
సాక్షి, అనంతపురం: వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.
‘‘హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా?. ముస్లిం, క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.
‘‘భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలపై పాజిటివ్‌గా స్పందించాలి. సీఎం చంద్రబాబు, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి విషయం వైఎస్ జగన్‌కు ఆపాదించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలి’’ అని రామకృష్ణ హితవు పలికారు.