Prakasam district
-
మీ ఊరు కాదంటున్నారు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆ ఊరికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. నాలుగు తరాలుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఇళ్లు.. ప్రభుత్వ పాఠశాల.. చెరువు.. ఆయకట్టు కింద పొలాలూ ఉన్నాయి. అయినా, సరే ఇప్పుడిది మీ ఊరు కాదంటున్నారు అటవీ శాఖ అధికారులు. చెట్టు.. పుట్ట, ఇళ్లు, పొలాలన్నీ మీవి కావు. దీనిమీద మీకు హక్కులు లేవు. ఇది అటవీ శాఖకు చెందిన సంపద అని అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంతో కోల్పోయిన భూములకు వచ్చిన నష్ట పరిహారాన్ని కూడా వారి ఖాతాలో వేసుకున్నారు. అడుగు తీసి అడుగేయాలన్నా అనుమతి తీసుకోవాలంటున్నారు. ఇలా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరజాముల తండా వాసులపై కొంతకాలంగా జులుం ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెంకు 20 కిలోమీటర్ల దూరంలో.. జాతీయ రహదారి పక్కనే ఉండడం ఈ తండాకు తంటాలు తెచ్చిపెడుతోంది. మారుమూల అటవీ ప్రాంతంలోని నరజాముల తండాలో 290 కుటుంబాలకు పైగా జీవిస్తున్నాయి. అందరూ సుగాలీలే. పశువులను మేపుతూ, కట్టెలు కొడుతూ యర్రగొండపాలెంలో అమ్ముతూ పొట్ట పోసుకుంటుంటారు. కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు. అయితే, ఆదివాసీలకు జరిగే అన్యాయాన్ని సరిచేసే పేరుతో తెచ్చిన అటవీ హక్కుల చట్టం–2006 ఇప్పుడు వీరి నెత్తిన కత్తిలా వేలాడుతోంది. వేసవిలో మంచినీటి బోర్లు వేసుకోవడానికి లేదు.. పొలాలకు వెళ్లనీయరు.. జీవాలను మేపుకొనేందుకు అడవిలోకి వెళ్తే కేసులు పెడుతున్నారు.. పాములు, క్రూర జంతువుల నుంచి ఆత్మరక్షణకు గొడ్డలి తీసుకెళ్తే లాక్కుంటున్నారు. ఆఖరికి పశువులనూ స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలోని మౌలిక సమస్యలను ఉద్దేశపూర్వకంగానే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రెండెకరాల పరిహారం అటవీ శాఖ ఖాతాలోకి.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో రెండు ఎకరాలు హైవే నిర్మాణంలో పోయింది. పరిహారం కోరితే అటవీ శాఖ భూమి అని అంటున్నారు. మా భూమికి వారు డబ్బులు తీసుకోవడం ఏం న్యాయం? – నరసింహనాయక్, నరజాములతండా గిరిజనులపై ఆంక్షలు పెరిగిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లమల అడవుల్లో జీవించే గిరిజనులపై ఆంక్షలు, దాడులు పెరిగిపోయాయి. వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఇళ్ల నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం చేస్తున్నారు. కాయ కష్టంతో పండించిన పంటను అమ్ముకోనీయకుండా కూటమి ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతోంది. గిరిజనుల బాధలను గుర్తించిన వైఎస్ అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదుకున్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ పక్కా ఇళ్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజనులపై అటవీ అధికారులను ఉసిగొల్పుతోంది. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఈ దారుణాలు కనిపించడం లేదు. మొద్దు నిద్ర వీడి గిరిజన ప్రాంతాలను సందర్శించి స్థానికుల బాధలు తెలుసుకుని పరిష్కరించాలి. – తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, యర్రగొండపాలెంహైవేతో పెరిగిన సమస్యలు నాలుగేళ్ల క్రితం యర్రగొండపాలెం–హైదరాబాద్ రహదారి నేషనల్ హైవే 565 అయింది. మల్లాపాలం దాటాక 5 కిలోమీటర్ల నుంచి దావపల్లి వరకు 20.09 కిలోమీటర్ల మేర దండకారణ్యం ఉంది. అటవీ ప్రాంతానికి అవతల వరకు హైవే నిర్మాణమైంది. అనుమతులు రావడంతో ఇటీవల అడవిలోనూ పనులు మొదలుపెట్టారు. నరజాముల తండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు, పొలాలు హైవేలో పోయాయి. స్థానికులతో చర్చించకుండా, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా అటవీ శాఖ కొట్టుకుని తీసుకుపోయింది. ఈ మేరకు నష్ట పరిహారం చెల్లించాలని గిరిజనులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఏమయ్యారు?నరజాముల తండాలో 400 ఎకరాల రెవెన్యూ స్థలం ఉంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 47 సెంట్ల నుంచి 10 ఎకరాల వరకు పొలాలకు పట్టాలు ఇచ్చారు. పాస్ పుస్తకాల ద్వారా గిరిజనులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 1972లో 250 ఎకరాలలో చెరువు నిర్మించగా ఆయకట్టు కింద 800 ఎకరాలు సాగవుతున్నాయి. 50 ఏళ్ల కిందటే ప్రభుత్వ పాఠశాల, అనుబంధంగా హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం నిరి్మంచారు. ఇలా అన్ని సౌకర్యాలను కల్పిoచినపుడు అటవీ అధికారులు ఎక్కడకు పోయారని గిరిపుత్రులు నిలదీస్తున్నారు. ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు కన్నతల్లిలాంటి ఊరిని కాపాడుకునేందుకు సుగాలీలు సిద్ధమవుతున్నారు. గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. వదిలి వెళ్లేది లేదని తెగేసి చెబుతూ.. ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తమ ఇళ్లు, పొలాలను రెవెన్యూ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. -
పత్తి మానుకొని.. సిరిధాన్యాల సాగు!
ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి సాగులో, అందునా విత్తనోత్పత్తిలో నైపుణ్యం సాధించిన సీనియర్ రైతు కందిమళ్ల వేణుబాబు(52) ఆరేళ్ల క్రితం తన దృష్టిని సిరిధాన్యాల వైపు మళ్లించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వేణుబాబు మూడు దశాబ్దాల క్రితం కర్నూలు జిల్లాకు వలస వచ్చి స్థానికంగా దేవాలయ భూములను కౌలుకు తీసుకొని విత్తనోత్పత్తి లక్ష్యంగా పత్తి సాగు చేస్తుండేవారు. మరో 8 మంది రైతులతో కలసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్నిప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన తల్లికి కేన్సర్ వ్యాధి సోకటంతో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాల గురించి ఆలోచించారు. కర్నూలులో డాక్టర్ ఖాదర్‌వలి సభకు హాజరై సిరిధాన్యాల ఆహారంలో ఔషధ గుణాల గురించి తెలుసుకున్నారు. అప్పటికే పత్తి విత్తన రంగంలో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా పత్తి సాగుకు స్వస్తి చెప్పి సిరిధాన్యాల సాగు వైపు పూర్తిగా దృష్టి మళ్లించారు.32 ఎకరాల్లో సిరిధాన్యాల సాగు 2019లో తొలిసారి ఏడు ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రల సాగుకు శ్రీకారం చుట్టారు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోఒకే చోట 25 ఎకరాల దేవాలయ భూములను కౌలుకు తీసుకొని వర్షాధారంగా ఖరీఫ్‌లో సిరిధాన్యాలతో పాటు అంతర పంటగా కంది సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం గల మరో 7 ఎకరాల్లో ఖరీఫ్‌లో అండుకొర్ర పండిస్తున్నారు. రెండో పంటగా కంది, దోస సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేస్తారు. వేస్ట్ డీ కంపోజర్‌ను 4 సార్లు, పుల్ల మజ్జిగను రెండు సార్లు ట్రాక్టర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయిస్తారు. 8 క్వింటాళ్ల కొర్రలతో పాటు ఎకరానికి 5 క్వింటాళ్ల కంది దిగుబడి పొందుతున్నారు. కందులతో పాటు ఎకరానికి అరికలైతే 7 క్వింటాళ్లు, సామలు 3 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోందని వేణుబాబు తెలిపారు. మిషన్‌తో పంట కోయిస్తే ఎకరానికి రూ. 10 వేలు, కూలీలతో కోయిస్తే రూ. 15 వేల వరకు సాగు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.సొంతప్రాసెసింగ్ సొంతప్రాసెసింగ్ యూనిట్యూనిట్సిరిధాన్యాలను పండించి టోకుగా అమ్మటం కన్నా బియ్యంగా మార్చి రిటైల్‌గా అమ్మటం ద్వారా అధికాదాయం వస్తుందని తొలిదశలోనే గుర్తించిన వేణుబాబు రూ. 15 లక్షలతో సొంతప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాను పండించిన సిరిధాన్యాలతో పాటు ఇతర రైతులు పండించినవి కూడా కొని, మరపట్టించి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పురుగుల బెడద లేకుండా వ్యాక్యూమ్ ΄్యాకింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. సుమారు 3 వేల మందికి నేరుగా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అమ్ముతున్నారు. సాగు చేసి అమ్మటమే కాదు కుటుంబ సభ్యులంతా చిరుధాన్యాల ఆహారమే తీసుకుంటుండటం విశేషం. ఈ ఆహారంతో తాను బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నానని వేణుబాబు సంతోషిస్తున్నారు. వినియోగ దారుల ఆదరాభి మానాలు పొందాలంటే రాళ్లు, ఇసుక రాకుండా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అందించటం చాలా ముఖ్యమన్నారు.కలెక్టరేట్లో మిల్లెట్ కేఫ్చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సృజన కలెక్టరేట్ ఆవరణలో మిల్లెట్ కేఫ్ప్రారంభానికి వేణుబాబుకు అవకాశం ఇచ్చారు. సిరిధాన్యాల భోజనంతో పాటు జావ, లడ్డూలు, మురుకులు, బ్రెడ్ తదితర ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తమ వద్ద రోజువారీగా సిరిధాన్యాల ఆహారం తినే వారిలో 60% మంది యువతేనని ఆయన చెబుతున్నారు. క్వింటా రూ.4 వేలకు ప్రభుత్వం కొనాలిసిరిధాన్యాలకు గత ఏడాది మంచి ధర రావటంతో సాగు ఈ ఏడాది 50% పెరిగింది. గత సంవత్సరం కొర్ర ధాన్యం క్వింటా రూ. 5–6 వేలు పలికితే, ఈ ఏడాది 2,500కి పడిపోయింది. అండుకొర్రలు గత ఏడాది క్వింటా రూ. 8 వేలు పలికితే ఈ ఏడాది రూ.3,500కి పడిపోయింది. ఏ రకం సిరిధాన్యమైనా క్వింటా రూ. 4 వేలైతేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. సిరిధాన్యాల సాగు విస్తీర్ణం స్థిరంగా పెరగాలంటే ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున కొనాలిæలేదా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. దీంతో పాటు.. మినీ హార్వెస్టర్లను రైతులకు సబ్సిడీపై అందించాలి. వీటితో రైతులే స్వయంగా పంట కోసుకోవచ్చు. మహిళలు కూడా వీటిని ఉపయోగించగలుగుతారు. సిరిధాన్యాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. మా దగ్గర ఇద్దరు ఆయుర్వేద వైద్యులు రోగులకు విధిగా సిరిధాన్యాల ఆహారాన్నే సూచిస్తున్నారు. వారి కోసం అర కేజీ ΄్యాకెట్ల కిట్లను అందిస్తున్నాం. సిరిధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ.. నికరాదాయం ఎక్కువ. పూర్తి సంతృప్తి ఉంది. మా ఇంట్లోనూ సిరిధాన్యాలనే తింటూ ఆరోగ్యంగా ఉన్నాం. – కందిమళ్ల వేణుబాబు (94408 61443), చిరుధాన్యాల రైతు, కర్నూలు – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు -
ముగిసిన రాంగోపాల్ వర్మ విచారణ
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రాంగోపాల్ వర్మ వచ్చారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో చంద్రబాబు, పవన్‌పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ.. ఇవాళ విచారణకు హాజరయ్యారు.ముగుసిన అర్జీవి విచారణమధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు రాం గోపాల్ వర్మ ను విచారించారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు.మద్దిపాడు పీఎస్ 0 గంటల పాటు అర్జీవి విచారించారు. విచారణ ముగిసిన అనంతరం రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌కు బయల్దేరారు. -
ఇంటూరి రవికిరణ్‌పై ప్రకాశం జిల్లా పోలీసుల దురుసు ప్రవర్తన
సాక్షి, ప్రకాశం జిల్లా: సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు షరతు మేరకు సంతకం పెట్టేందుకు ప్రకాశం జిల్లా మార్టూరు స్టేషన్‌కు వెళ్లిన ఇంటూరిని.. అక్కడ నుంచి పర్చూరుకు సిఐ తీసుకెళ్లారు. ఇంటూరి రవి కిరణ్.. ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా పర్చూరు పోలీసులు దురుసుగా వ్యవహరించారు.కిడ్నాపర్లలా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకొని గుర్తు తెలియని ప్రదేశంలో ఇంటూరి రవి కిరణ్‌ను వదిలేశారు. కనీసం ఏ కేసుపై తీసుకొని వెళ్ళారో కూడా చెప్పని సీఐ శేషగిరి రావు.. ఇంటూరిని ఇబ్బంది పెట్టిన అంశంలో ఇదే సీఐకు న్యాయస్థానం షాకాజ్ నోటీసులు ఇచ్చింది. కక్ష సాధింపులో భాగంగా మరో అక్రమ కేసు బనాయించడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
ఐదేళ్లుగా ఆ పాపకు.. పాలు, నీళ్లే ఆహారం
మార్కాపురం: అన్న ప్రాసన రోజు అందరిలాగే తమ చిన్నారికి సంతోషంగా అన్నంపెట్టారు ఆ దంపతులు. వెంటనే వాంతి (Vomiting) చేసుకుంది. తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. మరుసటిరోజూ అన్నం పెట్టారు. మళ్లీ అదే పరిస్ధితి. ఇలా ఒక నెలరోజులు జరిగే సరికి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పలు కార్పొరేట్ వైద్యశాలలను సంప్రదిస్తే ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి (Rare Disease) సోకిందని వైద్యులు చెప్పారు. అన్నవాహిక, పెద్దపేగు మూసుకుపోవడంతో ఏం తిన్నా వాంతులు అవుతున్నాయని చెప్పారు. పాలు.. నీళ్లు మాత్రమే తాగించాలని వైద్యులు చెప్పడంతో, ఆ చిన్నారి గత ఐదేళ్ల నుంచి పాలు, నీళ్లతోనే బతుకుతోంది. రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం వారిది. ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని జార్జిఫార్మసీ కళాశాల వెనుక ఉండే మంచా భాస్కర్, కృష్ణవేణి దంపతుల కన్నీటి వ్యధ ఇది. మార్కాపురం (Markapuram) పట్టణంలోనే ఒక ఆసుపత్రిలో భాస్కర్ కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. పాపకు రక్షణ అనే పేరును పెట్టుకున్నా, ఆమె ప్రాణాలకు రక్షణ కల్పించలేని దీనస్థితిలో ఉన్న ఆ దంపతులు దాతల దయ కోసం ఎదురు చూస్తున్నారు. రూ.8 లక్షలు ఖర్చవుతుందన్నారు...ప్రస్తుతం మా చిన్నారి అంగన్వాడీ పాఠశాలకు వెళుతోంది. ఆపరేషన్ చేస్తే ఇబ్బంది తొలగుతుందని వైద్యులు చెప్పారు. అయితే అందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. పాప వైద్యం నిమిత్తం ప్రతి 2 నెలలకు ఒకసారి రాజమండ్రికి వెళ్లి రూ.25 వేలు ఖర్చుపెట్టుకుని వస్తున్నాం. దాతలు స్పందించి వైద్యానికి ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాం. స్పందించే దాతలు 83743 89936 నంబరుకు సాయం చేయాలని కోరుతున్నాం. – భాస్కర్, రక్షణ తండ్రి చదవండి: పసికందుకు హెల్త్ ప్రాబ్లమ్.. పూడ్చిపెట్టడానికి తల్లిదండ్రుల యత్నం -
పచ్చని కాపురంలో చిచ్చురేపిన అనుమానం!
కంభం(ఒంగోలు): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పై అనుమానంతో ఉన్న భర్త దాడి చేసి ఆమెను హత్య చేసిన ఘటన ఆదివారం కంభంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన అర్థవీటి నాగ అంజలి(40)కి 26 సంవత్సరాల క్రితం కంభం పట్టణంలోని సాదుమియా వీధికి చెందిన శివరంగయ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉండగా ముగ్గురికి వివాహాలయ్యాయి. శివరంగయ్య లారీడ్రైవర్ గా పనిచేస్తూ చిన్నపాటి ఫైనాన్స్ లు నడుపుకుంటుండగా, భార్య పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భార్య, భర్తల మద్య గొడవ జరగగా భార్యను చెక్కతో కొట్టడంతో ఆమె తలకు బలమైన గాయాలై మంచంపై పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ కె.మల్లిఖార్జున, ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు సంఘటన జరిగిన ఇంటి వద్దకు వచ్చి విచారించారు. మార్కాపురం క్లూస్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించారు. కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.అనుమానంతోనే హత్య చేశాడా..:భార్య, భర్తల మధ్య అప్పుడప్పుడూ చిన్నపాటి గొడవలు జరుగుతుండేవని తెలిసింది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో అల్లుడు తన కుమార్తెతో గొడవపడుతున్నాడని తన మనుమరాలు ఫోన్ చేసి చెప్పిందని, తెల్లవారే సరికే ఇలా రక్తపు గాయాలతో చనిపోయి పడి ఉందని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. తన కూతురిపై అనుమానంతోనే అల్లుడు కొట్టి చంపేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల అదుపులో నిందితుడు?భార్య మృతి చెందిన విషయం తెలుసుకున్న శివరంగయ్య ఆదివారం తెల్లవారుజామునే పోలీస్‌స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయినట్లు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. -
భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన రైతులు
-
ముండ్లమూరును వదలని భూప్రకంపనలు
ముండ్లమూరు (దర్శి): ప్రకాశం జిల్లా ముండ్లమూరులో సోమవారం మళ్లీ భూమి కంపించింది. ఉదయం 10:24 గంటల సమయంలో భూకంప రాగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైంది. సోమవారం రాత్రి మరో రెండుసార్లు ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లో భూమి కంపించింది. రాత్రి 8:16 గంటలకు, 8:19 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. నివాసాల్లోని ప్రజలు, దుకాణాల్లోని వ్యాపారులు ఒక్కసారిగా వచ్చిన శబ్దానికి ఏం జరిగిందోననే భయంతో బయటకు పరుగులు తీశారు. మ్యాప్‌లో ముండ్లమూరు–ఉమామహేశ్వరపురం మధ్య భూకంప కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా శని, ఆది, సోమవారాల్లో ఉదయం ఒకే సమయంలో భూకంపం రావడం, రాత్రి మరో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునేవారు సైతం ప్రతిరోజు వస్తున్న భూకంపంపై ఆందోళన చెందుతున్నారు. ముండ్లమూరులో ఈ నెలలో 4, 21, 22, 23 తేదీల్లో భూకంపం వచ్చింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మోడల్ స్కూల్ భవనం పాక్షికంగా దెబ్బతింది. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లలో ఉండాలంటే భయపడుతున్నారు. చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు. ముండ్లమూరులో ఏర్పడిన భూకంపం గుండ్లకమ్మ నది ప్రాంతంలో కేంద్రీకృతమై వచ్చిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శనివారం ఉదయం 10:35 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1గా నమోదైంది. ఆదివారం ఉదయం 10:41 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 2.1గా, సోమవారం 10.24 గంటల సమయంలో నమోదైన భూకంప తీవ్రత 1.8గా నమోదైంది. పరిశోధన చేయాలి ముండ్లమూరులో వరుసగా మూడుసార్లు భూకంపం రావడంపై శాస్త్రవేత్త రాఘవన్ కొన్ని వివరాలు అందజేశారు. వరుసగా మూడుసార్లు ఒకే సమయంలో ఎందుకు వచ్చిందో పరిశోధన చేస్తే తెలుస్తుందన్నారు. అక్కడకు దగ్గరలో రిజర్వాయర్లు, గుండ్లకమ్మ వంటి నదుల్లో రీసెర్చ్ చేయాల్సి ఉందన్నారు. ముండ్లమూరు ప్రాంతంలో వచ్చిన భూకంపాన్ని హైడ్రోశాస్మసిటీగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. ‘భూకంపం స్వామ్ లోపల వీక్ జోన్ ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే తరుచూ ఇదే ప్రాంతంలో ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంది’ అన్నారు. ఈ ప్రాంతంలో పరిశోధన చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు.కలెక్టర్‌కు నివేదించాంభూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కలెక్టర్ అడిగిన నివేదికలు పంపించాం. దానిపై కలెక్టర్ నుంచి వచ్చే ఉత్తర్వులు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.– శ్రీకాంత్, తహసీల్దార్ ఆందోళనగా ఉందిఉదయం 10.30 గంటల సమయంలో మూడు రోజులుగా వరుస భూకంపాలు వస్తున్నాయి. రోజూ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనగా ఉంది. – శ్రీనివాసరావు, వ్యాపారి, ముండ్లమూరుబెంచీలు బాగా ఊగాయి చాలా భయం వేసి చెట్టు కిందే కూర్చుని చదువుకుంటున్నాం. పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్కూల్లో పిల్లలంతా బయటకు పరుగులు తీశాం. మూడు రోజులుగా ఇదే జరుగుతోంది. పిల్లలందరూ భయంతో ఉన్నారు. – నవ్యశ్రీ, మోడల్ స్కూల్ విద్యార్థిని -
అకాల వర్షం.. మిర్చి రైతుకు అపార నష్టం
-
ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం
-
ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో ఆదివారం ఉదయం 10:40 గంటల సమయంలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సింగన్నపాలెం, మారెళ్లలోనూ భూమి కంపించింది. దీంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక, శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లురులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శనివారం రిక్టార్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. కాగా, గత మూడేళ్ల కాలంలో ఇక్కడ వరుసగా భూ ప్రకంపనలు వస్తున్నాయి. దీంతో, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ఎక్కడంటే?
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మండ్లమ్మురు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్లు శనివారం ఉదయం భూమి కంపించింది. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని మండ్లమ్మురు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించింది. ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు వచ్చాయి. అదే సమయంలో ఏపీలో విశాఖ సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. -
చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం
చీమకుర్తి: గంజాయి రవాణా విషయంలో పదో తరగతి విద్యార్థి కిడ్నాప్ వ్యవహారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన యాసిన్, నరసరావుపేటకు చెందిన సంతోష్, చిలకలూరిపేటకు చెందిన అమీర్లు గంజాయి వ్యాపారంలో ఆరితేరారు. ఇందు కోసం వారు తరచూ అరకు ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వారికి అల్లూరి జిల్లా అరకు మండలం మాడగడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి పరిచయం అయ్యాడు. ఈ విద్యార్థి చదువుకుంటూనే ఓ గంజాయి ఏజెంట్ వద్ద పని చేస్తున్నాడు.ఈ విషయం తెలుసుకున్న వారు ఆ విద్యార్థితో పరిచయం పెంచుకుని గంజాయి కావాలని అడిగారు. ఆ విద్యార్థి తన బంధువుకు తొలి విడతగా రూ.50 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం వారికి గంజాయి పంపలేదు. డబ్బులు పోగా, గంజాయి కూడా రాకపోవడంతో వారు నేరుగా అరకు ప్రాంతానికి వెళ్లి ఆ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. తమకు రూ.లక్ష ఇస్తే విడిచి పెడతామని చెప్పారు. ఇందుకు ఆ విద్యార్థి సమ్మతించక పోవడంతో శుక్రవారం చీమకుర్తి మీదుగా కారులో వినుకొండ తీసుకెళ్లారు. రాత్రి అక్కడి గాంధీనగర్‌లోని శ్రీనాథ్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్లారు.బాడుగ కోసం కారు డ్రైవర్ గొడవ చేయడంతో అతన్ని పంపించేశారు. అనంతరం కిడ్నాపర్లు మద్యం తాగి, మత్తులో ఉండటాన్ని గమనించిన ఈ విద్యార్థి తప్పించుకున్నాడు. రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యార్థి చెప్పిన వివరాల మేరకు పోలీసులు కిడ్నాపర్లు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అంతలో వారు ఆటోలో పరారయ్యారు. పోలీసులు వెంట పడిన క్రమంలో ఆటో ఒక చోట బోల్తా పడింది. యాసిన్ పోలీసులకు పట్టుబడగా, మిగతా ఇద్దరు పారిపోయారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరకు పోలీసులు శనివారం చీమకుర్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి విద్యార్థిని, కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని అరకు తీసుకెళ్లారు. కాగా, ముగ్గురు కిడ్నాపర్లపై ఇప్పటికే ఒక్కొక్కరిపై 15–20 కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. -
గండిచెరువు సమీపంలో పెద్దపులి సంచారం
పెద్దదోర్నాల: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గండిచెరువు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నదనే సమాచారం ఆ ప్రాంతవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం సమీపంలోని పంట పొలాలకు వెళ్లారు. వారికి అదే ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కంటబడింది. దీంతో హడలిపోయిన రైతులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో పులి పాదముద్రలు సేకరించడంతో పాటు, అది సంచరించిన ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట అదే ప్రాంతంలో ఓ రైతుకు సంబంధించిన ఎద్దుపై పులి దాడి చేసిందన్న వార్త కూడా రైతుల్లో భయాందోళనలు కలగజేస్తోంది. ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి పెద్దపులి సంచారం ఉందని, దేవలూరు వద్ద బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొంటున్నారు. -
బాలినేని జనసేనలోకి వెళ్లినా వదలను.. టీడీపీ నేత వార్నింగ్
సాక్షి, ప్రకాశం జిల్లా: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేరిక కూటమిలో చిచ్చు రేపుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ సమక్షంలోనే టీడీపీ నేత ఎద్దు శశికాంత్ రెచ్చిపోయారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి జనసేనలోకి వెళ్లినా వదలనంటూ బెదిరింపులకు దిగారు. బాలినేని జనసేనలోకి చేరడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేపోతున్నారు. ఎవరిని అడిగి బాలినేనిని జనసేనలోకి చేర్చకున్నారంటూ ప్రశ్నించారు.వాడు వీడు అంటూ బాలినేనిపై శశికాంత్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు భాగస్వామ్య పార్టీల మనోభావాలు గౌరవించాలి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నామన్నది పవన్ కల్యాణ్ గుర్తుంచుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలినేనికి జనసేన కండువా వేస్తే మా రక్తం మరిగింది. కూటమిలో ఉండి తమను సంప్రదించాలన్న ఇంగితం కూడా లేదా?. ఓడిపోయినవాళ్లను చేర్చుకుంటే మేము కూడా మా దారిలో వెళ్తాం’’ అని తేల్చి చెప్పారు. కాగా, శశికాంత్ భూషణ్ వ్యాఖ్యలను జనసేన జిల్లా అధ్యక్షుడు ఖండించారు. పవన్‌పై శశికాంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు. -
ఆర్మేనియాలో ఆంధ్రా యువకుడి మృతి
పెద్దదోర్నాల: జీవనాధారం కోసం ఆర్మేనియాకు వెళ్లిన ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దదోర్నాల మండల పరిధిలోని హసానాబాదకు చెందిన చిన్న ఆవులయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఒంటేరు శివనారాయణ (31) బీటెక్ పూర్తి చేసి యూరప్‌లోని ఆర్మేనియాలో ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం తల్లిదండ్రులకు తాను మరో కంపెనీలో ఉద్యోగంలో చేరానని, అక్కడే నలుగురు కలిసి రూం తీసుకుని ఉంటున్నామని తెలిపాడు. గురువారం మద్యం పార్టీ చేసుకున్న మిత్రులు తనకు ఓ బాటిల్లో నీరు ఇచ్చారని, అది తాగటం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపాడు. అనంతరం తాను వైద్యశాలలో చేరినట్లు శుక్రవారం సమాచారం అందించాడు. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులకు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలను పంపించిన సహచరులు.. అదే రోజున శివనారాయణ చనిపోయాడంటూ సమాచారం అందించడంతో తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. సహచరుల తీరుపై అనుమానాలు.. ‘రూ.2 లక్షల పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే మృతదేహాన్ని ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేసిన శివనారాయణ సహచరులపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, సమాచారం ఇచ్చినప్పటి నుంచి వారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఏం చేయాలో అర్ధంకాక మృతుని తల్లిదండ్రులు, దిక్కతోచని స్థితిలో విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. -
ఈసీకి బాలినేని ఫిర్యాదు.. 19 నుంచి ‘ఒంగోలు’ ఈవీఎంల చెకింగ్
సాక్షి, ఒంగోలు అర్బన్: ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను విలేకర్లు అడగగా.. జరిగేది రీకౌంటింగ్ కాదని, డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుందని చెప్పారు.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించనున్నట్టు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు రెండు ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్‌రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్‌లు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
వైఎస్సార్సీపీ శ్రేణుల నిర్మాణాల ధ్వంసం
కనిగిరి రూరల్: ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారులను అడ్డంపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సుమారు రూ.కోటి విలువైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లు, నిర్మాణాలను ఆదివారం కూలగొట్టించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల సహాయంతో పోలీస్ బందోబస్తు మధ్య పొక్లెయిన్లతో విరుచుకుపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. కనిగిరి మున్సిపాలిటీ కాశిరెడ్డినగర్ సమీపంలో ఎస్కే హుస్సేన్‌బీ పేరుతో 1976లో పాస్‌బుక్ పట్టా ఉంది. హుస్సేన్ పేరుతో 863ఏ సర్వే నంబరులో ఉన్న 4.56 ఎకరాలకు సంబంధించి 1976–2008 సంవత్సరాల మధ్య 10 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తరువాత ఆ భూమి క్రయవిక్రయాలు జరిగాయి. ఆ భూమిలో పలువురు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంటిపన్ను కడుతున్నారు. విద్యుత్ కనెక్షన్లున్నాయి. మరికొంత భూమిలో పదేళ్ల కిందటే ఐదారుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు రేకులòÙడ్లు, కట్టడాలు, ప్రహరీలు నిర్మించుకున్నారు. తాజాగా మరికొందరు వారి స్థలాలకు ప్రహరీలు కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కక్షసాధింపులో భాగంగా ఎమ్మెల్యే ఉగ్ర ముందుగా ఒక పక్షపత్రికల్లో ఆ భూమి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఆక్రమించారని రాయించి, కనీస సమాచారం ఇవ్వకుండా ఆదివారం సెలవురోజు అయినా ఒక్కసారిగా ఆర్డీవో జాన్ ఇరి్వన్, మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు సమక్షంలో నిర్మాణాలను కూల్చివేశారు. గతంలో సర్వే నంబరు 863ఎలోని 4.56 ఎకరాలను మున్సిపాలిటీ భవన నిర్మాణానికి కేటాయించి ఉన్నట్లు, అసైన్డ్ భూమి కింద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఆ భూమిని మున్సిపాలిటీకి కేటాయించినప్పుడు భూ హక్కుదారులు కోర్టుకు వెళ్లారు. దానిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్లు, కట్టడాలను ధ్వంసం చేయించారు. హైకోర్టు, ఆర్డీవో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నా.. అధికారులు ఆదివారం కూల్చేసిన భవన నిర్మాణాలకు సంబంధించిన స్థల వివాదం ప్రస్తుతం ఆర్డీవో కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై శేఖర్, బ్రహ్మయ్య, బాషా తదితరులు కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేశారు. అయినా అవేమీ లెక్క చేయకుండా ఆక్రమణల తొలగింపు పేరుతో ఆదివారం కూల్చేశారు. కనీసం తమకు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చేస్తున్నారంటూ నిర్మాణదారులైన ఖాశిం, రసూల్, బ్రహ్మయ్య అధికారులను అడిగినా పట్టించుకోలేదు. బాధితులు శ్రీను, రసూల్, ఖాశిం, బ్రహ్మయ్య, బాషా తదితరులు హైకోర్టులో, ఆర్డీవో కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయనడానికి సంబంధించిన ఆధారాలను, ఇతర డాక్యుమెంట్లను చూపించినా ఆర్డీవో, కమిషనర్ లెక్క చేయలేదు. ఈ వ్యవహారంపై మళ్లీ కోర్టును ఆశ్రయించనున్నట్లు బాధితులు తెలిపారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల షెడ్లు నేలమట్టంబిక్కవోలు: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు చెందిన రేకుల షెడ్లను పంచాయతీ వారు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. గ్రామంలోని చెరువు గట్టుపై 11 మంది షెడ్లు నిరి్మంచుకుని ఎన్నో ఏళ్లుగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆదివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ రెండు జేసీబీలతో అక్కడకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన గండి నాగవెంకటరమణ, గొరపల్లి సీతారామయ్య రేకుల షెడ్లను కూల్చేశారు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ వార్డు సభ్యురాలు కూడా అయిన వెంకటరమణ భార్య రామతులసి.. షెడ్ల కూల్చివేతపై అధికారులను నిలదీశారు. కనీస సమాచారం ఇవ్వకుండా కక్షపూరితంగా షెడ్లు కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులమనే ఒకే ఒక్క కారణంతో తమ ఆస్తులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అనపర్తి సీఐతో పాటు ముగ్గురు ఎస్.ఐ.లు, సుమారు 30 మంది పోలీసు సిబ్బందితో వచ్చిన పంచాయతీ సిబ్బంది గ్రామంలో యుద్ధవాతావరణం సృష్టించారని చెప్పారు. షెడ్లను కూల్చడం అధికార పార్టీ నాయకుల ఆకృత్యాలకు, వ్యవస్థల పనితీరుకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ షెడ్లు అక్రమ కట్టడాలని తాము నోటీసులు ఇవ్వగా పలువురు గడువు కోరారని, వెంకటరమణ, సీతారామయ్య స్పందించనందున వారి షెడ్లు కూల్చేశామని పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ చెప్పారు. -
ముంచేసిన ‘మై క్వీన్’
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ ముంచేసింది. ఒక్క రూపాయి కడితే ఏడు రూపాయలు, రూ.100 కడితే రూ.700 చెల్లిస్తామంటూ వల విసిరి బాధితులకు శఠగోపం పెట్టింది. ప్రైవేటు ఉపాధ్యాయులు, యువత, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు భారీ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మొదట్లో వారికి బాగానే డబ్బులు వచ్చాయి. అయితే నాలుగు రోజుల నుంచి కొంతమందికి డబ్బులు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యజమాని ఎక్కడుంటాడో తెలీదు.. చెన్నై కేంద్రంగా అంతా కేవలం ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క మార్కాపురంలోనే కాకుండా పెద్దారవీడు, తర్లుపాడు, పెద్ద దోర్నాల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాలకు కూడా ఈ చైన్ లింకు స్కీమ్ విస్తరించినట్టు సమాచారం. మై క్వీన్ యాప్ లింక్ పంపి.. ఒక్క రూపాయి కడితే మరుసటి రోజు రూ.7 అకౌంట్లో జమయ్యేలా మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ను రూపొందించారు. ఈ చైన్ సిస్టమ్‌లో భాగంగా మొదట డబ్బులు చెల్లించిన వ్యక్తికి ‘మై క్వీన్’ యాప్ లింక్ పంపుతారు. ఆ వ్యక్తి మరో కొంత మందిని చేర్పిస్తే వారికి కూడా లింక్‌ను షేర్ చేస్తారు. ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేయాలి. రూ.100 ఈ రోజు చెల్లిస్తే 24 గంటలు గడిచాక నగదు చెల్లించిన వ్యక్తి ఖాతాలో రూ.700 జమవుతాయి. దీంతో 24 గంటల్లోనే తాము కట్టిన దానికి 7 రెట్లు ఆదాయం రావడంతో ఈ యాప్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఒక్క మార్కాపురం పట్టణంలోనే 8 నుంచి 10 వేల మంది సభ్యులుగా చేరి సుమారు రూ.5 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. గతంలో ఇలాంటి స్కీమ్‌ల విషయంలో మోసపోయినా ప్రజలు లెక్కచేయడం లేదు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ మై క్వీన్ యాప్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. నెల రోజుల్లోనే లక్షాధికారులు కావాలనే దురాశ వారిని తెగించేలా చేస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి కొన్ని రోజుల నుంచి నగదు చెల్లింపులు కావడంలేదని తెలుస్తోంది. ఈ విషయమై మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. -
ప్రకాశంలో ఫ్యాన్ గాలి ఉధృతం
సాక్షి, ఒంగోలు ప్రతినిధి : ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఐదేళ్లలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విజయానికి పునాదులుగా మారాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబి్ధదారుల ఖాతాల్లో వందల కోట్లు జమయ్యాయి. అదే సమయంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలు మరోసారి వైఎస్సార్ సీపీకి పట్టం కట్టనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. విజయ ‘భాస్కరు’డే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎంపీఅభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క టీడీపీ తరఫున బరిలో ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ తరఫున పోటీ చేయడం మాగుంటకు రివాజుగా మారింది. తరచూ పార్టీలు మారడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికి తోడు దేశాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో ఈయన కుమారుడు అప్రూవర్‌గా ఉన్నారు. ప్రజల మనిíÙగా పేరొందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎంపీగా భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. బాలినేనికి సిక్సర్ ఖాయం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి విడదీయరాని బంధం. ఇప్పటికే ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు విడతలు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.230 కోట్లతో 25 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోనుంది. బాలినేనికి టీడీపీ అభ్యర్థి దామచర్ల ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా çగెలిచిన దామచర్ల ఆ ఐదేళ్లలో చేసిన అరాచకాలు, అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరు పిలిచినా పలికే నేతగా పేరు తెచ్చుకున్న బాలినేని మళ్లీ విజయం సాధించి సిక్సర్ కొట్టనున్నారు. దర్శి బూచేపల్లి అడ్డాదర్శి టీడీపీ తరఫున నరసరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బరిలోకి దించింది. కానీ రెండు దశాబ్దాలుగా దర్శిని అడ్డాగా మార్చుకున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి గొట్టిపాటి లక్ష్మి ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏడాదిగా దర్శిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న బూచేపల్లి ఏ ఇంటికి వెళ్లినా తమ కుటుంబ సభ్యునిగా భావిస్తారు. నిజాయితీకి మారుపేరుగా ఉన్న బూచేపల్లి కుటుంబం ఈ విడత భారీ మెజారీ్టతో విజయం సాధిస్తుందంటున్నారు. గొట్టిపాటి లక్ష్మి కొత్త అభ్యర్థి కావడం, జనసేన, టీడీపీల నుంచి పలువురు టికెట్లు ఆశించి భంగపడిన వారు వెన్నుపోటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంతనూతలపాడులో నాగా‘అర్జునుడే’ సంతనూతలపాడు నుంచి మంత్రి మేరుగు నాగార్జున బరిలో దిగుతున్నారు. ఇక్కడ మేరుగు కొత్త అయినా మంత్రిగా ఆయన అనుభవం మరోసారి విజయాన్ని అందించనుంది. 24 సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగురలేదని ఇటీవల చీమకుర్తిలో జరిగిన యువగళంలో కూడా లోకేశ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న బీఎన్ విజయకుమార్ ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి మేరుగు అనుభవం మరోసారి విజయాన్ని అందించనున్నాయి. ఆదిమూలపుసురేష్ దూకుడు కొండపి నుంచి ఈ సారి మంత్రి ఆదిమూలపు సురేష్ బరిలో దిగుతున్నారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. విద్యావంతుడిగా పేరుగాంచిన సురేష్‌కు కొండపిలో విజయం నల్లేరుపై నడకేనంటున్నారు. మరో వైపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్వామి బరిలోకి దిగుతున్నారు. మరుగుదొడ్లు, నీరు–చెట్టు, ఇంకుడుగుంతల పథకాల్లో వందల కోట్ల అవినీతికి పాల్పడిన డోలా బాల వీరాంజనేయస్వామికి ఈ విడత ఘోరంగా ఓటమి ఖాయమంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా అనంతవరం, కొణిజేడు గ్రామాల్లో ఎదురైన చేదు అనుభవాలే స్వామి ఓటమిని ఖరారు చేశాయి. గిద్దలూరు గెలుపు తథ్యం వైఎస్సార్సీపీకి గిద్దలూరు కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 80 వేల మెజారీ్టతో రాష్ట్రంలో గిద్దలూరు నియోజకవర్గం సంచలనం సృష్టించింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ముత్తుల అశోక్‌రెడ్డి పార్టీ ఫిరాయించి పారీ్టకి నమ్మకద్రోహం చేశాడని నియోజకవర్గంలో అతనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విడత ముత్తుముల బరిలో ఉన్నా అతన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్న కేపీ నాగార్జునరెడ్డి ఉన్నత విద్యావంతుడు, మృదుస్వభావి. వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయి. దీంతో కేపీ నాగార్జునరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే.మార్కాపురంలో ప్రభంజనమే గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యరి్థగా అన్నా రాంబాబు మార్కాపురం నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో 80 వేల మెజారిటీ సాధించిన చరిత్ర ఆయనది. విద్యాదాతగా అన్నా రాంబాబు పేరుగడించారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు చారిటబుల్ ట్రస్టు ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 13 క్రిమినల్ కేసులతో పాటు భూకబ్జాలు, అనేక ఆరోపణలు ఉండటంతో ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో అన్నా రాంబాబుకు మరోసారి భారీ మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనిగిరిలో కొత్త చరిత్ర దద్దాల నారాయణ యాదవ్ వైఎస్సార్సీపీ కనిగిరి నుంచి చరిత్ర సృష్టించనున్నారు. సామాన్యుడికి టికెట్ కేటాయించి జగనన్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిపై పోటీకి దించారు. దద్దాలపై కనిగిరి ప్రజలకు ఎనలేని అభిమానం ఉంది. టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పాల్పడిన కక్ష సాధింపు చర్యలను ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. దీనికి తోడు టీడీపీ బీజేపీ కూటమిలో ఉండటంతో ముస్లింలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. నియోజకవర్గంలో సుమారు 22,500 ఓట్లు ఉన్న ముస్లింలు దద్దాల వైపే ఉన్నారు. దీంతో ఇక్కడ ఆయన విజయం తథ్యమంటున్నారు. యర్రగొండపాలెం ఏకపక్షం యర్రగొండపాలెం ఎప్పుడూ ఏకపక్షమే. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ ఎరిక్షన్‌బాబు వైఎస్సార్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఏమాత్రం పోటీ ఇచ్చే అవకాశం లేదు. లిడ్‌క్యాప్ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో ఎరిక్షన్‌బాబుపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాటిపర్తి చంద్రశేఖర్ కొత్త వ్యక్తే అయినప్పటికీ గత మూడు నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు చాలా దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో తాటిపర్తి భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. -
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
-
మార్కాపురం @ 48 డిగ్రీలు
సాక్షి, విశాఖపట్నం/మార్కాపురం: సూర్యప్రతాపం రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న కొద్దిరోజులు రాష్ట్రంలో పరిస్థితి నిప్పులు చెరిగే పగళ్లు.. వేడిని వెదజల్లే రాత్రుళ్లు ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటివేళ సాధారణంకంటే 4–7 డిగ్రీలు, రాత్రిపూట 3–6 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
టీడీపీలో లోకల్ వార్.. నిస్తేజంలో కేడర్
నాయకత్వ లోపం తమ పార్టీ కొంప ముంచుతోందని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. అభ్యర్థి ఎంపికలో గందరగోళం, గ్రూపు రాజకీయాలు నేటికీ సమసిపోకపోవడంతో టీడీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. దర్శి: దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మిని ఖరారు చేసి బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4వ తేదీన ఆమె దర్శిలో తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజల నుంచి స్పందన కరువైంది. కేడర్‌లో పట్టుమని పది మంది కూడా ఆమె వెంట ప్రచారానికి రాకపోవడం గమనార్హం. దర్శిలో ఆమె అడుగుపెట్టినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలు, బీసీ సామాజికివర్గానికి చెందిన 500 మందికి పైగా టీడీపీ సానుభూతిపరులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. దీనికితోడు గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పైసా ఖర్చు చేయడం లేదని కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ శ్రేణుల నుంచే వ్యతిరేకత 2009 సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మన్నం వెంకటరమణతో చంద్రబాబు పోటీ చేయించారు. ఆయనతో టీడీపీ అధిష్టానం భారీగా డబ్బు ఖర్చు చేయించగా.. సొంత సామాజిక వర్గం వారే నాన్ లోకల్ అంటూ ఓడించారు. రాబోయే ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసేందుకు ఒంగోలు చెందిన గోరంట్ల రవికుమార్ ఉవిళ్లూరగా స్థానికుడే కావాలని ప్రధాన నాయకులు పట్టుబట్టడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. దర్శిలో బూచేపల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలెవరూ లేకపోవడంతో మల్లగుళ్లాలు పడిన టీడీపీ అధిష్టానం చివరికి గొట్టిపాటి లక్ష్మిని బరిలోకి దించింది. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికేతరురాలైన వ్యక్తికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటం, గెలుపు అవకాశాలు అంతంతమాత్రమేనని గ్రహించిన గొట్టిపాటి లక్ష్మి కాస్తో కూస్తో కూడా డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శిలో అడుగుపెట్టిన తొలిరోజే‘నేను పక్కా లోకల్’ అని గొట్టిపాటి లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులతోపాటు ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ‘నరసరావుపేట నుంచి దర్శికి వచ్చిన ఆమె ఎలా లోకల్ అవుతుంది.. వచ్చిన తొలిరోజే ఇలా అబద్ధాలు మాట్లాడమేంటి’ అని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. లక్ష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం విరుచుకుపడ్డారు. ‘దర్శిలో ఇల్లూవాకిలి లేదు.. నీ పూర్వీకులు, కుటుంబీకులు కూడా ఎప్పుడూ ఇక్కడ నివాసం ఉండలేదు. అలాంటపుడు ఎలా లోకల్ అవుతావు’ అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు నిలదీస్తున్నారు. బూచేపల్లిని ఢీకొట్టలేం! వైఎస్సార్ సీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆయన తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందిని సైతం గడప గడపకూ వెళ్లి ప్రజలతో మమేకం అవుతున్నారు. బూచేపల్లి ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో 80 శాతం ప్రచారం పూర్తి చేయడం విశేషం. గత 20 ఏళ్లుగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్థానికంగా నివాసం ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గని బూచేపల్లిని రాజకీయంగా ఢీకొట్టడం కష్టమని దర్శికి చెందిన టీడీపీ నేత ఒకరు పేర్కొన్నారు. -
మిమ్మల్నే గెలిపించుకుంటాం
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని కొనకనమిట్ల వద్ద ఏప్రిల్ 7న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షెడ్యూలు ప్రకారం అక్కడ మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకే సభా ప్రాంగణంలోకి జనప్రవాహం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకే సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఓ వైపు మండుతున్న ఎండ.. మరో వైపు ఉక్కపోత.. అయినా సభా ప్రాంగణం నుంచి లక్షలాది మంది అక్కడి నుంచి కాలు కదపలేదు. బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనం పలకడంతో సభా ప్రాంగణానికి సీఎం వైఎస్ జగన్ కాస్త ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. జననేతను చూడగానే అప్పటిదాకా పడిన ఇబ్బందిని జనం మరిచిపోయి ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ‘ఇంత మేలు చేసిన మీకు కాకుండా ఎవరికి ఓటు వేస్తాం.. మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదే’నంటూ నినాదాలు చేశారు. ఇలా ఎక్కడికక్కడ సీఎం జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణ సరికొత్త చారిత్రక విజయానికి బాటలు వేస్తోంది. సాక్షి, అమరావతి: పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడానికి.. చంద్రబాబు వంటి మోసగాళ్ల నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు ‘నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?’ అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిస్తే.. సెల్ ఫోన్ టార్చ్‌లైట్ వెలిగించి ‘మేమంతా సిద్ధం’ అంటూ లక్షల గళాలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాయి. మేమెంతా మీ వెంటేనంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు అడుగులో అడుగు వేస్తున్నారు. ఎక్కడికక్కడ అభిమానం అడ్డుపడుతుండటంతో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. ఈ నెల ఒకటవ తేదీన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోకి షెడ్యూలు సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.45 గంటలకు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. మధ్యాహ్నం 2 గంటలకే నేల ఈనిందా అన్నట్లుగా జనంతో కదిరి కిక్కిరిసిపోయింది. అనంతపురం–మదనపల్లె రహదారిపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్ షోకు అడగడుగునా జనం నీరాజనాలు పలకడంతో కుంభమేళాను తలపించింది. రోడ్ షో సాగినంత దూరం సెల్‌ఫోన్ టార్చ్లైట్లను వెలిగించి జనం సీఎం వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలిపారు. రెండు కిలోమీటర్ల పొడవున రోడ్ షో నిర్వహించడానికి 2.10 గంటల సమయం పట్టిందంటే జనం ఏ స్థాయిలో పోటెత్తారన్నది అర్థం చేసుకోవచ్చు. అందరి అభిమతం అదే.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు ఇప్పటిదాకా సాగిన బస్సు యాత్రలో అడగడుగునా ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కారించాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలాన మేలు చేస్తాం.. మాకు ఓటేయండి.. అని ప్రజలకు నాయకులు హామీలు ఇస్తుంటారు. కానీ.. బస్సు యాత్రలో జనంతో సీఎం వైఎస్ జగన్ మమేకమైనప్పుడు ‘మీ పాలనలో మాకు మంచి జరిగింది. మళ్లీ మీరే రావాలి. మిమ్మిల్నే గెలిపించుకుంటాం’ అంటూ యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు హామీలు ఇస్తుండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి మహోజ్వల ఘట్టాలను తామెన్నడూ చూడలేదని.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయిందనడానికి ఇవే తార్కాణమని విశ్లేషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయం సాధించడం ఖాయమనడానికి బస్సు యాత్రలో అడుగడుగునా కన్పిస్తున్న దృశ్యాలే నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థలు డజనుకు పైగా నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని తెగేసి చెబుతుండటం గమనార్హం. జైత్ర యాత్రలా బస్సు యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వద్ద మహానేత వైఎస్సార్ ఘాట్ నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల మీదుగా ఇప్పటిదాకా బస్సు యాత్ర సాగింది. మండుటెండను లెక్క చేయకుండా స్కూలు విద్యార్థుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు పోటీపడి సీఎం జగన్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. బిడ్డలను చంకనేసుకుని సీఎం జగన్‌ను చూసేందుకు బస్సు వెంట యువతీ యువకులతో పోటీపడుతూ మహిళలు పరుగులు తీస్తున్న దృశ్యాలు అడుగడుగునా కన్పిస్తున్నాయి. స్కూలు విద్యార్థులైతే సీఎం జగన్‌ను చూసేందుకు తల్లితండ్రులతోపాటు వస్తున్నారు. సీఎం జగన్‌ను చూడగానే ‘అదుగో జగన్ మామయ్య’ అంటూ చూపుతున్నారు. ఆ పిల్లలను సీఎం జగన్ అక్కున చేర్చుకుంటుండటంతో పిల్లలు ఆనందపరవశులవుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే సెల్ఫీ దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. యువత, మహిళలు, రైతులు, వృద్దులు ఇలా అన్ని వర్గాల వారితో సీఎం మేమకమవుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేట, కావలి, కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్టయ్యాయి. ఏ సమయం అయినా సీఎం వైఎస్ జగన్ నిర్వహించే రోడ్ షోల్లో అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. రాత్రి పొద్దుపోయినా దర్శి జన సంద్రాన్ని తలపించింది. ప్రజల్లో విశ్వసనీయతకు ప్రతీక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. గత 58 నెలల్లో అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి ఆ వర్గాల సామాజిక సాధికారతకు బాటలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించి.. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో రోజు రోజుకు విశ్వసనీయత పెరుగుతోంది. ఇదే బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టడానికి దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయే సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. ఇదే సమయంలో ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. జనసేనతో జట్టుకట్టి తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ–జనసేన.. సాక్షాత్తు ప్రధానిని రప్పించి చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమిలో నైతిక స్థైర్యం దెబ్బతింది. పొత్తులో సీట్ల లెక్క తేలాక.. అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక, ఆపార్టీలో చెలరేగిన అసమ్మతి కూటమిని చావు దెబ్బతీసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వృద్ధులకు ఇంటి వద్ద పెన్షన్ అందించకుండా వలంటీర్లను చంద్రబాబు అడ్డుకోవడంతో కూటమిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ వైపు సీఎం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతుండటం.. మరో వైపు చంద్రబాబు ప్రజాగళం పేరుతో, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు మొహం చాటేస్తుండటంతో కూటమి అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 21–22 లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకుని ఘన విజయం సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఈ దృష్ట్యా రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
బాధపడొద్దు.. నేనున్నా
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, వృద్ధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ సమస్యలు విన్నవించి ఆదుకోవాలని అభ్యర్ధించారు. వారి కష్టాలను సావధానంగా ఆలకించిన సీఎం జగన్ ప్రతి ఒక్కరి నుంచి అర్జీలను స్వీకరించారు. ‘‘బాధపడొద్దు.. నేను ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తా’’ అని భరోసా ఇచ్చి అర్జీలను వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. – సింగరాయకొండ (మర్రిపూడి) పొన్నలూరు/పీసీపల్లి టీడీపీ వాళ్లు పొలం కబ్జా చేశారయ్యా.. మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన రాయిపాటి లక్ష్మీనరసయ్య (70) వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పదేళ్ల పాటు గడ్డం పెంచాడు. 2019 ఎన్నికలకు ముందు జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నాడు. దీనిపై కక్షగట్టిన టీడీపీ సానుభూతిపరులు లక్ష్మీనరసయ్యకి చెందిన 9 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు. బస్సు యాత్ర సందర్భంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తేవడంతో పెద్దాయన సమస్యను నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగం కోసం వినతి 2017లో బీకాం చదివిన పీసీపల్లి మండలం అలవలపాడు కొత్తూరుకు చెందిన రావి సురేష్ ప్రస్తుతం వలంటీర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా ఉన్నందున ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశాడు. ట్రై సైకిల్ ఇప్పించండన్నా బస్సు యాత్ర కనిగిరి మండలం అజీజ్పురానికి చేరుకున్న సమయంలో గ్రామానికి చెందిన కేశారపు దేవమ్మ అనే దివ్యాంగురాలు సీఎం జగన్‌ను కలిసింది. దివంగత వైఎస్సార్ గతంలో తనకు ఇచి్చన ట్రైసైకిల్ మూలనపడినందున కొత్తది ఇప్పించాలని విన్నవించింది. నలుగురు బిడ్డలున్నా... ‘‘చూపు కోల్పోయి పని చేయడానికి వీలు లేకుండా పోయింది. కుటుంబ పోషణ అంతంత మాత్రం. ఆర్థిక సాయం చేయండి సారూ’’ అంటూ కనిగిరి మండలం అజీస్‌పురంలో కేశారపు రోశయ్య వేడుకున్నాడు. తనకు నలుగురు పిల్లలున్నా పట్టించుకోవడం లేదని, ఒంటరినయ్యానని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విలపించాడు. దివ్యాంగుడిని ఆదుకోండయ్యా కనిగిరి మండలం ఏరువారిపల్లిలో గ్రామానికి చెందిన లక్కె మంగమ్మ దివ్యాంగుడైన తన కుమారుడు లక్కె సాయిని వెంటబెట్టుకుని సీఎం జగన్‌ను కలిసింది. మన ప్రభుత్వంలో దివ్యాంగ పింఛన్ వస్తోందని తెలిపింది. తన కుమారుడికి ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విన్నవించింది. ► శారీరక ఎదుగుదల లేని పొన్నలూరు గ్రామానికి చెందిన వెలగపూడి ఏసుబాబు అర్హత ఉన్నా తనకు సదరం సరి్టఫికెట్ మంజూరు చేయడం లేదని, పింఛన్ పొందలేకపోతున్నానని విన్నవించాడు. ► పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన నేలపాటి నరసింహం ఎడమ కాలు రోడ్డు ప్రమాదంలో విరిగిపోయింది. తనకు మెరుగైన వైద్యం అందించాలని సీఎంకు విన్నవించాడు. ► కల్లూవారిపాలెం గ్రామానికి చెందిన కప్పల రియాగ్రేస్కు రెండు కళ్లు కనిపించకపోవడంతో శస్త్ర చికిత్స చేశారు. అయితే దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స విఫలమైందని, మరోసారి శస్త్ర చికిత్స కోసం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరారు. ► మరికొందరు వృద్ధులు తమకు ఆరోగ్య సమస్యలున్నాయని, వాటిని నయం చేసేందుకు వైద్య సాయం అందించాలని వేడుకున్నారు. -
జన సునామీ.. మండుటెండలోనూ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆదివారం 46 డిగ్రీల మండుటెండలోనూ జన జాతర హోరెత్తింది. ఊరూ–వాడా ఏకమై తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలకగా.. వేసవి తాపాన్ని లెక్కచేయక చిన్నా, పెద్దా వెంట నడిచింది. కొనకనమిట్ల జంక్షన్లో జరిగిన బహిరంగ సభలోనూ తమ అభిమాన నేతను చూసేందుకు జన సంద్రం ఉవ్వెత్తున ఎగిసిపడింది. బాబు మోసాలను ఎండగడుతూ సీఎం జగన్ ‘రైతు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా రూ.25 వేలు వేశాడా? ఇంటింటికీ ఉద్యోగం, లేకుంటే నిరుద్యో భృతి ఇచ్చాడా? అర్హులకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాడా? ఏపీని సింగపూర్ చేశాడా? హోదా తీసుకొచ్చాడా? వీటిల్లో ఒక్కటైనా అమలు చేశాడా? లేదా?’ అని ప్రశ్నించగానే ప్రజలు లేదు..లేదు.. అంటూ రెండు చేతులు పైకెత్తి గళమెత్తారు. యుద్ధ నినాదమై గర్జించారు. తనకు ప్రజలే అజెండా అని.. జెండాలు జట్టుకట్టిన ప్రతిపక్షాలు బూటకపు హామీలను నమ్ముతారా? అనగానే బాబును నమ్మేది లేదంటూ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ధ్వనించిన జననినాదానికి దిక్కులు పిక్కటిల్లాయి. ధర్మాన్ని కాపాడుతూ.. విశ్వసనీయతకు నీరాజనం పట్టేందుకు, పేదలకు.. చంద్రబాబు కుట్రలకు మధ్య జరిగే యుద్ధానికి సిద్ధమా? అని పిలుపివ్వగానే.. మేమంతా సిద్ధమే అంటూ అశేష జనవాహిని నినదించింది. సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లాలో సూర్యుడి భగభగలను సైతం ఎదురించి జైత్ర యాత్రలా కొనసాగింది. జువ్విగుంట బస శిబిరం నుంచి ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభం కాగా.. ఉదయం నుంచే రోడ్లపై జనాలు బారులు తీరారు. అంతకు ముందు తనను కలిసిన కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు సీఎం జగన్ ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. వేకువ జామునే ఉదయించిన అభిమానం.. జువ్విగుంట శిబిరం వద్ద సీఎం జగన్ యాత్ర అప్పటికే వేచి ఉన్న జనవాహినిలో నుంచి రోడ్డుపైకి వచ్చింది. కూతవేటు దూరంలోనే రాజుపాలెంలో ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. భారీ గజమాల తోరణాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ట్రాక్టర్లో బంతిపూలు తరలించి రోడ్డుపై ప్రజలు విరిబాటగా పరిచారు. అనంతరం కొండేపి నియోజకవర్గంలోని కె.అగ్రహారంలో యువత పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి జననేత రాకను నలుదిక్కులా చాటి చెప్పారు. ఎండలోనూ సీఎం జగన్ అశేష జనవాహినికి నమస్కరించారు. రాత్రి బస శిబిరం నుంచి 4 కిలో మీటర్ల దూరంలోని కె.అగ్రహారానికి యాత్ర చేరుకోవడానికి దాదాపు గంటపైనే సమయం పట్టింది. షెడ్యూల్లో లేని పాయింట్ల వద్ద కూడా తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల, మహిళలను సీఎం జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ నెమ్మదిగా ముందుకు సాగారు. పర్చూరివారిపాలెం, పాలేటి గంగమ్మతల్లి సెంటర్లో రోడ్డుకిరువైపులా మహిళలు పూలవర్షం కురిపించారు. అంతటి ఎండలోనూ బస్సు దిగివచ్చిన సీఎం ఓ దివ్యాంగుడి బాధను విని సమస్య పరిష్కారానికి ఆదేశించారు. రామాపురంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ సేవలపై సీఎం ప్రజలను ఆరా తీశారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి ఆశీర్వదించారు. మాస్ క్రౌడ్ పుల్లర్.. సీఎం వైఎస్ జగన్ సభలకు వస్తున్న అశేష జనప్రవాహాన్ని చూసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సునామీని సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అందుకే.. జగన్‌ను మాస్ క్రౌడ్ పుల్లర్‌గా అభివర్ణిస్తున్నారు. కొనకనమిట్ల బహిరంగ సభకు మేము సిద్ధం అంటూ జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ అభిమానులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 11 గంటల కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదికకు సమీపంలో రోడ్లపై మహిళలు, యువత సీఎం జగన్‌ను అనుకరిస్తూ కనిపించారు. ప్రకాశం జిల్లాలోని కర్నూలు జాతీయ రహదారి పొడవునా అభిమానం కట్టలు తెచ్చుకుంది. సాయంత్రం భోజన విరామ శిబిరం నుంచి 4.20 గంటలకు బయలు దేరిన సీఎం జగన్ 5.05 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్నారు. 5.15 గంటలకు ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం 6.20 గంటల వరకు తన ప్రసంగంలో చంద్రబాబు కుట్రలపై నిప్పులు చెరిగారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రజలకు గెలిపించాలని కోరారు. పొద్దు పోయినా.. సాయంత్రం 6.30 గంటల తర్వాత బహిరంగ సభ నుంచి బత్తువారి పల్లి, సలకనూతల క్రాస్ మీదుగా పొదిలి చేరుకున్న సీఎంకు అపూర్వ స్వాగతం లభించింది. రాత్రి 7 గంటల సమయంలోనూ ప్రజలు రోడ్లపై జననేత కోసం ఎదురు చూశారు. అనంతరం రాజంపల్లిలో మేళతాళాలు, గజమాల తోరణాలతో సీఎంను ఆహ్వానించారు. అక్కడి ఉంచి దర్శి ఎంట్రన్స్‌కు చేరుకోవడానికి రాత్రి 9.30 గంటలు దాటింది. దర్శిలో నాయకుల భారీ స్వాగత ఏర్పాట్ల మధ్య తరలివచ్చిన జనసందోహానికి రోడ్‌షోలో అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు కదిలారు. అనంతరం 10.20 గంటలకు వెంకటాచలం పల్లిలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. కదంతొక్కిన కనిగిరి.. తలపై చెంగు, టోపీలు ధరించి మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్ రోడ్ షోకు హాజరయ్యారు. కనిగిరి మెయిన్ రోడ్డుపై సెగలు పుడుతున్నప్పటికీ అభిమానం ఎగిసిపడింది. రెండు గంటలకు అశేష జనవాహిని మధ్య సీఎం జగన్ రోడ్ షో చేశారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. చిన్నారులు, విద్యార్థులతో షేక్ హ్యాండ్స్, సెల్ఫీలు, ఆత్మీయ పలకరింపులతో సీఎం జగన్ ముందుకు సాగారు. 2.30 గంటలకు నందెలమరెళ్లకి చేరుకున్న సీఎంకు ప్రజలు స్వాగతం పలికారు. మావయ్యా.. జగన్ మామయ్యా.. సీఎం జగన్ బస్సుయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరిలోకి ప్రవేశించింది. చింతలపాలెం ఎస్సీ కాలనీ వద్ద రోడ్డుకు దూరంగా చిన్నారులు, వారి తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ బాలుడు ‘మావయ్యా.. జగన్ మామయ్యా’..అంటూ కేకలు వేస్తూ ముందుకు రాగా రోప్ పార్టీ అతన్ని అడ్డుకున్నారు. గమనించిన జగన్ వెళ్తున్న బస్సును ఆపి కిందకు దిగారు. ఆ బాలున్ని దగ్గరకు తీసుకుని ముద్దాడి ఆత్మీయతపంచారు. అక్కడే ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు పరిగెత్తుకుని జగన్ దగ్గరకు వెళ్లారు. వారందరినీ దగ్గరకు తీసుకొని ఆప్యాయతను చాటారు. చిన్న పిల్లలను తల్లుల చేతిలోంచి తీసుకొని...ఎత్తుకుని లాలించారు. దీంతో కాలనీవాసుల్లో అంతులేని ఆనందం నెలకొంది. కనిగిరి రూరల్ ఏపీలో సీఎం వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పాదయాత్ర చేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం నుంచి భద్రాచలం రామాలయానికి ఆదివారం పాదయాత్రగా వెళ్లారు. మొదట రెడ్డిపాలెం రామాలయంలో, ఆ తర్వాత భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు. ఏపీలోని పురుషోత్తపట్నం ఎంపీటీసీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, అక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. – బూర్గంపాడు -
మేమంతా సిద్ధం@ డే10: ప్రజలతో సీఎం జగన్ మమేకం (ఫొటోలు)
-
వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
దశాబ్దాల కల సాకారం.. గర్వంగా ఉంది: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ, అద్భుతమైనప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్ట్ నేను పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని సీఎం తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ►ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య.. ఆ టన్నెల్లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను. ►ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగు నీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ►ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను కూడా ఒక్కో టన్నెల్ దాదాపు 18 కి.మీ. పైచిలుకు ఉన్న ఈ 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం.. ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముంది. ►ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, రెండో సొరంగం పనులు కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తంగా 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ రెండు సొరంగాలు పూర్తయ్యాయి ►వచ్చే ఖరీఫ్‌లో, జూలై-ఆగస్టులో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి, నల్లమల సాగర్‌లో మళ్లీ నీళ్లు నిండుతున్న సన్నివేశం, ఈ జూలై-ఆగస్టులోనే జరగబోతోంది. ►దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింది. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈరోజుతో పూర్తయిపోయింది. ►ఈ జూలై-ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో 1200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ ఆర్అండ్ఆర్ పూర్తి చేస్తాం ►ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం.. ఈ రెండు టన్నెళ్లు పూర్తి కావడం. ►మిగిలినవన్నీ పెద్ద ఏమీ లేవు. రిజర్వాయర్ పూర్తయిపోయింది. నీళ్లు నింపడం కోసం 1200 కోట్లు ఇస్తే పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది ►నీళ్లు నింపే కార్యక్రమం మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నీళ్లు నింపుతాం ►ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు.. ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా.. ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయి. రెండు టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కోటీ 18.8 కి.మీ. పొడవు ఉంటే, దాదాపు 37.6 కిలోమీటర్ల టన్నెళ్ల లెంత్ అయితే, ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కి.మీ. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు చేస్తూ టన్నెళ్లు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడ్డాయి. ►2014 నుంచి 2019 వరకు చూస్తే కేవలం 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల వర్కులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ ఈరోజు దాదాపు మిగిలిపోయిన 11 కి.మీ. టన్నెళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం ►ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడి దయతో ఇంత మంచి చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి ఈ సందర్భంగా మనసు నిండా ప్రేమతో దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఇదీ చదవండి: YSR Cheyutha: రేపు సీఎం జగన్ అనకాపల్లి పర్యటన -
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. -
ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల జీవితాల్లో సంతోషాలు నింపుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్ అగ్రహారంలో కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో ఇచ్చిన ‘డి’ పట్టాలను క్రమబద్దికరించుకోవడం ఎంత కష్టమో తెలిసిన విషయమే. రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చడం ఓ ప్రహసనమే. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ రిజిస్ట్రేషన్ల డేటా మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటాబేస్‌లో పదిలంగా ఉంది. లబ్దిదారులు ఎప్పుడైనా అక్కడి నుంచి తమ ఇళ్ల పట్టాకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని పొందే అవకాశం ఉంటుంది. దాన్ని ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికిగానీ ఆస్కారం ఉండదు. విలువైన స్థిరాస్తి.. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. ఇలా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల సంపదను పెడుతున్నారు. కుటుంబ సమేతంగా లబ్దిదారులు. ఒంగోలులోని ఎన్ అగ్రహారం వద్ద నేడు సీఎం జగన్ పాల్గొంటున్న బహిరంగ సభకు ఇళ్ల లబ్ది దారులు కుటుంబ సమేతంగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎన్.అగ్రహారంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు వాసుల మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.339 కోట్లు మంజూరు కాగా రోజూ తాగునీరు అందించేలా నగరంలోని పైపులైన్ వ్యవస్థను సమూలంగా మార్పు చేయనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ పథకానికి సంబంధించి కార్పొరేషన్‌పై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్‌గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతోంది. కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్లకుపైనే ఉంటుంది. అలాగే సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో ఇప్పటికే 8.9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. -
కారు, ఆటో ఢీ... ముగ్గురి దుర్మరణం
బేస్తవారిపేట: నిద్రమత్తులో కారు... ఆటోను ఢీకొట్టి న ఘటనలో ఇద్దరు రైతులు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ షేక్ ఖాశీంషా, కారులోని బైనగాని ఓబయ్య, గురవయ్య తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... బేస్తవారిపేట మండలంలోని ప్రకాశం జిల్లా, బార్లకుంటకు చెందిన చిత్తారు వెంకటేశ్వర్లు (53), చిత్తారు రాములు (40), బిళ్ల చిన్నవెంకటేశ్వర నాయుడు కలిసి ఎండుమిర్చి పంటను అమ్ముకునేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళా్లరు. విక్రయించిన సొమ్ముతో గుంటూరులో రైలు ఎక్కారు. కంభంలో దిగాల్సి ఉండగా, నిద్రపోవడంతో గిద్దలూరులో దిగారు. అక్కడ నుంచి బేస్తవారిపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కారు. మరోవైపు విజయవాడలో కొత్తగా కొనుగోలు చేసిన కారును తీసుకుని తండ్రీకొడుకులు ఓబయ్య, గురవయ్య వెళుతూ మార్గమధ్యంలో నిద్రమత్తులో పూసలపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిలో వెంకటేశ్వర్లును రోడ్డుపై వెళ్లే వాహనదారులు బయటకు తీశారు. ఆ సమయానికే అతడు మృత్యువాత పడ్డాడు. రాములు, చినవెంకటేశ్వర నాయుడు ఆటోలో చిక్కుకుపోయారు. ఈలోగా లీకైన ఆయిల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించడంతో ఇద్దరి శరీరాలు కాలిపోయాయి. వారి వద్ద మిర్చి పంట విక్రయించిన సొమ్ము రూ.10లక్షలు కాలి బూడిదైపోయాయి. మృతుడు చిన్న వెంకటేశ్వర నాయుడు సీఎస్‌పురం మండలం, నల్లమడుగుల సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. -
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం: బాలినేని
సాక్షి, ప్రకాశం : జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దర్శి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి నియమించబడిన తర్వాత మొదటిసారిగా మాజీమంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. అంతకు ముందు.. ఈ ఉదయం ఒంగోలులో బాలినేని నివాసంలో బాలినేనితో భేటీ అయిన చెవిరెడ్డి ,అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శి వచ్చారు. దీంతో పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. దర్శి నియోజకవర్గ ఇంచార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని నేతలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పట్టుదలతో పని చేద్దాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని.. ప్రజా బలంతో పేదల అండతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారన్నారు. అసంతృప్తులు, మనస్పర్ధలను పక్కనపెట్టి అందం సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి -
ఏసీబీ వలలో జిల్లా మలేరియా అధికారి
ఒంగోలు టౌన్: పీఆర్సీ అరియర్స్ బిల్లు మంజూరు చేసేందుకు 25 శాతం లంచం డిమాండ్ చేసిన ప్రకాశం జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, ఆమెకు సహకరించిన అసిస్టెంట్ జిల్లా అధికారి శీనయ్యను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని దోర్నాల పీహెచ్సీలో మల్టిపర్పస్ హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్న ఇజ్రాయిల్‌కు 2015–21 పీఆర్సీ అరియర్స్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని జిల్లా మలేరియా అధికారిణి జ్ఞానశ్రీని పలుమార్లు కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. పెండింగ్ బిల్లులో 25 శాతం లంచం ఇస్తే తాను బిల్లు మంజూరు చేస్తానని డిమాండ్ చేశారు. దాంతో ఇజ్రాయిల్ తనకు రావాల్సిన అరియర్స్‌తో పాటు..తన అర్హతల ప్రకారం పదోన్నతి కలి్పంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో స్పందించిన రీజినల్ డైరెక్టర్, ఇజ్రాయిల్ అరియర్స్ డబ్బులు ఎందుకు మంజూరు చేయలేదో వివరణ ఇవ్వాల్సిందిగా డీఎంఓకు మెమో ఇచ్చారు. అలాగే కోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు గానూ రిమార్క్స్ అడిగారు. ఈ క్రమంలో అనివార్య పరిస్థితుల్లో ఇజ్రాయిల్ అరియర్స్ పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తూ సంతకం చేశారు. బిల్లు డబ్బులు బ్యాంకులో జమ అయిన వెంటనే తనకు లంచం డబ్బులు ఇవ్వాలని కోరారు. ఈనెల 10వ తేదీ అరియర్స్ తాలుకు రూ.16,83,103 బ్యాంకులో జమయ్యాయి. జిల్లా కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ జరిగిన మీటింగ్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయిల్ ఒంగోలుకు వచ్చారు. మీటింగ్ అయిపోయాక తన ఇంటికి వచ్చి కలవాలని డీఎంఓ జ్ఞానశ్రీ అతడిని ఆదేశించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి శీనయ్యను ఇందుకు పురమాయించారు. దాంతో ఇద్దరూ కలిసి జ్ఞానశ్రీ ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యలో ఉండగా ఫోన్ చేసిన డీఎంఓ తాను ఇంట్లో లేనని, వర్మాస్ హోటల్‌కు వచ్చి కలవాలని చెప్పారు. అక్కడ బిల్లుల డబ్బులు బ్యాంకులో పడ్డాయి కనుక ముందుగా చెప్పిన ప్రకారం తనకు బిల్లు మొత్తంలో 25 శాతం రూ.4 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అతడి డైరీలో ఉన్న చెక్‌బుక్కును చూసి ఆమె చెక్కు రాసివ్వాలని డిమాండ్ చేశారు. చెక్ చెల్లదని చెప్పడంతో ఏటీఎం, పేటీఎంల ద్వారా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అయితే రూ.4 లక్షలు ఇవ్వలేనని బతిమాలు కోవడంతో చివరికి రూ.1.40 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఇజ్రాయిల్ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం జ్ఞానశ్రీకి డబ్బులు ఇస్తానని చెప్పడంతో వాటిని తీసుకునేందుకు అసిస్టెంట్ మలేరియా అధికారి శీనయ్యను సమీపంలోని సూపర్ బజార్ వద్దకు పంపించారు. అక్కడ ఇజ్రాయిల్ నుంచి డబ్బులు తీసుకుంటున్న శీనయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత జిల్లా మలేరియా కార్యాలయానికెళ్లి డీఎంవో జ్ఞానశ్రీని కూడా అదుపులోకి తీసుకున్నారు. -
వ్యక్తిగతంగా తిట్టమని చెప్పడం తప్పు: విజయసాయిరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఎలాంటి సమస్య లేదని.. పార్టీలో ఆయన అత్యంత విలువైన నాయకుడని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజనల్ కోర్దినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం తగ్గదని, బాలినేని స్థానం ఆయనకు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో నాలుగో జాబితా ఉంటుందన్నారు. ‘‘చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది.. ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహ ఎలక్షన్ కమిషన్‌కు వివరించాం. రాజకీయ పార్టీలలో విమర్శలు-ప్రతి విమర్శలు సహజం. కానీ.. పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించవలసిన బాధ్యత ఉంది. తిట్టమని చెప్పడం తప్పు. మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ పదాన్ని ఎందుకు వాడుతుందో తెలియదు. కావాలనే వాళ్లంతా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ విజయసాయి ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: మాకు అంత కర్మ పట్టలేదు: మంత్రి రోజా -
సీఎం అంశంపై టీడీపీ, జనసేన మధ్య బయటపడ్డ విభేదాలు
ఒంగోలు టౌన్: అంగన్వాడీ కార్యకర్తల సాక్షిగా టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయని టీడీపీ నేతలు పేర్కొనగా.. జనసేన నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ముందుగానే చంద్రబాబు సీఎం అని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపేందుకు టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సోమవారం దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసంగిస్తూ.. రానున్న ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అంగన్వాడీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు. చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఎలా చెబుతారు? ఆ తరువాత జనసేన నాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ చెప్పడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడే ఎలా చెబుతారని, ఎన్నికల తరువాత కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంచేశారు. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చాలా తప్పులు చేశారని, ఇప్పుడు కూడా ఆయన అలాగే తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ సహించరని హెచ్చరించారు. కాగా.. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణమ్మ కూడా నూకసాని బాలాజీ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. అంగన్వాడీలకు ఎంత జీతం ఇస్తారో అంకెలతో సహా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొనాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించడం తాము మరిచిపోలేదని కొందరు అంగన్వాడీలు చెప్పుకోవడం కనిపించింది. జనసేనలో ఆధిపత్య పోరు ఇదే సందర్భంలో జనసేన పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. అంగన్వాడీలకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మధ్య పోరు మరోసారి రచ్చకెక్కింది. తొలుత జనసేన తరఫున ప్రసంగించడానికి అరుణకు మైకు ఇచ్చారు. అయితే.. ఆమె నుంచి మైకు లాక్కుని రియాజ్‌ను ప్రసంగించాల్సిందిగా కొందరు కార్యకర్తలు కోరారు. రియాజ్ ప్రసంగించిన తరువాత తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు. కాగా.. ఇటీవల ఒంగోలు గద్దలగుంటలో జరిగిన కార్యక్రమంలోనూ రియాజ్, అరుణ వర్గాల మధ్య వివాదం జరిగింది. -
నూతన సంవత్సరంలో పెనువిషాదం
బేస్తవారిపేట/ఆగిరిపల్లి: నూతన సంవత్సరం వేళ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలంలోని పాపాయిపల్లెకు చెందిన నల్లబోతుల పవన్‌కళ్యాణ్ (19), పిక్కిలి రాహుల్ (19), గుజ్జుల శ్రీనివాసులు (20) స్నేహితులు. వీరు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై గిద్దలూరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో గిద్దలూరు నుంచి కంభం వైపు బొలేరో వాహనం (లగేజీ ట్రక్) వెళ్తోంది. బేస్తవారిపేట మండలంలోని చెట్టిచర్ల బస్టాండ్ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై బొలేరో, మోటార్ సైకిల్ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్‌పై పెట్రోల్ పడటంతో అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. బైక్‌పై ఉన్న రాహుల్, శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మోటార్ సైకిల్, బొలేరో వాహనం రెండూ మంటల్లో దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి.నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంభం అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలను కంభం ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పాపాయిపల్లె తీసుకెళ్లారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏలూరు జిల్లాలో బైక్ నేలబావిలో పడి ఇద్దరు యువకులు మృతి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో బైక్ నేలబావిలో పడి ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన తలశిల కృష్ణ చైతన్య (24), నున్న గ్రామానికి చెందిన శెట్టి సాయికుమార్ (24), నున్న రాకేష్ (25), మరో ఇద్దరు స్నేహితులతో కలసి ఆదివారం కనసానపల్లిలోని రాకేష్ మామిడి తోటలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఉదయం కృష్ణచైతన్య, సాయికుమార్, రాకేష్ ఒకే బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా, గేదె అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నేలబావిలోకి దూసుకుపోయింది. వీరి వెనుకే మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు స్నేహితులు గమనించి వెంటనే కనసానపల్లి సర్పంచ్ అమ్మిశెట్టి సంజీవరావు సాయంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీటిలో మునిగిపోవడంతో కృష్ణ చైతన్య, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రాకేష్‌ను బయటకు తీసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై ఎస్ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్‌కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్‌చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్‌పేకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్‌కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
మిర్చి పంటపై దృష్టిసారించిన అధికారులు
-
బంద్ పేరుతో రెచ్చిపోయిన టీడీపి కార్యకర్తలు
-
నలుగురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
మర్రిపూడి: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన స్థానిక తహసీల్దార్ సీహెచ్ కృష్ణారావు, డీటీ జి.జగదీశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ ఎంవీఎం శేషాచలం, పన్నూరు గ్రామ వీఆర్వో డి.శివారెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మర్రిపూడి మండలంలోని పన్నూరులో సర్వే నంబర్ 12–2, 169–1, ఇతర సర్వే నంబర్లలో 143.29 ఎకరాల పట్టా భూమికి ఆ గ్రామ వీఆర్వోతో పాటు ఆర్ఐ కలిసి రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండా ఫ్యామిలీ ట్రీ అనే ఒక పత్రం తయారు చేసి అసలైన వారసులకు కాకుండా సంబంధం లేని 65 మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసేందుకు సిఫారసు చేశారు. అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డీటీ జగదీశ్వరరావు కూడా పూర్తిగా పరిశీలించకుండా పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. ప్రస్తుత తహసీల్దార్ కృష్ణారావు కూడా వాటిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన భూముల్లో 71.75 ఎకరాలను వారం రోజుల్లోనే వీఆర్వో శివారెడ్డి బంధువుల పేర్లమీద రిజి్రస్టేషన్ చేశారు. దీనిపై హక్కుదారులైన గోరంట్ల వెంకటేశ్వర్లు, మరికొంతమంది ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు భూముల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు వెళ్తున్నందున రెవెన్యూ అధికారులంతా కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం అంశంపై కనిగిరి ఆర్డీవోతో విచారణ చేపట్టిన కలెక్టర్..ఆర్డీవో ఇచ్చిన నివేదిక ప్రకారం భూ అక్రమాలు జరిగినట్లు గుర్తించి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు. ఆ భూములకు సంబంధించి 91 మంది వారసులు ఉండగా, వీఆర్వో శివారెడ్డి తన బంధువుల పేర్ల మీద అక్రమంగా రిజి్రస్టేషన్ చేయించుకున్నారని, అందుకు మిగతా రెవెన్యూ అధికారులు కూడా చేతులు కలిపి సహకరించారని తేలడంతో నలుగురు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు. -
బాలినేని సవాల్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇళ్ల పట్టాలలో స్కాం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ‘‘నిస్వార్దంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం. బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే పేదలు క్షమించరు. స్కామ్‌లు నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరతా’’ అని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దళిత గళం గొంతు నొక్కి! -
అక్కా, తమ్ముళ్ళ మధ్య వార్.. మరోసారి పరాభవం తప్పదా?
అక్కా, తమ్ముళ్ళ మధ్య జరుగుతున్న వార్ ఆ నియోజకవర్గంలో టీడీపీని అట్టడుగుకు నెట్టేస్తోందా? పచ్చ పార్టీలో వరుసకు అక్కా తమ్ముళ్ళయ్యే నేతల తీరుతో అక్కడి కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. కత్తులు దూసుకుంటున్న ఆ ఇద్దరి కారణంగా ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోవడం ఖాయమని డిసైడవుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ అక్కా తమ్ముడు ఎవరు? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు పిడితల సాయికల్పనారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డిల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఆగేలా కనిపించడంలేదు. 2014లో వైయస్సార్సీపి నుంచి గెలుపొంది తర్వాత టిడిపీలో చేరిన అశోక్ రెడ్దిని 2019లో గిద్దలూరు ప్రజలు భారీ తేడాతో తిరస్కరించారు. పిడితల సాయికల్పనరెడ్దికి అశోక్‌రెడ్డి వరుసకు తమ్ముడవుతారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్గా అశోక్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకి సాయి కల్పన రెడ్డి దూరంగా వుంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అశోక్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్ళడంలేదని సాయికల్పనా రెడ్డి వర్గం విమర్శిస్తోంది. దీనికి తోడు అశోక్ రెడ్డి కూడా సాయికల్పనా రెడ్డిని ఆహ్వానించడకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ఇద్దరు నేతల తీరుపై పచ్చ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల చంద్రబాబు గిద్దలూరు వచ్చిన సందర్భంలో కూడా సాయికల్పనా రెడ్డి దూరంగానే వున్నారు. చంద్రబాబు నియోజకవర్గానికి వస్తున్నా నియోజకవర్గ ఇంచార్జ్ ఆశోక్ బాబు తనను ఆహ్వానించకపోవడంతో సాయికల్పనా రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యనేతలు వెళ్ళి చంద్రబాబు సభకు హజరుకావాలని కోరినా..సాయికల్పనా రెడ్డి మాత్రం రానని తెగేసిచెప్పారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఆహ్వనం పలుకుతూ తన వర్గం కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించి వేశారు. దీంతో వీరిద్దరి వ్యవహరశైలి చంద్రబాబును సైతం అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంపైనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నుంచి సాయికల్పన లేదా ఆమె తనయుడు అభిషేక్ రెడ్డి బరిలో ఉండాలని పిడతల కుటుంబం భావిస్తోంది. తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని సాయికల్పనారెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే సాయి కల్పన ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం.. ఫోన్ ద్వారా పలకరించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం వంటి అంశాలు ఆమెకు పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయనే టాక్ నడుస్తోంది. సాయికల్పన ఇండిపెండెంట్‌గా బరిలో దిగితే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ దెబ్బ తిని మరోసారి ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పార్టీ ప్రతిష్ట మసకబారిపోవడం, నేతల మధ్య అంతర్యుద్ధం వంటివి వైఎస్ఆర్ కాంగ్రస్ అభ్యర్థికి గెలుపు నల్లేరు మీద నడకే అని చెబుతున్నారు. ఓ వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పీడ్ పెంచారు. సౌమ్యుడుగా పేరున్న రాంబాబు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దూకుడు మీదున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలుసుకోవడం పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందిస్తూ అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? -
చెట్లు నరుకుతుండగా వింత ఘటన.. వీడియో వైరల్
ప్రకాశం జిల్లా: ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చెట్లు నరుకుతుండగా అకస్మాత్తుగా చెట్టులోంచి మంచినీళ్లు వచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో కొంతమంది చెట్లు నరుకుతుండగా, ఓ చెట్టులోంచి అకస్మాత్తుగా మంచినీళ్లు వచ్చాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను సైతం తాగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి.. -
డామిట్!.. కథ అడ్డం తిరిగింది.. టీడీపీకి పెద్ద షాకే తగిలింది..
ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఎంతకీ ప్రజలు గుర్తించడం లేదని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. అధికార పార్టీ మీద బురద జల్లి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఒంగోలులో లోకేష్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేసింది. విషయం తెలిసి ప్రజలు అసహ్యించుకోవడంతో సైలెంట్‌గా వాటిని తొలగించింది. ఇంతకీ ఒంగోలులో జరిగిందేంటి? ప్రకాశం జిల్లాలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటున్న తెలుగుదేశం, జనసేన నానా రకాల పాట్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీ మీద విషం చిమ్మడం, ప్రజలతో చీవాట్లు తినడంతో తాజాగా ఫ్లెక్సీల వివాదానికి తెర తీశాయి. వైఎస్సార్సీపీ మీద విషం చిమ్ముతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీ, జనసేనలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలను తెలియచేస్తున్నాయి. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, దర్శి, కొండెపి పట్టణాల్లో నరకాసుర వధ అంటూ కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కించరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు. ఈ ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న పోలీసులపై కూడా దాడికి ప్రయత్నం చేసారు జనసేన కార్యకర్తలు. ఆ గొడవతో మైలేజ్ పొందుదామనుకున్నవారికి ప్రజల్లో అవమానాలు తప్పలేదు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి స్పందనే కనిపించడంలేదు. పాదయాత్ర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ఫ్లెక్సీల వివాదంను తెరపైకి తెచ్చింది. ఒంగోలు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడుకి పండగ అనే కామెంట్స్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తెల్లవారు జాము నుండే ఎల్లో మీడియాకు లీకులిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. అయితే తాము ఒకటి అనుకుంటే మరొకటి జరగడంతో ఉదయం 8 గంటలకల్లా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేశారు. చదవండి: ‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేస్తున్నారా?’ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా లబ్దిపొందుదామనుకున్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాకే తగిలింది. నారా లోకేష్‌ను కొసరోడు అంటూ తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. తమ నాయకుడిని తామే ఎగతాళి చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆఫీసుల్లోనే చర్చ జరిగింది. పార్టీకి జరిగిన డ్యామేజ్ గురించి అర్థం చేసుకునేలోగా.. చంద్రబాబు నుంచి చీవాట్లు రావడంతో సైలెంట్ అయిపోయారు. కొందరు వాలంటీర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ మీడియాకు చెప్పి మిన్నకుండిపోయారు. తర్వాత వాటిని తొలగించేశారు. తమ పార్టీని పైకి లేపుతూ...అధికార పార్టీ పరువు తీయాలని టీడీపీ వాళ్లు చేసే ప్రతి పనీ వారికే ఎదురుకొడుతోంది. ఎప్పటికప్పుడు తమ పరువును తామే తీసుకుంటున్నారంటూ టీడీపీ దీనస్థితిపై టాక్ నడుస్తోంది. -
ప్రకాశం జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ప్రకాశం: దర్శి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి -
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శి సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఎస్పీ కాలువలోకి ఆర్టీసీ ఇంద్ర బస్సు దూసుకుపోవడంతో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ అజీస్(65), జానీబేగం(65), అబ్దుల్ హనీ(60), నూర్జహాన్(58), షేక్ రమీజ్(48), షబీనా(35), షేక్ హీనా(6) మృతిచెందారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. బస్సు తలకిందులుగా పడటంతో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక 7 మంది మృతి చెందారు. దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనాస్థలిని ఎస్పీ మలిక గర్గ్ పరిశీలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. -
హైడ్రామా.. నానా యాగీ.. టీడీపీ నేతల శవ రాజకీయం
ఒంగోలు అర్బన్: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు ఆ పార్టీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకుని.. నిస్సిగ్గుగా శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలో సవలం సుధాకర్ భార్య హనుమాయమ్మ(48) అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన సవలం కొండలరావు(బుజ్జి) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. కొన్నేళ్లుగా వీరి మధ్య భూ తగాదా ఉంది. అతను వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో హనుమాయమ్మ సోమవారం తన ఇంటి ముందు కూర్చుని ఉండగా.. కొండలరావు తన ట్రాక్టర్ నాగేలు అడ్డతో ఆమెను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె కింద పడటంతో వెనుక టైరుతో తొక్కించాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి.. హనుమాయమ్మ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఒంగోలు జీజీహెచ్ వద్ద మంగళవారం హైడ్రామా నడిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ హడావుడి చేశారు. పాత కక్షలు, కుటుంబ తగాదాలతోనే సదరు మహిళను హత్య చేశారని ఆ గ్రామ ప్రజలంతా స్పష్టంగా చెబుతున్నా, రాజకీయ రంగు పులుముతూ ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై, పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు ఆందోళన చేస్తున్న వారి వద్దకు స్వయంగా వచ్చిన ఆర్డీవో, టంగుటూరు తహశీల్దార్లు.. మానవతా దృక్పథంతో వీలైనంత మేర ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయినా టీడీపీ నేతలు వినిపించుకోకుండా నానా యాగీ చేశారు. టీడీపీ నేతల వైఖరిని కళ్లారా చూసిన వారంతా.. ఇదేం రాజకీయం అంటూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, మహిళ మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం పూర్తయింది. మృతురాలి భర్త తన అన్న భార్యపై కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తూ.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
వివాహిత హత్యపై ‘ఈనాడు’ తప్పుడు కథనం.. అసలేం జరిగిందంటే..?
సాక్షి, కనిగిరి రూరల్ : ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెల్లపాడుకు చెందిన వివాహిత కోటా రాధ (35) బుధవారం రాత్రి హత్యకు గురైంది. ఈ కేసులో మృతురాలి స్నేహితుడు కేతిరెడ్డి కాశయ్య అలియాస్ కా శీరెడ్డి కీలక నిందితుడిగా పోలీసులు అనుమాని స్తున్నారు. ఆర్థికపరమైన అంశాలే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మృతురాలి తల్లిదండ్రులు కూడా కాశయ్యపైనే ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. రాధ, కాశయ్యలు స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జిల్లెల్లపాడుకు చెందిన కె. రాధకు, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్‌రెడ్డితో వివాహమైంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మోహన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి, రాధ గృహిణి. అప్పటికే హైదరాబాద్‌లోనే నివాసముంటున్న కాశయ్య తాను సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నానని, దానికి నగదు కావాలంటూ వీరి వద్ద నుంచి సుమారు రూ.51 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. కంపెనీలో నష్టంరావడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. అప్పుగా తీసుకున్న నగదు వడ్డీతో కలిపి సుమారు రూ.80 లక్షలు అయింది. అయితే, రెండేళ్ల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో తరచూ రాధ, మోహన్‌రెడ్డి ఒత్తిడి చేస్తుండటంవల్లే రాధను కాశయ్య హత్యచేశాడనే ప్రచారం సాగుతోంది. అసలేం జరిగిందంటే.. ఈనెల 11న జిల్లెలపాడులోని చౌడేశ్వరమ్మ తిరు నాళ్లకు రాధ కుటుంబీకులు హైదరాబాద్ నుంచి పుట్టింటికి వచ్చారు. అది తెలుసుకున్న కాశయ్య.. తాను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నానని, తండ్రికి, భర్తకు ఎవరికీ చెప్పకుండా కనిగిరికి వస్తే రూ.2 లక్షలు చెల్లిస్తానని ఐదురోజుల క్రితం మెసేజ్ పెట్టాడు. అయితే, రాధ వెళ్లలేదు. తిరిగి బుధవారం మరో మెసేజ్ పెట్టాడు. దీంతో రాధ అదేరోజు తన చిన్న కుమారుడిని తీసుకుని తండ్రికి చెప్పకుండా, ఇంట్లో అమ్మకు చెప్పి కనిగిరి వెళ్లింది. అక్కడ చిన్నాన్న ఇంట్లో పిల్లవాడ్ని వదిలిపెట్టింది. తర్వాత బాబాయ్‌తో వచ్చి పిల్లవాడికి దుస్తులు షాపింగ్ చేసింది. సా.6.47 గంటల సమయంలో పామూరు బస్టాండ్‌లో గల సీసీ ఫుటేజీల్లో కనిపించింది. రా.8.30 గంటల నుంచి రాధ ఫోన్ పనిచేయలేదు. నాగిరెడ్డి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి అన్నిచోట్ల వెతికారు. ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 12.50 గంటలకు ఫోన్ లొకేషన్ కనిపెట్టారు. అది జిల్లెల్లపాడు వద్ద కన్పించడంతో అక్కడికి వెళ్లి చూడగా రాధ విగతజీవిగా పడి ఉంది. చదవండి: సరదాగా తిరిగొద్దామనుకుంటే.. కబళించిన మృత్యువు రాధను ఒక చోటికి తీసుకెళ్లి హత్యచేసి ఆ తర్వాత మరో ప్రదేశానికి తీసుకెళ్లి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాధను హంతకులు కారులోకి ఎక్కించుకుని మత్తు మందు ఇచ్చి ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి, తలపై బలంగా కొట్టి హత్యచేసి ఉంటారని ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను జిల్లెల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద పడేసి దాన్ని రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనాడు కథనం అవాస్తం : డీఎస్పీ ఈ హత్యకు సంబంధించి ఈనాడు కథనం పూర్తిగా అవాస్తమని కనిగిరి డీఎస్పీ ఆర్ రామరాజు అన్నారు. పోలీసులు జాప్యం చేశారని, సకాలంలో స్పందించలేదని రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో అత్యాచారం జరిగినట్లు వెల్లడికాలేదన్నారు. మృతురాలి తల్లిదండ్రులు కాశయ్యపై ఫిర్యాదు చేశారని, ఆ కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. -
AP: కవాసకీ వ్యాధి బాధితుడికి రూ.లక్ష ఆర్థిక సాయం
ఒంగోలు అర్బన్: అరుదైన మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్(కవాసకీ వ్యాధి)తో బాధపడుతున్న బాలుడి తల్లిదండ్రులకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ కార్యక్రమానికి సీఎం జగన్ ఈనెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నానికి వచ్చారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన హృదయరంజన్, ఉషారాణి దంపతులు సీఎంను కలిసి తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున తగిన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’ -
‘దళితులను అవమానించిన మీకు అక్కడ తిరిగే అర్హత ఉందా?’
సాక్షి, ప్రకాశం జిల్లా: దళితులను అవహేళన చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు మంత్రి ఆదిమూలపు సురేష్. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? దళితులు ఏమీ పీకలేరు అన్న మీరు ఏ ముఖం పెట్టుకుని అక్కడ పర్యటిస్తారని ఆదిమూలపు నిలదీశారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మండిపడ్డ ఆదిమూలపు.. పలు ప్రశ్నలు సంధించారు. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా?, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?.. దళితులు ఏమి పీకలేరు. అని మీరు అనలేదా? యర్రగొండపాలెంలో మీ పార్టీ ఇంచార్జి ఎరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా?, ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఎరీక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా?, అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా?, జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారు. ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి?, నీ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కడితేనే ఒప్పుకోని నీవు... సభల్లో మాత్రం జై ఎన్టీఆర్ అని అంటావు. నీది రెండు నాల్కల ధోరణి’ అని ధ్వజమెత్తారు మంత్రి ఆదిమూలపు సురేష్. -
సీఎం జగన్ చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా లభించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడి కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఒంగోలులోని ప్రకాశం భవనంలో ప్రభుత్వం తరఫున గురువారం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు వివిధ రూపాల్లో ఆదుకుంటామన్నారు. ఈబీసీ నేస్తం రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మార్కాపురం వచ్చిన సందర్భంగా బాధితుడి తల్లి మారమ్మ ఆయనను కలిసి తన కుమారుడు శ్రీనివాసులు పరిస్థితిని వివరించింది. బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని, తనొక్కడే కుటుంబానికి ఆధారమని తెలిపింది. కిడ్నీ చెడిపోయి ఆస్పత్రిలో ఉన్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారని సీఎంకు వివరించింది. చదవండి: టిడ్కో ఇళ్లపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్ స్పందించిన ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో బాధితుడి తల్లి మారమ్మను గురువారం కలెక్టరేట్‌కు పిలిపించి తక్షణ ఆరి్థక సహాయంగా రూ.లక్ష చెక్కు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బాధితుడి అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇడుపూరు లే–అవుట్లో ఇంటిస్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. -
ఇదీ చాలెంజ్ : సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘అయ్యా.. చంద్రబాబూ.. సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదు.. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరత్రా ప్రతి పేద ఇంటి ముందు నిలబడి.. ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలి. అది మన ప్రభుత్వం వల్లే జరిగిందని ఆ అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నప్పుడు తీసుకునే ఫొటోను సెల్ఫీ అంటారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో, నాలుగేళ్ల తమ ప్రభుత్వ పాలనలో ప్రతి ప్రాంతానికి, గ్రామానికి, ప్రతి సామాజిక వర్గానికి జరిగిన మేలు గురించి బేరీజు వేసుకునే సత్తా మీకు ఉందా.. ఇదీ ఛాలెంజ్ అని చంద్రబాబుకు సవాలు విసురుతూ నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద రెండో విడత నగదు పంపిణీని కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టకుండా వదిలేశాడు. అలా వదిలేసిన ఇళ్లను మీ బిడ్డ హయాంలో పూర్తిగా కట్టిన చోటుకు, వేగంగా పనులు జరుగుతున్న ఇళ్ల వద్దకు వెళ్లి ఈ 75 ఏళ్ల ముసలాయన నాలుగు ఫేక్ ఫొటోలు దిగి సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నాడు’ అని ఎద్దేవా చేశారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే ఫేక్ ఫొటోలు కాదన్నారు. బాబు బృందాన్ని ఇలా నిలదీయండి ► ఈ నిజాలు ప్రజలందరికీ తెలుసు. అయినా చంద్రబాబు, ఎల్లోమీడియా నిందలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు దిక్కుమాలిన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి అబద్ధాల బ్యాచ్‌ని నమ్మకండి. వారిని నిలదీయండి. ► గత ఐదేళ్లలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని మీరు.. ఈ ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి.. అందులో కట్టిస్తున్న ఇళ్ల వద్ద సెల్ఫీ దిగే ధైర్యం, స్టిక్కర్ అంటించే దమ్ము ఉందా అని నిలబెట్టి అడగండి. ► మనందరి ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా 45 లక్షల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిందని చెబుతూ.. మీరేం చేశారని ప్రశ్నించండి. ► 53 లక్షల మంది రైతు కుటుంబాలకు వరుసగా నాలుగేళ్లుగా ప్రతి ఏటా రూ.13,500 రైతు భరోసాగా అందిందని చెప్పండి. గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తామని ఎందుకు మోసం చేశావని చంద్రబాబును అడగండి. ► అయ్యా.. చంద్రబాబూ.. రుణమాఫీ చేస్తానని మోసం చేశావు.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపించి ఇంటికి ఇప్పిస్తానని చెప్పి మోసం చేశావు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగురగొట్టావ్.. మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావ్.. అలాంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత, స్టిక్కర్ అంటించే అర్హత ఉందా.. అని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అందరూ గట్టిగా నిలబెట్టి అడగండి. ► వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇంకా అనేక పథకాలు మా జగనన్న ఇచ్చాడు.. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నీ పాలనలో ఎక్కడికి పోయాయి.. ఎవరు తిన్నారు.. అని 45–60 ఏళ్ల వయస్సులో ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలు చంద్రబాబును అడగండి. ► ప్రభుత్వ బడి గురించి, మధ్యాహ్న భోజనం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌లో డిజిటల్æ బోర్డ్, ఇంగ్లిష్ మీడియం.. సీబీఎస్సీ సిలబస్, బైలింగ్వల్ టెక్ట్స్‌బుక్స్, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా తట్టాయా అని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడగండి. ► మీ పాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ముష్టి ఇచ్చినట్లు రూ.వెయ్యి పింఛన్ ఎందుకిచ్చావని ఇప్పుడు రూ.2,750 పెన్షన్ తీసుకుంటున్న నా అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగ అక్కచెల్లెమ్మలు నిలదీయండి. పింఛన్ మూడు వేలు కాబోతోందని చెప్పండి. ఇంత మేలు చేసిన మా బిడ్డతో కాకుండా మీతో సెల్ఫీ ఎలా దిగుతాము అని ప్రశ్నించండి. ► ఇంటింటికీ మంచి చేయడం అభివృద్ధా.. లేక రామోజీ ఇంటికి, రాధాకృష్ణ ఇంటికి, టీవీ–5 ఇంటికి.. చంద్రబాబు ఇంటికి దత్తపుత్రుడు ఇళ్లకు.. మూటలు పంపడం అభివృద్ధా.. అని గట్టిగా అడగండి. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయడమా...లేక చంద్రబాబు బృందం భోజనం చేయడమా అని ప్రశ్నించండి. ► భక్తి ఉంటే విజయవాడలో 45 గుళ్లను కూల్చేయడమా... మైనార్టీల మీద దేశ ద్రోహం కేసులు పెట్టడమా.. అని కూడా గట్టిగా అడగండి. జన్మభూమి కమిటీలు మంచివా.. లేక ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ మంచిదా అని చంద్రబాబు బృందాన్ని అడగండి. ► చంద్రబాబుకు సీఎం పదవి అంటే.. అరడజన్ దొంగలు.. గజదొంగలుగా దోచుకోవడం.. పంచుకోవడం... తినడం. అదే మీ బిడ్డ జగన్‌కు సీఎం పదవి ఇవ్వడమంటే.. ఇంటింటా అభివృద్ధి అని చెప్పండి. అన్నీ గుర్తు పెట్టుకోండి.. ► గతంలో 600 పేజీలతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఎన్నికలు అయిపోగానే దానిని చెత్తబుట్టలో పడేశాడు. అక్కచెల్లెమ్మలు, రైతులు, విద్యార్థులకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి. ఆ మేనిఫెస్టో వాళ్ల వెబ్సైట్లో కూడా కనబడని పరిస్థితి. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మేనిఫెస్టో అంటే ఒక బైబిల్.. ఒక ఖురాన్.. ఒక భగవద్గీత. ప్రతిరోజూ, ప్రతిక్షణం ఆ మేనిఫెస్టో కోసం తపించిన మీ బిడ్డ పాలన ఎలాంటిదో ఆలోచించమని కోరుతున్నా. ► రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం. చాలా చాలా అబద్ధాలు వింటాం. వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉంది. తోడుగా వాళ్ల దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కానీ మీ బిడ్డకు ఇవేమీ లేవు. మీ బిడ్డ వీళ్ల మాదిరి గజ దొంగల ముఠాను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకుంది ఆ దేవుడి దయను, మిమ్ముల్ని. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా మద్దతుగా నిలవండి. తేడా మీరే చెప్పండి.. ► ఈ నాలుగేళ్ల మనందరి ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా డీబీటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఇంటింటికీ ఎంత మంచి చేశామో మీ అందరికీ తెలుసు. అదే గత ప్రభుత్వంలో 2014–2019 మధ్య ఒక ముసలాయన సీఎంగా ఉండేవాడు. అప్పట్లో ఈ పథకాలు ఉండేవా? ఈ బటన్ నొక్కే డీబీటీ పద్ధతి ఉండేదా? ఆ రోజు దోచుకో.. పంచుకో.. తినుకో.. (డీపీటీ). ► 2 లక్షల 7 వేల కోట్ల రూపాయలు మనందరి ప్రభుత్వంలో మన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ అయింది. గత చంద్రబాబు పాలనలో ఈ డబ్బును ఎవరు దోచుకున్నారు? ► గత చంద్రబాబు పాలనలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? (లేదు లేదు అని మహిళలు చేతులు పైకెత్తి చెప్పారు). ఇవాళ ఏ పథకం తీసుకున్నా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. గతంలో జరగనిది.. మీ బిడ్డ జగన్ ఎలా ఇవ్వగలుగుతున్నాడో రాష్ట్రంలోని ప్రతి అన్నను, తమ్ముడ్ని.. ప్రతి అక్కను, చెల్లెమ్మను.. మొత్తంగా 1.56 కోట్ల కుటుంబాలను ఆలోచించాలని కోరుతున్నా. మా అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పమంది అన్నా.. నా భర్త చిన్న ఉద్యోగస్తుడు. ఓసీల్లోని పేదలను గుర్తించి ఈబీసీ నేస్తం ద్వారా ఏటా రూ.15 వేలు నేరుగా మా అకౌంట్లో వేస్తున్నారు. ఈ డబ్బుకు మరికొంత కలుపుకుని కిరాణా షాపు పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మఒడి సాయం అందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు–నేడు ద్వారా మా పిల్లలు చదువుకునే పాఠశాలను బాగు చేశారు. 8వ తరగతి చదువుతున్న మా పాపకు ట్యాబ్ ఇచ్చారు. మా అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పమంది. సొంతింటి కలను కూడా నిజం చేస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చి పాలన అందిస్తున్న మీరు కలకాలం చల్లగా ఉండాలి. – కాసుల వెంకట అరుణ, పదో వార్డు, మార్కాపురం చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే! మీ మేలు ఎవరూ మరచిపోరు మహిళలంతా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మీ మేలును అక్కచెల్లెమ్మలు ఎవరూ మరచి పోరు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. నారీ లోకమంతా మిమ్మల్ని దీవిస్తోంది. నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాయి. పంటలు బాగా పండాయి. దిగుబడులు బాగా వచ్చాయి. పేదరికం అనే పెద్ద రోగాన్ని తరిమేయాలని మీరు తపస్సు చేస్తున్నారు. ముందు తరాలకు కూడా భరోసా ఇచ్చేలా పాలన అందిస్తున్న మీకు అన్ని వర్గాల వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి -
ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం
-
YSR EBC Nestham: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సీఎం జగన్ ప్రసంగం: ►ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్ ►అక్కచెల్లెమ్మలను అన్ని విధాల ఆదుకుంటున్నాం ►చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు ►అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నా ►అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చే కార్యక్రమం ►అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం ►ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే లక్ష్యం ►పేదరికానికి కులం, మతం ఉండదు ►మాది మహిళ పక్షపాతి ప్రభుత్వం ►దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు ►రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ ►ఈబీసీ నేస్తం లాంటి పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నాం ►46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం ►మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం ►మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ►ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు ►ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు ►ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నాం ►అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు దిశ యాప్ ►ఏ ఆపద వచ్చినా నిమిషాల్లో పోలీసులు ఉంటారు ►ఇలాంటి యాప్ దేశంలో ఎక్కడైనా ఉందా? ►మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌పై చట్టం చేశాం ►మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి ►గత ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా? ►గతంలో డీపీటీ పథకం ఉండేది ►గతంలో దోచుకో, పంచుకో, తినుకో ►మా ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు జమ చేసింది ►చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలున్నాయా? ►ముసలాయన పాలనలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో జమ అయ్యిందా? ►ముసలాయన పాలనలో ఎవరు పంచుకున్నారు? ►ఎవరు దోచుకున్నారు,ఎవరు తిన్నారు ఆలోచన చేయండి ►టిడ్కో ఇళ్లపై సెల్ఫీ ఛాలెంజ్ అంటా? ►సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదు బాబు.. ►సెల్ఫీ ఛాలెంజ్ అంటే ప్రతీ ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పండి ►ప్రజలు మంచి చేశారు అని చెబితే అప్పుడు సెల్ఫీ తీసుకోవాలి.. దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు ►సీఎం జగన్ పాలనలో మహిళలంతా పండగ చేసుకుంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం జగన్ ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధి కోసమే ఆలోచిస్తారన్నారు. ►ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ వర్గాల్లోని పేదలకు సీఎం అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. 40 ఏళ్ల కల పొదిలి పెద్దచెరువుకు రూ.50 కోట్లు సీఎం కేటాయించారు. 14 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా రెండో ఫేజ్ అభివృద్ధి పనులకు సీఎం నిధులు సమకూర్చారని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్ మొదలుపెట్టిన వెలికొండ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ పూర్తిచేస్తారని నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ►వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన సీఎం జగన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ►ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు. మార్కాపురం చేరుకున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురం చేరుకున్నారు. కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం 4,39,068 మంది అగ్రవర్ణ పేదలకు రూ.658.60 కోట్లు అందించనున్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఉ.9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. ►10.15 గంటల నుంచి మ.12.05 వరకు ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబి్ధదారులకు నగదు జమచేస్తారు. కార్యక్రమం అనంతరం మ.12.40కు అక్కడి నుంచి తాడేపల్లికి బయల్దేరుతారు. ►రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయననున్నారు. ►ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం. మూడేళ్లలో మొత్తం రూ.45వేలు.. ►వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయంచేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ►ఇక నేడు అందిస్తున్న రూ.658.60 కోట్లతో కలిపి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ.30,000. అలాగే, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ.2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ కలిపి) -
జన హృదయాల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర
కనిగిరి రూరల్: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవిర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. చదవండి: పూర్తి చేసేది మేమే వైఎస్ జగన్ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్‌లో డయాలసిస్ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్టణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు. -
వెంటాడిన మృత్యువు!
ప్రకాశం: గుంటూరులో బంధువులను పరామర్శించి తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని మత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టి బోల్తాపడటంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో ఇద్దరు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పూతలపట్టు మండలం పాలకూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పామూరు మండలం, తాతయ్యపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి(50), భార్య రామ సుబ్బమ్మ(43) కర్ణాటకలోని హల్సూర్‌లో స్థిరపడ్డారు. కుమార్తె కీర్తిరెడ్డి(25), కుమారుడు వంశీ(23)తో కలిసి బెంగళూరులో పీజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. గతేడాది కుమార్తెకు సీఎస్‌పురం మండలం జంగవారిపల్లికి చెందిన çసాఫ్ట్వేర్ ఇంజినీర్ హరీష్‌తో వివాహం చేశారు. ఇతను కూడా బెంగళూరులోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గుంటూరులో ఉంటున్న సుబ్బమ్మ ఆడపడుచు భర్తకు గుండెపోటు రావడంతో భర్త, కుమార్తెతో కలిసి అల్లుడి కారులో గుంటూరు వెళ్లారు. సోమవారం రాత్రి 9 గంటలకు బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో మంగళవారం తెల్లవారుజామున పూతలపట్టు మండలం పాలకూరు వద్ద ముందు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీని వీరి కారు అదుపుతప్పి ఢీకొట్టింది. కారు బోల్తా పడి నుజ్జునుజ్జయింది. రామసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందగా హరీష్, వెంకటేశ్వర్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన కీర్తిరెడ్డి(25)ని 108 ఆంబులెన్సులో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ పేర్కొన్నారు. -
నా కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదు: ఎంపీ మాగుంట
సాక్షి, ప్రకాశం జిల్లా: తన కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందన్నారు. 10 రాష్ట్రాల్లో తమకు వ్యాపారాలు ఉన్నాయన్నారు. మా కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట స్పష్టం చేశారు. మాగుంట కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు: బాలినేని మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ప్రజలకు ఎంతో సేవ చేసిందని.. అలాంటి కుటుంబంపై రాజకీయ కుట్ర చేయడం బాధాకరమని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.. ఒంగోలులో మాగుంట నివాసంలో ఎంపీ మాగుంటను పరామర్శించిన బాలినేని, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవ్వరితో విబేధాలు లేకుండా అందర్ని కలుపుకునిపోయే గుణం మాగుంట కుటుంబానిది అని అన్నారు. రాజకీయంగా మాగుంట కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బాలినేని అన్నారు. మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలతో పాటు పార్టీ అండగా ఉంటుందని బాలినేని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని బాలినేని అన్నారు. చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది! -
పులిని చంపి వండుకుని తిన్నారు?
యర్రగొండపాలెం:(ప్రకాశం జిల్లా): పులిని చంపి వండుకుని తిన్నారని అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. పుల్లలచెరువు మండలంలోని అక్కచెరువు చెంచుగూడెంకు సమీపంలోని ఈతల కొండ, ఎర్రదరి ప్రాంతాల్లో దుప్పులు, మనపోతులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు కొంతమంది విద్యుత్ తీగలుపెట్టి జంతువులను వేటాడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన ఆ ప్రాంతంలో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులకు తెలిసింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు కూడా ఫారెస్ట్ అధికారులు సేకరించారు. ఈ పులిని కరెంటు తీగలు పెట్టి చంపారని, తోలును అడవిలో ఉన్న బావిలో వేసి, మాంసాన్ని వండుకుని తిన్నారని యర్రగొండపాలెంలోని అటవీశాఖ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ధ్రువీకరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు పులులు సంచరిస్తున్నాయి పులిని చంపి దాని మాంసం వడుకుని తిన్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.నీలకంఠేశ్వరరెడ్డి వివరణ ఇచ్చారు. తమకు అందిన సమాచారం మేరకు అక్కపాలెం ప్రాంతంలో విచారణ చేపట్టామని ఆయన తెలిపారు. పులి సంచరిస్తోందని తెలిసిన వెంటనే పాదముద్రలు సేకరించామని, తద్వారా అక్కడ రెండు ఆడ పులులు, ఒక మగపులి సంచరిస్తోందని తేలిందని ఆయన వివరించారు. అటవీ జంతువులు ఎక్కువగా సంచరిస్తున్న ఆ ప్రాంతంలో సహజంగానే పులులు తిరుగుతుంటాయన్నారు. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమకు కూడా తెలిసిందని, దీనివల్ల పులులకు ప్రాణహాని ఉంటుందన్నారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పులిని చంపినట్లు వస్తున్న వదంతులపై తమ దర్యాప్తు ఇంకా ముగియలేదని ఎఫ్ఆర్ఓ చెప్పారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? -
Ms శ్రీదేవి.. ఎల్లలెరుగని సేవ
ఇరవై నాలుగేళ్ల వయసులో మీరైతే ఏం చేస్తారు? శ్రీదేవి మాత్రం సమాజ సేవకు సిద్ధపడింది. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకుంది. పేదలతో మమేకమవుతూ.. వారి కష్టాలు విని ధైర్యం చెబుతూ.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూతనిస్తోంది. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ నేపథ్యమే తనను ఈ దిశగా అడుగులు వేసేలా చేశాయంటున్న శ్రీదేవి.. సేవా కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలకు తన వంతు సాయం చేస్తున్న ఆమె జీవితం.. ఎందరికో స్ఫూర్తివంతం. మద్దిపాడు(ప్రకాశం జిల్లా): Ms శ్రీదేవి. పేరు ఎక్కడో విన్నట్టు.. చూసినట్టు అనిపిస్తోందా? తను సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో ఇన్ఫ్లూయెన్సర్. నిరుపేదలకు సేవ చేయడంలో కలిగే సంతృప్తిని సమాజానికి పరిచయం చేస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కృప, సత్యనారాయణల మూడో కుమార్తె శ్రీదేవి. తను పుట్టిన మూడు నెలలకే తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తనకంటే ముందు ఇద్దరు అక్కలు. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది తన తల్లి. ఈ క్రమంలో తల్లి పడిన కష్టాన్ని కళ్లారా చూసిన శ్రీదేవి మనసులో పేదలకు సేవ చేయాలన్న ఆలోచన నాటుకుపోయింది. తన 24వ ఏట నుంచి సేవా కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారించింది. భర్తను కోల్పోయి చిన్న పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్న మహిళలు, పిల్లలు లేని వృద్ధులు, చదువుపై ఆసక్తి ఉన్నా చదివించే స్థోమత లేని నిస్సహాయ తల్లిదండ్రుల దీనగాథలు ఆమె దృష్టికి రాగానే వెంటనే స్పందించడం, ఆఘమేఘాల మీద ఆ ప్రాంతానికి వెళ్లి సాయం అందించి ఆత్మ సంతృప్తి పొందడం అలవాటుగా చేసుకుంది. గురువారం ఆమె మద్దిపాడు మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీకి వచ్చింది. స్థానిక సర్పంచ్ గంగిరెడ్డి ద్వారా పేదల కష్టాలు తెలుసుకుంది. కాలనీ పది మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు దుస్తులు, కొంత నగదు అందజేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకుంది. ‘నా ఆత్మ సంతృప్తి కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి నెలా సుమారు రూ.3 లక్షలకు పైగా పేదల కోసం ఖర్చు చేస్తున్నా. చిన్న పిల్లలను చదివిస్తున్నా. నా టీమ్‌లో మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఏఏ జిల్లాలకు వెళ్లాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ఆ తర్వాత గ్రామాలను ఎంచుకుని సహాయం అవసరమైన వారిని గుర్తిస్తాం. 20 మంది బాలబాలికలకు స్కాలర్షిప్ అందిస్తూ వారి చదువుల బాధ్యతను కూడా తీసుకున్నా’ అని సంతోషంగా చెప్పింది. శ్రీదేవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని ఆశిద్దాం. -
వైజాగ్‌లో కిడ్నాప్.. తాడివారిపల్లెలో హత్య
పొదిలిరూరల్: ఒంగోలు–నంద్యాల రహదారిలో తాడివారిపల్లె చెక్‌పోస్ట్ సమీపంలో కాలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధం నేపథ్యంలో బత్తుల దేవధరణి అనే యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుధవారం రాత్రి పొదిలి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి యువకుడి హత్య కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మనూరు గ్రామానికి చెందిన బత్తుల దేవధరణి(22) చిన్నప్పటి నుంచి చెడు వ్యవసనాలకు బానిసై తిరుగుతుండేవాడు. మహిళలకు పోన్ చేసి మాట్లాడటం, ఆకతాయితనంగా ఉండటంతో తన అన్న పవన్‌సాయి విశాఖపట్టణంలో తన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఇంటర్ వరకు చదివించడంతోపాటు ఓ రెస్టారెంట్లో పనిలో చేర్చాడు. చదువు మధ్యలో ఆపేసిన దేవధరణి నిత్యం సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో గంగ అనే యువతి పరిచయం కాగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గంగకు ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తితో ముందే అక్రమ సంబంధం ఉంది. దీంతో దేవధరణి, ప్రవీణ్‌కుమార్ మధ్య తరచూ వివాదం నడుస్తోంది. వీరిద్దరితో పవన్‌సాయి మాట్లాడి సర్దుబాటు చేసినప్పటికీ గంగతో దేవధరణి చాటింగ్ చేయడం మాత్రం ఆపలేదు. దీంతో దేవధరణిని అడ్డు తొలగించాలని ప్రవీణ్‌కుమార్ పథకం రచించాడు. అహోబిలం వెళ్లేందుకని చెప్పి జనవరి 30న బాడుగకు కారు మాట్లాడాడు. మనోజ్, చాణక్య, శివకుమార్, నరేష్, స్వప్న అనే యువతితో దేవధరణిని నమ్మబలికించి కారులో ఎక్కించారు. మార్గమధ్యంలో దేవధరణికి క్లోరోఫామ్ ఇచ్చి స్పహలో లేకుండా చేశారు. క్లోరోఫామ్ ప్రభావంతో దేవధరణి కారులోనే మలమూత్రాలు విసర్జించడంతో తర్లుపాడు మండలం తాడివారిపల్లె ఘాట్ రోడ్డులో కారు ఆపి కిందకు దించారు. అటవీ ప్రాంతంలో కత్తితో గొంతు కోసి, పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేవధరణి కనిపించకపోవడంతో సోదురుడు పవన్‌సాయి విశాఖపట్టణం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు చంపడానికి ఉపయోగించిన బాడుగ కారు డ్రైవర్ శివకిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. నిందితుల్లో ఒకడు అరెస్టయ్యాడని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో పొదిలి సీఐ సుధాకర్‌రావు, తర్లుపాడు ఎస్సై ముక్కంటి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నా మీ మేలు మరువలేము..
ఒంగోలు: ‘‘అన్నా మీ మేలు మరువలేము, అడగకుండానే అన్నీ ఇస్తున్నారు. ఇంతకంటే మాకేం కావాలి..తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీ వెంటే ఉంటామంటూ’’ ప్రజలు స్పష్టం చేశారు. స్థానిక విజయ్‌నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, వడ్డెపాలెం కొండలు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వ పరంగా అందిన కార్యక్రమాలను వివరించారు. పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఇళ్ల పట్టాల గురించి అడగ్గా మార్చినెలలో ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తిచేస్తామని వివరించారు. జగనన్న విద్యాదీవెన, అమ్మ ఒడి పథకం అందుతున్న చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు బాలినేని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి బాలినేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో తమ్మిశెట్టి అంజయ్య, తమ్మిశెట్టి వాసు, బండారు ఏడుకొండలు, తమ్మిశెట్టి శ్రీను, బండారు దుర్గయ్య, బండారు వెంకటేశ్వర్లు, బండారు డేవిడ్, బండారు శ్రీను, బండారు అంకమ్మ, గుంజి శివదుర్గ, మక్కిల దుర్గ , శ్రీను, వల్లపు ఆనంద్, గుంజి భరత్, బండారు శివ, బండారు గణేష్, బండారు అంజయ్య, బండారు రమేష్, బండారు ఆంజనేయులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాలినేనితోపాటు ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, నగర మేయర్ గంగాడ సుజాత, 31వ డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, మోడుబోయిన సురేష్‌యాదవ్, సంయుక్త కార్యదర్శి పటాపంజుల శ్రీనివాసులు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, ట్రేడ్ యూనియన్ జిల్లా, నగర అధ్యక్షుడు కేవీ ప్రసాద్, గోవర్థన్‌రెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావలి, వైఎస్సార్సీపీ నాయకులు పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, బడుగు ఇందిర, పోకల అనూరాధ, తమ్మినేని మాధవి, దాసరి కరుణాకర్, వల్లెపు మురళి, జాజుల కృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్ యం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పొలం గట్టున పొంచిన గండం.. రక్తపింజర, కొండచిలువలు కోకొల్లలు
మార్కాపురం డివిజన్లోని నల్లమల సమీప గ్రామాల్లో పాముల బెడదతో రైతులు వణికిపోతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న సర్పాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాములను చంపకుండా వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేసేందుకు అటవీశాఖ స్నేక్ వాచర్లను నియమించి.. వందల సంఖ్యలో పాముల్ని రక్షించి వాటి ఆవాసాలకు చేరుస్తోంది. మార్కాపురం(ప్రకాశం జిల్లా): పాము అంటే ప్రతి ఒక్కరికీ భయం. దేశంలో ఉన్న పాముల్లో అత్యంత విషపూరితమైన వాటిలో మొదటిది రక్తపింజర, తరువాత తాచుపాము, కట్లపాము. రక్తపింజర ఇటీవల కాలంలో మార్కాపురం ప్రాంతంలో ఎక్కువగా సంచరించటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్చి, పత్తి పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. అత్యధికంగా నవంబర్ నెలలో మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీం 103 పాములు పట్టుకోగా అందులో ఎక్కువగా ప్రమాదకరమైన రక్తపింజరలు ఉన్నాయి. మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో స్నేక్ వాచర్ నిరంజన్ 10 రోజుల వ్యవధిలో 8 రక్తపింజర పాములను పొలాల్లో పట్టుకున్నాడు. వేములకోటలో 4, కొండేపల్లి బ్రిడ్జి కింద 1, శివరాంపురం పొలాల్లో 1, ఎస్కొత్తపల్లిలో 1, పట్టణంలోని పీఎస్ కాలనీలో ఒక రక్తపింజర పామును పట్టుకున్నాడు. 5 అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే చనిపోతారు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఒళ్లంతా చమటలు పట్టి రక్తాన్ని పలుచన చేస్తుంది. దీంతో గుండె బలహీన పడుతుంది. ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కొండచిలువలు కూడా మార్కాపురం ప్రాంతంలో జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు, 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు 10 రోజుల వ్యవధిలో 3 ప్రాంతాల్లో పట్టుకుని అడవుల్లో వదిలేశారు. బుడ్డపల్లిలో 2, పొదిలి దగ్గర ఒక కొండచిలువను పట్టుకున్నారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి కొండ చిలువలు వస్తున్నాయి. కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను తింటున్నాయి. మనిషిని చుట్టేస్తే కొండచిలువ నుంచి బయటపడటం చాలా కష్టం. పాముల పట్టివేత ఇలా: నవంబర్ నెలలో నల్లమల పరిధిలోని శ్రీశైలంలో 15, సున్నిపెంటలో 27, మార్కాపురంలో 103, వైపాలెంలో 55, దోర్నాలలో 14, విజయపురి సౌత్‌లో 23 కలిపి మొత్తం 237 పాములను పట్టుకున్నారు. డిసెంబర్ నెలలో 163 పాములను పట్టుకున్నారు. పాముకాటు సంఘటనలు అక్టోబర్ 23న కొనకనమిట్ల మండలం గనివెనపాడులో యద్దనపూడి మరియమ్మ పాటుకాటుతో మృతిచెందింది. సిద్దవరంలో ఆగస్టులో ఒకేసారి 8 మంది పాముకాటుకు గురై చికిత్స పొందారు. విషపూరితమైనవే కాదు..మేలు చేసేవీ ఉన్నాయి నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పాములు సంచరిస్తున్నాయి. ఇందులో అత్యంత విషపూరితమైన నాగుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్నపింజర, కొండ చిలువలతో పాటు రైతులకు మేలు చేసే పాములు కూడా ఉన్నాయి. జర్రిపోతు, నీరుకట్టు పాము, చెక్డ్కిల్ బ్యాక్, బ్రౌన్జి, పసిరిక పాములు ఉన్నాయి. ఇవి పొలాల్లో పంటలను నాశనం చేసే ఎలుకలు, పందికొక్కులు, తొండలు, బల్లులను తిని జీవిస్తుంటాయి. కొండ చిలువ మాత్రం కుందేళ్లు, పక్షులు, కోళ్లు, చిన్న మేకలను తింటుంది. పసిరికపాము చెట్లపైనే ఉండి తొండలను, పిట్టలను తింటుంది. అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర, నాగుపాము, కట్లపాము పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
2024 ఎన్నికల్లో జగనే సీఎం.. ఇది పక్కా
ఒంగోలు: ప్రచార పిచ్చితో చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని, ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొస్తే దానిని టీడీపీ, జనసేన, సీపీఐలు విమర్శించడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించి కందుకూరులో 8 మంది ప్రాణాలు, చీరెలు ఇస్తామంటూ అమాయక పేద ప్రజలను ఆశపెట్టిన కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇటువంటి మరణాలు పునరావృతం కారాదని, పేదల హృదయ వేదన అర్థం చేసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవో నంబర్ ఒకటి తీసుకొచ్చారన్నారు. అది అర్థం చేసుకోకుండా పేదల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు... తమ మీటింగ్‌లు మాత్రం యధాతథంగా జరగాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి చర్యలను ప్రజలు హర్షించరన్నారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగానే 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సీపీఐ, జనసేన, టీడీపీ మూడు కలిసి పనిచేసినా 2024 ఎన్నికల్లో జగన్‌ను సీఎం కాకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. తనకు శ్రీవెంకటేశ్వర పొలిటికల్ సర్వే సంస్థ ఉందని, ఎన్ని విధాలుగా సర్వేచేసినా ప్రజలు మాత్రం జగన్ వైపు ఉన్నారని, కేవలం ప్రచార ఆర్భాటం ద్వారా టీడీపీ మైలేజీ పెంచుకోవాలని చూస్తోందన్నారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కూడా వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని, ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని పాతిక వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కనీసం ప్రతిపక్ష పార్టీ నేత అందుబాటులో లేకపోవడం, ఒక వేళ వస్తే పేదలను ఆదుకోవడానికి డబ్బు వెచ్చించాల్సి వస్తుందంటూ హైదరాబాదు, బెంగళూరులో దాక్కున్నారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబు ఏదోలా జనాలను నమ్మించి టికెట్లు అంటగట్టాలని ఆరాట పడుతున్నారని, టీడీపీ నాయకులు పోటీ చేసి ఉన్నదంతా పోగొట్టుకుని తరువాత బాధపడేకంటే ముందుగానే ఆలోచించుకోవడం మంచిదని సూచించారు. ఇటీవల చంద్రబాబు పెట్టిన రెండు రకాల బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలు కూడా ప్రజల్లో ఆయనకు వ్యతిరేకత పెంచేవిగానే ఉన్నాయన్నారు. మిణుగురు పురుగుల్లా చంద్రబాబు వద్దకు చేరవద్దని, దగ్గరకు వెళితే కాలిపోయేది మీరే అని గుర్తుంచుకోవాలని అన్నారు. మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షేక్ మీరావలి మాట్లాడుతూ బాలినేనిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దామచర్ల జనార్దన్ మానుకోవాలని హితవు పలికారు. -
ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయం..
ఒంగోలు: స్థానిక గద్దలగుంట పారువేట కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు గద్దలగుంట పారువేటకు వచ్చారు. గద్దలగుంట ముఖ ద్వారంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు నేతృత్వంలో ఏర్పాటైన పాటకచ్చేరికి బాలినేని, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గద్దలగుంటలోని నాగార్పమ్మతల్లి, అంకమ్మ తల్లి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, శ్రీకోదండ రామస్వామి ఆలయం, అంకమ్మ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన పాటకచ్చేరి కార్యక్రమానికి బాలినేని, మాగుంట ఇరువురు హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సంయుక్తంగా వాల్తేరు వీరయ్య సినిమా కేక్‌ను కట్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి వేగం అవుతుందన్నారు. చిరంజీవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, ఆయన సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో తమ కుటుంబానికి మంచి బంధం ఉందని అన్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీరయ్యగా చిరంజీవి అభిమానులు పేర్కొంటుండడం మరింత ఆనందంగా ఉందన్నారు. అనంతరం అక్కడ నుంచి గాంధీబొమ్మ సెంటర్లో 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఏర్పాటు చేసిన పాటకచ్చేరిలో ఇరువురు పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని, మాగుంటను వైఎస్సార్ సీపీ నాయకులు ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, కార్పొరేటర్ తాడి కృష్ణలత సత్కరించారు. రాజరాజేశ్వరస్వామి అమ్మవారు, గద్దలగుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇరువురు గద్దలగుంట నెహ్రూబొమ్మ సెంటర్లోని పాట కచ్చేరిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. మీ వాడిని.. ఎప్పుడూ అందుబాటులో ఉంటా ‘‘నేను మీ వాడిని... మీతో కలిసి పెరిగిన వాడ్ని..తిరిగిన వాడ్ని... నా బాల్యం అంతా గద్దలగుంటలోనే గడిచింది. ఇక్కడి ప్రజల ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... గద్దలగుంటతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. ఇప్పటికే గద్దలగుంటలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని, మరో వారం రోజుల్లో రూ.10 లక్షలతో మహిళా భవన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో గద్దలగుంటలో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డిని కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు. బహుమతి ప్రధానోత్సవ సభకు కమిటి అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్‌బాబు, కాపు కళ్యాణ మండపం చైర్మన్ టీవి రంగారావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివరావు, కమిటీ సభ్యులు ఈదుపల్లి అంకబాబు, కాటా నాగేశ్వరరావు, ఈదుపల్లి కోటేశ్వరరావు, చిట్టెం వెంకటేశ్వర్లు, తోటకూర చైతన్య, మలిశెట్టి రాజేంద్రప్రసాద్, దండే వెంకటేశ్వర్లు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. (క్లిక్ చేయండి: 2024 ఎన్నికల్లో జగనే సీఎం.. ఇది పక్కా) -
మిలమిల.. జగనన్న కాలనీ ఇలా..
పేదలందరికీ పక్కా ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు క్రమంగా కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇడుపూరు వద్ద 88 ఎకరాల విస్తీర్ణంలోని జగనన్న కాలనీలో పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 3 వేల గృహాల నిర్మాణాలు వివిధ దశలలో ఉండగా.. ప్రభుత్వం రూ.3 కోట్లతో విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. ట్రాన్స్ఫార్మర్లు పెట్టి.. వీధి లైట్లు ఏర్పాటు చేయటంతో ఆ ప్రాంతమంతా జిగేల్మంటూ మెరిసిపోతోంది. – మార్కాపురం (ప్రకాశం జిల్లా) -
నడిసంద్రంలో బిగ్ ఫైట్.. చెన్నై బోట్లను తరిమేశారు!
చెన్నై మత్స్యకారులు బరితెగించారు. ఎప్పటిలాగే మన సముద్ర తీర ప్రాంతం వైపు చొరబడ్డారు. అక్రమంగా మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. పెద్ద పెద్ద బోట్లలో వచ్చి వేటాడటాన్ని మనవాళ్లు గుర్తించారు. సినిమాను తలపించే విధంగా నడిసంద్రంలో చెన్నై సోనాబోట్లను వెంటాడారు. తీరం నుంచి మెరైన్ పోలీసులు, మత్స్యకారులు, మత్స్యశాఖ సిబ్బంది 10 కిలో మీటర్లు సముద్రంలో ప్రయాణించి పెద్ద పెద్ద బోట్లతో నిబంధనలు అతిక్రమించి వేటాడుతున్న 16 బోట్లను వెంబడించి తరిమికొట్టారు. దీంతో వారు తోక ముడిచి వలలను వదిలి ఉడాయించారు. ఈ ఘటన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్తపట్నం తీరంలో చోటుచేసుకుంది. కొత్తపట్నం: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరం వెంబడి చెన్నై సోనా బోట్లు నిబంధలకు విరుద్ధంగా వేట సాగిస్తున్నాయి. తీరానికి అతి దగ్గరలో 100 మీటర్ల దూరంలో తమిళనాడు మత్స్యకారులు వేట చేయడం పరిపాటిగా మారింది. వారి బోట్లు 40 అడుగుల ఎత్తులో, మన బోట్లు ఐదు అడుగుల ఎత్తులో ఉండటంతో వారిని స్థానిక మత్స్యకారులు కట్టడి చేయడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో.. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో చెన్నై సోనా బోట్లు అదుపు చేశారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు పెద్ద బోట్లలో తీరానికి దగ్గరగా వచ్చి మా సంపద కొల్లగొడుతున్నారని స్థానిక మత్స్యకారులు గత ఏడాది డిసెంబర్ 30న బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన కె.పల్లెపాలెం తీరానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నిజాంపట్నంలో సోనా బోటును బాడుగకు తీసుకొచ్చి చెన్నై మత్స్యకారులు వేటాడుతున్న ప్రాంతానికి వెళ్లి భయపెట్టాలని, వారిని అక్కడ వేటాడకుండా చేయాలని, ఆ బోటుకు ఎంత ఖర్చయినా తాను పెట్టుకుంటానని జేడీ ఆవుల చంద్రశేఖరరెడ్డిని ఆదేశించారు. తాజా వివాదం ఇలా.. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు స్పందించారు. నిజాంపట్నం నుంచి సోనా బోటును కొత్తపట్నం తీసుకొచ్చే సమయంలో గుండాయపాలెం వచ్చే సరికి ఇంజన్ చెడిపోయి అక్కడే ఉండిపోయింది. దీంతో మత్స్యకార జేడీ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మూడు ఫైబర్ బోట్లను సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో గస్తీ తిరిగారు. మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది, మత్స్యశాఖ అధికారులు సముద్రంలో 10 కిలో మీటర్ల దూరంలో వేటాడుతున్న చెన్నై సోనా బోట్ల సమీపానికి చేరుకున్నారు. అప్పుడు 16 బోట్లు వేటాడుతున్నాయి. వారి దగ్గరకు వెళ్లే కొద్దీ వారు వలలను వదిలేసి వేగంగా తమ ప్రాంతానికి తిరిగి వెళ్లడం ప్రారంభించారు. వారి వెంటబడి మరో 10 కిలో మీటర్ల దూరం తరిమి కొట్టారు. వారు వదిలి పెట్టి వెళ్లిన వలలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్రంలో బోటు ద్వారా వెళ్లిన వారిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సముద్ర తీర మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు గొల్లపోతు నాగార్జున, జిల్లా మత్స్య శాఖ సహకార సంఘం అధ్యక్షుడు వాయల శ్రీనివాసరావు, కాపులు తంబు వెంకటేశ్వర్లు, సింగోతు వెంకటేశ్వర్లు, సైకం పోతురాజు, సొసైటీ అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, పెదసింగు వెంకటేశ్వర్లు, కొక్కిలగడ్డ చిన్న లక్ష్మణ, మెరైన్ సీఐ కట్టా శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ ఉషాకిరణ్, ఎఫ్‌డీవో ఆషా, విలేజి ఫిషరీస్ అసిస్టెంట్లు, సాగర్ మిత్రలు, మెరైన్ పోలీసులు, మత్స్యకార సిబ్బంది ఉన్నారు. వారానికి ఒక రోజు సముద్రంలో గస్తీ వారానికి ఒక రోజు సముద్రంలో బోట్ల ద్వారా గస్తీ తిరిగితే చెన్నై బోట్లు మన ప్రాంతానికి రావటానికి భయపడతాయి. మన మత్స్య సంపద కోల్పోము. బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మత్స్యకారులకు మంచి జరిగింది. ఆయనకు కృతజ్ఞతలు. – గొల్లపోతు నాగార్జున, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మత్స్యకార్మిక యూనియన్ అధ్యక్షుడు బోట్ల ద్వారా ఎప్పుడూ తరిమికొట్టలేదు సోనా బోట్లను తరిమి కొట్టండి అని బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులకు మంచి సూచనలు ఇచ్చారు. ఇటువంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఆయన సొంత నగదు ఇస్తానని భరోసా ఇవ్వటం మత్స్యకారులకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా తరచూ బోట్ల ద్వారా సోనా బోట్లను వెంటాడితే స్థానిక మత్స్యకారులకు మేలు జరుగుతుంది. – వాయల శ్రీనివాసరావు, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు -
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్: పచ్చ బ్యాచ్.. పరువుపాయే..!
అది సినిమా ఫంక్షన్ అని మరిచారు..ఎప్పటిలాగే పచ్చ బ్యాచ్ చీప్ ట్రిక్స్‌కు తెరతీసింది. వేదిక పేరుతో టీడీపీ రచ్చ..రచ్చ చేసింది. ఇక ఎల్లో మీడియా అసత్య కథనాలను వండి వార్చేసింది. ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఊదరగొట్టింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా జరిగిన ఈ హైడ్రామాను రక్తి కట్టించబోయిన ఈ బ్యాచ్ బోర్లాపడింది. హీరో, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సాక్షిప్రతినిధి, ఒంగోలు: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను సినిమా బృందం ఒంగోలు నగరంలో నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత వేదికను రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఏబీఎం గ్రౌండ్లో జరుపుకోవాలని నిర్వాహకులు తలంచారు. అందుకోసం ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో బందోబస్తు, సభ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎంతమంది అభిమానులు, ప్రజలు వస్తారని పోలీసులు నిర్వాహకులను అడిగారు. 35 వేల మందికి పైగా పాసులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. దీంతో పోలీస్ అధికారులు ఈ గ్రౌండ్ కేవలం 15 వేల మందికి మాత్రమే సరిపోతుందని, ఇంకెక్కడైనా విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీంతో వారు ఉత్తర బైపాస్‌లోని ఒక విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకొని అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఒకపక్క జరుగుతుంటే మరో పక్క ఎల్లో గ్యాంగ్ అసత్య ప్రచారానికి పూనుకుంది. ఏబీఎం గ్రౌండ్లో నిర్వహించుకునేందుకు ఇచ్చిన అనుమతులను పోలీసులు రద్దు చేశారంటూ నానా రభస చేసింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒక అడుగు ముందుకేసి దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి, తనకు అనుకూలంగా మలుచుకోవటానికి సిద్ధమైపోయారు. వెంటనే విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమ హీరో సినిమా ఫంక్షన్‌కు అన్యాయం జరిగిపోతోందంటూ తనదైన శైలిలో నానా యాగీ చేశాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చే జనాలకు ఏబీఎం గ్రౌండ్ సరిపోదని నిర్వాహకులకు పోలీస్ అధికారులు సూచించారే తప్ప వ్యతిరేకించలేదన్న సంగతి కూడా పూర్తిగా వినకుండానే రాజకీయ కోణాన్ని ఆవిష్కరించారు. దీనిని ఆసరాగా తీసుకుని ఎల్లో మీడియా రెచ్చిపోయింది. కావాలనే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను అటు పోలీసులు, ఇటు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డుకుంటున్నాడని జోరుగా ప్రచారం కూడా చేసింది. ఎలాగైనా రాజకీయంగా వాడుకోవాలని చూసిన దామచర్ల చివరకు విఫలమయ్యాడు. దీంతో జనాల్లో కొద్దో గొప్పో ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నాడు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి ఒంగోలు నగరంలో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రశాంతంగా ముగిసింది. కార్యక్రమం విజయవంతంగా సాగిందని ఫంక్షన్ వేదికగా సినిమా డైరెక్టర్ మలినేని గోపీచంద్ ప్రకటించారు. నా కల సాకారం కావడానికి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవంతానికి మా బాలినేని వాసన్నే కారణమని స్వయంగా వేదిక సాక్షిగా ప్రశంసించారు. దీంతో అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్థమైంది. హీరో బాలకృష్ణ కూడా పోలీసులు బాగా సహకరించారని స్వయంగా ప్రశంసించారు. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అటు బాలకృష్ణ కానీ, ఇటు సినిమా డైరెక్టర్ గోపీచంద్ కానీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల పేరును కూడా ప్రస్తావించలేదు. దీంతో ప్రతిదాన్నీ రాజకీయం చేయాలనుకునే దామచర్ల పరువు నిలువునా పోయినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దామచర్లను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. -
అవినీతికి కేరాఫ్ దామచర్ల జనార్దన్
ఒంగోలు: అభివృద్ధి పథం అంటూ అభివృద్ధి భూతాన్ని ప్రజలకు చూపిస్తే నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని, అవినీతికి కేరాఫ్‌గా దామచర్ల జనార్దన్ నిలిచిపోయారంటూ నగర మేయర్ గంగాడ సుజాత విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడైనా పనులు నిలిచిపోతే ఆందోళన చేశామని, కానీ పనులు వేగవంతంగా జరుగుతుంటే దానిని ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో నిరసన చేయడం దామచర్లకు మాత్రమే చెల్లిందన్నారు. బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి కాంట్రాక్టర్ వద్ద కమీషన్‌తోపాటు దాదాపు రూ.10 కోట్ల అప్పు, ఇంకా మరికొంత మంది వద్ద అప్పు తీసుకుని వారిని దామచర్ల ఎలా వేధిస్తుందీ అందరికీ తెలుసన్నారు. మల్లవరం నుంచి నగరానికి పైప్‌లైన్ పనుల్లో ఎంత కక్కుర్తి పడింది, చివరకు టీడీపీ నాయకుల స్థలాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే వదిలేసి పత్తా లేకుండా పోయిన విషయం గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు. చివరకు జనార్దన్ కమీషన్లకు భయపడి కాంట్రాక్టర్లు సైతం పరారయ్యే పరిస్థితి వస్తే వారికి బకాయిలు సైతం తీర్చి నేడు పనులు వేగవంతంగా చేయిస్తుంటే కళ్లుండి చూడలేని స్థితి నెలకొందని విమర్శించారు. నిద్రలో సైతం బాలినేని ఫోబియాతో జనార్దన్ వణికిపోతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్ మాట్లాడుతూ మభ్యపెట్టడం, మోసపుచ్చడం అనేది చంద్రబాబు నాయుడికి మాత్రమే వెన్నతో పెట్టిన విద్య అని జనం అనుకునేవారని, కానీ నేడు ఆ జాబితాలో జనార్దన్ కూడా చేరిపోయారని విమర్శించారు. ఒంగోలులో 20 వేల పెన్షన్లు తీసివేశారంటూ మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని, 2 వేల పెన్షన్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతే తిరిగి వాటిని బాలినేని స్వయంగా పర్యవేక్షించి 1800 పెన్షన్లు పునరుద్ధరించిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కేవలం పెన్షన్లు తిరిగి వచ్చాయన్న విషయం ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ప్లాన్‌చేసి బకింగ్‌హాం కెనాల్ బ్రిడ్జి అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ విమర్శించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు మాట్లాడుతూ ప్రతి చోట యాక్టింగ్ షోలు సక్సెస్ కావని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఒంగోలులో ఎంతమంది పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు? నేడు వాటి విలువ ఎంతో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని, కానీ జనార్దన్ హయాంలో ఎంతమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి ఎంతమంది పేదల ఆస్తులు పెరగడానికి దోహదపడ్డారో సమాధానం చెప్పాలన్నారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు మాట్లాడుతూ రెండేళ్లపాటు కరోనా విలయ తాండవం చేసినప్పుడు ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడితే అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు బెంగళూరు, హైదరాబాదులో తలదాచుకుని, నేడు రోడ్ల మీదకు వస్తున్న తీరు చూసి ఇదేం ఖర్మ అంటూ జనం ఈసడించుకునే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి కావాటి రవికుమార్ మాట్లాడుతూ గోల్డెన్ స్పూన్ అని చెప్పుకునే జనార్దన్‌కు నిద్రలో సైతం బాలినేని కుటుంబాన్ని తలుచుకునే పరిస్థితి దాపురించిందని, బాలినేని ఫోబియాతో వణికిపోతున్నారని విమర్శించారు. టీడీపీ కోసం అంటూ బండ్లమిట్ట వద్ద ముస్లిం దుకాణాలను ధ్వంసం చేసింది, బుడబుక్కల వారి ఇళ్లను ధ్వంసం చేసింది, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఎలా కాజేయాలనుకుంది ప్రజలందరికీ తెలుసని, కబ్జాదారు ఎవరు, కనికరించేది ఎవరో కూడా అర్థమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకురాలు తమ్మినేని మాధవి మాట్లాడుతూ టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు కుమార్తె పెళ్లికోసం కాళ్లు పట్టుకుని ఆర్థికసాయం అందించమని జనార్దన్‌ను ప్రాధేయపడితే చివరకు రూ.50 వేలు చేతిలో పెట్టి లక్ష రూపాయలకు ఓచర్ రాయించుకున్నారంటూ మండిపడ్డారు. కార్పొరేటర్ తాడి కృష్ణలత మాట్లాడుతూ అభివృద్ధి మీరు చేస్తే నగరంలో తమ సమస్యలు తీర్చండంటూ జనం మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని, నేడు నిధులు అత్యధికంగా పేద ప్రజానీకం నివాసం ఉండే ప్రాంతాల్లోనే వెచ్చిస్తున్న సంగతి తెలుసుకోవాలన్నారు. బొమ్మనేని మురళి మాట్లాడుతూ బకింగ్‌హాం కెనాల్ ప్రాజెక్టుకు కేవలం 40 శాతం పనులు చేసి 80 శాతం చేశానంటూ ప్రజలను నమ్మించాలని చూడడం జనార్దన్ కుట్రలో భాగమే అన్నారు. 2015లో బ్రిడ్జి మంజూరైతే టెండర్ ఖరారుకు 16 నెలలు, మరో ఏడాదికి అంటే 2017లో శంకుస్థాపన చేశారని..ఇదీ టీడీపీ హయాంలో వేగవంతంగా పనులు జరగడం అంటూ విమర్శించారు. ప్రతి పనిలోను పర్సంటేజీలే అని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనార్దన్ హయాంలో ప్రతి పనిలోను 20 శాతం అదనానికి టెండర్లు పడడమే ఇందుకు నిదర్శమని మండిపడ్డారు. -
వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై స్పందించిన అడిషనల్ ఎస్పీ
సాక్షి, ఒంగోలు (ప్రకాశం జిల్లా): బాలకృష్ణ చిత్రం వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై వస్తున్న వార్తలపై అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈవెంట్‌కి పోలీసులు మొదట అనుమతి ఇచ్చి తర్వాత అనుమతి నిరాకరించారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. మొదట ఏబీమ్ స్కూల్ ఆవరణలో వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్వహకులు సన్నాహాలు చేసుకున్నారని.. ఆ విషయం మేం తెలుసుకొని నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ ఈవెంట్ చేస్తే పార్కింగ్‌కి, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని నచ్చ చెప్పామన్నారు. పక్కనే రైల్వే స్టేషన్, ఆసుపత్రులు ఉనందున్న ప్రజల రాకపోకలకు ఇబ్బందవుతుందని సూచించామని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో ఈవెంట్ జరుపుకోమని సూచించామని, దానికి నిర్వాహకులు కూడా సమ్మతించి.. ఈవెంట్ ప్లేస్ మార్చుకున్నారన్నారు. మొదట మేము అనుమతి ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నామన్న వార్తలలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. రేపు ఒంగోలు-గుంటూరు రోడ్డు అర్జున్ ఇన్ఫ్రాలో జరిగే వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వారు అడిగిన దాని కన్నా ఎక్కువే భద్రత ఇస్తున్నామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్‌ను కూడా డైవర్ట్ చేస్తున్నామని, ఇటువంటి ఇబ్బంది లేకుండా హీరో బాలకృష్ణ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి సహకరిస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. చదవండి: సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఆయన లేకపోతే.. -
నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య.. ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి పార్టీ నాయకుల వరకూ ఒకటే తీరు. నాడేమో కాసుల కోసం కక్కుర్తి పడి..కావల్సిన వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పి..పనులు వేగంగా జరుగుతున్నాయని ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వారి తీరు మారలేదు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా కొత్తపట్నం వంతెనపై క్షుద్ర రాజకీయానికి తెరతీశారు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..బకింగ్‌హామ్ కెనాల్ సాక్షిగా ఆయన చేస్తున్న డ్రామా పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, ఒంగోలు: ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలకు కడుపుమంట పుడుతోంది. అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. నాడు కమీషన్లకు కక్కుర్తిపడి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి కాంట్రాక్టు పనులు అప్పగించారు.. పనులు వేగంగా జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు... ఇతని రాజకీయ డ్రామాలు తెలుసుకున్న ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టారు.. దీంతో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకునే కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ప్రజలపై ఉన్న కోపమో, బాలినేనిపై అక్కసో తెలియదు గానీ పేదల ఇళ్లు దగ్గర నుంచి ఎన్నో పనులకు అడ్డుపడుతూనే ఉన్నారు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో జనార్దన్ హైదరాబాద్‌కు, బెంగళూరుకు పరిమితమయ్యారు తప్ప, వారి ఇబ్బందిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ఎమ్మెల్యే బాలినేని మాత్రం నిత్యం ప్రజలతో ఉంటూ జీజీహెచ్‌లో వంద పడకలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఆక్సిజన్, మందులు, భోజనం ఉచితంగా అందించడమే కాక, నగర ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు అందిస్తూ వారితో మమేకమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక దామచర్ల జనార్దన్ అండ్ కో బాలినేనిపై ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ మరో రాజకీయ డ్రామాకు తెరతీశారు. అసలు బ్రిడ్జి నిర్మాణం విషయానికొస్తే జనార్దన్ జేబులు నింపుకోవడానికే దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప, ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని కొత్తపట్నంతోపాటు, ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మండి పడుతున్న పరిస్థితి. బ్రిడ్జి పనులు చేస్తున్నది తాను అప్పగించి.. తమ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్ అయినప్పటికీ బాలినేనిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారు. తాజాగా మరోసారి బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ ప్రస్తుతం సైతం పనులు చేస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ వద్ద కమీషన్లకు దామచర్ల జనార్దన్ కక్కుర్తి పడ్డా..బాలినేని మాత్రం బ్రిడ్జి వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ వచ్చారు తప్ప, కాంట్రాక్టర్‌ను ఎక్కడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయితే రాజకీయ కుట్రలో భాగంగా పనులు నత్తనడకన జరుగుతున్నాయని గ్రహించిన బాలినేని పనులు వేగవంతం చేయాలని, లేదంటే చర్యలు తప్పవంటూ కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో అప్పటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. దీన్ని గమనించిన జనార్దన్ త్వరలో పనులు పూర్తవుతాయని తెలుసుకుని రాజకీయ డ్రామాకు తెరతీశారు. బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టి తన ఆందోళన కారణంగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే కలరింగ్ ఇచ్చుకునే కుయుక్తులకు పథక రచన చేస్తున్నారు. చదవండి: (పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు) కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు సక్రమంగా పనులు జరగలేదని తెలిసినా బ్రిడ్జిని రాజకీయంగా తన రాజకీయ డ్రామాకు వాడుకునే ప్రయత్నం చేస్తుండటంపై ప్రజలు సైతం ఛీ కొడుతున్నారు. సొంత పార్టీలో ఉన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ఏవో ఉద్యమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆపార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తుండటం గమనార్హం. బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసి ఈనెల 20వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించేందుకు ఆర్అండ్బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 20 తరువాత వాహనాల రాకపోకలను బ్రిడ్జిపై అనుమతించి చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే వాటిని అతి త్వరలోనే పూర్తి చేస్తామంటూ అధికారులు చెబుతుండటం విశేషం. బ్రిడ్జి పనులు పూర్తయ్యే సమయంలో జనార్దన్ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలందరికీ తెలుసని, చీప్ పాలిటిక్స్ చేస్తూ జనార్దన్ ప్రజల్లో మరింత చులకనవుతారని గుర్తించాలని పలువురు హెచ్చరిస్తున్నారు. కరోనాతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నా వారి ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించని జనార్దన్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు చూపించే కుయుక్తులకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆటంకాలు కలిగించకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలా.. ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌హాం కెనాల్‌పై వంతెన నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ వద్ద మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్ కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారు. 2016లో మంజూరైన బ్రిడ్జి పనులు టీడీపీ ప్రభుత్వంలో మూడున్నర సంవత్సరాలపాటు కమీషన్ల కోసం కాలయాపన చేస్తూ నిర్మాణ పనులను నిర్వీర్యం చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధులతో ప్రారంభమైన పనులు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమును రద్దు చేసిన సంగతి తెలిసి కూడా జనార్దన్ ప్రజలను మభ్యపెట్టే పనులు చేపట్టడం ఏదో సానుభూతి పొందాలని తప్ప ప్రజలకు మేలు చేద్దామని కాదు. నిర్మాణ పనులు పూర్తవుతున్న బ్రిడ్జి వద్దకు వెళ్లి ఏదో నిరసన వ్యక్తం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆయన హడావుడి చేసినందు వల్ల పనులు వేగంగా జరిగాయని బిల్డప్ ఇచ్చుకోవాలని చూస్తున్నాడు. అయితే నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ట్రయల్ రన్ పూర్తి చేసి అనంతరం బ్రిడ్జిపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగిస్తాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, ఒంగోలు -
వీర్లకొండ ఎక్కేద్దాం రండి!
ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. మరో అడుగు ముందుకేసింది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉండేవారి కోసం వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్ పాయింట్ ఏర్పాటు చేసింది. టెక్కింగ్ చేసే పర్యాటకుల కోసం స్థానిక గిరిజనులను గైడ్లుగా వినియోగించనుంది. ఫలితంగా వారికి ఉపాధి లభిస్తుంది. పచ్చని కొండలను సాహసోపేతంగా ఎక్కేయాలని సరదాపడుతున్నారా.. వీర్లకొండ విశేషాలేంటో చూద్దాం రండి.. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): నల్లమలలో పర్యటించే యాత్రికులకు వసతి, సౌకర్యాలు కల్పించటంతో పాటు వారిలోని ఉత్సాహం, పట్టుదల, ధైర్య సాహసాలను ప్రదర్శించేందుకు అటవీశాఖ సరికొత్త కార్యక్రమాలను రూపొందించనుంది. పర్యాటకులకు చిన్న చిన్న సాహసాలతో కూడిన ఎన్నో అడ్వంచర్లను చేపట్టేందుకు అద్భుత అవకాశాన్ని కల్పించే దిశగా అడుగులు వేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం రెస్టు రూములు, సావనీర్ షాపులు ఏర్పాటు చేసిన అధికారులు సరికొత్తగా పర్వతారోహణ (ట్రెక్కింగ్)కు అవకాశం కల్పించి యాత్రికులకు ఉల్లాసాన్ని కలిగించనున్నారు. ఇందు కోసం మండల పరిధి తుమ్మలబైలు సమీపంలోని వీర్లకొండ అనువుగా ఉందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు యుద్ధప్రాతిపదిన పర్వతారోహణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఉత్సాహవంతులైన గిరిజన యువకులకు ఉపాధి కల్పించటంతో పాటు, అటవీశాఖ కూడా కొంత ఆదాయం సమకూర్చుకోనుంది. వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్ ఏర్పాట్లు వేగవంతం అటవీశాఖ సరికొత్తగా ఏర్పాటు చేయనున్న ట్రెక్కింగ్ కార్యక్రమానికి పెద్దదోర్నాల, తుమ్మలబైలు మధ్య ఉన్న వీర్లకొండ అనువుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు కొన్ని రోజుల కిందట వీర్లకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు, వన్యప్రాణుల సంచారం, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రెక్కింగ్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. పర్వతారోహణకి అనువుగా వీర్లకొండ పైకి నడిచి వెళ్లేందుకు నడక మార్గాన్ని ఏర్పాటు చేయటంలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. నడక దారిలో అడ్డంగా ఉన్న చెట్లకు ఏమాత్రం నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయటంతో పాటు, దట్టంగా ఉన్న గడ్డి పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో తుమ్మలబైలు గిరిజన గూడేనికి 2 కిలోమీటర్లు ముందుగానే వీర్లకొండ వస్తుందని, శ్రీశైలం ప్రధాన రహదారిలోనే వీర్లకొండ ఉండటం వల్ల యాత్రికులు, పర్యాటకులు నడవాల్సిన అవసరం లేకుండా వారి వాహనాలను అక్కడే పార్కింగ్ చేసుకోవటానికి వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారి వద్ద నుంచి కొండపైకి ఎక్కేందుకు 500 మీటర్లు, కొండ దిగేందుకు 500 మీటర్లు మొత్తంగా ఒక 1 కిలో మీటరు మేర ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్‌కు సంబంధించి ఒక్కొక్కరికి రూ.300 మేర ట్రెక్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి వీర్లకొండపై ఇప్పటికే వాచ్ టవర్‌ను అధికారులు సిద్ధం చేశారు. దీంతో పాటు అత్యాధునిక బైనాక్యులర్ను ఏర్పాటు చేసి నల్లమల అభయారణ్య పరిసరాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని అధికారులు కల్పించనున్నారు. ఇప్పటికే కొండపైకి నడక మార్గాన్ని సిద్ధం చేశారు. ఈనెలాఖరు నాటికి ట్రెక్కింగ్‌కు పర్యాటకులకు అనుమతించనున్నారు. ట్రెక్కింగ్‌తో చెంచు గిరిజనులకు ఆర్థికాభివృద్ధి నల్లమలలో ట్రెక్కింగ్ ఏర్పాటు చేయటంతో పాటు అక్కడి చెంచు గిరిజనులకు ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. కొంత మంది గిరిజన యువకులకు శిక్షణ ఇచ్చి వారిని గైడ్లుగా ఏర్పాటు చేసి వారి సేవలను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్‌కు వెళ్లే ఒక్కో పర్యాటకుడితో పాటు ఒక్కో గైడు వారి వెంట ఉంటారు. ట్రెక్కింగ్‌కు వెళ్లే వారిని జాగ్రత్తగా తీసుకెళ్లటంతో పాటు, నల్లమల విశిష్టతను తెలియజేయటం, వారి రక్షణ పట్ల జాగ్రత్తలు తీసుకుని వారిని మళ్లీ తిరిగి కిందికి తీసుకురావటం గైడ్లు చూసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. దీని వల్ల ఒక్కో గైడుకు అటవీశాఖ వసూలు చేసే రూ.300 రుసుములో రూ.200 గైడ్‌లకే ఇస్తామని అటవీశాఖ రేంజి అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. ప్రతి యువకుడికి రోజుకు రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎక్కువ మంది యువకులకు గైడ్‌గా ఉండే అవకాశం కలుగుతుంది. ట్రెక్కింగ్ పనులు వేగవంతం నల్లమలలో పర్యటించే యాత్రికులు, పర్యాటకుల కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ట్రెక్కింగ్‌తో గిరిజన యువకులకు ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. దీని వల్ల పర్యాటకులకు మరొక సందర్శనీయ ప్రాంతంగా వీర్లకొండ మారనుంది. – విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి -
సన్నాయి ఊదలేం.. బసవన్నను ఆడించలేం
సన్నాయి, మేళతాళాలతో ఓ రాముడూ అమ్మగారికి నమస్కరించు.. అయ్యగారికి దండం పెట్టూ.. సీతమ్మా వచ్చి రాముడు పక్కన నిలబడు... లక్ష్మణా రాముడు పక్కన నిలబడు... హనుమంతూ పల్టీలు కొట్టు ఇలా ఇంటి ముంగిట వాకిట ముగ్గులలో గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బసవన్నలను ఆడిస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తారు గంగిరెద్దుల వాళ్లు. సంక్రాంతి వచ్చిందంటే వీరికి మూడు నెలలు పండగే. గజ్జెలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో బసవన్నలను అలంకరించి ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. వీరి జీవనాన్ని ఒక్కసారి పరికిస్తే మనసును బాధించే ఎన్నో కష్టాలు మన ముందు ఉంచుతారు. వారి మదిని ఒక్కసారి తడితే వారి భవిష్యత్ అందర్నీ కలచివేయక మానదు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న కళను వదులుకోలేక.. భారమైనా జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఉన్న ఊరు వదిలి వందల కిలోమీటర్లు వచ్చి ఊరికి దూరంగా ఉన్న ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని బతుకు బండి లాగుతున్న వీరిని చూస్తే గుండె బరువెక్కక మానదు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా వారి జీవన విధానాన్ని తెలుసుకుందామని నగరంలోని ముంగమూరుడొంక వెళ్లాం. అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకుని పిల్లాజెల్లాతో నివాసం ఉంటున్నారు. సుమారు 60 నుంచి 80 గుడారాలు కనిపించాయి. అక్కడున్న వారిలో పెద్దాయన బత్తుల సబ్బయ్యను కలిశాం. ‘సంప్రదాయంగా వస్తున్న ఈ కళకు ఆదరణ తగ్గిపోయింది. ఇన్నాళ్లు బసవన్నలను పట్టుకుని అందంగా సింగారించి ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేసే వాళ్లం. అలసిపోయాం. మాతో పాటు గంగిరెద్దులు కూడా అడుగులు వేయలేని పరిస్థితి. ఇక అందరం ప్రత్యామ్నాయ వృత్తులకు పోయి కడుపు నింపుకుంటున్నాం. సంకురాత్రి వచ్చిందంటే నాలుగు డబ్బులు కనిపిస్తాయి. అవి కూడా బసవన్నల పోషణకు సరిపోతాయి. మా పిల్లలు వేరే పనులకు వెళ్లి తెచ్చిన డబ్బుతో మా కడుపులు నిండుతాయి..’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పుకొచ్చాడు సుబ్బయ్య. ‘ఏడాదిలో రెండుమూడు నెలలు మాత్రమే ఉపాధి ఉండటంతో మిగతా ఏడాది అంతా గంగిరెద్దుల పోషణ గగనమవుతోంది. రానురాను సంప్రదాయ కళకు ప్రోత్సాహం కూడా సన్నగిల్లుతోంది. ఆచారాన్ని పోగొట్టలేక భారమైనా ఈడ్చుకొస్తున్నాం’ అని అంటున్నారాయన. సుమారు రూ.10 వేలు ఖర్చు చేసి గంగిరెద్దులను సింగారిస్తాం. రెండు నెలల పాటు ఊరూరా తిరిగితే దయగల మహానుభావులు చేసే దానధర్మాలతో వచ్చిన డబ్బుతో కాలం వెళ్లిపోతుంది. కొంత మంది దానం చేసిన దుస్తులను సైతం బసవన్నల అలంకరణకే వాడుకుంటాం. దాదాపు 40 ఏళ్ల పాటు గంగిరెద్దులతో తిరిగా. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడంలేదు. వైద్యానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నా. మాయావిడ తెల్లవారుజామునే బజారుకెళ్లి పండ్లు తీసుకొస్తది. వాటిని సైకిల్ రిక్షాపై వేసుకుని ఒంగోలు నగర వీధుల్లో తిరుగుతూ విక్రయిస్తున్నా. మా పిల్లలు కూడా 8వ తరగతి వరకూ చదువుకుని వేరే పనులకు వెళ్తున్నారు. మాకు సొంత గూడు అంటూ ఏమీ లేదు. ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకున్నాం. ఈ స్థలం మాది.. ఖాళీ చేయండి అంటే వేరే ప్రాంతానికి పోతాం అంటున్నాడు సుబ్బయ్య. గంగిరెద్దుల తరం వారికి ప్రకాశం జిల్లా పెట్టింది పేరు. జిల్లాలోని తర్లుపాడు మండలం నాగళ్లముడుపు గ్రామంలో ప్రధాన ఆచారంగా దాదాపు 500 కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. అదేవిధంగా వెలిగండ్ల మండలం గణేశునిపల్లె గ్రామంలోనూ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. వీరిని ఆధారం చేసుకుని గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర ఉప్పరపాలెం, నెల్లూరు జిల్లా కొల్లపూడి, కంటేపల్లి, మనుబోలు గ్రామాల్లో ఆచారాన్ని కొనసాగిస్తున్న వారూ ఉన్నారు. పోషణ గగనం కావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. రకరకాల వ్యాపకాలతో జీవనోపాధి పొందుతున్నారు. నాలుగు నెలలు శిక్షణ... వీరి ఆచారం ప్రకారం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత అని పేర్లు పెట్టుకుంటారు. కొత్తగా తీసుకొచ్చిన గిత్తలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు. వాటికి ఆట, పాట నేర్పిస్తారు. కాళ్లు ఆడించడం.. చేతులు తొక్కడం.. నమస్కారాలు చేయడం వంటి అంశాల్లో నాలుగు నెలల పాటు తర్ఫీదు ఇస్తారు. రాముడూ ఇలా వచ్చి బాబుగారికి సలాం చేయి అంటే బసవన్నలు చేయాల్సిందే. కొత్తగా వచ్చిన గిత్తలు బెదరకుండా చూసుకుంటూనే రంగంలోకి దింపుతారు. పలిగాపులో (నోట్లో తలపెట్టడం) కూడా శిక్షణ ఇస్తారు. ఒంటి నిండా రంగురంగుల దుస్తులతో వీటిని అలంకరించడంతో మండుటెండల్లో ఇవి ఇబ్బంది పడతాయి. కొన్ని పొగరు గిత్తలైతే శివాలు ఎత్తుతాయి. కులపెద్దలదే తీర్పు... ఎవరైనా తప్పు చేస్తే ముందుగా వీరి కులంలోని పెద్దలు పంచాయితీ చేస్తారు. తప్పు చేశారని రుజువైతే వారే శిక్షవేస్తారు. వారి తీర్పు శిరోధార్యం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే పోలీస్స్టేషన్లకు వెళ్తారు. డిగ్రీ, ఇంజినీరింగ్ చదువులు... గంగిరెద్దుల వంశానికి చెందిన కొందరు వాటికి ఆటపాటలు నేర్పి సంక్రాంతి పండుగ నెలల్లో ప్రతి ఇంటి ముందు ప్రత్యేక అలంకరణలతో డూ..డూ బసవన్నలు చేసే విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. మరికొందరు ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు రాక దుకాణాల్లో, ఫ్యాక్టరీల్లో చిన్న, చిన్న పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. చాలా మంది ఐదారు తరగతుల వరకూ చదువుకుని ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్లలేక కూలి పనులకు వెళ్తున్నారు. మా కష్టాలు గుర్తించండి... సంకురేత్రి నెల మొదలు శివరాత్రి వరకూ గంగిరెద్దులతో ఇంటింటా తిరుగుతూ బసవన్నలతో సందడి చేస్తాం. మా ఆచారం ప్రకారం అందరం ఆరు నెలలు పట్నంలో ఉంటాం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో పెళ్లిలకు మేళాలు వాయిస్తాం. ఇతర పనులకు వెళ్తాం. నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి వినాయక చవితికిగానీ, దసరాకుగానీ సొంతూళ్లకు వెళ్లిపోతాం. అక్కడ పొలం పనులు చేసుకుంటాం. గంగిరెద్దులకు పొలంలో వచ్చిన జొన్న, వరిగడ్డి ఆహారంగా పెడతాం. డిసెంబర్ మొదటి వారంలో పట్టణాలకు చేరుకుని సంకురేత్రికి ఎద్దులను ఆడించుకుంటూ జీవనం సాగిస్తాం. కొంత మంది కూలి పనులకెళ్తారు. నేనూ, నా కుటుంబ సభ్యులు (నలుగురు) రెండు బృందాలుగా విడిపోయి రోజంతా తిరిగితే రూ.1,000 నుంచి రూ.1,500 వస్తాయి. అందులో గంగిరెద్దులకు ఆహారం పోతే మాకు అంతంత మాత్రమే మిగులుతుంది. ఆవు కంటతడి పెడితే ఇంటికి మంచిది కాదు. వాటిని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాం. గంగిరెద్దులను ఏదైనా ఉత్సవాలకు తీసుకెళ్తే అక్కడ కచ్చితంగా సీతారాముల కల్యాణం ఉండి తీరాల్సిందే. అన్ని జాతుల వారికి కాలనీలు ఉన్నాయి. మాకు మాత్రం ఎక్కడా లేవు. పేర్నమిట్ట దగ్గర స్థలాలు ఇస్తే బాగుంటుంది. పాలకులు మా కష్టాలను గుర్తించండి. – బి.వీరయ్య, ఒంగోలు -
గుక్క పట్టి ఏడుస్తూ.. వద్దమ్మా అంటున్నా ఆమె మనసు కరగలేదు
సాక్షి, ప్రకాశం (వేటపాలెం): అభం శుభం తెలియని బాబుకు.. తన తల్లి ఏం చేస్తుందో తెలియక.. గుక్క పట్టి ఏడుస్తూ.. వద్దమ్మా వద్దు అంటున్నా ఆమె మనసు కరగలేదు.. పిల్లాడు చూస్తుండగానే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలోని పద్మశాలి వీధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పద్మశాలి వీధిలో అద్దె ఇంట్లో అమరలింగేశ్వరరావు, అనూష (26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి కాగా ఒక పాప, బాబు ఉన్నారు. అమరలింగేశ్వరరావు బేల్దారి పనులు చేస్తుంటాడు. అయితే శుక్రవారం ఉదయం భర్త పని కోసం వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. అనూష ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొనేందుకు ఉపక్రమించింది. ఇంట్లోనే ఉన్న ఐదేళ్ల కుమారుడికి తల్లి ఏంచేస్తుందో అర్థం కాలేదు. ఏడుస్తూ వద్దమ్మా అని వేడుకున్నా ఆమె వినలేదు. దీంతో బాలుడు ఇంటి ముందు ఉన్న వారిని తీసుకొచ్చేలోపే తల్లి ప్రాణాలు వదిలింది. భార్య, భర్తలు అన్యోన్యంగానే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై జి.సురేష్, సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చదవండి: (అంబులెన్స్‌కు చోటివ్వని చంద్రబాబు కాన్వాయ్) -
డ్రైన్ ఉంటే మాకేంటి...ఆక్రమించి మరీ భవన నిర్మాణం!
ఒంగోలు సబర్బన్: నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్చగా సాగుతున్నాయి. నగర పాలక సంస్థ అధికారుల అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో ఒకచోట కాదు అనేక ప్రాంతాల్లో అనుమతుల్లేని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తనిఖీలకు వెళ్లిన సమయంలో తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకుని వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవనం. దక్షిణ బైపాస్ ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రధాన గేటుకు ఆనుకొని దానిని నిర్మిస్తున్నారు. వారం రోజులుగా పనులు జరుగుతున్నాయని తెలిసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకటికి నాలుగు సార్లు అక్కడికి వెళ్లి వచ్చారే తప్ప నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే.. దాని మతలబు ఏమై ఉంటుందో స్పష్టమవుతోంది. దీనికి తోడు దక్షిణ బైపాçస్లో ఉత్తరం వైపున ఆనుకొని ఒంగోలు నగరానికి చెందిన ప్రధాన డ్రైనేజీ కాలువ ఉంది. మామిడిపాలెం, హౌసింగ్ బోర్డు, ఎస్ఎస్ ట్యాంకు–1 పరిసర ప్రాంతాల నుంచి మురుగు నీరు, వర్షపు నీరు ఈ డ్రైనేజి నుంచే ప్రవహించాల్సి ఉంది. అయితే దాదాపు 10 అడుగుల వెడల్పు ఉండే దీనికి రెండు సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా మట్టితో కప్పేసి మరీ నిర్మాణం చేస్తున్నారు. పెద్ద వరద వస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలు లేక ప్రభుత్వ భవనాల సముదాయం, నాగార్జున యూనివర్శిటీ స్టడీ సెంటర్, నవోదయ కళాశాలల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా నగరంలో అక్రమ నిర్మాణాలకు కట్టడి వేయాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్‌లో ఉన్నతాధికారి స్పందించకపోవడం గమనార్హం. నగర పాలక సంస్థ ఆదాయానికి గండి: అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతే నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఫ్లింత్ ఏరియాను బట్టి, అంతస్తుల భవనాల లెక్కన కార్పొరేషన్‌కు ఫీజులు చెల్లించాలి. నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా తమ జేబులు నిండితే చాలు అన్న చందంగా ఉంది టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు. నోటీసులు ఇచ్చి ఆపుతాం.. అక్రమంగా జరుగుతున్న భవన నిర్మాణాలను ఆపేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం. దక్షిణ బైపాస్‌లో ప్రగతి భవన్ ముందు జరుగుతున్న భవన నిర్మాణం విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే నోటీసులు ఇవ్వమని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పా. నోటీసు ఇవ్వటంతో పాటు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తాను. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన విషయం నా దృష్టికి రాలేదు. ఆ విషయంపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ -
‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు..’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు...’’ ఓ సినిమాలో డైలాగు. అదే మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ పనితనం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై ఇటు విద్యార్థులు.. అటు ఉద్యోగులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పట్లో స్థానిక మంత్రిని గాని, కలెక్టర్‌ను గాని, ఎంపీని కానీ ఆహా్వనించలేదు. ఇదేంటని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తే ‘‘మీకు సర్టిఫికెట్లు కావాలా... అతిథులు కావాలా’’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీకి సంబంధించిన మెస్ విషయంలోనూ ఈయన వ్యవహరించిన తీరుపై పెద్ద వివాదం జరిగింది. చివరకు కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగింది. వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రిన్సిపల్ తరచూ గైర్హాజరు అవుతుంటారు. కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారుల వీడియో సమావేశాలైనా...వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జరిగితే ప్రిన్సిపల్ హాజరైన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను చేపడితే దానిలో సైతం అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కానీ, ఇటు జీజీహెచ్ అధికారులకు కానీ సహకరించకుండా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎనీమియా వ్యాధికి సంబంధించి సర్వే చేయాల్సి ఉండగా దానిపై ప్రొఫార్మా తయారు చేసే విషయంలోను ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులే తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించారు. మహిళా ఉద్యోగి రాజీనామా... ప్రిన్సిపల్‌తో పాటు ఈయన అనుచరుల వేధింపుల దెబ్బకు ఒక మహిళా ఉద్యోగి తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ప్రిన్సిపల్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న మెడికల్ కాలేజీలో ఎల్రక్టీషియన్ కూడారి ఆంజనేయులు మహిళా ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె 2022 అక్టోబర్ 20న రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంజనేయులుపై ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ విషయమై ప్రిన్సిపల్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతని అనుచరుడు కావటంతో చర్యలు తీసుకోలేదు. దీనిపై మనస్థాపం చెందిన మహిళా ఉద్యోగి రాజీనామా చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన అటెండర్లు ఆయనకు కనీసం ఆహారం కూడా అందించకూడదనే మౌఖిక ఆదేశాలు జారీ చేశాడంటే ఆ సామాజిక వర్గాల ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో ఉందో అర్థమవుతోంది. చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం బయోమెట్రిక్ నుంచి మినహాయింపు రూల్ ఈజ్ రూల్...రూల్ ఫర్ ఆల్...కానీ ఈ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్‌కు మాత్రం కొన్ని మినహాయింపులు. విధి నిర్వహణకు వచ్చిన సమయంలో ఉద్యోగులందరూ బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయాలి. కానీ ఈయనకు బయో మెట్రిక్ విధానం మినహాయింపు. ఆయన ఎప్పుడైనా రావచ్చు...వెళ్లిపోవచ్చు...అసలు రాకుండా కూడా ఉండవచ్చు. ఇదీ ఆయన తీరు. ఆరోపణలన్నీ అవాస్తవమే.. నాపై వచ్చినవన్నీ నిరాధారమైన ఆరోపణలే. మహిళా ఉద్యోగి విషయంలో లేనిపోని రాజకీయాలు చేస్తున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే నేను పని చేస్తున్నాను. సెలవులు ఎవరైనా పెట్టుకోవచ్చు. గైర్హాజరైతేనే ఒప్పుకోను. – డాక్టర్ పీవీ సుధాకర్, జీఎంసీ ప్రిన్సిపాల్ -
మార్కాపురం కుర్రాడు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి, మిస్టర్ ఇండియా విజేత.. ఇప్పుడేమో ఏకంగా
Bali Mr Universe Tourism 2023- Sai Bharadwaja Reddy: తనుబుద్ధి సాయి భరద్వాజ రెడ్డి... 21 ఏళ్ల కుర్రాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ నెల ఒకటవ తేదీన ఒడిశా రాష్ట్రం, పూరి పట్టణంలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో విజేత. వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 21 వరకు ఇండోనేషియా, ‘బాలి’ దీవిలో జరిగే ‘మిస్టర్ యూనివర్స్ టూరిజమ్ –2023’ పోటీల్లో మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా భరద్వాజ తన విజయరహస్యాన్ని సాక్షితో పంచుకున్నాడు. ‘‘మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. నాన్న వ్యాపార రీత్యా విజయవాడలో పెరిగాను. నాకు ఫ్యాషన్ ప్రపంచం మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. ఫొటోజెనిక్‌గా కనిపించాలనే కోరిక ఉండేది. మంచి దుస్తులు ధరించడం, ఫొటోలు తీసుకోవడం ఇష్టం. బిడియపడకుండా కెమెరాను ఫేస్ చేయడం నన్ను విజేతగా నిలవడానికి కలిసి వచ్చిన ఒక అంశం. ఈ విజయం వెనుక ఐదేళ్ల కఠోరశ్రమ ఉంది. బీటెక్‌లో తొలి ప్రయత్నం మిస్ ఇండియా పోటీలలాగానే మిస్టర్ ఇండియా పోటీలు కూడా ఉంటాయని ఇంటర్లో ఉండగా తెలిసింది. బీటెక్‌లో యూనివర్సిటీ వేడుకల సందర్భంగా ఫ్యాషన్ కాంపిటీషన్ పాల్గొనడం, గెలవకపోవడం జరిగిపోయాయి. అప్పటి వరకు పోటీలను లైట్‌గా తీసుకున్నాను. పోటీని తేలిగ్గా తీసుకోరాదని అవగాహన వచ్చిన సందర్భం అది. డిప్రెషన్‌కి లోనయ్యాను కూడా. ఓటమిని జీర్ణించుకోలేని మానసిక స్థితిలో ఉన్నాననే సంగతిని నేను గ్రహించిన సందర్భం కూడా అదే. ఆ ఓటమి నాకు చాలా మంచి చేసిందనే చెప్పాలి. అప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్‌ని కూడా ఈ పోటీలకు అనుగుణంగా మార్చుకున్నాను. నడవడం, నిలబడడం అన్నింటికీ ఓ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసేకొద్దీ నాలో ఆత్మవిశ్వాసం మెరుగవడం కూడా నాకే స్పష్టంగా తెలిసింది. ఈ పోటీలకు బాడీ బిల్డింగ్ అవసరం లేదు, ఫిట్‌గా ఉండడమే ప్రధానం. బాడీ, మైండ్, స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి. ప్రకటన లేని రెండో ప్రయత్నం సెకండ్ అటెంప్ట్‌కి చాలా పక్కాగా సిద్ధమయ్యాను. గెలిచాను కూడా. అయితే కోవిడ్ కారణంగా అకస్మాత్తుగా ఫలితాల ప్రకటన లేకుండా ఆ పోటీలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇక మూడవ ప్రయత్నంలో ’మిస్టర్ క్లూ’గా ఎంపికయ్యాను. అయితే అది ఆన్లైన్ పోటీ. నాలుగవ ప్రయత్నంలో ఫైనల్స్‌కి ఎంపికయ్యాను, కానీ ఆర్థికపరమైన అడ్డంకి కారణంగా ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయాను. నా ఫ్యాషన్ పోటీల్లో ఐదవ ప్రయత్నం ఈ ‘మిస్టర్ ఇండియా’ పోటీలు’’ అని వివరించాడు భరద్వాజ. విజేత బాధ్యత ఇది ఈ పోటీలను గ్లోబల్ మోడల్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఇప్పటి వరకు మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న విజేతల్లో చిన్నవాడు భరద్వాజ. వచ్చే ఏడాది బాలిలో మిస్టర్ యూనివర్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్న అనేక దేశాల ‘మిస్టర్’లలో కూడా చిన్నవాడు. మిస్టర్ ఇండియా టూరిజమ్ టైటిల్ విజేతగా... అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ భారతీయ సంస్కృతి, పర్యాటకం పట్ల అవగాహన కల్పించడం అతడి బాధ్యత. ఈ సందర్భంగా దక్షిణాది పట్ల ఉత్తరాది వారికి ఉన్న చిన్నచూపును రూపుమాపడానికి కృషి చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. నాకు నేనే అన్నీ! పోటీదారులు ఎప్పుడూ మరొకరిలాగా కనిపించాలని అనుకరించకూడదు. నేను నాలాగే ఉన్నాను కాబట్టి విజేతనయ్యాను. మరో విషయం... నిపుణులైన కోచ్ శిక్షణ, డైటీషియన్ సలహాలు ఏవీ లేవు. ఉద్యోగం చేసుకుంటూనే ప్రాక్టీస్ చేశాను. ఉదయం ఐదింటికి లేచి జిమ్ చేసేవాడిని. ఓట్స్, ఎగ్స్ ప్రధానంగా సొంతవంట. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఎక్సర్సైజ్. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ‘మిస్టర్ ఇంటర్నేషనల్’ టైటిల్‌ని మనదేశానికి తీసుకురావాలనేది ప్రస్తుత లక్ష్యం. – టి. సాయిభరద్వాజ రెడ్డి, మిస్టర్ ఇండియా 2022. – వాకా మంజులారెడ్డి చదవండి: Woolen Art: ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు రేణు ది గ్రేట్ -
దట్టమైన అడవిలో 350 ఏళ్లనాటి దిగుడు బావి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
సాక్షి, తెనాలి(గుంటూరు జిల్లా): అది బావి మాత్రమే కాదు.. ఓ ఇంజనీరింగ్ అద్భుతం.. మన వాళ్ల ప్రతిభకు తార్కాణం.. ప్రకాశం జిల్లాలోని మైలచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావిని చూస్తే.. ఎవరైనా ఔరా అనాల్సిందే. అంత అత్యద్భుతంగా ఉంటుంది దాని నిర్మాణ కౌశలం. లేత గోధుమ రంగు గ్రానైట్ రాళ్లను అందంగా చెక్కి ఆ బావిని నిర్మించారు. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధక బృందం చిట్టడవిలో ప్రయాణించి మరీ ఈ అందమైన దిగుడు బావిని వెలుగులోకి తెచ్చింది. ఆ విశేషాలను ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ బావి మెట్లు.. కనికట్టు! ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలచర్ల అటవీగ్రామం వెలుపల ఉందీ దిగుడు బావి. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకులైన మొవ్వ మల్లికార్జునరావు, చిట్టినేని సాంబశివరావు, బోడపాటి రాఘవయ్య, ముత్తేవి రవీంద్రనాథ్‌లు ఈ బావి గురించి సూచాయిగా విన్నారు. దీంతో ఆ బావిని సందర్శించాలన్న కోరిక వారికి కలిగింది. గత నెలాఖరులో అక్కడకు ప్రయాణం కట్టారు. చంద్రశేఖరపురం మండలంలోని వేట్ల బయలు(వి.బైలు) అనే గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన మైలచర్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి చిట్టడవిలో కొంత దూరం ప్రయాణించాక వెలుగుచూసింది.. ఆ అద్భుతమైన బావి. ఆ మెట్ల బావి డిజైన్, అనితర సాధ్యమైన నైపుణ్యంతో రూపొందించిన తీరు అద్భుతమని రవీంద్రనాథ్ బృందం చెప్పింది. ఊటబావి చుట్టూ పటిష్టంగా నిర్మించిన రాతి కూర్పు కారణంగా గట్టు నుంచి మట్టి పెళ్లలు విరిగిపడి నీరు కలుషితమయ్యే అవకాశమే లేదు. పటిష్టంగా నిర్మించిన రాతి మెట్ల కారణంగా చివరివరకు కిందికి దిగి శుభ్రమైన మంచినీటిని తీసుకెళ్లే వీలు గ్రామీణులకు లభించింది. ప్రస్తుతం నీరు కొద్దిగా మురికిగా ఉన్నా.. తీయదనాన్ని కోల్పోకపోవడం విశేషం. ఇప్పుడు పరిస్థితి కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా.. గతంలో తరచూ దుర్భిక్షం తాండవించే ప్రాంతం అది. బిందెడు మంచినీటి కోసం సుదూర గ్రామాల ప్రజలు మైలచర్ల అటవీ ప్రాంతంలోని సహజసిద్ధమైన మంచినీటి ఊట దగ్గరకు వచ్చేవారట. ‘గండి సోదరుల’ అద్భుత సృష్టి భైరవకోన గుహాలయాల్లో క్రీ.శ 1675 ప్రాంతంలో నివసించిన ఒక సాధువు.. ఆ ప్రాంత ప్రజల తాగునీటి ఇక్కట్లను గమనించి పరిష్కారాన్ని ఆలోచించారు. మైలచర్ల నీటి ఊట దగ్గర ఒక సౌకర్యవంతమైన దిగుడు బావిని నిర్మించాలని తన శిష్యులైన ‘గండి సోదరులు’గా ప్రసిద్ధులైన పశువుల పెంపకందార్లను ఆదేశించడంతో ఈ బావిని వారు నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు. చదవండి: కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? -
సఫారీకి జీవకళ...రూ.కోటితో సరికొత్త హంగులు
ప్రకృతి అందాలు, రమణీయ, కమనీయ దృశ్యాలకు నెలవైన నల్లమల అభయారణ్యం సరికొత్త సొబగులు దిద్దుకుంటోంది. రూ.కోటితో పర్యావరణ ప్రేమికులకు మరో కొత్త లోకాన్ని చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. ఓపెన్ టాప్ జీపుల్లో విహరిస్తూ సాగే జంగిల్ సఫారీ ఇకపై సరికొత్త అనుభూతులు నింపనుంది. తుమ్మలబైలు సమీపంలో రూపుదిద్దుకుంటున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో ఉట్టిపడుతున్న జీవకళ ప్రకృతిని ప్రేమించే మనసులను కట్టిపడేస్తోంది. పెద్దదోర్నాల(ప్రకాశం): నల్లమల అభయారణ్యం.. ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. అక్కడ సాగే జంగిల్ సఫారీని ఆస్వాదించేందుకు ఆరాటపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ పర్యటిస్తుంటే కలిగే ఆనందమే వేరు. నల్లమలలో ఇలాంటి అనుభూతులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్న పర్యాటకులకు అటవీశాఖ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తోంది. తాజాగా సుమారు కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది. వన్యప్రాణుల ఆకృతులతో కూడిన పర్యావరణ విజ్ఞాన కేంద్రంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు పగోడాలు, క్యాబిన్లో అధునాతనంగా రూపుదిద్దుకున్న టాయిలెట్లు, ఆరు బయట పచ్చిక బయళ్లతో ఆకట్టుకునే రీతిలో జంగిల్ సఫారీ ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. ఎకో టూరిజం పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేందుకు సరికొత్త వాటిని సిద్ధం చేస్తోంది. శరవేగంగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పనులు... జంగిల్ సఫారీలో భాగంగా పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేంద్రంలో పెద్దపులి, చిరుతపులి, జింకలు, కృష్ట జింక, నీల్గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలతో పాటు రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్‌బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలి, ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్ఠించారు. ఆయా ఆకృతులకు సంబంధించి విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి ఆకృతి వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి గాండ్రింపుతో పాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్లో వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో జీవకళ... పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల ఆకృతులు జవకళను సంతరించుకుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పులుల ప్రతిమలు చూస్తుంటే.. మన కళ్ల ముందే సజీవంగా ఉన్నాయన్న అనుభూతి కలుగుతోంది. సహజసిద్ధ వాతావరణంలో రాజసంగా నిలుచుని ఉండే పెద్దపులి ప్రతిమ సందర్శకులను కట్టిపడేసేలా ఉంది. చెట్టుపై కూర్చున్న చిరుతపులితో పాటు పెద్ద పులులను సైతం ఎదిరించే మొండితనం, ధైర్యం ఉన్న బుల్లి జీవి హనీబ్యాడ్జర్, ప్రపంచంలోని జింకలలో కెల్లా అత్యంత చిన్న జింకగా ప్రసిద్ధి గాంచిన మూషిక జింకలు సైతం జీవకళతో అబ్బురపరుస్తున్నాయి. గడ్డి మైదానంలో కూర్చుని సేదతీరుతున్న కణితి, పర్యావరణ విజ్ఞాన కేంద్రం గోడలపై ఏర్పాటు చేసిన నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతుల ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. జంగిల్ సఫారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి సరస్సు, పచ్చిక బయళ్లు, చిన్నారులు కూర్చునేందుకు చెక్కతో తీర్చిదిద్దిన సీతాకోక చిలుక, తాబేలు, తదితర ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. ఇవే కాకుండా జంగిల్ సఫారీకి అధునాతన వాహనాలు ఏర్పాటు చేశారు. నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల నెలవైన పులిచెరువు రహదారిలో ఏర్పాటు చేసిన ముఖద్వారంతో పాటు 14 కిలోమీటర్లు జంగిల్ సఫారీ కొనసాగే రహదారిని అందంగా తీర్చిదిద్దారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పలు ప్రత్యేకతలతో జంగిల్ సఫారీని అందంగా తీర్చిదిద్ది పర్యాటకులకు గొప్ప అనుభూతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి రూపాయలతో పనులు నల్లమల జంగిల్ సఫారీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో వన్యప్రాణుల ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాం. విద్యుద్ధీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. జంగిల్ సఫారీ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఆద్యంతం పచ్చని పచ్చిక బయళ్లతో అందంగా తయారు చేస్తున్నాం. పులిచెరువు ముఖద్వారం ఆర్చిని ఆకర్షణీయంగా మారుస్తున్నాం. వన్యప్రాణుల ప్రతిమలు జీవకళతో సందర్శకులను ఆకట్టుకుంటాయి. – విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి -
ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందించిన ఎంపీ మాగుంట
సాక్షి, ప్రకాశం జిల్లా: ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది పూర్తిగా సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా వ్యాపారులు చేస్తున్న కుట్రగా భావిస్తున్నట్లు చెప్పారు. తనకు, తన కుమారుడికి ఆ కంపెనీలో ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. ఆరోపణలపై త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయని తెలిపారు. చదవండి: (సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్) -
కల్లుగీత..రాత మారేలా..! సీఎం వైఎస్ జగన్ చొరవతో తీరిన కష్టాలు
రాత్రనక..పగలనక చెట్టుకు లొట్టి కట్టి కల్లు గీసే కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం మొత్తం బాధ పడేవాళ్లు. అదే కాలో చెయ్యో విరిగితే విధి రాత అనుకొని తమను తామే నిందించుకొనే వారు. ఇదంతా గతం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కల్లుగీత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారు. ఆర్థిక భద్రతతో పాటు ఎందులోనూ వారు నష్టపోకుండా భరోసా కల్పించారు. దీంతో జిల్లాలో దాదాపు 2500 మంది కల్లు గీత కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): కల్లుగీత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి భరోసా కల్పిస్తున్నాయి. జిల్లాలో పెద్దగా నీటి వనరులు లేకపోవడంతో ఈత, తాటి వనాల సంఖ్య తక్కువగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 11 టీసీఎస్ సొసైటీలు (తాడీ కో–ఆపరేటివ్ సొసైటీలు) ఉన్నాయి. అవి ఒంగోలు, టంగుటూరు, కనపర్తి, చీమకుర్తి, పొదిలి, పెదారికట్ల, మర్రిపూడి, కనిగిరి, పామూరు, గిద్దలూరు, నాగులుప్పలపాడు ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీలో 10 నుంచి 15 మంది లోపు సభ్యులుంటారు. 136 కల్లు దుకాణాలు ఉన్నాయి. టీఎఫ్టీలు (ట్రీ ఫర్ ట్యాఫర్) కల్లు గీసేవారు 2300 మంది ఉన్నారు. దాదాపు 25 వేల చెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో కల్లు గీతనే వృత్తిగా చేసుకొని జీవిస్తున్న కుటుంబాలు పరిస్థితి దుర్భరంగా మారింది. ఆశించిన ఆదాయం లేదు..ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవు. ఇలాంటి తరుణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గీత కార్మికుల జీవితాలకు బలమైన ఆర్థిక పునాదులు వేస్తోంది. పరిహారం పెంచి..భరోసానిచ్చి: కల్లు గీసే సమయంలో కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో వైఎస్సార్ బీమా పరిహారం కింద రూ.5 లక్షలు చెల్లించేవారు. దీనిని తాజా ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. ఇందులో వైఎస్సార్ బీమా రూ.5 లక్షలతో పాటు ఎక్స్‌గ్రేషియా కింద మరో రూ.5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి వైఎస్సార్ గీత కార్మిక భరోసా పథకంగా పేరు పెట్టారు. అంతేగాక ఐదేళ్ల కాల పరిమితితో కల్లు గీత విధానాన్ని ఖరారు చేసినట్లుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఖరారు చేసిన కల్లు గీత పాలసీ 2022 నుంచి 2027 సెప్టెంబరు 30 వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం అమలుతో గౌడ, శెట్టిబలజ, ఈడిగ, కులాలకు చెందిన కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 2500 మందికి ప్రయోజనం కలగనుంది. కల్లు అద్దెలను (కిస్తీలను) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ప్రత్యామ్నాయ మార్గం... కల్లు గీత సొసైటీలలో గీసే వానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు లైసెన్స్ కూడా ఇస్తారు. ఒక వేళ ఎవరైనా కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైతే ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆదాయ మార్గాలను చూపిస్తారు. అలాగే వైఎస్సార్ బీమా ద్వారా నష్ట పరిహారం చెల్లిస్తారు. అంతే కాదు ఎన్ఆర్ఈజీఎస్.షెల్టర్బెడ్ అభివృద్ధి పథకం కింద తాటి, ఈత చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటారు. కాలువ గట్లు నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సంవృద్ధిగా పెంచనున్నారు. జగనన్న మేలు మరువలేం కల్లు గీత కార్మికుల కష్టాలను గుర్తించి వారి అభ్యున్నతికి పాటు పడుతున్న సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలు ఎప్పటికీ మరువలేం. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కల్లుగీత కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. – జూపల్లి ఏడుకొండలు, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్, డైరెక్టర్, పొదిలి మండలం గీత కార్మికులకు భరోసా ఏర్పడింది కల్లు గీత కార్మికులకు ప్రమాద బీమా పెంచడం మంచి పరిణామం. గతంలో కల్లుగీత కార్మికుల జీవితాలు ఎంతో దుర్భరంగా ఉండేవి. మా స్థితిగతులను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కిస్తీలను రద్దు చేయడం, మరికొన్ని సమస్యలను పరిష్కరించడంతో ఎంతో భరోసా ఏర్పడింది. ఆయనకు గీత కార్మిక కుటుంబాలు రుణపడి ఉంటాయి. – కంచర్ల కోటయ్య గౌడ్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్, గిద్దలూరు ఎక్స్‌గ్రేషియాపై హర్షం గీత కార్మికుల సమస్యలపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. గీత కార్మికుల కష్టాలు గుర్తించి వారి సంక్షేమానికి పాటు పడిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. వీరి నిర్ణయంపై గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – రామచంద్రరావు, ప్రకాశం జిల్లా కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు నూతన పాలసీతో ఎంతో మేలు ప్రభుత్వం చేపట్టిన నూతన పాలసీ విధానంతో కల్లుగీత కార్మికుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఇచ్చేవారు. నూతన పాలసీ వలన గతంలో ఇస్తున్న ప్రమాద బీమాతో పాటు మరో రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. దీంతో ఆ కుటుంబాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చినట్లువుతుంది. అంతేగాక సాధారణ ప్రమాదం జరిగి కాలు, చేయి విరిగితే అటువంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించింది. – రాయపాటి హనుమంతారావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి -
కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!
మద్దిపాడు: గొర్రెల కాపరికి తన జీవాలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే కదా! తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం, చింతగుంట గ్రామానికి చెందిన కురమయ్య సుమారు వెయ్యి గొర్రెల మందకు కాపరి. అన్ని జీవాలకు మేత కావాలి కదా! అందుకే వాటిని మేపుకుంటూ ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి, గుండ్లాపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు కూడా మందకు రక్షణగా ఉంటారు. ఇంత పెద్ద సమూహంలో పిల్లలు పుట్టడం సహజమే. అయితే అవి నడవలేవు కాబట్టి వాటి కోసం బాడుగ వాహనం కావాలి. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కురమయ్యకు ఓ ఐడియా వచ్చింది. చిలకలూరిపేటలో ఓ ఆటోమొబైల్ గ్యారేజీకి వెళ్లి 38వేల రూపాయలు ఖర్చు చేసి ఇనుప గ్రిల్స్‌తో ట్రాలీ తయారు చేయించాడు. దానిని తన ద్విచక్రవాహనానికి అమర్చడంతో ట్రాలీ వాహనంలా మారిపోయింది. ప్రస్తుతం 60 మేక పిల్లలను ఎంత దూరమైనా సులువుగా తీసుకువెళుతున్నామని దీనివలన ఖర్చు తగ్గిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
స్త్రీనిధి రుణాలతో స్వయం ఉపాధికి బాటలు
మహిళా సాధికారతే లక్ష్యంగా.. డ్వాక్రా మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా చిన్న తరహా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకుని జీవనం గడుపుతున్నాము. జగనన్న తోడు కింద రూ.10 వేలు రుణం ఇచ్చారు. దాంతో చిన్నపాటి మ్యాచింగ్ సెంటర్ పెట్టుకున్నాను. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు డీఆర్డీఏ ఏరియా కో ఆర్డినేటర్ లక్ష్మీరెడ్డి ఇచ్చిన సలహా మేరకు స్త్రీనిధి రుణం రూ.50 వేలు తీసుకుని చీరలు, రవికలు, వాటికి సంబంధించిన మ్యాచింగ్ మెటీరియల్ తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నాను. దీనివలన కుటుంబ పరిస్థితి కుదుట పడింది. మహిళలకు సీఎం జగనన్న ఇస్తున్న సహకారం మరువలేము. – దాసు ఝాన్సీ, లావణ్య గ్రూపు సభ్యురాలు జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేని రుణంతో ఇంట్లోనే దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాను. వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి స్త్రీనిధి రుణం రూ.50 వేలు, బ్యాంకు రుణం రూ.30 వేలు తీసుకుని బ్యాంకుకు దగ్గరలో షాపును అద్దెకు తీసుకుని ఫ్యాన్సీ, గిఫ్ట్ ఐటమ్స్ విక్రయిస్తున్నాను. వ్యాపారం బాగానే జరుగుతోంది. గతంలో కుటుంబం జరగడమే కష్టంగా ఉండేది. ప్రస్తుతం జగనన్న మా కుటుంబానికి తోడుగా ఉండి నాతో వ్యాపారం చేయిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ పరిస్థితి బాగుంది. జగనన్నకు రుణపడి ఉంటాము. – షేక్ ఆయేషా, అల్లాహ్ గ్రూపు సభ్యురాలు యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా): జిల్లాలోని 38 మండలాల్లో డీఆర్డీఏ పరిధిలో 47,275 గ్రూపుల్లో 4,90,250 మంది సభ్యులున్నారు. మెప్మా పరిధిలో 4,210 గ్రూపుల్లో 44,215 మంది సభ్యులున్నారు. స్వయం సహాయక సంఘాలకు అధికారులు గడిచిన రెండేళ్లలో లక్ష్యానికి మించి రుణాలు అందజేశారు. 2020–21 సంవత్సరంలో 4,808 సంఘాలకు చెందిన 20,132 మందికి రూ.103.35 కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 6,343 గ్రూపులకు చెందిన 22,466 మంది సభ్యులకు రూ.113.52 కోట్లు ఇచ్చారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలు అందజేశారు. 2021–22 సంవత్సరంలో 5,185 గ్రూపులకు చెందిన 31,070 మందికి రూ.155.18 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, 12,755 గ్రూపులకు చెందిన 43,863 మంది సభ్యులకు రూ.158.07 కోట్ల రుణాలిఇచ్చారు. దీని ద్వారా 102.27 శాతం పంపిణీ చేసినట్లయింది. ఈ ఏడాది 7 నెలల్లో... 2022–23 ఆర్థిక సంవత్సరంలో 10,075 గ్రూపులకు చెందిన 40,336 మంది సభ్యులకు రూ.201.68 కోట్ల స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడిచిన 7 నెలల్లో 7,373 గ్రూపులకు చెందిన 23,735 మంది స్వయం సహాయక సభ్యులకు రూ.80.19 కోట్ల రుణాలు అందజేశారు. రానున్న కాలంలో మిగిలిన రుణాలు అందజేసి లక్ష్యాన్ని దాటాలని అధికారులు యత్నాలు చేస్తున్నారు. గ్రేడ్ల వారీగా రుణాల పెంపు... స్త్రీనిధిలో ప్రస్తుతం ఉన్న గ్రామ సమాఖ్య (వీవో)ల క్రెడిట్ లిమిట్‌ను ఏ గ్రేడ్ వీవోకి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచారు. బీ గ్రేడ్ వీవోకి రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షలకు, సీ గ్రేడ్ వీవోకి రూ.30 లక్షల నుంచి రూ.55 లక్షలకు, డీ గ్రేడ్ వీవోకి రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు పెంచారు. 10 మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)కు రూ.3 లక్షల వరకు రుణం అర్హతగా ఉండేది. ప్రస్తుతం దానిని రూ.4 లక్షలకు పెంచారు. 11 మంది అంతకంటే ఎక్కువ సభ్యులున్న ఎస్‌హెచ్‌జీ రుణ పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షలకు పెంచారు. గతంలో ఎస్‌హెచ్‌జీలో ఐదుగురు సభ్యుల వరకు రూ.50 వేలు రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం దానికి కూడా రూ.75 వేలకు పెంచారు. ఒక సభ్యురాలు రూ.లక్ష వరకు గరిష్టంగా రుణం పొందవచ్చు. యూనిట్లను బట్టి రూ.10 వేలు (జగనన్నతోడు), రూ.50 వేలు, రూ.75 వేలు, రూ.లక్ష ప్రకారం రుణం పొందే అవకాశం ఉంది. -
పుత్తడి బొమ్మకు పుస్తెల బంధనం
బడిలో బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన పుత్తడిబొమ్మలకు మూడుముళ్ల బంధనాలు వేసి వారి భవితను చిదిమేస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, అవగాహన లోపం, నిరక్షరాస్యత బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను వారికి వివరించి పుస్తెల భారం వేయకుండా పుస్తకాలతో చెలిమి చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 17 నుంచి 25వ తేదీలోపు అధికారులు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామసభలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా..ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. నిరక్షరాస్యత, తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్నారేమో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లకు వయస్సు రాగానే తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని చూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2012 నుంచి 2022 వరకు 589 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని అనుకుంటున్న బాలికలకు కొంతమంది తల్లిదండ్రులు మూడుముళ్లతో బంధనాలు వేసి సంసార సాగరంలోకి తోసేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుస్తెలు వద్దు..పుస్తకాలే ముద్దు అంటూ ఒక వైపు ఊరూరా ప్రచారం చేస్తూ, మరో వైపు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను తల్లిదండ్రులకు సవివరంగా తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ బాల్య వివాహాలు ఎక్కువగా 13 సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారికి జరుగుతున్నాయి. బాల్య వివాహాల జరుగుతున్న ప్రదేశాలకు అధికారులు వెళ్లి పెళ్లి అడ్డుకొని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వీటిపై అన్ని మండల కేంద్రాల్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలపై ఈ నెల 17 వ తేదీ నుంచి 25 లోపు గ్రామ కమిటీల ఏర్పాటు, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్‌లైన్ 1098, ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. 2012లోనే జీవో జారీ... బాల్య వివాహ నిరోధక చట్టం 2006కు సంబంధించిన జీవో నంబరు 13ను 2012 మార్చి 19న ప్రభుత్వం జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటును సూచించింది. జిల్లా స్థాయిలో కమిటీకి కలెక్టరు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్లుగా ఐసీడీఎస్ పీడీ, ఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వ్యవహరిస్తారు. డివిజన్ స్థాయిలో చైర్మన్‌గా ఆర్డీఓ, సీడీపీఓ, డీఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీకి చైర్మన్‌గా తహశీల్దారు, మెంబరు కన్వీనర్లుగా ఐసీడీసీ సూపర్వైజర్, ఎస్ఐ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఉంటారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ చైర్మన్‌గా, కన్వీనర్‌గా అంగన్వాడీ కార్యకర్త, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రామానికి చెందిన ఉపాధ్యాయడు, మహిళ వార్డు మెంబరు, ఏఎన్ఎం, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, యువజన సంఘం ప్రతినిధి, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. బాల్య వివాహం నేరానికి శిక్ష.. బాల్యవివాహాన్ని ప్రోత్సహించే వారికి, చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. బాల్య వివాహాన్ని దాచేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ఆ వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. న్యాయమూర్తి ఉత్తర్వుల ఉల్లంఘన కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాలను ఆపొచ్చు. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్ లేని శిక్ష విధించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు...పిల్లల ప్రవర్తన కారణంగా.. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే.. అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. మరి కొందరైతే రకరకాల కారణాల ప్రభావంతో పిల్లలు పెడదారి పడుతున్నారని ఆలోచించి చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. అడ్డుకుంటున్నా ..ఆగడం లేదు బాల్య వివాహాలను మాతాశిశు సంరక్షణ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంత వరకు బాల్య వివాహాలు తగ్గినట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. -
అక్రమాలకు అడ్డుకట్ట.. ఇసుక కోరినంత
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పారదర్శకంగా జిల్లా ప్రజలకు కోరినంత ఇసుకను జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తోంది. కృష్ణా, పెన్నా తీర ప్రాంతాల నుంచి ఉప్పునీటి తాకిడి లేని ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లను రెట్టింపు చేసి భారీగా నిల్వ చేసింది. జగనన్న కాలనీలకే కాకుండా ఇతర కట్టడాలకు సరిపడా ఇసుకను సరఫరా చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమార్కుల చెర నుంచి వినియోగదారులను గట్టున పడేసినట్లు అయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అన్ని రకాల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పెన్నా నది ఇసుక సంగం రీచ్ ద్వారా జిల్లాకు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 40 నుంచి 50 వేల టన్నుల ఇసుకను జిల్లాలోని వినియోగదారులకు అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంగోలుతో పాటు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో ప్రధాన ఇసుక స్టాక్ పాయింట్లు ఉండేవి. పుష్కలంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అదనంగా ఏడు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. త్వరలో కృష్ణా నది ఇసుకను జిల్లాకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 500 ఇళ్లకుపైగా ఉన్న జగనన్న కాలనీలకు ప్రత్యేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక ఉచితంగా సరఫరా అవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా 500 ఇళ్లకు పైగా ఉన్న జగనన్న కాలనీల్లోనే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఆయా కాలనీల సమీపంలో పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో జగనన్న కాలనీలకు సకాలంలో నాణ్యమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సింగరాయకొండలోని నిర్మిత కేంద్రం, కనిగిరి పట్టణం, పొదిలి, దర్శి, గిద్దలూరు టిడ్కో ఇళ్ల పక్కన, యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు కూడా అక్కడ నుంచే ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక జిల్లాలో ఇతర కట్టడాలకు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక ఉంచేలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా చార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు సరఫరా చేస్తోంది. ఎవరైనా ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే ఎస్ఈబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. నెలకు 20 వేల టన్నులకు పైగా... జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు నెలకు దాదాపు 20 వేల టన్నులకు పైగా ఇసుకను గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తోంది. ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు కోర్టు కేసుల వలన నిలిచిపోయాయి. అవి కూడా ప్రారంభమైతే మరో 5 నుంచి 10 వేల టన్నుల వరకు అదనంగా ఇసుక వాడకం పెరుగుతుంది. జిల్లాలో మొత్తం 570 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం ప్రస్తుతం 50,813 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యమైన ఇసుకతో ఇళ్లు నిర్మించుకున్నాం గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ అధికారులు నెల్లూరు జిల్లా, సంగం ప్రాంతంలోని పెన్నా నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఉచితంగా అందజేశారు. హాండ్లింగ్ చార్జీల కింద టన్నుకు రూ.175 చొప్పున మాత్రమే ఇచ్చిన ఇసుక తెచ్చుకున్నాం. నాణ్యమైన ఇసుక కావటంతో నిర్మాణం కూడా బాగా వచ్చింది. పటిష్టంగా నిర్మించుకున్నాం. జగనన్న కాలనీ వల్ల సొంతింటి కల నెరవేరింది. అందుకే ఇంటిపై జగనన్న ఫొటోను కూడా ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మా కుటుంబంలో జగనన్నను ఒక సభ్యునిగా చేసుకున్నాం. – ధారా నందిని భవానీ, రామాయణ కండ్రిక, పొదిలి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా... ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్లకు కూడా అందిస్తున్నాం. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా 20 నుంచి 25 వేల టన్నుల వరకు సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలకు అందుబాటులోనే ఇసుక సరఫరా చేస్తున్నాం. – ఈమని పేరయ్య, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ -
రొయ్యల కొనుగోళ్లు: కోతేస్తే.. కొరడా
అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఆక్వా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ధరల పతనంతో రొయ్య రైతులు దిగాలు పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలబడింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చింది. ధరల స్థిరీకరణకు ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని ప్రాసెసింగ్ కంపెనీలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేసింది. మరో వైపు ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. ఎప్పుటికప్పుడు ధరలను సమీక్షిస్తూనే రైతుల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు : 9392905878, 9392905879 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 16 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రధానంగా రొయ్యల సాగు చేపడుతున్నారు. రొయ్యల సాగును మూడు విడతల్లో చేపడతారు. ప్రధాన రెండు సీజన్లలో అధిక సంఖ్యలో రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధిస్తారు. ఒక్కో సీజన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 30 వేల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఈ మొత్తాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు కొనుగోలు చేయాల్సిందే. జిల్లాలో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు దేవీ సీ ఫుడ్స్, జీవీఆర్ ఆక్వా, మున్నంగి ఆక్వా, సదరన్ ఆక్వా, కళ్యాణి ఆక్వా, నీలా ఆక్వా, క్రిస్టల్ ఆక్వా, రాయల్ ఆక్వా, ఆక్వా టీకాలు కొనుగోలు చేయాలి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభంతో రొయ్యల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనిని సాకుగా చూపి వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, ఎగుమతిదారులు కుమ్మక్కై కూడబలుక్కుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో నీలివిప్లవానికి పెట్టింది పేరైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఈ దశలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. గత నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు కలిసి రొయ్యల రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. అయినా వారిలో మార్పురాలేదు. రైతుల పక్షాన ప్రభుత్వం... ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలిచింది. వ్యాపారులు, ఎగుమతిదారులతో మంత్రుల సబ్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎగుమతులు లేవని, అందుకోసం తగ్గించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు, ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన మంత్రుల సబ్ కమిటీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది. రొయ్యలు పచ్చి సరుకు కాబట్టి ప్రభుత్వమే ఒక మెట్టు దిగి గతంలో నిర్ణయించిన ధరను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధరలు సవరించిన ప్రభుత్వం... వ్యాపారులు, ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయనడంతో ప్రభుత్వం ఆక్వా రైతులతో చర్చించిన మీదట ధరల్లో కొంత మార్పు చేసింది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ముందు నిర్ణయించిన ధరలను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నూతన ధరలను ప్రకటించింది. ఆ ధరలకు కొనుగోలు చేస్తున్నామంటూనే నూతనంగా నిర్ణయించిన ధరలను కూడా పెడచెవిన పెట్టి మరీ తక్కువకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. బుధవారం మరోసారి రాష్ట్ర మంత్రులు సాధికారిత కమిటీతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు స్థానిక మార్కెట్లో ధరలను సమీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయకపోతే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై రైతులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులను ఇదే ప్రాంతంలో విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా ఆక్వా రైతు కమిటీలు గురువారం జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకునేలా తీర్మానం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు అండగా ఉంది. అందుకే అటు వ్యాపారులతో, ఇటు రైతులతో విరామం లేకుండా చర్చలు జరుపుతోంది. అయినా రొయ్యల ధరల విషయంలో వ్యాపారుల్లో మార్పు లేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – దుగ్గినేని గోపీనా«థ్, రొయ్యల రైతు సంఘ నాయకుడు వ్యాపారులు, ఎగుమతిదారులు తీరు మార్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగుకు పూర్తి భరోసానిస్తోంది. కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులతో రొయ్యలు కొనుగోలు చేయించింది. 10 ఎకరాల్లోపు సాగు చేసే రైతులకు విద్యుత్ చార్జీ యూనిట్‌కు కేవలం రూ.1.50గా నిర్ణయించింది. ఇటీవల రొయ్య మేత ధరలను టన్ను రూ.2,600కు తగ్గించింది. ప్రస్తుతం ఆక్వా వ్యాపారులు ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం 100 కౌంట్ రూ.210గా నిర్ణయించి వ్యాపారులచే కొనుగోలు చేయిస్తోంది. – మాలె రంగారెడ్డి, ఆక్వా రైతు, మూలగుంటపాడు ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యల ఎగుమతి ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యలు ఎగుమతి చేయడం వలన మన దేశం రొయ్యల ధర దిగజారింది. యూరప్ కంట్రీస్‌లో ఉన్న ఈక్విల్యాండ్ దేశంలో రొయ్యలు 100 కౌంట్ రూ.140కు విక్రయిస్తున్నారు. అక్కడ ఏడాది క్రితం రొయ్యల కల్చర్ మొదలుపెట్టారు. ఎకరానికి 5 టన్నులకు తగ్గకుండా తీస్తారు. మన దేశంలో 2 టన్నుల్లోపే వస్తుంది. వారికి ఎగుమతి ఖర్చులు, రొయ్యల యూనిట్లు దగ్గర ఉండటం వలన చార్జీలు తక్కువ. అందుకే తక్కువ ధరకు ఇస్తారు. మనదేశంలో రొయ్యల రైతులకు 100 కౌంట్ ధర రూ.250కు తగ్గకుండా ఇస్తేనే గిట్టుబాటవుతుంది. – గాదె కోటిరెడ్డి, రొయ్యల రైతు, గాదెపాలెం -
Prakasam District: వికేంద్రీకరణకు మద్దతుగా మానవహారం
సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో మానవహారం నిర్వహించి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై ఇంచార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్‌తో మురిపించి రాష్ట్ర ప్రజలను మోసం చేసారని బాలినేని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ తప్ప వెలగబెట్టింది ఏమి లేదని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో శాసన రాజధాని ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ముళ్ళకంపళ్లలో రాజధాని పెట్టి ఒక వర్గాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు కలలు కన్నారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రాన్నీ కొల్లగొట్టేశాడని మంత్రి మండిపడ్డారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష -
అడవిలో అగ్నిశిఖ
పెద్దదోర్నాల (ప్రకాశం): ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్ లిల్లీ, ఫైర్ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఆయుర్వేదంలో దివ్యౌషధం ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, గాయాలకు మందులుగా వాడతారు. ఉదర క్రిములను బయటకు పంపించే మందుగాను, దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టువల్ల కలిగే గాయాలు, మొలలు, పొత్తి కడుపు నొప్పి నివారణకు వినియోగిస్తారు. శరీరానికి బలవర్ధకమే కాక వీర్యవృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మన్యూనత లాంటి మానసిక రోగాలతో పాటు, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక రోగ నివారణకు దీనిని వినియోగిస్తారు. సుఖవ్యాధుల చికిత్సలోనూ అడవినాభి ఉపయోగపడుతుంది. గర్భధారణ అవకాశాలను పెంచటంలో ఇది బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అడవినాభి అద్భుతమైన ఔషధి నల్లమల అభయారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో లభించే అడవినాభి అరుదైన ఔషధ గుణాలు ఉన్న మొక్క. దీన్ని పలు పేర్లతో పిలుస్తుంటారు. పాముకాటు, తేలుకాటు, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలకు సంబంధించిన మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. – ఎం.రమేష్, సైంటిస్ట్, బయోడైవర్సిటీ, శ్రీశైలం ప్రాజెక్టు -
సర్కారీ వైద్యం సూపర్
జిల్లా కేంద్రానికి దూరంగా.. నల్లమల అభయారణ్యానికి దగ్గరగా ఉన్న మార్కాపురం పట్టణంలో గత ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందేది కాదు. ఇక్కడి జిల్లా వైద్యశాలలో వైద్యుల కొరతతో పాటు సరైన మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కావు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్యశాల రూపురేఖలు మారిపోయాయి. మెరుగైన వైద్యసేవలందించేందుకు కోటి రూపాయలతో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు అవసరమైన స్పెషలిస్టు వైద్యులు, సిబ్బందిని నియమించారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. మార్కాపురం(ప్రకాశం జిల్లా): గత ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2019 వరకు మార్కాపురం జిల్లా వైద్యశాలలో 10 నుంచి 12 మంది మాత్రమే డాక్టర్లు ఉండేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చిన తరువాత వైద్య రంగానికి మహర్దశ పట్టింది. ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు–నేడు పథకాన్ని అమలు చేశారు. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి జిల్లా వైద్యశాలకు కో చైర్మన్‌గా ఉన్నారు. ఇక్కడి సమస్యలను ఆయన ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో పశ్చిమ ప్రకాశం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో స్పెషలిస్టు డాక్టర్లను నియమించారు. పశ్చిమ ప్రకాశం ముఖ్య కేంద్రమైన మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వం 12 మంది డాక్టర్లను నియమించింది. దీంతో మొత్తం 32 మంది డాక్టర్లు ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత తీరింది. ప్రభుత్వం ఇటీవల ఇద్దరు పీడియాడ్రిక్, ముగ్గురు గైనకాలజిస్టులు, ఇద్దరు జనరల్ సర్జన్లు, ఇద్దరు ఈఎన్టీ సర్జన్లు, ఒక డెర్మటాలజిస్టు, ఇద్దరు ఆప్తమాలజిస్టులు, ఇద్దరు ఎనస్తీషియన్లు, ఒక మైక్రోబయాలజిస్టు, ఇద్దరు ఆర్ధోపెడిక్లు, ఇద్దరు జనరల్ మెడిసిన్, ఒక ఫోరెన్సిక్ డాక్టర్‌ను నియమించారు. వీరు కాక ఐదుగురు హౌస్ సర్జన్లు కూడా అందుబాటులోకి వచ్చారు. నెలకు 300 ఆపరేషన్లు పూర్తిగా డాక్టర్ల నియామకంతో నెలకు 300 సాధారణ కాన్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 15 రోజుల వ్యవధిలో సాధారణ డెలివరీలు, ఈఎన్టీ సర్జరీలు, ఆర్ధో సర్జరీలు, సిజేరియన్లు, పిండి కట్టులతో కలిపి సుమారు 150 జరిగాయి. 24 గంటలు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 400 నుంచి 450 మందిదాక ఔట్ పేషెంట్లు వైద్యశాలకు వచ్చి చికిత్స పొందుతున్నారు. వంద బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యశాలలో ఈసీజీ, వెంటిలేటర్లు, కంప్లీట్ ఆటో ఎనలైజర్, డయాలసిస్, హార్మోన్స్ ఎనలైజర్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కిడ్నీ, లివర్, సీరమ్ అన్ని రకాల రక్త పరీక్షలు హార్మోన్స్ టెస్టు, థైరాయిడ్, గ్యాస్ ఎనాలసిస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు మంచి సేవలు అందించండి ప్రజలకు జిల్లా వైద్యశాల వైద్యులు మంచి సేవలు అందించాలి. డాక్టర్ల కొరత కూడా తీరింది. వైద్యశాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరిస్తాం. వైద్యశాలలో ఆధునిక వైద్య పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. – కేపీ నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే సేవలు అందించేందుకు సిద్ధం మార్కాపురం జిల్లా వైద్యశాలలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సిబ్బంది కొరత కూడా తీరింది. రోజూ 450–500 మంది వరకు ఓపీ చూస్తున్నాం. నెలకు 300 వరకు వివిధ రకాల ఆపరేషన్లు చేస్తున్నాం. 12 ఐసీయూ బెడ్లు, 28 వెంటిలెటర్లు, 102 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, మార్కాపురం రోగులకు మంచి వైద్యం అందుతోంది నేను మార్కాపురం పట్టణంలో విజయ టాకీస్ ఏరియాలో ఉంటాను. ఇటీవల నాకు జ్వరం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం జిల్లా వైద్యశాలకు వెళ్లాను. అక్కడ డాక్టర్లు, సిబ్బంది నాకు అన్ని రకాల పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. జ్వరం తగ్గింది. జిల్లా వైద్యశాలలో ఇప్పుడు రోగులకు మంచి సేవలు అందుతున్నాయి. డాక్టర్ల సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలి. – మీరావలి, మార్కాపురం రూ.కోటితో అభివృద్ధి పనులు గడిచిన ఏడాదిన్నర కాలంలో జిల్లా వైద్యశాలలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి వైద్యారోగ్యశాఖ మంత్రితో మాట్లాడి రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ఇందులో ఒకటి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ కాగా మరొకటి ఆక్సిజన్ న్యాచురల్ ప్లాంట్. నిరంతరాయంగా ఒకే సమయంలో వంద మందికి ఆక్సిజన్ అందించే అవకాశం ఉంది. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 12 ఐసీయూ బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. సుమారు రూ.50 లక్షలతో జిరియాట్రిక్ (వృద్దుల వార్డు)ను నిర్మించారు. దీంతోపాటు కరోనా టెస్టులు చేసేందుకు వీఆర్డీఎల్ ల్యాబ్‌ను కూడా నిర్మించారు. -
తల్లి చెప్పిన మాటలు నచ్చక.. యువతి షాకింగ్ నిర్ణయం
మార్కాపురం(ప్రకాశం జిల్లా): ఉన్నత చదువులు చదువుకోవాలని తల్లి చెప్పిన మాటలు నచ్చక ఓ యవతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మార్కాపురం పట్టణ పరిధిలోని తర్లుపాడు రోడ్డులో సబ్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నాగలక్ష్మీ కూతురు సాయిసింధు డిగ్రీ పూర్తి చేసింది. పీజీ చదవాలని తల్లి సూచించగా ఇష్టం లేదని చెప్పింది. ఉన్నత చదువులు చదివితే ఉద్యోగం వస్తుందని, పీజీలో చేరేందుకు కళశాలకు వెళ్లాలని తల్లి గురువారం మరోసారి నచ్చజెప్పింది. చదవడం ఇష్టం లేని సింధు తల్లి బయటకు వెళ్లగానే లోపల తలుపు గడియ వేసుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి తలుపులు మూసి ఉండటంతో ఆందోళన చెంది పగులగొట్టింది. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి బోరున విలపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శశికుమార్ తెలిపారు. చదవండి: గ్యాస్ట్రబుల్ అని వెళ్తే.. షాక్ ఇచ్చిన డాక్టర్.. ఎంత పనిచేశాడంటే? -
వ్యవసాయానికి వలంటీర్లు
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విశిష్ట సేవలందిస్తున్న వలంటీర్లు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలకూ (ఆర్బీకే) అనుబంధంగా పని చేయనున్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాల్లో నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది. వలంటీర్ల రాకతో ఆర్బీకేలు రైతులకు మరింత చేరువకానున్నాయి. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న భావనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ప్రభుత్వ సేవలు ప్రతీ ఇంటికీ అందేలా నియమించిన వలంటీర్లు ఇప్పుడు అన్నదాతకు కూడా సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంట దిగుబడులు వచ్చాక విక్రయానికి ఇబ్బందులు పడుతున్న రైతుల అవస్థలను గుర్తించి ధాన్యం కొనుగోలులో వలంటీర్ల సేవలను వినియోగించుకోనేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ పంటల సాగు ఆధారంగా విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజి హార్టీకల్చర్ అసిస్టెంట్, విలేజి సెరీకల్చర్ అసిస్టెంట్ పని చేస్తున్నారు. వీరే ఆర్బీకే ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్ర స్థాయిలో గడపాల్సి వస్తుంది. ప్రధానంగా పంటల సాగు సమయంలో ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తుంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాలి. వీటితో పాటు మండల, సబ్‌డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసి వేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితిలో వ్యయప్రయాసలతో మండల, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాలి. ఈ సమస్యను గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్ల ఎంపిక జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 597 ఉండగా, అర్బన్ ప్రాంతంలో 19 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి 597 మంది, అర్బన్ ప్రాంతంలో 9 మంది వలంటీర్లను ఆర్బీకేలకు ఎంపిక చేశారు. మిగిలిన 10 మంది వలంటీర్లను ఒంగోలు 9, కనిగిరి 1 నియమించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో అదికూడా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతి ఆర్బీకేకు ఇంటరు (బయాలజీ) చదివిన వ్యక్తిని వలంటీర్లుగా ఎంపీడీవో నియమించారు. వలంటీర్లకు ఆర్బీకేల నిర్వహణపై, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై శిక్షణ కూడా ఇచ్చారు. విత్తనాల పంపిణీ, డిజిటల్ కియోస్క్ ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు ఆర్డర్ పెట్టడం, పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు ఆర్బీకే ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు. వలంటీర్లు నేరుగా రైతు వద్దనే ధాన్యం సేకరించి వారికి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటారు. దేశానికే రోల్‌మోడల్‌గా ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు ఊర్లోనే ఆర్బీకేల ద్వారానే అందుతున్నాయి. దీంతో అవి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచాయి. తాజాగా ఆర్బీకేకు ఒక వలంటీరును నియమించడంతో మరో విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రైవేటు డీలర్లు రసాయనిక ఎరువులను అడ్డగోలుగా అధిక ధరలకు విక్రయించే వారు. ఎంఆర్పీపై రూ.50 నుంచి రూ.100 వరకు ఎక్కువగా వసూలు చేసేవారు. ఆర్బీకేలు ఏర్పాటు కావడంతో ప్రైవేటు డీలర్ల అక్రమాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. తాజాగా వలంటీర్ల నియామకంతో మరింత మెరుగైన సేవలు రైతులకు అందుతాయి. శుభ పరిణామం ప్రతి ఆర్బీకేకు వలంటీర్‌ను నియమించడం శుభపరిణామం. దీంతో సేవలు మరింత చేరువవుతాయి. అప్పటికే ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పొందుతున్నాం. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచడం మంచి నిర్ణయం. వ్యవసాయ అధికారులు రైతుల పొలాలకు వచ్చి పంటలను చూసి సూచనలు, సలహాలు ఇవ్వడంతో రైతులకు మేలు జరుగుతుంది. – బీరం కృష్ణారెడ్డి, గురుగుపాడు, రైతు గొప్ప ఆలోచన రైతుల మేలు కోసం ఆర్బీకేకు ఒక వలంటీరును నియమించడం సీఎం జగన్ మంచి ఆలోచన. విలేజీ అసిస్టెంట్లు ఏదైనా పనుల నిమిత్తం బయటకు పోతే రైతులు ఇబ్బందులు పడుతారేమోనని సమస్యను ముందుగానే గుర్తించి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమించడం మంచి నిర్ణయం. రైతుల సమస్యలను గుర్తించి వలంటీర్‌ను నియమించినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – వెంకటేశ్వర్లు, రైతు, మాదాలవారిపాలెం వలంటీర్లకు సమగ్ర శిక్షణ జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటిలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఆర్బీకేలకు 606 మంది వలంటీర్ల నియామకం పూర్తయింది. అర్బన్ ప్రాంతంలో ఉన్న ఆర్బీకేలకు ఇంకా 10 మంది వలంటీర్ల నియామకం పూర్తి కాలేదు. వాటిని త్వరగా పూర్తి చేస్తాం. నియామకం పూర్తైన వలంటీర్లకు ఆర్బీకేల నిర్వహణపై సమగ్ర శిక్షణ కూడా ఇస్తారు. ఆర్బీకే ఇన్‌చార్జ్‌లు క్షేత్ర స్థాయిలో వెళ్లిన సమయాల్లో రైతులకు వీరే అన్ని సేవలు అందించాల్సి ఉంటుంది. – ఎస్ శ్రీనివాసరావు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఒంగోలు ఆర్బీకేలో శాఖల వారీగా అందుతున్న సేవల సంఖ్య వ్యవసాయ శాఖ: 28 ఏపీఎంఐపీ: 05 మత్స్యశాఖ: 09 ఉద్యానశాఖ: 06 పశుసంవర్ధక శాఖ: 11 పట్టు పరిశ్రమ శాఖ: 08 -
సామాన్యులకు ఊపిరి పోస్తున్న జీజీహెచ్ ‘సూపర్’
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయి. సామాన్యులకు ఊపిరి పోస్తున్న జిల్లా సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా జీజీహెచ్ అభివృద్ధికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా న్యూరో, పీడియాట్రిక్, ప్లాస్టిక్, యూరాలజీలకు సంబంధించి సర్జరీ విభాగాలు, నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియన్ సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు అర్బన్: కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన ఒంగోలు జీజీహెచ్‌కు నిత్యం పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. అత్యవసర సేవల కోసం పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడకు పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. దీంతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చొరవతో ఆస్పత్రిలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను సైతం పూర్తి చేసి మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా దీనిని తీర్చిదిద్దేందుకు ఇటీవల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. జీజీహెచ్‌లో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, అందుకు తాను ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని బాలినేని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. దీంతో సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్ఎంఓ చైతన్యవర్మ, ఇతర అధికారులు జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. జీజీహెచ్ భవనంలోని 112 గదిలో సూపర్ స్పెషాలిటీ ఓపీని పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 120లో అత్యాధునిక పరికరాలతో 40 పడకల సూపర్ స్పెషాలిటీ వార్డును సిద్ధం చేయనున్నారు. ఆమేరకు పనులను వడివడిగా నిర్వహిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలో న్యూరో, పీడియాట్రిక్, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సంబంధించిన విభాగాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. అలాగే నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధి ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీజీహెచ్‌లో అభివృద్ధి చేసిన పనుల్లో కొన్ని రూ.2 కోట్లతో 100 పడకల ఐసీయూ కాంప్లెక్స్, రూ.2 కోట్లతో 100 ఆక్సిజన్ బెడ్లతో కోవిడ్ ప్రత్యేక గదులు, టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఆడిటోరియం రూ.3.5 కోట్లతో పూర్తి చేశారు. అంతేకాకుండా రూ.7.5 కోట్లతో ఎంఆర్ఐ, రూ.2.5 కోట్లతో సిటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేసి రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందిస్తున్నారు. అలాగే రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ప్రజలకు అన్నీ వైద్య సేవలు జీజీహెచ్‌లో అందాలి జీజీహెచ్‌లో ప్రజలకు అన్నీ రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్నీ విభాగాల్లో సర్జరీలు నిర్వహించేలా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అందించాల్సిన సేవలను పూర్తి స్థాయిలో నాణ్యంగా అందించేందుకు అన్నీ విధాలుగా సిద్ధం చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ వార్డు ఏర్పాటుతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుంది. జీజీహెచ్‌లో వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు మంచి వైద్య సేవలందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. – దినేష్ కుమార్, కలెక్టర్ జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు ఆలోచించి ఆ దిశగా చర్యలు చేపట్టాం. త్వరలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. నిరంతరం సాధారణ ఓపీలను పర్యవేక్షిస్తూ రోగులకు వైద్య సేవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించేలా చూస్తున్నాం. – భగవాన్ నాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
బంగారమంత ఆశ: ఒక్క రేణువు చిక్కినా.. ఆ రోజుకు బువ్వ దొరికినట్లే..
యుగాలు మారుతున్నా...కొందరి జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. అందుకు వీరి జీవితాలే నిదర్శనం.. ఒంగోలు గాంధీరోడ్డులోని బంగారం దుకాణాల వల్ల, వాటి పక్కన ఉండే మురుగు కాల్వల్లో బంగారు రేణువులు దొరుకుతాయేమోననే ఆశతో మురుగునీటిని, మట్టిని జల్లెడ పడతారు. ఒక్క రేణువు చిక్కినా.. ఆ రోజుకు బువ్వ దొరికినట్లే.. -ఫొటోలు: ఎం ప్రసాద్, సాక్షి -
పాడిపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రీయ గోకుల్ మిషన్
దేశీయ పశుజాతుల వృద్ధికి సర్కార్ సమాయాత్తమైంది. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆడ దూడల సృష్టి ద్వారా పాడి పరిశ్రమాభివృద్ధితో పాటు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఒంగోలు, గిర్ వంటి ఉన్నత దేశీయ జాతులకు పూర్వవైభవాన్ని తీసుకురావడం ద్వారా పాల ఉత్పత్తి పెంచేందుకు జిల్లా పశుసంరక్షణశాఖ దృష్టి సారించింది. ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకాన్ని జిల్లాలో అమల్లోకి తెచ్చింది. చీమకుర్తి(ప్రకాశం జిల్లా): పశువుల్లో సహజ, కృత్రిమ గర్భధారణతో 50 శాతం మగ, 50 శాతం ఆడ దూడలు పుడుతుంటాయని పశువైద్యుల నిపుణుల అంచనా. ఆడదూడల పెంపకం ద్వారా పాడి రైతులకు లాభాలు వస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. దీంతో ఆడదూడల పుట్టుకను నిర్ధారించే వీర్యకణాలను ఎంపిక చేసి రెండు స్ట్రాలలో నింపుతారు. ఒక్కో ఆవు లేక ఒక్కో గేదెను పెంచుకునే రైతులకు వీటిని అందజేస్తారు. ఎదకు వచ్చిన గేదె లేక ఆవుకు తొలి విడతగా ఒక స్ట్రాతో ఇంజెక్షన్ చేస్తారు. ఒక స్ట్రాతో సూడి నిలిచినట్లయితే పర్వాలేదు. ఒక వేళ సూడి నిలవకపోతే తిరిగి 21 రోజుల తర్వాత రెండోసారి ఎదకు వస్తుంది. అప్పుడు రైతుల లెక్కలో ముందుగానే ఉంచిన రెండో స్ట్రాతో రెండోసారి ఇంజెక్షన్ చేస్తారు. ఇలా సార్టెడ్ సెమన్‌తో ఆవులు లేక గేదెలలో సూడి నిలిచి 9 నెలల తర్వాత పుట్టే దూడలు దాదాపు 99 శాతం ఆడదూడలే పుడతాయని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం కేంద్రం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పాడి పశువులతో గ్రామాలు కళకళలాడేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని జిల్లాలో ప్రారంభించామని పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కే.బేబీరాణి తెలిపారు. తొలి విడతలో చేపట్టే మండలాలు.. ఆడదూడల ఉత్పత్తికి సంబంధించి తొలుత జిల్లాలో ఎక్కువగా పాడిపశువులను పెంచే గ్రామాలపై అధికారులు దృష్టి సారించారు. చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు, నాగులుప్పలపాడు, దర్శి, తాళ్ళూరు, ముండ్లమూరు, కొత్తపట్నం, టంగుటూరు, కొండపి, శింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో రాష్ట్రీయ గోకుల్ మిషన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. 2500 పశువులకు 5 వేల వీర్యకణాల స్ట్రాల పంపిణీ: రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంలో భాగంగా జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే 2500 పశువులను ఎంపిక చేశారు. వాటికి 5 వేల సార్టెడ్ సెమన్ స్ట్రాలను పంపిణీ చేశారు. ఒక్కో పశువుకు అందించే రెండు స్ట్రాలను ప్రభుత్వం రూ.1350కు అందిస్తుంది. దానిలో రూ.850 సబ్సిడీ ఇస్తోంది. ఇక రైతు కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఒక వేళ రైతులకు అందించిన రెండు స్ట్రాలతో పశువులు సూడికి రాకపోతే రైతులు చెల్లించిన రూ.500ను తిరిగి చెల్లిస్తారు. ఒక వేళ సూడికి వచ్చి ఆడదూడలు పుట్టకుండా మగదూడ పుడితే రైతులకు రూ.250 తిరిగి చెల్లిస్తారు. ఏటా 1.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ: ప్రభుత్వ పశువుల ఆస్పత్రుల ద్వారా ఏటా జిల్లాలో సరాసరిన 1.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తారు. దానికి గాను 3.5 లక్షల సాధారణ సెమన్లతో కూడిన స్ట్రాలను వినియోగిస్తారు. దాని వలన ఆడ, లేక మగ దూడలు ఏవైనా రావచ్చు. అయితే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా కేవలం ఆడదూడల ఉత్పత్తి లక్ష్యంగా చేసుకొని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది 2500 పశువులలో అమలు చేస్తున్నారు. దానికి గాను 5 వేల సార్టెడ్ సెమన్స్ట్రాలను అందించేందుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది 5 వేల పశువులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇలా ప్రతి ఏడాది పశువుల సంఖ్యను డబుల్ చేసుకుంటూ ఆడదూడల ఉత్పత్తికి పశుగణాభివృద్ధి శాఖ కంకణం కట్టుకుంది. రానున్న ఐదేళ్లలో ప్రతి గ్రామంలో కనీసం 300 నుంచి 500 లీటర్ల పాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆడదూడల ఉత్పత్తి పెంచేలా.. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఆవులు, గేదెలలో 99 శాతం ఆడదూడలను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా సెక్స్ సార్టెడ్ సెమన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈనెల 1వ తేదీ నుంచి తొలుత 2500 పశువులలో అమలు చేయనున్నాం. ఇప్పటికే 5 వేల సార్టెడ్ సెమన్ ఇంజక్షన్లను సరఫరా చేశాం. – డాక్టర్ కే.బేబీరాణి, జాయింట్ డైరెక్టర్, జిల్లా పశుసంవర్థక శాఖ, ఒంగోలు కొండ ప్రాంతాల వారికి కోడెదూడలు ఉచితం కొండ ప్రాంతాల్లో ఆవులను పెంచే పశుపోషకులకు ప్రభుత్వం కోడెదూడలను ఉచితంగా అందిస్తుంది. 10 నుంచి 20 ఆవులు కలిగిన యజమానికి 6 నెలల వయస్సు కలిగిన కోడెదూడను అందిస్తారు. చదలవాడ పశువుల క్షేత్రం వద్ద పెరుగుతున్న కోడెదూడలను ఇందుకు వినియోగిస్తారు. కోడెదూడ పెరిగి పెద్దయ్యే వరకు దానికి దాణ, ఇతర ఖర్చులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. అనంతరం కోడెదూడకు క్రాసింగ్ చేసే వయస్సు రాగానే ఆవులలో సార్టెడ్ సెమన్ స్ట్రాలతో పనిలేకుండా వాటిని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అధికారులు పశుపోషకులకు కోడెదూడలను ఉచితంగా అందిస్తారు. యర్రగొండపాలెం, గిద్దలూరు, పీసీపల్లి, పుల్లలచెరువు వంటి కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లోని ఆవులు కలిగిన రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. -
మనబడి నాడు-నేడుపై కమాండ్ ఐ
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పనులు మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మొదటి విడతలో పలు పాఠశాలలను సుర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం రెండో విడతకు 979 స్కూళ్లను ఎంపిక చేసింది. ఇందులో 960 స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయి. పనులను పర్యవేక్షించేందుకు కలెక్టర్ దినేష్‌కుమార్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది నిరంతరం పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించనున్నారు. ఒంగోలు: జిల్లాలో మనబడి నాడు–నేడు పనులు వేగవంతమయ్యాయి. కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పనులు ఊపందుకున్నాయి. పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 16 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ కలెక్టర్ చర్యలు చేపట్టడంతో అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం పనుల్లో పురోగతిపై దృష్టి సారించారు. మొన్నటి వరకు 20వ స్థానంలో ఉన్న జిల్లా ఒక్కసారిగా 5వ స్థానానికి చేరుకుంది. 960 గ్రౌండింగ్ పూర్తి జిల్లాలో నాడు–నేడు రెండో దశలో ఇప్పటికే 979 విద్యా సంస్థలకు 960 గ్రౌండింగ్ పూర్తయింది. వాటిలో అంగన్వాడీ సెంటర్లు, డైట్ కాలేజీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాలోని ఏపీఈడబ్ల్యూఐడీసీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్, రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్, సమగ్రశిక్ష అభియాన్ ఇంజినీరింగ్ విభాగాలు ఈ పనులను పర్యవేక్షిస్తున్నాయి. మొత్తం రూ.425 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా తొలుత 15 శాతం నిధులు విడుదల చేసింది. అంచనాలు రూపొందించడం, ఒప్పందాలు చేసుకోవడం, రివాల్వింగ్ ఫండ్ జమ చేయడం, పరిపాలన పరమైన అనుమతులు పొందడం చకచకా జరిగాయి. ఇప్పటి వరకు రూ.81 కోట్లకుపైగా ఖర్చు చేశారు. మొత్తం ప్రక్రియ ఇంకా ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఏపీఎంలకు దిశా నిర్దేశం డలాల్లో నాడు–నేడు పనుల పర్యవేక్షణకు సంబంధించి సెర్ప్‌లోని ఏపీఎంలను జిల్లా విద్యాశాఖలో అదనపు బాధ్యతలు నిర్వర్తించేందుకు కేటాయించారు. ఇప్పటికే వారికి కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. మొత్తం 37 మంది ఈ బాధ్యతలు నిర్వహించనుండగా వీరంతా ప్రస్తుతం బాపట్లలో శిక్షణ పొందుతున్నారు. వారు కూడా వస్తే పనులు మరింత వేగవంతం అవుతాయి. ఆరు నెలల లక్ష్యాని కన్నా ముందే నాడు–నేడు పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ జారీ చేస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నాం. – డీఈఓ బి.విజయభాస్కర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు సమగ్రశిక్ష అభియాన్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఇందులో ఐదుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వీరు ప్రతి రోజు పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంటారు. ప్రధానంగా సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి సిమెంట్, ఇనుము, ఇసుకతో పాటు ఇతర ఫర్నిచర్ రాకపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. పనుల్లో తలెత్తే సమస్యలను తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. కలెక్టర్ ప్రతి రోజు ఉదయాన్నే వాట్సాప్‌లో పనుల ప్రగతిని సమీక్షించడం, డీఈఓకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి మంగళవారం నేరుగా మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొక్కుబడి సమీక్షలు కాకుండా ప్రత్యేకంగా విద్యాశాఖపై కలెక్టర్ నేరుగా పర్యవేక్షిస్తుండడంతో దిగువ స్థాయిలో కూడా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 16 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులిచ్చారు. -
ఆపద వేళ.. అమృత హస్తం
పేద కుటుంబాల్లోని వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో, దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పడితే వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బులు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అటువంటి వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ పెన్షన్లు మంజూరు చేస్తోంది. వ్యాధిని బట్టి గరిష్టంగా రూ.10 వేల వరకు అందిస్తున్న పెన్షన్‌తో సకాలంలో వైద్యం పొందుతున్నారు. ఒంగోలు అర్బన్: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసి దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలు అమలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా అన్నీ వర్గాల పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ఏర్పాటుతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వైద్య సేవలే కాకుండా అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి “వైఎస్సార్ హెల్త్ పెన్షన్’ ద్వారా ఉపశమనం కల్పిస్తున్నారు. గతంలో కేవలం వికలాంగులకు మాత్రమే నెలకు రూ.3 వేలు పింఛన్ ఇచ్చేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని చూసి చలించిపోయారు. కుటుంబ పెద్ద మంచానికి పరిమితం కావడంతో కుటుంబ పోషణ సైతం కష్టమైన పరిస్థితులను గమనించి ప్రభుత్వం ఏర్పడగానే అటువంటి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్సార్ హెల్త్ పెన్షన్ పథకం అమలు చేసి వ్యాధిని బట్టి నెలకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా అందజేస్తున్నారు. జిల్లాలో వైఎస్సార్ హెల్త్ పెన్షన్నుకు సంబంధించి ఉన్నతాధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన బాధితులకు అండగా నిలుస్తున్నారు. 2020లో ప్రారంభమైన వైఎస్సార్ హెల్త్ పెన్షన్ పథకం ద్వారా ఉమ్మడి ప్రకాశంలో 3,983 మంది ఉండగా ప్రస్తుత కొత్త జిల్లాలో 2558 మంది లబ్ధిదారులు పెన్షన్ అందుకుంటున్నారు. ప్రస్తుతం మరో 400 దరఖాస్తులు అప్లోడ్ చేసిఉన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.3 వేలు పింఛన్ ఇస్తుండగా కిడ్నీ, లివర్, గుండె రీప్లేస్మెంట్ జరిగిన రోగులకు, కిడ్నీ బాధితులు (సీరం క్రియాటిన్ 5 ఎంఎం కంటే ఎక్కువ) ఉన్న వారికి, తీవ్రంగా కండరాల క్షీణతతో పాటు ప్రమాదాలతో మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితమైన వారికి, చక్రాల కుర్చీ, మంచానికి పరిమితమైన పక్షవాతం ఉన్న రోగులకు, బోదకాలు (రెండు కాళ్లకు) ఉన్న వారికి నెలకు రూ.5 వేలు పింఛన్ అందజేస్తున్నారు. తలసేమియా మేజర్, సికిల్‌సెల్, సివియర్ హిమోఫీలియా (2 శాతం పైబడి) ఉన్న రోగులకు నెలకు రూ.10 వేలు ఇస్తున్నారు. పక్షవాతం, కండరాల క్షీణత, ప్రమాదాలతో మంచానికే పరిమితమైన రోగులకు సదరమ్ సర్టిఫికెట్తో పెన్షన్ మంజూరు చేస్తున్నారు. మిగిలిన వ్యాధులకు తొలుత మెడికల్ బోర్డులోని కమిటీ రోగ ధ్రువీకరణæ చేస్తారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లు సోషల్ ఆడిట్ చేసి వ్యాధి నిర్ధారణ చేసి అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని రోగులకు అందజేస్తారు. ధ్రువీకరణ పత్రంతో పాటు రోగులకు సంబంధించిన ఆధార్, బియ్యం కార్డు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం తదితర వివరాలను డీఎంహెచ్ఓ కార్యాలయంలోని వైఎస్సార్ హెల్త్ పెన్షన్ విభాగంలో దరఖాస్తు అందచేయాలి. అందిన దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు అప్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి సెర్ప్‌కు వెళ్లి పెన్షన్ మంజూరై సంబంధిత సచివాలయాలకు వెళుతుంది. సచివాలయాల ద్వారా వలంటీర్లు బాధితులకు పెన్షన్ అందజేస్తారు. అనారోగ్యంతో ఉన్న వారికి ప్రభుత్వం చేయూత దీర్ఘకాలిక అనారోగ్యం, ప్రమాదాలతో నడవలేని పరిస్థితితో సాధారణ జీవనం గడపలేని వారికి ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ పెన్షన్ ద్వారా చేయూతనిస్తోంది. వ్యాధి నిర్ధారణకు సంబంధించి సదరమ్, మెడికల్ బోర్డు పారదర్శకంగా పనిచేసేలా పక్కా చర్యలు తీసుకున్నాం. నిరంతరం సంబంధిత ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం తలపెట్టిన పెన్షన్ పథకం నిజమైన రోగులకు చేరాలి. ఆ విధంగా పెన్షన్ మంజూరులో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వ్యాధి నిర్ధారణలో అవకతవకలు జరిగితే సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – ఏఎస్ దినేష్ కుమార్, కలెక్టర్ -
అభివృద్ధే మన అజెండా.. ప్రతి ఒక్కరికీ సంక్షేమం
ఒంగోలు: అభివృద్ధే మన అజెండా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మూడో డివిజన్ అయిన కరుణాకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లింల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. వాసన్నా అంటూ ఆప్యాయతను కనబరిచారు. కరుణాకాలనీలో కబేలా స్థలం ఖాళీగా ఉందని, దానిని కమ్యూనిటీ స్థలం కోసం కేటాయిస్తే తమ ప్రాంతంలో ఇబ్బందులు తొలగిపోతాయంటూ పలువురు ప్రజలు బాలినేనికి విజ్ఞప్తి చేశారు. దీనిని వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ను బాలినేని ఆదేశించారు. అదే విధంగా కొంతమంది పరిస్థితి దయనీయంగా ఉండడం చూసి చలించిన బాలినేని అక్కడికక్కడే వారికి కొంత మొత్తం ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా మరికొంతమంది డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యుత్ లైన్లు ఇళ్లకు అందుబాటులో ఉంటున్నాయని, తద్వారా ప్రమాదం జరిగే ఉందంటూ వివరించారు. రేషన్ బియ్యం, సంక్షేమ ఫలాలతోపాటు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అంటూ బాలినేని అడిగి తెలుసుకున్నారు. గతంలో పెన్షన్ కోసం తిండీ తిప్పలు లేకుండా ఒకటికి రెండు రోజులు పడిగాపులు పడాల్సి వచ్చేదని, అప్పుడు కూడా వేలిముద్రలు పడడంలేదంటూ అధికారులు తిప్పి పంపేవారన్నారు. కానీ నేడు ఒకటో తేదీ నిద్రలేచే సరికే పెన్షన్ చేతిలో పెడుతున్నారని, నిజంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చల్లగా ఉండాలంటూ వృద్ధులు దీవించారు. సాయంత్రం ప్రకాశం కాలనీలో పర్యటించారు. బాలినేని వెంట స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, ఆమె భర్త గండు మధు, 3వ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, నగర మేయర్ గంగాడ సుజాత, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జిలాని, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ కళాపరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ దస్తగిరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, బడుగు ఇందిర, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, అయినాబత్తిన ఘనశ్యాం, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షేక్ మీరావలి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, ఒంగోలు సూపర్‌బజార్ డైరెక్టర్ వల్లెపు మురళి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖుద్దూస్, షేక్ రజాక్, వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి షేక్ సలాం, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, వీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ దుగ్గిరెడ్డి వీరాంజనేయరెడ్డి, కొమ్మూరి రవిచంద్ర, కార్పొరేటర్లు అంగిరేకుల గురవయ్య, తాడి కృష్ణలత ఉన్నారు. -
బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!
బొమ్మలు గీయడమంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. అచ్చు గుద్దినట్లు సహజత్వం ఒట్టిపడేలా చిత్రాలు తీర్చిదిద్దడంలో ఆయన దిట్ట. చిన్నప్పటి నుంచి త్రలేఖనంపై మక్కువ కలిగిన ప్రసాదరావు కష్టపడి ఆర్ట్స్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. తన లాగే చిత్ర లేఖనంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించి మేటిగా రాణించేందుకు కృషి చేస్తున్నారు. కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): కొనకనమిట్ల మండలం వెలిగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్న కొమ్ము ప్రసాదరావు విభిన్న శైలి. సామాజిక స్పృహపై అరుదైన చిత్రాలు వేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రసంసించే చిత్రాలు.. సామాజిక రుగ్మతలు, దేశ, రాష్ట్ర నాయకులు, పర్యావరణ కాలుష్యం, మంచినీటి సమస్య, పరిసరాల పరిశుభ్రత, విజృంభిస్తున్న అంటువ్యాధులు, బాల కార్మిక నిర్మూలనం వంటి అంశాలపై చిత్ర లేఖనం ద్వారా నలుగురికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసాతో జై కిసాన్ అంటూ రైతు శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల మోములో ఆనందహేలలు నింపుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు కొమ్ము ప్రసాదరావు తీర్చిదిద్దారు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా చిత్రాలు వేసి ప్రదర్శిస్తున్నారు. నీటి వృథా, స్వచ్ఛ భారత్, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత అంశాలతో పాటు కరోనా మహమ్మారిపై విద్యార్థులు గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. భూగర్భజలాల ఆవశ్యకత, కాలుష్య కారకాలు, చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాలు, కందకాలు తీయడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చనే విషయాలపై చిత్రాలు వేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో చిత్రలేఖనం పోటీలకు ఎంపిక కావటంతో పాటు ఉత్తమ చిత్రాలకు అవార్డులు, బహుమతులు సాధించారు. ఆర్టు అకాడమీలో ప్రశంసలు.. ఆర్టు అకాడమీ నిర్వహిస్తున్న పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొంటూ ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 8వ తేదీన ఒంగోలులో ‘సృష్టి ఆర్ట్ అకాడమీ’ వారు నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి 87 మంది ప్రముఖ ఆర్టిస్టులు పాల్గొని చిత్రాలు ప్రదర్శించారు. వారిలో ప్రసాదరావు ప్రదర్శించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, దృశ్య కళల అకాడమీ చైర్మన్ సత్యశైలజ, అమృత హాస్పిటల్ వైద్యులు కేశవ, ప్రఖ్యాత చిత్ర కళాకారులు కళాసాగర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు పొందటంతో పాటు ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల ఆర్ట్స్ టీచర్ అద్భుతంగా సందేశాత్మక చిత్రాలను పెయింటింగ్ ద్వారా రూపొందించి జాతీయ యిలో ప్రదర్శించి అవార్డులు సొంతం చేసుకోవటం అభినందనీయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు అన్నారు. -
AP: ఆయుష్మాన్‌భవ: గర్భిణులకు, పిల్లలకు పది రకాల వ్యాక్సిన్లు
చిన్నారులను దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు జరిగే వరకు, పుట్టిన శిశువుల నుంచి యుక్తవయస్సు వచ్చే వరకు క్రమం తప్పకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రణాళికతో నిర్వహిస్తోంది. వారంలో రెండు రోజులు ప్రభుత్వాస్పత్రుల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందు కోసం ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన నాటి నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతోంది. అయితే వ్యాక్సినేషన్‌పై అవగాహన లేకపోవడంతో చిన్నారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంగోలు అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇమ్యూనైజేషన్ ప్రక్రియ గర్భిణులు, నవజాత శిశువుల మరణాలకు చెక్ పెట్టడంతో పాటు చిన్నారుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపకరిస్తుంది. శిశువు నుంచి వృద్ధాప్యం వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి వ్యాక్సినేషన్ రక్షణ కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్దేశించిన వాతావరణంలో భద్రపరిచి అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులకు వాక్సిన్లను అవసరం మేరకు సరఫరా చేస్తోంది. ప్రతి బుధ, శనివారాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో డాక్టర్లు, నర్సులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు లేని గ్రామాలకు ముందు రోజే ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలియజేసి బుధ, శనివారాల్లోనే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 64 పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీలు, 8 సీహెచ్‌సీలు, 2 ఏరియా ఆస్పత్రులు, మాతా శిశు వైద్యశాల, మార్కాపురంలోని జిల్లా ఆస్పత్రి, ఒంగోలు జీజీహెచ్‌లో వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాదికి జిల్లాలో ఏడాదికి 42,062 జీరో డోసులు టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 20,603 డోసుల ప్రక్రియ పూర్తయింది. టీకాలు.. పది రకాలు గర్భిణులకు, పిల్లలకు మొత్తం పది రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెండు రకాలు చుక్కల మందు, ఒక రకం ద్రావణం, ఏడు రకాల ఇంజక్షన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు పుట్టిన క్షణం నుంచి 16 ఏళ్ల వయసు వరకు నిర్దేశించిన వయసు ప్రకారం ఆయా డోసులు వేయించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్‌కు సంబంధించి పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్ కార్డు ఇచ్చి అందులో వ్యాక్సినేషన్ వివరాలు పొందుపరుస్తారు. గర్భిణులు, పిల్లలకు డీటీ (డిప్టీరియా టెటానస్) ఈ టీకా గర్భం దాల్చిన తొలి రోజుల్లో మొదటి డోసు, తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు, ఆ తర్వాత బూస్టర్ డోసు వేస్తారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్ మొదటిగా పుట్టిన సమయంలో బీసీజీ (క్షయ) ఓపీవీ వ్యాక్సిన్ జీరో మోతాదుతో పాటు హెపటైటీస్ బీ పుట్టిన వెంటనే మోతాదు ఇస్తారు. 6 వారాల వయసులో ఓపీవీ–1 (పోలియో రాకుండా) చుక్కల మందు, రోటా–1 (విరోచనాలు రాకుండా) చుక్కల మందుతో పాటు ఎఫ్‌ఐపీవీ–1 ఇంజక్షన్ (పోలియో రాకుండా), పెంటావాలెంట్ (డిప్టీరియా, కంఠసర్పి, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు రాకుండా) టీకాలు వేస్తారు. పది వారాల వయసులో ఓపీవీ, పెంటావాలెంట్, రోటా టీకాలు రెండో డోసు వేస్తారు. 14 వారాలకు ఓపీవీ, పెంటావాలెంట్, రోటా మూడో డోసుతో పాటు ఎఫ్‌ఐపీవీ రెండో డోసు వేస్తారు. 9 నెలలకు తట్టు, రుబెల్లా రాకుండా ఎంఆర్ వ్యాక్సిన్‌తో పాటు విటమిన్ ఏ ద్రావణం ఇస్తారు. 16 నుంచి 24 నెలలకు డీపీటీ మొదటి బూస్టర్, ఓపీవీ బూస్టర్‌తో పాటు ఎంఆర్ రెండో డోసు వేస్తారు. 5,6 సంవత్సరాలకు డీపీటీ రెండో బూస్టర్ మోతాదు, 10–16 సంవత్సరాలకు టీడీ వ్యాక్సిన్ వేస్తారు. టీకాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డ వరకు సకాలంలో టీకాలు వేయించాలి. టీకాల కాల పరిమితి ఆశా వర్కర్లు, అంగన్వాడీల ద్వారా తెలుసుకుని సకాలంలో పిల్లలకు టీకాలు వేయించాలి. టీకాల వలన ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడవచ్చు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం నిర్దేశించిన రోజుల్లో క్రమం తప్పకుండా జరుగుతోంది. – ఏఎస్ దినేష్‌కుమార్, కలెక్టర్ ఇమ్యూనైజేషన్ ప్రక్రియ పక్కాగా పర్యవేక్షిస్తాం జిల్లాలో నిర్వహించే ఇమ్యూనైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు టీకాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్డులో నమోదు చేస్తున్నాం. ఆశాలు, అంగన్వాడీల ద్వారా వ్యాక్సినేషన్ సమయాన్ని కూడా తల్లిదండ్రులకు ముందుగానే గుర్తు చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలు టీకాలపై అవగాహనతో ఉండి పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించి పోలియో, ఇతర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలి. – పద్మజ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. ఇలా ఒక్కటయ్యారు.. ఆ పెళ్లిలో ఇదే ప్రత్యేక ఆకర్షణ
చీరాల రూరల్(ప్రకాశం జిల్లా): అమెరికా అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించుకున్నారు. సంప్రదాయంగా పెళ్లి చేసుకుని చీరాలలో శనివారం ఒక్కటయ్యారు. చీరాల కొత్తపేటకు చెందిన లింగం జాన్ సుశీల్‌బాబు, రత్నకుమారి దంపతుల కుమారుడు లింగం జాన్కిరణ్బాబు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. చదవండి: వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..! ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఇతనికి తోటి ఉద్యోగి అయిన అమెరికాలోని ఆరిజోనా స్టేట్ హుడ్ రివర్ పట్టణానికి చెందిన కోరి ఎలిజబెత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు విషయం చెప్పారు. వారు ఒప్పుకోవడంతో వివాహం చేసుకున్నారు. కోరి ఎలిజబెత్ కుటుంబ సభ్యులు పట్టుచీరలు కట్టుకుని వివాహానికి హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
విద్యాశాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సెర్ప్‌తో షేర్
ఒంగోలు: విద్యాశాఖలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ ఎంఈఓలు నిర్వహిస్తున్న విధుల్లో కొన్నింటిని సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న ఏపీఎంలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంలు ప్రస్తుతం సెర్ప్‌లో స్వయం సహాయక సంఘాలు, స్త్రీ నిధి తదితర బ్యాంకు లింకేజీ స్కీములను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాశాఖకు కేటాయించిన ఏపీఎంలు నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వంటి వాటిని పర్యవేక్షిస్తారు. మండల విద్యాశాఖ అధికారికి వీటి నుంచి మినహాయింపు ఇవ్వడంతో పనిభారం తగ్గుతుంది. తద్వారా వారు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. పాఠశాలల తనిఖీలు, పాఠశాలల్లో సిలబస్ నిర్ణీత సమయానికి పూర్తిచేస్తున్నారా, హాజరు ఎలా ఉంది, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. పనులు వేగవంతం అయ్యేందుకు ఉపయోగం సెర్ప్‌లోని అదనపు ప్రాజెక్టు మేనేజర్లను ఎంఈవో బాధ్యతల్లో కొన్నింటిని పర్యవేక్షించేందుకు ఇవ్వడం వలన పనులు వేగవంతం అవుతాయి. సాధారణంగా ఎంఈవోలకు చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నింటిని సమన్వయం చేసుకునే సమయంలో విద్యాప్రమాణాల పెంపుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏపీఎంలను ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యా ప్రమాణాల మెరుగుదల, మరో వైపు నాడు–నేడు వంటి పనుల పర్యవేక్షణ వేగవంతం అవుతాయి. – బి.విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి -
బాబు పాలనలో వెంటిలేటర్‌పై వైద్యశాఖ
మార్కాపురం(ప్రకాశం జిల్లా): చంద్రబాబు పాలనలో వైద్య, ఆరోగ్యశాఖను వెంటిలేటర్‌పై ఉంచారని ఆ శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ శాఖకు జీవం నింపుతున్నారని, పేదలకు మేలుచేసే విషయంలో ఎవరైనా ఆయన తర్వాతనేనని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి ఆస్పత్రుల్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. తొలుత మార్కాపురంలో రూ.80 లక్షలతో నిర్మించిన యూపీహెచ్‌సీని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖకు చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని, ఆయన రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆస్పత్రులు కట్టకుండా, ఉన్న ఆస్పత్రులను పట్టించుకోకుండా ఈ శాఖను నిర్వీర్యం చేశారన్నారు. అమరావతి రాజధాని పేరుతో పాదయాత్ర అంటూ ఓ బూటకపు నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం అత్యంత వేగంగా, సులువుగా, ఉచితంగా అందించేందుకు రూ.16 వేలకోట్లకు పైగా నిధులతో వైద్య వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. రూ.1,692 కోట్లతో గ్రామగ్రామాన వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మిస్తున్నారన్నారు. రూ.8 వేలకోట్లకు పైగా నిధులతో 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నారని తెలిపారు. 1,126 పీహెచ్‌సీలను కొత్తగా నిర్మించడం, లేదా ఆధునికీకరించడం కోసం రూ.665 కోట్లు ఖర్చుచేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 184 యూహెచ్‌సీల ఆధునికీకరణ, 344 యూహెచ్ సీల నిర్మాణం కోసం రూ.392 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో రానున్న ఫ్యామిలీ ఫిజిషియన్ విధానంలో ప్రభుత్వ వైద్యులు ఇళ్లకే వచ్చి వైద్యసేవలు అందిస్తారని ఆమె తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ అవార్డుతో అభివృద్ధికి బాటలు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ప్రజల్లో అవగాహన కల్పించే పట్టణాలు, నగరాలకు స్వచ్ఛతా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగా పొదిలి నగర పంచాయతీ జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. దీంతో స్వచ్ఛ పొదిలి దిశswachh awardsగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు నిధుల లభ్యత కలగనుంది. పొదిలి(ప్రకాశం జిల్లా): నగర పంచాయతీగా ఉన్న పొదిలికి స్వచ్ఛ పురస్కారం వరించింది. సుమారు 40 వేల జనాభా, 20 వార్డులతో ఉన్న నగర పంచాయతీలో 12 వేల గృహాలు ఉన్నాయి. మేజర్ పంచాయతీ నుంచి 2021లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన పట్టణంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏటా రూ.1.30 కోట్ల ఇంటి పన్నుల డిమాండ్ ఉంది. ప్రత్యేక కేటగిరీలో అవార్డు: స్వచ్ఛత లీగ్‌లో భాగంగా ప్రత్యేక కేటగిరీలో పొదిలి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. 15 వేల జనాభా విభాగం కింద అవార్డు ఇచ్చారు. గత నెల 30వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా నగర పంచాయతీ కమిషనర్ డానియేల్ జోషెఫ్ అవార్డు అందుకున్నారు. జాయిన్ ద ఫైట్ ఫర్ గార్బేజ్ సిటీస్ నినాదంతో ముందుకు సాగేందుకు అవార్డు ఉపకరిస్తుంది. టీమ్‌కు నచ్చటంతోనే సర్వే ప్రారంభం: పట్టణంలో పారిశుధ్య పనులు ఊపందుకున్నాయి. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ, పరిశుభ్రతపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఆగస్టులో నిర్వహించిన స్వచ్ఛత మహోత్సవ ర్యాలీలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన టీమ్ సభ్యులు సర్వే ప్రారంభించారు. నిబంధనల మేర అన్నీ జరుగుతున్నాయని టీమ్ సభ్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నగర పంచాయతీకి అవార్డు వరించింది. నీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో... నగర పంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సాగర్ నీరు పెద్ద చెరువుకు చేర్చి, దాని ద్వారా ఇంటింటికీ కొళాయిల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయటంతోపాటు, నీటి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు దిశగా... కాలుష్య నివారణ, నీరు కలుషితం కాకుండా చేయటానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్యమంగా జరుగుతోంది. ఎస్టీపీ, ఎఫ్ఎస్టీపీ కేంద్రాలు ఏర్పాటు చేయటానికి అవకాశాలపై టీం సభ్యులు సర్వే నిర్వహించారు. సీవేజ్ ట్రాన్స్పోర్ట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు చేయటం ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తారు. మరో వైపు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మల, మూత్రాలను ఒకే చోటికి చేర్చి శుద్ధీకరణకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏర్పాటుకు మురుగునీరు, మలం రెండు వేరు వేరుగా ఒకే చోటకు చేరే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసేందుకు టీమ్ చేసిన సర్వేలో అనువుగా ఉందని గుర్తించటంతో ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయి. అభివృద్ధి లక్ష్యంతో సమన్వయంతో పనిచేస్తున్నారు నగర పంచాయతీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు. తొలి ప్రాధాన్యతగా మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నాం. మరో వైపు నగర పంచాయతీ కార్యాలయం భవనాల కోసం స్థల పరిశీలన తుది దశకు చేరుకుంది. సీపేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నాను. శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు దశకు వస్తాయి. అన్ని విధాలుగా నగర పంచాయతీ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పథకాలను, నిధులు మంజూరు చేయిస్తాం. – కేపీ.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే. అవార్డుతో అభివృద్ధికి బాటలు జాతీయ అవార్డు అందుకోవటం ఆనందంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే అవార్డుకు అర్హత సాధించాం. దీని వల్ల పట్టణానికి భవిష్యత్‌లో ఎంతో మేలు జరుగుతుంది. శుద్ధీకరణ ప్లాంట్లు కార్యరూపం దాల్చితే కోట్ల నిధులు రావటంతో పాటు, కాలుష్యం లేకుండా పోతుంది. ప్రస్తుతానికి కంపాక్ట్ వాహనం (8 టన్నుల చెత్తను రవాణా చేసే వాహనం) అందిస్తారు. దీంతో పాటు చెత్త రవాణా కోసం అవసరమైన వాహనాలను సమకూర్చుతారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, నగర పంచాయతీ అధికారులు, పారిశుధ్య కార్మికులు అందరికీ కృతజ్ఞతలు. – డానియేల్ జోషెఫ్, కమిషనర్ -
ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యల్పంగా విద్యార్థులు ఎంపికయ్యారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,400 సీట్లు ఉండగా, వీటిలో 400 సీట్లు ఈడబ్ల్యూఎస్ సీట్లు కాగా, ప్రత్యేక కేటగిరి కింద 280 సీట్లు మినహా 4,120 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు. వీటిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 463 మంది, గుంటూరులో 434 మంది, నెల్లూరులో 393 మంది, పశ్చిమ గోదావరిలో 128 మంది, శ్రీకాకుళంలో 391 మంది, విజయనగరంలో 337 మంది, విశాఖలో 244 మంది, తూర్పు గోదావరిలో 275 మంది, కృష్ణాలో 269 మంది, కడపలో 231 మంది, కర్నూలో 260 మంది, చిత్తూరులో 357 మంది, అనంతపురంలో 232 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో బాలికలే అధికం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో బాలికలే అధికంగా ఉన్నారు. బాలికలు 2,721 మంది ఎంపికవ్వగా, బాలురు 1,399 మంది మాత్రమే ఎంపికయ్యారు. మొత్తం సీట్లలో ఎంపికైన బాలికల శాతం 66.04, బాలుర శాతం 33.96గా ఉంది. బాలికలు నూజివీడు ట్రిపుల్ ఐటీకి 677 మంది, ఇడుపులపాయకు 676 మంది, ఒంగోలుకు 680 మంది, శ్రీకాకుళానికి 688 మంది ఎంపికయ్యారు. ఏపీ నుంచి 4,014 మంది, తెలంగాణ నుంచి 106 మంది ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో ఉన్నారు. (క్లిక్ చేయండి: అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు..) ముగిసిన ట్రిపుల్ ఐటీ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న అడ్మిషన్లలో భాగంగా సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి దివ్యాంగులకు 120 సీట్లు, సైనికోద్యోగుల పిల్లలకు 80, ఎన్సీసీ 40, స్పోర్ట్స్ కోటా 20, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 20 సీట్లు ఉన్నాయి. ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు పర్యవేక్షణలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించారు. క్రీడా కోటాకు 622 మంది, ఎన్సీసీ కోటాకు 1,267 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు 272 మంది, వికలాంగుల కోటాకు 198 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి/చీమకుర్తి: ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మినీ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ ఇటీవల హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తూ ఆ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ -
తుపాకీ పట్టిన చేతులతో మేడి పట్టిన మాజీ సైనికులు
తుపాకీ చేతపట్టి సరిహద్దు రేఖపై పహారా కాసిన వారే.. నాగలి చేతబూని పంటచేలో సేద్యం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి దేశం కోసం పరితపించిన వారే నిరంతర శ్రామికులై శ్వేదం చిందిస్తూ అన్నదాతలుగా మారారు. వేలాది మంది సైనికులు, మాజీ సైనికులకు నిలయమైన జిల్లాలో ఏళ్ల తరబడి దేశసేవలో తరించిన మాజీ సైనికులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. కష్టం మాకు లెక్కేం కాదంటూ అవిశ్రాంతంగా మండుటెండల్లో.. పంట చేలల్లో కాయకష్టం చేస్తూ గర్వంగా మీసం మెలేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జై జవాన్.. జై కిసాన్.. అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ సైనికులు. జిల్లాలో దేశానికి సేవ చేసిన.. చేస్తున్న జవాన్లు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులకు పశ్చిమ ప్రకాశం పెట్టింది పేరు. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సైనికులు, మాజీ సైనికులతో పోల్చుకుంటే అత్యధిక శాతం ఉన్నారు. నియోజకవర్గంలోని అర్థవీడు మండలం జిల్లాలోనే అత్యధికంగా సైనికులు, మాజీ సైనికులున్న మండలంగా గుర్తింపు పొందింది. ఆ తరువాత స్థానాల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట, రాచర్ల, కంభం మండలాలున్నాయి. ఆ తరువాత స్థానాల్లో కనిగిరి నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. దేశానికి సేవలందించటంలో జిల్లాకు గుర్తింపు దేశ సేవలో వేలాది మంది జిల్లావాసులు పునీతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా మాజీ సైనికులు 28 వేల మంది ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం దాదాపు 15 వేల మందికి పైగా త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే సైన్యంలో పనిచేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, పాకిస్థాన్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ జిల్లా సైనికులు అత్యంత సాహసాన్ని కనబరిచారు. కార్గిల్‌లాంటి యుద్ధాల్లో ప్రాణాలు ఫణంగా పెట్టారు. త్రివిధ దళాల్లో 15 నుంచి 30 సంవత్సరాల వరకు సేలందించి పదవీ విరమణ చేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులుగా పనిచేసిన తరువాత వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కూడా పొందే అవకాశం మాజీ సైనికులకు ఉంటుంది. అలా వెళ్లిన వారు కొంతమంది మాత్రమే ఉంటారు. మరికొంతమంది వివిధ రంగాల్లో అంటే వ్యాపారాలు, పరిశ్రమలు, ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది వ్యవసాయం మీద మక్కువతో కష్టమైనా ఇష్టంగా పనిచేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే అత్యధికంగా.. సైనికుడంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవనం. ఆ క్రమశిక్షణ సోమరితనాన్ని పారదోలుతుంది. జవానుగా పదవీ విరమణ చేసిన వేలాది మంది మాజీ సైనికులు విశ్రాంత జీవితాన్ని ఖాళీగా గడపకుండా.. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికులు ఇతర రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో వీరి సంఖ్య దాదాపు 10 వేల మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరికొందరు పశువుల పెంపకం ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. కొందరు వ్యవసాయంతోపాటు చేపల చెరువులు వేస్తూ అందులో మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం, చేపల పెంపకంతో.. ఇతని పేరు దూదేకుల మౌలాలి. రాచర్ల మండలంలోని గుడిమెట్ట కొత్తపల్లె గ్రామానికి చెందిన ఈయన 26 ఏళ్లపాటు ఆర్మీ జవానుగా పని చేసి 2018లో పదవీ విరమణ చేశారు. అనంతరం స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వారికున్న 6.50 ఎకరాల వ్యవసాయ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. టమోటా, మిరప, బత్తాయి, పత్తి పంటలతో పాటు చేపల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఆదాయం వస్తున్నా వ్యవసాయంపై మక్కువతో పంటలు సాగుచేస్తున్నట్లు మౌలాలి చెబుతున్నారు. జత ఎడ్లతో పాటు, నాలుగు పాడి గేదెలను పెంచుకుంటున్నారు. కుటుంబంలోని అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ మరికొంత మందికి తన వ్యవసాయం, చేపల పెంపకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. పొలం కౌలుకు తీసుకొని.. రాచర్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కఠారు పూర్ణ రంగయ్య 22 ఏళ్ల పాటు మిలిటరీలో పనిచేశారు. తనకు పెన్షన్ వస్తున్నా, మిలిటరీ క్యాంటీన్లో కావాల్సిన వస్తువులు నాణ్యమైనవి, తక్కువ ధరకు వస్తున్నా సరిపెట్టుకోలేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తనకు పొలం లేకపోయినా 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆ పొలంలో ఒక ఎకరంలో వరి సాగుచేస్తుండగా మిగతా మూడెకరాల్లో మిర్చితో పాటు కూరగాయల సాగు చేపడుతూ శ్రమను నమ్ముకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతూ కౌలుకు తీసుకున్న పొలం అయినా ఇష్టంగా పంటలు పండిస్తున్నారు. పెట్టుబడి, కౌలు ఖర్చులు, కూలీ ఖర్చులు పోనూ ప్రతి సంవత్సరం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. (క్లిక్ చేయండి: వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్) -
వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్
(బివి రాఘవ రెడ్డి) ఈ భూ మండలంలో రెండు విలువైన సంపదలు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లు కాగా.. మరొకటి ప్రకాశం జిల్లా చీమకుర్తి భూగర్భంలో ఉన్న గెలాక్సీ బ్లాక్ గ్రానైట్. 45 ఏళ్ల కిందట.. తనకు రోజూ మంచి కాఫీ ఇస్తున్నాడన్న అభిమానంతో చీమకుర్తి తహశీల్దార్ వెంకటేశ్వర్లు.. ఆఫీసు ఎదురుగా ఉన్న ఓ టీస్టాల్ యజమానికి సాగు చేసుకోమంటూ రెండెకరాలకు పట్టా రాసిచ్చారు. పశువుల మేత కూడా మొలవని ఆ భూమి నాకెందుకంటూ అతను పట్టా తీసుకోకుండానే వెళ్లిపోయాడు. ఆ భూమి విలువ ఇప్పుడు ఎకరా రూ.3 కోట్లు! చీమకుర్తికి 4 కి.మీ దూరంలో రాళ్లు, రప్పలు, రేగుచెట్లతో నిండిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో 1978లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న వేమా ఎల్లయ్య రామతీర్థం కేంద్రంగా పశుక్షేత్రం ఏర్పాటు చేయించారు. అదే భూమి గర్భంలో రూ.వేల కోట్ల విలువైన గ్రానైట్ ఉన్నట్లు తర్వాత కాలంలో బయట పడింది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ మరింతగా వెలుగులు విరజిమ్మనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో విదేశాలకు ఎగుమతులు పెరగటంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో పాదయాత్రకు వచ్చిన సందర్భంగా గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు ఇచ్చిన హామీ మేరకు జీఓ నంబరు 58ని ఇటీవల విడుదల చేశారు. ఆ ప్రకారం అక్టోబర్ 1 నుంచి కొత్త స్లాబ్ సిస్టం అమలులోకి రానుంది. సింగిల్ కట్టర్ బ్లేడ్ ఉన్న ఫ్యాక్టరీ యజమాని రూ.27 వేలు చెల్లిస్తే 22 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయిని ప్రాసెస్ చేసుకునేందుకు అనుమతి వస్తుంది. మల్టీ కట్టర్ బ్లేడ్ ఫ్యాక్టరీ అయితే రూ.54 వేలు చెల్లించి 44 క్యూబిక్ మీటర్ల రాయిని ప్రాసెస్ చేసుకోవచ్చు. విద్యుత్ చార్జీల రాయితీపైనా త్వరలో జీవో విడుదల కానుంది. ఆ మేరకు యూనిట్‌కు రూ.2 రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఒక్కో ఫ్యాక్టరీ యజమానికి నెలకు కనీసం రూ.లక్ష ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు రా మెటీరియల్‌ను క్వారీ యజమానుల వద్ద నేరుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు వచ్చింది. విజిలెన్స్ దాడుల భయం లేకుండా చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. రామాయపట్నం పోర్టు ఇక్కడి ఎగుమతిదారులకు వరం కానుంది. రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో ఇప్పటికే 1650 గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 60 అధునాతన ఫ్యాక్టరీలు. ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యాయి. కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే యజమానులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం జనరల్ కేటగిరీ, బీసీ వర్గాలకు 30 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 45 శాతం సబ్సిడీ వస్తుంది. దీంతో బ్యాంకుల్లో రుణం తీసుకున్న రెండు మూడు సంవత్సరాల్లోనే తీర్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వ సహకారం బాగుండటంతో ఏటేటా ఫ్యాక్టరీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన మూడేళ్లలోనే 250కి పైగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మరో 90 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదికి 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఎగుమతి జిల్లా నుంచి ఏడాదికి 8.82 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ చైనా, ఇటలీ, వియత్నాం, ఈజిప్ట్, టర్కీ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. అందులో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఒక్కటే 6.25 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతి అవుతుంది. బ్లాక్ గ్రానైట్ ఏడాదికి 80 వేల క్యూబిక్ మీటర్లు, కలర్ గ్రానైట్ 1.77 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతవుతోంది. వెలికితీసిన గ్రానైట్ విలువ రూ.1.26 లక్షల కోట్లు! ఇక్కడ గ్రానైట్‌ను గుర్తించిన తొలినాళ్లలో ఏడాదికి 11 వేల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికి తీసినా ప్రస్తుతం పది లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీస్తున్నారు. 35 ఏళ్లలో సరాసరిన ఏడాదికి 4 లక్షల క్యూబిక్ మీటర్ల వంతున లెక్కగట్టినా 1.40 కోట్ల చ.మీటర్ల గ్రానైట్ రాయిని తవ్వి తీసినట్లు అంచనా. క్యూబిక్ మీటర్ గ్రానైట్ నాణ్యతను బట్టి రూ.35 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. క్యూబిక్ మీటర్‌కు సరాసరిన రూ.90 వేలు లెక్కగట్టినా ఇప్పటి వరకు రూ.1.26 లక్షల కోట్ల విలువ చేసే గ్రానైట్‌ను బయటకు తీసినట్లు అంచనా. ఇప్పటి వరకు భూగర్భంలో ఉన్న గ్రానైట్‌లో 30 శాతం గనుల ద్వారా వెలికితీయగా.. రానున్న 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరువు జిల్లాలో కనకవర్షం... ఒకప్పుడు ప్రకాశం జిల్లా కరువుకు పెట్టింది పేరు. అలాంటి జిల్లా నేడు పారిశ్రామిక కేంద్రంగా మారిందంటే దానికి చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ కారణం. అప్పట్లో ఎందుకూ పనికి రాదనుకున్న రామతీర్థం పరిసరాల్లోని భూమి నేడు ఎకరం రూ.3 నుంచి రూ.4 కోట్లకు పైనే పలుకుతోంది. చీమకుర్తితో పాటు ఒంగోలు శివారులో నున్న పేర్నమిట్ట ఎస్టేట్, సంతనూతలపాడు, మార్టూరు, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ తదితర ప్రాంతాల్లో 1650 గ్రానైట్ ఫ్యాక్టరీలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, తమిళనాడు, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల కార్మికులు ఇక్కడి పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదుకున్న వైఎస్... 2008లో ఆర్థిక మాంద్యం కారణంగా గ్రానైట్ గనుల లీజుదారులు తీవ్రంగా నష్టాల బారిన çపడ్డారు. 2009లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి లీజుదారులు చెల్లించాల్సిన రాయల్టీలో మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీని ప్రకటిస్తూ జీఓ నంబర్లు 104, 105 ను జారీ చేశారు. దాంతోనే తాము ఒడ్డున పడ్డామని చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బ్లాక్ గెలాక్సీ.. పేరెలా వచ్చిందంటే చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో గ్రానైట్ ఉన్నట్లు 1983లో బయటపడింది. 1985లో మైనింగ్ లీజుకు తీసుకున్న జూబ్లీ గ్రానైట్ యజమాని నన్వాని వెలికి తీసిన గ్రానైట్‌ను మార్కెటింగ్ కోసం చైనా తీసుకెళ్లారు. నల్లని బండపై నగిషీలు అద్దినట్టున్న ఆ గ్రానైట్‌కు బ్లాక్ గెలాక్సీ అని పేరుపెట్టారు. దాని డిమాండ్‌ను గుర్తించిన చైనా అధునాతన కటింగ్ మిషన్లతో పెద్దఎత్తున యూనిట్లను నెలకొల్పింది. రూ.11,015 ఆదాయంతో మొదలు రామతీర్థం పరిసరాల్లో గ్రానైట్ ఉన్నట్లు గుర్తించిన అనంతరం మొట్టమొదటి సారిగా 8.094 హెక్టార్లలో ఒకే ఒక లీజుతో రాయల్టీ ద్వారా రూ.11,015 ఆదాయం వచ్చినట్లు ఒంగోలు భూగర్భ గనుల శాఖాధికారుల వద్దనున్న గణాంకాలు చెబుతున్నాయి. 2013లో రాయల్టీ రూçపంలో ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 1081 హెక్టార్లలో 327 లీజులతో ఏడాదికి రూ.566 కోట్ల ఆదాయం రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి వస్తోందని మైన్స్ డీడీ తెలిపారు. జీఎస్టీ, డెడ్రెంట్లు, పెనాల్టీల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.200 కోట్లు ఆదాయం వస్తోంది. ఏటా రూ.500– రూ.600 కోట్లు బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 85 శాతం చైనాకు ఎగుమతి అవుతోంది. గ్రానైట్ రాయి కటింగ్‌కు, పాలిషింగ్‌కు ఉపయోగించే మిషనరీ, డైమండ్ కట్టర్లు, సెగ్మెంట్లు అన్నీ చైనా లో పెద్దఎత్తున అభివృద్ధి చేసి యూనిట్లు స్థాపించారు. కొన్నేళ్లుగా మన పారిశ్రామికవేత్తలు చైనా నుంచి మిషనరీ దిగుమతి చేసుకుని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. – బి.జగన్నాథరావు, మైన్స్ డీడీ, ఒంగోలు చైనా మార్కెట్‌తోనే డిమాండ్ చీమకుర్తిలోని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు చైనాలో మంచి డిమాండ్ ఉంది. మొట్టమొదటి సారిగా గెలాక్సీ గ్రానైట్‌ను నేనే చైనాకు తీసుకుపోయి మార్కెటింగ్ చేశాను. ఆ తర్వాత మరో రెండు కంపెనీలు నాతో కలిసి వ్యాపారం చేశాయి. క్వారీలు పెరిగాక ఎగుమతి కూడా భారీగా పెరిగింది. – ఎల్.టి.నన్వాని, జూబ్లీ గ్రానైట్ యజమాని స్లాబ్ సిస్టంతో మంచి రోజులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చీమకుర్తి వచ్చినప్పుడు స్లాబ్ సిస్టం అమలు చేస్తున్నట్లు చెప్పి, ఆమేరకు జీఓ ఇచ్చారు. ఈ విధానం వల్ల ఫ్యాక్టరీల యజమానులకు నిర్ణీత ధరకు రాయి దొరుకుతోంది. విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2 రాయితీ వల్ల చాలా కలిసి వస్తుంది. మొత్తం మీద ఫ్యాక్టరీల యజమానులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. – యర్రంనేని కోటేశ్వరరావు, ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రెసిడెంట్, గుండ్లాపల్లి -
మృత్యుహైవే..37 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
మార్కాపురం టౌన్/మద్దిపాడు(ప్రకాశం జిల్లా): హైవే రోడ్లు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ మలికా గర్గ్ నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రతి శనివారం నేషనల్, స్టేట్ హైవేలపై నో యాక్సిడెంట్ డేగా నిర్ణయించి తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఒక వైపు ప్రజలకు ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరో వైపు నిబంధనలు ఉల్లంఘంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒంగోలు–చెన్నై, ఒంగోలు–విజయవాడ ఎన్‌హెచ్ 16, ఒంగోలు–చీమకుర్తి పరిధిలోని స్టేట్ హైవే నంబర్ 39, గిద్దలూరు–విజయవాడ పరిధిలోని ఎన్‌హెచ్ 544డి, మార్కాపురం టౌన్‌లోని బోడపాడు క్రాస్ రోడ్‌లోని ఎన్‌హెచ్ 565 పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ స్పాట్స్‌లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. వీటి వద్ద బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు స్పీడ్ బ్రేకర్లను, బ్లింకింగ్ లైట్స్ సిస్టంను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లను తొలగిస్తున్నారు. గ్రామాలు పాఠశాలలు, మలుపుల వద్ద వాహనదారులను అలర్టు చేసేందుకు మార్కింగ్ చేశారు. గత నెల 24వ తేదీన డీఐజి త్రివిక్రమ వర్మ మద్దిపాడు మండలంలోని బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఎస్పీ మలికాగర్గ్‌కు పలు సూచనలు చేశారు. కారణాలు ఇవే „ నేషనల్ హైవే నిబంధనల ప్రకారం హైవే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఉండవు „ 100 నుంచి 140 కిలో మీటర్ల మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. „ మద్యం తాగి వాహనం నడపటం „ గ్రామాల వద్ద, మలుపుల వద్ద వాహనం నిదానంగా కాకుండా వేగంగా వెళ్లడం, ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించక ప్రమాదాలు జరుగుతున్నాయి. „ హెల్మెట్ వాడకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. „ హైవేపై ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత నెలలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని అమరావతి–అనంతపురం హైవేపై కంభం రైల్వేస్టేషన్ వద్ద ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. 12న కొనకనమిట్ల మండలంలో జాతీయ రహదారిపై బైక్ ఢీకొని వృద్దుడు మృతి. 16న బేస్తవారిపేట పరిధిలో బస్సును బైక్ ఢీకొని యువకుడు మృతి. దర్శిలో బైక్‌పై వెళ్తూ బస్సును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి. 20వ తేదీన తాళ్లూరు మండలం గంగవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు మృతి. 23న జే పంగులూరు మండలం కొండమంజులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 28వ తేదీ కొమరోలు మండలంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ, బైక్‌పై ఉన్న ఇద్దరు మృత్యువాత. 2019వ సంవత్సరంలో బ్లాక్ స్పాట్ల వద్ద 24 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2020లో 18 మంది ప్రమాదాల్లో చనిపోగా 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నలుగురికి గాయాలయ్యాయి. 2021లో 22 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2022లో ఆగస్టు వరకూ 11 మంది మృతిచెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నివారణ చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. నివారణకు మా సిబ్బంది వాహనదారులకు అవగాహన కలి్పస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. స్పీడ్ గన్లు ఏర్పాటు చేశాం. దీంతో హై స్పీడ్‌తో వెళ్తున్న వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తున్నాం. ప్రతి శనివారం జిల్లా వ్యాప్తంగా నో యాక్సిడెంట్ డేను అమలు చేస్తున్నాం. పోలీస్ అధికారులు తమ సిబ్బందితో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. – మలికాగర్గ్, జిల్లా ఎస్పీ బ్లాక్ స్పాట్లు మార్కాపురం పరిధిలోని బోడపాడు క్రాస్‌రోడ్డు, కొనకనమిట్ల జంక్షన్, రాయవరం పలకల గనులు, పెద్దారవీడు సమీపంలోని హనుమాన్ జంక్షన్, నేషనల్ హైవేపై ఉన్న గొబ్బూరు, తోకపల్లి, దేవరాజుగట్టు, కంభం సమీపంలో హైవేపై ఉన్న పెట్రోల్ బంకు వద్ద, గిద్దలూరు సమీపంలోని త్రిపురాపురం క్రాస్‌రోడ్, బేస్తవారిపేట సమీపంలోని పెంచికలపాడు, యర్రగొండపాలెం పరిధిలోని గురిజేపల్లి, బోయలపల్లి, దోర్నాల సమీపంలోని చింతల, చిన్నారుట్ల మలుపు, పుల్లలచెరువు సమీపంలోని మల్లపాలెం క్రాస్‌రోడ్డు, త్రిపురాంతకం సమీపంలోని నేషనల్ హైవేపై ఉన్న గొల్లపల్లి, డీబీఎన్ కాలనీ క్రాస్ రోడ్ల వద్ద తరచుగా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ బైపాస్ జంక్షన్, సంఘమిత్ర హాస్పిటల్ రోడ్డు, వెంగముక్కలపాలెం జంక్షన్, త్రోవగుంట, ఏడుగుండ్లపాడు, కొప్పోలు ఫ్లైఓవర్ జంక్షన్, మద్దిపాడు పరిధిలోని గ్రోత్ సెంటర్, చీమకుర్తి పరిధిలోని మర్రిచెట్లపాలెం జంక్షన్, ఈస్ట్ బైపాస్ రోడ్డు, రెడ్డి నగర్, సంతనూతలపాడు పరిధిలోని ఒంగోలు రోడ్డు, సింగరాయ కొండ పరిధిలోని కనుమళ్ల క్రాస్‌రోడ్డు, టంగుటూరు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజి, వల్లూరమ్మ గుడి మధ్య, సూరారెడ్డిపాలెం ఐవోసీ ప్రాంతం, కొండపి ఫైవోవర్ బ్రిడ్జి దగ్గర తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. -
సెల్‌ఫోన్ రికవరీలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి
నిత్య జీవితంలో సెల్‌ఫోన్ అత్యంత అవసరంగా మారింది. వినోదమే కాదు డిజిటల్ లావాదేవీలు, ముఖ్యమైన సమాచారం మొత్తం ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు. అంతటి ముఖ్యమైన సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ రికవరీలపై ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా రికవరీని ప్రారంభించి ఇప్పటికే వేలాది ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎస్పీ మల్లికాగార్గ్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట: సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. ఈ నేరాలు ప్రకాశం జిల్లాలో గణనీయంగా పెరిగాయి. సెల్‌ఫోన్ చోరీలతో పాటు వాటిని మరిచిపోయినప్పుడు అందులోని డేటా విషయంలో ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితులు. బంధువులు, సన్నిహితులు, మిత్రుల ఫోన్ నంబర్లతో పాటు కీలకమైన డాక్కుమెంట్లు సైతం సెల్ఫోన్లోనే దాచుకోవడం సమస్యగా మారింది. అనుకోని పరిస్థితుల్లో సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గతంలో పోలీసులు సైతం సెల్‌ఫోన్ రికవరీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు కాదు. సెల్‌ఫోన్ పోయిందంటూ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కితే చేదు అనుభవాలను మూటగట్టుకోవాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే తొలిసారిగా.. సెల్‌ఫోన్ రికవరీలపై ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేలకు వేలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన సెల్ఫోన్లు పొగొట్టుకున్న బాధితులకు సకాలంలో న్యాయం చేకూర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నూతన సాంకేతిక వ్యవస్థతో ఫోన్లను రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1600 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మరో 1000 ఫోన్లను ఎవరు ఉపయోగిస్తున్నారో గుర్తించారు. 300 ఫోన్లు మన జిల్లాలో, 700 ఇతర రాష్ట్రాలు, జిల్లాలో ఉన్నట్లు గుర్తించి వాటిని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెల్‌ఫోన్ వినియోగంలో ఉంటేనే.. సెల్‌ఫోగొట్టుకున్న వారు పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియపరుస్తూ ఒక ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదును ఎస్పీ పర్యవేక్షణలోని ప్రత్యేక సాంకేతిక బృందం పరిశీలనకు స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి పంపిస్తారు. ఐఎంఈఐ ద్వారా ఆ సెల్‌ఫోన్ ఎక్కడ వినియోగిస్తున్నారో గుర్తించి రికవరీ చేస్తున్నారు. అయితే ఆ సెల్‌ఫోన్ వినియోగంలో ఉన్నప్పుడే రికవరీ సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం: మలికాగార్గ్, ఎస్పీ జిల్లాలో ఇప్పటి వరకు 3799 ఫిర్యాదు వచ్చాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు జిల్లా ఐటీ కోర్ టీంకు అందుతాయి. జిల్లాలో మిస్సింగ్ మొబైల్స్‌ను ట్రేస్ చేసేందుకు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు 1600 ఫోన్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేశాం. ఫోన్ పోగొట్టుకున్నా లేదా మర్చిపోయినా వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫార్మాట్లో డేటాను పూర్తి చేసి ఇవ్వాలి. బహిరంగ ప్రదేశాల్లో దొరికిన ఫోన్లను తీసుకుని వాడడం చేయరాదు. వాటిని స్థానిక పోలీస్స్టేషన్లలో అందజేయాలి. 10 రోజుల్లోనే తెచ్చి ఇచ్చారు నా మొబైల్ పోయినట్లు ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే ఎస్సై నాకు అప్పగించారు. తిరిగి రాదనుకున్న రూ. 40 వేల సెల్‌ఫోన్ అందడం ఎంతో సంతోషంగా ఉంది. – ఎన్ రమణారెడ్డి, సర్పంచ్, పిటికాయగుళ్ల -
వివాహేతర సంబంధం.. ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు
కొండపి(ప్రకాశం జిల్లా): ఓ మహిళ తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసింది. ఈ సంఘటన కొండపి మండలం మూగచింతల గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మూగచింతలకు చెందిన సీహెచ్ హరినారాయణకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో చాలా కాలం నుంచి వివాహేతర సంబంధం ఉంది. ఎప్పటిలాగే ఆమె ప్రియుడి కొస్టం వద్దకు బుధవారం రాత్రి వెళ్లింది. కాసేపు సన్నిహితంగా ఉన్న ఆమె ముందస్తు పథకం ప్రకారం తన వద్ద ఉన్న బ్లేడుతో ప్రియుడి మర్మాంగాన్ని కోసింది. చదవండి: వరుడు నచ్చకపోయినా వివాహం.. పెళ్లయిన పదిరోజులకే.. దీంతో హరినారాయణ లబోదిబోమంటూ కొస్టం బయటకు పరుగు తీశాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా హరినారాయణకు భార్య లేకపోవడంతో చాలా కాలం నుంచి ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఆస్తి కోసం లేదంటే మరేదైనా కారణంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ఎస్సై రామకృష్ణని వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు(ప్రకాశం జిల్లా): జిల్లాలో టీడీపీ కంత్రీగాళ్లు చెలరేగిపోతున్నారు. పార్టీ నేతల ముసుగులో చీకటి వ్యాపారాలు, మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిషేధిత గుట్కాలు.. గంజాయి విక్రయిస్తూ ఓ టీడీపీ నేత కుమారుడు పోలీసులకు చిక్కగా, ఓ మహిళా నేత భర్త ఎస్సీ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తూ లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును స్వాహా చేసి జైలు పాలయ్యాడు. తాజాగా ఆ పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానంటూ కన్సల్టెన్సీ పేరుతో రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇతని బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చదవండి: ఆ టీడీపీ నేత సిగ్గు లేకుండా రూ.20 కోట్లు అడిగాడు: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు విశాఖలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ‘స్మార్ట్ సిటీ జాబ్ కన్సల్టెన్సీ’ తరహాలోనే ఒంగోలులో శ్రీనాథ్ జాబ్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. సాక్షాత్తూ టీడీపీ నాయకుడు ఈ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగులను నిలువునా మోసం చేసి దోచుకున్నాడు. ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరిగిన నిరుద్యోగులు చివరకు ఉద్యోగాలు రావని నిర్ధారించుకొని డబ్బులైనా తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడినా ప్రయోజనం లేదు. డబ్బులు ఇచ్చేది లేదు మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరింపులకు దిగటంతో బాధితులు న్యాయం చేయాలని జిల్లా పోలీస్ అధికారులను వేడుకుంటున్నారు. మోసం ఇలా.. స్థానిక పాత గుంటూరు రోడ్డులోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న దాసరి వెంకటేశ్వర్లు ఎదురుగా ఉన్న సూర్య కాంప్లెక్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లోని 110 రూమ్‌ని అద్దెకు తీసుకొని శ్రీనాథ్ జాబ్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరిట రిజిస్టర్ నంబర్ 52/2020తో కార్యాలయాన్ని ప్రారంభించాడు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షల చొప్పున ఖర్చవుతుందని నమ్మబలికాడు. దీంతో దాదాపు 15 నుంచి 20 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో డబ్బులు చెల్లించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జ నార్దన్తో దాసరి వెంకటేశ్వర్లు (ఫైల్) మద్దిపాడు గ్రామానికి చెందిన చల్లపల్లి సుధాకర్‌బాబు జూన్ 2020లో ఉద్యోగం కోసం శ్రీనాథ్ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు అవుతుందని వెంకటేశ్వర్లు చెప్పాడు. సుధాకరబాబు అంత ఇచ్చుకోలేనని మద్దిపాడులో కంప్యూటర్ సెంటర్‌ను నిర్వహిస్తూ తను, తన భార్య జీవనం సాగిస్తున్నామని చెప్పాడు. దీంతో ఇద్దరికీ కలిపి రెండు ఉద్యోగాలకు రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2020 జూన్‌లో రెండు సార్లు రూ.2 లక్షల చొప్పున రూ.4 లక్షలు, 2021లో మరో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.6 లక్షలు వెంకటేశ్వర్లుకి చెల్లించారు. ఆ తరువాత ఎన్ని రోజులు తిరుగుతున్నా ఉద్యోగాలు ఇవ్వలేదు. చివరకు ఇచ్చిన డబ్బులైనా ఇవ్వాలని ప్రాధేయపడినా లాభం లేదు. ఆ తర్వాత కార్యాలయాన్ని మూసేశారు. ఈ విధంగా ఎంతో మంది బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక లబోదిబోమంటూ గుండెలు బాదుకొని ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా దాసరి: దాసరి వెంకటేశ్వర్లు టీడీపీ సీనియర్ నాయకుడు. మర్రిపూడి మండలం అయ్యపురాజుపాలేనికి చెందిన వెంకటేశ్వర్లు టీడీపీ తరఫున మర్రిపూడి ఎంపీపీగా కూడా గెలిచాడు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆ తరువాత దాసరి వెంకటేశ్వర్లును ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా ఆయన నిర్వహించేవాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఖాదీబోర్డు మెంబరుగా కూడా పనిచేశాడు. టీడీపీ నేతల చీకటి భాగోతాలు.. టీడీపీ నాయకులు నిత్యం ఎదుటి వారి తప్పులను వల్లెవేస్తుంటారు. కానీ పార్టీలో కొంతమంది చేసే నీతిమాలిన.. రోత మాలిన పనులను మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు నగరానికి చెందిన 33వ డివిజన్ టీడీపీ నేత జగన్నాథం శారద భర్త మురళీమోహన్ ఎస్సీ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్లో చక్రం తిప్పాడు. లబ్ధిదారుల నుంచి రికవరీ చేసిన సొమ్మును కార్పొరేషన్‌కు చెల్లించకుండా స్వాహా చేశాడు. బాధితులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని భాగోతం వెలుగు చూసింది. విచారణలో అక్రమాలు రుజువు కావడంతో మురళీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 46వ డివిజన్‌కు చెందిన టీడీపీ నేత మస్తానమ్మ కుమారుడు నిషేధిత గుట్కాలు, గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు దాసరి వెంకటేశ్వర్లు నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి నిలువునా ముంచేశాడు. చంపుతానని బెదిరించాడు ప్రభుత్వ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లా టీడీపీ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న దాసరి వెంకటేశ్వర్లు మోసం చేశాడు. మూడు విడతలుగా నాకు, నా భార్యకు ఉద్యోగాలు కావాలని రూ.6 లక్షలు చెల్లించాను. మద్దిపాడు కంప్యూటర్ సెంటర్ నడుపుకుంటూ పైసా...పైసా కూడబెట్టుకొని ఉన్నది మొత్తం అతనికి ధారపోశాను. ఉద్యోగం ఇవ్వకపోగా చివరకు డబ్బులు అడిగినా ఇవ్వలేదు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తున్నాడు. ఇక చేసేది లేక ప్రాణ భయంతో జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌కు ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాను. – చల్లపల్లి సుధాకర బాబు, మద్దిపాడు, బాధితుడు -
ఆశల కల..నెరవేరుతున్న వేళ
అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పదోన్నతుల కోసం ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి సువర్ణావకాశం కలి్పంచింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఒంగోలు రీజియన్ పరిధిలో 142 పోస్టులు ఉన్నాయి. సుమారు 5,530 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు ఒంగోలు నగర పరిధిలోని ఏడు ఇంజినీరింగ్ కళాశాలలను ఎంపిక చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఒంగోలు సబర్బన్: అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టు కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాసిన అంగన్వాడీ కార్యకర్తలకు సువర్ణావకాశం కల్పించింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి పూనుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కొన్ని పోస్టులను భర్తీ చేశారు. ఆ తరువాత 2013 డిసెంబర్లో కిరణ్ కుమార్ రెడ్డి రెగ్యులర్ పోస్టులను అసంపూర్తిగా భర్తీ చేశారు. ఆ తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారు. పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేసినా పెడచెవిన పెట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ కావడంతో అంగన్వాడీ కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. ఈ నెల 12వ తేదీతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది. 5,530 దరఖాస్తులు అంగన్వాడీల్లో కార్యకర్తలుగా పనిచేస్తున్న వారి నుంచే సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టులకు ఎంపిక చేస్తారు. పాత ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాల పునర్విభజన తరువాత ఈ మూడు జిల్లాల పరిధి ప్రస్తుతం ఐదు జిల్లాలకు పెరిగింది. ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం పరిధిలో మొత్తం 142 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకుగాను మొత్తం 5,530 మంది అంగన్వాడీ కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 50 మార్కులు.. అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి రాత పరీక్షతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ ప్రొఫిషిఎన్సీ (ఆన్ వీడియో)తో కూడిన పరీక్ష నిర్వహించనున్నారు. 50 మార్కులు. అందులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు 90 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున వేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు ఒక్కోదానికి అర మార్కు చొప్పున 45 మార్కులకు ఇస్తారు. వీటితోపాటు ఐదు మార్కులకు స్పోకెన్ ఇంగ్లిషు ప్రొఫిషిఎన్సీకి కేటాయించారు. అలాగే నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే పావు మార్కు తగ్గిస్తారు. ఏడు కాలేజీల్లో పరీక్ష ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం పరిధిలో సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించేందుకు ఏడు కాలేజీలను ఎంపిక చేశారు. కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందుకు సంబంధించి పోలీస్ అధికారులు, ప్రభుత్వ అనుబంధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష కూడా నిర్వహించారు. ఏర్పాట్లు పూర్తి సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15 నుంచి హాల్ టికెట్లు పంపిణీ చేస్తున్నాం. 18వ తేదీన కేటాయించిన కాలేజీల్లో రాత పరీక్ష ఉంటుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు అభ్యర్థులు పరీక్ష హాలులోకి రావాలి. 10 గంటలకు పరీక్ష ప్రశ్న పత్రం ఇస్తాం. 10 గంటల తరువాత ఎవరినీ హాలులోని అనుమతించం. – వై.శైలజ, ఆర్జేడీ, ఒంగోలు -
ఆస్తి కోసం అన్న ఘాతుకం.. సొంత తమ్ముడిని కారుతో ఢీకొట్టి...
త్రిపురాంతకం: స్థల వివాదంతో తోడబుట్టిన తమ్ముడిని అన్న కారుతో ఢీకొట్టి ప్రాణం తీశాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లికి చెందిన కంచర్ల ఏడుకొండలు(30), అతని అన్న వెంకటేశ్వర్లుకు మధ్య ఐదు సెంట్ల స్థలం విషయంలో వివాదం నెలకొంది. తరచూ దాని గురించి తగాదాలు పడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా స్థలం విషయమై ఘర్షణ పడ్డారు. గొడవ జరిగాక ఏడుకొండలు నేషనల్ హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెంకటేశ్వర్లు కారుతో ఢీకొట్టాడు. దీంతో ఏడుకొండలు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి మూడేళ్ల కుమార్తె ఉండగా.. గర్భిణి అయిన భార్య యల్లమ్మ కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. తల్లి రమణమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. -
పునారస్ మామిడికి మంచి గిరాకీ.. వేసవి సీజన్ తర్వాత...
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం జిల్లా): పునారస్ మామిడికి ప్రస్తుతం గిరాకీ వచ్చింది. మామిడి వేసవి సీజన్ పూర్తయిన తరువాత వచ్చే మామిడికాయల రకం ఈ పునారస్.. గతంలో కొద్దిగా వచ్చే ఈ కాయలకు గిరాకీ ఉండడంతో ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఈ చెట్లను అధికంగా నాటారు. దీని కారణంగా ప్రస్తుతం ఈ సీజన్లో పునారస్ మామిడి కాయలు అధికంగా వచ్చాయి. ఉలవపాడు మార్కెట్ నుంచి ఈ కాయలు ప్రస్తుతం భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఉలవపాడు కేంద్రంగా వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఉన్న దళారులు రైతుల నుంచి కాయలను కొనుగోలు చేసి మార్కెట్లో తూకం వేసి బస్తాలు, ట్రేలలో లారీలు, మినీ ట్రక్కులు, ఆటోల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తారు. ఈ ఏడాది మార్కెట్లో దాదాపు 10 కేంద్రాల నుంచి కాయల ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళకు ఈ మామిడికాయలు తరలివెళ్తాయి. పచ్చళ్లకు అధికంగా ఈ కాయలను వినియోగిస్తారు. ఈ ఏడాది రేటు కూడా కాస్త అధికంగానే ఉంది. ఈ వేసవిలో మామిడి కాయలకు పండు ఈగ సోకి కాయల్లో పురుగులు రావడంతో రైతులు నష్టపోయారు. ఈ సమయంలో పునారస్ చెట్లు ఉన్న రైతులు ఈ ఏడాది రేటు అధికంగా ఉండడంతో ఊరట ఇచ్చినట్టయింది. పెరిగిన ఎగుమతులు గత నాలుగేళ్ల క్రితం నుంచి పోలిస్తే ఈ ఏడాది పునారస్ మామిడి కాయల ఎగుమతులు భారీగా పెరిగాయి. రైతులు సీజన్ కాని సమయంలో వస్తున్న కాయలు కావడంతో ఇటీవల కాలంలో ఎక్కువగా సాగు చేశారు. ఉలవపాడు ప్రాంతంలో దాదాపు 4000 ఎకరాలకు పైగా ఈ తోటలు ఉన్నాయి. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 వేక ఎకరాల్లో పునారస్ తోటలు ఉన్నట్లు సమాచారం. కానీ ప్రతి ఏడాదికి వీటి సాగు శాతం పెరుగుతుంది. ఈ ఏడాది గత నెల నుంచి రోజుకు సుమారు 50 నుంచి 80 టన్నుల కాయలు ఎగుమతులు చేస్తున్నారు. కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు ఈ ఏడాది కేజీ 40 నుంచి రూ.50 వరకు పునారస్ మామిడి రేటు పలుకుతుంది. గతంలో 25 నుంచి చిన్నగా పెరుగుతూ చివరి దశలో రూ.50కు చేరుకునేది. ఈ సారిమాత్రం రూ.40 నుంచి రూ.50 మధ్యనే ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ మామిడికాయలు చెన్నై, తిరువనంతపురం, కోయంబేడు, కోయంబత్తూరుకు తరలివెళుతున్నాయి. రోజుకు సుమారు 30 నుంచి 50 లక్షల మధ్య ఉలవపాడు మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది. కేరళ ఓనం పండుగకు ఉలవపాడు పునారస్... కేరళలో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వచ్చే నెల 8 వరకు జరిగే ఓనమ్ పండుగకు ఉలవపాడు పునారస్ కాయలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అక్కడ పెట్టే పచ్చడికి దీనిని ఉపయోగిస్తారు. ఈ సమయంలో అంటే సెప్టెంబరులో ఇంకా భారీగా రేట్లు పెరుగుతాయి. ఇక్కడ నుంచి ఓనమ్ పండుగకు ప్రత్యేకంగా గ్రేడ్ చేసిన కాయలను తరలిస్తారు. ఈ ఏడాది రేట్లు బాగున్నాయి గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రేట్లు బాగున్నాయి. కాయలు కూడా నాణ్యత బాగుంది. గతంలో కేజీ రూ.25 నుంచి రూ.35 లోపు ధర ఉండేది. ఈ ఏడాది మాత్రం రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. – ఆర్ కోటేశ్వరరావు, ఉలవపాడు అధికంగా దిగుబడులు ఈ ఏడాది కాయలు అధికంగా కాశాయి. అయినా రేటు తగ్గలేదు. రైతులు ఎక్కువ మంది పునారస్ మామిడి సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ ఏడాది దిగుబడి బాగా పెరిగింది. – వింజమూరి సురేష్ బాబు, రైతు ఉలవపాడు మంచి రేటుకే కొంటున్నాము మా ప్రాంతంలో ఈ కాయలకు డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసి లారీల్లో తీసుకుని వెళుతున్నాం. కాయకు మంచి రేటు ఇస్తున్నాము. – రఫీ, కొనుగోలుదారుడు, కోయంబత్తూరు -
వైఎస్సార్, బూచేపల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్
ప్రకాశం చీమకుర్తి పర్యటన అప్డేట్స్ ►ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకు మేలుచేసే ప్రాజెక్టు వెలిగొండ: సీఎం జగన్ ►వెలిగొండ మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తయ్యింది: సీఎం జగన్ ►మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్‌గా మారుస్తాం: సీఎం జగన్ ►పేదలు, రైతులు సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు మహానేత వైఎస్సార్: సీఎం జగన్ ►రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత మహానేత వైఎస్సార్‌కే దక్కుతుంది: సీఎం జగన్ ►ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు మహానేత వైఎస్సార్: సీఎం జగన్ ►ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేదలకు చదువు అందించారు వైఎస్సార్: సీఎం జగన్ ► దివంగత నేతలకు పూల నివాళి అర్పించి.. సభను ప్రారంభించిన సీఎం జగన్. ► చీమకుర్తి బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం జగన్.. నేతలో ఆప్యాయ పలకరింపు. ► కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్. ► మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్. ► కాసేపట్లో మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్దకు చేరుకోనున్న సీఎం జగన్. ► చీమకుర్తి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► ప్రకాశం జిల్లా చీమకుర్తి పర్యటన కోసం సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. --- ► విగ్రహాల ఆవిష్కరణ అనంతరం.. బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ► బుధవారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా.. చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీతోనే: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దూషించిన నోటితోనే పులకింతా? చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్‌తో మాట్లాడతానని బాలినేని తెలిపారు. గోరంట్ల మాధవ్ విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయాయని తెలిపారు. -
కేసినో వ్యవహారానికి నాకు సంబంధం లేదు: మాజీ మంత్రి బాలినేని
-
ఎల్లో మీడియా అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదు: ఆదిమూలపు సురేష్
-
Ongole: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు ఫుల్ డిమాండ్!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు మించి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం, తదితర కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. గతంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారు కాదు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల మొదటి వారంలో పాఠశాలలు తెరవగా, రెండు వారాలు గడవకముందే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రస్తుతం పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు క్లోజవడంతో వెనుదిరుగుతున్నారు. క్లిక్: మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు -
మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు
కనిగిరి పట్టణ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం హోదాతో వివిధ ప్రభుత్వ శాఖల సేవలు మరింత చేరువ కాగా.. మూడేళ్లుగా నగర పంచాయతీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరగడంతో తాజాగా నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఫలితంగా మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో అభివృద్ధి నిధుల లభ్యత పెరగనుంది. కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా) : కనకగిరి.. పేరు సార్ధకం చేసుకునేలా కనిగిరి అభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది. నియోజకవర్గ కేంద్రమైన కనిగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నిన్న రెవెన్యూ డివిజన్ సాధించగా.. తాజాగా కనిగిరిని నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రెవెన్యూ డివిజన్‌తో అభివృద్ధికి ఊపు: కనిగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారడంతో అనేక ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు ప్రజల చెంతకు చేరాయి.. చేరుతున్నాయి. సుమారు 4 నుంచి 5 కి.మీల దూరం వరకు విస్తరించి ఉన్న కనిగిరిలో కనుచూపు మేరలో భూముల ధరలు పెరిగాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మిగతా మండలాల ప్రజల రాకపోకలు సాగుతుండటంతో వ్యాపారాలు, పెరిగి ఆయా వర్గాల వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులకు కందుకూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కనిగిరిలోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో వ్యయ ప్రయాసలు తగ్గాయి. రెవెన్యూ, వైద్య, విద్య, పోలీస్, మండల పరిషత్ తదితర అంశాల సమస్యలను ఇక్కడే త్వరితగతిన పరిష్కారం అవుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నగర పంచాయతీ–నేడు గ్రేడ్ 2 మున్సిపాలిటీ కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ శాఖ నుంచి జీఓ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పట్టుబట్టి మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రాష్ట్రంలో కనిగిరి నగర పంచాయతీ ఒక్కటి మాత్రమే గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కనిగిరి పట్టణం అభివృద్ధిలో మరింత ముందడుగు వేయనుంది. ఈమేరకు మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో పాటు, ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలున్నాయి. మారనున్న కనిగిరి రూపు రేఖలు: గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో కనిగిరి రూపు రేఖలు పూర్తి స్థాయిలో మారనున్నాయి. చాలా కాలం పంచాయతీగా ఉన్న కనిగిరి.. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. అనంతరం కనిగిరి, శంఖవరం, కాశీపురం, మాచవరం పంచాయతీలను కలిపి కనిగిరి నగర పంచాయతీగా చేశారు. నగర పంచాయతీగా హోదా ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈసారి గ్రేడ్ 2 మున్సిపాలిటీ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. మూడేళ్లుగా మున్సిపాలిటీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరిగినట్లు నగర పంచాయతీ కౌన్సిల్ మున్సిపల్ శాఖకు వెల్లడించడంతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. పెరిగిన కౌన్సిల్ హోదా... ఇప్పటి వరకు నగర పంచాయతీ చైర్మన్..మున్సిపల్ చైర్మన్‌గా, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా హోదా పొందుతారు. ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న పోస్టులు పెరుగుతాయి. అమృత్ సరోవర్ వంటి భారీ నిధుల ప్రాజెక్టులు, ఆర్థిక సంఘ నిధులు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 25 వార్డులుగా మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. (క్లిక్: నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్) సీఎం సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి చేస్తా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా. బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో, సీఎం వద్దకు వెళ్లి కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకున్నా. మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, సీడీఎంఏ, సీఎస్ల సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా హోదా సాధించుకున్నా. పేదలకు మంచి ఆరోగ్యం, విద్య, సాగు, తాగునీరు అందించడమే నాధ్యేయం. – బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు కనిగిరి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారడంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ చేసిన కృషి ప్రశంసనీయం. ఎమ్మెల్యే ఆదేశానుసారం కనిగిరి పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పనిచేస్తా. చైర్మన్‌గా తాను, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులంతా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – అబ్దుల్ గఫార్, చైర్మన్, కనిగిరి మున్సిపాలిటీ -
విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్
ఒంగోలు: ‘విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్మోహన్రెడ్డి అయితే వెన్నుపోట్లకు పెట్టింది పేరు చంద్రబాబు’ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మ అంటూ జగన్మోహన్రెడ్డి పిలిచే పిలుపులోనే ఆప్యాయత, అనురాగాలు ఉట్టిపడతాయన్నారు. కానీ చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవంగా ఉండాలన్న కనీస జ్ఞానం కూడా లేని వ్యక్తని ధ్వజమెత్తారు. 2014లో డ్వాక్రా సంఘాల అప్పులు మొత్తం తీరుస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... గద్దెనెక్కాక రూ.14 వేల కోట్ల అప్పును తీర్చకుండా సంఘాలను రుణాల రొంపిలోకి నెట్టి డిఫాల్ట్ అయ్యేలా చేశాడని మండిపడ్డారు. కానీ సీఎం జగన్మోహన్రెడ్డి హామీ మేరకు రెండు విడతలుగా డ్వాక్రా సంఘాల రుణాలను తిరిగి వారికి చెల్లించడంతో పాటు ఏటా సున్నా వడ్డీ కూడా అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తూ వారందరినీ లక్షాధికారులను చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాజ్యోతిరావు ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఆయన చేస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. ఈ ఆశయాలే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 175కు 175 స్థానాలు కట్టబెడతాయన్నారు. రెండేళ్లు కరోనా వెంటాడినా రూ.లక్షల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేసి సీఎం జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారన్నారు. అందుకే జగన్‌ను చూస్తే నమ్మకం, చంద్రబాబును చూస్తే వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి ప్రజలు విచ్చేసి జగన్మహన్రెడ్డి పట్ల కనబరిచిన విశ్వాసం దేశచరిత్రలోనే ప్రత్యేక రికార్డు అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పోతుల సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడితే సామాజిక న్యాయానికి పేటెంట్ అని చెప్పుకుంటారని, కానీ ఆయన భావజాలమే ప్రజా వ్యతిరేకమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటించారన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామంటూ హెచ్చరించిన ఘటనలు, దళితులపై చేసిన వ్యాఖ్యలు, చివరకు అమరావతిలో 55వేల మంది అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కోర్టుల కేసులు వేయించిన చంద్రబాబుకు సామాజిక న్యాయంపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే, ప్రజల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పోతుల సునీతకు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చింతగుంట్ల సువర్ణ, పోతంశెట్టి వెంకటరత్నం తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. (క్లిక్: బాబుకు మైండే కాదు.. చెవులూ పోయాయి) -
కాసుల వర్షం కురిపిస్తోన్న ‘తెల్ల బంగారం’
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉప్పురైతుల దశ తిరిగింది. వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో ఉప్పుసాగు జోరుగా సాగుతోంది. ధరలు సైతం ఊహించని విధంగా పెరగడంతో తెల్ల బంగారం కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా ధర కేవలం రూ. 70 మాత్రమే ఉండేది. ప్రస్తుతం రూ. 300 పలుకుతోంది. యాబై ఏళ్లలో ఇంత ధర ఎప్పుడూ లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. సింగరాయకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల్లోని కొఠారుల్లో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. వర్షాకాలం మినహా మిగిలిన కాలాల్లో దాదాపు 9 నెలల పాటు ఉప్పు సాగు చేస్తారు. ప్రతి నెల సుమారు 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. సుమారు 7 వేలకు పైగా ఉప్పు రైతులు, 10 వేలకు పైగా కూలీలకు ఉపాధి పొందుతున్నారు. 50 ఏళ్లలో అత్యధికం ప్రస్తుతం ఉప్పు ధర నాణ్యతను బట్టి 75 కేజీల బస్తా రూ.300 వరకు పలుకుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.270 పలికింది. ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు ధరలు మరింత పెరిగాయి. ఈ ఏడాది తమిళనాడులో అధిక వర్షాలతో ఉప్పు ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో తమిళనాడు వ్యాపారులు రాష్ట్రానికి రావడంతో ఏప్రిల్‌లో ధరలు బాగా పెరిగాయి. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా రూ.75 లకు కూడా ధర రాని దుస్థితి. దీంతో చాలా మంది ఉప్పు రైతులు సాగుకు సెలవు ప్రకటిద్దామనుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంతో పాటు, తెలంగాణ, మహారాష్ట్ర ఉప్పు సరఫరా అవుతోంది. పెరిగిన కూలి ఉప్పు ధరలు ఆశాజనకంగా ఉండటంతో కూలీలకు కూలి సైతం పెరిగింది. ఇప్పటి వరకు కొఠారుల్లో మూడు గంటలు పనిచేస్తే పురుషులకు రూ.400 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, మహిళలకు రూ.300 ఇస్తుండగా రూ.350 పెరిగిందని రైతులు తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యాపారుల రాకతో.. ఈ ప్రాంతంలో వ్యాపారుల సిండికేట్ కారణంగా ఉప్పు రైతులకు ఆశించిన ధర చేతికి వచ్చేది కాదు. కానీ ఈ ఏడాది తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో ధరలు ఆశాజనంగా పెరిగాయని ఉప్పు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వ్యాపారులు నేరుగా రావటంతో ఇప్పటివరకు సిండికేట్‌తో వ్యాపారులు లాభపడుతుండగా ఇప్పుడు రైతులే ఆ లాభాలను పొందుతున్నారు. ఉప్పును కూడా ఆర్బీకేల కొనుగోలు చేస్తే మరింత లాభం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి 10 ఎకరాలను కౌలుకు తీసుకొని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉప్పు తయారీ బాగుంది. తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో మంచి ధరలు వస్తున్నాయి. – పురిణి శ్రీనివాసులరెడ్డి గతంలో ఎప్పుడూ ఈ ధర లేదు 50 ఏళ్లలో ఎన్నడూ ఈ ధర లేదు. గతంలో వ్యాపారుల సిండికేట్, వర్షాభావ పరిస్థితులతో గిట్టుబాటు ధరలు రాక తీవ్రంగా నష్టపోయేవాళ్లం. రెండేళ్లుగా ధరలు ఆశాజ నకంగా ఉండటంతో సాగు లాభదాయకంగా ఉంది. – కుర్రి నరసింహారావు -
గుట్కా దందా.. తమ్ముళ్ల పంథా
సాక్షి, ఒంగోలు: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చాటుమాటు పనులు అన్న చందంగా ఉంది తెలుగు తమ్ముళ్ల తీరు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు తెగబడిన టీడీపీ నాయకులు.. అధికారంలో లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, గుట్కా దందాకు తెరలేపారు. ఒంగోలు నగరానికి చెందిన టీడీపీ నాయకుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గంజాయి, గుట్కా వ్యాపారం చేస్తూ మాఫియాగా మారాడు. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన శ్రీమన్నారాయణ తల్లి మస్తానమ్మ ప్రస్తుతం ఒంగోలు 46వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆయన సోదరుడు కూడా టీడీపీలో క్రియాశీలకమైన పదవిలో ఉన్నాడు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఏళ్ల తరబడి గంజాయి, గుట్కాల వ్యాపారం చేస్తూ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా గంజాయి, గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు శ్రీమన్నారాయణ అత్యంత సన్నిహితుడు. దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గంజాయి, గుట్కా వ్యాపారం జోరుగా సాగించాడు. మాజీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు కూడా అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చాడు. యువతకు ఉపాధి కోసం టీడీపీ ధర్నాలో ప్లకార్డు పట్టుకొని నిరసన తెలుపుతున్న శ్రీమన్నారాయణ (ఫైల్) గుడ్లూరు పోలీసులకు గంజాయితో పట్టుబడి గుడ్లూరు పోలీసులకు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గత ఏడాది గంజాయితో పట్టుబడ్డాడు. 2021 ఏప్రిల్ 25వ తేదీన గుడ్లూరు పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుంచి కారులో గంజాయితో వస్తూ దీనిని గమనించిన గుట్లాపల్లి శ్రీమన్నాయణ బృందం కారును తిరిగి కావలి వైపునకు తిప్పడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అప్పట్లో వారి వద్ద కారులో 10 కేజీల గంజాయి దొరికింది. గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీమన్నారాయణతో పాటు తెట్టుకు చెందిన తిరుమలరాజు వెంకటేశ్వరరాజు, ఏకొల్లు కృష్ణార్జున రావు, బెంగళూరుకు చెందిన శంకర్ మోహన్, ప్రధాన నిందితుడు శ్రీమన్నారాయణ కారు డ్రైవర్ రమేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు) ) గుట్కా ప్యాకెట్లతో నిందితులు శ్రీమన్నారాయణ, కారు డ్రైవర్ ఒంగోలులో గుట్కాల నిల్వలతో... ఒంగోలు నగరంలో కారులో గుట్కాలు తరలిస్తున్నట్లు ఎస్పీ మలికాగర్గ్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రారావు తన సిబ్బందితో దాడి చేసి కారును పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని కారు నడుపుతున్న ముల్లూరి వెంకట నాగ శివ చరణ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 27,375 గుట్కాప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ అక్రమ వ్యాపారం బయటపడింది. ఒంగోలు నగరంలోని బృందావన్ నగర్ 11 వ లైన్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్ల గుట్టు రట్టయింది. ఆ ఇంట్లో 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ ఇల్లు 46వ డివిజన్ టీడీపీకి చెందిన కార్పొరేటర్ గుట్లాపల్లి మస్తానమ్మ, కుమారుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణది అని తేలింది. మొత్తం గుట్కా ప్యాకెట్ల విలువ రూ.3,43,224 గా ఎస్ఈబీ పోలీసులు తేల్చారు. ఇలా గంజాయి, గుట్కా అక్రమ వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. -
బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని..
ఒంగోలు(ప్రకాశం జిల్లా): బెట్టింగ్ భూతం ఓ యువకుడ్ని నిండా ముంచింది. అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోవడంతో పాటు చివరకు నేరాల బాట పట్టి కటకటాల పాలైన ఉదంతాన్ని జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) వి.శ్రీధరరావు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీ మలికాగర్గ్ క్రైమ్స్ అదనపు ఎస్పీగా ప్రత్యేకంగా ఒక పోస్టును కేటాయించడంతోపాటు చాలెంజింగ్‌గా మారిన పలు కేసులను అప్పగించారు. ఈ నేపథ్యంలో వాటిపై ప్రత్యేక నిఘా కొనసాగించగా గత నెలలో జరిగిన చోరీ కేసుతో ఓ నిందితుడి బండారం బయటపడింది. చదవండి: ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా! ఆ కేసుతోపాటు గతంలో అదే తరహాలో చోటుచేసుకున్న కేసులను సరిపోల్చగా ఒంగోలు పట్టణ పరిధిలోనే 11 కేసుల్లో నిందితునిగా వెల్లడైంది. దీంతో పోలీసులు నిఘా పెట్టి గురువారం నిందితుడు రాయవరపు శ్రీనివాసరావును స్థానిక కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు సమీపంలో అరెస్టు చేశారు. అతనిని విచారించగా 2021 మార్చి నుంచి 2022 జూన్ వరకు మొత్తం 11 చోరీ కేసుల్లో అతని పాత్ర రూఢీ అయింది. ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో 2, ఒంగోలు వన్‌టౌన్ పరిధిలో 9 వెరసి మొత్తం 11 దొంగతనం కేసులకుగాను 5 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక మంగళసూత్రం, ఒక బంగారపు కాసు, రూ.500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొంపముంచిన అత్యాశ పామూరు మండలం పుట్టనాయుడుపల్లికి చెందిన రాయవరపు శ్రీనివాసరావు ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. ఇతని సోదరి అనకాపల్లిలో, తల్లిదండ్రులు పూణేలో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు అంటూ పూణే వెళ్లిన సమయంలో అతనికి బెట్టింగ్ భూతం ఆవహించింది. ఆన్లైన్లో వన్ ఎక్స్‌బెట్, బెట్ వే, వూల్ఫ్ 777, 22 బెట్, ఐపీఎల్ విన్ అనే యాప్‌లలో బెట్టింగ్ ఆడి చేతిలో ఉన్న సొత్తును పోగొట్టుకున్నాడు. చివరకు తల్లి ద్వారా తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకుని ఆ మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న చోటే సొమ్ము తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఉన్న ఇంటిని సైతం రూ.20 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బును సైతం బెట్టింగ్‌లో అర్పించాడు. అనకాపల్లిలో ఉంటున్న అక్క వద్దకు వెళ్లి వారి లారీలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.20 లక్షలను కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఒక వైపు సొంత ఇల్లు కోల్పోయి, తోబుట్టువుకు చెందిన సొమ్మును సైతం బెట్టింగ్‌లో సమర్పించుకుని, తల్లిదండ్రులకు ఇబ్బందులు తెచ్చి పెట్టి చివరకు నేరాల బాట పట్టాడు. ఒంగోలు లాడ్జిలో మకాం వేసి రాత్రిపూట షాపులను ఎంచుకుని చోరీలు చేయడం మొదలెట్టాడు. దాదాపు 16 నెలలపాటు చోరీలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. చోరీ చేసిన సొత్తును సైతం బెట్టింగ్‌లోనే పోగొట్టినట్లు నిర్ధారించుకున్నామని క్రైమ్స్ అదనపు ఎస్పీ వి.శ్రీధరరావు వివరించారు. కేసులను ఛేదించేందుకు కృషి చేసిన క్రైమ్స్ అదనపు ఎస్పీతోపాటు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఎం.దేవకుమార్, ఎం.సైదుబాబు, సిబ్బందిని ఎస్పీ మలికాగర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. -
ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్ అప్పారావు
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు పేర్కొన్నారు. బుధవారం అద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక పెండ్యాల ప్లాజాలో విలేకర్లతో ముచ్చటించారు. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ ఉండేదన్నారు. ‘శుభవేళ’ చిత్రం ద్వారా వెండి తెరకు పరిశ్రమకు పరిచయమైనట్లు తెలిపారు. షకలక శంకర్ ప్రోత్సాహంతో ఓ తెలుగు చానల్ కామెడీ షోలో పాత్రలు పోషించానని, ప్రాధాన్యత లేని పాత్రలు రావడంతో 6 నెలల క్రితమే తప్పుకున్నాని చెప్పారు. చదవండి: బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్ విశాఖ జిల్లాలోని అక్కాయపాలెం తన స్వస్థలమని, పట్టుదలతోపాటు భార్య సహకారంతో ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన భార్య 18 ఏళ్లు టీచర్‌గా పనిచేస్తూనే ప్రోత్సహించిందన్నారు. ఇప్పటి వరకు 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించినట్లు వివరించారు. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు దక్కాయని తెలిపారు. తనకు రాని ఇంగ్లిష్ భాషతోనే అందరినీ ఆకట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సినీ రంగాన్ని ఎంచుకునే యువకులు ఏ శాఖలో ప్రతిభ ఉందో గ్రహించి శిక్షణ పొందితే విజయం సాధించవచ్చని సలహా ఇచ్చారు. ప్రతిభ ఉన్నవారిని ఎవరూ అడ్డుకోలేరని హాస్యన టుడు అప్పారావు స్పష్టం చేశారు. -
మాజీ మంత్రి బాలినేని మచ్చలేని నాయకుడు: శ్రీధర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి మచ్చలేని నాయకుడిగా చలామణి అవుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీకి పర్యాయ పదం బాలినేని అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టపాలు చేస్తే మంత్రి పదవిని సైతం త్యజించి, వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారని వివరించారు. నైతిక విలువలతో కూడిన రాజకీయం చేశారని, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు అనైతిక ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా సొంత పార్టీ నేతులు ఎవరూ ప్రయత్నించకూడదని హితవు పలికారు. మాజీమంత్రి బాలినేని ఎదుర్కొంటున్న సమస్యలను తాను కూడా చవిచూస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు) వైఎస్సార్సీపీ పెట్టక మునుపు నుంచి పార్టీ కోసం కష్టం చేసిన వ్యక్తుల్లో తాను ఒక్కడేనని వివరించారు. మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలనే తపన ఉండాలని, కానీ కొంత మంది ముఖ్య నేతలు రూరల్ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని నేతలు తనను బలహీన పర్చాలని చూస్తున్నారని వెల్లడించారు. రూరల్ ప్రజానీకం, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ బలహీన పర్చలేరని స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్‌ను తాను ఒకప్పటి రాజకీయ సహచరుడిగానే చూస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ప్రత్యర్థిగా, రాజకీయ పోటీదారుడిగా చూడలేదని వివరించారు. చదవండి: (మా నాయకుడన్న ఆ మాటకు మేమంతా కట్టుబడి ఉన్నాం: కొడాలి నాని) -
నా కుటుంబంపై కుట్ర జరుగుతోంది: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: తనకు సంబంధం లేని విషయాలపై కొందరు గొడవ చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీని వెనుక టీడీ జనార్ధన్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న చెన్నైలో పట్టుబడ్డ డబ్బుపై మరోసారి దుష్ప్రచారం చేశారన్నారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా వారు పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే పదవి నుంచి తప్పకుంటానని బాలినేని సవాల్ విసిరారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఓపెన్ సవాల్ -
భక్తుల కొంగుబంగారం.. ఇష్ట కామేశ్వరిదేవి
దట్టమైన అభయారణ్యంలో బండరాళ్ల మధ్య కుదుపులతో కూడిన ప్రయాణం. అనుక్షణం భయం, ఉత్కంఠ, ఆహ్లాదం, ఆనందం ఇవన్నీ కలగలపి చేసే యాత్రే ఇష్టకామేశ్వరీదేవి దర్శనయాత్ర. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె బీట్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన ఇష్టకామేశ్వరి దేవతను దర్శించుకోవాలంటే కొంచెం సాహసమే.. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): భారతదేశం మొత్తం మీద ఆ దేవి రూపాన్ని ఆ ఒక్క క్షేత్రంలో మాత్రమే దర్శించుకోగలం. అందుకే ఆ దేవి దర్శనం ఒక సాహసయాత్ర. దట్టమైన అభయారణ్యంలోని ఓ చిన్న గుహలో వెలసిన జగజ్జనని దర్శనంతో ఆ తల్లి మన ముందు సజీవంగా నిలిచిన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం కాపాలికులు, సిద్ధులు మాత్రమే సేవించిన మహామహన్విత ఇష్టకామేశ్వరిదేవి నేడు సామాన్య భక్తులు కూడా దర్శించుకోగలుగుతున్నారు. చెంచు గిరిజనుల నివాసాల మధ్య బండరాళ్లను పేర్చి కట్టిన చిన్న మండపానికి ముందు రేకుల షెడ్డుతో సాదాసీదాగా ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం. జగద్గురువులు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతో మంది సిద్ధులు అమ్మవారిని దర్శించుకుని అక్కడే సాధన చేశారని పురాణాలు చెపుతున్నాయి. ప్రసిద్ధ శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొద్దిమందికి మాత్రమే తెలిసిన మహాన్విత కేత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం కూడా ఒకటని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఎంత గొప్ప కోరికైనా ఈ అమ్మవారిని కోరుకుంటే తీరుతుందని పురాణాల్లో నానుడి. ఆకట్టుకునే అమ్మవారి స్వరూపం చతుర్భుజాలతో, రెండు చేతులలో తామర మొగ్గలు, మరో చేతిలో శివలింగం, మరో చేతితో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లుగా ఒక యోగినిలా అర్ధనిమీలిత నేత్రాలతో జ్ఞానముద్రలో ఉన్నట్లు ఎంతో కళాత్మకంగా కనబడుతుంది ఇష్టకామేశ్వరీ అమ్మవారు. భూగర్భంలోని ఓ చిన్న దేవాలయంలో కొలువుతీరి ఉంటుంది ఇష్టకామేశ్వదేవి. కిటికీ మాదిరిగా ఉండే చిన్న ముఖద్వారం ద్వారా మోకాళ్ల మీదుగా ఒక్కరొక్కరుగా లోనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి దర్శనానికి ముందు మార్గమధ్యంలో వెలసి వినాయకుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగళిని నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, బ్రమరాంభాదేవి వెలసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలి«శారని స్థల పురాణాలు చెపుతున్నాయి. మానవకాంతను పోలిన అమ్మవారి నుదురు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి చేత స్వయంగా బొట్టు పెట్టించటం ఇక్కడ అనవాయితీ. అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారి నుదురు రాతి విగ్రహం మాదిరిగా కాకుండా ఒక మానవ కాంత నుదుటిని తాకినట్లుగా మెత్తగా చర్మాన్ని తాకినట్లుగా ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తులు ధర్మబద్ధంగా కోరే ఏ కోరికైనా అమ్మవారు తీరుస్తారని ప్రతీతి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు ఈదన్న పేర్కొంటున్నారు. అమ్మవారికి కొందరు భక్తులు చీర, సారెలను బహూకరిస్తారని అర్చకులు పేర్కొంటున్నారు. సాహసోపేతమైన దర్శనయాత్ర.. నల్లమల అభయారణ్యంలో వెలసిన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శంచుకోవాలంటే కాస్తంత సాహసం చేయాల్సిందే. ఈ యాత్ర యావత్తూ వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే టైగర్ రిజర్వు అటవీ ప్రాంతం కావటంతో అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కొంతకాలంగా ఈ యాత్ర అటవీశాఖ అనుమతులతోనే సాగుతుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న శిఖరం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. శిఖరం వద్ద అటవీశాఖ అధికారులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి అలయానికి చేరుకోవటానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. 5 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లే ప్రతి వ్యక్తికి రూ.1000 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక్కో వాహనంలో కేవలం 8 మంది మాత్రమే వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. అలా మొత్తంగా రోజుకు 15 జీపులు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. టికెట్లు తీసుకున్న అరగంట నుండే వాహనాలు ప్రారంభమవుతాయి. ఇలా కష్టసాధ్యమైన యాత్రను చేసే ప్రతి ఒక్కరూ తాము కోరిన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అవి తీరగానే తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. -
పెరటి కోళ్లతో జీవనోపాధి.. 10 వేల యూనిట్లు టార్గెట్
ఒకప్పుడు పల్లెల్లోనే నాటు కోళ్లు సందడి చేసేవి. కోడి కూతతోనే గ్రామాల్లో ప్రజలు మేల్కొనేవారు. ప్రతీ ఇంట్లో 10 నుంచి 15 కోళ్లు ఉండేవి. నాటు కోడి గుడ్లు, మాంసంతో వారి జీవనోపాధికి చేదోడుగా నిలిచేవి. ప్రజలకు ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా దన్నుగా నిలిచిన వీటి పెంపకం క్రమంగా తగ్గుతూ వచ్చింది. పల్లెలో పట్టణ వాతావరణం వ్యాపించడంతో వీటి స్థానంలో బ్రాయిలర్ కోళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఒకవైపు నాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పెరటి కోళ్ల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా జిల్లాలో పదివేల యూనిట్లు అందజేసే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. చీమకుర్తి(ప్రకాశం జిల్లా): డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లో ఆసక్తి చూపే మహిళలకు రూ.4800 విలువ చేసే పెరటి కోళ్ల యూనిట్‌ను వడ్డీ లేని రుణం కింద అందించనుంది. ఒక్కో యూనిట్ కింద 9 కోడి పెట్టలు, 3 కోడిపుంజులు, వాటి పెంపకానికి అవసరమైన 30 కేజీల దాణాను మొత్తం కలిపి కూడా రూ.4800కే అందిస్తోంది. 9 కోడిపెట్టలు వరుసగా 100 గుడ్లు వరకు పెడుతుంది. రెండేళ్ల తర్వాత ఒక్కో కోడి కనీసం 2 కేజీల మాంసం అందిస్తుంది. ఈ విధంగా 12 కోళ్ల ద్వారా 24 కేజీల మాంసం వస్తుంది. నాటుకోడి కేజీ మాంసం ధర రూ.400 పలుకుతుందని అధికారుల అంచనా. ఇలా 24 కేజీల నుంచి రూ.9,600 ఆదాయం వస్తుంది. అలాగే కోడిగుడ్లు, మాంసంతో కలిపి రెండేళ్లలో కనీసం రూ.12 వేల ఆదాయం లభిస్తుంది. వచ్చిన ఆదాయంలో వైఎస్సార్ క్రాంతి పథం గ్రూపులకు 24 లేక 36 వాయిదాలలో వడ్డీ లేకుండా రుణం కింద ఇచ్చిన రూ.4800ను నెల నెలా చెల్లించగా, ఇంకా దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు లాభసాటిగా ఉంటుంది. అనంతపురం నుంచి దిగుమతి డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా అందించే నాటుకోళ్లను అనంతపురంలోనున్న ఎస్సెల్ బ్రీడ్ కంపెనీ వారి ద్వారా దిగుమతి చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి కనీసం 10 వేల యూనిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో పెరటి కోళ్ల పెంపకంతో పాటు పొట్టేళ్లు, మేకలను కూడా ఒక్కో కుటుంబానికి ఒక యూనిట్‌ను అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పీడీ తెలిపారు. జీవనోపాధికి ఇప్పటికే పలు పథకాలు జిల్లాలో డీఆర్డీఏ సంస్థ ద్వారా వైఎస్సార్ క్రాంతి పథకం నుంచి గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళల జీవనోపాధి కోసం ఇప్పటికే పలు పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తూ వారి జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దానికోసం డీఆర్డీఏలో ఉన్న సుమారు రూ.200 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. దానిలో భాగంగా స్త్రీనిధి, ఉన్నతి (ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్), సీఐఎప్ (కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్), హెచ్‌డీఐఎఫ్ (హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) పథకాలను అందిస్తోంది. స్త్రీనిధితో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయల వరకు జీవనోపాధి పెంపునకు అందిస్తుంది. వాటి ద్వారా గొర్రెలు, గేదెలను పెంచుకోవచ్చు. ఉన్నతి పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే సబ్‌ప్లాన్ పథకం నుంచి అందిస్తారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఒక్కో వ్యక్తికి రూ.50 వేల వరకు రుణ సదుపాయం వడ్డీలేకుండానే అందిస్తారు. సీఐఎఫ్ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలను ఇస్తారు. అయితే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కేటాయించాల్సి ఉంటుంది. హెచ్‌డీఐఎఫ్ ద్వారా గరిష్టంగా రూ.50 వేలను హెల్త్ యాక్టివిటీ కింద ముందుగానే ఎంపిక చేసిన 15 మండలాల్లో మాత్రమే అందిస్తున్నారు. వాటితో పాటు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ తోడు వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో 10 వేల యూనిట్ల వరకు పంపిణీకి సిద్ధం జిల్లాలోని 38 మండలాల్లో రానున్న ఏడాది లోపు 10 వేల యూనిట్లను పంపిణీ చేసేందుకు వైఎస్సార్ క్రాంతిపథం సిద్ధమవుతోంది. మొదటి విడతగా 4 వేల యూనిట్లను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కనిగిరి మండలాల్లో దాదాపు 600 యూనిట్లకు పైగా పంపిణీ చేశారు. 10 వేల యూనిట్ల పెరటి కోళ్లు అందించేందుకు చర్యలు జిల్లాలో పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించిన 10 వేల యూనిట్లను డ్వాక్రా మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో యూనిట్ ద్వారా 9 కోడిపెట్టలు, 3 కోడిపుంజులు, 30 కేజీల దాణాలను అందిస్తున్నాం. ఈ సంవత్సరం 4 వేల యూనిట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 6 మండలాల్లో అందించాం. త్వరలో పొట్టేళ్లు, మేకలను కూడా అందించేందుకు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాం. – బీ.బాబూరావు, పీడీ, డీఆర్డీఏ, ఒంగోలు మా కుటుంబంలోనే 4 యూనిట్లను తీసుకున్నాం జగనన్న పేద మహిళల ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకొచ్చిన పెరటి కోళ్ల పెంపకం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. మా కుటుంబంలోనే నాతో పాటు నా కుమార్తె, కోడలు వేరువేరుగా 4 యూనిట్లను తీసుకున్నాం. మా ఎస్సీ కాలనీలో మొత్తం 30 యూనిట్లను ఇచ్చారు. పెరటి కోళ్ల వలన గుడ్లు, మాంసం ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంలో జీవనోపాధి పెరగటమే కాకుండా ఖర్చులకు ఉపయోగపడుతుంది. – జంగాల లలిత కుమారి, ఆశాజ్యోతి గ్రూపు, మద్దులూరు, సంతనూతలపాడు -
విధి వక్రీకరించి.. పెళ్లయిన మూడు నెలలకే..
ఒంగోలు: విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైన సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట గ్రామ సమీపంలోని కుమ్మరికుంట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రాజేష్‌రెడ్డి అనే యువకుడు అదృశ్యమైనట్లు అతని తండ్రి రమణారెడ్డి పుంగనూరు పోలీసులకు ఈ నెల 14వ తేదీ ఫిర్యాదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు విచారించగా ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పుంగనూరు పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్, కానిస్టేబుల్ ఎల్లప్ప, రమణారెడ్డి, బంధువులు కలిసి పవన్‌కుమార్ అనే కారు డ్రైవర్‌ను తీసుకుని కారులో ఖమ్మం చేరుకున్నారు. అక్కడ రాజేష్‌రెడ్డిని గుర్తించి తీసుకుని తిరిగి పుంగనూరు పోలీసుస్టేషన్‌కు వెళ్తుండగా డ్రైవర్ పవన్‌కుమార్ నిద్రమత్తు కారణంగా కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు రెండోవైపు నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న హర్షిత (35) అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన ఆరుగురైన రాజేష్‌రెడ్డి, రమణారెడ్డి, మోహన్‌రెడ్డి, ఎల్లప్ప, జ్ఞానప్రకాష్, డ్రైవర్ పవన్‌కుమార్ గాయపడటంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరుగుమల్లి ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన హర్షితకు మార్చిలో వివాహం జరగ్గా, మూడు నెలలకే ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. -
రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్‌లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ మొత్తంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం రూ.2.14 కోట్ల విలువైన 42,810 బాటిళ్లను ధ్వంసం చేశారు. (క్లిక్: 88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..) -
సర్కారు వారి సత్తా..
సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభ పది పరీక్షల్లో నిరూపితమైంది. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన సంస్కరణల ఫలితాలకు కరోనా అడ్డుపడింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు పరీక్షలు లేకుండానే పోయాయి. ఇక ఆ రెండేళ్లు చదువులు సైతం ఆన్‌లైన్‌కే పరిమితమైంది. తాజాగా కరోనా పరిస్థితులను అధిగమించి.. నూతన సంస్కరణలతో నిర్వహించిన పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు లభించాయి. ఇది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమర్థతకు అద్దం పడుతోంది. కార్పొరేట్ ఫలితాలకు మించి సాధించారు. ప్రకాశం (పీసీపల్లి) : 588/600, 570/600, 569/600.. ఇది పదో తరగతి పరీక్షల్లో మార్కులు. ఈ ఫలితాలు సాధించింది సర్కార్ పాఠశాలల విద్యార్థులు. జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి çమండలం 97.67 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో 10 ప్రభుత్వ పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మంది విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించి సత్తా చాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించి పేద తల్లిదండ్రుల కళ్లలో సంతోషాన్ని నింపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 77.77 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. మొత్తం 826 హైస్కూళ్లు ఉండగా 41,341 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందులో 41,061 మంది పరీక్షలకు హాజరయ్యారు. 32,151 మంది ఉత్తీర్ణత సాధించారు. కనిగిరి నియోజకవర్గంలో 52 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 45 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 6 కేజీబీవీ పాఠశాలలు, 1 మోడల్ స్కూల్ ఉన్నాయి. ఇందులో హెచ్‌ఎంపాడులో 4 పాఠశాలలు, కనిగిరిలో 3 పాఠశాలలు, పీసీపల్లిలో 3 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఉత్తమ ఫలితాలు ఇలా.. ప్రత్యేక తరగతులు, ప్రత్యేక ప్రణాళికలు. పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక తరగతులు, పకడ్బందీ ప్రణాళికలతో ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించింది. ప్రతి రోజూ సాయంత్రం స్టడీ అవర్స్. వారాంతంలో ఆ వారంలో పూర్తయిన సిలబస్‌పై పరీక్షలు. ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకబడ్డారో గుర్తించి దానిపై ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే సకాలంలో సిలబస్‌ను పూర్తి చేశారు. పలు మార్లు రివిజన్ చేశారు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్యార్థులకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేశారు. దీంతో నూటికి నూరు శాతం ఫలితాలతోపాటు మంచి మార్కులొచ్చాయి. పథకాలతో అండగా.. ► అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, నాడు–నేడు, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో సీఎం జగన్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ► పిల్లలను బడికి పంపుతున్న తల్లుల ఖాతాల్లో ఏటా జనవరిలో క్రమం తప్పకుండా అమ్మ ఒడి నగదు రూ.15 వేలు జమ చేస్తున్నారు. ► సరైన సౌకర్యాలు లేక పూర్తిగా శిథిలమైపోయిన పాఠశాలలను నాడు–నేడు పేరుతో మరమ్మతులు చేయించి అదనపు సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ► ఒక్క తెలుగు మీడియంలోనే విద్యనభ్యసిస్తే భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదువుకునేందుకు అడ్డంకి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా ఇంగ్లిషు మీడియం ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులకు ముందుగా ఇంగ్లిషు మీడియంలో శిక్షణనిచ్చింది. ప్రత్యేక బస్సు.. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనిగిరి ఆర్టీసీ డిపో అధికారులు సీఎస్‌పురం మండలంలో ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. సీఎస్‌పురం నుంచి ఏకునాపురానికి రెండు హైస్కూళ్ల విద్యార్థులను తీసుకువెళ్తుంది. చెర్లోపల్లి, అరివేముల, జంగంవారి పల్లి, చింతలపాలెం, ముండ్లపాడు, ఏకునాపురం తదితర గ్రామాల్లో చదువుతున్న 70 నుంచి 80 విద్యార్థులను స్కూలుకు సకాలంలో తీసుకువెళ్తుంది. ప్రత్యేక తరగతులు నిర్వహించాం కరోనాతో విద్యకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. పదో తరగతిలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని రాత్రి ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులతో నిర్వహించాం. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా స్టడీ అవర్స్ నిర్వహించడం వల్లే ఇంతటి మెరుగైన ఫలితాలు సాధించాం. – సుజాత, కేజీబీవీ హెచ్ఎం, పీసీపల్లి నూరుశాతం ఫలితాలు సాధించాం పాఠశాలలో చదువుతున్న 64 మంది పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. అమ్మ ఒడి పథకంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. 99 శాతం విద్యార్థుల బడికి హాజరవుతున్నారు. 35 మంది బాల బాలికలు 500 పైన మార్కులు సాధించారు. – జీవీ సురేష్‌బాబు, హెచ్ఎం, హెచ్‌ఎంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు ఉపాధ్యాయుల బోధన, ఇచ్చిన సలహాలు సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. ఇంగ్లిషు మీడియంలో కష్టపడి చదివి 588 మార్కులు సాధించాను. అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక పథకాలు బాగా ఆదుకున్నాయి. మంచి మార్కులు వచ్చినందుకు మా అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. – గంటా నీతీష్రెడ్డి, హనుమంతునిపాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ విజయం .. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పించడం వల్ల మేము బాగా చదువుకునేందుకు వీలైంది. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చదివించారు. వారి సహకారంతోనే 576 మార్కులు సాధించాను. – కే పద్మ, శ్రీరంగా పురం, మోడల్ స్కూల్ కనిగిరి బిడ్డల చదువుకు ఆటంకం లేకుండా చేశారు.. నాకు ఇద్దరు బిడ్డలు. వీరిని చదివించాలంటే మా ఆర్థిక స్థోమత సరిపోక పొలం పనులకు తీసుకెళ్లే దాన్ని. జగన్ సీఎం అయ్యాక మాకు రైతు భరోసా, నా బిడ్డలను చదువుకోవడానికి అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద, విద్యాకానుక అందిస్తూ నా బిడ్డల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు. – అన్నెబోయిన పద్మ,ఏకునాంపురం, అశ్విని తల్లి బస్సు సౌకర్యం కల్పించారు మా గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు దాదాపు 15 కి.మీలు ఉండేది. గతంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం ఉండేది కాదు. దీంతో వారంలో మూడు రోజులు గైర్హాజరయ్యేదాన్ని. ఇప్పుడు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ప్రతి రోజు బడికి వెళ్లాను. పదో తరగతిలో 554 సాధించాను. – అన్నెబోయిన అశ్విని, ఏకునాంపురం, సీఎస్‌పురం మండలం ప్రైవేటు స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరా.. గతంలో నేను ప్రైవేటు స్కూల్లో చదువుకున్నాను. తరువాత ప్రభుత్వ పాఠశాలలో చేరాను. మా బడిలో వసతులు బాగున్నాయి. బాగా చదువు చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడి చదివి 554 మార్కులు తెచ్చుకున్నాను. – మాధవిరెడ్డి, పీసీపల్లి ప్రభుత్వ పాఠశాల -
ప్రకాశం జిల్లాలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు
-
మంత్రి జోగి రమేష్ కారుకు తప్పిన ప్రమాదం
ఒంగోలు(ప్రకాశం జిల్లా): మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం ఉదయం చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై పనుల నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. చదవండి: చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు డివైడర్‌పై ఏర్పాటు చేసిన కోన్లు హోరు గాలికి ఎగిరి రోడ్డుకు అడ్డంగా పడటంతో మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో పాటు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాయి. మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు కూడా అదుపు తప్పినప్పటికీ.. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే మరో కారులో ఎక్కి ఆయన వెళ్లిపోయారు. హైవే మొబైల్ సిబ్బంది, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పక్కకు తొలగించారు. -
అమెరికాలో ప్రమాదం.. ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు
సాక్షి, ప్రకాశం జిల్లా: అమెరికాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మృతి చెందింది. సుప్రజ కుమారుడు అఖిల్ స్వల్పగాయాల బారిన పడ్డాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున మూడున్నర గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద ఘటనతో మక్కేనవారిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
లోకం తెలియని చిన్నారులు.. రోజూ నరకమే.. అందుకే వచ్చేశాం..
సాక్షి, అమరావతి బ్యూరో: లోకం తెలియని చిన్నారులు వాళ్లు. తాగుబోతు నాన్న పెట్టే బాధలు భరించలేకపోయారు. రోజూ తాగి వచ్చి అమ్మను, తమను కొట్టడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంకా అక్కడ ఉంటే తమకు రోజూ నరకమేనన్న భావనకొచ్చారు. ఎలాగోలా అక్కడ నుంచి బయట పడాలనుకున్నారు. ఏదో రైలెక్కి విజయవాడ వచ్చేశారు. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై దీనంగా ఉన్న వీరిని క్లీనింగ్ సిబ్బంది చూసి చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు. చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వేంకటేశ్వరస్వామి గుడి ప్రాంతానికి చెందిన వీరు తమ పేర్లు మస్తానీ (9), మౌలాలీ (7) గా చెబుతున్నారు. తండ్రి ఎల్లప్ప కూలింగ్ నీళ్లు అమ్మే పని చేస్తుంటాడని, తల్లి శ్యామల కుర్చీలకు వైర్లు అల్లుతుందని అంటున్నారు. ‘నాన్న ఇంట్లో డబ్బులివ్వడు. ఇవ్వకపోగా రోజూ మందు (మద్యం) తాగడానికి అమ్మను డబ్బుల కోసం సతాయిస్తుంటాడు. ఇవ్వకపోతే కొడతాడు. ఇచ్చాక తాగి వచ్చాక అమ్మను, మమ్మల్ని కొడుతూ ఉంటాడు. అందుకే తమ్ముడు, నేను, ఇల్లు వదిలి నాన్నకు దూరంగా వచ్చేశాం. ఇక మార్కాపురం నాన్న దగ్గరకు వెళ్లం.’ అని మస్తానీ చెబుతోంది. పోలీసులకు సమాచారం ఇచ్చాం ఈ చిన్నారులు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్లో ఉండగా అక్కడ క్లీనింగ్ సిబ్బంది మాకు అప్పగించారు. వెంటనే మైక్‌లో అనౌన్స్మెంట్ చేయించాం. వారి కోసం ఎవరూ రాలేదు. తదుపరి సంరక్షణ కోసం జీఆర్పీ స్టేషన్లో హాజరు పరిచాం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో బాలుడిని విజయవాడ ఎస్కేసీవీ చి్రల్డన్ ట్రస్టు వసతి గృహంలోను, బాలికను ప్రజ్వల బాలికల వసతి గృహంలోనూ తాత్కాలికంగా ఉంచాం. పిల్లలు చెప్పిన వివరాలతో ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాం. – కళ్లేపల్లి శ్రీకాంత్, కో–ఆర్డినేటర్, రైల్వే చైల్డ్‌లైన్, విజయవాడ -
టీడీపీలో అంతర్గత పోరు.. మహానాడు సాక్షిగా బీసీ నేతకు అవమానం
టీడీపీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంది. ఆ పార్టీ మహానాడు సాక్షిగా ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. నిన్నటి వరకూ ఫ్లెక్సీల వివాదం నడిస్తే.. నేడు నగరంలోని పార్టీ కార్యాలయాల అంశంలోనూ వర్గ విభేదాలు వెలుగు చూస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన జిల్లా అధ్యక్షుడి కార్యాలయాన్ని మహానాడుకు వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు కన్నెత్తి చూడకపోవడంతో వెలవెలబోతోంది. గుంటూరు రోడ్డులోని దామచర్ల కార్యాలయం మాత్రం ఎప్పుడూ నాయకులు, ముఖ్య నేతలతో కళకళలాడుతోంది. ఇదేమి సామాజిక న్యాయం అంటూ సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీకి మహానాడు అనేది ఒక పండుగలాంటిది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడ జరుగుతోంది. దాదాపు రెండు వారాలుగా పార్టీ ముఖ్య నాయకుల హడావిడి ఎక్కువగా ఉంది. అయితే ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ హడావిడి ఇసుమంతైనా కనపడలేదు. దీంతో భాగ్యనగర్‌లోని ఆ కార్యాలయం వెలవెలబోతోంది. ఈ వైపు టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటమే టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వెలవెలబోవటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పాత గుంటూరు రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యాలయం మాత్రం కళకళలాడుతోంది. చదవండి: చంద్రబాబు, బాలకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్ బీసీలకు టీడీపీ గుండెకాయ వంటిది అని చంద్రబాబు నిత్యం చెబుతుంటారు. టీడీపీకి బీసీలు వెన్నుపూసలాంటి వారు అని కూడా ఆయనే వల్లెవేస్తుంటారు. కానీ బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే పదవులు ఎరవేయడం, ఆ తర్వాత వారిని అవమానించడం టీడీపీలో కొత్తేమీ కాదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీకి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అయితే పార్టీ అధిష్టానం జిల్లా పార్టీ కార్యాలయానికి, జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలు మాత్రం నేతి బీరకాయలో నేతి చందంగా తయారయ్యాయి. ఆ పార్టీ పండుగలా మహానాడును నిర్వహిస్తున్న సమయంలోనూ భాగ్యనగర్ మూడోలైన్‌లో జిల్లా పార్టీ కార్యాలయం ఓ అనాథలా వెలవెలబోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పది, పదిహేను రోజుల నుంచి రాష్ట్ర పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ నగరానికి వచ్చి వెళ్తున్నారు. బాలాజీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక్కసారి వచ్చి వెళ్లారు. జనార్దన్ ఆఫీసు కళకళ: ఒంగోల మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు చెందిన పాత గుంటూరు రోడ్డులోని కార్యాలయం మాత్రం ఎప్పుడూ నాయకులతో, ముఖ్య నేతలతో కళకళలాడుతోంది. మహానాడుకు వచ్చిన ముఖ్య నేతలు కూడా అక్కడికే వచ్చి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు సామాజికవర్గానికి చెందిన నేత దామచర్ల జనార్దన్ కావటమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. మరి జిల్లా పార్టీ కార్యాలయం ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంటూ ఆ పార్టీలోని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. జనార్దన్ అసలు జిల్లా పార్టీ కార్యాలయంలో అడుగు కూడా పెట్టలేదు. జనార్దన్ ఆయన పార్టీ కార్యాలయం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. టీడీపీలో బీసీలకు పేరుకే పదవులు..అధికారం మాత్రం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనన్న వాదనలు అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ బలంగా వినిపిస్తోంది. మరి జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వటం ఎందుకు, నూకసాని బాలాజీని ఈ విధంగా అగౌరవ పరచటం ఎందుకని బీసీలకు చెందిన కొందరు నేతలు నేరుగానే ప్రశి్నస్తున్నారు. ఏదిఏమైనా మహానాడు వేదికగా బీసీ నేతకు తీవ్ర అవమానం జరిగిందనే చెప్పాలి. ఫ్లెక్సీల్లో కూడా.. మహానాడు సందర్భంగా ఒంగోలు నగరం మొత్తం టీడీపీ ముఖ్య నేతలతోపాటు ఇతర నాయకుల ఫొటోలతో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల ఏర్పాటులో కూడా బీసీ నేత, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి తీవ్ర అవమానం జరిగింది. ఏ పదవులు లేని వారి ఫొటోలను సైతం తాటికాయంతా సైజుల్లో వేసుకున్న ఫ్లెక్సీలో ఏ ఒక్కచోట కూడా బాలాజీ ఫొటోలు ఆ సైజులో లేకపోవడం గమనార్హం. కొన్నింటిలో అయితే బాలాజీ ఫొటోలే లేవు. -
Kirru Cheppulu: ట్రెండ్ మారింది.. కిర్రు చెప్పుల ‘సోగ్గాడు’
కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): పెద్దల కాలంలో కిర్రు చెప్పులు రకరకాల రంగుల్లో తయారు చేయించి వేసుకొని వీధుల్లో తిరుగుతుంటే కిర్ కిర్ మంటూ వచ్చే శబ్దం అదో హోదాగా భావించేవారు. ముఖ్యంగా వివాహ వేడుకలు, అమ్మవారి కొలుపులు, ఉత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇలాంటి చెప్పులు వాడేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రజలు వాడే పాదరక్షల విషయంలో పెను మార్పులు చేటు చేసుకున్నాయి. చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా.. కానీ నేటికి అలనాటి కిర్రు చెప్పులపై మోజు తీరని కొందరు పల్లెవాసులు వాటిని వాడుతుండటం విశేషం. మండలంలోని కాట్రగుంట గ్రామంలో ఎల్లమ్మ కొలుపుల వేడుకల్లో రెట్టపల్లి గ్రామానికి చెందిన నాలి పెద్దన్న కిర్రు చెప్పులతో వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. రూ.3 వేలు ఖర్చుపెట్టి చెప్పులు తయారు చేయించానని సాక్షితో ముచ్చటించారు. -
నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి!
చంద్రబాబు పాలన అంటే ఉత్తుత్తి హామీలు, అబద్ధాలు, నయవంచన గుర్తుకు వస్తాయి. ఆయన ఐదేళ్ల పాలనలో జిల్లాలో దుర్భిక్షం రాజ్యమేలింది. పాడికి పేరొందిన ప్రకాశం జిల్లాలో రైతులకు అండగా ఉన్న ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. రైతులను నట్టేట ముంచేసి.. వేలాది మంది కార్మికులను రోడ్డు పాల్జేశారు. రుణమాఫీ హామీని గాలికొదిలేసి లక్షలాది మంది కర్షకులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్ట్ పేరుతో విడుదలైన అరకొర నిధులు బాబు బినామీలు కాజేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఐదేళ్లు కాలక్షేపం చేసిన ఎన్నికల వేళ హడావిడిగా శిలా ఫలకం వేసి వంచన చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను నట్టేట ముంచేసిన చంద్రబాబు.. ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఈ గడ్డపై మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు హయాం 2014 నుంచి 2019 వరకు ప్రకాశం జిల్లాలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఐదేళ్లూ అన్ని మండలాల్లో కరువు తాండవించింది. సాగు, తాగు నీటి కోసం ప్రజలు విలవిల్లాడారు. పశ్చిమాన పలు గ్రామాల్లో ప్రజలు వలసబాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనలతో హడావుడి చేశారు. మళ్లీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఐదేళ్ల బాబు నయవంచన పాలనను.. మూడేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని జనం పోల్చుకుంటున్నారు. జగన్‌కు జై కొడుతున్నారు. జిల్లాలో నాడు–నేడు ఒక్కసారి పరిశీలిద్దాం.. పాలేరూ అంతే.. కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం వద్ద పాలేరుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో ముందుకు సాగనేలేదు. అప్పటి, నేటి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి (టీడీపీ) కాంట్రాక్టర్లను మార్చటమే పనిగా పెట్టుకున్నారు. మూడుసార్లు కాంట్రాక్టర్లను మార్చి నిర్లక్ష్యం చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను గాలికొదిలేశారు. కరువు జిల్లాగా మార్చేశారు. రుణమాఫీ పేరిట దగా 2014 ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలు ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. కమిటీల పేరుతో ఏడాదిన్నరపాటు కాలయాపన చేశారు. పాత ప్రకాశం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 7 లక్షల మంది డ్వాక్రా మహిళలు కలిపి సుమారు రూ.11 వేల కోట్లకు పైగా రుణాలు ఉండేవి. కేవలం రూ.3 వేల కోట్లలోపు మాత్రమే రుణాలు మాఫీ చేసి అటు రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. హెరిటేజ్ కోసం ఒంగోలు డెయిరీ మూత... పాడి రైతులకు ఆదాయ వనరుగా ఉన్న ఒంగోలు డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్ కోసం నిలువునా ముంచేశారు. తన పార్టీకి చెందిన డెయిరీ పాలక మండలి చేత సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్పించి దగా చేశారు. డెయిరీ సొమ్ముంతా దోచుకునేటట్లు చేసి చివరకు రూ.100 కోట్ల వరకు అప్పులు చేయించి మరీ డెయిరీని మూతవేయించారు. పాడి రైతులను నట్టేట ముంచారు. వేలాది ఉద్యోగులు, కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. వెలిగొండ పనులు నత్త నడక.... ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా నిర్మింపతలపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఐదేళ్లూ నత్తను తలపించాయి. తన సొంత బినామీ అయిన సీఎం రమేష్‌కు వెలిగొండ పనులను అడ్డగోలుగా నామినేషన్‌పై ఇచ్చి రూ.వందల కోట్లు కాజేశారు. పనుల్లో మాత్రం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకటో టన్నెల్ పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. ఆర్అండ్ఆర్ పనులు అసలు చేపట్టనే లేదు. నాడు గాలికొదిలేసిన టీడీపీ నేతలు ఇదే ప్రాజెక్టుపై లేఖల డ్రామాలు మొదలుపెట్టి అసత్య ప్రచారానికి పూనుకున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపన జిల్లా ప్రజల చిరకాల కోరిక రామాయపట్నం పోర్టు. టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారు. చివరకు ఎన్నికలకు ముందు డ్రామాకు తెరతీశారు. మేజరు పోర్టును మినీపోర్టుగా మార్చేశారు. హడావుడిగా శిలాఫలకం వేశారు. నన్ను తిరిగి గెలిపిస్తే రామాయపట్నం పోర్టు, పేపర్ మిల్లు ఏర్పాటు చేస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చి వెళ్లారు. మారిన గతి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. వెలిగొండకు భారీగా నిధులు కేటాయించింది. పనుల్లో వేగం పెంచింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో నాలుగైదు రకాల ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది దాదాపు రూ.19,600 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారులకు చేరాయి. మార్కాపురంలో మెడికల్ కాలేజీ.. దోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందుకోసం 50 ఎకరాలు కేటాయించి, నిర్మాణానికి రూ.475 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. దోర్నాల మండలం అయినముక్కల గ్రామంలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల దశ పూర్తి చేసుకొని పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జీజీహెచ్ అభివృద్ధికి రూ.170 కోట్లు జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.170 కోట్లు మంజూరు చేయించారు. జీజీహెచ్ వెనుక 7 ఎకరాలను అదనంగా కేటాయించారు. బెడ్లు పెంచటంతో పాటు అదనపు సౌకర్యాలు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి సీటీఎంఆర్తో పాటు జీజీహెచ్‌లో అనేక ఆధునికీకరణ పనులు చేపట్టారు. థర్డ్ వేవ్ కోవిడ్‌ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ వేలాది ప్రాణాలను కాపాడింది. జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ.. టీడీపీ హయాంలో ఒక్క విద్యా సంస్థ కూడా జిల్లాకు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీని మంజూరు చేసింది. పేర్నమిట్టలో 109 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను డీపీఆర్ కోసం రూ.50 లక్షలు రిలీజ్ చేసింది. మొత్తం యూనివర్శిటీ బడ్జెట్ కింద రూ.340 కోట్లు కేటాయించింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ► నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించటానికి (స్కిల్ డెవలప్మెంట్) ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో 5 ఎకరాలు కేటాయించింది. ► దోర్నాలలో రూ.3 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ► గిద్దలూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకేసుల గ్యాప్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లతో పనులు చేస్తున్నారు. ► ఒంగోలు నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఒంగోలు నగరానికి వచ్చినప్పుడు రూ.400 కోట్లు కేటాయించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరారు. దీంతో ఆ ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నట్లు బహిరంగ సభలోనే ప్రకటించారు. ► రూ.54 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► చీరాల మండలంలోని వాడరేవు, కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో రెండు ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే వాటికి సంబంధించి స్థల సేకరణ పూర్తయింది. త్వరలో వాటి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి చేసింది. రెండో టన్నెల్ 18.679 కిలో మీటర్లకుగాను ఇక కేవలం 4.920 కిలో మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా వేగవంతం చేసింది. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ఇప్పటికే 31,066 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసింది. భూ సేకరణ కోసం రూ.418 కోట్లు వెచ్చించింది. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం 11 గ్రామాల తరలింపునకు రూ.116 కోట్లు కేటాయించింది. పేద విద్యార్థుల కల సాకారమే ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీని జిల్లాకు తీసుకొచ్చి పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏటా 4 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చేరుతుంటారు. ఐదేళ్లపాటు అంటే 20 వేల మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం ఇడుపులపాయతో పాటు పేర్నమిట్ట అవతల ఉన్న ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనిర్మాణం కోసం కనిగిరి ప్రాంతంలో స్థల పరిశీలన జరుగుతోంది. -
మనీషా బొమ్మేస్తే అచ్చుపడుద్ది!
ప్రకాశం (దర్శి) : కరోనా.. ఎందరినో బలి తీసుకుంది. అదే సమయంలో కొత్త ఆలోచనలు పరుడుపోసుకునేలా చేసింది. సరికొత్త ఆవిష్కరణలకు కారణభూతంగా నిలిచింది. కొందరి ఉపాధికి గండి కొట్టింది.. మరికొందరిని జీవనోపాధి మార్గాలు వెతుక్కునేలా చేసింది. దర్శికి చెందిన మనీషా కూడా తనలోని సృజనకు కరోనా సమయంలోనే పదును పెట్టింది. బొమ్మలు గీసే తన హాబీని ఉపాధికి మార్గంగా మలుచుకుంది. తాను గీసిన బొమ్మలను తోటివారికి చూపి, వారి బొమ్మలు కూడా గీయడం.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఆర్డర్లు తీసుకుని బొమ్మలు వేయడం.. ఇలా తన కళా ప్రతిభను చాటుకుంటూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కొందరు మనీషా ప్రతిభకు ముగ్ధులై తమ చిత్రాలను పంపి బొమ్మలు గీయించుకుంటున్నారు. వాటిని కొరియర్ ద్వారా విదేశాలకు తెప్పించుకుంటున్నారు. పేర్లతో బొమ్మలు.. త్రీడీ, ఫైవ్‌డీ కెమెరాలతో తీసిన అందమైన ఫొటోలు ఫ్రేమ్ కట్టించుకుని మురిసిపోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, కాస్త విభిన్నంగా ఉండాలని కోరుకునేవారు మాత్రం చేత్తో గీసిన చిత్రాలను ఇష్టపడతారు. అలాంటి వారి బొమ్మలను గడిచిన రెండేళ్లలో మనీషా వందల సంఖ్యలో గీసింది. పెన్సిల్‌తో బొమ్మలు వేయడమే కాదు పేర్లు రాస్తూ చిత్రంగా మలచడం మనీషా ప్రత్యేకత. కరోనా సమయంలో ఉపాధి కోసం ఒక్కో చిత్రానికి రూ.200 తీసుకున్న ఆమె.. ప్రస్తుతం చిత్రం సైజును బట్టి రూ.300 నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటోంది. తన ఇంట్లోనే బొమ్మలు గీస్తూ.. పిల్లలు, పెద్దలకు చిత్ర లేఖనంపై శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతోంది. భర్త సాయికుమార్ ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరుకుంటానని మనీషా ధీమాగా చెబుతోంది. -
బీరు లారీ బోల్తా.. బాటిళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో మద్యం ప్రియులు ఎగబడి బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని యునైటెడ్ బ్రేవరేజెస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మద్యం డిపోకు కింగ్‌ఫిషర్, ఎన్జి బ్రాండు బీరు బాటిళ్ల లోడుతో లారీ బయలుదేరింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలోని విమానాల రన్‌వేపైకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా.. రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. అదే సమయంలో చెన్నై నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ మద్యం లారీ ట్రక్కు భాగాన్ని బలంగా ఢీ కొట్టడంతో బీరు బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. బీరు బాటిళ్ల విలువ అధికారికంగా రూ.5.50 లక్షలు కాగా మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.30 లక్షలు ఉంటుంది. బీర్ బాటిళ్ల లారీ బోల్తా పడిందని తెలుసుకున్న మద్యం ప్రియులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దొరికినవి దొరికినట్లు బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, టంగుటూరు హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. తరువాత క్రేన్ సహాయంతో లారీని రోడ్డు పక్కకు చేర్చి మిగిలిన బాటిళ్లను ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని ఎక్సైజ్, సెబ్ అధికారులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్.సంపత్‌కుమార్ తెలిపారు. -
Viral Video: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి..
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శిలో ఓ కోతి సెల్ఫీలు దిగుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకుని వాకింగ్ చేస్తూ ఉన్న ఓ వ్యక్తి నుండి మొబైల్ ఫోన్‌ను ఓ వానరం లాక్కెళ్లింది. అంతటితో ఆగకుండా దగ్గరలో ఉన్న గోడపై కూర్చొని సెల్ఫీలో దిగుతూ గంట పాటు మొబైల్ ఫోన్‌ను ఇవ్వకుండా ఆ వ్యక్తి కి ముచ్చెమటలు పట్టించింది. చదవండి: బెజవాడలో ఫేమస్.. రామకృష్ణ బుల్లెట్ గ్యారేజ్ ఆ కోతి చేష్టలకు వాకింగ్ చేస్తూ ఉన్నవారంతా ఒక్కసారి నోరెళ్ల పెట్టి అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత మొబైల్‌ను నోటితో పట్టుకొని చెట్లపై అటు ఇటు దూకుతూ తన కోతి చేష్టలను చూపెట్టింది. గంట తర్వాత చిన్నగా ఓ గోడపై వదిలి వెళ్లగా ఆ యువకుడు నానా కష్టాలు పడి గోడలు ఎక్కి మొబైల్ ఫోన్ తీసుకోవడంతో అక్కడి వారంతా కోతి చేష్టలకు ముక్కున వేలేసుకున్నారు. -
సమాజ సేవతోనే జీవితానికి పరిపూర్ణత
ఒక వ్యక్తి తన కోసం తాను పని చేసుకుంటుంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అదే వ్యక్తి సమాజం కోసం కూడా పని చేస్తుంటే చెప్పుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. అదే... సమాజంలో మార్పు కోసం నిరంతరాయంగా శ్రమిస్తుంటే చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు అనిత చావలి. గాంధీజీతో పాటు చీరాల–పేరాల ఉద్యమంలో పాల్గొన్న తాతగారి స్ఫూర్తితో ఆమె సామాజిక కార్యకర్తగా మారారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె సామాజిక జీవనం, సమాజంలో ఆమె తీసుకువచ్చిన మార్పులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. అనిత చావలి పుట్టింది పెరిగింది బాపట్ల జిల్లా (విభజనకు పూర్వం ప్రకాశం జిల్లా) చీరాల. డిగ్రీ వరకు చీరాలలోనే చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో చేశారు. జిల్లా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా, ఎన్సీసీ క్యాడెట్‌గా ఆమె విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉండడానికి కారణం తాతగారు వాసుదేవమూర్తిగారినే చెబుతారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు 1986 గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎన్సీసీ క్యాడెట్‌గా సేవలందించిన రోజులను గుర్తు చేసుకున్నారు అనిత. ‘‘బాధితులకు ఆహార పొట్లాలు పంచడం, మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లకు సహాయం చేయడం వంటి పనులు మాకప్పగించారు. సర్వీస్‌లో ఉండే ఆత్మసంతృప్తిని నూటికి నూరుపాళ్లు అనుభవించిన సందర్భం అది. పీజీలో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పని చేశాను. అయితే నా జీవితంలో అతి పెద్ద విరామం పెళ్లి రూపంలో వచ్చింది. నా పీహెచ్డీ సీటును కూడా వదులుకుని యూఎస్‌కి వెళ్లాల్సి వచ్చింది. పన్నెండేళ్లు అక్కడే ఉన్నాం. అయితే అక్కడ కూడా ఊరికే ఉండలేదనుకోండి. లోవెల్ జనరల్ హాస్పిటల్లో చారిటీ వర్క్ చేశాను. ఒక కల్చరల్ ఫౌండేషన్ స్థాపించి బోస్టన్, న్యూజెర్సీల్లో ఉన్న భారతీయ మహిళలను సంఘటితం చేస్తూ తరచూ కలిసే ఏర్పాటు చేశాను. యూఎస్ రోడ్లే కాదు! ఇండియాకి వచ్చి హైదరాబాద్, సఫిల్‌గూడలో స్థిరపడ్డాం. అప్పటికి మా పిల్లలిద్దరూ ప్రైమరీ స్కూల్ వయసులోనే ఉన్నారు. ఇక్కడికి రాగానే ఒకింత షాక్ ఏమిటంటే... చిన్న క్లాసుల పిల్లలను కూడా ట్యూషన్‌కి పంపిస్తున్నారు. ఆ వయసులో ఇంత ప్రెషర్ ఎందుకు? ఆట–పాట లేని చదువేమిటి! అనిపించింది. ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో రెయిన్ బో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. అదే సమయంలో కాలనీ మీద కూడా నా ఫోకస్ పడింది. ‘యూఎస్‌లో రోడ్లు శుభ్రంగా ఉంటాయి, అలాంటి రోడ్లు ఇండియాకి ఎప్పుడు వస్తాయో... అని పెదవి విరిస్తే సరిపోదు, అక్కడి వాళ్లు ఎలా పని చేస్తారో అలా మనం కూడా పని చేయాలి, అలా పని చేయడం అలవాటు చేయాలి... అనుకున్నాను. మా కాలనీలో ఉత్సాహవంతులతో ఒక సొసైటీ ఏర్పాటు చేశాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి జీహెచ్ఎంసీ వాళ్లు చెత్త తీయకపోతే ఫోన్ చేయడం అలవాటు చేశాం. కాలనీ రోడ్లు శుభ్రంగా మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు 2015 వరదలు మా కాలనీని జలమయం చేశాయి. డ్రైనేజ్ నీరు పొంగి రోడ్ల మీదకు రావడానికి కారణం నాలాలు ప్లాస్టిక్ చెత్తతో పూడిపోవడమేనని తెలిసింది. ప్లాస్టిక్ మీద నా పోరాటం అప్పుడే మొదలైంది. ప్లాస్టిక్ వద్దు... కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ బదులు ఈ బ్యాగ్ వాడండి అని జ్యూట్ బ్యాగ్ ఇచ్చాం. జీహెచ్ఎంసీతో కలిసి తడి చెత్త –పొడి చెత్త వేరు చేయడం నేర్పించాం. ఇంకా చక్కగా వేరు చేసిన వారిని గుర్తించి ‘స్వచ్ఛ నాగరిక’ పురస్కారంతో ప్రోత్సహించాం. స్వచ్ఛ రంగోలి పేరుతో ‘యాంటీ ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయవద్దు, డ్రై–వెట్ వేస్ట్ సెగ్రెగేషన్, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం’ అంశాల మీద ముగ్గుల పోటీలు పెట్టాం. ఈ విషయాల్లో మహిళలను ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావం ఇంట్లోనూ, సమాజంలోనూ ప్రతిబింబిస్తుందనే ఉద్దేశంతో ఈ థీమ్ డిజైన్ చేశాను. వీటన్నింటితోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాం. అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. మా దగ్గరకు వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ క్రషింగ్ యూనిట్‌కి వెళ్లిపోతుంది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ కోసం రైల్వే స్టేషన్లలో కూడా క్రషింగ్ మెషీన్లు పెట్టించాం. ఇవన్నీ బాగా జరిగాయి. కానీ... చికెన్, మటన్ షాపులకు స్టీలు బాక్సు తీసుకెళ్లాలనే ఉద్యమం కరోనా ముందు వరకు విజయవంతంగా చేయగలిగాం. ఆ తర్వాత మా చేతుల్లో నుంచి మెల్లగా జారిపోయింది. దాని మీద మళ్లీ ఫోకస్ పెట్టాలి. మా కాలనీలో నేను కనిపిస్తే అందరూ ఎదురు వచ్చి పలకరిస్తారు. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉన్న వాళ్లు మాత్రం ఇప్పుడు పలకరించవద్దు అనుకుని మరో దారిలో మలుపు తిరిగి వెళ్లిపోతుంటారు’’ అన్నారామె నవ్వుతూ. సంఘటిత శక్తి ‘పని చేసే చేతులకు తీరిక ఉండదు, పని చేయని చేతులకు పని కనిపించదు’... అంటారు. అనిత వ్యాపకాల జాబితా చూస్తే ఈ నానుడి నిజమే అనిపిస్తోంది. వాటర్ బోర్డు సహకారంతో కాలనీలో ఇంకుడు గుంతల తవ్వకం వంటి పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ‘‘నేను ఒక పని తలపెట్టి ‘కాలనీలో ఈ పని చేద్దాం’ అని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టిన ఇరవై నాలుగ్గంటల్లో స్వచ్ఛందంగా తమ వంతు సహకారంగా ఎవరు ఏమేమి చేయాలనుకుంటున్నదీ తెలియచేస్తారు, అందుకయ్యే ఖర్చులో తమ వంతుగా ఎంత ఇవ్వగలరో కూడా సమాచారం ఇచ్చేస్తారు. అందుకే ఇంత సజావుగా చేయగలుగుతున్నాం. పైకి కనిపించేది నేనే, కానీ, నాకు సహకరించే ఎందరో అండగా ఉన్నారు’’ అని చెప్పారు అనితా చావలి. జీవితం అంటే... మన ఇంటి నాలుగ్గోడలకు పరిమితమైనది కాదు, సమాజంతో కలిసి ఉన్నదే జీవితం. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినట్లే, సామాజిక బాధ్యతను కూడా పూర్తి చేయాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. అలాగే గౌతమ్‌నగర్ సరిహద్దులో రైల్వే పరిధిలో చెత్తకుప్పలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయించి సరిహద్దు గోడకట్టించి గాంధీజీ విగ్రహం పెట్టాం. – వాకా మంజులారెడ్డి. -
Prakasam: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రమణారెడ్డి
సాక్షి, ప్రకాశం(బేస్తవారిపేట): జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా మండలంలోని రెడ్డినగర్‌కు చెందిన యన్నం వెంకట రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఒంగోలులో శుక్రవారం అందుకున్నారు. అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించిన ఎంపీ మాగుంటకు రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మాగుంట నుంచి నియామక పత్రం అందుకుంటున్న పులి వెంకట కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కూడా.. తాళ్లూరు: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా బొద్దికూరపాడు మాజీ సర్పంచి పులి వెంకట కృష్ణారెడ్డిని నియమిస్తూ ఆ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డి గతంలో గ్రామ సర్పంచిగా పని చేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో కీలక నాయకుడిగా పనిచేస్తున్నారు. తనను అడ్వైజరి కమిటీ సభ్యుడిగా నియమించేందుకు సహకరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్‌కు పీవీ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. -
ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే..ఇప్పుడు కర్మాగారాల ఖిల్లా!
గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్.. మద్దిపాడు మండలంలో జాతీయ రహదారి పక్కనున్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే ఉండేది. కాలక్రమంలో కర్మాగారాల ఖిల్లాగా మారింది. ప్రస్తుతం 400కుపైగా పరిశ్రమలతో 40 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తోంది. వృత్తి నైపుణ్యం గల వారికి వరంగా నిలిచింది. మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వేల మందికి ఉపాధి లభిస్తోంది. భారీ ఫ్యాక్టరీల నుంచి చిన్నపాటి పరిశ్రమల వరకూ నిర్వహిస్తుండటంతో అనేక రంగాల వారికి జీవనోపాధి దొరుకుతోంది. ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా మరికొంత మందికి బతుకుదెరువైంది. ఎంతోమంది ఆకలి తీరుస్తున్న గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... మద్దిపాడు: అది 1986వ సంవత్సరం.. జిల్లా కలెక్టర్‌గా ఎన్.జయప్రకాష్ నారాయణ్ పనిచేస్తున్నారు. అప్పటికి పూర్తిగా వెనకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా అభివృద్ధి వైపు నడిపించాలని భావించారు. మద్దిపాడు మండలంలోని వెయ్యి ఎకరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రభుత్వ భూములు కాగా, మరికొన్ని భూములను రైతులు ఇచ్చేశారు. మండలంలోని గుండ్లాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 112 ఎకరాలు, అన్నంగి రెవెన్యూ పరిధిలోని 952 ఎకరాలు కలిపి మొత్తం 1,062 ఎకరాల భూములను ఏపీఐఐసీ ద్వారా ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిలో పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారు. ఆ తర్వాత చాలా కాలం వరకూ కూడా ఆ ప్రాంతంలో ఒకేఒక టీ బంకు మినహా మరేమీ ఉండేవి కావు. ఆ టీ బంకు కూడా హైవే పక్కనున్న ప్రాంతం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ మాత్రమే నడిచేది. అలాంటి ప్రాంతం నేడు 24/7 టీ స్టాళ్లతో కళకళలాడుతోంది. పరిశ్రమలకు పెట్టింది పేరుగా మారింది. ఉపాధికి నిలయంగా నిలిచింది. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ పేరుతో పారిశ్రామిక పట్టణంగా రూపుదిద్దుకుంది. వైఎస్సార్ హయాంలో అభివృద్ధికి అడుగులు... గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఏర్పాటైన తర్వాత చాలా కాలం వరకూ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. లోపలికి వెళ్లేందుకు రహదారులు కూడా లేవు. పదేళ్ల వరకూ పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతికష్టం మీద 1995లో ఒకటీరెండు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. మెల్లగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం మొదలైంది. మద్దిపాడు మండలంలోని మల్లవరం కొండ వద్ద గుండ్లకమ్మ నదిపై రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్.. అనతికాలంలోనే 2008 నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారు. ఈ పరిణామం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. గుండ్లకమ్మ డ్యామ్‌తో ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ సబ్సిడీపై రుణాలిచ్చారు. విద్యుత్ చార్జీల్లో రాయితీలు ప్రకటించారు. ప్రభుత్వం అందించిన పలు రకాల ప్రోత్సాహాలతో గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో ప్లాట్ల కొనుగోలుకు పారిశ్రామికవేత్తలు పరుగులు తీశారు. పారిశ్రామికాభివృద్ధికి వడివడిగా అడుగులు పడటంతో ఏపీఐఐసీ అధికారులు అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, నీరు, విద్యుత్, తదితర మౌలిక వసతులు కల్పించారు. పలు రకాల ఫ్యాక్టరీలు ఏర్పాటు... పరిశ్రమల స్థాపనకు ముఖ్యంగా కావాల్సింది రవాణా సౌకర్యం. ఆ తర్వాత కనీస వసతులు. అలాంటిది గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం గొప్ప అవకాశంగా మారింది. ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో పలు ఫ్యాక్టరీల యజమానులు గ్రోత్ సెంటర్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇప్పటి వరకూ మొత్తం 400 పైచిలుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎక్కువ శాతం గ్రానైట్ రంగానికి చెందిన ఫ్యాక్టరీలే ఉన్నాయి. వాటితో పాటు కెమికల్ ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, నీల్కమల్ కుర్చీల తయారీ ఫ్యాక్టరీ, విండ్‌మిల్స్ తయారీ ఫ్యాక్టరీ, రంగులు, గ్లౌజ్‌ల తయారీ వంటి పలు రకాల ఫ్యాక్టరీలు ప్రస్తుతం నడుస్తున్నాయి. పెద్దపెద్ద ఫ్యాక్టరీల నుంచి చిన్నపాటి పరిశ్రమల వరకూ నిర్వహిస్తుండటంతో వాటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వెల్లువలా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 20 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికిపైగా పరోక్షంగా గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. మన రాష్ట్రంలోని చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా స్కిల్డ్ వర్కర్లు వచ్చి పనిచేస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్, రాంచి, యూపీ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. శరవేగంగా గ్రోత్ సెంటర్ అభివృద్ధి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాల పాటు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఆగిపోయినా.. ప్రస్తుతం అన్ని పరిశ్రమలు పుంజుకుంటున్నా యి. విద్యుత్ సమస్యను అధిగమిస్తే పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగే ఆవకాశాలున్నాయి. గ్రోత్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు జంగిల్ క్లియరెన్స్, వీధి దీపాల ఏర్పాటు, సైడు డ్రెయిన్ల నిర్మాణాలకు అంచనాలు వేస్తున్నాం. అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించేలా గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌ను తీర్చిదిద్దుతాం. – జే వెంకటేశ్వర్లు,జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ గ్రానైట్ మార్కర్‌గా స్థిరపడ్డా గతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటవడంతో ప్రస్తుతం సొంతంగా గ్రానైట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. కంపెనీల వారికి సరఫరా చేసే స్థాయికి ఎదిగాను. నాతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల యువతకు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఉపాధి కల్పించింది. దూరప్రాంతాల నుంచి కూడా స్కిల్డ్ వర్కర్లు వచ్చినా.. ఇక్కడి వారికి ఉపాధి ఏమాత్రం తగ్గలేదు. – నలమలపు శ్యామసుందరరెడ్డి, గ్రానైట్ మార్కర్ గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌తో అన్ని రకాలుగా అభివృద్ధి వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందేందుకు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతోంది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ప్రస్తుతం అధిక సంఖ్యలో ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల నిరుద్యోగులకు చక్కటి ఉపాధి అవకాశాలు దొరికాయి. 2004లో ఫ్యాక్టరీల యజమానులకు రాయితీలు ప్రకటించడంతో గ్రోత్ సెంటర్ అభివృద్ధి ఊపందుకుంది. – చుండూరి రవిబాబు, రైస్‌మిల్ ఓనర్ త్వరలో ఐటీ కంపెనీ ప్రారంభం... గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోకి త్వరలో ఒక ఐటీ కంపెనీ కూడా చేరనుంది. టెక్ బుల్స్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఐటీ కంపెనీ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభమే తరువాయి. నాలుగు రోజుల క్రితమే మాజీ మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతి కార్జ్ సర్ఫేస్ పేరుతో గ్రానైట్ రంగానికి చెందిన భారీ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించారు. సెజ్‌లో మరికొన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జాతీయ రహదారికి రెండోవైపు బూరేపల్లి గ్రామస్తులకు పునరావాస కాలనీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం రద్దీగా మారింది. జనజీవనం పెరిగిపోవడంతో టీ స్టాళ్లు, హోటళ్లు, సెల్‌ఫోన్ దుకాణాలు, నిత్యావసర సరుకులు, వస్తువులు, దుస్తులు షాపులతో నిండిపోయి నిరుద్యోగులకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. గ్రోత్సెంటర్లలోని ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్టు కంపెనీలు,ఆఫీసులు వచ్చాయి. వాటి ద్వారా మరికొంత మందికి ఉపాధి లభిస్తోంది. ఈ విధంగా రోజురోజుకూ పలు రకాలుగా అభివృద్ధి చెందుతున్న గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఉపాధికి అడ్డాగా మారడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి
ఒంగోలు అర్బన్: జిల్లాల పునర్విభజన తర్వాత పెద్ద జిల్లాగా ఏర్పడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్పందన భవనంలో ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన శుక్రవారం డీఆర్సీ (జిల్లా సమీక్ష సమావేశం) నిర్వహించారు. దీనిలో ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా నీటి సరఫరా సక్రమంగా చేయాలన్నారు. గృహాల నిర్మాణాలతో పాటు ప్రజలకు ఇసుక కొరత లేకుండా నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు స్థానికంగా ఎడ్ల బండ్లు, టైర్ బండ్లపై ఇసుక తీసుకెళ్లే వారిపై సెబ్ అధికారులు చర్యలు తీసుకోవడం మంచిది కాదన్నారు. అటువంటి చర్యలపై అందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక అవసరాల కోసం జీవో ప్రకారం ఇసుకను తీసుకెళ్తే అడ్డుకోవడం వలన ప్రజలకు ఇబ్బందులు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. పంచాయతీ అధికారులు ఇసుక రవాణాను పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక డిపోలే అందుబాటులో ఉంచడంపై జేపీ వెంచర్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఒక ఇసుక డిపో ఉండాలన్నారు. ఇసుక సరఫరాలో విఫలమైతే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని హెచ్చరించారు. తాను ఇన్చార్జ్ మంత్రిగా ప్రకాశం జిల్లాకు ఉండటం సంతోషంగా ఉందని తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, శ్మశాన భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఒంగోలు శివారు ప్రాంతం అయిన పేర్నమిట్టలో ఆంధ్రకేసరి యూనివర్శిటీ స్థలం కూడా ఆక్రమణలకు గురవుతున్నట్లు సమావేశంలో తెలిపారు. యూనివర్శిటీ భూములను పరిరక్షించాలని ఇన్చార్జ్ మంత్రి కలెక్టర్‌కు తెలిపారు. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సరిహద్దుల్లో కందకాలు తవ్వాలని సూచించారు. కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లా ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. సదరమ్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యల రాకుండా పైప్‌లైన్ లేని ప్రాంతాల్లో ప్రజల అవసరాల మేరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు. నీటి సరఫరాలో మూగ జీవాలను పరిగణలోకి తీసుకుని నీటిని అందించాలని అధికారులకు సూచించారు. ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు తాగునీటి సమస్యను ప్రధానంగా ప్రస్తావించారని, సమస్యను అధిగమించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో పరిష్కరించాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు బాధితుల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. కనిగిరిలో ఈ సంవత్సరంలో ట్రిపుల్ ఐటీ క్లాసు ప్రారంభించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అవసరమైన వసతులు కల్పించాలని ఆ మేరకు అధికారులు దృష్టి సారించాలని అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినందుకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన చెల్లించాలని కోరారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకల నుంచి సారవంతమైన మట్టిని పొలాలకు చేరవేసుకునేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. సదరమ్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు. వెలిగొండ మొదటి దశ కింద ఎత్తిపోతల పథకం పనులు త్వరగా చేపట్టేందుకు టెండర్లు నిర్వహించాలన్నారు. కాకర్ల ముంపు ప్రాంత వాసులకు వెంటనే పరిహారం అందచేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్న నాటు సారాను అరికట్టాలన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ఓటీఎస్ కింద నగదు చెల్లించిన పేదలకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని, వెంటనే ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. దొనకొండ, కురిచేడు మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. దర్శి నగర పంచాయతీలో జల జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.6.50 కోట్ల నిధులు వెనక్కి వెళ్లకుండా పనులు చేపట్టాలని కోరారు. పింఛన్ పంపిణీలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలన్నారు. పంచాయతీల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు త్వరగా ప్రారంభించి జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. ఇసుక సరఫరాలో సెబ్ అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ డీఆర్సీ సమావేశాల్లో చర్చించిన అంశాలను అధికార యంత్రాంగం దృష్టి సారించి ఫలితాలు సాధించాలన్నారు. గత డీఆర్సీలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు. కమిటీ సభ్యుల సూచనల మేరకు వారి సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు అన్నీ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మార్కాపురంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెలకు రెండు పంచాయతీలను లక్ష్యంగా పెట్టుకుని సమగ్రమైన ప్రణాళికతో తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సెర్ప్ ప్రోత్సాహంతో స్వయం సహాయక సంఘాల ద్వారా పరిశ్రమలు స్థాపించేలా చూడాలన్నారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ అనధికారిక చేపల ఉత్పత్తి కేంద్రాలను అరికట్టాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వాటికి చట్టబద్ధత కల్పించాలన్నారు. శిథిలావస్థకు చేరిన తుఫాను షెల్టర్లను తొలగించి నూతనంగా నిర్మాణాలు చేయాలన్నారు. శింగరాయకొండలో దేవదాయ భూములుగా నమోదైన రెండు వేల ఎకరాల భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. టంగుటూరులో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు కోసం రూ.136 కోట్లతో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కమిటీలో తెలిపారు. తిరిగి ఆ పనులు సత్వరమే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రిపుల్ ఐటీ తాత్కాలిక భవనాల నిర్మాణాలకు రూ.25 కోట్లు కేటాయించాలన్నారు. కనిగిరి రెవన్యూ డివిజన్ పరిధిలో వచ్చే ప్రభుత్వ కార్యాలయ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కంబాలదిన్నె పాఠశాలలో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారని, నాడు–నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రకేసరి యూనివర్శిటీ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలన్నారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఒంగోలు–పొదిలి రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలన్నారు. గుండ్లకమ్మ నుంచి ఆయా ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసే పైపులైన్లు మరమ్మతులు చేయాలని కోరారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపల అక్రమ వేటను అరికట్టాలన్నారు. పారిశ్రామికవాడ నుంచి వచ్చే ఆదాయంలో 40 శాతం నిధులు స్థానిక ప్రాంతాలకు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. ఉప్పుగుండూరులో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. -
Ongole: ఆర్టీఏ అధికారుల తీరుపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఆర్టీఏ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్ కోసం వాహనాలు సమకూర్చాలని సిబ్బంది ఒత్తిళ్లు తెస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ దృష్టికి వార్తా కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన సీఎం ప్రజలను ఇబ్బందులు పెడితే సహించబోమంటూ గట్టి సంకేతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు సస్పెన్షన్ ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఒంగోలు ఏఎంవీఐ సంధ్య, హోంగార్డ్ తిరుపాల్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చదవండి: మన పంతం 'అవినీతి అంతం'