balineni srinivasa reddy
-
Chevireddy Reddy: పవన్ పిఠాపురం ఎందుకెళ్లాడు ?
-
బాలినేని జనసేనలోకి వెళ్లినా వదలను.. టీడీపీ నేత వార్నింగ్
సాక్షి, ప్రకాశం జిల్లా: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేరిక కూటమిలో చిచ్చు రేపుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ సమక్షంలోనే టీడీపీ నేత ఎద్దు శశికాంత్ రెచ్చిపోయారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి జనసేనలోకి వెళ్లినా వదలనంటూ బెదిరింపులకు దిగారు. బాలినేని జనసేనలోకి చేరడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేపోతున్నారు. ఎవరిని అడిగి బాలినేనిని జనసేనలోకి చేర్చకున్నారంటూ ప్రశ్నించారు.వాడు వీడు అంటూ బాలినేనిపై శశికాంత్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు భాగస్వామ్య పార్టీల మనోభావాలు గౌరవించాలి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నామన్నది పవన్ కల్యాణ్ గుర్తుంచుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలినేనికి జనసేన కండువా వేస్తే మా రక్తం మరిగింది. కూటమిలో ఉండి తమను సంప్రదించాలన్న ఇంగితం కూడా లేదా?. ఓడిపోయినవాళ్లను చేర్చుకుంటే మేము కూడా మా దారిలో వెళ్తాం’’ అని తేల్చి చెప్పారు. కాగా, శశికాంత్ భూషణ్ వ్యాఖ్యలను జనసేన జిల్లా అధ్యక్షుడు ఖండించారు. పవన్‌పై శశికాంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు. -
ఒంగోలు: వాసన్నకు వరుస అవమానాలు!
ప్రకాశం, సాక్షి: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో ‘రాజకీయ సహకారం’ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. గత శుక్రవారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ వద్ద బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు. గత కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు దామచర్ల వర్గీయులు జనసేనలోకి బాలినేని వెళ్లడాన్ని భరించలేకపోతున్నారు. మరోవైపు.. భవిష్యత్తులో జనసేనలోనూ బాలినేని వల్ల వర్గపోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీల చించివేత వ్యవహారాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
‘బాలినేని.. నిన్ను వదల’
ఒంగోలు టౌన్/టంగుటూరు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలినేని ఆ పారీ్టలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒంగోలు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒక కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. శుక్రవారం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫొటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వారి్నంగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆలూ లేదు సూలు లేదు అన్నట్లు ఇంకా పారీ్టలో చేరక ముందే ఇలా ఉంటే రానురాను ఈ ఇరుపార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో చూడాలి.ఏ పార్టీలోకి వెళ్లినా వదలను..: ఎమ్మెల్యే దామచర్ల బాలినేని వంటి అవినీతిపరుడిని ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేదే లేదని, అతనిని, అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం, ఒంగోలులో టీడీపీ శ్రేణులు, నాపై బాలినేని 32 కేసులు పెట్టారు, మా నాయకుడు చంద్రబాబుని కూడా దూషించారు, అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటకు తీస్తాం, వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పారీ్టలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం..’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు. నేనెప్పుడూ కాంప్రమైజ్ కాను.. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ‘‘నేనెప్పటికీ కాంప్రమైజ్ కాను. జనసేన ఫ్లెక్సీలు ఎవరు వేశారో నాకు తెలియదు. ఆయన బొమ్మేశారని తీసేయమన్నాడంటా, సంతోషమే... ఆయన బొమ్మ వద్దంటే తీసేద్దాం’’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని, జనసేన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడిగానని, అంతకుమించి తానేమీ మాట్లాడలేదన్నారు. దానిమీద కూడా ఆయన అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేకనే రెచ్చగొట్టేందుకు కావాలని ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడో చూస్తానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని విన్నానని, అంతపనికి రాదు... ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఇప్పుడు కూడా ఏదైనా తప్పులు జరిగితే తాను ప్రశి్నస్తానన్నారు. జనసేన పార్టీలో ఉన్న పాతవారిని, తనతో పాటు వస్తున్న వారిని కలుపుకొని జనసేన బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. -
బెడిసికొట్టిన ‘మాక్’ నాటకం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, అమరావతి: ఈవీఎంలపై సర్వత్రా నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా ‘సుప్రీం’ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మాక్ పోలింగ్‌తో మభ్యపుచ్చేందుకు చేసిన యత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనే అనుమానాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లో 12 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్‌లను పరిశీలించటానికి బదులుగా డమ్మీ బ్యాలెట్‌తో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్‌కు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా, ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం మాక్ పోలింగ్‌కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.పూర్తి వివరాలు ఇవ్వండిసుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
మాక్ పోలింగ్ వద్దు..
-
మాకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదు తేడావస్తే సుప్రీంకు వెళ్తా..
-
ఆగిపోయిన ఈవీఎంల లెక్కింపు బయటకు వచ్చిన బాలినేని
-
మాక్ పోలింగ్ వెరిఫికేషన్ ఏర్పాట్లపై బాలినేని అభ్యంతరం
-
వీవీప్యాట్ కూడా లెక్కించాల్సిందే!.. బాలినేని తరఫు ప్రతినిధుల వాకౌట్
ప్రకాశం, సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరఫున ప్రతినిధులు బయటకు వచ్చేయగా.. దీంతో అధికారులు రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు.ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో వేరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు కూడా. అయినప్పటికీ అధికారులు ముందుకు వెళ్లారు. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వేరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోవైపు.. రిట్ విచారణ రేపటికి..ఈవీఎంల వేరిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. మాక్ పోలింగ్ పద్ధతి నిలిపివేసి , సుప్రీంకోర్టు ఉత్వర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వేరిఫికేషన్, వీవీప్యాట్ లెక్కింపును కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. ఈసీ మాక్ పోలింగ్ చేస్తోందని బాలినేని తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయడం సరికాదని బాలనేని లాయర్ వాదించారు. దీంతో.. ఈసీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. ఆ 12 బూత్‌లలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది.డమ్మీ బ్యాలెట్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల(అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధులు) సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. -
నేటి నుంచి ఈవీఎంల పరిశీలన
ఒంగోలు అర్బన్: ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు అందిన క్రమంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు పరిశీలించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించనున్నారు. డమ్మీ బ్యాలెట్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియను సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నారు. -
ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ బాలినేని న్యాయ పోరాటం
-
ఈసీకి బాలినేని ఫిర్యాదు.. 19 నుంచి ‘ఒంగోలు’ ఈవీఎంల చెకింగ్
సాక్షి, ఒంగోలు అర్బన్: ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను విలేకర్లు అడగగా.. జరిగేది రీకౌంటింగ్ కాదని, డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుందని చెప్పారు.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించనున్నట్టు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు రెండు ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు. -
బుజ్జిగాడి పచ్చపన్నాగం
నగరపాలక సంస్థలో ఆయన కీలక నాయకుడు.. ఇన్నాళ్లూ పైకి మంచోడిలా కనిపించిన ఆయన ముసుగు తొలగించి తన కపట బుద్ధిని బయటపెట్టాడు.! నాటి శాసన సభ్యుడితో సన్నిహితంగా మెలుగుతూనే ఆయన కన్నుగప్పి భూ దందాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేడు స్వార్ధప్రయోనాల కోసం వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశాడు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి తల్లి లాంటి పార్టీకే ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యాడు.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీలో పదవులు అనుభవించి..సుదీర్ఘంగా ప్రయోజనాలు పొంది.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఎన్నో అవకాశాలిచ్చిన పార్టీని వదిలిపోవడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నమ్మిన వారిని నట్టేట ముంచడం సర్వసాధారణంగా మారింది. ఒంగోలు నగరానికి చెందిన ఓ నాయకుడి వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉంది.పార్టీలోనూ అధిక ప్రాధాన్యం..ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని సదరు నాయకుడికి పార్టీ పరంగానూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నగర పాలక సంస్థలో సభ్యుడిగా ఉంటూనే పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనైనా ఆయన కనిపించేలా కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా నాటి శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడిగా ఉంటూనే ఆయనకు తెలియకుండా అన్ని పనులు చక్కబెట్టుకున్నాడు. తీరా సొంత పార్టీ అధికారం కోల్పోయాక పచ్చ పార్టీలో చేరేందుకు రాయ‘బేరాలు’ నెరుపుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పైకి 24 కేరట్ బంగారంలా కనిపిస్తాడు కాని నిజానికి అసలు సిసలు కల్తీ బంగారమని తనకు తానే రుజువు చేసుకుంటున్నాడు.కేసుల నుంచి తప్పించుకునేందుకేనా?ఒంగోలు నగరంలో భూ కబ్జాలపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు వాటిని నాటి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అంటగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే భూకబ్జాలు, నకిలీ పట్టాల సృష్టికర్తల వివరాలు బట్టబయలు చేయడం ద్వారా టీడీపీ నేతల విమర్శలను బాలినేని తిప్పికొట్టారు. అదే సమయంలో భూకబ్జా ఆరోపణలపై బాలినేని సిట్ విచారణకు నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీపైనా ఒత్తిడి తీసుకొచ్చి పట్టుబట్టి మరీ ‘సిట్’ వేయించారు. సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టొద్దని మీడియా ముఖంగా బాలినేని స్పష్టం చేశారు. భూ కబ్జాలపై ఇప్పటికీ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు నాయకుడు తన భూ దందాల గుట్టు బయటపడుతుందనే భయంతో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.పక్కాగా సేఫ్ గేమ్..సదరు నాయకుడు ఎలాగైనా భూ కబ్జాల కేసుల నుంచి బయటపడేందుకు ఎన్నికలకు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో తన బంధువులను, సన్నిహితులను టీడీపీలోకి పంపేశాడు. ఒక వేళ అధికారం కోల్పోతే టీడీపీలోకి వెళ్లిన వారి సాయంతో తాను ఆ పార్టీకి వెళ్లిపోవచ్చనే పథకాన్ని రచించాడు. తన సేఫ్ గేమ్‌లో భాగంగా టీడీపీలోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. తనతో పాటు నగరపాలక సంస్థలో ఉన్న కార్పొరేటర్లు, మరికొంత మంది వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులను తీసుకొస్తానని పచ్చపార్టీ ముఖ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది.తాయిలాలు..బెదిరింపులు:తనతో పాటు పార్టీ మారాలంటూ సదరు నాయకుడు సహచర కార్పొరేటర్లతో రాయబారం నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తనతో పాటు టీడీపీలోకి వస్తే ఆర్థికంగా బాగుంటుందని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులకు తెరతీసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నాయకుడి వ్యవహారాన్ని వైఎస్సార్ సీపీ కేడర్ అసహ్యించుకుంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్న అతడి చర్యలను ఖండిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దేనికైనా సిద్ధమే దామచర్ల కు బాలినేని వార్నింగ్
-
దామా.. అంతా డ్రామా జనం చిత్రవధ
కుట్రలూ..కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి నేతల వరకూ అదేతీరు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఊరచెరువు ప్రాంతంలోని ముస్లింలపై ప్రతాపాన్ని చూపారు. నగరంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా న్యాయపరమైన అవరోధాలు కల్పించారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తర్వాత మొండిచేయి చూపడం ఆయనకు అలవాటేఒంగోలు సాక్షిప్రతినిధి: తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన పాల్పడిన అక్రమాలు ఎన్నో ఉన్నాయి. పుష్కరకాలంగా దామచర్ల కుట్రలు, కుతంత్రాలకు సాక్ష్యంగా పలు సంఘటనలు నిలుస్తున్నాయి. ఆయన సొంత సామాజిక వర్గం నేతల్ని మినహా మిగతవారందరినీ అవసరాలకు తగ్గట్టుగా వాడుకుని వదిలేస్తారన్నది బహిరంగ రహస్యం. 2012 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల పోటీకి దిగారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నగరంలో జరిగిన సంఘటనల్లో ప్రధానమైనవి పరిశీలిస్తే నియోజకవర్గానికి ఎంత నష్టం జరిగిందో అవగతమవుతుంది.👉 2012 ఉప ఎన్నికల సమయంలో 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సొంతంగా మినరల్ వాటర్ ప్లాంటు పెడుతున్నట్లు డ్రామా ఆడారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కేటాయించిన నివాస ప్లాట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా. దీంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి రాగానే మినరల్ వాటర్ ప్లాంటు పెడతామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అక్కడ మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు కాలేదు.👉 ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలుకు మంచినీటి పైపులైను నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. సమయంలో ప్రైవేటు స్థల యజమానికి పరిహారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో పనులు నిలిచిపోయాయి. మరో వైపు నరగపాలక సంస్థ రూ.70 కోట్లు భాగస్వామ్యంగా వ్యయం చేయాల్సి ఉంది. అయితే కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చుచేసి కమీషన్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉 నగరంలో రెండో కేంద్రీయ విద్యాలయం అవసరం ఉందని అప్పట్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర మానవవనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ భవనాల సముదాయంలో రూములు కూడా తాత్కాలికంగా కేటాయించారు. సొంత భవనం నిర్మాణం కోసం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి శిథిలమైన క్వార్టర్లు ఉండే భాగాన్ని ఎంపిక చేశారు. కానీ ఆ స్థలాన్ని కేటాయిస్తే వైఎస్సార్ సీపీకి మంచి పేరువస్తుందని కుట్రలు పన్ని అడ్డుకున్నారు దామచర్ల.👉 రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం సూచించింది. అందుకుగాను ఎన్టీయార్ సుజల పథకం అని నామకరణం చేశారు. అందులో భాగంగా ఒంగోలులో కూడా కేశవరాజుకుంటలో ఒక నివేశన స్థలంలో ప్లాంటు అయితే ఏర్పాటు చేశారు కానీ చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. పేరుకు మాత్రం 20 లీటర్ల నీరు రూ.2లకే అని పేర్కొన్నారు. అందులోనూ తిరకాసే. ఖర్చు దాతలది...ప్రచారం ప్రభుత్వానికి కావడంతో దాతలు ముందుకు రాలేదు.👉 ప్రస్తుత మినీ స్టేడియం పక్కన ఉన్న జెడ్పీ ప్రాంగణాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు తిరస్కరించడంతో జైకా నిధులతో నిర్మిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్యాలయంపై కన్ను పడింది. కార్యాలయ భవన నిర్మాణ పనులను అడ్డుకుని నానా యాగీ చేశారు. నేటికీ పునాది దశలోనే ఆ నిర్మాణం దర్శనమిస్తోంది.👉 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలమిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా యరజర్ల వద్ద 25 వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి శాటిలైట్ సిటీ నిర్మించాలని బాలినేని యత్నిస్తే దానిని కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారు. పేదలకు ఎలాగైనా సొంతిళ్లు నిర్మించాలని బాలినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారులు పక్కాగా ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తే అవి దొంగపట్టాలంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ఈ స్థలాలపై కూడా న్యాయపరమై ఇబ్బందులు కలిగించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.👉 సంతనూతలపాడు, కొప్పోలు చెరువులను సమ్మర్ స్టోరేజీ ట్యాంకులుగా ఏడాది కాలంలో నిర్మిస్తానని ఎంఎల్ఏగా గెలిచిన మొదటి పర్యటలోనే ప్రజలకు దామచర్ల హామీ ఇచ్చారు. కానీ ఆయన పదవీ కాలం పూర్తయ్యేనాటికి కూడా కనీసం వాటివైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు.👉 స్థానిక బైపాస్‌లో విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం వద్ద నుంచి లీజుకు తీసుకున్నారు. దాని ప్రకారం అందులో నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నా అది ప్రారంభం కాకపోవడంపై దాతలు దొరక్కే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.👉 స్థానిక కేశవరాజు కుంటలో పెళ్లి కానుక పేరుతో ధనికులైన, తెల్లకార్డు కూడా లేని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లకు ఎన్ఎస్పీ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి మరీ అప్పగించిన చరిత్ర దామచర్లదే. చివరకు ఈ వ్యవహారంపై తిరగబడ్డ సమీప కాలనీవాసులైన మహిళలపై పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టించి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన ఘనత దామచర్లదే.👉 దామచర్ల తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని డ్రైవింగ్ లైసెన్స్, టూ వీలర్ కాగితాలు చూపించాలని ట్రాఫిక్ ఎస్సై మహేష్ కోరినందుకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌నే ముట్టడించారు.బాబు మెప్పుకోసం..తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలు ఊరచెరువుపై చంద్రబాబు కన్నుపడింది. ఆ స్థలంలో భువనేశ్వరి హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ఆ భూమిని లీజుకు కేటాయించేందుకు యత్నాలు జరిగాయి. అప్పటి టీడీపీ మున్సిపల్ పాలకవర్గం అనుమతి కూడా ఇచ్చేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అడ్డుతగలడంతో అది కాస్తా ఆగింది. తిరిగి 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కన్ను మరోమారు ఆ ప్రాంతంపై పడింది. అధినేతను ప్రసన్నం చేసేందుకు దశాబ్దాలుగా ఊరచెరువు ఒడ్డున ఇనుపరేకులు, చెక్క వస్తువుల తయారీ దుకాణాలు ఏర్పాటు చేసు కుని పొట్టపోసుకుంటున్న ముస్లిం కుటుంబాలపై ప్రతాపాన్ని చూపారు దామచర్ల. రంజాన్ మాసం అని కూడా చూడకుండా వారి షాపులను కూల్చివేయించారు. దానిని హస్తగతం చేసుకోవాలని యత్నించినా బాలినేని ముస్లింలకు అండగా నిలిచారు. దీంతో నేటికీ వారి దుకాణాలు అక్కడే ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు అరాచకాలకు పాల్పడి నేడు ఎన్నికలు సమయం వచ్చేసరికి ముస్లింలకు అండగా ఉంటానంటూ ప్రవచనాలు వల్లిస్తున్నారు.జెడ్పీ పీఠంపైనా కుట్రే..2014 సాధారణ ఎన్నికలకు కొద్ది ముందుగా జిల్లా ప్రజాపరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 31 ప్రాదేశికాలను కై వసం చేసుకుంటే టీడీపీ 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు అభ్యర్థులను కొనుగోలు చేయడం ద్వారా, మరో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఎన్నికకు హాజరుకాకుండా పోలీసుల అండగా యత్నించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ తదితరులు అడ్డుకట్ట వేశారు. అయితే ఈదర హరిబాబు జెడ్పీ చైర్మన్‌గా ఎంపిక కావడం ఇష్టంలేని దామచర్ల చివరకు ఆయనను జెడ్పీ చైర్మన్ స్థానంలో కొనసాగకుండా చేసేందుకు ఎంతోమందిపై ఎన్నోరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు.కాపులపైనా కేసులుఅధికారంలో ఉన్నప్పుడు కాపులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జనార్దన్ నేడు జనసేన పొత్తు కలవడంతో కుల రాజకీయాలకు తెరతీశారు. నేతలను తమ వైపునకు తిప్పుకుంటే ఓట్లు వాటంతట అవే పడతాయనే భావనతో నేతలపై ఆకర్ష పథకాన్ని ప్రారంభించారు. నాడు కాపు సోదరునిపై గంజాయి కేసు పెట్టించారు. అంతే కాదు ముద్రగడపై టీడీపీ ప్రభుత్వ దమన కాండను నిరశిస్తూ కంచాలు మోగిస్తే దానిపై సైతం కేసులు పెట్టించిన విషయాన్ని కాపులు మర్చిపోలేదు. ఇలా అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన దామచర్లను జనం ‘నిన్ను నమ్మం’ బాబూ అంటున్నారు. -
దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు యుక్తాయుక్త విచక్షణ మరిచి ‘రాళ్లతో కొట్టండి.. కర్రలతో బాదండి..’ అని సెలవిస్తే పచ్చదండు ఊరుకుంటుందా? ‘నిన్ను చంపితే ఏం చేస్తావ్..’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నేతల గత వైఖరిని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ‘ఓటు వేయకుంటే పోటు.. అడ్డు తగిలితే వేటు’.. స్థూలంగా చెప్పాలంటే టీడీపీ సిద్ధాంతం ఇదే. ప్రజల ఆశీస్సులతో గద్దెనెక్కాలనే ఆలోచనకే తావు లేకుండా తమకు తెలిసిన ‘దండన’ విద్యనే పచ్చ నేతలు నమ్ముకున్నారు. నిత్యం తగువులే తలంపుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పారీ్టల నాయకులు, కార్యకర్తలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో టీడీపీ నేతల వికృత క్రీడకు బలైన రాజకీయ నాయకులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. అంతకు పది రెట్ల మంది అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చుపెట్టడమే కాకుండా తమ అహానికి, అవినీతికి అడ్డు వస్తున్నారనే కారణంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు మళ్లీ బరితెగించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని పచ్చమూకలు రెచ్చిపోయాయి. పల్లెల్లో దాడులకు తెగబడ్డాయి. తమకు అడ్డువస్తే అంతమొందించడమే లక్ష్యంగా రెచ్చిపోయాయి. నేడు అధికార పక్షంపై వికృత రాతలతో శునకానందాన్ని పొందుతున్న పచ్చమీడియా నాడు కళ్లుండి చూడలేదని కబోదుల్లా చోధ్యం చూశాయి. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అరాచకాల్లో కొన్ని ప్రధాన ఘటనలు ఎంపీటీసీ భర్తను చంపారు 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపూడి మండలం కెల్లంపల్లి సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా తేలుకుట్ల గురవమ్మ పోటీ చేశారు. ఏప్రిల్ 11న గోసుకొండ అగ్రహారంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడటంతో గురవమ్మ భర్త వెంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలులో చికిత్స ΄పొందుతూ మృతి చెందారు. ఏడాది వ్యవధికే దిగులుతో గురవమ్మ కూడా కన్నుమూసింది.దాడులకు అంతే లేదు..పీసీపల్లిలో 2017 జూలైలో వైఎస్సార్ సీపీ ఎంపీపీ బత్తుల అంజయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. 2015 ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన అప్పటి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌తోపాటు మరో ఏడుగురిపై అక్రమంగా కేసులు బనాయించారు. కొండపి నియోజకవర్గంలో అయ్యప్పరాజుపాలెంలో ఎంపీటీసీ ఎన్నికల రోజున ఐదుగురిపై దాడి చేసి గాయపరిచారు. జరుగుమల్లి మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయబాబుపై టీడీపీ నేతలు దుర్మార్గంగా రేప్ కేసు పెట్టించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో సాధారణ ఎన్నికల సమయంలో వెంకట్రావు అనే వ్యక్తి ఏజెంట్‌గా కూర్చున్నాడని అతనికి చెందిన రూ.5 లక్షల విలువ చేసే పొగాకును టీడీపీ నాయకులు తగలబెట్టారు. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీ బరితెగించింది. మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డి ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పేరుతో అరెస్టు చేయించారు. గాజులపల్లెలో దాష్టీకం2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని పుల్లలచెరువు మండలం మర్రివేముల నుంచి ఆ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో గాజులపల్లెలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను రెచ్చగొట్టడమే కాకుండా మర్రివేముల నుంచి 100 మంది టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లి దమనకాండ సృష్టించారు. ఇళ్లలోకి చొరబడి ఆడామగా తేడా లేకుండా బయటకు లాక్కుని వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల సొమ్ము లూటీ చేశారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని కాలితో తన్నడంతో ఆమెకు అబార్షన్ చేయాల్సి వచ్చింది. మమ్ము చిన్న అంజయ్య అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఎముకలన్నీ విరిగి ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. సుమారు పది వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పురుగుమందు డబ్బాలు తెచ్చి కొందరిపై పోసి రాక్షసానందం పొందారు. రాళ్లదాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త బలి పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామంలో 2018 సెపె్టంబర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రంగునీళ్లు చల్లి రెచ్చగొట్టారు. మరుసటి రోజు ఉదయం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొందరు బహిర్భుమికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన టీడీపీ నాయకులు కొందరు ఇంటిపైకి ఎక్కి ఒక్కసారిగా ఇటుక రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎనిమిరెడ్డి పెదబ్రహ్మయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.రెచ్చగొట్టి.. అక్రమ కేసులు పెట్టి.. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఆలూరి శ్రీహరి ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని 2019లో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ పెట్టడమే కాకుండా, బూతులు తిడుతూ.. తొడలు చరుస్తూ టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దాడికి దిగడమే కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, మరికొందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టించారు. కమ్మపాలెంలో దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రెయినేజీ, రోడ్లు, పబ్లిక్ టాయ్‌లెట్‌కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా టీడీపీ నేతలు అడ్డుపుల్ల వేశారు. కమ్మపాలెంలో 119 మంది దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లోకి వారిని వెళ్లనివ్వకుండా దామచర్ల అడ్డుకున్నారు. దళితులు మొత్తుకుంటున్నా వినకుండా ఆ స్థలంలో గుండా డ్రెయినేజీ నిర్మించి జులుం ప్రదర్శించారు. ఒంగోలు సమతా నగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారానికి ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలిన పచ్చ మందలో మేడికొండ మోహన్‌రావు, ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చౌదరి, ఆయన భార్య కీలకంగా ఉన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఏఆర్ కానిస్టేబుల్ భార్య మాట్లాడిన బూతులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయిన రోజున బండ్లమిట్టలోని దుకాణాలపై టీడీపీ నేతలు తెగబడ్డారు. ఓ ముస్లిం యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా, దుకాణం షట్టర్ మూతవేసి హల్చల్ చేశారు. గాయపడిన ముస్లిం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో కీలక సూత్రధారి, సమతానగర్‌లో రచ్చకు కారణమైన మేడికొండ మోహన్రావే. నగరంలో రాజకీయ ఘర్షణలు ఎక్కడ జరిగినా మోహన్‌రావు పేరే ప్రధానంగా వినిపిస్తోంది. మోటా నవీన్ అనే ఎస్టీ యువకుడిని చితకబాది ముఖంపై మూత్రం పోసిన కేసులో నిందితుడు రామాంజనేయ చౌదరికి ఆశ్రయం కలి్పంచి పోలీసులకు చిక్కకుండా కొద్ది రోజులపాటు అడ్డుపడింది మోహన్రావే అన్న ఆరోపణలున్నాయి. దాడి కేసులో జైలుకు వళ్లి వచ్చిన మోహన్‌రావును ముందు పెట్టి దామచర్ల జనార్దన్ ఆడిస్తున్న డ్రామాలను ఎల్లో పత్రిక ప్రముఖంగా ప్రచురించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
ABN కి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ పై రాళ్ళు...బాబు హస్తం జాగ్రత్త పవన్
-
సీఎం జగన్ కంటికి తగిలి వుంటే.. బాలినేని వార్నింగ్
-
కావాలనే సీఎం జగన్ ను టార్గెట్ చేశారు: బాలినేని
-
చాలా ఓర్పుతో ఉన్నాం...మీరు ఎన్ని దాడులు చేసిన 150 సీట్లు పక్కా..
-
తప్పుడు కేసులు పెడితే ఊరుకోను మాజీ మంత్రి బాలినేని ఫైర్
-
పోలీసులు ఓవర్ యాక్షన్ బాలినేని ఆగ్రహం
-
ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్.. బాలినేని ఆగ్రహం
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సమతా నగర్ ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. తెల్లవారు జామున 4 గంటలకు వైస్సార్సీపీ కార్యకర్తలు ఇండ్లలోకి వెళ్లి పోలీసులు భయబ్రాంతులకు గురి చేశారు. ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపడ్డారు. తనను కూడా అరెస్ట్ చేయండంటూ వన్ టౌన్ పీఎస్‌కి బాలినేని వెళ్లారు. ఒంగోలు నగరంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. తప్పులు చేయడం.. ఆ నెపాన్ని అధికార వైఎస్సార్ సీపీపై నెట్టేయడం వారికి రివాజుగా మారింది. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అండ్ కో అలజడి సృష్టించారు. పక్కా ప్లాన్ ప్రకారం అధికార వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు పన్నాగం పన్నారు. అది బెడిసికొట్టేసరికి ఎదురుదాడికి దిగారు. బుధవారం రాత్రంతా హంగామా సృష్టించారు. ఓటమి భయంతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేలా పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని వాస్తవాలు వక్రీకరిస్తూ రెచ్చిపోయారు. మహిళ అని చూడకుండా ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అసలు జరిగింది ఇదీ.. పార్టీ ఏదైనా తోటి మనిషి పట్ల సంస్కారవంతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య అన్నారు. నగరంలోని 37వ డివిజన్ సమతానగర్ 4వ లైన్లో శ్రీకావ్య, మరోచోట బాలినేని శచీదేవి వేర్వేరుగా గురువారం మహిళలతో మమేకం–సీ్త్రశక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన సమతానగర్ ఘటనపై బాలినేని శ్రీకావ్య మీడియాతో మాట్లాడారు. తాము ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామని, వచ్చిన వారిని అవమానించడం మాత్రం సంస్కారం కాదని అన్నారు. బుధవారం జరిగిన ఘటనలో గేటు వేసి తమను లోపలకు రానివ్వకపోగా తమతో పాటు ఉన్న గర్భిణీ అయిన రాజీనామా చేసిన వలంటీర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. తాము అవతలివైపు ఉన్న నాలుగు ఇళ్లకు వెళ్లి వస్తామని, ఇక్కడే ఉండమని గర్భిణీకి చెప్పామన్నారు. తాము అక్కడకు వెళ్లి వచ్చేసరికి ఆమెతో టీడీపీ వర్గీయులు గొడవపడుతుండటంతో ఎందుకు ఇలా చేస్తున్నారని తాము మాట్లాడామన్నారు. దానికి అవతలి టీడీపీ మహిళ వినలేని, చెప్పలేని బూతు పదజాలంతో మాట్లాడిందని, అవి మహిళలుగా తాము చెప్పలేని పదాలని అన్నారు. చివరకు పైనుంచి వాళ్ల కుమార్తె వీడియో తీస్తుండటంతో.. ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా, ఆమె మాట్లాడిన మాటలు కూడా తట్టుకోలేకుండా ఉన్నాయన్నారు. విషయం తెలుసుకుని మా వద్దకు వచ్చిన మా మమయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి పూర్తి విషయం చెప్పకుండా తామే సర్దిచెప్పి పంపామన్నారు. కానీ, వారు మళ్లీ తమ పక్కన ఉన్న మహిళల పట్ల కూడా అవమానకరంగా మాట్లాడి రెచ్చగొట్టారన్నారు. వారు వీడియో తీస్తూనే ఉన్నారని, తమను మెట్ల వద్దనే అడ్డుకున్నారని, అలాంటప్పుడు తాము వారుండే పైఅంతస్తులోని ఇంట్లోకి ఎలా వెళ్లగలమని అన్నారు. తమకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటు వేయమని చెప్పినా పర్వాలేదని, కానీ, అసభ్యపదజాలంతో దూషిస్తే మాత్రం సహించమని అన్నారు. మన ఇంటికి వచ్చిన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడటం అనేది సంస్కారమని, వైఎస్సార్ సీపీ వాళ్ల ఇళ్లకు కూడా టీడీపీ వారు ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లరా అంటూ శ్రీకావ్య ప్రశ్నించారు. ముందస్తుగా ఒక పథకం ప్రకారమే వాళ్లు ఉద్రిక్తత సృష్టించి దురదృష్టకర ఘటనకు కారణంగా నిలిచారన్నారు.