Katrina Kaif Reveals She Got Insulted In Early Stages Of Her Career, Deets Inside - Sakshi
Sakshi News home page

Katrina Kaif : 'చేదు అనుభవం.. ఇక కెరీర్‌ ముగిసిపోయిందనుకున్నా'

Oct 23 2022 2:13 PM | Updated on Oct 23 2022 6:12 PM

Katrina Kaif Reveals She Got Insulted During Her Begining Of Career - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ గురించి పరిచయం అక్కర్లేదు. 2003లో  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండు దశాబ్లాలకు పైగా టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అయితే కెరీర్‌ ఆరంభంలో మాత్రం తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంది ఈ బ్యూటీ. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ... 'కెరీర్‌ ఆరంభంలో సాయ అనే చిత్రంలో చిన్న పాత్ర పోషించాను.

జాన్‌ అబ్రహం, తారా శర్మ అందులో హీరో, హీరోయిన్లు. అయితే నాపై ఒక షాట్‌ చిత్రీకరణ తర్వాత సినిమా నుంచి తొలగించారు. నటికి ఉండాల్సిన ఒక్క మంచి లక్షణం కూడా నాలో లేదన్నారు. ఆరోజు నా కెరీర్‌ ఇక ముగిసిపోయిందని చాలా బాధపడ్డాను. కానీ ఆ అవమానాల కారణంగా హీరోయిన్‌ అవ్వాలన్న నా కల ఇంకా పెరిగింది' అంటూ చెప్పుకొచ్చింది కత్రినా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement