కల్కి-2లో ఆ రెండు పాత్రలపైనే ఎక్కువగా ఉంటుంది: నాగ్ అశ్విన్ | Director Nag Ashwin Responds On Kalki 2 Movie Udpate | Sakshi
Sakshi News home page

Nag Ashwin: కల్కి-2లో ఆ రెండు పాత్రల గురించే అంతా: నాగ్ అశ్విన్

Published Tue, Mar 18 2025 7:40 PM | Last Updated on Tue, Mar 18 2025 8:26 PM

Director Nag Ashwin Responds On Kalki 2 Movie Udpate

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. గతేడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ కీలక పాత్రలో నటించారు. అశ్వత్తామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ కల్కి-2 ‍అప్‌డేట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగాఎవడే సుబ్రమణ్యం రీ రిలీజ్ సందర్భంగా  ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కల్కి-2 ఎప్పుడొస్తుందనే విషయంపై నాగ్ అశ్విన్ స్పందించారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ నడుస్తోంది. అది పూర్తయ్యాక  షూటింగ్‌ మొదలు పెడతాం. సెకండ్ పార్ట్‌లో భైరవ, కర్ణకు సంబంధించిన పార్ట్‌ ఎక్కువగా ఉంటుంది.  అంతా సజావుగా సాగితే ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాం. కల్కిలో మహాభారతం నేపథ్యం, సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్‌ చేసుకుని ఇక్కడి వరకూ వచ్చాం. ప్రభాస్‌ను పార్ట్‌-2లో ఎక్కువగానే చూపిస్తాం. ఇంకా చాలా వర్క్ ఉంది.  విడుదల తేదీ గురించి ఇంకా ఏం డిసైడ్ చేయలేదు.'  అని అన్నారు.

కాగా.. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్‌తో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ నటించనున్నారు. ఈ మూవీకి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాతే కల్కి-2లో ప్రభాస్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌ 2- శౌర్యంగ పర్వం, ప్రశాంత్‌ వర్మతో ఓ మూవీ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement