Live : చంద్రబాబు కేసుల అప్‌డేట్స్‌ | Chandrababu Naidu Cases, Court Hearings On Nov 01 Updates | Sakshi
Sakshi News home page

Nov 1st: చంద్రబాబు కేసుల అప్‌డేట్స్‌

Published Wed, Nov 1 2023 9:05 AM | Last Updated on Wed, Nov 1 2023 6:57 PM

Chandrababu Naidu Cases Court Hearings Nov 01 Updates - Sakshi

Chandrababu Naidu Cases, Petitions, Court Hearings Update

6:51 PM నవంబర్‌ 01, 2023
హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అతిక్రమించిన చంద్రబాబు
►చంద్రబాబు కాన్వాయితో సహా వందలాది వాహనాలతో ర్యాలీ
►భారీ ట్రాఫిక్ జాం వాహనదారుల తవ్ర ఇబ్బందులు
►బేగంపేట నుండి పంజాగుట్ట, బంజారాహిల్స్ భారీ ట్రాఫిక్
►వాహనాలను అడ్డం పెట్టి నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న టీడీపీ నాయకులు
►అంబులెన్స్‌కు సైతం సైడ్ ఇవ్వకుండా ర్యాలీ
►ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

5:20 PM నవంబర్‌ 01, 2023
బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు

►ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ చంద్రబాబు ర్యాలీ
►చంద్రబాబు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదన్న హైకోర్టు
►హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని చంద్రబాబు, టీడీపీ శ్రేణులు

3:40 PM నవంబర్‌ 01, 2023
రామకృష్ణ కన్‌స్ట్రక్షన్ ఎండీ అంజనీకుమార్ పిటిషన్‌పై విచారణ
►అసైన్డ్ భూముల కేసులో అంజనీకుమార్ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్
►విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

3:30 PM నవంబర్‌ 01, 2023
చంద్రబాబు బెయిల్ షరతుల పై హైకోర్టులో విచారణ
►బెయిల్ ఉత్తర్వుల్లో మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అనుబంధ పిటిషన్
►కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►చంద్రబాబుకు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
►ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు
►కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు, రాజకీయ సభలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని షరతులు ప్రతిపాదించిన సీఐడీ
►సీఐడీ కండిషన్స్‌పై కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు లాయర్లు

3:20 PM నవంబర్‌ 01, 2023
కాసేపట్లో హైదరాబాద్ బల్దేరనున్న చంద్రబాబు
►గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బేగంపేట చేరుకోనున్న చంద్రబాబు
►జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు
►రేపు సాయంత్రం వరకు చంద్రబాబుకు వైద్య పరీక్షలు

3:15 PM నవంబర్‌ 01, 2023
చంద్రబాబు బెయిల్ పై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్ పై తీర్పు వాయిదా
►సీఐడీ అనుబంధ పిటిషన్ పై ఎల్లుండి తీర్పు వెల్లడించనున్న హైకోర్టు
►సీఐడీ షరతులు ప్రాథమిక హక్కులకు భంగమని చంద్రబాబు లాయర్లు వాదనలు

3:11 PM నవంబర్‌ 01, 2023
సీఐడీ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ
►అసైన్డ్ భూములు కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్లు
►ఈ కేసులో విచారణ రీ ఓపెన్ చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ
►అసైన్డ్ కుంభకోణాలకు సంబంధించి ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపిన సీఐడీ న్యాయవాదులు
►ఇప్పటికే ఆడియో క్లిప్స్ కోర్టుకు నివేదించామని తెలిపిన సీఐడీ తరఫున న్యాయవాదులు
►వీడియో క్లిప్ రేపు కోర్టు సబ్మిట్ చేస్తామని తెలిపిన సీఐడీ తరఫున న్యాయవాదులు
►తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా

2:57 PM నవంబర్‌ 01, 2023
నారాయణ ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
►అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో నారాయణ ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
►తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిన హైకోర్టు

1:00 PM నవంబర్‌ 01, 2023
సాయంత్రం హైదరాబాద్‌కు చంద్రబాబు
►విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చంద్రబాబు
►మధ్యాహ్నం 3గంటలకు కరకట్ట ఇంటి నుంచి బయల్దేరనున్న బాబు
►సాయంత్రం 4.45గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాబు
►బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి టిడిపి సన్నాహాలు
►బలప్రదర్శన చూపించేందుకు జనసమీకరణ చేస్తోన్న తెలుగుదేశం నేతలు
►నిన్నంతా రాజమండ్రి, విజయవాడను అస్తవ్యస్తం చేసిన తెలుగుదేశం నేతలు
►కోర్టు సూచించినా మారని చంద్రబాబు తీరు
►నిన్న జైలు నుంచి బయటకు రాగానే మైక్‌ అందుకున్న బాబు

12:56 PM నవంబర్‌ 01, 2023
స్కిల్‌ కేసులో టిడిపి సాంకేతిక పిటిషన్లు
►ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు పై చర్యలు తీసుకోవాలన్న పిల్ పై విచారణ
►పిల్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
►స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రెస్‌మీట్ లు ఏర్పాటు చేశారని పిల్
►ప్రజాధనం ఎంత వృధా అయ్యిందో వివరాలు తెలపాలన్న కోర్టు
►ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదన్న పిటిషనర్
►మరోసారి వివరాల కోసం దరఖాస్తు చేయాలన్న కోర్టు
►కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
►తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా

12:45 PM నవంబర్‌ 01, 2023
నారాయణ పిటిషన్లు నవంబర్‌ 15కి వాయిదా
►అసైన్డ్ భూముల కొనుగోలులో మాజీ మంత్రి నారాయణ వేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
►కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన సీఐడీ
►తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన హైకోర్టు

12:35 PM నవంబర్‌ 01, 2023
సాయంత్రమే లోకేష్‌ రిటర్న్‌ జర్నీ.!
►ఢిల్లీలో నారా లోకేష్
►వ్యక్తిగత పనులపైనే లోకేష్ ఢిల్లీకి వచ్చాడంటున్న టిడిపి వర్గాలు
►మధ్యాహ్నం లాయర్ లూథ్రాతో భేటీ కానున్న లోకేష్
►సాయంత్రమే హైదరాబాద్ కు లోకేష్ తిరుగు ప్రయాణం

11:55 AM నవంబర్‌ 01, 2023
షరతుల పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ
►సీఐడీ అనుబంధ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా
►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లో అదనపు షరతులు ఇవ్వాలని పిటిషన్
►మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు
►కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు

11:45 AM నవంబర్‌ 01, 2023
కరకట్ట ఇంట్లోనే వైద్య పరీక్షలు
►చంద్రబాబుకు కరకట్ట ఇంట్లోనే  వైద్య పరీక్షలు
►హైదరాబాద్ నుంచి అమరావతికి AIG వైద్య సిబ్బంది
►ప్రాధమిక పరీక్షలు, రక్తం నమూనాల సేకరణ
►మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ కు చంద్రబాబు
►హైదరాబాద్‌ వచ్చిన తర్వాత కంటి ఆపరేషన్‌ గురించి నిర్ణయం

11:40AM నవంబర్‌ 01, 2023
క్వాష్‌ పిటిషన్‌కు ముందు పురాణాలు వల్లిస్తోన్న లూథ్రా
►చంద్రబాబు లాయర్, సీనియర్‌ కౌన్సిల్‌ సిద్ధార్థ లూథ్రా ట్వీట్ల జపం
►సిక్కుల పదో గురువు అమరపదాలను షేర్ చేసిన లూథ్రా
►గతంలోనూ కత్తులు తిప్పాలి అంటూ ట్వీట్లు చేసిన లూథ్రా

11:32AM నవంబర్‌ 01, 2023
మళ్లీ ఢిల్లీకి లోకేష్‌.. ఇంతకీ అక్కడేం పని.?
►క్వాష్‌ పిటిషన్‌ కేసుకు సంబంధించి లాయర్లతో చర్చలంటున్న తెలుగుదేశం వర్గాలు
►లోకేష్‌ ఢిల్లీ టూరు వెనక మరేదో మతలబు ఉందంటున్న తెలుగు తమ్ముళ్లు
►లోకేష్‌ ఏమి లాయర్‌ కాదు, సుప్రీంకోర్టు సీనియర్లకు బ్రీఫింగ్‌ ఇచ్చే పరిస్థితి లేదు.!
►అయినా హస్తినలో లోకేష్‌కు ఏం పని.?
►మొన్నటి నెల రోజుల ఢిల్లీ పర్యటనలో ఏదో తేడా కొట్టిందని ప్రచారం
►లోకేష్‌ చేసిన పని వల్లే కేసు కాస్తా తిరకాసు అయిందని ప్రచారం
►లోకేష్‌ను నమ్ముకుని పనిలో దిగిన ఓ పెద్దమనిషికి మొత్తం కథ అడ్డం తిరిగిందని సమాచారం
►డ్యామేజీ కంట్రోల్‌ కోసం లోకేష్‌ మళ్లీ ఢిల్లీకి వెళ్లినట్టు టిడిపిలో ప్రచారం

11:11AM నవంబర్‌ 01, 2023
లంచ్‌ తర్వాత అదనపు షరతుల పిటిషన్‌ విచారణ
►స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌
►మధ్యంతర బెయిల్కి అదనపు షరతులు పెట్టాలని సీఐడీ అనుబంధ పిటిషన్‌ దాఖలు
►పిటిషన్‌పై విచారణ వాయిదా
►పాస్ ఓవర్ కోరిన న్యాయవాదులు 
►మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 2.15కి విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు
►కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు

10:55AM నవంబర్‌ 01, 2023
అసైన్డ్ భూములు కేసు విచారణ 10కి వాయిదా
►అసైన్డ్ భూములు కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ
►క్వాష్ పిటిషన్ల కేసులో  విచారణ రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్‌ దాఖలు 
►అసైన్డ్ కుంభకోణంలో ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపిన సీఐడీ న్యాయవాదులు
►ఇప్పటికే ఆడియో, వీడియో క్లిప్స్ కోర్టుకు నివేదించినట్లు వెల్లడి
►చంద్రబాబు, నారాయణ తరపున కౌంటర్ దాఖలు చేసిన లాయర్లు
►ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
ఇదీ చదవండి: అసైన్డ్‌ భూదోపిడీలో కొత్త కోణం.. గుట్టుగా జీఓ–41 జారీ

 10:19AM నవంబర్‌ 01, 2023
స్కిల్‌ స్కాంలో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఎప్పుడంటే.. 
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో బెయిల్‌ పిటిషన్‌ వేసిన చంద్రబాబు నాయుడు
►రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
►నవంబర్‌ 10వ తేదీన వాదనలు వింటామని బాబు లాయర్లకు వెల్లడి
ఇదీ చదవండి: స్కిల్‌ స్కాం.. అంతా చంద్రబాబు కనికట్టు


09:55AM నవంబర్‌ 01, 2023
16న టీడీపీ నేతల పిటిషన్‌పై విచారణ
► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్
► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ పిటిషన్
► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు
► విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

09:29AM నవంబర్‌ 01, 2023
చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు

►తన హయాంలో కావాల్సిన కంపెనీలకు దోచిపెట్టిన చంద్రబాబు
►కావాల్సిన డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులు 
►క్విడ్‌ప్రోకోలో భాగంగా ఎక్సైజ్‌ పాలసీనే మార్చేసిన నాటి ప్రభుత్వం 
►రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు 
►ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం 
►ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌.. అనుమతించిన న్యాయస్థానం 
►ఏ–1గా ఐఎస్‌ నరేష్, ఏ–2గా కొల్లు రవీంద్ర, ఏ–3గా చంద్రబాబు  
►అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే అందులో నిందితునిగా చేర్చారని చంద్రబాబు అభ్యంతరం
►హైకోర్టులో చంద్రబాబు అత్యవసరంగా లంచ్‌మోషన్‌ పిటిషన్‌
►విచారణ జరిపిన జస్టిస్‌ మల్లికార్జునరావు
►28 వరకు చంద్రబాబును అరెస్టు చేయబోం
►హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్‌
►తదుపరి విచారణ 21కి వాయిదా

09:15AM నవంబర్‌ 01, 2023
ఇదెక్కడి రోగం?

►ఆస్పత్రి పేరుతో జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు విజయోత్సవాలు
►నిజం గెలిచిందంటూ రాత్రంతా ర్యాలీలు.. బాబు తీరుపై విస్తుపోతున్న ప్రజలు
►చంద్రబాబుకు షరతులతో తాత్కాలిక బెయిల్‌.. అదీ కంటి ఆపరేషన్‌ కోసం
►స్కిల్‌ స్కామ్‌ కేసు యథాతథమే.. చేసిన నేరం అలాగే ఉంది
►నిజం గెలిచిందంటూ స్వాతంత్య్ర సమర యోధుడిలా ఊరేగింపులా?..
►తన కోసం జనం తండోపతండాలుగా వచ్చినట్లు హడావుడి
►ముందే కార్యకర్తల సమీకరణ.. రూట్‌ షెడ్యూల్‌ విడుదల
►అరెస్టయిన నాటి నుంచే టీడీపీ అధినేత డ్రామాలు 
►జైలులో దోమలు.. చర్మ రోగాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు హంగామా
►అవేమీ పారకపోవడంతో భద్రత లేదని, ప్రాణ హాని ఉందంటూ నాటకాలు
►చివరికి కంటి ఆపరేషన్‌ కోసం తాత్కాలిక బెయిల్‌ ఇవ్వాలంటూ వేడుకోలు
►మానవత్వంతో బెయిలిస్తే.. నిజం గెలిచిందంటూ టీడీపీ ఓవరాక్షన్‌  

ఇదీ చదవండి: IRR Case.. తోడు దొంగల రింగ్‌

09:10AM నవంబర్‌ 01, 2023
హైకోర్టు జడ్జిపై పోస్టులు.. చర్యలు తప్పవన్న సీఐడీ 
►ఏపీ హైకోర్టు జడ్జి పై కొందరు సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు: సీఐడీ చీఫ్ సంజయ్
►ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ను దెబ్బ తీసే అంశం: సీఐడీ చీఫ్ సంజయ్
►జడ్జీల పై ఎవ్వరు అసభ్యకరంగా పోస్టులు పెట్టిన తీవ్ర చర్యలు ఉంటాయి: సీఐడీ చీఫ్ సంజయ్
►జడ్జి పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు: సీఐడీ చీఫ్ సంజయ్
►నిందితులను పట్టుకుని కోర్టులో ప్రవేశ పెడతాం: సీఐడీ చీఫ్ సంజయ్

09:02AM నవంబర్‌ 01, 2023
ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు లాయర్ల కౌంటర్‌
►స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ 
►ఐదు షరతులతో కూడిన బెయిల్  ఇచ్చిన కోర్టు 
►మరో 5 నిబంధనలు చేర్చాలంటూ సీఐడీ పిటిషన్
►ఈరోజు వరకు ర్యాలీలు, మీడియాతో మాట్లాడకూడదంటూ నిన్న ఆదేశాలు జారీ చేసిన కోర్టు
►బెయిల్ షరతులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ
►మధ్యంతర బెయిల్ కండిషన్స్ పై చంద్రబాబు లాయర్ల కౌంటర్‌ వేసే అవకాశం
►నిన్న జైలు బయటకు వచ్చాక చంద్రబాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని సైతం ప్రస్తావించనున్న సీఐడీ

08:59AM నవంబర్‌ 01, 2023
విజయవాడ సీపీకి అచ్చెన్నాయుడు సందేశం
►విజయవాడ సీపీ కాంతిరాణాకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సందేశం
►కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు ప్రయాణిస్తారని సీపీకి అచ్చెన్న స్పష్టం
►చంద్రబాబు ఎక్కడా రాజకీయ యాత్ర చేపట్టలేదని సీపీకి తెలిపిన అచ్చెన్న
►వేలాదిగా ప్రజలు వచ్చినా చంద్రబాబు వాహనం దిగలేదన్న అచ్చెన్న
►చంద్రబాబు కాన్వాయ్ వెంట వేరే వాహనాలు అనుమతించొద్దని సీఐకి తెలిపాం : అచ్చెన్న
►హైకోర్టు నిబంధనలను చంద్రబాబు తూచా తప్పకుండా పాటించామని అచ్చెన్న వెల్లడి

ఫైబర్‌నెట్‌ కేసులో..  అస్మదీయ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపు 

08:47AM నవంబర్‌ 01, 2023
ఏపీ హైకోర్టు జడ్జి ట్రోలింగ్ పై సీఐడీ సీరియస్
►చంద్రబాబు కేసులో ఏపీ హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
►కేసు నమోదు చేసిన సీఐడీ
►దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు

08:38AM నవంబర్‌ 01, 2023
ఢిల్లీ బయల్దేరిన నారా లోకేష్
►చంద్రబాబు కేసుల కోసం ఢిల్లీకి నారా లోకేష్‌ బాబు 
►సుప్రీంకోర్టులో పెండింగ్ లో చంద్రబాబు క్వాష్ పిటిషన్
►చంద్రబాబు పై వరుస కేసుల విషయం పై ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించనున్న లోకేష్ : టిడిపి

08:12AM నవంబర్‌ 01, 2023
ఉండవల్లి నివాసంలో చంద్రబాబు విశ్రాంతి
►చంద్రబాబును పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలు రావొద్దని టీడీపీ విజ్ఞప్తి
►సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు చంద్రబాబు
►రేపు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో చంద్రబాబుకి వైద్య పరీక్షలు
►అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు

08:00AM నవంబర్‌ 01, 2023
చంద్రబాబుకి కండిషన్లతో మధ్యంతర బెయిల్‌

►స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిల్‌
►52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు
►నాలుగు వారాలపాటు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
►నవంబర్‌ 28వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని ఆదేశం
►అనారోగ్య కారణాల రీత్యా.. కేవలం మానవతా ధృక్పథంతో బెయిల్‌ ఇస్తున్నట్లు తీర్పు
►కంటి సర్జరీ కోసమే బెయిల్‌ అని స్పష్టం చేసిన కోర్టు
►ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశాలు
►కాదని ఉల్లంఘిస్తే.. వెంటనే బెయిల్‌ రద్దు అవుతుందని హెచ్చరిక
►ట్రీట్‌మెంట్‌ వివరాలను ఎప్పటికప్పుడు ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఆదేశం
►మంగళవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement