May 28th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections 2024 May 28th Political Updates In Telugu | Sakshi
Sakshi News home page

May 28th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Tue, May 28 2024 6:42 AM | Last Updated on Tue, May 28 2024 7:03 PM

AP Elections 2024 May 28th Political Updates In Telugu

May 28th AP Elections 2024 News Political Updates..

07:00 PM, May 28th, 2024 

  • కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!: మంత్రి మేరుగు నాగార్జున
  • పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు
  • అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరు
  • ఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?

     06:00 PM, May 28th, 2024 

     

    నెల్లూరు..

    • మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, ఎస్పీ అరిఫ్ హఫీజ్..
    • కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల్లో భద్రత ను ఏర్పాటు చేశాం: కలెక్టర్‌
    • కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ ఆంక్షలువుంటాయి.
    • కౌంటింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో వుంటుంది.
    • కౌంటింగ్ కేంద్రం వద్దకు కేవలం అభ్యర్థులు,ఎజెంట్ లకు మాత్రమే అనుమతి.
    • కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చడం, డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధం.. ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ
    • కౌంటింగ్ కేంద్రం వద్ద  కేంద్ర బలగాలు,బయట రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు ఉంటాయి.
    • అల్లర్లకు అవకాశం వుండే వారిని ఇప్పటికే బైండోవర్ చేశాం

    2:00 PM, May 28th, 2024

    సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..

    • ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?
    • పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.
    • 10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. 
    • పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. 
    • టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. 
    • కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.
    • ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? 
    • ఈసీ అంపైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుంది.
    • బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. 
    • సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. 
    • చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది

    1:30 PM, May 28th, 2024
    ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది

    • పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. 

     

     12:30 PM, May 28th, 2024
    సచివాలయం
    మాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..

    • ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాం
    • అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు
    • పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారు
    • గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారు
    • స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారు
    • కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారు
    • దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారు
    • ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది
    • ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు
    • ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది
    • ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాం
    • ఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం

    11:57 AM, May 28th, 2024
    తిరుమల
    ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..

    • వైఎస్సార్‌సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయం
    • ఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే
    • 2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడు
    • గెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబు
    • ప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసింది
    • అనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం  చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్‌సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్ర
    • తెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారు
    • ఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారు
    • మహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్‌కు ధైర్యం వచ్చింది 

    11:44 AM, May 28th, 2024

    ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

    • మూడు కేసుల్లో మందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
    • ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టు
    • కండీషన్లతో బెయిల్ మంజూరు 
    • 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు 
    • కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి

    11:27 AM, May 28th, 2024
    తిరుమల:

    వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. 

    • వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎంగా రావడం ఖాయం
    • అశాంతి కిషోర్‌ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవు
    • ఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారింది
    • ప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు
    • 2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయి
    • ఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్‌సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదు
    • టీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసింది
    • మా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారు
    • ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదు
    • అసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్‌లో 22కు పైగా సీట్లు వైఎస్సార్‌సీపీ గెలవబోతుంది
    • పెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 
       

      10:30 AM, May 28th, 2024
      నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం

    • నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..
    • తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!

    9:34 AM, May 28th, 2024
    విజయవాడ
    పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు

    • నిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలు
    • పిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరు
    • పిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్ర
    • ఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశం
    • హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు
    • ఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లి
    • హైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న‌ నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడి
    • హైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాది
    • రికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం
    • 23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు
    • హైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం
    • మరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్
    • తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్
    • ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు
    • తీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి
       

    8:09 AM, May 28th, 2024
    మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలు

    • హైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులు
    • పిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడి
    • పోలీసుల తీరుపై  హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయం
    • పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదా
    • మరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్
    • పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరు
    • టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్
    • దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరు
    • పిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులు
    • పోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చ
    • ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట
    • జూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టు
    • కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్ర
    • హత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులు
    • వాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులు
    • కాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులు
    • పోలీసులు వాదనలపై  పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం
    • ఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరం
    • వెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టు
    • పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడి
    • ఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి    
    • వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాది
    • పీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాది
    • హైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాది
    • రికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయం
    • కోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చ
    • ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చ
    • ఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చ
    • చివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టు
    • మరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చ
    • ప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయం
    • కనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులు
    • తొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనం
    • ఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరు
    • బాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.
    • ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ.
       

    7:15 AM, May 28th, 2024

    హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు  

    • పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు  
    • ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టు
    • ముందస్తు బెయిల్‌ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారం
    • ఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు
    • సంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులు
    • పిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయం
    • కౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి  

    6:45 AM, May 28th, 2024
    రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు

    • కౌంటింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు  
    • పోలింగ్‌ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు  
    • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా
       

    6:30 AM, May 28th, 2024
    పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌

    • మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. 
    • పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. 
    • చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 
    • 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement