Mahabharat
-
'కల్కి' సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం
ఎక్కడ చూసినా ఇప్పుడు 'కల్కి' మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. గత కొన్నాళ్ల నుంచి డల్‌గా ఉన్న బాక్సాఫీస్‌కి ఈ సినిమా మంచి ఊపు తీసుకొచ్చింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు తెలుగు హీరోలు ఇప్పటికే సినిమాని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా మహాభారత్ సీరియల్ లో కృష్ణుడిగా చేసిన నితీశ్ భరద్వాజ్ వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి.(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?)ఇంతకీ ఏమన్నారంటే?'మ్యాడ్ మ్యాక్స్ సినిమాలని దర్శకుడు నాగ్ అశ్విన్ సూర్తిగా తీసుకుని 'కల్కి 2898' తీసినప్పటికీ పురాణాలని లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే నడిపించారు. సెట్టింగులతో ఇది పురాణాలకు సంబంధించిన కథనే అన్నట్లు తెలివిగా తెరకెక్కించారు. ఫిక్షన్, పురాణాలని కలిపి కొత్తగా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. నా అంచనా ప్రకారం సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది. ఎందుకంటే కర్ణుడికి అశ్వధ్ధామ, కృష్ణుడు కలిసి విముక్తి కలిగించినట్లు పార్ట్ 2లో చూపిస్తారేమో! అయితే కృష్ణుడి ముఖాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను' అని నితీశ్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు.ఎంత నిజం?నితీశ్ భరద్వాజ్ చెప్పినట్లు పార్ట్ 2లో ప్రభాస్ పాత్ర చనిపోకపోవచ్చు. ఎందుకంటే తొలి భాగం చివర్లో అంతలా హైప్ ఇచ్చి ప్రభాస్‌ని కర్ణుడిగా చూపించారు. ఒకవేళ ఇదే పాత్ర గనక రెండో భాగంలో మరణిస్తే అభిమానులు దీన్ని తీసుకోలేకపోవచ్చు. అంటే నితీశ్ భరద్వాజ్ చెప్పినట్లేం ఏం జరగకపోవచ్చు. మరి ఇలాంటి కామెంట్స్ అన్నింటికీ ఎండ్ కార్డ్ పడాలంటే మాత్రం 'కల్కి 2' వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దర్శకుడు తాజాగా మీడియా మీట్లో చెప్పిన దానిబట్టి చూస్తే.. మరో రెండు మూడేళ్ల తర్వాత పార్ట్-2 రిలీజ్ కావొచ్చేమో!(ఇదీ చదవండి: OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ట్రైలర్) -
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే
మొన్నటివరకు టాలీవుడ్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ మాటలతో కొట్టేసుకునేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మహాభారతం హాట్ టాపిక్ అయిపోయింది. అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? లాంటి చర్చలు మొదలయ్యాయి. ఇవన్నీ కాదన్నట్లు ఇన్ స్టాలో రీల్స్ దగ్గర నుంచి టీ కొట్టు దగ్గర ముచ్చట్ల వరకు మహాభారతమే వినిపిస్తుంది. దీనంతటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగ్ అశ్విన్.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)అప్పట్లో మహాభారతం ఆధారంగా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి తీసుకుంటే ఏ డైరెక్టర్ కూడా దీన్ని సినిమాగా, కనీసం సీన్స్ వరకైనా తీసే సాహసం చేయలేదు. రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పాడు. కాకపోతే జక్కన్న ఇది తీసేసరికి ఇంకో 10-15 ఏళ్లయినా పట్టొచ్చు. ఇంతలోనే నాగ్ అశ్విన్ అనే కుర్ర డైరెక్టర్ రయ్ అని దూసుకొచ్చాడు.మరీ పూర్తిగా కాకపోయినా సరే 'కల్కి'లో మహాభారతంలోని కురుక్షేత్రానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌తో అబ్బురపరిచాడు. అశ్వద్థామ పాత్రని 'కల్కి'తో లింక్ చేసిన విధానం సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. దీంతో అసలు అశ్వద్థామ ఎవరు? అతడికి కర్ణుడితో సంబంధం ఏంటనే సీరియస్‌గా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. 'కల్కి' అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)ఇక 'కల్కి' చివర్లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు. కర్ణుడి చరిత్ర అంతా తవ్వితీస్తున్నారు. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వచ్చిన చందమామ కథలు పుస్తకాల దగ్గర నుంచి గీత ట్రస్ట్ మహాభారతం వరకు ఎవరికీ తోచిన పుస్తకాలని వాళ్లు తిరగేస్తున్నారు. ఇది కాదన్నట్లు మహాభారతం క్యారెక్టర్స్ గురించి పలువురు యాక్టర్స్ మాట్లాడిన వీడియోలని ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు.ఏదేమైనా ఓ తెలుగు సినిమా వల్ల 'మహాభారతం' అనే అద్భుతం గురించి తిరిగి మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఇప్పటి జనరేషన్‌కి మహాభారతంపై మనసు పడేలా చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి ధన్యవాదాలు. కాకపోతే అర్జున vs కర్ణ.. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ గురించి యూత్ తగువులాడుకోవడం మాత్రం వింతగా ఉంది.(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)Thank you man @nagashwin7 🥺❤️Chinnaptinunchi karnudi story amtey chala istam...finally see the Elevations on screen about karna☀️ Even the Divine knows real Hero of MAHABHARAT🙌🔥 #Karna #Kalki2898ADonJune27 #Mahabharath #Kalki2898ADReview pic.twitter.com/PhmsJae837— DRUG❤️🔥 (@Akhilgo16778185) June 28, 2024 -
నా మాజీ సతీమణి వేధిస్తుంది.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటుడు
బుల్లితెరపై మహాభారతంలో కృష్ణుడిగా నటించిన నితీష్ భరద్వాజ్ తన భార్యపై మానసిక వేధింపుల కేసు పెట్టారు. ఆయన భార్య స్మిత మధ్యప్రదేశ్ క్యాడర్లో జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. చాలా రోజుల నుంచి స్మిత తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ భోపాల్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌కి ఆయన ఫిర్యాదు చేశారు. స్మిత ఆయనకు రెండో భార్య. 1991లో మోనిషా పాటిల్‌తో నితీష్ భరద్వాజ్‌కు మొదటి వివాహం జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి అయిన స్మితను ప్రేమించి నితీష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో 2019లో విడాకుల కోసం ధరఖాస్తు చేసుకుంటే 2022లో ముంబై ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసింది. తాజాగా తన రెండో భార్య స్మితపై వేధింపుల కేసు పెట్టడంతో సంచలనంగా మారింది. భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా ఈ ఫిర్యాదును స్వీకరించారు. ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశించారు. ఏడీసీపీ షాలినీ దీక్షిత్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్లు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, నితీష్, ఐఏఎస్ అధికారిణి స్మిత ఒకరినొకరు ప్రేమించుకుని 2009లో మధ్యప్రదేశ్‌లో పెళ్లి చేసుకున్నారు. 12 సంవత్సరాల వివాహం తరువాత విబేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు స్మిత వద్దే ఉంటున్నారు. వారిని కలుద్దామనుకుంటే ఆ అవకాశం స్మిత కల్పించడం లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. వీరికి 11 ఏళ్ల వయస్సు గల కవల కుమార్తెలు ఉన్నారు. తనను స్మిత మానసిక వేధనకు గురిచేస్తుందని ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రముఖ టీవీ షో 'మహాభారతం'లో నటుడు నితీష్ భరద్వాజ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించి మెప్పించారు. గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు. -
రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా
'మహాభారతం' సినిమా తీయాలనేది నా కల. ఇది స్టార్ డైరెక్టర్ రాజమౌళి చాలాఏళ్ల క్రితమే చెప్పిన మాట. ఇప్పటి జనరేషన్ దర్శకుల్లో పీరియాడికల్ చిత్రాలంటే రాజమౌళికి మాత్రమే సాధ్యం అనేంతలా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే జక్కన షాక్ ఇస్తూ ఓ డైరెక్టర్ 'మహాభారతం' సినిమాని ప్రకటించాడు. ఇప్పుడదే మూవీ లవర్స్‌ని కంగారు పెడుతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!) హిందీలో ఏవేవో సినిమాలు తీసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. కనీసం గుర్తింపు సంపాదించలేకపోయాడు. 'ది తాష్కెంట్ ఫైల్స్'తో కాస్త ఫేమ్ వచ్చింది. ఇక 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ ఫేమ్‌ని క్యాష్ చేసుకోవాలని 'ద వ్యాక్సిన్ వార్' మూవ తీశారు. సెప్టెంబరు 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కనీసం వసూళ్లు తెచ్చుకోలేక ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు 'మహాభారతం' సినిమాని మూడు భాగాలుగా తీస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించాడు. 'పర్వ' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు కృష్ణుడు, అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి 'ద కశ్మీర్ ఫైల్స్' తప్ప చెప్పుకోదగ్గ రేంజులో ఒక్కటంటే ఒక్క సినిమా తీయలేకపోయిన వివేక్ అగ్నిహోత్రి.. 'మహాభారతం' చిత్రాన్ని ఏం చేస్తాడోనని ఆడియెన్స్ కంగారుపడుతున్నారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) BIG ANNOUNCEMENT: Is Mahabharat HISTORY or MYTHOLOGY? We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’: PARVA - AN EPIC TALE OF DHARMA. There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’. 1/2 pic.twitter.com/BiRyClhT5c — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023 -
మహాభారతంలోని ఖాండవవనం దహనం గురించి మీకు తెలుసా?
ఒకసారి వేసవిలో చల్లగా ఉంటుందని కృష్ణార్జునులు సపరివారంగా అరణ్యప్రాంతానికి వెళ్లారు. కొన్నాళ్లు అక్కడే గడిపేందుకు వీలుగా విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు కృష్ణార్జునులు వనవిహారం చేస్తుండగా, ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. వారు అతడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి, సత్కరించారు. కుశల ప్రశ్నలయ్యాక ఏం కావాలని ప్రశ్నించారు.‘అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది. భోజనం పెట్టించగలరా?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! మీకు ఏమేమి ఇష్టమో చెప్పండి. వండించి పెడతాం’ అన్నారు కృష్ణార్జునులు. అప్పుడా బ్రాహ్మణుడు తన నిజరూపంలో అగ్నిదేవుడిగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘నేను అగ్నిదేవుడిని. ఔషధమూలికలు పుష్కలంగా ఉన్న ఖాండవవనాన్ని నేను దహించాలి. అప్పుడు గాని నా అజీర్తిబాధకు ఉపశమనం కలగదు. అయితే, నేను ఖండవవనాన్ని దహించకుండా దేవేంద్రుడు ఆటంకం కలిగిస్తున్నాడు. మీరిద్దరూ తోడుంటే, ఖాండవాన్ని దహించివేస్తాను’ అన్నాడు.‘స్వామీ! అమితశక్తిమంతులు మీరు. మీకు అజీర్తిబాధ కలగడమా? ఆశ్చర్యంగా ఉందే!’ అన్నాడు అర్జునుడు.‘చాలాకాలం కిందట శ్వేతకి అనే రాజర్షి వందేళ్ల సత్రయాగం చేయ సంకల్పించాడు. అన్నేళ్లు ఏకధాటిగా రుత్విక్కుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అతడు ఈశ్వరుని కోసం తపస్సు చేసి, ఆయనను మెప్పించాడు. శ్వేతకి తన సంకల్పం చెప్పడంతో ఈశ్వరుడు దుర్వాస మహర్షిని అతడికి యాజ్ఞికుడిగా నియమించాడు. దుర్వాసుడి ఆధ్వర్యంలో శ్వేతకి నిరాఘాటంగా వందేళ్లు సత్రయాగం చేశాడు. యజ్ఞగుండంలో విడిచిన నేతిధారలను నేను అన్నేళ్లూ ఆరగించాను. అందువల్ల నాకు అజీర్తి పట్టుకుంది. నివారణ కోసం బ్రహ్మ వద్దకు వెళితే, ఖాండవవనంలో పుష్కలంగా ఔషధ మూలికలు ఉన్నాయి. వాటిని ఆరగిస్తే, అజీర్తి నయమవుతుందని సెలవిచ్చాడు. ఖాండవ దహనానికి నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఇంద్రుడు అడ్డుకుంటూ వస్తున్నాడు’ అని అగ్నిదేవుడు గోడు వెళ్లబోసుకున్నాడు. ‘దేవా! నీకు మేము సహాయం చేయగలం గాని, ఇప్పుడు మా వద్ద ఆయుధాలేవీ లేవు’ అన్నాడు అర్జునుడు. ‘మీకా చింత వద్దు’ అంటూ అగ్నిదేవుడు వెంటనే వరుణ దేవుడిని పిలిచాడు. వరుణుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘వరుణదేవా! నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనుర్బాణాలను, రథాన్ని అర్జునుడికి ఇవ్వు. చక్రాన్ని, గదను కృష్ణుడికి ఇవ్వు’ అన్నాడు.వరుణుడు సరేనంటూ, కృష్ణార్జునులకు ఆయుధాలను, రథాన్ని ఇచ్చాడు. కృష్ణార్జునులను తనకు తోడుగా తీసుకువెళ్లి, అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం మొదలుబెట్టాడు. కృష్ణార్జునులు ఇరువైపులా అగ్నిదేవుడికి రక్షణగా నిలిచారు. అడ్డు వచ్చిన వనరక్షకులను సంహరించారు. అడవిలోని పశుపక్ష్యాదులన్నీ అగ్నిజ్వాలలకు ఆహుతి కాసాగాయి.ఇంద్రుడికి ఈ సంగతి తెలిసి, ఖాండవవనం మీద కుంభవృష్టి కురవాలంటూ మేఘాల దండును పంపాడు. ఖాండవంపై మేఘాలు కమ్ముకోగానే, అర్జునుడు తన బాణాలతో ఖాండవ వనమంతా కప్పేస్తూ పైకప్పును నిర్మించాడు.మేఘాలు కుంభవృష్టి కురిసినా, ఖాండవంపై చినుకైనాకురవలేదు. అగ్నిదేవుడికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు.అగ్నికీలల నుంచి రక్షించుకోవడానికి తక్షకుడి కొడుకైన అశ్వసేనుడు తల్లి తోకను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. అర్జునుడు అశ్వసేనుడిని బాణాలతో కొట్టాడు. అది చూసి ఇంద్రుడు అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడిపై మోహినీ మాయ ప్రయోగించి, అశ్వసేనుడిని, అతడి తల్లిని కాపాడాడు. నిమిషంలోనే తేరుకున్న అర్జునుడు వెంటనే ఇంద్రుడిపై తిరగబడ్డాడు. చాలాసేపు యుద్ధం సాగింది. తనను తాను కాపాడుకోవడానికి ఇంద్రుడు యుద్ధం కొనసాగిస్తూ ఉండగా, ‘దేవేంద్రా! వీరిద్దరూ నరనారాయణులు. వీరిని జయించడం నీకు అసాధ్యం.తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రానికి పారిపోయాడు’ అని అశరీరవాణి పలికింది. చేసేదేమీ లేక ఇంద్రుడు తిరిగి స్వర్గానికి బయలుదేరాడు. ఖాండవదహనం సాగుతుండగా, సముచి అనే రాక్షసుడి కొడుకైన మయుడు అర్జునుడిని శరణుజొచ్చి ప్రాణాలను దక్కించుకున్నాడు. మయుడితో పాటు అతడి తల్లి, మందపాలుడు, అతడి కొడుకులైన నలుగురు శారఙ్గకులు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు.అగ్నిదేవుడు పదిహేను రోజుల పాటు ఖాండవవనాన్ని సమూలంగా దహించి, తన ఆకలి తీర్చుకున్నాడు. అగ్నిదేవుడి అజీర్తిబాధ నయమైంది. తనకు సహకరించిన కృష్ణార్జునులకు కృతజ్ఞతలు తెలిపి తన దారిన వెళ్లిపోయాడు. -
G20 Summit - జీ20 అతిధులకు బుక్లెట్లు
న్యూఢిల్లీ: 'భారత్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 సదస్సుకు ఆయా దేశాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. వారికి ఇవ్వడానికి భారతీయత ఉట్టిపడే విధంగా రెండు పుస్తకాలను ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. క్రీస్తుపూర్వం 6000 ఏళ్లనాటి భారత చరిత్ర మొత్తం ప్రతిబింబించేలా వీటిని ముద్రించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగబోయే జీ 20 సమావేశాలకు భాగస్వామ్య 20 దేశాలతో పాటు అతిధులుగా మరో తొమ్మిది దేశాలు కూడా హాజరు కానున్నాయి. ఈ నేపథ్యంలో అతిరథ మహారధులందరికి చేతికి అందివ్వడానికి రెండు బుక్లెట్లను ముద్రించింది కేంద్రం. వీటిలో ఒకటి 'భారత్-ప్రజాస్వామ్యానికి మాతృక' కాగా రెండవది 'భారతదేశంలో ఎన్నికలు'. ఈ రెండు పుస్తకాల్లోని 40 పేజీల్లో రామాయాణం, మహాభారతంలోని ఇతిహాస ఘట్టాలు, ఛత్రపతి శివాజీ, అక్బర్ వంటి చక్రవర్తుల వీరగాధలతో పాటు సార్వత్రిక ఎన్నికల ద్వారా భారతదేశంలో అధికార మార్పిడి గురించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. ప్రజాస్వామ్య తత్వమన్నది భారతదేశ ప్రజల్లో సహస్రాబ్దాలుగా భాగమని చెప్పడము ఈ రెండు బుక్లెట్ల ముఖ్య ఉద్దేశ్యమని తెలుపుతూ ఈ ప్రతుల సాఫ్ట్ కాపీలను జీ20 అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచింది. మొదటి 26 పేజీల డాక్యుమెంటు భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృకగా వర్ణిస్తుంది. దీని ముఖచిత్రంగా 5000 ఏళ్ల నాటి నాట్యం చేస్తున్న మహిళామూర్తి కాంస్య ప్రతిమను ముద్రించారు. సామాన్యులు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సభనుద్దేశించి చతుర్వేదాల్లో ఆది వేదమైన ఋగ్వేదంలోని శ్లోకాన్ని కూడా ముద్రించారు. రామాయణ, మహాభారతాల్లోని ప్రజాస్వామిక అంశాలను ప్రస్తావించారు. రామాయణం నుంచి దశరధ మాహారాజు ప్రజాప్రతినిధులు, మంత్రులను సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రచురించారు. అదేవిధంగా మహాభారతం నుంచి ధర్మరాజుకు భీష్మణాచార్యలు చెప్పినా సుపరిపాలనా నియామాల గురించి.. ప్రజా శ్రేయస్సు, సంతోషాలను కాపాడటమే రాజు ధర్మమని చెప్పిన అంశాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు. బౌద్ధమతం దాని సిద్ధాంతాలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి చక్రవర్తులకు చాణక్యుడి అర్థశాస్త్రం ఏ విధంగా ప్రజాస్వామ్య నిఘంటువుగా నిలిచి నడిపియించిందో అందులో పొందుపరిచారు. ఇది కూడా చదవండి: రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్ -
స్వర్గం నుంచి దిగివచ్చిన దేవతా వృక్షం.. రాత్రయితే అంతులేని అందాల విందు!
స్వర్గం ఎంత అందంగా ఉంటుందో మనం అనేక కథల రూపంలో వినేవుంటాం. స్వర్గం నుంచి దిగివచ్చే అప్సరసలు కంటిమీద కునుకులేకుండా చేస్తుంటారని కొందరు అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా స్వర్గం నుంచి దిగివచ్చిన వృక్షం గురించి విన్నారా? అవును.. ఇప్పుడు మనం స్వర్గపు వృక్షం అంటే పారిజాత వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దివ్య వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ వృక్షానికి ప్రతిరాత్రి రంగురంగుల పూలు వికసిస్తాయి. అవి ఉదయానికి రాలిపోతాయి. ఈ దివ్య వృక్షాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు. పౌరాణిక గాథల ప్రకారం సాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటు పారిజాత వృక్షం కూడా వెలికి వచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ పారిజాతాన్ని తన తన భార్య సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని చెబుతారు. అర్జునుడు మహాభారత కాలంలో ద్వారకా నగరంలోని ఈ వృక్షాన్ని కింతూర్ గ్రామానికి తీసుకువచ్చాడని స్థానికులు చెబుతుంటారు. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గల కింతూర్ గ్రామంలో ఉంది. ఈ పారిజాత వృక్షానికి స్థిరమైన పేరు లేదు. దీనిని హర్సింగర్, షెఫాలీ, ప్రజక్త అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. పారిజాతంనకు బెంగాల్ రాష్ట్ర పుష్పం హోదా కూడా ఉంది. ఈ భారీ పారిజాత వృక్షం ఈ గ్రామంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రతి రాత్రి ఈ చెట్టుకు చాలా అందమైన పూలు వికసిస్తాయి. ఉదయం కాగానే ఈ పూలన్నీ నేలరాలిపోతాయి. యూపీలోని బారాబంకి జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతూర్ గ్రామం మహాభారత కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. పాండవుల తల్లి అయిన కుంతి పేరు మీదుగా ఈ గ్రామం ఏర్పడిందంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు ఈ గ్రామంలోనే ఉన్నారట. కుంతీమాత ప్రతిరోజూ శివునికి పూలు సమర్పించవలసి వచ్చినప్పుడు, అర్జునుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి ఇక్కడకు తీసుకువచ్చారని చెబుతారు. గ్రామంలో కుంతీమాత నెలకొల్పిన కుంతేశ్వరాలయం కూడా ఉంది. ఇతర పూలతో పోలిస్తే పారిజాతం పూలు ప్రత్యేక సమయంలో మాత్రమే వికసిస్తాయి. దీని వెనుక ఇంద్రుని శాప వృత్తాంతం దాగి ఉంది. ప్రపంచం మొత్తంలో పూలు ఉదయం పూస్తుండగా, పారిజాతం పూలు రాత్రి పూట వికసించి, చూపరులకు అందాలను అందిస్తాయి. సత్యభామ ఈ పూలతో తన కురులకు అలంకరించుకునేదని, రుక్మణి ఈ పూలను పూజకు ఉపయోగించేదని చెబుతుంటారు.ఈ తరహా పారిజాత వృక్షం భారతదేశంలోని కింతూర్ గ్రామంలో మాత్రమే కనిపించడం విశేషం. ఇది కూడా చదవండి: తండ్రి బకాయి కోసం.. కుమార్తెతో 52 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. తుపాకీ చూపించి.. -
అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే..
మనదేశంలో రామాయణ, మహాభారత కథలతో ముడిపడిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అవి ఎంతో ఆదరణ పొందుతున్నాయి కూడా. వీటిలో విచిత్రమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే రావణుని మూత్రంతో ఏర్పడిన చెరువు. వింత కథనం ఈ కథ ఎంతో వింతగా అనిపిస్తుంది. అయితే మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో ముడిపడిన కథలు స్థానికుల, పురాణాల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. రావణుని మూత్రంతో నిండిన చెరువు కూడా ఈ కోవలోకే వస్తుంది. జార్ఖండ్‌లోని బైద్యనాథ్‌లో అత్యంత ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని రావణుడు ఇక్కడికి తీసుకువచ్చాడని చెబుతారు. కనీసం నీటిని తాకరు ఈ ఆలయానికి సమీపంలో రెండు చెరువులు ఉన్నాయి. వాటిలో ఒక చెరువు రావణుని మూత్రంతో ఏర్పడిందని చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడికి వచ్చేవారు కనీసం ఈ నీటిని తాకరు. అలాగే ఈ నీటిని ఏ పనులకు కూడా వినియోగించరు. రావణుని మొండితనాన్ని గ్రహించి.. ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకసారి రావణుడు మహాశివునికి ప్రతిరూపమైన శివలింగాన్ని లంకకు బలవంతంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. రావణుని మొండితనాన్ని గ్రహించిన మహాశివుడు ఆ శివలింగాన్ని దారిలో ఎక్కడ కింద పెట్టినా, అది మరిక కదలదని చెబుతాడు. ఈ షరతు విన్న రావణుడు దానికి సరేనంటాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న విష్ణుమూర్తి ఇది జరగకుండా చూడాలని తిరిగి శివుడిని కోరుతాడు. లఘుశంక తీర్చుకునేందుకు.. శివలింగం తీసుకువెళుతున్న రావణుడు దారిలో లఘుశంక కోసం ఆగాల్సి వస్తుంది. ఈ సమయంలో మహావిష్ణువు బాలుని రూపంలో రావణునికి ఎదురవుతాడు. రావణుడు కాసేపు ఈ శివలింగాన్ని పట్టుకోవాలని ఆ పిల్లవాడిని కోరతాడు. రావణుడు లఘుశంక తీర్చుకుని తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు కనిపించడు. అయితే ఆ శివలింగం అక్కడ నేలపై ఉంటుంది. రావణుడు ఆ శివలింగాన్ని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట. బైద్యనాథ్‌లో కొలువై.. ఆ శివలింగమే బైద్యనాథ్‌లో కొలువై పూజలు అందుకుంటోందని చెబుతారు. రావణుడు మూత్రం పోసిన ప్రాంతం చెరువుగా మారిందని, అందుకే దానిని రావణుని మూత్రం చెరువుగా అభివర్ణిస్తారు. అలాగే దీనిలోని నీటిని ఎవరూ వినియోగించరు. కాగా ఇది నమ్మకాలపైన ఆధారపడిన అంశమని, దీనిలో వాస్తవం లేదనేవారు కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే.. -
ప్రభాస్ కథతో బన్నీ కొత్త సినిమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అది కూడా నాలుగోసారి. అధికారికంగా లాంచ్ జరిగిపోయింది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ కాంబో.. ఈసారి ఎలాంటి సినిమా చేయబోతున్నారు? ఎప్పుడు మొదలవుతుంది? థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? లాంటి ప్రశ్నలు.. అభిమానుల బుర్రలు తొలిచేస్తున్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహాభారతం ఆధారంగా 'పుష్ప' సినిమాతో బన్నీ.. అనుహ్యంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం 'పుష్ప 2' చేస్తున్నాడు. తర్వాత ఎవరితో కలిసి పనిచేయబోతున్నాడా అనే ప్రశ్నకు తెరదించాడు. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్ తోనే వరసగా నాలుగోసారి కలిసి వర్క్ చేయబోతున్నాడు. గత మూడు సినిమాలని కమర్షియల్ గా తీసి వీళ్లు హిట్స్ కొట్టారు. ఈసారి మాత్రం మహాభారతాన్ని స్పూర్తిగా తీసుకుని, ఓ సోషియో ఫాంటసీ కథని గురూజీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!) ప్రభాస్ కథతో అయితే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చాలా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది దర్శకులు అతడికి స్టోరీలు వినిపించారు. అలా త్రివిక్రమ్ కూడా ఓ కథని ప్రభాస్ కి చెప్పారట. కానీ అది సమయం కుదరక, ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు దాన్నే కొన్ని మార్పులు చేసి, బన్నీకి వినిపించగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ ప్రయోగం గతంలో 'బద్రీనాథ్' సినిమాతో అల్లు అర్జున్.. ఫాంటసీ స్టోరీ ప్రయోగం చేశాడు. కానీ ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కావడం, అతడికి పురాణాలు, ఇతిహాసాలపై మంచి పట్టుండటం అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న 'పుష్ప 2' పూర్తయ్యేసరికి మరో 7-8 నెలలు పట్టొచ్చు. అంతలో త్రివిక్రమ్ 'గుంటూరు కారం' పూర్తి చేస్తారు. అంటే 2024 వేసవిలో అలా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టి, 2025 లేదా 2026లో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) (ఇదీ చదవండి: బేబమ్మ రెచ్చిపోవడానికి ఇదా అసలు కారణం?) -
మహాభారత్ నటుడు కన్నుమూత
మహాభారత్ సీరియల్లో శకుని మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుఫి ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గుఫీ మేనల్లుడు హిటెన్ వెల్లడించారు. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు ఓ కొడుకు, కోడలితో పాటు ఓ మనవడు కూడా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంధేరి సబర్బన్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి) కాగా.. గుఫీ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించారు. మహాభారత్ సీరియల్‌తో పాటు బహదూర్ షా జఫర్, కానూన్, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీ కృష్ణ, రాధాకృష్ణ, జే కనియా లాల్ షోలలో కనిపించాడు. అతను 1975 చిత్రం రఫూ చక్కర్తో బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దిల్లాగి, దేశ్ పరదేశ్, సుహాగ్ చిత్రాలలో కనిపించాడు. -
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 'మహాభారత్' నటుడు
మహాభారత్ సీరియల్లో శకుని మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గుఫి పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన బంధువు హిటెన్ మీడియాకు వెల్లడించాడు. 'గుఫికి రక్తపోటు అలాగే హృదయ సంబంధిత సమస్యలున్నాయి. చాలాకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగుండటం లేదు. ఇటీవల ఆయన పరిస్థితి మరింత విషమించింది. అందుకే ఆయన్ను వారం రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకొచ్చాం. మొదట ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం గుఫి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచారు' అని పేర్కొన్నాడు. కాగా నటుడు గుఫి పైంటాల్.. మహాభారత్ సీరియల్ మాత్రమే కాకుండా సీఐడీ, హెల్లో ఇన్స్పెక్టర్ వంటి టీవీ షోలు కూడా చేశాడు. సిల్వర్ స్క్రీన్‌కే పరిమితం కాకుండా శర్మాజీ నామ్కీన్, సుహాగ్, దిల్లగీ చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు. చదవండి: రోజుకు రెండు కోట్లు అని పబ్లిక్‌గా చెప్పడం అవసరమా? రైలు ప్రమాదం.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ అసందర్భోచిత ట్వీట్.. నెటిజన్స్ ఫైర్ -
ఓటీటీ చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్’
మహాభారతం నిజంగా ఒక మహాగ్రంథం. అది చదవడం మొదలు ఎన్నటికీ పూర్తికానంతగా రచన జరిగింది. లెక్కలేనన్ని పాత్రలు, పాత్రధారులు మనకు కనిపిస్తారు. ప్రతి ఒక్క పాత్రకు దానికంటూ ఒక విశిష్టత ఉంటుంది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంధాన్ని తెరకెక్కించాలని ఎన్నో నిర్మాణ సంస్థలు, దర్శకులు సన్నాహాలు చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. అయితే ఇది సినిమా కంటే ముందు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్’ రాబోతుంది. అల్లు ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. ‘గ్రేటెస్ట్ ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడుతుంది. ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌లో 'మహాభారత్' రాబోతుంది’ అని అడిస్నీ+ హాట్‌స్టార్ సంస్థ ట్వీట్ చేసింది. అల్లు ఫ్యామిలీ ఇటీవలే అల్లు ఎంటర్టైన్మెంట్స్ను ప్రారంభించింది. ఇప్పటికే వారు మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌కు సహ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. The greatest epic ever written- retold at a scale never seen before! Stay tuned for an ethereal spectacle- #Mahabharat, is coming soon only on @DisneyPlusHS #HotstarSpecials #Mahabharat #MahabharatOnHotstar @alluents & @MythoStudios pic.twitter.com/5yhs7HvuCC — Disney Star (@starindia) September 10, 2022 -
భర్త చనిపోయిన రెండు రోజులకే ఈ నటి ఏం చేసిందో తెలుసా?
బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గత శనివారం(జులై30)న తుదిశ్వస విడిచారు. అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే నటి కేత్కి దేవ్ షూటింగ్లో పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేత్కి దేవ్.. భర్త చనిపోయినప్పటికీ ఎటువంటి బ్రేక్ తీసుకోలేదని పేర్కొంది. ముందుగానే డేట్స్ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు తెలిపింది. 1983లో రసిద్ దేవ్- కేత్కి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు. ‘బాలికా వధు’,క్యోంకీ సాస్ బీ కబీ బహు తీ’ సహా పలు హిందీ, గుజరాతీ సినిమాలతో కేత్కి దేవ్ గుర్తింపును సంపాదించుకుంది. -
కిడ్నీ ఫెయిల్.. 'మహాభారత్' సీరియల్ నటుడు మృతి
బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్(65) కిడ్నీ ఫెయిల్యూర్‌తో మరణించారు. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు 15 రోజులపాటు చికిత్స తీసుకున్న ఆయనను గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆ మరునాడే కిడ్నీ ఫెయిల్ అవడంతో ప్రాణాలు విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రసిక్ దేవ్‌కు భార్య కేత్కి, కూతురు రిద్ధి దేవ్, ఓ కుమారుడు ఉన్నారు. కాగా రసిక్ దేవ్ పుత్ర వధు అనే గుజరాతీ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. తన భార్య కేత్కితో కలిసి నాచ్ బలియే డ్యాన్స్ షోలోనూ పాల్గొన్నారు. ఇకపోతే రసిక్ బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితమే! మహాభారత్ సీరియల్లో ఆయన నంద పాత్రలో ఒదిగిపోయారు. Sad to know about the demise of a dear friend Rasik Dave who was a versatile actor on stage , tv and films due to kidney failure. Heartfelt condolences to his wife Ketaki Dave and his entire family . Will always be remembered . ॐ शान्ति ! 🙏 pic.twitter.com/tORLPIUKA4 — Ashoke Pandit (@ashokepandit) July 29, 2022 చదవండి: ఇదే నాకు తొలిసారి.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు: రష్మిక నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ -
అలా జరిగి ఉండకపోతే..
ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతే... అసలు కథ మరోలా ఉండేదిరా అంటూ ఉంటాం. నిజ జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా ఓ చిన్న ఘటనే అనుకోని మలుపైపోతుంది. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. యథార్థ జీవితంలోని ఘటనలను మనం çసృష్టించలేం. అదే సాహిత్యంలో అయితే... ఇటువంటి మలుపులను రచయితలు చాలా తెలివిగా çసృష్టిస్తారు. ఇక అక్కడి నుండి కథను ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. ఆ ట్విస్టే అద్భుత రచనలకు ప్రత్యేక ఆకర్షణ అయిపోతుంది. అదే రచయితలోని చమత్కారాన్ని చాటి చెబుతుంది. మహాభారతాన్నే తీసుకోండి. పాండురాజు కుమారులు ప్రశాంతంగా తమ రాజ్యాన్ని తాము ఏలుకుంటూ సుఖంగా జీవిస్తోన్న తరుణంలో రచయిత వ్యాసుడి మెదడులో ఓ మెరుపులాంటి మలుపు తట్టింది. తాను సృష్టించిన పాత్రలతో ఓ కొత్త ఆట ఆడుకోవాలనిపించింది. అంతే ధర్మ రాజును జూదానికి ప్రేరేపించాడు. అది మామూలు ద్యూతం అయితే అనుకున్న ట్విస్ట్ రాదు కాబట్టి అధర్మ, మాయా ద్యూతాన్ని సృష్టించాడు. అందుకోసం శకునికి ఓ పెద్ద నేపథ్యం సృష్టించి, పాచికలు శకుని ఎలా చెబితే అలా ఆడేలా ప్లాన్ చేశాడు. ఆ రోజున శకుని మాయోపాయంతో కౌరవులు ధర్మరాజుని జూదానికి పిలవగానే జూదం అంటే మితిమీరిన ప్రేమ కలిగిన ధర్మరాజు మరో ఆలోచనే లేకుండా సై అన్నాడు. జూదం ఆడి శకుని మాయలో పడి రాజ్యాన్నీ, ధర్మపత్నినీ కూడా జూదంలో పోగొట్టుకున్నాడు. ఆ రోజు జూదం ఆడి ఉండకపోతే... పాండవులు అరణ్య వాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు... కౌరవులపై పాండవులకు కక్ష పుట్టేది కాదు... ఇద్దరి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగాల్సిన అవసరమూ ఉండేది కాదు! కేవలం జూదం కారణంగా లక్షలాది సైనికుల ప్రాణాలు తీసే యుద్ధం అనివార్యమైంది. ఆ తర్వాత పాండవులు, కౌరవుల్లో ఎవరూ మిగలకుండా అందరూ చనిపోవలసి వచ్చింది. ఇంత పెద్ద కథ రాసుకోవడం కోసం... వ్యాసుడు çసృష్టించిన అద్భుతమైన ట్విస్టే– మాయా ద్యూతం. ఇదే లేకపోతే అసలు మహాభారతంలో మసాలాయే లేదు. ‘తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి’ అని మనవాళ్ళు అని ఉండేవారు కారు. ఇటువంటి ట్విస్టే రామాయణంలో రచయిత వాల్మీకీ ప్రయోగించారు. అయితే వాల్మీకి రెండు మలుపులు పెట్టారు. కైకేయికి దశరథుడు ఏం కావాలంటే అది ఇస్తానని వరం ఇవ్వకుండా ఉంటే... రాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు. సరే... అరణ్యానికి వెళ్లాడే అనుకుందాం. అక్కడైనా పధ్నాలుగేళ్ల పాటు అడవిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా గడిపేసి, తిరిగి అయోధ్య వచ్చేయ వచ్చు. అందుకే వాల్మీకి అడవిలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు. బంగారు లేడి కోసం రాముడు వెళ్లగానే, రాముడు ప్రమాదంలో ఉన్నాడనుకుని సీతమ్మ చెప్పిన వెంటనే లక్ష్మణుడూ వెళ్లాడు. వెళ్లే ముందు ఓ గీత గీసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటద్దని షరతు విధించాడు. సీతమ్మ దానికి కట్టుబడి ఉంటే బాగుండేది. కానీ.. రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను గీత దాటేలా ప్రేరేపించడంతో లక్ష్మణుడి మాట పెడచెవిన పెట్టిన సీతమ్మ గీత దాటింది. అంతే... రావణుడు ఆమెను లంకకు ఎత్తుకుపోయాడు. సీతను రక్షించుకోవడం కోసమే రాముడు వానర సైన్యం సాయంతో సముద్రాన్ని దాటి, లంకలో రావణుడితో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సీతే కనక గీత దాటి ఉండకపోతే – ఇంత కథ ఉండేది కాదు. వాల్మీకి సృష్టించిన ఈ ట్విస్టుతో రామాయణం నిత్య పారాయణమైంది. వ్యాసుడు, వాల్మీకే కాదు... యుగాల తరబడి గొప్ప గొప్ప రచయితలంతా కూడా తమ ఉద్గ్రంథాల్లో ఏదో ఓ చిన్న ట్విస్ట్ తో మొత్తం కథను నడుపుతారు. కథలోని ఆ కీలకమైన మలుపులే ఆ రచయితనూ, రచననూ కలకాలం గుర్తుండేలా చేస్తాయి. శకుంతలా దుష్యంతుల కథ అయిన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో మొత్తం మెలోడ్రామాకి ఉంగరమే పెద్ద ట్విస్ట్. దుష్యంతుడికి మతి మరుపు శాపం అనేది కథకు కొక్కెం. అందుకే ఆ కథ, ఆ నాటకం ఏ రూపంలో వచ్చినా అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక యథార్థ జీవితంలోనూ ఇటువంటి మలుపులు లేకపోలేదు. ప్రపంచ చరిత్రలో జర్మనీ నియంత హిట్లర్ సోవియట్ రష్యా పైకి యుద్ధానికి కాలు దువ్వి ఉండకపోతే... జర్మనీ కథ మరోలా ఉండేది. సోవియట్ రష్యాకు సవాల్ విసరడం వల్లనే జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్టాలిన్ యుద్ధానికి వెళ్లాడు. సోవియట్ ఆర్మీ చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గం లేక చివరకు హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. సోవియట్ జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే జర్మనీని మరికొన్నేళ్ల పాటు హిట్లర్ ప్రశాంతంగా ఏలుకుని ఉండేవాడేమో? ఈ స్క్రిప్ట్‌ను ఎవరూ రాయలేదు. దానంతట అది ఆవిర్భవించడంతో చరిత్రకారులు దాన్ని రాసుకున్నారు. బ్రిటిష్ వాడిని మొదట్లోనే అడ్డుకొని, ‘ఎవర్రా నువ్వు? మా దేశంలోకి ఎందుకొచ్చావ్?’ అని కాలర్ పట్టుకొని ఉంటే, భారతదేశం తెల్లవాడి పాలనలో బానిస బతుకు బతకాల్సి వచ్చేది కాదు. స్వాతంత్య్ర సంగ్రామం అవసరమయ్యేదీ కాదు. ఇది కూడా చరిత్ర సృష్టించిన ట్విస్ట్. ఇందులోని అసలు గొప్పతనం ఏమిటంటే... రచయితలు çసృష్టించే మలుపులు చాలా సహజంగా ఉంటాయి. అవి నిజమే కాబోలు అనిపించేలా ఉంటాయి. అలా రాయడంలోనే వారి నైపుణ్యం కనపడుతుంది. మహారచయితలంతా కథాంశంలోని కీలకమైన మలుపులను ఆసరాగా చేసుకొన్నవారే! తమ రచనలను చిరస్మరణీయ గ్రంథాలుగా మలుచుకున్నవారే! కథల్లోని మలుపులతో ప్రపంచ సాహిత్యాన్నే మలుపు తిప్పిన రచయితలకు వందనాలు. -
స్వర్గం వద్దన్న ముద్గలుడు
ముద్గలుడు సకల సద్గుణ సంపన్నుడు. కురుక్షేత్రంలో భార్య, కుమారుడితో కలసి ఉండేవాడు. ఏడాదిలోని మూడువందల అరవై రోజులూ ఏదో ఒక వ్రతదీక్షలోనే ఉండేవాడు. జపతపాలు చేసుకుంటూ, భిక్షాటనతో కుటుంబ పోషణ చేసుకునేవాడు. అతిథులను ప్రాణప్రదంగా ఆదరించేవాడు. కొన్నాళ్లకు ముద్గలుడు పక్షోపవాస దీక్ష చేపట్టాడు. ఉభయ పక్షాల్లోనూ పాడ్యమి నుంచి పద్నాలుగు రోజులు యాచన ద్వారా సంపాదించిన గింజలతో దైవపూజ, పితృపూజ చేసేవాడు. ఆ పద్నాలుగు రోజులూ ఉపవాసం ఉండేవాడు. ఉపవాస దీక్ష ముగించే ముందు శుక్లపక్షంలో పౌర్ణమినాడు, కృష్ణపక్షంలో అమావాస్యనాడు అతిథులకు భోజనం పెట్టేవాడు. మిగిలినది భార్యా కొడుకులతో కలసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడు. ముద్గలుడు ఇలా కాలం గడుపుతుండగా, ఒక పర్వదినం రోజున దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. దుర్వాసుడు స్నానాదికాలు చేసి ఎన్నాళ్లో అయినట్లుగా అతి అసహ్యకరంగా ఉన్నాడు. జుట్టు విరబోసుకుని, మురికి కౌపీనంతో పిచ్చివాడిలా ఉన్నాడు. నకనకలాడే ఆకలితో సోలిపోతూ ఉన్నాడు. అతణ్ణి చూసి ముద్గలుడు ఏమాత్రం అసహ్యపడలేదు. సాదరంగా ఎదురేగి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. స్నానానికి ఏర్పాట్లు చేశాడు. భక్తిశ్రద్ధలతో భోజనం పెట్టాడు. దుర్వాసుడు తిన్నంత తిని, మిగిలినది ఒళ్లంతా పూసుకుని, మాటా పలుకూ లేకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు. ముద్గలుడి ఇంటికి ఇలా ఆరుసార్లు వచ్చాడు దుర్వాసుడు. వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. చక్కగా విస్తరివేసి భోజనం పెడితే, తిన్నంత తినడం, మిగిలినదంతా ఒంటికి పూసుకుని వెళ్లిపోవడమే! దుర్వాసుడి చేష్టలకు ముద్గలుడు ఏమాత్రం కోప్పడలేదు. పరుషంగా మాట్లాడటం కాదు కదా, కనీసం మందలించనైనా లేదు. దుర్వాసుడు వచ్చిన ప్రతిసారీ ముద్గలుడు అతణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో ఏ లోపమూ లేకుండా సేవించుకున్నాడు. ముద్గలుడి సహనానికి, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైపోయాడు దుర్వాసుడు. ‘ముద్గలా! నీ తపస్సుకు, సహనానికి, శాంతానికి, ధర్మనిష్ఠకు నేను ముగ్ధుణ్ణయ్యాను. ఇంతటి తపశ్శక్తి ఏ లోకంలోనూ నేను చూడలేదు. నీవంటి తాపసులు ముల్లోకాల్లో ఎక్కడా ఉండరు. దేవతలు కూడా నీ తపశ్శక్తిని పొగుడుతున్నారు. నీకోసం దివ్యవిమానం ఇప్పుడే వస్తుంది. స్వశరీరంతో స్వర్గానికి వెళ్లి సుఖించు’ అని చెప్పి వెళ్లిపోయాడు. దుర్వాసుడు చెప్పినట్లుగానే ముద్గలుడి ముందు దివ్యవిమానం వచ్చి నిలిచింది. అందులోంచి ఒక దేవదూత దిగివచ్చి, ముద్గలుడికి వినమ్రంగా ప్రణమిల్లాడు. ‘మహర్షీ! అనన్యమైన నీ తపశ్శక్తి ఫలితంగా స్వశరీరంతో స్వర్గ ప్రవేశం చేసే అర్హత నీకు లభించింది. దయచెయ్యి. నాతో కలసి విమానాన్ని అధిరోహించు. నిన్ను స్వర్గానికి తీసుకుపోతాను’ అన్నాడు. ‘మహాత్మా! స్వర్గం అంటే ఏమిటి? అదెక్కడ ఉంటుంది? అక్కడి మంచిచెడ్డలేమిటి? నాకు తెలుసుకోవాలని ఉంది. కుతూహలం కొద్ది అడుగుతున్నానే గాని, నిన్ను పరీక్షించడానికి కాదు. కాబట్టి ఏమీ అనుకోకుండా నా సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు ముద్గలుడు. ‘ఈ మర్త్యలోకానికి పైన చాలా దూరాన ఊర్ధ్వదిశలో ఉంది స్వర్గలోకం. సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాలంకార భూషితమై, దివ్యకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. గొప్ప తపస్సంపన్నులు, యజ్ఞాలు చేసేవాళ్లు, సత్యనిష్ఠతో జీవితం గడిపినవాళ్లు, ధర్మాత్ములు, దానశీలురు, రణశూరులు, ఇంద్రియాలను జయించిన ఉత్తములు మాత్రమే స్వర్గార్హత సాధించగలరు. అలాంటి వాళ్లు అక్కడ హాయిగా సర్వసుఖ వైభోగాలతో ఆనందంగా గడుపుతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఎవరెవరి నెలవుల్లో వారు నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో జరా వ్యాధి మరణాలేవీ ఉండవు. ఆకలి దప్పులుండవు. వేడీ చలీ ఉండవు. ఎటు చూసినా మనోహరంగా ఉంటుంది. ఇంద్రియాలన్నీ నిరంతరం ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాయి’ చెప్పాడు దేవదూత. ‘అయినా, స్వర్గం మంచిచెడులు అడిగావు కదూ! ఇప్పటివరకు స్వర్గంలోని మంచివిషయాలన్నీ ఏకరువు పెట్టాను. ఇక స్వర్గానికీ పరిమితులు ఉన్నాయి. అవి కూడా చెబుతాను విను. భూలోకంలో చేసిన పుణ్యఫలాన్నే మనుషులు స్వర్గంలో అనుభవిస్తారు. అక్కడ మళ్లీ పుణ్యం చేయడానికి అవకాశం ఉండదు. భూమ్మీద చేసిన పుణ్యం చెల్లిపోగానే, స్వర్గం నుంచి తరిమేస్తారు. మళ్లీ భూమ్మీద జన్మించవలసిందే! అలవాటైన సుఖాలను వదులుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకో! పుణ్యం నశించిన మనిషి ఆ దుఃఖంతోనే మళ్లీ భూమ్మీద పుడతాడు. బ్రహ్మలోకం తప్ప మిగిలిన పుణ్యలోకాలన్నింటిలోనూ ఇదే తంతు. పుణ్యలోకాల నుంచి తిరిగి భూమ్మీదకు తరిమివేయడబడ్డ మనిషి సుఖవంతుడిగానే పుడతాడనుకో! ఎందుకంటే భూలోకం కర్మభూమి, మిగిలిన పుణ్యలోకాలన్నీ ఫలభూములు. ఇదీ సంగతి. మంచివాడివని ఏదో నీ మీద ఆదరంతో ఇవన్నీ నీతో చెప్పాను. ఇప్పటికే ఆలస్యమవుతోంది. ఇక దయచెయ్యి. స్వర్గానికి బయల్దేరుదాం’ అన్నాడు దేవదూత. అంతా విని కాసేపు ఆలోచించాడు ముద్గలుడు. ‘అలాగైతే, ఆ స్వర్గం నాకొద్దు. ఏదో రమ్మని ఆదరంగా పిలిచావు. అదే పదివేలు అనుకుంటాను. ఆ స్వర్గసౌఖ్యాలేవో దేవతలకే ఉండనీ. జపతపాలు చేసుకునే నాకెందుకవన్నీ? వెళ్లు. నీ విమానం తీసుకుని వచ్చినదారినే బయలుదేరు. ఎక్కడికి వెళితే మనిషి మళ్లీ తిరిగి భూమ్మీదకు రాకుండా ఉంటాడో అలాంటి ఉత్తమలోకం కావాలి నాకు. అంతేగాని, పుణ్యఫలాన్ని కొలతవేసి, అంతమేరకు మాత్రమే దక్కే తాత్కాలిక స్వర్గమెందుకు నాకు? శాశ్వతమైన ఉత్తమలోకమే కావాలి నాకు. అలాంటిదానికోసమే ఎంత కష్టమైనా ప్రయత్నిస్తాను’ అన్నాడు ముద్గలుడు. దేవదూత ఎంత బతిమాలినా పట్టించుకోకుండా, అతణ్ణి సాగనంపాడు. దేవదూతను సాగనంపిన తర్వాత ముద్గలుడు యాచకవృత్తిని కూడా వదిలేశాడు. పరమశాంత మార్గం అవలంబించాడు. నిందాస్తుతులకు చలించడం మానేశాడు. మట్టినీ బంగారాన్నీ ఒకేలా చూసేటంతగా ద్వంద్వాతీత స్థితికి చేరుకున్నాడు. పూర్తిగా తపస్సులోనే మునిగిపోయాడు. నిర్వికల్ప జ్ఞనాయోగంతో తుదకు మోక్షం పొందాడు. - సాంఖ్యాయన -
పెన్సిళ్ల పై మహాభారతాన్ని లిఖించింది!
కారంచేడు: సూక్ష్మకళపై మక్కువతో సీస లేఖినిలపై (పెన్సిళ్లపై) మహాభారతాన్ని లిఖించింది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. మహాభారతంలోని 18 పర్వాలను.. 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు ఆమె 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. ఇందుకోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవడం లక్ష్యమని మహిత చెబుతోంది. బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులు మహిత మొదట్లో బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులను చెక్కడం ప్రారంభించింది. గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు, కొంగ, మినప్పప్పుపైన కూడా వినాయకుడు వంటి ఆకృతులను చక్కగా చెక్కి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత పెన్సిల్‌పై మహాభారతాన్ని చెక్కాలనే ఆలోచనకు పదునుపెట్టింది. సూక్ష్మ కళలను ప్రోత్సహించాలి కళలలో సూక్ష్మకళ ఒకటి. అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి సూక్ష్మకళను ప్రోత్సహించాలి. నాలాంటి వారెందరో ఉన్నా.. ప్రతిభను కనబర్చుకునే వీలు లేక ఇలాంటి కళలు మరుగున పడుతున్నాయి. ఆర్థికం, శిక్షణ పరంగా ఈ కళలను ప్రోత్సహించాలి. – అన్నం మహిత (చదవండి: సరికొత్త శకం) -
Praveen Kumar Sobti: స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్..భీముడిగా గుర్తింపు
Praveen Kumar Sobti:- న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విజేయుడు... ‘మహాభారత్’లో భీముడు ప్రవీణ్ కుమార్ సోబ్టీ కన్నుమూశారు. 74 ఏళ్ల ప్రవీణ్ సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పంజాబ్‌కు చెందిన ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రో, హ్యామర్ త్రో ఈవెంట్లలో పతకాలు నెగ్గిన ఈ అలనాటి దిగ్గజం ఓ క్రీడాకారుడిగా కంటే విలక్షణ నటుడిగా సుపరిచితం. ఇప్పుడు ఒక్క కాంస్య పతకంతోనే రాత్రికి రాత్రే స్టార్ అవుతుండగా... ఆ కాలంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో విజయవంతమైన అథ్లెట్‌గా ఎదిగారు. అయినప్పటికీ క్రీడల్లో రాని గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఒక్క ‘మహాభారత్’ సీరియల్‌తోనే వచ్చాయి. ఇవీ ఆయన ఘనతలు ►అమృత్‌సర్‌లో 1947 డిసెంబర్ 6న పుట్టిన ప్రవీణ్ 1960 నుంచి 1974 వరకు పలు మెగా ఈవెంట్లలో పతకాలతో మెరిశారు. ►1966 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో చాంపియన్‌గా నిలిచిన ప్రవీణ్ హ్యామర్ త్రోలో కాంస్యం నెగ్గారు. ►అదే ఏడాది కింగ్‌స్టన్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో హ్యామర్ త్రోలో రజతం గెలుపొందారు. ►1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రో ఈవెంట్లో టైటిల్ నిలబెట్టుకున్న ప్రవీణ్ 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు. ►1968 మెక్సికో, 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ ప్రవీణ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారతంలో భీముడు దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన సుప్రసిద్ధ పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్’లో పంచ పాండవుల్లో భీముడిగా ప్రవీణ్ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తదనంతరం పలు హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించారు. 2013లో రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. చదవండి: IND VS WI 2nd ODI: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
విషాదం: 'మహాభారత్' భీముడు కన్నుమూత
Mahabharat Bheem Actor Praveen Kumar Sobti Passes Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత మహాభారత్ సీరియల్లో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ (75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె నికునికా అధికారికంగా ధృవీకరించారు. గతరాత్రి 9.30నిమిషాలకు హార్ట్ ఎటాక్ కారణంగా ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆమె పేర్కొంది. కాగా మభాభారత్ సిరీయల్లో భీముడి పాత్రతో ప్రవీణ్‌కుమార్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. రెండు దశాబ్దాల పాటు యాభైకి పైగా సిరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల పలువురు బీటౌన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
విడాకులు తీసుకున్న మరో నటుడు.. మరణమే బాగుంటుందని
Nitish Bharadwaj As Krishna Announces Divorce With His Wife Smita: చిత్ర పరిశ్రమలో వివాహ బంధాలతో ఇలా ఒక్కటవుతుంటే.. అలా విడిపోతున్నారు. ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారో.. అంతే వేగంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల సినిమాలు కాకుండా వారి వ్యక్తిగత విషయాలతోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. కొందరు నేరాలు, మోసాలతో వార్తల్లోకి ఎక్కితే.. వారి భాగస్వామితో తెగదెంపులు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరికొందరు. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోయారనే విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న తరుణంలో కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు పెద్ద బాంబు పేల్చారు. దీంతో అభిమానగనం, ప్రేక్షకలోకం నివ్వెరపోయి అందుకు కారణాలు ఏంటా అని ఆలోచిస్తున్నాయి. (చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు..) ఇదిలా ఉంటే తాజాగా మరో సెలబ్రిటీ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అతనే ప్రముఖ టీవీ సీరియల్ నటుడు నితీష్ భరద్వాజ్. అతను భరద్వాజ్ కంటే 'మహాభారతం' సీరియల్లో శ్రీకృష్ణుడిగానే మోస్ట్ పాపులర్. నితీష్ భరద్వాజ్ తన భార్య, ఐఏఎస్ అధికారిణి స్మితా గేట్‌తో ఉన్న 10 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడిపోయినట్లు తెలిపాడు. అయితే నితీష్ భరద్వాజ్, స్మితా గేట్ 2019 సెప్టెంబర్‌లో విడిపోయారు. వారికి ఇద్దరు కవల కుమార్తెలు. భరద్వాజ్ తన డివోర్స్ గురించి 'నేను 2019 సెప్టెంబర్‌లో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశాను. మేము విడిపోడానికి కారణాలు నాకు చెప్పాలని లేదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నేను చెప్పేది ఏంటంటే.. కొన్నిసార్లు మరణం కంటే విడాకులే చాలా బాధగా ఉంటాయి.' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా 2009లో స్మితా గేట్‌ను రెండో వివాహం చేసుకున్నాడు నితీష్ భరద్వాజ్. (చదవండి: ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్) బీఆర్ చోప్రా తెరకెక్కించిన టీవీ సిరీస్ 'మహాభారతం'లోని శ్రీకృష్ణుడి పాత్రలో భరద్వాజ్ ప్రేక్షకులను ఎంతో అలరించాడు. ఈ పాత్రతో అతనికి ఎనలేని పేరు వచ్చింది. ఈ టీవీ సిరీస్ 1988వో నాలుగు సీజన్స్‌తో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే బీఆర్ చోప్రా రూపొందించిన అనేక సీరియల్స్‌లో నటించాడు. అందులో 'విష్ణువు' పాత్రతో మరింత ప్రసిద్ధి చెందాడు నితీష్ భరద్వాజ్. అలాగే నితీష్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన పిత్రురూన్ చిత్రానికి ఎంతో పేరు వచ్చింది. నితీష్ సినిమాల్లోకి రాకముందు వెటర్నరీ సర్జన్‌గా పనిచేశాడు. (చదవండి: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్ ఫోన్ కాల్.. కారణం ఇదేనా?) -
కౌత్సుడి గురుదక్షిణ..
నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించాను. క్షుణ్ణంగా నేర్చుకున్నావు. ఇక ఇంటికివెళ్లి, తగిన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. శ్రీరామచంద్రుడి తాత అయిన రఘు మహారాజు పరిపాలిస్తున్న రోజులవి. రఘు మహారాజు పాలనలో విద్యలకు గొప్ప ఆదరణ ఉండేది. విరివిగా గురుకులాలు ఉండేవి. ప్రతి గురుకులంలోనూ వందలాదిగా శిష్యులుండేవారు. గురువుల శుశ్రూషలో గడుపుతూ, విద్యలు నేర్చుకునేవారు. పరతంతు మహాముని నడిపే గురుకులంలో కౌత్సుడనే పేదబాలకుడు కూడా విద్యాభ్యాసం చేసేవాడు. గురువును అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటూ, వేదవేదాంగాలను, సకల శాస్త్రాలనూ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కౌత్సుడి విద్యాభ్యాసం పూర్తయిన సందర్భంగా గురువు పరతంతుడు అతణ్ణి చేరబిలిచి, ‘నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించాను. క్షుణ్ణంగా నేర్చుకున్నావు. ఇక ఇంటికివెళ్లి, తగిన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. ఎప్పటికీ స్వాధ్యాయాన్ని శ్రద్ధగా కొనసాగించు. గృహస్థాశ్రమంలో కోపతాపాలకు తావివ్వకు. త్యాగంతో కూడిన భోగమే గొప్పదని గ్రహించు. ధర్మాన్ని ఆచరించు’ అని చెప్పాడు. ‘గురువర్యా! విద్యాభ్యాస సమయంలో చేసిన దోషాలను మీరు క్షమించాలి. మీకు గురుదక్షిణ చెల్లించడం శిష్యునిగా నా కర్తవ్యం. గురుదక్షిణగా ఏం కావాలో ఆదేశించండి’ అన్నాడు కౌత్సుడు. ‘నిరుపేదవు నువ్వేమిచ్చుకుంటావు నాయనా! ఆశ్రమంలో సేవలు చేసుకుంటూ, నా శుశ్రూషలో గడిపావు కదా! అది చాలు. నీ సేవలను చాలాసార్లు మెచ్చుకున్నాను కూడా. నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు. సంతోషంగా వెళ్లిరా’ అన్నాడు గురువు పరతంతుడు. ‘గురువర్యా! దయచేసి మీరు అలా అనవద్దు. గురుదక్షిణ కోరుకోండి. తప్పక చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను’ అన్నాడు కౌత్సుడు. తనకు ఏమీ ఇవ్వనవసరం లేదని పరతంతు మహాముని పదేపదే చెప్పినా, కౌత్సుడు వినిపించుకోలేదు. గురుదక్షిణ కోరుకోవాల్సిందేనంటూ పట్టుబట్టాడు. శిష్యుడి మొండితనానికి విసిగిన గురువు ఇలా అన్నాడు: ‘నాయనా! నీకు పద్నాలుగేళ్లు పద్నాలుగు విద్యలను నేర్పించాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి, ఒక గులకరాయిని విసిరితే, ఆ రాయి ఎంత ఎత్తుకు ఎగురుతుందో అంత ఎత్తు గల పద్నాలుగు ధనరాశులు ఇవ్వు’ అన్నాడు. ‘సరే’నని గురువుకు నమస్కరించి, బయలుదేరాడు కౌత్సుడు. గురువుకు గురుదక్షిణ చెల్లించాలనే సంకల్పమే తప్ప, ఎలా చెల్లించాలో అతడికి అంతుచిక్కలేదు. రాజు తండ్రివంటి వాడంటారు. రాజును కోరుకుంటే తప్పక తనకు కావలసిన ధనరాశులు దొరుకుతాయని ఆలోచించి, రాజ దర్శనానికి బయలుదేరాడు. రఘు మహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకుముందు రోజే రఘు మహారాజు ఒక మహాయజ్ఞం చేసి, తన వద్దనున్న ధనరాశులన్నింటినీ దానం చేశాడు. కౌత్సుడు వచ్చేసరికి రఘు మహారాజు మట్టి కుండలు ఎదుట పెట్టుకుని, సంధ్యావందనం చేస్తున్నాడు. కౌత్సుడిని గమనించిన రఘు మహారాజు ‘నాయనా! నువ్వెవరివి? ఏ పనిమీద వచ్చావు?’ అని అడిగాడు. మహారాజు పరిస్థితిని గమనించిన కౌత్సుడు ‘అది కష్టంలే మహారాజా!’ అని నిష్క్రమించడానికి వెనుదిరిగాడు. రఘు మహారాజు అతణ్ణి వెనక్కు పిలిచాడు. ‘నా వద్దకు వచ్చి, వట్టి చేతులతో వెనుదిరగడమా? ఏం కావాలో సంశయించకుండా అడుగు. తప్పక ఇస్తాను’ అన్నాడు. కౌత్సుడు తన గురువుకు చెల్లించాల్సిన గురుదక్షిణ కోసం వచ్చానంటూ, జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ‘రేపు ఉదయమే కనిపించు. నీవు కోరిన ధనరాశులు ఇచ్చుకుంటాను’ అని కౌత్సుణ్ణి సాగనంపాడు రఘు మహారాజు. యజ్ఞంలో చేసిన దానాల వల్ల ఖజానా ఖాళీ అయిన స్థితిలో ఏం చేయాలో పాలుపోలేదు మహారాజుకు. మంత్రులతో సంప్రదించాడు. వారి సలహాపై రాజగురువైన వశిష్ఠుని వద్దకు వెళ్లాడు. ‘తక్షణమే అంత ధనం కావాలంటే, దేవేంద్రుడిపై దండెత్తడమే మార్గం’ అని సూచించాడు. రఘు మహారాజు దేవేంద్రుడిపై దండ్రయాత్రకు బయలుదేరాడు. ఆయన సైన్యం చేసే భేరీనాదాలకు దేవేంద్రుడి చెవులు మార్మోగాయి. దేవదూతల ద్వారా రఘు మహారాజు దండయాత్రకు వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ‘ధర్మాత్ముడైన రఘు మహారాజు ఏమి కోరి దండయాత్రకు వస్తున్నాడో కనుక్కోండి. ఆయనను కోరినది ఇచ్చి, సంధికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పండి’ అని దేవదూతలను పంపాడు. ధనరాశులు కోరి దండయాత్రకు వచ్చినట్లు తెలుసుకున్న దేవేంద్రుడు, తక్షణమే రఘు మహారాజు కోశాగారాలన్నింటినీ ధనరాశులతో నింపివేయాలని దేవదూతలను ఆదేశించాడు. కోశాగారాలు అపార ధనరాశులతో నిండిపోయి ఉండటం గమనించిన రాజభటులు హుటాహుటిన రఘు మహారాజు వద్దకు చేరుకుని, సంగతి చెప్పారు. యుద్ధం చేయకుండానే పని నెరవేరడంతో రఘు మహారాజు సైన్యంతో వెనుదిరిగాడు. మర్నాడు ఉదయమే వచ్చిన కౌత్సుడికి తన కోశాగారాల్లోని ధనరాశులను చూపించి, ‘నీకు కావలసిన ధనరాశులు తీసుకువెళ్లు’ అన్నాడు. కౌత్సుడు వాటిని చూసి, ‘నా గురువు పద్నాలుగు ధనరాశులే కోరుకున్నాడు. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగిలినవి నాకొద్దు’ అంటూ తన గురువు కోరినన్ని మాత్రమే ధనరాశులను తీసుకుని బయలుదేరాడు. మిగిలిన ధనరాశులను రఘు మహారాజు తిరిగి దేవేంద్రుడికి పంపేశాడు. ∙సాంఖ్యాయన -
ఐకానిక్ మహాభారత్ సాంగ్‌ను ఆలపించిన ముస్లిం: నెటిజన్లు ఫిదా!
సాక్షి, హైదరాబాద్: అలనాటి పాపులర్ టెలివిజన్ సీరియల్ ‘మహాభారత్’ టైటిట్ సాంగ్‌ను ఆసాంతం అద్భుతంగా ఆలపించి ఒక ముస్లిం ప్రశంసలందుకుంటున్నారు. ఆయన స్వరానికి, స్పష్టమైన ఉచ్చారణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఐకానిక్ ట్రాక్‌ను హృద్యంగా ఆలపించిన ఈ వీడియోను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురైషి షేర్ చేశారు. బీటింగ్ ది స్టీరియోటైప్స్ అంటూ ఆయన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిందూ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన రామాయణ, మహాభారత సీరియల్స్ టెలివిజన్ చరిత్రలో గొప్ప సంచలనం రేపాయి. ఆదివారం ఉదయం ప్రసారమయ్యే వీటి కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేశారు. తాజా వీడియోతో ఈ ఐకానిక్ టైటిల్ సాంగ్ వినపడగానే అందరూ టెలివిజన్ సెట్ల ముందుకు చేరిపోయే వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిమిషం, 9 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దిస్ ఈజ్ ఇండియా అంటూ కమెంట్ చేస్తున్నారు. లక్షా12 వేలకు పైగా వ్యూస్, రీట్వీట్లు, లైక్స్‌తో ఈ వీడియో సందడి చేస్తోంది. -
మీటూ కేసు : రామాయణం ప్రస్తావన
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియారమణికి విముక్తి లభించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంజే అక్బర్ తనని లైంగికంగా వేధించారంటూ ప్రియారమణి చేసిన ఆరోపణలపై అక్బర్ కోర్టుకెక్కారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రియారమణికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎంజే అక్బర్ వేసిన దావాను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకి దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికలోనైనా తనకు జరిగింది వెల్లడించే హక్కు ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాంజే స్పష్టం చేశారు. తీర్పుని వెలువరించే సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘంలో హోదా ఉన్న వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. ‘‘లైంగిక వేధింపులపై తమ గళం విప్పిన మహిళల్ని శిక్షించలేము. ఒక వ్యక్తి పరువు తీశారని ఫిర్యాదులు వచ్చినా మహిళల్ని శిక్షించడానికి వీల్లేదు. మహిళల మర్యాదని పణంగా పెట్టి సంఘంలో మరో వ్యక్తి పరువుని కాపాడలేము’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపులతో మహిళల ఆత్మగౌరవం, మర్యాదకి భంగం వాటిల్లుతుంది. తనపై జరిగిన నేరంతో ఆమె తీవ్రమైన మానసిక సమస్యలనెదుర్కొంటుంది. నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలపై ఒక్కోసారి ఆమె పెదవి విప్పలేకపోవచ్చు. ఒక్కో సారి ఆమెకి అన్యాయం జరిగిందని కూడా బాధితురాలికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే లైంగిక వేధింపులకు గురైన మహిళలు దశాబ్డాల తర్వాత కూడా బయట ప్రపంచానికి వెల్లడించవచ్చు’’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.‘‘లైంగిక వేధింపులతో బాధితురాలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి కూడా మిగిలిన వారిలాగే మన సమాజంలో కలిసిపోతారు. అతనికీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలోనే ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి’’ అని మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. మహిళల్ని గౌరవించాలంటూ రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు రాసిన నేలపై వారి పట్ల జరుగుతున్న అకృత్యాలు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. మహిళలు ఇక మాట్లాడాలి ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పట్ల ప్రియారమణి హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపు మరెందరో మహిళల్ని పెదవి విప్పేలా ప్రోత్సహిస్తుందని ప్రియారమణి వ్యాఖ్యనించారు. ‘‘నేను చేస్తున్న పోరాటం నా ఒక్కదాని కోసం కాదు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరి తరఫున పోరాడుతున్నాను. కేవలం మాట్లాడానని నన్ను ఈ కేసులోకి లాగారు. ఒక బాధితురాలినైన నన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టారు. సమాజంలో పలుకుబడి ఉందని, శక్తిమంతులమని బావించే మగవాళ్లు బాధిత మహిళల్ని కోర్టుకీడ్చడానికి ఇకపై ముందు వెనుక ఆలోచిస్తారు’’ అని ప్రియారమణి అన్నారు. ఈ కేసులో తాను విజయం సాధించేలా శ్రమించిన తన లాయర్లకి ప్రియారమణి ధన్యవాదాలు తెలిపారు. -
అమావాస్య రోజు రాత్రి ఏం జరిగింది?
1. బిలం నుండి బయటకు వచ్చిన పాండవులు ఏం చేశారు? 2. పాండవుల పరిస్థితి ఎలా ఉంది? 3. భీముడు ఏ విధంగా సాగాడు? 4. కుంతి సహా మిగిలిన నలుగురు పాండవులు ఏ స్థితిలో ఉన్నారు? 5. భీముడు నీటి కోసం ఏం చేశాడు? 6. భీముడు కొలను చూసి ఏం చేశాడు? 7. అమావాస్య రోజు రాత్రి ఏం జరిగింది? 8. భీముడి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? జవాబులు 1. పాండవులు గంగ దాటి, మహారణ్యంలోకి ప్రవేశించారు. అది చీమలు దూరని చిట్టడవి.ఆ రోజు కృష్ణ చతుర్దశి. దట్టంగా చీకటి ఆవరించి ఉంది. కంటికి అవతల ఏమున్నదీ కనిపించటంలేదు. 2. పాండవులు అలసిపోయి ఉన్నారు. అప్పుడు భీముడు... తల్లిని, సోదరులను ఎత్తుకొని మహారణ్యంలో నడిచాడు. 3. భీముడికి చీకటి కాని, ముళ్లు కాని కనపడలేదు. వేగంగా నడిచాడు. అతడి నడకకు చెట్లు కదిలాయి. భూమి అదిరింది. భీముడు చల్లని మర్రి చెట్టు కిందకు వచ్చాడు. తల్లిని, సోదరులను ఆ చెట్టు కింద దించి, పడుకోబెట్టాడు. 4. అందరూ ఒడలు మరచి నిద్రించారు. భీముడు అప్రమత్తుడై వారిని రక్షిస్తున్నాడు. 5. భీముడు నీటి పట్టును తెలుసుకోవటం కోసం, మర్రి చెట్టు ఎక్కి, కొనకొమ్మలకు చేరి చూశాడు. దగ్గరలో ఒక సరస్సు కనిపించింది. తామరల వాసన వచ్చింది. హంసలు, తుమ్మెదలు ధ్వనులు చేశాయి. 6. భీముడు కొలను చేరి, స్నానం చేసి తామర దొన్నెలలో నీరు తెచ్చి, సోదరులకు ఇచ్చాడు. అప్పటికి సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమించాడు. పక్షులు, జంతువులు, సర్పసమూహాలు బయటపడ్డాయి. 7. ఆ రాత్రి కుంతి, నలుగురు కొడుకులు నిద్రించారు. భీముడు కాపలా ఉన్నాడు. 8. దుష్టుల అండన నగరంలో ఉండటం కంటె, ఒంటరిగా అరణ్యాలలో ఉండటం మేలు. యోగ్యులు అడవిలోని చెట్ల వంటివారు. ఒకరిని ఒకరు ఆశ్రయించుకుని ఉంటారు. వృక్షాలు ఫలాలనిస్తాయి. యోగ్యుడు ఇతరులకు ఉపకారం చేస్తాడు. వృక్షాలు గట్టి వేర్లు కలిగి ఉంటాయి. యోగ్యుడు గొప్ప బుద్ధి కలిగి ఉంటాడు... అని భీముడు ఆలోచన చేశాడు. –నిర్వహణ: వైజయంతి పురాణపండ