'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది! | Actor Suman Comments On Prabhas Kalki 2898 AD | Sakshi
Sakshi News home page

Suman Kalki 2898 AD: ఫస్టాప్ ల్యాగ్.. ఆ రెండు నిజంగా వేస్ట్

Published Mon, Jul 15 2024 8:19 AM | Last Updated on Mon, Jul 15 2024 9:15 AM

Actor Suman Comments On Prabhas Kalki 2898 AD

థియేటర్లలోకి వచ్చి రెండు వారాలైనా సరే ప్రభాస్ 'కల్కి'.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతూనే ఉంది. ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ సినిమా ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మరీ అంతగా నచ్చలేదనే వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడా లిస్టులోకి తెలుగు సీనియర్ హీరో కమ్ నటుడు సుమన్ చేరాడు. సినిమాలో బాగున్న వాటి గురించి మెచ్చుకుంటూనే, కొన్ని అస్సలు బాగోలేవని విమర్శించాడు.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)

'కల్కి సినిమా చాలా నెమ్మదిగా అనిపించింది. ఓ అరగంట వరకు తీసేయొచ్చు. మరీ ముఖ్యంగా బాంబే హీరోయిన్ (దిశా పటానీ) సాంగ్, ఫైట్ తీసేయొచ్చు. అసలు అది కథకి సంబంధం లేదు. సెకండాఫ్ బాగుంది. డైరెక్టర్ విజన్‌కి సెల్యూట్. మూవీలో అమితాబ్ రోల్ చాలా డామినేట్‌గా ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే అతడిని ఓ టార్జాన్‌లా చూపించాలి. కానీ ఏదో ప్లేట్ పెట్టి, బాడీకి షీల్డ్ పెట్టి కవర్ చేసేశారు. ప్రభాస్‌కి మంచి ఫిజిక్ ఉంది. ఏదైనా సీన్‌లో దాన్ని చూపిస్తారేమో అనుకున్నా. సాంగ్స్ అయితే అస్సలు బాగోలేవు. మూవీని ఓ డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తేనే నచ్చుతుంది' అని సుమన్ చెప్పుకొచ్చారు.

ఇకపోతే 'కల్కి'లో చాలామంది అతిథి పాత్రలు చేశారు కదా ఒకవేళ మీకు అవకాశమొచ్చుంటే చేసేవారా అని సుమన్‌ని అడగ్గా.. 'కల్కి మూవీలో నేను చేసే క్యారెక్టర్ ఏం లేదు. చాలామంది అతిథి పాత్రల్లో అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. మనం ఓ పాత్ర చేస్తే అది గుర్తుండిపోవాలి. మూవీలో ఇంతమంది స్టార్స్ ఉన్నప్పుడు అంచనాలు ఉంటాయి. అది లేకపోతే ఫ్యాన్స్ నిరాశ పడతారు. చాలామంది చేసే తప్పు ఇదే. ఇలా స్టార్ సెలబ్రిటీలు ఎక్కువమందిని పెట్టేసి జనాల్ని థియేటర్లకి రప్పించాలనుకుంటారు' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

(ఇదీ చదవండి: మీరు లేకపోతే నేను లేను.. 'కల్కి' సక్సెస్ పై ప్రభాస్ స్వీట్‌ వీడియో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement