నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా | Eesha Rebba Comments On Aravinda Sametha Movie Work Experience | Sakshi
Sakshi News home page

Esha Rebba: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ!

Published Fri, May 17 2024 12:54 PM | Last Updated on Fri, May 17 2024 1:23 PM

Eesha Rebba Comments On Aravinda Sametha Movie Work Experience

సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే అంతకు మించిన ఇబ్బందులు ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది మోసపోతుంటారు కూడా. ఇప్పుడు అలాంటి ఓ అనుభవాన్నే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా బయటపెట్టింది. ఎన్టీఆర్ 'అరవింద సమేత' విషయంలో తనని ఎలాంటి పరిస్థితి ఎదురైందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈషా చెప్పుకొచ్చింది.

'త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో మీరు ఒకరు అని అన్నారు. అయితే నేను మెయిన్ లీడ్‌గా మాత్రమే చేద్దామనుకుంటున్నానని, తొలుత నో చెప్పేశాను. కానీ త్రివిక్రమ్ కథ మొత్తం చెప్పి లీడ్స్‌లో ఓ క్యారెక్టర్ అని అన్నారు. సరే చూద్దాములే అని ఓకే చెప్పేశా. షూటింగ్‌కి వెళ్లే ఒక్క రోజు ముందు ఓకే చెప్పాను. మొదటిసారి నేను పెద్ద సినిమా చేశా. దాంతో అంతా కొత్తగా అనిపించింది. షూటింగ్ జరిగినన్నీ రోజులు హ్యాపీగానే ఉంది.'

(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.. జీవితంలోకి స్పెషల్ పర్సన్)

esha rebba interview

'అలానే సినిమా విడుదలకు ముందు నన్ను సెకండ్ లీడ్‌గా అనౌన్స్ చేస్తానని అన్నారు. కానీ అలా చేయలేదు. ఒకవేళ చేసుంటే నాకు హెల్ప్ అయ్యేది. అయితే ఈ విషయం మా మేనేజర్‌ని కూడా అడిగా. కను‍క్కోమన్నాను. షూట్ అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. కానీ నేను హ్యాపీగా లేను. సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను. కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో తీసేశారు. ఎన్టీఆర్‌తో సాంగ్ అన్నారు. అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ సినిమాకు నాకున్న హ్యాపీనెస్ ఒకటే తారక్, త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం' అని ఈషా చెప్పుకొచ్చింది.

అయితే ఈ ఇంటర్వ్యూలో ఎవరి గురించి నెగిటివ్‌గా చెప్పలేదు గానీ హీరోయిన్ ఛాన్స్ అని తనని మోసం చేసిన విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది. చాలా సినిమాల విషయంలో ఎలాంటివి జరుగుతున్నాయో బయటపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గుంటూరు కారం'లో కూడా ఇలానే మీనాక్షి చౌదరికి రెండే సీన్లలో చూపించారు. బహుశా ఈమెకి కూడా ఈషా లాంటి అనుభవమే ఎదురై ఉంటుంది.

(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement