March 5th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 5th Updates | Sakshi
Sakshi News home page

March 5th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Tue, Mar 5 2024 7:07 AM | Last Updated on Tue, Mar 5 2024 7:45 PM

Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 5th Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu.. 

7:44 PM, Mar 5th, 2024
మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్త్‌రఫ్‌

  • మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీలోకి చేరిన గుమ్మనూరు
  • సీఎం జగన్‌ సిఫార్సు మేరకు బర్త్‌రఫ్‌ చేసిన గవర్నర్‌
  • మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై భగ్గుమన్న టీడీపీ నేతలు
  • గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళన
  • గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరికను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌
  • గుమ్మనూరు జయరాం అవినీతి పరుడు అంటూ టీడీపీ నేతలు నినాదాలు
  • జయరాం ఇచ్చే డబ్బుకు ఆశ పడి టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యం
  • గుమ్మనూరు జయరాంకు సహకరించేది లేదన్న గుంతకల్లు టీడీపీ నేతలు

6:45 PM, Mar 5th, 2024
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ లో అసమ్మతి సెగలు 

  • మద్దతు కోసం వెళ్లిన టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
  • మద్దతు ఇవ్వాలని ముంతిమడుగు కేశవరెడ్డి ఇంటికి వెళ్లిన బండారు శ్రావణి
  • తాను సహకరించేది లేదని శ్రావణికి తేల్చి చెప్పిన కేశవరెడ్డి
  • తన సోదరుడి పై కేసులు పెట్టి ఇప్పుడు సాయం అడుగుతావా అంటూ మండిపాటు
  • చేసేదేమి లెక్క అక్కడ నుండి వెళ్లిపోయిన బండారు శ్రావణి
  • బండారు శ్రావణి కి మద్దతుగా నిలిచిన జేసీ బ్రదర్స్

6:23 PM, Mar 5th, 2024
భూమా అఖిలప్రియకు భూమా కిషోర్ రెడ్డి వార్నింగ్ 

  • మర్యాదగా రాజకీయాలు చేసుకుంటే సరి .. లేదంటే ఆమె జీవితం బట్టబయలు చేస్తా
  • ఎక్కడ ఏమి చేసిందో.. ఎవరితో లాలూచీ పడిందో బయటకు చెప్పేస్తా
  • డిపాజిట్లు కాదు కదా.. నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి
  • భూమా అఖిలప్రియకు ఇదే చివరి వార్నింగ్
  • బాబాయ్ కూతురని వదిలిపెడుతున్నా
  • చెంచాగాళ్లతో కామెంట్లు చేయిస్తే ఊరుకోను

5:43 PM, Mar 5th, 2024
చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్

  • నాకు రూ.500 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు
  • మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తా
  • నాకు ఉన్నాయని చెప్తున్న 500 కోట్లు మీరే రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు పంచండి
  • చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్
  • చెన్నెకొత్తపల్లిలో మేము మామిడి చెట్లు నరికివేయిస్తే కేసు ఎందుకు పెట్టలేదు
  • చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
  • రాప్తాడు టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతి చంద్రబాబుకు కనిపించలేదా?
  • పరిటాల కుటుంబీకుల అక్రమాస్తులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?
  • చంద్రబాబు దిగజారి ఆరోపణలు చేస్తున్నారు
  • కియా ఫ్యాక్టరీ చంద్రబాబు వల్ల రాలేదు
  • వైఎస్సార్, నరేంద్ర మోదీ కృషి ఫలితంగా కియా ఫ్యాక్టరీ ఏర్పడింది
  • హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన ఘనత వైఎస్సార్ దే
  • పెనుకొండ ప్రాంతంలో వైఎస్సార్ నీటి వసతి కల్పించారు కనుకే కియా ఫ్యాక్టరీ వచ్చింది

5:36 PM, Mar 5th, 2024
కడప టీడీపీ లో భగ్గుమన్న అసమ్మతి వర్గం 

  • అధిష్టానం తీరుపై టీడీపీ రెబల్స్ సమావేశం
  • వలస నేతలకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం
  • డబ్బు ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తున్నారని మండిపాటు
  • న్యాయం జరిగే వరకు పోరాడుతామంటున్న టీడీపీ నేతలు
  • న్యాయం చేయకపోతే తాడోపేడో తేల్చుకుంటామంటూ వార్నింగ్

5:10 PM, Mar 5th, 2024
చంద్రబాబు అంటే అలా ఉంటుంది.!

  • బొమ్మసాని సుబ్బారావుతో వసంత కృష్ణప్రసాద్ భేటీ 
  • తనకు మైలవరం టికెట్ ఇస్తే సహకరించాలని వినతి 
  • మైలవరంలో పరిస్థితిబాగోలేదని కృష్ణప్రసాద్ కు చెప్పా 
  • పెనమలూరు అయితే బాగుంటుందని చెప్పా 
  • నాకు కూడా టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా : బొమ్మసాని సుబ్బారావు 

4:50 PM, Mar 5th, 2024
కళ్యాణదుర్గం టీడీపీ లో అసమ్మతి సెగలు

  • టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు చేదు అనుభవం
  • తనకు మద్దతు ఇవ్వాలని హనుమంతరాయచౌదరిని కోరిన అమిలినేని 

4:45 PM, Mar 5th, 2024
అమరావతి: మండలి ఛైర్మన్ వద్ద విచారణకు హాజరైన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్

  • వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ పై ముగిసిన విచారణ
  • న్యాయ సలహా తర్వాత అనర్హత పిటిషన్ పై తీర్పు వెలువరించనున్న ఏపీ శాసనమండలి ఛైర్మన్

అనకాపల్లి:
4:39 PM, Mar 5th, 2024
నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస

  • వైఎస్సార్‌సీపీ సభ్యులపై దాడికి దిగిన టీడీపీ సభ్యులు
  • వైఎస్సార్‌సీపీ సభ్యులను బెదిరించిన అయ్యన్న సతీమణి పద్మావతి, కుమారుడు రాజేష్
  • వైఎస్సార్‌సీపీ సభ్యుల పొడియం వైపు వెళ్లి దౌర్జన్యం చేసిన టీడీపీ కౌన్సిలర్లు
  • వేలు చూపించి బెదిరించిన అయ్యన్న సతీమణి పద్మావతి
  • వైఎస్సార్‌సీపీ సభ్యులపైకి వెళ్లిన కుమారుడు రాజేష్
  • దౌర్జన్యంగా కౌన్సిల్ సమావేశంలోకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు

శ్రీకాకుళం
4:31 PM, Mar 5th, 2024
ఉద్దానం కిడ్నీ రోగులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం: మంత్రి సీదిరి అప్పలరాజు

  • పలాసలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ రీసెర్చ్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో వైద్యం అందిస్తున్నాం
  • అన్ని విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లు ఈ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు
  • వైఎస్సార్‌సీపీ సర్కార్‌కు వచ్చిన మంచి పేరు చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారం 
  • ప్రతిపక్ష నాయకులు కంటి ఆపరేషన్ చేసుకొని చూస్తే ప్రభుత్వం కిడ్నీ రోగులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుందో కనిపిస్తుంది

3:36 PM, Mar 5th, 2024
జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా?: సజ్జల రామకృష్ణారెడ్డి

  • చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారు
  • అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది?
  • మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారు
  • గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటోంది
  • జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు.
  • మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు?
  • చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు?
  • వలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీలవుతాం
  • చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా?
  • జగన్ పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డలి పోటు అంటూ మాట్లాడుతున్నారు
  • పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడుతో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారు
  • కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారు
  • జగన్ చేసినవన్ని తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు
  • బరితెగించేలా చంద్రబాబు ప్రవర్తన ఉంది
  • ఎస్సీ, బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారు
  • 2014-19 మధ్య చంద్రబాబు ఏమి చేశారు?
  • జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్‌ని చంద్రబాబు తయారు చేశారు
  • చివరికి మరుగుదొడ్ల విషయంలో కూడా అక్రమాలు చేశారు
  • రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారు
  • ఇంక చాలు అంటూ ప్రజలు 2019లో  చంద్రబాబుని సాగనంపారు
  • 23 ఎమ్మెల్యేలను లాక్కొని తొక్కాలని చూసినా జగన్ నిలబడ్డారు
  • సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు 70శాతం పదవులు ఇచ్చారు
  • అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు
  • ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం జగన్ కష్టపడ్డారు
  • ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు
  • చట్టం చేసి మరీ జగన్ చర్యలు చేపట్టారు
  • జగన్‌కి ఉన్న నిబద్ధత మరొకరికి లేదు.
  • జగన్ ఒక రెఫార్మర్‌గా ఆలోచనలు చేశారు
  • బీసీల్లో వడ్డెరలకు పూర్తి న్యాయం జరుగుతుంది
  • చంద్రబాబు అనుకూలంగా సర్వేలు లేవు.
  • అయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు

3:22 PM, Mar 5th, 2024
శ్రీసత్యసాయి: మడకశిర టీడీపీలో ఆగని అసంతృప్తి

  • టీడీపీ అభ్యర్ధి సునీల్ కుమార్ ను మార్చాలంటూ ఆందోళన
  • ఆందోళన చేపట్టిన గుండుమల తిప్పేస్వామి వర్గం
  • పెట్రోల్ పోసుకున్న కార్యకర్త చంద్రను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు 

3:16 PM, Mar 5th, 2024
మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం: ఎంపీ విజయసాయిరెడ్డి

  • పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్కన బెట్టాం
  • ముందుగా వేమిరెడ్డిని పోటీకి సిద్ధం చేశాం
  • మారిన రాజకీయ పరిస్థితులతో నేను పోటీలో ఉంటున్నా
  • లోక్ సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని అనుకోలేదు
  • కానీ పార్టీ నిర్ణయమే శిరోధార్యం
  • నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి గెలుస్తా : ఎంపీ విజయసాయిరెడ్డి 

3:15 PM, Mar 5th, 2024
విజయవాడ : దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్

  • నా టార్గెట్ గా ఉమా పని చేస్తే సమాధానం చెబుతా
  • దేవినేని ఉమా పార్టీ కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం
  • ఉమాకు టికెట్ ఇచ్చినా నేను, నా వర్గం పని చేయడానికి సిద్ధం
  • నన్ను పక్క నియోజకవర్గం వెళ్లమని పార్టీ చెబితే సిద్ధం

3:10 PM, Mar 5th, 2024
సత్యసాయి: మడకశిర టీడీపీలో టికెట్ చిచ్చు

  • సునీల్ కు టికెట్ ఇవ్వడంపై తిప్పేస్వామి అసంతృప్తి
  • అభ్యర్థిని మార్చాలంటూ తిప్పేస్వామి వర్గీయుల ఆందోళన
  • నన్ను సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించారు
  • కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా

2:56 PM, Mar 5th, 2024
శ్రీసత్యసాయి జిల్లా:

‘సిద్ధం’ సముద్రం.. ‘రా కదలిరా’ పిల్ల కాలువ’: మంత్రి ఉషశ్రీ చరణ్

  • పరిగి మండలంలో టీడీపీ నుంచి 430 కుటుంబాలు మంత్రి ఉషశ్రీ చరణ్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిక.
  • ‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ.. టీడీపీ సభలకు జనం రావడం లేదు
  • రెండు రోజుల ముందు వరకు వాలంటీర్లను కించపరిచిన చంద్రబాబు
  • పెనుగొండ సభలో వాలంటీర్లను కొనసాగిస్తామంటూ టీడీపీకి పని చేయడంటూ అడుక్కోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనం
  • అనంతపురం వద్ద జరిగిన సిద్ధం సభలో పార్కింగ్‌ స్థలంలో సగం కూడా లేదు చంద్రబాబు రా కదలిరా సభ
  • సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువ
  • చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు
     

1:40PM, Mar 5th, 2024

ఎన్టీఆర్ జిల్లా: 

పేదలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వ్యక్తి జగనన్న: ఎంపీ కేశినేని నాని

  • సొంత ఇళ్లు లేని వారికి 30 లక్షల ఇళ్లు ఇచ్చారు
  • ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారు
  • గతంలో దేవినేని ఉమా దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చాడు
  • ఈ రోజు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పట్టాలు పంపిణీ చేస్తున్నాం..అంటే అది జగనన్న పుణ్యమే
  • గతంలో పేదలకు కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో ఆరు లక్షల ఇళ్లు అని చెప్పి ఇంటికి లక్ష రూపాయల చొప్పున కమీషన్ నొక్కేసి మీకు ఇల్లు ఇవ్వలేదు
  • తండ్రి కొడుకులు ఇద్దరూ మిమ్మిల్ని మోసం చేశారు
  • కానీ జగన్ అలా చేయలేదు
  • గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం అర్జీ పెట్టుకుంటే ఇక్కడే ఆ అప్లికేషన్లు తగలెట్టారు
  • కానీ ఈ రోజు ఈ స్థలంలోనే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ తో సహా అందుకుంటున్న మీరు అదృష్టవంతులు
  • జగన్ మోహన్ రెడ్డి మీకు చెప్పినటువంటి పథకాలు అన్ని పూర్తి చేశారు
  • గత ప్రభుత్వానికి మోసం చేయడమే తెలుసు
  • చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడో  మీరే చెప్పాలి
  • అన్ని వర్గాలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి మన జగనన్న
  • అందరూ బాగుండాలి అంటే జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలి
  • మైలవరంలో జగనన్న ఒక సామాన్యమైన వ్యక్తిని అపర కుభేరుడు మీద పోటీ పెట్టారు
  • సర్నాల తిరుపతిరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది

జగనన్న నన్ను ఎంపీ కేశినేని నాని చేతుల్లో పెట్టారు: మైలవరం ఇంఛార్జి తిరుపతిరావు

  • ఇన్నిరోజులు నాయకత్వంతో ఉన్నా, ఇప్పుడు ప్రజల్లోకి రావడం నా అదృష్టం
  • నా దేవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నన్ను ఇంచార్జిగా ఉంచాలన్న తొలగించాలన్న జగనన్నే.. మీరు చెప్పుడు మాటలు నమ్మొద్దు
  • నాయకులు వలసలు వచ్చి ఇక్కడ ఏలుతున్నారు
  • నియోజకవర్గంలో ఇసుక బూడిద మట్టి మీద వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారు
  • కానీ ప్రజల సమస్యలు చూడడం లేదు
  • దేవినేని ఉమా తాగడానికి ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడు
  • దేవినేని ఉమా ప్రజలకు సేవ చేస్తే అభివృద్ధి వస్తుంది..అంతేగానీ మట్టి, ఇసుక గ్రావెల్ దోచుకుంటే అభివృద్ధి రాదు
  • మనం ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తికూడా అభివృద్ధి జరగడం లేదం టే విడ్డూరంగా ఉంది
  • మన జగనన్న మనకు ఒక టైగర్‌ను పంపించాడు ఆయనే నాని అన్న
  • వసంత రాజధాని అని కొత్త పాట పాడుతున్నారు
  • వసంత కృష్ణప్రసాద్  నువ్వు సీటు కొనుక్కుని మళ్ళీ వస్తున్నావ్ ప్రజలు తగిన శాస్తి చేస్తారు
  • వసంత కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గ వీరప్పన్..అడవి దొంగ
  • నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే చస్తా,

11:25AM, Mar 5th, 2024

అనంతపురం:

కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు చేదు అనుభవం

  • వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని టీడీపీ అసమ్మతి నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరిని కోరిన అమిలినేని సురేంద్ర బాబు
  • నిరాకరించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి
  • చంద్రబాబు తో తాడోపేడో తేల్చుకుంటా, నాకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో తేల్చుకుంటా
  • నేను లంచగొండి కాదు.. అవినీతి చేయలేదు, 
  • చంద్రబాబును కలిసిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా
  • కళ్యాణదుర్గం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి

10:20AM, Mar 5th, 2024

చిత్తూరులో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన 

  • సంతపేట 47వ డివిజన్ లో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఉద్యానవనం కు భూమి పూజ చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
  • కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ ఎన్ రెడ్డప్ప, చిత్తూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త  విజయానందరెడ్డి, చుడా చైర్మన్ శ్రీ పురుషోత్తం రెడ్డి
  • ఈ ప్రాంతం లో ఒక మంచి పార్క్ అతి త్వరలో వస్తుంది
  • ఈరోజు భూమి పూజ చేశాం, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం
  • మరోసారి చిత్తూరు ఎంపీగా ఎన్ రెడ్డప్ప పోటీ చేస్తున్నారు
  • చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా విజయనంద రెడ్డి నిలబడుతున్నారు
  • వారిద్దరినీ గెలిపించి సిఎం వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కోరుతున్నా

9:45AM, Mar 5th, 2024

ఎన్టీఆర్‌ జిల్లా:

వైఎస్సార్‌సీపీ నాయకులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి

  • తిరువూరు బోసుబొమ్మ సెంటర్‌కు రావాలంటూ కొలికపూడి శ్రీనివాస్‌ సవాళ్లు
  • కొలికపూడి వంటి వ్యక్తుల సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదంటున్న వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌  నల్లగట్ల స్వామిదాస్
  • టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివా'స్‌ను హౌజ్‌ అరెస్ట్‌ చేసిన  పోలీసులు
  • ముందస్తు చర్యల్లో భాగంగా తిరువూరు బోసుబొమ్మ సెంటర్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు
  • రేపటి  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ పనుల్లో నిమగ్నమైన స్వామిదాస్

8:02 AM, Mar 5th, 2024

విజయవాడ

నేడు ఫిరాయింపు ఎమ్మెల్సీల అనర్హత పై విచారణ

  • అనర్హత పిటిషన్ పై నోటీసులు జారీచేసిన శాసన మండలి చైర్మన్
  • నేడు తుది విచారణకు హాజరు కావాలని నోటీసులు
  • ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య లకు నోటీసులు

7:02 AM, Mar 5th, 2024

ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్

  • ప్రశాంత్ కిషోర్‌కి ఆంధ్రాలో టీమ్‌ ఉందా?
  • అతను సర్వేలు ఎప్పుడు చేసాడు 
  • ఐ ప్యాక్‌కి, ప్రశాంత్‌ కిషోర్‌కి సంబంధం లేదు
  • ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు రెండు మాటలు మాట్లాడాడు 
  • ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది 
  • ప్రశాంత్ కిషోర్‌ని ఎవరూ పట్టించుకోరు 
  • చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు 
  • టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే పీకే చదువుతున్నాడు 
  • ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరు 
  • జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు 
  • వై నాట్ 175 అనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం

7:00 AM, Mar 5th, 2024

విశాఖలో ప్రలోభాల పర్వానికి తెర లేపిన టీడీపీ

  • భీమిలి నియోజకవర్గంలో బట్టలు పసుపు కుంకుమ పంపిణీకి సిద్ధం
  • పంచేందుకు లక్ష కిట్లను రెడీ చేసిన మాజీ మంత్రి గంటా
  • భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్న గంటా
  • చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాను ఆదేశించిన చంద్రబాబు
  • అధినేత మాటను లెక్క చేయని గంటా

6:50 AM, Mar 5th, 2024

బాబు డైరెక్షన్‌లోనే పీకే వ్యాఖ్యలు!

  • శనివారం చంద్రబాబుతో మూడుగంటలు సమావేశం
  • బాబు చెప్పిన మేరకే ఆదివారం పీకే వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు
  • ఏ సర్వేలు చేయడంలేదంటూనే వైఎస్సార్‌సీపీపై విషం
  • బాబు మేలు కోరే ఇలా మాట్లాడారంటున్న విశ్లేషకులు
  • సోమవారమూ బాబుతో పీకే రెండున్నర గంటలపాటు భేటీ
  • ఆ భేటీ తర్వాతే అనంతపురం జిల్లా సభకు చంద్రబాబు

6:40AM, Mar 5th, 2024

పవన్‌ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని

  • ఇద్దరు గుంటనక్కల మధ్య ప్రయాణం చేస్తున్నాడు
  • 3 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గానికి 30 సీట్లిచ్చిన బాబు
  • 20 శాతం ఉన్న కాపు సామాజికవర్గానికి 24 సీట్లు మాత్రమే ఇచ్చాడు
  • డబ్బున్న వాళ్లకే టీడీపీలో టికెట్లు: పేర్ని నాని
  • రాజకీయ వ్యాపారం చేసే బాబు, పవన్‌ రాష్ట్రానికి అవసరం లేదు: భరత్‌రామ్‌
  • రాజమహేంద్రవరంలో సిద్ధం సభ

6:38AM, Mar 5th, 2024

బీసీ డిక్లరేషన్‌ కంటే మిన్నగా మేలు చేస్తున్న సీఎం జగన్‌ 

  • కేబినెట్‌ నుంచి స్థానిక సంస్థల దాకా సింహభాగం పదవులు వారికే
  • 1.73 లక్షల కోట్ల మేర డీబీటీ, నాన్‌ డీబీటీతో బీసీలకు లబ్ధి
  • సామాజిక న్యాయంతోపాటు చదువుల్లోనూ బీసీ బిడ్డలకు ప్రోత్సాహం
  • విద్యా దీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఉన్నత విద్యకు సంపూర్ణ తోడ్పాటు
  • భోజన ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా ‘వసతి దీవెన’ 
  • నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియంతో తీర్చిదిద్దిన స్కూళ్లతో బీసీల విద్యా సాధికారతకు బాటలు.. సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతున్నారంటూ సామాజికవేత్తల ప్రశంసలు
  • బీసీ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కి మరోసారి చంద్రబాబు అదే పాట.. బీసీల కంచుకోటలు కుప్పం, మంగళగిరిలో తిష్ట వేసి ఆ వర్గాలకు వెన్నుపోటు

6:35AM, Mar 5th, 2024

వైఎస్సార్‌సీపీలో కీలక చేరికలు

  • వైఎస్సార్‌సీపీలో చేరిన ఏపీసీసీ కిసాన్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ గురునాథరావు
  • వైఎస్సార్‌సీపీలో చేరిన జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్‌
  • వైఎస్సార్‌సీపీలోకి బీజేపీ ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భూమా కిషోర్‌రెడ్డి
  • నిన్న( సోమవారం) తాడేపల్లిలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement