బాలినేని జనసేనలోకి వెళ్లినా వదలను.. టీడీపీ నేత వార్నింగ్‌ | Tdp Leader Shashikant Warned Ex Minister Balineni Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

బాలినేని జనసేనలోకి వెళ్లినా వదలను.. టీడీపీ నేత వార్నింగ్‌

Published Sun, Oct 27 2024 10:18 AM | Last Updated on Sun, Oct 27 2024 11:11 AM

Tdp Leader Shashikant Warned Ex Minister Balineni Srinivasa Reddy

సాక్షి, ప్రకాశం జిల్లా: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేరిక కూటమిలో చిచ్చు రేపుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ సమక్షంలోనే టీడీపీ నేత ఎద్దు శశికాంత్‌ రెచ్చిపోయారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి జనసేనలోకి వెళ్లినా వదలనంటూ బెదిరింపులకు దిగారు. బాలినేని జనసేనలోకి చేరడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేపోతున్నారు. ఎవరిని అడిగి బాలినేనిని జనసేనలోకి చేర్చకున్నారంటూ ప్రశ్నించారు.

వాడు వీడు అంటూ బాలినేనిపై  శశికాంత్‌ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు భాగస్వామ్య పార్టీల మనోభావాలు గౌరవించాలి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నామన్నది పవన్‌ కల్యాణ్‌ గుర్తుంచుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలినేనికి జనసేన కండువా వేస్తే మా రక్తం మరిగింది. కూటమిలో ఉండి తమను సంప్రదించాలన్న ఇంగితం కూడా లేదా?. ఓడిపోయినవాళ్లను చేర్చుకుంటే మేము కూడా మా దారిలో వెళ్తాం’’ అని తేల్చి చెప్పారు. కాగా, శశికాంత్ భూషణ్ వ్యాఖ్యలను జనసేన జిల్లా అధ్యక్షుడు ఖండించారు. పవన్‌పై  శశికాంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు.

 

 


 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement