‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’ | Buchepalli Venkayamma Fires On Balineni Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’

Published Sun, Mar 16 2025 4:31 PM | Last Updated on Sun, Mar 16 2025 4:57 PM

Buchepalli Venkayamma Fires On Balineni Srinivasa Reddy

సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి బాలినేనికి మాట్లాడే అర్హత లేదంటూ జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ, వైస్సార్ కుటుంబం లేకపోతే నువ్వెవరవి అంటూ బాలినేనిని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిసారి ఏదో ఒక సాకుపెట్టు కొని మా మీద ఏడుస్తావు. గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావ్. ఇప్పటికీ నీ బుద్ధిమారలేదు’’ అంటూ వెంకాయమ్మ మండిపడ్డారు.

‘‘బూచేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి.. ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావు. వైఎస్‌ జగన్‌ను ఓడిస్తావా..? నీ తరం కాదు. 2024 ఎన్నికలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి గెలవకూడదని కుట్ర పన్నావ్...? నువ్వే ఓడిపోయావు. నన్ను చైర్ పర్సన్ పదవి నుంచి దించుతావా..? నా కుర్చి టచ్ చేసి చూడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగనే సీఎం.. ఎవరూ అడ్డుకోలేరు.?.

..2004 నుంచి రాజకీయాల్లో ఉండి.. నీతిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రాణాలు పోయే వరకు వైఎస్‌ జగన్‌తోనే ప్రయాణం. మా కుటుంబం మీద అభిమానంతో వైఎస్‌ జగన్‌ నన్ను జడ్పి చైర్ పర్సన్‌ని చేశాడు. నీకు దమ్ముంటే... నా కుర్చీ జోలికిరా..? చూస్తా.. ప్రతీ సారి వైఎస్‌ జగన్‌ మీద అలగడం.. ఎడవడమే.. బాలినేని చరిత్ర?. జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడు బాలినేని’’ అంట వెంకాయమ్మ ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement