insults
-
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలకు అవమానం
-
తిట్టుకుని.. కొట్టుకుని
ఇల్లెందు: ఒకరు మున్సిపల్ చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్.. సాక్షాత్తు కౌన్సిల్ సమావేశంలో బాహాబాహీకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దూషణలు, పరస్పర దాడులకు దారితీసింది. మూడు నెలల విరామం తర్వాత శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించగా.. పట్టణంలో రోడ్లపై వెలసిన దుకా ణాలు, తోపుడు బండ్లను తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చవుతుందంటూ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆక్రమణలు తొలగిస్తున్నా ఎవరూ అడ్డు చెప్పడం లేదు కదా.. దీనికి కొత్తగా ఫీజు రూపంలో రూ.2లక్షలు ఎందుకంటూ వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ పరస్పరం అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చైర్మన్ వెంకటేశ్వరరావు.. వైస్ చైర్మన్ జానీపాషాపైకి దూసుకొచ్చినట్టు కౌన్సిలర్లు, అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మరోసారి ఘర్షణ జరగడంతో వైస్ చైర్మన్‌పై చైర్మన్ చేయి చేసుకున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎదురుగానే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ వాసులకు సేవలందించాల్సిన పాలకవర్గ సభ్యులు ఇలా ఘర్షణ పడడం తగదని హితవు పలికారు. ఈ విషయంలో ఇద్దరిదీ తప్పేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సమావేశంలో నిలదీస్తే ఇలా దాడులు చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారులను ప్రశ్నిస్తుండగా చైర్మన్ జోక్యం చేసుకుని దాడికి దిగారని ఆరోపించారు. దీనిపై చైర్మన్ వెంకటేశ్వరరావు వివరణ కోరగా.. తనను పలుమార్లు వ్యక్తిగతంగా దూషించినా సహించానని స్పష్టం చేశారు. -
అయ్యన్నపాత్రుడి బూతు పురాణం..
-
మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..
మనల్ని ఎవరైన కామెంట్ చేస్తేనే దిగులు పడిపోతాం. మనం బాగానే ఉన్నా.. ఏదో ఒక విధంగా కామెంట్ చేస్తారనే విషయం తెలిసిందే. అలాంటిది అస్సలు రూపమే చూసేందుకు అసహ్యంగా ఉంటే.. అస్సలు బయటకు అడుపెట్టం. కానీ ఈ అమ్మాయి ఆ బాధను దిగమింగడం కాదు..సానుకూలంగా ఆ వైకల్యాన్ని అంగీకరించింది. ఆ అవహేళనలను అధిగమంచి తానెంటో ప్రపంచానికి తెలియజేడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. జన్మతః లేదా మరేదైన కారణం వల్ల వచ్చే వైకల్యం లేదా అనారోగ్యంతో చతికిలపడిపోకూడదని చాటి చెప్పింది. సత్తువ, స్థైర్యం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రూవ్ చేసింది. ఎవరంటే ఆమె..కేరళలోని తిరువనంతపురంకి చెందిన 24 ఏళ్ల బిస్మిత. చిన్నప్పటి నుంచి ఎన్నో హేళనలు, చిత్కారాలు. ఎందుకంటే..? బిస్మిత అరుదైన జన్యుపరమైన చర్మ పరిస్థితి కారణంగా శరీరం అంతా మచ్చల మచ్చలుగా ఉంటుంది. ఇలా బిస్మతకు పుట్టిన రెండు నెలలకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆమె తల్లి మజిత(47)కు కూడా ఇలానే ఉండటంతో..అదే ఆమెకు వంశపారపర్యంగా వచ్చేసింది. కేరళలోని ఆసుపత్రులన్నీ తిరిగింది ఆమె తల్లి. జన్యుపరంగా వచ్చే చర్మ సమస్య, చికిత్స లేదని వైద్యులు చేతులెత్తేయడంతో.. కూతురి జీవితం ఏమైపోతుందోనని ఆందోళనకు గురైంది మజిత. చెప్పాలంటే ఇది ఒక విధమైన బొల్లి వ్యాధి మాదిరిగా బిస్మిత చర్మం ఉంటుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా.. చదువును మాత్రం వదల లేదు. అలా ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. అయితే బిస్మిత చిన్నప్పుడు స్కూల్లో జరిగే పాటల పోటీల్లో ఎప్పుడూ ఆమెనే విజేత. అందరూ ఆమె గొంతు బాగుంటుందని ప్రశంసించేవారు. దీంతో తానే సొంతంగా వీడియోలు తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది బిస్మితకి. అందుకు అమ్మ కూడా ఒప్పుకోవడంతో 2019లో టిక్‌టాక్ వీడియోలు చేయడం ప్రారంభించింది. అయితే వాటికి ప్రశంసలు కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చేవని బాధగా చెబుతోంది బిస్మిత. అస్సలు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా..నువ్వు దెయ్యానివా లేక మచ్చల జింకవా.. అంటూ కామెంట్లు పెట్టేవారు. ఇది జన్యుపరమైన సమస్య కదా!..దీన్నే ఇంతలా పట్టించుకుంటున్నారేంటీ అని బాధగా ఉండేది బిస్మతకి. అయినా సరే వీడియోలు తీయడం ఆపలేదు. అనుకోకుండా టిక్‌టాక్‌ని మనదేశంలో బ్యాన్ చేయడంతో ఇన్‌స్టాలో రీల్స్ పోస్ట్ చేసేది. వాటిని కూడా అసభ్య పదజాలంతో ట్రోలింగ్ చేసేవారు. అయినా సరే వెనకడుగు వేయడకుదని గట్టిగా నిశ్చయించుకుంది బిస్మిత. అయితే ఇన్‌స్టాలో బిస్మిత వీడియో చూసి.. ఓ ఫొటోగ్రాఫర్ మేకోవర్ పేరుతో ఫొటో షూట్ చేస్తానని అడిగాడు. ఆ షూట్లో నవ వధువులా బిస్మిత మేకప్‌తో ఉంటుంది. అందమైన వధువుగా బిస్మిత మారిన వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఒక్క రోజులోనే లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ‘బిస్మి వ్లాగ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది బిస్మిత. మచ్చలున్న అమ్మాయిని పెళ్లాడటానికి ఎవరు ముందుకొస్తారని బంధువులంతా అన్నారు. కానీ ఆటో డ్రైవర్ సాను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఆయన సపోర్ట్ ఎంతో ఉందంటోంది బిస్మిత. ఈ రీల్స్‌లో తనలాంటి వాళ్లు ఎదుర్కొనే సమస్యలను, రోజువారీ విషయాలను షేర్ చేస్తుంది బిస్మిత. ఆ దంపతులకు ఒక కొడుకు కూడా. అయితే అతడికి కూడా ఇలాంటి జన్యు సమస్యే వచ్చింది. తన కొడుకు అయినా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆమె భర్త ఎన్నో ఆస్పత్రులు తిప్పాడు కానీ ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ప్రస్తుతం బాబుకి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతోంది బిస్మిత. ఈ విషయాన్నే వీడియోలో చూపిస్తుంటే..దీనికి కూడా ఆమెను విమర్శించడం బాధకరం. కొడుకు అలా ఉన్నా కూడా.. వీడియోలు చేస్తున్నావు..నీ బతుకు ఇంతేనా అని తిడుతూ కామెంట్లు పెడుతున్నారని బాధగా చెప్పింది బిస్మిత. అయితే తాను వాటిని పట్టించుకోను ఇంకా అలాంటివే చేస్తాను..నా కొడుకికి ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పేందుకైనా ఆపాను అని స్టైర్యంగా చెబుతోంది బిస్మిత.నిజంగా బిస్మిత చాలా గ్రేట్ కదూ..! జస్ట్ ఎవ్వరైనా చిన్నగా.. ఏదైనా అన్నా.. తట్టుకోలేం, ఈజీగా తీసుకోలేం. అలాంటిది ఆమె తన రూపం అలా ఉన్నా ధైర్యంగా కెమెరా ముందుకు రావడమే గాక తనలాంటి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. నిజంగా బిస్మిత తనలాంటి వాళ్లకే కాదు..ట్రోలింగ్కి గురయ్యి బాధపడుతున్నవారికి కూడా ఈమె స్ఫూర్తి.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
అసలే ఇది ఎన్నికల సీజన్. ప్రచారం దుమ్మురేగుతోంది. మైకు దొరికితే చాలు.. నేతల హామీలకు, విమర్శల ధాటికి అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఆ క్రమంలో కొన్నిసార్లు తాము ఏ పారీ్టలో ఉన్నాం, ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నామన్న స్పృహ లేకుండా నేతలు నోరు జారుతున్నారు. సొంత పార్టీ అభ్యరి్థనే చిత్తుచిత్తుగా ఓడించండనీ, ప్రత్యర్థి పారీ్టకి ఓటేయాలనీ పిలుపిస్తున్నారు! జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా నాలుక్కరుచుకుంటున్నారు. ఇలా టంగ్ స్లిప్పవుతున్న వారిలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినవారే గాక కాకలుతీరిన నేతలు కూడా ఉండటం విశేషం. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారు గానీ, రాజకీయాల్లో మాత్రం నోరుజారితే నవ్వులపాలే...!! అధిర్.. అయ్యో రామా! బీజేపీకి ఓటేయడం మేలన్న కాంగ్రెస్ దిగ్గజం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశి్చమ బెంగాల్ కాంగ్రెస్ దిగ్గజం అధిర్ రంజన్ చౌదరి ఇటీవల ఎన్నికల ర్యాలీలో మళ్లీ నోరుజారారు. ‘బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేసే కంటే బీజేపీకి వేయడం నయం’ అన్నారు! జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన పారీ్టకి ఓటేయాలని పిలుపివ్వడం పట్ల సొంత నేతలే తీవ్రంగా మండిపడ్డారు. దాంతో తానలా అన్లేదంటూ అ«ధిర్ మాట మార్చారు. కానీ అధికార తృణమూల్ దీన్ని మంచి అస్త్రంగా అందిపుచ్చుకుంది. బెంగాల్లో అ«ధిర్ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయింది.లాలు కూతుర్ని ఓడించండి! సొంత పార్టీ ఎమ్మెల్సీ పిలుపు బిహార్ రాజకీయ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సరన్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెను గెలిపించుకునేందుకు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లాలు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కూతురితో పాటు పాల్గొన్న తొలి సభలోనే హంసపాదు ఎదురైంది! సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఓటర్లు, పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా. రోహిణీ ఆచార్యను భారీ మెజారిటీతో ఓడించండి’ అంటూ పిలుపునిచ్చారు. దాంతో లాలుతో పాటు వేదికపై ఉన్న ఆర్జేడీ నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సునీల్ క్షమించాలంటూ వేడుకున్నారు.కంగనా... కన్ఫ్యూజన్! గురి తప్పిన ‘నాన్ వెజ్’ విసుర్లు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బీజేపీలో చేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ అయిన ఆమె బిహార్ ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్‌కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను విమర్శించి నవ్వులపాలయ్యారు. ‘‘దారి తప్పిన యువరాజులున్న పారీ్టలకు మన దేశంలో కొదవ లేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలకునే రాహుల్ గాంధీ కావచ్చు. నవరాత్రుల సందర్భంగా కూడా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు. అంతా అదే బాపతు’ అంటూ కంగన విరుచుకుపడ్డారు. దాంతో భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తేజస్వీ యాదవ్ కూడా, ‘ఇంతకీ ఎవరీ అమ్మగారు?!’ అంటూ ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్ర బోస్ అన్న కంగనా వ్యాఖ్యల పైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. శివపాల్.. శివ శివా! బీజేపీని గెలిపించాలన్న సమాజ్‌వాదీ నేత అది ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ఇటావా లోక్‌సభ స్థానం. జస్వంత్ నగర్లో ఎన్నికల ప్రచార సభ. జనం భారీగా హాజరయ్యారు. పార్టీ చీఫ్ అఖిలేశ్ బాబాయి, సమాజ్‌వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న అఖిలేశ్, ఇటావా ఎస్పీ అభ్యర్థి జితేంద్ర దోహారే తదితరులు ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో శివపాల్ ఉన్నట్టుండి, ‘అందుకే నేను కోరేదొక్కటే! బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించండి!!’ అంటూ పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు. ‘ప్రజలంతా అఖిలేశ్ చెప్పినట్లు విని, భారతీయ జనతాపారీ్టకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించండి’ అన్నారు. దాంతో అఖిలేశ్ బిత్తరపోగా ఇతర ఎస్పీ నేతలంతా గతుక్కుమన్నారు. నోరు జారానని గమనించిన శివపాల్ కాసేపు బీజేపీపై విరుచుకుపడ్డా జనమంతా గోలగోలగా నవ్వుకున్నారు! అందిపుచ్చుకున్న మోదీ...ఈ ఉదంతాన్ని తర్వాత ఇటావాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. ‘చూశారా! స్వయంగా ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ బాబాయ్ కూడా బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు’ అంటూ చెలరేగిపోయారు. 2019లో ములాయం కూడా బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ‘‘2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి సెషన్లో ములాయం మాట్లాడుతూ, మీరు మళ్లీ విజయం సాధించబోతున్నారని నన్నుద్దేశించి నిండు సభలో అన్నారు. ఆ ఆశీర్వాదం ఫలించింది. ఇప్పుడు ములాయం మన మధ్య లేకున్నా ఆయన సోదరుడు బీజేపిని గెలిపించాలని కోరుతున్నారు. ఇది యాదృచి్ఛకమని నేననుకోవడం లేదు. శివపాల్ మనసులో ఉన్నదే బయటికొచి్చంది’’ అంటూ చెణుకులు విసిరారు!లోగుట్టు ‘బోరా’కే ఎరుక... స్వపక్ష ఎంపీనే ఓడించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!అసోంలోని నగావ్ లోక్‌సభ స్థానంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శిబమణి బోరా కూడా ఇలాగే నోరు జారారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్టుండి, ‘ప్రద్యుత్‌ను భారీ మెజారిటీతో ఓడించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఓడిస్తారో లేదో చెప్పండి. ఈవీఎం బటన్‌ను నొక్కి నొక్కి ప్రద్యుత్ కచ్చితంగా ఓడేలా చూడండి’’ అంటూ పిలుపునివ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. పొరపాటున అన్నారా, కావాలనే అన్నారా అంటూ దీనిపై తీవ్ర చర్చ కూడా జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
సిమ్లా: ఎన్నికలన్నాక పరస్పర విమర్శలు సహజమే. కానీ హిమాచల్‌ప్రదేశ్ ప్రచారంలో అభ్యర్థులు విమర్శలు దాటి.. వ్యక్తిగత తిట్ల వరకూ వచ్చేశారు. ఈ దండకంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ అందరూ ఆ తాను ముక్కలే. ఒకరు ‘కాలే నాగ్’ అంటే.. మరొకరు ‘బిగ్డా షెహజాదా’ అంటూ ప్రచార పదజాలంలో కొత్త తిట్లను చేరుస్తున్నారు.ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసిన విషయం తెలిసింది. వారిపై అనర్హత వేటు పడి ఆ ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు.. పార్టీ తిరుగుబాటుదారులను ‘కాలే నాగ్’(నల్లత్రాచు)లు, బికావు (అమ్ముడుపోయినవాళ్లు) అంటూ విమర్శించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దేవేందర్ కుమార్ భుట్టో నియోజకవర్గమైన కుట్లేహార్లో సీఎం మాట్లాడుతూ.. ‘భుట్టో కో కూటో’ (భుట్టోను కొట్టండి) అంటూ పిలుపునిచ్చారు. సుఖూ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఇక ‘మండీ మే భావ్ క్యా చల్ రహా హై’ అంటూ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నేను రెండాకులు ఎక్కువే చదివానంటూ రనౌత్ చెలరేగిపోయారు. రాహుల్‌గాం«దీ, విక్రమాదిత్య పేర్లు చెప్పకుండా.. ‘బడా పప్పు’, ‘ఛోటా పప్పు’ అని పదేపదే వాడారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పారీ్ట.. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన ‘రోగం’ అంటూ వ్యాఖ్యానించారు. 2014 వరకు చెద పురుగుల్లా దేశాన్ని తినేశారన్నారు. విక్రమాదిత్యను.. ‘బిగ్డా షెహజాదా’ (చెడిపోయిన యువరాజు) అంటూ సంబోధించారు. ఇక కంగనాను ‘ఆమె హుస్న్ కి పరి’ (అప్సరస) అని, ప్రజలు ఆమెను చూడటానికి మాత్రమే వస్తారు.. ఓట్లేయరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కంగనా తల్లి ఆశా రనౌత్ స్పందించారు. తన కూతురును ‘అప్సరస’, ‘క్యా చీజ్ హై’ అంటున్నవాళ్లు తమ ఇళ్లలో ఆడపిల్లలున్నారన్న విషయం మరుస్తున్నారని మండిపడ్డారు. -
జనసేన పరువు తీసిన చింతమనేని
-
ఎన్నో అవమానాలు భరించా: జగ్ధీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తాను ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వ్యక్తినని అన్నారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై విపక్ష ఎంపీలు కేంద్ర హోం మంత్రి స్పందించాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాల ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దానిని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను అనుకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ధన్‌ఖడ్.. తనను, తన కులాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయితే తాజాగా ఆయన ఈ వ్యవహారంపై ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసు(ఐఎస్ఎస్) ప్రొబేషనర్లు ఏర్పాటు చేసిన ఓ కర్యక్రమంలో మాట్లాడారు. ‘నేను ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించిన వ్యక్తిని. అన్ని వైపుల నుంచి వచ్చే అవమానాలు, బాధలను సహించడం నాకు తెలుసు. మనం భారత మాత సేవలో ఉన్నాం’ అని అన్నారు. విమర్శలను తట్టుకోవడం నేర్చుకోవాలని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నప్పటికీ దేశ ప్రజలు తనకు దూరంగా లేరని తెలిపారు. రాజ్యసభ చైర్మెన్‌గా, ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ హోదాలో ఉన్నప్పటికీ తనను ప్రజలు ఎప్పుడూ విడిచి పెట్టలేదని తెలిపారు. అది తన ఆలోచనా విధానాన్ని మార్చాలా?.. అది తన మార్గాన్ని తప్పుదారి పట్టించాలా? అని అన్నారు. ధర్మ మార్గంలో మనం ఎల్లప్పుడూ ముందుకు సాగాలని తెలిపారు. మన ఎదుగుదలను చూసి ఎవరైతే తట్టుకోలేరో.. అటువంటి వారే ఎప్పుడూ విమర్శలు చేస్తారని మండిపడ్డారు. చదవండి: ‘మార్పు’పై అసంతృప్తి! -
దళిత మహిళా అధికారిపై టీడీపీ నేత సోమిరెడ్డి దూషణలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ccపొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ దళిత మహిళా అధికారిపై దూషణలు చేయడంతో దళిత, గిరిజన వర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. నెల్లూరు జిల్లా ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న ఆ అధికారికి ఫోన్ చేసి వ్యక్తిగత దూషణలకు దిగిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ సీనియర్ రాజకీయ నేతగా సమాజంలో హుందాగా ఉండాల్సిన వ్యక్తి తన స్థాయి మరిచి ప్రవర్తించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమిరెడ్డి అనుచరుడు కేసీ పెంచలయ్య గత టీడీపీ పాలనలో ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.8 లక్షల విలువైన టాటా ఇండికా వాహనాన్ని రాయితీపై పొందారు. దానికి రూ.లక్ష వరకు రాయితీ వస్తుండగా, మిగతాది ప్రతి నెలా రూ.15 వేలు కంతు చెల్లించాల్సి ఉంది. ఇలా కంతులు చెల్లించుకుంటూ ఐదేళ్లలో పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంది. కానీ గిరిజన సంఘం నేత ఇప్పటికి కేవలం రూ.60 వేలే చెల్లించాడు. ఆరేళ్లు పూర్తి కావస్తున్నా వాహన కంతులు చెల్లించకపోవడంతో ఐటీడీఏ అధికారులు పలుమార్లు నోటీసులిచ్చారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నాలుగు రోజుల కిందట వాహనాన్ని సీజ్ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన మాజీ మంత్రి.. ఐటీడీఏ పీవో మందా రాణికి ఫోన్ చేసి వ్యక్తిగత దూషణలకు దిగారు. నువ్వు.. అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ దూషించారు. సోమిరెడ్డి దూషణతో మనస్తాపం చెందిన ఆమె జిల్లా కలెక్టర్ హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. సోమిరెడ్డి తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన గిరిజన సంఘాలు దళిత అధికారిపై వ్యక్తిగత దూషణలు చేసిన సోమిరెడ్డి తీరును నిరసిస్తూ శనివారం దళిత, గిరిజన సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేశాయి. ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘ నేత పాలకీర్తి రవి మాట్లాడుతూ కుల సంఘం ముసుగులో సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్న వ్యక్తి వాహన కంతులు చెల్లించకుండా విలాస జీవితం గడుపుతున్నారని విమర్శించారు. తన మద్దతుదారుడి వాహనం సీజ్ చేస్తే అదేదో ఘోరం జరిగినట్టు మహిళా అధికారిపై ఫోన్లో బెదిరింపులకు దిగి నానా యాగీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ గాలి తీసిన పవన్ కళ్యాణ్..
-
బావయ్య చంద్రబాబు అరెస్ట్ ను సినీ పరిశ్రమలో ఎవరూ ఖండించకపోవడంతో బాలయ్య ఉక్రోషం
-
మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్తని అవమానించిన సల్మాన్ ఖాన్
-
చేదు అనుభవం.. ఇక కెరీర్ ముగిసిపోయిందనుకున్నా : కత్రినా కైఫ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి పరిచయం అక్కర్లేదు. 2003లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండు దశాబ్లాలకు పైగా టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే కెరీర్ ఆరంభంలో మాత్రం తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంది ఈ బ్యూటీ. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ... 'కెరీర్ ఆరంభంలో సాయ అనే చిత్రంలో చిన్న పాత్ర పోషించాను. జాన్ అబ్రహం, తారా శర్మ అందులో హీరో, హీరోయిన్లు. అయితే నాపై ఒక షాట్ చిత్రీకరణ తర్వాత సినిమా నుంచి తొలగించారు. నటికి ఉండాల్సిన ఒక్క మంచి లక్షణం కూడా నాలో లేదన్నారు. ఆరోజు నా కెరీర్ ఇక ముగిసిపోయిందని చాలా బాధపడ్డాను. కానీ ఆ అవమానాల కారణంగా హీరోయిన్ అవ్వాలన్న నా కల ఇంకా పెరిగింది' అంటూ చెప్పుకొచ్చింది కత్రినా. -
మగవారిని గమనించండి.. దేశంలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు
ఇంట్లోని వారు ఎలా ఉన్నారో గమనించాల్సిన బాధ్యత మగవాడిదని సమాజం అంటుంది. కాని ఇంటి మగవాడు ఎలా ఉన్నాడో ఎవరు గమనించాలి? ఇటీవల పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యలు వారి ఒత్తిళ్లను పట్టించుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020’ ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 70 శాతం పురుషులవైతే 30 శాతం స్త్రీలవి. కోవిడ్ కాలపు అనారోగ్యం.. ఆర్థిక సమస్యలు.. ఉద్యోగ బాధలు మగవారిని ఈ వైపుకు నెడుతున్నాయి. వారి గురించి కుటుంబం, సమాజం ఆలోచించాలి. మన దేశంలో రోజుకు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో తెలుసా? రోజుకు దాదాపు 419. 2020లో మొత్తం ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో తెలుసా? 1,53,052. వీటిలో పురుషుల సంఖ్య 1,08,532 (70 శాతం). స్త్రీలు 44, 498 (30 శాతం). అంటే స్త్రీల కంటే రెట్టింపు సంఖ్యలో పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలు సున్నిత స్వభావులు, భావోద్వేగాలకు తొందరగా లోనవుతారు అనుకుంటాము. కాని పురుషులే ఇప్పుడు సున్నితంగా ఉన్నారు. జీవితాన్ని ఎదుర్కొనలేకపోతున్నారని ఈ సర్వే మనకు తెలియచేస్తోంది. స్త్రీలైనా పురుషులైనా ప్రాణం అత్యంత విలువైనది. అయితే స్త్రీలు తమ ఆందోళనను ఏదో ఒక విధంగా బయటపెట్టి నలుగురికి తెలిసేలా చేస్తారు. కాని పురుషుడు తన లోలోపల అదిమి పెట్టుకుంటాడు. తీరా నష్టం జరిగిపోయాకే అతడి మనసులో ఎంత వత్తిడి ఉన్నదో మనకు తెలుస్తుంది. దీనిని బట్టి ఇంట్లోని భర్తను, తండ్రిని, సోదరులను గమనించుకోవాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబ సభ్యులపై ఉందని తెలుస్తోంది. కోవిడ్ అనంతరం 2020 ప్రారంభంలోనే కోవిడ్ మహమ్మారి రావడం, ఫలితంగా నిరుద్యోగం, ఆర్థిక అభద్రత, మానసిక ఆందోళన... ఇవన్నీ పురుషుల ఆత్మహత్యలకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే దీని వెనుక సంఘం పెట్టిన ఇమేజ్ కూడా కారణమే. పురుషుడంటే సమర్థుడిగా ఉండాలి, ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలి, తెగింపుతో ఉండాలి ఇలాంటి స్టీరియోటైప్ ఆలోచనలను ఇచ్చింది సంఘం. ఏడ్చే మగాళ్లను నమ్మొద్దంది. కాని పురుషుడు ఒత్తిడిలో ఉంటే ఏం చేయాలి? కష్టం చెప్పుకుంటే చేతగానివాడనుకుంటే ఎలా? ఆత్మహత్య చేసుకోవడమేనా దారి? కొందరు పురుషులు అదే చేస్తున్నారు. పనిచేసే చోట అవమానాలు 2020లో పురుషులలో జరిగిన ఆత్మహత్యలను పరిశీలిస్తే పని ప్రదేశంలో అవమానాలు కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ఆ సంవత్సరం పనిచేసేచోట అవమానాల వల్ల దేశంలో మొత్తం 1847 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పురుషులు 1602 (87 శాతం). స్త్రీలు 234 (12 శాతం). అంటే రోజుకు సగటున ఐదు ఆత్మహత్యలు దేశంలో పని ప్రదేశంలో వేధింపుల వల్ల జరుగుతున్నాయి. వీటిలో మూడు నుంచి నాలుగు పురుషులవి. బాస్‌లు అవమానించడం, జీతాల పెంపులో తేడా, ప్రమోషన్లలో తరతమ భేదాలు ఇవన్నీ మగవాళ్లను కుంగదీసి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయి. స్త్రీలకు లైంగిక వేధింపులు ప్రధాన కారణం అవుతున్నాయి. అలాగే పని దొరకడం లేదన్న బాధతో కూడా పురుషులు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భరోసా ఇవ్వాలి తండ్రి, భర్త, సోదరులతో మాట్లాడండి. వారి ఉద్యోగం, వ్యాపారం, వృత్తి... వీటిలో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోండి. ఆరోగ్యం గురించి ఆరా తీయండి. సమస్య ఉంటే బలవంతంగానైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లండి. ఆర్థిక సమస్యలు తెలుసుకోండి. అప్పులేమైనా ఉన్నాయా కూపీ లాగండి. పరిస్థితి ఎలా ఉన్నా వారి వల్ల ఏదైనా తప్పు జరిగి ఉన్నా నిందించకండి. నిలదీయకండి. సపోర్ట్ చేస్తామని చెప్పండి. ఒత్తిడి ఉంటే విశ్రాంతి తీసుకోమని చెప్పండి. ఉద్యోగం మారాలనుకుంటే మారమని, లేదంటే మానేసి కొంతకాలం బ్రేక్ తీసుకోమని, మరేం పర్వాలేదని దిలాసా ఇవ్వండి. మిత్రులతో, క్లోజ్‌ఫ్రెండ్స్‌తో మాట్లాడించండి. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం ప్రాణాంతకం. -
Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!
కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో. అర్హతలు ఉన్నప్పటికీ, పుట్టుకతో ఉన్న శారీరక సమస్యను సాకుగా చూపుతూ ఉద్యోగానికి పనికిరావని చీత్కారాలకు గురైంది. దీంతో 22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ కొన్నాళ్లకు ఎడారిలో వర్షంపడినట్లుగా రాధిక జీవితంలో ఉద్యోగ అవకాశం రావడం.. దానిని అందిపుచ్చుకుని నేడు ఏకంగా ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యింది. ఇండియాలో ఉన్న అతిపిన్న వయసు సీఈవోలలో రాధిక కూడా ఒకరిగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. యోగేష్, ఆర్తీ గుప్తా దంపతుల ముద్దుల కూతురు రాధికా గుప్తా. యోగేశ్ వృత్తిరీత్యా దౌత్యవేత్త కావడంతో రాధిక చిన్నతనం మొత్తం పాకిస్థాన్, నైజీరియా, అమెరికా, ఇటలీలలో గడిచింది. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో ..‘‘బాగా చదువుకో జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతావు’’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండేవారు. దీంతో రాధిక కూడా చక్కగా చదువుకుంటూ స్కూల్లో టాప్–ఫైవ్ జాబితాలో ఉండేది. అంతా బాగానే ఉన్నప్పటికీ రాధికకు పుట్టుకతో కొన్ని సమస్యల కారణంగా మెడ వంకరగా ఉండేది. వంకర మెడతో స్కూలుకెళితే మిగతా విద్యార్థులంతా.. ఆమెను చూసి గేలి చేసేవారు. నువ్వు మీ అమ్మకంటే అందవిహీనంగా ఉన్నావు’’ అంటూ తరచూ మాటలతో హింసించేవారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ అవ్వడం.. వెళ్లిన ప్రతి కొత్త స్కూల్లో అవమానాలు వెన్నంటి వేధిస్తుండేవి. అయినప్పటికీ తనని తాను నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడేది . డ్యూయల్ డిగ్రీ ఉన్నప్పటికీ.. ప్రతిష్టాత్మక వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌లలో డ్యూయల్ డిగ్రీ చేసింది. రెండు డిగ్రీలు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. ఆమె విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలను పక్కనపెట్టేసి ‘నీ మెడ వంకరగా ఉంది నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇవ్వలేము’’ అని వెనక్కి తిప్పి పంపేవారు. ఇలా వరుసగా ఏడుసార్లు జరగడంతో రాధిక తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది. ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకుంటే ఏబాధ ఉండదు అనిపించింది ఆమెకు. కౌన్సిలింగ్‌తో... నిరాశనుంచి బయటపడేందుకు కొంతమంది స్నేహితుల సాయంతో సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుంది. ఆ తరువాత మెకిన్సేలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, ఏక్యూఆర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా చేరింది. తరువాత తన భర్తతో కలిసి ఇండియా వచ్చింది. సొంతంగా ‘ఫోర్‌ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్’ కంపెనీని ప్రారంభించింది. కంపెనీ క్యాపిటల్, పనితీరు బావుండడంతో ఎడిల్వీజ్ ఫోర్ఫ్రంట్ను కొనేసింది. ఇదే సమయంలో రాధిక పనితీరుని మెచ్చి ఎడిల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు సీఈవోని చేసింది. అనేక అవమానాలు, కష్టాల తరువాత సీఈవోగా రాణిస్తోన్న రాధిక ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘దట్ గర్ల్ విత్ ఏ బ్రోకెన్ నెక్’ వీడియోలో తన కథను వివరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అవమానాలనుంచి అందనంత ఎత్తుకు ఎదిగి నేను ఇది అని నిరూపించి చూపిస్తోంది రాధిక. నాన్నే ప్రేరణ.. నాన్న ..ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్‌లో ఏడో ర్యాంక్ సాధించారు. నిరుపేదరికం నుంచి వచ్చిన ఆయన అన్నిసాధించ గలిగినప్పుడు, నాకున్న ఒక సమస్యతో ఎందుకు వెనుకబడిపోవాలి అనుకుని, బాగా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. అందం, అనుమానాలను పక్కనపెట్టి, నేను ఎదుర్కొన్న ప్రతిసమస్యను అనుభవాలుగా మార్చుకుని ముందుకు సాగాను. దాంతోనే ఈ స్థాయిలో నిలబడిగలిగాను. – రాధికా గుప్తా -
కథ చెప్పేందుకు వెళ్తే హీరో నన్ను వర్షంలో నిలబెట్టాడు: డైరెక్టర్
వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అ, కల్కి, వంటి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్ వర్మ ఇటీవలె తేజ సజ్జాను హీరోగా పరిచయం చేశారు. జాంబీ రెడ్డితో తొలిసారిగా సౌత్‌లో జాంబీ జోనర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. దర్శకుడిగా సత్తా చాటుతున్న ఆయన ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొలినాళ్లలో తనకు ఎదురైన అవమానాల గురించి వెల్లడించాడు. 'ఓ హీరోకు కథ చెప్పడానికి వాళ్ల ఇంటికి వెళ్లాను. ముందుగానే ఆయనకి కాల్ చేసి రమ్మంటేనే వెళ్లాను. అయితే అక్కడికి చేరుకోగానే పెద్ద వర్షం మొదలైంది. దీంతో నేను గేటు బయటే ఉండి ఆయనకు కాల్ చేశాను. అయినా నన్ము లోపలికి రమ్మనకుండా అలానే వర్షంలో వెయిట్ చేయించాడు. ఆ రోజు వర్షంలో నేను తడిసిపోతూ, ఆయన ఇంటివైపు చూస్తూ నిలబడ్డాను. కిటికీలోంచి ఆ హీరో నన్ను చూస్తుండటం నేను గమనించాను. కనీసం లోపలికి కూడా పిలవకుండా బయటే నిలబెట్టడంతో చాలా కోపం వచ్చింది. అయినా తమాయించుకొని ఆ హీరోకు కథ చెప్పి సినిమా కూడా చేశాను' అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరో ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తేజ సజ్జాతో కలిసి హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
చింతలపూడి(పశ్చిమగోదావరి): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన దళిత సంఘాల నేతలు ఆదివారం ఉదయం పాత బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. (చదవండి: అది టీడీపీ నేతల కుట్రే) దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆందోళనలకు వైఎస్సార్సీపీతో సహా పలు రాజకీయపారీ్టల నేతలు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎలీజా పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళిత సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. దళిత నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.(చదవండి: టీడీపీ ప్రలోభాలు) దోషులకు కఠిన శిక్ష తప్పదు: డీఎస్పీ జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చెప్పుల దండను తొలగించారు. దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి, సీసీ కెమెరాల ఆధారంగా దోషులను పట్టుకోవడానికి విచారణ జరుపుతున్నారు. -
దేశ ప్రధాని ముందే అవమానించారు: మమత
పుర్సురా (పశ్చిమబెంగాల్): ‘మీ ఇంటికి ఎవరినైనా పిలిచి అనంతరం వారిని అవమానిస్తారా ? అలాంటి సంప్రదాయం భారత్‌లోగానీ, బెంగాల్‌లోగానీ ఉందా ? నేతాజీ స్లోగన్లను పలికి ఉంటే నేనే వారికి సెల్యూట్ చేసేదాన్ని. కానీ కార్యక్రమంతో సంబంధంలేని నినాదాలు చేసి నన్ను దేశ ప్రధాని ముందే అవమానానికి గురి చేశారు. ఇలా అవమానించడమే బీజేపీ సంస్కృతి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో బీజేపీపై మండిపడ్డారు. బెంగాల్‌లోని పుర్సురాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె బీజేపీపై ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో ప్రధాని ఎదుట మమతా ప్రసంగించే సమయంలో కొందరు వ్యక్తులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయగా, తాను అవమానానికి గురయ్యానంటూ మమత బెనర్జీ వేదిక నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి మత నినాదాలు చేసిన వారికి బెంగాల్ సంస్కృతి తెలియదని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేయాల్సిందిగా బీజేపీ కోరవచ్చని, వారి నుంచి డబ్బు తీసుకొని, ఓటు మాత్రం తృణమూల్ కాంగ్రెస్‌కు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని బయట నుంచి వచ్చిన పార్టీగా చెబుతూ, భారత్ జలావో పార్టీగా అభివర్ణించారు. వారంతా కావాలంటే తనను అవమానించవచ్చని, కానీ బెంగాల్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నమస్కార్ అనిగానీ, జైశ్రీరాం అనిగానీ అంటే గౌరవాన్ని చూపుతున్నారని అర్థమని చెప్పారు. ఆ నినాదం చేయాల్సిందిగా తామెవరినీ బలవంతం చేయడం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. జై శ్రీరాం నినాదం చేస్తే ఎవరూ నొప్పి పుట్టినట్టు భావించాల్సిన అవసరం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. -
ఆర్మీని అవమానించారు
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు అవమానకరమనీ, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం డిమాండ్ చేశారు. భాగవత్ ఆదివారం బిహార్‌లో ఆరెస్సెస్ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘సైనిక సిబ్బందిని సన్నద్ధం చేయడానికి ఆర్మీకి ఆరేడు నెలలు పట్టచ్చేమో కానీ ఆరెస్సెస్‌కు మూడు రోజులు చాలు’ అని అన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ మాట్లాడుతూ ‘భాగవత్ అలా అనడం తప్పు. ఆర్మీని ఆయన అవమానించారు. ఆ మాటలు నాకు బాధ కలిగించాయి. మన సైనికులు సరిహద్దుల్లో నిల్చొని రక్తం చిందిస్తున్నారు. భాగవత్ తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు. ఆర్మీ సామర్థ్యాన్ని భాగవత్ తక్కువ చేసి మాట్లాడారనీ, ఇలాంటి వ్యాఖ్యలు సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. అవమానించలేదు: ఆరెస్సెస్ భాగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారనీ, ఆయన ఆర్మీని అవమానించలేదంటూ ఆరెస్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సంఘ్ స్వయం సేవకులతో సైనికులను భాగవత్ పోల్చలేదని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఈ అంశాన్ని కావాలని రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీనిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు ఎరువులు, పురుగు మందులపై రాయితీ ఇస్తామన్నారు. కర్ణాటకలో జనాశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయచూరు, యాదగిరి, గుల్బర్గాల్లో రాహుల్ పర్యటించారు. -
జాతీయ జెండాకు అవమానం
గుడిహత్నూర్(బోథ్) : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ కార్యాలయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ గద్దె, గులాబిరంగులో ఉన్న పోల్ పైనే జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో వేడుకలకు హాజరైన పలువురు నాయకుల తీరుపట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకిందులుగా జెండా ఆవిష్కరణ మందమర్రిరూరల్(చెన్నూర్): పట్టణంలోని కార్మెల్ హైస్కూల్ సమీపంలో ఉన్న హెచ్ఎంఎస్ యూనియన్ కార్యాలయం ఎదుట నాయకులు జాతీయ జెండాను తల కిందులుగా ఆవిష్కరించారు. అటువైపుగా వెళ్తున్న సాక్షి విలేఖరి కంట పడడంతో వెంటనే కెమెరాలో బంధించాడు. కొద్ది సమయానికి తేరుకున్న నాయకులు తిరిగి జెండాను కిందికి దించి సరిచేసి ఆవిష్కరించారు. మురుగునీటిలో జెండా పండుగ కెరమెరి(ఆసిఫాబాద్): ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ పేరిట స్వచ్ఛత కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంటే.. ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని ఎస్సీ కాలనీలో అంగన్వాడి కేంద్రం వద్ద జెండా మురికి నీటిలో రెపరెపలాడింది. ఆ కేంద్రానికి సమీపంలోనే డ్రెయినేజీ ఉంది. అది పిచ్చిమొక్కలు, పూడికతో నిండి ఉండడం వల్ల ఆ మురుగునీరంతా జెండా ఎగురవేసే గద్దె వరకు పారింది. దీంతో గతి లేని పరిస్థితుల్లో జెండాను అక్కడే ఎగురవేశారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు మాత్రం ఈసడించుకున్నారు -
అడుగడుగునా అవమానిస్తున్నారు
ఒంగోలు టూటౌన్: అధికార పార్టీలో తనకు జరుగుతున్న అవమానంపై ఒంగోలు ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు ఒక్కసారిగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పలుమార్లు అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలోని సమావేశ మందిరంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి దామచర్ల జనార్దన్ గెలుపునకు కృషి చేశానన్నారు. అందుకు తనకు మిగిలింది అవమానాలేనని చెప్పుకొచ్చారు. ఏఎంసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారానికి నోచుకోలేకపోయానన్నారు. రోడ్డు విస్తరణలో ముస్లిం, మైనార్టీల దుకాణాలు తొలగించినా టీడీపీకి, ఎమ్మెల్యేకు మద్దతు తెలిపానన్నారు. నాడు మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ప్రొటోకాల్‌లో తన పేరు లేదంటూ అధికారులు లోనికి వెళ్లనీయలేదని, తనకంటే తక్కువ క్యాడర్ ఉన్నవాళ్లు చాలా మంది ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు పదవిని ఎవరికైనా ఇవ్వాలని ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలిపారు. అయితే ఇటీవల పార్టీ పదవులు ఊరికే రావని.. పార్టీ కోసం పని చేయాలని ఎమ్మెల్యే పేర్కొనడం బాధించిందన్నారు. పుట్టిన రోజు వేడుకకు ఒక రోజు ముందు ఎమ్మెల్యే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌ను మారుస్తున్నట్లు ప్రకటించి బాధపెట్టాడని వాపోయారు. ఆయన అలా ఎందుకు చేశారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పార్టీపై, పార్టీ నాయకుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. రానున్న ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికిస్తే వారి గెలుపునకు కృషి చేస్తానని, పార్టీ వీడనని చెప్పడం చర్చనీయాంశమైంది. -
అలకవీడని చినరాజప్ప..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి గురువారం హోంమంత్రికి ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీంతో అవమానంగా భావించిన చినరాజప్ప అప్పటి నుంచి అలకబూనారు. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు చినరాజప్పతో ఫోన్లో మాట్లాడారు. మీ శాఖలో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అధికారుల పట్ల మెతక వైఖరితో ఉండొద్దని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. శంకుస్ధాపనకు తనని పిలవకుండా అవమానించారని చినరాజప్ప మనస్థాపానికి గురయ్యారు. మంత్రినే పట్టించుకోకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నచంద్రబాబు.. ) -
అప్పు+అవమానం=ఆత్మహత్య
అతడొక నిరుపేద రైతు. ఓ వ్యాపారి వద్ద అప్పు చేశాడు. సరుకుల కోసం తన వద్దకు వచ్చిన ఆ రైతును.. సదరు వ్యాపారి గదిలో నిర్బంధించాడు. అప్పు తీర్చిన తరువాతనే బయటకు పంపిస్తానన్నాడు. దీనిని అవమానంగా భావించిన ఆ రైతు.. అదే గదిలోగల పురుగు మందు తాగాడు. తీవ్రంగా అస్వస్థుడయ్యాడు. ఖమ్మం ఆస్పత్రిలో బుధవారం ప్రాణాలొదిలాడు. ఆ వ్యాపారిపై కేసు నమోదైంది. ఇల్లెందు: ఇల్లెందు మండలం చల్లసముద్రం పంచాయతీ ధనియాలపాడు గ్రామానికి చెందిన ఆ రైతు పేరు రైతు ఏసు(45). స్థానిక వ్యాపారి లక్ష్మీనారాయణ దుకాణానికి ఈ నెల 4వ తేదీ రాత్రి 8.00 గంటల సమయంలో వెళ్లాడు. అప్పటికే ఆ వ్యాపారి నుంచి ఏసు అప్పు చెల్లించాల్సుంది. ఇదే విషయమై అక్కడ వీరిద్దరికీ వాగ్వివాదం జరిగింది. తన అప్పు చెల్లించిన తరువాతనే వదులుతానంటూ ఏసును తన దుకాణం గదిలో లక్ష్మీనారాయణ బంధించాడు. ఈ అవమానాన్ని ఆ రైతు భరించలేకపోయాడు. తీవ్ర మనోవేదనను తట్టుకోలేక, తనను నిర్బంధించిన దుకాణం గదిలోగల పురుగుల మందును తాగాడు. తీవ్రంగా అస్వస్థుడయ్యాడు. స్థానికులు వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అతడు బుధవారం ఉదయం మృతిచెందాడు. ఏసు కుమారుడు లక్ష్మణ్‌రావు ఫిర్యాదుతో ఇల్లెందు సీఐ ఎస్.సారంగపాణి కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. ఏసుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భారంగా మారిన వ్యవసాయ అప్పు దారెల్లి ఏసుకు గ్రామంలో ఎకరం భూమి ఉంది. అరెకరంలో వరి, మరో అరెకరంలో పత్తి సాగు చేశాడు. గ్రామంలోగల వ్యాపారి లక్ష్మీనారాయణ దుకాణంలో అప్పు కింద ఎరువులు, విత్తనాలు తీసుకున్నాడు. 15,000 రూపాయలు బాకీ ఇవ్వాల్సుంది. కొంతైనా అప్పు తీరుద్దామని సోమవారం రాత్రి వ్యాపారి వద్దకు వెళ్లాడు. మొత్తం అప్పు తీర్చాలని వ్యాపారి పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మాటామాటా పెరిగింది. ఇది చివరికి, ఏసు ప్రాణాలు తీసింది. నాయకుల సందర్శన ధనియాలపాడులో ఏసు మృతదేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఐతా సత్యం, నాయకులు తాజ్‌బాబా, జానీ, చీమల వెంకటేశ్వర్లు, బానోతు హరిప్రియ, సాములు నాయక్, గిన్నారపు నాగేందర్, సుదర్శన్‌కోరి, జేబీ శౌరి, అక్తర్, ఆజం, చింత నరసింహారావు, రజని తదితరులు సందర్శించి నివాళులర్పించారు. -
కళలంటే చులకనా...?
‘‘కళలంటే అంత చులకనా... కళాకారులను పిలిచి అవమానిస్తారా? కార్యక్రమం పెట్టమని ఎవరు అడిగారు...తీరా ప్రదర్శనకు వస్తే పూర్తిగా కార్యక్రమం చేయనివ్వరా? ఇదేనా కళలకు విజయనగరంలో ఇచ్చే గౌరవం?’’ ఇవీ విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో సోమవారం కళాకారులు, వారు కుటుంబీకులు, కళాభిమానులు నుంచి వినిపించిన వాఖ్యలు. విజయనగరం గంటస్తంభం: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా ఆనందగజపతి ఆడిటోరియంలో రెండోరోజు సోమవారం ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పలు కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో పలు నృత్య, గీత, పద్య, కీర్తన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే గాంధీ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేయాల్సిన స్వచ్ఛత సేవ కార్యక్రమం ఉదయం అక్కడే ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం 11 గంటల దాటే వరకు కళా ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయింది. సుమారు రెండుగంటల కార్యక్రమం ఆవిరి కావడంతో ప్రభావం కళా ప్రదర్శనలపై పడింది. దీంతో సమయాన్ని తగ్గించుకోవాలని కళాకారులకు నిర్వహణ బాధ్యత చూస్తున్న అధికారులు సూచించారు. బి.ఎ.నారాయణ, సంగీత కళాశాల ప్రిన్స్‌పాల్ అనురాధా పరుశరాం గేయకచేరి చేస్తూ వందేమాతర గీతం, వినాయక స్తుతి అలపించారు. అనంతరం మాట్లాడిన అధికారులు మరో పాటతో ముగించాలని సూచించారు. దీంతో బి.ఎ.నారాయణ కళాకారులకు ఇంతసమయం పాడాలని దయచేసి సూచించవద్దని వేడుకున్నారు. అయినా నిర్వాహకులు అంగీకరించకపోవడంతో కోపంగా తన బృందాన్ని తీసుకెళ్లిపోయారు. దీనిపై అనురాధా పరుశురాం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కళాకారులకు అవమానమన్నారు. దీంతో ప్రదర్శనలో పాల్గొన్న వారి కుటుంబీకులు, వీక్షించేందుకు వచ్చిన కళాకారులు తీవ్రంగా మండిపడ్డారు. పిలిచి అవమానించడం ఏమిటని ఆగ్రహం చెందారు. సుదీర్ఘ అనవసర ప్రసంగాలకు సమయం ఉంటుందని, కళల ప్రదర్శనకు సమయం ఇవ్వరా అని నిట్టూర్చారు. స్వచ్ఛత సేవ కార్యక్రమాన్ని ఇక్కడెవరు పెట్టమన్నారని ప్రశ్నించారు. తర్వాత భగవతి నృత్య కళామండలి వెంకటేశ్వర వైభవం ప్రదర్శనలో భాగంగా మధ్యలో మైకు కట్ చేయడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు. తర్వాత విజయనగరం ఎమ్పీడీవో శ్రీరాంమూర్తి ఎంత ప్రాధేయపడినా మరో పాటకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశతో నిష్క్రమించారు. ఇలా సాయంత్రం వరకు ప్రతి కళాకారుల ప్రదర్శనకు గడువు తగ్గించడంతో కళాకారులు అసహనం వ్యక్తం చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల ఇలా జరిగిందని పలువురు విమర్శించారు. అంతా గందరగోళం.. విజయనగరం వైభవం తెలియజెప్పేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచ్ఛత సేవ కార్యక్రమం, అవార్డుల ప్రదానోత్సవం పెట్టడంతో ఆనందగజపతి ఆడిటోరియంలో అంతా గందరగోళంగా తయారైంది. అవార్డులు ప్రదానం కూడా పద్ధతి ప్రకారం జరగకపోవడంతో వేదిక గజిబిజిగా కనిపించింది. దీంతో అక్కడకు వచ్చిన ఆహుతులకు ఏమి జరుగుతుందో అర్ధంకాలేదు. నిర్వహణ లోపం ఇందుకు కారణమన్న విమర్శలు వినిపించాయి. గతేడాది మాదిరిగా సమర్థమైన అధికారులు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమైంది. వచ్చే ఏడాదైనా ఇలాంటి లోపాలు లేకుండా చూడాలని కళాకారులు సూచించారు. -
మరోసారి రెచ్చిపోయిన శరద్ యాదవ్