పెళ్లయిన నెల రోజులకే నవ దంపతులకు నూరేళ్లు నిండిపోయాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పలకగనుల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. పెద్దారవీడు మండలం స్థానికవరం గ్రామానికి చెందిన తోట శివ (25), తోట హేమలత (21) కొనకనమిట్లలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతున్నారు.
మార్కాపురం పలకలగనుల వద్ద వీరి వాహనాన్ని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్ర గాయాలతో శివ, హేమలత ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. వీరికి నెల క్రితమే వివాహం జరిగినట్టు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.