
Katrina Kaifs Lookalike: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కి డూప్ దొరికేసింది. అలాంటి ఇలాంటి పోలికలు కాదండోయ్ అచ్చం కత్రినాలానే ఉంది. ఇంకా చెప్పాలంటే వీరిద్దరిలో రియల్ కత్రినా ఎవరో తేల్చడం సాధ్యపడదేమో అనేంతలా..అలీనా రాయ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. 2లక్షల ఫాలోవర్లతో సోషల్ స్టార్‌గా మారిపోయింది. ఇందుకు కారణం ఈ అమ్మాయి అచ్చం బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌లా ఉండటమే.
అలీనా రాయ్‌కు కత్రినా కైఫ్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసి .. కత్రినా కార్బన్ కాపీలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సాధారణంగా మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు. అలా ఇప్పటికే ఐశ్వర్యరాయ్ సహా పలువురు హీరోయిన్స్ ముఖ కవలికలతో ఉన్న వాళ్లని చూశాం. కానీ అలీనా మాత్రం కత్రినాకు జిరాక్స్ కాపీలా దిగిపోయింది.
వీరిద్దరిని పక్కన పెడితే అసలు అలీనా ఎవరు? కత్రినా ఎవరు అన్న సందేహం వచ్చేంతలా అనిపిస్తుంది ఎవరికైనా. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్3 షూటింగ్‌లో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment