
సుహాసిని, హేమలత, సుమన్
శ్రీకాంత్, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసిని, భానుచందర్, సుమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ‘‘మా వీరభద్ర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న రెండో చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసినిగారు మా సినిమాలో నటిస్తుండటం మా అదృష్టం. సీనియర్ నటులు సుమన్, భానుచందర్ చిత్రబృందంతో కుటుంబసభ్యుల్లా కలిసిపోయారు. అవుట్‌పుట్ బాగా వస్తోంది’’ అన్నారు నిర్మాత హేమలతా రెడ్డి. కిన్నెర, కాశీ విశ్వనాథ్, నిహాల్, వేణు మహేశ్, ఫణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రమణ్ రాథోడ్.
Comments
Please login to add a commentAdd a comment