Sevadas Banjara Movie Release Date: Actors Suman, Bhanu Chandar Lead Role In 'Sevadas Movie'- Sakshi
Sakshi News home page

Sevadas Movie: సీనియర్‌ హీరోలు సుమన్‌, భానుచందర్‌ కీలక పాత్రల్లో ‘సేవాదాస్‌’

Published Wed, Feb 9 2022 2:49 PM | Last Updated on Wed, Feb 9 2022 4:04 PM

Actors Suman, Bhanu Chandar Sevadas Movie Releseing On February 18th - Sakshi

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ డైరెక్టర్‌ కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం ‘సేవాదాస్’. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైద్రాబాద్‌లోని ఎంబీ మాల్‌లో ఘనంగా జరిగింది. 


  
ఈ కార్యక్రమంలో ఆలిండియా ఆదివాసీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చౌహాన్, తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరీ భూక్య భారతి, ఐ.ఎ. ఎస్., ఐ.టి.కమిషనర్ పీర్యా నాయక్, లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త రమేష్ నాయక్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సేవాదాస్ చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను.. ఆలిండియా ఆదివాసీ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్‌లు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నెల(ఫిబ్రవరి) 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో వినోద్ రైనా, ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ తదితరులు నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement