Nag Ashwin
-
బాపు ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది – నాగ్ అశ్విన్
‘‘బాపు’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంపై క్యూరియాసిటీ కలిగించింది. సినిమా టాక్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్‌ఫుల్ చేస్తారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. బ్రహ్మాజీ లీడ్ రోల్లో దయా దర్శకత్వం వహించిన చిత్రం ‘బాపు’. ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, చందు మొండేటి, బుచ్చిబాబు సాన, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీ ట్రైలర్లో రా ఎమోషన్ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద చిత్రమే’’ అని చందు మొండేటి చె΄్పారు. ‘‘ఈ సినిమాని దయాగారు చాలా బాగా తీశారు’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని బ్రహ్మాజీ తెలిపారు. ‘‘కిస్మత్’ తర్వాత ‘బాపు’ నా రెండో సినిమా’’ అన్నారు భానుప్రసాద్ రెడ్డి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని పేర్కొన్నారు దయా. -
'ఆ థియేటర్‌తో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు'.. గుర్తు చేసుకున్న కల్కి డైరెక్టర్
కల్కి మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కల్కి పార్ట్-2 పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ థియేటర్‌ను గుర్తు చేసుకున్నారు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగు సినిమా చరిత్రలో సత్యం థియేటర్ ఒక భాగమన్నారు. ఆ థియేటర్లో గీతోపదేశంలోని కుడ్యచిత్రం అంతర్భాగమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే మల్టీప్లెక్స్‌గా మార్చాక ఆ ఆ కుడ్యచిత్రాన్ని భద్రపరచలేదని ఆవేదన చెందాను.. కానీ మళ్లీ ఆ ఫోటోను చూడడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఆ చిత్రాలను అలాగే భద్రపరచిన నిర్మాత సునీల్ నారంగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సత్యం థియేటర్ మళ్లీ సత్యంగానే మారిందని ఇన్‌స్టాలో నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
‘కల్కి’లో ఆ పాత్ర చేయమని అడిగితే..నచ్చలేదని తిరస్కరించా : కీర్తి సురేశ్
‘‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక పాత్ర చేయమని నన్ను కోరారు నాగ్ అశ్విన్. అయితే ఆ పాత్ర నాకు అంత ఆసక్తిగా అనిపించలేదు.. అందుకే సున్నితంగా తిరస్కరించాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేష్ అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) వేడుకల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి పాల్గొన్నారు కీర్తీ సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో నన్ను అడిగిన పాత్రను నేను తిరస్కరించినప్పటికీ నాగ్ అశ్విన్ ఏదో ఒక రకంగా ఆ సినిమాలో నన్ను భాగస్వామ్యం చేస్తాడని నమ్మాను. నేను అనుకున్నట్లుగానే బుజ్జి పాత్రకు (ప్రభాస్ వాడిన కారు పేరు) నాతో డబ్బింగ్ చెప్పించాడు. బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడం వల్ల ప్రేక్షకులకు ఎలా చేరువ అవుతావు? అని కొందరు నన్ను ప్రశ్నించారు. కానీ, చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావించి, నాగి అశ్విన్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను. సినిమా విడుదల తర్వాత చాలా మంది.. ‘బుజ్జి కారుకు నీ డబ్బింగ్ ప్లస్ అయింది’ అని నాతో అనడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఇదిలా ఉంటే... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మహానటి’ (2018). సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో సావిత్రిగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కీర్తి. ఈ సినిమాకి జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తీ సురేష్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కీర్తి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.... తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ని డిసెంబరులో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారామె. -
ఆలియా భట్‌తో నాగ్ అశ్విన్ సినిమా.. ఆయన ఏమన్నారంటే?
ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ప్రస్తుతం కల్కి-2 మూవీతోనే బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరక్కిక్కిస్తున్నారనే వార్తలకు తెరపడింది.కాగా.. నాగ్ అశ్విన్ గతంలో కీర్తి సురేశ్ లీడ్ రోల్లో మహానటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవితం అధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌లో ఆర్ఆర్ఆర్ హీరోయిన్.. ఆ పవర్ఫుల్ రోల్ కోసమేనా?
ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ పాత్రకు ఆలియానే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.అయితే ఆలియా భట్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత మరో భారీ పాన్-ఇండియా చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ రోల్స్‌కు ఆలియా భట్ పేరుగాంచింది. ఇటీవలే ఆమె లీడ్ రోల్లో నటించిన జిగ్రా మూవీ థియేటర్లలో సందడి చేసింది.అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మూవీని వైజయంతీ ఫిల్మ్స్ బ్యానర్లోనే తెరకెక్కించనున్నారు. 2025 మధ్యలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా.. అలియా భట్ ప్రస్తుతం శర్వాయ్ వాఘ్‌తో కలిసి ఆల్ఫా చిత్రంలో నటిస్తోంది. -
మీకు మరణం లేదా..? కల్కి డిలీట్ సీన్స్ హైలైట్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఈ ఏడాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో కల్కి ఉంది. ఈ క్రమంలో కల్కి డిలీట్ సీన్స్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా హిందీ వెర్షన్ ప్రసారం అవుతుంది. ఇదే తేదీ నుంచి తెలుగు, తమిళంతో సహా మిగతా భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
ప్రభాస్ కల్కి సీక్వెల్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మించారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందన ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.తాజాగా కల్కి సీక్వెల్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల రష్యాలోని మాస్కోలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ వీక్‌లో నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్‌లు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కల్కి-2 షూటింగ్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా.. కల్కి మూవీని త్వరలోనే రష్యన్ భాషలోనూ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రంలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. అంతేకాకుండా రాజమౌళి, రాంగోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ మూవీలోని బుజ్జి కారుకు కీర్తి సురేశ్ వాయిస్ అందించారు. అయితేస పార్ట్-2లో కమల్ హాసన్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చారు. దీంతో పార్ట్-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ప్రపంచ వేదికపై తెలుగు సినిమా.. ఆ దేశ భాషలోనూ కల్కి రిలీజ్!
టాలీవుడ్ సినిమా పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ దాకా ఎదిగింది. తాజాగా రష్యాలోని మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో ఆర్ఆర్ఆర్, కల్కి చిత్రాలను ప్రదర్శించారు. రష్యాలోనూ ఇండియన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆర్ఆర్ఆర్ను ఆ దేశ భాషలోనూ విడుదల చేశారు.రష్యన్ భాషలో రిలీజ్తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను రష్యన్ భాషలోనూ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వప్నదత్, ప్రియాంక దత్‌లు వెల్లడించారు. కల్కి సినిమాను రష్యా భాషలోకి డబ్ చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌లోనే రష్యా థియేటర్లలో కల్కి సందడి చేయనుంది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో టాలీవుడ్ సినిమాల ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆగస్టు 23న ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది.బాక్సాఫీస్ షేక్ చేసిన కల్కికాగా.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో కీర్తి సురేశ్ వాయిస్‌తో ఉన్న బుజ్జికారు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Celebrating Indian Cinema globally! ✨ #Kalki2898AD proudly represents India at the Moscow International Film Week during Indian Cinema Day 🇮🇳@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/yDmlcAurm8— Kalki 2898 AD (@Kalki2898AD) August 27, 2024 -
బాలీవుడ్ యాక్టర్ అర్షద్ కు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్
గత కొన్నిరోజుల నుంచి ప్రభాస్-అర్షద్ వార్సీ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. 'కల్కి'లో ప్రభాస్ లుక్ జోకర్లా ఉందని హిందీ నటుడు అర్షద్ కామెంట్ చేయడం.. దీనికి ప్రతిగా నాని, సిద్ధు, శర్వానంద్ తదితర తెలుగు హీరోలు కౌంటర్స్ వేయడంతో ప్రస్తుతం ట్విటర్లో నార్త్-సౌత్ అనే రచ్చ అవుతోంది. ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. మంట చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)'కల్కి' సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్, కర్ణుడిగా ఎంట్రీ ఇచ్చే సీన్ ని ట్విటర్లో పోస్ట్ చేసి.. బాలీవుడ్ మొత్తం కంటే ఇది బెటర్ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన నాగ్ అశ్విన్.. 'మళ్లీ పాతకాలంలోకి వెళ్లొద్దు. సౌత్ వర్సెస్ నార్త్, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనేవి లేవు. ఇప్పుడంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అర్షద్ సాబ్ మీరు కాస్త చూసుకుని మాట్లాడాల్సింది. కానీ ఓకే. మీ నలుగురు పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపిస్తున్నాను. అలానే కల్కి 2లో ప్రభాస్ మరింత బెస్ట్‌గా కనిపిస్తాడు' ఓ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు.'ఇప్పటికే ప్రపంచం చాలా ద్వేషంతో నిండిపోయింది. మనం దాన్ని పెంచే పనిచేయొద్దు. నేనే కాదు ప్రభాస్ కూడా ఇలానే చెబుతాడు' అని మరో ట్వీట్లో నాగ్ అశ్విన్ రాసుకొచ్చాడు. మరో ట్విటర్ యూజర్.. అర్షద్ వార్సి కంటే బెస్ట్ యాక్టర్ సౌత్‌లో ఎవరైనా ఉన్నారా? అని పోస్ట్ పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన నాగ్ అశ్విన్.. 'అసలు నువ్వు ఎవర్రా? ఇంత ద్వేషం ఎందుకు? ఇలా వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నావ్? మేమంతా ఒక్కటే. కావాలంటే బుజ్జి బొమ్మ ఒకటి పంపనా?' అని గొడవని చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. (ఇదీ చదవండి: కూతురికి రామ్‌చరణ్ బహుమతి.. ఆ గిఫ్ట్‌కు మగధీరతో లింక్!)Let's not go backwards..no more north-south or bolly vs tolly..eyes on the bigger picture.. United Indian Film Industry..Arshad saab should have chosen his words better..but it's ok..sending buji toys 4 his kids..il work hard so tweets fdfs that prabhas was the best ever in k2💪— Nag Ashwin (@nagashwin7) August 24, 2024Who are you man? Why so much hate? And spreading division? We are all in this together...Chill... Can I send u a bujji toy?— Nag Ashwin (@nagashwin7) August 24, 2024Too much hate in the world already bro...we can try not to add to it..I know prabhas garu will also feel the same...❤️— Nag Ashwin (@nagashwin7) August 24, 2024 -
మరికొన్ని గంటల్లో ఓటీటీకి కల్కి.. ఎక్కడ చూడాలంటే?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.థియేట్రికల్ రిలీజ్ సూపర్ హిట్ కావడంతో కల్కి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నెల 22 నుంచి అమెజాన్ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని గంటల్లోనే కల్కి ఓటీటీలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ అదే తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకేందుకు ఆలస్యం ఇవాళ అర్థరాత్రి నుంచే ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
'కల్కి' దర్శకుడి భారీ సాయం.. ఏకంగా రూ.66 లక్షలు!
'కల్కి' సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ సాయం చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంతూరు ఐతోల్లో తన తాత సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చాడు. తన తండ్రి చదువుకున్న ఈ స్కూల్‌కి తన వంతుగా ఈ సాయం చేసినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్)ఈ క్రమంలోనే అదనపు గదులు నిర్మించేందుకు దాదాపు రూ.66 లక్షల మేర ఖర్చయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. తాజాగా ఈ గదుల ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి నాగ్ అశ్విన్ హాజరయ్యాడు.'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఈ మధ్య 'కల్కి'తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం) -
కల్కి ఖాతాలో మరో మైలురాయి.. ఆ మార్కును దాటేసింది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్లోనూ అత్యధిక వసూళ్లతో సత్తా చాటింది. విడుదలైన రెండువారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త మైలురాయిని అధిగమించింది.తాజాగా కల్కి మూవీ మరో రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోపే రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ అంటూ కల్కి పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సైతం అతిథి పాత్రల్లో మెరిశారు. 𝐀 𝐫𝐞𝐬𝐨𝐮𝐧𝐝𝐢𝐧𝐠 𝐩𝐡𝐞𝐧𝐨𝐦𝐞𝐧𝐨𝐧 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐛𝐨𝐱 𝐨𝐟𝐟𝐢𝐜𝐞...❤️🔥1100 CRORES and counting… #Kalki2898AD continues its epic run into the 5th week! @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms… pic.twitter.com/WQOeT9a3Zf— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 25, 2024 -
మహబూబ్‌నగర్ : కల్కి కారు.. నాగీ సందడి..(ఫొటోలు)
-
ప్రభాస్ కల్కి మరో ఘనత.. ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఐఎండీబీ ప్రకటించిన లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో ఇండియావ్యాప్తంగా ఇప్పటివరకు మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో కల్కి మొదటిస్థానంలో నిలిచింది. దీంతో చిత్రయూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ జాబితాలో కల్కి తర్వాత మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా.. లపత్తా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్యా సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో మలయాళ చిత్రాలు సత్తా చాటగా.. టాలీవుడ్ నుంచి కల్కి, హనుమాన్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ నాలుగో స్థానం నిలిచి సత్తా చాటింది. ‘Tis the season of lists, and we’re back with the ultimate one! 🌟Halfway through 2024, we're excited to share the Most Popular Indian Movies of the year (so far!) 🎬✨Which one's your top pick? 🤔1. Kalki 2898-AD pic.twitter.com/9eCnBR7zYM— IMDb India (@IMDb_in) July 23, 2024 -
కమల్ హాసన్ 'కలి' కాదు.. 'కల్కి' సీక్రెట్స్ బయటపడ్డాయ్!
'కల్కి' సినిమా వచ్చి నెలరోజులు దగ్గరైపోయింది. వేరే సినిమాలేం సరైనవి లేకపోవడంతో ఇప్పటికీ చాలా చోట్ల విజయవంతంగా రన్ అవుతోంది. మూవీ గురించి ఇప్పటికీ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ జిహానీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'కల్కి' నుంచి సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)'మీరు 'కల్కి'లో చూసింది ఒక్క కాంప్లెక్స్ మాత్రమే. కానీ ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఏడు కాంప్లెక్స్‌లు ఉంటాయి. వీటన్నింటినికీ సుప్రీం యాష్కిన్ నాయకుడు. కంటికి కనిపించని అద్భుత శక్తి 'కలి' దిగువన ఇతడు పనిచేస్తుంటాడు' అని నితిన్ జిహానీ చెప్పుకొచ్చాడు.'కల్కి' చూసిన తర్వాత చాలామంది కమల్ హాసన్.. కలి పాత్రధారి అనుకున్నారు. కానీ నితిన్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే కలి, సుప్రీం యాష్కిన్ వేర్వేరు అని క్లారిటీ వచ్చేసింది. అలానే ఏడు కాంప్లెక్స్‌లు అంటే నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోయే సినిమాల్లో వీటిని చూపిస్తారేమో? దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశాడో ఏంటో?(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!) View this post on Instagram A post shared by SoSouth (@sosouthofficial) -
చిన్నారులకు గోల్డెన్ ఛాన్స్.. ప్రకటించిన కల్కి డైరెక్టర్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో నాగ్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.చిన్నారులకు కల్కి మూవీ సెట్ చూసే అవకాశం కల్పించనున్నట్లు నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. అయితే చిన్నారికి సంబంధించి కల్కి సినిమాపై ఓ వీడియోను పంపించాలని ఆయన కోరారు. వీటిలో ఎంపికైన వారికి కల్కి సెట్ చూసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీ చిన్నారుల వీడియోలు పంపి.. అరుదైన ఛాన్స్ కొట్టేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
'రెబల్స్ ఆఫ్ కల్కి' వీడియో వైరల్
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది.'బుక్ మై షో'లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటికీ టికెట్ల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా 'రెబల్స్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో భారీ యాక్షన్ సీన్స్‌ను వారు చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి. -
ప్రభాస్‌కు అది రోటీన్.. కానీ నాకు మాత్రం.. అమితాబ్ ఆసక్తికర కామెంట్స్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత గతనెల థియేటర్లలోకి వచ్చింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. కల్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విశేష ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే వెయ్యి కోట్ల రావడమనేది ప్రభాస్ కెరీర్లో రోటీన్ విషయమేనని అన్నారు. నా విషయానికొస్తే ఇంత పెద్ద సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. కల్కి చిత్రాన్ని ఇప్పటికే నాలుగు సార్లు చూశానని.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా.. కల్కి మూవీకి పార్ట్-2 కూడా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో భైరవగా సందడి చేసిన ప్రభాస్.. సీక్వెల్లో కర్ణుడిగా కనిపించనున్నారు. దీంతో పార్ట్-2పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కాగా.. కల్కి 2898 ఏడీలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. -
ఆ సినిమా కోసం క్యూరియాసిటీతో ఉన్నా: కల్కి డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం చాలా సినీ యూనివర్స్‌లు వస్తున్నాయని.. ముఖ్యంగా పుష్ప-2, యానిమల్, సలార్ లాంటి సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయి.. ఒక అభిమానిగా మీరు ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా పేరును నాగ్ రివీల్ చేశారు. తాను ప్రభాస్ మూవీ సలార్ పార్ట్-2 కోసం క్యూరియాసిటీతో ఉన్నానని నాగ్ అశ్విన్ అన్నారు. సలార్ స్టోరీ చాలా బాగా నచ్చిందని తెలిపారు. ముందుగా నేను గేమ్ ఆఫ్ త్రోన్స్కు వీరాభిమానిని.. అదోక విభిన్నమైన ప్రపంచం.. విభిన్నమైన హౌస్‌లు ఉంటాయి.. సలార్ కూడా అలాగే అనిపిస్తోందని అన్నారు. డిఫరెంట్ వరల్డ్, హిస్టరీ ఆధారంగా వస్తోన్న సలార్-2 కోసమే తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.కాగా.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో దేవ (ప్రభాస్) శౌర్యంగ అని రివీల్ అవుతుంది. దీంతో ఆ తర్వాత ఖాన్సార్‌లో ఏం జరిగిందనే దానిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం పేరుతో రానుంది."I'm definitely curious about #Salaar because the story just started there. I'm a huge Game of Thrones fan, so seeing different houses and stories makes me excited."My hero Prabhas - #NagAshwin 😍#Prabhas #Kalki2898AD pic.twitter.com/88NKadDsHT— Prabhas' Realm (@PrabhasRealm) July 16, 2024 -
'భారతీయుడు 2' కంటే 'కల్కి'పైనే కమల్ స్పెషల్ ఇంట్రెస్ట్!
విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇది 'భారతీయుడు 2' మూవీ గురించి అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయిందని ఈయనకు కూడా తెలిసినట్లు ఉంది. దీంతో పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. మరోవైపు 'కల్కి' సక్సెస్ గురించి ఏకంగా మూడున్నర నిమిషాలు మాట్లాడారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)కమల్ హాసన్ లీడ్ రోల్ చేసిన 'భారతీయుడు 2' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు ఓ మాదిరి అంచనాలు ఉండేవి. కానీ సినిమా మరీ ల్యాగ్ ఉండటం పెద్ద మైనస్ అయింది. దీంతో ఘోరమైన డిజాస్టర్ దిశగా వెళ్తోంది. మరోవైపు దీనికి రెండు వారాల ముందు రిలీజైన పాన్ ఇండియా మూవీ 'కల్కి'లోనూ సుప్రీం యాష్కిన్ అనే విలన్ పాత్రని కమల్ చేశారు. రెండు మూడు సీన్లలో కనిపించినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ క్రమంలోనే కమల్ హాసన్ 'కల్కి' బ్లాక్ బస్టర్ కావడంపై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మూవీ టీమ్‌ని అభినందిస్తూనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని ఆకాశానికెత్తేశారు. దాదాపు మూడన్నర నిమిషాలు మాట్లాడారు. 'కల్కి' గురించి చాలా మాట్లాడారు కానీ రిలీజ్ తర్వాత 'భారతీయుడు 2' గురించి ఒక్క ట్వీట్, పోస్ట్, వీడియో గానీ కమల్ పెట్టలేదు. అంటే ఈయనకు కూడా రిజల్ట్ ఏంటే అర్థమైపోయింది అనుకుంటా!(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి) -
'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది!
థియేటర్లలోకి వచ్చి రెండు వారాలైనా సరే ప్రభాస్ 'కల్కి'.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతూనే ఉంది. ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ సినిమా ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మరీ అంతగా నచ్చలేదనే వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడా లిస్టులోకి తెలుగు సీనియర్ హీరో కమ్ నటుడు సుమన్ చేరాడు. సినిమాలో బాగున్న వాటి గురించి మెచ్చుకుంటూనే, కొన్ని అస్సలు బాగోలేవని విమర్శించాడు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)'కల్కి సినిమా చాలా నెమ్మదిగా అనిపించింది. ఓ అరగంట వరకు తీసేయొచ్చు. మరీ ముఖ్యంగా బాంబే హీరోయిన్ (దిశా పటానీ) సాంగ్, ఫైట్ తీసేయొచ్చు. అసలు అది కథకి సంబంధం లేదు. సెకండాఫ్ బాగుంది. డైరెక్టర్ విజన్‌కి సెల్యూట్. మూవీలో అమితాబ్ రోల్ చాలా డామినేట్‌గా ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే అతడిని ఓ టార్జాన్‌లా చూపించాలి. కానీ ఏదో ప్లేట్ పెట్టి, బాడీకి షీల్డ్ పెట్టి కవర్ చేసేశారు. ప్రభాస్‌కి మంచి ఫిజిక్ ఉంది. ఏదైనా సీన్లో దాన్ని చూపిస్తారేమో అనుకున్నా. సాంగ్స్ అయితే అస్సలు బాగోలేవు. మూవీని ఓ డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుంది' అని సుమన్ చెప్పుకొచ్చారు.ఇకపోతే 'కల్కి'లో చాలామంది అతిథి పాత్రలు చేశారు కదా ఒకవేళ మీకు అవకాశమొచ్చుంటే చేసేవారా అని సుమన్‌ని అడగ్గా.. 'కల్కి మూవీలో నేను చేసే క్యారెక్టర్ ఏం లేదు. చాలామంది అతిథి పాత్రల్లో అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. మనం ఓ పాత్ర చేస్తే అది గుర్తుండిపోవాలి. మూవీలో ఇంతమంది స్టార్స్ ఉన్నప్పుడు అంచనాలు ఉంటాయి. అది లేకపోతే ఫ్యాన్స్ నిరాశ పడతారు. చాలామంది చేసే తప్పు ఇదే. ఇలా స్టార్ సెలబ్రిటీలు ఎక్కువమందిని పెట్టేసి జనాల్ని థియేటర్లకి రప్పించాలనుకుంటారు' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: మీరు లేకపోతే నేను లేను.. 'కల్కి' సక్సెస్ పై ప్రభాస్ స్వీట్ వీడియో) -
మీరు లేకపోతే నేను లేను : ప్రభాస్ స్వీట్ వీడియో
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. కల్కి సూపర్ హిట్ కావడంపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ప్రభాస్ మాట్లాడుతూ..' ఇంత పెద్ద హిట్ అందించినందుకు మీకు ఫ్యాన్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను జీరోనే. థ్యాంక్ యూ నాగ్ అశ్విన్. దాదాపు మాది ఐదేళ్ల ప్రయాణం. ఇంత పెద్ద సినిమాను అందించినందుకు వైజయంతి మూవీస్, నిర్మాతలకు నా ధన్యవాదాలు. అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అలాగే దీపికా, కమల్ సార్, అమితాబ్ సార్, దిశా పటానీకి మనస్ఫూర్తిగా నా అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్‌లో కనిపించనున్నారు. WE HAVE MUCH BIGGER PART 2 🔥A sweet note from Rebel star #Prabhas, celebrating the blockbuster success of #Kalki2898AD ❤️#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/g5CdfE9a1E— Telugu FilmNagar (@telugufilmnagar) July 14, 2024 -
'రక్తపాతం, అశ్లీలత లేకుండా హిట్ కొట్టాం'.. సందీప్‌పై సెటైర్స్?
చిన్న చిత్రమైనా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అయినా.. కంటెంట్ బాగుంటేనే థియేటర్‌కు వస్తామంటున్నారు ఆడియన్స్. లేదంటే మాత్రం చూసేదేలేదని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో 'హనుమాన్' వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా 'బడే మియా చోటే మియా' వంటి భారీ బడ్జెట్ సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయాయి.చాలా పెద్ద విషయంప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఇంత గొప్ప కలెక్షన్స్ అందుకుని ఈ మైలురాయిని చేరుకోవడం మా యంగ్ టీమ్‌కు చాలా పెద్ద విషయం. సందీప్‌పై సెటైర్స్?అయితే విధ్వంసం, అరాచకం, రక్తపాతం, అశ్లీలత లేకుండా ఈ విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన నటీనటులకు, సినీ ప్రేక్షకులకు థాంక్యూ' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. దానికి రేపటికోసం అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. ఇది చూసిన కొందరు.. యానిమల్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ పై కామెంట్స్ చేశాడా? అని నాగ్ అశ్విన్‌ను అనుమానిస్తున్నారు. పోలిక అవసరమా?సందీప్ తన సినిమాలను కొత్తగా ట్రై చేస్తున్నాడు. అతడిని కించపర్చాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ వారికుంటుంది. పక్కవారిని ఎందుకు అనడం? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం కల్కి ఆల్రెడీ యానిమల్ సినిమా కలెక్షన్స్ దాటేసింది. నాగ్ అశ్విన్.. ఆ సినిమా డైరెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. ఏదో సాధారణంగా చెప్పాడంతే! అని నాగిని వెనకేసుకొస్తున్నారు. Man literally attacked Sandeep vanga like nobody ever could 🏃🏻♂️#SandeepReddy #Kalki28989AD #nagashwin pic.twitter.com/p3E6f4sZPE— HARISH KS (@CinemaPaithiyom) July 14, 2024 చదవండి: బిగ్‌బీ కాళ్లకు నమస్కరించబోయిన రజనీకాంత్.. వీడియో వైరల్ -
వాష్ రూమ్ కోసం అమితాబ్ పర్మిషన్.. అసలు విషయం ఇది
థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు అయిపోతున్నా సరే ప్రభాస్ 'కల్కి'కి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా రూ.1000 కోట్ల గ్రాస్ దాటేసినట్లు పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఇందులో అశ్వద్థామగా నటించిన అమితాబ్ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. ఇక సెట్లో ప్రభాస్ కాళ్లకు నమస్కారం చేస్తానని చెప్పడం లాంటి కామెంట్స్‌తో ఈయనపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి.షూటింగ్ జరుగుతున్న టైంలో అమితాబ్, వాష్ రూమ్‌కి వెళ్లాలన్నా సరే తన అనుమతి తీసుకునేవారని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రమోషన్స్ టైంలో చెప్పాడు. తాజాగా దీనికి అమితాబ్ వివరణ ఇచ్చారు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. సెట్లో ఉన్నంత సేపు తాను ఓ పనివాడిని అయితే.. దర్శకుడు కెప్టెన్ లాంటి వాడని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)'మంచితనంగా ఉండటానికి ఇదేం ఉదాహరణ కాదు. ఎందుకంటే ఇది చాలా సాధారణ విషయం. వాష్ రూమ్‌కి వెళ్లేందుకు నేను పర్మిషన్ అడిగారని డైరెక్టర్ చెప్పారు. అవును అది నిజమే. అది అతడి సెట్, అతడి సమయం, అక్కడ అతడే కెప్టెన్. నేను కేవలం పనోడిని మాత్రమే. ఒకవేళ నేను బయటకెళ్లాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి కదా! సెట్‌కి నన్ను పిలిచింది అతడే. అందుకే అతడి చెప్పిన విషయాల్ని తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నేను అదే చేశాను' అని అమితాబ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.'కల్కి' సినిమాలో అశ్వద్థామగా కనిపించి అమితాబ్.. 80 ఏళ్ల వయసులోనే యాక్షన్, ఎమోషనల్ సీన్లలో రఫ్ఫాడించారు. ఒకానొక సమయంలో హీరో ప్రభాస్ అయినప్పటికీ.. పార్ట్-1లో తన యాక్టింగ్‌తో అశ్వద్థామనే అసలైన హీరో అనిపించేలా యాక్టింగ్ చేశారు. ఇలా ఇంత డెడికేషన్ చూపిస్తూ డైరెక్టర్ చెప్పింది వింటున్నారు కాబట్టి ఇప్పటికీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారేమో!(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఆలస్యం.. మనసు మార్చుకున్న చరణ్?) -
రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ‘కల్కి’.. అరుదైన రికార్డు!
ఊహించిందే నిజమైంది. ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల కొల్లగొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమైయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ రోజే(జూన్ 27) హిట్‌టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పటికి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు వచ్చాయాని మేకర్స్ ప్రకటించారు. (చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్)రిలీజ్ అయి రెండు వారాలు దాటినా..ఇప్పటికీ సక్సెఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.ఏడో చిత్రంగా ‘కల్కి’ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఏడోది. అంతకు ముందు దంగల్ (2016) రూ.2024 కోట్లు, బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్ఆర్ఆర్ (2022) 1387 కోట్లు, కేజీయఫ్2 (2022) రూ.1250 కోట్లు, జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు వసూలు చేశాయి. -
కల్కితో కాసుల వర్షం.. 11 రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గతనెల 27న విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు సృష్టిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. అంతేస్థాయిలో కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి విడుదలైన 11 రోజుల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరనుంది.సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వచ్చిన కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. మూడు ప్రాంతాల మధ్య జరిగే పోరాటాన్ని కల్కిలో చూపించారు. ఇందులో అమితాబ్ నటన, కమల్ హాసన్‌తో సీన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి పార్ట్-2 కూడా ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. Raging towards the magical milestone…❤️🔥#EpicBlockbusterKalki in cinemas - https://t.co/xbbZpkX7g0#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/r27Dybw58B— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2024 -
కల్కి పార్ట్ 2 స్టోరీ చెప్పిన నాగ్ అశ్విన్ !
-
'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా'.. ఆసక్తిగా టీజర్!
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కలి. ఈ చిత్రాన్ని శివ సాషు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్లో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన కలి టీజర్ చూస్తే ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా.. నెక్ట్స్ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే మాత్రం మనిషిగా పుట్టకూడదు.. మంచితనంతో అస్సలు పుట్టకూడదు.' అనే డైలాగ్‌లో టీజర్ ప్రారంభమైంది. టీజర్లో ట్విస్ట్‌లు, సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో నేహా కృష్ణన్, గౌతన్ రాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, సివిఎల్ నరసింహారావు, మణిచందన, మధు మణి, త్రినాధ కీలక పాత్రల్లో నటించారు. -
‘కలి’ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది: నాగ్ అశ్విన్
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. "కలి" మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు. "కలి" మూవీ టీమ్ కు నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు.ఇక టీజర్ విషయానికొస్తే.. స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో "కలి" టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. -
'కల్కి'లో యాక్షన్ సీక్వెన్స్.. ఎలా తెరకెక్కించారంటే..?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ సినిమా వారం పూర్తి అయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. తొలిరోజే రూ.191.5 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన 'కల్కి' తాజాగా రూ. రూ.800కోట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే రూ. 1000 కోట్ల మార్క్‌ను మరో కొద్దిరోజుల్లో చేరుకోవడం పెద్ద కష్టం కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి.కల్కి సినిమాలోని ఫైట్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి యాక్షన్ సీన్స్‌ను ఎలా తెరకెక్కించారో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సాలమన్ డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్స్ వెనుకున్న కష్టాన్ని ఆయన ఒక వీడియో ద్వారా పంచుకున్నారు. -
'కల్కి' రికార్డుల పరంపర.. నైజాం, ఓవర్సీస్లో తగ్గేదే లే
ప్రభాస్ 'కల్కి' థియేటర్లలోకి వచ్చి వారం దాటిపోయింది. ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా వల్ల అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా రికార్డులు బద్ధలవుతున్నాయి. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరడం విశేషం.(ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్)ఈ సినిమాకు మన దగ్గర కంటే ఓవర్సీస్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మిగతా హీరోలు ఒకటి లేదా రెండు మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడమే కష్టంగా మారుతుంటే.. 'కల్కి'తో ప్రభాస్ ప్రస్తుతం 14.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో 14.3 మిలియన్ డాలర్స్‌తో ఉండగా ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించేసింది.మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.242 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే ఏకంగా రూ.100 కోట్లని 'కల్కి' సాధించినట్లు టాక్. తమిళనాడులో రూ.24 కోట్లు, బాలీవుడ్లో రూ.164 కోట్లు, కర్ణాటక-తమిళనాడులో వరసగా రూ.25 కోట్లు, రూ.24 కోట్లు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా తన గత చిత్రాల కలెక్షన్స్ రికార్డులని ప్రభాసే అధిగమిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!) -
పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!
గత కొన్నిరోజుల నుంచి తెలుగు ప్రేక్షకుల మధ్య వినిపిస్తున్న పేరు 'కల్కి'. రిలీజ్ ముందు వరకు కొన్ని డౌట్స్ ఉండేవి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓవరాల్‌గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలా అని పొరపాట్లు ఏం లేవా అంటే సినిమాలో చాలానే ఉన్నాయి. అయినా సరే మూవీ బాగానే ఉండటంతో జనాలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పొరపాట్ల విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.చాలామంది దర్శకులకు ఒకటి రెండు హిట్స్ పడగానే పొగరు తలకెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాము తీసిందే గొప్ప అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. సినిమాలో పొరపాట్లు గురించి చెబితే తట్టకోలేరు. కానీ ఈ విషయంలో నాగ్ అశ్విన్‌ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తాజాగా 'కల్కి' సెట్లో మీడియాతో చాలాసేపు ముచ్చటించాడు. తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని ఒప్పుకొన్నాడు.(ఇదీ చదవండి: కల్కిలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ అలా అనేశాడేంటి?)'కల్కి'లో మేజర్ కంప్లైంట్స్ విషయానికొస్తే ఫస్టాప్ ల్యాగ్ అయిపోయింది. అయితే సినిమాని రెండు పార్ట్స్‌గా తీయాలనే ఉద్దేశంతో పాటు కథని డీటైల్డ్‌గా చెప్పాలని కాస్త టైమ్ తీసుకున్నామని నాగ్ అశ్విన్ చెప్పాడు. అలానే ఫస్టాప్ సీన్స్ కంటే ఎడిటింగ్‌ని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా చేసుండాల్సిందని చెప్పుకొచ్చాడు. ఇక మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుతూ.. కొన్నిచోట్ల ఎక్స్‌ట్రార్డీనరీగా వస్తే, కొన్నిచోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని, అక్కడ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సిందని నాగ్ అశ్విన్ కూడా అభిప్రాయపడ్డాడు.'మహానటి'లానే ఇందులోనూ నటీనటులతో సొంతంగా డబ్బింగ్ చెప్పించాం. చివరి నిమిషంలో తొందర వల్ల బహుశా సరైన ఫినిషింగ్ రాలేదేమో! పట్టి పట్టి చెప్పినట్లు ఉందని తమకు కూడా అనిపించిందని నాగ్ అశ్విన్ అన్నాడు. యాక్ట్ చేసినవాళ్లు డబ్బింగ్ చెబితే 100 శాతం ఫెర్ఫెక్ట్ ఉంటుందనేది తన అభిప్రాయమని అందుకే ఇలా చేసినట్లు చెప్పాడు. పైన చెప్పిన వాటి బట్టి చూస్తే నాగ్ అశ్విన్ తాను చేసిన పొరపాట్లు ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టి వీటిని పార్ట్-2లో రిపీట్ కాకుండా చూస్తాడనే ఆశిద్దాం.(ఇదీ చదవండి: ఆ కల్ట్ క్లాసిక్ చిత్రమే కల్కికి స్ఫూర్తినిచ్చింది: నాగ్ అశ్విన్) -
ఆ కల్ట్ క్లాసిక్ చిత్రమే కల్కికి స్ఫూర్తినిచ్చింది: నాగ్ అశ్విన్
‘‘కల్కి 2898 ఏడీ’ని సూపర్ హిట్ చేసినందుకు మా టీమ్, వైజయంతీ మూవీస్ తరఫున ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయం మొత్తం ఇండస్ట్రీదిగా భావిస్తున్నాను. ఎన్నో ప్రోడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్‌కి ఒక డోర్ ఓపెన్ అయ్యింది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి ‘కల్కి’ రిఫరెన్స్ పాయింట్లా ఉంటుంది’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం రూపొందించిన సెట్స్‌లో శుక్రవారం డైరెక్టర్ నాగ్ అశ్విన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ⇒ తెలుగు సినిమా అనగానే చాలామందికి ‘మాయా బజార్’ గుర్తొస్తుంది. అది ఓ రకంగా మహాభారతం ఆధారంగా రూపొందిందే. ‘మాయా బజార్’ మూవీ స్ఫూర్తితోనే ‘కల్కి 2898 ఏడీ’ తీశాను. ఈ కథను ముందుగా చిరంజీవిగారికి చెప్పాననడంలో నిజం లేదు. ప్రభాస్‌గారు కథని నమ్మి చాలా సపోర్ట్ చేశారు. ముందు ఒకే భాగంగా తీయాలనుకున్నాం. కొన్ని షెడ్యూల్స్ తర్వాత ఇంత పెద్ద కథని ఒక భాగంలో చెప్పడం సవాల్‌గా అనిపించింది. అందుకే రెండు భాగాలుగా చూపించాలనుకున్నాను. ⇒ ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ చేసిన భైరవ పాత్ర సీరియస్‌గా కాకుండా సరదాగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా క్రియేట్ చేశాను. మొదటి భాగంలో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉందంటున్నారు. రెండో భాగంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్స్‌ని వ్యాపార కోణంలో ఆలోచించి తీసుకోలేదు. ఆయా పాత్రలకు వారు న్యాయం చేయగలరనే ఉద్దేశంతోనే తీసుకున్నా. ఒకవేళ కథలో బలం లేకపోతే ఆ నటుల ఎంపిక మాకు నెగెటివ్ అయ్యేది. కానీ వారి క్యారెక్టర్స్‌కి అనూహ్య స్పందన వస్తోంది. కమల్ సార్ చేసిన యాస్కిన్ పాత్రను పార్ట్ 2లోనే ఎక్కువ రివీల్ చేస్తాం. ⇒ వైజయంతీ మూవీస్ 50 ఏళ్ల జర్నీలోనే కాదు... తెలుగు సినిమా హిస్టరీలో ఉన్న అత్యధిక భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. ఈ సినిమా గొప్ప విజయం సాధించి మా పెట్టుబడి పూర్తిగా రావడంతో చాలా హ్యాపీగా ఉంది. రామ్‌గోపాల్ వర్మ, రాజమౌళిగార్లు ఈ మూవీలో కనిపించడం ప్రేక్షకులకు సర్ప్రైజ్. విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్లతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తీశాను. నా ఫస్ట్ మూవీ నటులు కాబట్టి వారు ప్రత్యేకం. నాకు లక్కీ ఛార్మ్. అందుకే వాళ్లని నా ప్రతి చిత్రంలో తీసుకుంటాను. నానీ, నవీన్ ΄÷లిశెట్టిలను రెండో భాగంలో ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేస్తా (నవ్వుతూ). ⇒ ‘కల్కి...’లో కృష్ణుడి పాత్రలో మహేశ్‌బాబు నటించి ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ మూవీలో ఆ చాన్స్ లేదు. కానీ ఆయన ఏ సినిమాలో అయినా కృష్ణుడిగా నటిస్తే చాలా బాగుంటుంది. ‘కల్కి’ రెండో భాగానికి సంబంధించి 20 రోజులు షూటింగ్ జరిపాం. రెండో భాగంలో కల్కి పాత్రలో ఏ హీరో కనిపిస్తార న్నది సస్పెన్స్. రెండో భాగాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేం. -
కల్కిలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ అలా అనేశాడేంటి?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.కల్కి చిత్రం పార్ట్-2లో మహేశ్ బాబు ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు? దీనిపై మీరేమంటారు? అని నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. 'ఇప్పుడైతే మేం మహేశ్ బాబును తీసుకోవాలని అనుకోలేదు.. ఈ సినిమాలో కాకుండా.. వేరే ఏదైనా చిత్రంలో ఆయన చేస్తే బాగుంటుంది' అని అన్నారు. అయితే కల్కి పార్ట్-2లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా హీరో నాని, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నించారు. అయితే దీనిపై బదులిస్తూ.. వాళ్లద్దరిని తీసుకోవడం ఈ చిత్రంలో కుదరలేదు.. ఎక్కడ ఛాన్స్ వస్తే వాళ్లను అక్కడ పెట్టేస్తాను' అని అన్నారు. -
'కల్కి 2898 ఏడీ'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ ఈ సినిమాను తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కల్కి 2898 ఏడీ చిత్రంలోని హోప్ ఆఫ్ శంబల అనే వీడియోసాంగ్ విడుదలైంది. వారణాసి, కాంప్లెక్స్, శంబల.. ఈ మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో ఈ మూవీని రూపొందించారు. కాగా.. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. The hope begins with her…#HopeOfShambala Video Song from #Kalki2898AD out now 🎵🔗 https://t.co/BxcYCLzjW9#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal… pic.twitter.com/YOhI2a9OmM— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 4, 2024 -
కల్కి మేకర్స్‌పై ప్రముఖ నటుడు ఆగ్రహం.. అలా చూపించడం సరైంది కాదు!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజు సైతం అదే జోరును కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.అయితే బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. కల్కి మేకర్స్ మహాభారతాన్ని వక్రీకరించారని అన్నారు. కొన్ని సన్నివేశాల్లో పురాణ ఇతిహాసాన్ని మార్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాజాగా కల్కి మూవీ వీక్షించిన ముకేశ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివ్యూను వెల్లడించారు. కల్కి చిత్రంలోని విజువల్స్, నటనను ప్రశంసించినప్పటికీ మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.ముఖేశ్ మాట్లాడుతూ.. "నన్ను బాధిస్తున్న ఒక విషయం ఏమిటంటే.. కల్కి మేకర్స్ ఈ చిత్రంలో మహాభారతాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అశ్వథామను వేడుకున్నట్లు చూపించారు. అశ్వథామ మణిని శ్రీకృష్ణుడు తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నా రక్షకుడివని అతన్ని శ్రీకృష్ణుడు వేడుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈ విషయంపై నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా. మీకు వ్యాసముని కంటే ఎక్కువ తెలుసునని ఎలా ఊహించుకున్నారు. నేను నా చిన్నప్పటినుంచి మహభారతం చదువుతున్నా. అశ్వత్థామ 'మణి'ని తొలగించింది శ్రీ కృష్ణుడు కాదు. ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి' అని అన్నారు.అనంతరం ముకేశ్ మాట్లాడుతూ..'నేను ఈ కథను ఇంత వివరంగా చెప్పడానికి కారణం. కృష్ణుడు భవిష్యత్తులో తనను రక్షించమని కల్కిలో అశ్వత్థామను ఎలా ఆజ్ఞాపించాడో నాకు అర్థం కాలేదు? అంత శక్తిమంతుడైన శ్రీకృష్ణుడు.. తనను రక్షించమని అశ్వత్థామను ఎలా అడగుతాడు? ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి. దక్షిణాది ఫిల్మ్ మేకర్స్‌కి మన సంప్రదాయాలపై ఎక్కువ గౌరవం ఉందని అనుకుంటున్నాం? కానీ రామాయణం, గీత, ఇతర పౌరాణిక అంశాలతో రూపొందిస్తున్న చిత్రాలను పరిశీలించాలి. అవసరమైతే సినిమా స్క్రిప్ట్ పరిశీలనకు కమిటీని వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా.. మహాభారత్ సీరియల్లో భీష్ముని పాత్రలో ముకేశ్ ఖన్నా కనిపించారు. -
ఆ స్టార్ హీరోల ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను కొట్టేసిన ప్రభాస్
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కల్కి దూసుకుపోతుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి ఆ తర్వాతి రోజుల్లో కూడా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఆరు రోజుల్లో రూ. 700 కోట్లు రాబట్టిన కల్కి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారత చిత్రాల్లో ప్రథమ స్థానంలో ఉంది.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్ కల్కి చిత్రం ఇప్పటికే పలు రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్, దళపతి విజయ్‌ల ఆల్‌టైమ్ రికార్డులను కల్కి బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 15 ఇండియన్ సినిమాల జాబితాలో కల్కి చేరిపోయింది.రజనీకాంత్ హిట్ సినిమా జైలర్ లాంగ్ రన్లో రూ.650 కోట్లు రాబట్టితే.. విజయ్ నటించిన లియో మాత్రం రూ. 600 కోట్లు రాబట్టింది. ఇద్దరు సౌత్ ఇండియన్ టాప్ హీరోలకు చెందిన ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను ప్రభాస్ కేవలం ఆరు రోజుల్లోనే దాటేశాడు. బాక్సాఫీస్ వద్ద ఇంకా ఈ కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా కల్కి ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 'హనుమాన్' రూ.350 కోట్లు, 'ఫైటర్' రూ. 327 కోట్లు, 'మంజుమ్మెల్ బాయ్స్ రూ. 242 కోట్లు, 'సైథాన్' రూ. 211 కోట్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్ వండర్ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. అందుకే కల్కి చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు వెళ్తున్నారు. -
నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ
నాగ్ అశ్విన్.. మొన్నటి వరకు ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తప్పితే..పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మార్మోగిపోతోంది. యావత్ సినీ ప్రపంచం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దానికి కారణంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.(చదవండి: కల్కి దెబ్బకు 'షారుఖ్ ఖాన్' రికార్డ్ బద్దలైంది) నాగ్ అశ్విన్ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడని పొగిడేస్తున్నారు. సామాన్యులు మొదలు..స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ‘కల్కి 2898 ఏడీ’పై రివ్యూ ఇస్తూ.. నాగ్ అశ్విన్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన శైలీలో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు. (చదవండి: ఆ సంఘటనతో భయమేసింది: నాగ్ అశ్విన్)ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ రిలీజ్ రోజు అరిగిపోయిన చెప్పులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే డైరెక్టర్ ఎంత సింపుల్ ఉంటాడో చూడండి అంటూ.. ఆయన చెప్పుల ఫోటోలను వైరల్ చేశారు నెటిజన్స్. దానికి సింక్ ఆయ్యేలా బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్ సినిమా తీశారు . నాగ్ అశ్విన్ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. థ్యాంక్యూ ప్రియాంక ,స్వప్న (నిర్మాతలు). మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష’ అని బ్రహ్మాజీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు .@nagashwin7 గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను ❤️..thank యూ ప్రియాంక ..స్వప్న ..మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష 🙏🏼 .#Kalki2808AD 🔥@VyjayanthiFilms 🙏🏼— Brahmaji (@actorbrahmaji) July 1, 2024 -
కల్కి సినిమాలో ఓల్డ్ టెంపుల్.. ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
-
కల్కి దెబ్బకు 'షారుఖ్ ఖాన్' రికార్డ్ బద్దలైంది
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, వీకెండ్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే అనేక రికార్డ్స్‌ను కల్కి క్రియేట్ చేస్తుంది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని తెరకెక్కించారు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డ్స్‌ను దాటేసింది. ఒక వీకెండ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఉంది. షారుక్‌ఖాన్- అట్లీ 'జవాన్' (రూ.520 కోట్లు) పేరుతో ఉన్న రికార్డు ప్రభాస్ దెబ్బకు బద్దలైంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారత్ చిత్రంగా హనుమాన్ (రూ.350 కోట్లు) ఉంది. అయితే, ఆ రికార్డ్‌ను కల్కి కేవలం రెండు రోజుల్లోనే బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ టాప్-3 చిత్రాల జాబితాలో 'కల్కి' మూడో స్థానంలో ఉంది. ఆర్ఆర్ఆర్ (రూ.223 కోట్లు), బాహుబలి2 (రూ.217 కోట్లు), కల్కి (రూ.191.5కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇందులో రెండు ప్రభాస్ సినిమాలే ఉండటం విశేషం.బాలీవుడ్లో పెరుగుతున్న కలెక్షన్స్కల్కి సినిమాకు హిట్ టాక్ రావడంతో బాలీవుడ్లో కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. వీకెండ్ తర్వాత సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద భారీగానే రాబట్టింది. సోమవారం నాడు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్‌ను కల్కి రాబట్టింది. ఇప్పటికే బాలీవుడ్లో రూ. 170 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతుంది. బాలీవుడ్ బయర్ల నుంచి కల్కి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో కల్కి సులభంగానే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. -
ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంది: నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడినట్లు నాగ్ అశ్విన్ ఇదివరకే వెల్లడించారు. తాజాగా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ సంఘటనను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం.నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో రాస్తూ..' దాదాపు 10 సంవత్సరాల క్రితం మేము ముగ్గురం(నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్) కలిసి మా తొలి చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం" ప్రారంభించాం . అప్పట్లో వైజయంతి నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కించడం రిస్క్‌తో కూడుకున్నది . నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంది. ఒక రోజు వర్షం కురిసింది. దీంతో షూటింగ్ పూర్తి చేయలేకపోయాం. దీంతో మళ్లీ షూటింగ్ సెట్ వేయాల్సి వచ్చింది. దీంతో నిర్మాణ ఖర్చు ఎక్కువైంది. అది కాస్తా మమ్మల్ని భయాందోళనకు గురిచేసిందని. ' రాసుకొచ్చారు. 'అంతే కాకుండా.. దాదాపు 10 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు.. సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి. ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవడం మీ అందరి ఆశీర్వాదంగా భావిస్తున్నా. వీళ్లిద్దరి మధ్యలో నిల్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఆదరిస్తున్నందకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు మీ నుంచి మరెన్నో అద్భుతమైన చిత్రాలు రావాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. కొత్త ఆలోచనలతో సరికొత్త మూవీస్ చేస్తూ అబ్బురపరుస్తుంటారు. అలా కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ కుర్రాడు జస్ట్ రెండే సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. లేటెస్ట్గా ఇతడి పేరు మరోసారి మార్మోగిపోతోంది. మరి హింట్స్ ఇచ్చాం కదా ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో ముగ్గురు కుర్రాళ్లున్నారు. వీళ్లలో ఓవైపు చివరలో ఉంది విజయ్ దేవరకొండ అని తెలుస్తోంది. మరో చివర ఉన్నది ఎవరంటే టక్కున చెప్పడం కష్టం. అతడి పేరు నాగ్ అశ్విన్. తాజాగా థియేటర్లలో సెన్సేషన్ సృష్టిస్తున్న 'కల్కి' మూవీ తీసింది ఇతడే. డాక్టర్స్ ఫ్యామిలీలో పుట్టిన ఇతడు.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ మాత్రం ఇతడి కెరీర్‌తో పాటు జీవితాన్నే మార్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)నాగ్ అశ్విన్ డైరెక్టర్ కాకముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇది చూసిన నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు. పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చారు. తొలుత ఒకటి అనుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి 'ఎవడే సుబ్రహ్మణ్యం' బయటకొచ్చింది. ఈ మూవీతోనే విజయ్ దేవరకొండ నటుడిగా పూర్తిస్థాయిలో పరిచయమయ్యాడు. దీని తర్వాత 'మహానటి'తో సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించి నాగ్ అద్భుతం చేశాడు.ఇక తనతో సినిమా తీసిన ప్రియాంక దత్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా నిర్మాత అశ్వనీదత్‌కి నాగ్ అశ్విన్ అల్లుడైపోయాడు. వీళ్ల కాంబినేషన్లోనే ఈ మధ్య వచ్చిన 'కల్కి' మూవీ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ్ అశ్విన్ పాన్ ఇండియా సెన్సేషన్ అయిపోయాడు. తాజాగా ఇతడి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అంత డిఫరెంట్‌గా ఉన్నాడు మరి!(ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్) -
నాలుగు రోజుల్లో కల్కి కలెక్షన్స్.. ఎక్కడ ఎంత వచ్చిందంటే..?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా పట్ల హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్ వండర్ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. మహాభారతాన్ని ఫ్యూచర్ కథకు ముడి పెట్టి కల్కిని తెరకెక్కించిన నాగ్ అశ్విన్‌ను నెటిజన్లు అభిమానిస్తున్నారు.కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో 204.5 కోట్లు, హిందీలో రూ. 134.5 కోట్లు, తమిళ్లో రూ. 32.9 కోట్లు, మలయాళంలో రూ.35.1 కోట్లు, ఇతర దేశాల్లో రూ. 158 కోట్లు వచ్చాయి. అదె నెట్ పరంగా అయితే కల్కి ప్రపంచ వ్యాప్తంగా నాలుగురోజుల్లో రూ. 320 కోట్లు రాబట్టింది. -
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
ప్రభాస్ పని అయిపోయిందన్న ప్రతిసారి రెట్టింపు వేగంతో డార్లింగ్ ముందుకు దూసుకు వస్తూనే ఉన్నాడు. కల్కి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మొదట్లో కూడా సినిమా పోయేలా ఉందన్న విమర్శలు వచ్చాయి. తీరా సినిమా రిలీజ్ చేశాక.. అప్పుడు విమర్శించినవారే వన్స్‌మోర్ అంటూ మరోసారి కల్కి చూసేందుకు థియేటర్‌కు పరుగులు తీస్తున్నారు. ఈ ఘనత ప్రభాస్ ఒక్కడిదే కాదు! తెర వెనక నుంచి నడిపించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ది.కలెక్షన్ల సునామీఅభిమానులను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా కల్కి కళాఖండాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్లోనూ రికార్డులు తిరగరాస్తోంది.హలో అమెరికా..అమెరికా, కెనడాలోనే రూ.91 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ అక్కడి ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. హలో అమెరికా.. మేము తీసే ప్రతి సినిమాకు మీరెప్పుడూ అండగా ఉంటున్నారు. మంచి సినిమాలను ఆదరిస్తారు. కల్కి మీ సినిమాగా భావించి సపోర్ట్ చేశారు. అందుకు థాంక్యూ సో మచ్. ఇలాంటి చిత్రాలు అరుదుగా..మీ ఫ్రెండ్స్, పిల్లలతో కలిసి సినిమాకు వెళ్లండి. కల్కి వంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇది తప్పకుండా బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన మూవీ! ఇప్పటికే మీలో చాలామంది కల్కి చూసి ఎంజాయ్ చేశారు. అందరికంటే ముందుగా కల్కిని సపోర్ట్ చేసినందుకు మరోసారి థాంక్యూ అని వీడియో రిలీజ్ చేశాడు. Our Captain @nagashwin7 thanks the USA audience for their tremendous love and record breaking start ❤️#Kalki2898AD #EpicBlockbusterKalki@PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/fC6jUTcv0G— Kalki 2898 AD (@Kalki2898AD) June 30, 2024 ‘KALKI 2898 AD’ OVERSEAS BO: IT'S NOT A STORM, IT'S A TSUNAMI... #Kalki2898AD *opening weekend* biz in key international markets...⭐️ #USA + #Canada: $ 11 million+ [₹ 91.81 cr]. Final numbers later. Includes Wed premieres.⭐️ #UK: £ 888,190 [₹ 9.38 cr]. Some locations to be… pic.twitter.com/0kQ0cYOFR9— taran adarsh (@taran_adarsh) July 1, 2024చదవండి: ప్రభాస్‌తో పోటీ కాదు.. నాదొక పాత్ర మాత్రమే.. -
ప్రభాస్‌తో పోటీ కాదు.. నాదొక పాత్ర మాత్రమే..
నాగ్, ప్రభాస్ అంటే చాలా ఇష్టం కల్కితో తెలుగు సినిమా దిశ మారింది‘సాక్షి’తో విజయ్ దేవరకొండ నాగీ (దర్శకులు నాగ్ అశ్విన్), ప్రభాస్‌ల కోసమే కల్కి సినిమాలో నటించానని.. ఆ ఇద్దరంటే తనకెంతో ఇష్టమని ప్రముఖ సినీనటుడు విజయ్ దేవరకొండ తెలిపారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్.. ఇటీవల విడుదలైన కల్కి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కల్కి సినిమాతో భారతీయ సినిమాను, ముఖ్యంగా తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లగలిగామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమా చూస్తూ ఎమోషనల్‌కు లోనయ్యానన్నారు. ‘కల్కిలో ప్రభాస్ గొప్పనా, నేను గొప్పనా అనే వాదనలు కాదు... నాగ్ అశి్వన్ సృష్టించిన వినూత్న ప్రపంచంలో తామొక పాత్రలమేనని’ వివరించారు. వైజయంతి సంస్థతోనే తన ప్రయాణం మొదలైందని, ఎప్పుడు అడిగినా వారి సినిమాల్లో నటిస్తానన్నారు. నాగ్ ప్రతి సినిమాలో నటిస్తూ లక్కీ చార్మ్‌గా మారారనే ప్రశ్నకు సమాధానంగా.. నాగ్ దర్శకత్వంలో తను అతిథి పాత్రలు పోషించిన మహానటి, కల్కి సినిమాలు బాగున్నాయి కాబట్టే హిట్ అవుతున్నాయని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని మరోసారి తన సింప్లిసిటీని నిరూపించుకున్నారు. కల్కి పార్ట్–2లో మీ పాత్ర మరింతగా ఉంటుందని నిర్మాత అశ్వినీదత్ ఓ సమావేశంలో అన్నారనే మరో ప్రశ్నకు సమాధానంగా..అశి్వనీదత్ అంటే అది కరెక్టేనని సినీ ప్రియులకు హింట్ ఇచ్చారు. -
కల్కి దెబ్బకు షేక్ అవుతోన్న బాక్సాఫీస్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య రిలీజైన కల్కికి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.కల్కి సినిమా రిలీజైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు సైతం అదే జోరును కొనసాగించింది. రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ సినీ తారలు అతిథి పాత్రల్లో మెరిశారు. The force is unstoppable…❤️🔥#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/fjhnE8KWIB— Kalki 2898 AD (@Kalki2898AD) June 30, 2024 -
‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె!
‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన సైన్స్ విజువల్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్ర దర్శకుడు మన పాలమూరు బిడ్డే. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రెబల్‌స్టార్ ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి టాప్‌స్టార్లతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై.. భారీ హిట్‌గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. సాక్షి, నాగర్‌కర్నూల్/తాడూరు: దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశి్వన్పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్‌లో యూరాలజిస్ట్‌గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్‌కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు. ⇒ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న నాగ్ అశ్విన్‌కు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సినిమాలకు దర్వకత్వం వహించాలనే లక్ష్యంగా ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అశ్విన్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే.. ఆ చిత్రాల్లో చిన్నపాత్రలు సైతం వేశారు. అయితే 2013లో రచయిత, దర్శకుడిగా తీసిన ఇంగ్లిష్ లఘు చిత్రం ‘యాదోం కీ బరాత్’ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌కు ఎంపికైంది. అనంతరం 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్‌తో తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. అదే ఏడాది వైజయంతి మూవీస్ అధినేత, నిర్మాణ అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకను వివాహం చేసుకున్నారు. 2018లో అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్‌గా తీసిన ‘మహానటి’ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ‘బయోపిక్’లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ చిత్రం 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వీటితో పాటు 2021లో వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్‌లో ‘ఎక్స్‌లైఫ్’ సిగ్మెంట్‌కు దర్శకత్వం వహించారు. అలాగే అదేఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఇండియాలోనే భారీ బడ్జెట్ రూ.600 కోట్లతో తీసిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. స్వగ్రామంలో హర్షాతిరేకాలుదర్శకుడు నాగ్ అశి్వన్ తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుండటం, ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన స్వగ్రామం తా డూరు మండలం ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంతో పాటు జిల్లాకేంద్రంలోనూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు. నాగ్ అశి్వన్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడినా సొంత ఊరిపైనున్న మమకారాన్ని వదులుకోలేదు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటుండటం గమనార్హం. ఏళ్ల నాటి కల నెరవేర్చుకున్నాడు.. మంచి దర్శకుడిగా ఎదగాలన్న తన ఏళ్ల నాటి కలను నాగ్ అశ్విన్ నెరవేర్చుకున్నాడు. కల్కి సినిమా పార్ట్–1 విజయవంతమై అందరి ప్రసంశలు అందుకుంది. భవిష్యత్‌లోనూ ఈ విజయాల పరంపర కొనసాగాలి. సినిమా గొప్ప విజయం సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ జయంతిరెడ్డి, నాగ్ అశ్విన్ తల్లిఇంకా గొప్ప విజయాలు సాధించాలి.. ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన విజయం మాకు అందరికీ గర్వకారణం. భవిష్యత్‌లోనూ గొప్ప సినిమాలు చేయాలని, దర్శకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. – హరికృష్ణ శర్మ, ఐతోలు, తాడూరు మండలం -
'ప్రపంచస్థాయి సినిమాకు ఏమాత్రం తగ్గలేదు'.. కల్కిపై పుష్పరాజ్ కామెంట్స్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.అయితే ఈ సినిమాపై పలువురు దిగ్గజ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్, ప్రభాస్ నటన అద్భుతం అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ సైతం తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కల్కి మూవీ చిత్రబృందానికి బన్నీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.అల్లు తన ట్వీట్లో రాస్తూ..' కల్కి టీమ్‌కు నా అభినందనలు. అద్భుతమైన విజువల్ వండర్. ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్ నటన సూపర్బ్. అమితాబ్ బచ్చన్ నటన గురించి ఇక మాటల్లేవ్. కమల్ హాసన్,దీపికా పదుకొణె, దిశా పటానీ నటన అద్భుతం. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్ బృందానికి, సాంకేతిక సిబ్బందికి అభినందనలు. ఇంత రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్, వైజయంతి మూవీస్‌కు నా ధన్యవాదాలు. కల్కితో ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని ఆశ్చర్యానికి గురి చేశాడు నాగ్. మా తరానికి చెందిన నాగ్ అశ్విన్‌కు ప్రత్యేక అభినందనలు. చివరిగా ప్రపంచ సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే.. మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన చిత్రమే కల్కి' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 లో నటిస్తున్నారు. ఈ సినిమాను పుష్ప సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. Kudos to #Kalki2898AD team. Outstanding visual spectacle . Respect for my dear friend #Prabhas garu for empowering this epic . Entertaining super heroic presence. @SrBachchan Ji, you are truly inspirational... no words 🙏🏽 . Adulation to our @ikamalhaasan sir looking fwd for…— Allu Arjun (@alluarjun) June 29, 2024 -
అమితాబ్ అలా చేస్తారని ఊహించలేదు: నిర్మాత సి. అశ్వినీదత్
‘‘అమితాబ్ బచ్చన్‌గారు లెజెండ్. మేము సెట్స్‌లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నా కాళ్లకి అమితాబ్‌గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాగ్ అశ్విన్ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్‌ల ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్‌గోపాల్ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్‌గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 వచ్చే ఏడాది జూన్‌లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్‌గారి అబ్బాయి రోషన్‌తో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్‌తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
Kalki 2898: కృష్ణుడి పాత్రను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్!
‘కల్కి 2898’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చిస్తున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడని అందరు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామతో పాటు పలు పాత్రలను చూపించారు. ఆ సన్నివేశాలన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అశ్వత్థామ, కృష్ణుడి మధ్య వచ్చే సన్నివేశాలు.. సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. (చదవండి: 'కల్కి'లో నిజంగానే అది అద్భుతం.. ఎందుకంటే?)అయితే సినిమా మొత్తంలో మూడు, నాలుగు సార్లు కృష్ణుడు కనిపిస్తాడు. కానీ ఆయన మొఖం మాత్రం కనిపించదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కావాలనే కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదట. ఆ పాత్రను ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌తో చేయించాలని భావించారట. నిర్మాత అశ్వనీదత్ ఈ ఇద్దరి హీరోలను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో వారిద్దరు ఆ పాత్రను చేయలేకపోయారు.(చదవండి: ఇంటర్నేషనల్ మీడియాలో 'కల్కి' హవా .. వేరే లెవల్!) ‘కల్కి 2898’ విడుదలైన మంచి విజయం సాధిస్తే..పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌తో కృష్ణుడు పాత్ర చేయించాలని డైరెక్టర్ నాగి అనుకున్నాడట. అందుకే పార్ట్ 1లో కృష్ణుడి ఫేస్‌ని రివీల్ చేయకుండా కథను నడిపించాడు. అనుకున్నట్లే సినిమా పెద్ద విజయం సాధించింది. తొలి రోజే ఏకంగా రూ. 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి రికార్డును సృష్టించింది. వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. డైరెక్టర్ అంచనా వేసిందే జరిగింది కాబట్టి.. పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది.పార్ట్ 1 కృష్ణుడు ఇతనే‘కల్కి 2898’లో కృష్ణుడి పాత్ర పోషించిన నటుడితో పాటు చాలా మంది పేర్లను మేకర్స్ రహస్యంగానే ఉంచారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అందరి పేర్లు బయటకు వచ్చాయి. ఎవరెవరు ఏ పాత్ర పోషించారనేది కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. అర్జునుడుగా విజయ్ దేవరకొండ నటించగా.. కృష్ణుడిగా తమిళ నటుడు కృష్ణకుమార్ సుబ్రమణియమ్ నటించాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇక ఈ చిత్రంలో కీలకమైన అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్కిన్ పాత్రను కమల్ హాసన్ పోషించారు. ఇతర కీలక పాత్రల్లో దీపికా పదుకొణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి నటించారు. (చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ) -
మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే
మొన్నటివరకు టాలీవుడ్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ మాటలతో కొట్టేసుకునేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మహాభారతం హాట్ టాపిక్ అయిపోయింది. అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? లాంటి చర్చలు మొదలయ్యాయి. ఇవన్నీ కాదన్నట్లు ఇన్ స్టాలో రీల్స్ దగ్గర నుంచి టీ కొట్టు దగ్గర ముచ్చట్ల వరకు మహాభారతమే వినిపిస్తుంది. దీనంతటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగ్ అశ్విన్.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)అప్పట్లో మహాభారతం ఆధారంగా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి తీసుకుంటే ఏ డైరెక్టర్ కూడా దీన్ని సినిమాగా, కనీసం సీన్స్ వరకైనా తీసే సాహసం చేయలేదు. రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పాడు. కాకపోతే జక్కన్న ఇది తీసేసరికి ఇంకో 10-15 ఏళ్లయినా పట్టొచ్చు. ఇంతలోనే నాగ్ అశ్విన్ అనే కుర్ర డైరెక్టర్ రయ్ అని దూసుకొచ్చాడు.మరీ పూర్తిగా కాకపోయినా సరే 'కల్కి'లో మహాభారతంలోని కురుక్షేత్రానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌తో అబ్బురపరిచాడు. అశ్వద్థామ పాత్రని 'కల్కి'తో లింక్ చేసిన విధానం సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. దీంతో అసలు అశ్వద్థామ ఎవరు? అతడికి కర్ణుడితో సంబంధం ఏంటనే సీరియస్‌గా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. 'కల్కి' అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)ఇక 'కల్కి' చివర్లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు. కర్ణుడి చరిత్ర అంతా తవ్వితీస్తున్నారు. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వచ్చిన చందమామ కథలు పుస్తకాల దగ్గర నుంచి గీత ట్రస్ట్ మహాభారతం వరకు ఎవరికీ తోచిన పుస్తకాలని వాళ్లు తిరగేస్తున్నారు. ఇది కాదన్నట్లు మహాభారతం క్యారెక్టర్స్ గురించి పలువురు యాక్టర్స్ మాట్లాడిన వీడియోలని ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు.ఏదేమైనా ఓ తెలుగు సినిమా వల్ల 'మహాభారతం' అనే అద్భుతం గురించి తిరిగి మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఇప్పటి జనరేషన్‌కి మహాభారతంపై మనసు పడేలా చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి ధన్యవాదాలు. కాకపోతే అర్జున vs కర్ణ.. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ గురించి యూత్ తగువులాడుకోవడం మాత్రం వింతగా ఉంది.(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)Thank you man @nagashwin7 🥺❤️Chinnaptinunchi karnudi story amtey chala istam...finally see the Elevations on screen about karna☀️ Even the Divine knows real Hero of MAHABHARAT🙌🔥 #Karna #Kalki2898ADonJune27 #Mahabharath #Kalki2898ADReview pic.twitter.com/PhmsJae837— DRUG❤️🔥 (@Akhilgo16778185) June 28, 2024 -
'కల్కి'పై హాలీవుడ్ ప్రశంసలు.. రేంజు పెరిగిపోయింది!
'కల్కి' సినిమా అద్భుతాలు చేస్తోంది. దక్షిణాదిలో టాక్ పరంగా అక్కడక్కడ కాస్త మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ ఉత్తరాదితో పాటు మిగతా దేశాల్లో మాత్రం యునానిమస్ టాక్ సొంతం చేసుకుంది. ముందు నుంచే దీన్ని పాన్ వరల్డ్ సినిమాగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు మూవీ టీమ్ కోరుకున్నట్లు హాలీవుడ్ మీడియా కూడా 'కల్కి'కి ఫిదా అయిపోయినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)డైరెక్టర్ నాగ్ అశ్విన్.. 'కల్కి'ని హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో తీసిన మాట వాస్తవం. వాళ్లకు మార్వెల్, డీసీ లాంటి విజువల్ వండర్స్ మూవీస్ ఉన్నాయి. మనకు అలాంటిది ఎందుకు ఉండకూడదని సైన్స్ ఫిక్షన్ కథకు మహాభారతాన్ని ముడిపెట్టి తీసిన మూవీనే 'కల్కి'. దీని రిలీజ్ తర్వాత తెలుగోళ్లు మహాభారతం గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.మరోవైపు హాలీవుడ్లో ప్రముఖ మీడియా సంస్థలైన డెడ్ లైన్, కొలీడర్ లాంటివి 'కల్కి' గురించి ఆర్టికల్స్ రాశాయి. అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాయి. గతంలో నాగ్ అశ్విన్ ఏదైతే అనుకున్నాడే ఇప్పుడు అదే జరిగింది. ప్రభాస్ క్రేజ్ కూడా 'కల్కి' దెబ్బకు హాలీవుడ్ వరకు వెళ్లిపోయింది. ఏదేమైనా తెలుగు సినిమాకు ఆస్కార్ రావడమే ఎక్కువ అనుకున్నాం ఇప్పుడు మన మూవీ గురించి వాళ్లు ఆర్టికల్స్ రాయడం బోనస్ లాంటిది!(ఇదీ చదవండి: గతంలో నేను తప్పు చేసిన మాట నిజమే: సమంత) -
ప్రభాస్ ‘కల్కి’ మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
'ఆ విషయం నాకు ముందే చెప్పారు'.. కల్కిపై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంంబోలో తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నైజాంలో కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిమిగమించేసింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా కమల్ హాసన్ కల్కి సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా సుప్రీం యాస్కిన్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు.కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'కల్కి రెండో పార్ట్‌లోనే నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం నాకు ముందే చెప్పారు. కేవలం ఓ అభిమానిగా పార్ట్-1 షూటింగ్లో పాల్గొన్నా. ప్రస్తుతం ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ఓపిక చాలా ఎక్కువ. పురాణాలను సైన్స్‌ను ముడిపెట్టి కల్కిని అద్భుతంగా రూపొందించారు. చాలా ఓపిగ్గా కల్కి కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు' అంటూ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో విలన్‌గా నటించిన సినిమాల కంటే యాస్కిన్ పాత్ర భిన్నంగా కనిపించిందన్నారు. ఈ పాత్ర నేను చేయగలనా అనే సందేహం వచ్చిందని కమల్ తెలిపారు. -
కల్కిలో భారీగా గెస్ట్ రోల్స్.. బాగా మెప్పిచ్చింది ఎవరంటే..?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ఈ సినిమాలో అనేక గెస్ట్ రోల్స్ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా హైలైట్ అవుతోంది విజయ్ దేవరకొండ నటించిన అర్జునుడి పాత్రే అని చెప్పవచ్చు. ఈ పాత్రలో విజయ్ పర్పెక్ట్ గా సరిపోయారంటూ నెట్టింట పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది.అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో చూపించే బలమైన ఎమోషన్స్ తన నటనతో పలికించారు విజయ్ దేవరకొండ. నిడివి తక్కువే అయినా అర్జునుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కల్కిలో ఒక హైలైట్‌గా నిలుస్తున్నాయి. విజయ్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ అప్లాజ్ వస్తోంది. విజయ్ను మైథాలజీ పాత్రల్లో చూసే అవకాశం అరుదు కాబట్టి కల్కి సినిమా ఆయన కెరీర్లోనూ ఓ స్పెషల్ మూవీ అనుకోవచ్చు. -
రికార్డులు క్రియేట్ చేసే వాళ్లు పరుగులు పెట్టరు: స్వప్న దత్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం తాజాగా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కల్కి నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ తాజాగా స్పందించారు. 'కల్కి సినిమా విడుదల తర్వాత చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఇతర సినిమాలకు చెందిన రికార్డులను 'కల్కి' క్రాస్ చేసిందా..? అని కొందరు అభిమానులు అడుగుతున్నారు. ఈ ప్రశ్న నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన వారెవ్వరూ మళ్లీ వాటికోసమే పరుగులు పెట్టి సినిమాలు చేయరు. కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల కోసం తీశాం. ఇలాంటి ప్రశ్నలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.' అని స్వప్నదత్ అన్నారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన వంటి స్టార్స్ నటించారు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలైన కల్కి సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్, వైజయంతి మూవీస్ బ్యానర్లో కల్కి చిత్రం కూడా ఎవర్‌గ్రీన్‌గా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
Kalki2898AD ‘నవ్వొస్తోంది.. మేం రికార్డులకోసం చేయలేదు’! షాకింగ్ ట్వీట్
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి2898 ఏడీ అంచనాలకు మించి ఆదరణను సంపాదించు కుంటోంది. నాగ్ కథను ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే, టెక్నికల్ విలువలు, విజువల్స్ అన్నీ అద్భుతంగా అమరి పోవడం ప్రేక్షకులు చాలా థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు. అద్భుతమైన సినిమా అంటూ కితాబిస్తున్నారు. దీంతో వసూళ్లు , రికార్డులపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు సి. అశ్వినీదత్ కుమార్తె , నిర్మాత స్వప్నాదత్ చలసాని చేసిన ట్వీట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.#Kalki2898AD pic.twitter.com/85X4CYqNij— Swapnadutt Chalasani (@SwapnaDuttCh) June 28, 2024 ‘చాలామంది కాల్ చేసి మీరు రికార్డులను బ్రేక్ చేశారా అని అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నవ్వొస్తోంది.. ఎందుకంటే ఆ రికార్డులను సాధించినవారు, లేదా రికార్డులు సృష్టించిన వారు .. రికార్డుల కోసం ఎపుడూ సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ఉన్న ప్రేమతో సినిమాలు తీసారు. మేమూ అదే చేశాం’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు మంచిమాట అంటూ కమెంట్ చేశారు. ఎవరూ ఉచితంగా ఏమీ చేయరు అక్కా. మీరు నిజంగా సినిమాపై ఉన్న ప్రేమ కోసం దీన్ని రూపొందించినట్లయితే, తొలి వారంలోనే రెట్టింపు వసూళ్ల కోసంలా కాకుండా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించండి. అందరూ చూడగలిగేలా సరసమైన ధరలో ఉండేలా చూడండి అని వ్యాఖ్యానించారు. -
కల్కి సీక్వెల్ ఫిక్స్ చేసిన నాగ్ అశ్విన్.. రిలీజ్ ఎప్పుడంటే..?
-
‘ఏం చేసావ్ నాగ్ ? అసలేంటి ఇదంతా!’ కల్కి నటి భావోద్వేగ పోస్ట్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రధానంగా నాగ్ అశ్విన్ కథ, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్, వీఎఫ్ఎక్స్, ఇలా పలు రకాలుగా మేజిక్ చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సెన్సేషనల్ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించిన ఫరియా అబ్దుల్లా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. అలాగే షూటింగ్ సందర్భంగా తీసుకున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)ఏం చేసావ్ నాగ్ అశ్విన్? అసలేంటి ఇదంతా! ఇప్పుడే కల్కి 2898AD చూసాను. అయినా మళ్ళీ వెంటనే చూడాలని అనిపిస్తోంది అని పేర్కొంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరి అంచనాలను మించిపోతోంది అద్భుతమైన ఫీలింగ్ ఇది అంటూ వైజయంతి మూవీస్ అండ్ టీంకు అభినందనలు తెలిపింది. ఫరియా షేర్ చేసిన ప్రభాస్‌తో సెల్ఫీ , తన పాత్రకు సంబందించిన లుక్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరియన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి అడియన్స్ ఫిదా. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటన పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకా దీపికా పదుకోనె, దిశా పఠాని, స్టార్ హీరో కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
'బాహుబలి'కి కట్టప్ప.. 'కల్కి'లో మాత్రం ఏకంగా రెండు
ప్రభాస్ 'కల్కి' థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోంది. కొన్నిచోట్ల మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓవరాల్‌గా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ అని చాలామంది అంటున్నారు. 3 గంటల నిడివితో 'కల్కి'ని తెరకెక్కించినప్పటికీ కొన్ని ప్రశ్నలని అలానే వదిలేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు ఇందులోను ఓ రెండు సందేహాలు అలానే ఉండిపోయాయి. ఇంతకీ అవేంటి? స్పాయిలర్స్ చెప్పకుండా కాస్త డిస్కస్ చేసుకుందాం.'బాహుబలి' తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ ఉద్ధృతమైంది. ఎంతలా అంటే చాలామంది టాలీవుడ్ దర్శకులు తమ తమ సినిమాల్ని రెండు పార్టులుగా తీస్తున్నామని.. ఆయా చిత్రాల చివర్లో హింట్ ఇచ్చారు. కాకపోతే ఇవేవి కూడా 'బాహుబలి' రేంజులో ఆసక్తిని కలిగించలేకపోయాయి. కానీ 'కల్కి'కి మాత్రం ఇది బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)'కల్కి' చూసిన చాలామంది సినిమా సూపర్ ఉందని అంటున్నారు. కానీ ఇందులో కల్కి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటే చెప్పలేరు. మూవీలో దీపికా పదుకొణె పాత్ర సుమతి గర్భంతో ఉండగా, ఈమె కడుపులో దైవంశ ఉన్నట్లు చూపించారు. దీనిబట్టి చూస్తే ఈమెకు పుట్టే బిడ్డనే 'కల్కి'. కాకపోతే ఈ పాత్రలో ప్రభాస్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే మహాభారతం సీన్లలో భాగంగా 'కల్కి' క్లైమాక్ల్లో కీలక పాత్రలో ప్రభాస్ కనిపించాడు. మరి కల్కిగా కూడా ప్రభాసే కనిపిస్తాడా వేరే ఎవరానా ఉంటారా అనేది పార్ట్ 2 వస్తే గానీ తెలియదు.ఇకపోతే 'కల్కి'లో కమల్ హాసన్ సుప్రీం యాష్కిన్ అనే విలన్‌గా చేశాడు. కాంప్లెక్స్ ప్రపంచంలో ఇతడు మహిళలకు గర్భం తెప్పించి ప్రాజెక్ట్-కె అనే ఓ మిషన్ నిర్వహిస్తుంటాడు. అసలు ఇదంటే ఏంటి? ఎందుకు చేస్తున్నాడనేది కూడా సరిగా ఎష్టాబ్లిష్ చేయకుండానే 'కల్కి' చిత్రాన్ని ముగించారు. బహుశా ఈ రెండింటికి సమాధానాలు.. 'కల్కి' సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చే తర్వాత భాగంలో రివీల్ చేస్తారేమో? 'బాహుబలి'లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక్కటే ప్రశ్న. 'కల్కి'లో మాత్రం రెండు సందేహాలు ఆలోచనలో పడేశాయ్.(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ) -
ప్రభాస్ కల్కి మూవీ.. ఈ పోస్ట్ చూస్తే చాలు.. ఆయన ఎంత కష్టపడ్డాడో!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్, విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం రిలీజైంది. ఉదయం నుంచే ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. మొదటి రోజే కల్కి సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.అయితే కల్కి సినిమాకు తెరెకెక్కించేందుకు దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డారు. ఇప్పటికే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డామని.. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం తాను కష్టపడ్డాడో అది చూస్తేనే అర్థమవుతోంది.తాజాగా తన అరిగిపోయిన చెప్పులను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక సుదీర్ఘమైన రోడ్డు ప్రయాణం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కాగా.. కల్కి చిత్రంలో అగ్రతారలైన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి స్టార్స్ నటించారు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
ప్రభాస్‌ను ఇలా ఎప్పుడు చూడలేదు: కల్కిపై ఆర్జీవీ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కల్కి అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో కల్కి సందడి మొదలైంది. దీంతో ప్రభాస్ సక్సెస్‌ను థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీపై సంచలన డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్‌ను కొనియాడారు. నీ ఆశయం, ఊహలకు నా అభినందనలు. ఇందులో అమితాబ్ బచ్చన్ వందరెట్లు ఎక్కువగా కనిపించారు. ప్రభాస్‌ను ఇంతకు ముందెప్పుడు ఇలాంటి లుక్‌లో చూడలేదు. అదేవిధంగా తొలిసారి నాకు నటించేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇవాళ రిలీజైన కల్కి చిత్రంలో ఆర్జీవీ అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ స్టార్స్ సైతం ఈ సినిమాలో మెరిశారు.Hey @nagashwin7 KUDOS to ur AMBITION and IMAGINATION .. @srbachchan is a 100 times more dynamic than ever and #prabhas is in a never before seen avatar and AHEM 😌also THANKS for giving me my acting DEBUT 😌#Kalki2898— Ram Gopal Varma (@RGVzoomin) June 27, 2024 -
ప్రభాస్ అంటే వేరే లెవెల్.. ఇక మాటల్లేవ్: కృష్ణం రాజు భార్య క్రేజీ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కల్కి అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో కల్కి సందడి మొదలైంది.తొలి రోజే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(కృష్ణంరాజు భార్య) హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో కల్కి మూవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ఫైట్స్ వేరే లెవెల్.. ఇక మాటల్లేవ్ అంటూ థియేటర్ వెలుపల మాట్లాడారు. ప్రభాస్ 1000 రెబల్ స్టార్స్‌తో సమానమని ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బుజ్జి కారుపై కూర్చొని సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కల్కి మూవీపై రాజమౌళి రివ్యూ.. ఆయన ఏమన్నారంటే?
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజైంది. ఉదయాన్నే బెనిఫిట్ షో నుంచే ఫ్యాన్స్ సందడి మొదలైంది. మొదటి షో నుంచే కల్కికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే తొలి రోజే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి తన రివ్యూను ప్రకటించారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..' కల్కి మూవీ ప్రపంచం నిర్మాణాన్ని ఇష్టపడ్డా. అద్భుతమైన సెట్టింగ్‌లతో ఇది నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. డార్లింగ్ తన టైమింగ్, టాలెంట్‌తో చంపేశాడు. అమితాబ్ జీ, కమల్ సర్, దీపిక నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది. అయితే సినిమా చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. తమ ప్లాన్‌ను అమలు చేయడంలో వందశాతం ప్రయత్నం సక్సెస్ సాధించారు. నాగి, అలాగే మొత్తం వైజయంతి టీమ్‌కు అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. Loved the world-building of #Kalki2898AD… It transported me into various realms with its incredible settings.Darling just killed it with his timing and ease… Great support from Amitabh ji, Kamal sir, and Deepika.The last 30 minutes of the film took me to a whole new world.…— rajamouli ss (@ssrajamouli) June 27, 2024 -
Kalki 2898 AD: అశ్వత్థామగా బిగ్‌బీ, అర్జునుడిగా దేవరకొండ.. ఇంకా.. (ఫోటోలు)
-
ప్రమోషన్స్ లేవు.. సూపర్ హిట్ సాంగ్స్ లేవు.. అయినా క్రేజ్ పీక్స్..
-
నాగ్ అశ్విన్ సక్సెస్ స్టోరీ.. ప్రియాంక దత్తో ప్రేమ ఎలా మొదలైంది..?
డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఆయన మాటలు చాలా పొదుపు కానీ, తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు. నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా..? అని ఆశ్చర్యపోతారు. సెట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రతిభను చూసి మెచ్చుకోని వారు అంటూ ఉండరు. ఈ క్రమంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నాగ్ టాలెంట్‌కు ఫిదా అయ్యారు. నేడు ఆయన డైరెక్ట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' విడుదలైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్‌ను నాగ్ అశ్విన్ తీసుకుబోయాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగ్ అశ్విన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.అసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతులకు నాగ్ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్ అశ్విన్ ఆపై మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్లో టాప్ టెన్ ర్యాంక్‌లో ఉన్న నాగ్ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతాడని అనుకుంటే.. మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్‌తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్‌ను సంపాదించుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీ ఎలా..?సినిమాలపై నాగ్ అశ్విన్ చూపుతున్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈ క్రమంలో వారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్దకు నాగ్ అశ్విన్‌ను పంపారు. ఆ సమయంలో 'గోదావరి' సినిమా చిత్రీకరణ జరుగుతుండటంతో తర్వాత ప్రాజెక్ట్‌లో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చుకుంటానని శేఖర్ కమ్ముల మాట ఇచ్చారు. ఈ గ్యాప్‌లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అందుకు రెమ్యునరేషన్‌గా రూ. 4 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి పిలుపు వచ్చింది. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నాగ్ ప్రతిభను శేఖర్ కమ్ముల మెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.డైరెక్టర్‌గా ఛాన్స్ ఎవరిచ్చారు..?శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో 'యాదోం కీ బరాత్' అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత కావడం విశేషం. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో ఆయన జీవితం టర్న్ అయిపోయింది. ఆ షార్ట్‌ఫిల్మ్ వల్ల నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి 'ఎవడే సుబ్రమణ్యం' కథను నాగ్ వినిపించారు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట ఇచ్చారు. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్ అశ్విన్ తొలి సినిమా వెండితెరపై మెరిసింది. తక్కువ బడ్జెట్లో చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని అశ్విన్ తీశాడు. సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా దక్కింది. ఇదే సమయంలో ఆయన పలు యాడ్ చిత్రాలకు కూడా డైరెక్ట్ చేయడం విశేషం.ప్రియాంక దత్తో ప్రేమ, పెళ్లిప్రియాంక దత్.. తన 21వ యేట 2004లో పవన్ కల్యాణ్ 'బాలు' చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్ర రంగంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత 'శక్తి' చిత్రాన్ని కూడా ఆమె నిర్మించారు. త్రీ ఏంజల్స్ స్టుడియో పేరుతో సారొచ్చారు, బాణం, ఓం శాంతి, యాదోంకీ బరత్ వంటి చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. ప్రియాంక కొన్ని యాడ్స్ కూడా నిర్మించారు. ఆ సమయంలో ఆమెకు నాగ్ అశ్విన్ పరిచయం కావడం.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాదోంకీ బరత్ అనే లఘు చిత్రం కోసం పనిచేయడం జరిగింది. అలా 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది.ప్రియాంక దత్‌కు తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రపోజ్ చేశారు. 'మీకు ఎవరైనా నచ్చితే సరే... లేదంటే మనం పెళ్లి చేసుకుందాం' అని నాగ్ అశ్విన్ తన ప్రేమ గురించి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు. అప్పటికే చాలా కాలంగా నాగ్ అశ్విన్‌తో ఆమె ట్రావెల్ చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో వారి పెళ్లి 2015లో జరిగింది. అలా దర్శకుడుగా నాగ్ అశ్విన్ మంచి విజయం సాధించకముందే అతన్ని ఆమె నమ్మారు. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్- ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా స్టేట్ నంది అవార్డు అందుకున్న అశ్విన్.. మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు కల్కి సినిమాతో అంతర్జాతీయ అవార్డును నాగ్ అశ్విన్ తప్పకుండా అందుకోవాలని కోరుకుందాం. -
ప్రభాస్ ‘కల్కి’ మూవీ..ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
‘కల్కి 2898 ఏడీ’ టాక్ ఎలా ఉందంటే..?
ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2898 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి సినిమాటిక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటించడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, రెండు ట్రైలర్లు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల గురువారం తెల్లవారుజాము నుంచే స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కల్కి’ కథేంటి? నాగ్ అశ్విన్ కలల ప్రాజెక్టు ఎలా ఉంది? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.. అవేంటో చదివేయండి. అయితే ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. భైరవగా ప్రభాస్‌ను అద్భుతంగా చూపించడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడంటూ నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా కల్కి కథ చెప్పిన విధానం బాగుందని తెలుపుతున్నారు. అయితే, 20 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ ప్రారంభం అవుతుందని వారు చెబుతున్నారు. ఇందులో యానిమేషన్ విజువల్స్ కూడా భారీగానే మెప్పించాయి. ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చెప్పినట్లుగా బుజ్జి పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. Last 30mins🥵🔥 Mahabharatam🙌 #KALKI #Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan #kalki2898ad #BlockBusterKALKI pic.twitter.com/blithytX2g— Crick...Shyam!! (@ShyamCrick) June 27, 2024 అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు. కమల్ హాసన్ గెటప్ మాత్రం పీక్స్‌లో ఉంటుందని ఆయన పాత్రకు మంచి మార్కులే పడుతాయని అంటున్నారను. ఫైనల్‌గా కల్కితో ప్రభాస్ హాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించబోతున్నట్లు ప్రేక్షకులు చెబుతున్నారు.మరికొందరు మాత్రం కల్కి 2898 ఏడీ సినిమా యావరేజ్‌గా ఉందంటూ తెలుపుతున్నారు. కథ చెప్పడంలో కాస్త నెమ్మది ఉందని తెలుపుతున్నారు. కానీ, ఎక్కువ ప్రాంతాల్లో సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. అక్కడక్కడా కాస్త బోరింగ్ ఫీల్ అవుతారని అంటున్నారు. సినిమా యావరేజ్ అని కూడా కొందరు నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్నీ ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని కూడా వారు చెబుతున్నారు. ఇందులో ఊహించని కెమియో రోల్స్ ఉన్నాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఇండియన్ సినిమా ఉందంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.It's Time For #Kalki2898AD, claimed to be Biggest Indian Film, with 600+ Cr Budget and PAN India Mass Appeal 💡All said an done, I wanted to see what #NagAshwin invisioned & created.I belive, this could be the game changer and taking that feeling in to the theater.Without… pic.twitter.com/a8KvWrJQXU— Ashwani kumar (@BorntobeAshwani) June 27, 2024 #KALKI2898AD gets unanimous positive talk in tamil#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan pic.twitter.com/3U4un4OPrF— Tolly hub (@tolly_hub) June 27, 2024#Kalki2898AD - 3.75 ⭐ /5 ⭐ • #Prabhas 's Performance & Comedy Timings 🔥• Storyline & #NagAshwin 's Direction 🏆• SANA 's Background Scores 💣💥 Literally ge is The Second Hero.• Pre - Interval 🧨• VFX Standard & Visuals .. Literally a Never Seen Stuffs - in… pic.twitter.com/ghh0WFA8Ph— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 26, 2024Epude #Kalki movie premier chusa... Just Superb.... anthe Never before visuals...Prabhas, Amitabh and Kamal Haasan rocked the show.Nag ashwin Rating: 4.5/5 #Kalki28989AD#kalki #Kalki2898ADonJune27 #kalki2898 #Prabhas #DeepikaPadukone #Amitabh #KalkiUK pic.twitter.com/ZI8LgSbrBS— OTTRelease (@ott_release) June 27, 2024 #Kalki2898AD 2nd Half Arachakam 🔥🌋Block Buster Bomma 🔥🔥🤩@nagashwin7 - The Pride Of Indian Cinema #Prabhas Fans Collars Yegareyochu 🤘Waiting For Kalki Cinematic Universe pic.twitter.com/yAyou7Jl2K— 𝘿𝙖𝙧𝙡𝙞𝙣𝙜𝙨...🖤 (@ajayrock1211) June 26, 2024#KALKI2898AD #kalki2898ADreviewGood: Grand scale, good story, Ashwathama, Climax.Bad: BGM, loose screenplay, many unwanted scenes, Prabhas characterization in first half was silly, wasted opportunities to connect emotionally. Overall ok ok.— goutham (@Goutham_se) June 26, 2024Finished watching #Kalki2898AD Kalki Cinematic Universe 🔥🔥🔥Review :- No words 🤐, Especially Last 30mins🔥🔥🔥, Goosebumps guarantee, KCPD Worth Watching. Nagi Mawa - unexpected from you.Prabhas character - Surya puthraa *****#Kalki2898AD #PRABHAS @VyjayanthiFilms pic.twitter.com/i2NoumQPxP— Jagadish (@kvj2208) June 26, 2024Deepika Padukone as Danerys Targeryan for Interval, is the best non heroic goosebumps moment for me@Music_Santhosh BGM is fucking lit 🔥🔥#kalki2898ad #Prabhas pic.twitter.com/yTPffkrLO6— sampathkumar (@Imsampathkumar) June 26, 2024Indian film directors need super mega stars like #prabhas to pull off visual grandeurs like #kalki2898ad Film may have few flaws but what @nagashwin7 envisioned is second to none and is filled with huge brilliance.DO NOT MISS this movie! Visual extravaganza!@HailPrabhas007— Nikhil (Srikrishna) Challa (@Srikrishna6488) June 26, 2024Finished watching #kalki2898ad @nagashwin7 took his time and research to get this epic on screen Visuals are Out the world ,Screen play was on point ,Comedy personally did not work for me at some point Mahabharatham shots are crisp 🤌🏻Last 20 mins 🔥🔥🔥🔥 Casting is 👍 pic.twitter.com/h7QnfR7cYJ— TIG🐯R (@GopiSai251) June 26, 2024#Kalki2898AD A breath of fresh air to Indian cinema. Theme : Dystopian future entangled in mythology. Rating : ⭐️⭐️⭐️Long read🧵— 🪬Absurdism 🪢 (@absurdtips) June 26, 2024World’s first premier show completed in Finland @PrabhasRaju Mind blowing visualsVery good first half 👌👌Awestruck second half 🔥🔥🔥 Fight between @SrBachchan and @PrabhasRaju is next level. Repeat watches for sure Thanks @nagashwin7 #Kalki2898AD #kalki2898 #Prabhas pic.twitter.com/VrL9PNqb49— Jyothi Swaroop (@subbuswaroop) June 26, 2024Em Tesav Bhayya Next Part Kosam Em Hype Ekkinchinav Pakka Indian Star Wars Type Film This Is Repeating Like Baahubali 1 and The Next One Will Be Like Baahubali 2 Kalki Cinematic Universe #kalki2898 #Kalki2898AD #KALKI2898ADBookings #ProjectK#Prabhas#RebelStarOochaKotha— RTC X ROADS DEVARA 🌊⚓ (@MGRajKumar9999) June 26, 2024#Kalki2898ADFirst 30 Min#Kalki Review #KALKI2898ADO >>> #Salaar 💥🔥Nagashwin 💥Super hero entry #Prabhas performance 💥💥💥 comedy timing 🔥Songs 👍💥Bgm 🔥🔥🥁overall ga movie lover ki biggest festival 🤙My rating : 4.5 / 5 #Kalki#KALKI2898ADO #Kalki28989AD pic.twitter.com/lXu69nullD— Daemon (@sammyTFI) June 27, 2024 -
ఆ విషయాన్ని లీక్ చేసిన నాగ్ అశ్విన్.. ఆ హీరోలు కూడా ఉన్నారు!
రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. మరికొద్ది గంటల్లో థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ కూడా పూర్తి కావడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు.అయితే రిలీజ్ ముందు రోజు డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో కనిపిస్తారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టా వేదికగా ప్రభాస్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే అతిథి పాత్రల్లో నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటించారనే టాక్ వినిపించింది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరి, వీళ్లు నటించారా? లేదా? అన్నది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. "Dulquer Salmaan & Vijay Deverakonda are in the Film" - @nagashwin7 🔥#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DulquerSalmaan #VijayDeverakonda pic.twitter.com/HbGDVGO3kv— Ayyo (@AyyoEdits) June 26, 2024 -
'కల్కి' మూవీలో ఏ పాత్ర ఎవరు చేశారు? స్పెషల్ ఏంటంటే?
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'కల్కి'. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఆన్లైన్ పెట్టిన టికెట్స్ పెట్టినట్లు అయిపోతున్నాయి. మరోవైపు ట్రైలర్ చూపించినోళ్లే కాకుండా మూవీలో ఇంకా స్టార్ నటీనటులు చాలామంది యాక్ట్ చేశారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మూవీలో ఎవరెవరు నటించారు? వాళ్ల పాత్రలేంటి తెలుసుకుంటే సినిమా అర్థం చేసుకోవడం మీకు కాస్త సులభమైపోతుంది!ప్రభాస్ది భైరవ అనే పాత్ర. కాంప్లెక్స్ అనే ప్రాంతానికి వెళ్లడం కోసం ఎలాంటి పనైనా చేసే ఓ తుంటరి కుర్రాడి పాత్ర.అశ్వధ్థామగా అమితాబ్ బచ్చన్ నటించారు. మహాభారతంలో కౌరవులు, పాండవులకు గురువైన ద్రోణాచార్యుడి కొడుకే ఈ అశ్వధ్ధాముడు. యుద్ధంలో తన తండ్రిని చంపిన పాండవుల వంశాన్ని అంతం చేయాలనుకుంటాడు. కానీ కృష్ణుడి శాపానికి గురై ఒంటి నిండా గాయలతో విశ్వం అంతం వరకు ఉండే పాత్ర.సుప్రీం యాష్కిన్‌గా కమల్ హాసన్ నటించాడు. అయితే కమల్‌ది కలి పాత్రలా అనిపిస్తోంది. అధర్మం ఎక్కడ జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడే కలి.దీపికా పదుకొణె 'సమ్-80' అనే రోల్ చేసింది. పురాణాల్లో 'కల్కి' తల్లి పేరు సుమతి. దీనికి ఈ సినిమాలో దీపిక పాత్రకు దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి.ప్రభాస్ కారు బుజ్జికి కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈమె కనిపించదు గానీ గొంతు మాత్రం సినిమా అంతా వినిపిస్తుంది.ఉత్తర పాత్రలో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈమెపైనే అశ్వథ్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే.. కృష్ణుడు ఇతడిని శపిస్తాడు.దిశా పటానీ రోక్సీ అనే అమ్మాయిగా నటించింది. బహుశా ప్రభాస్‌కి జోడీగా ఈమె కనిపిస్తుంది. సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఓ డ్యూయెట్ కూడా ఉంది.ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్స్, ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే వీళ్లు సినిమాలో అధికారికంగా ఉన్నట్లు చూపించారు. కానీ చాలామంది స్టార్స్ 'కల్కి' అతిథి పాత్రలు చేశారని టాక్.మహాభారతం ఎపిసోడ్లో కృష్ణుడు కచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు. కాకపోతే దీన్ని ఏఐ టెక్నాలజీ రూపొందించారట.అర్జునుడిగా విజయ్ దేవరకొండ, అభిమన్యుడిగా నాని.. అలానే భైరవ తల్లిదండ్రులుగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ కనిపిస్తారని టాక్.వీళ్లే కాకుండా ప్రముఖ దర్శకులు ఆర్జీవీ, రాజమౌళి కూడా అతిథి పాత్రలు చేశారని తెలుస్తోంది. మరి అవేంటి తెలియాల్సి ఉంది.ఒకప్పుడు 'మహాభారతం' ఆధారంగా తెలుగులో సినిమాలు వచ్చాయి. కానీ రీసెంట్ టైంలో మాత్రం రాలేదని చెప్పుచ్చు. మరి నాగ్ అశ్విన్.. మహాభారతాన్ని ఎంత కన్విన్సింగ్‌గా చూపించాడనేది మరికొన్ని గంటల్లే తేలిపోతుంది. -
ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ 'కల్కి' రిలీజ్‌కి రెడీ. మరికొన్ని గంటల్లో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఎందుకంటే మూవీపై అంచనాలు మామూలుగా లేవు. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తొలిరోజు వసూళ్లలో రికార్డులు బద్దలవ్వొచ్చని మాట్లాడుకుంటున్నారు. అయితే మీకు 'కల్కి' గురించి విశేషాలు ఎన్ని తెలుసు? ఇంతకీ 'కల్కి' ఎప్పుడు మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం.ప్రభాస్ 'కల్కి' విశేషాలుడార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'కల్కి'.జూన్ 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు.ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లలో 'కల్కి' రిలీజ్ అవుతోంది.తెలుగులో 1600కి పైగా.. మిగతా భాషలన్నీ కలిపి 4000కి పైగా స్క్రీన్లలో రిలీజ్ఓవర్సీస్లో 4500కి పైగా స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.మన దగ్గరతో పాటు ఓవర్సీస్లోనూ కనివినీ ఎరుగని రీతిలో టికెట్స్ బుక్.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు, అదనపు షోలు భారీ ఎత్తున అనుమతి.'కల్కి'లో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక, దిశా పటానీ, శోభన లాంటి స్టార్స్ నటించారు.విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ కూడా ఉన్నారని టాక్.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.ఫిబ్రవరి 2020న 'ప్రాజెక్ట్ కె' పేరుతో ఈ సినిమాని అనౌన్స్ చేశారు.అదే ఏడాది కరోనా రావడంతో దాదాపు ఏడాది వాయిదా పడింది.2021 జూలై నుంచి మార్చి 2024 వరకు షూటింగ్ జరిగింది.ఈ ఏడాది మే 9నే రిలీజ్ చేస్తామని ప్రకటన. కానీ ఎన్నికల కారణంగా జూన్ 27కి వాయిదా.క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 2898 AD వరకు విస్తరించే కథనే 'కల్కి'మహాభారతం సంఘటనలతో పాటు వర్తమాన, భవిష్యత్‌ని ఇందులో చూపించబోతున్నారు.ఇకపోతే 'కల్కి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.370 కోట్ల వరకు జరిగిందని సమాచారం.తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.168 కోట్లు కాగా.. కర్ణాటక 25, తమిళనాడు 16, కేరళ 6, హిందీ ప్లస్ నార్త్ కలిపి రూ.85 కోట్లు!ప్రభాస్ గత సినిమా 'సలార్' తొలిరోజు కలెక్షన్స్ రూ.178 కోట్లు.దీన్ని సులభంగా 'కల్కి' అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు జోస్యం. -
'కల్కి' ముందు పెద్ద సవాలు.. నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో?
ప్రభాస్ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే కోట్లాది టికెట్స్ అమ్ముడుపోయాయి. మరిన్ని చోట్ల బుకింగ్స్ ఇంకా నడుస్తున్నాయి. మొన్నటివరకు సరిగా ప్రమోషన్ జరగలేదని బాధపడిన ఫ్యాన్స్.. ఇప్పుడొస్తున్న బజ్ చూసి తెగ సంతోషపడిపోతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ 'కల్కి' ఓ పెద్ద సవాలు ఉంది. దీన్ని దాడటం పెద్ద కష్టమేమి కాదు గానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చేస్తాడోనని అందరూ వెయిటింగ్.(ఇదీ చదవండి: 'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్‌ఫుల్!)ఇలా థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే అర్థమైపోవడానికి, ఎంజాయ్ చేయడానికి 'కల్కి'.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో లేదంటే లవ్ స్టోరీనో కాదు. సైన్స్ ఫిక్షన్ ప్లస్ మైథాలజీ కాంబోలో తీసిన క్రేజీ సినిమా. భూత, భవిష్యత్, వర్తమాన అంశాల్ని స్టోరీలో మిలితం చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వర్తమాన, భవిష్యత్ ఉండే సీన్లనీ అర్థం చేసుకోవడం ఎవరికీ పెద్దం కష్టమేం కాకపోవచ్చు.'కల్కి'లో మహాభారతం ఆధారంగా తీసిన సీన్లు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అలా కల్కి, కలి, అశ్వథ్ధామ పాత్రల రిఫరెన్సులు కూడా ఉన్నాయి. ఒకప్పటి జనరేషన్‌కి పర్వాలేదు గానీ ప్రస్తుత టీనేజీలో ఉన్న యూత్ వీటన్నింటిని అర్థం చేసుకోవాలంటే పూర్తిగా కాకపోయినా కాస్తయిన అవగాహన ఉండాలి. ఎందుకంటే సినిమాలో ఇన్ డీటైల్డ్‌గా అయితే చెప్పలేరు కదా! మరి ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం చేశాడనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.(ఇదీ చదవండి: Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?) -
Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి సరికొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా, అమితాబ్,కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు నాగ్ అశ్విన్ ఏం చెప్పబోతున్నాడనేదానిపై కాస్త క్లారిటీ వచ్చింది. కథ మొత్తం ‘కల్కి’ పాత్ర చుట్టే తిరుగుతుంది.మన పురణాల ప్రకారం మహావిష్ణువు పదో అవతారమే ‘కల్కి’. కలియుగం చివరి పాదంలో భగవంతుడు ‘కల్కి’రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని పురణాలు చెబుతున్నాయి. ఈ పాయింట్‌నే నాగ్ అశ్విన్ తీసుకొని దానికి సాంకేతిక జోడించి, సినిమాటిక్‌గా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో కాశీ, కాంప్లెక్స్, శంబలా అనే మూడు ప్రపంచాలు ఉంటాయి. ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే ఈ సినిమా.కల్కి అవతరించడానికి ముందు అంటే 2898 ఏడీలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్ర కథాంశం. అయితే ఇందులో ‘కల్కి’ ఎవరు? ‘కలి’ ఎవరనేది ఇప్పటివరకు చెప్పలేదు. హీరో ప్రభాస్ పోషించిన పాత్ర పేరు ‘భైరవ’. అశ్శత్థామగా అమితాబ్ నటించాడు. కమల్ పోషించిన పాత్ర పేరు ‘సుప్రీం యాస్కిన్’ అని వెల్లడించారు. ఇక గర్భిణీ ‘సమ్-80’ గా దీపికా పదుకొణె నటించింది. కల్కి పుట్టబోయేది ఆమె కడుపునే అన్నది ప్రచార చిత్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అమెను కాపాడడం కోసం అశ్వత్థామ పొరాటం చేస్తున్నాడు. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర అశ్వత్థామ. కృష్ణుడి శాపంతో శారీరక రోగాలతో బాధపడుతున్న ఆయన.. ‘కల్కి’ అవతార ఆవిర్భావానికి ఎందుకు సాయం చేస్తున్నాడని మరో ఆసక్తికరమైన పాయింట్. సుప్రీం యాస్కిన్ పాత్రే కలిగా మారుతుందా? అంటే ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అవుననే అంటారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో కమల్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర ‘ఎన్ని యుగాలైనా మనిషి మారడు.. మారలేడు’ అనే డైలాగ్ చెబుతాడు. పురాణాల ప్రకారం కలి అనేవాడు మానవుడిలో ఉన్న అరిషడ్వర్గాలను ఆసరగా చేసుకొని ఆడుకుంటాడు. కమల్ చెప్పిన డైలాగ్‌ను బట్టి చేస్తే ఆయనే కలి అని అర్థమవుతుంది. భైరవగా నటించిన ప్రభాస్‌నే కల్కిగా చూపించబోతున్నారా? లేదా పుట్టబోయే ‘కల్కి’ని రక్షించే వ్యక్తిగా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రను ప్రభాస్ పాత్ర చేతిలోనూ చూపించారు. అంటే ‘కల్కి’ని రక్షించే బాధ్యత భైవర తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా మన ఊహ మాత్రమే. డైరెక్టర్ నాగి అల్లుకున్న కథలో కలి ఎవరు? కల్కి ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు(జూన్ 27 రిలీజ్)ఆగాల్సిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'కల్కి' తప్ప మరో మాట వినిపించడం లేదు. సినిమా గురించి లేదా టికెట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో పెట్టిన షోలు పెట్టినట్లు ఫుల్ అయిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ మిడ్ నైట్ బెన్ఫిట్ ఎందుకు వేయట్లేదా అని చాలామంది అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'కల్కి' థీమ్ సాంగ్ రిలీజ్.. మొత్తం స్టోరీ ఒకే పాటలో!)అయితే ఈ విషయంలో మూవీ టీమ్ చాలా ముందుచూపుతో ఆలోచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అర్థరాత్రి అంటే కొందరైనా సరే మద్యం సేవించి వచ్చిన వాళ్లు ఉంటారు. వీళ్ల వల్ల గొడవలయ్యే అవకాశముంటుంది. మరోవైపు రాత్రి అంటే నిద్రలేకుండా సినిమా చూడాల్సి వస్తుంది. దీంతో అద్భుతమైన సీన్స్ కూడా సరిగా అర్థం కాకపోవచ్చు.అదే ఉదయం అయితే ఫ్రెష్ మైండ్‌తో థియేటర్‌కి వస్తారు. అలానే నైట్ షోలతో పోలిస్తే ఉదయం అయితే టాక్ జెన్యూన్ రావొచ్చు. బహుశా ఈ కారణాల వల్లనో ఏమో 'కల్కి' టీమ్ మిడ్నైట్ బెన్ఫిట్ షోలకు నో చెప్పేసి ఉంటారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఏంటనేది మరో 36 గంటల్లో తెలిసిపోతుందిలే!(ఇదీ చదవండి: స్టార్ హీరో విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?) -
'కల్కి' టికెట్ల ధరలు భారీగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ,శోభన ప్రముఖ పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.కల్కి టికెట్ల విక్రయాలు ఆన్లైన్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాలపాటు ఈ వెసులుబాటును ఏపీ కల్పించింది. కల్కి సినిమా కోసం టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత అశ్వినీదత్ కోరడంతో ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో టికెట్‌పై సింగిల్ స్క్రీన్ సాధారణ థియేటర్లో అయితే రూ.75, మల్టీప్లెక్స్‌లలో అయితే రూ.125 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గత ఐదేళ్లలో ఏ సినిమాకు ఇంతలా టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది లేదు. అయితే కల్కి నిర్మాత అశ్వనీదత్ అధికార టీడీపీకి దగ్గరి వ్యక్తి కావడంతోనే ఈ వెసులుబాటు ఇచ్చారేమో అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. కల్కి సినిమాకు చేసిన తాజా పెంపుతో.. ఏపీలో రెండు వారాల పాటు టికెట్ల ధరలు గతం కంటే ఎక్కువే ఉండబోతున్నాయి. -
కల్కి 2898 ఏడీ.. కారులో కూర్చొని సినిమా చూసేయొచ్చు!
ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసిన ఆ పేరే వినిపిస్తోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆ సినిమా కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అదే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే కల్కి సినిమాకు సంబంధించి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మూవీ టికెట్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ముంబయిలో కల్కి సినిమా టికెట్ ధరలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ముంబయిలోని మల్టీప్లెక్స్‌లో కల్కి టికెట్ ధర ఏకంగా రూ.2000 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబయి నగరంలోని మైసన్ పీవీఆర్: జియో వరల్డ్ డ్రైవ్-ఇన్ మల్టీప్లెక్స్‌లో ఈ ధరను నిర్ణయించారు. అయితే ప్రత్యేక డ్రైవ్-ఇన్ థియేటర్లో ప్రేక్షకులు తమ సొంత స్నాక్స్‌తో పాటు తమ కారులోనే కూర్చొని సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. ముంబయిలో రెండో అత్యంత ఖరీదైన టిక్కెట్ ఐనాక్స్: ఇన్సిగ్నియాలో వర్లీస్ అట్రియా మాల్లో రాత్రి 9:30 గంటలకు షో టిక్కెట్ ధర రూ.1,760 గా నిర్ణయించారు. దీంతో కల్కి టికెట్ ధరలు చూసిన అభిమానులు ఇది ప్రభాస్ రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇంత ధర వెచ్చించి సినిమా చూడాలా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. కల్కి మూవీ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
హైదరాబాద్ జోన్లో 'కల్కి' అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలు రాలేదు. సంక్రాంతి తర్వాత అలాంటి జోష్ మళ్లీ కల్కితో మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ల అమ్మకాలు కూడా ప్రారంభం అయ్యాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నాగ్ అశ్విన్ తెరెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ విడుదల చేస్తోంది.హైదరాబాద్‌లో సింగిల్ థియేటర్ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ప్రతిచోట కల్కి చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. హైదరబాద్ జోన్ పరిధిలో 1వ రోజు అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు రూ. 6 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మొత్తం రిలీజ్ సమాయానికి పెరగవచ్చని కూడా సమాచారం. జూన్ 27న హైదరాబాద్‌లో తెల్లవారుజామున 4:30 గంటలకే మొదటి షో పడుతుంది. కల్కి టికెట్ల ధరలను వారం రోజుల పాటు పెంచుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చని తెలపడంతో మొదటిరోజు ఓపెనింగ్స్ భారీగానే జరిగినట్లు సమాచారం. -
శ్రీకృష్ణుని జన్మస్థలంలో 'కల్కి' ఈవెంట్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్, సుప్రీమ్ యాక్సిన్గా కమల్ కనిపిస్తారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న రిలీజ్ కానుంది.కల్కి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ భారీగా పెంచారు. రెండు ట్రైలర్స్ రిలీజ్ చేయడం వల్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.అయితే తాజాగా కల్కి థీమ్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగరంలో నేడు ఈ థీమ్ సాంగ్‌ను విడుదల చేస్తామని తెలిపారు. Unveiling the #ThemeOfKalki at Lord Krishna’s birthplace, Mathura in Uttar Pradesh.Song will be out Tomorrow.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/5p2SZb9hbN— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 23, 2024