మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే | Mahabharata Epic Discussion After Kalki 2898 AD Release | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: 'కల్కి'లో నిజంగానే అది అద్భుతం.. ఎందుకంటే?

Published Sat, Jun 29 2024 12:45 PM | Last Updated on Sat, Jun 29 2024 1:13 PM

Mahabharata Epic Discussion After Kalki 2898 AD Release

మొన్నటివరకు టాలీవుడ్‌లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ మాటలతో కొట్టేసుకునేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మహాభారతం హాట్ టాపిక్ అయిపోయింది. అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? లాంటి చర్చలు మొదలయ్యాయి. ఇవన్నీ కాదన్నట్లు ఇన్ స్టాలో రీల్స్ దగ్గర నుంచి టీ కొట్టు దగ్గర ముచ్చట్ల వరకు మహాభారతమే వినిపిస్తుంది. దీనంతటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగ్ అశ్విన్.

(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)

అప్పట్లో మహాభారతం ఆధారంగా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి తీసుకుంటే ఏ డైరెక్టర్ కూడా దీన్ని సినిమాగా, కనీసం సీన్స్ వరకైనా తీసే సాహసం చేయలేదు. రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పాడు. కాకపోతే జక్కన్న ఇది తీసేసరికి ఇంకో 10-15 ఏళ్లయినా పట్టొచ్చు. ఇంతలోనే నాగ్ అశ్విన్ అనే కుర్ర డైరెక్టర్ రయ్ అని దూసుకొచ్చాడు.

మరీ పూర్తిగా కాకపోయినా సరే 'కల్కి'లో మహాభారతంలోని కురుక్షేత్రానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌తో అబ్బురపరిచాడు. అశ్వద్థామ పాత్రని 'కల్కి'తో లింక్ చేసిన విధానం సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. దీంతో అసలు అశ్వద్థామ ఎవరు? అతడికి కర్ణుడితో సంబంధం ఏంటనే సీరియస్‌గా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. 'కల్కి' అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)

ఇక 'కల్కి' చివర్లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు. కర్ణుడి చరిత్ర అంతా తవ్వితీస్తున్నారు. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వచ్చిన చందమామ కథలు పుస్తకాల దగ్గర నుంచి గీత ట్రస్ట్ మహాభారతం వరకు ఎవరికీ తోచిన పుస్తకాలని వాళ్లు తిరగేస్తున్నారు. ఇది కాదన్నట్లు మహాభారతం క్యారెక్టర్స్ గురించి పలువురు యాక్టర్స్ మాట్లాడిన వీడియోలని ట్విట్టర్‌లో వైరల్ చేస్తున్నారు.

ఏదేమైనా ఓ తెలుగు సినిమా వల్ల 'మహాభారతం' అనే అద్భుతం గురించి తిరిగి మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఇప్పటి జనరేషన్‌కి మహాభారతంపై మనసు పడేలా చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి ధన్యవాదాలు. కాకపోతే అర్జున vs కర్ణ.. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ గురించి యూత్ తగువులాడుకోవడం మాత్రం వింతగా ఉంది.

(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement