Trivikram Srinivas
-
గురూజీని పక్కన పెట్టిన బన్నీ..! కన్ ఫ్యూజన్ లో త్రివిక్రమ్
-
ఆరు నెలలు ఆగండి.. త్రివిక్రమ్‌కు బన్నీ రిక్వెస్ట్!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun ) నటించే తదుపరి సినిమా ఏంటనేదానిపై ఇప్పుడు రకరకాల ఊహగానాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటి వరకు త్రివిక్రమ్( Trivikram Srinivas)తో సినిమా ఉంటుంది.. అది కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా అని వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో బన్నీ మరో తమిళ దర్శకుడితో చేతులు కలిపాడని, అదే ఇప్పుడు తెరకెక్కుతుందని అంటున్నారు. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.బన్నీ కోసం స్టోరీ రెడీ చేసిన గురూజీగుంటూరుకారం తర్వాత తివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయలేదు. ఆ సినిమా రిలీజ్‌కి ముందే బన్నీతో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారట. పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కేస్తుందని అంతా భావించారు. కానీ బన్నీ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తివిక్రమ్ కంటే ముందు వేరే దర్శకుడితో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట.నా కోసం ఆరు నెలలు ఆగండితన కోసం కథ రెడీ చేసి సిద్ధంగా ఉన్న త్రివిక్రమ్‌ని తాజాగా బన్నీ కలిశారు. మరోసారి ఇద్దరు స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బన్నీ తన మనసులో మాట చెప్పేశాడట. ఈ సినిమా షూటింగ్ కంటే ముందు మరో సినిమా చేస్తానని, 2026లో అది రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తివ్రిక్రమ్‌కి వివరించారట. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే.. ఈ సినిమా కూడా ప్రారంభిద్దామని, తనకోసం ఓ ఆరు నెలలు వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశారట. దీనికి త్రివిక్రమ్ కూడా అంగీకరించారట.రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనేలా ప్లాన్ చేసుకోమని బన్నీని అడిగారట. ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయేవరకు తాను ఆగలేనని, మధ్యలో జాయిన్ అవుతానంటే తనకు ఓకే అని చెప్పారట. బన్నీ కూడా మొదట అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభించి, తర్వాత త్రివిక్రమ్ మూవీని సెట్‌పైకి తీసుకురావాలనుకుంటున్నాడట. త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌కి చాలా సమయం పడుతుంది. 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మధ్యలో అట్లీ సినిమా చేస్తే..అది వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసి గ్యాప్ లేకుండా చూసుకోవాలని బన్నీ భావిస్తున్నాడట. పుష్ప 1,2 చిత్రాల కోసం ఐదేళ్లు కేటాయించిన బన్నీ..ఇప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ని అలరించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. -
త్రివిక్రమ్ తో ఫ్యామిలీ మూవీ ఆలోచనలో పడిన వెంకీ మామ
-
స్టార్ డైరెక్టర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న త్రివిక్రమ్ కుమారుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్వరలో ఆయన కుమారుడు రిషీ మనోజ్ కూడా మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతలో తన కుమారుడికి శిక్షణ ఇచ్చే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకోకుండా మరో ఇద్దరు దర్శకులకు ఆ పని అప్పజెప్పారు. ఇప్పటికే రిషీ ట్రైన్ అయి ఉన్నాడు. అయితే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నాడు.జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి వద్ద త్రివిక్రమ్ కుమారుడు ఇప్పటికే శిక్షణ తీసుకున్నాడు. విజయ్- గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' సినిమాకు అసిస్టెంట్‌గా త్రివిక్రమ్ కుమారుడు పనిచేస్తున్నాడు. దాదాపు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావస్తోంది. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా దగ్గరకు రిషీ వెళ్లనున్నాడు. ఇక్కడ త్రివిక్రమ్ ఫోన్ చేసి తన కుమారుడిని అసిస్టెంట్‌గా తీసుకోవాలని కోరితే ఎవరు వద్దంటారు..? అందుకే ప్రభాస్ స్పిరిట్ సినిమాకు రిషీ అసిస్టెంట్‌గా పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత రిషీ కూడా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.మరో రెండేళ్లలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అకీరా, రిషీ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌తో పరిచయం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పవన్-త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహం ఈ ప్రాజెక్ట్ సులభంగా పట్టాలెక్కనుందని చెప్పవచ్చు. -
త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
-
అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటనలో సడెన్‌గా కీలక మార్పులు..?
పుష్ప2 విజయంతో అల్లు అర్జున్ ఇమేజ్ భారీగా పెరిగింది. ఈ సినిమా తర్వాత బన్నీ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి..? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. అయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో సడెన్‌గా బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కాకుండా అట్లీతో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.పుష్ప2 సమయంలోనే అల్లు అర్జున్‌కు అట్లీ కథ చెప్పాడట. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాశారని తెలిసింది. ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసేందుకు అట్లీ డీల్ సెట్ చేసుకున్నాడు.. ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ కావడంతో అట్లీ టీమ్ కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ను మరోసారి కలిసినట్లు టాక్ వస్తుంది. దీంతో అల్లు అర్జున్, అట్లీ సినిమా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అట్లీతో చేసే చిత్రం దాదాపు యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని నెట్టింట వైరల్ అవుతుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట. సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ నెలలోనే బన్నీ కొత్త సినిమా ప్రకటనపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.అట్లీతో సినిమా కోసం సాయి అభ్యంకర్ అనే కొత్త సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్‌లో ఉన్నారట. స్టార్ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి అభ్యంకర్.. తన టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు పొందాడు. దర్శకుడు ఆర్జే బాలాజీ- సూర్య సినిమాకు అభయ్నే సంగీత దర్శకుడు కావడం విశేషం. హీరోయిన్ మీనాక్షి చౌదరితో ఆయన చేసిన ఒక సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. లోకేశ్ కనగరాజ్ స్టోరీతో వస్తున్న బెంజ్ సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ మూవీలో ఛాన్స్ దక్కితే మరో కొత్త సంగీత దర్శకుడి పేరు సెన్సేషనల్ కానుంది. -
గెట్ రెడీ.. రంగం సిద్ధం?
-
హిస్టారికల్ స్టోరీలో అల్లు అర్జున్
-
నా హృదయంలో ప్రత్యేక స్థానం ఆ సినిమాకే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మూవీ విడుదలైన ఐదేళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పోస్ట్ చేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన నటీనటులు, సిబ్బందితో పాటు మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ మూవీ సమయంలో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 5 years of #AlaVaikunthapurramuloo! This film will always hold a special sweet place in my heart. A heartfelt thank you to #Trivikram Garu, Chinna Babu Garu, Allu Aravind Garu, brother @MusicThaman, @vamsi84 garu and the entire cast and crew for bringing this magical film to… pic.twitter.com/N0w7lsR8Lq— Allu Arjun (@alluarjun) January 12, 2025 AVPL DAYS 💛 THROWBACK MEMORIES 💛 pic.twitter.com/7Nz904BaH2— Allu Arjun (@alluarjun) January 12, 2025 -
బన్నీ అప్పుడే మొదలు పెట్టేశాడుగా..! త్రివిక్రమ్ సినిమా పనులు మొదలు..!
-
త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని,కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రం నిజంగానే పూనమ్‌కి అన్యాయం జరిగిందంటారు. మరికొంత మంది ఏమో ఫేమ్ కోసమే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని విమర్శిస్తారు. అయితే పూనమ్ మాత్రం తన పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని డిమాండ్ చేస్తునే ఉంది. కానీ ‘మా’ మాత్రం పట్టించుకోవట్లేదని పూనమ్ ఫైర్ అవోతుంది.తాజాగా మరోసారి ‘మా’పై తన అసంతృప్తిని వెల్లడిస్తూ పూనమ్ సంచలన ట్వీట్ చేసింది.(చదవండి: డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)‘త్రివిక్రమ్(Trivikram Srinivas)పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ‘మా’ దానిపై స్పందించలేదు. త్రివిక్రమ్‌ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తుంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది. గతంలో కూడా పూనమ్ ఇలాంటి ట్వీట్స్ చాలానే చేసింది. త్రివిక్రమ్‌పై ‘మా’లో ఫిర్యాదు చేస్తే సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పూనమ్ డిమాండ్ చేసింది.పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
వేసవిలో షురూ
‘పుష్ప 2: ది రూల్’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్ . అయితే ఆయన నటించనున్న తర్వాతి చిత్రంపై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేసేందుకు పచ్చజెండా ఊపారు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి.దీంతో అల్లు అర్జున్ తర్వాతి మూవీ త్రివిక్రమ్‌తోనే ఉండబోతుందనే విషయం స్పష్టం అవుతోంది. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో...’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్స్ తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హారిక హాసినీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాని గత ఏడాది జూలైలో ప్రకటించారు. ఈ సినిమా గురించి సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతేకాదు.. ఈ మూవీని వచ్చే వేసవిలో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారట అల్లు అర్జున్ , త్రివిక్రమ్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
Trivikram: అప్పట్లో నాకు ముప్పై రూపాయలు మాత్రమే వుండే
-
యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్.. మాటల మాంత్రికుడు ఎలా అయ్యాడు? (ఫొటోలు)
-
కొత్త ప్రపంచాన్ని చూస్తారు.. బన్నీ-తివిక్రమ్ మూవీపై నిర్మాత కామెంట్
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత మూడేళ్లుగా ఈ సినిమాపైనే బన్నీ ఫోకస్ చేశాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజుల కిందటే ప్రకటించారు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ లాంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రమిది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్మాత నాగవంశీ తన మాటలతో ఆ అంచనాలను మరింత పెంచేశాడు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూస్తారని ఆయన చెప్పారు.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్ని-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ‘ప్రస్తుతం త్రివిక్రమ్ తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు. స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జనవరిలో ఓ స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తాం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఓ కొత్త కథతో రాబోతున్నాం. రాజమౌళి సైతం ఇలాంటి జానర్‌ని టచ్ చేయలేదు. మంచి విజువల్స్ ఉంటాయి. దేశంలో ఎవరూ చూడని సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా సినిమా ఉంటుంది’అని చెప్పారు. నాగవంశీ మాటలతో బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఓ తెలుగు దర్శకుడు.. ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్‌నే నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?)'ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడు. మా(మూవీ ఆర్టిస్ట్ అసియేషన్) జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికింది. అతడు లీడర్‌గా మారిన నటుడు కాదు. అయితే ఈ విషయంలోకి తనను ఓ నటుడు/రాజకీయ నాయకుడు అనవసరంగా లాగారు' అని పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ పెట్టింది.పూనమ్ ట్వీట్ పెట్టింది కానీ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇకపోతే గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌పై తాను మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేశానని, కానీ అప్పుడు సరిగా పట్టించుకోలేదనే నిజాన్ని బయటపెట్టింది. తాజా ట్వీట్ చూస్తే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌నే పరోక్షంగా టార్గెట్ చేసిందా అనిపించింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?) -
సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సమంత రీసెంట్ టైంలో సినిమాలు చేయనప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నీమధ్య తెలంగాణ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా సామ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అదలా ఉంచితే చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చింది. ఆలియా భట్ 'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి హాజరైన సామ్‌పై త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)సమంత ఏం చెప్పింది?సినిమా టీమ్‌కి విషెస్ చెప్పింది. అలానే హీరోయిన్లుగా తమకు ఎంతో బాధ్యతగా ఉంటుందని, ప్రతి అమ్మాయి కథలో వాళ్లే హీరోలని చెప్పింది. చాలారోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని అభిమానులని ఉద్దేశించి చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులు తన కుటుంబమని క్లారిటీ ఇచ్చింది.త్రివిక్రమ్ టీజింగ్ఇదే ఈవెంట్‌కి హాజరైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఏ మాయ చేశావే' సినిమా నుంచే సమంత హీరో అని, ఆమెకు వేరే ఏం అక్కర్లేదని, ఆమెనే ఓ శక్తిని ఆకాశానికెత్తేశాడు. ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా రండి, మీరు చేయడం లేదని మేం రాయడం లేదు, మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తామని అన్నారు. 'అత్తారింటికి దారేది' లాగా సమంత కోసం హైదరాబాద్ రావడానికి దారేది అని అనలేమో అని త్రివిక్రమ్ చెప్పారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్) -
త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా అటు త్రివిక్రమ్, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆమె వరుస ట్వీట్స్ చేస్తారు. వారిద్దరు కలిసి తనకు చేసిన అన్యాయం గురించి బహిరంగానే వెల్లడిస్తారు. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని, వారి కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై అటు త్రివిక్రమ్ కాని, ఇటు పవన్ కాని స్పందించలేదు కానీ, ఇండస్ట్రీ ప్రముఖుల్లో కొంతమంది పూనమ్‌కి నిజంగానే అన్యాయం జరిగిందని అంటారు. మరికొంతమంది ఏమో ఫేమ్ కోసమే వారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. సినీ నిర్మాత చిట్టి బాబు కూడా పూనమ్ ట్వీట్స్‌పై స్పందించాడు. (చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా)తాజాగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..‘పూనమ్ ఫిర్యాదు ఇవ్వమని పిలిస్తే రాదు కానీ.. పిచ్చి పిచ్చిగా ట్వీట్స్ వేస్తారని’అన్నారు ఏం జరిగిందో కమిటికీ ఫిర్యాదు చేస్తే తెలుస్తుంది కానీ..ఇలా ట్వీట్స్ చేస్తే ఏం లాభం’అని చిట్టి బాబు అన్నారు. నిర్మాత వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ మండి పడింది. మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? అని నిలదీసింది.‘మీరు త్రివిక్రమ్‌ను ప్రశ్నించరు.. ప్రశ్నించలేరు.. నేను మీలా వెన్నుమొక లేని దాన్ని అయితే కాను. నా మీద కామెంట్ చేయడం కాకుండా.. త్రివిక్రమ్‌ను అడిగే దమ్ముందా? అంటూ నిర్మాతను ప్రశ్నించింది. దీనిపై చిట్టి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. It’s trivikram Srinivas who doesn’t and will not be questioned- I am not spineless like these men who run their show to project their fake masculinity- I dare him to question the director rather than commenting on me .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2024 -
త్రివిక్రమ్ పై పిర్యాదు చేశా.. పరిష్కారం ఏది ..?
-
KSR Live Show: దర్శకుడు త్రివిక్రమ్ పూనమ్ కౌర్ ట్వీట్
-
పూనమ్ కౌర్ ట్వీట్ పై కొమ్మినేని కామెంట్స్..
-
ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి ఉన్నదే. వీలు చిక్కినప్పుడల్లా గురూజీపై పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్.. తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌తో ఈమెకు ఏం గొడవ ఉందో తెలీదు గానీ ఎప్పటికప్పుడు వీళ్లని విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?)ఇది పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.మరి పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో?(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో కొడుకులు అరెస్ట్)Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
జూ. ఎన్టీఆర్ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన స్టార్స్ వీరే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు టాలీవుడ్ చిత్రపరిశ్రమ నుంచి పలువురు ముందుకొస్తున్నారు. మొదట జూనియర్ ఎన్టీఆర్ రూ. 1 కోటి సాయం ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.సిద్దూ జొన్నలగడ్డ సాయంటాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా సాయం ప్రకటించారు. వరద బాధితులకు తన వంతుగా రూ. 30 లక్షలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అందిస్తున్న డబ్బు కొంతమందికైనా ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని ఆయన కోరారు.త్రివిక్రమ్, నాగవంశీ సాయంభారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు. తెలంగాణకు రూ. 25లక్షలు, ఏపీకి రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు తమను ఎంతగానో కలచి వేశాయని వారు చెప్పుకొచ్చారు. బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక నోట్ విడుదల చేశారు.ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ప్రకటించారు. ఆపై యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి కూడా'సార్', 'తొలిప్రేమ' సిినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు వెెంకీ అట్లూరి కూడా తన వంతు సాయం అందజేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.5 లక్షలు విరాళమిచ్చినట్లు ప్రకటించాడు.మహేశ్ బాబు కోటి రూపాయల విరాళం..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరద బాధితుల సాయం అందించేందుకు ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆపదలో ఉన్న వారిని అదుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మహేశ్ బాబు కోరారు.In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024హీరోయిన్ విరాళం.. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించారు. తన వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు ట్వీట్ చేశారు. త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి…— Ananya Nagalla (@AnanyaNagalla) September 3, 2024 హీరో నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదల వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.50 లక్షలు విరాళం అందించారు. రెండు రాష్ట్రాల్లో అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
తారక్ కథతో వస్తున్న బన్నీ.. మైథాలజీ మూవీతో మాంత్రికుడు...
-
Trivikram : అల్లు అర్జున్ తో అదిరిపోయే మూవీ పిక్స్..|
-
తిరుమలకు కాలినడకన చేరుకున్న టాలీవుడ్ డైరెక్టర్..!
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తన భార్య సౌజన్యతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. -
ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్న త్రివిక్రమ్.. కారణాలు ఇవే...
-
నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే అంతకు మించిన ఇబ్బందులు ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది మోసపోతుంటారు కూడా. ఇప్పుడు అలాంటి ఓ అనుభవాన్నే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా బయటపెట్టింది. ఎన్టీఆర్ 'అరవింద సమేత' విషయంలో తనని ఎలాంటి పరిస్థితి ఎదురైందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈషా చెప్పుకొచ్చింది.'త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో మీరు ఒకరు అని అన్నారు. అయితే నేను మెయిన్ లీడ్‌గా మాత్రమే చేద్దామనుకుంటున్నానని, తొలుత నో చెప్పేశాను. కానీ త్రివిక్రమ్ కథ మొత్తం చెప్పి లీడ్స్‌లో ఓ క్యారెక్టర్ అని అన్నారు. సరే చూద్దాములే అని ఓకే చెప్పేశా. షూటింగ్‌కి వెళ్లే ఒక్క రోజు ముందు ఓకే చెప్పాను. మొదటిసారి నేను పెద్ద సినిమా చేశా. దాంతో అంతా కొత్తగా అనిపించింది. షూటింగ్ జరిగినన్నీ రోజులు హ్యాపీగానే ఉంది.'(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.. జీవితంలోకి స్పెషల్ పర్సన్)'అలానే సినిమా విడుదలకు ముందు నన్ను సెకండ్ లీడ్‌గా అనౌన్స్ చేస్తానని అన్నారు. కానీ అలా చేయలేదు. ఒకవేళ చేసుంటే నాకు హెల్ప్ అయ్యేది. అయితే ఈ విషయం మా మేనేజర్ని కూడా అడిగా. కనుక్కోమన్నాను. షూట్ అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. కానీ నేను హ్యాపీగా లేను. సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను. కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో తీసేశారు. ఎన్టీఆర్‌తో సాంగ్ అన్నారు. అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ సినిమాకు నాకున్న హ్యాపీనెస్ ఒకటే తారక్, త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం' అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈ ఇంటర్వ్యూలో ఎవరి గురించి నెగిటివ్‌గా చెప్పలేదు గానీ హీరోయిన్ ఛాన్స్ అని తనని మోసం చేసిన విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది. చాలా సినిమాల విషయంలో ఎలాంటివి జరుగుతున్నాయో బయటపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గుంటూరు కారం'లో కూడా ఇలానే మీనాక్షి చౌదరికి రెండే సీన్లలో చూపించారు. బహుశా ఈమెకి కూడా ఈషా లాంటి అనుభవమే ఎదురై ఉంటుంది.(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ) -
పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఫిక్సయిపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మంచి హై ఇచ్చే విజువల్స్.. అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ఇప్పుడు బన్నీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ 'పుష్ప' మూవీని 2021 చివర్లో కేవలం తెలుగు వరకే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు 'పుష్ప' దెబ్బకు మెంటలెక్కిపోయారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) దీంతో 'పుష్ప 2' కాస్త లేట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి శ్రీను.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడనిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే పుకార్లకు చెక్ పడినట్లయింది. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన త్రివిక్రమ్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) Wishing an amazing actor with great perseverance & dedication to achieve anything on and off screen, the stylish Icon Star of Indian cinema and National Award winner, Our @alluarjun garu a very Happy Birthday ❤️#HappyBirthdayAlluArjun 🌟 Can't wait to work with you again, sir.… pic.twitter.com/BhLfbaynwB — Haarika & Hassine Creations (@haarikahassine) April 8, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన 'గుంటూరు కారం'.. ఆ వర్షన్లో మరింత క్రేజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం సుమారు రూ. 280 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. మహేశ్ కెరీర్లోనే మూడోసారి రూ. 200 కోట్ల మార్క్‌ను ఈ చిత్రంతో అందుకున్నారు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా సూపర్ కొట్టి టాలీవుడ్లో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు ప్రిన్స్ మహేశ్.. ఆయన క్రేజ్‌కు తగ్గట్లే గుంటూరు కారం ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో నేడు ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. హిందీలో క్రేజ్ టాలీవుడ్ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్,తారక్,రామ్ చరణ్ వంటి స్టార్స్ బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మహేశ్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన SSMB29 చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళితో ప్లాన్ చేశారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ ద్వారా 'గుంటూరు కారం' చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా చూసిన ఆయన అభిమానులు ఇప్పుడు హిందీలో మరోసారి రమణగాడిని చూస్తున్నారు. Hindi version of Kurchi madathapetti song from Guntur Kaaram ain’t bad 🪑🔥 @MusicThaman#GunturKaaramOnNetflix pic.twitter.com/76YumZyRCy — Satvik (@SatvikV1) February 8, 2024 Dum Masala Biryani Erra Kaaram Ara kodi ready ga pettukoni full ga enjoy chese Guntur Kaaram vacchesindhi 🤤 Guntur Kaaram, now streaming on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflix pic.twitter.com/ROm8FYyjcU — Netflix India South (@Netflix_INSouth) February 8, 2024 -
‘గుంటూరు కారం’ ఎఫెక్ట్.. ‘గురూజీ’కి బన్నీ షాక్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్ అయినా హిట్ లేకుంటే అంతే సంగతి. ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చాయంటే ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేస్తుంది. డైరెక్టర్ల విషయం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓ స్టార్ హీరోతో తీసిన సినిమా ఫ్లాప్ అయిందంటే.. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఖాతాలోకే వెళ్తుంది. అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రారు. తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో అదే జరిగినట్లు తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్ గురుజీపై బాగానే పడినట్లు అనిపిస్తుంది. (చదవండి: భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్.. ఎన్టీఆర్‌కి పెద్ద భారమే!) ఈ చిత్రం విడుదలకు ముందు.. అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ ప్రకటించాడు. అయితే సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ‘గుంటూరు కారం’ చిత్రానికి కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ.. సినిమాకు తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వినిపిసించింది. ఇందులో త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. మహేశ్ కారణంగా సినిమాకు ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చాయని సినీ పండితులు అభిప్రాయపడ్డారు. మహేశ్ లాంటి స్టార్ హీరోని త్రివిక్రమ్ సరిగా వాడుకోలేకపోయాడని నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇవన్నీ చూసిన బన్నీ.. తివ్రిక్రమ్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?) పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి-అల్లు అరవింద్ కాంబోలో సినిమా రాబోతుందని గీతా ఆర్ట్స్ అఫిషియల్‌గా ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ అల్లు అర్జున్‌తోనే బోయపాటి సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బన్నీకి బోయపాటి కథ వినిపించాడట. ఆయన ఓకే చెప్పిన తర్వాత గీతా ఆర్ట్స్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అంట్లీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే బోయపాటి మూవీ ఉంటుందని మరో ప్రచారం సాగుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు సందీప్ రెడ్డి వంగాతో కూడా బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇవన్నీ వరుసగా రాబోతున్న చిత్రాలు. ఈ లెక్కన చూస్తే.. ఇప్పట్లో త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా రావడం కష్టమే. -
గుంటూరు కారం కలెక్షన్స్.. ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తొలి వారంలో రూ. 212 కోట్లు వసూల్ చేసినట్లు అఫీషియల్‌గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రాంతీయ భాషలో మాత్రమే విడుదలైన గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. రిజనల్ ఫిల్మ్ పరంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. మహేశ్ బాబు కెరీర్లో రూ.200+ గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా రూ. 100 కోట్ల క్లబ్లో మహేశ్ బాబు చిత్రాలు ఐదు ఉన్నాయి. టాలీవుడ్లో ఈ రికార్డ్ మహేశ్ పేరుతో మాత్రమే ఉంది. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 sets the BOX-OFFICE ablaze!! 🔥🕺#GunturKaaram grosses over a SMASHING 𝟐𝟏𝟐 𝐂𝐑 Worldwide in it’s 1st Week ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 (Highest for a regional cinema)💥💥 Watch #BlockbusterGunturKaaram at… pic.twitter.com/KyXpMsIwHf — Haarika & Hassine Creations (@haarikahassine) January 19, 2024 -
తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్ రాకపోవచ్చు: మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్ న్యూస్ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు. అతడు, ఖలేజా లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. మహేశ్‌బాబు మాస్ యాక్షన్, డ్యాన్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో నెక్లెస్ పాటతో పాటు కుర్చి సాంగ్ ఉండాలని ముందే నిర్ణయించుకున్నామని మహేశ్ అన్నారు. (చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్.. అసలు విషయం బయటపెట్టిన సూపర్ స్టార్) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ మరిన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ‘గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్ సాంగ్స్ ఉండాలని నేను, త్రివిక్రమ్ ముందుగానే అనుకున్నాం. ఈ మూవీ తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు. బహుశా ఇదే నా చివరి తెలుగు చిత్రం కావొచ్చు. అందుకే మాస్ సాంగ్స్ ఉండాలనుకున్నాం. ఈ మూవీలోనే నా డ్యాన్స్ అంతా చూపించాలనుకున్నాను. కుర్చి సాంగ్.. నా కెరీర్ బెస్ట్ కావాలని శేఖర్ మాస్టర్‌తో చెప్పాను. ఆయన అలాంటి స్టెప్పులే కంపోజ్ చేశాడు. శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేయడానికి మొదట్లో టెన్షన్ పడ్డాను. నెక్లెస్ పాట షూటింగ్ అయితే ముందే పూర్తి చేశాం. ఆ తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. కుర్చి సాంగ్ రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు(డిసెంబర్ 22)పూర్తి చేశాం. చాలా అద్భుతంగా అనిపించింది. నా కెరీర్ బెస్ట్ సాంగ్ ఇదే’ అని మహేశ్ అన్నారు. ప్రస్తుతం మహేశ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో ‘ఇదే ఆఖరి సినిమా కావచ్చు అంటే ఆయన ఇకపై తెలుగు సినిమాలు చేయరా’ అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ చెప్పింది నిజమే! మహేశ్‌బాబు మరో రెండు,మూడేళ్ల వరకు తెరపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే తన తదుపరి సినిమా రాజమౌళితో చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు రాజమౌళి. ఈ సినిమా రిలీజ్‌కి దాదాపు రెండేళ్లు పట్టొచ్చు. ఆ తర్వాత మహేశ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం గ్యారెంటీ. దీంతో మహేశ్ బాబు తదుపరి ఎలాంటి చిత్రం చేసినా.. అది పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉన్న చిత్రాలే చేయాలి. తెలుగు సినిమాల మాదిరి ఆ చిత్రాల్లో మాస్ సాంగ్స్, డ్యాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అది దృష్టిలో పెట్టుకోనే.. గుంటూరుకారంలో తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులను నచ్చే సాంగ్స్, స్టెప్పులు ఉండేలా మహేశ్ జాగ్రత్త పడొచ్చు. -
వరసగా మూడోసారి అలా డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్!
తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ కొందరి దర్శకులకు కూడా కల్ట్ అభిమానులున్నారు. వీళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమా తీస్తే చాలు దాన్ని రిపీట్స్‌లో చూడొచ్చు. ఆయన పెన్ పవర్ అలాంటిది. కానీ తాజాగా 'గుంటూరు కారం' మూవీతో వచ్చిన గురూజీ.. చాలా డిసప్పాయింట్ చేశాడని మూవీ చూసిన చాలామంది అంటున్నారు. ఇదే టైంలో ఓ విషయంలోనూ త్రివిక్రమ్ పట్టుతప్పుతున్నట్లు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్‌కి థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి) డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడనే పేరుంది. అయితే గత మూడు సినిమాల నుంచి మాత్రం సెకండ్ హీరోయిన్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా అనే సందేహం వస్తుంది. ఫస్ట్ 'గుంటూరు కారం'నే తీసుకుందాం. ఇందులో రాజీ అనే మరదలి పాత్ర కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే ఈమెతే ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి రిపీటైంది. 'అరవింద సమేత'లో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రంలోనూ నివేదా పేతురాజ్‌ని సెకండ్ హీరోయిన్గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్‌కి గుర్తింపు అయితే ఏం రాలేదు. అయితే ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పేరున్న హీరోయిన్లని కాకుండా కాస్త గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిల్ని తీసుకుంటే సరిపోతుందిగా అని సగటు సిని ప్రేమికుడు అనుకుంటున్నాడు. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) -
Guntur Kaaram: అభిమానులతో కలిసి సినిమా చూసిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది ఆయన మాస్ మసాలా సినిమాతో వస్తున్నాడంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం నేడే(జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుకు తగ్గట్లే సినిమాలో ఘాటు ఎక్కువే ఉందనుకున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో టాక్ చూస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే కనిపిస్తోంది. మిక్స్డ్ టాక్.. మహేశ్ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు కానీ కొన్నిచోట్ల సీన్లు, డైలాగులు పేలవంగా ఉండటం, కథ కూడా బలహీనంగా ఉండటంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ సహా ఫైటింగ్ సీన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ తన ఫ్యామిలీతో కలిసి శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో గుంటూరు కారం సినిమా చూశాడు. భార్య నమ్రత, తనయుడు గౌతమ్, కూతురు సితార అతడి వెంట ఉన్నారు. థియేటర్లో మహేశ్‌బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్, రచయిత వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు.. మహేశ్‌తో కలిసి థియేటర్లో సినిమా వీక్షించారు. థియేటర్లో అభిమాన హీరో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషంతో కేకలు పెట్టారు. అయితే మహేశ్, త్రివిక్రమ్, వంశీ ముఖాల్లో చిరునవ్వే కనిపించడం లేదని అభిమానులు ఫీలవుతున్నారు. మహేశ్‌ను అలా దిగాలుగా చూడలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. Superstar @urstrulyMahesh at sudarshan 35mm 😍🔥 #GunturKaaram pic.twitter.com/vbVwvWVWo8 — Mahesh Fans Campaign ™ (@ursMFC) January 12, 2024 Actor Mahesh Babu Arrived At Sudharshan Theatre For Watching His Movie With Fans#GunturKaaramOnJan12th #GunturKaaram #MaheshBabu pic.twitter.com/njfKeMAX29 — Pawar Dilip Kumar Choudhary (@DkpChoudhary) January 12, 2024 చదవండి: గుంటూరు కారం ఓటీటీ పార్ట్నర్ ఇదే! సినిమా సత్తాను బట్టి.. -
‘గుంటూరు కారం’ మైండ్ బ్లోయింగ్ మేకింగ్ HD స్టిల్స్ (ఫొటోలు)
-
గుంటూరు కారం మేకింగ్ వీడియో రిలీజ్.. అదిరిపోయిన యాక్షన్ సీన్స్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం రుచి ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు మహేశ్.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్ రికార్డులకెక్కింది. తాజాగా గుంటూరు కారం చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను యూనిట్ షేర్ చేసింది. షూటింగ్ సెట్స్‌లో మహేశ్ ఎంతో ఫన్నీగా నవ్విస్తూ ఉన్న విజువల్స్ అందరినీ మెప్పిస్తాయి. రెండురోజుల క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గుంటూరు కారంతో ఈసారి గట్టిగా కొడతామంటూ మహేశ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రతి సినిమాకు తన తండ్రి ఫోన్ చేసేవారని, ఈసారి తన తండ్రి పాత్రను ప్రేక్షకులు పోషించాలని స్టేజీ మీద ఎమోషనల్ అయ్యాడు. ఇకపై తనకు తల్లయినా, తండ్రయినా ప్రేక్షకులే అంటూ రెండు చేతులెత్తి మొక్కాడు. దీంతో ఎప్పటికీ మహేశ్‌కు అండగా తాము ఉంటామంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన గుంటూరు కారం మేకింగ్ వీడియోను మీరు చూసేయండి. -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
Guntur Kaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ వచ్చేసింది
ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నా.. అందరి కన్ను గుంటూరు కారం చిత్రం మీదే ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న విడుదల కానున్న గుంటూరు కారం చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్‌తో ఆ అంచనాలను త్రివిక్రమ్ మరింతగా పెంచేశాడు. సినిమాలో మాస్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్ విడదలకు ముందే గుంటూరు కారం ట్యాగ్‌ను ఆయన ఫ్యాన్స్ ట్రెండింగ్‌లో పెట్టేశారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హైదరబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఫ్యాన్స్ కొంతమేరకు నిరాశపడ్డారు. అదే వేడుకలో ట్రైలర్‌ను కూడా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ అనుమతి రాకపోవడంతో తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. సినిమా కలెక్షన్స్‌పై కూడా ఇప్పటికే నిర్మాత నాగవంశీ వైరల్ కామెంట్ చేశారు. అన్ని సెంటర్స్‌లలో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్‌కు దగ్గరగా ఉంటామని ఆయన పేర్కొన్నాడు. నైజాంలో ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికే భారీగా థియేటర్స్ దక్కాయి. రీజనల్ సినిమాతో మహేష్ బాబు వంద కోట్ల ఓపెనింగ్స్ రాబడతాడు అంటూ ఆయిన ఫ్యాన్స్ ఫుల్ క్లారటీతో ఉన్నారు .అమెరికాలో గుంటూరు కారం సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు.RRR తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేది గుంటూరు కారం సినిమానే. -
గురూజీ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే బొమ్మ బ్లాక్‌బస్టరే! వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి ఆదరణ పొందాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో ఓ సినిమా వస్తోంది. అదే గుంటూరు కారం.. రిలీజ్‌కు ముందే మంటెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఆ విషయంలో సమర్థుడు అయితే ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఒరిజినల్‌గా రాసుకోలేదని, యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ కొట్టాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. 'ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడు. కొందరు గుడ్డిగా ఆయన్ను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అదెందుకో నాకిప్పటికీ అర్థం కాదు మరి' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చివరగా సినిమాలో కనిపించింది అప్పుడే! ఈ ట్వీట్‌కు గురూజీ థింగ్స్ అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఇకపోతే మాయాజాలం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం ఇలా అనేక చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో -
Guntur Kaaram Songs: ‘కుర్చీని మడతపెట్టి..’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరుకారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. (చదవండి: 'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?) తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘కుర్చీని మడతపెట్టి..’ అనే మాస్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ పాట ప్రోమోని నిన్న విడుదల చేయగా..ఎంత వైరల్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే పద ప్రయోగాన్ని వాడుకొని తమన్ బాణీ కట్టాడు. రామ జోగయ్యశాస్త్రి సాహిత్యం అదించారు. ప్రముఖ సింగర్స్ సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటలో అదిరిపోయే బీట్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి. ‘రాజమండ్రి రాగ మంజరి... మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి" మరియు "తూనీగ నడుములోన తూటాలెట్టి ... తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి... మగజాతినట్టా మడతపెట్టి..’ వంటి పదాలు మరియు పదబంధాలు 80ల నాటి సూపర్‌స్టార్ కృష్ణ గారి యొక్క క్లాసిక్ మాస్ చిత్రాలను గుర్తు చేస్తున్నాయి. పాట మధ్యలో 'ఏంది అట్టా సూత్తన్నావ్. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్. రాసుకోండి.... మడతెట్టి పడేయండి' అంటూ మహేశ్‌బాబు డైలాగ్ చెప్పడం విశేషం. మహేశ్‌బాబు, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదిరిపోయిన ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి. -
Guntur Kaaram Movie HD Stills: మహేష్‌బాబు మాస్ జాతర ‘గుంటూరు కారం’ మూవీ స్టిల్స్
-
ఆ సమయంలో చాలా కంగారుగా అనిపించింది: గుంటూరు కారం హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఖలేజా తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో మరో నటి మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ మహేశ్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన రియల్ లైఫ్‌లోనూ సూపర్‌స్టారేనని అన్నారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. సెట్లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. నేను సెట్లోకి వచ్చిన మొదటి రోజు కాస్తా టెన్షన్ పడ్డా. ఫస్ట్ షాట్‌లోనే ఆయనతో పని చేశా. అప్పుడు చాలా కంగారుగా అనిపించింది. అప్పుడు వెంటనే మహేశ్‌బాబు.. నో టెన్షన్.. కాస్త సమయం తీసుకోండి. ఏం కాదంటూ చాలా కూల్‌గా మాట్లాడారు' అని తెలిపింది. ఆయనతో కలిసి నటించడం చాలా సరదాగా అనిపించింది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు. View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
త్రివిక్రమ్‌కు రూ.6 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో!
టాలీవుడ్లో కొందిమంది డైరెక్టర్లకి మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనను సామాన్యులే కాదు స్టార్ హీరోలు సైతం అభిమానిస్తారు. ఆయనలోని దర్శకత్వ ప్రతిభ కంటే ఆయన కలం నుంచి జారువాలే పదునైన సంభాషణలకు ఫ్యాన్స్ ఎక్కువ. తనదైన మాటలతో ప్రేక్షకులను నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు.. ఆలోచింపజేస్తారు. అందుకే ఆయనను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ‘మాటల మాంత్రికుడు’అని పిలుచుకుంటారు. ఆయన బర్త్‌డే(నవంబర్ 7)ను ప్రతి యేటా పండుగలా జరుపుకుంటారు. ఈ సారి కూడా త్రివిక్రమ్ బర్త్‌డే గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. పలువురు సినీ తారలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ హీరో మాత్రం బర్త్‌డే విషెస్‌తో పాటు ఖరీదైన బహుమతిని అందజేశాడట. ఏంటా బహుమతి? త్రివిక్రమ్ బర్త్‌డే సందర్భంగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’నుంచి ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడా పాట మహేశ్ ఫ్యాన్స్ ఫెవరేట్ ట్రాక్‌గా మారింది. ఈ సంగతి పక్కకి పెడితే.. బర్త్‌డే రోజు త్రివిక్రమ్‌కి ఖరీదైన బహుమతి అందిందనే రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్‌కి చెందిన ఓ ఆగ్రహీరో రూ.6 కోట్ల విలువ చేసే ప్రాపర్టీనీ బహుమతిగా అందించాడట. ఇప్పుడీ గిప్ట్ రూమర్ టాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. ఎవరా హీరో? త్రివిక్రమ్ కొంతకాలంగా టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోకి సపోర్ట్‌గా ఉంటున్నాడు. ఆ హీరో చేయాల్సిన సినిమాలకు స్టోరీస్, డైరెక్టర్స్‌ను సెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే పుట్టిన రోజు కానుకగా ఆ హీరో త్రివిక్రమ్‌కు రూ. 6 కోట్ల విలువ చేసే బహుమతిని అందించారట. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. -
త్రివిక్రమ్ బర్త్ డే కి 6కోట్లు గిఫ్ట్..హీరో ఎవరంటే..
-
'ధమ్ మసాలా' వచ్చేసింది.. చూసేయండి'!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబో వస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే కావడంతో సాంగ్ విడుదల చేశారు. గంటూరు కారం మూవీ నుంచి ధమ్ మసాలా అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. Witness the ULTIMATE EXPLOSION of SUPER 🌟 @urstrulyMahesh in MASS SWAG 🔥💥#GunturKaaram First Single ~ #DumMasala Out Now 🔥 - https://t.co/egSALSY4Xt A @MusicThaman Musical 🎹🥁 ✍️ @ramjowrites 🎤 #SanjithHegde #JyotiNooran#Trivikram #thaman @sreeleela14… pic.twitter.com/0nku6bu9P8 — Guntur kaaram (@GunturKaaram) November 7, 2023 -
'అందుకే ఆయనను మాటల మాంత్రికుడు అంటారు'
టాలీవుడ్ డైరెక్టర్స్‌లో ఆయన స్టైలే వేరు. ఆయన పేరు వింటే చాలు సినిమాల్లోని డైలాగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. అందరిలా కేవలం డైరెక్షన్ చేయడమే కాదు.. కథ, మాటల రచయితగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో కొత్త ట్రెండ్ చేసిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమాల్లో పాత్రల కంటే.. ఆయన రాసిన మాటలు, డైలాగ్స్ మాత్రమే మనకు గుర్తుంటాయి. జంధ్యాల, ముళ్లపూడి లాంటి మహానుభావుల్లాగే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఉందని నిరూపించాడు. తన సినిమాల్లో తన పంచ్ డైలాగ్‌లతో నిజ జీవితంలోని సంఘటలను సున్నితంగా తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనకే సొంతం. రచయితగా మొదలైన సినీ ప్రస్థానం.. స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన తీరు చూస్తే ఆయనేంటో అర్థమవుతుంది. అంతలా టాలీవుడ్లో తన డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తోన్న ఆ లెజెండరీ డైరెక్టర్ ఎవరో కాదు.. మన త్రివిక్రమ్ శ్రీనివాసుడే. నువ్వే నువ్వే చిత్రం నుంచి ఇప్పటి గుంటూరు కారం వరకు ఆయన ప్రయాణం మరిచిపోలేని జ్ఞాపకం. 1971 నవంబరు 7 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన ఆకెళ్ల నాగ శ్రీనివాస్.. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌గా పేరు సంపాదించారు. స్వయంవరం సినిమాతో రచయితగా త్రివిక్రమ్ జర్నీ మొదలైంది. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు కథ, మాటల రచయితగా పనిచేశారు. అయితే తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మహేశ్ బాబుతో తీసిన అతడు సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవ లాంటి హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో గుంటూరు కారం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. నవంబర్ 7న మాటల మాంత్రికుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన కలం నుంచి దూసుకొచ్చిన టాప్ టెన్ డైలాగ్స్ గురించి తెలుసుకుందాం. త్రివిక్రమ్ టాప్ డైలాగ్స్ 1. సన్ ఆఫ్ సత్యమూర్తి - 'మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి... కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్' 2. జులాయి - 'మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు.. మనకి రాని పని ట్రై చేయకూడదు' 3. జులాయి - 'లాజిక్‌లు ఎవరు నమ్మరు.. అందరికి మ్యాజిక్లే కావాలి.. అందుకే మన దేశంలో సైంటిస్ట్‌ల కన్నా బాబాలే ఫేమస్' 4. నువ్వు నాకు నచ్చావ్ - 'మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి.. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.' 5. అల వైకుంఠపురములో- 'నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. కానీ చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది' 6. నువ్వే నువ్వే - 'సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు.. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు' 7. అరవింద సమేత వీరరాఘవ - 'పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?' 8. జల్సా - 'అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే.. మనం చేసే యుద్ధానికి అర్థమేముంది' 9. అత్తారింటికీ దారేది - 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు' 10. తీన్ మార్ - 'కారణం లేని కోపం.. గౌరవం లేని ప్రేమ.. బాధ్యత లేని యవ్వనం.. జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం' -
Birthday Special: మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
గుంటూరు కారం ఫస్ట్ సాంగ్.. మహేశ్ ఫ్యాన్స్‌కు మసాల బిర్యానీ రెడీ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానుల జాతర నేటి నుంచి మొదలైంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చింది. నిజానికి ఈ ప్రోమో ముందే లీక్ అయింది. కొన్ని సెకెండ్ల బిట్ బయటకు వచ్చేసింది. అఫీషియల్‌గా విడుదలైన సాంగ్ ప్రోమోను వింటే మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ మసాలా బిర్యానీనే అనేలా ఉంది. తమన్-త్రివిక్రమ్ కాంబోలో మ్యూజిక్ ఎలా ఉటుందో ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దిరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ సెన్సేషన్ అని తెలిసిందే. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) 'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' అంటూ మొదలైన సాంగ్‌లో.. బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు ఉన్నాయి. అయితే ఇది జస్ట్ ట్రాక్ బీట్ మాత్రమే.. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రోమో కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నా తమన్ మ్యూజిక్ దుమ్ములేపాడు అని చెప్పవచ్చు. మంచి మసాలా బిర్యానీ తింటూ సాంగ్‌ను ఎంజాయ్ చేయవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. ఇటీవల చాలా సినిమాల నుంచి థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు తరచు విమర్శలతో పాటు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఇలాంటివి ఏమీ తమన్ లెక్కచేయడు. నిజానికి తన వ్యవహారధోరణి, తత్వాన్ని బట్టి ఆలోచిస్తే తన మీద సోషల్ మీడియాలో ఏదో ప్రచారం జరిగితే డిస్టర్బ్ అయ్యే కేరక్టర్ కాదు… సోషల్ మీడియా తీరూతెన్నూ మొత్తం తెలిసినవాడే… అవసరమైతే సోవాట్ అని తేలికగా తీసుకోగలడు. గుంటూరు కారంతో ట్రోలర్స్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. -
గుంటూరు కారం నుంచి దీపావళి ధమాకా
-
పాన్ ఇండియా హీరోయిన్ తో అల్లు అర్జున్ తను ఎవరంటే..!
-
త్రివిక్రమ్ పెద్ద డైరెక్టర్ అంటే నేను ఒప్పుకోను..!
-
ఫోటోలో ఎవరో తెలుసా..? డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న టాప్ దర్శకుడి కుమారుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్‌లోని టాప్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టడమే కాకుండా బాక్సాఫీసుల వద్ద కలెక్షన్స్ సునామీని తెచ్చిన డైరెక్టర్‌గా ఆయనకు ఎనలేని గుర్తింపు ఉంది. అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు, ఇటు మాస్‌ను మెప్పించగల దర్శకుడు ఆయన. కొద్దిరోజుల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె సితార ఎంటర్టైన్మెంట్తో కలిసి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతల భార్యలు కెమెరా ముందుకు రావడమే అరుదు! అయితే సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఆమె కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగానే దుల్కర్ సల్మాన్- మీనాక్షి చౌదరి కాంబోలో ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మాతగా సౌజన్యనే తెరకెక్కిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్-సౌజన్య కుమారుడు రిషీ మనోజ్ దర్శకుడిగా పరిచయం కానున్నట్లు ధృవీకరించారు. ఇప్పటికే రిషీ పూర్తి స్థాయిలో ట్రైన్ అయి ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్‌తో పాటు అతని కుటుంబం ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. ఇటీవలే సౌజన్య తన సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా రావడం ప్రారంభించారు. అయితే, ఇదిగో త్రివిక్రమ్ కుమారుడు రిషీ తాజా చిత్రం అంటూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు రాజా చెంబోలు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని షేర్ చేశాడు. ఆ ఫోటోలో సౌజన్య కూడా ఉన్నారు. ముగ్గురూ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ డైరెక్టర్ పిల్లలు మాత్రం పెద్దగా సినీ ఇండిస్ట్రీలో అడుగుపెట్టన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. టాలెంట్ ఉంటేనే ఈ పరిశ్రమలో సక్సెస్ అవుతారు. మొదటి అడుగు వరకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. ఆపై కొనసాగాలంటే తనలోని సత్తాను నమ్ముకోవాల్సిందే. తండ్రి సలహాలు సూచనల మేరకు త్రివిక్రమ్ కుమారుడు ఇండస్ట్రీలో సక్సెస్ కొడతారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. -
'షరతులు వర్తిస్తాయి' లాంటి సినిమాలను ఆదరించాలి: త్రివిక్రమ్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ...మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని.. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని.. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి తెలిపారు. కుటుంబ విలువలను తెలియజేసే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర) అలాగే చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు’అని అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు కుమార స్వామి అన్నారు. -
‘శాంతల’ పాటను విడుదల చేసిన త్రివిక్రమ్
అమెజాన్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో హీరో కుమార్తెగా నటించిన అశ్లేషా ఠాకూర్ టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాంతల’. త్రివిక్రమ్ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీహల్ హీరోగా నటించాడు. డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నుంచి మొదటి పాటను తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రం లోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికీ మా కృతఙ్ఞతలు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చిత్రికరించం. నవంబర్ 3వ తారీఖున విడుదల అవుతుంది’ అని తెలిపారు. ‘సీతారామం’ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. -
'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు'
పవన్‌కల్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అజ్ఞాతవాసి' 2018 జనవరిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కింది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు లేక కొన్నిచోట్ల మొదటి రెండురోజుల్లోనే ఈ సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అలా ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వచ్చాయి. కొన్ని చోట్ల తమన ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కూడా రోడ్డెక్కారు. ఆ సినిమా తర్వాత పవన్ కూడా సుమారు 3 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు. మళ్లీ 2021లో 'వకీల్‌సాబ్'గా కనిపించాడు. దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకున్నారు. అజ్ఞాతవాసి పోయాక ఆ బాధలోనే టీమ్ రెండు నెలలు గడిపేసిందని ఆయన చెప్పాడు. భారీ అంచనాలతో జనవరిలో రిలీజైన ఈ సినిమా ఫలితం చూశాక తప్పెక్కడ జరిగిందో ఎవరికీ అంతు చిక్కని పరిస్థితి అయింది. అలా ఒకరకమైన డిప్రెషన్లో ఉండగా తమకు జూ. ఎన్టీఆర్ ధైర్యం ఇలా ఇచ్చారని నాగవంశీ చెప్పాడు. 'వెంటనే ఆ మూడ్‌లో నుంచి బయటికి వచ్చేయమని, ఇదే సంవత్సరం మనం హిట్టు కొడుతున్నామని చెప్పి 'అరవింద సమేత వీర రాఘవ'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా త్రివిక్రమ్- తారక్ కాంబోలో తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాం. దీంతో హారిక & హాసినీ ఇండస్ట్రీలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది.' అని ఒక జాతీయ వెబ్ వీడియో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ పంచుకున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ' 2018 అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్) ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా తమకు ఇలాంటి సంఘటనలో ఎన్నో ఎదరయ్యాయని అన్నీ బహిరంగంగా చెప్పుకోలేమని ఆయన చెప్పాడు. నాగవంశీ సోదరి హారిక నిర్మించిన ‘మ్యాడ్’ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దీనిని తెరకెక్కించారు. -
సర్కార్ లాంటి పాత్రలో కనిపించాలని కోరిక ఉంది
-
మీనాక్షి చౌదరినే కావాలని పట్టుబట్టిన త్రివిక్రమ్ భార్య
త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అతను ఇటీవల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. సినిమాకు సంబంధించిన పలు పనుల్లో అతని భార్య సాయి సౌజన్య కూడా చురుకుగా పాల్గొంటున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో కూడా సౌజన్య పాల్గొంటోంది. ఇప్పుడు, ఆమె సితార ఎంటర్టైన్మెంట్తో కలిసి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ని నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: రవితేజ, విజయ్ దేవరకొండ ఎవరైతే ఏంటి.. శ్రీలీల పరిస్థితి ఇదీ!) అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని టీమ్ ఎంపిక చేసింది. మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం కోసం త్రివిక్రమ్ కాంపౌండ్‌లోకి ప్రవేశించింది. ఆమె ఈ చిత్రంలో ద్వితీయ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ధనుష్ తొలి తెలుగు స్ట్రైట్ మూవీ అయిన 'సార్'ను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పుడు దుల్కర్ సినిమాను కూడా ఆయన తెరకెక్కించనున్నారు. లక్కీ భాస్కర్లో దుల్కర్‌కు సరిజోడిగా మీనాక్షి అయితే బాగుంటుందని సౌజన్య పట్టుబట్టి మరీ తీసుకున్నారట. ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోందని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సతీమణి సౌజన్యతో మీనాక్షి చౌదరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
'గుంటూరు కారం' పోస్టర్.. మహేశ్ వేసుకున్న షర్ట్ ధరెంతో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. క్రేజీ లుక్‌లో మహేశ్ బాబు అందులో మహేశ్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. లుంగీ, షర్ట్ ధరించి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బీడీ కాలుస్తూ క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పోస్టర్లో మహేశ్ బాబు వేసుకున్న షర్ట్ ఫ్యాన్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇది ఏ బ్రాండ్? దీని ధరెంత అంటూ నెట్టింట సెర్చ్ చేశారు. సాధారణంగానే సెలబ్రిటీలు వాడిన కాస్ట్యూమ్స్, వాచెస్, షూస్ వంటి వస్తువులను ట్రై చేయాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. మహేశ్ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా.. ఈ క్రమంలో మహేశ్ వేసుకున్న క్యాజువల్ షర్ట్ గురించి గూగుల్ చేయగా వారికి దిమ్మతిరిగే బొమ్మ కనిపించింది. ఎందుకంటే గుంటూరు కారం లేటెస్ట్ పోస్టర్లో మహేశ్ వేసుకున్న షర్ట్ ధర అక్షరాల రూ.74,509. ఫ్యాషన్ ఫార్‌ఫెచ్ R13కు చెందిన బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్‌లో మహేశ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే ఇంత సింపుల్ షర్ట్ అంత కాస్ట్లీనా అని కొందరు షాక్ అవుతుంటే, మహేశ్ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. #HBDSuperstarMahesh 🥳💥#GunturKaaram pic.twitter.com/2mf80iWpgQ — Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023 -
గుంటూరు కారం కోసం మహేష్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!
ప్రిన్స్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ‘గుంటూరు కారం’ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తీయాలనకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల దీనిని రీజనల్ మూవీగానే 2024లో సంక్రాతి కానుకగా విడుదల చేయనున్నారు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్) ఈ సినిమా కోసం మహేష్ రూ. 78 కోట్ల రూపాయలతో పాటు జిఎస్టిని అందుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ మన ఇండియా హీరోలు సుమారు వంద కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ మహేష్ బాబు రీజనల్ సినిమా కోసమే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో గుంటూరు కారం సినిమాను నిర్మించనున్నారు. (ఇదీ చదవండి: వాళ్లు అన్యాయం చేస్తే.. ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) రీజనల్ సినిమాలకు సంబంధించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వారి జాబితాలో మహేష్ బాబు టాప్‌లో ఉంటారు. ఈ సినిమా తర్వాత SS రాజమౌళి యొక్క SSMB 29 పాన్ ఇండియా సినిమా హిట్ట్ అయితే ఆయన రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే. -
ప్రభాస్ కథతో బన్నీ కొత్త సినిమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అది కూడా నాలుగోసారి. అధికారికంగా లాంచ్ జరిగిపోయింది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ కాంబో.. ఈసారి ఎలాంటి సినిమా చేయబోతున్నారు? ఎప్పుడు మొదలవుతుంది? థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? లాంటి ప్రశ్నలు.. అభిమానుల బుర్రలు తొలిచేస్తున్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహాభారతం ఆధారంగా 'పుష్ప' సినిమాతో బన్నీ.. అనుహ్యంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం 'పుష్ప 2' చేస్తున్నాడు. తర్వాత ఎవరితో కలిసి పనిచేయబోతున్నాడా అనే ప్రశ్నకు తెరదించాడు. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్ తోనే వరసగా నాలుగోసారి కలిసి వర్క్ చేయబోతున్నాడు. గత మూడు సినిమాలని కమర్షియల్ గా తీసి వీళ్లు హిట్స్ కొట్టారు. ఈసారి మాత్రం మహాభారతాన్ని స్పూర్తిగా తీసుకుని, ఓ సోషియో ఫాంటసీ కథని గురూజీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!) ప్రభాస్ కథతో అయితే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చాలా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది దర్శకులు అతడికి స్టోరీలు వినిపించారు. అలా త్రివిక్రమ్ కూడా ఓ కథని ప్రభాస్ కి చెప్పారట. కానీ అది సమయం కుదరక, ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు దాన్నే కొన్ని మార్పులు చేసి, బన్నీకి వినిపించగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ ప్రయోగం గతంలో 'బద్రీనాథ్' సినిమాతో అల్లు అర్జున్.. ఫాంటసీ స్టోరీ ప్రయోగం చేశాడు. కానీ ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కావడం, అతడికి పురాణాలు, ఇతిహాసాలపై మంచి పట్టుండటం అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న 'పుష్ప 2' పూర్తయ్యేసరికి మరో 7-8 నెలలు పట్టొచ్చు. అంతలో త్రివిక్రమ్ 'గుంటూరు కారం' పూర్తి చేస్తారు. అంటే 2024 వేసవిలో అలా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టి, 2025 లేదా 2026లో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) (ఇదీ చదవండి: బేబమ్మ రెచ్చిపోవడానికి ఇదా అసలు కారణం?) -
ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!
పవన్ 'బ్రో' సినిమా.. టీజర్ తాజాగా రిలీజైన విషయం తెలిసిందే. ఆయన మేనల్లుడు తేజ్ కూడా ఇందులో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించాడు. అంతా బాగుంది కానీ ఈ టీజర్ విషయంపై నెట్టింట్లో ట్రోల్ కూడా చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..) అదేంటంటే.. 'బ్రో' టీజర్లో పూజా హెగ్డే గురించి. టీజర్ ప్రారంభంలో ఓ కమర్షియల్ యాడ్‌లో పూజా హెగ్డే కనిపిస్తుంది. ఆమెను యాడ్ చేయడానికే.. టీజర్‌ను లేట్‌గా రిలీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో పలువురు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ టీజర్లో పెట్టడానికేనా .. మహేశ్ 'గుంటూరు కారం' నుంచి పూజను తీసేశావ్ అంటూ త్రివిక్రమ్‌పై సెట్టైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియా అంతా ఇదే చర్చ జరుగుతుంది. పూజా లేకుండా త్రివిక్రమ్ సినిమాలు అస్సలు చేయలేరని, ఎక్కడో చోట ఆమె ఉండాల్సిందే అంటూ వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం అసలే త్రివిక్రమ్‌కు పూజా లక్కీ హీరోయిన్ అంటూనే ఇదేం ట్రోలింగ్ బ్రో.. ఇకనైనా ఆపేయండని సోషల్‌మీడియాలో కోరుతున్నారు. (ఇదీ చదవండి: శృంగారం గురించి బోల్డ్ కామెంట్ చేసిన సీతారామం బ్యూటీ) -
బ్రహ్మానందం కోసం మహేష్ బాబు ఏం చేశారంటే..?
తెలుగు సినీ ప్రపంచంలో హాస్యనటుడు బ్రహ్మానందానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన హాస్యం వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన.. తెరపై కనిపించినప్పుడల్లా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అలా గిన్నిస్‌బుక్ రికార్డును కూడా కైవసం చేసుకున్న లెజండరీ కమెడియన్ ఆయన. బ్రహ్మానందం స్క్రీన్‌పై కనిపిస్తే, ఎవరైనా నవ్వడం అనేది కామన్ పాయింట్. బ్రహ్మీతో టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్‌లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు) అలాంటి వాటిలో బ్రహ్మానందం-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో అంటే వెరీ స్పెషల్. త్రివిక్రమ్ నుంచి వచ్చిన చాలా సినిమాల్లో బ్రహ్మానందం కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా మహేష్‌బాబు సూపర్ హిట్ సినిమా 'అతడు'లో బ్రహ్మనందం చేసిన కామెడీ సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాత్రకు సంబంధించిన మీమ్స్ వాడుతూనే ఉంటారు. బ్రహ్మానందం-త్రివిక్రమ్ కాంబో నుంచి వచ్చిన ఖలేజా, జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా అదే రేంజ్లో మెప్పిస్తాయి. కానీ 'అరవింద సమేత, అఆ, అజ్ఞాతవాసి' చిత్రాలలో బ్రహ్మీ కనిపించలేదు. వారి కాంబినేషన్లో వచ్చే సినిమాలు ఎవరికైనా ఇప్పటికీ అలా చూస్తూ చూడాలనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ) తాజాగా టాలీవుడ్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. 'గుంటూరు కారం' సినిమాలో బ్రహ్మానందం సందడి చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో మళ్లీ ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందట. కానీ ఈ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి బ్రహ్మీకి ఓ పాత్ర క్రియేట్ చేయాలని ప్రిన్స్ మహేష్ సూచించారట. దీంతో త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. బ్రహ్మీ కోసం ఆడియన్స్‌ను మెప్పించే ఓ పాత్రను డిజైన్ చేశారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దీంతో మహేష్ ఫ్యాన్స్ కూడా గుంటూరు కారంతో పాటు గుంటూరు కామెడీ కూడా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. -
గుంటూరు కారం నుండి థమన్ అవుట్.. అరటిపండు పోస్ట్ క్లారిటీ
-
తమన్‌పై మళ్లీ కాపీ మరకలు..‘గుంటూరు కారం’ బీజీఎం అక్కడిదేగా!
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ముందు వరుసలో ఉంటారు. కోటి, మణిశర్మ లాంటి సీనియర్ సంగీత దర్శకుల తర్వాత టాలీవుడ్‌ని దేవిశ్రీ ప్రసాద్ కొన్నాళ్లపాటు ఏలాడు. దేవిని మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేరు అనుకుంటున్న సమయంలో తమన్ పుంజుకున్నాడు. ముఖ్యంగా అల..వైకుంఠపురములో’ తర్వాత తమన్ రేంజ్ మారిపోయింది. డీఎస్పీతో పోటీ పడడమే కాదు అతనిపై పై చేయి సాధిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ తమన్‌పై మాత్రం కాపీ ముద్ర చెదరడం లేదు. తన సినిమాలతో పాటు పక్కవాళ్ల సినిమాల్లోని పాటలను, బీజీఎంను కాపీ చేస్తాడని తమన్‌పై ఆరోపణలు ఉన్నాయి. (చదవండి: పవిత్రతో పరీక్షలు రాయించిన నరేశ్.. నెటిజన్స్ ప్రశంసలు) ఆ మధ్య రవితేజ క్రాక్‌కి సినిమాకు అదిరిపోయే సంగీతం అందించాడు తమన్. అయితే అందులో ‘బంగారం’సాంగ్‌ని ఓ యూట్యూబ్ సాంగ్‌ని నుంచి కాపీ కొట్టాడని ఆరోపణలు వినిపించాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’కి కూడా తమన్ అద్భుతమైన బీజీఎంని అందించాడు. కానీ అందులో జై బాలయ్య సాంగ్ ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్‌ని పోలి ఉందని నెటిజన్స్ విమర్శించారు. ఇక ఇప్పుడు మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ విషయంలో కూడా తమన్ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. (చదవండి: గుంటూరు కారం ఘాటు చూపిస్తానంటున్న మహేశ్‌బాబు) సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న(మే 31)మహేశ్- త్రివిక్రమ్‌ల కాంబోల తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. అయితే ఈ వీడియోకి తమన్ ఇచ్చిన బీజీఎం కాపీ అని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని ఓ ట్యూన్‌ని బీజీఎంగా వాడేశాడని ఆరోపిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆ చిత్రంలో అరబిక్ స్టయిల్ లో ఓ సాంగ్ ఉంటుంది. అందులో దేవీ ఇచ్చిన ట్యూన్స్‌ని కాపీ చేసి ‘గుంటూరు కారం’కి బీజీఎంగా మలిచాడని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక ట్యూన్ అచ్చం ఇలానే ఉందంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు. మరి దీనిపై తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. Rey teddy https://t.co/G7wOSqMy93 pic.twitter.com/qQkcVEOnHw — Ponile Mowa (@ponilemova) May 31, 2023 Ennada teddy idhi 🚶🏻🫠?#SSMB28MassStrike #ssthaman #MRtollywoodmahesharrival #MaheshBabu𓃵 pic.twitter.com/bxrc1mLLF7 — chandu kandregula (@Chandu_CS12) May 31, 2023 -
ఏందట్టా చూస్తున్నావు, బీడీ త్రీడీలో కనపడ్తుందా?.. మహేశ్‌బాబు వేరే లెవల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు గుంటూరు కారం అని టైటిల్ ఖరారు చేశారు. నేడు (మే 31) కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో వందలాది మంది అభిమానుల సమక్షంలో టైటిల్, టీజర్ అట్టహాసంగా విడుదల చేశారు. ఇందులో మహేశ్ స్వాగ్ అదిరిపోయిందంతే.. 'ఏందట్టా చూస్తున్నావు, బీడీ త్రీడీలో కనపడ్తుందా?' అంటూ హీరో బీడీ ముట్టించుకున్న తీరుకు ఫ్యాన్స్ విజిల్స్ వేయడం ఖాయం. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల ముఖ్యపాత్రలో నటించనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం హారిక అండ్ హాసిన బ్యానర్లో నిర్మితం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. కాగా అతడు, ఖలేజా తర్వాత గుంటూరు కారంతో మహేశ్- త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి జతకట్టారు. ఇది మహేశ్‌బాబు కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతోంది. -
ఇది మీ కోసమే నాన్న.. మహేశ్ బాబు స్పెషల్ ట్వీట్, పోస్టర్ వైరల్
సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు(మే 31). ఈ సందర్భంగా మహేశ్ బాబు, త్రివిక్రమ్ కొత్త సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్నహ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. (చదవండి: నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా..హీరో అశ్విన్ కన్నీంటి పర్యంతం) SSMB28 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్ని నేడు విడుదల చేశారు. ఇందులో మహేశ్ తలకు ఎర్ర టవల్ చుట్టుకొని ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. ‘ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ గారి లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ’అంటూ కార్నర్లో కృష్ణగారి ఫోటోని పెట్టారు. పోస్టర్ చూస్తుంటే ఫైట్ సీన్‌కి సంబంధించినది అని తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్‌ని ఈ రోజు సాయంత్రం రివీల్ చేయనున్నారు. కాగా, ఈ పోస్టర్ని మహేశ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘ఈరోజు మరింత ప్రత్యేకమైంది. ఇది నీ కోసమే నాన్న’ అని క్యాప్షన్ ఇచ్చాడు. మహేశ్ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి. Today is all the more special! This one's for you Nanna ❤️❤️❤️ pic.twitter.com/HEs9CpeWvY — Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2023 -
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..మహేశ్ బాబు ఊరమాస్ లుక్ పోస్టర్ రిలీజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ను అందించారు మేకర్స్. మహేశ్ బాబు లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, తలకు రిబ్బన్ కట్టుకొని ఊరమాస్ లుక్‌లో మహేశ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన పూజాహెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్‌ను ఈనెల 31న రివీల్ చేయన్నునారు. కాగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విభిన్న రకాల టైటిల్స్ తెరపైకి వచ్చినప్పటికీ ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’ టైటిల్స్‌లో ఏదొకటి ఖరారు అయ్యే చాన్స్ ఉందని సమాచారం. The Thunderous #SSMB28MassStrike arrives in just 2 Days 🔥🔥 Our Beloved SUPER FANS to launch at the theatres near you on May 31st 🤩 Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/3FT4JfQp8o — Naga Vamsi (@vamsi84) May 29, 2023 -
మరో డైరెక్టర్ తో పాన్ ఇండియా ప్రాజెక్టు
-
త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్!
కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఒక వ్యక్తిని పొగడాలన్నా లేదా విమర్శించాలన్నా.. ట్వీటర్‌ని ఆయుధంగా వాడతారాయన. ఆ మధ్య డైరెక్టర్ హరీశ్ శంకర్, బండ్ల గణేశ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక తన ట్విటర్ అస్త్రాన్ని త్రివిక్రమ్‌పై ప్రయోగించాడు బండ్లన్న. అయితే అక్కడ త్రివిక్రమ్ పేరుని ప్రస్తావించకపోయినా.. ‘గురుజీ’ అంటూ పరోక్షంగా ఆయన్ను విమర్శించారు. (చదవండి: అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా!) అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేశ్ తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అని ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్‌గా మారింది. ‘గురూజీని కలవండి. ఖరీదైన బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక మరో నెటిజన్ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్‌ప్లే రాసి అసలు కథను షెడ్‌కు పంపిస్తాడని టాక్ ఉంది. నిజమేనా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా బండ్ల తనదైన శైలీలో స్పందించాడు. . ‘‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌ను చాలామంది గురూజీ అని పిలుచుకుంటారు. దీంతో బండ్ల ట్వీట్ త్రివిక్రమ్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ 😝 https://t.co/P6J844y0fa — BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023 -
త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా సంయుక్తా మీనన్!
మలయాళ భామ సంయుక్తా మీనన్‌కు తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది. భీమ్లా నాయక్‌తో టాలీవుడ్‌కు పరిచమైన ఈ భామ వరుస హిట్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష హిట్ అవ్వడంతో సంయుక్తకు గెల్డెన్ లెగ్ అనే పేరుంది. దీంతో తెలుగులో సంయుక్తా మీనన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. దీంతో ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకుందట ఈ మల్లు బ్యూటీ. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: వెకేషన్లో దిల్ రాజు కుమార్తె.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్! ఈ సినిమాలో బన్నీకి జోడీగా సంయుక్తను ఫిక్స్ చేశారట డైరెక్టర్ త్రివిక్రమ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు ఫిల్మీదునియాలో జోరుగా ప్రచారం జరగుతుంది. ఈ క్రమంలో మరోసారి త్రివిక్రమ్-సంయుక్తా మీనన్‌ల రిలేషన్‌పై నెట్టింట పుకార్లు మరోసారి తెరమీదకి వచ్చాయి. చదవండి: టార్చర్.. రోజూ కొట్టేవాడు, పార్కింగ్ ప్లేస్‌లో పడుకునేదాన్ని: నటి -
మహేశ్ బాబు సినిమాలో నా రోల్ చాలా వైల్డ్‌గా ఉంటుంది : జగపతి బాబు
హీరో జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సైతం అలరిస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో SSMB28 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. అద్భుతమైన పాత్రలను క్రియేట్ చేసే దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. గతంలో ఆయన దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటించాను. చదవండి: అప్పుడే ఓటీటీలోకి లారెన్స్ 'రుద్రుడు' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే.. ఇప్పుడు దానికంటే భిన్నంగా, వైల్డ్‌గా పవర్‌ఫుల్‌గా SSMB28లో కనిపిస్తాను అంటూ వెల్లడించారు జగపతి బాబు. ఈ సినిమాతో పాటు పుష్ప-2, సలార్ వంటి పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తున్నారు జగపతి బాబు. అంతేకాకుండా బాలీవుడ్‌లోనూ మరో మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. -
NTR30 చిత్రం ప్రారంభం.. ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ (ఫొటోలు)
-
మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆరోజే సినిమా రిలీజ్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా పడితే అభిమానులకు పూనకాలు రావాల్సిందే! వీరి కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు రాగా ముచ్చటగా మూడోసారి జతకట్టారిద్దరూ. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో సూపర్ స్టార్ చేతిలో సిగరెట్ పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి ‘అడవిలో అర్జునుడు’, ‘ఆమె కథ’, ‘అమ్మ కథ’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 22న ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం నడిచింది. కానీ అది నిజం కాలేదు. మరి ఈ చిత్ర టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి! The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH — Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023 -
SSMB28: మహేశ్ మూవీకి తప్పని లీకుల బెడద.. కన్ప్యూజన్లో ఫ్యాన్స్!
సెల్‌ఫోన్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత షూటింగ్ లోకేషన్స్ నుంచి లీక్స్ కామన్ అయిపోయాయి. చిన్న బడ్జెట్ సినిమాల సంగతి పక్కన పెడితే..భారీ బడ్జెట్ సినిమాలు ఈ లీకుల బెడద నుంచి తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నించినా...అవి ఆపటం ఎవరి వల్ల కావటం లేదు. పుష్ప2, సలార్ సినిమా షూటింగ్ లోకేషన్స్ నుంచి పోటోలు , వీడియో క్లిప్స్ లీక్స్ అయ్యాయి. ఇప్పుడు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న #ssmb 28 మూవీ నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ లీక్ అయింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో మహేష్ బాబు #ssmb 28 ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. పుష్ప 2, సలార్ మూవీ షూటింగ్ లోకేషన్స్ నుంచి ఆ క్లిప్స్ ఎవరు లీక్ చేశారో తెలియదు. కానీ #ssmb 28 మూవీలోని మహేష్ బాబు లుక్ ఎవరు లీక్ చేశారో తెలిసిపోయింది. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించనున్నాడు. గతంలో జయరామ్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురంలో కూడా నటించాడు.ఇప్పుడు #ssmb 28 లో మహేష్ తో కలిసి నటించనున్నాడు. యాక్టర్ జయరామ్, మహేష్ బాబు తో కలిసి నటించటం ఇదే మొదటిసారి. ఇక తను #ssmb 28లో నటిస్తున్నట్లుగా జయరామ్ కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు త్రివిక్రమ్, మహేష్ బాబుతో కలిసి దిగిన పోటో తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. అలాగే ధియేటర్స్ లో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను...ఇప్పుడు ఆయన కొడుకు మహేష్‌తో కలిసి నటించటం సంతోషంగా వుందంటూ రాసుకొచ్చాడు. జయరామ్ తను మహేశ్ తో నటిస్తున్న సంగతి చెప్పడం ఏమో గానీ....నెటిజన్స్ అయితే #ssmb 28లో మహేశ్ బాబు ఫస్ట్ లుక్ లీక్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించినప్పుడు మహేశ్ కు కొంచెం హెయిర్ ఎక్కువగానే ఉంటుంది. ఆ లుక్ త్రివిక్రమ్ మూవీ కోసమే అని అందరికీ అర్ధమైంది. ఇప్పుడు జయరామ్ సెట్స్ నుంచి మహేష్ తో దిగిన పోటో షేర్ చేయటంతో...లుక్ పై మహేష్ ప్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. దసరా సీజన్ లో రిలీజ్ చేయాలను కుంటున్న ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ ఎండింగ్ కల్లా పాటలు, ఒక ఫైట్ మినహా మిగిలిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియా తెగ డిస్కషన్ నడుస్తోంది. అయోధ్యలో అర్జునుడు, ఆరంభం, అతడే తన సైన్యం వంటి టైటిల్స్ పరిశీలన ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూడు టైటిల్స్ కాకుండా కొత్త టైటిల్ ను ఉగాది రోజు అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.మహేశ్‌బాబు కూడా ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు.ఈ సినిమా తర్వాత మహేశ్.. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాడు. పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించబోయే ఈ సినిమా ఓపెనింగ్ ఆగస్ట్ లో జరుగుతుందనే మాట టి.టౌన్ లో వినబడుతోంది. View this post on Instagram A post shared by Jayaram (@actorjayaram_official) -
SSMB 28 సెట్లో సందడి చేయనున్న శ్రీలీల! కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్లో ఈ మూవీ సెట్‌పైకి వచ్చింది. ఇటీవలె హైదరాబాద్ రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తదుపరి అప్డేట్ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. SSMB 28కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ రేపటి(ఫిబ్రవరి 28) నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం త్రివిక్రమ్ ఓ భారీ సెట్ ప్లాన్ చేశాడట. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ హైదరాబాద్ శివారులోని ఓ ఇంట్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందట. ఈ షెడ్యూల్లో మహేశ్ బాబు హీరోయిన్ పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్‌తో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా జాయిన్ కానుందట. ఇక్కడ హీరోహీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అంతేకాదు ప్రకాశ్ రాజ్-మహేశ్ మధ్య ఉండే సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్‌తో శ్రీలీల SSMB 28 సెట్లో తొలిసారి అడుగుపెట్టబోతుంది. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ కాగా ఇందులో పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ కాగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు మరో బాలీవుడ్ నటి ఇందులో సందడి చేయనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సెకండ్ హాఫ్‌లో చాలా కీలకంగా ఉంటుందట. అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనువిందు చేయనుందని టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. -
SSMB 28: మహేశ్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ!
‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, బాలా, బధాయి దో’ వంటి చిత్రాలతో బాలీవుడ్ ఆడియన్స్‌ని అలరించిన హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ద్వారానే భూమి టాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారని టాక్. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం భూమి ఫెడ్నేకర్ని సంప్రదించారట. ఇది కానిస్టేబుల్ పాత్ర అని, సెకండాఫ్‌లో ఈ పాత్ర వస్తుందని వినికిడి. మరి.. ఈ చిత్రంలో ఈ పాత్ర ఉందా? ఉంటే.. భూమి ఫెడ్నేకర్నే చేస్తారా? లేక వేరే తార సీన్లోకి వస్తారా? వెయిట్ అండ్ సీ.. -
మహేశ్‌ను తారక్ ఫాలో అవుతున్నాడా? లేక తారక్‌ను మహేశ్ ఫాలో అవుతున్నాడా
మహేష్‌ను తారక్ ఫాలో అవుతున్నాడో, లేక తారక్‌ను మహేష్ ఫాలో అవుతాడో తెలియదు కాని, ఈ ఇద్దరి కెరీర్ టర్న్ తీసుకునే సినిమాలు మాత్రం ఈ ఏడాదే పట్టాలెక్కనున్నాయి. మరో విధంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు ఒక లెక్క్, డిసెంబర్ నుంచి మరో లెక్క్. అదేంటిటది డిసెంబర్ నుంచి ఏం జరగబోతోంది అంటారా.. అయితే ఈ స్టోరీ చూడండి. మహేష్ బాబు రాజకుమారుడు మూవీ నుంచి, ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం వరకు, మహేష్ ఫిల్మ్ జర్నీ ఒక లెక్కలో సాగింది. కానీ డిసెంబర్ నుంచి మాత్రం మహేష్ లైఫ్ మారిపోనుంది. పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోవాల్సి వస్తుంది.ఇంతకీ డిసెంబర్ స్టోరీ ఏంటి అంటే, రాజమౌళి మేకింగ్‌లో మహేష్ నటించే , యాక్షన్ అడ్వెంచర్ మూవీ, అదే ఇండియానా జోన్స్ లాంటి సినిమా, డిసెంబర్ నుంచే పట్టాలెక్కనుంది. తారక్ స్టూడెంట్ నంబర్ వన్ నుంచి, ఇప్పుడు తెరకెక్కే కొరటాల మూవీ వరకు, తెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించాడు. అయితే డిసెంబర్ నుంచి మాత్రం, తారక్ కూడా పూర్తి యాక్షన్ హీరోగా మారాల్సి ఉంటుంది. తారక్ ప్రశాంత్ నీల్ మూవీలో పూర్తిస్థాయి డైనమిక్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా డిసెంబర్ నుంచే షూటింగ్ ప్రారంభించుకోనుంది. మొత్తంగా 2023 డిసెంబర్ ఈ ఇద్దరి హీరోల కెరీర్ చాలా కీలకం. అయితే మహేష్ కంటే ముందే తారక్ నటించే యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు కారణం ప్రశాంత్ నీల్ ఫాస్ట్ మేకింగ్. ఇక రాజమౌళి సంగతి సరేసరి. మహేష్ తో మూవీని ఎప్పటికి కంప్లీట్ చేసి తీసుకొస్తాడు అనేది ఆయన చేతుల్లో కూడా ఉండదు. -
మహేశ్ బాబుకు ఆగస్ట్ సెంటిమెంట్.. ఈ సారి వర్కౌట్ అయ్యేనా?
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్ట్ లోనే రిలీజ్ చేస్తామని సహ నిర్మాత నాగవంశీ గతంలోనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే మాటపై ఉన్నాడు. మహేష్ బాబు న్యూ మూవీ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ లోనే ప్రేక్షకుల తీసుకువచ్చేందుకుగట్టిగానే షూటింగ్స్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు. దాదాపు పది కోట్లతో ఇంటి సెట్ వేస్తున్నారు. త్వరలో ఇదే సెట్లో షూటింగ్ జరగనుంది. అయితే సెంటిమెంట్ కోసమే ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. మహేశ్ బాబు నటించిన చిత్రాలన్నీ ఆగస్ట్‌లో మంచి విజయం సాధించాయి. 2004లో ఆగస్ట్ 18న అర్జున సినిమా విడుదలైన హిట్ టాక్ని సంపాదించుకుంది. 2005 ఆగస్ట్ 10న ‘అతడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత చాలా కాలానికి 2015 ఆగస్ట్ 7న శ్రీమంతుడు విడుదలైంది. ఈ సినిమా చిన్న సైజ్ బాక్సాఫీస్ సునామిని తీసుకొచ్చింది.సెంటిమెంట్ పరంగా చూసుకుంటే మహేశ్‌కు, ఆగస్ట్ బాగా కలిసొచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా రిలీజ్ తో ఈ సెంటిమెంట్ మరింత బలపడనుంది. -
బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. ఆ స్టార్ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా?
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుసుకున్న బండ్ల గణేష్ తన స్పీచులతోనే సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఏ అంశంపైన అయినా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటపెడుతుంటాడు. అలా తరచూ తన ట్వీట్స్‌తో ఆటం బాంబ్స్ పేలుతుంటాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల చేసిన ఓ ట్వీట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆయన చేసిన ఈ ట్వీట్ ఓ స్టార్ డైరెక్టర్ ఉద్దేశించేనా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బండ్ల చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడుగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా’ అంటూ ఫైర్ ఎమోజీని జత చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే బండ్ల ఎవరి మీదో ఫుల్ ఫైర్‌లో ఉన్నాడని అర్థమవుతుందో. ఇక ఆయన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు కదా? అన్న అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ మధ్య నటుడు పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ ఈవెంట్‌కు బండ్ల గణేష్‌ను పిలవలేదని, దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తనని మూవీ ఫంక్షన్‌కు రాకుండా అడ్డుకున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడినట్టుగా ఓ ఆడియో లీక్ కాగా.. అది తనది కాదని బండ్ల అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా..🔥 — BANDLA GANESH. (@ganeshbandla) February 16, 2023 -
పవన్ సినిమా పనుల్లో త్రివిక్రమ్.. మహేష్ ఫ్యాన్స్ పరేషాన్
-
ఆ హీరోయిన్ కు 'ఐ లవ్ యు' చెప్పిన త్రివిక్రమ్.. వీడియో వైరల్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచులకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి త్రివిక్రమ్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోలీవుడ్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక తన స్పీచ్‌లో మూవీటీంపై ప్రశంసలు కురిపించిన త్రివిక్రమ్.. హీరోయిన్ సంయుక్త గురించి మాట్లాడుతూ.. అందరి ముందే ఆమెకు 'ఐ లవ్ యు' చెప్పేశారు. దీంతో ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. దాంతో ‘లేదండి బాబూ.. పూర్తిగా చెప్పేది వినండి.. కంగారు పడకండి అంటూ కాస్త కవర్ చేశారు త్రివిక్రమ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈవెంట్లో త్రివిక్రమ్ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. -
SSMB28 సెట్లో క్రికెట్ ఆడిన త్రివిక్రమ్.. వీడియో వైరల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కిస్తున్న మూవీ ఎస్ఎస్ఎమ్బీ28. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. పలు వాయిదాల అనంతరం జనవరిలో ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ మూవీని ప్రకటించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లేటు అయ్యిందని, ఎప్పడు పూర్తి చేస్తారంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ సెట్ త్రివిక్రమ్ టైంపాస్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. చదవండి: సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్ వారసులు.. ఎందుకంటే దీనిపై మహేవ్ ఫ్యాన్స్ కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఎప్పుడూ పనితో బిజీగా ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే ఎస్ఎస్ఎమ్బీ28 సెట్లో యాక్షన్, కట్ అంటూ మైక్ పట్టుకోవాల్సిన ఆయన బ్యాట్ పట్టుకుని కనిపించాడు. మూవీ టీంతో కలిసి క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ షూటింగ్ సెట్లో కాస్తా బ్రేక్ తీసుకుని టీంతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘రంగస్థలం’ మహేశ్‌తో పాటు ఇతర సహాయ నటీనటులు కనిపించారు. చదవండి: వామ్మో.. చిరు వాడే వాచ్ అంత కాస్ట్లీనా! ధరెంతో తెలుసా? కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా. ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల మరో హీరోయిన్గా చేయనుంది. అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సక్సెస్ ట్రాక్‌లో ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. Trivikram Garu Playing Cricket at #SSMB28 Set in Break😂❤ pic.twitter.com/fuHBhIT8po — Nikhil_Prince💫 (@Nikhil_Prince01) February 1, 2023 -
భారీ ధరకు మహేశ్ సినిమా ఓటీటీ రైట్స్.. అన్ని కోట్లా?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. అతడు’(2005), ‘ఖలేజా’ (2010 ) చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నాన్ థియెట్రికల్ హక్కులను హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సంక్రాంతి రోజునే ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెటిప్లిక్స్ రూ.80 కోట్లు చెల్లించిందట. అన్ని భాషలకు కలిసి ఈ భారీ మొత్తం ఇచ్చారట. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ ఏడాది దసరాకి థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
రవీంద్రభారతి : దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్యరూపకం (ఫొటోలు)
-
మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల? కారణం ఇదే!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా SSMB28. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈమెతో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పడు శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చేసుకున్న ఒప్పందాల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల ఇంత పెద్ద ఆఫర్‌ను వదులుకోవడం ఆమె బ్యాడ్ లక్ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. -
అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్న మహేష్ బాబు & త్రివిక్రమ్
-
త్రివిక్రమ్ తో మహేష్ సినిమాపై బయపడుతున్న ఫ్యాన్స్
-
మహేశ్ బాబు SSMB28 లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇదే విషయంపై మూవీ టీం సైతం క్లారిటీ ఇచ్చింది. జనవరిలో ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక మూవీ టీంతో కలిసి మహేశ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. All set to shoot! With heightened spirit and great energy #SSMB28 will go on sets from January, non-stop! Stay-Tuned, More SUPER-EXCITING updates coming your way soon! 🌟✨ SUPERSTAR @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod #ASPrakash @NavinNooli @vamsi84 pic.twitter.com/cEjRFVsz64 — Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2022 -
ముంబయిలో బిజీగా మహేశ్ బాబు.. నమ్రత పోస్ట్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల కృష్ణ మరణం తర్వాత తొలిసారి త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబీ28 టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేశ్ సతీమణి నమ్రత ముంబయిలో ఆమె స్నేహితురాలు సాజియాను కలుసుకున్నారు. వారి ఇంట్లోనే మహేశ్ బాబు, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి రుచికరమైన ఇంటి వంటకాలను ఆస్వాదించారు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నారు. తన స్నేహితురాలు ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇన్‌స్టాలో ఆమె రాస్తూ..' నా కలల జీవితంలో కొన్ని మధుర క్షణాలు.. ఇంటి భోజనాన్ని రుచి చూపించిన సాజియాకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కనిపించనుంది. గతంలో ఆమె మహర్షి చిత్రంలో కలిసి పనిచేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో నటించనున్నారు. ఆ చిత్రానికి ఎస్ఎస్ఎంబీ29 టైటిల్ ఖరారు చేశారు. దీనిపై మహేష్ బాబు మాట్లాడుతూ..'ఈ చిత్రం గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా కల నిజమైంది. రాజమౌళితో నేను చాలా కాలంగా కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నా. చివరకు అది నెరవేరబోతోంది. ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్‌గా ఉన్నా' అని అన్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో " అతడు " సీక్వెల్
-
దుబాయ్‌లో సిట్టింగ్
మహేశ్‌బాబు–త్రివిక్రమ్–తమన్–నాగవంశీ... ఈ నలుగురూ దుబాయ్‌లో ల్యాండ్ అయ్యారు. ఎందుకంటే ఈ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ గ్యాప్‌లో దుబాయ్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ ఆరంభించారు. ఓ వారం పది రోజుల పాటు పాటల పని జరుగుతుంది. అనంతరం హైదరాబాద్ చేరుకుని చిత్రీకరణ ఆరంభిస్తారు. -
లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ధర ఎంతో తెలుసా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుతం మహేశ్‌బాబుతో SSMB28 ఓ సినిమాను చేస్తున్నారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. రీసెంట్గా త్రివిక్రమ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ లగ్జరీ కారు ధర 1.34 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వరకే ఆయన గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్నా తాజాగా మరో కొత్త కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం మహేష్‌తో సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. -
స్పెషల్ సాంగ్ కోసం భారీ రెమ్యూనరేషన్ అడుగుతున్న రష్మిక
-
మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్
-
యాక్షన్ ప్లాన్.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌కు మహేశ్!
రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవి మరణం, ఇటీవల(నవంబర్ 15) తండ్రి కృష్ణ హఠాన్మరణంతో మహేశ్ బాబు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన తివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. అతడు’(2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ వారం రోజులు షూట్ చేశారు. రెండో షెడ్యూల్ ఇటీవల ప్రారంభం కావాల్సి ఉండగా.. కృష్ణ మరణంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబరు 8న ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ముందు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట త్రివిక్రమ్. తండ్రి మరణంతో మహేశ్ పుట్టేడు శోకంలో ఉన్నప్పటికీ.. నిర్మాతల కోసం తిరిగి షూటింగ్లో పాల్గొనడంపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా షూటింగ్ పునఃప్రారంభానికి సహకరించడం.. సినిమాపై ఆయనకు ఉన్న శ్రద్ద, గౌరవాన్ని చూపిస్తోందని అభిమానులు తెలుపుతున్నారు. -
SSMB28: మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? నిర్మాత ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలె మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. అయితే రెండు, మూడు రోజుల నుంచి ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు పుకార్లు వస్తుండటంతో నిర్మాత నాగవంశీ ఈ వార్తలకి చెక్ పెట్టారు. ‘SSMB28’ సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎగ్జ్జైటింగ్ అప్డేట్స్ వస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. The second schedule of our most awaited action extravaganza #SSMB28 will begin soon. Many more exciting updates will be unveiled in upcoming days. Stay tuned! — Naga Vamsi (@vamsi84) October 31, 2022 -
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మహేష్‌బాబు.. వైరల్ అవుతున్న ఫోటో
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో మహేష్ గతంలో ఎన్నడూ చేయలేని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్న మహేశ్ తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ మహేశ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో ఆ పిక్ వైరల్‌గా మారింది. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) -
తరుణ్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
బాల నటుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకరు. మనసు మమత మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన తరుణ్ బాలనటుడిగా మూడు నంది అవార్డులు తీసుకున్నాడు. హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్నాడు. అందులో నువ్వే నువ్వే సినిమా ఒకటి. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారాడు. నువ్వే నువ్వే సినిమా రిలీజై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో తరుణ్ మాట్లాడుతూ.. 'నువ్వే నువ్వే వచ్చి 20 ఏళ్లు గడిచాయి. నాకు మాత్రం ఇప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు ఉంది. ఎప్పుడైనా బోర్ కొడితే యూట్యూబ్‌లో నా సినిమాలోని కామెడీ సీన్స్ నేనే చూసుకుంటా! త్రివిక్రమ్‌గారి విషయానికి వస్తే నా తొలి సినిమాకు ఆయన డైలాగులు రాశారు. ఆయన తొలి సినిమాకు నేను హీరోగా చేశాను. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా తనకు నేనే ఫస్ట్ హీరోను. ఇప్పటికీ నాకు బయట ఎవరు కలిసినా నువ్వే నువ్వేలాంటి సినిమా ఇంకొక్కటి చేయండి అని అడుగుతుంటారు. త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్' అని చెప్పుకొచ్చాడు. తరుణ్ మాట్లాడుతుంటే త్రివిక్రమ్ ఎమోషనలయ్యాడు. స్టేజీపైనే తన కన్నీళ్లు తుడుచుకుని నిలబడ్డాడు. చదవండి: విడాకులు వద్దనుకుంటున్న ధనుష్, హీరో తండ్రి ఏమన్నాడంటే? కంటెంటే రేవంత్ వెనకాల పరిగెడుతోంది.. -
Nuvve Nuvve@20 Years: 'నువ్వే నువ్వే’లోని ఈ డైలాగ్స్ గుర్తున్నాయా?
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2002లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో 'సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా 'నువ్వే నువ్వే' నిలిచింది. వెండి నందిని 'స్రవంతి' రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో బాగా పేలాయి. ‘నువ్వే నువ్వే’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 10) నాటికి 20 ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు.. ► అమ్మ, ఆవకాయ్, అంజలి... ఎప్పుడూ బోర్ కొట్టవు. ► ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు... పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. ► కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం. ►ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు. ►సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ►డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు. ► మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు. ►ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని... వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు. ►ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు... ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని? ►నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా? ► డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు. ►తాజ్ మహల్... చార్మినార్... నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు. ► నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. -
మహేష్‌బాబుకు మాతృ వియోగం.. ఇందిరా దేవి పార్థీవదేహానికి ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్‌పైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం మేకోవర్ కూడా అయ్యాడు మహేశ్. ఆయన న్యూలుక్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ స్టార్ట్స్ అంటూ సెప్టెంబర్ 13న సెట్స్‌లోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసింది చిత్ర బృందం. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! అయితే యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించాడట త్రివిక్రమ్. ఈ క్రమంలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని, సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాతే అంటూ తాజాగా మూవీ యూనిట్ ప్రకటన ఇచ్చింది. ఇదిలా ఉంతే రెండు, మూడు రోజుల్లోనే తొలి షెడ్యూల్ పూర్తి కావడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. దీని వెనక ఓ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ తాజా బజ్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్‌ను కావాలనే ఆపేసారంటున్నారు. ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మహేష్‌బాబు, త్రివిక్రమ్ సంతృప్తిగా లేరట. అనుకున్న విధంగా ఈ ఫైట్ సీన్లు రావడం లేదని, అందుకే షూటింగ్‌కు కావాలనే బ్రేక్ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి నిజానికి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం తొలి షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగాల్సి ఉందట. కానీ, యాక్షన్ సీన్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో ఆర్థాంతరంగా షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని సినీవర్గాల నుంచి సమాచారం. కాస్తా సమయం తీసుకుని ప్రస్తుత ఫైట్ మాస్టర్ని కొనసాగించాలా? కొత్త మాస్టర్ని తీసుకోవాలా? అనే కీలక నిర్ణయం తీసుకొనున్నాడట దర్శకుడు. ఆ తర్వాతే తిరిగి షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అందుకే దసరా వరకు త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించేవరకు వేచి చూడాల్సిందే. First schedule of #SSMB28 has been completed with some kick-ass high octane epic action scenes 🔥 Thank you @anbariv masters for amazing stunt choreography 🤗 The second schedule will start post Dussehra with our Superstar @urstrulyMahesh garu & butta bomma @hegdepooja. — Naga Vamsi (@vamsi84) September 21, 2022 -
మహేశ్ బాబు న్యూలుక్ చూశారా? షూటింగ్ ప్రారంభం
సెట్స్‌లో మహేశ్‌బాబు యాక్షన్ ఆరంభమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. నెక్ట్స్ షెడ్యూల్లో పూజా హెగ్డే జాయిన్ అవుతారట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ‘అతడు (2005)’, ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు పన్నెండేళ్ల తర్వాత రూపొందుతున్న చిత్రం ఇది. -
ఆ వార్తలో నిజం లేదు : హీరో తరుణ్
మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. (చదవండి: గుర్తుపెట్టుకో.. నీకు ఎప్పుడు అవసరమైనా నీ వెన్నంటే ఉంటా!) అయితే తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు.ఒకప్పుడు వరుస హిట్లతో సందడి చేసిన తరుణ్ కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు. అయితే ఎలా మొదలయిందో? ఎందుకు మొదలయిందో తెలియదు కానీ తరుణ్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు మొదలయ్యాయి. -
త్రివిక్రమ్ సినిమాతో హీరో తరుణ్ రీఎంట్రీ!
మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరోలు, హీరోయిన్స్‌ని తీసుకుంటాడు. తాజాగా SSMB28 సినిమా కోసం లవర్ బాయ్ తరుణ్‌ని తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వరుస పరాజయాలతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయిన తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతోనే త్రివిక్రమ్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించగా మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
షర్ట్ లేకుండా షాకిచ్చిన మహేశ్ బాబు.. క్షణాల్లో ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలను స్వయంగా మహేశ్ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ పోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా మహేశ్ తన బాడీని ఎక్స్ పోజింగ్ చేయరు. సినిమాల్లోనూ షర్ట్‌లేకుండా కనిపించాలని మేకర్స్ కోరినా మహేశ్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు. చదవండి: మహేశ్ సోదరి మంజులకు పిల్లలను కనడం ఇష్టమే లేదట.. కానీ! ఇలాంటి లుక్‌లోనూ మహేశ్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవలి కాలంలో తన లుక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు మహేశ్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేశ్ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో మహేశ్ షర్ట్ లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఫైనల్లీ.. మహేశ్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ 'లైగర్' View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
SSMB 28: మహేశ్ ఫ్యాన్స్ విజిల్ వేసే న్యూస్..
అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడో చిత్రం రాబోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు. తాజాగా ఈసినిమా నుంచి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్డేట్ వదిలింది చిత్రబృందం. సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ అలాంటివి ఏమీ రిలీజ్ చేయకుండానే ఏకంగా విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజవుతున్నట్లు వెల్లడిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. కాగా ఇది మహేశ్‌కు 28వ సినిమా. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తుండగా నవీన్ నూలి ఎడిటింగ్ చేయనున్నాడు. MAHESH BABU - TRIVIKRAM: RELEASE DATE LOCKED... One of the biggest combinations - #MaheshBabu and director #Trivikram - have finalised the release date of #SSMB28: 28 April 2023... Costars #PoojaHegde... Produced by Haarika & Hassine Creations. #SSMB28From28April pic.twitter.com/NYq0By8G69 — taran adarsh (@taran_adarsh) August 18, 2022 చదవండి: ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి ‘అమ్మానాన్నకు డేటింగ్ అంటే నచ్చదు, కానీ నాకు అలా కాదు’ -
స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు.. వైరల్ అవుతున్న ఫోటో
సూపర్‌స్టార్ మహేశ్ బాబు లేటోస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో సర్ప్రైజ్ చేస్తున్నారు మహేశ్. తాజాగా ఆయన ఓ స్టైలిష్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 'LOVING THE NEW VIBE' అనే ట్యాగ్‌లైన్‌తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ షేర్ చేసిన ఈ ఫోటో సూపర్ కూల్‌గా ఉంది. కాగా ఈ ఫోటోతో #SSMB28 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
రీఎంట్రీ తర్వాత వేణు దూకుడు.. మరో క్రేజీ ఆఫర్ కొట్టేశాడుగా?
దాదాపు పదేళ్ల గ్యాప్ అనంతరం రీఎంట్రీ ఇచ్చాడు నటుడు వేణు తొట్టెంపూడి. ‘స్వయంవరం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన వేణు తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే’ వంటి ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఇక వరుస ఆఫర్స్, హిట్స్‌తో దూసుకుపోయిన వేణును ఆ తర్వాత ఫ్లాప్‌లు వెంటాడాయి. ఇలా అడపదడప చిత్రాలు చేస్తూ వచ్చిన వేణు చివరిగా ‘రామాచారి వీడో పెద్దగూఢ’ చారి సినిమాతో తెరపై కనిపించాడు. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వేణు రీసెంట్గా ‘రామారావు ఆన్‌డ్యూటీ’తో ప్రేక్షకులను పలకరించాడు. చదవండి: సందడే సందడి.. ఈ వారం బోలెడన్ని సినిమాలు రిలీజ్! ఇక సీఐ మురళి అనే పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఇప్పుడు వేణు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు సినిమాలో ఓ కీ రోల్ కోసం చిత్ర బృందం వేణుని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సర్కారు వారి పాట మూవీతో అలరించిన మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎమ్బి 28(#SSMB28) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందే ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పైకి రానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. చదవండి: హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్ సల్మాన్ అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత కోసం త్రివిక్రమ్ వేణును ఎంపిక చేసినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వేణు-త్రివిక్రమ్‌లు స్వయంవరం చిత్రంతో ఒకేసారి వెండితెర ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరికి ఈ మూవీ తొలి చిత్రం కావడం విశేషం. ఈ సనిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. అందులోని త్రివిక్రమ్ డైలాగ్స్ ఏ రేంజ్లో పేలాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వేణు నటించిన ‘చిరునవ్వుతో’ చిత్రానికి కూడా త్రివిక్రమే మాటలు రాశారు. ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఏకంగా వేణుకి త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించే అవకాశం రావడం ఆసక్తిని సంతరించుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌కు మహేశ్ ప్యాకప్.. నెక్ట్స్ ఫిల్మ్‌పై ఫోకస్!
స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌కు ప్యాకప్ చెప్పి ఇండియాలో ల్యాండ్ అయ్యారు మహేశ్‌బాబు. గత నెల మూడో వారంలో ఫ్యామిలీతో కలిసి మహేశ్ ఫారిన్ వెకేషన్‌కు వెళ్లారు. ముందు లండన్ వెళ్లి, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో ఎక్కువ రోజులు గడిపారు. శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మహేశ్‌బాబు నెక్ట్స్ ఫిల్మ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు కొత్తగా మేకోవర్ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా) మహేశ్ గడ్డంతో ఉన్న లుక్స్ వైరల్ అవుతుండటంతో ఈ న్యూ మేకోవర్ ప్రచారానికి మరింత ఊతం లభించినట్లయింది. అలాగే ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం మహేశ్ కాస్త బరువు కూడా తగ్గుతున్నట్లుగా తెలిసింది. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కావాల్సింది. కానీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించే దిశగా తెలుగు సినిమాల షూటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలు ఓ కొలిక్కి వచ్చి, షూటింగ్‌ల బంద్‌కి ఫుల్స్టాప్ పడితే ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. -
కాళ్లకూరులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు
కాళ్ల(పశ్చిమగోదావరి): కాళ్లకూరులో వేంచేసియున్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామిని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్ ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎంతో మహిమగల కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామిని ఏటా దర్శించుకునేందుకు వస్తుంటానన్నారు. అనంతరం త్రివిక్రమ్ దంపతులను ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. -
ఆగస్ట్ నుంచి ఆగేది లేదు
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమా షూటింగ్ ఎప్పుడు ఆరంభమవుతుంది? అనే చర్చ కొన్నాళ్లుగా జరుగుతోంది. ‘అతడు, ఖలేజా’ తర్వాత మహేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్ట్‌లో ఆరంభిస్తామని ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) శనివారం తెలిపారు. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: పీఎస్ వినోద్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్. -
మహేశ్-త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ అప్డేట్ వదిలిన మేకర్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఎంబీ28 (SSMB28) అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి తీసుకురానున్నారు. మహేశ్-త్రివిక్రమ్‌లో కాంబినేషన్ అనగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా! దీంతో ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చేది ఎప్పుడెప్పుడా? అని ఫ్యాన్స్ ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ‘ఎస్ఎస్ఎంబీ28 చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అగస్ట్లో రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది’ అని మేకర్స్ ట్విటర్ వేదికగా తెలిపారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందులో మహేశ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥 The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨ Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad — Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022 -
‘ఏంటీ.. మహేశ్ సినిమాకు పూజా కండిషన్స్ పెట్టిందా?’
ప్రస్తుతం పూజా హెగ్డే వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుస ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. అయినప్పటికీ ‘బుట్టబొమ్మ’ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో జనగనమణ, మహేశ్-తివిక్రమ్ మూవీ ‘ఎస్ఎస్ఎంబీ28’తో (#SSMB28) పాటు హిందీలో సర్కస్ రెండు సినిమాలకు సంతకం చేసింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కభీ ఈథ్ కభీ దివాలీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న పూజా త్వరలో సర్కస్ మూవీ షూటింగ్లో కూడా పాల్గొనుంది. చదవండి: ఆరేళ్ల రిలేషన్.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది: ఆలియా మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో సైతం ఆమె బిజీ బిజీగా మారింది. ఈ క్రమంలో తివిక్రమ్-మహేశ్ సినిమా కూడా త్వరలో సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ మొదటి వారం నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకొనుందని సమాచారం. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమాకు పూజా పలు కండిషన్స్ పెట్టినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పూజా కేవలం 45 రోజుల కాల్షీట్ మాత్రమే కేటాయించిన్నట్లు సమాచారం. చదవండి: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు ప్రస్తుతం ఉన్న తన బిజీ షెడ్యూల్ కారణంగా.. ఇచ్చిన డేట్స్‌లోనే తనకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్‌కు చెప్పిందట పూజా. ఇది తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ పూజాపై కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ సినిమాకే ఆమె కండిషన్స్ పెట్టిందా? అంటూ ఆమెపై కొందురు ముక్కు విరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మహేశ్ సైతం ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఎందుకంటే జక్కన్నతో చేసే సినిమాను 2023లోనే సెట్స్‌పైకి తీసుకురావాల్సింది ఉందట. -
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న వీడియో
PVT04 Shooting Started Announcement Video Released: పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వైష్ణవ్ 'రంగరంగ వైభవంగా' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా నేడు జూన్ (22) ఉదయం 11.16 నిమిషాలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అతిరథుల మధ్య వైభవంగా ముహూర్తం జరుపుకుంది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కల్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. హీరో సాయిధర్మ తే జ్ క్లాప్ ఇవ్వగా,దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు. చిత్రం ముహూర్తం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇందులో "రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా..." అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరిక గా అంటే.. "ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా..!" అంటూ కథానాయకుడు మరింత గా హెచ్చరించడం చూడొచ్చు. పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది. ఈ మూవీని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ #PVT04 ~ #ProductionNo16 begins with a pooja ceremony today✨ Shoot begins soon! 🎬🎥 ▶ https://t.co/h0m5jrbdl4 Directed by #SrikanthNReddy Produced by @vamsi84 & #SaiSoujanya#PanjaVaisshnavTej @sreeleela14 @SitharaEnts @Fortune4Cinemas Sankranthi 2023 Release ⚡ pic.twitter.com/UxGDdh35Wm — Sithara Entertainments (@SitharaEnts) June 22, 2022 -
SSMB28: మహేశ్ సినిమాలో విలన్‌గా నందమూరి హీరో? ట్వీట్‌తో క్లారిటీ!
Taraka Ratna As Villain In Mahesh Babu SSMB28 Movie?: సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉన్న మహేశ్ త్వరలోనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఎస్ఎస్ఎమ్బీ28(#SSMB28) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చదవండి: మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్ దీనిపై సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే రోజున(మే 31) స్పష్టత వచ్చే అవకాశం ఉందని వినికిడి. ఇక జూలైలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నందమూరి హీరో తారకరత్న ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఓటీటీకి శివకార్తికేయన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘డాన్’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్ అయితే ఇందులో వాస్తవమెంత అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఆ సందేహాలకు తెర దించుతూ తారకరత్న తాను మహేశ్ 28వ సినిమాలో చేయనున్నట్టు ఒక ట్వీట్ వదిలాడు. విలనిజానికి సంబంధించిన ఒక ఎమోజీని జోడించాడు. గతంలో తారకరత్నా పలు చిత్రాల్లో విలన్‌గా చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆయన పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఆసక్తి నెలకొంది. #SSMB28 💉👺 — Nandamuri TarakaRathna (@NTarakarathna) May 28, 2022 -
డైరెక్టర్ త్రివిక్రమ్ కారుకు జరిమానా
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు జరిమాన విధించారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వెలుతున్న త్రివిక్రమ్ కారును అడ్డుకున్నారు. ఆయన కారును తనిఖీ చేసిన ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలింను గుర్తించారు. దీంతో కారుకు ఫైన్ వేసి బ్లాక్ ఫిలింను తొలగించారు. ఆనంతరం ఆయనకు రూ. 700 జరిమానా విధించారు. చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్ క్రికెటర్! కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్‌లకు కూడా ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసి బ్లాక్ ఫిలిం తొలగించిన సంగతి తెలిసిందే. -
తెలుగు సినిమాలపై కన్నడ స్టార్ ఫోకస్.. నెక్ట్స్ మహేశ్ సినిమాలోనే
కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన ఉపేంద్ర మళ్లీ తెలుగు సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మధ్య సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు తెరపై కనిపించనున్నారు. ఇటీవలె ఆర్జీవీతో ఓ సినిమా అనౌన్స్ చేశారు ఉపేంద్ర. ఇందులో ఆయన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇక వరుణ్‌తేజ్ గని చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. తాజాగా మహేశ్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ ఉపేంద్రను ఎంపిక చేసినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఓ కీలకమైన పాత్ర కోసం ఉపేంద్రను సంప్రదించగా, ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. ఇక మహేశ్‌బాబు నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ అనంతరం మహేశ్- త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనుంది. -
Mahesh Babu: ఫ్యామిలీ వెకేషన్ తర్వాతే త్రివిక్రమ్‌తో సినిమా!
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తారు. ముందు ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆరంభించాలనుకున్నారు. అయితే ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారు వారిపాట’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఈ వేసవిలో ఓ వెకేషన్‌ను ప్లాన్ చేశారట మహేశ్‌బాబు. ఈ వేసవి బ్రేక్ పూర్తయిన ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సినిమా షూట్లో పాల్గొంటారట మహేశ్‌బాబు. ఇక ‘సర్కారువారి పాట’ చిత్రం మే 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే.. -
హిట్ కాంబినేషన్, ఆ హీరోయిన్లే కావాలంటున్న డైరెక్టర్స్!
ఓ సినిమా హిట్టయితే.. ఆ హీరో–దర్శకుడిది హిట్ కాంబినేషన్ అంటారు. ఆ కాంబినేషన్లో అభిమానులు మరో సినిమాని ఎదురు చూస్తారు కూడా. ఇప్పుడు కూడా ‘హిట్ కాంబినేషన్’ షురూ అయింది. అయితే ఇది హీరోయిన్–డైరెక్టర్ కాంబినేషన్. ‘రిపీట్టే..’ అంటూ ఒక సినిమా తర్వాత వెంటనే తన మరో సినిమాకి ఆ హీరోయిన్నే ఎంపిక చేశారు కొందరు దర్శకులు. ఆ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం. దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్‌తో పూజా హెగ్డేకి ‘అరవిందసమేత వీరరాఘవ’ తొలి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్. ఆ వెంటనే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పూజకు చాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకి కూడా హీరోయిన్గా పూజా హెగ్డేనే తీసుకున్నారు త్రివిక్రమ్. సేమ్ ఒకప్పుడు త్రివిక్రమ్‌తో సమంత ఇలా వరుసగా మూడు సినిమాలు (‘అత్తారింటికి దారేది’ (2013), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అ ఆ’ (2016) చేశారు. ఇప్పుడు పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా త్రివిక్రమ్‌లానే పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ (2017), ‘గద్దలకొండ గణేష్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించారు పూజా హెగ్డే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్’లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ నటిస్తారు. రెండు భాగాల సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ రిపీట్ కావడం సహజం. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’లో ఓ హీరోయిన్గా నటించిన తమన్నా ఈ చిత్రం సీక్వెల్ ‘ఎఫ్ 3’లోనూ నటిస్తున్నారు. ఏప్రిల్ 27న ‘ఎఫ్ 3’ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ముందు మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకోవైపు ‘క్రాక్’ (2021) సినిమాకి ముందు దాదాపు మూడేళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రుతీహాసన్. ఈ గ్యాప్ తర్వాత ‘క్రాక్’ హిట్‌తో టాలీవుడ్లో శ్రుతి సందడి మొదలైంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా శ్రుతీహాసన్నే తీసుకున్నారు గోపీచంద్ మలినేని. ఇక తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. ‘గూఢచారి’ తర్వాత శోభితా వెంటనే మరో తెలుగు సినిమా చేయలేదు. హిందీ సినిమాల్లో నటించారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమె యాక్ట్ చేసిన తెలుగు చిత్రం ‘మేజర్’. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్గా నటించినవారిని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. చదవండి: అనన్య గ్లామరస్‌గానే కనిపించాలి.. ఆమెకు అవసరం: చుంకీ పాండే -
త్రివిక్రమ్, తరుణ్ భాస్కర్ కాదు.. జాతి రత్నానికే వెంకీమామ గ్రీన్ సిగ్నల్
గతేడాది విక్టరీ వెంకటేశ్ రెండు సినిమాల్లో నటించాడు. అయితే బ్యాడ్‌లక్ ఏంటంటే.. ఆ రెండు సినిమాలు(నారప్ప, దృశ్యం-2) ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత ఎఫ్3 సినిమాతో థియేటర్స్ ప్రేక్షకులను పలకరించేందుకు వెంకీ సిద్దమవుతున్నాడు. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత వెంకీ చేయబోయే కొత్త చిత్రంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. త్రివిక్రమ్, తరుణ్ భాస్కర్లతో సినిమాలు చేయాల్సి ఉన్నా.. ఇంకా ఫైనల్ కాలేదు. అన్నీ కూడా చర్చల దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేశ్ నెట్ ఫ్లిక్స్ కోసం రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రానా కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత వెంకీ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే అది త్రివిక్రమ్ లేదా తరుణ్ భాస్కర్‌తో కాదు. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్‌తో మూవీ చేయబోతున్నాడట. ఇటీవల అనుదీప్ వెళ్లి వెంకీకి కథ వినిపించి ఇంప్రెస్ చేశాడట. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ హీరో శివకార్తికేయన్‌తో తెలుగు తమిళ బైలింగువల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే వెంకీని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. -
SSMB28: మహేశ్‌బాబుతో సమానంగా త్రివిక్రమ్ పారితోషికం!
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఓ రేంజ్లో అంచనాలు ఉంటాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో సినిమాకు దాదాపు రూ.25 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్న మాటల మాంత్రికుడు ఈ సినిమా విజయంతో పారితోషికాన్ని రెట్టింపు చేశాడట. SSMB28వ సినిమాకు ఏకంగా రూ.50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం 50 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడట. ఈ లెక్కన డైరెక్టర్ త్రివిక్రమ్ హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడన్నమాట!. కాగా సర్కారువారి పాట షూటింగ్ ముగిసిన వెంటనే మహేశ్‌బాబు త్రివిక్రమ్ సినిమాలో భాగం కానున్నాడు. దీనికోసం డైరెక్టర్ ఇప్పటినుంచే ప్రాజెక్టుకు మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘భీమ్లా నాయక్’ రీమేక్ విషయంలో మా తొలి సవాల్ ఇదే: త్రివిక్రమ్
Bheemla Nayak Success meet: ‘‘మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో కథ కోషి (తెలుగులో రానా చేసిన పాత్ర) వైపు నుంచి చెప్పబడింది. ఈ కథను తెలుగులో భీమ్లా నాయక్ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాల్. కథను ఎలా మార్చాలనే విషయంపై చాలా చర్చించాం’’ అని త్రివిక్రమ్ అన్నారు. పవన్ కల్యాణ్–రానా కాంబినేషన్లో సాగర్.కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో పవర్ఫుల్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో పవన్, రానా భయం లేకుండా జనాల మధ్య రిస్క్ చేసి పనిచేశారు. 600 మందితో సాంగ్ షూట్ చేయడం సాధారణ విషయం కాదు. మూడు రోజుల్లో గణేశ్ మాస్టర్ ఈ పాటను పూర్తి చేశాడు’’ అన్నారు. ‘‘భీమ్లా నాయక్’ సక్సెస్ రీసౌండ్‌కి కారణం త్రివిక్రమ్‌గారి ఆలోచనే’’ అన్నారు సాగర్ కె. చంద్ర. పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్లశ్యామ్ తదితరులు మాట్లాడారు. -
మహేశ్ బాబు చిత్రంలో తమిళ స్టార్ హీరో.. క్లారిటీ!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజ' వంటి చిత్రాల తరువాత హ్యాట్రిక్ చిత్రం కోసం వీరిద్దరూ రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రంలో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం త్రివిక్రమ్ ప్రముక తమిళ హీరో విక్రమ్‌ను సంప్రదించినట్టుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విక్రమ్‌కు సంబంధించిన మేనేజర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. దాంతో పాటు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన తెలిపాడు. ఇక దీంతో మహేశ్ బాబు సినిమాలో విక్రమ్ లేనట్టేనని క్లారిటీ వచ్చేసింది. అయితే ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. -
'భీమ్లా నాయక్' ఈవెంట్లో త్రివిక్రమ్ అందుకే మాట్లాడలేదా?
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. రేపు(ఫిబ్రవరి 25)న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయ్యింది. అయితే ఈవెంట్ మొత్తంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లేకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన ఫంక్షన్‌కి వచ్చారా లేదా అన్న సందేహం కూడా ఫ్యాన్స్‌లో మిగిలిపోయింది. పవన్ సినిమా ఫంక్షన్‌కు అన్నీ తానై ముందుండి నడిపించే త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మాత్రం బ్యాక్ స్టేజ్‌కే ఎందుకు పరిమితం అయ్యారన్నది ఇప్పడు చర్చనీయాంశమైంది. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో లీక్ అయిన బండ్ల గణేష్ ఆడియో కాల్‌తో త్రివిక్రమ్ అప్సెట్ అయ్యారని, దీనివల్లే త్రివిక్రమ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి త్రివిక్రమ్ పేరే హైలైట్ అవుతూ వచ్చింది. నిజానికి యంగ్ ఫిల్మ్ మేకర్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ సోషల్ మీడియాలోనూ త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఈవెంట్లో ఎలాంటి హడావిడి లేకుండా కావాలనే బ్యాక్ స్టేజ్‌కి పరిమితం అయ్యారని టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. చదవండి: త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్ -
త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్
Bandla Ganesh Clarity On Audio Leak : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా ఫంక్షన్లకి బండ్ల గణేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే రీసెంట్గా పవన్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డకుంటున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో త్రివిక్రమ్‌ని దూషిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్‌పై స్పందించిన బండ్ల గణేష్.. అది తన గొంతు కాదని, ఎవరో కావాలనే ఇలా క్రియేట్ చేశారంటూ కొట్టి పారేశారు. అయితే దీనిపై అఫీషియల్‌గా ఓ స్టేట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఇష్టపడకపోవడం గమనార్హం. కాగా పవన్ కల్యాణ్, రానా మల్టీస్టారర్లుగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈనెల 25న రిలీజ్ కానుంది. -
SSMB 28: క్రేజీ రూమర్... మహేశ్‌కు పిన్నిగా శోభన
Shobana To Play Key Role In Mahesh-Trivikram Film: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. SSMB28గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అతడు, ఖలేజా’తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడంతో భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో మహేశ్ పిన్నిగా అలనాటి హీరోయిన్ శోభన నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. -
మహేశ్‌బాబుకు తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు- డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కీలక పాత్రలో కనిపించనుందట. మహేశ్ తల్లి పాత్ర కోసం మేకర్స్ ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా 90వ దశకంలో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన రాధ పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసింది. తాజాగా ఈ చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో సినియర్ హీరోయిన్లకు కీలక పాత్రలు ఇస్తుంటారు. అలా అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబులు ముఖ్యపాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. -
మహేశ్-త్రివిక్రమ్ కాంబో రిపీట్.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం
Mahesh Babu Trivikram Srinivas Combo Movie Has Been Started: మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు' ఎంతపెద్ద హిట్ సొంతం చేసుకుందో తెలిసిందే. తర్వాత వచ్చిన 'ఖలేజా' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి మూవీ రానుందంటే ఆడియెన్స్‌లో కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి తప్ప సెట్స్‌పైకి వెళ్లింది మాత్రం లేదు. అయితే ఎట్టకేలకు మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు గురువారం (ఫిబ్రవరి 3) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ పూజాకార్యక్రమాలకు మహేశ్ బాబు హాజరు కాలేదు. మహేశ్ భార్య నమ్రత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా హారికా అండ్ క్రియేషన్స్‌లో వస్తున్న ఏడో మూవీ కాగా హీరోగా మహేశ్ బాబుకు 28వ సినిమా. ఇదిలా ఉంటే ఈ సినిమా అతడుకు సీక్వెల్‌గా పుకార్లు వినిపిస్తున్నాయి. 2005లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ 'అతడు' సినిమాకు కొనసాగింపుగా తీయాలని తివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి 'పార్థు' అని టైటిల్ పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఇందులో నిజమెంతుందో వేచి చూడాలి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేశ్ బాబు సినిమాలో విలన్‌గా స్టార్ హీరో!
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. థర్డ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంత ఆలస్యమవుతోంది. అన్ని కుదిరితే మహేశ్‌తో సినిమాను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు. ఈ మూవీకి పాన్ ఇండియా టచ్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మహర్షిలో మహేశ్‌తో జోడి కట్టిన పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు విలన్ రోల్ కోసం బాలీవుడ్ నుంచి బడా స్టార్ ను రంగంలోకి దింపుతున్నాడట. ఆయన ఎవరో కాదు సునీల్ శెట్టి. ప్రస్తుతం ఈ హిందీ నటుడు టాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. మోసగాళ్లు,గని లాంటి చిత్రాల్లో ఆల్రెడీ నటించేశాడు. ఇప్పుడు మహేష్ కు ప్రతినాయకుడిగా మారుతున్నాడట. -
బాలీవుడ్‌పై టాలీవుడ్ దర్శకుల దండయాత్ర.. పక్కా ప్లాన్‌తో రెడీ!
Telugu Industry Directors: బాహుబలి సిరీస్ తో రాజమౌళి, పుష్పతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్స్ గా పేరు తెచ్చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్తో దర్శకధీరుడు, పుష్ప 2తో సుకుమార్ నెక్ట్స్ ఇయర్ మరోసారి బాలీవుడ్ పైకి ఎటాక్ కు రెడీ అవుతున్నారు. వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది తెలుగు దర్శకులు బాలీవుడ్ పైకి దండయాత్రకు రెడీ అవుతున్నారు.పాన్ ఇండియా సినిమాలతో దుమ్మురేపాలనుకుంటున్నారు. లైగర్ తో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ సృష్టిస్తానంటున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అలాగే రాధేశ్యామ్ తో రాధాకృష్ణ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం మహేశ్ తో మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను కూడా పాన్ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేస్తోంది హారికా హసినీ క్రియేషన్స్. రాజమౌళి కంటే ముందే మహేశ్ బాబును బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాడు త్రివిక్రమ్. అంతే కాదు రాజమౌళి, సుకుమార్ రేంజ్ లో బీటౌన్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు. -
త్రివిక్రమ్ క్లాప్‌తో ధనుష్ సినిమా మొదలు (ఫోటోలు)
-
2022లో వెంకీ మామ ప్లానింగ్ ఏంటి?
2021లో విక్టరీ వెంకటేశ్ రెండు సినిమాల్లో నటించాడు. అయితే ఆయన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఆ రెండు కొత్త చిత్రాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేశాయి. జూలైలో నారప్ప, నవంబర్ లో దృశ్యం2 చిత్రాలు అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు కూడా రీమేక్ మూవీస్ కావడం ఒక విశేషం అయితే, రెండు కూడా నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడం మరో హైలైట్ పాయింట్. అయితే 2021లో మాత్రం వెంకీ బాక్సాఫీస్ కలెక్షన్స్ మిస్ అయ్యాడు. 2022లో మాత్రం థియేటర్స్ ద్వారానే ప్రేక్షకులను పలకరించడానికి ఫిక్స్ అయ్యాడు. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 మూవీని ఏప్రిల్ 29న రిలీజ్ థియేటర్స్‌లో చేస్తున్నారు. మరోసారి వెంకీ, వరుణ్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ వెండితెరపై చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ తర్వాత వెంకటేష్ చేయబోయే కొత్త సినిమా పై సస్పెన్స్ కొనసాగుతోంది. త్రివిక్రమ్ ఒకటి, తరుణ్ భాస్క్ర్లో మరో సినిమా చేయాల్సి ఉన్నా.. ప్రస్తుతానికి ఏ డైరెక్టర్ మూవీ ఖరారు కాలేదని ఇటీవలే వెంకీ స్వయంగా చెప్పుకొచ్చాడు.పైగా నచ్చిన కథలు వచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తానంటున్నాడు విక్టరీ. మరో వైపు నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ నటిస్తున్న వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో రానాతో కలసి నటిస్తున్నాడు. మరి 2022లో వెంకీ మామ ప్లాన్ ఏంటి? తదుపరి సినిమా ఏ డైరెక్టర్‌తో చేస్తాడో వేచి చూడాలి. -
భీమ్లా నాయక్ నుంచి నాలుగో పాట.. 'అడవి తల్లి మాట'
Bheemla Nayak Movie 4th Song "Adavi Thalli Mata" Released: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు, గ్లింప్స్ అదరగొడుతున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగా తాజాగా 'భీమ్లా నాయక్' ఫోర్త్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఫోర్త్ సింగిల్ అయిన 'అడవి తల్లి మాట' పాటను డిసెంబర్ 1న విడుదల చేయాల్సింది. అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట రిలీజ్‌ను ఆపేసారు. చివరికీ ఇవాళ (డిసెంబర్ 4, శనివారం) ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టే ఇవాళ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ 'అడవి తల్లి మాట' పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. దుర్గవ్వ, సాహితి చాగంటి తమదైన గాత్రంతో పాడి ఆకట్టుకున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' తెరకెక్కుతోంది. -
‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి
Sirivennela Sitaramasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం 2:26 గంటల సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగగా..ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నవంబర్ 3న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్‌తో మృతి చెందిన సంగతి తెలిసందే. అంతనం అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని కడసారి చూపు కోసం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈ రోజపు మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం కాగా. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్
Emotional Speech by Trivikram About Sirivennela Seetharama Sastry Old Video Viral: తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్తను సాహిత్య ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణం పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సీతారామశాస్త్రి పాటలను తలచుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా సీతారామశాస్త్రి గురించి గతంలో తివ్రిక్రమ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో సిరివెన్నెలపై భావోద్వేగ ప్రసంగం ఇచ్చాడు త్రివిక్రమ్. ‘సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే ‘సిరివెన్నెల’సినిమాలో రాసిన ‘ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన’ ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని ‘శబ్ద రత్నాకరం’ అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. రండి నాకు సమాధానం చెప్పండి అంటాడు.మన ఇంట్లోకి వచ్చి మనల్ని పశ్నిస్తాడు. ఓటమిని ఎప్పుకోవద్దు అంటాడు. సింధూరం సినిమాలో ‘అర్థ శతాబ్దం అజ్ఞానాన్నే స్వతంతం అందామా’ అనే ఒక్క మాటతో నేను లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా.. ఎక్కడి వెళ్తున్నానో తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది. సిరివెన్నెల తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం’అంటూ త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. -
సిరివెన్నెలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమవుతాడో తెలుసా?
Sirivennela Sitaramasastri And Director Trivikram Srinivas Relation: సిరివెన్నెల సీతారామశాస్త్రికి -డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. స్వయంవరం సినిమాతో రైటర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రివిక్రమ్.. నువ్వేకావాలి సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. అప్పటివరకు మూసధోరణిలో వెళ్తున్న సినిమాలకు తన రైటింగ్ స్కిల్స్‌తో కొత్త దారిని పరిచయం చేశాడు. తేలికైన పదాలతోనే పవర్ఫుల్ పంచుడైలాగులు రాయడం ఆయన స్పెషాలిటీ. త్రివిక్రమ్ సినిమాల గురించి తెలిసినంతగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కెరీర్ పరంగా త్రివిక్రమ్ అప్పటికే రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ ప్రతిభతో పాటు అతని వ్యక్తిత్వం నచ్చిన సిరివెన్నెల స్వయంగా తమ ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారట. అయితే అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్ ఆ అమ్మాయిని కాకుండా వాళ్ల చెల్లిని ఇష్టపడ్డాడట. ఇదే విషయాన్ని చెప్పగా, మొదట కాస్త సంశయించినా, తర్వాత అర్థం చేసుకొని వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అలా త్రివిక్రమ్-సౌజన్యల వివాహం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా సోదరుడి కూతురే సౌజన్య. అలా వీరి పెళ్లి సినిమా స్టోరీని తలపించే విధంగా ఉంటుంది. -
త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్‌డే స్పెషల్
టాలీవుడ్ టాప్ దర్శకుడు, మాటల మాంత్రికుడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఆయన పెన్‌పవర్ తోడైతే స్టార్ హీరోలకు జల్సానే. తన పవర్ ఫుల్ డైలాగులతో నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు.. చురకలు వేస్తాడు..థియేటర్లలో సీటీల మోత మోగిస్తాడు. ఆయనే ఆకెళ్ల నాగ శ్రీనివాస్ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల రచయితనుంచి టాప్ డైరెక్టర్‌గా తన టాలెంట్ ఖలేజాను తెలుగు తెరకు రుచి చూపించిన ఈ భీమవరం బుల్లోడికి హ్యాపీ బర్త్‌డే అంటోంది. సాక్షి. కామ్. న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించడం టాలీవుడ్ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. అలాగే డైలాగు రైటర్‌గా కరియర్ మొదలుపెట్టి దర్శకత్వంవైపు అడుగులు వేయడమేకాదు, పలు బ్లాక్ బ్లస్టర్ మూవీలను అందించడం తెలుగు ప్రేక్షకుల భాగ్యం. యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ, చక్కటి సాహిత్యం, మాంచి మెలోడీ ఇవన్నీ కలగలసిన చక్కటి విందు త్రివిక్రమ్ సినిమాలు. అలా మొదలైన మాటల ప్రస్థానం 1972, నవంబర్ 7న జన్మించిన శ్రీనివాస్‌కు సక్సెస్ అంత సులువుగా వచ్చిందేమీ కాదు. అంది వచ్చిన అవకాశాల్ని ఒక రేంజ్లో వాడుకొని తానేంటో నిరూపించుకున్నాడు. 1999 లో స్వయంవరం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయన, త్రివిక్రమ్ డైలాగులుంటే చాలు సినిమా హిట్ అన్న నమ్మకాన్ని కలిగించాడు. సముద్రం, నిన్నే ప్రేమిస్తా, చిరునవ్వుతో, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు ఈ కోవలోకే వస్తాయి. ఈ విజయాలతో ఆయన సంతృప్తి చెంది ఆగిపోలేదు. డైరెక్టర్‌గా రెండో అవతారమెత్తి శభాష్ అని పించుకున్నాడు. డెబ్యూ మూవీ ‘నువ్వే నువ్వే’తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. దీనికి తోడు ఆయన డైలాగులు ఉండనే ఉన్నాయి. 2005లో సూపర్ స్టార్మహేష్ బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ ఎంత హిట్టో చెప్పాల్సిన పనేలేదు. మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమా బుల్లితెరపైకూడా పెద్ద సంచలనం. త్రిష, మహేష్ జోడీ, పాటలు, మ్యూజిక్ అన్నీ సూపర్‌డూపర్ హిట్టే .2004లో వచ్చిన మల్లీశ్వరి మూవీకి కథ,మాటలు అందించారు త్రివిక్రమ్. పెళ్లి కాని ప్రసాద్ అంటూ విక్టరీ వెంకటేష్‌తో పండిచిన కామెడీ అద్భుతంగా పండింది. పవన్ కల్యాణ్‌కు మాంచి కిక్కిచ్చిన జల్సా 2008లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మాంచి కిక్కు ఇచ్చిన మూవీ ‘జల్సా . వరస ప్లాపుల్లో ఉన్న పవన్‌కు ముచ్చటగా మూడో చిత్రంతో అదిరిపోయే హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఈ మూవీ డీఎస్పీ మ్యూజిక్ మరో ఎసెర్ట్. పవన్ కల్యాణ్ కెరీర్లో పాత రికార్డులన్నింటినీ తిరగ రాయడమే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు బీజం వేసింది ఈ చిత్రం. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో చేసిన ప్రయోగం మరో హైలెట్‌గా నిలిచింది. మహేశ్‌లోని కామెడీ యాంగిల్‌ను చూపించిన 'ఖలేజా' ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబులోని కామెడీ యాంగిల్‌ను ఫస్ట్ టైమ్ చూపించిన సినిమా ‘ఖలేజా’. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోయినా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. యాక్షన్ అండ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న టాలీవుడ్ ప్రిన్స్ కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పటికీ ఇది బుల్లితెర బ్లాక్ బస్టరే. రియల్ హీరో సోనూసూద్ విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచేయం చేసిన మూవీ జులాయి. ఖలేజా కలెక్షన్లతో నిరాసపడిన త్రివిక్రమ్‌ను దర్శకుడిగా మళ్ళీ జులాయి ఊపుని ఇచ్చింది. కామెడీతోపాటు, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ , ముఖ్యంగా బన్నీ క్యారెక్టరైజేషన్, ఇలియానా గ్లామర్ వెరసి కలెక్షన్ల వర్షం కురిసింది. 100 కోట్ల క్లబ్‌తో సరికొత్త రికార్డు వీరు ఆరడుగుల బుల్లెట్టూ, ధైర్యం విసిరిన రాకెట్టు అంటూ 2013లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్‌మూవీ సినిమా ‘అత్తారింటికి దారేది’. వీరిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన జల్సా రికార్డులను చెరిపేయడమే 100 కోట్లపైగా వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలనాటి హీరోయిన్ను నదియాను హీరో అత్తగా గ్లామరస్‌గా ప్రెజెంట్ చేసిన తీరు బాగా కనెక్ట్ అయ్యింది. ట్రెండ్ సెట్ చేసింది. అయితేపవన్ కళ్యాణ్‌తో చేసిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’ మాత్రం త్రివిక్రమ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అనే పేరును మూటగట్టుకుంది. సెంటిమెంట్‌తో..‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ నాన్న అంటే మరిచిపోలేని ఓ జ్ఞాపకం అంటూ నాన్న సెంటిమెంట్‌తో 2015లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ త్రివిక్రమ్ కాంబినేషన్‌తో అల్లు అర్జున్‌కు మరో భారీ హిట్ ఇచ్చింది. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, సమంత కాంబోలో వచ్చిన చక్కటి చిత్రం ‘అ..ఆ కూడా సక్సెస్‌ఫుల్‌గా నడించింది. అలాగే 2020లో వీరిద్దరి కాంబోలో ‘అల వైకుంఠపురములో’ రేపిన ప్రభంజనం మామూలుదికాదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో ఎస్ ఎస్ థమన్ సంగీతంలో ‘బుట్ట బొమ్మ’‘రాములో రాములో’ సామజవరగమన పాటలు కొల్లగొట్టిన రికార్డులు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. త్రివిక్రమ్ తన సినిమాల్లోకి పాటలకు, సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో నిరూపించిన మ్యూజికల్హిట్స్ ఇవి. 2018లో యంగ్ హీరో ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ అందించి బిగ్గెస్ట్ హిట్ ‘అరవింద సమేత వీర రాఘవ’. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్‌గా జగపతి బాబును, రాయలసీమ యాసలో ఎన్టీఆర్‌ను ఫెరోషియస్‌గా చూపించడంలో త్రివిక్రమ్ పుల్ మార్కులు కొట్టేశాడు. 150 కోట్లకు పైగా వసూళ్లతో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు త్రివిక్రమ్. 'బీమ్లానాయక్'కు మాటల తూటాలు ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో రెండు,మహేష్‌బాబుకు మరో హిట్ ఇచ్చేందుకు రడీ అవుతున్నాడు. టాలీవుడ్‌కు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన త్రివిక్రమ్ మలయాళంలో సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ మూవీని తెలుగు రీమేక్ బీమ్లానాయక్‌కు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండంటం విశేషం. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. 2002లో త్రివిక్రమ్, క్లాసికల్ డ్యాన్సర్ సౌజన్యను పెళ్లి చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిరునవ్వు మూవీకిగాను బెస్ట్ డైలాగ్ రైటర్ గా, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, అతడు, అత్తారింటికి దారేది సినిమాలకి నంది అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఉత్తమ దర్శకుడిగా అతడు, అత్తారింటికి దారేది సినిమాలకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లభించాయి. -సాక్షి, వెబ్‌డెస్క్ -
హీరోయిన్ రీతూ వర్మ మూవీ టైటిల్స్‌పై త్రివిక్రమ్ సెటైర్లు
Trivikram Srinivas Satires On Ritu Varma Movie Titles: నాగ శౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం(అక్టోబర్28)న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ హీరోయిన్ రీతూవర్మ సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. 'వరుడు కావలెను సినిమాను నేను చూశాను. చాలా రోజుల తర్వాత సినిమా మొత్తం చీరకట్టిన హీరోయిన్ను చూశాను. ఆమె సినిమాలన్నీ చూస్తే...పెళ్లిచూపులు, కనులు కనులు దోచాయంటే.. ఇప్పుడు వరుడు కావలెను. తర్వాత షామినా, కేటరింగ్, లాజిస్టిక్ సర్వీసెస్.. ఇలాంటి సినిమాలు తీస్తారేమో. అసలే సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి మిగతావాళ్లు కూడా నీతో ఇలాంటి సినిమాలు తీస్తారు' అంటూ రీతూ సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు. త్రివిక్రమ్ కౌంటర్లతో హీరోయిన్ రీతూ సిగ్గుతో తలపట్టుకుంది. -
నాగశౌర్య అందగాడు, మంచి మనసున్న వ్యక్తి : అల్లు అర్జున్
‘‘కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా రిలీజ్‌ల సీజన్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. తెలుగులో ‘వరుడు కావలెను, రొమాంటిక్’, తమిళ్లో రజనీకాంత్‌గారి ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగీ 2’, హిందీలో ‘సూర్య వన్షీ’.. సినిమాలు విడుదలవుతున్నాయి.. అన్ని సినిమాలూ హిట్ అవ్వాలి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తున్నారు.. ఇదే పాజిటివిటీ కొనసాగాలి.. అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలి. ఈ డిసెంబరు 17న ‘పుష్ప’ తో మేము కూడా వస్తున్నాం.. మా సినిమా మీకు నచ్చాలని కోరుకుంటున్నా. ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆల్ ది బెస్ట్. ఈ దీపావళికి భారతీయ సినిమా మునుపటిలా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘వరుడు కావలెను’లోని ‘దిగు దిగు నాగ’ పాట మా ఇంట్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఈ పాటకి తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. నాగశౌర్య సినిమాలన్నీ చూశా.. చాలా అందగాడు. తనలో ఒక ఇన్నోసెన్స్, స్వీట్నెస్ ఉంటుంది. అంత మంచి మనసున్న వ్యక్తి కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.. అవ్వాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి స్వయం కృషితో ఎదిగేవారంటే నాకు చాలా ఇష్టం.. శౌర్యకూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రీతూ వర్మ మంచి నటి. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ వర్మ వద్ద చాలా ఉంటుంది. ముంబయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లోనూ సగం మంది మహిళలు ఉన్నారు.. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అలా కాకుండా ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లోకి మహిళలు రావాలి.. లక్ష్మీ సౌజన్యకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి విశాల్, తమన్ మంచి సంగీతం అందించారు. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి చేయడానికి అహం ఉంటుంది.. అలాంటివేమీ లేకుండా చేసినందుకు వారిద్దరికీ అభినందనలు. ఈ వేడుకకి రావడం ‘అల వైకుంఠపురములో..’ సినిమాకి కొనసాగింపుగా ఉన్నట్లు ఉంది. చినబాబు, త్రివిక్రమ్, నవీన్ నూలి, తమన్... ఇలా అందరూ ఉన్నారు. గీతా ఆర్ట్స్ తర్వాత నేను సొంత సంస్థగా భావించేది చినబాబు, నాగవంశీగారి బ్యానరే. ‘జెర్సీ’ కి జాతీయ అవార్డు అందుకున్నందుకు నాగవంశీకి థ్యాంక్స్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మన చుట్టుపక్కల ఇళ్లలోని మనకు తెలిసిన ఒక ఆడపిల్ల తాలూకు సినిమా ఇది. ఇలాంటి కథలెప్పుడూ మన మనసుకు దగ్గరగా అనిపిస్తాయి. ఈ కథని ఎంచుకోవడంలోనే సౌజన్య సగం సక్సెస్ అయ్యింది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు కాబట్టి మిగతా సగం కూడా సక్సెస్ అయినట్టే. ఇంట్రవెల్, క్లైమాక్స్ సన్నివేశాల్లో శౌర్య చాలా బాగా చేశాడు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన రాధాకృష్ణ, వంశీగార్లకు థ్యాంక్స్. ఓ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండటం చాలా కష్టం (నవ్వుతూ). విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ వంశీ, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్ నవీన్ నూలి, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సాక్షి’ అవార్డు నాకో సర్ప్రైజ్ : అనిల్ రావిపూడి
-
‘సిరివెన్నెల’ బరువు మోయటం అంత సులువు కాదు: త్రివిక్రమ్
కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఎంతో అంగరంగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో పాటు పలువురు హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన నటులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. థ్యాంక్యూ భారతీగారు.. థ్యాంక్స్ సాగరికాగారు.. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అల్లు అరవింద్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ అవార్డు మీది, మారుతిగార్లదే. నా కెరీర్ బిగినింగ్ నుంచి నాపై మీరు ఎంతో నమ్మకం పెట్టారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నాకోసం మంచి క్యారెక్టర్ రాసిన మారుతి సార్‌కి థ్యాంక్స్. ప్రేక్షకుల ఆదరణ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే ‘వెంకీ మామ’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ బాబీ, నిర్మాత సురేశ్‌బాబులకు థ్యాంక్స్. ‘సాక్షి’ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం గౌరవంగా ఉంది. ‘సాక్షి’ చానల్ నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్యూ సో మచ్. – రాశీ ఖన్నా, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (వెంకీ మామ, ప్రతిరోజూ పండగే) ‘జెర్సీ’ మూవీ నా ఒక్కడికే కాదు, మా ఎంటైర్ టీమ్‌కి కూడా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాకు ఏ అవార్డు వచ్చినా అది మా మొత్తం టీమ్‌కి చెందుతుంది. మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – గౌతమ్ తిన్ననూరి, క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ (జెర్సీ) యాభై వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఈ బరువు (బాలు తరఫున అవార్డు అందుకున్నారు) నేను మాత్రమే మోయలేను. మీరు కూడా వచ్చి సాయం పట్టండి.. తమన్ నువ్వు కూడా రా.. థ్యాంక్యూ. – మణిశర్మ (మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (ఇస్మార్ట్ శంకర్)గా కూడా మణిశర్మ అవార్డు అందుకున్నారు). ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అందుకుంటుంటే సాయిమాధవ్ చేతులు వణుకుతున్నాయి.. ఇస్తుంటే నాకు కూడా వణుకుతున్నాయి. ఎందుకంటే శాస్త్రిగారి బరువు మోయటం అంత సులువు కాదు. కొన్ని వేల పాటల్ని మనందరి జీవితాల్లోకి వదిలేసిన మహా వృక్షం అది. – త్రివిక్రమ్ ‘సిరివెన్నెల’గారి గొప్పదనం గురించి చెప్పాలంటే ప్రపంచంలోని భాషలన్నీ వాడేసినా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఆయన అవార్డును ఆయన బదులుగా నేను తీసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. – సాయిమాధవ్ బుర్రా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2020కి ఉత్తమ గీచ రచయితగా ఒక పాట కాకుండా మూడు పాటలకు (అల వైకుంఠపురములో, జాను, డిస్కోరాజా) ఎంపిక చేశారు. ‘డిస్కోరాజా’ చిత్రంలో నా పాటకి మా అన్నయ్య బాలూగారు పాడిన చివరి పాటల్లో ఒకటి కావడం కొంత విషాదాన్ని కలిగిస్తుంది.. కొంత ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ అవార్డు తీసుకోవడానికి ఆ రోజు నేను వేదికపైకి రాలేకపోయాను. నా తరఫున అవార్డు అందుకున్న బుర్రా సాయిమాధవ్ అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన రచయిత, నా ఆత్మీయ సోదరుడు. పాటల గురించి, మూవీ గురించి సంక్షిప్తంగా నాలుగు మంచి మాటలు చెప్పిన ప్రఖ్యాత దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి థ్యాంక్స్. – పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్–‘సామజ వరగమన’ (అల వైకుంఠపురములో)..., ‘లైఫ్ ఆఫ్ రామ్...’ (జాను) ‘నువ్వు నాతో ఏమన్నావో...’ (డిస్కో రాజా). -
‘సాక్షి’ అవార్డు నాకో సర్ప్రైజ్ : అనిల్ రావిపూడి
సాక్షి మీడియా గ్రూప్ అందించిన ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ పురస్కారాల్లో భాగంగా మోస్ట్ పాపులర్ డైరెక్టర్(ఎఫ్ 2) అవార్డును అనిల్ రావిపూడి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎఫ్ 2’ నా కెరీర్‌కు ఒక గేమ్ చేంజర్లా ఫీల్ అవుతాను. ఈ సినిమా నాకు సర్ప్రైజులు ఇస్తూనే ఉంది. ఇది కూడా (‘సాక్షి’ అవార్డు) ఓ సర్ప్రైజ్. ఈ ప్యాండమిక్ తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలుపెట్టి, చక్కగా పని చేసుకుంటున్నాం. ఇలాంటి టైమ్‌లో ‘సాక్షి’ యాజమాన్యం అవార్డ్స్ ఇవ్వటం అనేది మా అందరికీ ఒక బూస్టింగ్‌లా అనిపించింది. నాకు ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో నాకు జంధ్యాలగారు, ఈవీవీగారంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే త్రివిక్రమ్‌గారి సినిమాలు చూసి, ఆయన రాసే స్టైల్, డైలాగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్లం. మా జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ వాళ్లు తీసిన సినిమాలు మా మైండ్ మీద ఎంతో కొంత ప్రభావం చూపించే ఉంటాయి. ‘థ్యాంక్యూ సో మచ్ సార్.. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
‘అల వైకుంఠపురములో’కు అవార్డు వస్తదనుకోలేదు: అల్లు అర్జున్
ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలకు సాక్షి’ మీడియా గ్రూప్ 2019, 2020 సంవత్సరాలకు గాను ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా ‘అల వైకుంఠపురములో’గాను బెస్ట్ యాక్టర్ అవార్డు(2020) అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు అవార్డులంటే చాలా ఇష్టం. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారి వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. మా బ్రదర్ తమన్‌ని నాకు వన్ బిలియన్ ప్లే అవుట్స్ కావాలని ఏ ముహూర్తాన అడిగానో..! అంటే.. వందల కోట్ల సార్లు పాట ప్లే అవ్వాలని.. ఇప్పటికి దాదాపు 300 కోట్ల సార్లు ప్లే అయింది... ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ ఇవ్వడమే కాదు.. 2020 లాస్ట్‌లో ఎవడు సిక్సర్ కొడతాడో ఆడే మొత్తం డికేడ్ అంతా కొట్టినట్టు. ఆల్బమ్ ఆఫ్ ద డికేడ్... థ్యాంక్యూ తమన్. ఆల్బమ్‌లో ‘మల్లెల మాసమా...’ రాసిన సీతారామ శాస్త్రిగారికి, ‘రాజుల కాలం కాదు.. రథము, గుర్రము లేదు’ అని రాసిన రామజోగయ్య శాస్త్రిగారికి , ‘రాములో రాముల..’ పాట రాసిన కాసర్ల శ్యామ్‌గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెబుతున్నానంటే నాకు లాంగ్వేజ్ అంతగా రాదు.. కానీ లిటరేచర్ వేల్యూ బాగా తెలుసు. వచ్చే జనరేషన్ నాలా తెలుగు మాట్లాడకూడదు... చాలా బాగా మాట్లాడాలి (నవ్వు..). త్రివిక్రమ్గారిలా మాట్లాడాలనుకోండి. మా ప్రొడ్యూసర్ చినబాబుగారికి, వంశీగారికి, మా నాన్న అల్లు అరవింద్, బన్నీ వాసుకి థ్యాంక్యూ సో మచ్. ఈ సినిమాలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే... నాలుగైదేళ్లుగా ఇలాంటి ఒక పెద్ద హిట్టు పడాలి, ఇండస్ట్రీ రికార్డో లేదా ఆల్ టైమ్ రికార్డో పడాలి.. అనుకుంటూ ప్రతిసారీ సినిమా చేసేవాణ్ణి. అయితే రాలేదు. ప్రతిసారీ అలాగే అనుకుంటాం.. ఈసారి అన్నీ వదిలేసి సరదాగా ఒక సినిమా చేద్దాం అనుకుని చేస్తే.. ఆ సినిమానే ఆల్‌టైమ్ రికార్డ్, బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది సినిమాకే కాదు.. లైఫ్‌కి కూడా మంచి పాఠం. అదేంటంటే మన లైఫ్‌లో అద్భుతం రావాలంటే కొన్నిసార్లు పట్టుకోవడం కాదు.. వదిలేయాలి, వదిలేసినప్పుడే అద్భుతం వస్తుంది. మీ లైఫ్‌లో కూడా ఏదైనా అద్భుతం రావాలంటే వదిలేయండి. అదొస్తదంతే. – అల్లు అర్జున్, మోస్ట్ పాపులర్ యాక్టర్ (అల వైకుంఠపురములో...) అవార్డులు మాకు చాక్లెట్స్లాగా.. చిన్నపిల్లలకు చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమో బేసిగ్గా సినిమావాళ్లకు అవార్డులు కూడా అంతే ఇష్టం. మీరు ఎన్ని చాక్లెట్లు ఇస్తామన్నా పిల్లలు వద్దనరు.. మేము అవార్డులు వద్దనం. ‘అల వైకుంఠపురములో..’ తాలూకు అవార్డు మొట్టమొదటగా ‘సాక్షి’తో స్టార్ట్ అయింది. ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి మా ‘అల వైకుంఠపురములో..’ టీమ్ తరఫున ధన్యవాదాలు. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్గార్లకు, సినిమా రిలీజ్ అవక ముందే అత్యద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్లిన నా మిత్రుడు తమన్‌కి, ఈ సినిమాని మా అందరితో కలిసి నటుడిగానే కాదు తోటి టెక్నీషియన్‌గానూ చేసిన మా హీరో అల్లు అర్జున్‌గారికి.. నాగవంశీ, పీడీవీ ప్రసాద్, పూజా హెగ్డే, టబులతో పాటు మిగతా అందరికీ నా కృతజ్ఞతలు. – త్రివిక్రమ్ శ్రీనివాస్, మోస్ట్ పాపులర్ డైరెక్టర్ (అల వైకుంఠపురములో...) 2020 తర్వాత మొదటిసారి.. 2020లో వైజాగ్‌లో చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ (‘అల వైకుంఠపురములో’)లో అంతమందిని జనాలను చూసిన తర్వాత.. మళ్లీ అంతమందిని చూడటం, ఓ ఫంక్షన్‌కి అటెండ్ కావడం కరువైపోయింది. ఓ ఏడాదిన్నర అటువంటి కరువులో ప్రయాణించిన మాకు ఒక చల్లటి గాలిలా మా ఇండస్ట్రీకి ఫస్ట్ వేడుకగా. ప్రప్రథమంగా ‘సాక్షి’ వారు ముందుకొచ్చి ఈ ఫంక్షన్ చేయడాన్ని ఎంతో అభినందిస్తున్నాను. ఇక ‘థర్డ్ వేవ్’ లేదనుకుంటూ ముందుకు సాగాలి. ‘సాక్షి’ వారు మా సినిమాని ఎన్నుకుని నాకు ,రాధాకృష్ణగారికి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. – అల్లు అరవింద్, మోస్ట్ పాపులర్ మూవీ (అల వైకుంఠపురములో...) క్రెడిట్ అంతా త్రివిక్రమ్, బన్నీదే.. ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మాకు మ్యాజికల్ ఫిల్మ్. ఈ క్రెడిట్ అంతా త్రివిక్రమ్, బన్నీదే. ఈ సినిమాని ఇంత పెద్ద స్థాయిలో తీసిన రాధాకృష్ణ, అల్లు అరవింద్‌కు థ్యాంక్స్. ఓ సినిమాలో ఒక పాట హిట్ అయితే ఆ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్‌ది. ఆరు పాటలూ హిట్ కావడం అంత సులభం కాదు. త్రివిక్రమ్‌గారు చాలా తెలివైనవారు.. రియల్లీ జీనియస్. ఈ సినిమాకి మంచి లిరిక్స్ ఇచ్చిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కల్యాణ్ చక్రవర్తి, కృష్ణ చైతన్య, కాసర్ల శ్యామ్, విజయ్ కుమార్‌గార్లకు థ్యాంక్స్. ఈ సినిమాకి చాలా అవార్డులు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది.. ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. – సంగీత దర్శకుడు తమన్, మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (అల వైకుంఠపురములో...) ఇది నా రెండో సాక్షి అవార్డు.. ‘సాక్షి’ అవార్డు వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఇది నా రెండో సాక్షి అవార్డు. మొదటిసారి ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి అందుకున్నాను.. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి తీసుకున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ త్రివిక్రమ్ సార్. ఈ సినిమా నా కెరీర్లో చాలా ప్రత్యేకం. అల్లు అర్జున్, నిర్మాత చినబాబుగారు, వంశీ, గీతా ఆర్ట్స్‌కి థ్యాంక్స్. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నా. ఎందుకంటే వారు మళ్లీ మళ్లీ నా సినిమా చూసి నన్ను ఆశీర్వదించడంతో పాటు అభినందించారు.. అందుకు వారందరికీ థ్యాంక్స్. – పూజా హెగ్డే, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (అల వైకుంఠపురములో...) గర్వంగా ఉంది.. చిన్మయి ఇంతమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నందుకు గర్వంగా ఉంది. ఇంత అద్భుతమైన పాట (మోస్ట్ పాపులర్ సింగర్–‘ఊహలే...’ (జాను) కోసం ‘సాక్షి’ తనను గౌరవించడం చాలా సంతోషం. డైరెక్టర్ ప్రేమ్గారికి, నిర్మాతలు ‘దిల్’రాజు గారు, శిరీష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత, లిరిక్ రైటర్ శ్రీమణి గారు... అలాగే తెరపైన ఈ పాటకి ప్రాణం పోసిన సమంత, శర్వా.. అందరికీ చిన్మయి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ. – రాహుల్, నటుడు–దర్శకుడు, చిన్మయి భర్త -
అఫిషియల్: త్రివిక్రమ్‌తో నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం
‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నవీన్పొలిశెట్టి, తరువాతి ప్రాజెక్ట్‌పై అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కళ్యాణ్ శంకర్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి ఎంటర్టైనర్ గా బలమైన కథతో సాగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' అనే మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుంది. -
ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ..
సినిమా ఇండస్ట్రీలో కథలు రాయడం, సినిమా రిలీజ్ సహా చాలా అంశాలు సెంటిమెంట్‌తో ముడిపడి ఉంటాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించారు. ఈ క్రమంలో పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉండే ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. నటుడు సునీల్, డైరెక్టర్ దశరథ్‌లతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కిడి నుంచే త్రివిక్రమ్ ఎన్నో సినిమాలకు కథలు అందించారు. స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలకు ఆ ఇంట్లోనే ఉంటూ త్రివిక్రమ్ మాటలు అందించారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. అయినా తనకు మొదట ఆశ్రయం ఇచ్చిన ఆ అద్దె ఇల్లు అంటే త్రివిక్రమ్‌కు ఎంతో మమకారమట. అందుకే ఆ ఇంటిని వదులుకోలేక ప్రతి నెల ఐదు వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెంటిమెంట్‌గా ఇప్పటికీ కొన్ని సినిమాలకు అక్కడి నుంచే కథలు, మాటలు రాస్తారట. ప్రస్తుతం త్రివిక్రమ్‌కు సొంతంగా ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నా నేటికీ ఆ అద్దె ఇంటిని సెంటిమెంట్‌గా భావించి అప్పుడప్పుడు అక్కడికి వస్తారని సమాచారం. చదవండి : కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ 'మహమ్మద్ ఖయ్యుమ్'గా సునీల్.. -
మహేశ్‌బాబు-త్రివిక్రమ్ మూవీ అప్డేట్ వచ్చేసింది...
SSMB28 Update : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను వెల్లడించింది చిత్ర బృందం. ఇప్పటివరకు ఈ సినిమాలో మహేశ్‌కు జోడీగా ఎవరు నటిస్తారన్న సస్పెన్స్‌ను తెరదించుతూ బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్గా అనౌన్స్ చేసింది. ఇక హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరక్టర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ‘అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మహేశ్‌బాబు పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మహేశ్-త్రివిక్రమ్‌ల మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. -
టాలీవుడ్ ఎంట్రీకి సూర్య రెడీ.. ఆ దర్శకుడుతో సెట్ అయ్యేనా!
ఈ మధ్యకాలంలో తమిళ్లో సూర్య సినిమాలు అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. అక్కడే కాదు ఇక్కడ తెలుగులో కూడా అతడి సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సూర్య నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం తెలుగు స్టార్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సూర్య బోయపాటి శ్రీనుతో తెలుగులో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు వెలువడగా అందులో నిజం లేదని తెలింది. ఇక తాజా సమాచారం ప్రకారం సూర్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. -
పెళ్లిలో చిరు నవ్వులు చిందిస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ని గుర్తు పట్టారా?
పై ఫోటోలో పెళ్లి కూతురు పక్కన కూర్చొని చిరు నవ్వులు చిందిస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీని గుర్తుపట్టారా? అబ్బే.. చాలా కష్టమండి అంటారా? సరే అయితే మీ మీకోసం ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. టాలీవుడ్లో ఆయనో స్టార్ డైరెక్టర్. మాటల మాంత్రికుడు. తేలికైన పదాలతో, చాలా అర్థవంతమైన సంభాషణలు చెప్పడం ఆయన స్పెషాలిటీ. గుర్తొచ్చిందా? డౌట్ పడకండి.. మీరనుకున్నట్లుగా ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే. ఈ ఫోటోలో త్రివిక్రమ్ కొంచెం బొద్దుగా ఉండటంతో వెంటనే గుర్తు పట్టడం కష్టమే. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ మీకు త్రివిక్రమ్ పెళ్లి స్టోరీ తెలుసా? ఆయన పెళ్లి కూడా సినిమా మాదిరే జరిగింది. అక్కని చూడడానికి వెళ్లి చెల్లిని పెళ్లి చేసుకొని వచ్చాడు మన మాటల మాంత్రికుడు. ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురే సౌజన్య. మొదట సౌజన్య అక్కని చూడడానికి వెళ్లాడట త్రివిక్రమ్. అయితే అక్కడ అక్క పక్కన ఉన్న సౌజన్యని చూసి తొలి చూపుకే ప్రేమలో పడిపోయాడట. వెంటనే తన మనసులోని మాటను సౌజన్య తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా ఇందుకు ఒప్పుకున్నారట. అయితే సౌజన్య అక్క పెళ్లి అయిన తరువాత మీ పెళ్లి చేస్తామని వారి తల్లిదండ్రులు కండిషన్ పెట్టారట. దీనికి త్రివిక్రమ్ ఒప్పుకొని ఆమె పెళ్లయిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్‌బాబుతో ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్ధరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ సాధించగా.. రాబోయే సినిమాపై ఇప్పటి నుంచే అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. చదవండి: మీనాక్షి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా? మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి! -
మహేశ్ సినిమాలో సునీల్.. త్రివిక్రమ్ మూడో ప్రయత్నం ఫలించేనా?
సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత మంది స్నేహితులలో అందరికి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. ఇద్దరు కూడా ఒకే రూంలో ఉండి సినిమా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు త్రివిక్రమ్. సునీల్ కమెడియన్‌గా స్టార్డమ్ ఉన్న సమయంలోనే హీరోగా అవకాశాలు రావడంతో కామెడీ పాత్రలు మానేశాడు. ఇటీవల ఆయనకు హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తన స్నేహితుడిని మరోసారి హిట్‌ట్రాక్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్. హీరో నుండీ మళ్ళీ కమెడియన్ గా మారాలి అని సునీల్ డిసైడ్ అయినప్పుడు.. త్రివిక్రమ్ తన ‘అరవింద సమేత’ లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో సునీల్ పాత్ర పండలేదు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా సునీల్ కు త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడు కానీ ఆ సినిమాలో అతను ఉన్నట్టు కూడా జనాలు గుర్తు పెట్టుకోలేదు. దీంతో త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి సునీల్‌కి అవకాశం ఇస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరోకి కూడా అవకాశం ఉందట. ఆ పాత్రకు సునీల్‌ని ఎంపిక చేసుకున్నాడట త్రివిక్రమ్. గత చిత్రాల మాదిరి కాకుండా ఇందులో సునీల్ పాత్రని చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట. మరి మహేశ్ సినిమాతో అయినా సునీల్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి. చదవండి : మహేశ్ బాబు SSMB28 సినిమాలో శిల్పాశెట్టి ?