సాక్షి, ప్రకాశం: సానుభూతి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో శనివారం మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడా లేక వాళ్ల ఆఫీసు పగలగొట్టారని చెప్పేందుకు వెళ్తున్నాడో అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దేవాలయం అంటున్న చంద్రబాబు.. దేవుడైన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనుడు. చంద్రబాబు చరిత్ర వింటేనే అసహ్యం వేస్తుంది.
చదవండి: (ఇప్పుడే రాజీనామా చేస్తా: వల్లభనేని వంశీ)
రాష్ట్రంలో పని, పాట లేని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు తిరిగి వస్తాడు. తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అమిత్ షాను కలుస్తాడో చెప్పాలి. సానుభూతి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడు. తన హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించని ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరగగానే సీబీఐ ఎంక్వయిరీ జరపాలని కోరడం హాస్యాస్పదంగా ఉంది' అని మంత్రి బాలినేని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment