bhanuchandar
-
సుమన్, భాను చందర్ కీలక పాత్రల్లో ‘సేవాదాస్’, రిలీజ్ ఎప్పుడంటే
శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ డైరెక్టర్ కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం ‘సేవాదాస్’. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైద్రాబాద్‌లోని ఎంబీ మాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఆదివాసీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చౌహాన్, తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరీ భూక్య భారతి, ఐ.ఎ. ఎస్., ఐ.టి.కమిషనర్ పీర్యా నాయక్, లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త రమేష్ నాయక్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సేవాదాస్ చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను.. ఆలిండియా ఆదివాసీ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్‌లు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నెల(ఫిబ్రవరి) 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో వినోద్ రైనా, ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ తదితరులు నటించారు. -
జగన్ పాదయాత్ర ఓ చరిత్ర : భానుచందర్
పోలాకి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని సినీనటుడు భానుచందర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని డమర – రాంపురం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జగన్‌తో కలిసి చాలా సేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్రలో విశేష ప్రజాదరణను చూసిన భానుచందర్.. జగన్ మోహన్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి పైగా ప్రజల్లో ఉండి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ పాదయాత్ర చేయటం గొప్ప విషయమన్నారు. ఈ పాదయాత్ర రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రగా నిలుస్తోందని కితాబిచ్చారు. రాజకీయాల్లో జగన్ అత్యంత ప్రభావ వంతమైన నాయకుడిగా ఎదిగారని, ఆయన్ను చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వచ్చారని చెప్పారు. పాదయాత్ర విజయవంతమై.. జగన్ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. -
విలువలున్న ప్రేమకథ
మహీదర్, శ్రావ్య జంటగా తెరకెక్కిన చిత్రం ‘నటన’. ఈ చిత్రంతో రచయిత భారతీబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కుబేర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నైతిక విలువలున్న ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇందులో సీనియర్ హీరో భానుచందర్ చేసిన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ. పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రఘుబాబు, ప్రభాస్ శీను, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక, కెమెరా: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటేశ్వర్. -
హారర్ కామెడీతో ‘వస్తా’
భానుచందర్, జీవా, అదిరే అభి, ఫణి ముఖ్య తారలుగా జంగాల నాగబాబు దర్శకత్వంలో మెట్రో క్రియేషన్స్ పతాకంపై దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మించిన ‘వస్తా’ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ‘‘హారర్ కామెడీ చిత్రమిది. చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్నాయి హారర్ కామెడీ చిత్రాలు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాం. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన భానుచందర్ సహకారం మరువలేనిది’’అన్నారు నిర్మాతలు. రఘువర్మ, నాగేంద్ర, అబ్దుల్ రజాక్, రేణుక తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: వాసిరెడ్డి సత్యానంద్. సహ నిర్మాత: రేలంగి కనకరాజు. -
నిన్నే చూస్తూ
శ్రీకాంత్, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసిని, భానుచందర్, సుమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ‘‘మా వీరభద్ర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న రెండో చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసినిగారు మా సినిమాలో నటిస్తుండటం మా అదృష్టం. సీనియర్ నటులు సుమన్, భానుచందర్ చిత్రబృందంతో కుటుంబసభ్యుల్లా కలిసిపోయారు. అవుట్‌పుట్ బాగా వస్తోంది’’ అన్నారు నిర్మాత హేమలతా రెడ్డి. కిన్నెర, కాశీ విశ్వనాథ్, నిహాల్, వేణు మహేశ్, ఫణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రమణ్ రాథోడ్. -
నా సపోర్ట్ ఆ అమ్మాయికే...
నూతన నటుడు శ్రీకాంత్, హేమలత (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది. భానుచందర్, సుమన్, సన, కాశీ విశ్వనాధ్ ముఖ్యపాత్రల్లో కె. గోవర్ధన్‌రావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతారెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు మల్కాపురం శివకుమార్, హేమలత కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత ‘మల్టీ డైమన్షన్’ వాసు క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందించారు. అయోధ్య కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. హేమలతారెడ్డి మాట్లాడుతూ– ‘‘మేం నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే ఓ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 20న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో అతిథిగా కాకుండా, ఫుల్‌లెంగ్త్ రోల్ చేస్తున్నా. హేమలతకి సినిమా పట్ల చక్కని అభిరుచి ఉంది. ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తా’’ అన్నారు భానుచందర్. ‘‘ఆంధ్ర, తెలంగాణలలో 50–60 రోజులు షూటింగ్ చేస్తాం’’ అన్నారు గోవర్ధన్‌రావు. ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్, కెమెరా: ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్). -
డ్రగ్స్‌కు బానిసై దెబ్బతిన్నా: భానుచందర్
హైదరాబాద్: చిత్ర పరిశ్రమలోని సాంకేతిక నిపుణులు, నటుటు డ్రగ్స్ బానిసలుగా మారుతుంటే తనకు బాధగా అనిపిస్తోందని ప్రముఖ సీనియర్ నటుడు భాను చందర్ అన్నారు. అసలు ఈ విషయమే తనకు నచ్చడం లేదని చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్లో పలువురు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నేపథ్యంలో స్పందించిన ఆయన దయచేసి యువత, ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు మత్తుపదార్థాలకు బానిసగా మారొద్దని కోరారు. గతంలో డ్రగ్స్‌కు బానిసగా మారిన తాను చాలా దెబ్బతిన్నానని గుర్తుచేసుకున్నారు. వివాహం కాకముందే తాను మత్తుమందులకు బానిసగా మారానని చెప్పారు. అయితే అందులో నుంచి బయటపడేందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని, ఈ విషయంలో తన అన్నయ్య స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించి, కెరీర్‌పై దృష్టి పెట్టడంతో సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్నానని తెలిపారు. 'యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రగ్స్ జోలికి వెళ్లకండి. క్రమశిక్షణతో ఉంటే మనకు అవసరమైనవి మన దగ్గరకే వస్తాయి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ వస్తుంది. దీనికి వయసుతో పనిలేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా జీవితంలో మంచి మార్పు రావడం ఖాయం' అని భాను చందర్ చెప్పారు. -
అందరూ మెచ్చుకునే జగన్నాయకుడు
‘‘గతంలో కృష్ణ, శ్రీదేవి జంటగా ‘భోగభాగ్యాలు’ సినిమా తీశాను. ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. మూడు తరాల కథ ఇది. రాజకీయ నేపథ్యం ఉండదు’’ అని నిర్మాత వి.ఎ. పద్మనాభరెడ్డి చెప్పారు. రాజా, సుమన్, భానుచందర్ కాంబినేషన్లో పి. చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో వట్లూరి శకుంతల రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న ‘జగన్నాయకుడు’ పాటల సీడీని శుక్రవారం హైదరాబాద్‌లో తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ -‘‘ఈ నెల 25న చెన్నైలో నా వివాహం జరుగనుంది. 30న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ‘జగన్నాయకుడు’ పాటలు విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఇది అందరూ మెచ్చుకునే సినిమా అవుతుందని పి. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చిందని భానుచందర్ చెప్పారు.