Katrina Kaif
-
ప్రముఖ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్‌లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. -
అవార్డ్ అందుకున్న సుకుమార్ భార్య.. వైట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ పోజులు!
డిఫరెంట్ లుక్స్‌తో ఆదా శర్మ హోయలు..ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మెరిసిన కత్రినా కైఫ్..అవార్డ్ అందుకున్న తబిత సుకుమార్..వైట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ పోజులు..వేకేషన్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ నీలం ఉపాధ్యాయ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
16 ఏళ్ల క్రితం కలిశావ్.. నీలా ఎవరూ ఉండరు: కత్రినా కైఫ్ (ఫోటోలు)
-
హీరోయిన్ పవిత్ర స్నానం చేస్తుంటే.. నవ్వులాటగా ఉందా?
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. కుదిరితే సెల్ఫీలు దిగుతున్నారు. లేదంటే తమ కెమెరాల్లో వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ పరితపించిపోతున్నారు. సమయం, సందర్భం కూడా లెక్క చేయకపోవడం శోచనీయం. హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) ఇటీవల మహాకుంభమేళాకు వెళ్లి స్నానమాచరించింది.కత్రినా పవిత్ర స్నానం చేస్తుండగా వీడియో..అయితే ఆమె కనబడగానే అందరు ఆమె చుట్టూ మూగారు. వీఐపీ ఘాట్ వద్ద పవిత్రస్నానం చేస్తుంటే వెంటనే ఫోన్లు తీసి వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. తనకంటూ ప్రైవసీ ఇవ్వకుండా చుట్టూ నిలబడి కత్రినాను తమ ఫోన్లలో చిత్రికరించారు. ఓ వ్యక్తి అయితే.. నేను, నా సోదరుడుతో పాటు ఎవరున్నారో చూడండి అంటూ కత్రినా కైఫ్ పవిత్ర స్నానం చేస్తుండగా ఆమెను తన వీడియోలో చూపించాడు. కుంభమేళా దర్శనాన్ని కత్రినా దర్శనంగా మార్చేశామని ఏదో గొప్ప పని చేసినట్లుగా తెగ నవ్వుతున్నారు. నవ్వులాటగా ఉందా?ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కూడా మనిషేనని, తనను ఎందుకలా వేధిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఇదేమీ సరదాగా లేదని ఫైర్ అవుతున్నారు. నటి రవీనా టండన్ (Raveena Tandon) సైతం దీనిపై స్పందించింది. ఇది చాలా అసహ్యకరంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా చేసుకునే పనుల్ని ఇలాంటి జనాలు చెడగొడుతుంటారు అని మండిపడింది. -
బ్లూ శారీలో హెబ్బా.. స్విమ్మింగ్‌పూల్‌లో కత్రినా కైఫ్!
బ్లూ శారీలో మెరిసిపోతున్న హెబ్బా పటేల్..స్విమ్మింగ్ పూల్‌లో కత్రినా కైఫ్ చిల్..మజాకా హీరోయిన్ రీతూ వర్మ స్మైలీ లుక్స్...శారీలో అనుపమ పరమేశ్వరన్ ట్రెండీ లుక్..శారీ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
‘చావా’ మూవీ ప్రీమీయర్ షోలో రష్మిక సందడి (ఫొటోలు)
-
కత్రినా కైఫ్ చేతికి నల్లటి ప్యాచ్ .. బాలీవుడ్ బ్యూటీకి ఏమైంది?
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కి ఏమైంది? ఆమె చేతికి ఉన్న నల్లటి ప్యాచ్ ఏంటి? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చీరకట్టులో ఇటీవల ఎయిర్ పోర్టులో కనిపించిన కత్రినాని తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడ్డారు. వారి ఉత్సాహం చూసిన ఆమె కూడా ఫొటోలకు తనదైన శైలిలో పోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె కుడి చేతికి ఉన్న నల్లటి ప్యాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.ఆమె చేతికున్న ప్యాచ్‌పై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కత్రినా ఆరోగ్యానికి ఏమైంది? ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడానికి ఉపయోగించే డయాబెటిస్ ప్యాచ్ అయి ఉంటుందని తెలుస్తోంది. నిరంతర గ్లూకోజ్ మానిటర్లు అని కూడా పిలిచే ఇలాంటి ప్యాచ్‌లను మధుమేహం (షుగర్) ఉండే వ్యక్తులు పెట్టుకుంటారట. ఇది పెట్టడం వల్ల చేతి వేలును సూదితో గుచ్చి రక్త పరీక్ష చేసుకునే అవసరం ఉండదనీ, రోజంతా గ్లూకోజ్ స్థాయిలను ట్రాక్ చేయడంలో ఈ ప్యాచ్ ఉపయోగపడుతుందని సమాచారం. ఇక ఆ బ్లాక్ ప్యాచ్ ఆల్ట్రాహుమాన్ వంటి ఫిట్నెస్ ట్రాకర్ కావచ్చు.. ఇది బ్లడ్ షుగర్, హార్ట్ బీట్ రేటు, నిద్ర విధానాలను కూడా పర్యవేక్షిస్తుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి.. కత్రినా చేతికి ఉన్న ఆ నల్లటి ప్యాచ్ ఎందుకు? అనేది ఆమె చెబితేనే తెలుస్తుంది. -
కత్రినా ఫిట్నెస్ సీక్రెట్ తెలిసిపోయింది ఆమెది షట్పావళి డైట్ ప్లాన్
-
కత్రినా కైఫ్ బర్త్‌డే.. ఇష్టమైన ఫోటోలు షేర్ చేసిన విక్కీ కౌషల్ (ఫొటోలు)
-
కత్రినా కైఫ్‌కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్‌న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు.ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్‌తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
కత్రినా లేకుండానే ఫంక్షన్‌కు.. నటితో హీరో స్టెప్పులు..
అంబానీ ఇంట పెళ్లి అనగానే సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. ఎన్నో నెలల నుంచే మొదలైన సందడి ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ ఫంక్షన్‌కు హాజరై స్టెప్పులేస్తూ సంతోషంగా గడిపారు.వదిన రాలేదా?అయితే హీరో విక్కీ కౌశల్ మాత్రం భార్య కత్రినా కైఫ్ లేకుండా ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఇది చూసిన కొందరు ఫోటోగ్రాఫర్లు.. అదేంటి? వదిన రాలేదా? అని అడిగారు. కత్రినా కైఫ్‌ను వదినగా సంబోధించారు. వారి ప్రశ్నలు విన్న విక్కీ సమాధానమివ్వకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన కొందరు మేము కత్రినాను మిస్ అవుతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. విక్కీ ఎప్పటిలాగే..అయినా తను చాలా ఏళ్లుగా కష్టపడి పని చేస్తూనే ఉంది. ఇప్పుడైనా కొంత బ్రేక్ తీసుకుని ఇంట్లోవారితో కలిసుంటే బాగుంటుంది. విక్కీ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఎప్పటిలాగే హ్యాండ్సమ్గా ఉన్నాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కత్రినా ప్రెగ్నెంట్, అందుకే రాలేదేమో అని మరికొందరు అభిప్రాపయడ్డారు. కాగా సంగీత్‌లో విక్కీ.. నటి షెహనాజ్ గిల్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఈయన సినిమాల విషయానికి వస్తే అతడు ప్రధాన పాత్రలో నటించిన బ్యాడ్ న్యూస్ జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) Shehnaz x Vicky #TaubaTauba 🕺💃#ShehnaazGill #VickyKaushal pic.twitter.com/0EB0xlCSn1— $@M (@SAMTHEBESTEST_) July 6, 2024 చదవండి: ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ -
భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన స్టార్ హీరో!
బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల కత్రినా కైఫ్ గర్భం దాల్చిందంటూ గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌లో కత్రినా వదులుగా ఉన్న అవుట్‌ఫిట్‌లో కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. తన రాబోయే చిత్రం బాడ్ న్యూజ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన క్లారిటీ ఇచ్చారు.విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. 'ఏదైనా శుభవార్త ఉంటే మీతోనే మొదట చెబుతా. ప్రస్తుతం మీరు మా బ్యాడ్ న్యూజ్ సినిమాను ఎంజాయ్ చేయండి. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానిపై మాట్లాడుకుందాం' అని అన్నారు. కాగా.. ఈ జంట త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు టాక్ నడిచింది. ఒక నెల క్రితం లండన్‌లో భర్త విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ వేకేషన్‌కు వెళ్లగా అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. విక్కీ, కత్రినా రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయానికొస్తే విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు, తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో యానిమల్ బ్యూటీ ట్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత విక్కీ ఛావాలో ఛత్రపతి శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రణబీర్ కపూర్, అలియా భట్‌లతో కలిసి లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనున్నారు.Vicky Kaushal finally reacts to reports of Katrina Kaif's pregnancy during the trailer launch event of Bad Newz#VickyKaushal #KatrinaKaif #Vikkat #BadNewz pic.twitter.com/aFQOXoq8bQ— Ria Sharma (@RiaSharma1125) June 28, 2024 -
భర్త కోసం హీరోయిన్ స్పెషల్ పోస్ట్.. ప్రెగ్నెంట్ అని హింట్ ఇస్తోందా?
బర్త్‌డే అంటేనే సెలబ్రేషన్స్.. సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్ డేలో వర్క్ పక్కనపెట్టి ఎంటర్టైన్మెంట్కు, ఎంజాయ్‌మెంట్‌కు పెద్ద పీట వేస్తుంటారు. గురువారం (మే 16న) బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ 36వ బర్త్‌డే జరుపుకున్నాడు. అతడి భార్య కత్రినా కైఫ్.. విక్కీ బర్త్‌డేను తనకు తోచిన రీతిలో సెలబ్రేట్ చేసింది. అంతేకాకుండా అతడి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో మూడు హార్ట్ సింబల్స్, మూడు కేక్ ఎమోజీలను క్యాప్షన్‌లో జత చేసింది. ఆ క్యాప్షన్‌కు అర్థమదేనా!ఇది చూసిన కొందరు ఆ క్యాప్షన్‌లో ఇంకేదో అర్థం దాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అక్కడ హార్ట్స్, కేక్స్.. అలాగే విక్కీ ఫోటోలు.. అన్నీ మూడు మాత్రమే వచ్చేలా ఎందుకు పోస్ట్ చేసింది. అంటే తన కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని హింటిస్తోంది కాబోలు' అని అభిప్రాయపడుతున్నారు. మరో వ్యక్తయితే నువ్వు ప్రెగ్నెంట్ కదా.. అని ప్రశ్నించాడు. రెండేళ్ల క్రితం కూడా..కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె టీమ్.. సదరు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలు ఉట్టి పుకార్లుగానే మిగిలిపోతాయా? లేదంటే నిజమవుతాయా? అనేది చూడాలి!ఇద్దరూ సినిమాలతో బిజీవిక్కీ కౌశల్ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు చావా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ పీరియాడిక్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది. కత్రినా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా మేరీ క్రిస్మస్ అనే మూవీలో నటించింది. ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో జీలే జరా అనే సినిమా ఉంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) చదవండి: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ! -
నాలుగేళ్ల లవ్‌కు బ్రేకప్.. సినిమాకు ఒప్పుకోరేమోనని టెన్షన్!
ప్రేమలో ఉన్నంతసేపు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమంటారు. బ్రేకప్ అయ్యాక ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం చాలా ప్రొఫెషనల్. సినిమా కోసం పర్సనల్ విషయాలను పక్కనపెట్టి కలిసిపోయారు, కేవలం సెట్స్‌లోనే! సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పుడు ప్రేమపక్షులన్న విషయం తెలిసిందే! అయితే సల్మాన్ ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు, కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అలాగే కత్రినాతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అసౌకర్యంగా ఉంటుంది అది జరిగిన కొంతకాలానికే డైరెక్టర్ కబీర్ ఖాన్ 'ఏక్ థా టైగర్' సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కానీ ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ వల్ల ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారో, లేదోనని తెగ టెన్షన్ పడ్డాడు. దాని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కత్రినా, నాకు ఇంట్లో మనిషిలా అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పగానే వెంటనే సంతకం చేసింది. తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లాం. అసలే బ్రేకప్ అయింది. అలాంటి సమయంలో కలిసి పని చేయాలంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. కత్రినా అని తెలిసి కూడా ఆయన ఒప్పుకుంటాడో, లేదోనని టెన్షన్ పడుతూనే తన ఇంటికి వెళ్లాం. హీరోయిన్గా కత్రినాను సెలక్ట్ చేశాం అని చెప్పాను. 5-10 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత సరే చేసేద్దాం అన్నారు. మా గుండె నుంచి పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు. కాగా సల్మాన్- కత్రినా నాలుగేళ్లపాటు డేటింగ్ చేశారు. 2009లో విడిపోయారు. తర్వాత కత్రినా రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం కూడా నిలవలేదు. వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నాక విక్కీ కౌశల్‌ను లవ్ చేసింది. 2021లో వీరు పెళ్లి చేసుకున్నారు. చదవండి: పదేళ్ల క్రితం ఆశపడ్డాడు.. చివరికి అది నెరవేరకుండానే.. -
డ్యాన్స్ రాదన్నారు, సక్సెస్ కాలేవని ముఖం మీదే..
అత్యంత సుకుమారంగా కనిపించే అందగత్తె హీరోయిన్ కత్రినా కైఫ్. ఈ బ్యూటీ బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. దక్షిణాది ప్రేక్షకులకూ ఈమె సుపరిచితమే. ఇటీవల మేరీ క్రిస్మస్ అనే చిత్రం ద్వారా ఈమె కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ మూవీ అంతగా వర్కవుట్ కాలేదు. ఇకపోతే కత్రినాకైఫ్ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలో తన డాన్స్ గురించి తీవ్రంగా విమర్శించారంది. అసలు తాను నటిగా నిలదొక్కుకునే అవకాశమే లేదని పలువురు ముఖం మీదే చెప్పారని గుర్తు చేసుకుంది. ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈ అమ్మాయికి డ్యాన్స్ రాదని నృత్యదర్శకుడు చెప్పడంతో ఎంతో బాధపడ్డానని పేర్కొంది. అయితే ఆయన విమర్శలను తాను పెద్దగా పట్టించుకోలేదని, అలా చాలా మంది తన ఎదురుగానే నువ్వు సక్సెస్ కావు అని విమర్శలు చేశారని చెప్పుకొచ్చింది. అయితే వాటన్నింటినీ తాను సవాలుగా తీసుకుని తనేంటో నిరూపించానంది. తనను తక్కువగా చేసి మాట్లాడిన వారందరితోనూ సినిమాలు చేశానంది. వారి విమర్శలను పట్టించుకుని ఉంటే తానీ స్థాయికి చేరుకునేదాన్నే కాదని నటి కత్రినా కైఫ్ పేర్కొంది. చదవండి: ట్వీటు రాజా? పోటీ లేదా? -
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ మూవీ..
భాషాభేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, విలన్‌గా, హీరోయిన్ తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. రకరకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. పాత్ర నచ్చాలే కానీ ఏదైనా ఓకే అంటున్నాడు. ఈయన ఇటీవల హీరోగా నటించిన చిత్రం మెర్రీ క్రిస్మస్. హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడి చివరకు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నేడు అర్ధరాత్రి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ముందుగా హిందీ, తమిళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. Vijay Sethupathy’s #MerryChristmas will be streaming from Mar 8 on NETFLIX. pic.twitter.com/t3iNs7obth — Christopher Kanagaraj (@Chrissuccess) March 6, 2024 చదవండి: వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్ అంబానీ బరువుపై హీరోయిన్ కామెంట్లు -
బొమ్మలా మెరిసిపోతున్న జాన్వీ.. హాట్ బ్యూటీ అలాంటి లుక్!
లంగా ఓణీలో కుందనపు బొమ్మలా హీరోయిన్ జాన్వీ కపూర్ బ్యాక్ చూపించి రచ్చ లేపుతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే చార్మినార్ దగ్గర స్పెషల్ సాంగ్స్ బ్యూటీ చంద్రిక రవి పట్టుచీరలో సరికొత్తగా కనిపిస్తున్న హాట్ భామ పూనమ్ బజ్వా పొట్టి నిక్కర్లో హీరోయిన్ రియాసేన్ వలపు వల.. చూస్తే అంతే శ్రీలంకలో బికినీతో చిల్ అవుతున్న ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ కేరళలో ఎంజాయ్ చేస్తున్న సురేఖావాణి కూతురు సుప్రీత 22 ఏళ్ల తర్వాత నాగార్జునని కలిసిన 'మన్మథుడు' బ్యూటీ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by riya sen (@riyasendv) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
స్టార్ హీరో మూవీ.. నన్ను తీసేశారు: ప్రముఖ హీరోయిన్
'బచ్నా యే హసీనో'.. 2008లో రిలీజైన బాలీవుడ్లో మూవీ.. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించాడు. కథలో భాగంగా అతడు ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడతాడు. అయితే అతడు నాలుగో హీరోయిన్‌తో కూడా ప్రేమపాఠాలు నడుపుతాడని కథలో రాసుకున్నారట! కానీ ఫైనల్ స్క్రిప్ట్‌లో మాత్రం ఆ పాత్రనే లేపేశారంటోంది స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ నాలుగో హీరోయిన్ కోసం తనను సంప్రదించారని చెప్తోంది. నా రోల్ తీసేశారు తాజాగా కత్రినా కైఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'బచ్నా యే హసీనో సినిమాలో నన్ను నాలుగో అమ్మాయిగా అనుకున్నారు. కానీ చివరకు ఆ పాత్రను తీసేశారు. ఇకపోతే జీరో మూవీలో అనుష్క పాత్రను చేయాలనుకున్నాను. అదే సమయంలో బబిత ఆఫర్ రావడంతో దాన్ని చేశాను' అని చెప్పుకొచ్చింది. జీరో బాక్సాఫీస్ దగ్గర చతికిలపడగా బబిత హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా టైంలోనే డేటింగ్ కాగా బచ్నా యే హసీనో మూవీకి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు. ఇందులో మనీషా లంబ, బిపాషా బసు, దీపిక పదుకోణ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్‌బీర్-దీపికాలు లవ్‌లో పడ్డారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కత్రినాతోనూ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఆలియా భట్‌ను పెళ్లాడాడు. కత్రినా సినిమాల విషయానికి వస్తే ఆమె చివరగా మేరీ క్రిస్మస్ సినిమాలో నటించింది. ఈ మూవీ జనవరి 12న రిలీజైంది. చదవండి: హైదరాబాద్ టు ముంబై... బాలీవుడ్లో ఫేమస్ విలన్.. హీరోల వల్ల కెరీర్ నాశనం! -
నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్లో డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌ను మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్గా మంచి గుర్తింపు ఉంది. అంధాదూన్, బద్లాపూర్ వంటి థ్రిల్లర్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌కు థ్రిల్లర్ జోనర్ కథలే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.దీంతో ఆయన మళ్లీ అదే జోనర్‌లోనే మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. జనవరి 12న ఈ మూవీ రిలీజైంది. భారీ అంచనాలతో విడుదలైన మెర్రీ క్రిస్మస్ కలెక్షన్స్ పరంగా అంతగా రాబట్టలేకపోయింది. కానీ సినిమా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో మెర్రి క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రానుందని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీని విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్.30 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకుందట. దీంతో ఫిబ్రవరి 9న మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం. ఈ తేదిలో స్ట్రీమింగ్ కాకుంటే ఫిబ్రవరి 16న గ్యారెంటీగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని టాక్. మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు.తెలుగులో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. -
Merry Christmas Movie Premiere: 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రీమియర్‌లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
మా అమ్మ మధురైలో ఓ స్కూల్లో పని చేసింది: హీరోయిన్
విజయ్‌సేతుపతితో కలిసి నటించడం మంచి అనుభవమని బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ అన్నారు. బాలీవుడ్లో ప్రముఖ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించిన ఈమె తొలిసారిగా మెర్రీ క్రిస్మస్ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించారు. బద్లాపూర్, అంధదూన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ మూవీ హిందీ, తమిళ భాషల్లో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దుబాయ్‌లో పని చేశా.. అందుకే విజయ్‌సేతుపతి, కత్రికా కైఫ్, దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ సహా తదితరులు పాల్గొన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. తను ఆరంభ దశలో దుబాయిలో పని చేయడం వల్ల హిందీ భాష తెలుసన్నారు. అది ఈ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యిందని చెప్పారు. కత్రినా కైఫ్ మాట్లాడుతూ తనకు చైన్నె అంటే చాలా ఇష్టం అన్నారు. తన తల్లి కూడా కొంత కాలం మధురైలోని ఒక పాఠశాలలో పనిచేశారని చెప్పారు. తమిళంలో ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ తను ఇప్పటికే దక్షిణాదిలో తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించానని ఇప్పుడు తొలిసారిగా మెర్రీ క్రిస్మస్ ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో విజయ్‌సేతుపతితో కలిసి నటించడం ఇంకా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ చిత్రం కోసం ముందుగా తాము రిహార్సల్స్ చేశామని చెప్పారు. ఈ సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: హనుమాన్, గుంటూరు కారం కాంట్రవర్సీపై చిరంజీవి కామెంట్స్ -
Vicky-Katrina: కత్రినా-విక్కీ పెళ్లి వార్షికోత్సవ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Red Sea Film Festival 2023: కత్రినా కైఫ్.. అద్బుతమైన ఫోటోలు
-
చావు అంచుల దాకా వెళ్లొచ్చాను: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఓసారి చావు అంచులదాకా వెళ్లి వచ్చిందట. ఆ సమయంలో తను బతుకుతానని ఊహించలేదని, చావు తథ్యమని బయపడిపోయిందట. కత్రినా మాట్లాడుతూ.. ఓసారి నేను గగనప్రయాణం చేస్తున్నాను. అప్పుడు ఉన్నట్లుండి హెలికాప్టర్లో ఏదో ఇబ్బంది తలెత్తి ఆగిపోయింది. అంతా అల్లకల్లోలంగా మారింది. హెలికాప్టర్ వేగంగా నేలవైపు దూసుకెళ్లింది. ఇక అప్పుడే నేను చావు ఖాయమని ఫిక్సయిపోయాను. దేవుడా.. నా చావును ఇలా రాశావేంటి? అనుకున్నాను. ఆ క్షణమే నా జీవితం ముగిసిపోయిందనుకున్నాను. నాకేం జరిగినా మా అమ్మ తట్టుకోగలగాలని మాత్రమే కోరుకున్నాను అని చెప్పుకొచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో కత్రినా స్వల్ప గాయాలతో బయటపడింది. కాగా కత్రినా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ మీద వందల కోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మేరీ క్రిస్మస్ మూవీ ఉంది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. చదవండి: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేతులారా చేసుకుంది.. చివరకు ఎలిమినేట్.. రతిక కూడా? -
సల్మాన్ ఖాన్ కు సీక్వెల్ ఫీవర్.. టైగర్ 4 ప్లాన్!
-
'ఫారే' ప్రీమియర్ షోలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
విరాట్ కోహ్లీ మా పొరుగింటి వ్యక్తే: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఇటీవలే టైగర్-3 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. టైగర్ సిరీస్‌లో వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన మెరిసింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మరోవైపు కోలీవుడ్‌లో విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ప్రస్తుతం అందరిదృష్టి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష) ఫైనల్ మ్యాచ్‌కు ముందు కింగ్ కోహ్లీ విరాట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఇన్‌స్టాలో 'ఆస్క్ మీ ఏ క్వశ్చన్' అనే సెషన్ నిర్వహించింది. ఇందులో విరాట్ కోహ్లీ గురించి చెప్పండి? అని ప్రశ్నించారు. దీనికి కత్రినా బదులిస్తూ.. 'సూపర్ స్టార్, ఆదర్శవంతుడు, అంతే కాకుండా మా పొరుగు వ్యక్తి' అంటూ విరాట్ ఫోటోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా టైగర్ సినిమా గురించి నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు కత్రినా తెలిపారు. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీని కత్రినా ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు.. ఆమె పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీని ప్రశంసించారు. కాగా.. అనుష్క శర్మ, కోహ్లి చాలా ఏళ్లుగా ముంబయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. కత్రినా తన వివాహానంతరం భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అదే భవనంలో ఉంటోంది. (ఇది చదవండి: త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!) -
స్టేజీపై ఇద్దరు హీరోల ముద్దులాట, వీడియో చూశారా?
సినిమా సక్సెస్ అయిందంటే ఆ సంతోషమే వేరు. చిత్రయూనిట్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే! పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చేసినట్లే! అందుకే ఆ ఆనందాన్ని సక్సెస్ మీట్ల ద్వారా జనాలతో పంచుకుంటారు. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ మధ్య విజయాల్లేక అల్లాడిపోయిన బాలీవుడ్ ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోంది. అందులో తాజాగా టైగర్ 3 కూడా చేరింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ యాక్షన్ మూవీ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఆరు రోజుల్లోనే అన్ని కోట్లు మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 12న విడుదలవగా బాక్సాఫీస్‌పై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నవంబర్ 17న చిత్రయూనిట్ అభిమానుల కోసం ముంబైలో ఓ స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సల్మాన్, కత్రినాతో పాటు ఇందులో విలన్‌గా నటించిన మరో హీరో ఇమ్రాన్ హష్మీ సైతం పాల్గొన్నాడు. వీరు టైగర్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. సల్మాన్ ముద్దులు.. వీడియో వైరల్ తర్వాత సల్మాన్ మాట్లాడుతూ.. 'ఈ మూవీలో కత్రినా ఉంది. తనతో నేను చేసిన కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. సినిమాలో ఇమ్రాన్.. ఆతిష్ పాత్రలో లేకపోతే ఇలా జరిగి ఉండేది' అంటూ సరదాగా అతడి దగ్గరకు వెళ్లి ముద్దులు పెట్టాడు. సల్మాన్-ఇమ్రాన్ బ్రొమాన్స్ చూసిన జనాలు ఘొల్లుమని నవ్వారు. ముద్దు సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇమ్రాన్ హష్మీ గురించి సల్లూ భాయ్ మాట్లాడుతూ.. 'నేను ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కానీ ఇమ్రాన్‌కు అది బాగా అలవాటు.. దాన్ని మిస్ అవుతున్నాడేమో. అందుకే ఆ వెలితిని పూడ్చేశా' అని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్? -
‘టైగర్ 3’ ప్రదర్శనకు హాజరైన సల్మాన్, కత్రినా (ఫోటోలు)
-
సంక్రాంతి రేసులోకి 11వ సినిమా.. కాకపోతే!
చిన్నచిన్న పాత్రల చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. విలక్షణ నటుడిగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం అర్థ సెంచరీ సినిమాల మార్క్ దాటేసిన విజయ్.. అన్ని భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా తన కొత్త మూవీని సంక్రాంతి బరిలో పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ 'మేరీ క్రిస్మస్'. రాధికా శరత్‌కుమార్, సంజయ్‌కపూర్, టీనూ ఆనంద్, రాధిక ఆప్టే తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'అంధాదున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రాన్ని 2024 జనవరి 12న అంటే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పొంగల్ బరిలో రజనీకాంత్ లాల్‌సలామ్, ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్, సుందర్.సి 'అరణ్మణై 4' రెడీగా ఉన్నాయి. అలానే తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఫ్యామిలీస్టార్, నా సామిరంగ, రవితేజ 'ఈగల్' కూడా సంక్రాంతి బరిలోనే ఉండటం విశేషం. అయితే విజయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు హిట్, బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి గానీ హీరోగా చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అవుతున్నాయి. మరి 'మేరీ క్రిస్మస్' ఏం చేస్తుందో చూడాలి. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) View this post on Instagram A post shared by Tips Films (@tipsfilmsofficial) -
ఓటీటీకి సల్మాన్ ఖాన్ టైగర్-3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్-3. దీపావళి కానుకగా ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రెండు రోజుల్లో వంద కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్లింది. దీంతో సల్మాన్ ఖాతాలో మరో హిట్ పడిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. (ఇది చదవండి: బిగ్‌బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్) ఈ మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీకి రానున్నట్లు సమాచారం. ఎందుకంటే గత రెండు రోజులుగా ఈ సినిమా కలెక్షన్స్ తగ్గడమే కారణమని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ వారంలోనే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లు జరగడంతోనే కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు మేకర్స్ అంచనా వేస్తున్నారు. కాగా.. గతంలో రిలీజైన టైగర్ సిరీస్ సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా.. మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించారు. (ఇది చదవండి: స్టార్స్‌ను భయపెడుతోన్న డీప్ ఫేక్.. తాజాగా మరో స్టార్ హీరోయిన్!) -
టైగర్-3 దూకుడు.. రెండు రోజుల్లోనే వంద కోట్లు!
కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ చిత్రాన్ని టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ చిత్రాలకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించగా.. యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో వచ్చిన ఐదో సినిమా ఇది. దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం, పండుగ రోజు కావడంతో ఏకంగా రూ.44.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు కూడా అదే రేంజ్లో దూసుకెళ్లింది. రెండో రోజు రూ.57.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 102 కోట్ల వసూళ్లు సాధించింది. కాగా.. సినిమా రిలీజ్ రోజే సల్మాన్ ఫ్యాన్స్ థియేటర్లో హంగామా చేశారు. మాలేగావ్‌లోని సినిమా హాలులో మూవీ ఆడుతుండగానే టపాసులు కాల్చి హల్ చల్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ సైతం స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ‘టైగర్-3’ ట్విటర్ రివ్యూ) సల్మాన్ ఖాన్ తన ట్వీట్లో రాస్తూ.. 'టైగర్ 3 సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో బాణాసంచా కాల్చడం గురించి విన్నా. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. మనం ఇతరులను రిస్క్‌లో పెట్టకుండా సినిమాను ఎంజాయ్ చేద్దాం. సురక్షితంగా ఉందాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటించారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ విడుదలైంది. #Tiger3 becomes #SalmanKhan's 17th consecutive 100cr Grosser, Highest for any Indian star🔥. #KatrinaKaif #Tiger3BoxOffice pic.twitter.com/fyRaOcy6C0 — MASS (@Freak4Salman) November 14, 2023 -
‘టైగర్-3’ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్-3’. యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో విడుదలవుతున్న ఐదో సినిమా ఇది. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించింది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు(నవంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ‘టైగర్ 3’పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలకు సీక్వెల్‌గా వచ్చిన టైగర్ 3 ఎలా ఉంది? సల్మాన్-కత్రినా కైఫ్‌ల కెమిస్ట్రీ తెరపై ఎలా పండింది? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ‘టైగర్-3’ చిత్రానికి ఎక్స్(ట్విటర్)లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది సినిమా అదిరిపోయిందని చెబుతుంటే.. మరికొంతమంది బాగోలేదని కామెంట్ చేస్తున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో పోలుస్తూ ఆ స్థాయిలో ఆకట్టుకోలేదంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్ల బాగున్నప్పటికీ కథనం ఊహకందేలా సాగుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Tiger3 ~ 🐯 ROARING BLOCKBUSTER 🔥 Maneesh Sharma's BOND meets BOURNE is Action packed cracker heavy on emotions & higher stakes. Daddy of all Spy - SALMAN KHAN's Grand comeback 💪Peak villainism of @emraanhashmi 💯 & sizzling Katrina 🔥 Best film of Spy Universe. (4.5☆/5) pic.twitter.com/Qb6WO0y01o — Prince Prithvi (@PrincePrithvi) November 11, 2023 టైగర్ 3 రోరింగ్ బ్లాక్ బస్టర్. మనీష్ శర్మ జేమ్స్ బాండ్, బౌర్న్ చిత్రాల తరహాలో ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ ప్యాక్ట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్పై థ్రిల్లర్ చిత్రాలకు బాస్‌గా ఈ చిత్రం ఉంది. సల్మాన్‌కు మంచి కమ్ బ్యాక్ మూవీ. ఇమ్రాన్ హష్మీ విలనిజం, కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టారు. స్పై యూనివర్స్‌లో బెస్ట్ సినిమా అని కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ 4.5 రేటింగ్ ఇచ్చాడు. #Tiger3Review : Disappointing #SalmanKhan seems lethargic and trying too hard. The aura is missing and the screen presence looks animated#SRK lifts the movie on his entry but the movie drags again after his cameo. Katrina Kaif plays her part#Tiger3 will wrap under 250 cr. pic.twitter.com/Q4gEUr7nI3 — Pratham (@JainnSaab) November 11, 2023 టైగర్ 3 మూవీ డిస్పపాయింట్ చేసింది. సల్మాన్ ఖాన్ చాలా నీరసంగా కనిపించాడు. సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కనిపించలేదు. షారుక్ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. కానీ సాగదీసినట్టుగా ఉండడంతో ఆకట్టుకోలేకపోయింది. కత్రినా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. OneWordReview...#Tiger3 : BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½ Tiger is a WINNER and more than lives up to the humongous hype… #ManeeshSharma immerses us into the world of Mass Spy film,delivers a KING-SIZED ENTERTAINER A MUST WATCH #Tiger3Review #SalmanKhan #HappyDiwali… pic.twitter.com/uDLdoaHu9s — 𝐆𝐲𝐚𝐧𝐞𝐧𝐝𝐫𝐚 𝐬𝐢𝐧𝐠𝐡 (@Gyan84s) November 12, 2023 ‘ఒక్క మాటలో చెప్పాలంటే టైగర్ 3 బ్లాక్ బస్టర్. ఈ మాస్ స్పై చిత్రాన్ని మనీష్ శర్మ అద్భుతంగా డీల్ చేశాడు. ఒక కింగ్-సైజ్ ఎంటర్టైనర్ను అందించాడు’అని కామెంట్ చేస్తూ 4.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. #Tiger3 Routine plot that goes overboard at times saved by terrific making. Emotions works to an extend. SRK - Salman sequence worth though it gives over the top feels. Ends with a banger from Kabir 🔥 Watch out for Katrina and her perfo👌 Sallu 👏👏 • #Tiger3Review DWIALII 🏆 pic.twitter.com/kDN79L4G33 — Akhil Das (@thanatos__x4) November 11, 2023 Salman looks sooooooooo handsome in Tiger3🔥🔥🔥 don’t wanna give spoilers but it’s one of his best in recent times. And He’s the only one who can make me cry❤️🫶#Tiger3 #Tiger3FirstDayFirstShow #SalmanKhan pic.twitter.com/mSjEnAbGy9 — ShinChan😎❤️ (@ShikatuZukishi) November 12, 2023 #Tiger3 interval: bro What a film🔥boom It’s truly personal this time🔥Tiger abhi bhi zinda hai #SalmanKhan #KatrinaKaif #EmraanHashmi @BeingSalmanKhan 100/100⚡⚡⚡⚡, — @iamjhon (@rah42961) November 12, 2023 -
Deep Fake: ఇది లోతైన సమస్య!
మేధ అవసరం. సవ్యంగా వాడితే ఆధునిక సాంకేతికత అందించిన కృత్రిమ మేధ (ఏఐ) కూడా అవసరాలు తీర్చవచ్చు. కానీ, దాన్ని అపసవ్యంగా వాడి, అసత్య ప్రచారానికీ, అసభ్య వీడియోలకూ వినియోగిస్తే ఏమవుతుందో నాలుగైదు రోజులుగా తాజా ఉదాహరణలతో చూస్తున్నాం. లిఫ్టులో అడుగిడుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరైన ఓ బ్రిటిష్ ఇండియన్ మహిళ వీడియోను తీసుకొని, ఆమె ముఖం బదులు ప్రముఖ సినీ నటి రష్మికా మందన్న ముఖాన్ని తగిలించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, వివాదం రేపింది. నటి కత్రినా కైఫ్ పైనా ఇలాగే మరో నకిలీ వీడియో బయటకొచ్చింది. పెరిగిన ఏఐ సాంకేతిక వినియోగంతో ఈజీగా మారి, ఇంటర్నెట్ను ముంచెత్తుతున్న ఈ డీప్ ఫేక్‌లపై మళ్ళీ చర్చ రేగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, గౌరవం మొదలు జాతీయ భద్రత దాకా అన్నిటికీ ముప్పుగా మారుతున్న ఈ సాంకేతికతకు ప్రభుత్వం ముకుతాడు వేయాల్సిన అవసరాన్ని తెరపైకి తెచ్చింది. రకరకాల సాంకేతిక విధానాల ద్వారా బొమ్మలు, వీడియోలు, ఆడియోల్లో ఒక మనిషి స్థానంలో మరో మనిషి రూపాన్నీ, గొంతునూ అచ్చు గుద్దినట్టు ప్రతిసృష్టించి, డిజిటల్‌గా తిమ్మినిబమ్మిని చేయడమనే ‘డీప్ ఫేక్’ ఇప్పడు ప్రపంచమంతటినీ పట్టిపీడిస్తున్న చీడ. నిజానికి, ఫోటో–షాపింగ్ ద్వారా బొమ్మలు మార్చే పద్ధతి చాలా కాలంగా ఉన్నదే. కానీ, శక్తిమంతమైన మెషిన్ లెర్నింగ్,కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇట్టే బురిడీ కొట్టించేలా వీడియోలు, ఆడియోలు చేయడం డీప్ ఫేక్ను పదునైన అస్త్రంగా మార్చేశాయి. అసలు ఏదో, నకిలీ ఏదో కనిపెట్టేందుకు పలు పద్ధతులు లేకపోలేదు. అయితే, అసలు సంగతి వివరించేలోగా సోషల్ మీడియా పుణ్యమా అని నకిలీ సమాచారం క్షణాల్లో లోకాన్ని చుట్టేస్తోంది. చివరకు నాసిరకం డీప్‌ఫేక్‌లు సైతం జనం మనసులో అనుమానాలు రేపి, అసలు సిసలు సమాచారాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పోనుపోనూ సాంకేతికత పదును తేరి, అందరికీ అందుబాటులోకి వస్తే, డీప్‌ఫేక్‌లు నైసు తేలతాయి. అప్పుడిక అసలు, నకిలీలలో తేడాలు పసిగట్టడం ఇంకా కష్టం. ఇవాళ కంపెనీలు, రాజకీయ పార్టీలు, నేతలు తమకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకోవడానికీ, పెంచుకోవడానికీ, చివరకు ప్రత్యర్థులపై బురదచల్లడానికి ఫేక్ న్యూస్‌ను ఆసరాగా చేసుకుంటున్న తీరు చూస్తున్నాం. ఫలితంగా, అవి జనం మానసిక స్థితిపై ముద్ర వేసి, వారు తీసుకొనే నిర్ణయాలను ప్రభావితం చేయడమూ జరుగుతోంది. సమాచారం కోసం ఆన్‌లైన్‌పై అధికంగా ఆధారపడడం, సామాన్యుల్లో సైతం ఇంటర్నెట్ వినియోగం పెరిగాక వచ్చిన కొత్త తలనొప్పులివి. బాట్లు, ట్రోల్స్, ప్రభావం చూపే ప్రచారాలు... ఇలా పేర్లు ఏమైనా, అన్నిటి పనీ ఒకటే! ఆన్లైన్లో తమకు కావాల్సినట్టు కథనాలు వండివార్చడమే! మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వగైరా ఆధునిక సాంకేతికతల పుణ్యమా అని త్వరలోనే పూర్తిగా ఏఐ సృష్టించిన వార్తా కథనాలు, పాడ్ కాస్ట్‌లు, డీప్ ఫేక్ చిత్రాలు, వీడియోలతో కూడిన డిజిటల్ ప్రపంచాన్ని మనం పంచుకోవాల్సిన పరిస్థితి. మనం ఊహించలేనంత స్థాయిలో, వేగంతో ఇవన్నీ డిజిటల్ ప్రపంచాన్ని ముంచెత్తనున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం 2018 నాటికి కనిపెట్టిన డీప్‌ఫేక్‌లు 10 వేల లోపే! ఇవాళ ఆన్లైన్లో వాటి సంఖ్య లక్షల్లోకి చేరింది. కొత్త కృత్రిమ మీడియా సమాచారం ఆందోళనకరం. నిరుడు ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకొనేందుకు రష్యా డీప్ ఫేక్‌లను వాడే ప్రమాదం ఉందని పాశ్చాత్య దేశాలు అనుమానించాయి. ఈ ఏడాది మే నెలలో వైట్‌హౌస్ సమీపంలో పొగ వస్తున్న డీప్‌ఫేక్ చిత్రం దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. డీప్‌ఫేక్ కాకున్నా, రచయితల సమ్మె వేళ స్వర్గీయ తారల్ని తెరపై పునఃసృష్టించే పనికి హాలీవుడ్ స్టూడియోలు దిగడమూ నైతికతపై చర్చ రేపింది. సైబర్ ఆర్థిక నేరాలు, అసలును పోలిన నకిలీ సృష్టితో శీలహననం నుంచి దేశ భద్రత దాకా సాంకేతికత నీలినీడ పరుస్తోంది. సినీ తారలు ఇవాళ ఎదుర్కొన్న ఇబ్బంది సామాన్యులకు ఎదురవడానికి ఎంతో కాలం పట్టదు. ఈ ఏడాది ప్రపంచంలో 5 లక్షల డీప్‌ఫేక్ ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో షేరవుతాయని అంచనా. పైగా, డీప్‌ఫేక్ వీడియోల్లో 98 శాతం ఆడవారిపై చేసినవే. బాధిత ప్రపంచ దేశాల్లో 6వ స్థానం మనదే! ఆ మాటకొస్తే, 2020లోనే అజ్ఞాత సేవగా సాగిన ‘డీప్ న్యూడ్’ గురించి పరిశోధకులు బయటపెట్టారు. ఒక వ్యక్తి ఫోటోలను వారి అంగీకారంతో సంబంధం లేకుండా, క్రమం తప్పక అందించడం ద్వారా నకిలీ నగ్నచిత్రాలను సృష్టించే ఆ సర్వీస్‌పై రచ్చ రేగింది. పలు పాశ్చాత్య దేశాల్లో అరెస్టులు, దర్యాప్తులు, చట్టాల్లో మార్పులు జరిగాయి. కాలంతో పాటు సాంకేతికత మారి, జనజీవితంపై దాడి చేస్తున్న సమయంలో మన ప్రభుత్వాలు అవసరమైన కట్టుదిట్టాలు, చట్టాలు చేయకపోవడం సమస్య. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో సోషల్ మీడియా సంస్థలు సదరు మార్ఫింగ్ కంటెంట్‌ను తొలగించాలన్న రూలు ఇప్పటికే ఉంది. కానీ, డీప్ ఫేక్‌లను ముందే అరికట్టే చర్యలు అవసరం. అమెరికా లాంటి చోట్ల అరకొర చట్టాలతోనైనా ఆపే ప్రయత్నం జరుగుతోంది. బ్రిటన్‌లో డీప్‌ఫేక్ అశ్లీల వీడియోల తయారీ చట్టరీత్యా నేరం. చైనాలో ఏకంగా నిషేధమే ఉంది. వీడియోను మార్చినా, మార్పు చేసిన వీడియో అని రాయాల్సిందే. యూరోపియన్ యూనియన్ లాంటివీ కఠిన నియమాల రూపకల్పనకు కిందా మీదా పడు తున్నాయి. మన దేశంలోనూ అలాంటి ప్రయత్నం తక్షణమే జరగాలి. బాహ్య ప్రపంచంలో లానే వర్చ్యువల్ లోకంలోనూ వనితలను లక్ష్యంగా చేసుకొని, వారిపై సాగుతున్న ఈ హేయమైన దాడిని అడ్డకుంటే అది సభ్య సమాజానికే అవమానం. -
ప్రతి కణం కణం...
టైగర్, జోయాల ప్రేమ బలమైనది. ప్రేయసి మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘మెరిసే నీ కనులే.. ముసిరే నీ కనులే..’, ‘ప్రతి కణం.. కణంలో...’ అంటూ పాట అందుకున్నారు టైగర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘టైగర్ జిందా హై’కి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ 3’లోని పాట ఇది. టైగర్‌గా సల్మాన్ ఖాన్, జోయాగా కత్రినా కైఫ్ నటించగా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చొప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని రెండో పాట ‘ప్రతి కణం కణం..’ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ పాట టైగర్, జోయాల అన్యోన్యతను ఆవిష్కరించే విధంగా ఉంటుంది. ఆ కెమిస్ట్రీని సిల్వర్ స్క్రీన్‌పై చూసి, అనుభూతి చెందాల్సిందే. అందుకే వీడియోను ముందుగా రిలీజ్ చేయలేదు’’ అన్నారు ఆదిత్యా చొప్రా. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. -
రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కానీ ఆ వీడియో భారత సంతతికి చెందిన అమ్మాయి జరా పటేల్‌గా గుర్తించారు. గత నెల ఆమె తన ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేసింది. అయితే కొందరు దుండగులు డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో రష్మిక ఫేస్ వచ్చేలా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఈ వీడియోను అగ్రనటులు సైతం ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. ఇది చూశాక చాలా భాదపడ్డానని రష్మిక ట్వీట్ చేసింది. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన డీప్ ఫేక్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం టైగర్-3 చిత్రంలో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సీన్లో వచ్చే కత్రినా ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్.. మరో హాలీవుడ్ మిచెల్ లీతో టవల్ ఫైట్ సీన్లో కనిపించింది. ఈ సీన్ సినీ ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకంది. అయితే తాజాగా ఈ ఫైట్ సీన్లోని కత్రినా ఫోటోను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసినట్లు కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఇద్దరు స్టార్ హీరోయిన్లపై ఇలాంటి సంఘటనలు జరగడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సినీతారలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. -
టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న చిత్రం టైగర్-2. టైగర్ ఫ్రాంచైజీలో ఏక్తా టైగర్ వంటి సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన మరో చిత్రం టైగర్- 3. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. అయితే ఈ ట్రైలర్లో చూపించిన బాత్ టవల్ ఫైట్ హైలెట్‌గా కనిపించింది. (ఇది చదవండి: ప్రముఖ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోనున్న నటి ప్రగతి) తాజాగా మూవీ ప్రమోషన్స్ ఆ సీన్‌తోనే షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఈ సీక్వెన్స్‌తో రూ.1000 కోట్లు ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైట్ చేసింది ఆమెనే.. అయితే ఈ బాత్ టవల్ ఫైటింగ్ సీక్వెన్స్‌లో.. కత్రినాతో ఫైట్ చేసింది ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ లీ. తాజాగా ఆమె ప్రత్యేకంగా దీని గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సీన్ కోసం తామిద్దరం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తామిద్దరు కలిసి రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసినట్లు ఆమె తెలిపింది. బాడీ కవర్ అయ్యేలా టవల్స్‌ను హ్యాండిల్ చేయడం బిగ్ ఛాలెంజ్‌గా అనిపించిందని పేర్కొంది. (ఇది చదవండి: గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!) అంతే కాకుండా ఓ చిన్న సీన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడంపై ఆశ్చర్యం కలగలేదని చెప్పింది మిచెల్. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని తెలిపింది. అసలీ ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాన్ని ఎలా చేయాలి, కొత్తగా ఎలా చేస్తే ప్రేక్షకులకు మరింత బాగా కనెక్ట్ అవుతుందనే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ కూడా చేసినట్లు చెప్పింది. ఈ టైగర్-3 దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. Katrina’s Towel fight is gonna get #Tiger3 1000CR. 💥💥💥💥 #Tiger3Trailer #KatrinaKaif #SalmanKhan pic.twitter.com/mBIv6LPG3J — SuperNest (@supernest_) October 16, 2023 -
డ్యాన్స్ అంటే ఇష్టం.. ఫ్యాన్స్ కోసం ఎంతైనా కష్టపడతా: హీరోయిన్
ఒక సినిమా హిట్టయిందంటే వెంటనే దాని సీక్వెల్ గురించి చర్చ మొదలవుతుంది. చివరకు కథ రెడీ అయితే సీక్వెల్ పట్టాలెక్కడం ఖాయం. అలా బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ మూవీ టైగర్‌కు గతంలో సీక్వెల్ తెరకెక్కింది. తాజాగా టైగర్ 2కి సీక్వెల్‌గా టైగర్ 3 తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి లేకే ప్రభు కా నామ్ సాంగ్ రిలీజైంది. ప్రీతమ్ కంపోజ్ చేసిన ఈ పాటను అర్జిత్ సింగ్, నిఖిత గాంధీ పాడారు. తెలుగు, తమిళ వర్షన్స్ మాత్రం బెన్నీ దయాల్, అనూశ మణి పాడారు. ఇక ఈ పాటలో కత్రినా స్టెప్పులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. హిందీ వర్షన్ యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ పాటకు వస్తున్న స్పందనపై కత్రినా స్పందించింది. ఒక ఆర్టిస్టుగా నాకు ఎక్కడలేని ప్రేమాభిమానాలు అందిస్తున్నారు. లెకె ప్రభు కా నామ్ పాటను ఎంతో హిట్ చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. జనాలు మా నటనతో పాటు పాటలు, డ్యాన్సులు కూడా చూస్తారు. ఆ రెండు కూడా సినిమాలో భాగమే. పాటల వల్ల కూడా జనాలు సినిమాకు కనెక్ట్ అవుతుంటారు. అందుకే ఏ పాట అయినా దానికి ఎంతో బాగా డ్యాన్స్ చేయాలని ప్రయత్నిస్తుంటాం. ప్రేక్షకులను నిరాశపర్చకూడదని కష్టపడుతుంటాం' అని చెప్పుకొచ్చింది. కాగా టైగర్ 3 మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. చదవండి: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే? -
రొమాంటిక్ టైగర్
సిల్వర్ స్క్రీన్‌పై సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుందంటారు సినీ ప్రియులు. ‘టైగర్’ ఫ్రాంచైజీలో ‘ఏక్తా టైగర్’ వంటి సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన మరో చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుంది. ఈ సినిమాలోని సల్మాన్, కత్రినా కాంబినేషన్లోని రొమాంటిక్ సాంగ్ ‘లేకే ప్రభు కా నామ్’ పాట పూర్తి లిరికల్ వీడియోను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రీతమ్ స్వరపరచిన ఈ పాటను ఆర్జిత్ సింగ్ పాడారు. సల్మాన్‌కి ఆర్జిత్ సింగ్ పాడిన తొలి పాట ఇది. -
నువ్వు మొదలుపెట్టావ్.. నేను ముగిస్తాను!
‘దేశంలోని శాంతికి, దేశంలోని శత్రువులకు మధ్య ఎంత దూరం ఉంటుంది. కేవలం ఒక మనిషంత’ అంటూ మొదలువుతుంది ‘టైగర్ 3’ తెలుగు ట్రైలర్. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హాష్మి ప్రధాన పాత్రధారులుగా మనీష్శర్మ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన స్పై ఫిల్మ్ ‘టైగర్ 3’. యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ చిత్రాల్లోని ఘటనలకు కొనసాగింపుగా ‘టైగర్ 3’ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘టైగర్ 3’ ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను నవంబరు 12న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది. ‘టపాసులు కాల్చడం నవ్వు మొదలు పెట్టావ్.. నేను ముగిస్తాను’, ‘టైగర్‌కు శ్వాస ఉన్నంత వరకు, ఈ టైగర్ ఓటమిని ఒప్పుకోడు’ అంటూ సల్మాన్‌ఖాన్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందాహై’ చిత్రాల తర్వాత ‘టైగర్’ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమా ‘టైగర్ 3’. -
సల్మాన్ ఖాన్ టైగర్ 'ట్రైలర్ -3' విడుదల.. దుమ్ములేపిన కత్రినా
రెండు చిత్రాలతో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంట ప్రేక్షకులను మెప్పించిడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. ఆ చిత్రాల్లో టైగర్‌గా సల్మాన్ సాహసాలు, జోయాగా కత్రినా గ్లామర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. తాజాగా టైగర్-3 మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సీక్వెల్ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకుడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదొక ప్రతీకార యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. టైగర్ తన శత్రువులను వేటాడేందుకు ప్రాణాపాయకరమైన మిషన్‌ను ఎలా సాగిస్తాడో చూపించేదే ఈ సినిమా కథాంశం. సల్మాన్ ఖాన్ సీక్రెట్ ఇండియన్ రా ఏజెంట్ అని, అతను తన దేశాన్ని, ఫ్యామిలీని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో అతను ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు ప్రచారం జరగడంతో తన నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. నవంబర్ 12న దివాళి కానుకగా టైగర్-3 విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. -
విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ మూవీ.. రిలీజ్ డేట్‌పై అప్డేట్!
ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ భాషా భేదం లేకుండా ఎడాపెడా నటిస్తోన్న నటుడు విజయ్‌సేతుపతి. అదే విధంగా కథానాయకుడు, ప్రతినాయకుడు అని కూడా ఆలోచించకుండా.. పాత్ర నచ్చితే ఓకే చెప్పేస్తున్నారు. అలా ఏక కాలంలో హీరోగా, విలన్‌గా నటిస్తున్న అరుదైన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనొక్కరే అని చెప్పక తప్పదు. తాజాగా హీరోగా నటించిన తమిళ చిత్రం మహారాజా. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం విజయ్‌సేతుపతికి 50వ చిత్రం కావడం గమనార్హం. కాగా విజయ్ సేతుపతి ఇప్పటికే ఫర్జ్ అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యారు. తాజాగా జవాన్ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌కు విలన్‌గా నటించి బాలీవుడ్లో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న మేరీ క్రిస్మస్ చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా బాలీవుడ్ క్రేజీ భామ కత్రినా కై ఫ్ నటించడం విశేషం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్నారు. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మేరీ క్రిస్మస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. అయితే తాజాగా ఒక వారం ముందే అంటే డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని హిందీ, తమిళం భాషల్లో వేర్వేరుగా రూపొందించినట్లు వారు తెలిపారు. దీంతో మేరీ క్రిస్మస్ చిత్రంపై కోలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. Christmas comes even earlier this year!! Be ready to feel the chills and thrills of #SriramRaghavan's #MerryChristmas, now on 8th December, in cinema halls near you.@TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg #KatrinaKaif #SanjayKapoor… pic.twitter.com/PHp65E9KPx — VijaySethupathi (@VijaySethuOffl) October 3, 2023 -
కత్రినా క్రేజే వేరు.. ఏకంగా ఫేస్ బుక్ సీఈవోను వెనక్కి నెట్టి!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న సినీ తారల్లో కత్రినా ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. ఇన్‌స్టాలో ఆమెకు 76.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ సైతం ఛానెల్స్ సదుపాయం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కూడా కత్రినా కైఫ్ 14 ఫాలోవర్స్‌లో ముందు వరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్, ప్రముఖ రాపర్ బ్యాడ్ బన్నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) ఇప్పటివరకు వాట్సాప్ ఛానెల్‌కు అత్యధికంగా 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానెల్ 14.4 మిలియన్లతో మూడోస్థానంలో నిలవగా.. కత్రినా తన 14.2 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో 5వ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్‌ను 9.2 మిలియన్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్ 13న వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించింది. కొత్త ఛానెల్‌కు స్వాగతం చెబుతూ తన ఫోటోలు కూడా పంచుకుంది. సెలబ్రీటీల పరంగా చూస్తే కత్రినా కైఫ్ టాప్‌లో ఉంది. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్-3 చిత్రంలో నటిస్తోంది. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు. -
సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో మెప్పించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. గత రెండు చిత్రాలతో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంట ప్రేక్షకులను మెప్పించింది. ఆ చిత్రాల్లో టైగర్‌గా సల్మాన్ సాహసాలు, జోయాగా కత్రినా గ్లామర్ వహ్వా అనిపించాయి. ఇప్పుడు ఆ సిరీస్‌లో తదుపరి చిత్రంగా టైగర్ సందేశ్ పేరుతో మేకర్స్ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సీక్వెల్ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకుడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదొక ప్రతీకార యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. టైగర్ తన శత్రువులను వేటాడేందుకు ప్రాణాపాయకరమైన మిషన్‌ను ఎలా సాగిస్తాడో చూపించేదే ఈ సినిమా కథాంశం. (ఇదీ చదవండి: ప్రభాస్ వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్న ముగ్గురు టాప్ హీరోలు) టైగర్ తన దేశం కోసం, తన కుటుంబం కోసం తన పేరును దాచి ఒక స్పైగా పనిచేస్తాడు. తాజాగా విడుదలైన టైగర్ సందేశ్‌లో సల్మాన్ చెబుతున్న డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇందులోని యాక్షన్ సీన్స్ అదిరిపోయే రేంజ్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు. -
అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు
Bollywood highest tax-paying female actress: బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు హీరోలతో ధీటుగా తమ యాక్టింగ్ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే హీరోలతో పోలిస్తే రెమ్యనరేషన్ విషయంలో మాత్రం వివక్ష తప్పడం లేదు. అయితే నటనతో పాటు ఎండార్స్మెంట్స్, యాడ్స్ ద్వారా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్ ఎవరో తెలుసా? 500 కోట్లు నికర విలువ దీపికా పడుకోన్ బాలీవుడ్ విమెన్ సెలబ్రిటీలలో టాప్ టాక్స్పేయర్గా నిలుస్తోంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? ) బాలీవుడ్ సెలబ్రిటీలు, సినిమాలు చేయడంతో పాటు, విభిన్న వ్యాపారాలలో కూడా నిమగ్నమై భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్న నేపథ్యంలో దేశంలో అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో ఉంటున్నారు హీరోయిన్లు. ఇందులో తోటివారిలో ప్రత్యేకంగా నిలుస్తోంది దీపికా పడుకోన్. దీపికా 2016-2017 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చెల్లించిందట. ఇదే పరపరంలో తరువాత సంవత్సరాల్లో కొనసాగుతోందని బహుళ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే గత ఏడాది అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ దీపికా పదుకోన్. దీపికా పదుకోన్ సంపాదన సంవత్సరానికి రూ. 40 కోట్లు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేస్తోంది. ఇక ఎండార్స్మెంట్ల కోసం 7-10 కోట్లు వసూలు చేస్తుందట. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, దీపిక ప్రధాన ఆదాయ వనరు ఎండార్స్మెంట్లు. 2019లో 48 కోట్లు సంపాదించింది. పద్మావతి మూవీకోసం ఏకంగా రూ. 12 కోట్లు వసూలు చేసిందని బీటౌన్ టాక్. అంతేకాడదు అదే ఏడాది రోహిత్ శర్మ, అజయ్ దేవగన్, రజనీకాంత్ వంటి ప్రముఖులను వెనక్కి నెట్టి అత్యధిక నికర విలువ కలిగిన టాప్ 10 భారతీయ సెలబ్రిటీలలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. (డాలరు Vs ఫెడ్: మరి బంగారం, వెండి ధరలు? ఇపుడు కొనడం మంచిదేనా?) ఈ రేంజ్లో టాక్స్ కంటిన వారిలో దీపికానే టాప్. గతంలో ఈ ప్లేస్‌లో కత్రినా కైఫ్ ఉంది.2013-2014 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్లకు పైగా పన్నులు చెల్లించింది. రూ.10 కోట్ల మార్కుకు చేరుకోనప్పటికీ ఇక ఈలిస్ట్లోఆ లియా భట్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఏడాది 5-6 కోట్ల పన్నులు చెల్లిస్తున్నట్లు సమాచారం. భారతీయ మహిళా సెలబ్రిటీలలో ధనవంతులైన హీరోయిన్లల లిస్ట్‌లో దీపికా రెండో స్థానంలో ఉంది. ప్రియాంక చోప్రా జోనాస్ నెట్‌వర్త్ 620 కోట్లు. కరీన్ కపూర్ ఖాన్, దాదాపు రూ. 485 కోట్లు, -
వరుసగా సినిమాల నుంచి తప్పుకుంటున్న టాప్ హీరోయిన్స్.. అసలేంటీ కథ!
ఒక్క ఛాన్స్ వచ్చేవరకే ఎవరైనా ఆ చాన్స్ కోసం కష్టపడాలి. ఆ ఒక్క చాన్స్ బంపర్ చాన్స్ అయితే ఆ తర్వాతి చాన్సులు అవే వస్తాయి. ఇందుకు ఓ ఉదాహరణ పూజా హెగ్డే, రష్మికా మందన్నా. స్టార్ హీరోయిన్లుగా ఈ ఇద్దరూ తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు. చివరికి ఈ ఇద్దరూ డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమాలు వదులుకునేంత బిజీ. అటు హిందీకి వెళితే ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ కూడా ఈ మధ్య ఒక సినిమా వదులుకున్నారు. ‘నో డేట్స్.. ఐ వాన్న వాకౌట్’ అంటూ ఈ నలుగురూ వదులుకున్న చిత్రాల గురించి, పూజ–రష్మిక వాకౌట్ చేయడం వల్ల ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి దర్శక–నిర్మాతలు పరిశీలిస్తున్న హీరోయిన్ గురించి తెలుసుకుందాం. గుంటూరు కారం మిస్ ‘ఒక లైలా కోసం’తో (2014) తొలిసారి తెలుగు తెరపై మెరిశారు పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇక్కడ ఫుల్ బిజీ. అటు తమిళ, హిందీ నుంచి అవకాశాలు దక్కించుకున్నారు. ఇలా బిజీగా ఉన్న పూజ ఇటీవల డేట్స్ సర్దుబాటు చేయలేక ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకున్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది పేర్కొన్న విషయం తెలిసిందే. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు పూజ. ‘గుంటూరు కారం’ నుంచి వాకౌట్ చేయకపోయి ఉంటే ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడో సినిమా అయ్యుండేది. అలాగే ‘మహర్షి’ వంటి హిట్ తర్వాత మహేశ్‌బాబు–పూజ కాంబోలో రెండో సినిమా అయ్యుండేది. అయితే ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నప్పటికీ సూర్యదేవర నాగవంశితో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించనున్న చిత్రంలో ఈ బ్యూటీ నటించే చాన్స్ ఉందట. సాయిధరమ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రానికి పూజని హీరోయిన్గా తీసుకోవాలని నాగవంశి, సాయి సౌజన్య అనుకున్నారట. పూజని సంప్రదించారని సమాచారం. అయితే ఇంకా ఆమె కథ వినలేదట. నితిన్ సినిమా మిస్ ‘ఛలో’తో తెలుగుకి పరిచయమయ్యారు రష్మికా మందన్నా. ఈ సినిమాలో సింపుల్ గాళ్‌గా ఎంట్రీ ఇచ్చి, స్టార్‌గా ఎదిగారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రెయిన్ బో’తో పాటు మరో తెలుగు సినిమా, హిందీ చిత్రాలతో రష్మిక ఫుల్ బిజీ. అందుకే నితిన్ సరసన ఒప్పుకున్న చిత్రానికి కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారట. నిజానికి ‘భీష్మ’ సినిమాతో నితిన్–రష్మిక హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఒకవేళ రష్మిక డేట్స్ అడ్జెస్ట్ చేయగలిగితే మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేది. తెలుగులో రష్మిక ఎంట్రీ ఫిల్మ్ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తొలి హిట్ ఇచ్చిన దర్శకుడితో ‘భీష్మ’ వంటి రెండో హిట్ కూడా అందుకున్నారు రష్మిక. సో... వెంకీ కుడుములతో మూడో సినిమాని రష్మిక మిస్ అయ్యారు. రీప్లేస్ చేసేది ఎవరు? బాలీవుడ్లో ఈ మధ్య ప్రకటించిన చిత్రాల్లో ‘జీ లే జరా’ అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి కారణం ఇది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కావడం, చిత్రదర్శకుడు ఫర్హాన్ అక్తర్ కథానాయికలుగా ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్లను ఎన్నుకోవడం. అయితే హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వల్ల ఈ చిత్రాన్ని 2024లో ఆరంభించాలని ఫర్హాన్‌ని ప్రియాంక కోరారట. ఫర్హాన్ ఓకే చెప్పారని టాక్. ఈలోపు కత్రినా వేరే ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంతో ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయలేనన్నారట. కాగా ‘సిటాడెల్ 2’ స్టార్ట్ అయ్యే చాన్స్ ఉన్నందున టోటల్‌గా ఈ సినిమా నుంచి వాకౌట్ చేయాలని ప్రియాంక నిర్ణయించుకున్నారట. కత్రినా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఒకరు వదులుకున్న చాన్స్ ఆటోమేటిక్‌గా వేరొకరికి దక్కడం సహజం. అలా ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం శ్రీలీలకి, మీనాక్షీ చౌదరికి ప్లస్ అయింది. ముందు ఈ చిత్రంలో శ్రీలీలను రెండో హీరోయిన్గా అనుకున్నారు. కానీ పూజ తప్పుకోవడంతో ఆమె మెయిన్ హీరోయిన్ అయ్యారు. శ్రీలీల స్థానంలోకి మీనాక్షీ చౌదరి వచ్చారు. అలాగే నితిన్ సినిమా నుంచి రష్మికా మందన్నా తప్పుకోవడంతో ఆ చాన్స్ కూడా శ్రీలీలకే వెళ్లనుందని టాలీవుడ్ టాక్. అటు హిందీ ‘జీ లే జరా’ విషయానికొస్తే.. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ తప్పుకోవాలనుకోవడంతో అనుష్కా శర్మ, కియారా అద్వానీ వంటి నాయికల పేర్లను పరిశీలిస్తున్నారట ఫర్హాన్ అక్తర్. -
ప్రత్యేక అతిథిగా...
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల వెండితెర క్రిస్మస్ వేడుకల్లో రాధికా ఆప్టే ప్రత్యేక అతిథిగా సందడి చేశారట. బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తాజా చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం రాధికా ఆప్టేను ఎంపిక చేశారట. ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. హిందీ, తమిళ భాషల్లో రూపొంది, తెలుగులో కూడా విడుదల కానున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి గత ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘బదలాపూర్’, ‘అంథాధూన్’లో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఇట్లుంటరన్నమాట!
మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో చూడడానికి ఫొటో ఆల్బమ్‌లు ఉన్నాయి. మరి వయసు పైబడిన తరువాత ఎలా ఉంటామో చూడడానికి ఏమీలేవు. ‘ఎందుకు లేవు’ అంటూ రంగంలోకి దిగాడు ఏఐ ఆర్టిస్ట్ షాహిద్. ‘మిడ్‌జర్నీ’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బాలీవుడ్ అందాల కథానాయికలు దీపిక పదుకోణ్, కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ.. .మొదలైన వారిని బామ్మలుగా మార్చేశాడు. ‘వావ్ రే వావ్’ అంటూ ఈ ఫొటోలు నెట్లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి కొందరు తత్వంలోకి దిగి ఇలా అన్నారు... ‘భౌతిక అందం అశాశ్వతం. అంతఃసౌందర్యమే శాశ్వతం’ -
ముప్పై కోట్ల ఫైట్
‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల తర్వాత ‘టైగర్’ ఫ్రాంచైజీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ 3’. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించిన సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లు ‘టైగర్ 3’లోనూ జంటగా నటిస్తున్నారు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చో్ప్రాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం ఈ నెల 8 నుంచి ముంబైలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో షారుక్ ఖాన్ గెస్ట్‌గా కనిపిస్తారు. ఈ ఒక్క ఫైట్ కోసమే నిర్మాత ఆదిత్యా చో్ప్రాదాదాపు రూ. 30 కోట్లు కేటాయించారని, జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని బాలీవుడ్ టాక్. ‘టైగర్ 3’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఆమె ప్రెగ్నెంటా?.. స్టార్ హీరోయిన్‌పై నెటిజన్స్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె గతేడాది హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరు పొందారు. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న 2021 డిసెంబర్9న రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ పార్టీకి హాజరైన కత్రినాపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరి ఇచ్చిన ఈద్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ విందుకు కత్రినా కైఫ్ కూడా హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ సూట్‌ను ధరించిన కత్రినా చాలా బ్యూటీఫుల్‌గా కనిపించింది. కాస్తా బొద్దుగా కూడా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినాను చూస్తుంటే ప్రెగ్నెంట్‌లా కనిపిస్తోందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..' కత్రినా ప్రస్తుతం గర్భవతినా? కొంత బరువు పెరిగినట్లు కనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. మరొకరు రాస్తూ.. కత్రినా చాలా అందంగా ఉంది.. ఆమె గర్భవతి అయి ఉండొచ్చు' అని కామెంట్ చేశాడు. కాగా.. కత్రినా కైఫ్ చివరిగా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి ఫోన్ భూత్ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నేను పర్ఫెక్ట్ హజ్బెండ్ కాదు: విక్కీ కౌశల్
బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంట ఒకటి. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విక్కీ-కత్రినా తరచూ తమ క్యూట్ క్యూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకోలేదనే విషయం తెలిసిందే. అయితే గతేడాది ఓ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాడ్‌లో కలిసి నటించారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో విక్కీ కౌశల్ మాట్లాడుతూ భార్య కత్రినా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. కాగా కొంతకాలం పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021 డిసెంబర్లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాను పర్ఫెక్ట్ హజ్బెండ్ కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. ‘నేను నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేనెప్పుడు పర్ఫెక్ట్ అని అనుకోను. ఓ భర్తగా, కొడుకుగా, నటుడిగా ఎందులోనూ నేను కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నన్ను నేను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. పూరిపూర్ణంగా ఉండడమే లక్ష్యంగా పని చేస్తుంటాను’ అన్నాడు. చదవండి: తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్ హీరో అలాగే ఆదర్శవంతమైన భర్తనని కూడా తాను అనుకోనవడం లేదన్నాడు. కానీ, నిన్నటి కంటే రేపు ఉత్తమంగా ఉండేందుకు ట్రై చేస్తానన్నాడు. తనని తాను సరిచేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పాడు. అనంతరం భార్య కత్రినా గురించి మాట్లాడుతూ.. ‘కత్రినా నా లైఫ్‌లోకి వచ్చాక నాలో చాలా మార్పు వచ్చింది. అంతా ఒక్కసారిగా మారిపోయింది. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఒక సక్సెస్ ఫుల్ మ్యాన్‌గా ఎదగడానికి తను నాకు ఎంతో సహకరిస్తోంది’ అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు. -
కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా? వైరల్‌గా మారిన ఫోటోలు
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా? పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా మారిన కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఇటీవలె ఓ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఈ బ్యూటీ వదులుగా ఉన్న దుస్తులతో కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో కత్రినా తల్లి కాబోతుందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు పదేపదే కత్రినా తన పొట్టభాగాన్ని కవర్ చేసుకుంటూ కనిపించడంతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలపై కత్రినా స్పందించలేదు. 2021 డిసెంబర్9న కత్రినా- విక్కీ కౌశల్‌ల వివాహం రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ యాడ్ షూట్లో సందడి చేసిన వీరిద్దరు బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరు పొందారు. ప్రస్తుతం ఇద్దరూ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్నట్లు కత్రినా నిజంగానే ప్రెగ్నెంటా అన్నది త్వరలోనే తెలియనుంది. -
నిర్మాణ రంగంలో రాణిస్తున్న లేడీ ప్రొడ్యూసర్స్, ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చింది వీరే
అమ్మాయిలంటే సిల్వర్ స్క్రీన్‌పై మెరవడానికే.. స్క్రీన్ వెనక టెక్నీషియన్స్గానో, సినిమాలకు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌గా సూట్ అవ్వరనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకే ఈ రెండు విభాగాల్లో తక్కువమంది ఉంటారు. అయితే రోజులు మారుతున్నాయి. మహిళా సాంకేతిక నిపుణులు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య పెరిగింది. అరడజను మందికి పైగా ఈ ఏడాది నిర్మాతలుగా పరిచయం కావడం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పువచ్చు. ఇక ఈ ఏడాది ఫిలిం మేకింగ్ (నిర్మాణం)లోకి వచ్చిన మేడమ్స్ గురించి తెలుసుకుందాం. దివంగత ప్రముఖ నటులు, నిర్మాత కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీద ‘రాధేశ్యామ్’ సినిమాతో ఈ ఏడాది నిర్మాతగా పరిచయం అయ్యారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)లతో కలిసి ప్రసీద (గోపీకృష్ణా మూవీస్) ఈ సినిమా నిర్మించారు. నిర్మాణరంగంలోకి అడుగు పెట్టక ముందు విదేశాల్లో ప్రసీద ప్రొడక్షన్ కోర్స్‌లో చేశారు. మరోవైపు దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దివ్య దీప్తి నిర్మించిన తొలి చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, సంజన జంటగా నటించారు. తండ్రి దర్శకత్వం వహించిన చిత్రాల షూటింగ్‌లకు దివ్య వెళ్లేవారు. అలా ఫిలిం మేకింగ్‌పై అవగాహన పెంచుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా మారారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’ సినిమాకు నీలిమ ఓ నిర్మాత. ఈ ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ పీరియాడికల్ ఫిల్మ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక నిర్మాణరంగంలో ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రాలకు (సిరి సిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం..) పదికిపైగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్పై రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. కాగా ప్రస్తుతం తెలుగులో ఉన్న అగ్ర నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. ఆయన కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాణరంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ కూడా ఆరంభమైంది. ఈ సిరీస్‌కు దర్శకుడు హరీష్ శంకర్ కథ ఇచ్చారు. బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్‌కి హన్షిత రెడ్డి ఓ నిర్మాతగా ఉన్నారు. యాక్షన్ టు ప్రొడక్షన్ హీరోయిన్లు కూడా నిర్మాతలుగా మారు తుంటారు. హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ నిర్మాతగా మారారు. రాహుల్ విజయ్, మేఘా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మాటే మంత్రము’ చిత్రానికి బిందు ఆకాష్ ఓ నిర్మాతగా ఉన్నారు. పేరు తల్లిది అయినప్పటికీ కూతురు మేఘా ఆకాష్ సపోర్ట్‌తోనే బిందు నిర్మాత అయ్యుంటారని ఊహించవచ్చు. ఇక మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మి ‘గార్గి’ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అయ్యారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే టాప్ హీరోయిన్ కీర్తీ సురేష్ త్వరలో ఓ ప్రొడక్షన్ హౌస్ ఆరంభించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ.. బాలీవుడ్‌లోనూ ఈ ఏడాది లేడీ నిర్మాతల జాబితాలో కొందరు హీరోయిన్ల పేర్లు చేరాయి. హన్సల్ మెహతా తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లో నటించి, నిర్మించనున్నారు కరీనా కపూర్. ఏక్తా కపూర్‌తో కలిసి ఆమె ఈ సినిమా నిర్మించనున్నారు. ఇక షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఆలియా భట్ ‘డార్లింగ్స్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఆలియా నటించారు కూడా. హీరోయిన్ కృతీ కుల్హారి కూడా ‘నాయిక’ అనే సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇలా నిర్మాణ రంగంలోనూ స్త్రీ శక్తి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
నా పెళ్లిలో చాలా పెద్ద గొడవ జరిగింది: కత్రినా
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ గతేడాది వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. షూటింగ్ గ్యాప్ దొరికితే ఇద్దరూ కలిసి ఎంచక్కా విహార యాత్రలకు లేదా డిన్నర్ డేట్స్‌కు వెళ్తుంటారు. అలాగే ఇంటర్వ్యూలలో ఒకరి సీక్రెట్స్ గురించి మరొకరు చెప్పుకోవడానికి అస్సలు వెనుకాడరు. అయితే ఈసారి కత్రినా ఓ పెద్ద విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆనందంగా సాగిపోతుందనుకున్న తన పెళ్లిలో కొందరు చెప్పులతో కొట్టుకున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లి పందిట్లో కూర్చున్న నాకు వెనకాల నుంచి గట్టిగట్టిగా అరుపులు వినిపించాయి. ఏంటా? అని వెనక్కు తిరిగి చూస్తే అక్కడ పెద్ద గొడవే జరుగుతోంది. చెప్పులు విసిరేసుకుంటూ కొట్టుకుంటున్నారు. వాళ్లలో నా చెల్లెళ్లు, విక్కీ స్నేహితులు ఉన్నారు. చివరగా ఆ ఫైట్‌లో ఎవరు గెలిచారనేది మాత్రం అడగడమే మర్చిపోయా' అని చెప్పుకొచ్చింది క్యాట్. కాగా రెండేళ్ల డేటింగ్ అనంతరం గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు విక్కీ, కత్రినా. వీరి సినిమాల విషయానికి వస్తే కత్రినా టైగర్ 3, మేరీ క్రిస్మస్, జీలె జరా సినిమాలు చేస్తోంది. విక్కీ.. గోవిందా నామ్ మేరా, సామ్ బహదూర్ చిత్రాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఈ విషయంలో విశ్వక్సేన్దే తప్పు: డైరెక్టర్ -
చేదు అనుభవం.. ఇక కెరీర్ ముగిసిపోయిందనుకున్నా : కత్రినా కైఫ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి పరిచయం అక్కర్లేదు. 2003లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండు దశాబ్లాలకు పైగా టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే కెరీర్ ఆరంభంలో మాత్రం తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంది ఈ బ్యూటీ. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ... 'కెరీర్ ఆరంభంలో సాయ అనే చిత్రంలో చిన్న పాత్ర పోషించాను. జాన్ అబ్రహం, తారా శర్మ అందులో హీరో, హీరోయిన్లు. అయితే నాపై ఒక షాట్ చిత్రీకరణ తర్వాత సినిమా నుంచి తొలగించారు. నటికి ఉండాల్సిన ఒక్క మంచి లక్షణం కూడా నాలో లేదన్నారు. ఆరోజు నా కెరీర్ ఇక ముగిసిపోయిందని చాలా బాధపడ్డాను. కానీ ఆ అవమానాల కారణంగా హీరోయిన్ అవ్వాలన్న నా కల ఇంకా పెరిగింది' అంటూ చెప్పుకొచ్చింది కత్రినా. -
కత్రినా కైఫ్ 'ఫోన్ బూత్' మూవీ ఆడియో లాంఛ్ (ఫొటోలు)
-
పెళ్లికి పిలవలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది: కరణ్ జోహార్
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో కాఫీ విత్ కరణ్. తాజాగా ఫినాలే ఎపిసోడ్లో కరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహానికి పిలవకపోవడంపై కరణ్ జోహార్ స్పందించారు. పదమూడో ఎపిసోడ్లో తన్మయ్ భట్, డానిష్ సైత్, కుషా కపిల, నిహారిక పాల్గొన్నారు. ఈ నలుగురితో కాఫీ విత్ కరణ్ షో చాలా సరదాగా సాగింది. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల వివాహానికి పిలవకపోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఈ సందర్భంగా కరణ్ వెల్లడించారు. (చదవండి: ఆ టాలీవుడ్ హీరోను బాలీవుడ్లో లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్) కరణ్ జోహార్ మాట్లాడుతూ 'విక్కీ, కత్రినా వివాహానికి పిలవకపోవడం నాకు ఇబ్బందిగా మారింది. ఆహ్వానం అందలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది. ఈ విషయంలో చాలామందికి నాపై సానుభూతితో పాటు సందేహాలు వచ్చాయి. మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. మీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కదా ప్రశ్నించారు. విక్కీ-కత్రినా వివాహానికి అనురాగ్ కశ్యప్‌ను కూడా ఆహ్వానించలేదని తెలుసుకున్నప్పుడు కాస్త ఉపశమనం లభించింది' అని అన్నారు. కాగా.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న ఘనంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఫోర్ట్ బర్వారాలో జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. -
లైగర్ హీరోయిన్‌తో బ్రేకప్‌పై స్పందించిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే- షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ విడిపోయినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వారి డేటింగ్ జర్నీ ముగిసినట్లు తెలుస్తుంది. గతంలో పార్టీలకు, ఫంక్షన్లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ హడావుడి చేసిన జంట తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని అనన్య పాండే ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్ ఖట్టర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనన్యతో నువ్వు విడిపోయావు కదా అని కరణ్ ప్రశ్నించగా ప్రస్తుతానికి తాను సింగిల్ అని పేర్కొన్నాడు. మరిప్పుడు అనన్యతో స్నేహంగా ఉంటున్నారా అని అడగ్గా నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసిన వాళ్లలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య అని చెప్పాడు. -
పెళ్లి తర్వాత జరిగే తంతు పగలే పూర్తయింది: హీరోయిన్
సెలబ్రిటీల సీక్రెట్స్‌ను బయటపెట్టే షో "కాఫీ విత్ కరణ్". హోస్ట్ కరణ్ జోహార్ తారలతో మాటలు కలుపుతూ వారి గురించి అన్ని విషయాలు రాబడుతుంటాడు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను తెలుసుకోవాలనుకునే ఫ్యాన్స్ ఈ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. తాజాగా ఈ షోకు ఫోన్ బూత్ చిత్రయూనిట్ సిద్దాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్, కత్రినా కైఫ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. ఇందులో కరణ్.. 'పెళ్లిరోజు అలిసిపోతాం, కాబట్టి ఆరోజు శోభనం ఉండదు' అన్న ఆలియా సమాధానాంపై స్పందనేంటని అడిగాడు. దీనికి కత్రినా.. మా శోభనం పగలు జరిగింది అని షాకింగ్ ఆన్సరిచ్చింది. ఇక సిద్దాంత్ చతుర్వేదిని సింగిలా? కమిటెడా? అని అడిగాడు. దానికతడు ఇప్పటికీ బ్రహ్మచారినేనని ఆన్సరిచ్చాడు. ఆమధ్య అనన్య పాండేతో తెగదెంపులు చేసుకున్న ఇషాన్ ఖట్టర్ కూడా తాను ఏ రిలేషన్లో లేనని క్లారిటీ ఇచ్చాడు. కాగా గతేడాది డిసెంబర్ 9న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. చదవండి:బ్రహ్మాస్త్రపై భారీ అంచనాలు.. కానీ అంతా తలకిందులయ్యేలా ఉందే! లలిత్ మోదీకి సుష్మిత బ్రేకప్?! -
అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె ఇటీవల హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరిద్దరూ గతేడాది ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ, పెళ్లి విషయంలో కత్రినా-విక్కీలు చాలా గొప్యత పాటించారు. తాజాగా దానికి గల కారణమేంటో వివరించింది కత్రినా. ఇటీవల జరిగిన వోల్ఫ్777 ఫిలింఫేర్ ఆవార్డు ఫంక్షన్లో విక్ట్రీనా దంపతులు మెరిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం కత్రినా జూమ్ టీవీతో మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో గొప్యత పాటించడం వెనుక అసలు కారణం చెప్పింది. ‘కరోనా సమయంలో నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది. అందరు కరోనా బారిన పడ్డారు. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ వారి విషయంలో మరో చాన్స్ తీసుకోవాలని అనుకొలేదు. మళ్లీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మా వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. అందుకే కేవలం కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చాం. మా పెళ్లి సీక్రెట్‌గా జరగడానికి అదే కారణం. అలాంటి పాండమిక్‌లో కూడా మా వివాహం చాలా అద్భుతంగా జరిగింది. ఇద్దరం(నేను, విక్కి) చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేశారు. చదవండి: హే సీతా-హే రామ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా? -
ఆమె అంటే క్రష్, ఆ స్టార్ హీరోయిన్‌తో నటించాలని ఉంది: నాగ చైతన్య
అక్కినేను హీరో నాగ చైతన్య బాలీవుడ్ తొలి చిత్రం లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాలో చై పాత్రకు మాత్రం మంచి స్పందన వస్తోంది. బాలరాజుగా చై అద్భుతంగా నటించాడంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందు నుంచే చై వరుస ఇంటర్య్వూలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడాకులు, మాజీ భార్య సమంత గురించి, తన వ్యక్తిగత విషయాలపై చై చేసే వ్యాఖ్యలు ఆసక్తికని సంతరించుకుంటున్నాయి. చదవండి: రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్ పంపించాడు: విజయ్‌పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో అతడి కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన చైకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కాగా లాల్ సింగ్ చడ్డా మూవీతో చై బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో అక్కడ హీరోగా చేస్తే ఏ హీరోయిన్స్‌తో కలిసి నటించాలని ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. ఆలియా భట్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రాల పేర్లు చెప్పాడు. అనంతరం ‘ఇంకా చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వారందరితో కలిసి పని చేయాలని ఉంది. అందులో ముఖ్యంగా ఆలియా భట్ నటన అంటే నాకు చాలా ఇష్టం. చదవండి: ఆమిర్‌కు మద్దతు.. స్టార్ హీరోకు బాయ్‌కాట్ సెగ ఐ లవ్ హర్ యాక్టింగ్. ఒకవేళ తనతో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను’ అంటూ మనసులో మాట చెప్పాడు. మనం సినిమా హిందీలో రీమేక్ అయితే తన పాత్ర ఎవరు చేస్తే బాటుందని అడగ్గా.. రణ్‌బీర్ అని సమాధానం ఇచ్చాడు. ఇక సెలబ్రెటీ క్రష్ ఎవరని అడగ్గా.. మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ అని బదులిచ్చాడు చై. కాగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం విడుదలై వారం రోజులు గడిచిన ఇప్పటికి ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 37.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. -
గ్లామర్‌తో హీరోయిన్ల యాక్షన్.. సినిమాకే హైలెట్ !
Bollywood Actress Action With Glamour In Upcoming Movies: బాలీవుడ్లో యాక్షన్ రోల్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్ ఒకరు. ఆల్రెడీ కొన్ని యాక్షన్ సినిమాలు చేసిన దీపికా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి దీపిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. గన్ పట్టుకుని తీక్షణంగా దీపికా గురిపెట్టినట్లు ఈ పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు పోలీస్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు తీయడంలో మంచి అనుభవం ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, అలనాటి పాపులర్ హీరోయిన్ శిల్పా శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఇందులో శిల్పాది పవర్ఫుల్ పోలీసాఫీసర్ రోల్. ఈ రోల్ కోసం గన్ను ఫుల్‌గా లోడ్ చేసి వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు శిల్పా. ఇక 2017లో మిస్ వరల్డ్‌గా నిలిచిన మానుషీ చిల్లర్ ‘పృథ్వీరాజ్’ అనే పీరియాడికల్ ఫిల్మ్‌తో హీరోయిన్గా కెరీర్‌ను ఆరంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా వెండితెరపై యాక్షన్ టర్న్ తీసుకున్నారు. జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘టెహ్రాన్’లో మానుషీ ఓ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఇంకోవైపు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ‘గుడ్‌లక్ జెర్రీ’ అనే సినిమా కోసం గన్ పట్టు కున్నారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీలో కామెడీ టచ్ ఉంది. ఈ చిత్రం ఈ నెల 29 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ది ఘోస్ట్’ ఫిల్మ్‌లో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. అక్టోబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. వీరే కాదు.. ‘టైగర్ ఫ్రాంచైజీ’లోని ‘టైగర్ 3’లో చిత్రకథానాయకుడు సల్మాన్ ఖాన్‌కి దీటుగా కత్రినా కైఫ్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. అలాగే అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ లేడీ సూపర్ హీరో సినిమా అంగీకరించారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘హీరో పంతి 2’ కోసం తారా సుతారియా గన్ పట్టుకున్నారు. ఈ చిత్రానికి అహ్మద్‌ఖాన్ దర్శకుడు. అలాగే టైగర్ ష్రాఫ్ హీరోగా చేస్తున్న మరో ఫిల్మ్ ‘గణపత్’లో కృతీసనన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఈ యాక్షన్ జాబితాలో ప్రియాంకా చోప్రా (హాలీవుడ్ ఫిల్మ్ ‘మ్యాట్రిక్స్ 4’), దిశా పటానీ వంటి వారు కూడా ఉన్నారు. అంటే.. ఈ ముద్దుగుమ్మలందరూ తమ గ్లామర్‌తోపాటు యాక్షన్‌ను పండించనున్నారని తెలుస్తోంది. మరి వీరి యాక్షన్ ఆ సినిమాలకు ఏమాత్రం ప్లస్ కానుందో, లేదా హైలెట్ అవనుందో వేచి చూడాల్సిందే. -
‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ను సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మన్వీందర్ సింగ్‌గా గుర్తించారు. కాగా ఇతను కూడా సినిమా రంగంలో అవకాశాల కోసం వెతుకుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మన్వీందర్ సింగ్.. కత్రినాకు వీరాభిమాని. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడట. అయితే గతేడాది కత్రినా విక్కీతో పెళ్లిపీటలెక్కడంతో అతను నిరాశకు లోనయ్యాడు. చదవండి: మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు ఈ నేపథ్యంలో కత్రినా దంపతులను చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్ని నెలలుగా బెదిరిస్తున్నాడు. అయితే ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో కత్రినా దంపతులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు సెక్షన్ 506(2), 354(డి) ఐపీసీ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న మన్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినాతో పాటు ఇతర బాలీవుడ్ హీరోయిన్ల ఎడిటెడ్ ఫొటోలు, వీడియోలు ఉండడం గమనార్హం. అందులో కత్రినాతో తనకు వివాహమైనట్లు ఇద్దరి ఫొటోలను ఎడిట్ చేసి ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. చదవండి: కదలలేని స్థితిలో కైకాల, బెడ్‌పైనే కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్ దీనికి ‘నేటికి మా పెళ్లి జరిగి మూడు నెలలు.. నా భార్య కత్రినా కైఫ్’ వీడియోను ఎడిట్ చేశాడు. అంతేకాదు కత్రినా-విక్కీ జంటగా ఉన్న ఫొటోలకు విక్కీ ఫొటోలకు తన ముఖం ఉండేలా ఎడిట్ చేసి పలు వీడియాలు, పోస్ట్‌లు కూడా షేర్ చేశాడు. ఇలా కొద్ది రోజులుగా నిందితుడు కత్రినా-విక్కీని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు.కాగా నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా- విక్కీ కౌశల్ గతేడాది పెళ్లిపీటలెక్కారు.ప్రస్తుతం వీరిద్దరు సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న టైగర్-3లో క్యాట్ హీరోయిన్గా నటిస్తుండగా.. గోవింద్ నామ్ మేరా, డుంకీ చిత్రాలతో విక్కీ బిజీగా ఉన్నాడు. View this post on Instagram A post shared by King Aditya Rajput🇮🇳VVIP (@kingbollywoodceo) View this post on Instagram A post shared by King Aditya Rajput🇮🇳VVIP (@kingbollywoodceo) -
మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు
గత కొంతకాలంగా బాలీవుడ్లో బెదింపులు కలకలం రేపుతున్నాయి. ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరచూ హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో స్టార్ కపుల్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. దీంతో బాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడింది. ఇంతకి ఆ స్టార్ కపుల్ ఎవరంటే హీరోయిన్ కత్రీనా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్. ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విక్కీ బర్తడే సందర్భంగా ఈ జంట విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలె తిరిగొచ్చిన కత్రినా,విక్కీలు తమ సినిమా షూటింగ్‌లతో బిజీ అయిపోయారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న రణ్‌బీర్ షంషేరా మూవీ, ఎప్పుడు.. ఎక్కడంటే ఈ నేపథ్యంలో చంపేస్తామంటూ ఓ అగంతుడు కత్రీనాను ఇన్స్టాగ్రామ్ వేదికగా బెదిరిస్తున్నాడు.దీంతో కత్రీనా-విక్కీ ముంబైలోని శాంతాక్రూజ్ పోలీసులను ఆశ్రయించారు. తమకు వచ్చిన బెదిరింపుల మెసేజ్‌లపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతకాలంగ గుర్తు తెలియని వ్యక్తి చాలా ఇబ్బంది పెడుతున్నాడని, కత్రీనాను చంపేస్తామంటూ తరచూ బెదిరింపు మెసేజ్‌లు చేస్తున్నట్లు విక్కీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఈ స్టార్ జంట ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్(ఇన్ఫర్మెషన్ టెక్కాలజీ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: లైగర్ చిత్రానికి కళ్లు చెదిరే శాటిలైట్, డిజిటల్ రైట్స్? ఎంతంటే.. -
స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
Ileana Dating With Katrina Kaif Brother Sebastian: ఇలియానా.. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చెలామణి అయింది ఈ గోవా బ్యూటీ. 'దేవదాస్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ యూత్‌ను 'పోకిరీ'లుగా మార్చేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ బ్రదర్‌తో ఈ గోవా బ్యూటీ డేటింగ్లో ఉన్నట్లు ఇంగ్లీష్ వెబ్సైట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ సోదరుడుల సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్‌తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. వెబ్ వీక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ? View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) నెట్టింట తెగ వైరల్ అయిన ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ 'ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎందుకు పాల్గొంది?' అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలియానా, సెబాస్టియన్ 6 నెలలుగా డేటింగ్ చేస్తున్నట్లు పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. మరోవైపు సెబాస్టియన్ ఇన్‌స్టా అకౌంట్‌ను గత కొంతకాలంగా ఇలియానా ఫాలో అవుతోంది. కాగా ఈ గోవా సుందరి గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం జరిపిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల డేటింగ్ తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు. అయితే ఆండ్రూ, ఇలియానా పెళ్లి చేసుకునే విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
షారూఖ్, కత్రినా కైఫ్‌కి కోవిడ్ పాజిటివ్
-
భర్త విక్కీ కౌశల్‌కు కత్రీనా స్వీటెస్ట్ బర్త్‌డే విషెస్
Katrina Kaif Sweetest Birthday Wishes To Hubby Vicky Kaushal: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య, హీరోయిన్ కత్రీనా కైఫ్ స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ అమెరికాలో వేకేషన్ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (మే 16) విక్కీ కౌశల్ బర్త్‌డే సందర్భంగా అతడికి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు వెళ్లువెత్తున్నాయి. అలాగే పెళ్లి అనంతరం విక్కీ తొలి బర్త్‌డే సందర్భంగా కత్రీనా భర్తకు స్వీటెస్ట్ బర్త్‌డే విషెస్ తెలిపింది. చదవండి: ఆమిర్ ఖాన్ ఎదుటే బికినీలో బర్త్‌డే పార్టీ, ట్రోలర్స్ నోర్మూయించిన ఐరా నేపథ్యంలో భర్తతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘న్యూయార్క్ వాలా బర్త్‌డే మై లవ్.. ఏ విషయాన్నైనా నువ్వు ఉత్తమమైనదిగా చేస్తావు..’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోలో విక్కీ కౌశల్, కత్రీనాను వెనకనుంచి హగ్ చేసుకుని ఆమెకు ముద్దు పెడుతూ కనిపించాడు. ఇక కత్రీనా పోస్ట్ చూసిన ఈ జంట ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ జంటపై అభిమానం కురిపిస్తూ విక్కీకి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు నెటిజన్లు. చదవండి: 'ఖుషి' టైటిల్‌తో వస్తున్న విజయ్, సామ్ కాగా గతేడాది రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్లో ఉన్నారు. ఎప్పుడు ఈ జంట మీడియా ముందు బయట పడలేదు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియా ముందు మాత్రం దూరం పాటించేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్‌ను గోప్యంగా ఉంచారు విక్ట్రీనా. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
కత్రీనా ప్రెగ్నెంటా? క్లారిటీ ఇచ్చిన ఆమె టీం!
Katrina Kaif Team Clarifies Her Pregnant Rumours: గతడాది హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ ప్రస్తుతం గర్భవతి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కత్రీనా నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పింక్ కలర్ చుడిదార్‌లో దర్శనమించిన ఆమె కాస్తా బొద్దుగా, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో అది చూసి అంతా ఆమో ప్రెగ్నెంట్ అయ్యింటుందని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో కత్రీనా-వీక్కీలు త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా కత్రీనా టీం స్పదించింది. ఈ సందర్భంగా కత్రీనా ప్రెగ్నెంట్? వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి ఎలాంటి గుడ్‌న్యూస్ లేదని, కత్రీనా పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం కత్రీనా-విక్కీలు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ గ్లోబల్ స్టార్, హీరోయిన్ ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలను కత్రీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో కత్రినా, విక్కీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ప్రస్తుతం గోవిందా నామ్ మేరా, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక కత్రీనా సల్మాన్ ఖాన్‌తో నటించిన టైగర్ 3తో పాటు విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్టమస్’, ‘జీ లే జరా’ మూవీలతో బీజీగా ఉంది. -
రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కత్రినా, దీపికాల పోస్టులు వైరల్
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇంతకాలం ప్రేమికులుగా కలిసున్న వీళ్లు ఏడడుగులు వేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్14)న రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: ఆలియా భట్ షాకింగ్ నిర్ణయం! అదేంటంటే.. ఇక కొత్త జంటకు నెటిజన్లు సహా పలవురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ దీపికా పదుకోణె, కత్రినా కైఫ్‌లు న్యూ కపుల్‌కి బెస్ట్ విషెస్ అందజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. 'మీ ఇద్దరికి కంగ్రాట్స్. ఆల్ ది లవ్ అండ్ హ్యాపీనెస్' అంటూ కత్రినా ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. జీవితాంతం ప్రేమ, చిరునవ్వు, సంతోషం ఉండాలని కోరుకుంటున్నా అంటూ దీపికా పదుకొణె కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆలియా కంటే ముందు రణ్‌బీర్.. దీపికా, కత్రినాలతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. దీపికా రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడితే, కత్రినా విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. చదవండి: 'అందుకే ఇలా పెళ్లి చేసుకున్నాం'.. రివీల్ చేసిన ఆలియా -
కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ ? నెట్టింట వీడియో వైరల్..
Is Katrina Kaif Pregnant Rumours On Her Airport Look Video Viral: సోషల్ మీడియాలో నెటిజన్ల ఫోకస్ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. ఇక సినీ తారలపై అయితే వారి ఫోకస్ ఒక్కోసారి సైంటిస్ట్లను తలపించేలా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి కాలుకు వేసుకున్న ఫుట్‌వేర్ వరకు నిశితంగా పరిశీలించి ట్రోలింగ్ చేయడమో, బాగుంటే ప్రశంసించడమో చేస్తుంటారు నెటిజన్స్. ఇలా సెలబ్రిటీల మిస్టేక్‌లను కనిపెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా వీరి ఫోకస్ బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌పై పడింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ పలు వెకేషన్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తమ జీవితంలో జరిగే ప్రతీ చిన్న ఆనందాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది ఈ జంట. తాజాగా కత్రీనా కైఫ్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కత్రీనా ప్రెగ్నెంట్ అయిందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. చదవండి: కత్రీనా పెళ్లిపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. కమిటెడ్ అని హింట్ ! నెటిజన్లలో ఒకరు 'ఓరీ దేవుడా.. ఆమె ప్రెగ్నెంట్‌లా ఉంది' మరొకరు 'త్వరలో ఆమె తల్లి కాబోతుంది. కత్రీనా పాపను చూడాలని ఎంతో ఆతృతగా ఉంది', 'కత్రీనా నిజంగా ప్రెగ్నెంటా ? లేకుంటే తను ధరించిన డ్రెస్ వల్ల అలా అనిపిస్తుందా. ఏదైతేనే తను చాలా అందంగా ఉంది' అని ఆ వీడియోకు రిప్లై ఇస్తున్నారు. మరీ ఈ కామెంట్స్‌పై కత్రీనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. చదవండి: కత్రీనా పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రణ్‌బీర్ కపూర్ పెళ్లికి రానున్న మాజీ గర్ల్‌ఫ్రెండ్స్?
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్- ఆలియా బట్ వివాహానికి సంబంధించి కొద్ది రోజులుగా బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020 డిసెంబర్లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వీరి పెళ్లికి ఏప్రిల్17న ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా కపూర్ వంశానికి చెందిన పురాతన, వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ వెడ్డింగ్‌కి రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కూడా రాబోతున్నారట. స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌లతో రణ్‌బీర్ కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాలతో వీళ్లు విడిపోయారు. మరి తాజాగా ఆలియా -రణ్‌బీర్‌ల పెళ్లికి ఆహ్వానించిన గెస్ట్ లిస్ట్‌లో రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ పేర్లు ఉండటం మరింత ఆసక్తిగా మారింది. మరి ఇందులో ఇంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
బాడీగార్డ్‌కు అత్యధిక జీతం ఇస్తున్న హీరో ఎవరో తెలుసా ?
Bollywood Celebrities And Their Bodyguards Salaries: సినిమాల్లో హీరోయిన్స్ తమ అందచందాలతో, గ్లామర్‌తో కట్టిపడేస్తుంటారు. అందుకే వారి వెంట విలన్లు వెంటపడుతుంటారు. ఆ విలన్ల నుంచి కాపాడుతూ హీరోలు ఎప్పుడూ హీరోయిన్లను ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఇది సినిమా వరకే. మరీ రియల్ లైఫ్‌లో.. నిజ జీవితంలో హీరోయిన్లను ప్రతీక్షణం కాపాడేందుకు హీరోలకు బదులు బాడీగార్డ్లు ఉంటారు. అభిమానులు సెల్ఫీలు తీసుకునే దగ్గరి నుంచి పెద్ద పెద్ద గుంపుల్లో ఆకతాయిలు చేసే అల్లరి పనుల వరకు వారి వెంట ఉండి ప్రొటెక్ట్ చేస్తారు. హీరోయిన్లే కాదు హీరోలు సైతం తమ రక్షణార్థం బాడీగార్డ్‌లను పెట్టుకుంటారు. బాడీగార్డ్‌లను ఊరికే పెట్టుకోరుగా.. వారికి సాలరీస్ కూడా ఇవ్వాలి. ప్రస్తుతం బాలీవుడ్ హీరోహీరోయిన్ల బాడిగార్డ్స్ జీతాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ హీరోహీరోయిన్లు వారి బాడీగార్డ్స్‌కు ఏకంకా కోట్లలోనే సాలరీస్ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దామా. 1. కంగనా రనౌత్-కుమార్ (90 లక్షలు) 2. దీపికా పదుకొణె-జలాల్ (కోటి) 3. కత్రీనా కైఫ్-దీపక్ సింగ్ (కోటి) 4. అనుష్క శర్మ-ప్రకాష్ సింగ్ (1.2 కోట్లు) 5. అక్షయ్ కుమార్-శ్రేయసే తేలే (1.20 కోట్లు) 6. అమితాబ్ బచ్చన్-జితేందర్ షిండే (1.5 కోట్లు) 7. సల్మాన్ ఖాన్- షెరా (2 కోట్లు) 8. అమీర్ ఖాన్- యువరాజ్గోర్పడే (2 కోట్లు) 9. షారుక్ ఖాన్ -రవి సింగ్ (2.6 కోట్లు) -
'టైగర్' ఎప్పుడూ సిద్ధమే.. వచ్చేది ఆ పండుగ రోజే
Salman Khan Katrina Kaif Starrer Tiger 3 Movie Released Date Out: బాలీవుడ్ కండల వీరుడు, భాయిజాన్ సల్మాన్ ఖాన్ మోస్ట్ అవేయిటెడ్ మూవీలో 'టైగర్ 3' ఒకటి. 'ఎక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాలతో కత్రీనా కైఫ్, సల్మాన్ బెస్ట్ ఆన్‌స్క్రీన్ జోడీగా గుర్తింపు పొందింది. ఈ మూవీ సిరీస్‌లో వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అందుకే సల్లూ భాయి ఫ్యాన్స్ వీరి కలయికలో మరో మూవీ ఎప్పుడూ వస్తుందా అని ఎదురూ చూస్తుంటారు. 'టైగర్ 3' మూవీ ఖరారు అయ్యాక.. ఇక సినిమా రిలీజ్ ఎప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'టైగర్ 3' చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ షేర్ చేశాడు. ఈ వీడియోలో కత్రీనా కైఫ్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్‌ను ప్రాక్టీస్ చేస్తూ సూపర్ హాట్‌గా కనులవిందు చేసింది. తన ప్రాక్టీస్ తర్వాత సల్మాన్‌ను 'ఇక నీ టర్న్' అని చెప్పగా.. 'టైగర్ ఎప్పుడూ సిద్ధమే' అని సల్మాన్ జవాబిస్తాడు. ఈ వీడియో, సల్మాన్ సమాధానం 'టైగర్ 3' సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇక ఈ మూవీ వచ్చే సంవత్సరం అంటే 2023లో ఈద్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఈ వీడియోలో తెలిపారు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
సల్మాన్‌కు మాజీ ప్రేయసి కత్రినా నుంచి స్పెషల్ విషెస్
Katrina Kaif Special Birthday Wishes to Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మాజీ ప్రేయసి నుంచి బర్త్‌డే విషెస్ అందాయి. నిన్న(సోమవారం)సల్మాన్ తన 56వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లు సహా పలువురు ప్రముఖుల నుంచి సల్లూ భాయ్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆ లిస్ట్‌లో సల్మాన్ మాజీ ప్రేయసి, కొత్త పెళ్లి కూతురు, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఉండటం నెటిజన్ల దృష్టిని మరింత ఆకర్షిస్తుంది. 'హ్యాపీయెస్ట్ బర్త్‌డే టూ యూ. నీ జీవితంలో ఉన్న లవ్, లైట్ అండ్ బ్రిలియన్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకుంటున్నా' అంటూ తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కత్రినా చేసిన ఈ విషెస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కత్రినా- సల్మాన్‌లు పార్ట్నర్, భారత్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ కపుల్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారని వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుతం సల్మాన్-కత్రినా జోడీగా టైగర్-3 సినిమాలో నటిస్తున్నారు. -
ఎప్పటి నుంచో కోరుకుంటున్నా, మొత్తానికి నెరవేరింది: కత్రినా
Vijay Sethupathi Katrina Kaif: నటుడు విజయ్ సేతుపతి బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్‌తో కలిసి మేరీ క్రిస్మస్కు సిద్ధమయ్యారు. ఈయన బహుబాషా నటుడు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్, టాలీవుడ్లో తన సత్తా చాటిన ఈయన ఇప్పుడు బాలీవుడ్‌నూ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా అక్కడ ఏకంగా అందాల రాణి కత్రినా కైఫ్‌తో జోడీ కడుతున్నారు. 'మేరీ క్రిస్మస్' అనే చిత్రంలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని నటి కత్రినా కైఫ్ స్వయంగా తన ఇన్ స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఇంతకు ముందు ఏజెంట్ వినోద్ బద్లాపూర్, అందాదూన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు శ్రీరామ్ రాగవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్నానన్నారు. కథను థ్రిల్లింగ్‌గా రూపొందించడంలో ఆయన మాస్టర్ అని పేర్కొన్నారు. ఇందులో నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న లవ్ బర్డ్స్ వీళ్లే..
Top Celebrities Weddings In 2021: See Which Stars Tied The Knot: అప్పటి వరకు సోలో లైఫే సో బెటర్ అన్నవాళ్లు సైతం ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. కొంతమంది డెస్టినేషన్ వివాహం చేసుకుంటే, మరికొందరేమో ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది 2021లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలపై మీరూ ఓ లుక్కేయండి. ప్రముఖ గాయని, డబ్బింగ్ అర్టిస్ట్ సునీత ఈ ఏడాది జనవరి9న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. హీరోయిన్ ప్రణీత సుభాష్ వివాహం మే31న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో జరిగింది. . ‘అత్తారింటికి దారేదీ’సినిమాతో గుర్తింపు పొందిన ప్రణీత అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ఈ ఏడాది జూన్4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఏడాది జనవరి14న ఓ ఇంటి వాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో ముంబైలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగింది. దాదాపు 11సంవత్సరాల రిలేషన్ అనంతరం బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ తన ప్రియురాలు పత్రలేఖను నవంబర్15న పెళ్లాడాడు. తెలుగమ్మాయి ఆనంది కోలీవుడ్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌ను పెళ్లాడింది. ‘బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాలలో టాలీవుడ్లో గుర్తింపు పొందిన ఈ భామ తమిళంలో బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ ఏడాది తెలుగులో ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా వివాహం వివాహం ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో జరిగింది. ‘చెలి’ హిందీ రీమేక్ ‘రెహనా హై తేరే దిల్ మే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దియా మీర్జా గతంలో సహిల్ సంఘా ను వివాహం చేసుకుంది. 11 సంవత్సరాల తర్వాత వారు 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ను హైదరాబాద్‌లో ఏప్రిల్ 22న వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటి వాడయ్యాడు. ప్రియురాలు లోహిత రెడ్డితో నవంబర్ 21న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. -
రోడ్లను తన బుగ్గలతో పోల్చిన మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన హేమమాలిని
Hema Malini Breaks Silence on MP Comments Comparing Roads to Her Cheeks: తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గల మాదిరిగా ఉన్నాయంటూ రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్ గుదా ఝాంజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ సైతం ఇదే తరహాలో అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో మంత్రులు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాందంటూ పలువురు సినీ, రాజకీయన ప్రముఖులు స్పందిస్తూ తప్పుబుడుతున్నారు. చదవండి: క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! తాజాగా మహారాష్ట్ర మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై నటి, ఎంపీ హేమమాలిని స్పందించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ఇలాగే అన్నారని గుర్తు చేశారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సంప్రదాయాన్ని లాలూ ప్రసాద్ మొదలు పెట్టారన్నారు ఆమె. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ సరైనవి కావని హేమమాలిని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్స్ చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ, గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్ #WATCH "A trend of such statements was started by Lalu Ji years ago and many people have followed this trend. Such comments are not in a good taste," says BJP MP Hema Malini on Maharashtra minister Gulabrao Patil comparing roads to her cheeks pic.twitter.com/SJg5ZTrbMw — ANI (@ANI) December 20, 2021 ఇక మీ బుగ్గలపై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ కోరుతారా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు. కాగ 2005లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రహదారిని త్వరలో నటి హేమమాలిని బుగ్గల మాదిరిగా మారుస్తామంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం చెలరేగడంతో ఆతర్వాత దీన్ని ఖండించారు. ఇక 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ప్రతాప్‌గఢ్‌జిల్లాలోని రోడ్లను హేమమాలినీ, మాధురీ దీక్షిత్ చెంపల మాదిరిగా నిర్మిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ ఆయనను పదవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. -
మాల్దీవ్స్‌లో విక్ట్రీనా హనీమూన్.. ఫొటో షేర్ చేసిన నవ వధువు.. 21 గంటల్లోనే...
పెళ్లి బంధంతో ఒక్కటైన బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మాల్దీవ్స్‌లో వాలిపోయారు. డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో ఏడడుగుల బంధంతో విక్ట్రీనా జంట ఒక్కటైంది. ప్రేమ ముచ్చట్ల నుంచి పెళ్లి హడావుడి వరకు వాళ్లకు సంబంధించిన వార్తలు బీటౌన్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. ఇక వివాహ అనంతరం నూతన వధువు కత్రినా తొలిసారిగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. హనీమూన్‌ను మాల్దీవ్స్‌లో ప్లాన్ చేసుకుందీ కొత్త జంట. మెహందితో ఉన్న చేతులు, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రతీరం ఉన్న ఫొటోను కత్రినా షేర్ చేసింది. లవ్లీ మాల్దీవ్స్, లవ్లీ లైఫ్ అన్నట్టుగా ఆమె షేర్ చేసిన ఫొటో చెప్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆలస్యంగానైనా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు మీ రెండు చేతులు చూపిస్తూ ఫొటో ఉంది. ఫొటో విక్కీయే తీశాడు కదా? అని ఫన్నీగా స్పందించారు. ‘నన్ను వదిలేసి వెళ్లావ్‌గా’ అని ఒక నెటిజన్ కొంటెగా కామెంట్ చేశాడు. ఫొటో షేర్ చేసిన 21 గంటల్లోనే దాదాపు 38 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. (చదవండి: ప్రగ్యా జైస్వాల్ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
కత్రినా వంటపై కామెంట్ చేసిన భర్త విక్కీ కౌశల్
Vicky Kaushal Reaction On Katrina Kaifs First Halwa After Wedding: బీటౌన్ కొత్త జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యభర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ క్యూట్ కపుల్ ఇటీవలె ముంబై చేరుకున్నారు. ఇక పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్‌షిప్‌ను అత్యంత సీక్రెట్‌గా ఉంచిన విక్ట్రీనా జంట వివాహం అనంతరం ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కాగా పెళ్లి తర్వాత అత్తగారింట్లో కత్రినా తొలిసారి వంట వండిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భర్త విక్కీ..ఇప్పటివరకు తిన్నవాటిలో బెస్ట్ హల్వా ఇదేనంటూ శ్రీమతిపై ప్రశంసలు కురిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. -
కొత్త పెళ్లికూతురు కత్రినా వండిన తొలి వంట ఏంటో తెలుసా?
Katrina Kaif Makes Her First Halwa After Wedding With Vicky Kaushal: కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వివాహం అనంతరం అత్తగారింట్లో వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం చేసే సాంప్రదాయం గురించి తెలిసిందే. ఈ ఆచారాన్ని కత్రానా కూడా పాటించింది. చదవండి: మిస్ యూనివర్స్-2021 ఈవెంట్లో బాలీవుడ్ నటికి అరుదైన గుర్తింపు పంజాబీ కోడలిగా అడుగుపెట్టిన అనంతరం తొలిసారిగా కత్రినా హల్వా వండింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..మైనే బనాయా(నేను చేశాను)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరోయిన్ అయినా చక్కగా ఆచారాలను పాటిస్తుంది అంటూ కత్రినాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ -
కత్రినాపై విక్కీ కౌశల్ కజిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
విక్కీ కౌశల్ కజిన్ ఉపాసన వోహ్రా కత్రినా కైఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో లైవ్‌చాట్ నిర్వహించిన ఆమె కత్రినా-విక్కీల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా యూజర్ల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు ఉపాసన ఓహ్ర ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కత్రినా కుటుంబం ఎలా ఉందని అడగ్గా.. తన కుటుంబ సభ్యులంతా చాలా బాగున్నారని, వారిది అద్భుతమైన వ్యక్తిత్వం’ అని చెప్పింది. చదవండి: నుదుటిన సింధూరం.. తాళి బొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్ కత్రినా పంజాబీ మాట్లాడుతుందా? అని మరో నెటిజనల్ ప్రశ్నించగా.. ‘తను చాలా బాగా పంజాబీ మాట్లాడుతుంది. పెళ్లిలో విక్కీతో పాటు మా కుటుంబ సభ్యులతో కూడా కత్రినా పూర్తిగా పంజాబీలోనే మాట్లాడింది. అతి తక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడేది. ఈ క్రమంలో తనతో మాకు బాగా చనువు ఏర్పడింది. ఇక అందరి పేర్లను క్యాట్ చాలా బాగా గుర్తుపెట్టుకుంది. ఆ మూడు రోజుల మేమంత ఒమేమంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్‌పోర్టు దాడి: విజయ్ సేతుపతికి కోర్టు సమన్లు కాగా హాంకాంగ్‌లో పుట్టిన కత్రినా కైఫ్ లండన్‌లో పెరిగింది. కాబట్టి ఆమె మదర్ టంగ్ ఇంగ్లీష్. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక హిందీ నేర్చుకున్న కత్రినా మీడియా ముందు, ఇంటర్వ్యూల్లో చాలా వరకు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే మాట్లాడుతుంది. ఇక భర్త విక్కీ కౌశల్ పంజాబీ కుటుంబానికి చెందిన వాడు కావడంతో క్యాట్ పంజాబీ భాషను నేర్చుకుందట. కాగా రాజస్థాన్‌లో వివాహం అనంతరం కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ దంపతులు నిన్న(డిసెంబర్ 14) తిరిగి ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు తమ ప్రేమబంధంపై ఎంతో గోప్యత పాటించిన ఈ నవ దంపతులు ముంబై ఎయిర్ పోర్టులో ఒకరిచేయి ఒకరు పట్టుకుని మరీ కెమెరాలకు స్టిల్ ఇచ్చారు. -
నుదుటిన సింధూరం.. తాళి బొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్
బాలీవుడ్ నూతన వధూవరులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్‌లో హానీమూన్ ట్రిప్ ముగించుకుని మంగళవారం(డిసెంబర్ 14) ముంబై చేరుకున్నారు ఈ నూతన వధువరులు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్పోర్ట్ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. తొలిసారి భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఈ సందర్భంగా కత్రినా నుదిటన సింధూరం, తాలిబొట్టు, పెళ్లి గాజులు ధరించి కొత్త పెళ్లి కూతురు లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కనే విక్కీ ఫార్మల్ లుక్‌లో కనిపించాడు. ఇలా కత్రినా, విక్కీలు భార్య భర్తలుగా చూడముచ్చటగా కనిపించారు. ఇక తమ అభిమాన జంటను తొలిసారి భార్యభర్తలుగా చూసిన విక్ట్రీనా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. -
భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్
బాలీవుడ్ నూతన వధూవరులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్‌లో చిన్న హానీమూన్ ట్రిప్ ముగించుకుని మంగళవారం(డిసెంబర్ 14) ముంబై చేరుకున్నారు ఈ నూతన వధువరులు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్పోర్ట్ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. చదవండి: సల్మాన్,రణ్‌బీర్ నుంచి కత్రినాకు కాస్ట్లీ గిఫ్ట్స్!, అవేంటో తెలుసా? దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కత్రినా చుడిదార్ ధరించి నుదుట తిలకంతో కనిపించగా, విక్కీ ఫార్మల్ లుక్‌లో ఉన్నాడు. చూడటానికి ఈ జంట చాలా అందంగా కనిపించారు. వీరిద్దరూ ఒకరిచేయి ఒకరు పట్టుకుని మీడియాను పలకరించడం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కత్రినా నవ్వూతూ చాలా సంతోషంగా కనిపించింది. దీంతో ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ ‘చాలా రోజుల తర్వాత క్యాటీ మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నా’, ‘క్యూట్ కపుల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్‌లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వీరిద్దరూ సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం సాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జంట కత్రినా, విక్కీలు ఎప్పుడు మీడియా ముందుకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియ ముందు విడివిడిగా ఉండేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్ విషయంలో గొప్యంగా ఉంచిన విక్ట్రీనా.. తొలిసారి పక్కపక్కనే ఒకరి చేయి ఒకరు పట్టుకుని భార్యభర్తలు కనిపించడంతో వారి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్‌లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్
Katrina Kaif And Vicky Kaushal's Pre-Wedding Photoshoot: బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ని వివాహం ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న విక్కీ, కత్రినా డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం కత్రినా పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా పెళ్లి అయ్యే వరకు వీరి వివాహం గురించి గోపత్య పాటించిన ఈ జంట పెళ్లి తరువాత వరుస పెట్టి ఫోటోలు షేర్ చేస్తున్నారు. ముందుగా పెళ్లి, తరువాత హల్దీ, సంగీత్.. తాజాగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను విక్కీ, కత్రినా ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో సెలెబ్రిటీ డిజైనర్ సభ్యసాచి ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో నూతన జంట మెరిసిపోతున్నారు. ఇద్దరూ బేబి పింక్ కలర్ మ్యాచింగ్ కాస్టూమ్స్‌తో ఫర్ఫెక్ట్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం, కత్రినా నుదిటిపై విక్కీ ముద్దు పెడుతున్న పిక్స్ ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి. చదవండి: వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే.. ఈ ఫోటోలను షేర్ చేస్తూ... ఓ అందమైన కొటేషన్‌ను కూడా పోస్టు చేశారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’ అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలు అభిమానులు, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఎంతో అందంగా, చూడముచ్చటగా, మేడ్ ఫర్ ఇచ్ అదర్ అనేలా ఉన్నారు. జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి’ అంటూ కపుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు.. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే..
Katrina Kaif And Vicky Kaushal Wedding Reception Hamper Goes Viral: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గురువారం(డిసెంబర్ 9) రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’’ అంటూ పోస్ట్ షేర్ చేశారు. చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు పెళ్లి అనంతరం తమ హల్ది ఫంక్షన్ ఫొటోలను షేర్ చేశారు విక్ట్రీనా. ఈ క్రమంలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు వైరల్ అవుతోంది. కాగా ప్రముఖులకు విక్ట్రీనా రిసెప్షన్‌కు ఆహ్వానం పంపించినట్లు జోరుగ ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లో కొద్దిమంది బంధువులు, కుటుంబసభ్యులు, కొద్ది మంది వీఐపీల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలందరికి, ప్రముఖుల కోసం ముంబైలోని ఓ స్టార్ హోటల్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. చదవండి: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన ఈ నేపథ్యంలో బి-టౌన్ సెలెబ్రెటీలకు, సినీ ప్రముఖులకు విక్ట్రీనా ఆహ్వానం పింపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ విక్ట్రీనా వెడ్డింగ్ రెసెప్షన్ ఇన్విటేషన్ హాంపర్ ఇదేనంటూ పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ ఇన్విటేషన్ హాంపర్ పూర్తిగా పింక్ కలర్ పూలతో నిండి ఉంది. ఇక ఇందులో నెయ్యితో చేయించిన స్పెషల్ లడ్డు ఇతర స్వీట్స్‌తో పాటు డ్రైఫ్రూట్స్‌తో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే కళ్లే చెదిరేలా ఉన్న ఈ హాంపర్‌తో విక్ట్రీనాలు పలువురికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే ఇది విక్ట్రీనాలకు సంబంధించిందా లేదా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు
Katrina Kaif And Vicky Kaushal Haldi Function Photos Goes Viral: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌లు ఒక్కటయ్యారు. గురువారం(డిసెంబర్ 9) రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా(విక్కీ కౌశల్-కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగే వారకు దీనికి సంబంధించిన ఏ అప్డేట్స్ బయటకు రాకుండా విక్ట్రీనా జాగ్రత్తపడ్డారు. నిశ్చితార్థం, పెళ్లి ముహుర్తం, వేడుకలు, హాల్దీ ఫంక్షన్, పెళ్లి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సీక్రెట్‌గా ఉంచారు. చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్ అయితే ఏదో విధంగా అవి పుకార్లుగా బయటకు వచ్చాయి. చివరికి అవే నిజమవుతూ వారి వివాహం జరిగింది. అనంతరం విక్ట్రీనాలు తామిద్దరం ఒక్కటయ్యామంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే సెలబ్రెటీల పెళ్లి అంటే దానికి ముందు జరిగే సెలబ్రెషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. వారి హల్దీ ఫంక్షన్, సింగీత్లను వేడుకలా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాల్లో వారు చేసే సందడి మామూలుగా ఉండదు. చూస్తే కళ్లు చెదిరెలా అట్టహాసంగా ఈ కార్యక్రమాలను జరుపుకుంటారు. అందుకే వాటిని చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతుంటారు. కానీ విక్ట్రీనా పెళ్లి వేడుకల్లో ఇవేవి బయటకు రాలేదు. చదవండి: ఆ షాట్‌తో చరణ్, తారక్‌ల బాండింగ్ అర్థమైంది: రాజమౌళి దీంతో వారి ఫ్యాన్స్ అంతా నిరాలో ఉన్నారు. ఇదిలా ఉంటే వివానంతరం ప్రకటన ఇచ్చిన విక్ట్రీనా మెల్లిమెల్లిగా ఫొటోలను బయటకు వదులుతున్నారు. ఇప్పటికే వారి పెళ్లి ఫొటోలను షేర్ చేయగా తాజాగా హల్ది ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ హల్ది ఫంక్షన్లో ఈ జంట నవ్వుతూ సంతోషంగా కనిపించడంతో వారి ఫ్యాన్స్, ఫాలోవర్స్ మురిసిపోతున్నారు. ‘క్యూట్ కపుల్’ అంటూ వారి ఫొటోలకు కామెంట్స్ చేస్తూ వారి ఫొటోలను వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
Virushka: విరుష్క పొరుగింట్లోకి కత్రినా- విక్కీ.. హమ్మయ్య మీకు పెళ్లైంది.. ఇప్పటికైనా!
Anushka Sharma Welcomes Neighbours Katrina Kaif and Vicky Kaushal: విరాట్ కోహ్లి- అనుష్క శర్మ.. విరుష్క జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా విజయవంతమైన సారథిగా కోహ్లి తనదైన ముద్ర వేస్తే.. బాలీవుడ్ హీరోయిన్, నిర్మాతగా అనుష్క విజయపథంలో దూసుకుపోతున్నారు. సంపాదనలోనూ తగ్గేదేలే అంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉందీ జంట. ఇక విరుష్కలు తమ కూతురు వామికతో కలిసి ముంబైలోని జుహులో గల విలాసవంతమైన అపార్టుమెంటులో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పక్క బిల్డింగులోకి మరో సెలబ్రిటీ జంట రాబోతుందట. వాళ్లెవరో కాదు.. విక్ట్రినా.. అదేనండి.. బాలీవుడ్ కొత్త దంపతులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్. రాజస్తాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరుష్క వీరికి శుభాభినందనలు తెలిపారు. అంతేకాదు.. త్వరలోనే తమ పక్క అపార్టుమెంటులో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. చదవండి: Virat Kohli: అబ్బో ఇంత తొందరగా.. ఇప్పుడే తెల్లారిందా మీకు! తనే మాకు కింగ్! ఈ మేరకు..‘‘అందమైన జంటకు శుభాభినందనలు! జీవితాంతం ఇలాగే ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ... ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి! హమ్మయ్య ఇప్పటికైనా మీ పెళ్లి జరిగింది... ఇక కొత్త ఇంటికి రావడమే తరువాయి! ఇప్పుడైనా.. పక్కింట్లో నుంచి వచ్చే శబ్దాలు(నిర్మాణంలో ఉన్నందున) తగ్గుతాయేమో’’ అంటూ తమ పొరిగింటి వారికి ఫన్నీగా స్వాగతం పలికారు. కాగా పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత కత్రినా- విక్కీ పలు ఆలయాల సందర్శించడం సహా కొన్ని రోజుల పాటు విహార యాత్రలు చేసి.. ఆ తర్వాత జుహులోని అపార్టుమెంటులోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. సముద్ర ముఖంగా ఉండే ఈ ఫ్లాట్‌ను ఏరికోరి సెలక్ట్ చేసుకున్నారట ఈ అందమైన జంట. చదవండి: Vicky Kaushal-Katrina Kaif Wedding: సమంత బాటలో కత్రినా.. సేమ్ సీన్ రిపీట్ -
హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఫోటోలు
-
ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన
హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్ ఏడడుగులు వేశారు. గురువారం రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’’ అంటూ పోస్ట్ షేర్ చేశారు. చదవండి: ఎంఎస్ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం ఇంతకాలం తమ ప్రేమ, పెళ్లిపై నోరు విప్పని ఈ జంట ఎట్టకేలకు స్పందించారు. వివాహం అనంతరం తమ బంధాన్ని అధికారికం చేశారు. కాగా కల్యాణ మండపాన్ని ఎల్లో, ఆరెంజ్, పింక్ కలర్ పరదాలతో, రకరకాల పువ్వులతో అలంకరించారని సమాచారం. అద్దాలు పొదిగిన పల్లకిలో పెళ్లి కూతురు కత్రినా కల్యాణ మండపానికి చేరుకున్నారట. ఎరుపు రంగు లెహెంగాలో కత్రినా, తెలుపు రంగు షేర్వానీలో విక్కీ మెరిసిపోయారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఏడడుగులు వేశాక, విక్ట్రీనా నాలుగు లక్షల ఖరీదైన కేక్‌ను కట్ చేసి, సెలబ్రేట్ చేసుకున్నారట. చదవండి: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘కొండపొలం’, ఎక్కడంటే.. ఇటలీ చెఫ్ ఈ కేక్‌ను ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పుకుంటున్నారు. అలాగే విందు విషయంలోనూ విక్ట్రీనా ఏమాత్రం తగ్గలేదు. అతిథుల కోసం ఎన్నో పసందైన వంటకాలను చేయించారట. రాజస్థానీ వంటకాలు ఈ వెడ్డింగ్ స్పెషల్ అని బీ టౌన్ ఖబర్. విక్ట్రీనా పెళ్లి వేడుకలను ఓ ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ దక్కించుకుందని భోగట్టా.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ పెళ్లి స్ట్రీమింగ్ కానుందని బాలీవుడ్ టాక్. బాలీవుడ్ నుంచి కబీర్ ఖాన్, ఆయన సతీమణి మినీ మాధుర్, విజయ్‌కృష్ణ ఆచార్య, నేహా ధూపియా, ఆమె భర్త అంగద్ బేడీ తదితరులు హాజరయ్యారని సమాచారం. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు..
బాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా పెళ్లి వేడుకలకు వేదికగా మారింది. పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తమ పెళ్లి విషయాన్ని ఈ కపుల్ గోప్యంగానే ఉంచుతున్నారు. ఇక పెళ్లి అనంతరం వీక్కీ, కత్రినాలా వెడ్డింగ్‌కు సంబంధించిన తొలి ఫోటో సోషల్ తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని ఓ ఫ్యాన్ పేజ్ ఈ ఫోటోను పోస్టు చేసింది. ఇందులో కోటపై భార్యభర్తలుగా నిల్చున్న వీరిద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. చదవండి: నా కల నిజమైంది, లోబో ఎమోషనల్ ఇక బుధవారం సాయంత్రం హల్దీ వేడుక, ఆ తరువాత సంగీత్ నిర్వహించారు. వెడ్డింగ్ ప్లానర్లు ముఖ్య అతిథుల కోసం 8 నుంచి 10 టెంట్లను బుక్ చేశారట. వీటికి రాత్రికి రూ.70 వేలు ఖర్చవుతుందట. చదవండి: అమితాబ్ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్.. రెంట్ వింటే షాకవుతారు? View this post on Instagram A post shared by Rohan (@rohankbohara) -
కత్రినా కైఫ్ పెళ్లి వేడుకల్లో.. మెహందీ క్వీన్.. సెలబ్రిటీ ఆర్టిస్టుగా మంచి ఆదాయం!
Bollywood Mehendi Artist Veena Nagda Been Roped In For Katrina Kaif Mehendi Ceremony: వధూవరులకు పెళ్లికళ తెప్పించే అంశాల్లో మెహందీ చాలా ముఖ్యమైనది. చేతులకు అందమైన మెహందీ డిజైన్లు వేయడంతో పెళ్లితంతు సందడిగా ప్రారంభమవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరి పెళ్లిళ్లలో మెహందీ హడావుడి మామూలుగా ఉండదు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పెళ్లి వేడుకల్లో మెహందీ ఫంక్షన్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కత్రినాను మరింత అందంగా కనిపించేలా మంచి మంచి మెహందీ డిజైన్లను వేశారు ఆర్టిస్ట్ ‘వీణా నాగాదా’. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి అంబానీ ఇంట జరిగే అన్ని వేడుకల్లో వీణా మెహందీ డిజైన్లు ఉండాల్సిందే. ప్రముఖస్థాయి వ్యక్తులకు సందర్భానికి తగినట్లుగా సరికొత్తగా అలంకరిస్తూ ‘మెహందీ క్వీన్’గా ఎదిగారు వీణా. గుజరాత్‌లోని సనాతన జైన్ కుటుంబంలో పుట్టింది వీణా నాగాదా. ఐదుగురు అక్కాచెల్లెళ్లలో అందరిలో ఆఖరు. తండ్రి పూజారి, తల్లి గృహిణి. పదోతరగతి అయ్యాక.. పై చదువులకు ఇంట్లో వాళ్లు అనుమతించలేదు. ఏదైనా ఇంట్లోనే ఉండి నేర్చుకోమన్నారు. దీంతో కుట్లు, అల్లికలతోపాటు మెహందీ డిజైన్లు వేయడం నేర్చుకుంది. శ్రద్ధగా నేర్చుకోవడంతో అతి కొద్దికాలంలోనే అనేక డిజైన్లను ఆకళింపు చేసుకుంది. తను నేర్చుకున్న డిజైన్లను స్నేహితులు, బంధువుల ఫంక్షన్స్‌లో వేస్తుండేది. వీణా పెట్టిన మెహందీ నచ్చడంతో తెలిసిన వారంతా తమ ఇళ్లలో జరిగే వేడుకలకు వీణాను మెహందీ పెట్టడానికి పిలిచేవారు. ఇలా డిజైన్లు వేస్తూ మంచి మెహందీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. తొలి సెలబ్రిటీ కస్టమర్.. వీణాకు తొలి సెలబ్రిటీ కస్టమర్ పూనమ్ ధిల్లాన్. పూనమ్‌కు మెహందీ డిజైన్లు వేసినప్పటికీ అప్పుడు అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత హృతిక్ రోషన్, సుసాన్నే పెళ్లిలో మెహందీ ఆర్టిస్ట్‌గా పనిచేయడంతో డిజైనర్‌గా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కరిష్మా కపూర్, రాణీ ముఖర్జీ, శిల్పాశెట్టి పెళ్లిళ్లకు కూడా వీణా మెహందీ డిజైన్లు వేసింది. ఆ డిజైన్లు సెలబ్రిటీలను బాగా ఆకర్షించడంతో... కరీనా కపూర్, దీపికా పదుకొనే, అమృతా అరోరా, మలైకా అరోరా ఖాన్, హేమమాలిని, ఇషా డియోల్, టీనా అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీ, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా, కాజోల్, షర్మిలా ఠాగూర్, కాజల్ అగర్వాల్, కపిల్ శర్మ భార్య గిన్ని ఛత్రత్, జరీన్ ఖాన్, ఫరా ఖాన్, డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, ఆశాభోంస్లే, ఏక్తా కపూర్, జయప్రద వంటి వారెందరికో మెహందీ డిజైన్లు వేశారు. ఇండియాలోని ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలేగాక బెల్జియం, లండన్, మారిషస్, పారిస్, సింగపూర్, అమెరికాలలో కూడా వీణాకు కస్టమర్లు ఉన్నారు. పెళ్లిళ్లకేగాక సినిమాలకూ... పెళ్లికూతుర్లను ఆకర్షణీయంగా కనిపించే విధంగా డిజైన్లు వేయడంలో వీణ స్పెషలిస్టు. బ్రైడల్, అరబిక్, డైమండ్–పర్ల్, స్టోన్–మెహందీలు వేయడంలో అందెవేసిన చెయ్యి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్లోనేగాక కొన్ని సినిమాల్లో కూడా మెహందీ డిజైన్లు వేశారు. బాలీవుడ్ సినిమాలైన ‘కభీ కుషీ కభీ గమ్’, కల్ హో నా హో, మేరే యార్ కీ షాదీ హై, యహ్ జవానీ హే దివానీ, పటియాల హౌస్ సినిమాల్లో పెళ్లి సీన్లలో నటించిన నటీనటులకు మెహందీ డిజైన్లు వేశారు. అంతేగాక 2019లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌లో పాల్గొన్న సోనమ్ కపూర్‌కు, అలియా భట్ వివిధ సినిమాల్లో నటించిన కొన్ని సీన్లకు డిజైన్లు వేశారు. బాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లిళ్ళే గాక, వారు చేసుకునే కర్వా చౌత్లలో కూడా వీణా మెహందీ డిజైన్లు వేయాల్సిందే. సెలబ్రెటీ ఆర్టిస్టుగా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉంటోన్న వీణా ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తూ మెహందీ కోర్సు నేర్పిస్తోంది. ఇప్పటిదాకా 55 వేల మంది విద్యార్థులు వీణా వద్ద మెహందీ డిజైన్లు నేర్చుకున్నారు. చదవండి: Mugdha Kalra: నా బాబు కూడా ఈ ప్రపంచం నుంచే వచ్చాడు కదా.. అందుకే.. -
కాబోయే వధూవరులు విక్కీ-కత్రీనాలపై రాజస్థాన్‌లో కేసు
Case File Against Katrina Kaif and Vicky Kaushal In Rajasthan: పెళ్లి వేడుకలు, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ఏం జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతాయి. ప్రధానంగా స్టార్ కపుల్స్ వివాహం అంటే చాలు భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో సీక్రెట్‌గా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఏర్పాట్లు జరగుతున్నాయి. వారి పెళ్లికి సంబంధించిన విషయాలను ఈ జంట గోప్యంగా ఉంచినప్పటికీ ఆ వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాగా రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని టాక్. ఇప్పటికే మెహందీ, సంగీత్‌లో భాగంగా ఈ జంట రాజస్థాన్‌కు పయనమైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమచారం. చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్ రాజస్తాన్‌లో వీరి పెళ్లి ఏర్పాట్లకు భారీ బందోబస్తును నియమించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు విక్కీ-కత్రీనాలకు షాకిచ్చారు. రాజస్థాన్‌కు చెందిన ఓ అడ్వకేట్ ఈ జంటపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా రాజస్థాన్‌లో చౌత్‌మాత మందిర్ ఎంత ప్రఖ్యాతిగాంచిందో తెలిసిన విషయమే. నిత్యం భక్తులతో ఈ మందిరం రద్దీగా ఉంటుంది. అయితే విక్కీ-కత్రినాల పెళ్లి ఏర్పాట్లలలో భాగంగా ఈ మందిర్‌కు వెళ్లే రోడ్డును డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 వరకు తాత్కలికంగా ఈవెంట్ నిర్వాహకులు మూసేశారు. దీంతో స్థానికులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన నైత్రాబింద్ సింగ్ జాదౌన్ అనే న్యాయవాది జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన పెళ్లి వేడుకలో భాగంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అమ్మవారి టెంపుల్ దారిని మూసివేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా మేనేజర్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో పాటు జిల్లా కలెక్టర్‌పై ఫిర్యాదు చేశాడు. అయితే విక్కీ కౌశల్-కత్రీనా పెళ్లికి తాను వ్యతిరేకం కాదని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేవలం అమ్మవారి టెంపుల్ దారిని మూసివేసిన కారణంగానే తాను ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశాడు. అంతేగాక వెంటనే ఆ దారిని తిరిగి తెరవాల్సిందిగా ఆయన లీగల్ సర్వీసెస్ అథారిటీ కోరారు. -
విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..!
ప్రస్తుతం బాలీవుడ్లో అనే కాదు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికర అంశం ఏంటంటే బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల పెళ్లి ముచ్చట. గత కొన్ని రోజులుగా వీరి వివాహం గురించి మీడియా, సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. గెస్ట్ లిస్ట్, వివాహ వేదిక తదితర వివరాల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత వరకు విక్కీ, కత్రినలు ఈ వార్తలపై స్పందించలేదు.. అలా అని ఖండించలేదు. మౌనంగా ఉన్నారు. అంటే అర్థాంగీకరామేమో మరి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2021, డిసెంబర్ 9 విక్కీ-కత్రినాల వివాహం అని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజస్తాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా వీరి వివాహ వేడుకకు వేదికగా మారనుందట. సరే వారిద్దరి వివాహం అయిననాడు తప్పకుండా అందరికి తెలుస్తుంది. అయితే ఈలోపు నెటిజనులు మరో పనిలో పడ్డారు. విక్కీ-కత్రినాల వివాహం నాడు సల్మాన్ ఖాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తూ.. బోలెడన్ని మీమ్స్ క్రియేట్ చేశారు. అంతటితో ఆగక #VickyKatrinaWedding పేరుతో ఈ మీమ్స్‌ని ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక వీటిని చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. వాటిపై మీరు ఓ లుక్కెయండి. (చదవండి: ఇప్పట్లో రకుల్ పెళ్లి లేనట్లే.. అసలు నిజం చెప్పేసిన బ్యూటీ) #VickyKatrinaWedding Selmon bhoi at their wedding pic.twitter.com/zC4QUR1zaF — Yuvraj Pratap Rao 🇮🇳 (@yuvrajuv444) December 2, 2021 #VickyKatrinaWedding Salman be like: pic.twitter.com/Kjge0ZpoEo — Aksha (@Aksha00786) December 2, 2021 #VickyKatrinaWedding Reactions after Vicky Kat wedding : pic.twitter.com/p6UGFGvUDj — Ctrl C + Ctrl Memes 🇦🇫 ♥️ 🇮🇳 (@Ctrlmemes_) December 2, 2021 #VickyKatrinaWedding Somewhere is parallel universe pic.twitter.com/fNzhkNHd6j — Tweetera🐦 (@DoctorrSays) December 2, 2021 ఇక విక్కీ-కత్రినాల వివాహానికి సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించలేదట. సల్మాన్ కుటుంబానికి ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ తెలియజేశారు. ‘విక్కీ, కత్రినా వివాహానికి సంబంధించి మాకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు’ అని తెలిపారు. (చదవండి: డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కత్రినా!) సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తొలిసారిగా 2005లో ‘మైనే ప్యార్ క్యున్ కియా’లో కలిసి నటించారు. ఆ తర్వాత వారు భారత్, యువరాజ్ వంటి చిత్రాలలో కూడా కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ టైగర్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం టైగర్ 3 లో కలిసి నటిస్తున్నారు. చదవండి: ఫిక్సైన విక్కీ-కత్రినా పెళ్లి తేదీ, దానికి ముందు ముంబైలో కోర్డు వివాహం! -
విక్కీ-కత్రినా పెళ్లిలో సెల్ఫోన్ల బ్యాన్పై నటుడు స్పందన, పోస్ట్ వైరల్
Actor Gajrajrao Objects Mobiles Ban In Vicky Kaushal-Katrina Kaif Marriage: కొద్ది రోజులుగా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. మొదటి నుంచి వీరి రిలేషన్‌ను గోప్యంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట దీపావళి పండుగ సందర్భంగా సీక్రేట్ రోకా ఫంక్షన్ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వరుసగా వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి వివాహనికి సంబంధించి అప్డేట్స్ను ఈ జంట గొప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ బయటకు వస్తూనే ఉన్నాయి ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో విక్కీ-కత్రినాల పెళ్లి తేదీ ఖరారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Katrina Kaif-Vicky Kaushal Marriage: డిసెంబర్ మొదటి వారంలోనే పెళ్లి, ఫస్ట్ కోర్టులో వివాహం! కాగా డిసెంబర్ 9వ తేదీకి వీరి పెళ్లి ముహుర్తం ఖారారైందని, రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా వీరి వివాహ మహోత్సవం జరగనుందంటూ వార్తలు వస్తున్నాయి. అంతేగాక వీరి పెళ్లికి ముబైల్ ఫోన్స్ కూడా బ్యాన్ చేసినట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై ప్రముఖ నటుడు గజ్రాజ్ రావు వ్యంగ్యంగా స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన విక్కీ-కత్రినాల ఫొటోను షేర్ చేస్తూ వివాహ సమయంలో సెల్ఫోన్లు బ్యాన్ చేశారు. ‘సెల్ఫీ తీసుకోవడానికి కూడా వీలు లేదంటే నేను పెళ్లికి రాను’ అంటూ సరదాగా పోస్ట్ షేర్ చేశాడు. చదవండి: మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం దీంతో ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ పోస్టుతో వారి పెళ్లిపై వస్తున్న వార్తలకు స్పష్టత వచ్చిందంటున్నారు నెటిజన్లు. సెల్ఫోన్లు బ్యాన్ చేస్తే కష్టమని, విక్కీ-కత్రినాలు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా రాజస్థాన్ పయనమయ్యే ముందు ముంబైలో విక్కీ-కత్రినాలు కోర్టు వివాహం చేసుకొన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పెళ్లికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లతో బిజీగా ఉన్నారట ఇరు కుటుంబ సభ్యులు. అయితే పెళ్లి కేవలం 200 మందికి మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. -
రోడ్లను ఆ నటి బుగ్గలతో పోలుస్తూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్: సాధారణంగా రాజకీయ నేతలు తమ ప్రసంగాలలో స్థానిక సమస్యలను ఒక్కో రీతిలో పోల్చి వ్యాఖ్యలు చేస్తారు. ఒక్కోసారి ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటే మరికొన్నిసార్లు వివాదాస్పదంగాను మారుతుంటాయి. తాజాగా, రాజాస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్ గుదా ఝాంజును జిల్లాలోని తన నియోజక వర్గం ఉదయ్‌పూర్‌వాటిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో స్థానికులు హజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.. తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గల మాదిరిగా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడున్నవారు పెద్దగా నవ్వారు. మంత్రిగారి వ్యాఖ్యలపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అశోక్ గెహ్లత్ నూతన మంత్రివర్గ కూర్పులో మూడు రోజుల క్రితం రాజేంద్రసింగ్ గుదాకు సైనిక్ కల్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అప్పగించారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంకగాంధీ స్పందించాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు ప్రాముఖ్యత ఉంటుందని పలుసభల్లో ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా కొందరు మంత్రులు, నాయకులు ఇదే విధంగా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2005లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రహదారిని త్వరలో నటి హేమమాలిని బుగ్గల మాదిరిగా మారుస్తామని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగడంతో ఆతర్వాత దీన్ని ఖండించారు. తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరించాయన్నారు. 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ప్రతాప్‌గఢ్‌జిల్లాలోని రోడ్లను హేమమాలినీ, మాధురీ దీక్షిత్ చెంపల మాదిరిగా నిర్మిస్తామని అన్నారు. దీంతో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ ఆయనను పదవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. #WATCH | "Roads should be made like Katrina Kaif's cheeks", said Rajasthan Minister Rajendra Singh Gudha while addressing a public gathering in Jhunjhunu district (23.11) pic.twitter.com/87JfD5cJxV — ANI (@ANI) November 24, 2021 -
పెళ్లి పీటలు ఎక్కబోతోన్న మరో బాలీవుడ్ ప్రేమ జంట
Tara Sutaria And Aadar Jain Tie Knot Soon: ఈ ఏడాది బాలీవడ్ లవ్‌బర్డ్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే హీరో రాజ్ కుమార్ రావు తన చిరకాల ప్రేయసి పత్రలేఖను పెళ్లి చేసుకోగా.. త్వరలో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, రణ్‌బీర్ కపూర్-అలియా భట్ ఈ డిసెంబర్లో బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు కొద్ది రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు తొందర పడుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి తారా సుతారియా, నటుడు ఆదార్ జైన్ల వివాహం త్వరలోనే జరగనుందంటూ బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆదార్ జైన్ ఎవరో కాదు రణ్‌బీర్ కపూర్‌కు కజిన్. చదవండి: మెగా డాటర్ శ్రీజ పోస్ట్‌పై సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ ఆసక్తికర కామెంట్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘మర్ జవాన్’ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారా సుతారియా, నటుడు ఆదార్ జైన్లు కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. మిగతా ప్రేమ జంటల మాదిరిగా ఈ జంట తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచకుండ ఎప్పటికప్పుడు బయటకు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తరచూ సోషల్ మీడియాలో ఒకరి ఫొటోలను ఒకరు షేర్ చేసుకోవడం, విందులు వినోదాలకు కలిసి వెళ్లడం, జంటగా హాలీడే వెకేషన్స్‌కు వెళ్లడమే కాకుండా అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు.అంతేగాక ఇటీవల జరిగిన ఆదార్ జైన్ సోదరుడి వివాహా వేడుకకు తారా సుతారియా కూడా హజరైంది. చదవండి: పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..? ఈ నేపథ్యంలో వీరిద్దరూ కూడా త్వరలో ఒక్కటవ్వాలనుకుంటున్నారట. అందుకే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో కూడా చెప్పడంతో వారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో కత్రీనా-విక్కీ, రణ్బీవర్-అలియా మాదిరిగా వచ్చే ఏడాది సమ్మర్‌లోగా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రణ్‌బిర్-అలియాల పెళ్లి కంటే ముందు వీరి పెళ్లి జరిగేలా ఉందంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం తారా సుతారియా ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ తడప్ చిత్రంతోపాటు హీరోపంతి 2, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తోంది. -
డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కత్రినా!
Katrina Kaif Forced Vicky Kaushal To Have A Wedding In December: ఏడువందల ఏళ్ల నాటి కోట సాక్షిగా హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్ ఏడడుగులు వేయనున్నారన్నది బాలీవుడ్ తాజా టాక్. కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక ఇంటివారు కావాలనుకుంటున్నారన్నది ప్రచారంలో ఉన్న వార్త. ఈ విషయం గురించి ఇద్దరూ అధికారికంగా ప్రకటించలేదు కానీ పెళ్లి పనులు మాత్రం జోరుగా జరుగుతున్నాయట. వివాహ వేదికగా రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాని ఫిక్స్ చేశారని సమాచారం. ఇది దాదాపు ఏడువందల ఏళ్ల చరిత్ర ఉన్న కోట. ఈ కోటలోని లగ్జరీ హోటల్లో విచ్చేసే అతిథుల కోసం గదులు బుక్ చేయడం, వారిని పికప్ చేసుకోవడానికి కార్లు బుక్ చేయడం కూడా జరిగిపోయిందని భోగట్టా. వచ్చే నెల 7 నుంచి 9 లోపు వివాహం జరుగుతుందట. మెహందీ, సంగీత్ వంటి వేడుకలను ఆ కోటలోనే ప్లాన్ చేశారని బాలీవుడ్ అంటోంది. వార్తల్లో ఉన్న ప్రకారం వచ్చే ఏడాది మేలో పెళ్లి చేసుకోవాలని విక్కీ అనుకున్నారట. కానీ వేసవి వెడ్డింగ్ కత్రినాకి నచ్చలేదట. ఎంచక్కా వింటర్లో కూల్ కూల్‌గా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని విక్కీతో అన్నారట. అందుకే డిసెంబర్లో పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారని టాక్. -
ప్రియుడితో సీక్రెట్ 'రోకా' ఫంక్షన్ చేసుకున్న కత్రినా!
Katrina Kaif And Vicky Kaushal Had Roka Ceremony : ఇటీవల దీపావళి పండగతో పాటు అదే రోజున విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల జీవితాల్లో మరో వేడుక కూడా జరిగిందని బాలీవుడ్ టాక్. ఆ వేడుక ఏంటంటే ‘రోకా’. పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో ఇదొకటి. నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి ముహూర్తం, వేదిక, విందు వంటి విషయాలు మాట్లాడుకోవడానికి అబ్బాయి–అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి మాట్లాడుకోవడమే ‘రోకా’ ఫంక్షన్. ఉత్తరాదిన ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తారు. దీపావళి రోజు కత్రినా–విక్కీ కుటుంబ సభ్యులు ఇవే మాట్లాడుకున్నారట. దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగిందట. కబీర్ దర్శకత్వంలో ‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’ చిత్రాల్లో నటించారు కత్రినా. ఆయన్ను సోదరుడిలా భావిస్తారు. అందుకే రోకా వేడుకకు ఆయన ఇల్లు వేదిక అయిందట. కొంత కాలంగా ప్రేమలో ఉన్న విక్కీ–కత్రినాల పెళ్లికి వేళయిందని, డిసెంబర్లో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటారని బాలీవుడ్ అంటోంది. మరి.. ఇయర్ ఎండింగ్లో విక్కీ బ్యాచిలర్ లైఫ్‌కి, కత్రినా బ్యాచిలరెట్ లైఫ్‌కీ ఎండ్ కార్డ్ వేస్తారా? వేచి చూడాలి. -
లవ్‌బర్డ్స్ పెళ్లి, ఆహ్వానాలు అందుకే పంపడం లేదట!
సాక్షి,ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి వార్త మరోసారి గుప్పుమంది. గత కొద్ది రోజులుగా కత్రినా, తన ప్రియుడు విక్కీ కౌశల్‌తో ఏడడుగులు వేయనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు పెళ్లిపై పలు రూమర్లు కొనసాగుతుండగానే ఈ దీపావళి వేడుకల్లో ప్రొడ్యూసర్ ఆర్తీ శెట్టి నివాసం వద్ద ఈ జంట కంటబడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజా నివేదికల ప్రకారం త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారనీ, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా రహస్యంగా చేసుకుంటూ పోతున్నారని తెలుస్తోంది. అందుకే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఇంకా ఎవరికీ పంపడం లేదని టాక్. అంతేకాదు కాబోయే కోడలికి విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు కూడా తెలుస్తోంది. దీంతో విక్కీ కుటుంబం నుంచి కత్రీనాకు షాగున్ (ప్రత్యేక బహుమతి) అందిందంటూ బీటౌన్‌లో వీరి వివాహానికి సంబంధించిన ఊహాగానాలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ జంట డిసెంబర్ 7 లేదా 9 తేదీల్లో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తమ పెళ్లి వార్త ఏ మాత్రం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఇంకా వివాహ ఆహ్వానాలను కూడా ఇంకా ఎవరికి పంపలేదట. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండే కత్రినా ఇటీవల తమ వెడ్డింగ్ ప్లేస్‌పై మీడియాలు వార్తలు రావడంపై చాలా అసహనంగా ఉందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అందుకే మరింత లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాదు తాజా లీకుల నేపథ్యంలో పెళ్లి వేదికను కూడా మార్చే ప్లాన్‌లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీకి వచ్చిన ఈ 15 ఏళ్ల నుంచి తన పెళ్లి వార్తలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి..నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు అంటూ ఇటీవల కత్రినా మండి పడినప్పటికీ ఈ బ్యూటీ పెళ్లి వార్త బజింగ్గానే నిలుస్తోంది. మరి ఈ విషయంపై విక్కీ-కత్రినా అధికారికంగా ప్రకటించేంతవరకు ఈ సస్పెన్స్‌కు తెరపడదు. -
Anamika Khanna: నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగింది.. ఇప్పుడు టాప్ హీరోయిన్లకు
పెద్దపెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులేవీ చేయలేదు, కానీ పాపులర్ సెలబ్రెటీలు.. సోనమ్ కపూర్, కరీనాకపూర్ ఖాన్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, కియరా అద్వానీలను మరింత అందంగా కనిపించే డ్రెస్‌లను రూపొందించింది అనామిక ఖన్నా. జీవితంలో ఎదగాలన్న తపన, వినూత్నమైన ఆలోచనలు, కృషి, పట్టుదలతో శ్రమించే గుణం ఉండాలేగాని డిగ్రీలు చదవకపోయినప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని నిరూపించింది అనామిక. Anamika Khanna: Celebrity Designer Inspiring Story Facts In Telugu: ఇండియాలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి, విభిన్న డిజైన్లతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకోవడమేగాక సరికొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టుచేస్తూ.. లక్షలమందికి ఆదర్శంగా నిలుస్తోంది అనామిక. అప్పటి కలకత్తాలోని ఓ గ్రామంలో పుట్టింది అనామిక. నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగిన అనామిక.. పెద్దయ్యాక క్లాసికల్ డ్యాన్స్ చేర్చుకుని మంచి డ్యాన్సర్ అయ్యింది. అలా మొదలైంది.. డ్యాన్స్‌తోపాటు అనామికకు పెయింటింగ్స్ వేయడం అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వివిధ రకాల స్కెచ్లను గీస్తుండేది. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ టెక్స్టైల్స్ బుక్ చూసిన అనామికను..దానిలో ఫ్యాషన్ స్టైల్స్ ఎంతగానో ఆకర్షించాయి. దీంతో తను కూడా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది. ఫ్యాషన్ డిగ్రీ చదవని అనామిక ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలుసుకునేందుకు వర్క్‌షాపులు, ఫ్యాషన్ షోలకు క్రమం తప్పకుండా వెళ్లేది. అక్కడ చూసిన డిజైన్లకు తన సృజనాత్మకతతో సరికొత్త స్కెచ్‌లు గీసేది. ఇలా గీసిన స్కెచ్లను దమానియా ఫ్యాషన్ షోకు పంపింది. ఆ డిజైన్లు నచ్చడంతో దమానియా ఫ్యాషన్ వాళ్లు ఆరు డిజైనర్ పీస్‌లు పంపించమన్నారు. అప్పుడు మార్కెట్లో బట్టను కొని టైలర్ దగ్గరకు వెళ్లి కావాల్సిన విధంగా కుట్టించి వారికి పంపడంతో అనామిక డిజైన్స్ అవార్డుకు ఎంపికయ్యాయి. దీంతో అనామికకు డిజైనర్‌గా తొలిగుర్తింపు లభించింది. దమానియా కోసం డిజైన్ చేసిన వస్త్రాలను బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ యశోధరా షరాఫ్ చూసింది. అవి ఆమెకు నచ్చడంతో తన ఫోలియో బ్రాండ్ వాటిని విక్రయించడమేగాక, 2003లో పాకిస్థాన్‌లో జరిగిన బ్రైడల్ ఏషియా ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఇలా యశోధరా షరాఫ్, ప్రసాద్ బిడప, రీతు కుమార్, మోనపలి వంటి ఫ్యాషన్ డిజైనర్ల గైడెన్స్ తీసుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. అంతర్జాతీయంగా అనా–మిక.. ‘అనా–మిక’ పేరుతో 2004లో ప్రారంభించిన బ్రాండ్, అంతర్జాతీయంగా బాగా పేరొందిన ఇండియన్ బ్రాండ్స్‌లో ఒకటి. ల్యాక్మె ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు 33 మంది డిజైనర్లను పిలవగా అందులో అనామిక ఒకరు. 2007లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌కు హాజరైన తొలి ఇండియన్ ఉమెన్ డిజైనర్ అనామిక. ఆ తరువాత 2010లో లండన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు. ఇక్కడ అనా–మిక డిజైన్లు నచ్చడంతో అతిపెద్ద బ్రిటిష్ రీటైల్ దిగ్గజ కంపెనీ హరాడ్స్ కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసింది. అంతేగాక బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్–500 జాబితాలో అనామిక ఒకరు. 2015లో ప్రముఖ నటి టాక్ షో అతిథి ఐమీ గరేవాల్ లేడీ గగాకు పదికేజీల వెల్వెట్ లెహంగాను బహుమతిగా ఇచ్చారు. ఈ లెహంగా డిజైనర్ అనామికే. 2017లో ఎలిజిబెత్ –2 యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్‌కు అనామిక ప్రత్యేక ఆహ్వానితురాలు. ఏకే– ఓకే వర్క్‌షాపులు, లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం, పారిస్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డిజైనింగ్స్ టిప్స్‌తోపాటు, సన్నగా కనిపించేలా బట్టను ఎలా కట్ చేయాలి? ప్యాట్రన్ ఎలా తీసుకురావాలి వంటి అనేక విషయాలను అనామిక జాగ్రత్తగా పరిశీలించి పూర్తిస్థాయి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. దీంతో తన అనామిక డిజైన్స్ పేరుతో సొంత బ్రాండ్, కోల్‌కతాలో తన డిజైనర్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. తన పిల్లలు విరాజ్ ఖన్నా, విశేష్ ఖన్నాలతో కలిసి రెడీ టు వేర్ స్ప్రింగ్, సమ్మర్ థీమ్‌తో ‘ఏకే–ఓకే’ పేరుతో ఏర్పాటు చేసింది. కొన్ని బాలీవుడ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఇవేగాక ‘టైమ్‌లెస్ ద వరల్డ్’ పేరిట ఈ ఏడాది మార్చిలో తన లేటెస్ట్ డిజైన్లను విడుదల చేశారు. కేవలం పదివేల రూపాయలతో ప్రారంభించిన అనామిక ఎథినిక్ బ్రైడల్ వేర్, కాంటెంపరరీ, వెస్ట్రన్ డిజైన్స్‌ను రూపొందిస్తూ, లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. చదవండి: Toy Bank: మీ పిల్లలు ఆడేసిన బొమ్మలను ఏం చేస్తున్నారు? View this post on Instagram A post shared by Anamika Khanna (@anamikakhanna.in) -
‘విరుష్క’ పొరుగింటికి మారనున్న కత్రినా, విక్కీ?
అందాల తార కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బాలీవుడ్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి రిలేషన్షిప్ కొన్నిరోజులుగా హిందీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ వారికి నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు షికారు చేయగా.. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదే వారు జంటగా కొత్త ఇల్లు తీసుకోబోతున్నారని. గతేడాది విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట ముంబైలోని జుహులో కొత్త ఇల్లు తీసుకున్నారు. వారి ఇంటి పక్కనే ఉన్న ఇంటిని విక్కీ, కత్రినా (అభిమానులు విక్యాట్గా పిలుస్తుంటారు) జంట కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైందని రూమర్స్ వస్తున్నాయి. ఆ ఇంటిని రెండు నెలల క్రితమే ఈ కపుల్ సందర్శించినట్లు, అది వారికి బాగా నచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వచ్చే డిసెంబర్లో రాజస్థాన్‌లో వారి వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా అనుష్క, కత్రినాకి ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ‘జబ్ తక్ హై జాన్’కి ఇద్దరూ కలిసి పని చేశారు. గతంలో కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్’కి ఇద్దరు భామలు అతిథులుగా వచ్చి తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు. దీంతో విక్యాట్ల పెళ్లి గురించి, కొత్త ఇల్లు గురించి ఉన్నవి రూమర్స్ కాదని, జరగబోయే నిజాలని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. చదవండి: కత్రినా కైఫ్‌తో ఎంగేజ్మెంట్.. నవ్వొస్తుందన్న విక్కీ కౌశల్ -
డిసెంబర్ లో కత్రీనా మ్యారేజ్ ?
-
వీడియోలో అడ్డంగా దొరికిపోయిన అక్షయ్.. అయినా వదలని కత్రీనా
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ జంట నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అజయ్‌దేవ్‌గణ్, రణ్వీర్ సింగ్ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పారంభించింది ఈ చిత్రబృందం. ఆ సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది క్యాట్. మా బోయ్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండంటూ అక్షయ్, రోహిత్‌ను చూపించింది ఈ బ్యూటీ. అందులో అక్షయ్ కళ్లు మూసుకొని, రోహిత్ కాళ్లపై తలపెట్టి పడుకొని ఉన్నాడు. కత్రీనా వీడియో తీయడం చూసిన రోహిత్, అక్షయ్ రికార్డు చేయొద్దు అంటూ పరుగు లంకించుకున్నారు. ‘ఇప్పుడు మేము అంతా బాగా కనిపించడం లేదు. మాకు ఫేమ్ ఉంది. రికార్డు చేయొద్దు’ అంటు పరిగెత్తుతున్న అక్షయ్ కిందపడ్డాడు. అది చూసిన పట్టువదలని ఈ భామ గొల్లున నవ్వుతూనే వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మూవీ ప్రమోషన్స్ గురించి వారు ఎంత ఎక్సయిట్మెంట్తో ఉన్నారో చూడండి అంటూ వెటకారమాడింది ఈ బ్యూటీ. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: OMG 2: శివుడిగా అక్షయ్ కుమార్.. లుక్ అదిరిందిగా! View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
కత్రినా కైఫ్‌తో ఎంగేజ్మెంట్.. నవ్వొస్తుందన్న విక్కీ కౌశల్
టాలెంటెడ్ యాక్టర్‌గా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న కొద్దిమందిలో ఒకరు విక్కీ కౌశల్. ఆయన నటి కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నాడని ఎప్పుటి నుంచో రూమర్స్ వినిపిస్తుండగా.. ఇటీవల ఏకంగా వారు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ కుర్ర హీరో తాజా చిత్రం ‘సర్దార్ ఉద్ధం’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో విడుదలై మంచి విజయాన్ని టాక్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలో ఇచ్చిన ఇంటర్వూలో ఈ రూమర్స్ పై ఆయన స్పందించాడు. విక్కీ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘క్యాట్‌తో ఎంగేజ్మెంట్ జరిగిందని రూమర్స్ ఆ రోజు ఉదయం వచ్చాయి. అప్పుడు షూట్ మధ్యలో ఉన్నాను. మళ్లీ సాయంత్రానికి చూస్తే అవన్నీ వట్టి పుకార్లేనని మీడియాలో వార్తలు వచ్చాయి. నిజా నిజాలేంటో తెలిసిపోవడంతో వాటి స్పందించలేదని’ తెలిపాడు. ఇలాంటి గాసిప్స్ విన్నప్పుడు నవ్వుకుని, పనిలో పడిపోతుంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ నటుడు చెప్పాడు. అయితే ఇటీవల ‘సర్దార్ ఉద్దం’ సినిమా స్పెషల్ స్కినింగ్ సమయంలో వీరిద్దరూ టైట్ హగ్ చేసుకున్న వీడియో నెట్టింట హల్చల్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: విక్కీతో కత్రినా టైట్ హగ్.. వీడియో వైరల్ -
విక్కీ- కత్రినా డేటింగ్: నిశ్చితార్థానికి రెడీ అంటున్న హీరో
Vicky Kaushal Engagement With Katrina Kaif: బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే! పార్టీలలో కలిసి సందడి చేయడమే కాక పండగల టైంలో ట్రిప్‌కు కూడా వెళ్తుందీ ప్రేమ జంట. అంతేకాదు, వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు తరచూ వెళుతుంటారు. తాజాగా వారిద్దరూ ఓ ఫంక్షన్లో గట్టిగా హగ్గులిచ్చుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో విక్కీ తన పెళ్లి గురించి మాట్లాడిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారింది. కత్రినాతో నిశ్చితార్థం జరుపుకుంటున్నారా? అన్న ప్రశ్నకు విక్కీ నవ్వుతూ.. 'ఈ వార్తలు మీడియానే ప్రసారం చేస్తోంది. సరైన సమయం వస్తే త్వరలోనే నేను నిశ్చితార్థం చేసుకుంటాను. కాకపోతే అందుకు మంచి టైం కుదరాలంతే!' అని చెప్పుకొచ్చాడు. కానీ తను వేలు పట్టుకుని నడిచే అమ్మాయి పేరు మాత్రం వెల్లడించలేదు. కాగా ఆగస్టులో విక్కీ, కత్రినాకు పెళ్లి కుదిరిందని, వారిది రోకా ఫంక్షన్ కూడా జరిగినట్లు నెట్టింట వార్తలలు ప్రసారమయ్యాయి. అయితే కత్రినా తరపు బంధువులు ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. -
విక్కీతో కత్రినా కైఫ్ టైట్ హగ్.. వీడియో వైరల్
‘ఉరి’ ఫేమ్ విక్కీ కౌశల్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారంటూ రూమర్ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరిలో ఎవరు కూడా వారి రిలేషన్‌షిప్‌పై స్పందించలేదు. తాజాగా వారిద్దరూ టైట్ కౌగిలించుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విక్కీ హీరోగా చేసిన తాజా చిత్రం ‘సర్దార్ ఉద్దం’. ఆ సినిమా ప్రీమియర్ షోకి గెస్ట్‌గా వచ్చింది కత్రినా. ఆ షో అయిపోయిన తర్వాత క్యాట్, ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌ని గట్టిగా హగ్ చేసుకుంది. ఈ వీడియోని వారిద్దరి ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో వారి రిలేషన్షిప్ గాసిప్‌కి ఇంక బలం చేకూరినట్లయింది. ఈ విషయమై ఎవరైన రెస్పాండ్ అవుతారెమో వేచి చూడాలి. చదవండి: కత్రినా కైఫ్‌తో విక్కీ కౌశల్ రిలేషన్షిప్.. టీజ్ చేసిన కపిల్ View this post on Instagram A post shared by VickyKatrina16 (@vickykatrina16) -
అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే..
Katrina Kaifs Lookalike: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కి డూప్ దొరికేసింది. అలాంటి ఇలాంటి పోలికలు కాదండోయ్ అచ్చం కత్రినాలానే ఉంది. ఇంకా చెప్పాలంటే వీరిద్దరిలో రియల్ కత్రినా ఎవరో తేల్చడం సాధ్యపడదేమో అనేంతలా..అలీనా రాయ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. 2లక్షల ఫాలోవర్లతో సోషల్ స్టార్‌గా మారిపోయింది. ఇందుకు కారణం ఈ అమ్మాయి అచ్చం బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌లా ఉండటమే. View this post on Instagram A post shared by Alina Rai (@alinarai07) అలీనా రాయ్‌కు కత్రినా కైఫ్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసి .. కత్రినా కార్బన్ కాపీలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సాధారణంగా మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు. అలా ఇప్పటికే ఐశ్వర్యరాయ్ సహా పలువురు హీరోయిన్స్ ముఖ కవలికలతో ఉన్న వాళ్లని చూశాం. కానీ అలీనా మాత్రం కత్రినాకు జిరాక్స్ కాపీలా దిగిపోయింది. వీరిద్దరిని పక్కన పెడితే అసలు అలీనా ఎవరు? కత్రినా ఎవరు అన్న సందేహం వచ్చేంతలా అనిపిస్తుంది ఎవరికైనా. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్3 షూటింగ్లో బిజీగా ఉంది. -
కత్రినా కైఫ్ కిల్లింగ్ వర్కవుట్స్ వీడియో వైరల్
సాక్షి,ముంబై: బాలీవుడ్స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కొత్త వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ ఫ్రీక్‌గా మారి సెక్సీ ఫిగర్‌తో మరింత ఎట్రాక్టివ్‌గా మారిన ఈ భామ శనివారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ కసరత్తు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. క్లిష్టమై వర్కవుట్ చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. చదవండి : Tiger-3: సల్మాన్ ఖాన్ డ్యాన్సింగ్ వీడియో వైరల్ "నేను నా మనసుకు శిక్షణ ఇస్తాను.. దాన్ని నా బాడీ ఫాలో అవుతుంది. లేదంటే రెజా కటానికి (ఫిట్నెస్ ట్రైనర్) కాల్ చేస్తా’’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో కిల్లింగ్ అంటూ సోఫీ చౌదరి కామెంట్ చేయగా అభిమానులు మాత్రం వావ్ అంటూ ఫిదా అవుతున్నారు. కాగా కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన టైగర్-3 మూవీలో నటిస్తోంది. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను ఇటీవల ఇన్‌స్టాలో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
టర్కీలో సల్మాన్ ఖాన్ సందడి: వైరల్ వీడియో
సాక్షి, ముంబై: 'టైగర్ 3' సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పార్టీలో తెగ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. టర్కీలోని కప్పడోసియాలో మెయిన్ సాంగ్ షూట్ షెడ్యూల్‌ను ముగించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో సందడి సందడి చేశాడు. తన పాపులర్ మూవీలోని ఒక పాటకు స్టెప్పులతో ఇరగ దీశాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు సన్‌రైజ్‌ను ఆస్వాదిస్తున్న ఒక అద్భుతమైన ఫోటోను స్వయంగా సల్మాన్ ఇన్‌స్టాలో షేర్ చేయడం విశేషం. టైగర్-3 షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్ పాట షూటింగ్ ముగియడంతో పార్టీలో సందడి చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో టర్కీ ఫ్యాన్స్‌కోసం 'టవల్ స్టెప్' తో సీటీలు కొట్టించాడు. 2004 లో విడుదలైన ముఝ్ సే షాదీ కరోగీ‘ మూవీలోని పాపులర్ పాట జీనే కే హై చార్ దిన్ పాటకు డ్యాన్స్‌తో ఇరగదీశాడు. దీంతో అభిమానులు సందడి చేస్తున్నారు. "కోయి డిస్టర్బ్ మత్ కరో, టైగర్ అభీ మిషన్ పార్ హై’’ (ఎవరూ అతడిని డిస్టర్బ్ చేయొద్దు.. టైగర్ మిషన్‌లో ఉన్నాడు) అని ఒకరు , కత్రినా కైఫ్ ఎక్కడ భాయ్ అని మరొకరు కామెంట్ చేశారు. ఈ సందర్భంగా టర్కీ మంత్రితో దిగిన ఫొటోలు గత వారం నెట్టింట హల్ చల్ చేశాయి. టైగర్ 3 టీమ్ తన కార్యాలయానికి వచ్చిన ఫోటోలను టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి మెహ్మెత్ నూరి ఎర్సోయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న టైగర్-3 మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) View this post on Instagram A post shared by Salman Khan 🔵 (@salman.khan.universe) -
ఒకే ఫ్రేమ్‌లో దీపికా, కత్రినా.. పాత పిక్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ కెరీర్ మోడలింగ్‌తో కేరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాల్లోకి అడుగుపెట్టి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న అరుదైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వారు మోడల్‌గా ఓకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ ఫొటోను ఫోటోని ఫ్యాషన్ వీక్ ఆర్గనైజర్ మార్క్ రాబిన్సన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. టామ్ఫిగర్ ఫ్యాషన్ షో కోసం తీసిన ఆ పిక్‌లో జలక్ దిఖ్ లాజా 7 పార్టిసిపెంట్, నటి, హోస్ట్ సోఫి చౌదరి కూడా ఉన్నారు. కాగా బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న దీపికా పడుకోనే ప్రస్తుతం ‘ఫైటర్, ది ఇంటర్న్, పఠాన్’ వంటి చిత్రాలతో పాటు భర్త రణవీర్ సింగ్‌తో కలిసి '83లో నటిస్తోంది. అంతేకాకుండా హాలీవుడ్లో సైతం మరో సినిమాకు సంతకం చేయడమే కాకుండా ఆ మూవీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం గమనార్హం. ఇక కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ మూవీ ‘టైగర్ 3’, ‘ఫోన్ బూత్’, ‘సూర్యవంశీ’ వంటి సినిమాలతో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Marc J Robinson (@marcusjrobinson) -
హల్చల్ : పార్క్‌లో కత్రినా..స్టన్నింగ్ లుక్‌లో మలైకా
► స్టన్నింగ్ లుక్‌లో మలైక అరోరా ► బెనారస్ చీరతో సూట్ కుట్టించుకున్న శిల్పారెడ్డి ► లవ్ అంటే అదే అంటున్న నిషా అగర్వాల్ ► పార్క్‌లో సరదాగా అంటున్న కత్రినా కైఫ్ ► క్రేజీ లుక్స్‌తో అదరగొడుతున్న శ్రీముఖి ► కిన్నెరసానితో వస్తున్న మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ ► ఓనమ్ లుక్‌లో నటి మధుమిత శివబాలాజీ View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) -
టైగర్ 3 కోసం పూర్తిగా మారిపోయిన సల్మాన్.. ఫొటోలు లీక్
Russia Tiger 3 Shooting Images: బాలీవుడ్లో సీరిస్‌లు మంచి ఆదరణ ఉంది. ధూమ్, దబాంగ్, క్రిష్ సినిమాలే అందుకు చక్కటి ఉదాహరణ. బీ టౌన్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రాల్లో హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఏక్ థా టైగర్’ ఒకటి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘టైగర్ జిందా హై’ కూడా మంచి హిట్‌ను సల్మాన్ ఖాతాలో చేర్చింది. ప్రస్తుతం ఈ సీరిస్‌లో మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘టైగర్ 3’ గా రానున్న ఈ చిత్రానికి సంబంధించిన సల్మాన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీకై హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల చిత్ర పరిశ్రమలో లీకుల బెడద ఎక్కువగా ఉంది. అభిమానులకు సినిమా అప్డేట్స్ ద్వారా సర్ప్రైజ్ ఇవ్వాలని హీరోలు, చిత్ర యూనిట్ భావిస్తుండగా అవి ముందే నెట్టింట ప్రత్యక్షమై తారలకే షాక్కిస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటిస్తున్న ‘టైగర్ 3’ చిత్రం రష్యాలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్లో భాగంగా.. కారు ఛేజ్ సీక్వెన్స్ కోసం షూట్ చేస్తున్నప్పుడు సల్మాన్ పొడవాటి గోధుమ రంగు గడ్డంతో కనిపించాడు. అయితే ఆయన అభిమానుల్లో ఒకరు షూటింగ్ జరుగుతుండగా కొన్ని ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం గడ్డంతో ఉన్న సల్మాన్ ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందులో సల్మాన్ గూఢచారిగా నటిస్తున్నందున, బహుశా ఆ లుక్ మారువేషాలలో ఒకటి కావచ్చని తెలుస్తోంది. ముంబైలో సల్మాన్ ఖాన్ మార్చి చివరిలో ‘టైగర్ 3’ షూటింగ్‌ను ప్రారంభించగా, కరోనా మహమ్మారి కారణంగా చిత్రీకరణ ఆలస్యమౌతూ వచ్చింది. ఇందులో ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనున్నాడు. కలర్స్ టీవీ షో బిగ్ బాస్ 15 షూటింగ్ కోసం సల్మాన్ అక్టోబర్ నాటికి భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది. -
సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కత్రినా-విక్కీ కౌశల్?
Katrina Kaif -Vicky Kaushal: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారంటూ కొంత కాలంగా బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. కానీ తాజాగా జరిగిన రోకా ఫంక్షన్లో కత్రినా- విక్కీ ఉంగరాలు మార్చుకున్నారంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్ల నుంచి వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ‘ఫీలింగ్ సారీ ఫర్ సల్మాన్ ఖాన్’ అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు షేర్ చేస్తున్నారు. కత్రినా-విక్కీ ఎంగేజ్మెంట్పై పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తుండటంతో ఆమె టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 'రోకా వేడుక జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కత్రినా అతి త్వరలోనే ‘టైగర్-3’ షూట్ కోసం విదేశాలకు వెళ్తున్నారు' అని పేర్కొన్నారు. కాగా దాదాపు రెండేళ్లుగా విక్కీ-కత్రినా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. న్యూఇయర్ పార్టీకి మాల్దీవులకు వెళ్లడం, కలిసి ప్రైవేటు పార్టీలు, వేడుకల్లో పాల్గొనడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఓ షోలో సోనమ్ కపూర్ సోదరుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ కూడా కత్రినా-విక్కీ కౌశల్ రిలేషన్ షిప్లో ఉన్నారంటూ బాంబు పేల్చాడు. దీంతో ఇక వీరు ఏడడుగులు వేయడమే తరువాయి అంటూ బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. చదవండి : katrina kaif : కత్రినా కైఫ్ పెళ్లిపై సల్మాన్ ఖాన్ మేనేజర్ హింట్ లవ్ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం -
మరోసారి కెమెరాకు చిక్కిన లవ్‌బర్డ్స్, వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయాణం నడుస్తోందని కొంతకాలంగా బి-టౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసేందుకు సిద్దమవుతున్నారనే వార్తల వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఈ లవ్‌బర్డ్స్ స్పష్టత ఇవ్వలేదు. వారి రిలేషన్‌పై నోరు కూడా విప్పడం లేదు. కానీ వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. తాజాగా ఈ రూమర్డ్ లవ్‌బర్డ్స్ సినిమా హాల్ నుంచి బయటకు వస్తూ మరోసారి కెమెరాకు చిక్కారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతుంది. ఇందులో విక్కీ, కత్రినాలు మీడియాను చూడగానే ఒకరికొకరికి సంబంధం లేనట్లుగా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘వికాట్, నోటంకి కపుల్’, అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా సిద్దార్థ్ మల్హోత్రా, కియార అద్వానీ నటించిన షేర్షా మూవీ రేపు విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. మంగళవారం (అగష్టు 10) ఈ మూవీ స్క్రినింగ్ను పూర్తి చేసుకుంది. షెర్షా స్క్రినింగ్కు విక్కీ, కత్రినాలు కూడా హజరయ్యారు. ఈ సినిమా స్క్రినింగ్ ముగిశాక థియేటర్ నుంచి ముందుగా విక్కీ బయటకు రాగా అతడి వెనకాలే కత్రినా వచ్చింది. అయితే కత్రినా మాత్రం కెమెరాలను చూసి అక్కడే ఆగిపోయింది . ఇక ముందుకు నడుచుకుంటూ వచ్చిన విక్కీ మరో డోర్ దగ్గరికి రాగానే వెనక్కి తిరిగి కత్రినా వంక చూస్తూ నవ్వాడు. కత్రినా కూడా నవ్వూతూ కనిపించింది. తన చెల్లలు ఇజబెల్లా వచ్చే వరకు అక్కడే ఆగిన కత్రినా తను రాగానే కలిసి బయటకు నడిచింది. ఇదిలా ఉండగా వీరిద్దరి రిలేషన్ గురించి ఇటీవల సూపర్ స్టార్ అనిల్ కపూర్ తనయుడు, నటుడు హర్షవర్థన్ కపూర్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ఛానల్‌కు ఇచ్చిన జూమ్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ రూమర్డ్ కపుల్‌గా పిలవబడుతున్న ఆ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారని వెల్లడించాడు. దీంతో హోస్ట్ వెంటనే మీరు విక్కీ కౌశల్, కత్రినా గురించి చెబుతున్నారా? అని అడగ్గానే.. అవును అని సమాధానం ఇచ్చాడు. అంతేగాక ఈ విషయం తాను బయట పెట్టినందుకు ఇబ్బందుల్లో పడతానేమో తెలియదు? కానీ వాళ్లిద్దరూ దీనిపై స్పష్టం ఉన్నారని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆ రాత్రి కత్రినా.. ఆలియాకి ఫోన్ చేశా! – ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ కలిసి ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. కానీ ఇది హాలీడే ట్రిప్ కాదు.. సినిమా ట్రిప్. ప్రియాంక, కత్రినా, ఆలియా భట్ ప్రధాన పాత్రధారులుగా హిందీలో ‘జీ లే జరా’ చిత్రం రూపొందనుంది. రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేస్తారు. 2011లో వచ్చిన ‘డాన్ 2’ తర్వాత ఫర్హాన్ డైరెక్ట్ చేస్తున్న హిందీ చిత్రం ఇదే. ‘‘2019 నవంబరులో ముంబైలో వర్షం కురిసిన ఓ రాత్రి నాలో ఏవో కొత్త ఆలోచనలు. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ హిందీలో ఫీమేల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? అసలు మనం ఎందుకు ఓ ఫీమేల్ మల్టీస్టారర్‌లో నటించకూడదు? అని ఆలోచించి, నా స్నేహితురాళ్లు కత్రినా, ఆలియా భట్‌లకు ఫోన్ చేసి మాట్లాడాను. 2020 ఫిబ్రవరిలో మేం కలుసుకున్నాం. ఫైనల్లీ మా కాంబినేషన్ కుదిరింది. ప్రేక్షకులకు ఓ మంచి మల్టీస్టారర్‌ని ఇవ్వడానికి రెడీ అయ్యాం. స్నేహానికి సెలబ్రేషన్‌లా మా సినిమా ఉంటుంది ’’ అన్నారు ప్రియాంకా చోప్రా. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. -
హల్చల్ : రకుల్ చీటింగ్..పూజా కిస్సింగ్..హ్యాపీ అంటున్న సదా
♦ చీటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ తల్లితో బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మునిగిన సుప్రీత ♦ ముద్దులొలుకుతున్న పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ♦ మహేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన నమ్రత ♦ పుస్తకాల ఇంపార్టెన్స్ చెబుతున్న సోనాలీ బింద్రె ♦ వీకెండ్ కోసం ఎదురుచూస్తున్న మనీష్ మల్హొత్ర ♦ బ్లాక్ సల్వార్‌లో కృష్ణ ముఖర్జి క్యూట్ లుక్స్ ♦ ఎవరో గెస్ చేయమంటున్న దీపిక పిల్లి ♦ వర్కవుట్కు రెడీ అయిన కత్రినా కైఫ్ ♦ బీ హ్యాపీ అంటున్న సదా ♦ మీరు కూడా ఇంతేనా అని ప్రశ్నిస్తున్న అభిజీత్ View this post on Instagram A post shared by ANSHUKA | Yoga & Wellness (@anshukayoga) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) \ \ View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) -
ప్రభాస్ సినిమాలో కత్రినా ఐటమ్ సాంగ్?
Katrina Kaif Item Song In Salaar: ఐటమ్ సాంగ్ లేని సినిమాలు దాదాపు ఉండటంలేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఒక స్పెషల్ సాంగ్‌ని ఫ్యాన్స్ ఆశిస్తారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చర్చ అంతా ఈ హీరో చేస్తున్న ‘సలార్’ సినిమా గురించే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటను భారీగా ప్లాన్ చేస్తున్నారనే వార్త వచ్చింది. అంతేకాదు.. ఇది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ పాటలో ప్రభాస్‌తో కలసి ఓ హిందీ హీరోయిన్ స్టెప్పులేస్తే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఆ బ్యూటీ ఎవరో కాదు.. కత్రినా కైఫ్ అని సమాచారం. కత్రినా డ్యాన్స్ ఎంత బాగుంటుందో చెప్పడానికి ఆమె చేసిన ప్రత్యేక పాటల్లో ఒకటైన ‘చిక్నీ చమేలీ..’ చాలు. ‘అగ్నిపథ్’లోని ఈ పాటలో కత్రినా స్టెప్స్ అదుర్స్. మరి... ‘సలార్’లో స్పెషల్ సాంగ్ ఉంటుందా? ఉంటే అందులో కత్రినానే నటిస్తారా? అనేది వేచి చూడాలి. -
హల్చల్ : దిక్కులు చూస్తున్న వర్షిణి.. ప్రశ్నించిన సారా
♦ వైట్ చూడిదార్లో మెరిసిపోతున్న శ్రీముఖి ♦ ఆ స్టోరీ ఉంటుందంన్న అరియానా గ్లోరీ ♦ అలాంటి జర్నీ మరొకటి లేదన్నకంగనా ♦ సిగ్గుపడుతున్న వితికా షెరు ♦ ష్యామిలీ ఫోటో షేర్ చేసిన యాంకర్ అంజలి ♦ అందులోనే బ్యూటీ ఉందన్న మెహ్రీన్ ♦ దిక్కులు చూస్తున్న యాంకర్ వర్షిణి ♦ సరిగమప ఫ్రెండ్స్‌తో ట్రిఫ్..ఫోటో షేర్ చేసిన రీతూ ♦ కసరత్తులు చేస్తున్న కత్రీనా ♦ త్రోబ్యాక్ పిక్చర్..ఎందుకు వద్దంటున్న సారా ♦ అది నమ్మితే పోరాడాల్సిందే అంటున్న దీప్తి View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Dr Nayini Pragna (@reethu_nayini) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
యంగ్ హీరోతో త్వరలోనే కత్రినా వివాహం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలోనే పెళ్లికూతురిగా మారనుందా అంటే అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు. ఇటీవలె కత్రినా 38వ బర్త్‌డే సందర్భంగా ఆమె పెళ్లి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సల్మాన్ ఖాన్ మేనేజర్, స్టయిలిస్ట్ యాష్లె షేర్ చేసిన ఓ పోస్ట్ మరింత బలం చేకూరుస్తుంది. కత్రినా పుట్టినరోజు సందర్భంగా ఆమె పెళ్లి డ్రెస్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసిన యాష్లె..త్వరలోనే ఇది నిజం కావాలంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీనికి కత్రినా కూడా 'థ్యాంక్యూ' అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. కానీ తమ లవ్ కహానీపై మాత్రం ఇంతవరకు ఎలాంటి కన్ఫార్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజాగా 40లోపు పెళ్లిచేసుకోవాలని కత్రినా భావిస్తుందని, దీంతో త్వరలోనే ఆమె పెళ్లి జరగనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రియుడు విక్కీ కౌశల్‌తోనే కత్రినా త్వరలోనే ఏడడుగులు వేస్తుందని, ముహూర్తం కూడా ఫిక్స్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్లతో కత్రినా ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌తో పెళ్లిదాకా వెళ్లిన రిలేషన్ అనుకోకుండా బ్రేక్ అయ్యింది. మరోవైపు రణ్‌బీర్ సైతం ఆలియాను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. View this post on Instagram A post shared by deluxeBollywood (@deluxebollywood__) -
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న కైఫ్
-
కత్రినాతో రణ్‌బీర్ సహజీవనం.. ఆలియా ఎంట్రీతో బ్రేకప్
Karina Kapoor-Ranbir Kapoor Breakup: ‘అవును.. మోసం చేశాను. అవగాహన, అనుభవరాహిత్యం, నా మీద నాకున్న అతివిశ్వాసం, నా మొండితనం వల్ల అవతలి వ్యక్తిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నాను. అనుభవం నేర్పిన పాఠంతో రిలేషన్షిప్ విలువ అర్థమైంది’ అని చెప్పాడు రణ్‌బీర్ కపూర్.. దీపిక పడుకోణ్‌తో బ్రేకప్ అయ్యాక చాలా రోజులకు. ఆనాటికి అతను కత్రీనా ప్రేమలో ఉన్నాడు. ఈ ఇద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేసింది ఎవరో తెలుసా? దీపిక పడుకోణ్. సందర్భం.. కత్రీనా కైఫ్ బర్త్‌డే పార్టీ. ఆ సమయంలో కత్రీనా ..సల్మాన్‌ఖాన్ ప్రేమలో ఉంది. దీపిక, కత్రీనా ఇద్దరూ మంచి స్నేహితులు. 2008లో తన పుట్టిన రోజు వేడుకకు దీపికాను ఆహ్వానించింది కత్రీనా. అప్పటికి దీపిక, రణ్‌బీర్‌లు డేటింగ్లో ఉన్నారు. ఆ పార్టీకి అతణ్ణి వెంటబెట్టుకెళ్లి.. కత్రీనాకు పరిచయం చేసింది దీపిక. అలా రణ్‌బీర్, కత్రీనాలు ఫ్రెండ్స్ అయ్యారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ విడుదలైంది. అందులో హీరోహీరోయిన్లు రణ్‌బీర్, కత్రీనాలే. ఆ సినిమాతో వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తెరబయటా సన్నిహితులైపోయారు. దీపికాతో రణ్బీర్కున్న అనుబంధం పలచనవసాగింది. ఇటు సల్మాన్‌తో కత్రీనా రిలేషన్ కూడా కొన ఊపిరితో ఉండింది. న్యూయార్క్‌లో రణ్‌బీర్, కత్రినాల సెలబ్రేషన్స్ రణ్‌బీర్, కత్రీనాల తర్వాత సినిమా. ఆ సెట్స్‌మీదే ఆ జంట మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అప్పటిదాకా వదంతులుగా ప్రచారమవుతున్న ఆ వ్యవహారం గురించి నమ్మడం మొదలుపెట్టారు ఇటు సినిమాభిమానులు.. అటు దీపిక, సల్మాన్‌లు. ఆనవాళ్లూ దొరికి ఆ బంధాన్ని బ్రేక్ చేసేసుకున్నారిద్దరూ. రాజ్‌నీతి పూర్తయ్యాక ఆ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం న్యూ యార్క్ వెళ్లారు రణ్‌బీర్, కత్రినా. అక్కడ న్యూ ఇయర్ ఈవ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. కత్రీనా.. రణ్‌బీర్ కుటుంబానికి దగ్గరైంది. రణ్‌బీర్ కూడా కత్రీనా ఫ్యామిలీకి ఆప్తుడైపోయాడు. కరీనా హింట్‌తో ఫిక్సయ్యారు ఈ ఇద్దరూ స్పెయిన్‌లో హాలీడేస్‌ను స్పెండ్ చేశారు. అక్కడి సముద్రం ఒడ్డున వీళ్లు దిగిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఇంక ఈ జంట పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకున్నాయి బాలీవుడ్ వర్గాలు. దాన్ని బలరపరుస్తున్నట్టుగా కాఫీ విత్ కరణ్ షోలో ‘రణ్‌బీర్, కత్రీనా పెళ్లిలో చిక్నీ చమేలీ (అగ్నీపథ్ సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్‌ను కత్రీనా మీద చిత్రీకరించారు) పాట మీద డాన్స్ చేయాలనుకుంటున్నాను’ అని చెప్పింది కరీనా. ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు ఆ జంట కూడా తమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయలేదు. డే అవుట్లు, వీకెండ్ హ్యాంగవుట్లతో పాపరాజీకి కావలసినంత ఫుటేజీ ఇచ్చారు. బాలీవుడ్ ఫంక్షన్లకూ కలిసే వెళ్లి కనువిందు చేశారు. అంతేకాదు.. ‘రణ్‌బీర్ అద్భుతమైన నటుడే కాదు అత్యద్భుతమైన వ్యక్తి కూడా. నా జీవితంలో అతను ప్రత్యేకం. తను నాకెంత దగ్గరివాడో ఈపాటికి అందరూ గమనించే ఉంటారు’ అంటూ కత్రీనా.. ‘నా లైఫ్‌లో కత్రీనాది స్పెషల్ ప్లేస్. నా కుటుంబం, ఆప్తుల వరుసలో తను ముందుంటుంది’అంటూ రణ్‌బీర్ మీడియా ఇంటర్వ్యూలలో ఒకరి మీద ఒకరికున్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. సహజీవనం..నిశ్చితార్థం కూడా... వాళ్ల ప్రేమ కచ్చితంగా పెళ్లిగా మారుతుందనే నమ్మకానికి ఇంకో కారణం.. ఆ ఇద్దరూ కొత్త ఫ్లాట్‌లోకి మారి సహజీవనమూ ప్రారంభించడం. లండన్‌లో ఆ జంటకు ఇరు కుటుంబాల ఆధ్వర్యంలో నిశ్చితార్థం జరిగిందనే వదంతీ వినిపించింది. రేపేమాపో వివాహ ఆహ్వాన∙పత్రిక రావొచ్చనీ ఎదురు చూడసాగారు ఆ జంట సన్నిహితులు. ‘ఈ ఏడాది (2015) ఇద్దరం బిజీయే.. పెళ్లి ఆలోచన కూడా రానంతగా. వచ్చే ఏడు ప్లాన్ చేసుకుంటున్నాం’ అని చెప్పాడు రణ్‌బీర్ కపూర్.. ఆనంద్ బజార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. రణ్‌బీర్ లైఫ్‌లోకి ఆలియా ఎంట్రీ ఆ ప్రేమా పెళ్లిదాకా రాలేదు. ఇద్దరూ విడిపోయారు. అలియా భట్‌తో రణ్‌బీర్‌కు కుదిరిన స్నేహమే కత్రీనాతో బ్రేకప్‌కి కారణం అంటారు రణ్‌బీర్ ఫ్రెండ్స్. ‘జగ్గా జాసూస్’ ప్రారంభమయ్యాక వీళ్ల మధ్య పొరపొచ్చాలు పొడచూపాయి. ఆ సినిమా నిర్మాతల్లో కత్రీనా కైఫ్ ఒకరు. షూటింగ్లో ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని వినికిడి. అయితే..వాళ్ల బ్రేకప్ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్ ‘మేమిద్దరం విడిపోయామంటూ వస్తున్న వార్తలన్నీ మీడియా ఊహగానాలే. మా మధ్య ఎలాంటి స్పర్థలు లేవు. నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి కత్రీనా. ఆమెతోనే జీవితాన్ని పంచుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో తనను మిస్ చేసుకోను. ఐ నీడ్ హర్ ఇన్ మై లైఫ్’ అని చెప్పాడు. అది ఒట్టి అబద్ధమని ఆ వెంటనే తేలిపోయింది. ‘ప్రాణంగా ప్రేమించి వ్యక్తి నుంచి విడివడి.. నేనుగా నిలబడ్డానికి.. చాలా కష్టపడ్డాను. అస్పష్టతను మించిన నరకం ఉండదు’ అని చెప్పింది కత్రీనా కైఫ్.. జగ్గా జాసూస్ సినిమా విడుదల తర్వాత ఒక ఇంటర్వ్యూలో. ∙ఎస్సార్ -
కత్రినా కైఫ్‌కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?
Katrina Kaif Net Worth: ఆమె చూపుల్తోనే బాణం వదులుతుంది.. తన ఒంపుసొంపులతో నయాగరా జలపాతాన్ని గుర్తు చేస్తుంది.. తన నవ్వుతో ఇంద్రధనస్సును నేలమీదకు తీసుకొస్తుంది.. డ్యాన్స్‌తో నెమలి నాట్యాన్ని కళ్ల ముందుంచుతుంది.. నటనతో అందరినీ ఫిదా చేస్తుంది.. ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. నేడు(జూలై 16న) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ హీరోయిన్ ఇప్పటివరకు ఎంత సంపాదించింది? ఎంత వెనకేసుకుందో తెలుసుకుందాం.. 'బూమ్' సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది కత్రినా కైఫ్. తొలి చిత్రంలోనే అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే ఆఫర్ కొట్టేసిన ఈ భామ తర్వాత 'మల్లీశ్వరి' సినిమాతో టాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. కానీ తర్వాత ఆమె ఇక్కడ పెద్దగా సినిమాలేమీ చేయలేదు. 'అల్లరి పిడుగు' చిత్రం తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ 'చిక్నీ చమేలీ', 'షీలాకీ జవానీ' అంటూ ఐటం సాంగ్స్‌తోనూ అదరగొట్టింది. సుమారు 40కి పైగా సినిమాల్లో ఆడిపాడిన కత్రినా.. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఆంగ్ల మీడియాలో ప్రచురితమవుతున్న కథనాల ప్రకారం.. ఆమె ఒక్క సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటుందట. వాణిజ్య ప్రకటనలు, తన మేకప్ బ్రాండ్ 'కే బ్యూటీ' ద్వారా వచ్చే ఆదాయం దీనికి అదనం. ఇవేకాక ఫిట్నెస్ బ్రాండ్ 'రీబూక్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె రీబూక్ నుంచి కూడా బాగానే వసూలు చేస్తోందట. ఆమెకు ముంబైలో ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ఖరీదు సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా! లండన్‌లోనూ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కోట్లు విలువ చేసే భూమి కూడా తన పేరు మీద ఉందట. ఇక కార్ల మీద మోజు పడే కత్రినా గ్యారేజీలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ఎల్‌డబ్ల్యూబీతో పాటు మెర్సిడిస్ ఎమ్ఎల్ 350, ఆడీ క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా కత్రినా కైఫ్‌కు రూ.150 కోట్ల పైచిలుకు ఆస్తి ఉండొచ్చని సమాచారం. -
హల్చల్ : వెనక్కి వెళ్లనంటోన్న అనసూయ...తప్పు కాదంటోన్న ప్రియమణి
♦ అది ఎప్పటికీ తప్పు కాదంటున్న ప్రియమణి ♦ వెనక్కి వెళ్లనంటున్న అనసూయ ♦ క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న జాస్మీన్ ♦ బ్లూపర్ షేర్ చేసిన భాను ♦ తన అందానికే సీక్రెట్ ఇదేనంటోన్న కత్రినా ♦ ఆ సమస్య లేకపోతే రోజూ అవే తింటానంటున్న కల్పిక ♦ యోగాతో మోటివేషన్ అంటోన్న ఙ్ఞానేశ్వరి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
కత్రినా ఇంట్లో విక్కీ, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు విక్కీ ఏకంగా ఆమె ఇంటికి కూడా వెళ్లడంతో అది నిజమేనని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అయితే ఆ మధ్య విక్కీని కత్రినాతో నీ పెళ్లెప్పుడు? అంటే అలాంటిదేం లేదని సమాధానమిచ్చాడు. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని తానింకా సింగిలే అని చెప్పుకొచ్చాడు. కానీ ఇదంతా పచ్చి అబద్ధమంటున్నాడు నటుడు హర్షవర్ధన్ కపూర్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'విక్కీ, కౌశల్ ప్రేమించుకుంటున్నారు. ఇదే నిజం అని కుండ బద్ధలు కొట్టేశాడు. ఈ వ్యవహారాన్ని బయటపెట్టినందుకు బహుశా నాకు ఇబ్బందులు తప్పవేమో! అదంతా ఏమో కానీ త్వరలోనే వారు కూడా దీని గురించి స్పందిస్తారని భావిస్తున్నాను' అని తెలిపాడు. ఇక జూన్ 7న విక్కీ కౌశల్ ప్రియురాలు కత్రినా ఇంటికి వెళ్లినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోకి వెళ్లిన విక్కీ రాత్రి 8.30 గంటలకు ప్రియురాలికి వీడ్కోలు పలికి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ కపుల్ లవ్ మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా వుంటే కత్రినా చివరిసారిగా 'భారత్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె 'సూర్యవంశీ', 'ఫోన్ బూత్' చిత్రాల్లో నటిస్తోంది. 'భూత్ పార్ట్ 1'లో చివరిసారిగా కనిపించిన విక్కీ కౌశల్ ప్రస్తుతం 'ద ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ', 'సర్దార్ ఉద్దమ్ సింగ్' సినిమాలతో పాటు ఓ బయోపిక్ చేస్తున్నాడు. చదవండి: ‘ఇద్దరితో బ్రేకప్.. అతడిని ఎలా లవ్ చేస్తున్నావ్?’ -
సల్మాన్ ఖాన్ మూవీ భారీ సెట్ కూల్చివేత!
కరోనా కష్టాలు సిసీ పరిశ్రమను ఇప్పట్లో వదిలేలా లేవు. సినిమా భాషలో చెప్పాలంటే కరుడుగట్టిన విలన్లా మారింది. గత రెండేళ్ల నుంచి దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. రెండేళ్లుగా ఎన్నో సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. కరోనా సెకండ్ వేవ్, అకాల వర్షాల కారణంగా షూటింగ్ కోసం వేసిన ఎన్నో సెట్స్ దెబ్బతిన్నాయి. కొన్ని సెట్స్ కూలిపోయాయి కూడా. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమా కోసం వేసిన ఓ భారీ సెట్‌ని కూల్చివేయాలని భావిస్తున్నారట చిత్ర నిర్మాత. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం ‘టైగర్ 3’. ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో సెట్స్‌పైకి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కత్రినాకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో చిత్రీకరణ ఆగింది. ఈ సినిమా కోసం గుర్గావ్లో ప్రత్యేకంగా సెట్‌ను తీర్చిదిద్దారు. ఆ సెట్ మొన్నటి తౌటే తుపాను దెబ్బకు పాక్షికంగా దెబ్బతింది. ఇప్పుడేమో వర్షాలు మొదలయ్యాయి. షూటింగ్‌కి అనుమతి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే ఈ సెట్‌ను కూల్చేస్తున్నారట. అనుమతులు వచ్చి చిత్రీకరణలు మొదలయ్యాక తిరిగి కొత్తగా సెట్‌ను నిర్మించుకోవచ్చనే ఆలోచనలో నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నారని తెలుస్తోంది. చదవండి: బాలీవుడ్ లవ్ బర్డ్స్‌పై కేసు: హీరో తల్లి ఏమందంటే? ఆగిన MI-7 షూటింగ్..టామ్ క్రూజ్‌కి కరోనా! -
సినిమా నుంచి స్వయంగా తప్పుకున్న యంగ్ హీరో.. ఎందుకంటే
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ అభిమానులకు షాకిచ్చాడు. షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ “రెడ్ చిల్లీస్” తెరకెక్కిస్తున్న ఓ మూవీ నుంచి ఆయన సడెన్‌గా తప్పుకున్నారు. అజయ్ బెహల్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన కత్రినా కైఫ్ నటించనుంది. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల క్రితమే కార్తీక్ సైన్ చేశాడు. అయితే ఇటీవలి కాలంలో దర్శకుడు అజయ్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పేశాడు. దర్శకుడు ఇది వరకు చెప్పిన స్టోరీ లైన్‌కు, ఇప్పటి స్క్రిప్ట్ కు సంబంధం లేకపోవడంతో కార్తీక్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు గాను అడ్వాన్స్‌గా ఇచ్చిన 2 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లవ్ స్టోరీ ప్రధానంగా తెరెకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆలోపే కార్తీక్ ఆర్యన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. గతంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దోస్తానా 2' సినిమా నుంచి అతడిని తప్పిస్తున్నట్లు కరణ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగం పూర్తైంది. అయితే కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతో కరణ్ జోహార్ ఆ హీరోను అర్ధాంతరంగా తొలగించినట్లు బీ టౌన్ టాక్. రెండు వారాలు షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ సడన్‌గా హీరోను సైడ్ చేయడం బాలీవుడ్లో చర్చకు తెరదీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తాను చేస్తున్న చిత్రం నుంచి అనూహ్యంగా వైదొలిగాడు. చదవండి : సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు కొరియోగ్రాఫర్ బర్త్‌డే.. అక్షయ్‌కుమార్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? -
విజయ్ సేతుపతికి జంటగా కత్రినా కైఫ్.. టైటిల్ ఇదే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి ప్రచారంలో ఉన్న 'మెర్రీ క్రిస్మస్' అనే టైటిల్‌నే ఖరారు చేసినట్లు నిర్మాత రమేష్ తౌరుని వెల్లడించారు. ఇక ఈ మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి- కత్రినా మొదటిసారి నటిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఈ సినిమా షూటింగ్ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే జూన్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే అతి కొద్ది తారాగణంతో షూటింగ్ చేయాలని భావిస్తున్నారట. దీంట్లో విజయ్ సేతుపతి, కత్రినా సహా మరికొద్ది మంది పాల్గొనున్నట్లు సమాచారం. చదవండి : విజయ్ను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్..రీజన్ అదే! ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ -
విజయ్ను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్..రీజన్ అదే!
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. 'లైగర్’ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరీ జగన్నాద్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా పూర్తవగానే విజయ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించనున్నట్లు బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే కత్రినా తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో విజయ్‌ని ఫాలో అవుతుందని ప్రచారం సాగుతోంది. ఇటీవలె ఆమె న్యూ డే.. న్యూ హెయిర్ కట్.. న్యూ ఫిలిమ్’అంటూ పెట్టిన ఓ పోస్టు కూడా విజయ్ సినిమా గురించే అన్న సందేహామూ ఫ్యాన్స్‌లో కలుగుతోంది. ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్ 80 శాతం దాకా పూర్తయ్యింది. ముంబైలో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా కరోనా కారణంగా బ్రేక్ పడింది. మరోవైపు కత్రినా కూడా ‘ఫోన్ బూత్’ అనే సినిమాలో నటిస్తుంది. ఇద్దరూ వారి వారి షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ సినిమాలు పూర్తవగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంని సమాచారం. విజయ్-కత్రినాల సినిమాను కూడా కరణ్‌జోహార్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేస్తుంది.. -
ప్రభాస్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి ఎవరంటే..
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సాహో సినిమా నుంచి ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు. వయసు దాటి పోతున్నా పెళ్లి విషయాన్ని పక్కనపెట్టి వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించే సినిమాల్లో బాలీవుడ్ గ్లామరే ఎక్కువ కనిపిస్తోంది. సాహో, ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ.. ఇలా అన్నిచిత్రాల్లో మొత్తం బీటౌన్ భామల సందడే నెలకొంది. ఇక తాజాగా 'వార్' వంటి యాక్షన్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌కు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనూ మరో బాలీవుడ్ బ్యూటినే ప్రభాస్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ తరువాత బాలీవుడ్లో బిజీగా మారింది. మళ్లీ చాలా ఏళ్లకు తెలుగు వెండితెరపై కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్-ఆనంద్ సినిమాలో కత్రినాను హీరోయిన్గా తీసుకోనున్నట్లు సమాచారం. ప్రబాస్ ఎత్తుకు కత్రినా సెట్ అవుద్దని వీరిద్దరి జోడి కూడా బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ కత్రినాను సంప్రదించినట్లు, ఇందుకు ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు వినికిడి. శ్రద్ధా కపూర్.. కృతి సనన్ తరువాత ప్రభాస్ సరసన కత్రినా కనువిందు చేయనుందన్న మాట. ప్రస్తుతం సిద్ధార్థ్ షారూఖ్ ఖాన్, దీపికతో 'పఠాన్' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా చేయనున్నాడు. అయితే 'రాధేశ్యామ్' పూర్తి చేసిన ప్రభాస్ ఆ తర్వాత 'ఆదిపురుష్'తో పాటు నాగ్అశ్విన్ సినిమా, ప్రశాంత్ నీల్ 'సలార్' పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా మొదలు కానుంది. కాగా నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పడుకొనె, 'సలార్'లో శ్రుతి హాసన్, 'ఆదిపురుష్'లో కృతి సనన్ కథానాయికలుగా నటించబోతున్నారు. చదవండి: ఓటీటీలో విడుదల కానున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’, కానీ.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాస్.. వైరలవుతోన్న ఫోటోలు -
‘ఇద్దరితో బ్రేకప్.. అతడిని ఎలా లవ్ చేస్తున్నావ్?’
బాలీవుడ్ లవ్ కపుల్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని బీటౌన్‌లో గుసగుసలు వినిపించగా.. గతేడాది రణ్‌బీర్ కపూర్ తమ రిలేషన్‌ని కన్ఫామ్ చేశాడు. ఆలియా తన గర్ల్‌ఫ్రెండ్ అని.. కరోనా లేకుంటే ఈ ఏడాది తామిద్దరం వివాహం చేసుకునే వారమని తెలిపాడు. అయితే ఆలియా కంటే ముందే రణ్‌బీర్ మొదట దీపికా పదుకోనెతో, ఆ తర్వాత కత్రినా కైఫ్‌లతో ప్రేమాయణం నడిపాడు. వారిద్దరికి బ్రేకప్ చెప్పిన తర్వాత ఆలియాతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో గతంలో ఓ ఆంగ్ల మీడియా ఆలియాతో చేసిన ఇంటర్వ్యూలో రణబీర్ బ్రేకప్ స్టోరీల గురించి ఆమె దగ్గర ప్రస్తావించింది. ఇప్పటికే ఇద్దరితో విడిపోయాడు.. అతడిని మీరు ఎలా అంగీకరించారు అని ప్రశ్నించారు రిపోర్టరు. ఇందుకు ఆలియా సమాధానమిస్తూ.. ‘‘ఇదేం పెద్ద సమస్య కాదు. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అదంతా గతం. దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ప్రస్తుతం నాతో ఎంత నమ్మకంగా, ప్రేమగా ఉన్నాడు అనేదే నాకు ముఖ్యం’’ అంటూ చెప్పుకొచ్చారు ఆలియా. అంతేకాక తమ బంధాన్ని స్నేహం అని పిలిచారు ఆలియా. ‘‘మా మధ్య ఉన్నది బంధం కాదు. స్నేహం. ఎంతో నిజాయతీతో కూడిన చెలిమి. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. మబ్బుల్లో తేలియాడుతున్నాను.. చుక్కలను తాకుతున్నాను. ఈ స్నేహంలో మేం మా వ్యక్తిగత జీవితాలను జీవిస్తూ.. ఎలాంటి ఆటంకం లేకుండా మా వృత్తిలో కొనసాగుతున్నాం. ఈ మైత్రిబంధంలో ఎంతో సౌకర్యవంతంగా.. సంతోషంగా ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు ఆలియా. ఆలియా, రణ్‌బీర్ అభిమానులు వీరి వివాహం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆలియా గంగూబాయ్ కతియావాడి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో బిజీగా ఉండగా.. రణ్‌బీర్ షంశేరా, టైటిల్ ఖరారు కానీ మరొక చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: నా కొడుకు లవ్ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం -
నా కొడుకు లవ్ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం
ముంబై : బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్‌కు లవర్‌బాయ్ ఇమేజ్ ఉంది. గతంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌లతో లవ్‌ట్రాక్ నడిపిన రణ్‌బీర్ ఇప్పుడు ఆలియాభట్‌తో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. కరోనా కారణంగా వీరి పెళ్లికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకు ఫెయిల్యూర్ లవ్స్టోరీలపై స్పందించారు. రణ్‌బీర్‌తో డేటింగ్ చేసిన హీరోయిన్లు ఎవరూ తనకు సూట్ కారని, రిలేషన్ బ్రేకప్ కావడంలో తన కొడుకు తప్పేమీ లేదని పేర్కొంది. 'రణ్‌బీర్ చాలా సాఫ్ట్. ఎవరినీ హర్ట్ చేయడు. తను బంధానికి ఎంతో విలువిచ్చే మనిషి. నో చెప్పడం కూడా తెలియని అమాయకుడు. ఫస్ట్ టైమ్ రణ్‌బీర్ డేటింగ్లో ఉన్నప్పుడు.. ఆ అమ్మాయితో రిలేషన్ వద్దని వారించినా రణ్‌బీర్ వ్యతిరేకించాడు. దీంతో ఈ మ్యాటర్‌ను మరో రకంగా డీల్ చేస్తే మంచిదని భావించా. అందుకే అమ్మాయిల విషయంలో అంత త్వరగా నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇచ్చా' అని నీతూకపూర్ వెల్లడించింది. కాగా రణ్‌బీర్‌తో గతంలో దీపికా పదుకొణె పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. అతని పేరుతో 'ఆర్కే' అనే టాటూని వీపుపై వేయించుకుంది. వీరిద్దరి పెళ్లి కూడా జరగనుందనే వార్తలు కూడా బీటౌన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా వీరి రిలేషన్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ కారణంగానే దీపికా డిప్రెషన్‌కు గురైనట్లు బీటౌన్ టాక్. ఆ తర్వాత నటుడు రణవీర్ సింగ్‌తో దీపిక పెళ్లి జరిగింది. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో ఆరేళ్ల పాటు రణ్‌బీర్ డేటింగ్ చేశాడు. అంతేకాకుండా ఫ్యామిలీ ఫంక్షనకు సైతం కత్రినా అటెండ్ అయ్యేది. వీరి పెళ్లకి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారనే ప్రచారం కూడా సాగింది. కానీ సడెన్‌గా వీరిద్దరు ఉంటున్న ఇళ్లు ఖాళీ చేసి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక దీపికా- కత్రినాలతో రణ్‌బీర్ బ్రేకప్ జరగడానికి తల్లి నీతూ కపూర్ కూడా ఒక కారణమని అప్పట్లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : తనే నా గర్ల్ ఫ్రెండ్, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్ ‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’ -
కత్రినా కైఫ్‌కు కరోనా పాజిటివ్
ముంబై : భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. ఇప్పటికే పలువురు బీటౌన్ సెలబ్రిటీలందరూ వరుసపెట్టి మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. జాగ్రత్తలు పాటించండి' అని కత్రినా పేర్కొన్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ట్వీట్ చేశారు. కాగా టాప్ స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బాలీవుడ్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే.. ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, అక్షయ్ కుమార్ సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. చదవండి : బీటౌన్‌లో కరోనా ప్రకంపనలు.. కరోనా పాజిటివ్: ఆస్పత్రిలో చేరిన అక్షయ్ -
పిక్చర్ అభీ బాకీ హై!.. సెట్స్‌పై సీక్వెల్స్ హంగామా
కాన్సెప్ట్ కొత్తగా ఉండి, సినిమాను ఆడియన్స్ వసూళ్ల రూపంలో మెచ్చుకుంటే ఆ కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకువెళ్లే ఆలోచన చేస్తుంటారు దర్శక–నిర్మాతలు. కథను కొనసాగించడానికి అవకాశం ఉంటే, అది ఓ సిరీస్‌లా కూడా మారుతుంది. ప్రస్తుతం హిందీలో కొన్ని హిట్ చిత్రాలకు ‘పిక్చర్ అభీ బాకీ హై’ (సినిమా ఇంకా ఉంది) అంటూ సీక్వెల్స్ రానున్నాయి. ఆ చిత్రాలపై ఓ లుక్కేద్దాం. పిక్చర్ అభీ బాకీ హై! బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్లో 2012లో వచ్చిన ‘ఏక్తా టైగర్’ సూపర్‌హిట్. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఐదేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టైగర్ జిందా హై’ సినిమా చేశారు సల్మాన్. కాన్సెప్ట్పరంగా ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా హిట్టే. ఇప్పుడు టైగర్ ఫ్రాంచైజీలో ‘టైగర్ 3’ సెట్స్ మీద ఉంది. మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాల్లో జంటగా నటించిన సల్మాన్, కత్రినా కైఫ్ ఈ సినిమాలో కూడా జోడీగా నటిస్తున్నారు. ఇక మరో బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం ఒకేసారి రెండు సీక్వెల్స్ చేస్తున్నారు. ‘సత్యమేవ జయతే 2’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రాల్లో నటిస్తున్నారు జాన్. 2018లో ఆయన నటించిన ‘సత్యమేవ జయతే’ చిత్రం బంపర్‌హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘సత్యమేవ జయతే 2’ ఈ ఏడాది మే 13న విడుదల కానుంది. ఇందులో జాన్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలప్ జవేరియే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. మోహిత్ సూరి డైరెక్షన్లో జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా మెయిన్ లీడ్ రోల్స్‌గా రానున్న ‘ఏక్ విలన్’ (2014) సీక్వెల్ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల కానుంది. 2018లో జాతీయ అవార్డు సాధించిన హిందీ చిత్రం ‘బదాయీ హో’కు స్వీకెల్‌గా ‘బదాయీ దో’ రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా... ‘బదాయీ దో’లో రాజ్‌కుమార్ రావ్ హీరో. భూమీ ఫడ్నేకర్ హీరోయిన్. పోలీసాఫీసర్‌గా రాజ్‌కుమార్ రావ్, పీఈటీ టీచర్‌గా భూమీ ఫడ్నేకర్ కనిపిస్తారు. దాదాపు పన్నెండేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ల ‘దోస్తానా’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు నవ్వించే బాధ్యతను కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య తీసుకుని, కోలిన్ డైరెక్షన్లో ‘దోస్తానా 2’ను రెడీ చేస్తున్నారు. అలాగే కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న మరో సీక్వెల్ ‘భూల్ భులయ్యా2’... అదేనండీ... మన రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాను హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా ‘భూల్ భులయ్యా’గా తీశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భూల్ భులయ్యా 2’ వస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, టబు, కియారా అద్వానీ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. రెట్టింపు ‘హంగామా’ (2003)తో ‘హంగామా 2’ను రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రియదర్శన్. ఈ ‘హంగామా 2’ సినిమాతో ప్రణీత బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. పరేష్ రావల్, శిల్పాశెట్టి, జెఫ్రీ ‘హంగామా 2’లో నటించిన ఇతర ముఖ్యతారాగణం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరోసారి రెడీ అయిపోయారు ‘బంటీ ఔర్ బబ్లీ’. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ నటించిన తాజా ‘బంటీ ఔర్ బబ్లీ 2’లో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధార్థ్ చతుర్వేది నటించారు. తెలుగు హిట్ మూవీ ‘పరుగు’ హిందీ రీమేక్ ‘హీరో పంతి’తో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన టైగర్ ష్రాఫ్ రీసెంట్గా ‘హీరో పంతి 2’ను అనౌన్స్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 3న రిలీజ్ కానుంది. ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’ సినిమా విడుదలై 11 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూవీ సీక్వెల్‌ను ప్రకటించారు నిర్మాత ఏక్తా కపూర్. హృతిక్ రోషన్ స్టార్‌డమ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన సినిమా ‘క్రిష్’. ఈ సిరీస్‌లో ‘క్రిష్ 4’ను 2018లో అనౌన్స్ చేశారు హృతిక్. కానీ ఆయన తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఈ సీక్వెల్స్‌తో పాటుగా ‘ఫుక్రే’ ఫ్రాంచైజీలో ‘ఫుక్రే 3’, ధర్మేంద్ర ‘అప్నే’ సినిమాకు సీక్వెల్‌గా ‘అప్నే 2’, ‘ఆంఖేన్ 2’ వంటి సీక్వెల్స్ వెండితెరపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి -
అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' రిలీజ్ డేట్ వచ్చేసింది..
అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సూర్యవంశీ’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మార్చి 14 (ఆదివారం)న రోహిత్‌శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ‘‘సూర్యవంశీ సినిమా ట్రైలర్ ఏడాది కిత్రం విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల సినిమాను విడుదల చేయలేకపోయాం. కానీ మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని చెప్పాం. ప్రామిస్ ఈజ్ ఈ ప్రామిస్. ‘సూర్యవంశీ’ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నాం. థియేటర్స్‌లో సినిమాను చూసినప్పుడు కలిగే అనుభూతి వేరు. ఆ రహీ హై పోలీస్ (పోలీస్ వస్తున్నాడు)’’ అని పేర్కొన్నారు అక్షయ్ కుమార్. చదవండి: చెర్రీతో జతకట్టే ఆ అమ్మాయి ఎవరంటే! -
ఇంటర్వెల్ లేని సినిమాలో కత్రినా కైఫ్
‘మెర్రీ క్రిస్మస్’ అంటున్నారు కత్రినా కైఫ్. అప్పుడే క్రిస్మస్ ఏంటి? అంటే కత్రినా నటించనున్న తాజా చిత్రానికి ‘మెర్రీ క్రిస్మస్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విజయ్ సేతుపతి హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్గా ‘అంధా ధున్’ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు ‘మెర్రీ క్రిస్మస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రాన్ని 90 నిమిషాల నిడివితో తెరకెక్కించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ఇంటర్వెల్ ఉండకపోవడం ఓ విశేషం. ఏప్రిల్‌లో పుణేలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. 30 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో ‘మెర్రీ క్రిస్మస్’ను థియేటర్లోకి తీసుకురావాలనుకుంటోంది చిత్రబృందం. -
మరోసారి టైగర్‌గా సల్మాన్ ఖాన్
ఏజెంట్ టైగర్‌గా ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’ చిత్రాల్లో కనిపించారు సల్మాన్ ఖాన్. మరోసారి టైగర్‌గా మారడానికి సిద్ధమయ్యారు. మార్చిలో దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. యశ్ రాజ్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. కత్రీనా కైఫ్ కథానాయిక. మొదటి రెండు సినిమాల కంటే భారీ బడ్జెట్‌తో, భారీ యాక్షన్‌తో ఈ సినిమా ఉంటుందని టాక్. మార్చి మొదటివారంలో యాక్షన్ సన్నివేశాలతోనే చిత్రీకరణను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఈద్ పండుగకు టైగర్ థియేటర్స్‌లోకి రానుంది. -
నాతో పెట్టుకోకు: హీరోను ఓడించిన హీరోయిన్
హీరో సిద్ధాంత్ చతుర్వేది, హీరోయిన్ కత్రినా కైఫ్ సరదాగా బ్యాడ్మింటన్ ఆడగా.. చిత్రబృందంలోని సభ్యులు ఆటను కన్నార్పకుండా చూశారు. నువ్వానేనా అన్న తరహాలో ఆడిన వీరి ఆటలో చివరకు కత్రినా గెలిచింది. దీనికి సంబంధించిన వీడియోను కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గుర్మిత్ సింగ్ దర్శకత్వంలో కత్రినా, సిద్ధాంత్, ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలుగా ‘ఫోన్ బూత్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉదయ్‌పూర్ కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ విరామ సమయంలో కత్రినా, సిద్ధాంత్ సరదాగా బ్యాట్లు పట్టారు. కాగా ఈ గేమ్ మధ్యలలోనే ఇశాంత్ సరదాగా డ్యాన్స్‌లు కూడా చేశాడు. ఈ విధంగా ఫోన్ బూత్ సినిమా షూటింగ్ విరామ సమయంలో నటీనటులు తమకు ఇష్టమైన క్రీడలు ఆడుతూ సేద తీరుతున్నారు. హర్రర్ కామెడీ ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఫర్హాన్ అక్తార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
కరోనా టెస్ట్: నవ్వుతోన్న కత్రినా
సినిమా మొదలు పెట్టేముందు చిత్రయూనిట్ అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే! ఈ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటున్నారు హీరోయిన్ కత్రినా కైఫ్. సెట్స్‌లో అడుగు పెట్టే ముందు ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె నవ్వుతూ పరీక్ష చేయించుకున్నారు. తద్వారా అభిమానులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా కోవిడ్ టెస్ట్ చేయించుకోమని సందేశమిచ్చారు. కాగా ఈ మధ్యే మాల్దీవులకు వెకేషన్ వెళ్లిన ఈ హీరోయిన్ అక్కడ దిగిన పొటోలను అభిమానులతో పంచుకోగా అవి నెట్టింట వైరల్‌గా మారాయి. (చదవండి: అమితాబ్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిన రకుల్) కాగా 'మల్లీశ్వరి' చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా పరిచయమైన కత్రినా తర్వాత బాలీవుడ్‌కే మకాం వేసి అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, ‘జర జర టచ్ మీ’ అంటూ ఐటంసాంగ్‌లపైనా చిందేశారు. ఎన్నో హిట్లు సొంతం చేసుకుంటూ, అవార్డులు ఎగరేసుకుపోయిన ఆమె ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి సూర్యవంశీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ అవుతుంది. అలాగే సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫోన్‌బూత్ చిత్రంలోనూ కత్రినా కనిపించనున్నారు. ఆద్యంతం కామెడీగా సాగే ఈ చిత్రానికి మీర్జా పూర్ ఫేమ్ గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
బిగ్‌బీ పోస్టుకు కత్రినా కైఫ్ ఫ్యాన్స్ ఫిదా!
ముంబై: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తాజా ఇన్స్టాగ్రామ్ పోస్టుకు బాలీవుడ్ బామా కత్రినా కైఫ్ అభిమానులు ఫిదా అవుతున్నారు. కత్రినా, బిగ్బీలు కలిసి చేసిన ఓ యాడ్‌కు సంబంధించిన ఫొటోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ బిగ్‌బీ చమత్కరించారు. ఈ ఫొటోలో అమితాబ్ బచ్చన్, కత్రినాలు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. ‘అనుకోకుండా ఓ ఫొటో నా కంటపడింది. అయితే నేను దానికి కోసం వేతకలేదు. కానీ ఈ ఫొటో దేవీ జీ ఆభరణాలతో చాలా అందంగా కనిపించారు, ఇక్కడ కింద కూర్చున్నది నేనే’ అంటూ బిగ్‌బీ చమత్కరిస్తున్న రెండు ఎమోజీలను జత చేసి పోస్టు చేశాడు. (చదవండి: ప్రభాస్ మూవీకి బిగ్‌బీ అంత తీసుకుంటున్నాడా?) View this post on Instagram अचानक हमें एक तस्वीर मिल गयी है, ढूँढा नहीं हमने ,पन्ना पलटते मिल गयी है; सोचा, देवी जी गहनों में अच्छी लग रही हैं , नीचे बैठे मान्यवर, हमी हैं , हमी हैं 😜🤣 A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Oct 24, 2020 at 1:57pm PDT కాగా కత్రినా పెళ్లి కూతురిగా బిగ్‌బీ దంపతులుగా ఓ ఆభరణాల సంస్థ కోసంస చేసిన ప్రకటన నుంచి తీసుకున్న ఫొటో ఇది. అయితే అమితాబ్, కత్రినాలు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్లలో కలిసి నటించిన విషయం తెలిసిందే. చివరిగా గులాబో సితాబోలో నటించిన ఆయన రణ్‌బీర్ కపూర్, అలియా భట్లు జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్రాలో నటిస్తున్నారు. అంతేగాక నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనెలు హీరోహీరోయిన్లు రూపొందిస్తన్న ఆదిపురుష్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. -
అర్థరాత్రి ముసుగులో కత్రినా ఇంటికి హీరో!
ముంబై: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యువహీరో విక్కీ కౌశల్ మధ్య ఏదో ఉందనే వార్తలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఒకానొక టైమ్‌లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను విక్కీ తోసిపుచ్చారు. తాను సింగిల్లే అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ విక్కీ కత్రినాతో మింగిల్ అవుతూనే ఉన్నాడని బీటౌన్ కోడై కూస్తోంది. అది నిజమే అనేలా అప్పుడప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ప్రేమాయణాన్ని ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా కూడా ఏదో రకంగా బయటికి వస్తూనే ఉంది. (చదవండి : ఆయుష్మాన్‌పై కంగన ఫైర్) తాజాగా అర్థరాత్రి వేళ ముసుగు వేసుకొని కత్రినా ఇంటికి వెళ్లిన విక్కీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తలకు క్యాప్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజు ధరించిన విక్కీ.. ఆదివారం రాత్రి ముంబైలోని కత్రినా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కంటా పడకుండా హడావిడిగా కారు దిగి లోపలికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే వాదనకు మరింత బలం చేకూరినట్లైంది. View this post on Instagram #vickykaushal spotted at #katrinakaif house today😍😍❤️❤️ #Vickat ❤️ pic credit : PINKVILLA article (thanks @pinkvilla 🙌😍❤️) . #victrina #vicky #katrina #bollywoodcouple #vickykatrina #bollywoodsongs #bollywooddance #mrandmrskaushal #vickykaushalfans #katrinakaiffans #sooryavanshi #sushantsinghrajput #sardarudhamsingh #sammanekshaw #phonebhoot #takht #aliabhatt #priyankachopra #ranbirkapoor #deepikapadukone #ranveersingh #salmankhan #sharukhkhan #shraddhakapoor #koffeewithkaran #kapilsharmashow A post shared by Vicky Katrina (@vickykatrina__) on Aug 9, 2020 at 2:23am PDT -
కత్రినాకు కండలవీరుడి సర్ప్రైజ్
ముంబై : సహ నటులు, స్నేహితులకు సోషల్ మీడియా వేదికగా అరుదుగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ విషయంలో మాత్రం ఆనవాయితీకి భిన్నంగా స్పందించారు. కత్రినా పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సల్లూ భాయ్ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఆకట్టుకునే ఫోటోతో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. వారు కలిసి నటించిన టైగర్ జిందా హై మూవీ నుంచి ఓ ఫోటోను పోస్ట్ చేసి హ్యాపీ బర్త్‌డే కత్రినా అని రాశారు. దిల్ దియా గలన్ అనే పాటలోని స్టిల్‌ను ఈ ఫోటో కోసం సల్మాన్ ఎంచుకున్నారు. 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కత్రినా కైఫ్‌కు బాలీవుడ్ సహచరుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కత్రినా ప్రస్తుతం తన సోదరి ఇసాబెల్లెతో కలిసి ముంబై నివాసంలో క్వారంటైన్లో ఉన్నారు. సల్మాన్, కత్రినా కలిసి గతంలో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, మైనే ప్యార్ కోం కియా, యువ్‌రాజ్, భారత్ వంటి పలు చిత్రాల్లో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు. ఇక కత్రినా తన తర్వాతి సినిమాలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సరసన నటించనున్నారు. -
నయన్ ఓ ఫైటర్.. తన అందానికి సలాం: కత్రినా
ముంబై: హీరోయిన్ నయనతారను ఎ ఫైటర్ అంటూ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కత్రినా మేకప్ బ్రాండ్ ‘కే’(kay)కు నయనతార బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కే(kay) ప్రచార ప్రకటనలో భాగంగా నయన్ ఇటీవల ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. తన మేకప్ బ్రాండ్ ప్రకటన కోసం నమనతార సమయాన్ని కేటాయించినందుకు గురువారం కత్రినా సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెద్ద ధన్యవాదాలు. మీ బీజీ షేడ్యూల్లో కూడా ముంబై వచ్చి మా మేకప్ బ్రాండ్ ప్రకటనకు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ ఉదారతకు.. అందానికి ఎప్పటికీ సలాం’ అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (అప్పుడు దూరాన్ని తరిమేద్దాం) అంతేగాక ఓ ఇంటర్య్వూలో కత్రినాను.. నయనతారతో కలిసి పనిచేసిన అనుభవం గురించి అడగ్గా.. ‘‘తన అద్భుత నటన, తన సంకల్పం చూసి ఆశ్చర్యపోయాను. తను ఓ ఫైటర్. పోరాట యోధురాలిగా కనిపిస్తుంది. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. అంతేగాక తను చేసే పనికి కట్టుబడి ఉంటుంది. తను చాలా చిన్న వయస్సు నుంచే నటిస్తున్నారు. అంతేకాదు అద్భుత నటి కూడా. అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటారు. అది నన్ను చాలా ఆకర్షించింది’’ అటూ చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన దర్భార్ నటిచంని నమయనతార ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ సినిమాలో నటిస్తున్నారు. (ఆగస్ట్‌లో ఆరంభం) View this post on Instagram A big big thank you to the gorgeous South Superstar #Nayanthara for coming down to Mumbai in between her hectic schedule to be a part of the Kay Beauty campaign . So generous and gracious 😘........... forever grateful ❤stay tuned for campaign coming tomorowwwww @kaybykatrina #KayByKatrina #KayXNykaa #MakeupThatKares A post shared by Katrina Kaif (@katrinakaif) on Oct 21, 2019 at 10:11am PDT -
అర్జున్ పోస్టు : ‘అబ్బా.. ఏం మామిడి జోక్ వేశారు!’
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్‌ను మరోసారి టార్గెట్ చేశాడు. అర్జున్ తన సహా నటులను వీలు చిక్కినప్పుడల్లా ఆటపట్టిస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కత్రినాను సోషల్ మీడియా వేదికగా ఆటపట్టించిన అర్జున్ మరోసారి తన ఫేమస్ ప్రకటన మ్యాంగో స్లైస్‌పై సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘హాలో ఫ్రెండ్స్ మామిడి కాలం వచ్చేసింది. ఇది చూడగానే మీకు గుర్తోచ్చేంది కత్రినా స్లైస్ యాడ్ కదా!’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. (అప్పుడు దూరాన్ని తరిమేద్దాం) View this post on Instagram Hello friends, mango season is here... aur aam dekh ke yaad aaya... @katrinakaif, would you like a SLICE ? 😉🥭 #Mango #Summer #AamKiBaat A post shared by Arjun Kapoor (@arjunkapoor) on May 25, 2020 at 12:29am PDT ఇది చూసిన కత్రినా ‘‘అవును.. ప్లీజ్ మీరు కూడా స్లైస్‌లు తీనాలని కోరుకుంటున్న’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి అర్జున్ ‘మా కోసం స్లైస్ తినాలని వినూత్నంగా చెప్పావు కాబట్టి.. నీకు నీలాగే ఇష్టంగా తింటానని వాగ్దానం చేస్తున్న’ అంటూ అర్జున్ కామెంట్ చేశాడు. ఇక వీరి ఫన్నీ కామెంట్స్ చూసిన నెటిజన్లు.. ‘‘హ హ్హా హ్హా.. కత్రినాను మీరు ఆటపట్టించిన తీరు అద్భుతం’’. ‘‘అబ్బా.. ఏం మామిడి జోక్ వేశారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (వైరల్: అర్జున్ పోస్ట్.. కత్రినా ఫన్నీ రిప్లై) -
అప్పుడు దూరాన్ని తరిమేద్దాం
‘‘కరోనా వైరస్ కారణంగా తలెత్తిన పరిస్థితులు జీవితం పట్ల నాకు ఉండే దృష్టి కోణాన్ని మార్చివేశాయి’’ అంటున్నారు కత్రినా కైఫ్. ఈ విషయం గురించి కత్రినా వివరంగా చెబుతూ– ‘‘ప్రపంచం మొత్తం ముందుకెళుతున్న సమయంలో కరోనా వచ్చి వెనక్కి నెట్టేసింది. కరోనాకు ముందు మన జీవితాలు ఎలా సాగాయి? అని ఆలోచిస్తే.. ఇకముందు అప్పటి పరిస్థితులు ఉంటాయా? అనే సందేహం కలుగుతోంది. మన సాధారణ జీవితం మనకు తిరిగి ఎప్పుడు లభిస్తుందో చెప్పలేం. దేశంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవిగా ఉండటమే ఉత్తమం. నలుగురితో కలిసిమెలిసి ఉండాలంటారు. కానీ ఇప్పుడు నలుగురి క్షేమం కోసం దూరంగా ఉండటమే మంచిది. కరోనాని తరిమేశాక ఈ దూరాన్ని కూడా తరిమేద్దాం’’ అని అన్నారు. -
వైరల్: అర్జున్ పోస్ట్.. కత్రినా ఫన్నీ రిప్లై
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ షేర్ చేసిన వీడియోకు కత్రినా కైఫ్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్వారంటైన్లో ఉన్న ఓ వ్యక్తి వినూత్నంగా క్రికెట్ ఆడుతున్న ఓ ఫన్నీ వీడియోను అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ‘క్రికెట్ ప్రేమికుడు లాక్డౌన్లో సామాజిక దూరం పాటిస్తూనే తనకు తానే క్రికెట్ ఆడుతూ మిగతా ఆభిమానులకు సవాలు విసిరాడు’ అంటూ అర్జున్ భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లిని ట్యాగ్ చేశాడు. (అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా) దీనికి ‘‘లాక్డౌన్లో క్రికెట్ ప్రేమికులంతా... విరాట్ కోహ్లి మీరు కూడా ఇలానే చేస్తున్నారా’’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. అర్జున్ పోస్టు చూసిన కత్రినా స్పందిస్తూ.. ‘‘నేను చేస్తాను’’ అంటూ చేయి పైకెత్తి ఉన్న అమ్మాయి ఎమోజీని జత చేశారు. దీనికి అర్జున్ ‘సెల్ఫ్ క్రికెట్’ అంటూ తల పట్టుకుని ఉన్న ఎమోజీతో తన స్పందనను తెలిపాడు. కాగా ఇంతవరకు విరాట్, అర్జున్ పోస్టుకు స్పందిచలేదు. ఇక విరాట్ దీనిపై ఎలాంటి కామెంటు చేస్తాడో వేచి చూడాల్సిందే. (‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’) -
ఆ సర్వేలో కోహ్లి జంట టాప్..!
కరోనా లాక్‌డౌన్‌తో సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్ లేకపోవడంతో వారిలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వినోదాన్ని పంచడమే కాకుండా.. ఇంటి పనులు చేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే లాక్డౌన్ సమయంలో నిర్వహించిన ఓ పోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. క్యా బోల్తి పబ్లిక్ పేరిట ఫ్లిప్‌కార్ట్ వీడియో పోల్ ఆధారిత గేమ్ షోను నిర్వహిస్తోంది. ఇందులో ఇండియన్ క్రికెటర్స్, బాలీవుడ్ తారల గురించి అభిమానుల ముందు పలు ఫన్నీ ప్రశ్నలు ఉంచింది. ఇందులో ఇండియాలోనే టాప్ టెన్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకటిగా నిలిచే విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంటకు అధిక శాతం ఓట్లు లభించాయని మై ఖేల్ పేర్కొంది.ఈ పోల్‌లో విరాట్-అనుష్క, సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్‌లలో క్యూటెస్ట్ కపుల్ ఎవరని అడగ్గా.. 81 శాతం మంది భారతీయ అభిమానులు విరుష్క జోడికే ఓటు వేశారు. కాగా, కోహ్లి, అనుష్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. (చదవండి : 8 వారాల తర్వాత.. హెసన్ భావోద్వేగం) కూలెస్ట్ ఆల్ రౌండర్స్‌గా జడేజా, హార్దిక్ .. ఇదే పోల్‌లో టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలలో కూలెస్ట్ ఆల్ రౌండర్ ఎవరని అభిమానులను ప్రశ్నించగా.. వారి నుంచి ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. జడేజా, హార్దిక్‌లకు దాదాపు కొద్దిపాటి తేడాతో ఓట్లు వచ్చాయి. మొత్తంగా జడేజాకు 53 శాతం ఓట్లు పోలయ్యాయి. కత్రినా కంటే ధావన్ బెటర్.. అలాగే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌లలో ఎవరు ఇంటి పనులు బాగా చేస్తారని ప్రశ్నించగా.. ఎక్కువ మంది ధావన్‌కే ఓటేశారు. కాగా, లాక్డౌన్ సమయంలో ధావన్ ఇంట్లో బట్టలు ఉతుకుతున్న వీడియోలో పోస్ట్ చేయగా.. కత్రినా ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు కడిగే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : మరోసారి వార్తల్లో శుభ్‌మన్, సారా టెండూల్కర్) -
ఇన్‌స్టా లైవ్.. స్టార్ హీరోయిన్ తంటాలు
సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉండే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చేసిన ఓ తుంటరి పని అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. చాలా వరకు సెలబ్రటీలు ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు అందంగా ముస్తాబై ఏ టైంకి లైవ్‌కి వస్తున్నామో ముందే షేర్ చేస్తారు. అయితే అనుకోకుండా కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఆప్షన్ నొక్కారు. దీంతో నిజంగానే ఆమె లైవ్‌లోకి వచ్చారనుకొని చాలామంది ఫ్యాన్స్ లైవ్‌లో జాయిన్ అయ్యారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక కొద్దిసేపటి వరకు అయోమయంలో పడిపోయింది. అనుకోకుండా ఏర్పడిన పరిస్థితి కావడంతో నేనెలా లైవ్‌కి వచ్చానురా బాబు అంటూ కత్రినా ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. (అర్జున్ ఫొటోకు కత్రినా కామెంట్!) అప్పటికే చాలామంది అభిమానులు లైవ్‌లో జాయిన్ అవడంతో ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి కాస్తా వైరల్ కావడంతో వావ్ కత్రినా మీరు మేకప్ లేకుండా కూడా చాలా బాగున్నారు. మీ ఎక్స్ప్రెషన్స్ సూపర్బ్ అంటూ కత్రానాను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక కరోనాపై పోరుకు కత్రిన తన వంతు సాయంగా మహారాష్ట్ర సీఎం కేర్, పీఎం కేర్ రిలీఫ్ ఫండ్స్‌కు విరాళాలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ సహాయంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరిన సంగతి తెలిసిందే. కత్రిన తదుపరి చిత్రం సూర్యవంశీ మార్చి 24న విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. (దర్శకుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్) -
ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసిన విక్కీ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, అందాల భామ కత్రినా కైఫ్ మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై స్పందించిన విక్కీ తన ఫస్ట్ లవ్ కత్రినా కాదని బాంబు పేల్చాడు. వివరాల్లోకి వెళితే.. ఈ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు ఎలాంటి విసుగు ప్రదర్శించకుడా తీరికగా సమాధానమిచ్చాడు. దొరికిందే చాన్సు అనుకున్న అభిమానులు హీరో నుంచి వీలైనన్ని సీక్రెట్స్ రాబట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బాలీవుడ్లో మీరు తొలుత ప్రేమించిన వ్యక్తి ఎవరు అని అభిమాని ప్రశ్నించగా విక్కీ.. ఎలాంటి తత్తరపాటు లేకుండా ఫొటోతో సహా సమాధానమిచ్చాడు. అలనాటి అందాల నటి మాధురీ దీక్షిత్ అంటే ఇష్టమంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక మీరు ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారన్న ప్రశ్నకు కుటుంబంతో గడుపుతూ, సినిమాలు చూస్తూ, అప్పుడప్పుడు అమ్మతో యోగా, ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ ద్వారా కాలాన్ని నెట్టుకొస్తున్నానన్నాడు. ఈ "ఉరి: ద సర్జికల్ స్ట్రైక్" హీరో కరోనాపై పోరుకు రూ.1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆయన తాజాగా స్వాతంత్ర్య సమర యోధుడు "సర్దార్ ఉద్ధమ్ సింగ్ "బయోపిక్‌లో నటించగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. (నటుడు కావాలని నిర్ణయం తీసుకున్నాక విక్కీ చేసిన మొదటి పని) -
రోహిత్ శెట్టిపై ట్రోలింగ్.. కత్రినా స్పందన
బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి తనకు మంచి స్నేహితుడని.. దయచేసి ఆయనను విమర్శించవద్దని స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకుని.. నిందించడం సరికాదని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్, కత్రినా కైఫ్ తదితరులు కీలక పాత్రల్లో రోహిత్ శెట్టి.. ‘‘సూర్యవంశీ’’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్లో భాగంగా రోహిత్.. కత్రినాను తక్కువ చేసి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో #ShameOnYouRohitShetty అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ విషయంపై స్పందించిన కత్రినా రోహిత్ శెట్టి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.(దర్శకుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్) ‘‘ప్రియమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు... నేను సాధారణంగా ఇలాంటి వార్తలపై స్పందించను. కానీ రోహిత్ సర్ విషయంలో నేను మాట్లాడక తప్పని పరిస్థితి. ఎందుకంటే మీరంతా ఆయనను అపార్థం చేసుకున్నారు. ‘ ‘ బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో ముగ్గురు హీరోలు ఉన్నపుడు నువ్వు ఫ్రేంలో కనిపించవు’’ అని రోహిత్ శెట్టి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజం కాదు. ఆ సీన్లో నేను కళ్లు మూసినట్లుగా కనిపించడంతో మళ్లీ టేక్ చేద్దాం అన్నాను. అయితే రోహిత్ సర్ మాత్రం.. ‘‘ అది బ్లాస్ట్ సీన్ కాబట్టి ఎవరూ అంతగా ఈ విషయాన్ని పట్టించుకోరు’’ అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయనే మళ్లీ మరో టేక్ చేద్దామని నాతో అన్నారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన సినిమాల్లో నటించడం ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఆయన ఎల్లప్పుడూ నాకు స్నేహితుడే’’అని కత్రినా తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు. కాగా రోహిత్ శెట్టి సైతం ఈ వార్తలపై స్పందించిన సంగతి తెలిసిందే. -
కత్రినా.. నిన్నెవరూ చూడరు: దర్శకుడు
ముంబై: బాలీవుడ్ అగ్ర దర్శకుడు, ‘సూర్యవంశీ’ డైరెక్టర్ రోహిత్ శెట్టి స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా కత్రినా కైఫ్ క్లైమాక్స్ సన్నివేశంలో రీటేక్ కావాలని రోహిత్‌ను కోరింది. అప్పటికే ఒకే సన్నివేశాన్ని నాలుగుసార్లు చిత్రీకరించటంతో రోహిత్ దానికి అంగీకరించలేదు. అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ లాంటి సూపర్ స్టార్లు నటిస్తున్న ఈ సన్నివేశంలో నిన్ను ఎవరూ పట్టించుకోరని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నటిని కించపరిచావని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై దర్శకుడు రోహిత్ స్పందిస్తూ.. క్లైమాక్స్ సన్నివేశంలో నటించడానికి కత్రినా అప్పటికే నాలుగు టేకులు తీసుకుంది. అయినప్పటికీ సన్నివేశం బాగా రాలేదంటూ మరోసారి నటిస్తానని కోరింది. అయితే అది బాంబు పేలుళ్ల సన్నివేశం కావడంతో అందులో నీ నటనను అంతగా ప్రజలు గమనించరని చెప్పానన్నారు. కానీ ఆమె నటించిన సన్నివేశాన్ని ప్రోమోలో పెడతానని చెప్పినట్లు పేర్కొన్నారు. అతని సమాధానంపై సంతృప్తి చెందని ఓ నెటిజన్.. ‘ కత్రినా కైఫ్ ఈ దశాబ్దపు అత్యుత్తమ హీరోయిన్ అని, ఆమెతో పాటు మహిళలను గౌరవించడం నేర్చుకోండి’ అని ఘాటుగానే కామెంట్ చేశాడు. చదవండి: ఆటలో పోరాడి గెలిచిన కత్రినా