hemalata
-
హేమలతా లవణం
‘‘హేమలతా లవణంగారంటే నాకు చాలా గౌరవం. తెరపై ఆమె పాత్ర చేయడం నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా’’ అన్నారు రేణూ దేశాయ్. ‘బద్రి’తో తెలుగు తెరపై కనిపించి, ఆ తర్వాత ‘జానీ’లో చేసిన రేణు నటనకి బ్రేక్ ఇచ్చి, నిర్మాతగా, క్యాస్టూమ్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా, డైరెక్టర్‌గా, చేశారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆమె తెలుగు పరిశ్రమకు రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నా. ఇందులో నేను హేమలతా లవణంగారి పాత్రలో కనిపిస్తాను’’ అని రేణు తెలిపారు. హేమలతా లవణం గురించి చెప్పాలంటే.. ఆమె సామాజిక కార్యకర్త, నాస్తికురాలు, అంటరానితనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారామె. ‘‘ఇలాంటి శక్తిమంతమైన పాత్ర ద్వారా తెలుగుకి రీ–ఎంట్రీ ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉందని, త్వరలో మరిన్ని విశేషాలు చెబుతాను’’ అని రేణు అన్నారు. -
నిన్నే చూస్తూ
శ్రీకాంత్, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసిని, భానుచందర్, సుమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ‘‘మా వీరభద్ర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న రెండో చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసినిగారు మా సినిమాలో నటిస్తుండటం మా అదృష్టం. సీనియర్ నటులు సుమన్, భానుచందర్ చిత్రబృందంతో కుటుంబసభ్యుల్లా కలిసిపోయారు. అవుట్‌పుట్ బాగా వస్తోంది’’ అన్నారు నిర్మాత హేమలతా రెడ్డి. కిన్నెర, కాశీ విశ్వనాథ్, నిహాల్, వేణు మహేశ్, ఫణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రమణ్ రాథోడ్. -
వివాహిత అనుమానాస్పద మృతి
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా భాన్సువాడలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న హేమలత(23) గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేపడుతున్నారు. కాగా.. భర్తే అదనపు కట్నం కోసం హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి
పెళ్లయిన నెల రోజులకే నవ దంపతులకు నూరేళ్లు నిండిపోయాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పలకగనుల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. పెద్దారవీడు మండలం స్థానికవరం గ్రామానికి చెందిన తోట శివ (25), తోట హేమలత (21) కొనకనమిట్లలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతున్నారు. మార్కాపురం పలకలగనుల వద్ద వీరి వాహనాన్ని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్ర గాయాలతో శివ, హేమలత ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. వీరికి నెల క్రితమే వివాహం జరిగినట్టు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కలవరపరుస్తున్న సైకో..ఇంజెక్షన్‌తో దాడి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు రోజులుగా మహిళలు, యువతులకు ఇంజెక్షన్లతో పొడుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో బాధితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో శనివారం నుంచి బుధవారం వరకు 13 మంది మహిళలు, విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్లతో సైకో దాడి చేశాడు. ఈనెల 22న యండగండి గ్రామంలో ఇద్దరు విద్యార్థినులపై దాడిచేసి గాయపర్చిన సైకో మంగళవారం మరో ఆరుగురు మహిళలపై దాడి చేశాడు. బుధవారం పెనుగొండ సమీపంలోని చెరుకువాడలో ఉదయం 6 గంటల వేళ వాకిలి ఊడ్చుతున్న గృహిణి కొమ్మిరెడ్డి హేమలత (27)కు ఇంజెక్షన్ పొడిచి పరారయ్యాడు. అదే మండలంలోని సిద్ధాంతంలో 6.30 గంటలకు కృష్ణకుమారి (16) అనే బాలికపై ఇంజెక్షన్‌తో దాడికి పాల్పడ్డాడు. 7.30కు పోడూరు మండలం కవిటం లో సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న విద్యార్థిని కొవ్వూరి తేజశ్రీ (17)కి వెనుకవైపుగా వచ్చి ఇంజెక్షన్ చేసి పరారయ్యాడు. వీరవాసరం మండలం కొణితివాడలో విద్యార్థిని కేతా విజయ(17)పై కూడా ఇదే విధంగా దాడిచేశాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు నలజర్లలోని గంటా చంటి (21) అనే మహిళపై సిరంజి గుచ్చి పరారయ్యాడు. బాధితులు స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, సైకో వినియోగిస్తున్నది ఇంజెక్షన్లు కాదని, అది స్టిచ్చింగ్ నీడిల్ మాత్రమేనని నార్త్ కోస్టల్ ఐజీ కుమార విశ్వజిత్ తెలిపారు. బాధితుల రక్తం ల్యాబ్‌లకు పంపగా, ఎటువంటి రసాయనాలు, మత్తుమందులు లేవని తేలిందని తెలిపారు. -
ఆదర్శం.. ఆమె జీవనం
కొంతమందికి పదవులు వన్నె తెస్తాయి. మరి కొందరు పదవులకే వన్నె తెస్తారు. రెండో కోవకు చెందిన వ్యక్తే పుత్తిలివారిపల్లె సర్పంచ్ నారమల్లి హేమలత. సర్పంచ్‌గా ప్రజలు పట్టం కట్టినా భేషజాలకు పోకుండా కూలి పనులకు వెళుతూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. ఆమె జీవనం ఆదర్శం.. ఆ మార్గం అనుసరణీయం. చంద్రగిరి: మండలంలోని పులిత్తివారిపల్లె పంచాయతీకి అనుబంధంగా నాలుగు గ్రామాలున్నాయి. ప్రజలు దళితులు కావడంతో నాలుగు గ్రామాలను కలుపుతూ గత ప్రభుత్వం ఒక పంచాయతీని గుర్తించింది. గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ తరపున నారమల్లి హేమలత బరిలో నిలిచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీలకతీతంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చే స్తున్నారు. సర్పంచ్ అనే డాబు, దర్పం లేకుండా ఆమె సాధారణ మహిళగా ఉపాధి పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నారమల్లి హేమలత సొంత గ్రామం చిన్నగొట్టిగల్లు మండలంలోని తట్టేవారిపాళ్యం. పొట్టిగానితోపునకు చెందిన రాణెమ్మ, కృష్ణయ్యల మొదటి కుమార్తె. తిరుపతిలోని ప్రభుత్వ హాస్టల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు. 2000లో చంద్రగిరి మండలంలోని పులిత్తివారిపల్లెకి చెందిన ఎంపీ శివప్రసాద్ బంధువు నారమల్లి ప్రసాద్‌ను వివాహమాడారు. గ్రామంలో అందరితో కలసి మెలసి ఉంటూ సమస్యలను పరిష్కరించే వారు. ఏడాది కిందట సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. ఓపక్క గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులతో సంప్రదిస్తూ, మరోపక్క సాధారణ మహిళగా కూలి పనులు చేస్తున్నారు. ఈ ఏడాది పులిత్తివారిపల్లిలో కరువు కాటేసింది. దీంతో గ్రామ ప్రజలకు కూలి పనులు లేక వలస వెళుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలో ఉపాధి హామీ పనులు కూడా లేకపోవడంతో సర్పంచ్, గ్రామస్తులు సమీప పంచాయతీల్లో కూలి పనులు చేసుకుంటున్నారు. సొంత గ్రామంలో కరువు విలయ తాండవం చేస్తున్నా ఎంపీ శివప్రసాద్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ఎన్నో కీలక పదవుల్లో కొనసాగిన శివప్రసాద్ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రంగారెడ్డి జిల్లా కీసరలో దారణం
రంగారెడ్డి జిల్లా: కీసరలో దారణం చోటుచేసుకుంది. సాయి అనే యువకుడు తన భార్య హేమలతకు లింగనిర్ధారణ పరీక్ష చేయించాడు.ఆమెకు ఆడశిశువని తేలడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిసున్నారు. -
కన్న తండ్రే... కాలయముడయ్యాడు
బెంగళూరు, న్యూస్‌లైన్ : పాఠశాలకు సెలవు ఆమె పాలిట మృత్యువైంది. కంటి రెప్పలా కాపాడుతాడనుకున్న తండ్రే కాలయముడయ్యాడు. పాశావికంగా కన్న తండ్రే దాడి చేస్తుంటే తప్పించుకోలేని అసహస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. విగతజీవిలా పడి ఉన్న కూతురిని గమనించి బెంబేలెత్తిన ఆ కిరాతకుడు చివరకు ఆత్మహత్యాయత్నం చేశాడు. పరప్పన అగ్రహార పోలీసుల సమాచారం మేరకు ... తమిళనాడులోని వేలూరుకు చెందిన బాలరాజు(38), కవిత దంపతులు. ఏడేళ్ల క్రితం బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సమీపంలోని ద్వారకానగరలో నివాసముంటున్నారు. వీరికి హేమలత(12) అనే కూతురు ఉంది. ఈమె అక్కడికి సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతోంది. ఏడాది క్రితం వరకు సెక్యూరిటీ గార్డుగా బాలరాజు పనిచేసేవాడు. తర్వాత మానసిక అస్వస్థతకు గురికావడంతో ఇంటిలోనే ఉంటున్నాడు. ఇతనికి వేలూరులో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం ఓ ప్రైవేట్ కంపెనీలో హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా కవిత పనిలో చేరింది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కవిత ఉద్యోగానికి వెళ్లింది. స్కూల్‌కు సెలవు కావడంతో హేమలత, తన తండ్రి వద్దే ఉంది. ఆ సమయంలో బాలరాజు విచిత్రంగా ప్రవర్తిస్తూ కూతురిపై దాడి చేసి ఉరి వేసేందుకు ప్రయత్నించాడు. అతని చర్యలను ఆమె ప్రతిఘటించడంతో మూటకట్టి పెట్టిన పాత ఫ్యాన్‌తో హేమలత తలపై బాది హతమార్చాడు. కొద్ది సేపటి తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న కూతురిని చూసి బెంబేలెత్తిన అతను విషం తాగి పడిపోయాడు. మధ్యాహ్నం కవిత తన భర్త మొబైల్‌కు ఫోన్ చేసింది. స్పందన లేకపోవడంతో అదుర్దాగా ఇంటికి చేరుకుంది. అక్కడ కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండడం, ఆ పక్కనే అపస్మారక స్థితిలో పడి ఉన్న భర్తను గమనించి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు చేరుకుని ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హేమలత మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. విక్టోరియా ఆస్పత్రిలో బాలరాజుకు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.