వెయిటింగ్‌ ఇజ్ ఓవర్.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది | Kalki 2898 AD Trailer Release | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Trailer: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది

Published Mon, Jun 10 2024 7:18 PM | Last Updated on Mon, Jun 10 2024 8:14 PM

Rebal Star Prabhsa Kalki 2898 AD Trailer Out Now

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, బుజ్జి టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే భారీస్థాయిలో ఈవెంట్‌ నిర్వహించిన మేకర్స్‌.. బుజ్జిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని రెబల్ ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తోన్న కల్కి 2898ఏడీ ట్రైలర్‌ రానే వచ్చింది. ఇవాళ కల్కి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తే యంగ్‌ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. మీరు కూడా కల్కి ట్రైలర్‌ను చూసేయండి. కాగా.. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 
కాగా.. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్‌ రెబల్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ట్రైలర్‌లో బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా థియేటర్స్‌లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం, నార్త్  ఇండియా మెయిన్ సిటీస్‌లోని థియేటర్స్‌లో కల్కి ట్రైలర్‌ను ప్రదర్శించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement