Dec 19th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Political News Updates Headlines Dec 19th In Telugu | Sakshi
Sakshi News home page

AP Political News Dec 19th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Tue, Dec 19 2023 6:50 AM | Last Updated on Tue, Dec 19 2023 6:45 PM

AP Elections Political News Updates Headlines Dec 19th In Telugu - Sakshi

AP Elections 2023 Political Latest Updates Telugu

5:29PM, Dec 19, 2023
ఎవరూ గుర్తించని యాత్ర ఇది: మంత్రి అంబటి రాంబాబు

  • లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా?
  • కనీసం లోకేష్‌కైనా, పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా? 
  • ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా తెల్లగా మారదనే వేమన శతకంలాగ లోకేష్ యాత్ర కొనసాగింది
  • యాత్ర వలన ఒళ్లు తగ్గిందే తప్ప, మైండు మెచ్యూరిటీ లేదు
  • కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు
  • అశుభయాత్ర చేశాడు లోకేష్
  • జనంలేక వెలవెలబోయిన రోజులు ఎన్నో ఉన్నాయి
  • ఎల్లోమీడియానైతే విపరీతంగా జనం వచ్చారని చెప్పటానికి తెగ ప్రయత్నం చేశారు
  • చివరికి యాంకర్ ఉదయభానుని తెచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ చౌదర్లులారా.. అంటూ మాట్లాడారు 
  • బాలకృష్ణ రేపు యాంకరింగ్ చేయబోతున్నారు
  • ఇంకో యాంకర్ పవన్ కళ్యాణ్ కూడా రేపు యాంకరింగ్ చేయబోతున్నారు 
  • వృద్దతండ్రి తన అసమర్ధ కొడుకుని హైలెట్ చేయటానికి చేస్తున్న ప్రయత్నమే కనిపిస్తుంది
  • లోకేష్ యాత్ర అంత విజయవంతమైతే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ల యాంకరింగ్ ఎందుకు?
  • సీట్లు, నోట్లు మాట్లాడుకుని పవన్ కళ్యాణ్‌తో యాంకరింగ్‌కి ఒప్పించుకున్నారు 
  • కిరాయి తీసుకుని పవన్ కళ్యాణ్ లోకేష్ సభకి యాంకరింగ్ చేస్తున్నారు
  • స్పెషల్ ఫైట్లు, స్పెషల్ రైళ్లలో రేపు జనాన్ని తరలిస్తున్నారు
  • స్కాంలో సంపాదించిన సొమ్ము రేపు ఖర్చు పెట్టబోతున్నారు 
  • సోదరుడికి, చౌదరికి తేడా తెలీని వ్యక్తి లోకేష్
  • సూట్ కేసులు మోసేది నాదెండ్ల మనోహర్ 
  • ప్రజల్లో గెలవకుండా మంత్రి ఐన వ్యక్తి లోకేష్
  • అలాంటి వారికి ప్రజల కష్టాలేం తెలుసు?
  • 175 సీట్లు గెలవటమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఇన్ఛార్జుల ప్రకటన జరుగుతోంది
  • అంతర్గత బదిలీలు సహజంగా జరుగుతుంటాయి
  • చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ఎందుకు బదిలీ అయ్యారు?

3:59PM, Dec 19, 2023

చంద్రబాబు.. పసుపు కుంకుమ పేరుతో ఓట్ల రాజకీయం చేయాలని చూశాడు:  భూమన కరుణాకరరెడ్డి

  • చంద్రబాబు నాయుడు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు.
  • ఎన్నికలు సమీపించే సమయంలో పసుపు కుంకుమ ఇచ్చి ఓట్ల రాజకీయం చేయాలని చూశాడు ఆయనకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి మూల కూర్చోబెట్టారు.
  • ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో విలవిలలాడుతోంటే చంద్రబాబు నాయుడు కనీసం ప్రజల వద్దకు వచ్చి సాయం అందించేందుకు రాలేదు.
  • ఎన్నికల సమీపించే సమయంలో ప్రజలకు అది చేస్తా, ఇది చేస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నాడు.
  • మాట ఇచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  • ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడు,ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని వందల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వలేదు.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం మూడు లక్షల మూపై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు కనీసం 30 కోట్లు కూడా ఖర్చు చేయలేదు
  • పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  • చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే మీరు ఓడిపోతారు.. జగన్‌కు ఓటేస్తే మీరు గెలుస్తారు
     

3.33 PM, Dec 19, 2023
ప్రశ్నార్థకంగా పవన్‌ .?

  • మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్
  • రేపు లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు అవుతాడని ప్రకటించిన పార్టీ
  • రెండు రోజుల పాటు మంగళగిరి పార్టీ ఆఫీసులోనే పవన్ మకాం
  • పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయాలపై పార్టీలోనే విమర్శలు, ప్రశ్నలు
  • లోకేష్‌ సభకు వెళ్లనని ఎందుకు ప్రకటించాడు?
  • చంద్రబాబు ఇంటికి వచ్చి చెప్పగానే వెళ్తానని ఎందుకు ప్రకటించాడు?
  • ప్యాకేజీ తీసుకుని లోకేష్‌ సభకు వెళ్తున్నాడన్న విమర్శలకు ఏం జవాబు చెప్పాలి?
  • చంద్రబాబు 25 సీట్లతో సరిపెడతానంటున్నాడు.. పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఏం చెబుతాడు?
  • ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో చేసింది ఒక్క పని లేదు..
  • అసలెందుకు పార్టీ పెట్టినట్టు.. ఈ ఊడిగం ఎందుకు చేస్తున్నట్టు?
  • ఇంతోటి దానికే చేగువేరా.. అని ఊగిపోతూ ప్రకటనలు చేయడమెందుకు?
  • పార్ట్‌ టైం పాలిట్రిక్స్‌తో ప్రజలను ఎన్నాళ్లని మోసం చేస్తాం?

3.22 PM, Dec 19, 2023
జడ్జిలపై ట్రోలింగ్‌ చేసిన కేసు

  • జడ్జిలపై ట్రోలింగ్ అంశంపై హైకోర్టు విచారణ
  • విచారణను 4 వారాలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
  • చంద్రబాబు అరెస్ట్ సమయంలో జడ్జిలపై ట్రోలింగ్ చేసిన తెలుగుదేశం నేతలు
  • క్రిమినల్ కంటెంప్ట్ కింద దాఖలైన పిటిషన్ పై విచారణ

3.06 PM, Dec 19, 2023
బెజవాడ తెలుగుదేశంలో రచ్చ రచ్చ

  • బెజవాడ ఎంపీ సీటుపై ముసలం
  • విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలంటున్న బీసీ సంఘాలు
  • ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న బుద్ధా వెంకన్న
  • తన సీటుకు ఎసరు పెడుతుండటంతో బుద్ధా వెంకన్నను టార్గెట్ చేస్తూ కేశినేని ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఎంపీ
  • విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ ను ఆహ్వానిస్తున్నా
  • కాల్ మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించేవాళ్లు బీసీలు కాదు
  • బుద్ధావెంకన్నను టార్గెట్ చేసి ఘాటైన కామెంట్స్ చేసిన కేశినేని నాని
  • నీతి , నిజాయితీ , మచ్చలేని వ్యక్తులే అసలైన బిసిలు
  • కాల్ మనీ , సెక్స్ రాకెట్ , గూండాగిరీ చేసేవాళ్లు బిసిల కిందరారు
  • నిరుపేదలైనా కాళ్లకు దండం పెడతాం
  • భూకబ్జాలు చేసేవాళ్లు, జనాలను హింసించిన వాళ్లు బిసిలు కాదు
  • పార్టీకోసం కష్టపడిన నిఖార్సైన బిసిలు చాలామంది ఉన్నారు
  • అలాంటి వారికి టిక్కెట్లిస్తే సంతోషిస్తా : కేశినేని

2.36 PM, Dec 19, 2023
లోకేష్‌ పాదయాత్ర ఈవినింగ్‌ వాక్‌ మాత్రమే : వెల్లంపల్లి

  • లోకేష్ చేసింది యువగళం పాదయాత్ర కాదు..ఈవెనింగ్ వాక్
  • పాదయాత్ర అంటే వైఎస్సార్,జగన్ మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు
  • వైఎస్సార్,జగన్ పాదయాత్రల వల్ల ప్రజల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశారు
  • చంద్రబాబు పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చి ప్రజలకోసం ఏం చేశారు
  • లోకేష్ అమ్మఒడికి ...అమ్మకు వందనంకు తేడా ఏంటి
  • జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నదే మీరు ఇస్తానంటున్నారు
  • 14 ఏళ్లు నీ తండ్రి సీఎంగా...నువ్వు మంత్రిగా చేశారు
  • అప్పుడు అమ్మ ఒడి ఎందుకు పెట్టలేకపోయారు
  • చేయూత ఎందుకు పెట్టలేకపోయారు..పేదలకు ఇళ్లు ఎందుకివ్వలేకపోయారు
  • యువగళం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు
  • నేను, నా తండ్రి తప్పుచేశామని లోకేష్ లెంపలేసుకుని .. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  • 14 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేనోళ్లు...మరోసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారు
  • నువ్వు, నీ తండ్రి, దత్తపుత్రుడు ఉండేది హైదరాబాద్ లోనే
  • పక్కరాష్ట్రంలో ఉండే మీకు ఇక్కడి రాజకీయాలతో మీకేం సంబంధం?

2.23 PM, Dec 19, 2023
చంద్రబాబు ఎవరికి ఇస్తే వారిదే టికెట్‌ : లోకేష్‌

  • పార్టీ అభ్యర్ధుల ఎంపికలో అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం
  • చంద్రబాబు మా అధ్యక్షుడు... మేమంతా ఆయన సైనికులం
  • ఎవరికి టికెట్‌లు ఇవ్వాలనుకున్నా.. వద్దనుకున్నా చంద్రబాబుదే నిర్ణయం
  • యువతను ప్రోత్సహించాలని టీడీపీ నిర్ణయించుకుంది

2.03 PM, Dec 19, 2023
విజయనగరం నుంచి తిరుమల వరకు సీఎం జగన్‌ కోసం పాదయాత్ర

  • విజయనగరం నుండి తిరుమల వరకు ఇందుకూరి రఘురాజు పాదయాత్ర
  • ఆంధ్రప్రదేశ్ కి జగనే రావాలి జగనే కావాలి అనే నినాదంతో పాదయాత్ర
  • చంద్రబాబు నాయుడి పై బాంబు బ్లాస్ట్ జరిగినా.., అరెస్టు అయినా.. ప్రజలు, టిడిపి పార్టీ వాళ్ళు కూడా ఆయన వెంట లేరు.
  • చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుప్పం నుంచే కాక మరో నియోజకవర్గాన్ని కూడా వెతుక్కుంటున్నారు.
  • జగనన్న ఫోటోతోనే 2024వ సంవత్సరంలో 175 కి 175 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుస్తారు.
  • గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
  • పవర్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
  • అసలు లోకేష్ పాదయాత్ర చేసాడా అని డౌట్ గా ఉంది.
  • వాళ్ళ నాయనను అరెస్టు చేస్తే భయపడి ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నాడు.
  • ఒక పాదయాత్రకు ఇన్ని బ్రేక్ లు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక లోకేష్ మాత్రమే.
  • ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల ఆయన సామాజిక వర్గానికి కానీ ప్రజలకు ఏ మాత్రం ఒరిగిందేమీ లేదు.
  • ఆ జనసైనికుల రెండు చేతుల్లో రెండు జెండాలు మోయిస్తూ జెండా మోసే కూలీలుగా చూస్తున్నారు.
  • జనసైనికులు మీరు అతని వెంట తిరిగి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు

1.35 PM, Dec 19, 2023
చంద్రబాబు, పవన్‌పై నిప్పులు చెరిగిన ప్రభుత్వ విప్‌ గ్రంధి శ్రీనివాస్‌

  • ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం
  • గతంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఖర్చు రూ.ఐదు లక్షలు ఉంటే దానిని 25 లక్షలకు పెంచారు
  • ఒక వ్యక్తి ఆసుపత్రి చేరిన దగ్గర నుండి ఇంటికి చేరేవరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు
  • చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ కుంటు పడిపోయింది
  • ఆరోగ్యశ్రీలో వేలకోట్ల బకాయిలను పెట్టాడు చంద్రబాబు.. అవి తీర్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • చంద్రబాబుపై విశ్వాసం లేక 23 సీట్లకు పరిమితం చేసి బై బై బాబు అన్నారు ప్రజలు
  • ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిన వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతుంటే ఎవరు వింటారు....?
  • గతంలో 1000 కి సంబంధించి ఆరోగ్యశ్రీలో వ్యాధులకు చికిత్స అందిస్తే ఇప్పుడు 3,000 లకు పైగావ్యాధులు చేర్చారు
  • వైఎస్ఆర్సిపి పై ప్రజా వ్యతిరేకత ఉంటే చంద్రబాబుకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి.....
  • చేగువేరా ,భగత్ సింగ్ ,మదర్ థెరీసా, జ్యోతిరావు పూలే.. మహనీయుల ఫోటోలు పెట్టుకుని యువతను ఆకర్షిస్తానంటాడు పవన్ కళ్యాణ్
  • చంద్రబాబులో మహనీయులు కనపడుతున్నారంటూ ఇప్పుడు స్టేజ్ పై చంద్రబాబు ఫోటో నే పెడుతున్నాడు
  • జనసేన పార్టీ నాయకులకు ఆత్మ అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు YSRCPలో చేరడమే సరైన మార్గం..
  • జనసేనలో పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్న జనసైనికులు నాయకులు YSRCPలో చేరండి గౌరవిస్తాం..
  • జనసేనైనా టిడిపి నైనా బిజెపి అయినా ఏ పార్టీ అయినా అన్ని పథకాలు అందిస్తున్నాము..
  • జన సైనికులను మెడపట్టి YSRCP ఆఫీస్ దాకా పవన్ కళ్యాణ్ గెంటక ముందే మీరే వచ్చి చేరండి...
  • జనసేన, టిడిపి హైదరాబాద్ పార్టీలు...
  • కళ్యాణ్ బ్రదర్ నాగబాబు కూడా ఏపీలో ఓటర్ రాపించుకుంటున్నారు
  • ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ రాష్ట్రం విడిపోతే 10 రోజులు భోజనం చేయలేదు అంటాడు తెలంగాణ వెళ్లి నేను ఇక్కడ ఎందుకు పుట్టలేదు అని అంటాడు...
  • ప్రజలను వంచించే దగా కోరు మాటలు మాట్లాడడమే పవన్ కళ్యాణ్ విధానం
  • పదేళ్లపాటు జనసేన పార్టీ కార్యకర్తలంతా టిడిపి జెండా మోయాలనీ అంటున్నాడు పవన్ కళ్యాణ్...
  • చంద్రబాబు, లోకేష్‌ తర్వాత దేవాన్ష్‌ను ముఖ్యమంత్రి చేసేదాకా పార్టీ జెండా మోయాలి అంటున్న పవన్ కళ్యాణ్ కి సిగ్గుండాలి..

1.10 PM, Dec 19, 2023
అల్లూరి జిల్లాకు ముఖ్యమంత్రి

  • తాడేపల్లి : ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పర్యటన
  • 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేయనున్న సీఎం
  • అనంతరం బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం జగన్

12.00 PM, Dec 19, 2023
పోలిపల్లిలో టీడీపీ కబ్జా గళం

  • టీడీపీ నాయకులు భూములు కొట్టేసిన గ్రామంలో లోకేశ్‌ యువగళం ముగింపు సభ
  • విజయనగరం జిల్లాలో టీడీపీ నేతల భూకబ్జా
  • భోగాపురం మండలం పోలిపల్లి సర్వే నంబర్‌ 27లో భూకబ్జా 
  • జాతీయ రహదారి పరిహారం సైతం స్వాహా చేసిన టీడీపీ నేతలు
  • టీడీపీ నేత బినామీ పులవర్తి సుబ్రమణ్యం పేరిట నకిలీ రిజిస్ట్రేషన్‌ 
  • న్యాయం కోరుతున్న తిరిమారెడ్డి ఆదినారాయణ వారసులు
  • ఆర్డీవో నాడు చర్యలకు ఆదేశించినా అడ్డుపడ్డ ఎల్లో గ్యాంగ్‌
  • అక్రమాలకు నాటి ఓ జిల్లా పోలీసు అధికారి అండదండలు!

11.10 AM, Dec 19, 2023
నేను జగనన్న సైనికురాలిని: మంత్రి రోజా

  • వైఎస్సార్‌సీపీ మార్పులపై యెల్లో మీడియా తప్పుడు రాతలు
  • అధికార పార్టీలో అసంతృప్తులంటూ.. పలువురికి టికెట్లు దక్కవంటూ కథనాలు
  • మంత్రులు, కీలక నేతలపై మరీ ఘోరమైన రాతలు
  • కథనాలపై స్పందించిన నగరి ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
  • వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ దక్కదంటూ ప్రచారం చేస్తున్నారు
  • తనపై అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారు
  • నేను జగనన్న సైనికురాలిని.. ఆయన మాటే శిరోధార్యం
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరతా
  • ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరిగినా.. ముందు వరుసలో నేనే ఉంటున్నా
  • చంద్రబాబు, పవన్‌లకు ఓటమి భయం పట్టుకుంది
  • ఎక్కడ గెలుస్తామా? అనే నియోజకవర్గాలు వెతక్కుంటున్నారు
  • రెండేసి నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారు

10.36 AM, Dec 19, 2023
టీడీపీకి పాంప్లెట్‌లా యెల్లో మీడియా

  • మీడియా పరువు తీస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5
  • చంద్రబాబుకి బాకా ఊదుతూ.. సంక్షేమ ప్రభుత్వంపై విషపు రాతలు, కథనాలు
  • తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  • ఎల్లో మీడియా తెలుగుదేశం పాంప్లెట్ ల తయారయ్యింది
  • సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తోంది
  • చంద్రబాబు ప్రభుత్వం లోనే ఎక్కువ శాతం అప్పులు చేశాడు
  • చంద్రబాబు కన్నా 100 రెట్లు ఎక్కువ మంచి పనులు చేసిన ప్రభుత్వం సీఎం జగన్ ప్రభుత్వందే
  • ప్రతిపక్షాలకు మతిభ్రమించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి
  • సీఎం జగన్ సంక్షేమ పథకాలు చంద్రబాబు కాపీ కొట్టాలనుకుంటున్నాడు
  • 2024 లో సీఎం జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు




10.12 AM, Dec 19, 2023
కోర్టు ధిక్కరణ పిటిషన్‌పైనా విచారణ

  • ఏపీ హైకోర్టులో నేడు కీలక పిటిషన్లపై విచారణ
  • ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పిటిషన్‌పై ఆదేశాలు వెల్లడించే అవకాశం
  • అలాగే.. ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ
  • చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత సోషల్‌ మీడియాలో రెచ్చిపోయిన కొందరు
  • బాబుకి రిమాండ్‌ విధించిన న్యాయమూర్తులను దూషిస్తూ పోస్టులు
  • తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం
  • కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేసిన ప్రభుత్వం.. ఇవాళ విచారణ




09.30 AM, Dec 19, 2023
గంటా తీరుతో విసిగిపోతున్న విశాఖ నేతలు

  • గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా
  • ఈ నాలుగున్నరేళ్లలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు
  • సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం
  • ఈసారి ఇక్కడ గెలిచే అవకాశాలు తగ్గడంతో భీమిలి వైపు చూపు

09.05 AM, Dec 19, 2023
ప్రగాల్బాలకే పరిమితమైన లోకేష్‌

  • ప్రజా స్పందన కరువైన లోకేష్‌ పాదయాత్ర
  • 226 రోజులకే పరిమితమైన పాదయాత్ర
  • 400 రోజులు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర అంటూ లోకేష్‌ ప్రగల్బాలు
  • అవగాహన రాహిత్యపు మాటలతో నవ్వులపాలైన లోకేష్‌

8.35 AM, Dec 19, 2023
టీడీపీతో పవన్‌ ముసుగు రాజకీయాలు

  • నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా పవన్‌లో లేవు

8.30 AM, Dec 19, 2023
నేడు బాబు పిటిషన్‌పై విచారణ

  • ఇసుక కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు 
  • సీఐడీ అభియోగాలతో కేసు నమోదు.. నిందితుడిగా పేరు 
  • హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌.. కొనసాగుతున్న విచారణ
  • మంగళవారం కొనసాగనున్న విచారణ 
  • గత ప్రభుత్వ హయాంలో ఉచితం పేరిట ఇసుక అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు అండ్‌ కో



8.25 AM, Dec 19, 2023

విజయవాడ టీడీపీ ఎంపీ సీటుపై ముసలం

  • విజయవాడ ఎంపీ టికెట్‌ ఇవ్వాలంటున్న బీసీ సంఘాలు
  • ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న బుద్ధా వెంకన్న 
  • తన సీటుకు ఎసరు పెడుతుండటంతో బుద్ధా వెంకన్నను టార్గెట్‌ చేస్తూ ఎంపీ కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలు 
     

8.10 AM, Dec 19, 2023
కోటలు దాటుతున్న యువగళం అంచనాలు

  • రేపు భోగాపురంలో యువగళం ముగింపు సభ
  • సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, నందమూరి బాలకృష్ణ
  • పోలిపల్లిలో 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు
  • ఆరంభం నుంచి అవాంతరాల మధ్య సాగిన పాదయాత్ర
  • చంద్రబాబు అరెస్ట్‌ కాగానే పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఇచ్చిన లోకేష్‌
  • విమర్శలు రావడంతో చివరకు ఓ కంక్లూజన్‌ ఇచ్చే ప్రయత్నం

7.50 AM, Dec 19, 2023
యెల్లో మీడియాకు మింగుడుపడని ‘మార్పు’

  • వైఎస్సార్‌సీపీలో మార్పులపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అక్కసు
  • ఏదో జరిగిపోతోందంటూ వరుస కథనాలు
  • వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసమేనంటూ ఇప్పటికే ప్రకటించిన వైఎస్సార్‌పీపీ
  • మార్పుపై స్పష్టమైన స్టేట్‌మెంట్లు ఇచ్చిన సజ్జల, బొత్స లాంటి సీనియర్లు  
  • సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు-చేర్పులు చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌
  • జీర్ణించుకోలేకపోతున్న యెల్లో బ్యాచ్‌
  • అసంతృప్తులు.. కన్నీళ్లు.. టికెట్‌ చించడం.. అంటూ విపరీత రాతలు
  • పచ్చ రాతలకు వైఎస్సార్‌సీపీ నేతల కౌంటర్లు
  • యెల్లో మీడియా కథనాలకు ఉపేక్షించొద్దని, గట్టిగా తిప్పికొట్టాలని కేబినెట్‌ భేటీలోనూ మంత్రులకు సూచించిన సీఎం జగన్‌



7.24 AM, Dec 19, 2023
చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్‌ ఊడిగం
• సొంత పార్టీ జనసేనను బలోపేతం చేయకుండా యజమాని బాబు మేలు

6.59 AM, Dec 19, 2023
వన్స్‌ మోర్‌ సీఎం జగన్‌

  • ఏలూరులో కదంతొక్కిన విద్యార్థులు 
  • ఉత్సాహంగా విద్యార్థి సాధికారత ర్యాలీ 
  • వేలాది మంది పాల్గొని ‘వన్స్‌ మోర్‌ సీఎం జగన్‌’ అంటూ నినాదాలు  
  • హాజరైన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు, ఎంపీ కోటగిరి శ్రీధర్‌  

6.42 AM, Dec 19, 2023
పొగాకుపైనా వితండవాదమేనా? 

  • పొగాకు పంటకు దేశంలో ఎక్కడా బీమా లేని సంగతి తెలియదా రామోజీ? 
  • పీఎం ఫసల్‌ బీమా యోజన జాబితాలోనూ చోటులేని విషయం తెలియదా? 
  • అయినప్పటికీ రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు ఈ–క్రాప్‌లో నమోదు చేస్తోంది కనిపించదా? 
  • ఏటా పంట నష్టపరిహారం ఇస్తున్నా ఎందుకీ రాతలు? 
  • 29,228 మంది నుంచి రూ.128.65 కోట్ల పొగాకు కొనుగోలు చేసినా పట్టదా?

6.37 AM, Dec 19, 2023
జగన్‌ అభివృద్ధి మంత్రానికి టీడీపీ కకావికలం

  • విశాఖ జిల్లాలో టీడీపీ నేతల వింత పరిస్థితి  
  • పోయే సీట్లైనా పట్టు కావాలట!
  • విశాఖ ఉత్తరాన్ని వీడాలనుకుంటున్న గంటా
  • భీమిలి వైపు శ్రీనివాసరావు చూపు.. కుదరదంటున్న కోరాడ రాజబాబు 
  • పాయకరావుపేట, యలమంచిలిలోనూ గంటా వర్గం రాజకీయం 
  • అక్కడ జనసేన అభ్యర్థులకు మద్దతు 
  • విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనూ గండి బాబ్జికి పొగ పెడుతున్న వైనం
  • పెందుర్తి నుంచి బండారును సాగనంపేందుకు మిగతా నేతల యత్నాలు 
  • అరకులో దొన్ను దొర, అబ్రహం మధ్య పోరు 
  • అనకాపల్లి ఎంపీ సీటు కుమారుడికి ఇవ్వాలంటున్న అయ్యన్న 
  • సీఎం జగన్‌ అభివృద్ధి మంత్రానికి టీడీపీ కకావికలం


    6.30 AM, Dec 19, 2023
    ఏపీలో జనసేన పా​ర్టీకి మరో బిగ్‌ షాక్‌

  •  వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్‌ సుధీర్‌ 
  • రామ్‌ సుధీర్‌ పాటుగా జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్‌లు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement