ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అది కూడా నాలుగోసారి. అధికారికంగా లాంచ్ జరిగిపోయింది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ కాంబో.. ఈసారి ఎలాంటి సినిమా చేయబోతున్నారు? ఎప్పుడు మొదలవుతుంది? థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? లాంటి ప్రశ్నలు.. అభిమానుల బుర్రలు తొలిచేస్తున్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
మహాభారతం ఆధారంగా
'పుష్ప' సినిమాతో బన్నీ.. అనుహ్యంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం 'పుష్ప 2' చేస్తున్నాడు. తర్వాత ఎవరితో కలిసి పనిచేయబోతున్నాడా అనే ప్రశ్నకు తెరదించాడు. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్ తోనే వరసగా నాలుగోసారి కలిసి వర్క్ చేయబోతున్నాడు. గత మూడు సినిమాలని కమర్షియల్ గా తీసి వీళ్లు హిట్స్ కొట్టారు. ఈసారి మాత్రం మహాభారతాన్ని స్పూర్తిగా తీసుకుని, ఓ సోషియో ఫాంటసీ కథని గురూజీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!)
ప్రభాస్ కథతో
అయితే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చాలా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది దర్శకులు అతడికి స్టోరీలు వినిపించారు. అలా త్రివిక్రమ్ కూడా ఓ కథని ప్రభాస్ కి చెప్పారట. కానీ అది సమయం కుదరక, ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు దాన్నే కొన్ని మార్పులు చేసి, బన్నీకి వినిపించగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
అల్లు అర్జున్ ప్రయోగం
గతంలో 'బద్రీనాథ్' సినిమాతో అల్లు అర్జున్.. ఫాంటసీ స్టోరీ ప్రయోగం చేశాడు. కానీ ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కావడం, అతడికి పురాణాలు, ఇతిహాసాలపై మంచి పట్టుండటం అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న 'పుష్ప 2' పూర్తయ్యేసరికి మరో 7-8 నెలలు పట్టొచ్చు. అంతలో త్రివిక్రమ్ 'గుంటూరు కారం' పూర్తి చేస్తారు. అంటే 2024 వేసవిలో అలా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టి, 2025 లేదా 2026లో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు.
(ఇదీ చదవండి: బేబమ్మ రెచ్చిపోవడానికి ఇదా అసలు కారణం?)
Comments
Please login to add a commentAdd a comment