భర్త కోసం హీరోయిన్‌ స్పెషల్‌ పోస్ట్‌.. ప్రెగ్నెంట్‌ అని హింట్‌ ఇస్తోందా? | Katrina Kaif Birthday Post for Vicky Kaushal Drops 3 Pics, 3 Hearts, 3 Cakes | Sakshi
Sakshi News home page

Katrina Kaif: భర్త కోసం స్పెషల్‌ పోస్ట్‌.. ఆ క్యాప్షన్‌ అర్థం అదేనా?

Published Fri, May 17 2024 2:08 PM | Last Updated on Fri, May 17 2024 3:06 PM

Katrina Kaif Birthday Post for Vicky Kaushal Drops 3 Pics, 3 Hearts, 3 Cakes

బర్త్‌డే అంటేనే సెలబ్రేషన్స్‌.. సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్‌ డేలో వర్క్‌ పక్కనపెట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు, ఎంజాయ్‌మెంట్‌కు పెద్ద పీట వేస్తుంటారు. గురువారం (మే 16న) బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ 36వ బర్త్‌డే జరుపుకున్నాడు. అతడి భార్య కత్రినా కైఫ్‌.. విక్కీ బర్త్‌డేను తనకు తోచిన రీతిలో సెలబ్రేట్‌ చేసింది. అంతేకాకుండా అతడి ఫోటోలను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ క్రమంలో మూడు హార్ట్‌ సింబల్స్‌, మూడు కేక్‌ ఎమోజీలను క్యాప్షన్‌లో జత చేసింది. 

ఆ క్యాప్షన్‌కు అర్థమదేనా!
ఇది చూసిన కొందరు ఆ క్యాప్షన్‌లో ఇంకేదో అర్థం దాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అక్కడ హార్ట్స్‌, కేక్స్‌.. అలాగే విక్కీ ఫోటోలు.. అన్నీ మూడు మాత్రమే వచ్చేలా ఎందుకు పోస్ట్‌ చేసింది. అంటే తన కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని హింటిస్తోంది కాబోలు' అని అభిప్రాయపడుతున్నారు. మరో వ్యక్తయితే నువ్వు ప్రెగ్నెంట్‌ కదా.. అని ప్రశ్నించాడు. 

రెండేళ్ల క్రితం కూడా..
కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కత్రినా ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె టీమ్‌.. సదరు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలు ఉట్టి పుకార్లుగానే మిగిలిపోతాయా? లేదంటే నిజమవుతాయా? అనేది చూడాలి!

ఇద్దరూ సినిమాలతో బిజీ
విక్కీ కౌశల్‌ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు చావా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పీరియాడిక్‌ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 6న విడుదల కానుంది. కత్రినా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా మేరీ క్రిస్‌మస్‌ అనే మూవీలో నటించింది. ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో జీలే జరా అనే సినిమా ఉంది.

 

 

చదవండి: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement