Suman
-
అప్పుడే మంచి సినిమాలు వస్తాయి: సుమన్
చిత్ర పరిశ్రమలో కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలి. నూతన దర్శకులను, చిన్న చిత్రాలను ప్రొత్సహిస్తేనే మంచి సినిమాలు వస్తాయి’ అన్నారు సీనియర్ హీరో సుమన్. శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రాజా మార్కండేయ". "వేట మొదలైంది" అనేది ఉప శీర్షిక.చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరో తేజస్ వీరమాచినేని, హీరోయిన్స్ రోమి, దేవిక, ప్రత్యూష, దర్శకుడు బన్నీ ఆశ్వంత్, నిర్మాతలు సామా శ్రీధర్, పంజల వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్రంలోని ఒక్కో పాటను విచ్చేసిన అతిధులు ఆవిష్కరించగా.. టీజర్ ను రాపోలు భాస్కర్ విడుదల చేశారు. సినిమా ట్రైలర్ ను హీరో సుమన్ రిలీజ్ చేశారు.అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. "రాజా మార్కండేయ" సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసినట్టు ఉంది. అందరూ కొత్తవాళ్ళైనా సినిమాలో మంచి కథ ఉందని అర్థం అవుతుంది. ఇలాంటి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. చిత్రంలో శివయ్య పాట చాలా అద్భుతంగా ఉంది. రాబోయే శివరాత్రి పండుగకు ప్రతి దేవాలయంలో ఈ పాట మార్మోగుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత దర్శకులకు మంచి లాభాలు రావాలి" అన్నారు.సంగీత దర్శకులు యస్ కె. మీరావలి, రాయారావు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. "బన్నీ ఆధ్వర్యంలో ఫోర్ ఫౌండర్స్ టీం మమ్ములను తీసుకొచ్చి ఈ చిత్రానికి మ్యూజిక్ చేయించారు. వారివల్లే మేము ఇండస్ట్రీకి రాగలిగాము. ఆడియోతోపాటు సినిమాని కూడా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాము అన్నారు.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. "చిత్ర దర్శకుడు బన్నీ మా సభ్యుడే. చాలా టాలెంట్ వున్న వ్యక్తి. నిర్మాతలు మా జిల్లాకు చెందినవారు. అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సాంగ్స్ ట్రైలర్ అధ్బుతంగా వున్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది" అన్నారు.దర్శకుడు బన్నీ ఆశ్వంత్ మాట్లాడుతూ.. "ఇరవై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమా తీయాలని నా కల. నాకు సహకరించి ప్రోత్సహించిన మా నిర్మాతలకు, స్నేహితులకి ధన్యవాదాలు. ఈనాటి కలియుగంలో శివుడి భక్తుడైన మార్కండేయ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటిని శివుడి అనుగ్రహంతో ఎలా అధిగమించాడు? అనేది కాన్సెప్ట్. మీరావలి మంచి సంగీతాన్ని అందించారు. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కోపరేట్ చేసి వర్క్ చేశారు.. లైఫ్ లాంగ్ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం. మా సినిమా ప్రేక్షలందరికి నచ్చుతుంది" అన్నారు. ‘సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్ కి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది’ అని నిర్మాత సామా శ్రీధర్ అన్నారు. -
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు: టాలీవుడ్ నటుడు సుమన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై టాలీవుడ్ నటుడు సుమన్ స్పందించారు. పాన్ ఇండియా హీరో అయిన బన్నీకి అంత క్రేజ్ ఉన్నప్పుడు భద్రత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉందన్నారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం చాలా తప్పు అని సుమన్ అన్నారు. కొత్త సినిమా రిలీజైనప్పుడు థియేటర్ యాజమాన్యం హీరోలను పిలుస్తారని వెల్లడించారు. అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ప్రైవేట్ బౌన్సర్లతో కంట్రోల్ చేయాలని సూచించారు.సుమన్ మాట్లాడుతూ..' అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా తప్పు. కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్ వాళ్లే హీరోను పిలుస్తారు. నన్ను కూడా గతంలో చాలాసార్లు థియేటర్ వాళ్లు పిలిచారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లడం తప్పుకాదు. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పోలీసులు, థియేటర్ యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోవాలి. అభిమానుల రద్దీని, ఆ క్రౌడ్‌ని థియేటర్ వాళ్లు మేనేజ్ చేయాల్సింది. ' అని అన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన సుమన్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. -
అల్లు అర్జున్ అరెస్ట్ పై నటుడు సుమన్ రియాక్షన్
-
‘సీఎం పెళ్లాం’.. మంచి సందేశం ఇచ్చే చిత్రం
జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం వెంకట రమణారెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటించాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో సీఎం భార్యగా నటించాను. సందేశాన్నిచ్చే చిత్రం ఇది’’ అని తెలిపారు ఇంద్రజ. (చదవండి: వాడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా లేదు.. ఫైర్ అయిన యష్మి)‘సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది’ అని అన్నారు నటుడు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సందేశాత్మక చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. ఓ సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపించే ప్రయత్నం చేశాం’’ అని వెల్లడించారు గడ్డం వెంకట రమణారెడ్డి. ‘‘ఈ చిత్రంలో మహిళా సాధికారకత అంశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ. -
Bangladesh: నిరసనల మధ్య.. జెండాల విక్రేత కథ వైరల్
సాధారణంగా ఎక్కడైనా నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు దానిలో పాల్గొన్నవారు జెండాలను, ప్లకార్డులను పట్టుకోవడాన్ని మనం చూస్తుంటాం. వీటిని ప్రదర్శించడం ద్వారా వారు తమ వాదనను బలంగా వినిపిస్తుంటారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విద్యార్థులు స్థానిక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రతిరోజూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వీరికి జెండాలను, హెడ్ బ్యాండ్లను విక్రయిస్తూ ఓ వ్యాపారి అత్యధికంగా సంపాదిస్తున్నాడు.ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య రాజధాని ఢాకాలో జాతీయ జెండాలు, హెడ్బ్యాండ్లకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. దీనిని గుర్తించిన సుమన్(35) అనే వ్యాపారి నిరసనకారులకు అవసరమైన జెండాలను, హెడ్ బ్యాండ్లను విక్రయిస్తున్నాడు. 1989లో ఢాకాలో జన్మించిన సుమన్, బంగ్లాదేశ్ జెండాలతో పాటు మూడు వేర్వేరు సైజుల హెడ్బ్యాండ్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తాను రూపొందిస్తున్న బంగ్లాదేశ్ జాతీయ జెండాలకు, గ్రీన్ హెడ్బ్యాండ్లు విద్యార్థులు విరివిగా కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు.సుమన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఢాకాలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాను. నా పేరు విన్నవాళ్లంతా నా తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందిన వారని అనుకుంటారు. అయితే అది నిజం కాదు. మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు, మా ఇంటిపక్కన ఉండే ఓ హిందూ మహిళ నాకు సుమన్ అనే పేరు పెట్టింది. భారతీయ సంతతికి చెందిన నా తండ్రి 1971లో కలకత్తా నుండి ఢాకాకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. నేను పెరిగి పెద్దయ్యాక జాతీయ జెండాలు రూపొందిస్తూ, వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాను. ఇటీవలి కాలంలో తాను 1,500 జెండాలు, 500 హెడ్బ్యాండ్లను విక్రయించానని’ తెలిపారు. సుమన్ తన జీవనోపాధి కోసం 2018 నుండి జెండాలు విక్రయిస్తున్నాడు. ఢాకాలో క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో కూడా సుమన్ జాతీయ జెండాలను విక్రయిస్తుంటాడు. STORY | Meet Mohd Suman: Flag-seller who saw #Dhaka protests up, close and personalREAD: https://t.co/X303wK81Nj(PTI Photo) pic.twitter.com/Ux18GikLbg— Press Trust of India (@PTI_News) August 27, 2024 -
రాజా మార్కండేయ.. కోట్లు కొల్లగొట్టాలి: సుమన్
'బన్నీ అశ్వంత్'ను దర్శకుడు గా పరిచయం చేస్తూ... శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా - వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తేజస్ వీరమాచినేని - అక్షయ రోమి జంటగా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ లోగోని తాజాగా ప్రముఖ నటుడు సుమన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి "రాజా మార్కండేయ" అనే పవర్ఫుల్ టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్. ‘వేట మొదలైంది’ అన్నది ట్యాగ్ లైన్. లోగో రిలీజ్ అనంతరం సుమన్ మాట్లాడుతూ.. కంటెంట్ బాగుంటే... చిన్న చిత్రాలు కూడా కోట్లు కొల్లగొడుతున్నాయని, "రాజా మార్కండేయ" ఆ చిత్రాల కోవలో చేరాలని ఆకాంక్షించారు. సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని పేర్కొన్న దర్శకనిర్మాతలు.. ఈ చిత్ర రూపకల్పనలో సహాయసహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కిస్తున్న "రాజా మార్కండేయ" సంచలన విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని అతిధులు అభిలషించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైశ్య ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు కాపాడే వైద్యులకు మనమే రక్షణగా ఉండాలి: సుమన్
పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ ఘటన యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. న్యాయం కావాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు అందరూ రోడ్డెక్కారు. వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు తమ నిరసనగా భారత వైద్య సంఘం(ఐఎంఏ) పిలుపునిచ్చింది. ఈ ఘటనను ఖండిస్తూ ఇప్పటికే ఎందరో ప్రముఖులు స్పందించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వచ్చిన సినీ హీరో సుమన్ అక్కడ వైద్యుల నిరసనను చూసి స్పందించారు.'మన సమాజంలో వైద్యులు చాలా పవిత్రమైన వృత్తిలో కొనసాగుతున్నారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులు, పోలీసులు తర్వాత ఆ స్థానంలో వైద్యులు ఉన్నారు. కరోనా సమయంలో బంధువులు కూడా మన దగ్గరకు రాలేదు. అలాంటిది వైద్యులు మనకు రక్షణగా నిలిచి కాపాడారు. కులం, మతం అని చూడకుండా డాక్టర్లు సేవ చేస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే సేవ చేసేందుకు ముందుకు వస్తారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను వారు కాపాడారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎందరో డాక్టర్లు, నర్సులు ముందుడి సేవ చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. అలాంటి వారిని మనమే కాపాడుకోవాలి. వారికి కొంత మంది మాత్రమే సపోర్టు చేయడం బాధాకరం. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణగా ఉండాలి. మహిళలు కూడా సొంతంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. ఆపద సమయంలో వారికి తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడుతుంది.' అని సుమన్ తెలిపారు. -
'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్‌ని అలా చూపించాల్సింది!
థియేటర్లలోకి వచ్చి రెండు వారాలైనా సరే ప్రభాస్ 'కల్కి'.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతూనే ఉంది. ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ సినిమా ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మరీ అంతగా నచ్చలేదనే వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడా లిస్టులోకి తెలుగు సీనియర్ హీరో కమ్ నటుడు సుమన్ చేరాడు. సినిమాలో బాగున్న వాటి గురించి మెచ్చుకుంటూనే, కొన్ని అస్సలు బాగోలేవని విమర్శించాడు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)'కల్కి సినిమా చాలా నెమ్మదిగా అనిపించింది. ఓ అరగంట వరకు తీసేయొచ్చు. మరీ ముఖ్యంగా బాంబే హీరోయిన్ (దిశా పటానీ) సాంగ్, ఫైట్ తీసేయొచ్చు. అసలు అది కథకి సంబంధం లేదు. సెకండాఫ్ బాగుంది. డైరెక్టర్ విజన్‌కి సెల్యూట్. మూవీలో అమితాబ్ రోల్ చాలా డామినేట్‌గా ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే అతడిని ఓ టార్జాన్‌లా చూపించాలి. కానీ ఏదో ప్లేట్ పెట్టి, బాడీకి షీల్డ్ పెట్టి కవర్ చేసేశారు. ప్రభాస్‌కి మంచి ఫిజిక్ ఉంది. ఏదైనా సీన్లో దాన్ని చూపిస్తారేమో అనుకున్నా. సాంగ్స్ అయితే అస్సలు బాగోలేవు. మూవీని ఓ డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుంది' అని సుమన్ చెప్పుకొచ్చారు.ఇకపోతే 'కల్కి'లో చాలామంది అతిథి పాత్రలు చేశారు కదా ఒకవేళ మీకు అవకాశమొచ్చుంటే చేసేవారా అని సుమన్‌ని అడగ్గా.. 'కల్కి మూవీలో నేను చేసే క్యారెక్టర్ ఏం లేదు. చాలామంది అతిథి పాత్రల్లో అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. మనం ఓ పాత్ర చేస్తే అది గుర్తుండిపోవాలి. మూవీలో ఇంతమంది స్టార్స్ ఉన్నప్పుడు అంచనాలు ఉంటాయి. అది లేకపోతే ఫ్యాన్స్ నిరాశ పడతారు. చాలామంది చేసే తప్పు ఇదే. ఇలా స్టార్ సెలబ్రిటీలు ఎక్కువమందిని పెట్టేసి జనాల్ని థియేటర్లకి రప్పించాలనుకుంటారు' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: మీరు లేకపోతే నేను లేను.. 'కల్కి' సక్సెస్ పై ప్రభాస్ స్వీట్ వీడియో) -
ఇండియా ఫైల్స్‌లాంటి సినిమా అవసరం
‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ లీడ్ రోల్లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్’. బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు. ‘‘గద్దర్‌గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ మాట్లాడారు. -
'సీతా కళ్యాణ వైభోగమే' ట్రైలర్ వచ్చేసింది!
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సీతా కళ్యాణ వైభోగమే. ఈ మూవీని సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు.హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మై ఫ్రెండ్ టైంలోనే సతీష్‌తో పరిచయం. ఈ మూవీ ఐడియాను ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. సుమన్ ఫస్ట్ ఫిల్మ్, సతీష్ రెండో చిత్రానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి అని అన్నారు.దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ అందరికీ నచ్చింది. సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. చరణ్ అర్జున్ మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్ సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉంది. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశా. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు’ అని అన్నారు. -
డూప్ లేకుండా కాజల్ ఫైట్ చేశారు: సుమన్ చిక్కాల
‘‘సత్యభామ’ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉన్నాయి. భావోద్వేగాలను పండించడంలో కాజల్ అగర్వాల్‌కి మంచి పేరుంది. ఆమె యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుందనిపించింది. ఎమోషన్, యాక్షన్ ఆమె చక్కగా చేశారు. ఈ రెండింటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అన్నారు డైరెక్టర్ సుమన్ చిక్కాల. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’.డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమన్ చిక్కాల మాట్లాడుతూ– ‘‘శశికిరణ్ తిక్క వద్ద స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. నాపై నమ్మకంతో దర్శకత్వం బాధ్యత అప్పగించాడు తను. ‘సత్యభామ’ పూర్తిగా ఫిక్షన్ కథ.ఒక కేసు విషయంలో బాధితురాలికి న్యాయం చేసే పవర్ఫుల్ పోలీస్సాఫీసర్గా కాజల్ పాత్రకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేశారామె. ఆంధ్రప్రదేశ్‌లోని దిశ యాప్, తెలంగాణలో షీ సేఫ్ యాప్ గురించి మా మూవీలో చూపించాం. ఎవరైనా ఈ యాప్స్ గురించి తెలుసుకుని ఆపదలో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక సందేశం చేరినట్లే’’ అన్నారు. -
పేదల పక్షపాతి జగన్
‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచి్చన తరువాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూశా. చాలా కాలంగా రాజకీయాలను గమనిస్తున్నాను. ఇప్పటివరకూ ఏనాడూ చూడని అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగింది. చెప్పింది చేయడం... చేసేదే చెప్పడం ఆయన అభిమతం. మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, ఖురాన్‌లా, బైబిల్లా భావించి తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయనే.’ అని ప్రముఖ సినీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది నేను పుట్టి పెరిగింది చెన్నైలో. మా అమ్మా నాన్నలది కర్ణాటకలోని మంగళూరు. చెన్నైలో అన్నాదురై కాలం నుంచీ ఎంజీఆర్, కామరాజ్ వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి కాంగ్రెస్... ఆ తర్వాత ప్రభుత్వాల వరకూ గమనిస్తున్నాను. పూర్వాశ్రమంలో మాది కాంగ్రెస్ పారీ్టకి చెందిన కుటుంబం. దివంగత ప్రధాని ఇందిరాగాం«ధీ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా చేసిన జనార్దన్ పూజారి మాకు దూరపు బంధువు. నా పూర్తి పేరు సుమన్ పూజారి(అయితే స్కూల్ రికార్డ్స్‌లో సుమన్ తల్వార్ అని ఉంటుంది) పూజారి అంటే గుడి పూజారి కాదు. ఆయుర్వేద వైద్యం చేసే బిల్లవ కమ్యూనిటీ అది. జగన్‌ని బీసీలు ఎన్నటికీ మరచిపోరు నేను కూడా బిసీ కమ్యూనిటీకి చెందిన వాడ్ని కాబట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. ఇప్పటిదాకా చూసిన దాన్ని బట్టి బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నేత జగనే. అది నేను చెప్పడం కాదు స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఆయన బీసీలకు 48 సీట్ల వరకూ ఇచ్చారు. అలాగే 11 ఎంపీ టికెట్లు ఇచ్చారు. గతంలో 4 రాజ్యసభ స్థానాలు కూడా ఇచ్చారు. బీసీలు ఎవ్వరూ జగన్‌ను మర్చిపోయే అవకాశం లేదు. అంత ప్రాధాన్యత మరెవ్వరూ ఇప్పటిదాకా బీసీలకు ఇవ్వలేదనేది వాస్తవం. ఏపీలో విద్య, వైద్యం అద్భుతం డబ్బున్నవారు.. ఆ స్థాయిలో ఉన్నవారు ఎలాగైనా బతికేస్తారు. కానీ పేదల బతుకులు రోజురోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. వాళ్లకు సరైన తిండి లేదు. ఉండడానికి గూడు లేదు. ఎదగడానికి చదువు లేదు. సరైన వైద్యం అందడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ జగన్ అద్భుతమైన పరిష్కారాలు చూపించారు. పేదల విద్య, వైద్యం విషయంలో ఆయన చేసిన సంస్కరణలు ప్రశంసనీయం. నేను చాలా గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లకు స్వయంగా వెళ్లి చూశా. ఒకప్పుడు స్కూలా శ్మశానమా అన్నట్టు ఉండేది. ఇప్పుడు నీట్‌గా క్లాస్‌రూమ్స్, డిజిటల్ బోర్డ్స్, కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరుపేదల పిల్లలు స్వచ్ఛమైన ఇంగ్లి‹Ùలో గుడ్‌మారి్నంగ్, థాంక్యూ సార్ అంటూ మాట్లాడుతూ ఉంటే ముచ్చటగా అనిపిస్తోంది. వైద్యం విషయంలోనూ చాలా మంచి మార్పు కనబడుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, విలేజ్ క్లినిక్స్ వంటివి పేదలకు బాగా ఉపయోగపడేవే. పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. రేపటి వైద్యుల కోసం దాదాపుగా జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వస్తోందంటే గొప్ప విషయమనే చెప్పాలి. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే ఊహించని ఉత్పాతంలా వచి్చపడిన కరోనాని ఆయన అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగారు. ఆ సమయంలో నేను ప్రత్యక్షంగా గమనించాను. అత్యధిక వైద్య పరీక్షలు చేయడం... ప్రభుత్వం తరపున ప్రజలకు అందించిన మెడికల్ సరీ్వసెస్, జనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వృద్ధుల విషయంలో ఆయన తీరే వేరు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పటిదాకా వృద్ధుల గురించి ఏ సీఎం కూడా ఇంతగా ఆలోచించలేదు. నెలకోసారి ఇచ్చే పింఛన్ల కోసం వృద్ధులు చాలా కష్టపడేవారు. ఎండల్లో, వర్షాల్లో... గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. అలాంటి వారు ప్రస్తుతం ఇంటి దగ్గరే కూర్చుని దర్జాగా పింఛన్ తీసుకునేలా చేసింది తొలుత జగనే. ఇప్పటిదాకా దేశంలో ఎవరూ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఎవరు అమలు చేసినా అది కచి్చతంగా కాపీ కొట్టినట్టే. చెప్పిందే చేశారు చేసిందే చెబుతున్నారు నిరుపేదల కోసం జగన్ సీఎం అయ్యాక చాలా వరకూ మంచి పనులు చేశారు. తాను పదవిలోకి రాక ముందు ఏదైతే చెప్పారో అందుకు తగ్గట్టు కమిట్ అయిన ప్రతీదీ చేశారు. ఇప్పుడు తాను చేసిందే చెపుతున్నారు. నిజం చెప్పాలంటే కొందరైతే ఆయన చెప్పిందానికన్నా ఎక్కువే చేశారంటున్నారు కూడా. అభివృద్ధి అంటే ఒక వ్యక్తికో, ఒక కులానికో కాదు ఇప్పుడు చాలా మంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే ఒక వ్యక్తికా... ఒక కులానిదా... లేక రాష్ట్ర అభివృద్ధా... అనేది ప్రజలు ఆలోచించాలి. అంతకు ముందు పాలించిన వారు ఏ మేరకు అభివృద్ధి చేశారు. ఇంకా ఏం చేయలేదు... అన్నది విశ్లేíÙంచుకోవాలి. ఎంత గొప్ప పాలన అయినా చిన్న చిన్న లోపాలు తప్పవు. అన్నీ అద్భుతాలే చేయాలంటే అసాధ్యం. ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా గ్యాప్ రాకుంటే ఇంకా గొప్పగా అభివృద్ధి జరిగి ఉండేదని నా అభిప్రాయం. మేనిఫెస్టో... బాగుంటే చాలదు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో జగన్ మేనిఫెస్టో కన్నా హామీలు ఎక్కువగా ఉన్నాయని కొందరు చెప్పారు. అయితే అందులోని హామీలు ఏ మేరకు అమలవుతాయి? ఎంత వరకూ అమలు కావు? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రస్తుత పాలనను కూడా ఒక్కసారి పోల్చుకోవాలి. –సత్యార్ధ్ -
శివుని ఆజ్ఞ వల్లే ఇక్కడకు వచ్చా..
నాతవరం : దైవ సంకల్పంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని సినీ నటుడు సుమన్ అన్నారు. మండలంలోని చిక్కుడుపాలెం గ్రామంలో గల శ్రీశివశక్తి క్షేత్రంలో ధర్మకర్త కె.ఎన్.ఎన్.శర్మ ఆధ్వర్యంలో సోమవారం 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి సుమన్ శంకుస్థాపన చేశారు. సుమన్‌కు వేదపండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.3 కోట్ల వ్యయంతో 85 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించే 50 పడకల ఉచిత ఆస్పత్రి నిర్మాణానికి సుమన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శివుడి ఆజ్ఞ లేనిదే మానవుడు ఏమీ చేయలేడన్న అపారమైన నమ్మకం శివభక్తుడిగా తనకు ఉందన్నారు. ఈ రోజు తనకు చైన్నెలో అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చానంటే శివుడి ఆజ్ఞే కారణంగా భావిస్తున్నానన్నారు. తాను హైదరాబాద్‌లో సినిమా షూటింగ్లో ఉండగా శివాలయం ధర్మకర్త శర్మ ఉచిత ఆస్పత్రి నిర్మిస్తున్నామని, శంకుస్థాపనకు రా వాలని ఆహ్వానించారన్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందించే మంచి కార్యక్రమానికి తన వంతు తోడ్పడాలని నిర్ణయించుకున్నాను అన్నారు. తన స్నేహితులు, సినిమా పరిశ్రమలో ఉన్న శివభక్తుల దృష్టికి ఈ ఆస్పత్రి విషయం తీసుకెళ్లి వారి ఆశీస్సులు కోరతానన్నారు. విదేశాల్లో ఉన్న వారు సైతం ఇలాంటి సేవా కార్యక్రమాలపై దృిష్టి సారించాలంటే సెలబ్రిటీలు ఇలాంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలన్నారు. ప్రతి వ్యక్తి దైవం లాంటి తల్లిదండ్రులు, గురువులను మరిచిపోకూడదన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో భక్తిభావం అధికమని, అందువల్లే ఇక్కడ యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఉక్రెయిన్, రష్యా వంటి దేశాల్లో యుద్ధాల కారణంగా ప్రతి రోజు మరణాలు నమోదు అవుతున్నాయన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. 750 సినిమాల్లో నటించాను.. తాను సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి 46 ఏళ్లు అయిందన్నారు. ఇంత వరకు వివిధ భాషల్లో 750 సినిమాల్లో నటించానన్నారు. తెలుగులో 100 సినిమాల్లో హీరోగా నటించానని, తమిళంలో 50 సినిమాలు, కన్నడ తదితర భాషల్లో నటించానన్నారు. తెలుగు సినిమాల్లో అన్నమయ్య సినిమా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిందన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో 8 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ చెప్పులు వేసుకోకుండా ప్రతిరోజు చన్నీళ్ల స్నానం చేశానన్నారు. దైవ స్మరణతో గడిపేవాడినని తెలిపారు. ఆ సినిమాతో శ్రీ వేంకటేశ్వస్వామిపై ఎనలేని భక్తిభావం పెరిగిందన్నారు. అన్నమయ్య సినిమా చూసిన అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ తనను ఢిల్లీ పిలిపించుకుని కలిసి టిఫిన్ చేశారన్నారు. తనను ఘనంగా సత్కరించి పంపించారన్నారు. అది సినిమా పరిశ్రమలో ప్రత్యేకత సంతరించుకునేలా చేసిందన్నారు. సినిమా పరిశ్రమలో ఎలాంటి సపోర్టు లేదన్నారు. పన్నెండేళ్ల వయసులో నేర్చుకున్న కరాటే కష్ట సమయంలో ఆత్మస్థైర్యం అందించిందన్నారు. శివుడు, శ్రీవేంకటేశ్వస్వామిని పూజిస్తానన్నారు. ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం శివశక్తి క్షేత్రం భూగర్గంలో గల శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధర్మకర్త, వేదపండితులు సుమన్‌ను ఘనంగా సత్కరించారు. సుమన్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన వెంట నర్సీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు, వినాయక ఆలయ కమిటీ చైర్మన్ దేవత సురేష్, అరుణ, వర్ధమాన నటులు సతీష్, రాము తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న ‘సీతా కళ్యాణ వైభోగమే’ ఫస్ట్ లుక్
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సీతా కల్యాణ వైభోగమే. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రం రాబోతోంది. గోవాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఈ చిత్రంలోని ఒక పాటను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే..లవ్ అండ్ యాక్షన్ మూవీని చూడబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 100 మంది ఫైటర్లతో చిత్రీకరించిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. గగన్ విహారి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి. వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలకి విజయ్ పనిచేస్తున్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..సుమన్ కామెంట్స్
-
Suman: వైఎస్సార్సీపీదే గెలుపు: సినీనటుడు సుమన్
తిరుపతి కల్చరల్ (తిరుపతి జిల్లా): సామాజిక న్యాయపాలనకు ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుందని ప్రముఖ నటుడు సుమన్ స్పష్టం చేశారు. తన వీరాభిమాని బుజ్జమ్మ కుమార్తె వివాహం కోసం తిరుపతికి వచ్చిన ఆయన ఆదివారం తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం సుమన్‌ను ఆలయ చైర్మన్ కట్టా గోనీయాదవ్ శాలువతో సత్కరించి అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేక ఏ పార్టీకైనా మద్దతు పలుకుతారా అని మీడియా ప్రశ్నించగా రాజకీయ పరంగా పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్స్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ మేనిఫెస్టో అందించే పార్టీకి తన సంపూర్ణ సహకారం ఉంటుందని సుమన్ చెప్పారు. రాజకీయం అంటే పదవులు చేపట్టడం కాదని, ప్రజల సంక్షేమం దిశగా ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజాదరణ పొందినప్పుడే ప్రజా నాయకులు అవుతారని, ఎంత కష్టమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల కోసం శ్రమించే వారికే పట్టం కడతారని పేర్కొన్నారు. -
మూఢ నమ్మకాల నేపథ్యంలో వస్తోన్న ఎర్రచీర!
శ్రీరామ్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఎర్ర చీర'. పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే స్వామీజీలు, మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే హారర్, కామెడీ చిత్రంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. ఈ చిత్రంలో అయ్యప్ప పి.శర్మ , కమల్ కామరాజు, సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రమోద్ పులిగార్ సంగీతమందించారు. ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. -
కామెడీ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రధారులుగా, ‘అవసరాల’ శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గురువారం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, సహ–నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
హిట్ అయితే పెద్ద సినిమానే
‘‘ప్రేక్షకుల సహకారంతో 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. చిన్న, పెద్ద సినిమాలనేవి ఉండవు. హిట్ అయితే పెద్ద సినిమా.. ఫట్ అయితే చిన్న సినిమా. ‘విక్టర్ ది నెక్ట్స్ గాడ్’ సినిమాలో 200 మంది నటీనటులకు చాన్స్ ఉండటం హ్యాపీ. నూతన సాంకేతిక నిపుణులకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’’ అని సుమన్ అన్నారు. నూతన నటీనటులతో ప్రీతమ్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘విక్టర్ ది నెక్ట్స్ గాడ్’. అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్‌పై రూపొందనున్న ఈ సినిమా టైటిల్ లోగో లాంచ్ వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ టైటిల్ లోగోని రిలీజ్ చేశారు. ప్రీతమ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక సందేశాత్మక చిత్రం. 4 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రానుంది. ఏడు దేశాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జాకీ–రవి, సంగీతం: రమేష్ ముక్కెర, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: బీఏ వర్మ. -
కుటుంబమంతా చూడాల్సిన చిత్రం
‘‘మాధవే మధుసూదన’ సినిమాని రామచంద్ర రావుగారు చాలా స్పష్టతతో తీశారు. ప్రతి సన్నివేశంలో ఆయన అనుభవం నాకు కనిపించింది. కుటుంబమంతా కలిసి థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం ఇది’’ అని నటుడు సుమన్ అన్నారు. తేజ్ బొమ్మదేవర, రిషికి లోక్రే జంటగా నటించిన చిత్రం ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24 విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ – ‘‘సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది. నేనే డైరెక్టర్,ప్రోడ్యూసర్‌గా మా అబ్బాయి తేజ్‌ని హీరోగా పెట్టి సినిమా చేశా. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘మాధవే మధుసూదన’తో ఒక మంచి ప్రయత్నం చేశాం’’ అని తేజ్ బొమ్మదేవర అన్నారు. -
'మాధవే మధుసూదన' అందరినీ మెప్పిస్తుంది: సుమన్
టాలీవుడ్లో చిన్న సినిమాలు ఒక్కోసారి బ్లాక్‌బస్టర్ అవుతుంటాయి. కథ నచ్చితే తెలుగు ఆడియన్స్ తప్పకుండా బ్లాక్‌బస్టర్ ఇస్తారు. ఈ కోవలోనే 'మాధవే మధుసూదన' అనే చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 24 విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. బొమ్మదేవర రామచంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వం,నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీని బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా తాజాగా హైదరాబాద్ ఫిలింఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ సుమన్ మాట్లాడుతూ.. 'మాధవే మధుసూదన' సినిమాను దర్శకుడు బొమ్మదేవర రామచంద్ర రావు చాలా క్లారిటీగా రూపొందించారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎంతోమంది దర్శకులను చూశారు. ప్రతి సీన్ తెరకెక్కించేటప్పుడు బొమ్మదేవర రామచంద్ర రావు అనుభవం నాకు కనిపించింది. కెమెరామెన్ వాసు ప్రతి ఫ్రేమ్‌ను చక్కగా పిక్చరైజ్ చేశారు. ఏ సినిమా బాగా రావాలన్నా అందుకు డైరెక్టర్, స్టోరీ, టెక్నీషియన్స్ కీలకం. ఈ సినిమాకు ఆ టీమ్ బాగా కుదిరింది. ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్లు అయినప్పటికీ బాగా ప్రిపేర్ అయి నటించారు. ఈ సినిమాతో బొమ్మదేవర రామచంద్రరావు తన కొడుకు తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అతను మంచి హీరో అవుతాడు. డ్యాన్సులు, ఫైట్స్, ఎమోషన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ బాగా చేస్తున్నాడు. అతనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హీరో తేజ్ వర్క్ షాప్స్ చేసి తన క్యారెక్టర్ లోని మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా చెప్పాడు. ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నాడు అని కాకుండా ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నట్లు ఎన్ని కరెక్షన్స్ చెప్పినా తేజ్ చేశాడు. హీరోయిన్ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. రామచంద్రరావు గారు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్ కు వెళ్లి చూడమని కోరుతున్నా.' అని సుమన్ అన్నారు. దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది. టచప్ బాయ్ నుంచి మేకప్ మెన్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. అక్కినేని నాగార్జున గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అందరు స్టార్ డైరెక్టర్స్‌తో అనుబంధం ఏర్పడింది. వాళ్లు సీన్స్ ఎలా చేస్తున్నారు, ఏ షాట్ ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు అనేది పరిశీలించేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండటం ఇందుకు కారణం. నేను కూడా ఇలా ఏదో ఒకరోజు డైరెక్షన్ చేయాలని కోరుకున్నాను. మంచి కథ సిద్ధం చేసుకుని కొందరు హీరోలను అప్రోచ్ అయ్యాను. నేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా చేస్తానని చెప్పడంతో వాళ్లలో ఏవైనా సందేహాలు కలిగి ఉండొచ్చు. లేదా రిస్క్ ఎందుకని అనుకోవచ్చు. వాళ్లు సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. అప్పుడు మా అబ్బాయినే హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నాను. నేను వెళ్లి మా అబ్బాయి తేజ్‌ను అడిగితే ..అతనికి కూడా మనసులో హీరో కావాలని ఉంది. కానీ నేను ఏమంటానో అని చెప్పడం లేదని తెలిసింది. అలా కాలేజ్ పూర్తయ్యాక ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి మా అబ్బాయి తేజ్ హీరోగా ఈ సినిమా స్టార్ట్ చేశాను.' అని ఆయన అన్నారు. -
సీనియర్ హీరో సుమన్ ప్రధాన పాత్రలో ‘త్రిష’
పాటల రికార్డింగ్‌తో సినిమాకు శ్రీకారం చుట్టడం అనే సంప్రదాయానికి ఇటివల మెగాస్టార్ చిరంజీవి జీవం పోయడం తెలిసిందే. తాను నటిస్తున్న 156వ చిత్రాన్ని కీరవాణి సారథ్యంలో పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి. అదే బాటలో యువ దర్శకుడు ఆర్.కె గాంధీ తన తాజా చిత్రాన్ని ప్రారంభించారు. సీనియర్ హీరో సుమన్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి 'త్రిష'అని నామకరణం చేశారు. 'సంభవామి యుగే యుగే' అన్నది ఈ చిత్రం ఉపశీర్షిక. స్నేహాలయం క్రియేషన్స్- బి.ఆర్ మూవీస్ పతకాలపై రవీంద్ర బూసం - ఈశ్వర్ నాగనాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం ఎం.ఎల్.రాజా సంగీతంతోపాటు సాహిత్యం సైతం సమకూర్చుతున్నారు. "త్రిష" చిత్రం కోసం యువగాయకుడు సాయి చరణ్ ఆలపించిన గీతాన్ని అభేరి స్టుడియోలో గురువారం రికార్డింగ్ చేశారు. ఈ నెల 14 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న 'త్రిష' కర్ణాటకలోను కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకోనుంది. ఒక దివ్యాంశ సంభూతుడు దుష్టశక్తులను, దుష్టపన్నాగాలను ఎలా అరికట్టాడు అనే కథాంశంతో తెరకెక్కుతన్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్, సురేష్ సూర్య, ఖుషీ గౌడ్, యువీన, కృష్ణేంద్ర, ధీరజ్ అప్పాజీ, ఆనంద్ మట్ట ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
సమ్మర్లో సత్యభామ
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో, నవీన్ చంద్ర, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఈ నెల రెండో వారంలో కొత్త షెడ్యూల్‌ను ఆరంభిస్తాం. సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహనిర్మాత: బాలాజీ. -
మార్పు కోసం..
సుమన్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జనం’. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ– ‘‘ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చే నాయకులు తప్పుదారి పట్టిన ప్రజల ఓట్ల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు. -
ప్రజల్లో మార్పు కోసం వస్తోన్న 'జనం'!
సుమన్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ 10న ప్రపంచం వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కథ విషయానికొస్తే ప్రతీ తల్లి తన బిడ్డను గొప్ప లక్షణాలతో, ఉన్నత విలువలతో పెంచాలనుకుంటుంది. కానీ ఎలక్షన్స్‌లో ఓటు విషయానికి వచ్చేసరికి కులం, మతం, ప్రాంతం, డబ్బు లాంటి ప్రలోభాలకు లోబడి తప్పు దారిలో వెళ్లేలా చేస్తుంది. ప్రజలకు ఎంతో మంచి చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ నాయకుడు.. ప్రజల ఓట్ల కోసం, ఎలక్షన్స్‌లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నాడన్న దానిపైనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నయన్, మౌనిక, లక్కీ, జయవాని, రషీదా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
రోజాను ఎదుర్కొనలేకే వ్యక్తిగత ఆరోపణలు..!
-
మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు.. సినీనటుడు సుమన్ రియాక్షన్
సాక్షి, విశాఖపట్నం: మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను సినీ నటుడు సుమన్ తప్పుబట్టారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ‘‘రోజాను వ్యక్తిగతంగా ఎదుర్కోనలేకే ఆరోపణలు చేస్తున్నారు. ధైర్యం ఉంటే మంత్రి రోజాను రాజకీయంగా ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలు పడి మంత్రి రోజా ఈ స్థాయికి వచ్చింది బండారు ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. వారి గురించి కూడా ఇదే విధంగా మాట్లాడితే బండారు ఊరుకుంటారా’’ అంటూ మండిపడ్డారు. చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు, మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా సైతం బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సాక్షి తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
Asha Suman: ఆత్మవిశ్వాసమే అసలైన గురుదక్షిణ
రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో దివ్యాంగురాలైన ఒక స్టూడెంట్ అత్యాచారానికి గురైన సంఘటన ఆశా సుమన్‌ను షాక్‌కు గురి చేసింది. స్కూలు, కాలేజిల్లో చదివే అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని ఆ సమయంలో సంకల్పించుకుంది ఆశ. దివ్యాంగులు, సాధారణ యువతులు 30 వేల మందికి పైగా ఆత్మరక్షణ విద్యలు నేర్పించిన ఉపాధ్యాయురాలు ఆశా సుమన్ గురించి... తొమ్మిది సంవత్సరాల క్రితం రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని ఖార్కర గ్రామంలో... ఆరోజు స్కూల్‌కు వెళ్లింది ఆశా సుమన్. బడిలో మగపిల్లలు తప్ప ఆడపిల్లలు ఎవరూ కనిపించలేదు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఈ లోపే ఎవరో ఊళ్లో జరిగిన దుర్ఘటన గురించి చెప్పారు. దివ్యాంగురాలైన ఒక అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. విషయం తెలిసిన ఆశ హుటాహుటిన బాధితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు చెవిన పడుతున్నప్పుడు ఆమె మనసు దుఃఖసముద్రం అయింది. ఈ సంఘటన ప్రభావంతో కొద్దిమంది తల్లిదండ్రులు అమ్మాయిలను స్కూల్‌కు పంపడం మాన్పించారు. నిజానికి ఆ ప్రాంతంలో ఆడపిల్లల చదువుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇచ్చే వాళ్లు కూడా తమ ఇంటి ఆడపిల్లలను బడికి పంపడానికి భయపడుతున్నారు. స్కూల్‌కు వెళ్లినా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఆ పాశవిక సంఘటన, తల్లిదండ్రులపై దాని ప్రభావం పడి ఆడపిల్లలు స్కూల్‌కు దూరం కావడం... ఇవి పదేపదే గుర్తుకు వచ్చి ఆశను విపరీతంగా బాధపెట్టాయి. ‘ఆ అమ్మాయికి తనను తాను రక్షించుకోవడం తెలిస్తే ఇలా జరిగేది కాదేమో. ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పాలి’ అనుకుంది. మొదటి అడుగుగా... పిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడింది. పిల్లలను తిరిగి స్కూల్‌కు పంపించడానికి వారు మొదట్లో ససేమిరా అన్నారు. చదువు అనేది ఎంత అవసరమో వివరించి, అమ్మాయిలు తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణ విద్యల గురించి చెప్పి వారిలో మార్పు తీసుకువచ్చింది. కొన్ని రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి అమ్మాయిలను తన స్కూటర్‌పై స్కూల్‌కు తీసుకువచ్చేది. రెండు నెలల తరువాత పరిస్థితి మామూలుగా మారింది. స్కూల్లోని అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పేది. ఆశ గురించి విన్న చుట్టుపక్కల ఊళ్లలోని స్కూల్, కాలేజీ వాళ్లు ‘మా స్టూడెంట్స్‌కు కూడా నేర్పించండి’ అంటూ ఆహ్వానిం చారు. కాదనకుండా వారి ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో స్కూళ్లు, కాలేజీలలో ఎంతోమంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించింది. వైకల్యం ఉన్న బాలికలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పే విధానం వేరుగా ఉంటుంది, వారు సులభంగా అర్థం చేసుకునేలా, అర్థం చేసుకున్నది ఆచరణలో చేసేలా రోజువారి సంఘటనలను ఉదాహరిస్తూ, డమ్మీని ఉపయోగిస్తూ నేర్పిస్తుంటుంది. దృష్టిలోపం ఉన్న మౌనిక అనే స్టూడెంట్ ఆశ టీచర్ దగ్గర సెల్ఫ్–డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుంది. ‘నేను బయటికి ఎక్కడికి వెళ్లినా తోడుగా అన్నయ్య వచ్చేవాడు. అన్నయ్య లేకుంటే బయటకు వెళ్లడానికి సాహసించేదాన్ని కాదు. అయితే ఇప్పుడు నా గురించే నేనే కాదు, తల్లిదండ్రులు కూడా భయపడడం లేదు. ఎవరైనా నాకు చెడు చేయడానికి ముందుకు వస్తే నిమిషాల్లో మట్టి కరిపించగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌనిక. స్టూడెంట్స్లోనే కాదు వారి తల్లిదండ్రులలోనూ ఇప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది. ‘చాలామందిలాగే నేను కూడా మా అమ్మాయిని స్కూల్‌కు పంపడానికి భయపడ్డాను. ఇప్పుడు అలాంటి భయాలేవీ లేవు. స్కూల్ అయిపోగానే అమ్మాయిల కోసం ఆశా టీచర్ నిర్వహిస్తున్న సెల్ఫ్–డిఫెన్స్ క్లాసులను దగ్గర నుంచి చూశాను. అమ్మాయిల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. ప్రతి స్కూల్లో ఆశలాంటి టీచర్ ఒకరు ఉండాలి’ అంటున్నాడు ఆ ఊరికి చెందిన జస్వంత్. అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆశ టీచర్ చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆత్మరక్షణ విద్యల వల్ల అమ్మాయిల్లో కనిపించే ఆత్మవిశ్వాసమే తనకు అసలు సిసలు గురుదక్షిణ అంటుంది ఆశా సుమన్. -
ప్రజల్లో మార్పు రావాలని చెప్పే చిత్రమే "జనం"!
సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నైనా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం జనం. వెంకట రమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్,అజయ్ ఘోష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు వి.సముద్ర , దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ పాల్గొన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ...'ఈ సినిమా ఒంగోలులో షూటింగ్ చేశాం. నేటి భారతం కూడా అక్కడే షూటింగ్ జరిగింది. ఆ సినిమా జ్ఞాపకాలు కళ్ల ముందు కదిలాయి. అదే కోవలో వస్తోన్న చిత్రం జనం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కరప్షన్ తో పాటు అన్యాయాలు, అక్రమాల గురించి దర్శకుడు చాలా చక్కగా చూపించారు. సందేశంతో పాటు మంచి ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుంది. ఈ తరం పిక్చర్స్ వారి చిత్రాలు ఎలా ఉంటాయో అలా ఈ చిత్రం కూడా ఉంటుంది. ఎలక్షన్స్ సమయంలో ఈ చిత్రం రావడం గొప్ప విషయం. ప్రజల్లో మార్పు రావాలని చెప్పే చిత్రం " జనం" అని అన్నారు. దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ....'నటుడు సుమన్‌తో దేశంలో దొంగలు పడ్డారు చిత్రానికి పని చేశాను. అప్పటి నుంచి వారితో మంచి పరిచయం ఉంది. జనం చిత్రాన్ని రెండు పార్ట్ లుగా చేస్తున్నా. నిజాయితీకి..ప్రజా స్వామ్యానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. ఒంగోలులో సినిమా అంతా పూర్తి చేశాం. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పొలిటీషియన్స్‌తో పాటు జనానికి కూడా ఈ చిత్రంలో చురకలు అంటించాం.' అని అన్నారు. కాగా... ఈ చిత్రంలో ప్రగ్నా గౌతమ్, సుజాత, జయవాణి, ఆదిత్య, నాగేంద్ర, క్రిష్, లక్కీ, సింధు, రిషిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాజ్ కిరణ్ అందిస్తున్నారు. -
Janam Movie Trailer Launch: పొలిటికల్ సెటైరికల్ చిత్రం "జనం" ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
అప్పటివరకు చంద్రబాబు జైల్లోనే..: సుమన్
సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై సినీనటుడు సుమన్ స్పందించారు. పాలిటిక్స్‌లో ఇదొక గుణపాఠం అన్నారు. సోమవారం నాడు ఆయన ఫిలిం ఛాంబర్లో మాట్లాడుతూ.. 'చంద్రబాబు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడూ వస్తాడో తెలుస్తుంది. టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఆయనకు అన్నీ అనుకూలంగా వచ్చే వరకు జైలులొనే ఉంటారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అన్ని ఆలోచించాకే అరెస్ట్ చేసి ఉంటారు. సీఎం వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు జైలుకు వెళ్ళాడంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉండి ఉంటాయి. సమయం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి' అన్నారు. చదవండి: Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh -
వైవిధ్యమైన కథ
నటుడు సుమన్ ప్రధాన పాత్రలో మునిప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సిర్నాపల్లి సంస్థాన్’. మనోహర్, శ్రీనివాస్, జ్యోతీసింగ్, శృతీ పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. కృష్ణకాంతి క్రియేషన్స్‌లో మంచాల రమేశ్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మంచాల రమేశ్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘సిర్నాపల్లి సంస్థాన్’. మునిప్రసాద్ చక్కగా తీశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేల్ మురుగన్, సంగీతం: ఏలేందర్. -
బాబుకు తోడు దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: ఓ దొంగ... మరో దొంగకు మద్దతిస్తే ఎలా ఉంటుంది? ఒకరికి మద్దతుగా మరొకరు తెరమీదికొచి్చ ‘తనేమీ తప్పు చేయలేదు’ అని చెప్పటం!!.. వినటానికే విచిత్రంగా ఉంది కదూ? నిజానికి కోర్టుల్లో కనుక ఇలా సాక్ష్యాలు చెబితే జైల్లో పడేస్తారు. కానీ ఎల్లో మీడియా మాత్రం... ఆ దొంగలు చంద్రబాబు నాయుడికి ఇస్తున్న సర్టిఫికెట్లను పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అవే నిజాలని జనాలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అవి నిజాలే అనుకుంటే... ఇలా ఎల్లో మీడియాలో సాక్ష్యాలు చెబుతున్న దొంగలను గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే కేసులో ఎందుకు అరెస్టు చేసింది? ఐటీ శాఖ ఎందుకు వాళ్లకు నోటీసులిచ్చింది? తాము తప్పు చేశామని వాళ్లు ఎందుకు ‘ఈడీ’ ఎదుట ఒప్పుకున్నారు? ఈ ప్రశ్నల్లో దేనికీ ‘ఈనాడు’ దగ్గర గానీ, దాని తోక మీడియా దగ్గర గానీ సమాధానాలు లేవు. వారికి తెలిసిందల్లా... చంద్రబాబు శుద్ధ పూస అని జనాన్ని నమ్మించేందుకు మొత్తం తమ మీడియా సామ్రాజ్యాన్ని అబద్ధాలకు తాకట్టు పెట్టడమే. అదే జరుగుతోంది కూడా!. దుర్యోధనుడు మంచోడని దుశ్శాసనుడు, శకుని సాక్ష్యం చెబుతున్నట్లే ఉంది టీడీపీ వ్యవహారం. స్కిల్ కుంభకోణంలో ఆధారాలతోసహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు మద్దుతుగా ఆ కేసులో ఇతర నిందితులు వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ వంటి వారు ఇంటర్వ్యూలిస్తుండటం... సిగ్గులేకుండా వాటిని ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ప్రచురిస్తుండటం రాష్ట్రం మొత్తాన్ని విస్మయపరుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్ ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా వీడియో విడుదల చేశారు. కాగా తాజాగా ఈ కేసులో మరో నిందితుడు సుమన్ బోస్ ‘మా చంద్రబాబు నీతిమంతుడు’ అని సరి్టఫికెట్ ఇచ్చేశారు. నిజానికి సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఒప్పందం చేసుకుని కోట్లు కొల్లగొట్టడంలో కీలక పాత్రధారి ఈ సుమన్ బోసే. ఈయనను, వికాస్ ఖన్విల్కర్‌ను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీఐడీ రెండూ అరెస్టు చేశాయి. జైల్లో ఉండి... బెయిలుపై బయటకు వచ్చారు. ఇలా బెయిలుపై వచి్చన వాళ్లు కేసులోని మరో నిందితుడికి మద్దతుగా మీడియాతో మాట్లాడటమే చిత్రాతిచిత్రం. వాస్తవానికి సుమన్‌బోస్ అసలు బండారాన్ని బయటపెడుతూ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే ఇటు సీఐడీకీ అటూ న్యాయస్థానానికి కూడా వాంగ్మూలాన్ని ఇచ్చిందన్నది టీడీపీ ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోంది. మాకు తెలీదు.. సంబంధం లేదు: సీమెన్స్ టీడీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్‌లో తమ అవినీతి దందాకు ‘సీమెన్స్ కంపెనీ ముసుగు వేయాలన్న చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. అసలు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించి తమకు తెలియనే తెలియదని సీమెన్స్ కంపెనీ కుండబద్దలు కొట్టింది. డిజైన్ టెక్ కంపెనీతో కలసి ఏపీఎస్ఎస్డీసీతో తాము కుదర్చుకున్నట్టు చెబుతున్న త్రైపాక్షిక ఒప్పందానికి, తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏదైనా ప్రాజెక్ట్ కింద 90 శాతం నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూర్చే పద్ధతి అసలు తమ కంపెనీ పాలసీలోనే లేదని విస్పష్టంగా తేల్చింది. తమ కంపెనీ పేరిట సుమన్ బోస్ టీడీపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధం లేదని... అసలు అటువంటి ఒప్పందాలు చేసుకునే అధికారాన్ని ఆయనకు కంపెనీ అప్పగించనే లేదని వెల్లడించింది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీ ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెబుతూ పంపిన ఈ–మెయిల్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీమెన్స్ కంపెనీ పూర్తిగా సహకరిస్తోంది. కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు వారిద్దరే.. స్కిల్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు కాగా, సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్ ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. వారి బండారాన్ని సీఐడీ, ఈడీ ఆధారాలతోసహా బట్టబయలు చేశాయి. ఒప్పందంలో ఓ చోట సుమన్ బోస్ అని మరో చోట సౌమ్యాద్రి బోస్ అని సంతకాలు చేసినట్టు ఆడిట్ నివేదిక నిగ్గు తేల్చింది. సీమెన్స్ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించి సుమన్ బోస్ తమ కంపెనీ పేరిట చేసిన మోసాన్ని నిర్ధారించింది. ఆయన అప్పటికే డిలీట్ చేసిన ఈ–మెయిల్స్, వాట్సాప్, ఎస్ఎంఎస్ సందేశాలను రిట్రీవ్ చేసి ఆ రికార్డులను సీఐడీకి అప్పగించింది. తమ కంపెనీకి తెలియకుండానే సుమన్ బోస్ ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేసుకున్నారని, అటు తమ కంపెనీని మోసం చేయడంతోపాటు ఇటూ ఏపీ ఖజానాను కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించారని న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చింది. ఇక షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్ కీలక పాత్ర పోషించారు. దాంతో సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్‌లను సీఐడీ 2021, డిసెంబర్10న అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించింది. వారిద్దరు 2022, జనవరి 18 వరకు అంటే 40 రోజులపాటు జైలులో ఉన్నారు. బెయిలుపై వచ్చి ఎల్లో మీడియాలో చిలకపలుకులు చెబుతుండటమే ఘోరాతిఘోరం. సుమన్‌బోస్, ఖన్విల్కర్‌లను అరెస్ట్ చేసిన ఈడీ ఇక స్కిల్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్లతోపాటు షెల్ కంపెనీల ప్రతినిధులు సురేష్ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్‌లను ఈ ఏడాది మార్చి 4న అరెస్ట్ చేసింది. వారికి విశాఖపట్నంలోనీ సీబీఐ న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ నలుగురినీ ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుని 10 రోజులపాటు విచారించారు. అటువంటి సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విన్వేల్కర్ ప్రస్తుతం స్కిల్ కుంభకోణంలో అవినీతి జరగలేదని చెబుతూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతుండటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని పరిశీలకులకు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంలో ప్రశ్నావళికి సీమెన్స్ కంపెనీ ఈమెయిల్ ద్వారా చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.. ప్రశ్న: జీవోలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్ నెలకొల్పడానికి అంగీకరించారా? మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో ప్రభుత్వం వాటా 10 శాతంగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సీమెన్స్ 90శాతం వాటా సమకూర్చేందుకు సమ్మతించిందా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అటువంటి ప్రాజెక్ట్‌లు చేపట్టే విధానం సీమెన్స్ కంపెనీలో ఉందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అలాంటి ఒప్పందం గురించి మాకు అసలు తెలీదు. ప్రశ్న: ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఏమైనా వర్క్ ఆర్డర్ మీకు వచ్చిందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు. ప్రశ్న: ఏపీఎస్ఎస్డీసీ, డిజైన్‌టెక్‌తో కలిసి సీమెన్స్ కంపెనీ పేరున కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంపై సీమెన్స్ కంపెనీ తరపున అని చెబుతూ సుమన్ బోస్ సంతకాలు చేశారు. సీమెన్స్ కంపెనీలో ఆయన హోదా ఏమిటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? సీమెన్స్ కంపెనీ సమాధానం: సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు. కంపెనీ ఆ అధికారాన్ని ఆయనకు ఎప్పుడూ ఇవ్వ లేదు. సుమన్ బోస్ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా మాకు సమాచారం లేదు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కరెంటు పోయింది.. కొవ్వొత్తుల వెలుగులోసంతకాలు చేశా ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరగలేదంటూ బుకాయించేందుకు యతి్నంచి సుమన్ బోస్ అడ్డంగా దొరికిపోయారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఒప్పంద పత్రంలో ఏమని రాసి ఉందో కూడా తెలియదని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం. ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున కరెంట్ పోయిందని... కొవ్వొత్తులు తెప్పించారని...ఆ కొవ్వొత్తుల వెలుగులోనే తాము సంతకాలు చేశామని చెప్పారు. ఇంతకీ ఆ ఒప్పందంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సైన్స్‌కు ఆధారం ఆధ్యాత్మికతేనా?
శేర్ (సిరాజ్) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హర ఓం హర’. అశోక్ కుల్హర్, దేవేంద్ర మదన్ సింగ్ నేగి నిర్మిస్తు్తన్న ఈ చిత్రంలో గంగాధర్, కర్ణిక ఇతర ముఖ్య తారాగాణం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలో ముగి సింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఆధ్యాత్మికత అంతా సైన్స్‌తోనే ముడిపడి ఉందని, సైన్స్‌కు ప్రధాన వనరు ఆధ్యాత్మికతేనని నిరూపిస్తూ రూపొందిస్తున్న సినిమా ఇది. తెలుగుతో ΄ాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో సుమన్, ఆమని కీలక ΄ాత్రధారులు. -
వినోదం..సందేశం
మల్లిక్ బాబు, వినయ్, ఇషా, ప్రియాన్స్ హీరో హీరోయన్లుగా, సుమన్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘దుమారం‘. జీఎల్బీ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాయీ బ్రాహ్మణుల వృత్తి, వారు జీవితంలో పడుతున్న ఇబ్బందులను కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో బార్బర్‌గా చేస్తున్నా. వినోదం, సందేశం అన్నీ ఉన్న చిత్రం అన్నారు. ‘‘హీరో తండ్రి పాత్రను సుమన్ చేస్తున్నారు’’ అన్నారు జీఎల్బీ శ్రీనివాస్. ‘‘తొలి చిత్రంలోనే మాస్ క్యారెక్టర్ దొరకడం హ్యాపీ’’ అన్నారు మల్లిక్. ‘‘ఈ సినిమా కో ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, విలన్ కొడుకు పాత్ర చేస్తున్నా’’ అన్నారు పాండు గౌడ్. -
ఎర్ర చీర చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్
శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, అజయ్ కీలక పాత్రల్లో బేబీ డమరి సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఎర్ర చీర’. సుమన్ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్ కానుంది. సుమన్ బాబు దర్శకత్వం వహించారు. ‘‘అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూ΄పొందించాం. 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
సుమన్, గరీమా చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పోచంపల్లిలో మొదలైంది. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా చివరి షెడ్యూల్లో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో 100 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
దసరాకి ‘సీతా కల్యాణ వైభోగమే’
సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు.ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇచ్చిన ఈ సినిమాను భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిస్తున్నారు. టైటిల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇటీవలే గోవాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఒక పాటను చిత్రీకరించారు. చక్కటి ఫ్యామిలీ ఫిల్మ్ గా, తెలంగాణ వైభవానికి అద్దం పట్టేలా ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పోచంపల్లి పరిసర ప్రాంతాలలో మొదలైంది. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రముఖ ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో 100 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గగన్ విహారి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, రచ్చరవి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
కోడి కూర కోసం దాడి..
నిజామాబాద్: చికెన్ వేయలేదని మేనమామను కట్టెతో కొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన చింతల రాజు ఇంట్లో మంగళవారం చికెన్ వండారు. రాజు అక్క కుమారుడు సుమన్ మద్యం మత్తులో చికెన్ వేయాలని కోరగా ఇద్దరి మధ్య మాటలు లేనందున చికెన్ వేయలేమని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన సుమన్ పక్కనే ఉన్న కట్టెతో రాజు తలపై బాదాడు. బాధితుడిని జీజీహెచ్‌కు తరలించారు. రాజు భార్య గౌరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?
ఆయన అసలు పేరు సుమన్ తల్వార్. మద్రాసులో పుట్టిపెరిగిన ఈ సీనియర్ నటుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మెప్పించాడు. ఒకప్పట్లో బహుభాషా హీరోగా ఒక వెలుగు వెలిగాడు. కరాటే మార్షల్ ఆర్ట్స్‌లో తనకు టాలెంట్ ఉండటంతో యాక్షన్ సినిమాలకు అప్పట్లో మారుపేరుగా నిలిచాడు. అలా అన్ని భాషల్లో కలిపి దాదాపు 700 చిత్రాలు చేసినా.. తెలుగు సినిమాలోనే సెటిలయ్యాడు. సుమన్ డేట్స్ కోసం ఆ రోజుల్లో దర్శకనిర్మాతలు క్యూకట్టేవారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కూడా సుమన్ పోటీ పడేవాడు. అయితే నీలి చిత్రాలను సుమన్ తీసినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆపై జైలు జీవితం కూడా గడిపాడు. (ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ఆ కారణం వల్ల ఒక్కసారిగా ఆయన ఇమేజ్ దెబ్బతిన్నది. సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీని వెనుక చాలా మంది హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన పలువురు కలిసి పక్కా ప్లాన్‌తో ఆయన్ను ఇరికించారనే ఆరోపణలు వచ్చాయి అవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పేరును కూడా పలువురు ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని సుమన్ బహిరంగంగానే పలుమార్లు చెప్పాడు. అసలు విషయం ఏంటనేది ఇప్పటికీ ఆయన చెప్పలేదు. కానీ సుమన్ జైలుకు సంబంధించిన టాపిక్‌పై దివంగత సీనియర్ దర్శకులు సాగర్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అమ్మదొంగా ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలా ఆయన అందరికి సుపరిచయమే. ఈ కారణంతోనే జైలుకు వెళ్లాడు నీలి చిత్రాల విషయంలో సుమన్ జైలుకు వెళ్లలేదని ఆ వీడియోలో డైరెక్టర్ సాగర్ తెలిపారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్, అప్పట్లో తమిళనాడులో పనిచేస్తున్న డీజీపీ, ఒక లిక్కర్ కాంట్రాక్టర్ (వడియార్) వీళ్ల ముగ్గురి వల్లే సుమన్ జైలుకు వెళ్లాడని ఆయన చెప్పారు. ఆ సమయంలో లిక్కర్ కాంట్రాక్టర్ చాలా పవర్ ఫుల్ అలాంటి వ్యక్తి కూతురిని సుమన్ ఫ్రెండ్ ఒకరు ప్రేమించాడు. మరోవైపు హీరో సుమన్ అంటే ఆ రాష్ట్ర డీజీపీ కూతురికి చాలా ఇష్టం. అతని సినిమా షూటింగ్ ఎక్కడుంటే ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చేదని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ సుమన్ మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడే వాడు కాదని తెలిపాడు. ఒకరకంగా వన్‌సైడ్ లవ్ అని చెప్పాడు. కానీ డీజీపీ మాత్రం తన కూతురికి ఇప్పటికే పెళ్లి అయిందని, ఆమె సుమన్ ట్రాప్‌లో పడిందనే ఆలోచనతో ఎంజీఆర్‌కు తెలపడం. మరోవైపు సుమన్ ఫ్రెండ్ కూడా లిక్కర్ కాంట్రాక్టర్ కూతురితో ప్రేమ వ్యవహారం. ఈ రెండు విషయాలు సుమన్‌ను ఇబ్బంది పెట్టాయని సాగర్ తెలిపారు. సుమన్ అరెస్ట్ అవుతాడని ఆ నిర్మాతకు ముందే తెలుసు సుమన్ విషయంపై డైరెక్టర్ సాగర్ ఇలా చెప్పారు.. 'ఒకరోజు సుమన్‌ను ఎంజీఆర్ తన ఇంటికి పిలిచి పరోక్షంగా డీజీపీ కూతురికి దూరంగా ఉండాలని సూచించాడు. దీంతో సుమన్ కూడా చెప్పాల్సింది నాకు కాదు ఆ అమ్మాయికి అన్నాడు. అక్కడ ఎంజీఆర్‌కు కొంతమేరకు కోపం వచ్చింది. అలా ఒకరోజు అందరూ చూస్తుండగా నడిరోడ్డులో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు సుమన్‌పై ఇలాంటి తప్పుడు కేసు పెట్టడంతో పాటు బెయిల్ రాకుండా ఉండే పలు సెక్షన్స్ నమోదు చేశారు. కానీ అప్పట్లో సుమన్‌పై చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దాలే. (ఇదీ చదవండి: తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్) సుమన్ ఫ్రెండ్‌కు వీడియో క్యాసెట్ల షాప్ ఉండేది. అక్కడికి చాల మంది అమ్మాయిలు వచ్చేవారు కాబట్టి ఈజీగా ఇలాంటి కేసును సుమన్‌పై నమోదు చేశారు. ఇదే సమయంలో సుమన్ అరెస్ట్ కాబోతున్నాడని నిర్మాత దగ్గుబాటి రామానాయుడికి ముందే తెలుసు. ఆ సమయంలో సుమన్‌తో తీయాల్సిన సినిమా ఆపేశాడు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగినా ఆయన తిరిగి సమాధానం చెప్పలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి ఎలా రిలీజ్ అయ్యాడంటే సుమన్ అమ్మగారికి అప్పటి గవర్నర్ PC అలెగ్జాండర్ క్లాస్మేట్ కావడంతో జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పడంతో బెయిల్ లభించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా సుమారు ఆరు నెలలు జైలు జీవితాన్ని సుమన్ గడిపాడని ఆయన తెలిపాడు. జైలుకు వెళ్తున్న సమయంలో సుమన్ వద్ద ఉన్న డబ్బు,పలు ఆస్తి కాగితాలను తన స్నేహితులకు ఇచ్చాడట. అతను రిలీజ్ అయి బయటకు వచ్చాక వారందరూ కూడా సుమన్‌ను మోసం చేసి డబ్బు ఎగ్గొట్టారని ఆయన తెలిపాడు. అప్పట్లో సుమన్ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆ సమయంలో అతని మేనేజర్ సారథినే కొంత సాయం చేశారు. తర్వాత మళ్లీ పలు సినిమాలు తీసి జీవితంలో నిలదొక్కున్నాడని సుమన్ గురించి పలు ఆసక్తకరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాగర్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
చావని ప్రేమిది...
హెబ్బా పటేల్ ప్రధాన పా త్రలో నటించిన చిత్రం ‘సందేహం’. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ ఊటుకూరు హీరో. సత్యనారాయణ పర్చా నిర్మించిన ఈ చిత్రం నుంచి సంగీతదర్శకుడు సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘చచ్చినా చావని ప్రేమిది..’ పాటను దర్శకుడు దశరథ్ విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సుమన్‌కి నటకేసరి
శతాధిక చిత్ర దర్శకులు దివంగత కోడి రామకృష్ణ జయంతి వేడుకలు వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు అందించారు. నటుడు సుమన్‌కి ‘నట కేసరి’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘కోడి రామకృష్ణగారి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడమే ఈ పురస్కారాల ముఖ్యోద్దేశం’’ అన్నారు నిర్వాహకులు టి. రామ సత్యనారాయణ, వీబీజీ రాజు, కొత్త వెంకటేశ్వరరావు. దర్శకులు కార్తీక్ వర్మ దండు, రామ్ అబ్బరాజు, వెంకట్ పెదిరెడ్ల, రచయిత భాను తదితరులు పురస్కారాలు అందుకున్నారు. కోడి రామకృష్ణ కుమార్తె, నిర్మాత కోడి దివ్య పాల్గొన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘మిస్టరీ’..షూటింగ్ షురు
తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్‌ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్. పవర్ ఫుల్ పోలీస్‌గా రవిరెడ్డి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. -
మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్
అంబాజీపేట(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడంతో మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రి చేయనున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరిగిందని వారే చెబుతున్నారని తెలిపారు. నవరత్న పథకాలను 95 శాతం అమలు చేసి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చదవండి: అసలేం జరిగింది? మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా? -
2 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణలు.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు
ఆడియో ఫంక్షన్‌కు రావాలని పిలిస్తే రూ.2 లక్షలు డిమాండ్ చేశాడంటూ సీనియర్ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే! తాజాగా అతడు ఈ వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. ‘నటరత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్ వేదికగా సుమన్‌పై చేసిన వ్యాఖ్యలకు శివనాగు క్షమాపణ తెలిపారు. దీనిపై అసలేం జరిగిందో క్లారిటీ ఇస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో శివనాగు మాట్లాడుతూ ‘‘సుమన్‌గారు నా కుటుంబానికి ఎంతో కావాల్సిన వ్యక్తి. ఆయనతో మూడు సినిమాలు చేశాను. నా పిల్లలు ఇద్దరు నిర్మిస్తున్న ‘నట రత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు ఆయన్ని ఆహ్వానించి, సన్మానించాలనుకున్నాను. ఆయన్ను పిలిచే క్రమంలో మేకప్‌మెన్ వెంకట్రావు చెప్పడం సమస్యో, నేను వినడం పొరపాటో తెలీదు కానీ ఫంక్షన్ టెన్షన్లో ఉండి సుమన్‌గారిపై ఆరోపణలు చేశాను. దీనిపై చాలామంది నిర్మాతలు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు గానీ నేను పొరపాటు మాట్లాడానని గమనించలేదు. మీడియా ముఖంగా సుమన్‌గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా’’ అని అన్నారు. చదవండి: 48 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కమెడియన్ -
రైతుల నేపథ్యంలో...
మోహన కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా, ఓ ప్రధాన పాత్రలో సుమన్ నటించిన చిత్రం ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్’. శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో సింగూలూరి మోహన్‌రావు నిర్మించిన ఈ చిత్రం జూలై 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం విలేకర్ల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ– ‘‘రైతులను ఇబ్బంది పెడుతున్న ఓ బర్నింగ్ ఇష్యూపై నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘రైతులు, స్నేహం, రాజకీయం.. అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మోహన కృష్ణ. ‘‘రైతు గురించి మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం’’ అన్నారు శ్రీ లక్ష్మణ్. -
రెండు లక్షలు డిమాండ్ చేశాడు.. సీనియర్ హీరో సుమన్‌పై శివనాగు ఫైర్!
సీనియర్ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు ఫైర్ అయ్యాడు. సినిమా ఆడియో ఫంక్షన్‌కి రావాలని ఆహ్వానిస్తే..రూ.2 లక్షలు ఇస్తేనే వస్తానని చెప్పారని, ఓ సీనియర్ హీరో అలా చెప్పడం బాధాకరం అన్నారు. సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. (చదవండి: నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!) ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. . ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్ ఫోన్ ఎత్తి ‘శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌కి వస్తారట అండీ’ అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు. సీనియర్ నటుడు సుమన్. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది’ అని మండిపడ్డారు. ‘చిన్న సినిమాతోనే పరిశ్రమ మనుగడ ఉంది. ప్రస్తుతం మినిమమ్ బడ్జెట్ చిత్రాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చికోటి ప్రవీణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎరపతినేని శ్రీనివాసరావు , దివ్యవాణి, డా. పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిపురుష్‌పై సుమన్ రివ్యూ.. ప్రభాస్‌కు హ్యాట్సాఫ్.. కానీ..
ప్రభాస్ రాఘవుడిగా నటించిన ఆదిపురుష్ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి మూడు రోజులు భారీ లెవల్లో కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా వెనకబడింది. ఇకపోతే శ్రీరామదాసులో రాముడిగా నటించిన సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఆదిపురుష్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'రావణుడు సీతను ఎత్తుకుపోవడం నుంచి ఆమెను రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్ తీశారు. మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో రాముడిని నీలిరంగులోనే చూశాం. అలాగే రాముడికి మీసాలు, గడ్డాలు కూడా ఉండవు. కానీ ఇందులో రాముడిని సాదాగా చూపించారు. అది చాలా పెద్ద రిస్క్. అయినా రెండున్నరేళ్లపాటు ప్రభాస్ ఆ బాడీని మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. అందుకు అతడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. రావణుడికి మోడ్రన్ హెయిర్ కట్ చేశారు. వేషధారణ మార్చారు. అది చాలా తప్పు. ఇలా డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు సినిమాలో ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ బాగున్నాయి. మరికొన్నిచోట్ల గ్రాఫిక్స్ పాతదానిలా ఉన్నాయి. చదవండి: ఆదిపురుష్ 5 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా? పాటలు నచ్చాయి. కృతీ సనన్ సీత క్యారెక్టర్లో బాగా చేసింది. ఈ సినిమాలో ఎమోషన్ మిస్ అయింది. చాలా చోట్ల సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను గుర్తుకు తెచ్చాయి. ఈ తప్పులు చేయకపోయి ఉంటే ఇది అంతర్జాతీయ సినిమా అయి ఉండేది. ఆదిపురుష్ అనేది పవర్ఫుల్ టైటిల్.. కానీ సినిమా చూసి నిరాశ చెందాను. మైథాలజీ సినిమాలను దక్షిణాదివాళ్లే బాగా హ్యాండిల్ చేస్తారు' అని చెప్పుకొచ్చాడు సుమన్. చదవండి: ప్రేమలో అబద్ధాలు, మోసాలు నచ్చవు: రకుల్ ప్రీత్ సింగ్ -
IQ Movie Review: ఐక్యూ సినిమా రివ్యూ
సినిమా : ఐక్యూ" " (పవర్ అఫ్ స్టూడెంట్స్) నటీ నటులు: సాయి చరణ్, పల్లవి, ట్ర్యాన్సీ,సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్, సూర్య,పల్లె రఘునాథ్ రెడ్డి, జబర్దస్త్ శేషు, గీతా సింగ్, లక్ష్మీ రావు, సత్తిపండు, జ్ఞానేశ్వర్ రావు, శీలం శ్రీనివాసరావు, సీఎం రెడ్డి, వాసు వర్మ, తదితరులు స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీనివాస్ GLB కథ, మాటలు, సంగీతం : పోలూరు ఘటికాచలం బ్యానర్ : కె. యల్. పి మూవీస్ సమర్పణ :కాయగూరల రాజేశ్వరి నిర్మాత : కాయగూరల లక్ష్మీ పతి కెమెరా : టి. సురేందర్ రెడ్డి సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీనటులుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన చిత్రం "ఐక్యూ" (పవర్ అఫ్ స్టూడెంట్స్). జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. కథ ఇది ఒక బ్రెయిన్‌కు సంబంధించిన సినిమా. మిడిల్ క్లాస్ అమ్మాయి భూమిక (పల్లవి) చాలా తెలివి గల అమ్మాయి. చిన్నతనం నుంచే యాక్టివ్‌గా ఉంటూ తనకున్న ఐక్యూతో కౌన్ బనేగా కరోడ్ పతి పోటీలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకొంటుంది. ఆలా గెలుచుకున్న డబ్బును మిడిల్ క్లాస్ విద్యార్థుల చదువులకు ఖర్చు పెడుతుంది. తన పీ.హెచ్.డి అయిన తరువాత ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులను మేటి పౌరులుగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తుంది. మంచి తెలివి ఉన్నప్పటికీ అదే కాలేజీలో తన ఫ్రెండ్స్‌తో కలసి అల్లరి చిల్లరగా తిరుగుతున్న వివేక్ గ్యాంగ్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తుంది. అలా వచ్చిన భూమికను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే భూమికను కిడ్నాప్ చేసి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. మరో వైపు తనలో ఉన్న ఐక్యూను చూసిన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ అమ్మాయి మెదడును అమ్మడానికి ఒక డీల్ కుదుర్చుకొని కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తాడు. ఇంతకీ భూమికను వివేక్ కిడ్నాప్ చేశాడా? లేక ప్రొఫెసర్ చేశాడా? ఆమెతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్ చేసే అజయ్ చేశాడా? దాని వల్ల జరిగిన పరిణామాలు ఏంటి? ఈ కేసును పోలీసులు ఎలా చేధించారు? అనేది తెలుసుకోవాలంటే "ఐక్యూ" సినిమా చూడాల్సిందే! నటీ నటుల పనితీరు వివేక్ పాత్రలో నటించిన సాయి చరణ్‌కు ఇది మొదటి చిత్రమైనా బాగానే యాక్ట్ చేశాడు. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయి భూమికగా పల్లవి తన పాత్రలో ఒదిగి పోయింది. భూమిక కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ కమిషనర్ పాత్ర పోషించిన సుమన్ నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు. మిగతా వారందరూ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు "ఐక్యూ" అంటే మేధస్సుకు సంబంధించిన చిత్రం. అన్ని రంగాల్లో మాఫియా వచ్చింది. విద్యారంగంలో కూడా మాఫియా వస్తే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అనే కొత్త పాయింట్ సెలెక్ట్ చేసుకొని చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనివాస్ GLB. ఎంటర్టైన్ చేసే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. టి.సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సీనియర్ రైటర్ ఘటికాచలం అందించిన మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. జీవితంలో అప్పుడప్పుడూ అల్లరి చేయచ్చు. కానీ జీవితమే అల్లరిపాలు కాకూడదు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శివషర్వాణి ఎడిటింగ్‌కు ఇంకాస్త కత్తెర వేయాల్సింది. ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారు. చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ -
స్టార్ హీరో ఇంటికి కోడలిగా సుమన్ కూతురు?
నీచల్ కులమ్(తమిళ) సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన సుమన్ సుమారు 45 ఏళ్లుగా నటుడిగా సత్తా చాటుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర నటుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. 90ల్లో అగ్ర హీరోగా రాణించిన సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు భక్తి చిత్రాలతోనూ మెప్పించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో జైలు జీవితం గురించి, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నా కూతురు గోల్డ్ మెడలిస్ట్ 'నేను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికీ తెలుసు. ఆ కేసులో నా ప్రమేయం లేకపోయినా నన్ను లోపలేశారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత నాకు సపోర్ట్‌గా మాట్లాడారు. సుమన్ ఇలాంటి చీప్ పనులు చేయడని స్టేట్మంట్ ఇచ్చారు. అది నాకు బాగా సాయపడింది. నా కూతురు అఖిలజ ప్రత్యూష విషయానికి వస్తే తనకు యాక్టింగ్ మీద ఆసక్తి లేదు. రెండేళ్ల క్రితం ఆమె మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనిటిక్స్‌లో గోల్డ్ మెడల్ సంపాదించింది. సౌత్ ఇండియాలోని స్టార్ హీరో ఇంటికి నా కూతురు కోడలిగా వెళ్తుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో దాని గురించి ఆలోచించలేదు. తన చదువు పూర్తయ్యాకే పెళ్లిపై దృష్టి పెడతాం' అన్నారు సుమన్. జైలు జీవితం గడిపిన సుమన్ కాగా 1985లో సుమన్ జైలుపాలయ్యారు. సుమన్ స్నేహితుడు దివాకర్‌కు క్యాసెట్ రెంట్‌కు ఇచ్చే షాపు ఉంది. ఆయన దగ్గర సుమన్ అప్పుడప్పుడు సినిమా క్యాసెట్లు తీసుకునేవారు. దివాకర్ తన స్నేహితుడే కావడంతో ఓసారి కారు అడిగితే ఇచ్చారు సుమన్. దాన్ని దివాకర్ నీలి చిత్రంలో వాడాడట. దీంతో ఇందులో సుమన్ హస్తం కూడా ఉందని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఈ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ అప్పటికే హీరోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమన్ జైలు నుంచి బయటకు వచ్చాక రచయిత డీవీ నరసరాజు మనవరాలు శిరీషను పెళ్లాడారు. చదవండి: ఆ క్రికెటర్‌ను ప్రేమించా, కానీ..: హీరోయిన్ -
యువత నేపథ్యంలో ‘ఐక్యూ’
సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ హీరో హీరోయిన్లుగా జీయల్‌బీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐక్యూ’ (పవర్ ఆఫ్ స్టూడెంట్స్). కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. (చదవండి: శివలా ‘కస్టడీ’ గుర్తుండిపోతుంది : శ్రీనివాసా చిట్టూరి) ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నటుడు సుమన్ మాట్లాడుతూ– ‘‘రెగ్యులర్ కథలకు భిన్నంగా కొత్త కథలను ఎంచుకుని ‘ఐక్యూ’ లాంటి సినిమా తీసిన నిర్మాతలకు మనం అండగా ఉండాలి’’ అన్నారు. ‘‘యువత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు కాయగూరల లక్ష్మీపతి. ‘‘మేధస్సుకు సంబంధించిన చిత్రం ఇది’’ అన్నారు జీయల్‌బీ శ్రీనివాస్. -
రామోజీరావు అంటే ఆయన కుమారుడు సుమన్‌కి నచ్చదు.. ఎందుకంటే?
చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని చంద్రబాబు, రామోజీ చూస్తే తెలుస్తుందంటూ రామోజీరావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వ్యాఖ్యానించారు. రామోజీ అంటే ఆయన కుమారుడికి నచ్చరని, సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి ఏం జరిగేందో వంటి ఆసక్తికరమైన విషయాలు సాక్షికి వెల్లడించారు. ఆశ్చర్యమనిపించింది.. మార్గదర్శిపై సీఐడీ దాడులతో రామోజీ భయపడ్డారు. అందుకే మంచం పట్టినట్లు కనిపించారు. దాని వల్ల ఎక్కువగా ప్రశ్నించరని అనుకున్నారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఆ ఫొటో (మంచంపై పడుకున్న రామోజీని సీఐడీ విచారిస్తున్న) చూశాక నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ స్థితిని చూసినప్పుడు ఈ మధ్య చంద్రబాబు ఏడ్చిన విషయం గుర్తొచ్చింది. గతంలో ఆరోగ్యం కూడా బాగోలేని ఎన్టీఆర్‌ని చంద్రబాబు, రామోజీ కలిసి ఏడిపించారు. చాలా మానసిక వేదనకు గురిచేశారు. రామోజీ మంచంపై పడుకోవడానికి.. చంద్రబాబు ఏడవడానికి కారణం కూడా అదే. చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని వీళ్లని చూస్తే తెలుస్తుంది. సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి అప్పుడే గొడవలు జరిగి ఉండేవేమో. ఎందుకంటే సుమన్‌కి ఈ తరహా మోసాలు అసలు నచ్చవు. రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు? వచ్చిన చిట్స్ మొత్తాన్ని రామోజీ ఇష్టం వచ్చినట్లు మళ్లించేస్తుంటే.. భవిష్యత్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా లక్షల మందికి ఎలా చెల్లించగలరు? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉంది. మార్గదర్శి డిపాజిటర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం మార్గదర్శిపై విచారణ ప్రారంభించడం చాలా మంచిపని. ఇన్నాళ్లూ మోనార్క్‌గా వ్యవహరించి.. మన మీదకు ఎవరు విచారణకు వస్తారనే ధీమాతో రామోజీ ఉండేవారు. ఇప్పుడు ఇలా ఒక్కసారిగా విచారణకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. లెక్కలన్నీ పక్కాగా ఉన్నప్పుడు రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు? అహం పెరిగిపోయింది.. ఇదంతా.. తన సామ్రాజ్యం.. ఇందులో వేరెవరికీ చోటుండకూడదని రామోజీరావు ఎప్పుడూ భావిస్తుంటారు. దీనికి చంద్రబాబు సహకారం అందించారు. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేశాక ఇద్దరూ ఒక్కటైపోయారు. అప్పటి నుంచి రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది. ఫిల్మ్‌సిటీని 1,000 నాగళ్లతో దున్నించేస్తానని కేసీఆర్ చెప్పడంతో.. ఆయనను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఓం సిటీ కడతానని ప్లాన్లు చూపించారు. ఇది ఫిల్మ్‌సిటీని మించిపోతుందని నమ్మించారు. దాన్ని మోదీకి కూడా చూపించారు. కానీ.. ఓం సిటీ ఏమైంది..? పేపర్లకే పరిమితమైంది. చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా? -
దసరాకు పోటీగా పరారీ? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. సాయి శివాజీ దర్శకత్వం వహించగా గాలి ప్రత్యూష సమర్పణలో, శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జివివి గిరి నిర్మించాడు. మార్చి 30న రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. 'ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. అలా ఈసారి పరారీ ద్వారా యోగేశ్వర్ హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌గా మంచి పాత్రలో నటించాను. నాతో పాటు చాలా మంది సీనియర్స్ నటించడం విశేషం' అన్నారు. చిత్ర నిర్మాత గిరి మాట్లాడుతూ.. 'మా సినిమా చూసిన వారందరూ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. హీరో సాంగ్స్, యాక్షన్ ఫైట్స్ సీన్లలో బాగా చేశాడని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. సుమన్ గారు మాకు బ్యాక్ బోన్ గా ఉండి ఫుల్ సపోర్ట్ చేశారు. చాలా మంది ఈ సినిమా నాని గారి "దసరా"కు మా సినిమా పోటీ అంటున్నారు. అలా ఏం కాదు. ఆ సినిమా స్టోరీ వేరు, మా సినిమా స్టోరీ వేరు. నాకు రాముడు భక్తి ఎక్కువ అందుకే శ్రీరామ నవమి రోజు రిలీజ్ చేయాలని చేశాము తప్ప పోటీగా విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. సోమవారం నుంచి థియేటర్స్ పెంచుతున్నాము' అన్నారు. హీరో యోగేశ్వర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి చిత్రం. చాలా బాగా చేశానని ప్రశంసలు లభిస్తుంటే సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే మా గురువుగారు సుమన్, ఆలీ, జీవా, భూపాల్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించడం హ్యాపీగా ఉంది. వీరంతా నన్ను కొత్త వాడు అని చూడకుండా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే వారి నుంచి చాలా నేర్చుకున్నాను. మా సినిమా టెక్నీషియన్స్‌కు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెపుతున్నాను' అన్నారు. -
ఈ సినిమాలో నాకు ఛాన్స్ రాలేదని బాధగా ఉంది.. సుమన్
నరసింహాచారి, డా.సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షిరెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’. డ్రీమ్ సినిమా పతాకంపై స్వీయ దర్శకనిర్మాణంలో నరసింహాచారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని సీనియర్ నటుడు సుమన్ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘యువత డ్రగ్స్ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.. ఆ తర్వాత అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆ విషయాన్ని ఇందులో చక్కగా చూపించారు. యువతకు మంచి సందేశాన్నిస్తుంది. ట్రైలర్ చూశాక ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపించింది. ఎమోషన్స్ పండించడం చాలా కష్టం. ఈ చిత్రంలో దానికే ఎక్కువ మార్కులు పడతాయి. ఇలాంటి చిత్రంలో నాకు పాత్ర రాలేదని కాస్త బాధగా ఉంది. సినిమా చూశాక మెండ్ ఫ్రెష్ అయినట్లు అనిపించింది. ఇలాంటి కథలు రావడం ఈ సమాజానికి అవసరం’’ అని అన్నారు. నటుడు సకారం మారుతి మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పినట్లు చేశాం. మట్టిని పిండి బొమ్మగా మలచినట్లు మా నుంచి చక్కని నటన రాబట్టారు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే. సినిమాలపై ఎంతో అవగాహన, అనుభవం ఉన్న సుమన్‌గారు సినిమా చూసి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పైగా ఈ సినిమా నచ్చి మా టీం చేసే తదుపరి చిత్రంలో తప్పకుండా అవకాశం ఇవ్వాలని సుమన్ మమ్మల్ని కోరడం చాలా ఆనందంగా అనిపించింది’’ అని అన్నారు. -
పరారీ మూవీ రివ్యూ
యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పణలో జి.వి.వి.గిరి నిర్మించారు. సాయి శివాజీ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మాత్రం నవ్వించిందో చూద్దాం.. కథ ఒకే కాలేజీలో చదువుకుంటున్న యోగి(యోగీశ్వర్), అతిథి(అతిథి) ప్రేమించుకుంటారు. హీరో తండ్రి(షయాజి షిండే) బడా వ్యాపారవేత్త కావడంతో చాలా తీరిక లేకుండా గడిపేస్తుంటారు. హీరోకి మరో ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్ తన తోటి ఆర్టిస్ట్ శివాని సైనిని ప్రేమిస్తుంటారు. వీరు ఐదు మంది కలిసి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగి తండ్రి పాండే(మకరంద్ దేశముఖ్ పాండే) కిడ్నాప్ అవుతాడు. మరి యోగి... మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్‌కు గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు? అతిథితో ప్రేమాయణానికి శుభం కార్డు పడిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! కథ... కథనం విశ్లషణ లవ్ క్రైం కామెడీ థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దానికి కావాల్సిన స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకుంటే చాలు. ఆడియన్స్‌ను థియేటర్లో రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా కూర్చోబెట్టవచ్చు. దర్శకుడు సాయి శివాజీ ఈ చిత్రానికి ‘రన్ ఫర్ ఫన్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ పెట్టి... ఈ సినిమాలో హీరో అండ్ బ్యాచ్‌ను ఇంటర్వల్ నుంచి పరుగులు పెట్టిస్తుంటాడు. దానిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు సరదాగా కాలేజీ లైఫ్.. ఆ తరువాత అత్తాపురం ఎపిసోడ్‌తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై మర్డర్ మిస్టరీతో సినిమాని పరుగులు పెట్టించాడు. క్లైమాక్స్ సీన్ బాగుంది. మకరంద్ దేశ్ ముఖ్ పాండే అండ్ బ్యాచ్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ నవ్వు తెప్పిస్తాయి. హీరో యోగీశ్వర్ కొత్త కుర్రాడైనా... బాగా నటించాడు. హీరోయిన్ అతిథి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. హీరోతో పాటు చేసిన భూపాల్ పాత్ర కూడా ఒకే. అతనికి జోడీగా నటించిన శివాని సైని పాత్ర గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ రఘు కారుమంచి... తన కామెడీ టైమింగ్‌తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆలీ ఇందులో ఉన్నా సైలెంట్‌గానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారి పాత్రలో సుమన్, హీరో తండ్రిగా షాయాజీ షిండే పర్ఫెక్ట్గా సూటయ్యారు. బాలీవుడ్ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్ మకరంద్ దేశ్ ముఖ్ పాండే... అమ్మాయిలను కిడ్నాప్ చేసి... వ్యభిచారం రొంపిలోకి దింపే కామెడీ విలన్ పాత్రలో బాగా చేశాడు. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా... తన పాత్ర పరిధి మేరకు నటించాడు. దర్శకుడు సాయి శివాజీ సినిమా ఆద్యంతం నవ్వించారు, కానీ కొన్నిచోట్ల అనవసర సన్నివేశాలు బలవంతంగా జోడించినట్లు అనిపిస్తుంది. గరుడ వేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం పర్వాలేదు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. -
నన్ను హీరోగా సినిమా తీస్తానంటే వద్దని చెప్పా: సుమన్
యోగేశ్వర్, అతిథి జంటగా నటిస్తోన్న చిత్రం 'పరారి'. ఈ చిత్రానికి సాయి శివాజీ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీవీ గిరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై గాలి ప్రత్యూష సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్, కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సుమన్ మాట్లాడుతూ.. 'మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్. తెలుగు వారందరూ గర్వించే రోజు. ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి మరిన్నీ ఆస్కార్ అవార్డులు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిర్మాత గిరి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే వద్దని తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడం జరిగింది. యోగేష్ చాలా బాగా నటించాడు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి.' అని అన్నారు నటి కవిత మాట్లాడుతూ.. 'ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో హీరో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. మంచి కథతో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరారి చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'యోగేష్ హీరోగా బాగా నటించారు. గిరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంత రావు(మాజీ రాజ్య సభ) , గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
మంచి లక్ష్యంతో ‘పరారీ’ నిర్మించా : జీవీవీ గిరి
యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పరారీ’. గాలి ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకానుంది. ఈ మూవీ పోస్టర్‌ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, టీజర్‌ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. ‘మంచి సినిమా తీయాలనే లక్ష్యంతో ‘పరారీ’ నిర్మించాను. సుమన్‌గారి వందో సినిమా నేను నిర్మించాల్సి ఉన్నా కుదరలేదు. ఈ మూవీలో సుమన్ గారు మంచి పాత్ర చేశారు’ అన్నారు జీవీవీ గిరి. ‘పరారీ’లో అన్ని పాటలు బాగావచ్చాయి’అన్నారు సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్. ‘ఈ సినిమాని నిర్మాత బాగా ఖర్చుపెట్టి తీశారు. అది విజువల్ గా కనపడుతుంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి. శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహిత్ నారాయణ్ సంగీతం అందించారు. -
సీనియర్ హీరో సుమన్‌పై చిరు ప్రశంసలు, వీడియో సందేశం ఇచ్చిన మెగాస్టార్
ఓ వైపు యాక్షన్ హీరోగా దూసుకుపోతూనే కుటుంబ కథాచిత్రాల్లో నటించారు హీరో సుమన్. 1959, ఆగస్టు 28న చెన్నైలో జన్మించిన సుమన్ కోలీవుడ్ లో నీచల్ కులం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ‘తరంగిణి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరో ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.మార్షల్ ఆర్ట్స్ హీరోగా సుమన్ చేసిన యాక్షన్ సినిమాలకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా టాలీవుడ్ అందగాడిగా సుమన్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉండేది. క సుమన్ కెరీర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భక్తి సినిమాల గురించి. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో అన్నమయ్య ఒకటి. సినిమాలో వెంకటేశ్వరస్వామిగా కనిపించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు సుమన్. ఇదిలా ఉంటే సుమన్ ఇండస్ట్రీకి వచ్చి 45 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయనకు విషెస్ తెలిపారు. ఈ మేరకు సుమన్‌ను కొనియాడుతూ ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ‘మై డియర్ బ్రదర్ సుమన్.. నటుడిగా మీరు 45 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 10 భాషలలో 150కి పైగా సినిమాలు చేయడం అద్భుతమైన విషయం. అది నిజంగా గొప్ప విజయం. సినిమాల పట్ల మీకున్న ఇష్టం, కమిట్మెంట్కు ఈ 45 ఏళ్లలో మీరు చేసిన చిత్రాలే చెబుతాయి. చదవండి: శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్! ఇంకా మరిన్ని సంవత్సరాలు లక్షలాది అభిమానులు, ప్రేక్షకులను ఇలానే అలరిస్తారని ఆశిస్తున్నా. ఫిబ్రవరి 16న మంగళూరులో మీ 45 ఏళ్ళ కెరీర్ ని పురస్కరించుకొని ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని విన్నాను. ఈ వేడుక విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా సుమన్ ‘నీచల్ కులమ్’ (తమిళ్) సినిమాతో తెరంగేట్రం చేశారు. ‘ఇద్దరు కిలాడీలు’తో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘నేటి భారతం’, ‘సితార’, ‘బావ బావమరిది’ తదితర విభిన్న కథా చిత్రాలతో 90ల్లో అగ్ర హీరోగా రాణించారు. కథానాయకుడిగా కొనసాగుతూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు సుమన్. Annayya #Chiranjeevi Congratulations Actor #Suman garu on Completing 45 Years in Films 👍 Megastar @KChiruTweets #MegaStarChiranjeevi pic.twitter.com/aC6n5hthTj — Chiranjeevi Army (@chiranjeeviarmy) February 15, 2023 -
సుమన్ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు
సుమన్ కల్యాణ్‌పూర్, లత ఒక విధంగా ఒకే మెట్టు మీద ఉండాలి. లత అభిమానులు కూడా సుమన్ కల్యాణ్‌పూర్ గొంతు లతాతో సమానం అంటారు. కాని సుమన్‌కు చాలా కొద్ది పాటలు లభించాయి. ఆమెను కొందరు ఎదగనివ్వలేదని అంటారు. బిడియం, హుందాతనం ఉన్న సుమన్ కల్యాణ్‌పూర్ అవకాశాల కోసం కలబడకుండా తప్పుకుని నిలబడింది. కాని ఆమె పాటలు నిలబడే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఆమె ఉండే అపార్ట్మెంట్ భవంతిలో అగ్నిప్రమాదం. అదే రోజు పద్మభూషణ్ ప్రకటన.జనవరి 28 ఆమె 87వ పుట్టినరోజు. ఇన్ని సందర్భాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్లకైనా తమ అభిమాన గాయనికి గౌరవం దక్కినందుకు అభిమానులు యూ ట్యూబ్‌లో ఆమె పాటల ప్లే బటన్ నొక్కుతున్నారు. నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే న తుమ్ హమే జానో – న హమ్ తుమే జానే మగర్ లగ్తా హై కుచ్ ఐసా మేరా హమ్దమ్ మిల్గయా... 1962. ‘బాత్ ఏక్ రాత్ కీ’ సినిమాలో దేవ్ ఆనంద్– వహీదా రెహమాన్ మీద చిత్రించిన ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత రేడియోలో శ్రోతలు తెగ ఫర్మాయిష్ చేయసాగారు... ఈ పాట ప్లే చేయమని. గాయకుడు హేమంత్ కుమార్ అందరికీ తెలుసు. గాయని లతా మంగేష్కర్... అని అందరూ అనుకున్నారు. కాదు. ఆ గొంతు సుమన్ కల్యాణ్‌పూర్‌ది. చెప్తే తప్ప తెలియదు. అదే మాధుర్యం. అదే తీపి. అదే పూలరెక్క సౌకుమార్యం. అదే అగరుపొగ ధూపం. అవునా... అని అందరూ నోరు తెరిచారు. లతాలా పాడుతున్న గాయని, లతా అంత బాగా పాడుతున్న గాయని సుమన్ కల్యాణ్‌పూర్ తెర మీదకు వచ్చిన సందర్భం అది. దానికి కారణం లతానే. అవును. ‘బాత్ ఏక్ రాత్‌కీ’కి సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్. ఆ సినిమా చేస్తున్నప్పుడు లతాకీ, బర్మన్కూ మాటలు లేవు. లతా లేకపోతే సినీ సంగీతమే లేదు అనుకుంటున్న రోజులు అవి. కాని బర్మన్కు పట్టుదల జాస్తి. సుమన్‌ను వెతికాడు. పాట చేశాడు. హిట్ కొట్టాడు. కాని లతా ఉండగా ఇతర గాయనులకు సంగీతమే ఉండదు అని మెల్లగా ఆ తర్వాత అర్థమైంది. సుమన్ పాట మీద ఎంత ప్రేమ ఉన్నా అది వినిపించక పోతే ఏమిటి చేయడం? నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే కర్నా థా ఇన్కార్ మగర్ ఇక్రార్ తుమ్హీసే కర్ బైఠే (జబ్ జబ్ ఫూల్ ఖిలే) సుమన్ కల్యాణ్‌పూర్‌ది బెంగాల్. వాళ్ల కుటుంబం ఆమె తండ్రి కాలంలో ఢాకా మీదుగా ముంబైకి చేరుకుంది. తండ్రి బ్యాంక్ ఉద్యోగి. ఐదుమంది అమ్మాయిల్లో సుమన్ పెద్దది. ఆ రోజుల్లో అమ్మాయిలను ఆ నాటి తల్లిదండ్రులు ఎలా పెంచారో అలానే సుమన్‌ను పెంచారు. దానికి సుమన్ స్వభావసిద్ధ సిగ్గు, బిడియం తోడైంది. అది ప్రవర్తనలోనే. కాని గొంతు విప్పితే పక్షి రెక్క విప్పినట్టు ఆమె పాట హాయిగా తరంగాలు సృష్టించేది. ఠెహరియే హోష్‌మే ఆలూ తొ చలే జాయియేగా... ఆప్కో దిల్ మే బిఠావూ తో చలే జాయియేగా... (మొహబ్బత్ ఇస్కో కెహెతే హై) ముంబైలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీ వేదిక మీద ఒక పాట పాడితే ఆ వేడుకకు గెస్ట్‌గా హాజరైన తలత్ మెహమూద్ ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు సుమన్ వయసు 16. అయినా సరే సుమన్‌ను హెచ్.ఎం.వి.కి రికమండ్ చేశాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడు షఫీ ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. 1954లో వచ్చిన ‘దర్వాజా’ సుమన్ మొదటి సినిమా. కాని 1962లో ‘న తుమ్ హమే జానో’ పాటతో ఆమెకు గుర్తింపు వచ్చింది స్టార్ అయ్యింది. కాని అప్పటికే లతా ఏకఛత్రాధిపత్యం సాధించింది. ఆశా భోంస్లే కూడా కూడదీసుకుంది. వీరిద్దరి కారణాన గీతా దత్, షంషాద్ బేగం... వంటి గాయనులే అవకాశాలు లేని స్థితికి చేరుకున్నారు. సుమన్ గొంతు లతా గొంతులా ఉండటంతో లతా దృష్టి ఈమె మీద ఎక్కువగా పడిందని అంటారు. సుమన్‌తో పాడిస్తే ఆ సంగీత దర్శకులకు లతా పాడటం కష్టం అయ్యేది. ఆ భయంతో సుమన్‌కు అవకాశాలు రాలేదు. కాని లతా మంగేష్కర్, రఫీలు రాయల్టీ విషయంలో భేదాభిప్రాయాలతో ఒకరికి మరొకరు పాడటం మానుకున్నారు. పాట ఒకసారి పాడి డబ్బు తీసుకున్నాక ఇక రాయల్టీ అవసరం లేదని రఫీ అభిప్రాయం. ఒక పాట తాలూకు రికార్డులు అమ్ముడయినంత కాలం గాయనీ గాయకులకు రాయల్టీ ఇవ్వాల్సిందేనని లతా అభిప్రాయం. ఈ తగాదా సుమన్‌కు కొద్దిగా లాభించింది. లతా పాడకపోవడం వల్ల రఫీ, సుమన్ కలిసి చాలా డ్యూయెట్లు పాడారు. షమ్మీ కపూర్ కోసం చేసిన ఈ పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆజ్ కల్ తేరె మేరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్ సబ్కో మాలూమ్ హై ఔర్ సబ్కో ఖబర్ హోగయి (బ్రహ్మచారి) తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే దిల్ హతేలీ మే లే ఆయేరే (రాజ్ కుమార్) అదొక్కటే కాదు... సుమన్‌కు చొరవ లేకపోవడం వల్ల తన సామర్థ్యానికి తగ్గ డిమాండ్ చేయలేకపోవడం వల్ల ఆమె ‘పేదవాడి లత’గా మారింది. అంటే లతా మంగేష్కర్‌కు ఇచ్చేంత డబ్బు లేనివారు సుమన్ చేత పాడించేవారు. దాంతో చిన్న సినిమాలకు సుమన్ పాడాల్సి వచ్చేది. వాటిలో పాటలు ఎంత బాగా ఉన్నా ప్రచారం పొందేవి కావు. సుమన్‌కు 1958లో పెళ్లి అయ్యింది. ఆమె నేరుగా సంగీత దర్శకులతో, నిర్మాతలతో మాట్లాడేది కాదు. భర్త అవన్నీ చూసేవాడు. దాని వల్ల కూడా ఆమెకు సంగీత ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో తెలియలేదు. కొన్నిసార్లు ఆమె బాగా పాడిన పాటలు సినిమాల్లో తొలగించబడేవి. లేదా అవే పాటలు మరొకరి గొంతులో వినిపించేవి. చాలా సున్నిత స్వభావం ఉన్న సుమన్ ఇదంతా నాకు అవసరమా అనుకుంది. కాని అభిమానులు మాత్రం ఆమె గొంతు అవసరమే అనుకున్నారు. షరాబీ షరాబీ ఏ సావన్ కా మౌసమ్ ఖుదాకీ కసమ్ ఖూబ్సూరత్ న హోతా... (నూర్ జహాన్) సుమన్‌కు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు డాక్టరు. అందరూ ముంబై లోఖండ్ వాలాలోని ఒకే అపార్ట్మెంట్లో వేరు వేరు ఫ్లాట్లలో ఉంటారు. మొన్న బుధవారం ఆ బిల్డింగ్‌లో షార్ట్ సర్క్యూట్ అయితే అందరినీ తీసుకుని ఆమె రోడ్డు మీద గడపాల్సి వచ్చింది. కాని అదే రోజు ఆమెకు పద్మభూషణ్ ప్రకటన అందింది. జనవరి 28 ఆమె పుట్టినరోజు. ఇది ఒక అందమైన పుట్టినరోజు కానుక. సుమన్ ఎంతో ప్రతిభావంతురాలు. ఎన్ని వందల పాటలో పాడి ఉండాలి. కాని ఆమె గొంతు మీద నీడ కదలాడుతూనే ఉండిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా వెలుతురు. కాని తీరం చేరిపోయాక పడవకు దొరికిన ఓదార్పు. ‘మమత’ (1966)లో ఈ పాటను లతా పాడింది. చాలా ఫేమస్. కాని ఇదే పాటను రఫీతో (లతా పాడదు కనుక) సుమన్ కల్యాణ్‌పూర్ డ్యూయెట్గా పాడింది. లతా ఎంత మార్దవంగా పాడిందో సుమన్ కూడా. వినండి. ఈ పాట ఆ సిగ్గరి గొంతుకు బంగారు తొడుగు. రహేనా రహే హమ్ మెహ్కా కరేంగే బన్కే కలి బన్ కే సబా బాగ్ ఏ వఫా మే.... చదవండి: శెభాష్.. ఒకేసారి ఇద్దరు మహిళా డీజీపీలు -
అనుకోకుండా యాక్టర్ అయ్యా.. అతనే నా గాడ్ ఫాదర్: సుమన్
కిరణ్‌రాజ్, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నువ్వే నా ప్రాణం'. ఈ సినిమాలో సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ కృష్ణ ఫిల్మ్స్ బ్యానర్‌పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. భానుచందర్ మాట్లాడుతూ... 'సివిల్ ఇంజనీర్‌కి మూవీ డైరెక్షన్‌కి ఎక్కడా కూడా కనెక్షన్ అనేది లేదు. కానీ మొదటి నుంచి కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశారు ఆయన. సెట్స్‌లో కూడా ఎన్ని పనులు ఉన్నా చాలా బాగా పనిచేసేవారు. ఇటువంటి చిత్రాలను అందరూ ఆదరించి మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ... 'సడెన్‌గా నేను యాక్టర్ అయ్యా. ఇన్నేళ్ల నా సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించా. నాకు మొదటిసారి అవకాశాన్ని ఇచ్చిన నా గాడ్ ఫాదర్ రామన్నకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే తర్వాత నా గాడ్ బ్రదర్ భానుచందర్ అని చెప్పాలి. ఆయన నాకు తెలుగు రాకపోయినా ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను కన్నడ చిత్రాల్లోనే కాక తెలుగు సినిమాల్లో నటించేలా చేశారు. నేను భానుచందర్ మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టులం. అందువల్ల ఎక్కువ దగ్గరయ్యాం. ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నాం. హీరో, హీరోయిన్లు ఈ చిత్రంలో బాగా నటించారు. అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
డబ్బులు ఉంటే అలాంటి పాత్రలు రావు..దేవుడి పర్మిషన్ ఉండాలి: సుమన్
డబ్బులు, పలుకుబడి ఉంటే ఆధ్యాత్మికమైన పాత్రలు రావు..అలాంటి పాత్రలు చేయాలంటే పై నుంచి ఆ దేవుడి పర్మిషన్ కావాలి. అన్నమయ్య సమయంలోనూ నా పాత్ర కోసం చాలా మందిని అడిగారు. కానీ ఆ వెంకటేశ్వరుడి స్వామి నన్ను మాత్రం కావాలని అనుకున్నాడు. అందుకే ఆ పాత్ర నాకు వచ్చింది’అని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. సుదర్శనం ప్రొడక్షన్స్ లో లయన్ డా. సాయివెంకట్ స్వీయ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ ’. సాయిప్రసన్న ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుమన్ మాట్లాడుతూ.. సాయి వెంకట్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి బంధం ఉంది. రామానుజం పాత్రను పోషిస్తున్నట్టుగా చెప్పారు. ఎలా ఉంటుందో అని అనుకున్నాను. అయితే ఫస్ట్ లుక్ చూసిన తరువాత నాకు కాన్ఫిడెంట్ అనిపించింది. కారెక్టర్‌కి గెటప్ బాగా సూట్ అయితే సినిమా బాగా వస్తుంది. రామానుజం పాత్రకు సాయి వెంకట్ గెటప్ బాగా సెట్ అయింది. ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. దర్శక నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు బాహుబలి, బింబిసార రేంజ్లో వీఎఫ్ఎక్స్ ఉంటుంది. చిన్న వాళ్లు సినిమా తీస్తే ఎవ్వరూ అంచనాలు పెట్టుకోరు. మనల్ని మనమే నిరూపించుకోవాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. మాలాంటి వారు తీసిన చిన్న సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టం. ఈ సినిమాను టెక్నికల్‌పరంగా, బిజినెస్ పరంగా తీశాను. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం’ అన్నారు. ‘జయహో రామానుజ సినిమా చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’అని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి అన్నారు. ‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’అని తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ అన్నారు. ‘ఇలాంటి గొప్ప చిత్రాన్ని తీసిన సాయి వెంకట్‌కు మా కృతజ్ఞతలు' అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ జో శర్మ, సింగర్, నిర్మాత సాయి ప్రసన్న , బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఐక్యూ’టీమ్‌తో మరో చిత్రం
కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్పి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం2 చిత్రం అనౌన్స్మెంట్ నేడు ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. పోలూరి ఘటికాచలం కథ మాటలు అందించారు. ఈ బ్యానర్లో ఐక్యూ మొదటి చిత్రం పూర్తయి ఫస్ట్ కాపీ రావడంతో పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ... ‘ఐక్యూ’ చిత్రంలో ఉన్నవారినే ఈ చిత్రంలో తీసుకున్నాం. మెడికల్ కాన్సెప్ట్ మీద వస్తున్న చిత్రమిది. ‘ఐక్యూ’లాగే ఈ చిత్రాన్ని కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఈ నెల 19న ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది’ అన్నారు. ‘ఐక్యూ’ చిత్రం మొదటి కాపీ రావడం.. ఆదే బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2 కూడా అనౌన్స్మెంట్ చేయడం ఆనందంగా ఉంది’అని దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్ అన్నారు. ఈ చిత్రంలో నేను పోలీసు అధికారి పాత్ర పోషించాను. సినిమాను చాలా ఫాస్ట్‌గా పూర్తి చేశారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని హీరో సుమన్ అన్నారు. సుమన్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని హీరో భూషన్ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ అంకిత, బాబా, ల్లవి, పద్మిని, ప్రమోదిని, ట్రాన్సీ, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ నటుడు సుమన్‌కు అరుదైన పురస్కారం
సీనియర్ నటుడు సుమన్‌కు అరుదైన పురస్కారం దక్కింది. ఆయనకు కాంతారావు శత జయంతి పురస్కారం అందించనున్నట్లు ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన వెల్లడించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అగ్ర హీరోలుగా వెలుగుతున్న సమయంలోనే వారితో సమానంగా హీరోగా కాంతారావు పేరు సంపాదించారని తమ్మా రెడ్డి భరద్వాజ అన్నారు. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హీరోగా నిలదొక్కుకున్నా తర్వాత ఆయన సహాయ పాత్రల్లో నటించారని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. 'కాంతా రావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ సుందరీ సుబ్బారావులో ఆయనకు మంచి వేషం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. మరో దర్శకుడు పీసీ ఆదిత్య మాట్లాడుతూ.. 'కాంతారావు బయో పిక్ తీసేందుకు వారి స్వ గ్రామం కోదాడ మండలం గుదిబండ వెళ్లి వచ్చినట్లు వివరించారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, కాంతారావు కుమారుడు, నటుడు రాజా పాల్గొన్నారు. -
ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చాటిచెప్పేలా ‘నిన్నే చూస్తు’
కె. గోవర్ధనరావు దర్శకత్వంలో శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నిన్నే చూస్తు’. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన చిత్రం అక్టోబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సీనియర్ హీరో సుమన్ మాట్లాడుతూ.. ‘నేను చాలా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. నటి, నిర్మాత హేమలత రెడ్డి చాలా యంగ్ అండ్ డైనమిక్ లేడీ తను సుహాసిని, భానుచందర్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని సినిమాలో నటిస్తూనే నిర్మాతగా సినిమాను చాలా చక్కగా డీల్ చేసింది. ఈ సినిమాలో తన డైలాగ్స్ అన్ని సింగల్ టేక్ లో చేసుకుంటూ అటు నిర్మాతగా ఇటు యాక్టర్ గా చేస్తూ సర్కస్ లో రింగ్ మాస్టర్ లా తనే దగ్గరుండి చూసుకుంటూ షూటింగ్ సక్సెస్ చేసింది’అన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి చిన్న సినిమాలు ఇండస్ట్రీకి రావడం ఎంతో అవసరం. ఫిల్మ్ చాంబర్ ఎప్పుడూ ఆట్టి దర్శక,నిర్మాతలకు సపోర్ట్ చేస్తుంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు, ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించా’మని హీరోయిన్, నిర్మాత పోతిరెడ్డి హేమలత రెడ్డి అన్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శకుడు కె.గోవర్థన్ అన్నారు. -
యువతరం ఆలోచనలతో...
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మది’. రామ్ కిషన్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు సుమన్, నటి ఆమని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ ధనుష్ మాటాడుతూ– ‘‘యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా వినూత్నరీతిలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘నటుడు కావాలని వచ్చిన నేను.. నా ఫ్రెండ్ బాధ చూడలేక ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’ అన్నారు రామ్ కిషన్. ‘‘ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది’’ అన్నారు శ్రీరామ్. కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, దర్శకుడు జై శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: పీవీఆర్.రాజా. -
హీరోగా సుమన్ కొత్త చిత్రం ప్రారంభం
సుమన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహరాజు’. శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌పై వెంకట నరసింహ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూడా వహిస్తున్నారు వెంకట నరసింహ రాజ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు ‘అల్లుడు బంగారం’, ‘అంతేనా.. ఇంకేం కావాలి’ వంటి చిత్రాలు నిర్మించాం. సుమన్ గారితో ఒక వైవిధ్యమైన కథతో మూడో చిత్రాన్ని రూపొందించనున్నాం. వచ్చే నెల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ప్రముఖ నటీనటులతో పాటు నూతన నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: పీఆర్ చందర్ రావు, సహనిర్మాత: సి. ఈశ్వర్ రెడ్డి. -
విషమంగా హీరో సుమన్ ఆరోగ్యం?!.. క్లారిటీ ఇచ్చిన నటుడు
సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొద్ది రోజులుగా పలు యూట్యూబ్ చానళ్లో వీడియో దర్శనిమిస్తున్నాయి. ఇక పలు ఉత్తరాది యూట్యూబ్ చానల్స్ అయితే ఏకంగా ఆయన ఇకలేరంటూ వీడియోలతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. అదేంటి ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడం ఏంటని, ఇది నిజమా? కాదా? అంటూ తెలుగు రాష్ట్రాల అభిమానులంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్ ఈ వార్తలపై స్పందించారు. చదవండి: వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి తాను పూర్తి ఆరోగ్యం ఉన్నానని, తన గురించి, తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తమిళ మీడియా ద్వారా ఆయన ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల వస్తున్న పూకార్లపై ఆయన మండిపడ్డారు. ‘నేను పూర్తి ఆరోగ్యం ఉన్నా. సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం బెంగళూరులో నా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో నా ఆరోగ్యంపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నా సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. అందుకే ఇలా నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది’ అని సుమన్ అన్నారు. చదవండి: హీరోయిన్ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు! అనంతరం తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన సదరు యూట్యూబ్ చానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ సుమన్ ధ్వజమెత్తారు. కాగా నాలుగు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగు, తమిళంలో హీరోగా, సహానటుడిగా ఎన్నో సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన మలయాళం, కన్నడలో సైతం పలు చిత్రాల్లో నటించారు. తన సినీ కెరీర్లో సుమన్ దాదాపు 150పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఐక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించనున్నారు. -
హీరో సుమన్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
ఓ వైపు యాక్షన్ హీరోగా దూసుకుపోతూనే కుటుంబ కథాచిత్రాల్లో నటించారు హీరో సుమన్. 1959, ఆగస్టు 28న చెన్నైలో జన్మించిన సుమన్ కోలీవుడ్ లో నీచల్ కులం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ‘తరంగిణి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరో ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.మార్షల్ ఆర్ట్స్ హీరోగా సుమన్ చేసిన యాక్షన్ సినిమాలకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా టాలీవుడ్ అందగాడిగా సుమన్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉండేది. ఇక సుమన్ కెరీర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భక్తి సినిమాల గురించి. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో అన్నమయ్య ఒకటి. సినిమాలో వెంకటేశ్వరస్వామిగా కనిపించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు సుమన్. అంతేకాదు అప్పట్లో ఈ సినిమాను అప్పటి రాష్ట్రపతితో కలిసి రాష్ట్రపతి భవన్లో వీక్షించడం అనేది సుమన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు అని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారాయన. శ్రీరామదాసు, ‘దేవుళ్లు’ వంటి సినిమాల్లో దేవుడి పాత్రలో ఒదిగిపోయారాయన. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ సినిమాలో విలన్‌గా నటించి తన విశ్వరూపాన్ని చూపారు. తెలుగులో సుమారు వందకి పైగా చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సుమన్ కెరీర్ టాప్‌లో ఉండగానే శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈమె టాలీవుడ్ లెజెండరీ రైటర్ డి.వి.నరసరాజు మనవరాలు. అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కున్న సుమన్ అనంతరం దాన్నుంచి బయటికొచ్చాక డి.వి.నరసరాజు సుమన్‌ను పిలిచి మరీ తన మనువరాలికి ఇచ్చి పెళ్లి జరిపించడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. సుమన్ నిజంగా తప్పు చేసి ఉంటే అంత పెద్ద లెజెండరీ రైటర్ పిలిచి మరీ సంబంధం కలుపుకోడు కదా అంటూ ఇండస్ట్రీలో చర్చ నడిచింది. ఇక కేసు నుంచి బయటపడిన తర్వాత పడిలేచిన కెరటంలా సుమన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, అబ్బాయిగారి పెళ్లి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ముక్కున వేలేసుకునేలా తన నటనతో సమాధానమిచ్చారు. -
దసరా కానుకగా వస్తున్న ‘ఐక్యూ'
సాయిచరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ జీఎల్‌బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్న ఈ సినిమా దసరాకి విడుదల కానుంది. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం నటుడు సత్యప్రకాశ్గారిపై ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. ఈ 25తో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు జీఎల్బీ శ్రీనివాస్. ‘‘ఈ చిత్రంలో మా అన్న కొడుకు సాయిచరణ్ హీరోగా నటిస్తున్నాడు’’ అన్నారు కాయగూరల లక్ష్మీపతి. ‘‘మా తొలి చిత్రం ‘ఐక్యూ’ని ఆదరించి, మరిన్ని సినిమాలు చేయడానికి మాకు ఎనర్జీ ఇవ్వాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అన్నారు సాయిచరణ్. సుమన్, సత్యప్రకాశ్, పల్లవి మాట్లాడారు. ఈ చిత్రానికి కథ–మాటలు–సంగీతం: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి. సురేందర్‌రెడ్డి. -
రాయలసీమ నేపథ్యంలో...
సుమన్, అక్సా ఖాన్, శ్రీను ముఖ్య తారలుగా మను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిద్ధన్న గట్టు’. ఎన్. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రవరం జేబీ, మధు, మహేష్ , మెహబూబ్, మీనాక్షీ రెడ్డి, వెంకట్రాముడు, చిన్న నరసింహులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సుమన్ మాట్లాడుతూ – ‘‘రాయలసీమ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నా ఏజ్, ఇమేజ్‌కి తగ్గట్టు ఈ చిత్రంలో నా పాత్రను మలిచారు’’ అన్నారు. ‘‘పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించాం’’ అన్నారు మను. ‘‘కథ నచ్చి సినిమా నిర్మించాం’’ అన్నారు నేశినేని శ్రీనివాస్ రెడ్డి. -
షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు ఫిలిం చాంబర్ సోమవారం(ఆగస్ట్ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రొడ్యుసర్స్ గిల్డ్ కూడ అంగీకారం చెప్పడంతో నేటి నుంచి షూటింగ్‌లు నిలిచిపోయాయి. తాజాగా షూటింగ్‌ల బంద్‌పై సీనియర్ నటుడు సమమన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదన్నారు. దీనివల్ల ఓటీటీకి ఏమౌతుందని, ఏం కాదంటూ వ్యాఖ్యానించారు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ ‘ఇండస్ట్రీలోని సమస్యలను చర్చించుకోవడానికి షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవలానడం సబబు కాదు. క్రేజ్ ఉన్నప్పుడే హీరోలకు రెమ్యునరేషన్ ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే డిమాండ్ అండ్ సప్లై’ అన్నారు. అనంతరం షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలని నిర్మాతలకు సూచించారు. ‘షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలి. రెండు రోజుల చేసే వర్క్‌ని ఒక రోజులో చేయండి. అవసరం మేరకే కాల్షీట్ తీసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ కాల్షీట్ తీసుకోవాలి. వర్క్ ఫాస్ట్‌గా చేయాలి. అంతేకాని రేట్స్ తగ్గించకోండి. రెమ్యునరేషన్ తగ్గించుకోండనడం కరెక్ట్ కాదు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై వారు మాకు క్లోజ్ అని, మా ఫ్యామిలీ అంటూ కొందరు చెప్పుకుంటుంటారు. అలాంటి వాళ్లు వెళ్లి మాట్లాడండి. దీంట్లో రిలేషన్ షిప్ అనేది ఏం ఉండదు. డబ్బు ఇస్తున్నారు కదా తొందరగా రావాలని గట్టిగా చెప్పండి. మేనేజర్లు అక్కడ పెట్టడం కాదు. ఇవన్ని స్వయంగా నిర్మాతే చూసుకోవాలి. మా టైంలో అవుట్ డోర్ షూటింగ్ అంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసే వాళ్లం. అదే ఇప్పడు 9 గంటలకు వస్తున్నారు. 6 గంటలకే ప్యాకప్ చెప్పేస్తున్నారు. ఇలా అయితే ఖర్చు పెరగదా. ఒకప్పుడ. లేట్ అయితే అడగాలి. వర్క్ షాప్ చేయాలి. ఒకప్పుడ భయ్యర్ సినిమా కోనేవాడు. సినిమ ఫ్లాప్ అయితే అతడిని ఎవరు పట్టించుకోరు. రెట్స్ తగ్గించుకోమ్మంటున్నారు. మరి భయ్యర్ పరిస్థితేంటి?’ అని ఆయన ప్రశ్నించారు. -
ఘనంగా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్.. సుమన్‌కు జీవనసాఫల్య పురస్కారం
కోడిరామకృష్ణ.. ఆయన ఒక లెజండరీ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులను స్వీకరించారు. లెజండరీ దర్శకుడు కోడిరామకృష్ణ జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ అండ్ వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్, బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను అందజేశారు. హీరో సుమన్‌కు కోడిరామకృష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. 'నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను' అని అన్నారు నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. 'మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు. అయితే అయన లేకున్నా ఆయనతో ఏ విధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు ప్రేక్షకులకు తెలియజేయాలని అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తున్న రామ సత్యనారాయణ గ్రేట్' అని పేర్కొన్నారు. నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా ఉన్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా పరిచయమయ్యాను. మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చిదిద్దారు. యం.యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ' అని తెలిపారు. -
రాజకీయాల్లోకి రావడంలేదు.. వారికే ప్రజలు ఓట్లు వేస్తారు: సుమన్
విజయవాడరూరల్: ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తోందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. ఆల్ ఇండియా సుమన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ధూళిపాళ్ళ దేవేంద్రరావు ఇంటి వద్ద జరిగిన ఒక కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన సందర్భంలో చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తామని చెప్పారన్నారు. పి.నైనవరంలో మాట్లాడుతున్న సినీ నటుడు సుమన్ బుల్లితెరపై వస్తున్న సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో సెక్స్ వయొలెన్స్ ఎక్కువగా ఉంటోందని, చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లలో వాటిని చూసి ఆ ప్రభావానికి లోనవుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బుల్లితెర సినిమాలకు, పెద్ద సినిమాలకు సెన్సార్‌బోర్డు నిబంధనలు ఒకేలా ఉంటే బాగుంటుందన్నారు. షార్ట్ ఫిలింస్ సత్తా చాటుతున్నాయని, నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారన్నారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తాను ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడంలేదని తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను చూసేవారికే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించలేరన్నారు. చదవండి: (anyas tutorial trailer: అలా భయపెట్టడం ఇష్టం) -
విడుదలకు సిద్ధమైన 'మాతృదేవోభవ'.. ఎప్పుడంటే ?
Matru Devo Bhava 2022 Movie Ready To Release In July: 1993లో వచ్చిన 'మాతృదేవోభవ' సినిమా ఏ రేంజ్లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అంతా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అన్ని వర్గాల ఆడియన్స్ నీరాజనం పలికారు. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల చేత థియేటర్స్‌లోనే కన్నీళ్లు పెట్టించాయి. సంవత్సరాల తరబడి ఈ సినిమా థియేటర్స్‌లో ఆడటమే గాక ప్రతి ఒక్క ఫ్యామిలీని సినిమా హాలుకు తీసుకొచ్చింది. అయితే ఇన్నేళ్లకు మళ్లీ అదే రకమైన సెంటిమెంట్ కంటెంట్‌తో 'మాతృదేవోభవ' టైటిల్‌తో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం 'మాతృదేవోభవ'. దీనికి ఓ అమ్మ కథ అనేది ట్యాగ్ లైన్. బలమైన ఫ్యామిలీ సబ్జెక్టుతో జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. భర్త ప్రమాదంలో చనిపోవడంతో తన పిల్లలను సుధ ఏ విధంగా పెంచిందనే కథాంశంతో ఎమోషనల్ ఎలిమెంట్స్ జొప్పిస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఎంఎస్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పతాంజలి శ్రీను, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. చదవండి: ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన సెంటిమెంట్ ప్రధానంగా రాబోతున్న ఈ చిత్రానికి కెజెఎస్ రామా రెడ్డి కథ అందించగా చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మారుధూరి రాజా డైలాగ్స్ రాశారు. డైమండ్ వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేశారు. అనంత శ్రీరాం, పాండురంగ రావు, దేవేందర్ రెడ్డి లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలో సుధ, సుమన్, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి లాంటి ప్రఖ్యాత తారాగణం నటించడం విశేషం. -
ఆయన లేకపోతే నేను లేను: హీరో
Kuppili Srinivas Meelo Okadu Teaser Trailer Launch: కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మీలో ఒకడు’. హ్రితికా సింగ్, సాధనా పవన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్రలో నటించారు. చిన్ని కుప్పిలి సమర్పణలో రూపొందింది. సోమవారం శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌ను ఆధ్యాత్మిక గురు, ‘ఏపీ సాధు పరిషత్’ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసనంద స్వామి లాంచ్ చేశారు. నిర్మాత సాయి వెంకట్, వ్యాపారవేత్త ఎస్వీఆర్ నాయుడు ఈ సినిమా టీజర్‌ను, సుమన్, ఆధ్యాత్మిక గురు యద్దనపూడి దైవాదీనం, పిట్ల మనోహర్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా ఊరి సర్పంచ్ ఎస్వీఆర్ నాయుడుగారు లేకపోతే నేను లేను. మా సినిమాలో చాలా ట్విస్టులుంటాయి’’ అన్నారు. ‘‘44 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నాను. ఇన్నేళ్లుగా నాకు సహకరిస్తున్న నా నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, ఆదరిస్తున్న నా అభిమానులకు పాదాభివందనాలు’’ అని నటుడు సుమన్ అన్నారు. చదవండి:👇 అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని సీనియర్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(మే 30) దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్మరించుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు. చదవండి: అదిరిపోయిన అనన్య, విజయ్ హుక్ స్టెప్, వీడియో చూశారా? ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరిగారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారని గుర్తు చేశారు. ‘ముఖ్యంగా ఆయన బయ్యర్స్ గురించి ఆలోచించేవారు. ఒక సినిమా ప్లాప్ అయితే తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్‌ను కాపాడేవారు. కానీ ప్రస్తుత నిర్మాతలు బయ్యర్స్ గురించి ఆలోచించడం లేదు. మేకర్స్ వల్ల బయ్యర్స్ నష్టపోతున్నారు. వారి తీరుతో బయ్యర్స్ సంతోషంగా ఉండటం లేదు. కోట్టకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో బయ్యర్స్ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే నష్టపోయేది వారే. అసలు బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరు. సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలు లేదు. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్ ఉన్నారు. ఇది నేను ఆవేశంతో మాట్టాడుతున్నాను అనుకున్నా.. ఇది మాత్రం నిజం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సుమన్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. -
‘మరో రెండు సార్లు జగన్ సీఎంగా కొనసాగితే.. రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుంది’
ఆటోనగర్ (విజయవాడ తూర్పు)/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో రెండు సార్లు సీఎంగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని సినీ నటుడు సుమన్ అన్నారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఒకరే ఉండేలా ప్రజలు అవకాశం ఇస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సోమవారం విజయవాడలోని జవహర్ ఆటోనగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపు సాక్షితో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాలతో పేదల్లో చిరునవ్వును నింపిందని చెప్పారు. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. సినిమాల్లోకి వెళ్లాలని ఓ మెకానిక్ సలహా ఇవ్వడంతోనే తాను ఈ రంగానికి వచ్చానని, అందుకే మెకానిక్‌లంటే తనకు అభిమానమని తెలిపారు. ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్ కలాం తన మంచి మిత్రుడని పేర్కొన్నారు. బయ్యర్లు బాగుంటేనే.. సినిమా పరిశ్రమ బాగుండాలని ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువే చేసిందని సుమన్ అన్నారు. బయ్యర్లు బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ‘పల్లె గూటికి పండుగొచ్చింది’ ఆడియో విడుదల చేసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చేసిన దానికి తామంతా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇంకా చేయగలిగినంత చేస్తామని సీఎం చెప్పారని, ఏపీలో స్టూడియోలు స్థాపించాలని కోరారని అన్నారు. రాష్ట్రంలో మంచి షూటింగ్ స్పాట్లు ఉన్నాయని చెప్పారు. -
‘సేవాదాస్’లో నటించడం గర్వంగా ఉంది: సుమన్, భానుచందర్
సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ కీలక పాత్రలు పోషించిన బహుభాష చిత్రం 'సేవదాస్'. శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కెపీఎన్ చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా, రేఖా నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని షురూ చేసింది. తాజాగా సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్‌తో పాటు మూవీ టీమ్ అంతతా మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ‘సేవాదాస్’ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘సేవాదాస్’ చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్- భానుచందర్. ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "సేవాదాస్" సంచలన విజయం సాధించడం ఖాయమని హీరో కమ్ డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ పేర్కొన్నారు. నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-బాలు చౌహాన్ మాట్లాడుతూ... "సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల వినోద్ రైనా-రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు. -
'విజయ్ దేవరకొండలా సుమన్ కూడా మంచి నటుడవుతాడు'
నూతన నటుడు సుమన్, గరీమా చౌహాన్ హీరో హీరోయిన్లుగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సతీష్ మాట్లాడుతూ – ‘‘దిల్’ రాజుగారి కాంపౌండ్ నుంచి వచ్చాను. ఓ తండ్రి తన కూతురుపై పెంచుకున్న ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేదే ఈ చిత్రకథ. ఈ కథలో ప్రణయ్, అమృత ఘటనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాం’’ అన్నారు. ‘‘ఊరికి ఉత్తరాన’ చిత్రం తర్వాత దర్శకుడు సతీష్‌తో నిర్మాతగా నేను అసోసియేట్ అయిన చిత్రం ఇది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు యుగంధర్. ‘‘సినిమాలపై ప్రేమ ఉన్న నిర్మాత యుగంధర్‌తో ప్రతిభావంతుడైన సతీష్ మరో సినిమాను చేస్తుండటం హ్యాపీగా ఉంది. థియేటర్ ఆర్టిస్టుగా వచ్చిన విజయ్ దేవరకొండవంటి వారు ఇప్పుడు స్టార్స్ అయ్యారు. అలా సుమన్ కూడా మంచి నటుడవుతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి మామిడి హరికృష్ణ. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
సుమన్, భాను చందర్ కీలక పాత్రల్లో ‘సేవాదాస్’, రిలీజ్ ఎప్పుడంటే
శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ డైరెక్టర్ కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం ‘సేవాదాస్’. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైద్రాబాద్‌లోని ఎంబీ మాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఆదివాసీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చౌహాన్, తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరీ భూక్య భారతి, ఐ.ఎ. ఎస్., ఐ.టి.కమిషనర్ పీర్యా నాయక్, లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త రమేష్ నాయక్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సేవాదాస్ చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను.. ఆలిండియా ఆదివాసీ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్‌లు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నెల(ఫిబ్రవరి) 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో వినోద్ రైనా, ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ తదితరులు నటించారు. -
సైన్యానికి హీరో సుమన్ 117 ఎకరాల భూమి విరాళం ఇచ్చారా?
ప్రముఖ నటుడు సుమన్ భారత సైన్యానికి 117ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భూమిని విరాళంగా అందించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై సుమన్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. '117 ఎకరాల భూమిని తాను భారత సైన్యానికి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో ఉంది. వివాదం పరిష్కారం అయిన వెంటనే స్వయంగా తానే అందరికీ తెలియజేస్తాను' అంటూ అంటూ చెప్పుకొచ్చారు. -
ఓడిన కోకిల.. ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే..
విజేతల గాథలు లోకానికి తెలుస్తాయి. విజేతలు కాలేకపోయిన వారి కథ తెర వెనుక ఉండిపోతుంది. సుమన్ కల్యాణ్‌పూర్‌ను ‘పేదవాళ్ల లతా మంగేష్కర్’ అనేవారు. ఆమె అచ్చు లతా లాగే పాడేది. లతతో సరిసాటి అనేవారు అభిమానులు. ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే’ ‘ఆజ్ కల్ తెరె మేరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’... ఎన్నో పాటలు. ఆమెను ఇండస్ట్రీ దగా చేసింది. ఆమె మాత్రం హుందాగా తనకు వచ్చిన పాటే పాడింది. ఈ సున్నితమైన గాయని జీవితాన్ని ఒక తలుచుకోవాల్సిన రోజు ఇది. ‘ఆమె అంత బాగా పాడేది. మరిఎందుకు ఎక్కువ పాటలు పాడలేదు?’ అని సుమన్ కల్యాణ్‌పూర్ గురించి అభిమానులు నేటికీ అనుకుంటారు. ఎందుకు పాడలేదు? ఎందుకు ఉద్యోగంలో రాణించలేదు? ఎందుకు ఫలానా రంగంలో పైకి ఎదగలేదు? అనంటే ఆ రంగానికి సంబంధించిన ఆట సరిగా ఆడకపోవడమే కారణం. ఆడేంత మొరటుదనం లేకపోవడమే కారణం. మనం గెలవాలంటే మనం ప్రయత్నించి గెలవడం ఒక మార్గం. ప్రత్యర్థులను లేకుండా చేసి గెలవడం ఒక మార్గం. పైకి ఎదగాలంటే సినిమా పరిశ్రమలో ఇవన్నీ చేయాలి. సుమన్ కల్యాణ్‌పూర్ కేవలం పాడగలిగేదే తప్ప ఇన్ని రాజకీయాలు చేసేది కాదు. అందుకే ఆమె తక్కువ పాడింది. కాని పాడిన ప్రతిదీ ఎంత తీయగా పాడింది? గుర్తుందా నౌషాద్ సంగీతంలో ముఖేశ్‌తో పాడిన ఈ డ్యూయెట్– మేరా ప్యార్ భీ తూహై ఏ బహార్ భీ తూహై తూహీ నజరోంమే జానే తమన్నా తూహీ నజారోమే... (సాథీ) సుమన్ కల్యాణ్‌పూర్‌ది మంగళూరు. తండ్రి బ్యాంక్ ఉద్యోగి కావడంతో ముంబై వచ్చి స్థిరపడింది. చిన్న వయసులోనే పెళ్లయ్యింది. భర్త రామానంద్ కల్యాణ్‌పూర్ ఆమెను పాడనిచ్చాడు కాని ప్రతి రికార్డింగ్‌కూ తోడు వచ్చేవాడు. లతా గొంతును చూసి ఇన్‌స్పయిర్ అయ్యింది సుమన్. కాని విశేషం ఏమిటంటే ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే ఉండేది. కొన్ని పాటలు వింటే లతా ఎక్కువ మార్దవం గా పాడుతోందా సుమన్ ఎక్కువ మార్దవంగా పాడుతోందా అర్థమయ్యేది కాదు. కొన్ని రికార్డు లు రేడియోలో ప్లే చేస్తూ ఒకరి పేరు మరొకరి పేరుగా చెప్పేంతగా కన్ఫ్యూజన్ ఉండేది. ‘బ్రహ్మచారి’ లో రఫీతో ఈ డ్యూయెట్ లతా పాడింది అనుకుంటారు. కాని సుమన్ పాడింది. ఆజ్ కల్ తెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్ తుజ్ కో మాలూమ్ హై ఔర్ సబ్కో ఖబర్ హోగయి... సుమన్ కల్యాణ్‌పూర్‌ను చాలా మంది నిర్మాతలు ఇష్టపడేవారు. దానికి కారణం ఆమె ‘పూర్‌మేన్స్ లతా’ కావడమే. అంటే లతా 10 వేలు తీసుకుంటే అలాగే పాడే సుమన్ మూడు నాలుగు వేలకు పాట పూర్తి చేసేది. ‘బాత్ ఏక్ రాత్ కీ’లో హేమంత్ కుమార్‌తో ఆమె ఎంత అందమైన పాట పాడింది. నా తుమ్ హమే జానో నా హమ్ తుమే జానే మగర్ లగ్తా హై కుచ్ ఐసా మేరా హమ్దమ్ మిల్ గయా... కాని లతా మంగేష్కర్, ఆశా భోంస్లే... వీరిద్దరికీ ఉండే శక్తి ముందు ఇతర గాయనులు ఒదిగి ఉండక తప్పేది కాదు. సంగీత దర్శకులు కూడా వీరిద్దరిని కాదని సుమన్‌కు పాట ఇవ్వాలంటే జంకే వారు. నిర్మాతలు భయపడేవారు. లతా మార్కెట్ సినిమాకు ప్లస్ అయ్యేది. దానిని వదులుకోలేక సుమన్‌ను వదులుకున్నారు. అయితే ఒక సందర్భం వచ్చింది. సినిమా పాటల రాయల్టీ ఆ పాటలు రిలీజయ్యి ఎన్నాళ్లయినా గాయనీ గాయకులకు ఇవ్వాల్సిందే అని లతా వాదనకు దిగింది. రఫీ ఆమెతో విభేదించాడు. పాటకు ఒకసారి డబ్బు తీసుకున్నాక ఆ తర్వాత దాని గురించి ఆలోచించకూడదు అని అతని వాదన. ‘అయితే నీతో నేను పాడను’ అని రఫీతో పాటడం మానేసింది లత. రఫీ అప్పుడు సుమన్ కల్యాణ్‌పూర్‌తో బోలెడన్ని డ్యూయెట్లు పాడాడు. అన్నీ హిట్. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ఈ పాట– నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే కర్నా థా ఇన్కార్ మగర్ ఇక్రార్ తుమ్హీసే కర్ బైఠే... ఖయ్యాం కూడా సుమన్, రఫీలతో మంచి డ్యూయెట్లు పాడించాడు. ‘మొహబ్బద్ ఇస్కో కెహతే హై’లో ‘ఠెహరియే హోష్ మే ఆలూం’ పాట మధురాతి మధురం. ‘రాజ్‌కుమార్’లో సుమన్–రఫీల డ్యూయెట్ ‘తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ పెద్ద హిట్. కాని ఆ తర్వాత తిరిగి లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్‌కు పాటలు పోయాయి. సుమన్ పెద్దగా ఎవరినీ కలవదు. నేటికీ ఆమె ముంబైలో జీవిస్తోంది కాని చూసిన వారు తక్కువ. మాట్లాడినవారూ తక్కువే. ఎన్నో గొప్ప పాటలు పాడాల్సిన ఆమె కొద్ది తేనె చుక్కలు చిలకరించి మాయమైంది. ఆమె పాటకు పూల కానుక. షరాబీ షరాబీ ఏ సావన్ కా మౌసమ్ ఖుదాకీ కసమ్ ఖూబ్ సూరత్ న హోతా అగర్ ఇస్ మే రంగే మొహబ్బత్ న హోతా (నూర్జహాన్). మొహమ్మద్ రఫీతో సుమన్ కల్యాణ్‌పూర్ -
ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్
Hero Suman Interesting Comments On Tollywood Issue: ప్రస్తుతం టాలీవుడ్లో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల అనంతరం ఎవరూ దీని ఊసే ఎత్తలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానన్నారు. చదవండి: Ram Gopal Varma: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ!, ఆ దర్శకుడు ట్వీట్ వైరల్ కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటానంటూ చిరు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోహన్ బాబు సినీ పరిశ్రమకు బహిరంగ లేఖ రాస్తూ.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదని వేల కుటుంబాలు, జీవితాలంటూ లేఖలో పేర్కొన్నాడు. దీంతో అప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనేదానిపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ అంశపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుటు, హీరో సుమన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో సోమవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లోకి వచ్చిన 44 ఏళ్లు అవుతుంది. 10 భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించాను. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా స్వయంకృషితో ఎదిగాను. సినిమా రంగంలో ఐక్యత లేదనడం అవాస్తవం. పరిశ్రమలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్లు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వారి సలహా తీసుకోవాలి. సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల సమస్యను ప్రభుత్వం చర్చించి త్వరలో పరిష్కరించాలి’ అని ఆయన వ్యాఖ్యానించాడు. -
పేకాట కేసు: ముగిసిన సుమన్ కస్టడీ.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మంచిరేవుల పేకాట కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు సుమన్‌ను విచారించిన పోలీసులు నేడు కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా పోలీసుల విచారణంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. సుమన్‌పై క్యాసినో, పేకాట ఇతర కేసుల వివరాలపై పోలీసులు ఆరా తీశారు.. చాలా కాలంగా సుమన్ క్యాసినో, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణలో సుమన్ చౌదరిపై పలు కేసులు నమోదైనట్లు, ఎంట్రీ ఫీజు, కమీషన్ల రూపంలో లక్షల రూపాల వసూళ్లు చేసినట్లు తేలింది. సుమన్‌కు రాజకీయ నేతలు, రియల్టర్స్‌తో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని శివారు ప్రాంతాల్లోని విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు, హోటల్స్, రిసార్ట్స్ వేదికగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలింది. క్రికెట్ బెట్టింగ్‌కు సైతం పలువురు నిందితులు పాల్పడినట్టు గుర్తించారు. అయితే డ్రగ్స్ కోణంలో సైతం పోలీసులు విచారించారు. మరోసారి కూడా సుమన్ చౌదరిని పోలీస్ కస్టడికి కోరే అవకాశం ఉంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట కాగా గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. -
Sevadas: శత దినోత్సవ వేడుకలా ఉంది: మంత్రి తలసాని
సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం‘సేవాదాస్’.కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో అత్యంత కోలాహలంగా జరిగింది. బంజారా సంప్రదాయపు డప్పులు, నృత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ బానోత్, రేఖా శ్యామ్ నాయక్, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, రాములు నాయక్, రవీంద్ర నాయక్, రాథోడ్ బాబూరావులతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... ‘ఇది ఆడియో వేడుకలా లేదు. శత దినోత్సవ వేడుకలా ఉంది. ‘సేవాదాస్’ చిత్రం కచ్చితంగా 100 రోజులాడాలి. ఆ వేడుకకు కూడా ముఖ్య అతిధిగా నన్ను పిలవాలి’అన్నారు. బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా తెలుగు-ఇంగ్లీష్-హిందీ భాషల్లో తీసిన "సేవాదాస్" ఆడియో ఫంక్షన్ లో పాల్గొనడం గర్వంగా ఉంది’అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ మాట్లాడుతూ... " "సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 15న ఇల్లందులో ప్రి-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈనెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’అన్నారు. చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి భోలే షావలి సంగీతం అందించారు. -
యువతరం మెచ్చే అంశాలతో ‘మాతృదేవోభవ’
శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మాతృదేవోభవ’. 'ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ... ‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అవమానవీయ సంఘటనలకు అద్దం పడుతూ ప్రముఖ రచయిత కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. భర్తను కోల్పోయి పిల్లల కోసమే బ్రతికి, వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఓ మాతృమూర్తికి పిల్లల వల్ల ఎదురైన చేదు సంఘటనల సమాహారమే మా "మాతృదేవోభవ". సుధ గారి అభినయం, మరుదూరి రాజా సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి చాలా బాగా చేశారు. యువతరం మెచ్చే అంశాలు కూడా "మాతృదేవోభవ"లో పుష్కలంగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ చేయిస్తాం. మా నిర్మాత చోడవరపు వెంకటేశ్వరావు గారికి చక్కని శుభారంభం ఇచ్చే చిత్రమవుతుంది" అన్నారు. సూర్య, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, అపూర్వ, కీర్తి, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, సమర్పణ: ఎం.ఎస్.రెడ్డి, నిర్మాత: చోడవరపు వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.హరనాథరెడ్డి. -
MAA Elections 2021: లోకల్- నాన్లోకల్పై సుమన్ కీలక వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఎలక్షన్ డేట్ రాకముందే ఫిల్మ్ సర్కిల్ ప్రచారాలు ఊపందుకున్నాయి. తమ ప్రత్యర్థులపై ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్ నిబడుతుండడంతో లోకల్, నాన్ లోకల్ నినాదం తెరపైకి వచ్చింది. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అని కొందరు ఆరోపించడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ స్పందిస్తూ.. భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకలేనని చెప్పారు. లోకల్-నాన్‌లోకల్ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. అలాగే వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదంటూ పరోక్షంగా ప్రకాశ్ రాజ్‌కి ఆయన మద్దతు ప్రకటించారు. -
ఆదిత్యుని సన్నిధిలో సినీ నటుడు సుమన్
సాక్షి, అరసవల్లి: ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ బుధవారం అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయంలో దర్శనం చేయించారు. అనంతరం అనివేటి మండపంలో తీర్థప్రసాదాలను ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ అందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ విశాఖలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సందర్భంగా అరసవల్లి వచ్చానన్నారు. అన్నమయ్యలో వేంకటేశ్వరుడు, శ్రీరామదాసులో శ్రీరాముడు వంటి దేవుళ్ల పాత్రల్లో నటించడంతో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వివరించారు. శ్రీకూర్మనాథుని సన్నిధిలో.. గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని సినీ నటుడు సుమన్ బుధవారం దర్శించుకున్నారు. మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష్మీదేవిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకు లు చామర్తి సీతారామ నృసింహాచార్యులు క్షేత్ర మహత్యాన్ని వివరించారు. ఆలయ ఈవో ఎస్.విజయకుమార్‌స్వామి ప్రసాదాన్ని అందజేశారు. చదవండి: తలైవి చిత్రం ఓటీటీలో విడుదలవుతుందా? -
సినీ హీరోలు సీఎం కావడం కష్టమే..
సాక్షి, అమరావతి: సినిమా హీరోలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు కావడం కష్టమేనని ప్రముఖ సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం విజయవాడ వచ్చిన సుమన్ ‘సాక్షి’తో మాట్లాడారు. సినిమాల ద్వారా అన్ని వర్గాలను మెప్పించిన ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలు రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితులు.. ఇప్పుడు లేవని చెప్పారు. వారికి రాజకీయాల్లో అందరి ఆమోదం లభించిందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని రాజకీయ పార్టీ పెడితే ప్రజల ఆదరణ పొందడం అంత తేలికైన విషయం కాదన్నారు. ఎంత గొప్ప హీరో అయినా కులమతాలకు అతీతంగా ప్రేక్షకులను మెప్పించగలడు కానీ.. రాజకీయాల్లో ప్రజలను సంతృప్తి పర్చడం కష్టతరమన్నారు. రాజకీయ నేతల పట్ల ప్రజల్లో అంచనాలు పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు. ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా వారిని సంతృప్తి పర్చడం కత్తి మీద సాము వంటిదేనని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు లంచాలు ఇవ్వకుండా సేవలు పొందేలా పాలన ఉండాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించిన అరకొర సొమ్ము.. లంచాలకు పోతే వారి బతుకు కష్టంగా మారుతుందన్నారు. ఎవరి మత విశ్వాసాలు వారికి గొప్ప అని చెప్పారు. మన మతం కోసం.. ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీసే విధానాలకు తాను దూరంగా ఉంటానన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు పక్కపక్కనే వారి వారి మత విశ్వాసాల ప్రకారం దేవుడిని ప్రార్థించే గొప్ప ఆదర్శం మన దేశంలోనే ఉందని గర్వంగా చెప్పవచ్చన్నారు. మన ఆదర్శాలను భావితరాలకు పదిలంగా అందించాల్సిన అవసరముందన్నారు. కొందరు స్వార్థం కోసం అన్నదమ్ముల్లా మెలగాల్సిన ప్రజల మనస్సుల్లో కుల, మత, ప్రాంతీయ వైషమ్యాల బీజాలు నాటడం సరికాదని విజ్ఞప్తి చేశారు. -
పబ్లిక్ సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలి: సుమన్
తిరుపతి: ‘పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో జరిగి ఉంటే బావుండేది. కరోనా పరిస్థితుల్లో ప్రజలు, ఉద్యోగుల సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదు’ అని సినీనటుడు సుమన్ అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి : ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సబబేనా? సుమన్ :గత ఏడాదిలో ఎన్నికలను వాయిదా వేయడంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అధికారులు, నాయకులు ప్రజలు, ఉద్యోగుల సేఫ్టీకి ప్రాధాన్యతనివ్వాలి. సాక్షి: సినీ పరిశ్రమ కరోనా నుంచి కోలుకుందా? సుమన్: సినీ పరిశ్రమకు కరోనాతో పెద్ద దెబ్బతగిలింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. సినిమా థియేటర్లు ప్రస్తుతం 50శాతం సీటింగ్‌తో నడుస్తున్నాయి. వంద శాతంతో థియేటర్లు నడిస్తే కోలుకున్నట్టే. సాక్షి: మూడు రాజధానులపై మీ అభిప్రాయం? సుమన్: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేశారు. రాష్ట్రం విడిపోయాక కూడా అదే తప్పు పునరావృతమైంది. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిది. సాక్షి: ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం సబబేనా? సుమన్: ఇది చాలా విచారకరం. కొందరు కావాలని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై సీఎంను విమర్శించడం, ప్రభుత్వానికి అంటగట్టడం దారుణం. సాక్షి: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం? సుమన్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోని వచ్చిన అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలోని పేద మహిళలకు లక్షలాది ఇంటిపట్టాలు పంపిణీ చేయడం అద్భుతం. ప్రతి రాష్ట్రంలోని పాలకులు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. సాక్షి: రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటారు? సుమన్: ప్రజలు యంగ్ అండ్ ఎనర్జిటిక్ సీఎంను ఎన్నుకున్నారు. సాధారణ మధ్య తరగతి ప్రజలు పరిపాలన విషయంలో సంతోషంగా ఉన్నారనేది నా అభిప్రాయం. సాక్షి: తిరుపతి, తిరుమల అభివృద్ధి ఎలా ఉంది..! సుమన్: వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ప్రస్తుతం తిరుమలలో వసతులు బాగున్నాయి. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. -
సీఎంకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలే చేశాయేమో?
తిరుమల: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సినీ హీరో సుమన్ కోరారు. ఆదివారం తిరుమలలోని ఓ అతిథిగృహంలో ఆయన మాట్లాడుతూ రామతీర్థం ఘటనలో విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారో నిర్ధారణకు రాకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు. ముఖ్యమంత్రికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష నాయకులే విగ్రహాలు ధ్వంసం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నిందితులను గుర్తించడకుండా ఒకరిమీద మరొకరు నిందలు వేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారు దేవుని చేతిలో తప్పకుండా శిక్షను అనుభవిస్తారని చెప్పారు. సీసీ కెమెరాలతో ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: మంత్రి చెల్లుబోయిన రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు దైవ నిందలకు పాల్పడుతున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దైవ అపచారాల్లో కుట్రకోణముందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
2020 చాలా గుణపాఠాలు నేర్పింది: సుమన్
సాక్షి, తిరుమల: 2020 ఏడాది చాలా గుణపాఠాలు నేర్పిందని సినీ నటుడు సుమన్ అన్నారు. కరోనా వైరస్ కాలంలో పోలీసులు, డాక్టర్ల సేవలకు అభినందనలు తెలిపారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమార్తె వివాహానికి హాజరైన సుమన్.. రామతీర్థం ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న సుమన్.. ప్రతి ఆలయం వద్ద సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాటు చేయాలన్నారు. దేవుడి విషయంలో తప్పు చేస్తే శిక్ష పడక తప్పదన్నారు. ఆలయాలపై దాడులు చేయటం చాలా బాధాకరమని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెడ్డపేరు తెవడానికి ఆలయాలపై ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆలయాల వద్ద నిఘా పెంచాలని, ఆలయాలపై జరిగే దాడులు కంట్రోల్ చేయాలన్నారు. -
నవ్వులు గ్యారంటీ
‘‘సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ రామానుజం తనయుడు విశ్వకార్తికేయ హీరోగా నటించిన ‘కళాపోషకులు’ సినిమాలో నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యాను. ఈ చిత్రం ట్రైలర్ బాగుంది. సినిమా హిట్ అవుతుంది’’ అని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. విశ్వకార్తికేయ, దీపా ఉమావతి జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాపోషకులు’. యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని సుమన్ విడుదల చేశారు. ‘‘సీనియర్ దర్శకులు పీసీ రెడ్డిగారి వద్ద పని చేశాను. ‘కళాపోషకులు’ లాంటి మంచి సినిమాని బ్రతికించండి’’ అని చలపతి పువ్వల అన్నారు. ‘‘ఇది నా తొలి సినిమా. చలపతి బాగా తీశాడు’’ అన్నారు సుధాకర్ రెడ్డి. ‘‘మా సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు విశ్వకార్తికేయ. -
నువ్వు నేను ఒక్కటైతే
ఆలం సందీప్, ప్రమీల జంటగా సుమన్, కవిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు నేను ఒక్కటైతే’. బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో ఏవీ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏవీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు విభిన్నమైన కథతో మంచి సినిమాని నిర్మించాం. మంచి సందేశాత్మక చిత్రం నిర్మించామని సెన్సార్ సభ్యులు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. థియేటర్స్ ప్రారంభం కాగానే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘విభిన్న కథా కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి పూర్తి చేశాం. నేను ఏది అడిగితే అది ఇచ్చి నాకు పూర్తి సహకారం ఇచ్చారు నిర్మాత. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ చిత్రంలోని పాటలు సందర్భానికి తగ్గట్టు ఉంటాయి. త్వరలోనే మా సినిమా ట్రైలర్ విడుదల చేస్తాం’’ అని బొంతు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శూలం ప్రసాద్, సంగీతం: చిన్నికృష్ణ. -
‘స్టాలిన్’ ప్రీ రిలీజ్ వేడుక
-
అందరివాడు
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతాడు స్టాలిన్. చెడుపై అతను ఎలా పోరాటం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘స్టాలిన్’. అందరివాడు అనేది ఉపశీర్షిక. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా రియా సుమన్, గాయత్రీకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నవదీప్ విలన్ పాత్ర చేశారు. రతిన శివ దర్శకుడు. తమిళ నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌తో కలిసి తెలుగు సంస్థలు నట్టిస్ ఎంటర్టైన్మెంట్ప్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. తమిళంలో ‘సీరు’ పేరుతో రూపొందింది. రెండు భాషల్లోనూ ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిర్మాతలు డాక్టర్ ఇషారి కె. గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ– ‘‘రంగం’ తర్వాత ఆ స్థాయిలో ఉండే మాస్ సినిమా ఇది. స్టాలిన్ పాత్రను జీవా అద్భుతంగా చేశారు. విలన్ పాత్రలో నవదీప్ ఒదిగిపోయారు. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందించాం. వచ్చే నెల 2న హైదరాబాద్‌లో ఆడియో ఫంక్షన్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీ సాయి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, గురుచరణ్, సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా: ప్రసన్నకుమార్. -
నిజాలే చూపించాం
‘‘1982 మార్చి నెలలో రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఎన్టీ రామారావుగారు పెట్టిన పార్టీలో నేను చేసిన కృషి ‘బగ్గిడి గోపాల్’ చిత్రంలో చూపించాం. నా జీవితంలో జరిగిన కీలక సంఘటనలు ఈ సినిమాలో చూపిస్తాం’’ అన్నారు బగ్గిడి గోపాల్. ఆయన జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘బగ్గిడి గోపాల్’. బగ్గిడి గోపాల్ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ కథ ఆదర్శంగా ఉంటుంది. పోలీస్ అధికారిగా నటిస్తున్నాను’’ అన్నారు సుమన్. ‘‘గోపాల్ ఎంఎల్ఏ అయిన తర్వాత జరిగిన సంఘటనలు నాకు తెలుసు. ఈ సినిమాలో అన్నీ నిజాలు చూపించారు. ముక్కుసూటి మనిషి అయిన తనను చాలా ఇబ్బంది పెట్టారు. అవి ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు మాజీ ఎంఎల్ఏ సంజయ్రావు. ‘‘దర్శకత్వంతో పాటు ఓ పాత్రలోనూ నటించాను’’ అన్నారు అర్జున్ కుమార్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్ చందన మాట్లాడారు. -
నేటి ట్రెండ్‌కి తగ్గ కథ
సుమన్, కవిత ప్రధాన పాత్రల్లో, అలం సందీప్, ప్రమీల జంటగా బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఏవీ భాస్కర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏవీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ చాలా క్లారిటీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు మంచిర్యాల, కోనసీమలో రెండు షెడ్యూల్స్ చిత్రీకరించాం. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తాం. జనవరి 24న ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సుమన్, కవిత గార్లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం బాగుంది’’ అన్నారు. ‘‘విభిన్న కథ, కథనాలతో నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం’’ అన్నారు బొంతు శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: శూలం ప్రసాద్, సంగీతం: చిన్నికృష్ణ. -
అయ్యప్ప కటాక్షంతో...
సుమన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. ఎ. జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ల, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ముఖ్యపాత్రధారులు. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. నటుడు సుమన్ కెరీర్లో ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించిన వి.యస్.పి. తెన్నేటి, టి.ఎస్. బద్రీష్ రామ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా పూర్తి కావాలంటే అద్భుతాలు జరగాలంటుంటారు. అలాంటివి ఈ సినిమాకు జరిగాయి. అయ్యప్పకటాక్షం వల్లే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నామనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇరవై ఏళ్లకు పైగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి? అయ్యప్ప దీక్ష చేసేవారు నలుపు రంగు దుస్తులే ఎందుకు వేసుకోవాలి? కాషాయ రంగు వస్త్రాలు ధరించి కూడా దీక్ష చేయవచ్చా? ఎలా క్రమశిక్షణగా ఉండాలి? అనే ఇలాంటి చాలా అంశాలకు ఈ సినిమాలో వివరణలు ఇచ్చాం’’ అన్నారు వి.యస్. పి. తెన్నేటి. -
దేశంలోనే ఓ గొప్ప ముఖ్యమంత్రి వైఎస్సార్: సుమన్
సాక్షి, విజయవాడ: ఆయుధాన్ని నమ్ముకోవడం కంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శరీరాన్నే ఆయుధంగా మలుచుకోవాలని మార్షల్ ఆర్ట్స్‌కు స్ఫూర్తి, ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. ఒక్కోసారి ఆయుధం మొరాయిస్తుందని, అదే ఆయుధం ప్రత్యర్థి చేతికి చిక్కే సమస్య ఉంటుందన్నారు. ఇందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా స్వీయరక్షణకు ఎటువంటి ఢోకా ఉండదన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చన్నారు. స్థానిక దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డాక్టర్ వైఎస్సార్ స్మారక 10 జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీల్లో ప్రారంభోత్సవంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి స్మారక కరాటే పోటీల్లో పాల్గొన డం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలోనే ఓ గొప్ప ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, డ్వాక్రా అక్కా చెల్లిమ్మలకు రుణాలు ఇలా ఎన్నో ఎవరూ ఊహించని సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప మహానేత తనకు చాలా ఇష్టమన్నారు. ఆ మహానేత బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. దిశలాంటి సంఘటనలను ఎదుర్కొవడానికి మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరమని, ఇందుకు ప్రతి పాఠశాలలో కరాటే విద్యను నేర్పించాలని తాను సీఎం జగన్‌ను కోరతానని అన్నారు. తొలుత ఈ పోటీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు చేసిన మార్చ్ఫాస్ట్ వందన స్వీకారాన్ని ఉప ముఖ్యమంత్రి అందుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపీ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్, అకాడమీ వ్యవస్థాపకుడు సైదులు, పోటీల నిర్వాహకులు చిన్నపురెడ్డి, కాత్యాయని, సత్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు వేమారెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, జార్జి వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు. కలర్ బెల్ట్ కేటగిరీలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ కైవసం చేసుకుంది. బ్లూబెల్ట్ కేటగిరీలో తమిళనాడు, గ్రీన్ బెల్ట్ కేటగిరీలో కర్ణాటక, పర్పుల్ బెల్ట్ కేటగిరీలో ఏపీ క్రీడాకారులు తమ సత్తాను చాటారు. దాదాపు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చిన్నారులు కరాటే విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారులు
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజన రోగులను డోలీలలో తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని మార్చాలన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి 100 పడకలతో గర్భిణులకు హాస్టళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన శాఖలో మంజూరు చేసిన పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనపుడు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి మహిళల రక్షణకు అవసరమైన చర్యలను సీఎం వైఎస్ జగన్ చేపట్టారని, ప్రతీ గ్రామంలో ఒక మహిళా పోలీసును నియమించడం, మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయడం వీటిలో భాగమేనని పుష్ప శ్రీవాణి చెప్పారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో డాక్టర్ వైఎస్సార్ స్మారక 10వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు సుమన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పవన్ వ్యాఖ్యలపై నటుడు సుమన్ ఫైర్
సాక్షి, గుంటూరు: యావత్ దేశాన్ని కుదిపేసిన షాద్‌నగర్ దిశ అత్యాచారం, హత్య ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు సుమన్ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు. గురువారమిక్కడ సుమన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు. అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా దిశ ఘటన గురించి పవన్ మాట్లాడుతూ... ‘వైద్యురాలిపై అత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పవన్ పేర్కొన్న విషయం తెలసిందే. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై మహిళలు, మేధావులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. (దిశ కేసు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు) ఇక దిశ ఘటనపై తిరుపతితో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పక్షాలు, లాయర్లు, డాక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు దిశా ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను నాలుగు దెబ్బలు వేస్తే సరిపోతుందని చెప్పటం పవన కల్యాణ్ సిగ్గు చేటని మండిపడ్డారు. -
అయ్యప్ప ఆశీస్సులతో...
సుమన్ హీరోగా నటించిన నూరవ చిత్రం ‘వీరశాస్త్ర అయ్యప్పకటాక్షం’. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో 100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ సంయుక్తంగా నిర్మించిన భక్తిరసాత్మక చిత్రం ఇది. రచయిత వి.ఎస్.పి. తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. వి.ఎస్.ఎల్. జయకుమార్ సంగీతదర్శకుడు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. సి.కల్యాణ్, లగడపాటి శ్రీధర్, రాజ్ కందుకూరి అతిథులుగా విచ్చేశారు. ‘‘అయ్యప్ప ఆశీస్సులతోనే ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఈ చిత్రంలోని పాటలను ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో తదితరులు పాడారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు రుద్రాభట్ల వేణుగోపాల్, వి.ఎస్.పి. తెన్నేటి, టి.ఎస్. బద్రీష్ రామ్ అన్నారు. -
సుమన్ @ 100
హీరోగా సెంచరీ కొట్టారు సుమన్. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో సుమన్ హీరోగా నటించిన చిత్రం ‘వీరశాస్త్రి అయ్యప్ప కటాక్షం’. ఈ చిత్రం హీరోగా సుమన్‌కి 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించడంతో పాటు బద్రీష్ రామ్‌తో కలసి నిర్మిస్తున్నారు రచయిత, ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి తన్నేటి. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా సుమన్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హీరోగా 99 సినిమాలు చేశాక ‘అన్నమయ్య’ సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్ర చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను. ఈ చిత్రం నా 100వ సినిమా కావడం అదృష్టం. నా తొలి చిత్ర దర్శక–నిర్మాతలు రేలంగి నర్సింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ సమక్షంలో ఈ ఫంక్షన్ జరగడం సంతోషం’’ అన్నారు. ‘‘శంకర్ మహదేవన్, యస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలు మా సినిమాలో హైలెట్’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: వి.ఎస్.ఎల్. జయకుమార్. -
మూడేళ్ల కష్టం
యోగీశ్వర్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పరారి’. ‘రన్ ఫర్ ఫన్’ అనేది ఉపశీర్షిక. సాయి శివాజీ దర్శకత్వం వహించారు. అతిథి హీరోయిన్గా నటించారు. ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జీవీవీ గిరి నిర్మించారు. మహిత్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నటుడు సుమన్ విడుదల చేశారు. అతిథిగా పాల్గొన్న దర్శకుడు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ– ‘‘యోగీశ్వర్ పేరులోనే పవర్ ఉంది. ‘పరారి’ చిన్న సినిమా అనుకోవడానికి వీలు లేకుండా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం తెరకెక్కించారని తెలుస్తోంది’’ అన్నారు.‘‘చిత్ర నిర్మాత గిరి నాకు అభిమాని మాత్రమే కాదు.. నా కుటుంబ సభ్యుడు. అలాంటి అభిమాని ఉండటం నా అదృష్టం. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది’’ అన్నారు సుమన్. ‘‘ఈ కథ వెనక మూడేళ్ల కష్టం ఉంది. మహిత్గారి సంగీతం మా సినిమాకి పెద్ద సపోర్ట్‌గా నిలిచింది’’ అన్నారు సాయి శివాజీ. ‘‘నేను హీరోగా మారడానికి మా నాన్నగారే కారణం. సుమన్గారితో కలిసి నటించడం నా అదృష్టం’’ అన్నారు యోగీశ్వర్. ‘‘సుమన్‌గారు నా అభిమాన హీరో. ‘పరారి’ చూశాక నా కొడుకు యోగీశ్వర్కి అభిమానిగా మారాను’’ అని గిరి అన్నారు. ‘‘చక్రిగారు నాకు అన్నయ్యే కాదు.. గురువు కూడా. ఆయన పేరుని తీసుకొని నేను నా ప్రయాణం మొదలుపెట్టాను’’ అన్నారు మహిత్ నారాయణ్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, నటుడు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
నీవెవరు?
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓమనిషి నీవెవరు’. కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శ కత్వం వహించారు. స్వర్ణ కుమారి దొండపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాత్ర ఉందని స్వర్ణకుమారిగారు చెప్పగానే అదృష్టంగా భావించి చేశాను’’ అన్నారు. ‘‘మా నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో పరిశోధన చేసి, ఈ సినిమా తీశా’’ అన్నారు కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు. ఈ చిత్రానికి సంగీతం: ప్రభాకర్, కెమెరా: సూర్య భగవాన్ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవానీ. -
బాలు పాట హైలైట్
అమిత్, ఇందు, సుమన్, హరిత ముఖ్య తారలుగా శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చీమ–ప్రేమ.. మధ్యలో భామ’. చీమ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్‌పై లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈగ’ సినిమా మాకు స్ఫూర్తి. చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు టైటిల్ సాంగ్‌ని అద్భుతంగా ఆలపించారు. రవివర్మగారి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట పదికాలాలు అందర్నీ అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
నవ భాషల్లో నటించినా.. తెలుగే సంతృప్తి
సాక్షి,ఒంగోలు : తొమ్మిది భాషల్లో నటించినా ‘తెలుగు‘ భాషే సంతృప్తినిచ్చిందని ప్రముఖ సినీనటుడు సుమన్ పేర్కొన్నారు. ఒంగోలులో ఒక కార్యాక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుమన్ తన సినీ ప్రస్థానంపై ‘సాక్షి’తో ముచ్చటించారు. తెలుగు పరిశ్రమ అక్కున చేర్చుకుంది 40 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నా. 9 భాషల్లో నటించా. కానీ తెలుగు చిత్రసీమ ఎక్కువగా నన్ను ఆదరించింది. పాత, కొత్త నిర్మాతలు, దర్శకులతో చేసిన అనుభవం నాది. హీరో, విలన్, ఉప కథానాయకుడిగా అనేక పాత్రలు ఇచ్చి తెలుగు సినీరంగం నన్ను అక్కున చేర్చుకుంది. సెంచరీకి ‘సినిమా’ దూరంలో.. ఇప్పటికి తొమ్మిది భాషల్లో 99 సినిమాలు చేశా. ఇంకో సినిమా చేస్తే వంద సినిమాలు పూర్తవుతాయి. నా జర్నీ సంతృప్తికరంగానే సాగుతోంది. రాష్ట్ర విభజనతో నష్టం లేదు రాష్ట్ర విభజన వల్ల ఏమీ నష్టం జరగలేదు. ఇంకా మంచే జరిగింది. అయితే, విశాఖకు సినీ పరిశ్రమ తరలితే ఇంకా బాగుంటుంది. ఇప్పటికే గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలో సినిమా షూటింగ్‌లు బాగానే జరుగుతున్నాయి. చదవండి : బిగ్‌బాస్ సీజన్–4 వ్యాఖ్యాత ఎవరు? -
వందో సినిమా ఆదర్శంగా ఉండేలా తీస్తాం..
యాదగిరిగుట్ట(ఆలేరు) : నేను తెలుగులో వందవ సినిమా ప్రజలందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఉండేలా తీస్తానని సినీ హీరో సుమన్ పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో హీరోనే ఉన్నాడు ఈతరంలో.. వారిని దృష్టిలో పెట్టుకొని నూతనంగా వందో సినిమా తీసే నిర్మాత కోసం వేచి చూస్తున్నా.. వచ్చే ఏడాదిలో కచ్చితంగా వందవ సినిమా విడుదలయ్యే విధంగా ముందుకు వెళ్తున్నా.. ఇప్పటికే ఎనిమిది భాషల్లో 500 సినిమా తీశాను.. సినిమా హిట్ అయినా.. ఫట్ అయినా.. అభిమానులు ఇంకా నాతోనే ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది.. 40 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు, ఓటములు అందుకున్నానని పేర్కొన్నారు. యాదగిరిగుట్టకు వచ్చిన సినీ హీరో సుమన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఇప్పటి వరకు ఎన్ని భాషల్లో సినిమాలు తీశారు..? తమిళం, కన్నడం, తెలుగు, మళయాలం, హిందీ తదితర భాషల్లో ఇప్పటి వరకు సినిమాలు తీశాను. అన్ని భాషలు కలిపి ఎనిమిది వందల సినిమాలను తీశాను. దాదాపు 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడి ఉన్నాను. తెలుగు సినిమాలో ఇప్పటికి 99 సినిమాలు తీశాను. ఎనిమిది భాషల్లో ఎక్కువగా ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారు..? మా తల్లిదండ్రుల ఊరు కర్ణాటక.. నేను పుట్టింది కర్ణాటకలో.. నేను ఫేమస్ అయింది తెలుగులో.. చేసింది ఎనిమిది భాషలు. ఇవ్వన్ని ఎలా ఉన్నా దాదాపు 30 సంవత్సరాలు తెలంగాణాలోనే ఉన్నాను. అనుకోకుండా ఒక్కో భాష నుంచి క్లిక్ అయ్యాను. కానీ ఎక్కువగా నేను తెలంగాణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను. దాని తరువాత ఇండియాకు ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది..? రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వస్తాను. ఏ పార్టీ అని తెలియదు. నాకున్న ఎజెండా నాకు ఉంటుంది. నన్ను సినిమా ఫీల్డ్‌కు ప్రజలు తీసుకువచ్చారు. ప్రజల ఆశీర్వాదం, అభిమానుల అండదండలతో ఈ స్థాయికి వచ్చాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో ఉండి కూడా చేయవచ్చు. తెలంగాణ ఉద్యమంలో హీరో సుమన్ పాత్ర ఉందా..? తెలంగాణ వచ్చే ముందే జైతెలంగాణ అని నినదించి చెప్పాను. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యాను. ఎంతో మంది త్యాగాలు చేశారు. వారందరినీ చూసి చలించిపోయాను. దీంతో ఉద్యమంలో పలు చోట్లా పాల్గొన్నాను. కానీ ఇంత త్వరగా తెలంగాణ వస్తుందని అనుకోలేదు. ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. రాజకీయాల్లో చాలామందికి పదవులు వచ్చాయి. ఇవ్వన్నీ కేసీఆర్‌తోనే సాధ్యమైంది. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు..? రాబోయే రోజుల్లో మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాను. ప్రధానంగా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులకు, పిల్లలకు మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నా ఉద్దేశ్యం. త్వరలోనే ఫైర్ ఫైటర్ గూర్చి సినిమా తీయాలనుకుంటున్నాను. హత్య జరిగిందంటే పోలీసులు వస్తున్నారు.. అదే అగ్నిప్రమాదం జరిగితే ఆ సందర్భంలో ఫైర్ ఫైటర్ రావాలి. దీంతో పైర్ఫైటర్కు గౌరవం పెరుగుతుంది. ఇలాంటి సినిమాలు తీయడంతో యువతకు ఆదర్శంగా నిలవాలనే ధ్యేయం. సుమన్‌కు ఎక్కువగా విలన్ పాత్రలే వస్తున్నాయని అభిమానుల టాక్..? నేను విలన్‌గా ఏ సినిమాలో చేయలేదు. శివాజీ సినిమాలో చేసిన క్యారెక్టర్ టైపు వస్తే చేస్తాను. శివాజీ సినిమాలో ఉన్న హీరోటైపు ఉన్న వ్యక్తి, అలాంటి డైరెక్టర్, సినిమాలో ఉంటేనే క్యారెక్టర్ చేస్తా. హీరోకు ఎంత పేరు వస్తుందో అలాంటి పేరు విలన్‌కు వస్తేనే చేస్తాను. శివాజీ సినిమాలో రజినీ కాంత్‌కు ఎంత పేరు వచ్చిందో అంత పేరు నా పాత్రకు, నాకు వచ్చింది. ప్రస్తుతం ఏఏ భాషల్లో సినిమాలు తీస్తు బిజీగా ఉన్నారు..? తెలుగులో 6 నుంచి 7 సినిమాలు తీస్తున్నాను. నెగిటివ్ రోల్స్ కాకుండా పాజిటివ్ రోల్స్, మంచి కథతో తీస్తున్నాం. ప్రస్తుతం వృత్తిపరంగా సంతోషంగా ఉన్నాను. -
తండ్రులు చాలా గొప్పవారు
‘‘ధర్మేంద్ర, బెల్లంకొండ సురేష్ తమ కొడుకుల కోసం చాలా కష్టపడ్డారు. వాళ్లలాగా ఈరోజు గౌతంరాజు కూడా తన కొడుకుని హీరో చెయ్యాలని చేస్తున్న సంకల్పం చాలా గొప్పది. అందుకే తండ్రులు చాలా గొప్పవారు. తండ్రి రుణం తీర్చుకోవాలని కృష్ణని కోరుతున్నాను. ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ సినిమా బాగా నచ్చింది. మంచి హిట్ అవుతుంది’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’. శ్రీనాధ్ పులకరం దర్శకత్వంలో బిజెఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘నారాయణమూర్తిగారు మంచి నీళ్లలాంటి వారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. గౌతంరాజు కోసం ఇంత మంది వచ్చారు. చిన్న సినిమాల్లోనే మాకు చాలా ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. మాకు మంచి గుర్తింపు కూడా వస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అని గౌతంరాజు చెప్పగానే.. ‘ఎందుకు ఇంత రిస్క్ చేశావ్?’ అన్నాను. నా కొడుకుని హీరోగా పరిచయం చెయ్యాలనుకున్నాను.. అది నా లక్ష్యం అన్నారు’’ అని నటుడు సుమన్ అన్నారు. ‘‘సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రం కోసం నాకు చాలా మంది సహాయం చేశారు’’ అన్నారు గౌతంరాజు. ‘‘నా కెరియర్‌కి ఇది మంచి మూవీ అవుతుంది’’ అన్నారు కృష్ణ. ‘‘గౌతంరాజుగారికి కథ బాగా నచ్చి, సినిమా తీశారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్’’ అని శ్రీనాధ్ పులకురవ్ అన్నారు. -
ఆ ఘనత వైఎస్ జగన్‌దే : హీరో సుమన్
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సమన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అని సినీ హీరో సుమన్ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. తాను పుట్టిన తర్వాత ఒకే పార్టీకి (వైఎస్సార్సీపీ -151) ఇన్ని సీట్లు రావడం ఇదే తొలిసారి అన్నారు. మహిళలను గౌరవించి ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ఇచ్చిన ఘనత కూడా సీఎం వైఎస్ జగన్‌దే అని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సినిమా ఇండస్ట్రీని ఏపీకి తీసుకొచ్చి అన్నివిధాల ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తే వచ్చే ఐదేళ్లు కూడా సీఎం వైఎస్ జగన్నే అధికారంలో ఉంటారని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కారణంగానే తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. -
‘ఆస్కార్’ ఎంత పని చేసింది!
జీవితమే ఒక సినిమా అంటుంటారు. ఒక్కోసారి జీవితం కూడా సినిమాలా సాగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నేహ, సుమన్ అనే యువతుల జీవితాలు ఒక్క సినిమాతో మారిపోయాయి. మూడు నెలల క్రితం సెలబ్రిటీ స్టేటస్ అనుభవించిన ఈ ఇద్దరిని ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారు. సినీమాయాజాలం ఇదే కామోసు! ఫ్లై (ఊ y) అనే స్వచ్ఛంద సంస్థ 2017లో కాథిఖేరా గ్రామంలో శానిటరీ ప్యాడ్ తయారీ యూనిట్ పెట్టింది. వీటి గురించి ఏమాత్రం అవగాహన లేని గ్రామస్తులు శానిటరీ ప్యాడ్స్ తయారీని వింతగా చూశారు. 28 ఏళ్ల సుమన్, 22 ఏళ్ల స్నేహ ధైర్యంగా ముందడుగు వేశారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్యాడ్స్ తయారీకి వెళ్లేవారు. ఈ ధైర్యమే వారికి సినిమా అవకాశం తెచ్చిపెట్టింది. శానిటరీ ప్యాడ్ తయారీ యూనిట్ ఏర్పాటు, తదనంతర పరిణామాలపై 26 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీని ఇరానియన్–అమెరికన్ దర్శకురాలు రేఖ జెహతా బచ్చి తెరకెక్కించారు. ఇందులో సుమన్, స్నేహ నటించారు. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు దక్కడంతో వీరిద్దరూ అమెరికా వెళ్లి అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని ఈ ఏడాది మార్చిలో సొంతూరికి తిరిగొచ్చిన స్నేహ, సుమన్‌లకు ఘన స్వాగతం లభించింది. వారిని స్వాగతించేందుకు ఊరు మొత్తం కదిలొచ్చింది. మరుసటి రోజుకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపారు. తమ ఊరి పేరును ప్రపంచమంతా మార్మోగిపోయేలా చేశారంటూ వీరిని ఘజియాబాద్ జిల్లా హాపూర్ తాలుకాలోని కాథిఖేరా గ్రామస్తులు పొగడ్తలతో ముంచెత్తారు. కాథిఖేరా గ్రామం పేరు కూడా ప్రసార సాధనాల్లో ప్రముఖంగా కనబడింది. ఆ తర్వాత వీరిద్దరి జీవితం తలకిందులైంది. ఆర్థిక సమస్యలు చట్టుముట్టడం, ఉన్న ఉపాధి కోల్పోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ‘మేము మంచి సినిమాలో నటించాం. కానీ ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో చూసుకుంటే బాధ కలుగుతుంది. ఆస్కార్‌తో తలరాత మారుతుందని అనుకున్నాం కానీ అప్పుల్లో కూరుకుపోతామని ఊహించలేదు. ఎవరో ఒకరు మమ్మల్ని ఆదుకోవాల’ని సుమన్ దీనంగా వేడుకుంటోంది.ఏదో ఒకరోజు ఢిల్లీ పోలీసు దళంలో చేరాలని చేరాలని కలలు కన్న స్నేహ డబ్బుల్లేక కోచింగ్ క్లాసులు మానుకుంది. ‘నెలకు రూ. 2500 ఇచ్చే ఫ్లై సంస్థ నాకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఇక నుంచి పనులకు రావొద్దని సంస్థ ప్రతినిధి చెప్పారు. నాకు రావాల్సిన జీతం డబ్బుల గురించి అడిగితే ముందే లక్ష రూపాయలు ఇచ్చామని, ఇక ఇవ్వాల్సిన అవసరం లేదన్నార’ని వాపోయింది. ఆస్కార్ అవార్డు దక్కించుకున్నందుకు సుమన్, స్నేహలకు ఉత్తరప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. చెరో లక్ష రూపాయలు రివార్డుగా ఇచ్చారు. గవర్నర్ రామ్‌నాయక్ 50 వేల చొప్పున బహూకరించారు. అయితే ఈ సొమ్ము తమకే చెందుతుందని వాదిస్తూ ఫ్లై సంస్థ తమను ఇబ్బంది పెడుతోందని సుమన్ తెలిపారు.సుమన్, స్నేహ ఆరోపణల్లో వాస్తవం లేదని, చేతులారా వారి జీవితాన్ని వారే దిగజార్చుకున్నారని ఫ్లై సంస్థ వాదిస్తోంది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత వీరిద్దరూ పనిని నిర్లక్ష్యం చేశారు. రెండు నెలలుపైగా పనిలోకి రాలేదు. ఆరుగురు మనుషులతో నడిచే చిన్న యూనిట్లో ఇద్దరు పని మానేస్తే ఎంత కష్టమవుతుంది. పనిలోకి చాలాసార్లు చెప్పినా వారు వినిపించుకోలేదని సదరు సంస్థ వివరించింది. మరోవైపు రుతుక్రమంపై అవగాహన పెరగడం, శానిటరీ ప్యాడ్ లభ్యత స్థానికంగా పెరగడంతో వీరు తయారు చేసే వాటిని డిమాండ్ కూడా తగ్గింది. సుమన్, స్నేహల పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. వీరిద్దరూ ఎలా గట్టెక్కుతారో చూడాలి! – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
సమరం కథ కొత్తగా ఉంది
‘‘సమరం’ టైటిల్ చాలా బాగుంది. పోస్టర్స్ ఆసక్తిగా ఉన్నాయి. బషీర్ చెప్పిన కథ కొత్తగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయి ఇండస్ట్రీలో సాగర్ మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. సాగర్ గంధం, ప్రగ్య నయన్ జంటగా, సుమన్, వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘సమరం’. బషీర్ ఆలూరి దర్శకత్వం వహించారు. యూనివర్సల్ ఫిలిమ్స్ సమర్పణలో జననీ క్రియేషన్స్ బ్యానరుపై శ్రీనివాస్ వీరంశెట్టి, పి .లక్ష్మణాచారి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని వీవీ వినాయక్ విడుదల చేశారు. బషీర్ ఆలూరి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన ఒక ఇంజినీరింగ్ అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయి... అనేది చిత్ర కథాంశం. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మాది మాచర్ల. పల్నాడు ప్రాంతం నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఓ మంచి సినిమా తీయాలన్నది నా కల. బషీర్ చెప్పిన కథ నచ్చి, ఈ సినిమా తీశాను. విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు పోకూరి లక్ష్మణా చారి. ‘‘త్వరలోనే మా చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నాం’’ అని శ్రీనివాస్ వీరంశెట్టి అన్నారు. ‘సమరం’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు సాగర్ గంధం. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.డేవిడ్, సహ నిర్మాత: ప్రగ్యానయన్. -
వైవిధ్యంగా ఓ మనిషీ...
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధానపాత్రల్లో కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ మనిషీ నీవెవరు’. గాడ్ మినిస్ట్రీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై స్వర్ణకుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను నటులు కృష్ణ విడుదల చేశారు. అనంతరం మొదటి వీడియో సాంగ్‌ను నటులు తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ రిలీజ్ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘జీసస్ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇలాంటి చిత్రాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు అనూప్ రూబెన్స్. ‘‘ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిధ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా’’ అన్నారు సుమన్. ‘‘గోపాలకృష్ణగారికి నేను వేరే కథ చెప్పాను. కానీ ఆయన ఈ కథ చెప్పి సినిమా తీయించారు. శివప్రసాద్‌గారి సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తి చేసేవాణ్ణి కాను’’ అని కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు అన్నారు. సీనియర్ దర్శకులు సాగర్, నటి కవిత, రిజ్వాన్ కులషాన్, స్క్రీన్ ప్లే రచయిత గోపాలకృష్ణ దొండపాటి, కెమెరామేన్ సూర్యభగవాన్ మోటూరి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య భగవాన్ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవాని. -
సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ‘ఓ మనిషి నీవెవరు’
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓమనిషి నీవెవరు’. గాడ్ మినీస్ర్టీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ మూర్తి రాజ్ కుమార్ నాయుడు దర్శకత్వంలో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సూపర్ స్టార్ కృష్ణ స్వగృహంలో ఆయన చేతుల మీదుగా జరిగింది. అనంతరం ప్రసాద్ ల్యాబ్ లో మొదటీ వీడియో సాంగ్ ను తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేసారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘జీసస్ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం అంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా డీవోపి నాకు బంధువు. ఆ కారణంగానే వేడుకకు తప్పక హాజరు కావాల్సి వచ్చింది. సినిమా అందరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. చక్కని సందేశాత్మక చిత్రమిది. పాటలు బాగున్నాయి’ అని అనూప్ రూబెన్స్ అన్నారు. సుమన్ మాట్లాడుతూ ‘నాకు కులం, మతం, ప్రాంతం లాంటి బేధాలు లేవు. నా దృష్టిలో అంతా ఒక్కటే. చెన్నైలో క్రిస్టిన్స్ స్కూల్ లోనే చదువుకున్నా. నా తల్లిదండ్రుపై క్రిస్టియన్స్ ప్రభావం ఉంది. అలా నేను కూడా జీసస్ ఆకర్షితుడినే. ఈ సినిమాలో పాత్ర చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిథ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నటులందరికీ ఎంతో కమిట్ మెంట్ ఉండాలి. అది ఈ సినిమా యూనిట్ లో చూసాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఏసు పాత్రకు రిజ్వాన్ బాగా సూటయ్యాడు. అన్ని పాటల్లో ఫీల్ ఉంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంద’ని అన్నారు. -
ఫ్రెష్ లవ్‌స్టోరీ
జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో మురళి రామస్మామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సుమన్ కీలక పాత్రధారి. పి.ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి సినిమా. ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సుమన్‌గారు బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్స్ కోసం 200 మందిని ఆడిషన్ చేశాం. జీపీఎస్ బాగా నటించాడు. టాకీ పార్ట్ పూర్తయింది. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరిస్తాం. జూన్ లేదా జులైలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఇదో ట్రెండీ లవ్ స్టోరీ’’ అన్నారు రామకృష్ణ. ‘‘కథ చెప్పినప్పుడు ఇది సినిమానా లేక జీవితమా అనిపించింది. సుమన్గారితో నటించడం హ్యాపీ’’ అని జీపీఎస్ అన్నారు. -
ఎవరో చూస్తుంటారు
రాత్రి పది దాటింది. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది ఊర్మిళ. మనోజ్ తలుపులు మూసి బోల్టు పెట్టి ఊర్మిళను గాఢంగా కౌగిలించుకుని ముద్దులు కురిపించాడు.‘‘మనోజ్! ఏంటి అంత తొందర? ఈ రాత్రి అంతా మనదే’’ గోముగా అతన్ని అల్లుకుని గుసగుసలాడింది ఊర్మిళ.‘‘తొందరే మరి! వారం దాటింది మనం కలిసి. నిన్ను తలచుకోని క్షణం లేదనుకో. కనులు మూసినా నీవాయె, కనులు తెరిచినా నీవాయె. నిద్ర పట్టడం లేదు...’’‘‘ఏం చేద్దాం? మా ఆయనకు డే డ్యూటీ. సాయంకాలం ఇంటికి వచ్చేస్తాడు. పగలు నువ్వు రావడం బాగుండదు. ఇంటికి ఎవరో ఒకరు వచ్చేస్తుంటారు. పట్టుబడితే అసలుకే మోసం మనోజ్. అర్థం చేసుకో..’’‘‘ఓకే.. ఓకే.. సుమన్గాడికి విడాకులిచ్చేయ్. తర్వాత మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా గడుపుదాం..’’ అన్నాడు మనోజ్ ఆమెను బెడ్రూమ్లోకి నడిపిస్తూ.‘‘అదంత ఈజీ కాదులే..! చూద్దాం! ఇప్పుడు సుమన్‌తో ఏం ప్రాబ్లమ్?’’‘‘ప్రాబ్లమా? వాడికి నైట్‌డ్యూటీలు ఉంటేనే మనకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. లేకపోతే నరకమే కదా?’’‘‘నరకం అనుభవిస్తేనే స్వర్గసుఖాల విలువతెలుస్తుంది’’ అని పకపక నవ్వింది ఊర్మిళ.ఇద్దరూ బెడ్ మీద వాలిపోయారు. కాసేపటికి కాలింగ్‌బెల్ మోగింది. ఉలిక్కిపడ్డాడు మనోజ్. భయపడిపోయింది ఊర్మిళ. ఇద్దరూ హడావుడిగా మంచం మీద నుంచి లేచి డ్రెస్ చేసుకోసాగారు.‘‘ఎవరు ఈ టైమ్‌లో వచ్చింది?’’ అడిగాడు మనోజ్. ‘‘ఏమో! ఎవరైనా రిలేటివ్స్ వచ్చారేమో? నువ్వు ఇక్కడే ఉండు. నేను లైట్ ఆర్పి వెళతాను’’ అంటూ ఊర్మిళ లైట్ స్విచాఫ్ చేసి, బెడ్రూమ్ తలుపులు మూసి హడావుడిగా వెళ్లి బోల్టు తీసింది.తలుపు తెరవగానే ఎదురుగా భర్త కనిపించే సరికి భయంతో వణికిపోయింది ఊర్మిళ. రేగిన జుట్టు, అస్తవ్యస్తంగా చుట్టుకున్న చీర, ముఖంలో భయం చూసి ‘‘నిద్రపోయావా?’’ వ్యంగ్యంగా అడిగాడు సుమన్.‘‘ఆ.. ఔనండీ! నిద్రపోతున్నాను. ఏంటి అప్పుడే వచ్చారు?’’ వణుకుతున్న కంఠంతో అన్నది ఊర్మిళ.‘‘ఎందుకంటే..? నువ్వు గుర్తొచ్చావు. చాలా రోజులైంది కదా.. ఆ సుఖంలేక’’‘‘చాలారోజులెక్కడా?’’‘‘ఇరవైనాలుగు గంటలే నాకు చాలా రోజులైనట్టుగా అనిపిస్తోందోయ్!.. పద..’’ అంటూ ఊర్మిళను బెడ్రూమ్లోకి లాక్కెళ్లసాగాడు సుమన్.‘‘అయ్యో! అదేంటండీ! ఎక్కడెక్కడో తిరిగొచ్చారు. డ్రెస్ మార్చుకుని, స్నానంచేయండి..ఎందుకు తొందర..?’’ నవ్వుతూ అన్నది ఊర్మిళ.‘‘స్నానం చేద్దాంలే.. ఆ తర్వాత..’’ అంటూ బెడ్రూమ్లోకి లాక్కెళ్లాడు ఊర్మిళను.స్విచ్ వేశాడు. మంచం మీద ఉన్న మనోజ్ లేచి కూర్చున్నాడు. తని ముఖం నెత్తురు చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది. తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనకుండా నిలబడ్డాడు. సుమన్ పెద్దపులిలా మనోజ్ మీద పడ్డాడు. బూతులు తిడుతూ అందినచోటల్లాతన్నసాగాడు. మనోజ్ దెబ్బలు కాచుకుంటూ ఉన్నాడు.‘‘నిన్ను చంపేస్తారా!...’’ అంటూ సుమన్ వంటగదిలోకి పోయి చాకు చేతిలోకి తీసుకున్నాడు.‘‘వద్దండీ.. ప్లీజ్..! తప్పయింది. వదిలేయండి. ఇక ముందు అతన్ని రానీయను..’’ అంటూ ఊర్మిళ సుమన్ రెండు కాళ్లూ పట్టుకుని నిలువరించింది.ఆ సమయంలో మనోజ్ పారిపోయాడు.‘‘తప్పుడు ముండా! ఏం లోటు జరిగిందే వాడిని తగులుకున్నావు? పరువు తీస్తున్నావే దరిద్రగొట్టుదానా’’ అంటూ కొట్టసాగాడు.‘‘తప్పయిందండీ.. ప్లీజ్ క్షమించండి..’’ అంటూ ఏడుస్తోంది ఊర్మిళ.‘‘ఈసారి వాడు వచ్చినట్టు తెలిసిందో? ఇద్దరినీ చంపేస్తా..’’ ఆయాసపడుతూ అన్నాడు సుమన్.∙∙ నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో పోతోంది లాంచి. సుమన్ ఊర్మిళ పక్కపక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. సుమన్ చల్లగాలి పీలుస్తూ దూరంగా కనిపిస్తున్న కొండలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.ఇంతలో ఊర్మిళ సెల్ మోగింది.‘‘హలో.. హలో..’’ అన్నది.‘‘సరిగా వినపడ్డం లేదు..’’ అంటూ లేచి డెక్ మీదకు వెళ్లింది. ‘‘హలో.. ఎక్కడున్నావు?’’ అటు నుంచి ప్రశ్నించాడు మనోజ్.‘‘లాంచీలో పోతున్నాం. ఇప్పుడు రిజర్వాయర్ మధ్యలో ఉన్నాం. ఎందుకు ఫోన్ చేశావు అనవసరంగా..?’’ విసుగ్గా అన్నది ఊర్మిళ.‘‘ఏం లేదు. గుర్తుచెయ్యడానికి చేశాలే. నాగార్జున కొండ పైకి వెళ్లిన తర్వాత మ్యూజియమ్ చూస్తారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు ఉంటుంది. రీ కన్స్ట్రక్షన్ చేసిన బౌద్ధ స్థూపాలు, అవీ ఉంటాయి. వాటిని చూస్తూ కొండ చివరకు తీసుకెళ్లు వాడిని. అటు పక్క కొండపై నిలబడితే కింద రిజర్వాయర్ కనిపిస్తూఉంటుంది. సమయం చూసి వాడిని బలంగా నెట్టెయ్. నీళ్లలో పడిపోతాడు. ఛస్తాడు బద్మాష్!... తర్వాత గట్టిగా అరుస్తూ మ్యూజియమ్ వైపు వెళ్లు..’’మనోజ్ చెబుతుంటే.. ‘‘సరేనే, మల్లికా.. ఉంటాను’’ అంటూ వచ్చేసింది సుమన్ దగ్గరకు.‘‘ఎవరు?’’ అనుమానంగా చూస్తూ అడిగాడు సుమన్.‘‘మా ఫ్రెండ్ మల్లిక..’’ అన్నది నవ్వుతూ.సుమన్ ఆమె చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని చూశాడు. స్క్రీన్ మీద అంతకు ముందు మాట్లాడిన నంబర్, మల్లిక అనే పేరు కనిపించాయి. మనోజ్ నంబర్‌ను మల్లిక అని సేవ్ చేసుకుంది ఊర్మిళ తెలివిగా.లాంచి నాగార్జున కొండకు ఆనుకుని ఆగింది. ఒక్కొక్కరే దిగారు. లాంచి కెప్టెన్ అనౌన్స్ చేశాడు వెళ్తున్న వారిని ఉద్దేశించి..‘‘ఇప్పుడు పదిన్నరైంది. ఒంటిగంటకు లాంచి రిటర్న్ అవుతుంది. అప్పటికి లాంచి దగ్గరకు మీరంతా చేరుకోవాలి. మిస్సయ్యారంటే మళ్లీ సాయంకాలం నాలుగింటి వరకు వేరే లాంచి వచ్చి రిటర్న్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.’’ టూరిస్టులంతా మ్యూజియంలోకి ప్రవేశించారు. రెండువేల సంవత్సరాల కిందటి శిల్పాలు, బౌద్ధ సంస్కృతి, నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందినవి చూస్తూ గడుపుతున్నారు.‘‘రెండువేల సంవత్సరాల కిందట ఇక్కడ ఇక్ష్వాకులు రాజ్యం ఏలారు. నాగార్జునుడు యూనివర్సిటీ నడిపాడు. చైనా, జపాన్, టిబెట్, శ్రీలంక వంటి పదమూడు ఆసియా దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్య నేర్చుకుని వెళ్లేవారు.యుద్ధాల వల్లనో, కృష్ణానది వరదల వల్లనో విజయపురి నగరం కాలగర్భంలో కలిసిపోయింది. పురావస్తు శాఖ 1926 లో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించడంవల్లయూనివర్సిటీ ప్రాంతం మునిగిపోయింది. శిల్పాలు, బౌద్ధారామాలు వగరైనా ఈ కొండ మీద మ్యూజియమ్‌లో ఉంచారు.’’గైడ్ చెబుతున్నది శ్రద్ధగా వింటూ కదులుతున్నారు. గంట తర్వాత టూరిస్టులు మ్యూజియం బయటకు వచ్చారు. ‘‘ఏమండీ మనం బౌద్ధ స్థూపాలు చూద్దాం. కొండ మీద అన్నీ రీ కన్స్ట్రక్షన్ చేశారట..’’ అన్నది ఊర్మిళ ఉత్సాహంగా.‘‘సరే.. పద..’’ అన్నాడు సుమన్.ఇద్దరూ కలసి బౌద్ధ స్థూపాలు చూస్తూ కొండ చివర ఒడ్డుకు చేరుకున్నారు. కొండ కింద సముద్రంలా కనిపిస్తోంది రిజర్వాయర్. కనుచూపు మేర అంతా నీరే.‘‘ఎంత బాగుందో ఈ సీన్. సముద్రం ఒడ్డున నిల్చున్నట్టు ఉంది..’’ అన్నది ఊర్మిళ పరవశించిపోతూ.‘‘ఊ..’’ అంటున్నాడు సుమన్.ఊర్మిళ అటూ ఇటూ చూస్తోంది. కొన్ని క్షణాల్లో సమయం చూసి సుమన్‌ని కొండ పైనుంచి తోసెయ్యడమే తరువాయి. ఊర్మిళ కబుర్లు చెబుతూ సమయం కోసం చూస్తున్నది. రెండు చేతులూ ముందుకు చాచి సుమన్‌ని నెట్టబోయింది.ఇంతలో ఒక యువకుడు పొదలమాటు నుంచి హఠాత్తుగా వచ్చి ఊర్మిళను బలంగా నెట్టాడు. ఊర్మిళ బొమ్మలా గాలిలో ఊగుతూ రిజర్వాయర్‌లోకి పడిపోయింది.‘‘వెల్డన్ శేఖర్..’’ అన్నాడు సుమన్ తమ్ముడిని అభినందిస్తూ.‘‘అన్నయ్యా! నిన్ను మర్డర్ చేయాలనే నాగార్జునకొండ ట్రిప్వేసింది. మనం అలెర్ట్‌గా ఉండబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఈపాటికి నీళ్లలో కొట్టుకుపోతూ ఉండేవాడివి’’ అన్నాడు శేఖర్.తర్వాత సుమన్ పరుగెత్తుతూ అరవసాగాడు..‘‘నా వైఫ్ కొండపై నుంచి జారి నీళ్లలో పడిపోయింది.. ప్లీజ్ హెల్ప్..’’ కాసేపటికి జనం గుమిగూడారు అక్కడ. సుమన్ ఏం జరిగిందో చెబుతున్నాడు. గజ ఈతగాళ్లు నీళ్లలోకి దిగారు. ఊర్మిళను లాక్కువచ్చారు. అప్పటికే ఆమె ప్రాణం వదిలింది. ‘‘నాగార్జున కొండ చూడడానికి వెళ్లిన టూరిస్ట్ ఊర్మిళ ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి రిజర్వాయర్‌లో పడిపోయింది. గజ ఈతగాళ్లు రక్షించడానికి ప్రయత్నించారు గాని, కాపాడలేకపోయారు. ఊర్మిళ మరణించింది. ఆమె భర్త భార్య మరణాన్ని తట్టుకోలేక విలపించడం టూరిస్టులందరినీ కలచివేసింది.’’వార్త అన్ని న్యూస్పేపర్లలోనూ వచ్చింది. సుమన్, శేఖర్ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు.తాము ఎత్తుకు పైఎత్తు వేసి ఊర్మిళను మట్టుబెట్టారు. లేకపోతే ఊర్మిళ ప్రియుడి సాయంతో సుమన్‌ని హత్యచేసి ఉండేది అనుకుని సంతోషించారు. ఆ రోజు ఇంటికి వచ్చిన సుమన్, తమ్ముడికి కాల్ చేశాడు.‘‘నా ఫ్రెండ్ ఫారిన్ నుంచి జానీవాకర్ తెచ్చాడు. నా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటున్నాం. నువ్వూ వచ్చి జాయిన్ అవ్వు..’’సుమన్ ఇంట్లో పార్టీ మొదలైంది. కాసేపటికి కాలింగ్‌బెల్ మోగింది. శేఖర్ వెళ్లి తలుపు తీశాడు.ఎదురుగా పోలీసు ఇన్స్పెక్టర్, కొందరు కానిస్టేబుల్స్.‘‘మిస్టర్ సుమన్ నిన్ను, నీ తమ్ముడు శేఖర్ని అరెస్టు చేస్తున్నాం..’’ సుమన్ దగ్గరకు వచ్చి చెప్పాడు ఇన్స్పెక్టర్.‘‘సార్! నన్ను, నా తమ్ముడిని అరెస్టు చేస్తున్నారా? ఎందుకు?’’ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు సుమన్.‘‘ఎందుకా? నీ భార్యను కొండపై నుంచి నీళ్లలోకి తోసి చంపినందుకు..’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘నో.. ఊర్మిళ కాలుజారి పడింది..’’ గట్టిగా అన్నాడు సుమన్.‘‘సరే! ఇది చూడు..’’ అంటూ సెల్ఫోన్లో వీడియో చూపించాడు.శేఖర్ వేగంగా వెళ్లి ఊర్మిళను నెట్టేయడం, అన్నదమ్ములిద్దరూ షేక్హేండ్ ఇచ్చుకుంటూ పగలబడి నవ్వడం కనిపించింది.సుమన్, శేఖర్ బిత్తరపోయారు. భయంతో గడగడ వణికిపోయారు. తాము చేసిన పని ఎవరు షూట్‌చేసి పోలీసులకు పంపారో అర్థంకాలేదు.‘‘మిస్టర్ సుమన్! నేరం చేసేవాడు తమను ఎవరూ చూడటం లేదనుకుంటారు. కాని ఎవరో చూస్తుంటారు. ఒక టూరిస్ట్ మీరు చేసిన ఘాతుకం వీడియో షూట్ చేసి మాకు పంపబట్టి మీరు దొరికిపోయారు. తెలుసుకోండి.. నేరందాగదు..’’ చెప్పాడు ఇన్స్పెక్టర్.పోలీసు కానిస్టేబుల్స్ అన్నదమ్ములిద్దరికీ బేడీలు వేసి వ్యాన్ ఎక్కించారు. - వాణిశ్రీ -
శిక్ష తప్పదు
ఇరుకళల పరమేశ్వరి ప్రొడక్షన్ పతాకంపై నెట్రంబాక హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో న్. హరిత ప్రియా రెడ్డి నిర్మించిన చిత్రం ‘సిబిఐ వర్సెస్ లవర్స్’. వంశీ, జైన్ నాని, దివ్య, శ్రావణి నిక్కి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రంలో సుమన్ , సత్య ప్రకాష్ కీలక పాత్రలు చేశారు. ఘన శ్యామ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సుమన్ ఆవిష్కరించి, సత్య ప్రకాష్‌కు ఇచ్చారు. ‘‘థియేటర్స్ విషయంలో చిన్న చిత్రాలకు ప్రభుత్వం అండగా నిలిస్తే మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సుమన్. ‘‘తొందరపాటు నిర్ణయాల వల్ల విద్యార్థులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనే కథతో నిర్మించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం. నెక్ట్స్ ‘బ్రహ్మముహూర్తం’ పేరుతో సినిమా నిర్మించబోతున్నాం’’ అన్నారు హరిత ప్రియారెడ్డి. ‘‘తప్పు చేసినవారికి శిక్ష తప్పదనే సందేశం ఇస్తున్నాం’’ అన్నారు హరి ప్రసాద్‌రెడ్డి. -
నీవు ఎవరు..?
రిజ్వాస్ కలసిస్ ప్రధాన పాత్రలో కృష్ణమూర్తి రాజ్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఓ మనిషి నీవు ఎవరు..?’. సుమన్, చలపతిరావు, జూనియర్ రేలంగి, బి.హెచ్.ఇ.ఎల్ ప్రసాద్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. స్వర్ణ కుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. కె. దుర్గా భవాని సహ నిర్మాత. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. ప్రస్తుతం విజయవాడలో చిత్రీకరణ జరుగుతోంది. ‘‘తొలి షెడ్యూల్లో కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించాం’’ అన్నారు దర్శకుడు. ‘‘అవుట్‌పుట్ బాగా వస్తుంది. సంతోషంగా ఉంది. త్వరలో ఆడియో వేడుకను, గుడ్ ఫ్రైడే రోజున సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు నిర్మాత. -
ఈ డాన్ ప్రత్యేకం
అక్రమ్ సురేష్ హీరోగా, ఢిల్లీ బ్యూటీ ఖుషీ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘అక్రమ్’. సురేష్ మేడిది దర్శకత్వంలో అమరావతి మూవీస్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ మాస్ యాక్షన్ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. అక్రమ్ సురేష్ పుట్టినరోజు సందర్భంగా ‘రాణా’ పాత్ర లుక్‌ని నటుడు సుమన్ లాంచ్ చేశారు. సురేష్ మేడిది మాట్లాడుతూ– ‘‘డాన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో రాక్, రాణా, అక్రమ్, రాణా ప్రతాప్‌సింగ్ అనే నాలుగు పాత్రల్లో హీరో కనిపిస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అందరికీ నచ్చే చిత్రమిది. మోస్ట్ స్టైలిష్ యాక్షన్ సినిమా. డాన్ల సినిమాల్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. భారీ సెట్లో చిత్రీకరించిన ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్. ఓ షెడ్యూల్, 2 పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో రాక్ లుక్‌ని, ఉగాదికి టీజర్‌ని రిలీజ్ చేస్తాం. సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటిగారు అక్కినేనికి ‘నటసామ్రాట్’ బిరుదును ఇచ్చారు. ఈ చిత్రంలో అక్రమ్ సురేష్ గెటప్ చూసి ‘టాలీవుడ్ తలైవా’ అనే బిరుదును ఇచ్చారు’’ అన్నారు. చిత్ర సమర్పకుడు విస్సా కోటి, శివకుమార్ పాల్గొన్నారు. పోసాని కృష్ణమురళి, సుమన్, లిపికా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.యు.సాయి, కెమెరా: అనీల్. -
ఫుల్ ప్యాకేజీ
‘‘దుర్మార్గుడు’ చిత్రంలో శ్రావణ భార్గవి పాడిన ప్రోమో సాంగ్ హార్ట్ టచింగ్‌గా ఉంది. లిరిక్స్ అద్భుతంగా కుదిరాయి. విజయ్‌కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ పనితనం కనపడుతోంది. తక్కువ బడ్జెట్ సినిమా అయినా విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా ఫుల్ ప్యాకేజీలా ఉంది’’ అని నటుడు సుమన్ అన్నారు. విజయ్ కృష్ణ, ఫిర్దోస్ భాను జంటగా సునీల్ జంపా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దుర్మార్గుడు’. బేబీ ఆరాధ్య సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆడియోను సుమన్ విడుదల చేశారు. ట్రైలర్‌ను నిర్మాతలు సి. కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్ రిలీజ్ చేయగా, బిగ్ సీడీని సుమన్, సి.కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్, నిర్మాత టి. రామసత్యనారాయణ సంయుక్తంగా విడుదల చేశారు. సునీల్ జంపా మాట్లాడుతూ– ‘‘1980లో కాకినాడలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాజవంశీగారికి ధన్యవాదాలు. అపర్ణగారు కూడా ఈ సినిమా కోసం చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో 25 మంది నూతన నటీనటులు, టెక్నీషియన్స్ పరిచయమవుతున్నారు’’ అన్నారు. ‘‘కేవలం సంకల్ప బలంతోనే ఎలాంటి శిక్షణ తీసుకోకుండా హీరో అయ్యాను. మా సినిమాను సపోర్ట్ చేసిన హీరో శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ కృష్ణ. ‘‘రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత నిర్మాతగా మారాను’’ అన్నారు నిర్మాత రాజవంశీ. -
ఆయనతో భోజనం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది!
నాలుగు దశాబ్దాలుగా యాక్షన్, ఫ్యామిలీ, కుటుంబ, పౌరాణిక, విలన్..తదితర పాత్రల్లో నటించి తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో సుమన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. మంగళవారం పార్నపల్లె గ్రామంలో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. – బండిఆత్మకూరు ప్రశ్న: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు.? జవాబు: తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, కొరియా, ఇంగ్లిష్, హిందీ భాషలు అన్ని కలపి 400 సినిమాల్లో పలు పాత్రల్లో నటించాను. తెలుగు, తమిళం, కన్నడం బాషల్లో హీరోగా 150 సినిమాల్లో నటించా. తెలుగులో హీరోగా 99 సినిమాల్లో నటించా. వందో చిత్రం వయస్సుకు తగిన పాత్ర వస్తే కమర్షియల్ సినిమా చేయాలని ఉంది. ప్రశ్న: తెలుగులో నటించిన తొలి తెలుగు సినిమా? జ: తెలుగులో తొలి సినిమాగా ‘ఇద్దరు కిలాడీలు’ చేశాను. అయితే ఆ తర్వాత నటించిన తరంగిణి సినిమానే మొదట విడుదలైంది. 1977లో తొలిసారిగా తమిళంలో స్విమ్మింగ్ ఫూల్ చిత్రంలో హీరోగా నటించా. ప్రశ్న: మీకు గుర్తింపు తెచ్చిన పాత్ర ? జ: అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరస్వామిగా నటించిన పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత నటించిన రామదాసు సినిమాలో రాముని పాత్ర కూడా మంచి పేరు తెచ్చింది. సత్యనారాయణ స్వామి సినిమాలో ఏడు వేషధారణలు చేసి వ్రతం ఏ విధంగా చేయాలో ప్రజల్లో చూపించడం జరిగింది. ఈ పాత్రే నాకు ఎక్కువగా సంతృప్తినిచ్చింది. ప్రశ్న: మీరు సినిమాలో చేయని పాత్రలు ఏవైనా మిగిలి ఉన్నాయా.? జ: కమెడియన్‌గా ఇంతవరకు ఒక పాత్ర కూడా చేయలేదు. దీంతో ఆ లోటును భర్తించడానికి క్రేజీ..క్రేజీ సినిమాలో నటిస్తున్నా. ఇందులో అందరి కమెడియన్లు మాదిరి కాకుండా తన కామెడీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల పాత్రల ఆధారంగా విభిన్నంగా ఉంటుంది. దీనికి తొలిసారిగా సంజై దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశ్న: మీ జీవితంలో చాలా సంతృప్తినిచ్చిన అంశం? జ: భారత రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ పక్కన కూర్చోని నటించిన అన్నమయ్య చిత్రం ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ తర్వాత ఆయనతో కూర్చోని భోజనం చేసే అవకాశం కూడా కలిగింది. నాకు వచ్చిన ఎన్నో అవార్డుల కంటే ఇది ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రశ్న: నేటి తరం ఆర్టిస్టులకుమీ సలహా? జ: నేటి తరం యువకులు ఒక సినిమా ప్లాప్ అయితే, అవకాశాలు తగ్గితే బేజారు అవుతున్నారు. ప్రస్తుతం ఒక భాషలో అవకాశాలు లేకపోతే ఇతర భాషల్లో వెళ్లి అవకాశాలు కల్పించుకోవచ్చు. గతంలో తెలుగు, తమిళంలో మాత్రమే అవకాశాలు ఉండేవి. ప్రస్తుతం టాలెంట్ ఉంటే బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి వెళ్లవచ్చు. ప్రశ్న: దైవశక్తిపై మీ అభిప్రాయం ఏమిటి.? జ: ప్రతి ఒక్కరు తమకు తెలిసినంత వరకు ఎవరికి ద్రోహం చేయరాదు. ఒకరికి మంచి చేస్తేనే మనకు దేవుడు ఏదో రూపంలో సహాయం చేస్తారు. తమకు తెలియకుండా తప్పు చేస్తే ఆ తర్వాత తప్పును తెలుసుకోని సరిచేసుకోవాలి. దేవుని దయ వల్లే నేను ఇన్ని సంవత్సరాలుగా చిత్ర సీమలో పలు పాత్రల్లో నటిస్తున్నా. ప్రశ్న: మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా.? జ: రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి లేదు. గత తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పదిరోజుల ముందు ఒక టీవీ ఇంటర్వూలో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని చెప్పా. ఎందుకంటే తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్న: పైరసీ పట్ల మీ అభిప్రాయం ఏమిటి.? జ: ప్రస్తుతం సినిమా విడుదలైన మొదటి రోజే సగం సినిమా పూర్తి అయిన వెంటనే ఫైరసీ సీడీలు, రెండవ గంటలోనే వస్తున్నాయి. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో నష్టం జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలి. పైరసీని అరికట్టేందుకు ముందుగా అభిమానుల్లో చైతన్యం తేవాలి. ప్రశ్న: అప్పటికి.. ఇప్పటికి సినిమాల్లో తేడా? జ: అప్పట్లో సినిమాల్లోకి రావడానికి ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉండేది. ప్రస్తుతం జిమ్‌కు వెళ్లి సిక్స్ ప్యాక్స్ పెంచుకోవడం, డ్యాన్స్ చేయడం నేర్చుకుంటే అవకాశాలు వస్తున్నాయి. గతంలో మేము ఏదైనా షూటింగ్ చేయాలంటే సంబంధిత లొకేషన్‌కు వెళ్లే వాళ్లం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ కారణంగా అక్కడి లొకేషన్లకు వెళ్లకుండానే డిజిటల్ ఐజేషన్ ద్వారా చేయవచ్చు. -
బిచ్చగాళ్లు లేని సమాజాన్ని చూడాలి
అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఎస్.ఎ. రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఓ యువకుడు సాగించిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అది తన ప్రేమకథను ఎలా ప్రభావితం చేసింది అన్నదే ఈ చిత్ర కథాంశం. హైదరాబాద్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా చేయాలని ప్రభుత్వం తలపెట్టిన యజ్ఞానికి బాసటగా నిలిచే చిత్రమిది. అనాథ అయిన అర్జున్ బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. శ్రీవెంకట్ పాటలకు చక్కని స్పందన వచ్చింది. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. 70 శాతం పూర్తయింది’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరరావు కథ చెప్పగానే విభిన్నంగా ఉందనిపించింది. సుమన్ ఓ వెరైటీ పాత్ర చేయగలడు అని ఈ సినిమాతో పేరొస్తుంది. మంచి విలన్ పాత్రలు ఇస్తే చేయడానికి రెడీ. నేటి జనరేషన్లో రాజమౌళి మాత్రం విలన్ని ఎంతో గొప్పగా చూపిస్తున్నారు. ‘బాహుబలి’లో హీరో ప్రభాస్ కాదు.. రానా. ఆయన పాత్ర అంత బాగుంది’’ అన్నారు. -
నరసింహస్వామి వైభవం
సుమన్ ప్రధాన పాత్రలో పి.శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భక్తిరస ప్రధాన చిత్రం ‘సింహనాదం’. (శ్రీ నరసింహస్వామి వారి వైభవం). శ్రీ లిఖిత మూవీ మేకర్స్, శ్రీ వైష్ణవ స్పిరిటైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు స్వామిజీల ఆశీస్సులతో ఈ చిత్రం టైటిల్ లోగోను కూడా ఆవిష్కరించారు. శ్రీనరసింహస్వామి వైభవాన్ని చాటి చెబుతూ రూపొందుతున్న ‘సింహనాదం’ సినిమా ఘన విజయం సాధించాలని స్వామీజీలు ఆశీర్వదించారు. ‘‘సుమన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుపుతున్నాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నాం’’ అని పి. శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ అహోబిల నరసింహస్వామిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనలతో కూడిన ‘సర్వం సింహమయం’ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవంలో సింహయాజి స్వామి, కామిశెట్టి శ్రీనివాస్, రామానుజాచార్యులు, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, బీజేపీ నాయకురాలు గీతామూర్తి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణి–దిలీప్, సంగీతం: విజయ్ కురాకుల. -
ఎవరు నీవు?
రిజ్వాన్ కలసిన్, సుమన్, చలపతిరావు, జూనియర్ రేలంగి, బి.హెచ్.ఇ.ఎల్. ప్రసాద్, జెన్నీ ముఖ్య తారలుగా కృష్ణమూర్తి రాజ్ కుమార్ దర్శకత్వంలో స్వర్ణకుమారి దొండపాటి నిర్మిస్తోన్న చిత్రం ‘ఓ మనిషి నీవు ఎవరు?’. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైన సందర్భంగా నటులు చలపతిరావు, సుమన్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. చలపతిరావు కెమెరా స్విచాన్ చేయగా, సుమన్ క్లాప్ ఇచ్చారు. కృష్ణమూర్తి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ‘‘ఇప్పటివరకూ వచ్చిన ఏసుక్రీస్తు సినిమాల్లో ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఇందులో నేను చైతన్ అనే పాత్ర పోషిస్తున్నాను’’ అన్నారు చలపతిరావు. ‘‘ఇది ఆధ్యాత్మిక చిత్రంలా కనిపించినప్పటికీ కమర్షియల్ సినిమాలా కథ, కథనం ఉంటాయి. ఇందులో నేను యోహాన్ పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సుమన్. ‘‘రాజ్‌కుమార్‌గారు చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నాను. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది గుడ్ ఫ్రైడే సందర్భంగా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు రిజ్వాన్ కకలసిన్. -
ఇంకేం ఇంకేం కావాలే...
క్లాప్‌బోర్డులు, ఆర్క్ లైట్లు, స్టార్ట్ కెమెరా, షాట్ ఓకే... వీటితో బిజీగా ఉండే స్టార్స్ ఫర్ ఎ చేంజ్ అప్పుడప్పుడూ వీటికి దూరంగా ఉండాలని అనుకుంటారు. 1980లలో వెండితెరను ఏలిన స్టార్స్‌లో కొందరు ఇలానే అనుకుని, ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో చోట. కొన్నిసార్లు ప్రైవేట్ ప్లేసెస్ ఇందుకు వేదిక అయితే కొన్నిసార్లు ఒక్కో సెలబ్రిటీ మిగతా అందరికోసం తమ ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి ‘1980స్ రీ–యూనియన్’ జరిగింది. ఇప్పుడు చెన్నైలో కలుసుకున్నారు. జనరల్‌గా రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్స్ కూడా కనిపిస్తుంటారు. ఈసారి వీళ్లు మిస్సింగ్. వైట్ అండ్ బ్లూ కలర్‌ని డ్రెస్‌కోడ్‌గా ఫిక్స్ చేసుకున్నట్లున్నారు. అందరూ తెలుపు, నీలం రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. మోహన్‌లాల్, సీనియర్ నరేశ్, జాకీ ష్రాఫ్, అర్జున్, సుమన్, శరత్‌కుమార్, భాగ్యరాజ్, సత్యరాజ్, సుహాసిని, ఖుష్బూ, శోభన, నదియా, రాధ తదితరులు పాల్గొన్నారు. లేడీ యాక్టర్స్ అందరూ ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాటకు డ్యాన్స్ చేశారట. మోహన్‌లాల్ కేరళలోని సంప్రదాయపు బోట్ నడుపుతున్నట్టు యాక్ట్ చేశారట. ఇలాంటి సరదా ఆటలతో సందడి చేశారని సమాచారం. -
ఇప్పుడు విలన్ పాత్రలదే ట్రెండ్
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ప్రస్తుతం విలన్ పాత్రల ట్రెండ్ నడుస్తోందని అంటున్నారు ప్రముఖ సినీ నటుడు సుమన్. ట్రెండ్ బట్టి తను పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. హీరో పాత్రలోనే కొనసాగాలన్నది ఇప్పుడున్న ట్రెండ్ కాదని, రాజమౌళి లాంటి డైరెక్టర్ల దర్శకత్వంలో హీరోలు సైతం విలన్ పాత్రలకు ఎదురుచూస్తున్న పరిస్థితులు వచ్చాయన్నారు. హీరో పాత్ర కంటే విలన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండడం, అందులో దమ్మున్న క్యారెక్టర్లకు జనాదరణ ఉండంతో అటువైపు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. గోపాలపట్నం కొత్తపాలెంలో ఆదివారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తన సినీ అనుభవాలు, సినిమా విజయవంతానికి పాత్రల ప్రాధాన్యం ఎంత ముఖ్యమో వివరించారు. హీరో పాత్రకు వయసు బట్టే ఆదరణ ఎపుడూ హీరో పాత్రలకు వయసుని బట్టే ఆదరణ ఉంటుంది. కాలం మారితే హీరోలు మారుతుంటారు. ఏ పాత్ర బాగుంటే అందులోనే హీరోయిజాన్ని చూడాలి. కుటుంబాన్ని మోసే తండ్రి పాత్ర కూడా హీరోయే. నేను నిర్మాతలు ఇచ్చే పారితోషకాలకు కంటే పాత్రలకే ప్రాధాన్యం ఇస్తాను. అలాంటి పాత్రలు చాలా సంతృప్తినిస్తాయి. రజనీకాంత్‌కు విలన్‌గా చేశా.. అగ్రహీరోలు కూడా విలన్ పాత్రలు పోషించడానికి ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోలు విలన్‌గా నటిస్తున్నారు. నేను శివాజీ చిత్రంలో రజనీకాంత్‌కు విలన్‌గా చేశాను. మంచి పేరు వచ్చింది. మళ్లీ అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా. నా స్థాయికి తగ్గ హీరో ఉంటే విలన్ పాత్రలు పోషిస్తా. రాజమౌళి లాంటి దర్శకుల సినిమాల్లో విలన్ పాత్రలకు ప్రాధాన్యం పెరిగింది. బాహుబలి–2 చిత్రంలో హీరో రానాకు విలన్‌గా ఎంతో పేరు వచ్చింది. సందేశం ఉంటే హీరోగా చేస్తా.. హీరో పాత్రలో తగిన కథ ఉంటే నటిస్తాను. అది సామాజిక సందేశాన్ని ఇచ్చేలా ఉండాలి. ప్రజల హృదయాలను కదిలిం చాలి. కుటుంబ సంబంధాలు కూడా కమర్షియల్ బంధాలయిపోతున్న ఈ రోజుల్లో సమాజానికి మంచి సందేశాన్నిచ్చే క్యారెక్టర్ ఉంటే హీరోగా నటిస్తాను. రాష్ట్రపతి నా సినిమా చూశారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ పరిశ్రమ ప్రేక్షక ఆదరణ పొందాను. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. హీరోగా 150 చిత్రాల్లో నటించాను. మొత్తంమ్మీద క్యారెక్టర్ ఆర్టిస్టుగా 400 పైగా సినిమాల్లో నటించాను. అన్నమయ్య చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రలో మెప్పించిన నన్ను మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ పిలిచి విందు ఇచ్చారు. నాతో కలసి ఆ సినిమా చూశారు. సినీ పరిశ్రమలో ఇదో అపురూప అవకాశం. ఇంతకంటే సంతృప్తి ఏం కావాలి. ప్రస్తుతం చాలా బిజీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి. ఆయా రంగాల్లోని సినిమా షూటింగ్‌లతో బిజీలో ఉన్నాను. ఇందులో తెలుగు, తమిళ్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు అనుభవాలను నేర్పుతుంది. ప్రస్తుత సినీ రంగంలో సినిమా హిట్ అయితే మాదే గొప్ప అని పొంగిపోవడం, లేకపోతే కుంగిపోవడం, ఫెయిల్యూర్ని డైరెక్టర్పైనో మరెవరిపైనో నెట్టేయడం కనిపిస్తోంది. సక్సెస్ వస్తే ఆ చిత్రానికి అంతా తామే అని అంటున్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ జీవితాలను చూస్తే వారు ఎన్నో ఆటుపోట్లు అధిగమించారు. అందుకే విజయాలను చూసి ఎక్కువ సంతోషపడకూడదు. ఓటమిని భరించాలి. సినిమా సక్సెస్/ఫెయిల్యూర్ అందరిది. పోషించడానికి ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోలు విలన్‌గా నటిస్తున్నారు. నేను శివాజీ చిత్రంలో రజనీకాంత్‌కు విలన్‌గా చేశాను. మంచి పేరు వచ్చింది. మళ్లీ అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా. నా స్థాయికి తగ్గ హీరో ఉంటే విలన్ పాత్రలు పోషిస్తా. రాజమౌళి లాంటి దర్శకుల సినిమాల్లో విలన్ పాత్రలకు ప్రాధాన్యం పెరిగింది. బాహుబలి–2 చిత్రంలో హీరో రానాకు విలన్‌గా ఎంతో పేరు వచ్చింది. సందేశం ఉంటే హీరోగా చేస్తా.. హీరో పాత్రలో తగిన కథ ఉంటే నటిస్తాను. అది సామాజిక సందేశాన్ని ఇచ్చేలా ఉండాలి. ప్రజల హృదయాలను కదిలిం చాలి. కుటుంబ సంబంధాలు కూడా కమర్షియల్ బంధాలయిపోతున్న ఈ రోజుల్లో సమాజానికి మంచి సందేశాన్నిచ్చే క్యారెక్టర్ ఉంటే హీరోగా నటిస్తాను. రాష్ట్రపతి నా సినిమా చూశారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ పరిశ్రమ ప్రేక్షక ఆదరణ పొందాను. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. హీరోగా 150 చిత్రాల్లో నటించాను. మొత్తంమ్మీద క్యారెక్టర్ ఆర్టిస్టుగా 400 పైగా సినిమాల్లో నటించాను. అన్నమయ్య చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రలో మెప్పించిన నన్ను మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ పిలిచి విందు ఇచ్చారు. నాతో కలసి ఆ సినిమా చూశారు. సినీ పరిశ్రమలో ఇదో అపురూప అవకాశం. ఇంతకంటే సంతృప్తి ఏం కావాలి. ప్రస్తుతం చాలా బిజీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి. ఆయా రంగాల్లోని సినిమా షూటింగ్‌లతో బిజీలో ఉన్నాను. ఇందులో తెలుగు, తమిళ్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు అనుభవాలను నేర్పుతుంది. ప్రస్తుత సినీ రంగంలో సినిమా హిట్ అయితే మాదే గొప్ప అని పొంగిపోవడం, లేకపోతే కుంగిపోవడం, ఫెయిల్యూర్ని డైరెక్టర్పైనో మరెవరిపైనో నెట్టేయడం కనిపిస్తోంది. సక్సెస్ వస్తే ఆ చిత్రానికి అంతా తామే అని అంటున్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ జీవితాలను చూస్తే వారు ఎన్నో ఆటుపోట్లు అధిగమించారు. అందుకే విజయాలను చూసి ఎక్కువ సంతోషపడకూడదు. ఓటమిని భరించాలి. సినిమా సక్సెస్/ఫెయిల్యూర్ అందరిది. -
డబ్బే జీవితం కాదు
‘‘కథకి నగేష్ ఇచ్చే ప్రాధాన్యం గురించి అందరూ చెప్పారు. ‘దేశ దిమ్మరి’ సినిమా తీసేందుకు ముందుకు వచ్చిన నిర్మాతకు అభినందనలు. ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. ఈ సినిమా హిట్ అయి, విజయ పరంపర కొనసాగాలి’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. తనీష్, షరీన్ జంటగా నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేశ దిమ్మరి’. స్వతంత్ర గోయల్ (శావి యుఎస్ఎ) నిర్మించారు. ఈ చిత్రంలో తనీష్ పాడిన ‘హే పైసా..’ సాంగ్‌ని విడుదల చేశారు. డైరెక్టర్ నగేష్ మాట్లాడుతూ– ‘‘పంజాబ్, హర్యానాలో ఈ చిత్రం షూటింగ్ చేశాం. కొండలు ఎక్కడం, దిగడం చాలా కష్టం. నేను ఈ సినిమా కోసం అందర్నీ చాలా ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా తనీష్‌ని, కెమెరామెన్స్‌ని’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను చాలెంజింగ్ రోల్ చేశా’’ అన్నారు సుమన్. ‘‘ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’’ అని గోయల్ అన్నారు . ‘‘పనీపాటా లేకుండా దేశం మొత్తం తిరుగుతుండే ఓ కుర్రాడి చుట్టూ తిరిగే సినిమా ఇది. డబ్బు అనేది కేవలం అవసరం.. అదే జీవితం కాదనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు తనీష్. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, పాటల రచయిత పార్వతి చంద్, ఫైట్‌మాస్టర్ అంజి, కెమెరామెన్ మల్లికార్జున నారగాని తదితరులు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్‌పూల్ టు శ్రీరామదాస్
కర్నూలు(కల్చరల్) : ‘అన్నమయ్య’లో వెంకటేశ్వరస్వామి, ‘శ్రీరామదాసు’లో శ్రీరాముడు పాత్రలకు నిండుదనం తెచ్చి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం పొందిన నటుడు సుమన్. 1977లో స్విమ్మింగ్ పూల్ అనే తమిళ సినిమాతో ఆరంగేట్రం చేసిన సుమన్ 400 సినిమాల్లో నటించారు. మాతృభాష కాకపోయినా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ తెలుగు చలన చిత్రసీమకే అంకితమై చెన్నై నుంచి హైదరాబాదు తరలివచ్చి తనను వరించిన పాత్రలకు వన్నె తెచ్చారు. బనగానపల్లెలో అరుణ భారతి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుమన్ మార్గంమధ్యలో కర్నూలులో కాసేపు ‘సాక్షి’తో మాట్లాడారు. మొదటి సినిమా స్విమ్మింగ్‌పూల్ నుంచి గుర్తింపు తెచ్చిన సినిమా శ్రీరామదాసు వరకు విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి : పుట్టిన ఊరు, అమ్మానాన్నల గురించిచెబుతారా? సుమన్ : పుట్టింది, పెరిగింది చెన్నైలో. అమ్మ ఓ కళాశాల ప్రిన్సిపాల్, నాన్న ప్రయివేటు కార్పొరేట్ సంస్థలో మేనేజర్. కాలేజీ చదువు వరకు చెన్నైలో సాగింది. సాక్షి : సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? సుమన్ : చదివేటప్పుడు కానీ, చదువైపోయాక కానీ ఏ రోజు సినీరంగంలో స్థిరపడతానని అనుకోలేదు. కిట్టు అనే ఓ కార్ మెకానిక్ నన్ను చూసి.. ‘సార్! మీరు సినిమాల్లో హీరో అయితే భలే ఉంటుందండీ’ అన్నాడు. ఓరోజు బలవంతంగా కారులో తీసుకెళ్లి తమిళ డైరెక్టర్ టి.ఆర్.రామన్‌కు పరిచయం చేయడం, ఆయన వెంటనే వేషం ఇవ్వడం జరిగిపోయింది. అలా 1977లో మొదటిసారి స్విమ్మింగ్‌పూల్ సినిమాలో నటించా. సాక్షి : సినిమాల్లోకి రాకుండా ఉండి ఉంటే? సుమన్ : చిన్నప్పటి నుంచి విమానాలంటే భలే క్రేజ్ . అందుకే ఆర్మీలో చేరి ఎయిర్‌ఫోర్స్ విమానాల పైలెట్ కావాలనుకునేవాడిని. అనుకోకుండా నా కెరీర్ సినిమాల వైపు తిరిగింది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ కానీ, గాడ్‌ఫాదర్ కానీ లేకుండా 40 ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తున్నా. సాక్షి : ఎన్ని సినిమాల్లో నటించారు? హీరోగా చేసిన సినిమాలు ఎన్ని? సుమన్ : 9 భాషల్లో 400 సినిమాల్లో నటించాను. హీరోగా 150 సినిమాలు చేశాను. తెలుగు, తమిళ, మళయాళం, హిందీ, ఒరియా, భోజ్‌పురి భాషల్లో నటించాను. డెత్ అండ్ టాక్సీస్ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించాను. తమిళంలో శివాజీ సినిమాలో విలన్ పాత్రకు బెస్ట్ విలన్ నంది అవార్డు అందుకున్నాను. హిందీలో గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు ప్రతి నాయకుని పాత్రలో నటించాను. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన తరంగిణి నా మొదటి తెలుగు సినిమా. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, బావ బావమరిది, అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు నా కెరీర్‌ను మలుపు తిప్పాయి. సాక్షి : వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడు పాత్రల్లో నటించాక మీ అనుభూతి ఏంటి? సుమన్ : అన్నమయ్యలో వెంకటేశ్వరస్వామి పాత్ర చూసిన అప్పటి రాష్ట్రపతి శంకరదయాళ్ శర్మ నన్ను పిలిపించి రాష్ట్రపతి భవన్లో నాతో కలసి ఆ సినిమా చూడటం నా జన్మ ధన్యమైనట్లుగా భావించాను. ఆ తర్వాత వచ్చిన శ్రీరామదాసులో శ్రీరాముడు పాత్ర కూడా మంచి గుర్తింపు తెచ్చింది. వెంకటేశ్వరస్వామి పాత్ర చేస్తూ 8 నెలలు కటిక నేలపై పడుకుంటూ శాకాహార భోజనానికే పరిమితమై నిష్టతో చిత్తశుద్ధితో గడిపాను. సాక్షి : అప్పటి అగ్రనటులు,ఇప్పటి హీరోలతోనూ నటించారు కదూ! సుమన్ : మూడు తరాల నటులతో నటించాను. అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతోనే కాకుండా ఇప్పటి యువతరం హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యతో కూడా నటించా. సాక్షి : సినిమా గురించి మీ అభిప్రాయం? సుమన్ : సినిమా అత్యుత్తమమైన అతిపెద్ద మాధ్యమం. అప్పుడూ, ఇప్పుడూ మంచి సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తుంటాయి. మంచిని గ్రహించి మసలుకుంటే మేలు చేస్తాయి. -
వినోదం... సందేశం
ప్రముఖ దర్శకుడు సాగర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన హరీష్ వడ్త్యా దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, అలీ, సుమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాక్ ల్యాబ్స్ పతాకంపై మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సాగర్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ క్లాప్ ఇచ్చారు. ఎస్.ఎ. గ్రూప్ చైర్మన్ సయ్యద్ అక్తర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు హరీష్ వడ్త్యా మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం కామెడీతో ఆకట్టుకునే చిత్రమిది. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉంటా యి’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా మొదటి సినిమా ‘తెలంగాణ దేవుడు’. మంచి మెసేజ్ ఉన్న కథతో నిర్మాతగా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం’’ అన్నారు మహమ్మద్ జాకీర్ ఉస్మాన్. ప్రగతి, ప్రభావతి, తోటపల్లి మధు, కోటేశ్ మానవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్ రాజ్ బొబ్బిలి, కెమెరా: ఎ. విజయ్ కుమార్. -
టెక్నాలజీ పేరుతో పరుగులు
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అన్నది ఉప శీర్షిక. శృతి యుగల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎం.వెంకట్ దర్శకత్వంలో లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. వెంకట్ మాట్లాడుతూ– ‘‘నేటి తరం యువత టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోంది. మానవ సంబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అమ్రీష్ అద్భుతమైన సంగీతం, రీ–రికార్డింగ్’’ అందించారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సినిమా ఇది. వెంకట్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. ఆగస్ట్ 22న సినిమా విడుదల చేస్తాం’’ అని నిర్మాత నారాయణ్ రామ్ అన్నారు. -
స్ఫూర్తి నింపే చిత్రాలు రావాలి
‘‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’ సినిమా చాలా బాగుంది. చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూపించారు. బాల–బాలికల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి గొప్ప చిత్రాలు తరచూ రావాలి’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’. 2015 నవంబర్4న విడుదలైన ఈ చిత్రం 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం అందుకుంది. తాజాగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఆదిత్య’ చిత్రంలో నేనూ నటించాను. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే మా చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారం అందించారు’’ అన్నారు భీమగాని సుధాకర్ గౌడ్. నటుడు సుమన్ పాల్గొన్నారు. -
ప్రతానికి డాక్టరేట్
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘యునైటెడ్ ధియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ’ (యుటిఆర్) నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీకి అనుబంధంగా గుర్తింపు పొందిన యుటిఆర్ యూనివర్సిటీ రామకృష్ణ గౌడ్, నటుడు సుమన్‌లను గౌరవ డాక్టరేట్‌కి ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ చేతుల మీదుగా రామకృష్ణ గౌడ్ గౌరవ డాక్టరేట్, 51వేల నగదు అందుకున్నారు. ఐదు వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డ్స్, ఐదు లక్షల ఉచిత బీమా కల్పించడంతో పాటు రెండు వందల మంది సినీ వర్కర్లకు గృహాలు ఇప్పించారు ప్రతాని. సినిమారంగంలో ఆయన చేసిన సోషల్ సర్వీస్‌కి గాను ఈ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రతానికి అభినందనలు తెలిపారు. ‘‘గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉంది’’ అని ప్రతాని అన్నారు. -
అందుకు ప్రతిరూపమే ఈ చిత్రం: బగ్గిడి గోపాల్
మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవితం ఆధారంగా అర్జున్ కుమార్ దర్శకత్వంలో బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘బగ్గిడి గోపాల్’. టైటిల్ రోల్లో బగ్గిడి గోపాల్ నటించారు. సుమన్, కవిత, గీతాంజలి తదితరులు నటించిన ఈ సినిమాకు జయసూర్య స్వరకర్త. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో సీడీని అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య రిలీజ్ చేశారు. బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ– ‘‘నా జీవితాన్ని కథగా రాస్తే ఎవరూ చదవరు. కాబట్టి సినిమా ద్వారా చెప్పాలనుకున్నాను. నేను ఎవరినీ మోసం చేయలేదు అని చెప్పాలనే నా 35 ఏళ్ల మనోవేదనకు ప్రతి రూపమే ఈ ‘బగ్గిడి గోపాల్’. త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి జమున, ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి మారెప్ప తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. -
వైఎస్సార్‌లా సేవ చేయాలనుంది
కృష్ణరాజపురం: రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టమైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా వారికి మద్దతుగా ప్రచారం చేస్తాను అని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. శుక్రవారం బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని నల్ళూరహళ్ళిలో తన మిత్రుడు, వ్యాపారవేత్త కిరన్‌కుమార్‌రెడ్డి ఇంటికి సుమన్ వచ్చారు. ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం నటన పైన ఉంది. తెలుగులో ఇప్పటికే సుమారు 99 సినిమాల్లో నటించాను. అన్ని భాషల్లో కలిపి మొత్తం 500 పైన సినిమాల్లో నటించాను. ఇప్పటివరకు నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటాను. ప్రముఖ రాజకీయ నాయకులు అయిన ఎన్టీఆర్, వైఎస్సార్‌లు అంటే నాకు చాలా అభిమానం. వారు పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారు. నేనూ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలే చేయాలన్నదే నా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రైతుల కోసం రాష్ట్రంలోప్రవేశ పెడుతున్న పథకాలు చాలా బాగున్నాయి. అన్ని చోట్లా రైతుల కోసం ఇలాంటి పథకాలను అమలు చేయాలి’ అని చెప్పారు. ప్రస్తుతం దేశానికి తృతీయ ఫ్రంట్ అవసరం చాలా ఉందని సుమాన్ అన్నారు. మొన్న తాను జేడీఎస్ అధినేత హెచ్.డి.దేవెగౌడ, సీఎం హెచ్.డి.కుమారస్వామిని కలిశానని తెలిపారు. ప్రస్తుతానికి తనకు ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆశ లేదని, మునుముందు తప్పకుండా పోటీ చేస్తానని, అది ఏ పార్టీ నుంచి అనేది ఇప్పుడే తెలియదని చెప్పారు. -
ఇంటికో హీరో
సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సడి’. పాలిక్ దర్శకత్వంలో భాను ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సాయి అమృతలక్ష్మి క్రియేషన్స్‌పై గోదారి భానుచందర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకులు ధవళ సత్యం కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకులు వి.సాగర్ క్లాప్ ఇచ్చారు. నటుడు, దర్శకుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ నేపథ్యంలో సాగే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతి ఇంటికీ ఒక హీరో ఉంటాడు. ఈ సినిమాలో నేను ఒక ఇంటికి హీరోగా చేస్తున్నా’’ అన్నారు. ‘‘ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొన్న ఊహించని పరిణామాలే ఈ చిత్రం. మే నెలాఖరులో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తాం’’ అన్నారు పాలిక్. ‘‘సుమన్గారితో నా తొలి సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు గోదారి భానుచందర్. దర్శకుడు వీరశంకర్, నటుడు గూడ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జశ్వంత్, సంగీతం: యాజమాన్య. -
వ్యూహం ఫలించిందా?
ఒకప్పుడు హాట్ గాళ్‌గా తెలుగువారిని సైతం పలు చిత్రాల్లో అలరించిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ప్రస్తుతం కన్నడ, తమిళ చిత్రాలకే పరిమితమయ్యారు. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె ‘దండుపాళ్యం 4’ చిత్రంతో తెలుగు స్క్రీన్‌పై కనిపించనున్నారు. కేటీ నాయక్ దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గతంలో వచ్చిన ‘దండుపాళ్యం’ చిత్రాలకూ, మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. 40 మంది గ్యాంగ్‌లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? అవి ఫలించాయా? లేదా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? వంటి ఆసక్తికరమైన అంశాలతో మా ‘దండుపాళ్యం 4’ రూపొందుతోంది. 30 శాతం షూటింగ్ పూర్తి అయింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథలోని వైవిధ్యం, నా పాత్ర ఎంతగానో నచ్చాయి. అందుకే.. వేసవిలోనూ సెట్స్‌లో ఎంతో ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నా’’ అన్నారు సుమా రంగనాథన్. సంజీవ్, విఠల్, అరుణ్ బచ్చన్, రిచా శాస్త్రి, బుల్లెట్ సోము, స్నేహ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆనంద్ రాజావిక్రమ్, కెమెరా: ఆర్. గిరి. -
తల్లిదండ్రుల గొప్పతనం చెబుతుంది
‘‘సాధారణంగా పుట్టుకతోనే అనాథలుగా మిగిలేవారికి, పుట్టిన తర్వాత అనాథలుగా మారేవారికి సమాజంలో గుర్తింపు ఉండదు. అటువంటి వారిని పట్టించుకోకపోతే వారు నేరస్థులుగా మారే అవకాశం ఉంది. అనాథలకు సంబంధించిన కథతో తెరకెక్కిన చిత్రం ‘సత్యగ్యాంగ్’’ అని సుమన్ అన్నారు. సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన సుమన్ మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేసే చిత్రమిది. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపిస్తా. ఈ చిత్రంలో అనాథలపై అద్భుతమైన సాంగ్ ఉంది. చంద్రబోస్‌గారు చక్కగా రాశారు. సాత్విక్‌కి హీరోగా మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేస్తున్న మంచి పనులు, తెలంగాణ అభివృద్ధి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఏదైనా చేయాలని ఆయన్ను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో నా మద్దతు ఉంటుంది. హోదా వద్దు స్పెషల్ ప్యాకేజ్ కావాలనుకున్న సమయంలో ప్రధాని మోదీగారితో చంద్రబాబు నాయుడుగారే మాట్లాడారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అసలు.. ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు కలిగే లాభాలేంటో తెలియజేస్తేనే కదా? వారికి ప్రత్యేక హోదా కావాలో? ప్రత్యేక ప్యాకేజీ కావాలో? నిర్ణయం తీసుకునేది’’ అన్నారు సుమన్. -
సరైన పరిష్కారం!
గ్యాంగ్‌లో ఎవరికైనా ఏమైనా జరిగితే సత్య ఊరుకోడు. ఎందుకంటే అతనే గ్యాంగ్ లీడర్. కానీ సడన్‌గా ఓ నలుగురి గ్యాంగ్ వల్ల మర్డర్ జరుగుతుంది. అసలు.. ఈ సత్యగ్యాంగ్కు మర్డర్‌కి సంబంధం ఏంటి? ఆ మర్డర్ పర్పస్ ఏంటి? అనే విషయాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, సుమన్, సుహాసిని, ‘కాలేకేయ’ ప్రభాకర్ ముఖ్య తారలుగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించారు. సెన్సార్ కంప్లీటైంది. ‘‘కాంప్రమైజ్ కాకుండా 16 నెలలు శ్రమించి నిర్మించాం. ఈ చిత్రం ద్వారా ఓ మంచి సందేశం ఇస్తున్నాం. పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. క్లైమాక్స్‌లో అనాథల భవిష్యత్‌కు సరైన పరిష్కారం చూపటం హైలైట్. ‘సత్యగ్యాంగ్’ మంచి చిత్రంలా నిలుస్తుంది’’ అన్నారు మహేశ్‌ఖన్నా. ఈ చిత్రానికి సంగీతం: జెబి. -
సింహపురితో దశాబ్దాల అనుబంధం
నెల్లూరు(బృందావనం): నెల్లూరుతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, నెల్లూరీయుల అభిమానం మరువలేనని బహుభాషా నటుడు సుమన్ అన్నారు. విళంబి నామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని సింహపురి సంస్కృతి సమాఖ్య అధ్యక్షుడు సమ్మోహనసామ్రాట్ రాంజీ ఆధ్వర్యంలో పురమందిరంలో ఆదివారం సుమన్‌ను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమినాడు నెల్లూరులో ఉగాది పురస్కారాన్ని అందుకోవడం తన జీవితంలో ఎన్నడూ మరువలేనన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీఈ విషయానికి సంబంధించి ఎవరు ఎటువంటి హామీ ఇచ్చినా వారిని ప్రశ్నించా ల్సిందేనన్నారు. ప్రధానంగా ఈ విషయంలో చలన చిత్రహీరోలు పెదవి విప్పాలంటూ అభిమానులు నిలదీయాలని సుమన్ సూచిం చారు. తానుఎనిమిది భాషలతోపాటు ఆంగ్ల చిత్రం లో నటించానన్నారు. మరో పదేళ్ల పాటు సినీపరిశ్రమలో కొనసాగి 50 ఏళ్లు పూర్తి చేయాలన్న కాంక్ష ఉందన్నారు. తాను వెంకటేశ్వరస్వామి, అన్నమయ్య, సత్యనారాయణస్వామి పాత్రల్లో నటిండం తనకు దక్కిన భాగ్యమన్నారు. నెల్లూరులో తొలి ఔట్‌డోర్ షూటింగ్లో పాల్గొన్నానని సుమన్ గుర్తు చేశారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ ఆచార్య వీరయ్య మాట్లాడుతూ కళలకు సింహపురి కాణాచిగా కీర్తించారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీటవేస్తూ రాంజీ వివిధ రంగాలకు చెందిన వారికి ఉగాది పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ ఢిల్లీరావు, నుడా డైరెక్టర్ షేక్ ఖాజావలి, నగర డీఎస్పీ మురళీకృష్ణ, సెట్నెల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, జొన్నవాడ ఆలయ చైర్మన్ పి.సుబ్రహ్మణ్యంనాయుడు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. పలువురికి ఉగాది పురస్కారాలు ప్రదానం ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖు లు సురభిగాయత్రి, కల్పన, కందుకూరు చెంగయ్య ఆచారి, నలుబోలు బలరామయ్యనాయుడు, మాల్యాద్రి, సత్యనారాయణ తదితరులతోపాటు బ్రహ్మకుమారీ నెల్లూరు నిర్వాహకులు ప్రసన్న తదితరులను సుమన్ శాలువలు, పుష్పగుచ్చాలు, పూలమాలలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. రంగనాథుడి సేవలో నటుడు సుమన్ సుమన్ ఆదివారం రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, సభ్యులు సాదరంగా స్వాగతించారు. ఆయన వెంట నగర డీఎస్పీ మురళీకృష్ణ, అభిమానులు ఉన్నారు. -
ఒకే జీవితం
సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అన్నది ఉపశీర్షిక. శ్రుతీ యుగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.వెంకట్ దర్శకత్వంలో లార్డ్ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని హీరో జీవా విడుదల చేశారు. వెంకట్ మాట్లాడుతూ– ‘‘టెక్నాలజీ పేరుతో పరుగెడుతోన్న నేటి తరం మానవ సంబంధాలకు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. జితన్ రమేష్ చక్కగా నటించారు. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి మా చిత్రం చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘మోషన్ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీవా. ‘‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు నారాయణ్ రామ్. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: వై.గిరి. -
యువత కోసం
బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఏక్’. ‘బీయింగ్ హ్యూమన్’ అనేది ఉపశీర్షిక. రుద్రారపు సంపత్ డైరెక్షన్లో కె.వరల్డ్ మూవీస్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘మానవీయ విలువలతో, మంచి కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. యూత్‌ని టార్గెట్ చేసుకుని తీసిన చిత్రమిది. ‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన మా చిత్రం పాటలను హీరో నాగార్జునగారు విడుదల చేయగా చాలా మంచి స్పందన వచ్చింది. హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సుమన్, బెనర్జీ, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రవర్తి ఘనపాటి, స్టోరీ– స్క్రీన్‌ప్లే– డైలాగ్స్– నిర్మాత: హరికృష్ణ కొక్కొండ. -
రక్త సంబంధీకులను పెళ్లి చేసుకుంటే...
సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే జంటగా సుమన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘అనువంశికత’. ‘జెనిటిక్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. రమేష్ ముక్కెర దర్శకత్వంలో తాళ్లపెల్లి దామోదర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు సుమన్ మాట్లాడుతూ– ‘‘రక్త సంబంధీకులను పెళ్లి చేసుకుంటే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయనే పాయింట్‌తో ఈ సినిమా తీశారు. మంచి సందేశాత్మకంగా ఉంటుంది. పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం 45 డిగ్రీల వేడిని సైతం లెక్క చేయకుండా షూటింగ్ చేశాం. నిర్మాత సహకారం వల్లే ఇంత మంచి సినిమా తీశాం’’ అన్నారు రమేష్ ముక్కెర. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రమిది. మా తొలి ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు తాళ్లపెల్లి్ల దామోదర్ గౌడ్. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే, గీత రచయిత తైదల బాపు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: యండి. యాకూబ్, సమర్పణ: అశ్విత, క్రాంతికుమార్, కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం: రమేష్ ముక్కెర. -
వచ్చే ఎన్నికల్లో బరిలోకి : సినీ నటుడు
హుజూర్నగర్ : విద్య, వైద్యం, వ్యవసాయ రంగ అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలో ఆయన విలేకరులతో మట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు తాను కోరుకున్న విధంగా ప్రజలకు సేవలందిస్తే.. తాను వారికి మద్దతుగా ప్రచారం, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి స్ధిదమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ చరిత్ర సృష్టించాడన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఇటీవల నిర్ణయం ప్రకటించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల బాలికలకు విద్యాభ్యాసం ఆధారంగా సైకిళ్లు, స్కూటీలు, ల్యాప్‌ట్యాప్‌లు అందజేయడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. సమావేశంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు కుక్కడపు కోటేశ్వరరావు, కార్యదర్శి కోతి సంపత్‌రెడ్డి, ఎన్.వెంకటేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మగారింట్లో...
‘‘అమ్మమ్మగారి ఇల్లు అంటే జ్ఞాపకాల పొదరిల్లు. ఆప్యాయతల అల్లర్లు, సంతోషాల మధురిమలు. అవన్నీ దండిగా మా ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాలో ఉన్నాయి’’ అంటున్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగశౌర్య, బేబి షామిలి జంటగా శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై సుందర్ సూర్య దర్శకత్వంలో కేఆర్ అండ్ రాజేష్ నిర్మించిన సినిమా ‘అమ్మమ్మగారిల్లు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటించా. కథను నమ్మి సినిమా చేశాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాతో మరింత దగ్గరవుతాను. దర్శకుడు సూర్య బాగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. నాగశౌర్య నటన హైలైట్’’ అన్నారు నిర్మాతలు. ‘‘దర్శకునిగా నాకిది తొలి సినిమా. రిలేషన్ నెవర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రాసుకున్న కథ ఇది’’ అన్నారు. ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతో మరో సినిమా చేయలేదు. కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు షామిలి. అమ్మమ్మ పాత్రలో సుమిత్ర నటించిన ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, సుమన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ రమణ. -
నిన్నే చూస్తూ
శ్రీకాంత్, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసిని, భానుచందర్, సుమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ‘‘మా వీరభద్ర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న రెండో చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసినిగారు మా సినిమాలో నటిస్తుండటం మా అదృష్టం. సీనియర్ నటులు సుమన్, భానుచందర్ చిత్రబృందంతో కుటుంబసభ్యుల్లా కలిసిపోయారు. అవుట్‌పుట్ బాగా వస్తోంది’’ అన్నారు నిర్మాత హేమలతా రెడ్డి. కిన్నెర, కాశీ విశ్వనాథ్, నిహాల్, వేణు మహేశ్, ఫణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రమణ్ రాథోడ్. -
బాలాజీ మహిమలతో...
సాయికుమార్, సుమన్, యస్.పి బాలసుబ్రహ్మణ్యం, భానుశ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ శ్రీ చిలుకూరి బాలాజీ’. ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 5న రిలీజ్ కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏయస్ ఆఫీసర్ డాక్టర్ కేవీ రమణ సౌజన్యంతో నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమాను విడుదల చేయిస్తున్నారని అల్లాణి శ్రీధర్ తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ– ‘‘యువతరానికి వీసాల బాలాజీగా ఆశీర్వాదాలు అందిస్తూ తరతరాలుగా ఆరాధించబడుతున్న చిలుకూరి బాలాజీ గొప్పతనాన్ని, ఆ ఆలయ పురాణాన్ని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించాం. చినజీయర్ స్వామి విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. అర్జున్ మంచి సంగీతాన్ని అందించారు. సుద్ధాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, రాపర్తి వీరేంద్ర, రాణి పులోమజాదేవి మంచి సాహిత్యం అందించారు. సినిమాను మెచ్చి రిలీజ్ చేస్తున్న ‘దిల్’ రాజుకి ధన్యవాదాలు’’ అన్నారు. -
గ్రామీణ నేపథ్యంలో...
‘‘దర్పణం’ సినిమా ఫేమ్ తనిష్క్‌రెడ్డి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్, సింహా ఫిలిమ్స్ పతాకాలపై అనిల్‌కుమార్ గుంట్రెడ్డి నిర్మిస్తున్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. జనవరి 3నుంచి పార్వతీపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నాం. ఆస్ట్రేలియాలో కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. తనిష్క్ కెరీర్‌ని మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమవుతుందనడంలో సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. సుమన్, వినోద్‌కుమార్, చిన్నా, పృధ్వీ, జీవా, ఉత్తేజ్, అనంత్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: సాయి చరణ్, కో–ప్రొడ్యూసర్స్: శ్రీకాంత్, త్రినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: చిన్నా, నాగేంద్రమ్మ. -
గ్రాఫిక్స్ హైలెట్
అభిమన్యుసింగ్, సుమన్, చలపతిరావు, తనాశ్రీ, ‘తాగుబోతు’ రమేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘శివ ప్రళయం’. ఎం.ఏ. చౌదరి దర్శకత్వంలో శ్రీపాద నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోని హీరో రాజశేఖర్, దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ–‘‘శివప్రళయం’ మంచి టైటిల్. టైటిల్ ఇంత బాగుందంటే సినిమా ఎంత బాగుంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. దర్శక–నిర్మాతలు ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా రష్స్ కొంత చూశా. కొత్త తరహా కథలా ఉంది. గ్రాఫిక్స్ బాగున్నాయి’’ అన్నారు మారుతి. ‘‘సరికొత్త జానర్లో రూపొందిస్తోన్న చిత్రమిది. గంటపాటు సాగే గ్రాఫిక్స్ సినిమాకి హైలెట్. ఓ ప్రముఖ హీరోయిన్‌పై త్వరలో చివరి షెడ్యూల్ షూటింగ్ చేయనున్నాం’’ అన్నారు చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: ఎస్. మహి. -
శివుడి మహిమ
పరమశివుడి కథాంశంతో ఇప్పటి వరకూ పలు చిత్రాలొచ్చాయి. తాజాగా ‘శివ ప్రళయం’ పేరుతో మరో సినిమా రూపొందుతోంది. అభిమన్యుసింగ్, సుమన్, చలపతిరావు, తనాశ్రీ, ‘తాగుబోతు’ రమేశ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఏ. చౌదరి దర్శకత్వంలో శ్రీపాద నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శ్రీపాద మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. ఈ షెడ్యూల్లో అభిమన్యుసింగ్, సుమన్, తనుశ్రీల మధ్య గ్రాఫిక్స్ సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నా. ఈనెల 12నుంచి గోవాలో జరిగే షెడ్యూల్‌తో క్లయిమాక్స్ పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘శివుడిపై సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు ఎం.ఏ.చౌదరి. ధన్‌రాజ్, అజయ్ నాని, సత్యప్రకాశ్, పృథ్వీరాజ్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: మహి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.రవికుమార్.