వర్మకు పిచ్చి ముదిరిందా? | Ram Gopal Varma insults former Prime Ministers via tweets | Sakshi
Sakshi News home page

వర్మకు పిచ్చి ముదిరిందా?

Published Mon, Oct 31 2016 10:55 AM | Last Updated on Thu, Aug 16 2018 4:59 PM

వర్మకు  పిచ్చి ముదిరిందా? - Sakshi

వర్మకు పిచ్చి ముదిరిందా?

ముంబై: సినిమాలతోనే కాదు  ట్వీట్లతో కూడా వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా మరోసారి దారుణమైన ట్వీట్లతో చెలరేగిపోయాడు.  దేశ మాజీ ప్రధానమంత్రులు ముగ్గురిపై  విచక్షణారహితంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీరి ముగ్గురు ఉన్న ఒక  ఫోటో ఆధారంగా విచిత్రకరమైన వాదనకు దిగాడు.  పార్లమెంటులో  ముగ్గురు మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహారావు, చంద్ర శేఖర్.. ఈ ముగ్గురికీ ముందు సోనియా గాంధీ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. దానిపై హద్దు మీరి వ్యాఖ్యలు చేశాడు. పార్లమెంటులో ముందువరుసలో కూర్చున్న సోనియాపై వెనక కూర్చున్న ప్రధానమంత్రులు ముగ్గురు కుళ్లు జోకులు వేసుకుంటున్నారంటూ లేనిపోని భాష్యాలు చెప్పుకొచ్చి వివాదాన్ని సృష్టించాడు. అంతేకాదు.. దీనిపై పోలీసు విచారణ జరగాలంటూ నోటికొచ్చినట్టు చెలరేగిపోయాడు.
 
పురుషులు ఎక్కడున్నా పురుషులేనని, బ్యాక్ బెంచ్ లో కూర్చున్నవాళ్లు  ఎపుడూ  బ్యాడ్ అని ట్వీట్ చేశాడు. పాఠశాల అయినా.. పార్లమెంట్ అయినా.. పురుషులు పురుషులే  అంటూ కామెంటు చేశాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement