Ram Gopal
-
ఆర్జీవీ వ్యూహం.. దసరాకు స్పెషల్ పోస్టర్ రిలీజ్!
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్,ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవలో ఓ సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. తాజాగా దసరా సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వ్యూహం మూవీలో వైఎస్ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. HAPPY DUSSEHRA from the team of VYOOHAM 💐💐💐 pic.twitter.com/4u6Ecpp1So — Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2023 -
నిరుద్యోగమే నిప్పంటించింది!
తల్లాడ: మోటార్‌సైకిల్‌పై వచ్చి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ ఎన్టీఆర్ నగర్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. అయితే ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోనే తమ కొడుకు ఈ దారుణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీనగర్ కాలనీకి చెందిన యడపల్లి రామ్‌గోపాల్ (24) మోటార్‌సైకిల్‌పై ఆదివారం మధ్యాహ్నం సమయంలో తల్లాడకు వచ్చాడు. ఎన్టీఆర్ నగర్ సమీపంలోని రాష్ట్రీయ రహదారి నుంచి పొలాల్లోకి వెళ్లే రోడ్డులో మోటార్‌సైకిల్‌ను ఆపాడు. దానిపైనే కూర్చుని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో మోటార్‌సైకిల్ పూర్తిగా కాలిపోయింది. అతడికి కూడా తీవ్రంగా మంటలు అంటుకోగా తాళలేక కాలుతున్న శరీరంతోనే రాష్ట్రీయ రహదారిపైకి పరుగులు తీశాడు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటల బాధ తట్టుకోలేక కేకలు వేస్తున్న యువకుడిని ట్రాలీ ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా.. మార్గమధ్యలో కొణిజర్ల వద్ద మృతి చెందాడు. సంఘటనా స్థలంలో సెల్‌ఫోన్, ఏటీఎమ్ కార్డు, ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీ కార్డు ఆధారంగా మృతుడిని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తల్లాడ ఏఎస్ఐ జేవీయర్ తెలిపారు. కాగా, తమ కుమారుడు బీటెక్ పూర్తి చేశాడని, ఉద్యోగం రాలేదని నిత్యం మనోవేదన చెందేవాడని, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రామ్‌గోపాల్ తండ్రి పోలీసులకు చెప్పారు. -
‘150 ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక సరఫరా మెరుగుపరుస్తామని మైనింగ్‌శాఖ కార్యదర్శి రాంగోపాల్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని నదుల్లో వరద ప్రవాహం ఉందని తెలిపారు. ఎన్నడూ ఊహించని విధంగా వరద, వర్షాలు ముంచెత్తాయని గుర్తు చేశారు. రీచ్‌లు, ఇసుక ఉన్నా తవ్వడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ప్రతికూల వాతావరణంలోనూ రోజుకు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తీస్తున్నామని తెలిపారు. వరదలు తగ్గగానే పూర్తిస్థాయిలో రీచ్‌లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘150 ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 267 రీచ్‌ల్లో 69 చోట్ల మాత్రమే ఇసుక తీయగలుగుతున్నాం. త్వరలో రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేస్తాం. ఇసుక మైనింగ్‌లో స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఎం ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో ఇసుక బుకింగ్‌లు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. మరో నాలుగేళ్ల వరకు ఇబ్బందులు లేని ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇసుక రవాణా వాహనాలకు కూడా జీపీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నాం’అని రాంగోపాల్ చెప్పారు. -
వర్మకు పిచ్చి ముదిరిందా?
ముంబై: సినిమాలతోనే కాదు ట్వీట్లతో కూడా వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా మరోసారి దారుణమైన ట్వీట్లతో చెలరేగిపోయాడు. దేశ మాజీ ప్రధానమంత్రులు ముగ్గురిపై విచక్షణారహితంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీరి ముగ్గురు ఉన్న ఒక ఫోటో ఆధారంగా విచిత్రకరమైన వాదనకు దిగాడు. పార్లమెంటులో ముగ్గురు మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహారావు, చంద్ర శేఖర్.. ఈ ముగ్గురికీ ముందు సోనియా గాంధీ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. దానిపై హద్దు మీరి వ్యాఖ్యలు చేశాడు. పార్లమెంటులో ముందువరుసలో కూర్చున్న సోనియాపై వెనక కూర్చున్న ప్రధానమంత్రులు ముగ్గురు కుళ్లు జోకులు వేసుకుంటున్నారంటూ లేనిపోని భాష్యాలు చెప్పుకొచ్చి వివాదాన్ని సృష్టించాడు. అంతేకాదు.. దీనిపై పోలీసు విచారణ జరగాలంటూ నోటికొచ్చినట్టు చెలరేగిపోయాడు. పురుషులు ఎక్కడున్నా పురుషులేనని, బ్యాక్ బెంచ్ లో కూర్చున్నవాళ్లు ఎపుడూ బ్యాడ్ అని ట్వీట్ చేశాడు. పాఠశాల అయినా.. పార్లమెంట్ అయినా.. పురుషులు పురుషులే అంటూ కామెంటు చేశాడు. Whoever these 3 men r am shocked they are cracking dirty jokes about such a classy dignified woman whoever she is pic.twitter.com/sbRJ07vpt7 — Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2016 Back benchers r always bad whether in school or parliament .Dont know who these 3 r but they look badder than each pic.twitter.com/iJ9GgqKFlM — Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2016 -
అసలు వాళ్ల మధ్య గొడవ ఎక్కడ మొదలైంది ?
-
రాంగోపాల్ వర్మ 'వంగవీటి' ట్రైలర్
'ఒకప్పుడు విజయవాడలో.. భయపడేవాడెప్పుడూ రౌడీ కాలేడు' అంటూ రక్తం పులుముకున్న టైటిల్స్.. 'వంగవీటి.. వంగవీటి.. వంగవీటి.. వంగవీటి కత్తి.. ఇది కాపును కాసే శక్తి.. కమ్మని పౌరుషాసుకి పుట్టిస్తుంది భయమూ భక్తి..' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో రాంగోపాల్ వర్మ గంభీర స్వరం.. కత్తులతో పోరాటం.. నెత్తుటితో సమాధానం.. చివరికి ఏం మిగిలిందనేది తెరపై చూడమంటూ టీజింగ్.. టాలీవుడ్ చరిత్రలో వివాదాస్పద సినిమాల్లో ఒకటిగా భావించే 'వంగవీటి' సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'వంగవీటి'ని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాపై మార్కెట్ వర్గాల్లో నెలకొన్న ఆసక్తిని రెట్టింపు చేసేలా అత్యంత ర(హిం)సాత్మకంగా ఉన్న ట్రైలర్ మీకోసం.. -
'నా వంగవీటి రాధ ఇతనే'
'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ఇదివరకే తెలిపారు. అయితే ఆ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన వంగవీటి రాధ క్యారెక్టర్లో నటించే నటుడి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ అంటూ రాంగోపాల్ వర్మ ఈ ఫోటోలను వెల్లడించారు. 'వంగవీటి రాధ చాలా తక్కువ సార్లు తన అంతరంగికుల మధ్య సిగరెట్ కాల్చే వాడు' అంటూ సిగరేట్ కాల్చే ఫోటోను.. 'వంగవీటి రాధకి కాఫీ అంటే చాలా ఇష్టమని వంగవీటి రంగగారు నాతో చెప్పారు'.. అని కాఫీ తాగుతున్న ఫోటోను.. కమ్మవాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివున్న వాళ్లే అర్హత ఉన్న నిజమైన కాపులని చెప్పారని మరో ఫోటోను ట్విట్ చేశారు. Kammavaalla manasthatanni ardham chesukune thelivunnavalle arhatha vunna nijamaina kaapulani chepparu pic.twitter.com/FZ8apGoXY7 — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016 Vangaveeti Radhagaariki coffee ante chaala ishtamani Vangaveeti Ranga gaaru naatho chepoaru pic.twitter.com/EZD6Uqv28D — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016 -
’వర్మ’బర్త్‌డే స్పెషల్ ఇంటర్వ్యూ
-
చనిపోతూ.. ముగ్గురి జీవితాల్లో వెలుగులు
సాక్షి, ముంబై: మనిషి చనిపోయినా మరికొందరి ప్రాణాలు నిలబెట్టొచ్చు. ప్రమాదవశాత్తు, ఏదైనా జబ్బు చేసి మనిషి చనిపోతే అవయవ దానం చెయ్యొచ్చు. ఇలా చేయడం వల్ల మరికొందరి ప్రాణాలను కాపాడొచ్చు. ఇటీవల కొందరు కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో తమ వారెవరైనా చనిపోతే అవయవదానం చేయడానికి ముందుకొస్తున్నారు. ముంబై నగరంలో అవయవ దానాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఓ మహిళ బ్రెయిన్ డెడ్(43) అయి మరణించి మరికొందరి జీవితంలో వెలుగులు నింపింది. శ్రీరామ్ గోపాల్, నందిని దంపతులు ములుండ్‌లో నివాసం ఉంటున్నారు. నందిని ఓ ప్రైవేట్ హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. ఇటీవల నందినికి తీవ్ర తలనొప్పి రావడంతో మూర్ఛపోయింది. ఆమెకు వైద్యపరీక్షలు చేసిన బాంబే ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ధ్రువీకరించారు. తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పారు. తన భార్య కల్లెదుటే ఉన్నదనే సంతృప్తి ‘తన భార్య చనిపోయినా అవయవాలను దానం చేయాలని శ్రీరామ్‌గోపాల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు భార్య అవయవాలను దానం చేశాడు’. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను బతికి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందోన ని, చనిపోతే తన అవయవాలను దానం చేయాలని భార్య నందిని కోరిందని, ఇదివరకే తన కళ్లను ఐబ్యాంక్‌కు దానం చేసినట్లు చెప్పారు. ఆమె కోరిక మేరకు మరో అవయవాలు వృథాగా పోకుండా ఆమె కిడ్నీలు, కాలేయం, కళ్లను దానం చేసినట్లు చెప్పాడు. తన భార్య అవయవ దానం వల్ల మరో ముగ్గురి ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. తన భార్య కల్లెదురుగా లేకున్నా ఆమె అవయవాలను దానం చేయడం వల్లలో ఆమె ఇంకా బతికి ఉన్నదనే సంతృప్తి కలుగుతుందని కన్నీటి పర్యంతమయ్యాడు. ముగ్గురి ప్రాణాలు కాపాడగలిగాం: డాక్టర్ ఓ 28 ఏళ్ల మహిళ కిడ్నీ కోసం బాంబే ఆస్పత్రిలో చేరింది. మరో 47 ఏళ్ల మహిళ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. 72 ఏళ్ల మరో మహిళ కాలెయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఫోర్టిస్ట్ ఆస్పత్రిలో వెయిటింగ్ జాబితాలో ఉన్నారని ఆస్పత్రి ట్రాన్స్‌ప్లాంట్ కో-ఆర్డినేటర్ సంతోష్ సొరాటే పేర్కొన్నారు. ఈ ముగ్గురు మహిళలకు శ్రీరామ్‌గోపాల్ భార్య నందిని దానం చేసిన అవయవాలు ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఆ మూడు ప్రాణాలు నిలబడ్డాయని చెప్పారు. అవగాహన కల్పించాలి కిడ్నీ జబ్బుల వైద్యుడు డాక్టర్ హరేస్ దోదేజీ మాట్లాడుతూ ..కిడ్నీ మార్పడి చేయడం ద్వారా ప్రస్తుతం ఓ మహిళ పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. మరో 72 ఏళ్ల మహిళకు కాలెయ మార్పిడి చేశామన్నారు. అవయదానం వల్ల రెండు జీవితాలను కాపాడగలిగామని చెప్పారు. అవయవ దానం పట్ల రోగుల్లో, బంధువుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అవయవ దానం చేయడం ద్వారా ఇతర రోగుల ప్రాణాలను కాపాడినవారు అవుతారని వారికి తెలియజెప్పాలని అభిప్రాయపడ్డారు. -
రుద్రమదేవి నగల మాయంపై వీడని మిస్టరీ ?
రుద్రమదేవి చిత్రం షూటింగ్లో నగలు మాయంపై లభించని క్లూ? దొంగ ఎవరు? అసలు బంగారం ఎంత..? పోలీసులకు సవాల్‌గా మారిన దర్యాప్తు సాక్షి, సిటీబ్యూరో: రుద్రమదేవి సినిమా షూటింగ్లో నగలు మాయంపై మిస్టరీ వీడలేదు. కిలోన్నర బంగారు ఆభరణాలు పోయాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులవుతున్నా క్లూ లభించలేదు. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత? రోల్డ్‌గోల్డ్ ఎంత అన్న విషయం సరఫరా చేసిన వారికే తెలియదనడం కొత్త అనుమానాలకు తెరలేపింది. అంత విలువైన నగలకు సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంచారు? వ్యానులో ఉన్న నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన నగల్లో అత్యంత విలువైన రాళ్లు పొదిగినవి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా రుద్రమదేవి సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా అనుష్క ధరించే నగలను చెన్నైలోని ఆంజనేయ శెట్టి అండ్ సన్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. షూటింగ్ జరిగే రోజు సంస్థ సిబ్బంది చెన్నై నుంచి నగలను తీసుకు వస్తున్నారు. షూటింగ్ ముగిసిన వెంటనే వాటిని తిరిగి తీసుకువెళ్లిపోతున్నారు. ఇలా ఆరు షెడ్యూల్స్‌లో జరిగింది. ఈ నెల 19వ తేదీన గోపన్‌పల్లెలోని రామానాయుడుకు చెందిన స్థలంలో చిత్రం ఏడవ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ఉదయం 8 గంటలకు చెన్నై నుంచి విమానంలో రెండు ప్లాస్టింగ్ బాక్స్‌లున్న బ్యాగ్‌లో నగలను ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఎస్. రవిసుబ్రమణ్యం షూటింగ్ స్పాట్‌కు తీసుకువచ్చాడు. ఈ బ్యాగ్‌ను ఏసీ మేకప్‌వ్యాన్ డ్రైవర్ సీటు వెనకాల పెట్టి సమీపంలో విశ్రాంతి తీసుకున్నాడు. భోజన విరామం తరువాత అనుష్కకు నగలు ధరింపజేసేందుకు బ్యాగ్ తెరిచారు. అందులో ఉన్న నగలు ఉన్న రెండు ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించలేదు. దీంతో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు మాయమయ్యాయని, వాటిలో వడ్డాణం, చెవి కమ్మలు (రెండు జతలు), గాజులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తేలని బంగారం లెక్క.. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత ఉంది. రోల్డ్‌గోల్డ్ ఎంత అనేది తెలియరాలేదు. నగలు పంపిన సంస్థకు చెందిన మార్కెటింగ్ అధికారి సుజిత్‌ను పోలీసులు సోమవారం విచారించారు. ఆయన కూడా సరిగ్గా సమాధానం చెప్పలేక పోయారు. దీంతో ముంబయి నుంచి జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ఉన్న బద్రీని పోలీసులు పిలిపిస్తున్నారు. నగలు వాడుతున్న వారికి, పంపిన వారికి వివరాలు తెలియదనడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. దొంగ ఎవరు... నగలు ఎవరు దొంగలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. నగల బ్యాగ్‌ను వ్యాన్‌లో పెట్టిన రవి కాపలా ఉండకుండా ఎక్కడికి వెళ్లాడనేది అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. న గలు మాయమైన రోజు రవితో పాటు చెన్నై నుంచి ఎవరైనా వచ్చారా? అన్న విషయాన్ని నిర్ధారించుకుంనేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో పుటేజ్‌లను పరిశీలించనున్నారు. అసలు ఆ బ్యాగ్‌లో నగలు ఉన్న విషయం రవికి మాత్రమే తెలుసు. ఆ నగలను ఇంకా షూటింగ్ నిర్వాహకులకు అందించలేదు. అప్పటికే అవి మాయం కావడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. షూటింగ్లో అసలు బంగారం వాడరని పోలీసులు అంటుండగా తమ కంపెనీ పబ్లిసిటీ కోసం వాటిని నిజమైన బంగారంతో నగలను డిజైన్ చేశామని నగల కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిసారి షూటింగ్ ఉన్న సమయంలో విమనాంలో తేవడం తిరిగి విమానంలో తీసుకెళ్లడం జరిగిందంటే అవి నిజమైనే బంగారు నగలేననే అనుమానాలు కలుగుతున్నాయి. నగల్లో విలువైన రాళ్లు ఉన్నాయని సమాచారం. -
గీత దాటొద్దు
అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారం చేయరాదు 24 గంటల్లోపు రాజకీయ పార్టీల ఫ్లైక్సీలు తొలగించాలి {పజాప్రతినిధుల వద్ద ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వెనక్కి కలెక్టర్ రాంగోపాల్ చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్ స్పష్టం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన క్రమంలో బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయని, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజకీయ నాయకులు, శాసనసభ్యులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారాలు వద్దు మతసంబంధమైన ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికల ప్రచారం చేపట్టరాదని కలెక్టర్ తెలిపారు. చర్చిలు, మసీదులు, ఆలయాల్లో ఆయా కమిటీలకు వాగ్దానాలు చేయడం, హామీలివ్వడం, పనులు చేపట్టరాదన్నారు. కుల, మత ప్రాతిపదికపై ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఫ్లెక్సీలు తొలగించాలి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ నాయకుల, పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లోపు తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మున్సిపల్, పంచాయతీ చట్టాల మేరకు కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలు అయ్యేవరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ అతిథి గృహాలను ఎన్నికల యం త్రాంగం ఆధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయించి నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాప్రతినిధుల వద్ద విధుల కోసం డెప్యుటేషన్‌పై వెళ్లిన ప్రభుత్వ అధికారులు వారి మాతృశాఖకు తిరిగి రావాలని ఆదేశించారు. నూతన పనులు చేపట్టరాదు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుంచి ఎలాంటి నూతన పనులూ చేపట్టరాదని కలెక్టర్ అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన పనులనే పూర్తి చేయాలన్నారు. సమస్య తీవ్రంగా ఉంటే ఏదైనా చర్యలు చేపట్టాలంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. బోరు, మోటారు రిపేరులాంటి పనులు చేపట్టవచ్చునని, వీటికి నిధులు సమస్య లేదని అన్నారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య, ఎన్నికల విభాగం అధికారులు పార్థసారథి, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
అవినీతి సిబ్బందిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు
చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: సింగిల్‌విండోల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సిబ్బంది, వారి కి పరోక్షంగా సహకరించిన అధికారుల ను ఇంతవరకు సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారని కలెక్టర్ రాం గోపాల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు, జిల్లా సహకార శాఖ అధికారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం సహకార శాఖలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పెండింగ్ కేసులపై డీసీసీబీ, ఆడిట్, పరి పాలన విభాగాలకు చెందిన ముఖ్యమైన అధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ జిల్లాలోని 75 శాతం సింగిల్‌విండోల్లో సిబ్బంది, అధికారుల వల్లే నిధులు దుర్వినియోగమయ్యాయని తే లినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సహకార శాఖ అధికారిని ప్రశ్నిం చారు. ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు వేసి వారి నుంచి నిధులు ఎందుకు రాబట్టడం లేదని మండిపడ్డారు. 1985 నుంచి అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నా ఎలాం టి చర్యలు లేవంటే మీరెలా పనిచేస్తున్నారో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు దుర్వినియోగం చేసిన వారు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేంతవరకు సమయమిస్తూ, వారిని మీరే రక్షించే ప్రయత్నం చేస్తున్నారని నిలదీ శారు. పూతలపట్టు సింగిల్‌విండోలో 1990 నుంచి 2000 మధ్య లక్షలాది రూ పాయలు దుర్వినియోగమయ్యాయని, అందుకు బాధ్యులైన వారిని ఇంతవరకు ఏమీ చేయలేకపోయారన్నారు. చి త్తూరు టౌన్ బ్యాంకులో అప్పటి చైర్మన్ రూ.21 లక్షలు, సీఈవో రూ.22 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఒకటి రెండు రోజుల్లో అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని, తద్వారా మిగిలిన వారికి భయం కలుగుతుందని ఆదేశించారు. సింగిల్‌విండోల్లో రుణాలు తీసుకుని ఎంతకూ చెల్లించని వారి జాబితా తయారు చేసుకుని పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి ఆయా మండలా లు, ప్రాంతాల్లో పంచితే చాలా వరకు రుణాలు రికవరీ అవుతాయన్నారు. 15 రోజుల్లో దీనిపైనే మళ్లీ రివ్వూ పెట్టుకుంటానని, ఈలోగా పెండింగ్ కేసుల్లో పురోగతి కనిపించకపోతే చర్యలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. -
ఫ్యాక్టరీని ఏం చేయాలనుకుంటున్నారు
చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ ఎండీపై కలెక్టర్ ఆగ్రహం =ఫైళ్లపై సంతకాలకు నో చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: ‘అసలు ఈ ఫ్యాక్టరీని ఏం చేయదలచుకున్నారు, ఇలా చేస్తే రైతుల బకాయిలు ఎలా చెల్లిస్తారు, రోజూ మాకు ఇదే పంచాయితీనా అంటూ కలెక్టర్ రాంగోపాల్ చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావుపై మండిపడినట్లు సమాచారం. సహకార చక్కెర ఫ్యాక్టరీ పర్సన్ ఇన్చార్జి అయిన కలెక్టర్ సంతకాలు అవసరమై కలెక్టరేట్‌కు ఎండీ వెంకటేశ్వరరావు సోమవారం వచ్చారు. గ్రీవెన్స్‌డే ముగిసిన తర్వాత తన కార్యాలయానికి కలెక్టర్ చేరుకున్నారు. ఎండీతో వెళ్లిన పీఏను వెలుపలికి పంపి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పత్రికల్లో కథనాలు వస్తున్నా పట్టించుకోరా, ఇలాగైతే ప్రభుత్వం గ్రాంట్ ఎలా మంజూరు చేస్తుంది, రైతులెలా చెరుకు సరఫరా చేస్తారని మండిపడినట్లు సమాచారం. వీటికి సమాధానాలు చెప్పిన తర్వాతే సంతకాలు చేస్తానన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ‘దీనికి పర్సన్ ఇన్చార్జి కావడంతో రైతుల ముందు నన్ను బాధ్యుడ్ని చేయాలనుకుంటున్నారా, నేను ముందే చెప్పాను డబ్బులుంటేనే నడపండి, లేకుంటే వద్దని అయినా మీరు వినలేదు, ఇప్పుడు రోజూ మీ పంచాయితీనే సరిపోతోందంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైళ్లపై సంతకాలు పెట్టకనే కలెక్టర్ తిప్పి పంపినట్లు తెలిసింది. ఆత్మహత్యలే శరణ్యం బకాయిలు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులు కలెక్టర్ రాంగోపాల్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం కొందరు రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు రెండేళ్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో సహకార రంగంలో నడిచే అన్ని ఫ్యాక్టరీలూ ఇదే పరిస్థితిలో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. అయితే తమ బకాయిలు ఇప్పించాల్సిందేనని రైతులు కోరారు. బకాయిలు చెల్లించేసి ఫ్యాక్టరీని మూసేస్తే పర్వాలేదా అని కలెక్టర్ ప్రశ్నించారు. బకాయిలిచ్చేసిన తర్వాత ఏమన్నా చేసుకోండంటూ రైతులు బదులిచ్చారు. జనరల్‌బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తే అన్నీ సర్దుకుంటాయని కొందరు రైతులు సూచించారు. దీంతో తప్పక వస్తానని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. -
తెరపైకి మరిన్ని ‘ఇనామ్’ వివాదాలు
=పలువురి పట్టాలు రద్దు చేసిన కలెక్టర్ =మరో మూడు కేసుల నమోదు =వివాదాలన్నీ మూడు గ్రామాల్లోనే =అధికారుల చెంతకు రైతుల పరుగులు జిల్లాలో ఇనామ్ భూముల వివాదాలు పెరుగుతున్నాయి. తాజాగా మరో మూ డు కేసులు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రైత్వారీ పట్టాలు పొందిన రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: గతంలో రాజులు, జమిందార్లు వివిధ కులాల వా రికి ఇనామ్‌గా భూములు కేటాయించారు. ఇవి కాలక్రమంలో చేతులు మారుతూ వచ్చాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇనామ్ రద్దు చట్టం అమలులోకి వచ్చింది. భూమి అనుభవదారులకే రైత్వారీ పట్టాలిస్తూ వచ్చారు. జిల్లాలో ఇనామ్ భూములను అక్రమ పద్ధతుల్లో పొందిన వారికి సంబంధించి రైత్వారీ పట్టాలను రద్దు చేస్తూ కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామంలోని 28 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 15.5 ఎకరాలకు సంబంధించి 11 మందికి ఇచ్చిన ఇనామ్ పట్టాలను రద్దు చేశారు. రేణిగుంట మండలంలోని ఎర్రమరెడ్డిపాళెంలోని 8 సర్వే నంబర్ల పరిధిలో 65.37 ఎకరాలకు 129 మంది అక్రమంగా పొందిన పట్టాలను కలెక్టర్ రద్దు చేశారు. అదే విధంగా చిత్తూరు కలెక్టరేట్లోని ఇనామ్ డెప్యూటీ తహశీల్దార్ ఆర్.ముస్తాఫాఖాన్ సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో భూములు తమపేరుతో ఉన్నాయా లేవా అని గతంలో ఇనామ్ భూములకు రైత్వారీ పట్టాలు పొందిన రైతులు ఇనామ్ డెప్యూటీ తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. మూడు కేసుల నమోదు! కలెక్టర్ రాంగోపాల్ ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల వ్యవధిలో మూడు కేసులు నమోదైనట్లు సమాచారం. ఇవి తిరుపతి పరిసర ప్రాంతాలైన తిరుచానూరు, రేణిగుంట మండలాల్లోనే దాఖలు కావడం గమనార్హం. సదరు కేసుల్లో గతంలోనే పట్టాలు ఇచ్చి ఉండవచ్చని అధికారులు తెలిపారు. మూడు గ్రామాల్లోనే వివాదాలు జిల్లాలో ఇనామ్ గ్రామాలు 9 ఉన్నాయని, వాటిల్లో 3 గ్రామాల్లోనే వివాదాలు నెలకొన్నాయని ఇనామ్ డీటీ సత్యవతి తెలిపారు. ఇందులో తిరుపతి రూరల్ మండలంలోని తిరుచానూరు, రేణిగుంట మండలంలోని ఎర్రమరెడ్డిపాళెం, బైరె డ్డిపల్లె మండలంలోని కైగల్ గ్రామాలు ఉన్నాయన్నారు. తిరుచానూరు, ఎర్రమరెడ్డిపాళెం గ్రామాల్లో వివాదాలు ఎక్కువగా పుట్టుకు వస్తున్నాయని వివరించారు. అలాగే తిరుపతి రూరల్‌లోని కొంకాచెన్నయ్యపల్లెలో చిన్నపాటి వివాదాలు ఉన్నాయని తెలిపారు. ములకలచెరువు, మదనపల్లె, పెనుమూరు మండలాల్లోని ఎస్.ఆర్.పట్టెడ(సంజీవరాయుని పట్టెడ), కదిరినాథునికోట, నడిగడ్డ తిమ్మపల్లె, అమ్మవారిపల్లె, పన్నయ్యగారిపల్లెల్లో ఎలాంటి వివాదాలూ లేవని అధికారులు అంటున్నారు. -
ఆపద్బ్రహ్మ
బ్రహ్మ సృష్టిస్తాడు. అపరబ్రహ్మలు ప్రతిసృష్టి చేస్తారు. ఈ ఇద్దరూ కాకుండా... వేరొక బ్రహ్మ ఉన్నారు. ఆపద్బ్రహ్మ! ఆపద్బ్రహ్మా?! ఆయనేం సృష్టిస్తారు? సృష్టించరు. మరి? కనిపెడతారు! ఎవరిని? రాబోయే గుండెపోట్లను! పేలబోయే ఆర్డీఎక్స్‌లను! కనిపెట్టడం అంటే కాపాడడమే కదా. కాపాడడం అంటే సృష్టించడమే కదా. అలా ఆయన ఆపద్బ్రహ్మ. ఆ... బ్రహ్మ సక్సెస్ స్టోరీనే... ఈవారం ‘జనహితం’ ‘గుండెజబ్బుని... ముందుగానే కనుక్కునే మిషన్ వస్తే ఎంత బాగుంటుంది?’ ‘ పూటకోచోట పేలే బాంబుల జాడని ముందే పసిగట్టి సమాచారమిచ్చే యంత్రాలొస్తే ఉగ్రవాదుల చర్యలకు బలయ్యే అవకాశముండదు కదా’ అని అందరూ ఆశపడతారు. ఈ రెండు కలల్ని నెరవేర్చడానికి మహబూబ్‌నగర్ వాసి చేస్తున్న కృషికి గుర్తింపు వచ్చింది. దేశవిదేశాలలో అనేక అవకాశాలున్నప్పటికీ సమాజానికి ఏదో చేయాలన్న తపన వలిపే రామ్గోపాల్రావుది. ముంబై ఐఐటి ప్రొఫెసర్, నానో ఎలక్ట్రానిక్స్ సెంటర్ ప్రముఖ పరిశోధకుడైన రామ్‌గోపాల్ ‘నానోస్కేల్ ఎలక్ట్రానిక్స్’ పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తూ తెలుగువాడి సత్తా చాటుతున్నారు. నానో పరిశోధనలో ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఆయన తాజాగా ‘ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డు-2013’ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరిశోధనలతోపాటు ఇతర విషయాల గురించి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రాబోయే కాలంలో నానో టెక్నాలజీ ఎంతో కీలకంగా మారనుంది. అందుకే నానో సెన్సర్ పరిశోధనకు నా వంతు కృషి చేస్తున్నాను. ఇందులో భాగంగానే గుండెపోటు, ఆర్‌డిఎక్స్‌ను పసిగట్టే నానో సెన్సర్లను రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నానో స్కేల్‌ను మన మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మారుతున్న కాలంతో పాటు మన దేశ ప్రజల జీవనశైలిలో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో శారీరక శ్రమ అంటే వ్యవసాయ పనులు తదితరాలు అధికంగా చేసేవారు. దీంతో అహారంలో తీసుకున్న కొవ్వు కూడా కరిగిపోయేది. మారిన కాలాన్ని పరిశీలిస్తే... శారీరక శ్రమ అంతగా లేని పనులు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పనుల చేసే విధానంలో మార్పులు వచ్చినప్పటికీ, తీసుకునే ఆహారంలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణించే హృద్రోగుల సంఖ్యను పరిశీలిస్తే మన దేశంలోనే అధికంగా ఉంది. అందువల్ల... గుండెపోటును ముందుగా తెలుసుకునేందుకు సెన్సర్లు కనిపెట్టాలని భావించాం. ఇవి మార్కెట్లోకి వస్తే, హృద్రోగులకు చాలా తక్కువ ఖర్చుతో పరీక్షలతో పాటు, గుండెపోటు గురించి ముందుగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌ప్లోజర్ డిటెక్టర్లు... దేశంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆర్డిక్స్ను పసిగట్టేందుకు ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌ప్లోజర్ డిటెక్టర్లను అంటే ‘ఈ నోస్’లను కనిపెట్టాలని భావించాం. దీనిని నానోటెక్నాలజీలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం వీటిని రూపొందించడం చివరి దశలో ఉన్నప్పటికీ పూర్తయిందని చెప్పవచ్చు. మరోవైపు ఈ నోస్ సెన్సర్లు అమర్చడంతో ఆర్‌డిఎక్స్‌తోపాటు అనేకరకాల పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు ఆస్కారం ఏర్పడనుంది. ముఖ్యంగా బస్సులు, తాజ్‌మహల్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీటిని అమర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒక బస్సులో ఇలాంటి ఈ నోస్ సెన్సర్లను సుమారు పది పన్నెండు అమర్చినట్టయితే ఏ సీట్లో పేలుడు పదార్థాలున్నా డ్రైవర్‌కు తెలిసిపోతుంది. వీటిని ఒక్కసారి అమర్చిన అనంతరం కనీసం సంవత్సరం పాటు ఎలాంటి మెయిన్టెనెన్స్ లేకుండా ఉండేలా చూసుకుంటున్నాం. అందుకు ఆ బస్సు నడిచే సమయంలో వచ్చే వైబ్రేషన్ (కుదుపుల)తో ఎనర్జీ సమకూరేలా ఈ సెన్సర్లను రూపొందిస్తున్నాం. తెలుగు మీడియంలోనే... ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మధ్యతరగతి కుటుంబం మాది. ఇంటర్ వరకు కొల్లాపూర్‌లో, తర్వాత వరంగల్‌లోని కిట్స్‌లో బి.టెక్ పూర్తి చేశాను. తెలుగు మీడియంలో చదివిన నాకు ఇంటర్లో ఫిజిక్స్, కెమెస్ట్రీ, మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉండేది. నాన్న అడ్వకేట్‌గా పనిచేసేవారు. ఎమ్‌టెక్ చేసేందుకు ముంబై ఐఐటిలో చేరడంతోనే నా జీవితం మలుపు తిరిగింది. ఇక్కడే విధులు నిర్వహించే ప్రొఫేసర్ జె.వాసి నా జీవితంలో మార్పుకు ఒక కారణం. మళ్లీ ముంబైకి... ఎమ్‌టెక్ అనంత రం ఐఐటిని వీడి అనేక ప్రాంతాలు తిరిగాను, విదేశాలకు కూడా వెళ్లాను. జర్మనీలో పిహెచ్డి చేశాను. అయితే నా మనసులో మాత్రం సమాజం కోసం ఏదో చేయాలన్న తపన ఉండేది. అందుకే అనేక అవకాశాలున్నప్పటికీ అన్ని వదులుకుని మళ్లీ ఐఐటిలో 1998లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. ప్రస్తుతం ఈ బాధ్యతలతో పాటు నానో సెంటర్‌కు ప్రముఖ పరిశోధకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పెద్ద ఉద్యోగాలే ముఖ్యం కాదు... ప్రస్తుతం ఐఐటిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా అనేకమంది ఉన్నారు. వారందరికీ నేనిచ్చే సలహా మాత్రం ఒకటే... డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా పదిమందికి ఉపయోగపడే పని చేయాలన్న తపనతో చేసిన పనులు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. సంపాదనతో పాటు సమాజం కోసం కూడా ఏమైనా చేస్తేనే జీవితంలో ఆనందం ఉంటుంది’’ అని ముగించారు రామ్‌గోపాల్‌రావు. విదేశాల్లో బోలెడు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ మన దేశ ప్రజలకు ఏదో మేలు చేసేందుకు నానోసెన్సర్లను రూపొందించే పనిలో ఉన్న ఈ ఇంజనీర్‌కి ఆల్ ది బెస్ట్ చెబుదాం. - గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై అవార్డు విలువ అరకోటి ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇచ్చే ‘ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డు’ను 2014 ఫిబ్రవరి 8 వ తేదీన బెంగళూరులో జరిగే ఓ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామ్‌గోపాల్‌కు అందించనున్నారు. అవార్డు కింద రూ. 55 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. ఏటా ప్రకటించే ఈ అవార్డుకు దేశవిదేశాల్లో ఉంటున్న ఏడుగురు జ్యూరీ సభ్యులు ఈ ఏడాది రామ్‌గోపాల్ పేరును ఎంపిక చేశారు. ఆ ఏడుగురిలో ‘యూనివర్సిటీ ఆ్‌ఫ్ కాలిఫోర్నియా’ చాన్స్‌లర్ డాక్టర్ ప్రదీప్ కోస్లా కూడా ఉన్నారు. రామగోపాల్ కృషితో దేశంలోని 92 ఇన్స్టిట్యూట్లలో నానో ఎలక్ట్రానిక్స్‌పై రిసెర్చ్ జరుగుతోంది. -
రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన
చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆది వారం మధ్యాహ్నం 1 గంటకు అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి 2.30 గంటలకు వి.కోటకు చేరుకుంటారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.50 గంటలకు హెలిప్యాడ్ చేరుకుంటారు. 5 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.30 గంటలకు కలికిరి చేరుకుంటారు. తర్వాత 5.40 గంటలకు పీలేరు ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 6.10 గంటలకు స్వగ్రామం నగిరిపల్లెకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా రాయచోటికి చేరుకుంటారు. అక్కడ రచ్చబండ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని భోజన విరామానంతరం 2.30 గంటలకు రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌కు బయలుదేరుతారు.