breaking news
Chandrababu Naidu
-
వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముందీ?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఎన్నిక జరిగిన 12వ తేదీ ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్ అన్నారు.ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచిపోతాడని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత అభద్రతాభావంతో ఉన్నాడని, అందుకే ఇలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలకు అర్థాన్నే చంద్రబాబు మార్చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచింది. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో వ్యవహరించింది.? మాది మంచి పాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు ప్రజాతీర్పును కోరకుండా, వ్యవస్థలను భ్రష్టు పట్టించి, అడ్డదోవలో గెలుపొందేందుకు తెగించింది..? ఎన్నికలు అంటేనే నిస్పక్షపాతంగా ఉండాలి. స్థానిక ఎంపీని పోలీసులు ఉదయం నుంచే అదుపులోకి తీసుకుని ఆంక్షలు విధించారు.కానీ కూటమి ప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమతో వందల కార్యక్తలను వెంట పెట్టుకుని సెగ్మెంట్లో తిరుగుతుంటే, వారికి పోలీసులు భద్రత కల్పించారు. ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ఓటర్ల నుంచి స్లిప్‌లను లాక్కుని, పక్క నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. టీడీపీలో మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి పదవుల్లో ఉన్న నాయకులే దొంగ ఓటర్ల అవతారం ఎత్తితే, ఆ పక్కనే కలెక్టర్, డీఐజీ, డీఏస్పీ, సీఐ వంటి అధికారులు ఉండి వారితో ఓట్లు వేయించారు. పైగా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయంటూ వారే ప్రకటించుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఫోటోలోనే దొంగ ఓటరు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దీనినేమంటారు? కూటమి ప్రభుత్వానికి తమ పనితీరు మీదే నమ్మకం లేదు. తమ గెలుపు మీద అంతకంటే నమ్మకం లేదు. అందుకే దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఒక చిన్న మండల స్థాయి ఎన్నికలకు ఇంతగా దిగజారిపోవాలా? దీనివల్ల ప్రభుత్వంకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? వ్యవస్థలనే నష్టపరిచేలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తీరు అత్యంత ప్రమాదకరం. ఈ పరిణామాలనే మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ప్రశ్నించారు.ఇంత వయస్సు వచ్చిన సీఎం చంద్రబాబుకు బహుశా ఇవే చివరి ఎన్నికలు కూడా కావచ్చు, జనం మంచిగా చెప్పునే పనులు చేయాలే కానీ ఇలాంటి మచ్చ తెచ్చుకునేలా చేస్తారా అని ప్రశ్నిస్తే తెలుగుదేశం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్ జగన్ గారు మాట్లాడిన దానిలో తప్పేముందీ? చంద్రబాబు చేసిన ఇటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఆయన చరిత్రలో మచ్చపడిన నేతగా నిలిచిపోతాడు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కనీసం పోటీ చేసిన అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వరా? పక్క నియోజకవర్గంకు చెందిన టీడీపీ నాయకులను తీసుకువచ్చి, క్యూలైన్లలో నిలబెట్టి వారితో ఓట్లు వేయించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. వీరంతా దొంగ ఓటర్లు అని మేం చెబితే వారిపై చర్యలు ఏవీ? పులివెందుల్లో జరిగింది రిగ్గింగ్.డీఐజీ కోయ ప్రవీణ్ తీరు దారుణం:కోయ ప్రవీణ్ డీఐజీ స్థాయి అధికారిగా వ్యవహరించిన తీరు దారుణం. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఒక అధికారి ఏకపక్షంగా వ్యవహరించే తీరు ఇదేనా? కడప పార్లమెంట్ సభ్యుడిని ఉదయం నుంచి నిర్భందంలోకి తీసుకుంటారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రిని మాత్రం పోలీస్ బందోబస్త్ మద్య సెగ్మెంట్లో విచ్చలవిడిగా తిరిగేందుకు అనుమతిస్తారు. ఇటువంటి వారి వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. సీఎం చంద్రబాబుకు ఇంత అభద్రతాభావం ఉందని అనుకోలేదు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడిన ఎంపీ రాహూల్ గాంధీ దేశంలో జరిగిన ఓట్ల అక్రమాలపై మాట్లాడారు. దీనిలో ఏపీలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి. దానిపై కూడా ఆయన ఎందుకు ప్రస్తావించలేదని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో జరిగిన అక్రమాలపై మాట్లాడకపోవడం వెనుక ఉద్దేశాలను వైయస్ జగన్ ప్రశ్నించారు. -
‘20 లక్షల ఉద్యోగాలన్నారు.. 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’
అనంతపురం: కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మరి చంద్రబాబు ప్రభుత్వం 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియర్ రాష్ట అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని, ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో 400 పరిశ్రమలు మూతబడ్డాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం-అభివృద్ధి జరిగిందని గౌతంరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ .జరిగిందని, వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్ పాల్పడ్డారని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనైతికమని గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. -
‘ఉప ఎన్నికల్లో చంద్రబాబు చేయని కుట్రలు లేవు’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యవస్థలను పతనం చేసి గెలుపొందిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత దారుణమైన ఎన్నికల కమిషన్‌ను తొలిసారి చూశామని ఆయన మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్మీట్లో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఏజెంట్లకు , ఓటర్లకు స్వేచ్చలేని పోలింగ్ జరిగింది ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. పులివెందులకు ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్టు ఎల్లోమీడియా చెప్తోంది. ఆఫీసుల్లో కూర్చుని మాట్లాడటం కాదు, జనంలోకి వచ్చి మాట్లాడాలి. ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఉన్నాయి. పోలింగ్‌కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళం సృష్టించారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా?, వైఎస్సార్సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా?, పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్ల వేయించుకోవటం కూడా గెలుపేనా?, ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి 35 సార్లు ఫిర్యాదులు చేశాం. 17 సార్లు మేమే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేశాం. 18 ఈమెయిల్స్ కూడా చేశాం. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కమీషనర్ శేషన్ లాగా స్వతంత్రంగా పని చేయమని కూడా చెప్పాం.హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చ, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది. అయినా సరే ఎన్నికల కమిషన్‌లో మార్పు లేదు. ఓటర్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయలేక పోయారు. ఇదేనా ప్రజాస్వామ్యం?, పోలింగ్ లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఇప్పటికీ టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదు. జమ్మలమడుగు, కమలాపురం నుండి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఎన్నికల కమిషన్ ప్రజల ముందు దోషిగా నిలపడింది. ఎన్నికల కమిషన్ వైఖరిపై మేము ధర్నా చేయాల్సి వచ్చింది. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలి. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం’ అని ఆయన స్పషం చేశారు. -
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రావడమే తరువాయి.. ‘‘మీ ఇష్టం ...మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు’’ అని ఇద్దరూ తెగ ఊరించారు. ఇంకో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని బస్ కండక్టర్‌కు తెలపండి.. నేను సేఫ్ డ్రైవర్ని’’ పదే పదే చెప్పారు కూడా. ఈ హామీకి సంబంధించిన ప్రచారం కోసం తయారు చేసిన ప్రకటనల్లో ‘‘మహిళలు ఏపీలోని ఏ పుణ్యక్షేత్రానైన్నా ఉచితంగా దర్శించి రావచ్చు’’ అని ఉండేది. ఒక యాడ్ ఎలా ఉందంటే... ‘‘టీ కూడా పెట్టకుండా బిజీగా రాసుకుంటున్నావు..’’ అని భర్త తన భార్యను ప్రశ్నిస్తాడు..‘‘మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు గాను పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేస్తున్నా’’.. అని భార్య జవాబు.. ‘‘అసలే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా’’ అని భర్త ప్రశ్న.. ‘‘మనం ఒక పనిచేస్తే సగం ఖర్చు తగ్గించుకోవచ్చు’’ అని భార్య సమాధానం..‘‘జనసేనకు ఓటు వేస్తే ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. దాంతో సగం ఖర్చు తగ్గిపోతుంది’’ అని భార్య వివరణరిప్లై.. ఇక అంతే కూటమికి ఓటు వేస్తే ఫ్రీబస్ అంటూ ఊదరగొట్టేశారు..అధికారం అయితే వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితోసహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా మహిళలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో, దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీలలో కొన్ని అయినా, కొంత మేర అయినా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని వీటిని అరకొరగా చేస్తుండడంతో ప్రజలలో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల షరతులు పెట్టడమే. ఉచిత బస్ స్కీమ్‌పై కూటమి మంత్రులు ఇంతకాలం పలురకాల పిల్లి మొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితం అని ఒకసారి, ఉమ్మడి జిల్లాలలో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథా ప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల ఒత్తిడి ఉండనే ఉంది. కడప నుంచి అమరావతి ఎప్పుడు ఉచిత బస్‌లలో వెళదామని స్త్రీలు ఎదురు చూస్తున్నారని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేసి రాష్ట్రమంతా పర్యటించవచ్చంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలానే చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం.. ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా హాపీగా వెళ్లి రావచ్చనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలోనే ఫ్రీ. ఇవేవి దూర ప్రాంతాలకు వెళ్లేవి కావు. ఎక్స్‌ప్రెస్ బస్సులను అనుమతించినా, అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్‌స్టాప్‌లుగా మార్చారు. అన్ని కలిపి 8458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్య పెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని పెంచి చెప్పినవే. ఏ మహిళైనా విశాఖ నుంచి తిరుపతికి వెళ్లాలంటే పది బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీల్లేదు. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోకాని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కాని టిక్కెట్ తీసుకోవల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్త్రీలు టిక్కెట్లు తీసుకోవల్సిందే అన్నమాట. మహిళలు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులు మారుతూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు వరకే ఉచితం కనుక, ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని మరో బస్సు ఎక్కాలన్నమాట. అమరావతి బస్సుల్లో కాని, ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపేవాటిల్లోనూ ఉచిత ప్రయాణం అవకాశం లేదు. నాన్‌స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ప్రతి పావుగంటకు నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి. అలాగే విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు ఇలా వివిధ పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి. ఇవి ఉచిత పథకంలో భాగం కాదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డులలో కూడా టిక్కెట్ కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్య క్షేత్రాలకు ఉచితంగా వెళ్లడం ఎలా సాధ్యం. చివరికి గిరిజనులు అధికంగా ప్రయాణించే పాడేరు ఘాట్ రోడ్డులో కూడా ఈ స్కీమ్ ఉండదట. అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్దపు ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా నమ్మబలికి , ఇప్పుడేమో అన్నీ కండిషన్స్ పెడతారా అని మహిళలను మండిపడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలి. ఎల్లో మీడియాలో మే నెల18 న రాసిన ఒక స్టోరీలో ఉచిత స్కీమ్ అమలుకు ఏపీ ప్రభుత్వంపై రూ.3182 కోట్ల భారం పడుతుందని లెక్కవేశారు. అదే మీడియా ఆగస్టు 10న రాసిన ఒక కథనంలో ఏడాదికి ఈ స్కీమ్ కింద భారం రూ.1942 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. అంటే దాదాపు 1200 కోట్ల మేర భారం తగ్గించారంటే ఆ మేరకు ఉచిత బస్ ప్రయాణ సర్వీసులలో కోత పెట్టినట్లే. నిజానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమును అమలు చేశారు. ఆ పథకం అమలులో ఆ రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో నెలకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నదని అంచనా. ఏపీలో కూడా తొలుత సుమారు రూ.250 కోట్ల వ్యయం అంచనా వేసినా, ఆ తర్వాత దానికి కోత పెట్టుకుంటూ స్కీమ్‌ను నామమాత్రం చేశారా అన్న సంశయం కలుగుతుంది. తెలంగాణలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులను రీయింబర్స్ చేయడం లేదు. దాంతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత కారణంగా తెలంగాణలో గౌలిగూడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఒక వార్త వచ్చింది. ఏపీలో గత జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా మార్చినందున కొంత భారం తగ్గుతుంది. అయినా స్కీమ్ అమలులో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఇలా ఉండగా, ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, టాక్సీల వారు వాపోతున్నారు.స్వయంఉపాధి కింద వేలాది మంది బతుకుతున్న వారికి ఇది ఒక గండంగా మారుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోలవారు నష్టపోకుండా వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అవి అమలు కావడం లేదు. దాంతో ఆటో యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొత్తమ్మీద చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో సిటీ బస్సుల్లో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం.అదేమీ పెద్ద ఖర్చు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి, ఆచరణలో అమలు చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నమాట.ఉచిత బస్ స్కీమ్ వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్య క్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలనుకున్న ఏపీ మహిళలు, కనీసం టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు ఇది పెద్ద నిరాశ మిగుల్చుతుందని భావించవచ్చు. ఇదన్నమాట! స్త్రీ శక్తి పేరుతో అమలు చేయతలపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం అసలు రంగు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు అంటూ ఆధారాలు చూపించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడమేంటి?. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీపోలింగ్ పెట్టింది.పులివెందులలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ప్రజలందరూ చూశారు. కిరాయి మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. టీడీపీ అరాచకాలకు ఉన్నతాధికారులు కూడా వంత పాడారు. సీసీ ఫుటేజీ, వెబ్ క్యాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయమెందుకు?. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు అని మండిపడ్డారు.టీడీపీ నేతలు ఇచ్చిన వీడియోల్లోనే దొంగ ఓటర్లు బయటపడ్డారు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు?. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలకు రిగ్గింగ్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఎక్కడా కూడా క్యూలైన్లలో మహిళలు కనిపించలేదు. గ్లాస్ దొంగలను.. సైకిల్, పువ్వు దొంగలు నమ్మలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారు. పులివెందులలో టీడీపీ నేతలే వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారు. కూటమిలో బీజేపీ, జనసేన డమ్మీ పార్టీలు. పులివెందులలో జరిగింది ఎన్నిక కాదు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారు’ అని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా పార్టీల్లో చంద్రబాబు బ్రోకర్లు ఉన్నారు. ఇతర పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నైజం. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా?. చంద్రబాబుకు పౌరుషం ఉంటే 2019-24 వరకు ఎంత జీతం తీసుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘వేసుకుందే దొంగ ఓట్లు.. ఉత్కంఠ ఎక్కడిది?’
సాక్షి, పులివెందుల: పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో.. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా? అని ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తాజాగా మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే.. లోకేశ్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది?. ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది?. తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు పులివెందులలో ఓటింగ్ జరిగితే కదా.. ఇలాంటి రాతలు అనైతికం కాదా?. మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి.ఎవరి కోసం స్టేట్మెంట్స్.. అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటింగ్ జరిగి ఉంటే కదా మీరు ఇలాంటి రాతలు రాయాల్సింది?. వేసుకుందే దొంగ ఓట్లు.. దానికి మళ్లీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు?. ఇక్కడ జరిగింది పులివెందుల, కడప జిల్లా వాళ్లకు మాత్రమే తెలుసు. రాష్ట్రమంతా తెలియదు కాబట్టి ఎల్లో మీడియాలో ఇక్కడ అంతా సవ్యంగా జరిగినట్లు వార్తలు రాయించేసుకుంటున్నారు. మీ పత్రిక, చానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికి ఎనలేని తృప్తి ఉండేది.. మాకు బాధ ఉండేది. కానీ, ఈ విధంగా పోలీసుల సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్‌ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటరు స్లిప్పులు లాక్కున్నారు.నిజమైన ఓటర్లు ఉన్నారా?నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్‌లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్‌లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్‌ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్‌తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
నమ్మక ద్రోహానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబు..
-
సాక్షి టీవీ కేసులో.. బాబు సర్కార్ కు సుప్రీం నోటీసులు
-
‘కన్ఫర్డ్ ఐపీఎస్’లకు రెడ్‌బుక్ కుట్ర బాధ్యతలు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు అడ్డగోలుగా వత్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు సన్నద్దమవుతోంది. అందుకోసం క్యాడర్ ఐపీఎస్ అధికారులు కాకుండా తమకు కొమ్ము కాసే ‘కన్ఫర్డ్ ఐపీఎస్’ అధికారులను నియమించాలని భావిస్తోంది. ఇది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. రెడ్‌బుక్ కుట్ర కేసులతో ఐపీఎస్‌లు బెంబేలు.. టీడీపీ కూటమి సర్కారు ఏడాదికిపైగా సాగిస్తున్న రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్‌లో న్యాయపరంగా, ఇతరత్రా ఇబ్బందులు తప్పవన్నది వారి ఆందోళన. ప్రధానంగా ఇంకా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రల్లో భాగస్వాములు కాలేమని డీజీ, అదనపు స్థాయి సీనియర్ ఐపీఎస్‌లే సహాయ నిరాకరణ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తున్నారు.సీఐడీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్ రెడ్‌బుక్ కుట్రలకు సహకరించలేనని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరో యువ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను పునరాలోచనలో పడేశాయి. రెడ్‌బుక్ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెబుతున్నారు. అస్మదీయ కన్ఫర్డ్ ఐపీఎస్‌లతో రెడ్‌బుక్ కుట్ర.. చంద్రబాబు ప్రభుత్వం మరో ఎత్తుగడకు తెరతీసింది. తమకు అస్మదీయులైన కన్ఫర్డ్ ఐపీఎస్‌ల ద్వారా రెడ్‌బుక్ కుట్రను తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి ఆర్‌ఈవీవోగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్‌ఈవీవోగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న రామ్మోహన్‌రావులను ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు సమాచారం.కరీముల్లా షరీఫ్‌ను పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరిలో ఒక జిల్లా, రామ్మోహన్‌రావును నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సీఐడీ విభాగంలో ఉన్న కన్ఫర్డ్ ఐపీఎస్ అ«దికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులకు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు వీలుగా క్యాడర్ ఐపీఎస్ అధికారులను అప్రాధాన్య పోస్టుటులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. -
99 పైసలకే 22 ఎకరాలు.. బాబు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకే కేటాయించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.ఇదే సమయంలో టీసీఎస్, లులు కంపెనీలకు భూ కేటాయింపులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కూడా కాగ్నిజెంట్‌కు సంబంధించిన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్నింటినీ కలిపి విచారిస్తామని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.99 పైసలకే 22 ఎకరాల భూ కేటాయింపులపై పిల్...కాగ్నిజెంట్ కంపెనీకి భూ కేటాయింపులను సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ విశాఖ జిల్లా అధ్యక్షురాలు నక్కా నమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, విశాఖ నడిబొడ్డున రూ.1,109 కోట్ల విలువ చేసే 22 ఎకరాల భూమిని ప్రభుత్వం కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చిందన్నారు. సేల్‌డీడ్ ద్వారా కాగ్నిజెంట్‌కు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. లీజు విధానంలో మాత్రమే భూ కేటాయింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు. -
చంద్రబాబు మోసకారి... పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ...
-
ప్రజాస్వామ్యం ఖూనీ
కళ్లు మూసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షిగా, రౌడీమూకల్లా చెలరేగిన పోలీసుల సాక్షిగా మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పచ్చమందలు అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. నిజమైన ఓటర్లు పోలింగ్ కేంద్రాల సమీపానికి రాకుండా అధికార పక్షం దౌర్జన్యాలకు దిగితే.... వాటిని ఎదిరించి వచ్చినవారిని పోలీసులు తరిమికొట్టారు. ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడినవారిని సైతం కనికరించలేదంటే... ఓటర్ల దగ్గర స్లిప్‌లు గుంజుకుని, మీ దగ్గర స్లిప్‌లు లేవుగనుక ఓటేయటం కుదరదని పోలీసులు దబాయించారంటే ఏపీలో పరిస్థితేమిటో అర్థంచేసుకోవచ్చు. ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం చేతగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రెండు స్థానాల్లో అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని పాyð క్కించారు. దీన్ని కప్పిపుచ్చ టానికి బుధవారం రెండు కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్ తంతు నిర్వహించి అయిందనిపించారు. తొలినాటి ఉదంతాలే మర్నాడూ పునరావృతమయ్యాయి. స్థానికేతర టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగిపోతుంటే చోద్యం చూసిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక నాయకుల్ని అరెస్టులతో, గృహనిర్బంధాలతో ఎటూ కదలనివ్వలేదు. అభ్యర్థులను తిరగనివ్వలేదు.అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్రమంగా నాలుగు గ్రామాల పోలింగ్ కేంద్రాలను 2 నుంచి 4 కిలోమీటర్ల దూరాల్లోవున్న వేరే గ్రామాలకు తరలించటంతోనే ఈ ఉప ఎన్నికల ప్రహసనం మొదలైంది. అన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటేయటం వృద్ధులకూ, అనారోగ్యం బారినపడిన వారికీ అసాధ్యమని లెక్కేసుకుని ఈ మార్పు చేశారు. మహిళలు, వృద్ధులతోసహా సాధారణ ఓటర్లంతా ఇలాంటి మాయోపాయాలను బేఖాతరు చేశారు. కానీ వారికి రక్షణగా నిలబడాల్సిన పోలీసులే వృత్తి ధర్మానికి ద్రోహం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలు మార్చటాన్ని హైకోర్టు తప్పుబట్టినా, చివరి నిమిషంలో సవరించటం అసాధ్యమని భావించింది. ఇదే అదునుగా జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు వంటి చోట్లనుంచి వచ్చిన రౌడీమూకలు ఎడాపెడా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో వుండగానే దొంగ ఓటర్లు బారులు తీరారంటే ఈ బరితెగింపు ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలిసో తెలియకో తమ ‘ఘనత’ను చాటుకోవటానికి జిల్లా కలెక్టర్ ఈ ఫొటోలనే సామాజిక మాధ్యమాల్లో వుంచి నగుబాటుపాలై తిరిగి వాటిని తొలగించాల్సి వచ్చింది. అధికారులకు వ్యక్తిగత స్థాయిలో ఇష్టాయిష్టాలుండొచ్చు. అధికార పార్టీకి పరిచారికలుగానో, పాలేళ్లుగానో మారాలని ప్రాణం కొట్టుమిట్టాడొచ్చు. అలాంటివారు రాజీనామా చేసి పోవాలితప్ప, జనం ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును నెలనెలా జీతాలుగా తీసుకుంటూ... కుటుంబాలను పోషించుకుంటూ కాలసర్పాల మాదిరిగా అదే జనాన్ని కాటేయాలని చూడకూడదు. సిగ్గూ లజ్జా, మానాభిమానాలు వున్నవారెవరైనా ఇలాంటి హీనస్థితికి దిగజారతారా? ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరమటం మాత్రమే కాదు... కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి రానీయకుండా నిర్వహించిన ఈ ఉప ఎన్నికలు ‘ప్రశాంతంగా’ జరిగాయని ప్రకటించటానికి అధికార యంత్రాంగానికి ఏమాత్రం సిగ్గనిపించకపోవటం విస్మయం కలిగిస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం అని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించింది. మరి అక్కడుండే వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? మంత్రి సమక్షంలోనే పోలింగ్ ఏజెంటును ఒక్కడిని చేసి అత్యంత దారుణంగా కొట్టారన్న సమాచారం ఆ సంఘానికి చేరిందా? అనేకచోట్ల ఏజెంట్లు లేకుండానే పోలింగ్ కొనసాగిన వైనం ఆ సంఘానికి తెలుసా? ఓటర్లెవరో, కానివారెవరో గుర్తించటానికి ఏజెంట్లుంటారు. పోలింగ్ పూర్తయ్యాక అంతా సవ్యంగా పూర్తయినట్టు వారినుంచి సంతకాలు తీసుకుంటారు. జరిగిన తంతు చూస్తుంటే ఆ సంతకాలను కూడా ఫోర్జరీ చేయదల్చుకున్నారా అనే సంశయం ఏర్పడుతోంది.పోయే కాలానికి కుక్కమూతి పిందెలని నానుడి. సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడటం ఆదినుంచీ అలవాటైన బాబుకు ‘అతని కంటె ఘనుడ’న్నట్టు పుత్రరత్నం తోడయ్యాడు. అందుకే ఈసారి బరితెగింపు అవధులు దాటిన వైనం కనబడుతోంది. ఇలాంటి దుష్టపోకడల్ని చూస్తూ వూరుకుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టదు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రహసన ప్రాయంగా మారిన ఈ ఉప ఎన్నికలను రద్దుచేయాలి. బాధ్యులైన అధికార్లను సాగనంపాలి. వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలి. -
YS Jagan: రాసిపెట్టుకో 2029 ఎన్నికల్లో ఇదే జరుగుతుంది
-
బాబు నీకు ఇదే ఆఖరి ఎలక్షన్..!
-
‘పులివెందులలో పోలీసులు, వైఎస్సార్సీపీ మధ్య ఎన్నికలు జరిగాయి’
సాక్షి, విశాఖ: నేడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నాయకులు. పులివెందులలో పోలీసులు, వైఎస్సార్సీపీ మధ్య ఎన్నికలు జరిగాయని అన్నారు. కూటమి సర్కార్‌ను గద్దె దింపే వరకు ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృతస్తాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘ప్రతీ రోజూ జగన్‌ను దళితులు తలుచుకుంటారు. దళితుల పక్షపాతి వైఎస్ జగన్. 20శాతం మంత్రి పదవులు దళితులకు జగన్ ఇచ్చారు. దళితులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు ఏ పథకాలు రావడం లేదు. దళితులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. మోసానికి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు. మోసానికి మరో పేరు చంద్రబాబు. ఎస్సీలు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ క్యాస్ట్ అని జగన్ నమ్మారు. సామాజిక న్యాయ మహా శిల్పాన్ని బాబు, లోకేష్, పవన్ ఒక్కసారైనా సందర్శించారా?. టీడీపీ గూండాలతో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. సూర్య చంద్రులు ఏకమైనా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్. నేడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు. గడిచిన ఎన్నికల్లో అన్ని కులాల కంటే వైఎస్సార్సీపీకి దళితులు అధికంగా ఓటేశారు. దళితులకు జగన్ అన్ని విధాలుగా న్యాయం చేశారు..టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ..‘దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నాడు. మిమ్మల్ని గద్దె దింపే వరకూ నిద్రపోయేది లేదు. డౌన్.. డౌన్ చంద్రబాబు అనే నినాదాలు ఊరు.. వాడా మొగాలి. చంద్రబాబు ఇంకా వెయ్యి రోజులే ముఖ్యమంత్రిగా ఉంటారు. పోలీసులకు, వైఎస్సార్సీపీకి మధ్య పులివెందుల ఎన్నిక జరిగింది. దళితుల ఆత్మగౌరవాన్ని 175 అడుగుల ఎత్తులో జగన్ నిలబెట్టారు. తెల్లవారింది మొదలు జగన్ గెలుపు కోసం పని చేస్తాం అని అన్నారు. -
చీకట్లో బాబు, రేవంత్ రాహుల్ తో హాట్ లైన్..! బండారం బయటపెట్టిన జగన్
-
బీటెక్ రవి, డీఐజీ కోయ ప్రవీణ్ ఎవరు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం.. ఒక్కో ఓటర్‌కు ఒక్కో రౌడీని దింపారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ నాయకుడు బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది పులివెందులలో మోహరించారని అన్నారు.పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్ పార్టీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఒక్కో ఓటర్ కోసం బయటి నుంచి ఒక్కో రౌడీ వచ్చారు. ప్రతీ పోలింగ్ బూత్‌కు 400 మందిని మోహరించారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రొత్సహించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారు. స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా?. ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారు.వాళ్లంతా ఎవరు?..మంత్రి సవిత ఆధ్వర్యంలో బయటి నుంచి వ్యక్తులు పులివెందులకు వచ్చారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డి.. వారిని తీసుకొచ్చారు. ఈ కొత్తపల్లిలో పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మకాం వేశారు. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలీసుల సమక్షంలోనే బయటివాళ్లు వచ్చి పాగా వేశారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది.. బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులు.. దాదాపుగా మొత్తం 7 వేలమంది పులివెందులలో మోహరించారు.ఎర్రబల్లిలో ఓటర్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. కనంపల్లి సర్పంచ్‌ను పోలీసులు గన్‌తో బెదిరించారు. కనంపల్లిలో బీటెక్ రవి తమ్ముడు దౌర్జన్యం చేశాడు. కనంపల్లిలో ఓటు కోసం ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిని ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లే చెప్పారు. రీపోలింగ్‌లోనూ యథేచ్చగా దొంగ ఓట్లు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు. టీడీపీ వాళ్లు వందలాది మంది ఉన్నా పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ వాళ్లే లక్ష్యంగా..ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ మహిళా ఏజెంట్లపై దాడి చేశారు. అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. రిగ్గింగ్ చేయడానికి వెళ్లిన టీడీపీ వాళ్లకు చక్కగా పోలీసులు స్వాగతం పలికారు. ఓటు వేస్తామంటూ.. కొందరు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. కోయ ప్రవీణ్.. టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ.. ఆయన బలగం ఈ ఎన్నిక నిర్వహించాయి. టీడీపీ ప్రభుత్వం మాట వినని ఐపీఎస్ అధికారులకు తప్పని వేధింపులు. బాబు మాట వినకుంటే డీజీ స్థాయి వాళ్లు కూడా జైలుకే! అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా.. క్యూ లైన్లో దర్జాగా నిలబడి దొంగ ఓట్లు వేసిన వాళ్ల ఫొటోలతో సహా వివరాలను వైఎస్ జగన్ చదివి వినిపించారు. -
సాక్షి ప్రసారాలు నిలిపివేత.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ సహా పలు ఎంఎస్‌వోలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై మూడు వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం.. కేబుల్ టీవీ నిబంధనలను ఉల్లంఘించి సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకుంది. ఏపీ ఫైబర్ నెట్, ఎంఎస్‌వోలు సాక్షి టీవీ ప్రసారాలను అక్రమంగా నిలిపివేయడంపై యాజమాన్యం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ పీఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్ విచారణ జరిపింది. నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వమే సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకుంటున్న వైనాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సీనియర్ న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, వి.గిరి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేతపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్‌లోని కీలక అంశాలు..టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ ఫైబర్ నెట్ చానెల్స్ ప్యాకేజీ నుంచి సాక్షి టీవీని తొలగించారుసాక్షి టీవీ ప్రసారాలు ఆపి స్వతంత్ర జర్నలిజం గొంతు నొక్కుతున్నారురాష్ట్రంలోని మేజర్ ఎంఎస్‌వో ఆపరేటర్స్‌ను అధికారులు తీవ్రంగా బెదిరించారుసాక్షి టీవీని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారుతమ మాట వినని ఎంఎస్‌వోలకు కరెంటు కట్ చేస్తున్నారురాజకీయ ప్రయోజనాలతో సాక్షిటీవీని బ్లాక్ చేస్తున్నారని.. దీని వల్ల తమకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని ఎంఎస్‌వోలు అంటున్నారుఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వమే మీడియా స్వేచ్చను హరిస్తోందిరాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(ఎ) ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారుఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీని తొలగించడం చట్ట విరుద్ధంఇది టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ చట్టం 2017, క్లాజ్ 17కు విరుద్ధంఏదైనా చానల్‌ను తొలగించాలంటే 21 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి, కానీ దీన్ని పాటించలేదుఇదే తరహాలో మల్టీసిస్టం ఆపరేటర్స్ (ఎంఎస్ఓ)లపై ఒత్తిడి తెచ్చి సాక్షి టీవీని తొలగించారుసాక్షి టీవీని తిరిగి ప్యాకేజీ చానల్స్‌లో పెట్టాలని ఢిల్లీ హైకోర్టు, టీడీ శాట్ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఫైబర్‌నెట్ అమలు చేయలేదుఅన్ని అంశాలను పరిశీలించి సాక్షి టీవీ ప్రసారాలను అన్ని ప్లాట్‌ఫాంలలో పునరుద్ధరించాలిమీడియా స్వేచ్ఛను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని నియంత్రించాలి. -
అమలు చేశారా బాబూ!.. షరతుల సంగతేంటి?
సత్యం, అసత్యాలతో నిమిత్తం లేదు.. వినేవారు ఏమనుకుంటారో అన్న సందేహం అస్సలు రాదు. తనను తానే పొగిడేసుకుంటారు. చెప్పే దాంట్లో నిజం ఉందన్న భ్రాంతి కలిగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి మచ్చు తునకలివి. మాటల మార్చేందుకు ఏమాత్రం తటపటాయించరు కూడా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చంద్రబాబు ఎక్కడ ఏ ఉపన్యాసం చేసినా చిత్ర, విచిత్రాలు కనిపిస్తాయి.పాడేరులో ఆదివాసి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఆయన ప్రసంగం చూడండి. ఇక్కడ తనకంటే మేధావి ఎవరైనా ఉన్నారా అని అడగటమూ.. లేరని ఆయనే తేల్చయడం కూడా జరిగిపోయిందట. తనది ముందు చూపని.. సూపర్ సిక్స్ ప్రకటించాం.. సూపర్ హిట్ చేశాం అని కూడా ఆయనంతకు ఆయన ప్రకటించుకున్నారు. ఈ మాటలిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించి తనకు తోచిన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రింగ్ రోడ్డుతో సహా పలు కార్యక్రమాలు తనవే అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హెలికాఫ్టర్‌లో పర్యటిస్తుంటే గిరిజన ప్రాంతంలో ఉన్న కొండలు చూసి ఆయన ముగ్దులయ్యారట. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్నారు.ఒకప్పుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని వ్యాఖ్యానించి విమర్శలకు గురైన చంద్రబాబు ఇప్పుడు గిరిజనులలో పుట్టాలని అనుకుంటున్నానని చెప్పడం స్వాగతించవలసిన విషయమే. కాకపోతే, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్న మాటలో చిత్తశుద్ది ఉందా అన్న సంశయం రావచ్చు. ఆయనకు నిజంగానే ఈ కోరిక ఉంటే, ఈ జన్మలోనే ఉంటానని చెప్పవచ్చు. తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత గిరిజన ప్రాంతంలోనే ఉంటానని ప్రకటించి ఉంటే ఆయన కోరిక తీరేది కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీలు లేకుండా చేసేశామని ఆయన అన్నారట. అందులో వాస్తవం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలు సరైన రోడ్లు లేక గిరిజనులు పడేపాట్లు ఇన్నీ అన్నీ కావు. ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా, అవి ముందుకు సాగడం లేదని గిరిజనులు గుర్రాలపై తిరుగుతూ నిరసన తెలిపారు.పీ-4 కోసం బయట నుంచి మార్గదర్శులను తెచ్చి గిరిజనులకు సహాయ పడతామని ఆయన అన్నారు. అంటే దీని అర్ధం ఇంతవరకు ఈ ప్రాంత పేదలను దత్తత తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదని చెప్పకనే చెప్పినట్ల అయ్యింది. కాగా చంద్రబాబుకు పీ-4 పిచ్చి పట్టిందా అంటూ ఆయనకు మద్దతు ఇచ్చే ఒక మీడియా రాసిన వ్యాసం చూసిన తర్వాతైనా అందులో ఉన్న డొల్లతనం అర్థమై ఉండాలి. గిరిజనులకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలేమిటి? వాటిని ఏ మేరకు అమలు చేశామో చెప్పకుండా, అది తెచ్చా! ఇది తెచ్చా! అని ప్రచారం చేసుకుంటే ఏమి ప్రయోజనం? గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని చెప్పిన హామీ ఎందుకు నెరవేర్చలేకపోయారో వివరించి ఉండాలి కదా! పాడేరు మెడికల్ కాలేజీని త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. బాగానే ఉంది. కానీ, ఏడాది కాలంలో ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదు?.వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పూనుకుని భవనాల నిర్మాణాలు కూడా చేపడితే, మెడికల్ సీట్లు అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ఏ రకంగా రాష్ట్రానికి, గిరిజన ప్రాంతానికి మేలు చేసినట్లు?. గిరిజన ప్రాంతాన్ని తానే అభివృద్ది చేశానని, ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితి అలా కనిపించదు. గిరిజనుల ఇళ్ల వద్దకే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు గిరిజనులు రేషన్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.కేంద్ర స్కీములను కూడా తన ఖాతాలో వేసుకుని మాట్లాడారు. ఫలానా పనిలో తన వాటా ఇంత అని చెప్పుకుంటే ఫర్వాలేదు. కానీ, మొత్తం తానే చేశానని చెప్పడం ద్వారా నగుబాటుకు గురవుతున్న విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిందన్న విషయం ప్రజలకు తెలియదా?. పోనీ హైదరాబాద్‌లో అన్ని చేశానని చెప్పుకునే చంద్రబాబు విశాఖ, విజయవాడ తదితర ముఖ్యమైన నగరాలకు ఫలానా పని చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలు.. సూపర్ హిట్ అని ప్రచారంలో పెట్టడం ఆయన మేధావితనానికి నిదర్శనం అనుకోవాలి. జనం కూడా అన్ని హామీలు నెరవేర్చేశారని భావించాలన్నమాట. నిజమే! అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఆయనంత మేధావి లేకపోవడం వల్ల ఆ హామీల గురించి ఎవరూ ప్రశ్నించి ఉండకపోవచ్చు. లేదా పోలీసులతో ఎక్కడ కేసులు పెట్టిస్తారో అన్న భయంతో ఆ విషయాలు అడిగి ఉండకపోవచ్చు.చివరికి వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును సభ వద్దకు అనుమతించకపోవడంతో ప్రశ్నించే వారే లేకుండాపోయారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరిందా?. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?. తల్లికి వందనం సహా రైతు భరోసా, తదితర స్కీములు ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది అరకొరగా అమలు చేస్తే అవి సూపర్ హిట్ అయినట్లా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి ఇచ్చిన హామీ ఏమిటి? ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని సంకల్పించినా, అన్ని రకాల బస్సుల్లో ఆ సదుపాయం కల్పించకుండా షరతులు పెట్టడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? కాదా?. ఎన్నికల మేనిఫెస్టోలోని మిగిలిన 145 హామీల సంగతేమిటి?. అవి అమలు చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటున్నారా?. వాటి ఊసే ఎత్తడం లేదే!. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పగలిగిన ధైర్యం అనండి.. నేర్పరితనం అనండి ఆయన సొంతమే అని అనుకోవాలి!.ఇక గిరిజన ప్రాంతంలో సభకు వెళ్లి అక్కడ కూడా వివేకా హత్య కేసు ప్రస్తావన తేవడంలోని దురుద్దేశం అర్దం కావడం లేదా?. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో దాని గురించి ఈ ప్రచారం చేయడం అవసరమా?. పులివెందుల ప్రజలకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఉంటుందా?. ఒకపక్క టీడీపీకి చెందిన వారు రౌడీయిజం చేస్తుంటే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై అంత దారుణంగా దాడి చేసినా, అలాంటి ఘోరాలను అరికట్టకపోగా, వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి ఏవేవో మాట్లాడితే నమ్మడానికి జనం పిచ్చివాళ్లని అనుకుంటున్నారా?. రౌడీయిజం, అబద్దాలు రాజకీయాలకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరమే అనుకోవాలి. అబద్దాలు చెప్పడంలో దేశంలోనే ఆయనను మించిన నేత లేరని ప్రత్యర్ధి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. వారు చేసే విమర్శలలో ఒక్కదానికి కూడా ఆయన నేరుగా ఎప్పుడూ జవాబుఇవ్వలేదు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడగల సత్తా చంద్రబాబుకు ఉందని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో పలుమార్లు అన్నారు.ఆ సమయంలో చంద్రబాబు లేచి తాను ఆడిన అబద్దమేమిటో చెప్పాలని ఎప్పుడూ సవాల్ చేసినట్లు కనిపించలేదు. రౌడీయిజం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గూండాలు చేస్తున్న రౌడీయిజం గురించి ముందుగా ఆయన బదులు ఇస్తే బాగుంటుంది. ఏమైందో కానీ, టీడీపీకి చెందిన ఒక మీడియానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై, రౌడీయిజంపై విమర్శలు చేసింది. దానికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తం. ఆయనకు ముందుచూపు ఉన్నమాట కొంతవరకు ఒప్పుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలను ఆయన దూషించినంతగా మరెవరూ దూషించి ఉండరు. కానీ, ఆ రెండు పార్టీలతో మళ్లీ జతకట్టగలరు. 2024 ఎన్నికల సమయంలో ఎంత ముందు చూపులేకపోతే బీజేపీని బ్రతిమిలాడి మరీ పొత్తు ఎలా పెట్టుకుంటారు?. దాని ద్వారా టీడీపీ ఎన్నో రకాల మాయోపాయాలను ప్రదర్శించగలిగింది కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్ కావొచ్చు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదు. ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులున్నాయో చెప్పడానికి పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూత్ లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్ లలో లేకుండా చేసి రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల ప్రోద్భలంతో రిగ్గింగ్ చేసుకున్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడేపులివెందులలో జరిగింది ఎన్నిక అంటారా?పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు.. బాధ్యతలుంటాయ్. నకిలీ ఓటర్లను గుర్తించడం , అభ్యంతరాలను తెలియజేయడం , పోలింగే వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలుంటాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ -12 ఇస్తారు. వైఎస్సార్సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ -12 ను పోలీసులు,టిడిపి వాళ్లు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికలో జరిగాయా?. ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా?..ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుంది. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది వాళ్ల విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు. సాక్షాత్తూ పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్.. ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరపండి.. .. ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు వేసే అవకాశం లేదు. ప్రతీ బూత్ లో వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా?. ఎవరెవరు బయటి నుంచి వచ్చారు..ఎవరెవరు బూత్ లను ఆక్రమించుకున్నారో ఆధారాలిస్తా. అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారు. ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు ... గతంలోనూ అదే జరిగిందిప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూత్ లను మార్చేశారు. పోలింగ్ బూత్ లు మార్చడం వల్ల నాలుగు వేల ఓట్ల పై ప్రభావం పడింది. పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు ఆరు పంచాయతీల పరిధిలో జరిగాయి. ఈ ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు ఈ గ్రామాల్లో పాగా వేశారు. పోలీసులే వారిని ప్రోత్సహించారు.ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారుపోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు. ప్రతీ బూత్ లో 400 లకు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారు. ఒక్కో ఓటరుకి ఒక్కో రౌడీని పెట్టారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్ లలో తిష్టవేశారు. బిటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదు. కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేశాడు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి..వారి స్లిప్పులను లాగేసుకున్నారు. ఆ స్లిప్పులతో వాళ్లు ఓట్లేసుకున్నారు. టిడిపికి ఓటేసేవాడైతేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనిచ్చారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన టిడిపి నేతలు పులివెందులలో ఓట్లేశారు. ఇవాళ జరిగే రీపోలింగ్ లో కూడా దొంగఓట్లు వేశారు. అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులు తరిమితరిమి కొట్టారు. మహిళ ఏజెంట్లను కూడా ఇబ్బంది పెట్టారు. టీడీపీ వాళ్లు వందల మంది ఒకేచోట ఉన్నా.. షామియానాలు వేశారు.పోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!ఏరికోరి పోలీసులను నియమించుకున్నారు. పచ్చచొక్కాలు వేసుకుని పోలీసులు టిడిపికి పనిచేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ .. టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజి కోయ ప్రవీణ్ పర్యవేక్షలో ఈ ఎన్నిక జరిపారు. చంద్రబాబు మాట వినకపోతే డిజి స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పీఎస్.ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్,విశాల్ గున్నీల పై కేసులు పెట్టారు ..కొందరిని అరెస్ట్ చేశారు. ఈ డీఐజీ మాఫియా రింగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు , ఇసుక,మట్టి,క్వార్ట్జ్, సిలికా, పేకాట శిభిరాలకు అనుమతి వరకూ అంతా డిఐజినే చూసుకుంటున్నాడు. ఈ కలెక్షన్లలో వాటాలను చంద్రబాబు,చినబాబు,ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఇలాంటి డీఐజీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించారువైఎస్సార్సీపీ వాళ్లే లక్ష్యంగా..ఉదయం 4 గంటల నుంచే టిడిపి వాళ్లు పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పులివెందుల టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి నేతలు రెచ్చిపోయారు. మోట్నుతలపల్లిలో పోలింగ్ బూత్ లకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓటర్లను అడ్డుకున్నారు. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోనికి రాకుండా అడ్డుకున్నారని ఓటర్లే చెబుతున్నారు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి పోలీసులు గన్ తో బెదిరించారుఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన టిడిపి వాళ్లకు పోలీసులే స్వాగతం పలికారు. కనంపల్లిలో పోలింగ్ బూత్ లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు. ఓటు వేయనివ్వండని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. కనంపల్లి ఓటర్లు ఓటు వేయలేకపోయామని ఆవేదన చెందారు. పులివెందుల జడ్పీటీసి అభ్యర్ధి హేమంత్‌ను ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. భూపేజ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డికి పులివెందులలో పనేంటి?. పులివెందుల రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి డిఐజి హడావిడి చేశాడు. పులివెందులలో డీఎస్పీ ‘‘కాల్చిపడేస్తా నాకొడకా’’ అని వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించాడు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లో రౌడీయిజం చేశాడు. రాయచోటి ఎమ్మెల్యే,మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒంటిమిట్టలో ఏం పని?చంద్రబాబుకి ఇదే హెచ్చరికప్రజలు ఓటేస్తారనే నమ్మకం నీకుంటే ఎందుకు ఇలాంటి పనులు చేయడం చంద్రబాబు. ప్రజలు నీకు ఓటు వేయరనే ఇలా దిగజారిపోయావు?. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలానే చేశాడు. నంద్యాలలో గెలిచి సంకలు గుద్దుకున్నాడు. ఏడాదిలోనే నంద్యాలలో గెలిచాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని భూ స్థాపితం చేశాం. కళ్లుమూసి తెరిచేలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. మరో మూడున్నరేళ్లు కూడా అలానే గడిచిపోతుంది. ప్రజాస్వామ్యం చేజారిపోతే నక్సలిజం పుడుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలిజరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు తప్పుడు పునాదులకు బీజం వేస్తున్నారు. రేపు ఇదే మీకు చుట్టుకుంటుంది. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావొచ్చు. కృష్ణారామా.. అనుకుంటూ ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోర్టులను కోరతాం. మీడియా ప్రతినిధి: ఓట్ చోరీ పేరిట ఇండియా బ్లాక్ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?ఓట్లు చోరీ అయ్యాయని మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది ఏపీలో మాత్రమే. అంటే.. పోలింగ్ నాటికి-కౌంటిగ్ నాటికి 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఎలా?. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఏరోజైనా చంద్రబాబు గురించి మాట్లాడాడా?. కానీ, నా గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అక్రమాల పై ఏరోజైనా మాట్లాడాడా?. కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారు. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీకి టచ్‌లో ఉన్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
రీపోలింగ్ లో కూడా రిగ్గింగే..
-
బోగస్ ఎలక్షన్.. కాళ్లు పట్టుకున్నా కనికరించలే..!
-
ఈసీ డ్రామా.. పులివెందులలో రీపోలింగ్ బహిష్కరిస్తున్నాం: అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: పులివెందులలో ఈరోజు జరుగుతున్న రీపోలింగ్‌ను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్‌ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్‌లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు తెల్లవారు జామున 2 గంటలకు కేవలం 2 బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్‌లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం రెండు బూత్‌లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నాం. మొత్తం 15 బూత్‌లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. నిన్న మీడియాను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు.ఒక గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోడానికి జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తాన్ని గ్రామంలో దించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది. నిన్న జరిగిన అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రీపోలింగ్ పెడుతున్నారు. అన్ని సెంటర్లలో పోలీసుల సంపూర్ణ సహకారంతో మా ఏజెంట్స్‌ను బయటకు నెట్టేశారు. 15 ఊరులో ప్రజలను అడిగితే నిజానిజాలు తెలుస్తాయి. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.. నిజమైన ఓటర్లను, ప్రజలను ప్రశ్నించి చూడండి. నిజాలు బయటకు వస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పులివెందులలో ప్రజాస్వామ్యానికి పాతర.. పోలీసు రాజ్యంలో పచ్చ మూకల రిగ్గింగ్ (ఫొటోలు)
-
YS Avinash Reddy: ఇంత చెత్త ఎన్నికలు రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు..
-
Magazine Story: ప్రజాస్వామ్యానికి పాతర.. పచ్చ ముఠా దొంగ ఓట్ల జాతర
-
పులివెందులలో అరాచకాలపై YS జగన్ ఉగ్రరూపం
-
మీ కాళ్లు పట్టుకుంటాం..మా ఓట్లు ఏమయ్యాయ్?
సాక్షి, అమరావతి/పులివెందుల : ‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి.. మీ కాళ్లు పట్టుకుంటాం..’ అంటూ పులివెందుల మండల ఓటర్లు వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించలేదు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ నేతల అడ్డగోలు వ్యవహారాలు, దౌర్జన్యాలు, ఓట్లు కొల్లగొట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను విస్తుగొలుపుతున్నాయి. ప్రజలు ఓట్లు వేయకుండా గ్రామాలకు గ్రామాలనే నిలువరించడం ఇప్పుడే చూస్తున్నామని పులివెందుల మండల ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలంటే ఓటర్లందరూ వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. పోలింగ్ రోజున వృద్ధులు, నడవలేని వారిని పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది భుజాలపై మోసుకుని వెళ్లి ఓటు వేయించడం గతంలో అందరూ చూశారు. మంగళవారం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఇలాంటి ఘటన మచ్చుకు ఒక్కటి కూడా కనిపించలేదు. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ పచ్చ తాలిబన్ల అరాచకం రాజ్యం ఏలింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ బూత్‌ల వరకూ వెళ్లనివ్వకుండా పోలీసులే చెక్‌పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. దీంతో మేం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాం.. మా ఓట్లన్నీ ఏమయ్యాయ్? అని పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని ఓటర్లు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ అడ్డగింత ప్రజాస్వామ్యబద్ధంగా ఉప ఎన్నిక జరిగితే ఘోర పరాజయం తప్పదని ముందే పసిగట్టిన చంద్రబాబు.. కుట్రలు, కుతంత్రాలు పన్నిన విషయం తెలిసిందే. ఒక గ్రామం పోలింగ్ బూత్‌ను మరో గ్రామానికి మార్చేసి, ఓటర్లు ఓటు వేయడానికి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ముందస్తు పన్నాగంలో భాగంగా ఓటర్లు పక్క ఊరికి వెళ్లి ఓటు వేయకుండా పోలీసుల ద్వారా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి నిలువరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు. ఓటర్లందరినీ పోలీసులతో నిలువరించి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఇతర బయటి ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను రప్పించి, వారితో ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా.. » పులివెందుల మండలంలోని కనంపల్లి ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు గ్రామాన్ని నిర్బంధించారు. దీంతో గ్రామస్తులు ఓటు వేయడం కోసం పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ వారు ఏ మాత్రం కనికరించ లేదు. ‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి..’ అంటూ గ్రామస్తులు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. ఇంతలోనే తమ ఓట్లను వేరే వారు వేశారని తెలుసుకున్న కనంపల్లె మహిళలు ఆందోళనకు దిగారు. మా ఓట్లు ఏమయ్యాయంటూ నిరసన తెలిపారు. వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. మోట్నూతనపల్లి గ్రామస్తులకు కూడా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేశారు. » తుదకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సైతం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మంగళవారం తెల్లవారుజామున హేమంత్ రెడ్డి నిద్ర లేచాక ఇంటి బయటికి వచ్చి చూస్తే వందలాది మంది టీడీపీ మూకలు చుట్టుముట్టాయి. బయటకు వస్తే మీ మీద దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులే హేమంత్‌రెడ్డిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయలేకపోయారు. ఓ దశలో బయటకు రావడానికి ప్రయత్నించినా, బయట ఉన్న టీడీపీ మూక అరుపులు, కేకలతో భయపెట్టారు. » ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని, రీపోలింగ్ నిర్వహించాలంటూ అచి్చవెళ్లి గ్రామస్తులు ఎన్నికల అధికారికి వినతి పత్రం సమరి్పంచారు. బయట ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో టీడీపీ గూండాలు గ్రామాల్లో కర్రలతో, రాడ్లతో కలియ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. మహిళలపైనా దౌర్జన్యకాండే » ఎక్కడికక్కడ పురుషులను పోలీసులు నిర్బంధించగా.. ఏజెంట్లుగా కూర్చోడానికి మహిళలు ముందుకొచ్చారు. ఇందుకు అభినందించాల్సిన ఖాకీలు.. అధికార ఒత్తిళ్లకు తలొగ్గారు. ‘మగాళ్లతోనే కాలేదు.. మీరెందుకొచ్చారు.. గొడవలవుతాయి.. త్వరగా ఇంటికి వెళ్లిపోండి’ అంటూ వెనక్కు పంపడం విస్తుగొలుపుతోంది. » పోలింగ్ బూత్‌లలోకి రాకుండా మహిళా ఏజెంట్లను అడ్డుకున్నారు. టీడీపీ రౌడీలు దూషణల పర్వం కొనసాగించినా చూస్తుండిపోయారు. అవసరమున్నప్పుడు బందోబస్తు ఇవ్వకుండా.. రిగ్గింగ్ అయిపోయాక వస్తారా.. అంటూ మరోచోట మహిళలు పోలీసులను నిలదీశారు. ఎర్రిపల్లెకు చెందిన అన్నారెడ్డి మమత, మునేశ్వరీ, గంగా భవానీలు ఏజెంట్లుగా కూర్చోడానికి టీడీపీ నేతలను తప్పించుకుని వెళ్లగలిగారు. అయితే వారిని పోలీసులే అడ్డుకున్నారు.» నల్లగొండువారిపల్లెకు చెందిన సంధ్య.. నల్లపురెడ్డిపల్లెలో ఏజెంటుగా కూర్చునేందుకు వచి్చనా అనుమతించలేదు. నోరు మూసుకొని పోండి’ అంటూ రౌడీ మూక గదమాయించింది. ఈ పోలింగ్ కేంద్రం వద్దకు వస్తున్న వారిపై సుమారు 350 మంది రౌడీలు దౌర్జన్యానికి దిగి వెనక్కు పంపారు. » తమను టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చొన్న మహిళలను బెదిరించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎదుట అచ్చివెళ్లి గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ బూత్‌ల వద్దకు వెళితే మహిళలని కూడా చూడకుండా చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రిగ్గింగ్ చేసుకున్నారు ఎర్రిపల్లె గ్రామంలో 600 ఓట్లు ఉన్నాయి. 350 మందికి పైగా టీడీపీ గూండాలు వచ్చి అరాచకం సృష్టించి, ఓట్లు వేయకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. పోలీసులు కూడా వారికే మద్దతుగా నిలిచారు. పోలీస్ పహారా మధ్య టీడీపీ మూకలే మా ఓట్లన్నీ వేసేసుకున్నాయి. – అన్నారెడ్డి మమత, ఎర్రిపల్లె, పులివెందుల మండలం ఏజెంట్లనూ వెళ్లనివ్వలేదు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అల్లరి మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. కనీసం ఏజెంట్లను కూడా పోలింగ్ బూ త్ల వద్దకు రానివ్వలేదు. బయటి వ్యక్తులు వచ్చి గ్రామంలో తిష్ట వేశారు. మా గ్రామంలో ఒక్కరు కూడా ఓటు వేయలేదు. అసలు ఇంత మంది పోలీసులను ఎందుకు దింపినట్లు? – రమాదేవి, కనంపల్లె, పులివెందుల మండలం చంపేస్తామని బెదిరించారు సోమవారం రాత్రి నుంచే టీడీపీ రౌడీలు గ్రామాన్ని చుట్టుముట్టారు. ఓటు వేయడం కోసం వస్తే చంపుతామని బెదిరించారు. మీరు స్లిప్పులు ఇచ్చి వెళ్లిపోండన్నారు. టీడీపీకి చెందిన బీటెక్ రవి, శ్రీనాథ్‌లతోపాటు 400 మంది బయట వ్యక్తులు వచ్చారు. పోలీసులు కూడా వారికి సహకరించారు. ఓటు..గీటు అంటే దెబ్బలు తింటారని పోలీసులే చెప్పడం దారుణం. – కుమారి, కనంపల్లె, పులివెందుల మండలం స్లిప్పులు లాక్కుని చించేశారు నా అనుభవంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. టీడీపీ గూండాలు సోమవారం రాత్రి నుంచే వైఎస్సార్సీపీ ఏజెంట్ల ఇంటి ముందు రాడ్లు, కత్తులు పట్టుకొని తిష్ట వేశారు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి బయటకు వస్తే చంపేస్తామని బెదిరించారు. జమ్మలమడుగు, కమలాపురం, వేంపల్లె ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీలు గ్రామాన్ని చుట్టి ముట్టారు. ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఓటు వేయడం కోసం ఎలాగో ఒకలా వచ్చిన వారి వద్ద నుంచి స్లిప్పులు లాక్కొని చింపేశారు. పోలీసుల కళ్లెదుటే ఇదంతా జరిగింది. – బాంధవి, ఎంపీటీసీ సభ్యురాలు, అచ్చవెళ్లి, పులివెందుల మండలం ఏజెంట్ ఫారాన్ని చింపేశారు గ్రామస్తులు ఎవరూ ఓటు వేయనందున రీ పోలింగ్ జరిపించాలి. నేను ఏజెంటుగా పోలింగ్ బూత్ వద్దకు ఆరు గంటల్లోపు వెళ్లాను. అప్పటికే టీడీపీ గూండాలు బూత్‌ల వద్దకు చేరుకొని నా దగ్గర ఉన్న ఏజెంట్ ఫారాన్ని చించేశారు. ఇంటికి వెళ్లకపోతే చంపుతాం అని బెదిరించారు. ‘మీరు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు.. ఓట్లు మేమే వేసుకుంటాం.. వెళ్లిపోండి’ అని బెదిరించారు. అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని.. లేదంటే దెబ్బలు తింటారని పోలీసులే చెప్పడం దారుణం. – అనురాధ, అచ్చివెళ్లి, పులివెందుల మండలం -
రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జరిగిన అరాచకాలపై మంగళవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని,పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే.పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/Qky1FZjeQA— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025 ‘చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు...ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానం. కాని చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడింది. మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్‌లను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్‌లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుగారి సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?’అని ప్ర శ్నించారు.‘అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు. 15నెలల ఆయన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత, పారిశ్రామిక రంగాలు సహా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. ప్రతి కుటుంబం తన కాళ్లమీద తాను నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ, ఆ స్కీములు అన్నిటినీ రద్దుచేయడమే కాదు, తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లనూ మోసాలతో, అబద్ధాలతో ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లెటరైట్, లిక్కర్, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాల కోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, విద్యాదీవెన, వసతి దీవెన లేదు, ఆస్పత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకూ ఆరోగ్యశ్రీ లేదు. స్కూళ్లలో నాడు-నేడు లేదు, ట్యాబుల్లేవు, టోఫెల్ పీరియడ్స్‌తో పాటు ఇంగ్లిషు మీడియం లేదు. మరి ఇలాంటి అబద్ధాలు, మోసాలు, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుగారికి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు?’ ..పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్నప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా? ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్ బూత్‌లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారు. రెండు చిన్న ZPTC స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తే దాంతో సాధించేది ఏముంటుంది?..2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 34,560 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్‌బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు చేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారు...పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం. అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం’ అని చంద్రబాబు రౌడీ రాజ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్..!
ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది. ప్రజాపాలనను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కార్.. ఒకవైపు కక్ష పూరిత పాలనను కొనసాగిస్తూ మరొకవైపు బారీగా అప్పులు చేయడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమం అనేది సామాన్యుడికి చేరకపోవడంతో అసలు అప్పులు చేసిన సొమ్మంతా ఎటుపోతుందనేది విశ్లేషకులు ప్రశ్న.ఫలితంగా ఏపీలో అసలు పాలన ఉందా అనేది ప్రజల్లో తలెత్తుత్తోంది. రోజురోజుకి ఏపీ అప్పుల భారం పెరిగిపోతోంది. ఏపీలో ప్రస్తుత అప్పుల భారం రూ. 5.6 లక్షల కోట్లుగా ఉంది. ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి’(జీఎస్డీడీపీ)లో అప్పులు 34.7 శాతంగా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని నేటి(మంగళవారం, ఆగస్టు 12వ తేదీ) రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ తెలంగాణ అప్పుల భారం రూ. 4.4 లక్షల కోట్లుగా ఉంది. ఇది తెలంగాణ జీఎస్డీడీపీ 26.2 అప్పుల శాతంగా ఉంది. అంటే తెలంగాణ కంటే అప్పుల్లో దూసుకుపోతోంది ఆంధ్రప్రదేశ్. అభివృద్ధిలో ఎటువంటి ముందంజ లేని చంద్రబాబు ప్రభుత్వం.. అప్పులు చేయడంలో మాత్రం పరుగులు పెడుతుందనేది ఇక్కడ అందరికీ అర్ధమవుతున్న విషయం. -
ఈవీఎంలతో గెలిచారు.. అందుకే వణుకుతున్నారు చంద్రబాబుపై అంజాద్ బాషా ఫైర్
-
Malladi Vishnu: ఇది ఎన్నికలు కాదు టీడీపీ బోగస్ ఎన్నిక
-
బాబుకు అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్.. ఇదిగో రిగ్గింగ్ ఫ్రూఫ్స్
-
లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు: సతీష్ రెడ్డి
-
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కుతంత్రం...
-
మిట్టల్‌పై మోహం.. ప్రైవేటు దాహం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు సర్కారు.. ఆ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెబుతుండగా.. మరోవైపు ప్లాంట్‌కు కొద్ది దూరంలోనే మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిశ్రమను నిలబెట్టేందుకు రూపాయి కూడా విదల్చని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్స్‌పై వ్యామోహంతో ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించడం విస్మయానికి గురి చేస్తోంది. మొదట్లో కొద్దోగొప్పో రాయితీలు అడిగి ఆ తర్వాత ప్రభుత్వం నెత్తినెక్కి కూర్చుంటుంది మిట్టల్ సంస్థ. దక్షిణాఫ్రికాలో ప్లాంట్ ఏర్పాటు చేసి ఇప్పుడు గొంతెమ్మ కోర్కెలు మిట్టల్ సంస్థ కోరుతోంది. భవిష్యత్తులో ఏపీ పరిస్థితి కూడా ఇలా మారకముందే మేల్కొనాలని ప్రజాసంఘాలు సూచిస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌కు పునరుజ్జీవనంపై దృష్టి సారించకుండా మిట్టల్‌కు మోకరిల్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాడు ప్రగల్భాలు పలికి.. ఎన్నికల ముందువరకూ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన నేతలు కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత విశాఖ ఉక్కును ముక్కలు చేసేందుకు ఏం చెయ్యాలో అన్నీ చేస్తోంది. ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రిత్వ శాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరతామని మరోసారి కుండబద్దలుగొట్టింది. అయినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం ప్లాంట్ మూసివేసేందుకు పూర్తిగా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కుకు కొద్ది దూరంలో అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది.ప్రజలు, ఉద్యోగుల ఆందోళనలు, ప్రజాసంఘాలు, రాజకీయ పారీ్టల నిరసనలను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ అండ్ కో మిట్టల్‌కు మోకరిల్లుతున్నారు. స్టేజ్–1లో మిట్టల్ పరిశ్రమ ఏర్పాటుకు ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ సంస్థకు కావల్సిన సమస్త సౌకర్యాలు కలి్పంచేందుకు సిద్ధమవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మిట్టల్ బెదిరింపులు మామూలుగా ఉండవు మిట్టల్ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేశాక ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి చేరుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. దక్షిణాఫ్రికాలో ఇదే మిట్టల్ సంస్థ అక్కడి ప్రభుత్వాన్ని బెదిరిస్తోంది. ఇప్పుడిస్తున్న రాయితీలు సరిపోవడం లేదనీ.. తాము కోరినంత రాయితీ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే ప్లాంట్ మూసేస్తామంటూ హెచ్చరిస్తోంది. దీంతో భయాందోళనలకు గురైన దక్షిణాఫ్రికా ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో 92 మిలియన్ డాలర్ల భారీ రాయితీలు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. మిట్టల్‌ని పెంచి పోషిస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపైనా ఇలాంటి బెదిరింపులు తప్పవని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.కాగా.. కూటమి ఎంపీల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడేందుకు ఒక్కసారి కూడా కూటమి ఎంపీలు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్లలేదు. కానీ.. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు సకల సదుపాయాలు కలి్పంచాలని కోరేందుకు మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, విశాఖ ఎంపీ భరత్ నేతృత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వద్ద సాగిలపడ్డారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ఏ ఒక్కరోజూ కోరని కూటమి ఎంపీలు మిట్టల్ ప్లాంట్‌కు మాత్రం సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని మోకరిల్లుతున్నారు. విశాఖ ఉక్కుపై కూటమి ఎంపీలు, ప్రభుత్వ తీరుచూసి విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. మిట్టల్‌పై ఎందుకంత మోజు? మిట్టల్ స్టీల్‌ప్లాంట్ కోసం ఇప్పటికే వేల ఎకరాల భూముల్ని ధారాదత్తం చేసి.. ప్రజల జీవనోపాధి, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాల చరిత్ర గల విశాఖ ఉక్కుని పరిరక్షించాలన్న ధ్యాస రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సొంత గనులు కేటాయించాలని పదేపదే కోరినా పట్టించుకోని ఎంపీలు.. ఇప్పుడు మిట్టల్‌కు సొంత గనులు కేటాయించాలని కోరడం దుర్మార్గం. ప్రభుత్వ తీరు చూస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని పూర్తిగా బలహీనపరచడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మిట్టల్ సంస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకంత మోజు చూపిస్తోందో అర్థం కావడం లేదు. ఎంపీలు ప్రైవేటుకు ఊడిగం చేయడం హేయమైన చర్య. ఇప్పటికైనా కళ్లు తెరిచి స్టీల్‌ప్లాంట్‌కు రూ.30 వేల కోట్ల ఆరి్థక సాయం తీసుకొచ్చి ఆంధ్రుల హక్కుని బతికించాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
అవేర్ 2.0తో ముందుగానే వర్షపాతం అంచనా వేసేస్తాం
సాక్షి, అమరావతి: అవేర్ 2.0 వెర్షన్‌తో ముందే వర్షపాతాన్ని అంచనా వేసేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సీఎం సందర్శించారు. ఆర్టీజీఎస్‌లోని అవేర్ 2.0 వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విధానం ద్వారా నదుల్లోకి ఏ సమయంలో ఎంత వర్షపు నీరు వస్తుంది, కురిసిన వర్షం భూమిలోకి ఎంత ఇంకుతోంది, వర్షపు నీటి సమర్థ వినియోగంపైనా రియల్ టైమ్ డేటా విశ్లేషణ చేసి సంబంధిత శాఖలను ఆర్టీజీఎస్ అప్రమత్తం చేయాలని సూచించారు. వరదలు, తుపాన్ల సమయంలో రోడ్లపై వరద నీటిని పరిశీలించి ఆ ప్రాంత ప్రజలను ఆర్టీజీఎస్ అప్రమత్తం చేయాలన్నారు. పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎలా పాల్పడిందీ వారికి వీడియో లు పంపి, అలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా చైతన్యం తేవాలని తెలిపారు. రాష్ట్రంలో డ్రోన్ సేవలు విసృత్తం చేయాలని డ్రోన్ కార్పొరేషన్‌కు చె ప్పారు. డ్రోన్ల వినియోగం ద్వారా రైతులు పురుగు మందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించేలా చూడాలని చెప్పారు. అంటు వ్యాధుల నివారణకు, దోమల వ్యాప్తిని అరికట్టడానికి డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. ఆర్టీజీఎస్ డేటా లేక్ పనులు నవంబరుకల్లా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 ప్రభుత్వ సేవలను అదిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి కూడా ఒక శాస్త్రీయ విశ్లేషణ ఉండాలని సూచించారు. సరుకు రవాణాకులాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలకు సరకు రవాణా నిర్వహణకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని విమానాశ్రయాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా మార్చి వీటిని అనుసంధానిస్తూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలన్నారు. కుప్పం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఎయిర్ పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానించేలా అంతర్గత రోడ్ల నిర్మాణం ఉండాలని, అవసరమైతే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా చేపట్టాలని సూచించారు. మారిటైం పాలసీలో మార్పులు..! పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు మారిటైమ్ విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పోర్టులు, టెర్మినల్స్, షిప్ బిల్డింగ్ యూనిట్లు, అంతర్గత జల రవాణా మార్గాలు, క్రూయిజ్ టెర్మినళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్కీం పాలసీకి అనుగుణంగా మారిటైం పాలసీలో మార్పులు చేయాలని అధికారులు ప్రతిపాదించగా అందుకు ఆమోదం తెలిపారు. షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం కోసం మచిలీపట్నం, మూలపేట, చినగంజాం లాంటి ప్రాంతాల్లో కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని అధికారులు తెలిపారు. స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. -
వైద్యశాఖలో ‘చంద్ర’ముఖి!
సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు బదులుగా కమీషన్లకే పెద్దపీట వేస్తున్నారనేందుకు ఇదో తాజా ఉదాహరణ! ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ టెండర్ల ప్రక్రియ పెద్ద ప్రహసనంలా మారింది. వైద్య శాఖ పరిధిలోని ఈ పనులన్నీ గంపగుత్తగా తమతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకే కట్టబెట్టడం కోసం అక్రమాలకు తెర తీశారు. డీఎంఈ, డీఎస్‌హెచ్ ఆస్పత్రుల్లో శానిటేషన్ నిర్వహణకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది.ఈ క్రమంలో ఓ సంస్థ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిందని పేర్కొంటూ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. ఇదిలా ఉండగా కొద్ది నెలల కిందట నిర్వహించిన సెక్యూరిటీ టెండర్లలో మాత్రం ఇదే తప్పిదానికి పాల్పడ్డ అస్మదీయ సంస్థ బిడ్‌ను మాత్రం ఆమోదించి కాంట్రాక్ట్ కూడా కట్టబెట్టేయడం గమనార్హం. ఒకే తరహా టెండర్లకు సంబంధించి అప్పు డొకలా ఇప్పుడొకలా ‘చంద్రముఖి’ మాదిరిగా వ్యవ హరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కప్పిపుచ్చుకునేందుకు బుకాయింపు.. గతంలో సెక్యూరిటీ టెండర్లు పిలిచిన సమయంలో ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఇతర చార్జీలు కలిపి కార్మీకులకు రూ.18,600, సూపర్వైజర్కు రూ.21,506, సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.40 వేలు.. ఇలా ఎవరెవరికి ఎంత వేతనం ఇవ్వాలో స్పష్టమైన నిబంధన పెట్టారు. ఏ ఆస్పత్రిలో ఎంత మందిని సిబ్బందిని నియమించాలో నిర్దేశించారు. ఈ మేరకు టెండర్లలో పాల్గొనే సంస్థలు లెక్కలు వేసుకుని ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేయాలని, నిర్దేశించిన వేతనాల్లో తగ్గిస్తే సదరు బిడ్లను తిరస్కరిస్తామని నిబంధన విధించారు.టెండర్ నిబంధనల్లో పేర్కొన్న దాని కంటే కార్మికులు, ఇతర సిబ్బంది వేతనాలు తక్కువకు కోట్ చేస్తే బిడ్ తిరస్కరణకు గురవుతుందని సెక్యూరిటీ టెండర్లలో పేర్కొన్న ప్రభుత్వం (రెడ్ కలర్లో) అయితే ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న ఓ కాంట్రాక్టు సంస్థ సెక్యూరిటీ ఇన్చార్జ్కు నిర్దేశించిన మేరకంటే తక్కువ వేతనాలు చెల్లించేలా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం అయితే సదరు సంస్థ బిడ్‌ను తిరస్కరించి అనర్హత వేటు వేయాలి. కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సదరు సంస్థను తక్కువ రేట్ కోట్ చేసిన సంస్థగా పరిగణించి జోన్–1 కాంట్రాక్ట్ బాధ్యతలను కట్టబెట్టారు. తాజాగా శానిటేషన్ టెండర్లలో తప్పు చేసిన సంస్థపై వేటు వేసినట్లే గతంలో ఎందుకు వ్యవహరించలేదన్న విమర్శలు బలంగా వ్యక్తమవుతుండటంతో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.ఫైనాన్షియల్ బిడ్‌లో నిబంధనలు అతిక్రమిస్తే తిరస్కరిస్తామని సెక్యూరిటీ టెండర్లలో పేర్కొనలేదని, శానిటేషన్ టెండర్లలో మాత్రం కొత్తగా చేర్చామని బుకాయిస్తోంది. అయితే వాస్తవాలను పరిశీలిస్తే.. కార్మికులు, సూపర్వైజరీ సిబ్బంది నెలవారీ వేతనాల్లో నిర్దేశించిన మొత్తం కంటే తక్కువ చెల్లించేలా బిడ్ వేస్తే తిరస్కరిస్తామని సెక్యూరిటీ టెండర్లలో స్పష్టంగా పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు దాఖలు చేసే ఫైనాన్షియల్ బిడ్‌లో ఇన్స్టిట్యూట్ వైజ్ ప్రైజ్ బిడ్‌లోని ప్రతి పేజీలో ఆ అంశాన్ని పొందుపరిచారు. ఆగమేఘాలపై ఎల్వోఏ..! ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు అడ్డదారుల్లో కాంట్రాక్టులు ఆగమేఘాలపై దక్కుతున్నాయి. పక్క రాష్ట్రంలో జూన్‌లో టెర్మీనేట్ అయిన సంస్థకు కోస్తాంధ్ర శానిటేషన్ కాంట్రాక్టు పనులు కట్టబెడుతున్నారు. అనర్హత వేటుకు గురైన పలు సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో వేగంగా అస్మదీయ సంస్థలకు ఎల్వోఏ ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వైద్య శాఖ అధికారులతో కూడిన బిడ్ ఫైనలైజేషన్ కమిటీ (బీఎఫ్సీ) సోమవారం సమావేశమై ఆరు జోన్లవారీగా కాంట్రాక్టర్లను ఖరారు చేసింది. -
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్
సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్‌లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్‌ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం.ఏజెంట్లపై దాడి చేసి వెళ్లగొట్టే కుట్ర మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే పోలింగ్ బూత్ నుంచి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి, పోలీసుల ద్వారా వారిని వెళ్లగొట్టేందుకు టీడీపీ నేతలు కుట్ర చేశారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి వెళ్లగొట్టడం ద్వారా తమ అడుగులకు మడుగులొత్తే పోలీసులు, అధికారుల సహకారంతో పోలింగ్ బూత్‌ను పూర్తిగా తమ అ«దీనంలోకి తీసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ శ్రేణులను ప్రతి పోలింగ్ బూత్ వద్ద కనీసం వంద మంది చొప్పున ఇప్పటికే మోహరించారు. పోలింగ్ ప్రారంభం కాక ముందే పోలింగ్ బూత్ వద్ద వారితో యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించి, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా చేసి.. పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి.. పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకోవడానికి మరో కుట్ర చేస్తున్నారు. తద్వారా రిగ్గింగ్ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఎస్ఈసీ, పోలీసులు ప్రేక్షకపాత్ర ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పులివెందుల మండల స్థానికులు మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు వెనక్కు వెళ్లిపోవాలి. ప్రచారం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాల వారు ఎన్నిక జరిగే ప్రాంతంలో ఉండటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా బస చేస్తే వారిపై ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) అధికారులు, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ.. ఇతర ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో వచి్చన టీడీపీ శ్రేణులు పులివెందుల మండలంలోని గ్రామాలకు చేరుకుంటున్నప్పటికీ.. వారిని అడ్డుకోకుండా ఎస్ఈసీ, పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పులివెందుల మండలంలోనే కాదు.. ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. అంతులేని అక్రమాలు ⇒ పులివెందుల మండలంలో ఇటు అధికారులు, అటు పోలీసులు అందరూ ఏకమై వైఎస్సార్సీపీపై కుయుక్తులకు పాల్పడుతున్నారు. పులివెందులకు విలన్లా మారిన మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు కుట్రలను అమలు చేస్తున్నారు. ఎలాగైనా సరే గెలిచి.. వైఎస్ జగన్ అడ్డాలో పాగా వేశామని చెప్పుకునేందుకు పులివెందులను రణరంగంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ⇒ కూటమి నేతల అరాచకంపై ఎన్నికల కమిషన్‌కు ఎన్నిమార్లు విన్నవించినా స్పందనే లేదు. మరోవైపు ఆయా కేసుల్లో అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచి్చనప్పటికీ మోట్నూతలపల్లె గ్రామానికి చెందిన అర్జున్, గంగన్న, చంద్రగిరికి చెందిన మస్తాన్‌వల్లి, మల్లికార్జునపురానికి చెందిన హరి, రచ్చుమర్రిపల్లె మైసూరారెడ్డి, లోపట్నూతల ప్రకాష్‌రెడ్డి, కారంపల్లె మహేష్‌నాయక్, బాలాజీ నాయక్, సర్పంచ్ రామాంజనేయులు, కోరా కిరణ్‌కుమార్‌రెడ్డి, రవిప్రకాష్రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మరోవైపు ప్రలోభాలకు గురిచేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.⇒ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ సోమవారం పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, ఎర్రిపల్లె, కొత్తపల్లె, కనంపల్లె, యర్రబల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జమ్మలమడుగు ఇన్చార్జి భూషేష్రెడ్డిలు రౌడీïÙటర్లను వెంటబెట్టుకుని హల్చల్ చేశారు. పోలింగ్ ప్రారంభం కాకముందే కొన్ని ఓట్లు వేసుకునేలా సరికొత్త కుట్రకు పదును పెట్టినట్లు తెలిసింది. ⇒ పోలింగ్ పారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు టీడీపీ నేతల మాట మాత్రమే వినాలని పోలీసులకు ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.నేడు పోలింగ్∙ 14వ తేదీన ఓట్ల లెక్కింపు వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
‘స్త్రీ శక్తి’.. బాబు కుయుక్తి!
‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు.. శ్రీకాకుళం నుంచి తిరుమలకు ఉచితంగా వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు.. టికెట్ లేకుండా అనంతపురం నుంచి అన్నవరం వెళ్లి సత్యన్నారాయణస్వామిని దర్శనం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రాజధాని అమరావతికి ఉచితంగా రావచ్చు అని హామీ ఇస్తున్నా...!’ ఇదీ ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికిన హామీ!ఈ మాట నమ్మి బస్సు ఎక్కితే ఆడపడుచులు బొక్కబోర్లా పడిపోయినట్లే.. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి తిరుమలకు కాదు కదా వారుంటున్న గ్రామం నుంచి అదే జిల్లాలోని పలాసకు కూడా డైరెక్టుగా పోలేరు. బాబుగారి ఉచిత బస్సులో పక్క జిల్లాకే కాదు పక్క నియోజకవర్గానికి కూడా పోలేరు. పల్లె నుంచి పక్క పల్లెకు మాత్రమే పోగలుగుతారు. అది కూడా ఆ పల్లెల్లో బస్సు తిరిగితేనే.. ఎందుకంటే మన పల్లెల్లో ఇప్పటికే చాలా బస్సులు ఎత్తేశారు.. చాలా పల్లెలకు అసలు బస్సులే లేవు మరి... సాక్షి, అమరావతి: ‘బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ..’ అని మరోసారి నిరూపితమైంది! అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తన ట్రేడ్ మార్కు వెన్నుపోటు రాజకీయం చూపించారు! ‘స్త్రీ శక్తి’ పథకం పేరిట మరోసారి తన కుయుక్తి ప్రదర్శించారు. ఏడాదికిపైగా కాలయాపన తరువాత ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఆదిలోనే నీరుగార్చారు. పథకం అమలుపై లెక్కలేనన్ని పరిమితులు విధించారు. మొత్తం 16 కేటగిరీ ఆర్టీసీ బస్సు సర్విసులు ఉంటే కేవలం ఐదు కేటగిరీ బస్సులకే ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తద్వారా రాష్ట్రం అంతటా కాదు కదా కనీసం జిల్లా అంతా ఉచితంగా ప్రయాణించే అవకాశం కూడా లేకుండా చేశారు. స్త్రీలకు టికెట్ ప్రయాణమే..! ఆర్టీసీ మొత్తం 16 కేటగిరీల్లో బస్ సర్విసులను నిర్వహిస్తోంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కేటగిరీ సర్విసుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చెప్పిందో తెలుసా..? కేవలం ఐదంటే ఐదు మాత్రమే! ఏసీ కేటగిరీలో వెన్నెల, డాల్ఫిన్ క్రూయిజర్, అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర, మెటోలగ్జరీ, 9ఎం ఇ.బస్ సర్విసులను ఆర్టీసీ నిర్వహిస్తోంది. ఇక నాన్ ఏసీ కేటగిరీల్లో స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, ఎస్ఏపీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్విసులు నడుపుతోంది. మొత్తం 11,256 బస్ సర్విసులు నిర్వహిస్తోంది. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సర్విసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు కేటగిరీలు.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఏసీ కేటగిరీలో ఉన్న ఏడు సర్విసుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కాదని తేల్చి చెప్పింది. పోనీ నాన్ ఏసీ కేటగిరీలో ఉన్న 9 కేటగిరీల్లో అయినా పూర్తిగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తుందా? అంటే అదీ లేదు. వాటిలో కూడా ముఖ్యమైన స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎస్ఏపీ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని, టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రకటించింది. మరోసారి మహిళలకు మోసం.. చంద్రబాబు ప్రభుత్వం పక్కా కుయుక్తితో మహిళలను వంచించింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవాలి కానీ మహిళలకు అందకూడదనే రీతిలో దుర్భుద్ధితో వ్యవహరించింది. అందుకే అన్ని ఏసీ సర్వీసులు, నాన్ ఏసీ సర్వీసుల్లో కూడా నాలుగు కేటగిరీల్లో అమలు చేయబోమని ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కేవలం ఒక్క కేటగిరీలోనే అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లోనే ఉచిత ప్రయాణం అందిస్తామని చెప్పింది. పోనీ సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో అయినా పూర్తిగా ఈ పథకాన్ని అమలు చేస్తారా అంటే అదీ లేదు. నాన్ స్టాప్ సర్విసుల్లో ఈ పథకం అమలు చేయబోమని ప్రకటించి దొంగ దెబ్బ తీసింది. ఆర్టీసీ చాలా ఏళ్లుగా రెండు పట్టణాల మధ్య సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసులను నిలిపివేసింది.వాటిని నాన్ స్టాప్ సర్విసులుగా మార్చివేసింది. ఉదాహరణకు.. శ్రీకాకుళం– విజయనగరం, శ్రీకాకుళం – విశాఖపట్నం, విశాఖపట్నం – అనకాపల్లి, విశాఖపట్నం – రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం– కాకినాడ, విజయవాడ – ఏలూరు, విజయవాడ – బందరు, విజయవాడ– గుంటూరు, ఒంగోలు – మార్కాపురం, నెల్లూరు– తిరుపతి, తిరుపతి– శ్రీకాళహస్తి, తిరుపతి – చిత్తూరు, తిరుపతి– మదనపల్లి, కడప – కర్నూలు... ఇలా రాష్ట్రంలోని ఏ రెండు ప్రధాన పట్టణాల మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్ సర్విసులను నాన్ స్టాప్ సర్వీసులుగా మార్చేసింది.ఎక్స్‌ప్రెస్ సర్విసులు పేరుకు 1,560 ఉన్నాయి. కానీ వాటిలో దాదాపు 950 సర్విసులు నాన్ స్టాప్ సర్విసులే. అంటే వాటిలో ఉచిత ప్రయాణం పథకం వర్తించదు. కేవలం జిల్లాలో కొన్ని పల్లెలు, పట్టణాల మధ్య తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, నగరాల్లో సిటీ ఆర్డినరీ సర్విసుల్లోనే ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే మహిళలు టికెట్ లేకుండా రాష్ట్రం అంతా కాదు కదా కనీసం తమ జిల్లా అంతా కూడా ప్రయాణించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. దాహరణకు శ్రీకాకుళం నుంచి పలాస, ఇచ్చాపురం వెళ్లాలంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సు సర్విసులు లేవు. అల్ట్రా డీలక్స్ బస్సులే శరణ్యం. ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయరు. అదే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ ఉంది. తిరుమలకు వెళ్లే సప్తగిరి సర్వీసుల్లో ఉచిత ప్రయాణం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పేరిట చంద్రబాబు మరోసారి మహిళలను మోసం చేశారన్నది తేటతెల్లమైంది. -
YSRCP నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్
-
ఉచిత బస్సు ప్రయాణం పేరిట చంద్రబాబు మరో మోసం
సాక్షి,అమరావతి: మహిళలను చంద్రబాబు ప్రభుత్వం చీట్ చేసింది. ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం చేసేలా స్త్రీ శక్తి పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రమంతటా ఫ్రీ అని కొర్రీలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో స్కీం ఎగట్టొంది.నాన్‌స్టాప్,సప్తగిరి ఎక్స్‌ప్రెస్,డీలక్స్.. అల్ట్రా డీలక్స్,సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్,ఇంద్ర, వెన్నెల, అమరావతి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెట్టారు. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరి, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే స్త్రీ శక్తి పథకం అమలుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో హైలెట్ చేసింది. -
మా వాళ్లని చంపేస్తారా ? జగన్ ఫైర్..
-
చంద్రబాబుకు జగన్ టెన్షన్.. దెబ్బకు కేబినెట్ లో మార్పులు
-
చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు నాయుడు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాది అని.. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చిని లాక్కోవాలని చూస్తున్నారనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయంటూ దెప్పి పొడిచారు.పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అంటూ ఎత్తిచూపారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంత మంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరికొంత మంది పోలీసులు.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పన్నాగాన్ని సాక్ష్యాధారాలతో వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచి్చంది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందల మంది వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్న వారిని, ప్రచారం చేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.⇒ ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లి వారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికి దిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.⇒ ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కారుని బద్దలు కొట్టారు.పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. రమేష్ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేరి్పంచారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.⇒ తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపైనే తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింత మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.⇒ ఆగస్టు 8న వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమ వైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని.. తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ⇒ అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు.. ఆగస్టు 8న వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4 వేల మంది ఓటర్లను, పక్కా వైఎస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు.వీళ్లు ఓటేయడానికి వెళ్లకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడటం.. ఈ మాదిరి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్నది టేబుల్లో పరిశీలించగలరు.)⇒ నల్లగొండువారిపల్లి వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే ఆగస్టు 8వ తేదీ రాత్రి ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంత మంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెబుతున్న సమయంలో బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్‌లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు.అయినా వారి మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు వీరిని వదిలి పెట్టాల్సి వచి్చంది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.⇒ ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ శాతం తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తున్నారు. వారిపైనా దాడులకు సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడి మీద, ప్రజల మీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. -
‘జగన్ అంటే చంద్రబాబు ఎంత భయపడుతున్నారో అనడానికి ఇదే నిదర్శనం’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి సీఎం చంద్రబాబు ఎంత భయపడిపోతున్నారో ప్రస్తుతం ఓ చిన్న ఎన్నిక కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తేనే అర్ధమవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చిన్న ఎన్నికకు జగన్ అంటే సీఎం చంద్రబాబు ఎంత భయపడుతున్నారో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. టీడీపీ నేతల దాడిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. మా నేతలపై దాడి చేసినా ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలేదు. తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించటం లేదు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం. దాడులకు గురైన వారిపైనే రిటర్న్ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గం. పులివెందుల జెడ్పీటీసీ సెగ్మెంట్ లో గెలిచి ఆధిపత్య రాజకీయాలు చూపించాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికలు జరుగుతుంది వైఎస్సార్సీపీకి కూటమికి మాత్రమే కాదు. వైసీపీకి పోలీసులకు.. వైసీపీకి ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది..సీఎం స్థాయిలో కూర్చున్న వ్యక్తి జెడ్పీటీసీ ఎన్నికను పర్యవేక్షించటం చంద్రబాబు హయంలోనే మొదలైంది..డీజీపీ కార్యాలయానికి వెళ్తే పోలీసులను పెట్టి ఆపిస్తున్నారు. డీజీపీ రాష్ట్రానికా.. టీడీపీ కా?, ప్రజా ప్రతినిధులు వస్తే ఔట్ వార్డులో ఇచ్చి వెళ్ళమంటారా?, ఎస్సీ నేతలమని మాపై డీజీపీ వివక్ష చూపిస్తున్నారు. కనీసం ఒక్క అధికారి కూడా రాలేదు. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్ళినా.. డీజీపీ కార్యాలయానికి వెళ్ళినా ఇదే తంతు జరుగుతుంది. చంద్రబాబు దృష్టిలో పడాలని అధికారులు పోటీలు పడుతున్నారు. మార్చిన పోలింగ్ కేంద్రాలు యధాస్థానంలో ఉంచాలి. మేము ఓడిపోతామనే భయంతో మాట్లాడటం లేదు.ఎన్నికల సంఘానికి ఇది శల్య పరీక్ష అని గుర్తుంచుకోవాలి. మా నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి. హైకోర్టు ఆదేశాలు పాటించాలి’ అని సూచించారు. -
చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది: వైఎస్ జగన్
తాడేపల్లి: ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేసే వ్యక్తి కాదని జగన్ దుయ్యబట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘చంద్రబాబు కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్ను పోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు’ అని జగన్ విమర్శించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పథకాల్ని వైఎస్ జగన్ ట్వీట్ రూపంలో ప్రస్తావించారు. .@ncbn అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే… pic.twitter.com/MaZrGo174C— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2025 1. పులివెందుల, ఒంటిమిట్ట ZPTCల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందలమంది వైయస్సార్సీపీ, నాయకులను కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తున్నవారిని, ప్రచారంచేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.2. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడిచేశాయి. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికిదిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.3. ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ MLC రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్యచేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లెవద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు,రాళ్లు, రాడ్లతో దాడిచేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కార్ని బద్దలు కొట్టారు. పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నంకూడా చేశారు. రమేష్ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్రగాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈరకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.4. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6, మధ్యాహ్నం 3.30గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడిచేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాముసహా మరొక 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ మరియు హత్యాయత్నం కేసుపెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింతమంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.5. ఆగస్టు8, వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడ్ని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమవైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని, తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైయస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీచేశారు.6. ఆగస్టు8: అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైయస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు4వేల మంది ఓటర్లను, పక్కా వైయస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందినవారిని ఈ రకంగా ఇబ్బందిపెట్టి, వీళ్లు ఓటేయడానికి వెళ్లే క్రమంలో వారిని వెళ్లనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడ్డం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డం, చంద్రబాబుగారు ఈమాదిరి కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్న టేబుల్‌ను అటాచ్ మెంట్లో ఉంది. పరిశీలించగలరు)7. ఆగస్టు8 రాత్రి, నల్లగొండువారిపల్లెవద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీకేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్లు బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్‌లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. అయినా వారిమీదకూడా ఎస్సీ, ఎస్టీకేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వీరిని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.8. ఇక ఎన్నికల పోలింగ్ రోజున, ఓటింగ్ తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడిచేస్తున్నారు. వారిపై దాడులకూ సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసంచేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి.అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడిమీద నమ్మకం ఉంది. ప్రజలమీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. -
ఎన్ని దాడులైనా చేసుకో.. జగన్ కోసం ప్రణాలివ్వడానికైనా సిద్ధం
-
కూటమి అరాచకం.. ప్రజలే బుద్ధి చెబుతారు: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, తిరుమల: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలియదు.. ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయబాంత్రులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.వైఎస్సార్సీపీ కడప అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలు కూడా పండటం లేదు. సూపర్ సిక్స్ దొంగ హామీలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజలు ఆశపడి ఓట్లు వేశారు. 2029లో మళ్లి వైఎస్ జగన్ గెలవాలని కోరుకుంటున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పడానికి సిద్దంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలియదు.. ప్రజలను, వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు ఓట్లు వేయడానికి లేకుండా, దొంగకేసులు పెట్టి భయబ్రాంతులకు చేస్తున్నారు.పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో 10,500 ఓట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగు వేల ఓట్లకుపైగా నల్లపురెడ్డి పల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబల్లెకు సంబంధించి ఓట్లను తారుమారు చేస్తున్నారు. ఓ ఊరిలో 700 ఓట్లు ఉంటే నాలుగు.. ఐదు కిలోమీటర్ల దూరంలో బూత్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లి ఓటు వేసే విధంగా చర్యలు తీసుకొన్నారు. ఓటింగ్ శాతం తక్కువ కావడానికి దారుణాలకు కూటమి ప్రభుత్వం ఒడిగడుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. వైఎస్ జగన్ గతంలో అనుకుంటే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే వాళ్లు కాదు. నామినేషన్ కూడా వేసి ఉండరు. కానీ, నేడు కూటమి పాలన అరాచక పాలన చేస్తుంది. కూటమి అరాచక పాలనపై కోర్టును ఆశ్రయిస్తాం. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. ఈ పద్దతి మార్చుకుంటే మంచిది. లేకుంటే చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జగనన్నకు మేము తోడుగా ఉండి.. ఆడబిడ్డలు అడ్డం తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తాం
-
ఒంటిమిట్ట YSRCP కంచుకోట.. ఇక్కడ గెలవడం బాబు తరం కాదు
-
తాగండి.. ఊగండి.. నా టార్గెట్ 35 వేల కోట్లు
-
పరువు కోసం పాలకుల పాకులాట!
సాక్షి, అమరావతి: హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ విషయమై అభాసుపాలైన కూటమి పాలకులు చివరకు పరువు దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను నిలబెట్టుకోవడంలో గతేడాది కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా చివరివరకు విజయవాడ ఎంబార్కేషన్‌కు అనుమతి రాలేదు. ఆఖరి నిమిషంలో అనుమతి రావడంతో తామే కొత్తగా సాధించినట్టు కూటమి పాలకులు బడాయి పోయారు. అయితే ఆఖరి నిమిషం వరకు అనుమతి లేకపోవడంతో రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లాలనుకునే చాలామంది యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు నుంచి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ దరఖాస్తులను జూలై 31 నుంచి కేంద్ర హజ్ కమిటీ మరో వారం రోజులు పొడిగించడంతో అప్పటికే అభాసుపాలైన కూటమి పాలకులు మేల్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి దరఖాస్తు చేసుకునేలా హజ్ యాత్రికులను కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడ్డారు. ప్లీజ్.. విజయవాడ ఆప్షన్ పెట్టుకోండి.. రాష్ట్రప్రభుత్వ పెద్దలు, ముఖ్యనేతల ఆదేశాల మేరకు హజ్‌కమిటీ ప్రతినిధులు సీఎం చంద్రబాబు, మంత్రి ఫరూక్‌ను కలిసి యాత్రను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు హైప్ తీసుకొచ్చారు. అయితే యాత్రికులకు ప్రభుత్వం రూ.లక్ష ఇస్తామన్నా.. విజయవాడ నుంచి వెళ్లే వారిపై విమాన చార్జీల భారం పడుతుండడంతో యాత్రికులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు గతంలో వెళ్లిన హాజీలకు ఇస్తామన్న రూ.లక్ష ఇవ్వకపోవడంతో ఈసారి కూడా ఇస్తారో? లేదో? అనే అనుమానాలు పెరగడం కూడా కారణం. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల ముందు హజ్ ప్రతినిధులు ఉంచడంతో పాలకులు ఆగమేఘాలపై స్పందించారు. హజ్–2025లో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుని ఇక్కడ ఎంబార్కేషన్ రద్దుతో హైదరాబాద్ నుంచి వెళ్లిన 72 మందికి కొద్ది రోజుల క్రితమే రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. కొత్తగా వెళ్లేవారికి కూడా ఇస్తామని, ప్లీజ్ ఈసారి విజయవాడ ఆప్షన్ పెట్టుకోవాలని ప్రాధేయపడ్డారు. అప్పటికే హైదరాబాద్,, బెంగళూరు నుంచి దరఖాస్తు పెట్టుకున్న 1700 మందికిపైగా యాత్రికులు విజయవాడ ఆప్షన్ మార్చుకునేలా వెసులుబాటు కల్పించారు. చివరకు ప్రభుత్వ యంత్రాంగం పడిన పాట్లతో 980 మంది విజయవాడ ఆప్షన్ పెట్టుకున్నట్టు సమాచారం. ముగిసిన గడువు..హజ్–2026 యాత్ర కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 7తో ముగిసినట్టు హజ్ కమిటీ అధికారులు ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,,500 మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇచ్చింది. కాగా, రాష్ట్రం నుంచి 2,620 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో కొంత మంది విరమించుకునే అవకాశం ఉందని, దీంతో కేంద్ర హజ్ కమిటీ ఇచ్చిన అనుమతికి అనుగుణంగానే యాత్రికులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 980 మంది విజయవాడ ఎంబార్కేషన్ ఆప్షన్ పెట్టుకున్నారు. మిగిలిన 1,640 మంది హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లనున్నారు.తొలిసారిగా 20 రోజుల యాత్ర.. హజ్ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 40 నుంచి 41రోజులపాటు యాత్ర సాగేలా అనుమతిస్తున్నారు. దేశంలో తొలిసారిగా హజ్–2026కు 20 రోజుల యాత్ర కోసం ప్రత్యేకంగా 10వేల మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇచ్చింది. ఎన్ఆర్ఐలు, ఉద్యోగులతోపాటు ప్రత్యేక పరిస్థితులు ఉన్న వారికి 40 రోజులపాటు యాత్రకు సెలవులు, ఇతర ఇబ్బందులు ఉండటంతో కేంద్ర హజ్ కమిటీ ప్రత్యేక అవకాశం కల్పించింది. దీంతో 20 రోజుల యాత్రకు ఏపీ నుంచి 290 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
‘వివేకా హత్య కేసు.. ఆ సమయంలో సీబీఐకి ఎందుకు అప్పగించలేదు?’
విశాఖ. వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వివేకానంద హత్య కేసులో లేనిపోని ఆరోపణలు చేసే బదులు.. ఆ కేసును సీబీఐతో విచారణ చేయించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని బొత్స నిలదీశారు. అసలు వివేకా హత్య కేసు చంద్రబాబు హయాంలో జరిగిందని, మరి ఆ సమయంలో ఎందుకు సీబీఐకి అప్పగించలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఆ కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు.మరి ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసును ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైందని, మరి వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారన్నారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 9) విశాఖ నుంచి మాట్లాడిన బొత్స.. వివేకా హత్య కేసులో ఆధారాలుంటే బయటపెట్టొచ్చు కదా అని బాబును సూటిగా ప్రశ్నించారు. ‘14 నెలలు నుంచి చంద్రబాబు ఏమి చేస్తున్నారు. సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికలు కోసమే వివేకానంద హత్య గురించి మాట్లాడుతున్నారు. వచ్చే నాలుగు ఏళ్ళు ఇదే అంశం చంద్రబాబు మాట్లాడుతారు’ అంటూ మండిపడ్డారు. -
చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటి. బాబు తీరు మారదా?
నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నాటకీయంగా వ్యవహరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్! ప్రజా వ్యతిరేకత వస్తుందనుకుంటే.. ఆ నిర్ణయానికి తానూ అనుకూలం కాదన్న బిల్డప్ ఇస్తారు. ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తున్నట్లు ప్రచారం కల్పిస్తారు. కొన్ని రోజుల క్రితం టీవీ ఛానళ్లలో చంద్రబాబు పేరుతో వచ్చిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎక్సైజ్ శాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అన్నట్లు ఛానెళ్ల స్క్రోలింగ్‌లలో కనిపించింది. ఎందుకబ్బా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనుకుంటూ ఉండగానే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు చంద్రబాబు స్టైల్! ప్రజా ఆరోగ్యం ముఖ్యమని అనుకుంటే పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తారా? ఇది ఏపీ ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా మంచిదో చంద్రబాబే చెప్పాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతంగా మద్యం షాపులను నిర్వహించి బెల్ట్ షాపులు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం రావడంతోనే మద్యం అమ్మకాలు మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. అదనంగా వెయ్యి దుకాణాలు అనుమతించడంతోపాటు 99 శాతం టీడీపీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలకే దక్కేలా చేసింది. ఇక బెల్ట్ షాపులు సరేసరి. బెల్ట్ షాపు పెడితే తాట తీస్తానని, రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు కానీ.. ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం. అధికార కూటమి స్థానిక ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో వేలాది బెల్ట్ షాపుల నిర్వహణకు వేలం పాటలు కూడా వేశారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు పర్మిట్ రూమ్‌లు తీసుకు వస్తున్నారు. చంద్రబాబు అంతకుముందు చేసిన ప్రకటనేమిటి? ఇప్పుడు జరిగిందేమిటి? ఆదాయం ముఖ్యం కాదంటూనే వాటిని పెంచుకునేలా మద్యం విధానాన్ని తయారు చేశారన్నది వాస్తవం. పర్మిట్ రూమ్‌ల ద్వారా సుమారు 180 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల ఆదాయం వస్తుంటే దానిని రూ.35 వేల కోట్లకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంత ఆదాయం పెరుగుతుందన్నది వేరే విషయం. కాని దీనికి ప్రభుత్వం కాని, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కాని ఇచ్చిన వాదన చూడండి. ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమం చేసిన ఈనాడు దినపత్రిక ఇప్పుడు మద్యం వ్యాపారానికి అండగా ఉన్నట్లుగా కథనాలు ఇస్తుండడం విశేషం. రోడ్లపై మద్యం తాగకుండా పర్మిట్ రూమ్‌లు తెచ్చారట.బహిరంగ ప్రదేశాలలో మద్యపానంతో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలో 2.7 లక్షల కేసులు నమోదు అయ్యాయట. దానిని నియంత్రించేందుకు పర్మిట్ రూమ్‌లు అనుమతిచ్చేలా నిర్ణయం చేశారట. అంతే తప్ప మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఇవ్వడం వల్ల మరింతగా మద్యపానం చేస్తారని, కుటుంబాలు నాశనం అవుతాయని వీరు రాయడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పర్మిట్ రూమ్‌లకు సంబంధించి హెడింగ్ కూడా పెట్టకుండా జాగ్రత్తపడింది.. కొత్త పాలసీలో 840 బార్లు వస్తున్నాయి. ప్రస్తుతం 3736 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఈ పర్మిట్ రూమ్‌లు వస్తున్నాయి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే బహిరంగంగా మద్యం తాగడం వల్ల కేసులు వస్తున్నాయట. ఒకే. అది నిజమే అనుకుందాం. ఆ రకంగా శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు ఒప్పుకున్నట్లే కదా! పోనీ పర్మిట్ రూమ్‌లలో తాగిన మందుబాబులు రోడ్లపైకి వచ్చి మళ్లీ అల్లరి చేయరని ఎలా గ్యారంటీ ఇస్తారో తెలియదు. కాగా రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయంలో కూడా విఫలమైంది. బాటిల్‌పై ఉన్న ధరకన్నా రూ.పది ఇరవై అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కొందరిని పోలీసులు కూడా పట్టుకున్నారు. నాణ్యమైన మద్యం ఇస్తామంటూ చిత్రమైన ప్రచారం చేసిన ఘనత కూడా చంద్రబాబు బృందానిదే. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరమని చెప్పవలసిన ప్రభుత్వం అలా చేయకపోగా, ఇప్పుడేమో ఊరూరికి బార్, వైన్ షాపు, పర్మిట్ రూమ్, బెల్ట్ షాపు అన్న చందంగా వ్యవహరించడం దురదృష్టకరం. మద్యం వల్ల కుటంబాలు నాశనం అవుతాయి. అందులోను మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. తాగిన మైంలోనే మహిళలపై అకృత్యాలు జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మద్యం విషయంలో ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2014-19 మధ్యలోనూ ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామంటూ ఫైల్ పై సంతకం చేశారు. కాని ఆ తర్వాత మాత్రం వేలాది బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడిచిపోయాయి. అవి సుమారు 40 వేలకు పైగా అప్పట్లో చేరాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటిని దాదాపు లేకుండా చేయడమే కాకుండా, షాపులను తగ్గించి, ఊరికి బయట అవి ఉండేలా చర్యలు తీసుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యథాప్రకారం మద్యాన్ని విస్తారంగా పారిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్.టి.రామారావు తన హామీ ప్రకారం మద్యాన్ని నిషేధించారు. ఆ టైమ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం చేస్తుంటే, వారిపై సైతం కేసులు పెట్టడానికి వెనుకాడవద్దని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆయన ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలుత తాము మరింత గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఆ తర్వాత అసలు సినిమా చూపించారు. టీడీపీ ఎమ్మల్యేలు ఇష్టం వచ్చినట్లు అక్రమ మద్య వ్యాపారం చేసినా చూసిచూడనట్లు పోయారు. పైగా దీనిపై అసెంబ్లీలో ఒక నివేదిక పెట్టారు. అక్రమ మద్యాన్ని అరికట్టలేక పోతున్నామని ప్రకటించారు.అలా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ తెలిపి కొందరి పేర్లు వెల్లడించడం సంచలనమైంది. తదుపరి మద్య నిషేధం ఉంచాలా ?వద్దా ? అన్నదానిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నిర్వహించారు. ఆ పిమ్మట మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. పైకి తనకు ఇష్టం లేకపోయినా మద్య వ్యాపారాన్ని అనుమతించాల్సి వస్తున్నట్లు పిక్చర్ ఇస్తారన్నమాట. అప్పట్లో మద్యం స్కామ్ లు జరిగాయని విపక్షం ఆరోపించేది. అది వేరే కథ. ఇంకో మాట చెప్పాలి. సంపూర్ణ మద్య నిషేధం చేయాల్సిందే అంటూ ఉద్యమం చేసిన ఈనాడు గ్రూప్ అదినేత రామోజీరావు మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక సంపాదకీయం రాసేసి చేతులు దులుపుకున్నారు. అందులో కూడా చంద్రబాబును పెద్దగా తప్పు పట్టుకపోవడంపై రామోజీని పలువురు విమర్శించేవారు. రామోజీ ఫిలిం సిటీ, డాల్ఫిన్ హోటల్ తదితర వ్యాపారాలు కలిగిన ఈనాడు మీడియా కూడా చంద్రబాబు మాదిరే డబుల్ గేమ్ ఆడిందన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చేవి. అప్పటి మాదిరే ఇప్పుడు కూడా పర్మిట్ రూమ్‌లు, మద్యం షాపుల దందాను టీడీపీ మీడియా సమర్థిస్తున్న తీరు అసహ్యంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా తనకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డు పెట్టుకుని ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని పారించడం ప్రజల కోణంలో దుర్మార్గమే అవుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘జైలు అధికారుల ఓవరాక్షన్.. మిథున్ రెడ్డికి తన సోదరి రాఖీ కడితే తప్పా?’
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తన సోదరితో రాఖీ కట్టే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు డైరెక్షన్లను కూడా జైలు అధికారులు అమలు చేయడం లేదన్నారు. మిథున్‌రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు.రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన సోదరి శక్తి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ మార్గాని భరత్ కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు తీసుకు వెళుతున్న రాఖీలను జైలు అధికారులు వాటిని వెనక్కి పంపించారు. దీంతో, రాఖీలు లేకుండానే ఆమె ములాఖత్‌కు వెళ్లారు.అనంతరం, ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. చేదు అనుభవాలతో జైలులోకి వెళ్లాల్సి వచ్చింది. రక్షాబంధన్ రోజున సోదరితో రాఖీ కట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ను సైతం జైలు అధికారులు అమలు చేయడం లేదు. కేవలం ప్రతిపక్ష నేతలు ములాఖత్‌కు వెళితే జైలు ఎదుట ఇంత భారీ భద్రత అవసరమా?. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. కేబినేట్ అనుమతులు లేకుండా జీవోలు జారీ చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వమే. 2014-19 మధ్యలో వేల కొద్దీ బెల్డ్ షాపులు ఏర్పాటు చేశారు. పాదయాత్రలో మహిళలు కోరిన మీదట 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మద్యం నియంత్రణ చేసే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గకుండా, విచ్చలవిడిగా మద్యం చలామణి కాకుండా వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది అంటూ మండిపడ్డారు.మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మాట్లాడుతూ..‘కనీసం పోలీసుల సమక్షంలోనైనా రాఖీ కట్టడానికి మిథున్ రెడ్డి సోదరికి అవకాశం ఇవ్వకపోవడం దారుణం. కూటమిలో మిగిలిన పార్టీలకు వాయిస్ లేదు.. కూటమి అంటే కేవలం టీడీపీ మాత్రమే. ఏపీలో మద్యం పాలసీ దారుణంగా ఉంది. మందుబాబులు రోడ్లపైనే తాగేస్తున్నారు. ప్రతి మద్యం షాప్‌నకు అనధికార పర్మిట్ రూమ్ ఉంది. టీడీపీ నేతలు బందిపోటు ముఠాలా మారి ప్రజలపై రాబందుల్లా పడ్డారు. మద్యం పాలసీ రూపొందించిన తరువాత కమీషన్లు ఎలా పెంచారు. పెరిగిన కమీషన్లు కరకట్ట ప్యాలెస్‌కి వెళ్లాలా?. ఇది కదా స్కామ్ అంటే. డిస్టలరీలకు ప్రివిలైజ్ ఫీజు మీరు ఎందుకు మాఫీ చేశారు. రాష్ట్ర ప్రజలకు 3000 కోట్లు ఎందుకు నష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో 60 వేలకు తగ్గకుండా బెల్ట్ షాపులు ఉన్నాయి. 2019-24 వరకూ రాష్ట్రంలో ఒక్క బెల్ట్ అయినా ఉందా?. ఆలస్యమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది’ అని అన్నారు. -
Byreddy: వైఎస్ కుటుంబ రుణం తీర్చుకోవాల్సిన టైమ్ పులివెందుల ప్రజలకు వచ్చింది
-
చంద్రబాబు పర్యటన.. అల్లూరి జిల్లాలో ఉద్రికత్త
సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే ర్యాలీగా వెళ్లిన నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రికత్త చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. -
టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్న పోలీసులు: రాచమల్లు
సాక్షి, పులివెందుల: టీడీపీ నేతలు పులివెందులలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోందన్నారు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తోంది. అధికారం అండతో టీడీపీ అధికారులను విచ్చలవిడిగా వాడుకుంటుంది. పులివెందులలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరుకు పులివెందులలో ఓటమి లేదు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్నారు. సాక్షి మీడియా సిబ్బందిపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. సాక్షి సిబ్బంది వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు’ అని చెప్పుకొచ్చారు. -
పులివెందుల ZPTC ఎన్నికలో టీడీపీ తొండాట
-
Wine Shop: మీ దోపిడీకో దండం .. మీరే అమ్ముకోండి
-
Big Question: EVM సర్కార్ ఇంతే..! గాలి కబుర్లతో కాలక్షేపం
-
ఇటు తగులు.. అటు మిగులు
రాష్ట్రంలో కీలకమైన వైద్య, సాంకేతిక విద్యలు గాడి తప్పుతున్నాయి. ప్రభుత్వ విధానపర నిర్ణయాల వల్ల ఈ దుస్థితి దాపురించింది. చంద్రబాబు కూటమి సర్కారు గద్దెనెక్కాక కుటిల నీతితో మెడిసిన్ సీట్లు తగ్గిపోతుంటే.. ఇంజినీరింగ్ విద్యకు ఆదరణ లేకుండా పోతోంది. ఫలితంగా ఇంజినీరింగ్ సీట్లలో మిగులు.. మెడికల్ సీట్లలో తగులు కనిపిస్తోంది. – సాక్షి, అమరావతి వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల పాలిట చంద్రబాబు పాలన శాపంగా మారింది. వైద్య విద్యకు పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ప్రభుత్వం కనీస చొరవ చూపడం లేదు. దీంతో ఈ విద్యా సంవత్సరం మన విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రంలో ఏటా వైద్య విద్యకు డిమాండ్ పెరుగుతోందని కన్వీనర్ కోటా సీట్ల కోసం పోటీ పడే విద్యార్థుల సంఖ్య స్పష్టం చేస్తోంది. 2024–25 విద్యా సంవత్సరంలో కన్వినర్ కోటా ప్రవేశాల కోసం 13,849 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరిగింది. కన్వినర్ కోటా ప్రవేశాల కోసం ఇటీవల హెల్త్ వర్సిటీ దరఖాస్తులు ఆహ్వానించగా 15వేల మంది వరకూ దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడైంది. ఇలా గతంతో పోలిస్తే పోటీ పెరిగినా అదే స్థాయిలో సీట్లు మాత్రం పెరగని దుస్థితికి చంద్రబాబు విధానపర పాపమే శాపమని స్పష్టంగా తేలిపోయింది. సీట్లు తిరోగమనంనేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2025–26 విద్యా సంవత్సరానికి వైద్య కళాశాలలు, వాటిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్లను ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్రానికి కొత్తగా ఒక్క కళాశాల కూడా మంజూరు కాలేదు. అదనంగా సీట్లు మంజూరు కాలేదు. దీనికితోడు వైజాగ్ గాయత్రి వైద్య కళాశాలలో అడ్మిషన్లపై నిషేధించడంతో సీట్లు తగ్గిపోయాయి. గతేడాది సీట్ మ్యాటిక్స్ ప్రకారం రాష్ట్రంలో 36 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉండగా వీటిల్లో 6,510 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4,046 కన్వినర్ సీట్లు రాష్ట్ర కోటా కింద భర్తీ చేశారు. కాగా, ఈ ఏడాది గాయత్రిలో 200 సీట్లపై నిషేధం విధించడంతో ఈ దఫా కన్వినర్ కోటాలో 100 సీట్లు తగ్గి 3,946 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.రెండేళ్లలో 2,450 సీట్లు నష్టం ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే వైద్య కళాశాలల నిర్మాణాలన్నింటినీ గద్దెనెక్కిన రోజు నుంచే చంద్రబాబు నిలిపేయించారు. గతేడాది ప్రారంభానికి నోచుకోని నాలుగు కళాశాలలతోపాటు, ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఏడింటిలో ఏ ఒక్క కళాశాలకూ అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయలేదు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు.కుట్రలతో కలలు ఛిద్రంపేద ప్రజలకు ఉచిత సూపర్‌స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడం కోసం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కళాశాలలు 2023–24లో ప్రారంభమై 750 సీట్లు సమకూరాయి. అలాగే 2024–25లో ఐదు, 2025–26లో ఏడు కళాశాలలు ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా గతేడాది 2024–25కు ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 సీట్లు రాబట్టడానికి ఏర్పాట్లు చేశారు. కాగా, ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన బాబు కళాశాలలను ప్రైవేట్‌కు అప్పజెప్పాలని నిర్ణయించారు. అంతటితో ఆగకుండా గతేడాది ప్రారంభం కావాల్సిన కళాశాలలపై కుట్రలు పన్నారు. బాబు ప్రభుత్వం చేసిందేమీ లేకున్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషితో నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) పులివెందుల మెడికల్ కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లతో గతేడాదే అడ్మిషన్లకు అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే మిగిలిన కళాశాలలకు ఇదే మాదిరిగా సీట్లు మంజూరు చేయడానికి ఎన్ఎంసీ సుముఖంగా ఉన్నప్పటికీ కళాశాలలు మేం నిర్వహించలేమంటూ బాబు ప్రభుత్వం లేఖలు రాసింది. దీంతో ఎన్ఎంసీ మంజూరు చేసిన సీట్లను రద్దు చేసేసింది. ఒక్క పాడేరు వైద్య కళాశాల మాత్రమే 50 సీట్లతో ప్రారంభమైంది. ఈ క్రమంలో గతేడాది ఏకంగా 700 సీట్లు నష్టపోయి మన విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే మన దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నీట్లో 100 నుంచి 150 మేర ఎక్కువ స్కోర్ చేసినా సీట్లు పొందలేక వైద్య విద్యకు దూరం అయ్యారు. విద్యార్థులకు మేలు చేసే ఆలోచనే లేదు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తేస్తామన్నారు. గత ఏడాది ఎత్తేయలేదు. ఈ ఏడాదైనా సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తేయాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్ధి చేయాలనే ఉద్దేశమే ఈ ప్రభుత్వంలో ఎక్కువగా కనపిస్తోంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మేలు చేయాలనే ఆలోచనే లేకుండా పోయింది. యోగా డే, అమరావతి పునఃప్రారంభం ఇలా రకరకాల ఆర్భాటపు కార్యక్రమాలకు రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలంటే మాత్రం నిధుల కొరతను సాకుగా చూపిస్తున్నారు. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ఇంజి‘నీరుగారిపోయే’..! రాష్ట్రంలోని ఇంజినీరింగ్ (బీటెక్) కన్వినర్ కోటా తొలి దశ సీట్ల భర్తీ అనంతరం కంప్యూటర్ సైన్స్(సీఎస్ఈ) ఆధారిత కోర్సుల సీట్లు భారీగా ఖాళీ ఉన్నాయి. ఒక్క సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లో 15,850 సీట్లు మిగిలిపోయాయి. 2025–26 విద్యా సంవత్సరానికి కన్వినర్ కోటాలో 1,52,246 సీట్లు ఉండగా తొలి దశ కౌన్సెలింగ్‌లో 1,18,525 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 33,721 సీట్లు మిగిలి ఉండటం గమనార్హం. ఈసీఈలో 6404, ఈఈఈలో 3409 సీట్లు, మెకానికల్‌లో 3090, సివిల్‌లో 2747 సీట్లు భర్తీకి నోచుకోలేదు. కాగా, స్థానికత అంశంపై విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో ఫేజ్–2 సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది. 66 బ్రాంచుల్లో సున్నా ప్రవేశాలు ఏపీ ఈఏపీ సెట్లో ఇంజినీరింగ్‌కు సంబంధించి 1.84లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 1.26లక్షల మంది అర్హత సాధించారు. వీరిలో 1.24లక్షల మంది వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. ఇందులో 1,18,525 మంది సీట్లు పొందారు. వివిధ కళాశాలల్లో 66 బ్రాంచుల్లో సున్నా ప్రవేశాలు నమోదవడం గమనార్హం. ఇలా సున్నా ప్రవేశాలు వచి్చన కోర్సుల్లో సీట్ల సంఖ్య 1,908గా ఉన్నాయి. మరోవైపు 51 కళాశాలల్లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. ఒక్క కళాశాలలో మాత్రమే ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. కెమికల్ ఇంజినీరింగ్‌లో 427 సీట్లలో అన్నీ భర్తీ అయ్యాయి. -
గిరిజనుల గోడు.. వినేదెవరు?
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. దీనికితోడు ఏ కార్యక్రమం అయినా కేంద్ర నిధులే దిక్కన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంకా సమీక్షలు.. సమావేశాలతోనే కాలయాపన చేయడంతో అడవిలో అలజడి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని 1994లో ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనుల ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది. అధికార పీఠమే లక్ష్యంగా వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయడంలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపరని మరోమారు తేటతెల్లమైంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎస్టీలకు ఇచ్చిన 20 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అప్పట్లోనే 50 ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికీ పింఛన్ ఇస్తానని, ప్రతి జిల్లాలో గిరిజన భవన్ నిరి్మస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, గిరిజన ప్రత్యేక కమిషన్ వంటి హామీలను మరిచిన చంద్రబాబు.. బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహించి, అటవీ సంపదను దోపిడీదారులకు దోచి పెట్టడానికి కొమ్ముకాయడంతో గిరిజనుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లోనూ 50 ఏళ్లకే పింఛన్, సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేయడం, ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో 3 పునరుద్ధరణ, ఎస్టీలకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదితర హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా వాటి అతీగతీ లేదు. వన్ ఆఫ్ సెవెంటీ, పీసా చట్టాల అమలులోనూ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోంది. నకిలీ గిరిజన ధ్రువపత్రాలపై విచారణ, తుది తీర్పులకు కాలయాపన శాపంగా మారింది. విద్య, ఉపాధి, వైద్యం అన్నింటా ఉత్తుత్తి మాటలతో కూటమి నేతలు మోసం చేయడంపై అడవిలో ఆందోళనలు, ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ ఎప్పుడు? జీవో నెంబర్ 3ను పునరుద్ధరించడంపై ఏడాదికిపైగా కాలయాపనతో సరిపెడుతోంది. ఏజెన్సీలోని షెడ్యూల్డ్ గ్రామాల్లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇచ్చేలా జారీ చేసిన ఈ జీవోను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. దాన్ని పునరుద్ధరిస్తామంటూ మాట ఇచ్చిన కూటమి నేతలు ఇప్పటికీ మభ్య పెడుతున్నారు. దీంతో ఈ జీవోను పునరుద్ధరించి, తమకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని గిరిజనులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. తా త్కాలికంగా గిరిజనుల ఆందోళనను విరమించేలా చేసిన ప్రభుత్వం.. ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవడంలో మాత్రం తాత్సారం చేస్తోంది. మంత్రి తొలి సంతకానికి దిక్కులేదు.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేసిన తొలి సంతకానికి దిక్కులేకుండా పోయింది. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం పార్వతీపురం కలెక్టర్ వద్ద గిరిజన విద్యార్థులు ఆందోళన నిర్వహించడం గమనార్హం. గిరిజన ఉత్పత్తులకు దక్కని ధరలు గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన కాఫీ సాగును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగును విస్తరిస్తామంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కాఫీ తోటలను బాగు చేసుకునేందుకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో దాన్ని తిరిగి సాధించేందుకు ఎన్డీఏ పక్షంలోని టీడీపీ ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌లో స్థానిక ఐటీడీఏ, జీసీసీలు సైతం విఫలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కాఫీకి డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ ఏడాది అరకు కాఫీకి మంచి ధర సాధించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజన రైతులకు శాపంగా మారింది. చింతపండు, తేనె వంటి వాటితోపాటు ఇతర పంటలకు, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంలోనూ వైఫల్యంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులకు మేలు కలుగుతోంది. గిరిజనులు అధిక ఉత్పత్తులు సాధించేలా తగిన పరికరాలు సబ్సిడీపై అందించడం, వారి ఉత్పత్తులకు సరైన ధర దక్కేవరకు నిల్వ చేసుకునేలా కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 34 తెగలకు చెందిన 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఫలితంగా వారి బతుకు చిత్రం మారింది. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. 2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.20,948.15 కోట్లు వెచ్చించింది. వివిధ పథకాల ద్వారా ప్రత్యక్షంగా (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) రూ.14,712.08 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఏకంగా 3.22 లక్షల ఎకరాలకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం గిరిజనులకు పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. అంతర పంటగా మిరియాలు, ఇతర పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు వంటివి అందించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధిపై ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ఆ ఐదేళ్లు గిరిజనులు ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఈ విషయాన్ని తలుచుకుంటూ ప్రస్తుతపరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డోలీ నిర్మూలన మాటలకే పరిమితం ఏజెన్సీలోని కొండ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించి డోలీ మోతలను నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎన్నికల ముందు హామీలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గతేడాది డిసెంబర్లో ఏజెన్సీలో రెండు రోజులపాటు పర్యటించి, రోడ్లు వేస్తున్నట్టు శంకుస్థాపనలతో హడావుడి చేశారు. నెలలు గడుస్తున్నా ఒక్క రోడ్డు వేయక పోవడంతో డోలీ కష్టాలు తీరడం లేదంటూ గత నెలలో గిరిజన యువకులు గుర్రాలపై గ్రామాల్లో తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ఏజెన్సీలో మాడ్రేబు నుంచి పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో రోడ్లు వేసి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. -
‘దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?’
తాడేపల్లి: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల అంఃశానికి సంబంధించి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ప్రజలను భయపెట్టి ఎన్నికలకు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారు.రెవిన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ కోసం పని చేస్తుంది. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?, రెండు దశాబ్దాల క్రితం బిహార్‌లో ఉన్న పరిస్తితి టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకు వచ్చింది. కొంతమంది అధికారులు మితి మీరిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. పులివెందుల ఎన్నికలతోనే రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా?, ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చేశారు.ప్రజలు ఓటు వేయాలి అనుకుంటున్నారా?, ఓటు వేయొద్దు అనుకుంటున్నారా?, మీరు ఎవరు ఓటుకు రావాల్సిన అవసరం లేదనే దురహంకారంతో మార్చారు. ప్రజా స్వామ్య బద్దంగా పులివెందుల ఎన్నిక నిర్వహించండి. ప్రజలు ఎవరి పక్షంగా ఉన్నారో తెలుస్తుంది. నిజంగా టిడిపి గెలిచే పరిస్తితి ఉంటే ఈ దాడులు ఏంటి?, రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు సునీత బయటకు వస్తారు. ప్రభుత్వాన్ని కాపాడటానికి మాట్లాడతారు. చంద్రబాబు మీ నాయకుడే కదా...ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. ఇంకా అధికారులను కలవడం ఎందుకు?’ అని ప్రశ్నించారు. -
‘పులివెందులలో ఎన్నిక వచ్చింది.. సునీత మళ్లీ దిగారు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. తన తండ్రిని ఓడించిన వారికి ఈరోజు ఎలా మద్దతిస్తారో సునీత సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు.. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకా కుమార్తె, అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయాలనుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి మేగురు నాగార్జున తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఓ వైపు అరాచకాలు చేస్తూనే.. మరోసారి వివేకా హత్యను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఏరోజూ నిజాయితీగా రాజకీయాలు చేయలేదు. ఎప్పుడూ తప్పుడు పద్ధతులతోనే రాజకీయాలు చేస్తున్నాడు. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకా కుమార్తె, అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుసు. అందుకే హఠాత్తుగా సునీతను రంగంలోకి దింపారు. సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారింది. గత రెండు ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసును వాడుకుని లబ్ది పొందాలని చూశాడు.అవినాష్ రెడ్డిపై కుట్ర..వివేకానందరెడ్డిని చంపింది తానే అని దస్తగిరి ఒప్పుకున్నది నిజం కాదా?. వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది. వ్యవస్థలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి. చంద్రబాబు చేతిలో వ్యవస్థలు ఉన్నా సీబీఐ చేతికి కేసు వెళ్లింది నిజం కాదా?. అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయాలనుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయనగానే వస్తారు.. నాలుగు నిందలు వేసి వెళ్లిపోతారు. చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత తోలుబొమ్మగా మారింది. తన తండ్రికి బద్ధశత్రువులైన వారితోనే సునీత చేతులు కలిపారు.బాబు ప్లానే..వివేకానందరెడ్డి రెండో భార్య విషయం.. ఆమెతో జరిగిన ఛాటింగ్ ఎందుకు బయటకు రావడం లేదు. ఎవరి ప్రోద్భలంతో బయటికి రావడం లేదో సునీత చెప్పాలి. హత్య ఎవరు చేశారో చెప్పిన తర్వాత కూడా అతన్ని అప్రూవర్‌గా మార్చింది ఎవరో తెలియదా?. వెయ్యి రూపాయలు లేని కారు డ్రైవర్ దస్తగిరి.. ఈరోజు కాన్వాయ్‌కు ఓనర్ అయిపోయాడు. దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దస్తగిరి తరపున వాదిస్తున్నాడు. సిద్ధార్ధ్ లూథ్రా.. చంద్రబాబు మనిషి అని మీకు తెలియదా?. నీ తండ్రిని ఓడించిన వారికి ఈరోజు ఎలా మద్దతిస్తారో సునీత సమాధానం చెప్పాలి. పులివెందులలో వ్యవస్థలను చంద్రబాబు తన చేతిలో పెట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై ఓ చర్చ నడుస్తోంది. వందకు వందశాతం 2024 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. 2024 ఎన్నికలు జరిగిన తీరుపై మాకు కొన్ని సందేహాలున్నాయి. విజయనగరంలో ఎన్నికలప్పుడు 40% శాతం ఎన్నికలయ్యాక 90% ఈవీఎంలలో చార్జింగ్ ఉంది. వీవీప్యాట్స్ స్లిప్పుల్లో తేడాలున్నాయి. కౌంటింగ్ సీసీ ఫుటేజీని కోరాం. మా సందేహాలను నివృత్తి చేయమని మేం ఎన్నికల కమిషన్‌ను కోరాం’ అని చెప్పుకొచ్చారు. -
‘బాబు, లోకేశ్.. ఆలపాటి బెదిరింపులు కనిపించడం లేదా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బెదిరింపులు తారాస్థాయికి చేరాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఆలపాటి రాజేంద్రకు శాతవాహన కళాశాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. శాతవాహన భూములను కాజేస్తుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ నడి బొడ్డున వందల కోట్ల విలువైన భూమిని దక్కించుకునేందుకు వర్గాలు తయారయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర శాతవాహన భూముల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆలపాటి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను ఆలపాటి బెదిరించారు. తన మాట వినకపోతే కుటుంబాన్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆలపాటి రాజేంద్రకు శాతవాహన కళాశాలకు సంబంధం ఏంటి?. ఎందుకు విద్యాసంస్థల్లోకి ఆలపాటి చొరబడ్డారో సమాధానం చెప్పాలి. అధికార ప్రభుత్వం ఏం చేస్తోంది.శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్‌ను గతంలో ఆలపాటి కిడ్నాప్ చేశారు. తాజాగా ఫోన్లో బెదిరించారు. అధికార పార్టీ నేతలే ఇలా కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే చంద్రబాబు, లోకేష్ ఏం చేస్తున్నారు?. శాతవాహన కాలేజ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మేం పోరాటం చేశాం. గత ప్రభుత్వంలో శాతవాహన కాలేజ్ భూములను కబ్జాల నుంచి కాపాడాం. టీడీపీ ప్రభుత్వం రాగానే శాతవాహన భూముల్లోకి కబ్జాదారులు చొరబడ్డారు. శాతవాహన భూములను కాజేస్తుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారు. శాతవాహన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. కొంతమంది ఫిర్యాదులు చేసినా పోలీసులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు.ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఆలపాటి చెబుతున్నారు. కబ్జా చేస్తున్నాననే అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారా?. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కబ్జాను ప్రోత్సహిస్తున్నట్లుగానే భావిస్తాం. తనపై ఫిర్యాదు చేసిన వంకాయలపాటి శ్రీనివాస్‌ను ప్రెస్ మీట్ పెట్టి ఆలపాటి బెదిరిస్తున్నారు. భూములు కబ్జా చేయడం కోసం సామాన్యులను బెదిరిస్తారా?. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని శాతవాహన భూములను కాపాడాలి’ అని డిమాండ్ చేశారు. -
పులివెందుల గడ్డ.. జగన్ అన్న అడ్డా.. ఆగస్టు 14 తో బాబు పతనం మొదలు
-
‘మాజీ సైనికుడి భూ వివాదంపై విచారణ జరిపించండి’
సాక్షి, విశాఖపట్నం: మాజీ సైనికుడి భూ వివాదం, విశాఖలో ల్యాండ్ గ్రాబింగ్, రెవెన్యూ సంబంధిత భూములపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గురువారం లేఖ రాశారు. ఎండాడలో మాజీ సైనికుడి భూవివాదంపై విచారణ కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెవెన్యూ మంత్రికి సైతం ఆయన లేఖ రాశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..‘ఎండాడలో మాజీ సైనికుడి భూవివాదంపై విచారణ కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెవెన్యూ మంత్రికి సైతం ఆయన లేఖ రాశారు. ‘ప్రీహోల్డ్ భూముల స్వాధీనం వంటి వివాదాస్పద ఘటనల పట్ల తీవ్ర ఆందోళన చెందిన విషయాన్ని లేఖలో రాశాను. మీడియా ద్వారా ఈ వ్యవహారాలు ప్రస్తుతం మీ దృష్టికీ వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆధారాలనూ ఈ లేఖకు జత చేశాను. ఆయా భూములు స్వాధీనపరచడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, సీనియర్ అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం వంటి అంశాల్లో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెవెన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శి స్థాయిలోనూ ఇందులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఈ విషయంపై న్యాయ విచారణ అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకుని, నిష్పక్షపాతమైన విచారణ ద్వారా వాస్తవాలను వెలికి తీయాలి. ప్రజల్లో పరిపాలనపై విశ్వాసం పునరుద్ధరించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. భూ కబ్జాదారులు, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆ లేఖలో బొత్స కోరారు. -
ఒక్క పదవి కోసం ప్రాణాలైనా తీసేయాలా?
-
కొత్త అప్పు లకు కూటమి సర్కారు రెడీ
-
Big Question: పులివెందులలో పచ్చ సైకోలు ఒక్క సీటు కోసం వందలాది తలలు!
-
రూ.పది లక్షల కోట్ల అప్పులున్నాయ్!
సాక్షి, అమరావతి/మంగళగిరి: చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయ్.. రూ.పదిలక్షల కోట్లు అప్పులున్నాయ్.. వా టికి వడ్డీలు, అసలు కట్టడానికే ఇబ్బందిపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ వీవర్స్ కాలనీలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. సభలో సీఎం మాట్లాడుతూ.. మీ (బీసీలు) వల్లే అధికారంలోకి వచ్చానని, నా మొదటి ప్రాధాన్యం వెనుకబడిన వర్గాలేనని, కొన్ని వర్గాలు వస్తుంటాయి.. పోతుంటాయని పేర్కొన్నారు. ఇంకా వైకుంఠపాళీ ఆడొద్దని, మళ్లీ మళ్లీ డెవలప్ చేయాలంటే ఇంకా నాకు ఓపిక లేదన్నారు. రాష్ట్రంలో బీసీల కోసం ఆదరణ–3 తెస్తామని, స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. నేతన్న భరోసా కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చెప్పారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం చేనేత ఉత్పత్తులపై విధించే 5 శాతం జీఎస్టీని మొత్తం రూ.15కోట్లను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని సీఎం పేర్కొన్నారు. చేనేతలో 5,386 మందికి లబ్ధి కలిగేలా రూ.5 కోట్లతో పొదుపు నిధి(థ్రిఫ్ట్ ఫండ్) ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని, మంగళగిరిలో పార్కుకు ఆయన పేరుపెట్టి, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. బ్రాహ్మణి కట్టిన చీరనే 98 మంది కొన్నారు : లోకేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంటే.. మంగళగిరిలో మాత్రం మోదీ, బాబు, లోకేశ్‌తో కూడిన ట్రిపుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘బ్రాహ్మణి మంగళగిరి చేనేత చీర కట్టిన తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలాంటి చీరనే 98 మంది కొనుగోలు చేశారు’ అని లోకేశ్ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసమే పీ–4 సాయం చేస్తే సంతృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో గురువారం పీ–4పై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేదరిక నిర్మూలన కోసమే పీ–4 అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి ఓ మండలంలో 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. నవ్వులపాలైన నారా లోకేశ్.. టాస్క్ ఫోర్స్ : ఎప్పటిలాగే మంత్రి నారా లోకేశ్ మరోసారి తప్పులో కాలేశారు. మంగళగిరిలో గురువారం చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించారు. ఆ మాటల ప్రవాహంలో పాపం నవ్వులపాలయ్యారు. ‘2019 ఎన్నికల్లో.. నేను మంగళగిరిలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయానని, అయితే, నన్ను 2024 ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించమని కోరాను. కానీ, ఏకంగా 91 వేల నాలుగు వందల 13 వేల మెజారిటీతో గెలిపించార’ని నోరుజారి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 91 వేల నాలుగు వందల 13 వేలు ఏంట్రా బాబూ అంటూ సభకు వచ్చిన వారు తలపట్టుకుని నవ్వుకున్నారు. -
‘అప్పు’డే పరగడుపు
సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం అలా ఆమోదం తెలిపిందో లేదో.. అందుకు సంబంధించి గురువారం వెనువెంటనే వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయిపోయాయి. బడ్జెట్ బయట ఏపీఐఐసీ, డిస్కమ్స్ ద్వారా ఏకంగా రూ.12,973. 94 కోట్ల అప్పునకు ఇంధన శాఖ, పరిశ్రమల శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఇందులో ఏపీఐఐసీ ద్వారా రూ.7,500 కోట్ల అప్పును వచ్చే 12 నెల ల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా కోటి రూపాయలు అదీకృత షేర్ కేపిటల్, రూ. లక్ష పెయిడ్–అప్ షేర్ కేపిటలతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేశారు. ఎస్పీవీ బోర్డు అవసరాల ఆధా రంగా ఎప్పటికప్పుడు అధీకృత పెయిడ్–అప్ కేపి టల్, షేర్ కేపిటల్‌ను పెంచవచ్చునని తెలిపారు. ప్రస్తుతం ఏపీఐఐసీ దగ్గర ఉన్న భూములను ఎస్పీవీకి బదిలీ చేస్తారు. ఆ బదిలీ చేసిన భూములను బ్యాంకులు, ఆర్థిక సంస్దలకు తనఖా పెట్టి 9–12 నెలల కాలవ్యధిలోనే రూ.7,500 కోట్లు రుణాన్ని సమీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీఐఐసీ దగ్గర 13,000 ఎకరాలకుపైగా భూములున్నాయని, కొత్తగా మరో 30 వేల ఎకరాలను సేకరించడంతోపాటు ఆ భూములను పరిశ్రమల అవసరాలకు అభివృద్ధి చేసేందుకు రూ.7,500 కోట్లు అప్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యుత్ డిస్కమ్స్ ద్వారా ఇలా.. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్మార్ట్ మీటరింగ్‌తోపాటు రేవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమును అమలు కొనసాగింపునకు ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా రూ.3544.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ ద్వారా రూ.1029.37 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో పక్క ఇప్పటికే ఏపీపీడీసీఎల్ ఎస్బీఐ, యుబిఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు ఆ సంస్థ ఖాతాల్లో నిధుల్లేక దివాళా తీసింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులు ఆర్బీఐకి, సిబిల్, క్రిసిల్ సంస్థలకు రిపోర్ట్ చేస్తామని హెచ్చరించాయి. ఏపీపీడీసీఎల్ ఆరి్థక పరిస్థితి దిగజారడంతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆ బ్యాంకులు దగ్గర ఏపీపీడీసీఎల్ తీసుకున్న రూ.900 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నేతన్నల జీవితాలు బాగు పడాలన్న ఆకాంక్షతో వైఎస్సార్సీపీ హయాంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేసి ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచామని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ గురువారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తమ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేస్తూ అన్ని వర్గాల మాదిరిగానే చేనేతలను సైతం చంద్రబాబు మోసం చేసిన వైనాన్ని ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..నేతన్నలకు రూ.3,706.16 కోట్ల సాయం చేశాం.. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘సంత్ కబీర్’’ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు (పొందూరు)లకు అభినందనలు. మా ప్రభుత్వ హయాంలో ప్రతి అడుగులోనూ నేతన్నలకు అండగా నిలిచాం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ ద్వారా ఏటా రూ.24,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు, నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం. అంతేకాదు.. వివిధ పథకాల ద్వారా నేతన్నలకు రూ.3,706.16 కోట్లు మేర సాయం చేశాం. ఇది ఒక రికార్డు. నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్‌కు రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా ప్రతి అడుగులోనూ చేనేతలకు అండగా నిలిచాం. ఏ రకంగా ఆదుకున్నట్లు..?ఈ ప్రభుత్వం చేనేతలకు నడుస్తున్న పథకాలను ఆపివేయడంతోపాటు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. కానీ రెండు బడ్జెట్లలో ఈ ప్రభుత్వం పెట్టింది సున్నా. పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. కానీ 14 నెలలు గడిచినా అమలు చేయలేదు. కరెంటు సబ్సిడీ ఇవ్వలేదు గానీ విద్యుత్తు చార్జీలు అమాంతం పెంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు రూ.19 వేల కోట్ల మేర కరెంటు షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం చేనేతలను ఏ రకంగా ఆదుకున్నట్లు? పత్రికల్లో ప్రకటనలు మినహా ఏమీ కనిపించడం లేదు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచించారు, మోసం చేశారు. -
నేతన్నలను చంద్రబాబు సర్కార్ ఏ రకంగా ఆదుకున్నట్లు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంత్ కబీర్ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు (పొందూరు)లకు ఆయన అభినందనలు తెలిపారు.‘‘నేతన్నల జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వారికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచాం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 'వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ ద్వారా ప్రతి ఏటా రూ.24,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు, నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం. అంతేకాదు వివిధ పథకాల ద్వారా నేతన్నలకు రూ.3,706.16 కోట్లు సాయం చేశాం. ఇది ఒక రికార్డు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్ కు రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా ప్రతి అడుగులోనూ చేనేతలకు అండగా నిలిచాం. ఈ ప్రభుత్వం చేనేతలకు నడుస్తున్న పథకాలను ఆపేసి ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. రెండు బడ్జెట్లలో పెట్టింది సున్నా.ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్న నేతన్నలందరికీ శుభాకాంక్షలు.ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా సంత్ కబీర్ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు… pic.twitter.com/x0ewriEn5z— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2025..పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. 14 నెలలు గడిచినా అమలు చేయలేదు. కరెంటు సబ్సిడీ ఇవ్వలేదు, కానీ కరెంటు ఛార్జీలు అమాంతంగా పెంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు రూ.19వేల కోట్ల మేర కరెంటు షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం చేనేతలను ఏ రకంగా ఆదుకున్నట్లు?. పత్రికల్లో ప్రకటనలు తప్ప ఏమీ కనిపించడం లేదు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచించారు, మోసం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు. -
తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం
-
చంద్రబాబు, లోకేష్ కు అంబటి ప్రశ్నాస్త్రాలు
-
వైఎస్ జగన్ హయాంలోనే చేనేత రంగానికి మేలు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సురేంద్రబాబు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చేనేత రంగానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును వారు గుర్తు చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేనేత రంగానికి చీకటి రోజులు వచ్చాయని మండిపడ్డారు. చేనేత కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..ఐదేళ్లలో చేనేతలకు రూ.3700 కోట్లు లబ్ధి: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగడిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు చేనేతలు సంతోషంగా జీవించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో వివిధ కార్యక్రమాల రూపంలో దాదాపు రూ.3700 కోట్లతో చేనేతలకు అండగా నిలబడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా నేతన్న నేస్తం పథకాన్ని తీసుకొచ్చి చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. 85 వేల కుటుంబాలకు రూ.1.20 లక్షల చొప్పున మేలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కి దక్కుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమాజానికి నాగరికత నేర్పి, దర్జా తెచ్చింది నేతన్నల జీవితాలు మళ్లీ చితికిపోతున్నాయి.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రతి ఏడాది ఇచ్చిన హామీలనే కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా చేనేతల పక్షాన వైఎస్సార్సీపీ అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గతేడాది ఆగస్టు 7న విజయవాడలో జరిగిన చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఏవైతే హామీలిచ్చారో అవే హామీలను మళ్లీ ఈ ఏడాది కూడా ఇస్తున్నారే కానీ అమలు చేయకుండా సీఎం చంద్రబాబు చేనేతలను మోసగిస్తున్నారు.జీఎస్టీపై చంద్రబాబు తిరకాసు హామీలు: సురేంద్రబాబుస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూస్తే చేనేతలకు ఎవరైనా నేరుగా సాయం అందించారంటే అది ఖచ్చితంగా సీఎంగా వైయస్ జగనే అని చెప్పక తప్పదు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు నేరుగా చేనేతల బ్యాంకు ఖాతాలో జమ చేసి మా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. జీఎస్టీ అనేది కేంద్రం పరిధిలోని అంశమే అయినా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చాలా సందర్భాల్లో చేనేతలకు జీఎస్టీ ఎత్తివేస్తామని, లేదంటే రీయింర్స్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ 14 నెలల్లో ఏనాడూ చేనేతల జీఎస్టీ గురించి లోకేష్ మాట్లాడిన పాపాన పోలేదు.జీఎస్టీ కౌన్సిల్లోనూ టీడీపీ ప్రస్తావించలేదు. జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది. 15వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఒడిశా ప్రభుత్వం మాత్రమే చేనేతలకు జీఎస్టీని వ్యతిరేకిస్తే ఏపీలో ఆనాటి ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు మాత్రం జీఎస్టీకి అనుకూలమని చెప్పేసి వచ్చారు. చేనేతలకు జీఎస్టీ విధించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ జీఎస్టీ కౌన్సిల్‌కి లేఖ రాయడం జరిగింది. 2021లో జీఎస్టీని 5 శాంతం నుంచి 12 శాతం పెంచుతామని కేంద్రం చెప్పినప్పుడు రాష్ట్ర ఆర్థికశాఖ ద్వారా కేంద్రానికి లేఖ రాసి, దానిని అడ్డుకున్నారు.వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా చేనేతలకు అండగా నిలిచింది. నేతన్న నేస్తం ఇస్తామని చీరాల సభలో నారా చంద్రబాబు ప్రకటించి ఇంతవరకు దాని ఊసెత్తడం లేదు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని జీవో జారీ చేసి 6 నెలలు గడిచినా ఇంతవరకు దానికి అతీగతీ లేదు. గతేడాది విజయవాడలో నిర్వహించిన చేనేత దినోత్సవం రోజున ఆరోగ్య బీమా కింద తక్షణమే రూ.10 కోట్లు రిలీజ్ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వాటికి ఇప్పటికీ మోక్షం లభించలేదు సరికదా ఈ ఏడాది దాన్ని రూ.5 కోట్లకు తగ్గించి మోసం చేస్తున్నాడు. జీఎస్టీ ఎత్తివేయడానికి రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.67 కోట్లు ఖర్చవుతుందని అదే రోజు చంద్రబాబు చెప్పారు.చేనేతకు అండగా నిలిచిన వైఎస్ జగన్: చిల్లపల్లి మోహన్రావువైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 2020 ఆగస్టు 7న చేనేత దినోత్సవ కార్యక్రమం జరుపుకొనే నాటికి రెండు విడతల్లో చేనేత నేస్తం ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యల మీద అధ్యయనానికి మమ్మల్ని నాటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనకు పంపించి రిపోర్టు తయారు చేయించారు. రాష్ట్రంలో 87 శాతం చేనేతలంతా ప్రైవేట్ మాస్టర్ వీవర్స్ మీద ఆధారపడి ఉన్నారు. ఆ కారణం చేత అందరికీ మేలు జరిగేలా సొంత మగ్గం ఇంట్లో ఉండి పనిచేసుకుంటున్న వారికి కూడా అమలయ్యేలా 85 వేల కుటుంబాలకు ఐదేళ్లు వైఎస్ జగన్ నేతన్న నేస్తం ద్వారా రూ. 900 కోట్లు లబ్ధి చేకూర్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సొసైటీలకు మాత్రమే మినహాయింపులు ఉంటాయని షరతులు విధిస్తున్నారు.వైఎస్ జగన్ సీఎం అయ్యాక రూ.5 వేలుగా ఉండే చేనేతల తలసరి ఆదాయం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోయింది. ఆప్కోకి పాత బకాయిలు రూ. 400 కోట్లు రద్దు చేసిన ఘనత వైఎస్ జగన్‌కి దక్కుతుంది. గత తెలుగుదేశం హయాంలో ఆప్కోకి పేరుకుపోయిన ముడి సరుకుకి సంబంధించి రూ.100 కోట్ల బకాయిలు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది.ఇప్పుడున్న సొసైటీలన్నింటికీ పాత బకాయిలు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే తీర్చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేతలు ఎవరూ సంతోషంగా లేరు. ఆప్కో సేల్స్ పెరిగితే సొసైటీలకు పని పెరుగుతుందని భావించి తిరుపతి, కడపలో మూడంతస్తుల సొంత భవనం, గుంటూరు, ఒంగోలు, గన్నవరం ఎయిర్పోర్ట్, రేణిగుంట ఎయిర్పోర్ట్, తదితర ప్రాంతాల్లో అత్యాధునిక షోరూమ్‌లను వైఎస్సార్సీపీ హయాంలోనే ఏర్పాటు చేశాం. గతంలో వైఎస్సార్ కూడా సీఎంగా ఉండగా కేంద్రంతో మాట్లాడి 11.3 శాతం ఎక్సైజ్ డ్యూటీని ఒక్క రోజులో రద్దు చేయించారు. -
‘ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటే’
ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పులివెందులలో టీడీపీ గూండాల అరాచకం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. సాక్షి,తాడేపల్లి: పులివెందులలో టీడీపీ నేతల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ‘‘పులివెందులలో టీడీపీ నేతలు నిసిగ్గుగా ప్రవర్తించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గెలవడం కోసం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారు. కోండెపి జెడ్పీటీసీ గెలిచినట్లు టీడీపీ నేతలే ప్రకటించుకున్నారు. పైగా గాయపడినవారిపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు.డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్స్‌ను ఖండిస్తూ.. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరి ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పని చేస్తున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ తప్పుడు మాటలు మాట్లాడడం సిగ్గు చేటు. ఖాకీ బట్టలు వేసుకుని కోయ ప్రవీణ్ చంద్రబాబు కాళ్ల పూజ చేస్తున్నాడు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్‌ను ప్రవీణ్ కాపాడాలి. చంద్రబాబు సింగపూర్ ప్రచారంపై.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారు. మరి ఏం ాధించారో చెప్పాలి. తాజాగా చంద్రబాబు కుమార సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పెట్టుబడులు పెడుతోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలను మభ్య పెడుతున్నారు. ఫ్రీ బస్సు స్కీమ్ మోసం.. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించారు. ఇప్పుడేమో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అరకొరగా అమలు చేసేందుకు కుటరలు చేస్తున్నారు అని అంబటి విమర్శనాస్త్రాలు సంధించారు. -
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడి హేయమైన చర్య: మేయర్ డాక్టర్ శిరీష
-
బల్క్ డ్రగ్ పార్క్ తరలించేవరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపదు
-
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు..
ఆంధ్రప్రదేశ్ మంత్రులు లోకేశ్, పి.నారాయణల వ్యాఖ్యలు చూస్తే మతిపోతుంది. ఎవరో ఒకరు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే సింగపూర్ తమ రాష్ట్రంలో పెట్టుబడులకు తటపటాయిస్తోందని వీరు అంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంకో అడుగు ముందుకేసి ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిఐడీ ద్వారా సింగపూర్‌లోని ప్రముఖులు కొందరిని బెదిరించిందీ అని! నవ్విపోదురు గాక అన్నట్టుగా లేవూ ఈ వ్యాఖ్యలు? తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంతటికైనా సిద్ధపడతారన్నమాట వీళ్లు! కాకపోతే ఆ క్రమంలో తమ అసమర్థతను తామే బయటపెట్టుకున్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తటపటాయిస్తోందంటే సింగపూర్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విశ్వసనీయతను సందేహిస్తున్నట్లే అవుతుంది కదా?వాస్తవానికి పెట్టుబడిదారులైనా, ప్రభుత్వాలైనా అజ్ఞాత వ్యక్తుల మెయిళ్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. మెయిళ్లలోని విషయాలను విచారించి నిర్ధారించుకోవచ్చు అంతే. ఫిర్యాదులు ఉన్నా లేకపోయినా కూడా ఇది జరుగుతూంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పేదాంట్లో నిజానిజాలెంత? అన్నది బేరీజు వేసుకుంటారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత లాభమొస్తుందనుకుంటే పెట్టుబడి పెడతారు లేదంటే లేదు. అంతే. ప్రభుత్వాల తీరుతెన్నులు, ఆయా ప్రాజెక్టుల ప్రయోజనం, పెట్టుబడులు పెడితే వచ్చే లాభనష్టాలు, ప్రభుత్వాలు కల్పించే రాయితీలు, సదుపాయాలు మొదలైన వాటిపై ఆధారపడి ఆయా సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ వంటి వారికి తెలియకుండా ఉంటుందా!జగన్ నిర్వాకం వల్ల సింగపూర్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్దరించడానికి వెళుతున్నారని చంద్రబాబు టూర్‌కు ముందే వ్యాఖ్యానించారు. తన పరపతి అంతా ఉపయోగించి అమరావతి ప్రాజెక్టులో సింగపూర్ వారిని మళ్లీ భాగస్వాములను చేస్తామని ప్రచారం చేసుకున్నారు. తీరా అక్కడికెళ్లాక ఏమైంది? అమరావతి ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం లేదని ఆ దేశ మంత్రి టాన్ సే కుండబద్ధలు కొట్టారు. సాంకేతిక సహకారం మాత్రం అందిస్తామన్నారు. అది కూడా మాట వరసకు అన్నట్లే అనిపిస్తుంది. సింగపూర్ కంపెనీలు కూడా పెద్దగా ఆసక్తి చూపని విషయం ఇప్పటికే స్పష్టమైంది. లేకుంటే టీడీపీ మీడియా ఇప్పటికే ఫలానా కంపెనీ ఇంత పెట్టుబడి పెడుతుంది అంటూ ఊదరగొట్టేది. అది కాకుండా లోకేశ్ చేసిన ఆరోపణలను ప్రముఖంగా ఇచ్చారు. మురళికృష్ణ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి స్థిరత్వం లేదని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఫిర్యాదులు చేశారట. ఆ వ్యక్తి రాస్తే సింగపూర్ ప్రభుత్వం ఎలా నమ్ముతుంది! కూటమికి 164 సీట్లు ఉన్న సంగతి ఆ దేశంవారికి తెలియకుండా ఉంటుందా!మరో కోణం చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలపై అభిప్రాయలు చెప్పేందుకు ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఈ అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవచ్చు లేకపోవచ్చు కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ అది. దీని గురించి మంత్రి లోకేశ్‌కు తెలుసో తెలియదో కానీ ఏ మార్గం ద్వారానైనా సరే ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం తప్పు కాదు కానీ.. దుష్ప్రచారం చేయడం తప్పు. అలాంటి తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వాలు కచ్చితంగా చర్య తీసుకుంటాయి. కూటమి నేతలు జగన్ ప్రభుత్వంపై ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారో గుర్తు లేదా? వైసీపీ ప్రభుత్వ అప్పులపై అబద్ధపు ప్రచారం చేయడమే కాకుండా.. రకరకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారే! అయినా ఫలితం లేకపోవడంతో అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి అప్పుల వివరాలు దాచేస్తోందంటూ చిత్రమైన ఆరోపణ కూడా చేశారు. జగన్ ప్రభుత్వం ఈ తాటాకు చప్పుళ్లకు వెరవలేదు సరికదా.. కూటమి నేతల మాదిరిగా బేలగా మాట్లాడనూ లేదు. తాము పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ వారు పుల్లలు పెడుతున్నారన్నట్లుగా లోకేశ్ ఆరోపించారు. మురళీకృష్ణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీతో సంబంధాలు ఉన్న వాడని ఆరోపించారు. తీరా చూస్తే ఎన్నారై అయిన ఆ వ్యక్తి ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి విజయం కోసం శ్రమించారని, డబ్బు కూడా ఖర్చు చేశాడని తేలింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎదురైనా చేదు అనుభవాలు, లోకేశ్‌ను కలిసేందుకు కూడా సిబ్బంది ముడుపులు అడగటంతో బాధతో సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పెట్టాడని తెలిసింది. లోకేశ్ వీటిల్లో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే తండ్రి మాదిరిగానే తన వైఫల్యాలను ఇతరులపై నెట్టేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు చిలకలూరిపేట వద్ద ఉన్న తన భవనాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సెటిల్ చేసుకోవడానికి రూ.కోటి డిమాండ్ చేశారని మురళీకృష్ణ వాపోతున్నాడు. ఈ అంశంపైనే చంద్రబాబు, లోకేశ్‌లను కలవడానికి ప్రయత్నించి విఫలమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీలు తమకు వచ్చిన ఫిర్యాదులను చూపించి చంద్రబాబును ప్రశ్నించారంటూ మీడియాలో మరో కథనం వచ్చింది.ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా లోకేశ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ వార్త చెబుతోంది. ఇది నిజమా? కాదా? అన్నది పక్కనబెడితే లోకేశ్ హుందా రాజకీయం చేయకుండా, అసత్య ప్రచారాలకు పూనుకుని దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. మురళీ కృష్ణ ఎవరో తెలిసి కూడా అతని గురించి అబద్ధం చెప్పారన్న భావనకు ఆయన అవకాశం ఇచ్చారనిపిస్తుంది. ఇక మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్య అయితే అర్థం పర్థం లేనిది.గత ప్రభుత్వం సీఐడీ వారిని పంపించి ఎంక్వైరీ చేయించిందని, దానివల్ల ఆ దేశ ప్రభుత్వానికి, ఏపీకి సంబంధాలు దెబ్బతిన్నాయాని, వాటిని మళ్లీ పునరుద్దించడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో సింగపూర్ వెళ్లామని అన్నారు. ఇన్ని విద్యా సంస్థలు నడిపే వ్యక్తి ఇలా మాట్లాడడం ఎబ్బెట్టుగా ఉంది. ఒక రాష్ట్రం అధికారులు ఇంకో దేశంలోకి వెళ్లి విచారణ చేయడం సాధ్యమా? కేంద్రంతో సంబంధం లేకుండా చేస్తారా? ఆ మాత్రం పరిజ్ఞానం కూడా ఈయనకు లేదా! ఏదో ఒకటి మాట్లాడి బట్ట కాల్చి మీద వేయడం అంటే ఇదేనేమో! నిజానికి సింగపూర్ ప్రభుత్వం గతంలో ఏపీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కేవలం ఆ దేశ కంపెనీలు అవగాహన కుదుర్చుకున్నాయి. వాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి 1700 ఎకరాల భూమి కేటాయించడమే కాకుండా, ఏపీ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి రోడ్లు తదితర సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. దానిపై అనేక విమర్శలు వచ్చాయి. అయినా ఆ ప్రాజెక్టు లాభసాటి కాదని భావించి ఆ కంపెనీలు వెనక్కి తగ్గాయని చెబుతారు. మరో సంగతి చెప్పాలి. చంద్రబాబుకు సన్నిహితుడుగా భావించే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో జైలుకు వెళ్లింది వాస్తవమా? కాదా? అన్నదాని గురించి చంద్రబాబు, లోకేశ్, నారాయణలు ఎవరూ మాట మాత్రం కూడా ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడ్డారు. ఏది ఏమైనా ఎదుటివారిపైన రాయి వేసే ముందు అది తమకే తగులుతుందేమో అని ఆలోచించుకోవాలి. ఏతావాతా సింగపూర్ నుంచి చంద్రబాబు బృందం రిక్త హస్తాలతోనే తిరిగి వచ్చినట్లేనా? అంటే కూటమి ప్రభుత్వంపై ఆ దేశ ప్రభుత్వానికి, సంస్థలకు నమ్మకం లేనట్లు అనుకోవాలా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్
-
రామకుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, చిత్తూరు: స్వయానా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది. అడ్డదారిలో మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. నామినేషన్ల పరిశీలనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థి హర్పితను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. దీంతో ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.2021లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొందిన శాంతకుమారి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక అవసరమైంది. గత నెల 30 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. టీడీపీ అభ్యర్థులుగా అరుణ, విశాలాక్షి, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శాంతకుమారి తనయ హర్పిత నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. హర్పితను రెండో సెట్ నామినేషన్ వేయనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఆమె తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఈలోపు రామకుప్పం మండలంలో ఒక్క స్థానం గెలవని టీడీపీ, అప్రజాస్వామికంగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంది. అదే సమయంలో టీడీపీ గూండాల వల్ల హర్పిత నామినేషన్ల పరిశీలనకు వెళ్లలేకపోయారు. ఫలితంగా మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రామకుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే చర్చ జోరందుకుందక్కడ. -
చావడానికైనా రెడీ.. భూములు మాత్రం ఇవ్వం..!
-
సైకిల్ పార్టీ కాదు..సైకో పార్టీ.. పులివెందులలో తెగబడ్డ టీడీపీ గూండాలు
-
విచ్చలవిడికి ‘పర్మిట్’!
మందు ఏరులై పారించాలి..! మద్యం ఆదాయం రూ.35 వేల కోట్లు దాటించాలి..! ఇదీ టార్గెట్! ఎంత భారీగా తిన్నా బకాసురుడి ఆకలి తీరనట్లుగా... మద్యం విధానం ద్వారా ఎంత బరి తెగించి దోపిడీకి పాల్పడుతున్నా కడుపు నిండని టీడీపీ మద్యం సిండికేట్ ఇంకా కావాలనే అంటోంది! మద్యం దోపిడీలో చంద్రబాబు సర్కారు తీరు బకాసురుడినే తలపిస్తోంది!! అందుకే సిండికేట్ దోపిడీకి మరింత రాచబాట పరుస్తూ రాష్ట్రంలో పర్మిట్ రూమ్‌లకు చంద్రబాబు సర్కారు తలుపులు బార్లా తెరిచింది. ఈ ఏడాది సెప్టెంబరులో కొత్త బార్లకు లైసెన్సులతోపాటు మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు రిబ్బన్ కత్తిరించాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీర్మానం ద్వారా మద్యం సిండికేట్ లూటీకి అధికారికంగా రాచబాట పరిచింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం ఇకపై వరద ప్రవాహాన్ని తలపించాలన్న ప్రభుత్వ పెద్దల పన్నాగం ఇదిగో ఇలా ఉంది..! –సాక్షి, అమరావతిపర్మిట్ రూమ్‌లతో సిండికేట్ గల్లా పెట్టె గలగలా.. 2014–19లో బాబు మార్కు దోపిడీ విధానంటీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పర్మిట్ రూమ్‌లు బూస్టర్ డోస్ లాంటివని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీడీపీ సిండికేట్ ఇదే పర్మిట్ రూమ్‌ల విధానం ద్వారా భారీ దోపిడీకి పాల్పడింది. అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 4,380 మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్ కోసమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా ఒక్కో పర్మిట్ రూమ్‌కు అధికారికంగా లైసెన్స్ జారీ చేశారు. అంటే మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి పక్కనే ఉండే పర్మిట్ రూమ్‌లలో కూర్చుని విచ్చలవిడిగా తాగేందుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి అది జాతీయ ఎక్సైజ్ విధానానికి విరుద్ధం. కేవలం బార్లలో కూర్చుని మద్యం సేవించేందుకే అనుమతినివ్వాలి. మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి తమ ఇళ్లలోగానీ ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోగానీ సేవించాలి. ఈ విధానానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో కొత్త విష సంస్కృతికి తెర తీసింది. తద్వారా అనధికారిక బార్లుగా పర్మిట్ రూమ్‌లకు అధికారికంగా ప్రభుత్వమే అనుమతినిచ్చింది. అలా భారీగా అమ్మకాలు పెంచి టీడీపీ సిండికేట్ దోపిడీకి పాల్పడింది. దీనికి మరింత సౌలభ్యం కల్పిస్తూ మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజును మంత్రి మండలి కళ్లుగప్పి 2015లో ఓ చీకటి జీవోతో రద్దు చేసింది. తద్వారా అధికారికంగా నాలుగేళ్లలో రూ.ఐదు వేల కోట్ల మేర ఖజానాకు గండి కొట్టింది. ఇక పర్మిట్ రూమ్‌లలో ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి దోపిడీకి తెగబడింది. తద్వారా ఏకంగా రూ.25 వేల కోట్లకుపైగా కొల్లగొట్టింది. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సైతం దీనిపై తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు. ఆ దోపిడీని గతంలోనే నిగ్గు తేల్చిన సీఐడీ ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబు టీడీపీ సర్కారు మద్యం దోపిడీని సీఐడీ 2023లోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ అక్రమాలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిండికేట్ దోపిడీకి కొమ్ము కాస్తున్న ప్రైవేటు మద్యం దుకాణాల విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో ముగింపు పలికింది. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. అంతే కాదు.. అప్పటి వరకు కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్‌ల అనుమతులను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వం దన్నుతో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్టు దుకాణాలను తొలగించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశపెట్టి దశలవారీ నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. దాంతో 2019–24 మధ్య రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పర్మిట్ రూమ్‌లకు పచ్చ జెండా ఇలా ఓ ప్రాతిపదికను సిద్ధం చేసుకుని టీడీపీ సిండికేట్ దోపిడీకి పక్కాగా స్కెచ్ వేశారు. అంతే.. పర్మిట్ రూమ్‌లకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది! సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్లకు లైసెన్సులు అమలులోకి రానున్నాయి. దాంతోపాటు మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించాలని కూటమి సర్కారు నిర్ణయించడం గమనార్హం. అదే బార్లకు లైసెన్సులు జారీ చేసిన తరువాత పర్మిట్ రూమ్‌లకు అనుమతించాలని భావిస్తే బార్ల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డుకునే అవకాశం ఉంది. తమ వ్యాపారం దెబ్బ తింటుందని వారు అందుకు సిద్ధపడవచ్చని ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. ప్రస్తుతం టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాలకు అనుబంధంగా 3,736 పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పర్మిట్ రూమ్‌కు వార్షిక ఫీజు రూ.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ కోసం ఎన్ని దారులు వీలైతే అన్ని దారులూ బార్లా తెరవాలన్నదే ఏకైక లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే విచ్చలవిడిగా ఏర్పాటైన బెల్టు దుకాణాలతో పట్టణాల్లోని కాలనీలు, పల్లెల్లో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇక పర్మిట్ రూమ్‌లతో పరిస్థితి మరింత దిగజారుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే దోపిడీయే లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు పర్మిట్ రూమ్‌లకు పచ్చజెండా ఊపింది. దందాకు పక్కా స్కెచ్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతాళంలో పాతి పెట్టేసిన ప్రైవేటు మద్యం సిండికేట్ భూతానికి ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఊపిరిపోసి రాష్ట్రంపైకి వదిలింది. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే ఏకపక్షంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. ఇతరులు ఎవరూ దరఖాస్తు కూడా దాఖలు చేయకుండా టీడీపీ గూండాలతోపాటు పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తరువాత కల్లుగీత కుటుంబాల ముసుగులో టీడీపీ సిండికేటే మరో 340 దుకాణాలను సైతం తమ గుప్పిట్లో పెట్టుకుంది. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాల ద్వారా టీడీపీ సిండికేట్ మద్యం దోపిడీకి పాల్పడుతూ వాటి పరిధిలో దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎంఆర్పీ కంటే 20 నుంచి 30 శాతం అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నా టీడీపీ సిండికేట్ ఆకలి చల్లారడం లేదు. అందుకే గతంలో టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పర్మిట్ రూమ్‌ల విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలన్న సిండికేట్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సమ్మతించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించే ప్రతిపాదనలను రూపొందించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. 2024–25లో మద్యం విధానం ద్వారా ఎక్సైజ్ శాఖకు వచ్చిన రూ.24 వేల కోట్ల ఆదాయం 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్లకు చేరుకోవాలని నిర్దేశించారు. అందుకోసం పర్మిట్ రూమ్‌లకు అనుమతించడం ఓ మార్గమని నిర్ణయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ ఆగమేఘాల మీద ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పర్మిట్ రూమ్‌లు లేకపోవడంతో ప్రభుత్వ ఖజానా ఏటా రూ.180 కోట్ల మేర ఆదాయం కోల్పోతోందని నిస్సిగ్గుగా ఓ సమర్థింపు ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందువల్ల పర్మిట్ రూమ్‌లకు మళ్లీ పచ్చజెండా ఊపారు. -
మహిళల జీవితాలు నాశనం చేసేలా చంద్రబాబు కేబినెట్ నిర్ణయం
-
కాళ్లు పట్టుకున్న వదల్లేదు! నా భర్తను చంపేశారు
-
ఫ్రీ బస్సుకు కండీషన్లు
-
GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. అడ్డదారిలో గెలిచేందుకు కూటమి కుట్రలు
-
KSR Live Show: చంద్రబాబుకు మాస్ వార్నింగ్.. మీ పిచ్చి వేషాలకు జగన్ భయపడడు
-
తమన్నా ఫోటో వేశావు..నీ ఫోటో దాచావు.. బయటపడ్డ పచ్చ ఫోటోలు
-
మంగళవారం మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం
-
Big Question: మద్యం కేసులో రెండో వీడియో.. 11 కోట్ల మతలబు
-
YS Jagan: చంద్రబాబు పాలన చూస్తుంటే ఇదేనా కలియుగం అనిపిస్తోంది
-
అమరావతి కోసం మళ్లీ చందాలు మొదలుపెట్టిన బాబు సర్కార్
-
కేసిరెడ్డి కేసులో.. బాబుకు ఊహించని దెబ్బ
-
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం, ధర్మం లేకుండా దుర్మార్గ పాలన సాగుతోంది... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
నేతన్నకు హ్యాండిచ్చిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: చేనేతకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో చంద్రబాబు మార్కు మోసం మరోసారి బట్టబయలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్టు ప్రభుత్వం గొప్పులు చెప్పుకొనేందుకు తప్ప దానివల్ల నేతన్నలకు పెద్దగా లబ్ధి లేదన్నది తేటతెల్లమవుతోంది. 2014 ఎన్నికల్లో చేనేత రంగానికి సుమారు 25 హామీలిచ్చి అమలు చేయని చంద్రబాబుకు... 2024 ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలనైనా నూరు శాతం అమలు చేసేందుకు మనసు రావడం లేదు. ప్రధానంగా హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల చొప్పున విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమలు ఉత్తర్వులు (జీవో) ఇచ్చారు. సర్వేలు, వడపోతల పేరిట కాలయాపన చేసిన చంద్రబాబు ఆ కార్యక్రమాన్ని జీవో ఇచ్చాక కూడా తీవ్ర తాత్సారం చేసి చివరకు ఈ నెల 7న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ముందే లబ్దిదారుల జాబితాలో కోతలు మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అసలు పథకం మొదలుకు ముందే అర్హుల జాబితాలో కోతలు పెట్టారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత ప్రారంభిస్తున్న ఈ పథకంలో లబి్ధదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మార్చిలో జీవో ఇచ్చిన ప్రభుత్వం ఉచిత విద్యుత్‌తో 91,300 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించింది. కానీ, ఇప్పుడు అర్హుల జాబితాను సొంత చేనేత మగ్గాలున్న 50 వేలమందికి, మర మగ్గాలున్న 15 వేలమందికి మొత్తం 65 వేల మందికి కుదించింది. వాస్తవానికి పెన్షన్ పథకంలో 92,724 మంది నేతన్నలకు పింఛను అందుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ సొంత మగ్గం ఉన్న 82,130 మందికి ఏటా రూ.24 వేలు చొప్పున నేతన్న నేస్తం అందించారు. అప్పట్లో చేనేత కార్మికులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న నేస్తంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌లో మెలిక చేనేత వ్రస్తాలపై జీఎస్టీ రీయింబర్స్మెంట్ (తిరిగి చెల్లింపు) చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ సైతం మోసపూరితమని నేతన్నలు మండిపడుతున్నారు. చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్నులు వేయకూడదని రాజ్యాంగం చెబుతోంది. అయినప్పటికీ చేనేత వస్త్రాలు రూ.వెయ్యిలోపు విక్రయాలపై 5 శాతం, రూ.వెయ్యి దాటితే 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. తయారీదారు షాపులకు విక్రయిస్తే.. వారు వినియోగదారులకు అమ్ముతారు. దీంట్లో వినియోగదారులే జీఎస్టీ చెల్లిస్తారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు ఈ మొత్తాన్ని ఎవరికి తిరిగి చెల్లిస్తారో స్పష్టత ఇవ్వలేదు. దాని కంటే చేతన వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తే నిజమైన మేలు జరుగుతుందని నేతన్నలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చేనేత సహకార ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం ఏడాదైనా కార్యాచరణ చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి. నేతన్నకు దన్నుగా వైఎస్ జగన్ 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేనేతల కోసం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.3,706 కోట్లకు పైగా వ్యయం చేసింది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు నేరుగా జమ చేసింది. నేతన్న నేస్తం పథకం ద్వారా మొత్తం రూ.982.98 కోట్లు ఆర్థిక సాయం అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆ చేయూతతో చేనేత కుటుంబాల్లో సగటు ఆదాయం గణనీయంగా పెరిగింది. టీడీపీ హయాంలో 2018–19 మధ్య నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే.. వైఎస్ జగన్ అందించిన ప్రోత్సాహంతో అది మూడు రెట్లు పెరిగి రూ.15 వేలు దాటింది. ఆర్థికంగా నేతన్నలు నిలదొక్కుకున్నారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తం, ప్రత్యేకంగా కోవిడ్ సాయం అందించి వైఎస్ జగన్ అండగా నిలిచారు. అధికారం కోసం హామీలిచ్చి ఇప్పుడు డబ్బులు లేవనడం దారుణం మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తే మేలు జరుగుతుంది. పవర్‌లూమ్స్‌కు కూడా 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తే.. మగ్గంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడతాయి. రాష్ట్రంలో దాదాపు 1.77 లక్షల మంది చేనేత కార్మికులున్నారు. వైఎస్ జగన్ 82 వేల మందికి నేతన్న నేస్తం అందిస్తే అప్పుడు మగ్గం కలిగిన అందరికీ ఇవ్వాలని కోరిన టీడీపీ ఇప్పుడు 65 వేల మందికే ఇస్తామనడం దారుణం. అధికారంలోకి రావడానికి ఇష్టానుసారం హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు డబ్బులు లేవని చెప్పడం దారుణం. – పిల్లలమర్రి బాలకృష్ణ, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేనేతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. జీఎస్టీ రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి హామీలను త్వరగా అమలు చేసి ఆదుకోవాలి. చేనేత వర్గాలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించాలి. వీవర్స్‌కు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలి. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ -
రూ.2 లక్షల కోట్ల దిశగా...!
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఎడాపెడా రుణాలు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. వారం వారం అప్పులు చేస్తూ కేవలం 14 నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులకు చేరువయ్యారు. సంపద సృష్టి సంగతి పక్కనపెడితే సూపర్ సిక్స్ హామీల అమల్లోనూ వెనకబడిన చంద్రబాబు సర్కారు... బడ్జెట్ లోపల–బయట అప్పులు చేయడంలో మాత్రం వేగంగా దూసుకుపోతోంది. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 6.96 శాతం వడ్డీకి రూ.5 వేల కోట్లు సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వీటితో కలుపుకొని బడ్జెట్ లోపల అప్పులే ఏకంగా రూ.1,28,702 కోట్లకు చేరాయి. బడ్జెట్ లోపల, బయట చేసిన, చేయనున్న అప్పులు రూ.1,91,112 కోట్లకు పెరిగాయి. » బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.31,410 కోట్లు అప్పు చేస్తోంది. ఏపీ జల్‌జీవన్ వాటర్ సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్లు అప్పు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది తప్ప మిగతా బడ్జెట్ బయట అప్పును ఇప్పటికే ప్రభుత్వం చేసేసింది. » రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కోల నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కూడా కాకుండానే రూ.2 లక్షల కోట్ల అప్పుల మార్క్‌ను చేరడం ఖాయం. కాగా, ఈ స్థాయిలో బాబు సర్కారు అప్పులు తెస్తున్నప్పటికీ ఎల్లో మీడియా మౌనంగా ఉంటోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేసినా ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించింది. అదే చంద్రబాబు ఇప్పుడు మంగళవారం మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఆస్తులు సమకూర్చలేదు.. అప్పులు పెంచారు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టాను సారం అప్పులు చేస్తున్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా బాబు సర్కారు కాలక్షేపం చేస్తోంది. మరోవైపు చేసిన అప్పులతో ఆస్తులు కూడా సమకూర్చలేదు. వివిధ వర్గాలకు సూపర్ సిక్స్‌తో పాటు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. -
చంద్రబాబుకు బొత్స సత్యనారాయణ లేఖ
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్ దయనీయ పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్య పరికరాలు కేజీహెబ్‌లో అందుబాటులో లేకపోవడం బాధాకరమని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 30 నుంచి 40 వరకు గుండె శస్త్ర చికిత్సలు జరుగుతాయని లేఖలో బొత్స ప్రస్తావించారు. ‘‘కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా వైద్యం కోసం వస్తారు. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా సమస్యను వెంటనే పరిష్కరించాలి. వీలైనంత త్వరగా కేజీహెచ్‌లో సాధారణ పరిస్థితిని తీసుకురావాలి’’ అంటూ లేఖలో బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఇంకో మూడేళ్లే ఈ కష్టాలు... చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
సాధింపులే లక్ష్యంగా అక్రమ మద్యం కేసు
-
చినబాబు బాధితుడే బ్లాక్ మెయిలర్.. డొంక కదిలిన చినబాబు అవినీతి
-
AP Farmers: పెట్టుబడి సాయంలో మోసం.. ఎరువుల కొరత..మద్దతు ధరలో దగా
-
టీడీపీ నేతలతో అత్యంత సన్నిహితంగా వెంకటేశ్ నాయుడు
-
‘డబ్బుల్లేవ్.. అమరావతికి చందాలివ్వండి.. కూటమి క్యూఆర్ కోడ్’
సాక్షి, విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి అని ఎవరికి అడిగినా చెబుతారు. ఆయన మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదు. ఇది ఇప్పటికే ఎన్నోసారు నిరూపితమైంది. ఇక, తాజాగా మరోసారి చంద్రబాబు మాటల్లో మోసం రుజువైంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబు.. దీనికోసం ఇప్పటికే వేల కోట్ల అప్పులు తీసుకురాగా.. మళ్లీ చందాల సేకరణకు నడుం బిగించారు.చంద్రబాబు సర్కార్ అమరావతి కోసం మళ్ళీ చందాలు అనే ప్లాన్ ముందుకు తీసుకువచ్చింది. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల సేకరణ చేపట్టింది. అమరావతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలంటూ చందాలు సేకరణ ప్రారంభించింది. విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సీఆర్డీఏ వెబ్సైట్ crda.ap.gov.in లో ఇందుకు ప్రత్యేకంగా ‘డొనేట్ ఫర్ అమరావతి’ అనే ఆప్షన్ ఇచ్చారు.ఇక, 2015లో కూడా రాజధాని నిర్మాణం కోసం ‘మై బ్రిక్..మై అమరావతి’ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో ఈ-ఇటుకను రూ.10 పేరుతో విరాళాల సేకరించారు. అప్పటి విరాళాలు ఏమయ్యాయో లెక్కను మాత్రం సీఆర్డీఏ ఇప్పటి వరకు చెప్పకపోవడం విశేషం. మళ్ళీ ఇప్పుడు విరాళాల సేకరణకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. కాగా, అమరావతికి అప్పులు పుట్టక చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేపడుతున్నట్టు పలువురు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. చంద్రబాబు ఇప్పటికే అమరావతి కోసం 31 వేల కోట్లు అప్పులు చేశారు. మరో 70వేల కోట్ల అప్పులు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.రైతులతో మంత్రి భేటీ..ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అమరావతి రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం అమరావతి రైతులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని జేఏసీ నేతలు బహిరంగ విమర్శలు చేసిన తర్వాత సమావేశం అవుతున్నారు. అమరావతిలో రైతులు కేటాయించిన ప్లాట్లు డెవలప్ చేయట్లేదని, భూముచ్చిన రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నాలుగు రోజుల ముందు అమరావతి జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అమరావతి రైతులు.. సీఆర్డీఏ కార్యాలయాల్లో రైతులను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని, పనిచేయాలంటే లంచాలు అడుగుతున్నారని బహిరంగ విమర్శ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. -
సూత్రధారి చంద్రబాబే. తీగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే 11 కోట్ల రూపాయల జప్తు డ్రామా.
-
చినబాబు బాధితుడే బ్లాక్‘మెయిలర్’
సాక్షి, అమరావతి: డ్యామిట్ కథ అడ్డం తిరిగిందంటే ఇదే.. సింగపూర్ ప్రభుత్వంలోని అందరికీ ఏపీతో ఒప్పందాలు చేసుకోవద్దంటూ మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ–మెయిల్స్ పంపించాడని, అతను వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అని చినబాబు ఇటీవల శివాలెత్తిపోయారు. అయితే ఈ వ్యవహారంపై సింగపూర్ కంపెనీల ఫిర్యాదుతో పెదబాబు చేపట్టిన పోస్టుమార్టంలో నిర్ఘాంతపోయే వాస్తవాలు బట్టబయలయ్యాయి. ఈ–మెయిల్స్ పంపించి సింగపూర్‌లో రాష్ట్రం పరువు తీసింది చినబాబు బాధితుడేనని తేలింది. దీంతో పెదబాబు చినబాబుకు తలంటారు. అయితే అవన్నీ తనకు తెలీకుండా జరిగాయని తనయుడు చల్లగా జారుకోవడంతో సింగపూర్‌లో పరువుమొత్తం పోయిందంటూ పెదబాబు గగ్గోలు పెడుతున్నట్టు సమాచారం. పెదబాబు పోస్టుమార్టంలో తేలిందేమంటే..! చిలకలూరిపేటకు చెందిన మురళీకృష్ణ అమెరికాలో ఉంటారు. చిలకలూరి పేటలో తనకు ఉన్న భవనం సెటిల్మెంట్ కోసం ఆయన చినబాబు అపాయింట్మెంట్ కోసం యతి్నంచారు. మంత్రి ప్రైవేట్ బృందంలోని ఎ.వంశీని సంప్రదిస్తే అపాయింట్మెంట్కు రూ.38 లక్షలు, భవనం సెటిల్మెంట్కు రూ.కోటికి బేరసారాలు నడిపారు. దీంతో మురళీకృష్ణ అపాయింట్మెంట్ కోసం రూ.38 లక్షలు వంశీ ఖాతాకు జమ చేశారు. చివరకు చినబాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మురళీకృష్ణ కడుపు మండింది. ఆగ్రహంతో సింగపూర్ ప్రభుత్వానికి, కంపెనీలకు ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా ఈ–మెయిల్స్ పంపించారు. మెయిల్స్ చూపించి నిలదీసిన సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు అపాయింట్మెంట్లకూ లంచాలు తీసుకుంటారని మురళీకృష్ణచేసిన మెయిల్స్‌ను పెదబాబుకు చూపించి సింగపూర్ కంపెనీలు నిలదీశాయి. మీ పరిపాలన ఇలా ఉంటే ఎలాగని, పెట్టుబడులు పెట్టేందుకు తాము వస్తే తమకూ అపాయింట్మెంట్లు అమ్మరని గ్యారెంటీ ఏమిటని ప్రశి్నంచినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో పెదబాబు ఈ మెయిల్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కూపీ లాగితే చినబాబు అవినీతి డొంక కదిలినట్టు సమాచారం. దీనిపై చినబాబుతోపాటు ఆయన ప్రైవేటు బృందానికీ పెదబాబు తలంటినట్టు తెలుస్తోంది. చినబాబు బాధితుడే బ్లాక్‘మెయిలర్’తొలి నుంచి చినబాబు చిల్లర టీమ్‌పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల మంత్రి అపాయింట్మెంట్ కోసం సంప్రదించిన పదిమంది పారిశ్రామికవేత్తల వద్ద కూడా అతని బృందం డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. చివరకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా చినబాబు బయటకు వెళ్లిపోవడంతో పారిశ్రామిక వేత్తలు కరకట్ట క్యాంపులో రచ్చరచ్చ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చినబాబు అపాయింట్మెంట్ లంచాల వ్యవహారం అధికారపార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
అమరావతి కట్టలేక చంద్రబాబు వైఫల్యం: సుధాకర్ బాబు
-
నేను నవ్వినందుకు కేసు పెట్టారు
సాక్షి,నెల్లూరు: నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డికు మద్దతు తెలిపేందుకు నాపై కేసు పెట్టారు.ప్రసన్న కుమార్‌తో కలిసి నన్ను ఏ2గా చేర్చారు. నేను నవ్వినందుకు కేసు పెట్టారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కూటమి ప్రభుత్వంలో వేదిక మీద నవ్విన నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి. నవ్విన తప్పే అంటే ఇక ఏమి చేయాలి?. కూటమి నేతలు ఏ స్థాయికి దిగజారి పోయారో తెలుస్తోంది.36 ప్రశ్నలు అడిగారు, 10 నిమిషాల్లో సమాధానం రాసి ఇచ్చాను. నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు. బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది’అని ఆరోపించారు. కాగా,కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్‌పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. -
టీడీపీ గుట్టురట్టు.. మద్యం అక్రమ కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషే
-
సిగ్గులేకుండా సుపరిపాలన అని చెప్పుకుంటున్నారు చంద్రబాబుపై దేవభక్తుని చక్రవర్తి ఫైర్
-
‘లోకేశ్‌కు సీఎం పదవి.. చంద్రబాబు ఇంట్లో గొడవలు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేశ్ మునిగి పోయారని విమర్శలు చేశారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్ ఇంట్లో గొడవలు పెడుతున్నాడు. కుటుంబ కలహాలు పెరిగాయి. లోకేశ్‌ను అందుకే చంద్రబాబు పొగుడుతున్నారు. సరిగ్గా చదువుకోని లోకేశ్‌ను మంత్రిని చేశారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు లోకేశ్. చంద్రబాబు ప్రతీ విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు. ఢిల్లీలో పనిచేసే ఇతర దేశాల విలేకర్లకు నెలవారీ జీతాలు ఇస్తున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టులకు కూడా చంద్రబాబు డబ్బులు పంపుతున్నారు. పదే పదే 90 దేశాలు అంటూ చంద్రబాబు మాట్లాడే మాటల వెనుక చాలా కథ ఉంది. అందుకే రామోజీకి భూమి.. చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించిందిఅందుకే ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం దూరం పెట్టింది. కుట్రలు పన్నటంలో చంద్రబాబును లోకేశ్ మించి పోయాడు. ఇప్పుడు లోకేశ్ భజన చేయటంలో ఎల్లో మీడియా పోటీ పడుతోంది. పత్రికలను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ మనుషులను పార్టీకి దూరం చేశారు. తనకు ఇష్టమైన వారిని దగ్గర చేర్చుకుని, ఎన్టీఆర్ టీమ్‌ని వెళ్లగొట్టారు. తాను అడిగిన వందలాది ఎకరాల భూమిని రామోజీరావుకు ఎన్టీఆర్ ఇవ్వలేదు. ఆ కోపంతో ఉన్న రామోజీరావుని చంద్రబాబు దగ్గరకు చేర్చుకున్నారు. ఆ తర్వాత నుండి చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెట్టారు. అన్నింటా బాబు మనుషులే..ఎన్టీఆర్ గెలుపు వెనుక నేను ఉన్నానని నాపై కుట్రలు పన్నారు. నన్ను రాజ్యాంగేతర శక్తి అంటూ నాపై ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిల్‌గేట్స్‌ని మించిన ధనవంతుడ్ని కావాలని చంద్రబాబుకు కోరిక ఉండేది. అందుకే విపరీతమైన అవినీతి, అక్రమాలు, కుట్రలు చేస్తూ వస్తున్నారు. పరిపాలన చేతగాని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ బతుకుతున్నారు. తండ్రిని మించిన అవినీతిలో లోకేశ్ మునిగి పోయారు. ఇసుక, మద్యంలో తండ్రీ కొడుకుల అవినీతి తారాస్థాయికి చేరింది. ఇక్కడ సంపాదించిన డబ్బంతా సింగపూర్‌లో పెట్టుబడి పెడుతున్నారు. సీబీఐ, ఈడీ సహా అనేక న్యాయ వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారు. తాము దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఈ అవినీతి ప్రభుత్వం ఎంతోకాలం నిలవదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
గోడకు కొట్టిన బంతిలా.. తిరగబడ్డ నెల్లూరు!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పి ఉండాలి. వైఎస్సార్సీపీ పార్టీకి కూడా ఇదో అనుభవం అని చెప్పాలి. పోలీసుల వ్యవస్థ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ప్రజల్లో వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా తెలియజేసినంది. ఒక నాయకుడి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు (రోడ్లు) ధ్వంసం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు కూడా. ప్రజాస్వామ్యాన్ని ఇంతగా పరిహాసం చేసిన సందర్భం కూడా ఇంకోటి ఉండదు. వైఎస్ జగన్ తన మీడియా సమావేశంలో వ్యక్తిగత విమర్శలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, తను ఏ సందర్భంలో టూర్‌కు వచ్చిందీ, పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ కార్యకర్తల విధ్వంస కార్యక్రమాలు వాటి విపరిణామాలపై ఎక్కువ మాట్లాడారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన జమ్మలమడుగు పర్యటనలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. అసలు మినహా మిగిలిన సోదంతా వెళ్లబోసుకున్నారు. 👉జైల్లో ఉన్న మాజీ మంత్రి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు, మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ మూకలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన్ను కూడా పలుకరించే ఉద్దేశంతో జగన్ నెల్లూరులో పర్యటనకు సంకల్పించారు. గత నెల మొదటిలోనే ఈ పర్యటన ఖరారైనా హెలిప్యాడ్ కోసం పోలీసులు ఒక అటవీ ప్రాంతాన్ని చూపించడంతో వాయిదా పడింది. ఆ ప్రదేశంలోనే ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకుని టూర్ తేదీలు నిర్ధారించుకున్నారు. అంతే! ఇక అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఆయన ప్రోగ్రాంను విఫలం చేయడానికి చాలా శ్రమ పడింది. చంద్రబాబు, లోకేశ్‌లకు వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. జగన్ టూర్లో పాల్గొనడానికి వీల్లేదని శాసించే రీతిలో పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు నోటీసులు ఇచ్చారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులే కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు. జగన్ టూర్లో పాల్గొంటే ఏదో జరిగిపోతుందని, కేసులు పెడతారని ప్రచారం చేశారు. టూర్ జరిగే రోజున ప్రజలు, అభిమానులు ఎవరూ రాకుండా ఉండడం కోసం పోలీసులు జేసీబీలతో రోడ్లపై గోతులు తవ్వారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎక్కడకక్కడ ఇనుప కంచెలు వేయడం, నెల్లూరు సందులలో నుంచి కూడా జనం రాకుండా చేయాలని యత్నించడం వల్ల ప్రజలు నానాపాట్లు పడ్డారు. చివరికి అంత్యక్రియల కోసం రేవుకు వెళ్లడం కూడా కష్టమైందని నెల్లూరు వాసి ఒకరు తెలిపారు. ఇన్ని నిర్బంధాల మధ్య ప్రజలు జగన్ టూర్‌కు రారేమో అని అందరకూ అనుకున్నారు. కానీ.. వేల మంది జనం పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ రోడ్లపైకి వచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఈ అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. 👉ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీని అణగదొక్కాలని అనుకుంటే అది అన్నిసార్లు అయ్యే పని కాదని నెల్లూరు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కార్ విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ ఏ పట్టణానికి వెళ్లినా ఇలా జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక కూటమి నేతలు తల పట్టుకుంటున్నారు. ఒక పక్క జనం వస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే ప్రజలు రాలేదని, సాక్షి టీవీలో బంగారు పాళ్యం ప్రోగ్రాం వీడియోలోని సన్నివేశాలు ప్రసారం చేశారని ఒక అసత్య ప్రచారం పెట్టారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి అలా మాట్లాడారంటే జగన్ టూర్‌పై వారు ఎంతగా కలవరపడుతున్నది అర్థం చేసుకోవచ్చు. బంగారుపాళ్యంలో జనం విశేషంగా వచ్చారని వారే స్వయంగా ఒప్పుకున్నట్ల అయ్యిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. ప్రభుత్వం దీనిని పరాభవంగా భావించి మరింత కక్షకు దిగకుండా ఇకనైనా ప్రజస్వామ్య పద్దతిలో జగన్ టూర్లకు సహకరించడం మంచిది. పోలీసులు ఎవరైనా ముఖ్యనేత వస్తుంటే ఆయనకు భద్రతకు కల్పించడం, జనం అధికంగా వస్తున్నారనుకుంటే దానికి తగ్గట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప, జనం ఆ ప్రోగ్రాంకు రాకుండా అడ్డుకోవడమే విధిగా పెట్టుకోరాదని ఈ ఘటన రుజువు చేసింది. 👉బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంతగా పైకి లేస్తుందన్న విషయం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. జగన్, చంద్రబాబుల వ్యాఖ్యలను పరిశీలిద్దాం. పాలనలో విఫలం అయినందునే చంద్రబాబు భయంతో తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. తన పార్టీ నేతలను కలవడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. కాకాణి పై ఉన్న పలు అక్రమ కేసుల గురించి ప్రస్తావించి సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు, మీడియా సమావేశం వీడియోను పోస్టు చేసినందుకు కూడా కేసులు పెట్టారని వివరించారు. నిజంగానే ఇది చాలా శోచనీయం. రాజకీయ నేతలకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించాలి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి అమలుకాని వైనం, రైతుల కష్టాలు, ప్రభుత్వంలో అవినీతి, శాంతిభద్రతల వైఫల్యం రెడ్ బుక్ రాజ్యాంగం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మొదలైన అంశాలను జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన రెడ్ బుక్ విత్తు పెరిగి చెట్టు అవుతుందని, భవిష్యత్తులో అది వారికే ప్రమాదం అని హెచ్చరించారు.తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని,ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని కూడా జగన్ పేర్కొన్నారు. జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు ఎక్కడా నేరుగా బదులు ఇచ్చినట్లు కనిపించలేదు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో కావాలన్నది ఆయన భావన. తన కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను నానా మాటలు అన్నప్పటికీ, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అన్నప్పుడు కాని అవేవి అరాచకంగా ఆయనకు కనిపించలేదు. స్వయంగా చంద్రబాబే పలుమార్లు పోలీసులను ధిక్కరించి హెచ్చరికలు చేయడం, టూర్లు సాగించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయి జగన్ టూర్‌ను అరాచకంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కోసం జనం వస్తే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం అసందర్భంగా అనిపిస్తుంది. రాజకీయ పాలన చేస్తానని చెప్పడం ద్వారా టీడీపీలో అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మళ్లీ వస్తా.. అంతు తేలుస్తా అని జగన్ చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు దానిని విశ్వసిస్తుంటే జగన్ టూర్ లకు ఎందుకిన్ని ఆంక్షలు పెట్టడం అన్నదానికి మాత్రం జవాబు ఇవ్వరు. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా తన కుమారుడు, మంత్రి లోకేశ్ అనుభవ రాహిత్యంతో అమలు చేస్తున్న రెడ్ బుక్ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం. నెల్లూరు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ప్రభుత్వానికే మంచిది.లేకుంటే ప్రజలలో ఆయన ప్రభుత్వమే మరింత పలచన అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో తీవ్ర అక్రమాలు
-
సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం
-
పోలీసులా రాక్షసులా వాళ్ళు.. చంద్రబాబుపై అశోక్ బాబు భార్య ఫైర్
-
కృష్ణా నదిలో నిత్యం ఇసుక దోపిడీ... ఏపీ సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం
-
అన్నీ గుర్తు పెట్టుకుంటాం: అంబటి రాంబాబు
సాక్షి, బాపట్ల: రేపల్లె ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్‌బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ‘‘రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘వేమూరు నియోజకవర్గంలో రైతులంతా కలిసి కాలువలో గుర్రపు డెక్కతో తమ పడుతున్న ఇబ్బందిని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కాలువలో గుర్రపు డెక్క తొలగించాలంటూ రెండు రోజులు పాటు అక్కడే దీక్ష చేశారు. అధికారులు స్పందించట్లేదు. కనీసం కాలువల్లో గుర్రపు డెక్క కూడా తీయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాలువలో గుర్రపు డెక్క ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వానికి చేతకాకపోతే గుర్రపు డెక్క తొలగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్‌బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్‌బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులను కచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
Editor Comment: అడ్డగోలు బరితెగింపు.. ఆ నోట్ల కట్టలు నోళ్లు తెలిస్తే..
-
కూటమి కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: ఏపీలో వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా చంద్రబాబు కూటమి సర్కార్ అక్రమ కేసులో పెడుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఐటీ యాక్ట్ కింద కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నానికి నోటీసులు ఇచ్చారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ 2024లో విశాఖ-3 టౌన్ పోలీసు స్టేషన్లో విశాఖకు చెందిన అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు.. కొడాలి నానిపై U/S353(2),352,351(4), 196(1) BNS 467, IT Act కింద కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొడాలి నానికి 41ఏ కింద విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. -
బీఆర్ నాయుడు డైరెక్షన్.. తిరుమలలో మఠాలపై బాబు, పవన్ దాడి: భూమన
సాక్షి, తిరుపతి: హైందవ ధర్మ పరిరక్షణకు పాటు పడే మఠాలపై కూటమి సర్కార్ దాడి చేస్తోందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలపై హిందూ సంస్థలు స్పందించాల్సి ఉందన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో విశిష్ట అద్వైత మఠం, శృంగేరి, పెజావర్ పీఠం, వైఖానస మఠం, అహోబిల మఠం, చినజీయర్ మఠం, మంత్రాలయం మఠం నెలకొల్పారు. హైందవ పరిరక్షణ కోసమే మఠాలు ఉన్నాయి. సంప్రదాయాలు, మఠాల నిర్వహణ సత్ సంకల్పంతో నిర్వహించాలని, శ్రీ మహావిష్ణువు వెలసిన దివ్య క్షేత్రంలో స్వామి వారి వైభవం విశ్వవ్యాప్తం చేయడానికి ఉన్నాయి. అటువంటి మఠాలకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పీఠాధిపతులను కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది. హైందవ మఠాలపై కూటమి దాడి సరికాదు.కూటమి ప్రభుత్వం దాదాపు 32 మఠాలకు నోటీసులు జారీ చేసింది. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి?. పవిత్రమైన మఠాధిపతుల అధీనంలో ఉన్న మఠాలకు ఏవిధమైన నోటీసులు ఇచ్చారో చెప్పాలి. హైందవ మఠాలపై చేస్తున్న దాడి ఇది. హిందూ సంస్థలు వెంటనే స్పందించాల్సి ఉంది. ఇదంతా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోనే జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి మూల మూర్తి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టేలా ఉన్నారు. విద్వేష పూరితమైన ఆలోచన ఇది. మఠాధిపతులు మేల్కొవాలి. మఠాలపై దాడిని ఖండించాలి. సనాతన ధర్మం పట్ల గొడ్డలి వేటు ఇది. సనాతన ధర్మం కావడమే నా లక్ష్యం అంటున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
బాబు, లోకేష్ స్టాంట్స్ కి సింగపూర్ ఛీ ఛీ
-
అది జగన్ రేంజ్.. ఎప్పుడూ అబద్ధాలు చెప్పే బాబు నోట జగన్ పథకం పేరు..
-
బాబు ఫ్రీ బస్సుపై.. టీడీపీ ఎమ్మెల్యే సెటైర్లు
-
జెడ్పీటీసీ ఎన్నికలు.. పులివెందులలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అధికార కూటమి సర్కార్ పాలనలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల ఏవైనా కూటమి నేతలకు ప్రలోభాలకు, బెదిరింపులకు దిగుతున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పోలీసుల సాయంతో లా అండ్ ఆర్డర్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇక, తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి.. వైఎస్సార్సీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించింది.వివరాల ప్రకారం.. పులివెందుల మండలం అచ్చవెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు, రేషన్ డీలర్ జనార్దన్ రెడ్డిపై రెవెన్యూ అధికారులు అక్రమ కేసు పెట్టారు. జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేసేందుకు అధికారుల ద్వారా జనార్దన్ రెడ్డి రేషన్ షాపును తనిఖీ చేయించారు. అన్నీ సక్రమంగా ఉన్నా కూడా రెండు కేజీలు బియ్యం తక్కువగా ఉన్నాయని కేసు నమోదు చేశారు. అయితే, టీడీపీ నేతల ఒత్తిడి మేరకే రేషన్ షాపును తనిఖీ చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా.. వైఎస్సార్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లాల్లోని మూడు ఎంపీటీసీ స్థానాలు, రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు, మణీంద్రం, వేపకంపల్లి, విడవలూరు–1 ఎంపీటీసీ స్థానాలకు 12న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు. -
Big Question: సుఖీభవకు కొత.. అన్నదాతకు వాత..
-
చంద్రబాబు మోసం ఇవాళ మరోసారి నిజమైంది.... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు.. ఉండబోదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/దర్శి : ‘చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్..’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయట పెట్టారు. రైతులంటే తనకు ఎంత చిన్నచూపో మరోమారు స్పష్టం చేశారు. గతంలో ఉచిత విద్యుత్ ఇస్తానన్న వైఎస్ రాజశేఖరరెడ్డి మాటలను తప్పుపట్టి.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు, వ్యవసాయం దండగ.. రైతులు మరో పని చూసుకోవాలని కూడా చెప్పిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో శనివారం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. అన్నదాతల పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. ఈ పథకం కింద రూ.5 వేలు వేస్తూ రూ.7 వేలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాను చూసుకోండి తమ్ముళ్లూ.. అనటంతో రైతులు అవాక్కయ్యారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3,174 కోట్ల నగదు జమ చేశానని చెప్పారు.కరోనా సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే చంద్రబాబు మాత్రం తన ప్రసంగంలో ‘తుపాను వచ్చినా, నష్టపోయినా, ఏ రైతూ వ్యవసాయం మానలేదు. భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ రైతులకు మాత్రం లాక్ డౌన్ లేకుండా చేశాను’ అని చెప్పడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. గత ఏడాది పంటలకు ఉచిత పంటల బీమాను ఇవ్వకపోయినా, ఇచ్చామని మరో అబద్ధం చెప్పారు. దేశంలో డ్రిప్ ఇరిగేషన్‌ను తానే ప్రవేశ పెట్టానని చెప్పుకొచ్చారు.సీఎం ప్రసంగంలో ఎక్కువ భాగం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కార్యకర్తలను సైతం రెచ్చగొట్టారు. ఇచ్చిన హామీల గురించి మాట్లాడే ప్రయత్నమే చేయలేదు. తనను ఆశీర్వదించాలని పదే పదే అడిగారు. సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాశారని మండిపడ్డారు. మీరు సాక్షి పేపర్ చూస్తారా? అని ప్రశి్నంచారు. ముఖం చాటేసిన రైతులు రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి వీరాయపాలెం గ్రామంలోని రైతులు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. సభా ప్రాంగణంలో ఎటువంటి టెంట్లు వేయలేదు. నులక, నవారు మంచాలు వేయించి వచ్చిన కొద్దిమంది రైతులను పొలంలో ఎర్రటి ఎండలో వాటిపైనే కూర్చోబెట్టారు. ప్రాంగణంలోకి రైతులు మాత్రమే వెళ్లాలని నిబంధనలు పెట్టారు. సామాన్య రైతులు రాక పోవడంతో ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో కార్యకర్తలు పసుపు కండువాలు తీసేసి ఆకు పచ్చ కండువాలు వేసుకుని మంచాలపై కూర్చున్నారు.ఉదయం 10 గంటల నుంచి చంద్రబాబు సభ అయిపోయే వరకు ఎండ వేడిమి భరించలేక వచ్చిన వారిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు మంచాల పైకెక్కి వాటిని విరగ్గొట్టారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ ద్వారా చాలా సేపు చూపించారు. ఎండ వేడిమికి తాళలేక చాలా మంది సొమ్మసిల్లి పోయే పరిస్థితిలో చంద్రబాబు మాట్లాడటం మొదలు పెట్టారు. సభను రక్తి కట్టించేందుకు ఆ ప్రాంగణం అంతా అధికారులు, టీడీపీ నాయకులు హంగామా చేశారు. చంద్రబాబు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. సీఎం ప్రసంగం పూర్తి కాకముందే వెనుక భాగంలోని మంచాలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇంతటి అట్టర్ ఫ్లాప్ షో ఎప్పుడూ చూడలేదని టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకోవడం కనిపించింది. అసంతృప్తితో బాబు తిరుగు ప్రయాణం చంద్రబాబు తన సభను రక్తి కట్టించాలని ఎంత ప్రయత్నించినా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో అసంతృప్తితో వెనుతిరిగారు. సభ పూర్తయిన తర్వాత ఏసీ బస్‌లోకి ఎక్కిన బాబు.. అరగంటకు పైగా లోపలే కూర్చుండిపోయారు. ‘సీఎం బస్సు దిగి కిందకు వస్తారు.. వరి నాట్లు వేస్తారు’ అని అధికారులు సభా ప్రాంగణం ముందు నాట్లు వేయించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే డ్రోన్ కెమెరాలు ప్రారంభించే కార్యక్రమంలోనూ సీఎం పాల్గొనలేదు. ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కూడా రద్దు చేసుకుని వెళ్లిపోయారు.కాగా, తూర్పు వీరాయపాలెం గ్రామంలోని ఇళ్లల్లో ఉన్న మంచాలన్నీ చంద్రబాబు కార్యక్రమానికి తరలించారు. ఈ కార్యక్రమానికి అరకొరగా హాజరైన వారిలో అధికారులు, ఉద్యోగులు 80 శాతం, రైతులు.. ప్రజలు 20 శాతం ఉన్నారు. వీరిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. ‘నేను మీ కోసం ఇంతటి ఎండలో ఉన్నాను.. మరి మీరు ఉండరా..’ అని చంద్రబాబు అడిగినా ఎవరూ వినిపించుకోలేదు. కార్యక్రమం ముగిశాక విరిగిపోయిన మంచాలను చూసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగున్న వాటిని ఎవరివి వాళ్లు తీసుకెళ్లారు. -
మీ మోసం ఇవాళ మరోసారి నిజమైంది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మీ హామీ ఒక మోసం.. మీ ష్యూరిటీ ఇంకో మోసం.. మీ బాండ్లు మరో మోసం.. మీ గ్యారెంటీ పచ్చి మోసం’ అన్నది మరోసారి దర్శి సభ సాక్షిగా నిజమైందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా.. ఏటా రూ.20 వేలు ఇస్తానన్న హామీని చంద్రబాబు మంటగలిపారని మండిపడ్డారు.ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5 వేలేనని.. అది కూడా ఎంత మందికి చేరిందో తెలియదన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే.. మీరు ఉద్దేశ పూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి ఏడు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టి అన్యాయం చేశారు.హామీల అమల్లో మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ మండిపడ్డారు. అందుకే ప్రజలను మభ్య పెట్టడానికి దర్శిలో మోసపూరిత కార్యక్రమాన్ని సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని జనం గమనిస్తూనే ఉన్నారని ఎత్తిచూపారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమే కాదు.. వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు. నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్–6, సూపర్–7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతు భరోసా పథకాన్ని దారుణంగా దెబ్బ తీశారు. మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే. ⇒ ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంత వరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవం. ⇒ చంద్రబాబూ.. మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, 2019 అక్టోబర్‌లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించాం. ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచాం. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్లం. కానీ, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. ⇒ మా 2019 మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా.. మరో రూ.1,000 పెంచి వరుసగా ఐదేళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.⇒ కానీ చంద్రబాబూ.. మీరు కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మీరు ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5 వేలు. అది కూడా ఎంత మందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారుల వైపు, ప్రైవేటు అప్పుల వైపు మళ్లించారు.⇒ మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశ పూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్య పెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ⇒ చంద్రబాబూ.. వైఎస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకు ముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు. ⇒ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు. ⇒ రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశారు.⇒ మేం ప్రవేశపెట్టి, అమలు చేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాది కూడా మీరు బీమా సొమ్ములు కట్టక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ⇒ ఆర్బీకేలనమీ–క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యం చేశారు.⇒ ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోక పోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం. -
ఆ నోట్ల కట్టలు నోళ్లు తెరిస్తే..?
చాలా విషయాలు బయటకొస్తాయి. ఆ నోట్ల కట్టలపై నిజాయితీగా విచారణ జరిగితే మద్యం కేసు కడుపులో దాక్కున్న గుట్టు రట్టవుతుంది. కట్టు కథలు ఎవరు చెబుతున్నారో, పుక్కిటి పురాణాలను ఎవరు వల్లెవేస్తున్నారో తేలిపోతుంది. అంతేకాదు, అపవిత్ర రాజకీయ మైత్రీబంధాల బండారం కూడా బద్దలు కావచ్చు. పన్నెండు అట్టపెట్టెల్లోని 11 కోట్ల సంగతి ఇది.ఆంధ్రప్రదేశ్ పోలీసుల సిట్ బృందం చెప్పిన లెక్క. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో కుంభ కోణం ఉన్నదని దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించి ఏడాది పూర్తయింది. ‘సిట్’ రంగప్రవేశం చేసి ఆరు నెలలయింది. ఈ మధ్యనే ఒక అసంపూర్ణ ఛార్జిషీట్ వేశారు. ఆయన చెప్పాడని ఈయన పేరు, ఈయన చెప్పాడని ఆయన పేరు చొప్పున ఓ నలభై ఎనిమిది మందిని ఇందులో నిందితులుగా చేర్చారు.త్వరలో ఇంకో చార్జిషీట్‌ను వేస్తారట! అందులో ఇంకొంత మందిని చేరుస్తారేమో! ఈ కుంభకోణం ద్వారా ఆనాటి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని సిట్ ఆరోపిస్తున్నది. నిందితులుగా నమోదైన వారిలో కొందరి చేత నయానో భయానో తమ స్క్రిప్టుకు అనుకూలంగా చెప్పించుకుంటున్నారనీ, కొందరు చెప్పిన వాఙ్మూలాలకు విరుద్ధంగా రాసుకొని బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారనీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రకమైన వాఙ్మూలాల మీదనే కథ నడిపిస్తున్నారు తప్ప ఇంతవరకూ తమ ఆరోపణలకు బలం చేకూర్చే వస్తుగతమైన, సాంకేతికమైన, లిఖిత పూర్వకమైన ఆధారాలేవీ సిట్ సంపాదించలేక పోయిందనేది యథార్థం. ఇక తుది ఛార్జిషీట్‌ను వేయవలసిన దశలో 12 అట్టపెట్టెలు, 11 కోట్ల నోట్ల కట్టలు అనే వృత్తాంతాన్ని ముందుకు తెచ్చింది.వరుణ్ అనే నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో ప్రధాన నిందితు డైన రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను గత బుధవారం సీజ్ చేసినట్టు న్యాయస్థానానికి సిట్ చెప్పింది. 2024 జూన్‌లోనే తాము ఈ డబ్బును అక్కడ పెట్టి నట్టు కూడా వరుణ్ చెప్పినట్టు సిట్ తెలియజేసింది. ఈ 11 కోట్లు కూడా లిక్కర్ కుంభకోణం డబ్బేనని సిట్ వాదన. దీనిపై స్పందిస్తూ రాజ్ కేసిరెడ్డి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సిట్ సీజ్ చేసినట్టు చెబుతున్న ఫామ్‌హౌస్ తీగల విజయేందర్‌రెడ్డి అనే వ్యాపారవేత్తదని, ఆయన టర్నోవర్ కోట్ల రూపాయల్లో ఉంటుందని కూడా కేసిరెడ్డి తన పిటిషన్లో తెలిపారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఒక ఆస్పత్రిలో తన భార్య చిన్న భాగస్వామి మాత్రమేనని, అంతకుమించి ఆ ఫామ్‌హౌస్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వాదించారు. సీజ్ చేసిన సొమ్ముకూ, తనకూ ఎటువంటి సంబంధం లేదని చెబుతూ 2024 జూన్ నుంచి ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు చెబుతున్న నోట్లను వీడియో తీయించాలని, ఆ సీరియల్ నెంబర్ల ఆధారంగా ఆ నోట్లను ఎప్పుడు విడుదల చేశారో రిజర్వు బ్యాంకు ద్వారా సమాచారం తెప్పించుకోవాలని ఆయన అభ్యర్థించారు. 2024 జూన్ తర్వాత విడుదల చేసినట్టు తేలితే ప్రాసిక్యూషన్ కథనం తేలిపోతుందనీ, తనకు న్యాయం జరుగుతుందనీ ఆయన వాదించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఆ నోట్ల కట్టలను ఫోటోలు తీయించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. ఫోటోలు, వీడియోలు తీయకుండానే ఆ నోట్ల కట్టలను సిట్ బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నదని, దాన్ని అడ్డుకోవాలని, కోర్టు కమిషన్ ఆధ్వర్యంలో వీడియో తీయించాలని కేసిరెడ్డి న్యాయవాదులు శనివారం నాడు మరో పిటిషన్ వేశారు. తాము అప్పటికే కోర్టులో నగదు డిపాజిట్ చేశామని దర్యాప్తు అధికారి కోర్టుకు చెప్పారు. అలా చేసి వుంటే ఆ లావాదేవీ తాలూకు కౌంటర్ ఫాయిల్ చూపెట్టాలని కేసిరెడ్డి న్యాయవాదులు డిమాండ్ చేశారు. దర్యాప్తు అధికారి ఇప్పుడు తన దగ్గర లేదన్నారు. కనీసం వాట్సాప్‌లోనైనా పంపించాలని వారు కోరారు. చాలాసేపటి వరకు ఎటువంటి వాట్సాప్ సమాచారం రాలేదు. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయకుండానే చేసినట్టు కోర్టులో సిట్ చెప్పి ఉండాలి. పిటిషన్ విచారించిన జడ్జి కీలకమైన ఆదేశాలను సిట్‌కు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జారీ చేశారు. సదరు 11 కోట్లను ప్రత్యేకంగా ఉంచాలనీ, మిగతా డబ్బుతో కలపొద్దనీ చెప్పారు. అలాగే పంచనామా చేసి ఆ నోట్ల సీరియల్ నంబర్లను నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని సిట్‌కు ప్రత్యేకంగా తెలిపారు.ఆ నోట్లను వీడియో తీయాలని ముందురోజు జడ్జి చెప్పినప్పటికీ, లెక్క చేయకుండా ఆ నోట్లను హడావిడిగా బ్యాంకులో డిపాజిట్ చేశామని ఎందుకు చెప్పినట్టు? ఒకసారి బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత, ఆ సొమ్ము మిగతా డబ్బులో కలిసిన తర్వాత దానిపై విచారణ కుదరదనే ఎత్తుగడను వేశారని అనుకోవాలా? సిట్ వ్యవహరించిన తీరు పారదర్శకంగా లేదు. న్యాయబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా లేదు. ఈ కేసులో ఇంతవరకూ ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారని కోర్టు అక్షింతలు వేసినందువల్లనే ఈ గూడుపుఠాణీ జరిపినట్టు నిందితులు ఆరోపిస్తే దాన్ని పూర్వ పక్షం చేయగలరా? దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా పని చేస్తున్నట్టయితే, కోర్టు కమిషన్ సమక్షంలో రిజర్వు బ్యాంకు ప్రతినిధుల సమక్షంలోనే వీడియో తీసి, నోట్ల సీరియల్ నెంబర్లను నమోదు చేసి అనంతరం బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండేవారు. ఎవరూ అడగనవసరం లేదు. అది వారి కనీస బాధ్యత. ఈ నోట్ల కట్టల వ్యవహారంలో ఆది నుంచి అంతంవరకూ సిట్ వ్యవహారం తీరు పారదర్శకంగా లేదు. ‘విశ్వసనీయ’ సమాచారం మేరకు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి డబ్బు సీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడమో, వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడమో చేసి ఉండవలసింది. లేదంటే సీబీఐ లేదా ఈడీ వంటి కేంద్ర సంస్థలకు సమాచారం అందించి ఉండవలసింది. దొరికింది నల్లధనం కనుక ఆదాయం పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చి ఉండవలసింది. దొరికిన నల్లడబ్బు ఒక పెద్ద కేసులో సాక్ష్యంగా చూపెడుతున్నారు కనుక ఈమాత్రం పారదర్శకత లేకపోతే అదొక కుట్రపూరిత వ్యవహారంగానే జనం భావిస్తారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు తాజా ఆదేశాల తర్వాత సిట్ వారి స్క్రిప్టు ఏ మలుపులు తిరుగుతుందో చూడవలసి ఉన్నది.పొరుగు రాష్ట్రానికి వెళ్లి కుట్రపూరిత వ్యవహారాలకు పురుడు పోయాలంటే అదీ, ఒక వాణిజ్య ప్రముఖుని ఫామ్‌హౌజ్ కేంద్రంగా జరిపించాలంటే స్థానిక వ్యవస్థల సహకారం లేకుండా సాధ్యపడుతుందనేది అనుమానమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మధ్య సహకార ధోరణి బాగా ఉన్నట్టే చెబుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే మంచిదే. కానీ ఒక ప్రభుత్వ స్వార్థ రాజకీయాలకు సాయపడే విధంగా వ్యవహరించడం, ఒక ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తికి మేలు చేయడం కోసం ఒట్టు తీసి గట్టున పెట్టడం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు వగైరాలు తాజా సంఘటనలే. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేశారు. తాను సీఎం కుర్చీలో కూర్చున్నంతకాలం సినిమా టిక్కెట్ల ధరలు పెంచడానికి, స్పెషల్ షోలు వేయడానికి అనుమతించబోనని ఖండితంగా చెప్పారు. జనం కూడా హర్షించారు. నాయకుడంటే ఈమాత్రం పట్టుదల ఉండాలని అభినందించారు. కానీ ఆరు నెలలు తిరిగే సరికి ఆ పట్టుదల పట్టు తప్పింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. ఆ సినిమా హీరో పక్కరాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ, వ్యక్తిగత సహకా రాలపై పొలిటికల్ సర్కిల్స్‌లోనే కాదు, బ్యూరోక్రాట్లు, వ్యాపార వర్గాలు కూడా మాట్లాడుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించుకున్న దగ్గర నుంచి ఈ పార్టీల బంధం కొనసాగుతున్నది. ఆయన మీద కేసులు వేయడం, జైలుకు పంపించడంలోనూ కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం – యెల్లో మీడియాలు సమష్టిగానే పనిచేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసు పార్టీ తన విజయావకాశాలను కాలదన్నుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ క్షేత్రస్థాయిలో కేసీఆర్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతున్నదని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్‌ను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఏపీ మాదిరిగానే టీడీపీ, జనసేనలు బీజేపీ కూటమి (ఎన్డీఏ)గా పోటీ చేస్తే ప్రయోజనమా? లేక బీజేపీని ఒక్కదాన్నే పోటీలో నిలిపి తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రయోజనమా అనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ విభాగం ఆచరణలో ఎన్డీఏలో నాలుగో పార్టీగా వ్యవహరిస్తున్నదనే భావన సామాన్య ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉన్నది. ఒకపక్క రాహుల్‌గాంధీ ఎన్డీఏపై రాజీలేని పోరాటానికి కసరత్తులు చేస్తు న్నారు. ఢిల్లీ గద్దె కోసం నాలుగో పానిపట్టు యుద్ధానికి సిద్ధమవు తున్నారు. బీజేపీపై సైద్ధాంతిక పోరాటాన్ని కూడా ప్రారంభించి అస్త్రశస్త్రాలను ఆవాహన చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముసుగులో ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ ముఖ్య మంత్రికి మద్దతుగా రంగంలోకి దిగి రెచ్చి పోవడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విషయమైతే కాదు. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 16 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాడని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆరోపించారు. దాన్ని ఖండించడానికి, వివరణ ఇచ్చుకోవడానికి సిఎం రమేశ్‌కు ఉన్న హక్కును ఎవరూ కాదనలేరు.కానీ, ఆయన అంతటితో ఆగిపోకుండా బీఆర్ఎస్ బండారం బయటపెడతానని హెచ్చరించడం, బీజేపీలో తమ పార్టీని విలీనం చేయడానికి కేటీఆర్ తన సహాయాన్ని అర్థించాడని చెప్పడం బూమెరాంగయింది. కేసీఆర్ స్థాయి నేత తన పార్టీని ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావిస్తే సీఎం రమేశ్ లాంటి వాళ్ల సహాయం అవసరమా? ఇటువంటి నాసిరకం ఆరోపణను ఎవరూ విశ్వసించకపోగా ఒకరకంగా బీఆర్ఎస్కు మేలు చేసింది. బీజేపీ – బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉన్నదని నమ్మించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రమేశ్ ప్రకటన గండి కొట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి: చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
తాడేపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయకండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు చంద్రబాబు హామీల మోసాన్ని ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టారు వైఎస్ జగన్ 1, చంద్రబాబు గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 2. మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతుభరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు. మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే.3. ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే. 4. చంద్రబాబుగారూ మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, అక్టోబరు, 2019లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించి ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచింది. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్లం. కాని, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 5. మా 2019, మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 వేలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా, మరో రూ.1000 పెంచి వరుసగా 5 ఏళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.1.@ncbn గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 20256. కాని, చంద్రబాబుగారూ మీరు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, మీరు ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5వేలు. అదికూడా ఎంతమందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారులవైపు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారు.7. మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.8. చంద్రబాబుగారూ…, వైయస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు.9. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800కోట్లు ఖర్చుచేసి రైతులను ఆదుకున్నాం. కాని, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు.10. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు.11. మేం ప్రవేశపెట్టి, అమలుచేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. ఇన్సూరెన్స్‌కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాదికూడా మీరు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. .12.ఆర్బీకేలను, ఇ-క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు.13. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు.14 .రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్యచేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం. -
‘ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు సమాధానం చెప్పాలి’
విజయవాడ: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో శనివారం(ఆగస్టు 2) బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాల్లాది విష్ణుతో పాటు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలిస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్ రూ.13 వేలు రైతు భరోసా కింద రైతులకు అందించారు. ఐదేళ్లలో రూ. 34,288 కోట్లు రైతులకు ఇచ్చారు. చంద్రబాబు 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు కేంద్రం ఇచ్చినదాంతో కలిపి ఏడు వేలు మాత్రమే ఇచ్చారు. జగన్ ఐదేళ్లూ రైతు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడు లక్షల మంది రైతులకు కోత పెట్టింది. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని కబుర్లు చెప్పారు. ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. -
ఏం చేస్తారో చేసుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకొక్కడికి..
-
చంద్రబాబు ఉన్నంతవరకు రైతులకు భరోసా లేదు: చంద్రబాబు
-
నేనున్నంత వరకు రైతుకు భరోసా లేదు: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయటపెట్టారు. తాను ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పైగా ఇది నా ప్రామిస్ అంటూ నొక్కి మరీ చెప్పారు.‘‘చంద్రన్న ఉన్నంత వరకు రైతు భరోసా లేదు.. ఉండదు.. రాబోదు’’ అంటూ చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అర్థమైన రైతులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బాబు నిజస్వరూపం బయటపెట్టారంటూ చర్చ మొదలు పెట్టారు. శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే టంగ్ స్లిప్ అయ్యారో ఏమోగానీ.. తన మనసులో మాటే ఆయన బయటపెట్టారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు .. ఉండదు.. ఉండబోదు🤣🤣#ChandraBabu #ChandraBabuFailedCM #APNotInSafeHands #AndhraPradesh pic.twitter.com/qcbRpArzju— Jaganaithene Chesthadu (@Jaganaithene) August 2, 2025 -
‘కూటమి వెన్నుపోటు.. అన్నదాత సుఖీభవలో మరో మోసం’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో వెన్నుపోటు రాజకీయానికి తెర తీసిందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో ఏడు లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఎగొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి 20 వేలకు మాత్రమే పరిమితం చేసిందని విమర్శలు చేశారు.మాజీ మంత్రి కారుమూరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అన్నదాత సుఖీభవలో కూటమి మరో మోసం చేస్తోంది. 26వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి.. ఎన్నికలైన 14 నెలల తర్వాత ప్రజలను మోసం చేసే కార్యక్రమం ప్రారంభించారు. 10,716 కోట్లు గత ఏడాది రైతులకు ఎగొట్టారు. ఏడు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వడం లేదు. దర్శిలో సినిమా సెట్టింగ్ వేసి మంచాలకు కూడా పచ్చ రంగు వేసి ఈ కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం మరో వెన్నుపోటు రాజకీయానికి తెర తీసింది.రైతులను నట్టేట ముంచి 20వేలకు మాత్రమే పరిమితం చేసింది. ఐదేళ్లలో వైఎస్ జగన్ రైతులకు 67,500 అందించారు. తల్లికి వందనం కోతలు లేకుండా ఇస్తామని చెప్పి 13వేలు ఇచ్చారు. అందులో కూడా లక్షలాది మందికి పంగనామం పెట్టారు. రైతు గురించి పూర్తిగా ఆలోచించడం మానేశారు. రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. 5,500 రూపాయలకు కోకో పంట టన్నుకు ఇప్పిస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు రైతులను దారుణంగా మోసం చేశారు. మామిడికాయ కిలోకు 19 రూపాయలు ఇస్తామని చెప్పి రెండు రూపాయలకు పరిమితం చేశారు. రైతులు అన్యాయం అయిపోయారు.మిర్చి రైతుల గురించి కేంద్రానికి లేఖ రాసి మమ అనిపించారు. పొగాకు రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. మూడు నెలలకు కూడా డబ్బులు వేయలేదు. వైఎస్ జగన్ హయాంలో సున్నా వడ్డీతో రుణాలు ఇప్పించారు. రైతు పంట పండించకపోతే ఏ ప్రజాప్రతినిధి మనుగడ సాధించలేరు. వ్యవసాయం అవసరం లేకపోతే మీరు ఆకలికి ట్యాబ్లెట్ కనిపెట్టండి. గతేడాది అన్నదాత సుఖీభవ సొమ్ముతో కలిపి లబ్ధిదారులకు చెల్లించాలి. రోజుకు 450 కోట్లు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అని విమర్శలు చేశారు. -
చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు
వైఎస్ఆర్ కడప జిల్లా: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండేళ్ళకు కలిపి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రూ.40 వేలని అన్నారు. కానీ ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన దానిలో మొదటి విడత కింద ఇస్తున్నది కేవలం రూ.5 వేలు మాత్రమే, దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాను ప్రకటించి రైతులకు పెట్టుబడి సాయంను అందించడం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాని పేరు అన్నదాత సుఖీభవ అంటూ మార్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతి రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా ఈ రాష్ట్ర ఖజానా నుంచి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ రైతుల కోసం రైతుభరోసా కాకుండా ఏమైతే ఇచ్చారో అవి కూడా కొనసాగిస్తామని కూడా చెప్పారు.చిత్తశుద్ది ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండిఈ రోజు అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద దర్శిలో సీఎం చంద్రబాబు చేతుల మీదిగా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఈ పథకం కింద ప్రతి రైతుకు రాష్ట్ర ఖజానా నుంచి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఎందుకు రూ.14 వేలు మాత్రమే ఇస్తున్నారో చంద్రబాబు చెప్పాలి. మిగిలిన ఆరు వేల రూపాయలను ఎందుకు ఎగ్గొడుతున్నారో సమాధానం చెప్పాలి. గత ఏడాది ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా రూ.20 వేలు ఎందుకు ఇవ్వలేదు..? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్ళపాటు రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందించాం. కానీ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టారో చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 53 లక్షల మంది అర్హులైన రైతులను గుర్తించి ఏటా రూ.13,500 చొప్పున రైతుభరోసాను అందించారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 46 లక్షల మంది రైతులకే ఈ పథకాన్ని ఇస్తోంది. అంటే దాదాపు 7 లక్షల మంది రైతులకు కోత విధించారు.కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన మేలు ఏదీ..?కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటి వరకు రైతులకు చేసిన మేలు ఏమిటో చెప్పాలి. 2024 నుంచి రబీ, ఖరీఫ్ సీజన్లలో పంట నష్టాలను చెల్లించారా..? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైఫరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి కేవలం 30 రోజుల్లో పరిహారాన్ని చెల్లించాం. ఉచిత పంటల బీమా కింద రైతుల పక్షాన ప్రీమియంను ప్రభుత్వమే భరించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పధకాన్నే ఏత్తేసింది. కనీసం రైతులే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకున్నా కూడా వారికి జరిగిన పంటనష్టం బీమాను కూడా చెల్లించకపోవడం దారుణం కాదా..? విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించారా..? కనీసం వ్యవసాయ పనిముట్లను అయినా అందుబాటులోకి తెచ్చారా.? వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కడైనా గిట్టుబాటు ధర కల్పించారా.? వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను సక్రమంగా నిర్వహిస్తున్నారా.? ఎందుకు రైతులు గిట్టుబాటు రేటు కోసం రోడ్డెక్కుతున్నారు.? ఎందుకు రాష్ట్రంలో మళ్ళీ రైతు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. -
సింగపూర్ టూర్ పై తండ్రి, కొడుకులను ఏకిపారేసిన గుడివాడ అమర్నాథ్
-
లిక్కర్ కేసులో సిట్ కుట్ర బట్టబయలు.. నోట్ల కట్టల తారుమారు..?
-
సింగపూర్ నుంచి సైలెంట్ గా ఇంటికి.. మొహం చాటేసిన చంద్రబాబు
-
రూ. 11 కోట్ల కథలో కొత్త ట్విస్ట్.. అడ్డంగా దొరికిపోయిన బాబు
-
చంద్రబాబు ప్రభుత్వం సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత
-
‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్‌కు చంద్రబాబు’
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అమర్నాథ్ అన్నారాయన. శనివారం ఉదయం విశాఖపట్నంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారాయన. శనివారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్‌కు వెళ్లారు. అక్రమంగా సంపాదించిందంతా దాచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి సాధించింది ఏమిటో చెప్పుకోలేకపోతున్నారు.... ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి?. సాధించింది ఏమీ లేకే వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏర్పాటైంది వైఎస్సార్సీపీ హయాం. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్‌లకు ఎప్పుడైనా అనిపించిందా?. లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీకి అంకురార్పణ జరిగింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. కేవలం ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రధానమైన మూడు పోర్టులను పూర్తి చేశారు.... భూములను ఉద్యోగాలు కల్పించే నాణ్యమైన కంపెనీలకు అప్పగిస్తే ఫర్వాలేదు. కానీ, విశాఖలో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారు. 99 పైసల చొప్పున.. రూ.1,350 కోట్ల విలువైన భూమిని అప్పన్నంగా అప్పగించారు. లులు సంస్థకు కారుచౌకగా భూములను, ఉర్సాకు 60 ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కడా పారదర్శకత లేకుండా భూములు కేటాయించారు. కంచె చేను మేసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితి’’ అని అమర్నాథ్ మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ యాప్‌తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్‌లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్‌లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్‌పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్‌కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్‌ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్‌లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్‌లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్‌లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్‌లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.