
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్,ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవలో ఓ సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. తాజాగా దసరా సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు.
కాగా.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వ్యూహం మూవీలో వైఎస్ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు.
HAPPY DUSSEHRA from the team of VYOOHAM 💐💐💐 pic.twitter.com/4u6Ecpp1So
— Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2023