AP Elections & Political March 21st Latest News Telugu
09:17 PM, మార్చి 21 2024
నెల్లూరు జిల్లా:
కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేని సోమిరెడ్డి ఎన్నికలు దగ్గర పడడంతో నానాయాగి చేస్తున్నాడు: మంత్రి కాకాణి
- సర్వేపల్లి టికెట్ విషయంలో చంద్రబాబు అనేక రకాల సర్వేలు చేసినా.. ఏ సర్వే కూడా టీడీపీ కి అనుకూలంగా రాలేదు
- గత్యంతరం లేక సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి కోడలు పేర్లు పరిశీలిస్తున్నారు
- టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు
08:30 PM, మార్చి 21 2024
విశాఖ: జనసేన కార్యకర్తలు ఆరుగురిపై కేసు నమోదు
- విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీ అనుచరులు.. నిన్న సాదిక్ పార్టీ ఆఫీస్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు
- నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచిన పోలీసులు
- జనసేన కార్యకర్తలు ఆరుగురుకి 15 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
08:00 PM, మార్చి 21 2024
శ్రీకాళహస్తి: టీడీపీ నేతల్లో తారాస్థాయికి చేరిన అసమ్మతి
- టీడీపీ అసమ్మతి నేత మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి వినుత భేటీ
- బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు
- ఉమ్మడి పార్టీల నాయకులు రహస్య భేటీ
- శ్రీకాళహస్తి నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్న కోలా ఆనంద్
- ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ నేత కోలా ఆనంద్,
- పొత్తు ధర్మం పాటించాలని, శ్రీకాళహస్తి బీజేపీకి కేటాయించాలని డిమాండ్
07:02 PM, మార్చి 21 2024
ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ
- బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా రాని క్లారిటీ
- పొత్తులో భాగంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ
- ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత
- ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమువీర్రాజు
- బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాల్లో జాప్యం
- ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు
- రాజమండ్రి సీటు కోరుతున్న పురంధేశ్వరి, సోమువీర్రాజు
- వైజాగ్‌లో పోటీ చేస్తానంటున్న జీవీఎల్
- అనకాపల్లి సీటు కావాలంటున్న సీఎం రమేష్
- రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు
- అరకు టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి గీత
- ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆంజనేయ చౌదరి
- తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు
- విజయనగరం సీటు కేటాయించాలంటున్న మాధవ్
06:30 PM, మార్చి 21 2024
అమరావతి
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో ముగిసిన మూడు జిల్లాల ఎస్పీల భేటీ.
- ముగ్గురు ఎస్పీలను విడి విడిగా పిలిచి వివరణ అడిగిన ఏపీ సీఈఓ
- ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన
- ఏపీలోని శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీఐ నిఘా పెట్టిందన్న సీఈఓ
- ముగ్గురు ఎస్పీలిచ్చిన వివరణల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న ఏపీ సీఈఓ ఎంకే మీనా.
06:15 PM, మార్చి 21 2024
పిఠాపురం ప్రజలకు భీమవరం, గాజువాక ప్రజల బహిరంగ లేఖ
- పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం ప్రజలు నమ్మొద్దు
- పవన్ భీమవరం, గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేశారు
- ఏనాడు పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరు
- కనీసం ఆ నియోజకవర్గంలో పర్యటనలు కూడా చెయ్యలేదు
- ప్యాకెజి కోసం తూతూ మంత్రంగా సభలు పెట్టి వెళ్లిపోయారు
- ఇప్పుడు మా రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నాడు
- సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖ
06:02 PM, మార్చి 21 2024
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు
- ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, అనుచరులు దాడికి దిగారు
- నా ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు
- 20 కార్లలో రామాంజనేయులు గూండాలను తీసుకొచ్చారు
- నా డ్రైవర్, మా కార్యకర్తలకి గాయాలయ్యాయి
- మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశాడు
- నాపై హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు
- ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చెయ్యాలని చేస్తోంది
- పెమ్మసాని చంద్రశేఖర్ గుండాయిజంని ప్రోత్సహిస్తున్నారు
-ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్
నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది
- రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తోంది
- నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు
- భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని సీఈఓ ని కోరాం
- ఈనాడు పత్రిక అడ్డగోలు రాతల పై ఫిర్యాదు చేశాం
- సీఎం జగన్ పై విషపు రాతల తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- ఈనాడు పత్రిక పై చర్యలు తీసుకోవాలని కోరాం
-నారాయణ మూర్తి, వైఎస్సార్‌సీపీ నేత
05:45 PM, మార్చి 21 2024
కాకినాడ:
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
- ఏటిమొగలోని 14,15 డివిజన్ లలో ప్రచారం
- ఏటిమొగ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహరం అందేలా కృషి చేస్తాను
- ఉప్పలంక నుండి ఉప్పాడ వరకు ఉన్న మత్స్యకార గ్రామాల్లో రిలియన్స్ సీఎస్‌ఆర్ నిధులు అందించే పట్టుపదలతో ఉన్నాను
- ఏటిమొగ లో రోడ్లు,డ్రైన్లు నిర్మించి మత్స్యకార ప్రాంతాలను అభివృద్ధి చేశాను
05:42 PM, మార్చి 21 2024
నెల్లూరు:
ప్రచారానికి వెళుతుంటే ప్రజల స్పందన అద్భుతంగా ఉంది: విజయసాయిరెడ్డి
- సిటీ నియోజకవర్గంలోని 47వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్
- ప్రచారంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, NDCC బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి..
- సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారు
- తమ ప్రభుత్వంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాం
- -మరోసారి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు
05:39 PM, మార్చి 21 2024
తిరుపతి:
- తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు
- నారా లోకేష్‌ను కలిసిన తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు
05:30 PM, మార్చి 21 2024
అనకాపల్లి..
మాడుగుల నియోజకవర్గంలో టీడీపీలో బయటపడే విభేదాలు
- మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న నిరసనలు
- ఎన్నారై పైల ప్రసా ద్‌కు సీటు వద్దంటూ కార్యకర్తలు ప్రదర్శన
- నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్ద అంటూ నిరసన
- టీడీపీ అధిష్టానం సీటుపై పున పరిశీలన చేయాలని డిమాండ్.
- లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక..
05:26 PM, మార్చి 21 2024
విజయవాడ:
ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ
- రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41-ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
- లోకేష్‌ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ
- సీఐడీ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసిన లోకేష్ తరపు న్యాయవాదులు
- ఏప్రిల్ 15కు తదుపరి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
04:40 PM, మార్చి 21 2024
టీడీపీకి టికెట్.. జనసేన కార్యకర్తల ఆందోళన..
- రామచంద్రపురం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తల ఆందోళన..
- జనసేన కార్యాలయానికి భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు..
- రామచంద్రపురం టికెట్ జనసేనకే ఇవ్వాలని డిమాండ్.
- .జనసేన నేత పోలిశెట్టి చంద్రశేఖర్ లేదా నాగబాబుకి ఇవ్వాలని కోరిన కార్యకర్తలు..
- నియోజకవర్గానికి సంబంధం లేని అమలాపురం స్థానికుడు వాసంశెట్టి సుభాష్‌కు ఇవ్వడంపై ఆగ్రహం.
04:10 PM, మార్చి 21 2024
విజయవాడ:
పవన్‌కు ఎదురు తిరిగిన పోతిన మహేష్
- విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్
- టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన వపన్
- పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్
- పవన్ కుదరదని చెప్పడంతో రెబల్‌గా బరిలోకి దిగాలని నిర్ణయం
- ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని పవన్‌కు స్పష్టం చేసిన పోతిన మహేష్
03:38 PM, మార్చి 21 2024
మా ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో టీడీపీ కూటమి : వైవీ సుబ్బారెడ్డి
- మోదీ వస్తే తప్ప ప్రచారం చేయలేని పరిస్థితిలో వాళ్లు ఉన్నారు
- వారాహిని ఎన్నిసార్లు దించుతారు... ఎన్నిసార్లు ఎత్తుతారు
03:36 PM, మార్చి 21 2024
మిగిలిన సీట్లపై చంద్రబాబు-పవన్ మల్లగుల్లాలు
- ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్‌లో బాబు, పవన్ చర్చలు
- చంద్రబాబును ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన పవన్
- ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా సాగిన చర్చ
- ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు,పవన్ చర్చలు
- 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్ధుల ఖరారు దిశగా కసరత్తు
- ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు
02:30 PM, మార్చి 21 2024
విజయవాడ
విజయవాడ వెస్ట్‌లో కొనసాగుతున్న పోతిన మహేష్ నిరసనలు
- పశ్చిమ టికెట్ మహేష్‌కి ఇవ్వాలని, పవన్ మనసు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- దేవుడి కి 108 కొబ్బరికాయలు కొట్టి మరి వేడుకొంటున్న జనసేన కార్యకర్తలు
- 7రోజులుగా నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు
02:15 PM, మార్చి 21 2024
మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి
- చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు
- వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారు
- జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డారు
- కేంద్ర, రాష్ట్ర నిధులను దోచేశారు
- బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారు
- మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది
- షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తోంది
- ఐఎంజీ స్కామ్‌కు ఆద్యుడు చంద్రబాబు
- రూ.లక్ష పెట్టుబడితో వచ్చిన కంపెనీకి 5 రోజుల్లోనే 400 ఎకరాలు కేటాయించిన ఘనుడు చంద్రబాబు
- రూ.వేల కోట్ల దోపిడీకి ఆ రోజుల్లోనే బాబు ప్లాన్ చేశారు
- అమరావతి స్కాం లాంటిదే ఐఎంజీ స్కాం
- ఇలాంటి అవినీతిపురుడికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి
02:12 PM, మార్చి 21 2024
స్కిల్ బిల్ పాండే చంద్రబాబు
- తాడేపల్లిలో మహాదోపిడీ పుస్తకావిష్కరణ
- చంద్రబాబు స్కాంల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చింది
- దోపిడీలు చేసిన గద్దలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయి
- రామోజీ జర్నలిజం ముసుగులో విషం చిమ్ముతున్నారు
- చంద్రబాబు కుహనా రాజకీయాలను నేను దగ్గరగా చూశా
- ‘‘స్కిల్ బిల్ పాండే’’ చంద్రబాబు
- స్కిల్ కార్పొరేషన్ లో భారీ స్కాం చేసి జైలు పాలయిన వ్యక్తి చంద్రబాబు
- తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారు
- జగన్ కనుసైగ చేస్తే జనం పవన్ ని తొక్కుకుంటూ తీసుకెళ్తారు
- చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ రాజ్యం వస్తుంది
-రచయిత, సీనియర్ జర్నలిస్టు విజయబాబు వ్యాఖ్యలు
02:00 PM, మార్చి 21 2024
ముగిసిన బాబు-పవన్ భేటీ
- ముగిసిన చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ
- హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో భేటీ అయిన పవన్ కల్యాణ్
- 75 నిమిషాల పాటు కొనసాగిన బాబు-పవన్ భేటీ
- ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ
- ఉమ్మడి హామీలు సహా ఏపీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ
01:45 PM, మార్చి 21 2024
వలంటీర్ల మీద ఫేక్ ప్రచారం.. స్పందించిన ఈసీ
- వలంటీర్ల మీద సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం
- వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే.. ఫొటోలు, వీడియోలు తీసి పంపాలంటూ ఏపీ ఎన్నికల సంఘం పేరిట ప్రచారం
- వాట్సాప్ చేయాలంటూ ఫేక్ సర్క్యూలర్
- ఎక్స్ వేదికగా ఖండించిన ఏపీ సీఈవో
- ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసిన ఏపీ సీఈవో
FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024
01:37 PM, మార్చి 21 2024
విజయవాడ వెస్ట్ టికెట్ మాదే: అడ్డూరి శ్రీరామ్
- విజయవాడ వెస్ట్ సీటుపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
- వెస్ట్ సీటుపై ఇప్పటికే చర్చలు ముగిశాయి.. బీజేపీకే టికెట్
- 2014 పొత్తు లెక్కల ప్రకారం బీజేపీకే టికెట్ వస్తుంది
- పొత్తులో త్యాగాలు సహజం, జనసేన కలిసి వస్తుందని భావిస్తున్నా
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వ్యాఖ్యలు
01:22 PM, మార్చి 21 2024
విజయవాడ వెస్ట్ జనసేనకు ఇవ్వాలి : పోతిన మహేష్
- పొత్తులో సీటు ఎవరైనా కోరుకోవచ్చు
- విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు రావడం న్యాయం
విజయవాడ వెస్ట్ జనసేన ఇంఛార్జి పోతిన మహేష్ వ్యాఖ్యలు
01:10 PM, మార్చి 21 2024
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
- టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ
- హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇరు నేతల సమావేశం
- ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చ
- 23,24 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన
- 27 నుంచి ఉత్తరాంధ్ర నుంచి వారాహితో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్
12:43 PM, మార్చి 21 2024
ఏపీ బీజేపీకి ఇంఛార్జిల నియామకం
- లోక్‌సభ ఎన్నికల వేళ మూడు రాష్ట్రాలకు ఇంఛార్జిల నియామకం
- ఏపీకి బీజేపీ ఎన్నికల ఇంఛార్జిగా అరుణ్ సింగ్, కో ఇంఛార్జిగా సిద్ధార్థ్ నాథ్ సింగ్
- ఏపీ బీజేపీలో ఇంకా తేలని సీట్ల పంచాయితీ
12:27 PM, మార్చి 21 2024
ఏపీలో నాడు డబుల్ ఇంజిన్ సర్కార్ దివాళ తీసింది: విజయసాయిరెడ్డి
- 2014లోనే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను చూశాం
- డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ దివాళ తీసింది
- బీజేపీ, టీడీపీ పక్షపాతిగా వ్యవహరించాయి
- టీడీపీ హయాంలో ఒక జిల్లా, ఒక కుటుంబం ఒక కులం మాత్రమే అభివృద్ధి చెందింది
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్
AP has already seen a “double-engine” sarkar between 2014-18 to realize that both the engines of BJP and TDP work in the opposite directions leading to policy paralysis, stagnation of rural economy and rampant corruption. Only, 1 district, 1 caste and 1 family prospers under TDP.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 21, 2024
12:02 PM, మార్చి 21 2024
విజయవాడ వెస్ట్ ఎవరికో?
- విజయవాడ వెస్ట్ సీటు కోసం బీజేపీ, జనసేన మధ్య పోటీ
- పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం
- గెలుపు కోసం బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు
- ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీటింగ్
- టికెట్ కోసం జనసేన వెస్ట్ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ పట్టు
- మహేష్ కే టికెట్ ఇవ్వాలని వారం రోజులుగా అనుచరుల నిరసనలు
- నిన్న పవన్ తో పోతిన మహేష్ భేటీ
- చర్చలు నడుస్తున్నాయి.. ఆందోళన వద్దన్న పవన్!
- పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం
- పవన్ తాజా హామీతో.. జనసేన - బీజేపీలో ఎవరికి టికెట్ ఫైనల్ అవుతుందోనని ఉత్కంఠ
11:38 AM, మార్చి 21 2024
నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో టికెట్ పంచాయితీ
డోన్ 1అభ్యర్థిగా ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించిన అదిష్ఠానం
టీడీపీ బీఫామ్ మాత్రం తనకే వస్తుందంటున్న స్థానిక నేత ధర్మవరం సుబ్బారెడ్డి
డోన్ అభ్యర్థిని నేనే అని చంద్రబాబు రెండుసార్లు బహిరంగంగా చెప్పారు: ధర్మవరం సుబ్బారెడ్డి
నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం : ధర్మవరం సుబ్బారెడ్డి
11:27 AM, మార్చి 21 2024
రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటన
- రాజోలు జనసేన అభ్యర్థిపై వీడిన సస్పెన్స్
- రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్
- బొంతు రాజేశ్వరరావు వర్గంలో తీవ్ర నిరాశ
- 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు
10:39 AM, మార్చి 21 2024
చంద్రబాబుపై బోడె ప్రసాద్ అసహనం
- పెనమలూరు టీడీపీలో కొనసాగుతున్న సీటు పంచాయితీ
- రకరకాల పేర్లతో సర్వే చేయిస్తున్న చంద్రబాబు
- చంద్రబాబు సర్వేల పై బోడే ప్రసాద్ అసహనం
- పార్టీకోసం ఎంతో కోల్పోయా : బోడే ప్రసాద్
- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: బోడే ప్రసాద్
- పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు: బోడే ప్రసాద్
- పని చేయటం రాని వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: బోడే ప్రసాద్
- పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ?: బోడే ప్రసాద్
- సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి: బోడే ప్రసాద్
- కానీ చంద్రబాబు నన్ను విస్మరించారు: బోడే ప్రసాద్
- పెనమలూరు టీడీపీ టికెట్ నాకే వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నాను: బోడే ప్రసాద్
- అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది: బోడే ప్రసాద్
- ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం: బోడే ప్రసాద్
10:11 AM, మార్చి 21 2024
ఇళ్లు తొలగించాలని లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్: దేవినేని అవినాష్ ఫైర్
- టీడీపీ హయాంలో లో ఏటువంటి అభివృధి జరగలేదు
- కలువ గట్ల వాసులకు 1.20లక్షల రూపాయలు తో మంచి నీటి సౌకర్యం కల్పించాం
- మౌలిక సుడుపాయాలు కల్పనే జగన్ ప్రభుత్వానికి ప్రథమ లక్ష్యం
- ప్రతి ఒక్క కుటుంబానికి అనేక పథకాలు అందించాం
- అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
- ఎన్నికల నేపథ్యంలో బూటకపు హామీలతో ప్రజల ముందు వస్తున్న టీడీపీ జనసేన నేతలు
- కలువ గట్ల ఇల్లు తీసేస్తారు అనీ గద్దె రామ్మోహన అసత్య ప్రచారం చేస్తున్నాడు
- జగన్ హయాంలో లో ఏ ఒక్కరి ఇల్లు తొలగించరని హామీ ఇస్తున్నా
- గతం లో కలువ గట్ల ప్రాంతం లో ఇళ్ళ తొలగింపు పై లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్
- ఎవరు మోసం చేస్తారు, అబద్ధాలు చెబుతారో ప్రజలకు తెలుసు
- కలువ గట్ల ఇళ్లు తీసేసి సింగపూర్ సంస్థ కు అప్పజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది
- హుందా తనం కోల్పోయి రెచ్చ గొట్టు వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
- శవ రాజకీయాలు, నీచ రాజకీయాలకు తెర లేపుతున్న టీడీపీ నేతలు
- నాయి బ్రాహ్మణులను తోకలు కట్ చేస్తా అనీ అన్నది చంద్రబాబు కాదా?
- బీసీ లు అంటే ఓటు బ్యాంక్ గా మాత్రమే చంద్రబాబు చూస్తారు
- 14సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పుడు చేయకుండా బీసీ డిక్లరేషన్ ఇప్పుడు చేస్తా అనడం హాస్యాస్పదం
- గతంలో జగన్ పథకాలను మెచ్చుకుని.. నేడు చంద్రబాబు మాయలకు లొంగిపోయిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ
దేవినేని అవినాష్ వ్యాఖ్యలు
10:56 AM, మార్చి 21 2024
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లపై వేటు
- కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వాలంటీర్లపై వేటు
- చిన్నపురంలో బందరు అభ్యర్థి పేర్ని కిట్టు తరఫున వలంటీర్ల ప్రచారం
- ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లు పాల్గొన్నట్లు గుర్తింపు
- విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో ఉత్తర్వులు
10:34 AM, మార్చి 21 2024
పి.గన్నవరం బీజేపీకే?
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మారుతున్న రాజకీయాలు
- పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థులను మార్చే ప్రయత్నం
- టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ ని మార్చి బిజెపి అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు...
- రేసులో మాజీ ప్రభుత్వ అధికారి టి ఎస్ ఎన్ మూర్తి
- ఇప్పటికే ప్రచారంలోకి దిగిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్
10:01 AM, మార్చి 21 2024
అనంతలో YSRCP ప్రచారం
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నికల ప్రచారం
- ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
- కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ
- ప్రజల నుంచి అపూర్వ స్పందన
09:32 AM, మార్చి 21 2024
చోడవరం టీడీపీలో విభేదాలు
- అనకాపల్లి చోడవరం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- కేఎస్ఎన్ రాజుకు సీటు ఇవ్వడంపై బత్తుల తాతయ్య బాబు, గూనూరు మల్లు నాయుడు ఆగ్రహం
- కాపులను, వెలమ సామాజిక వర్గాలను విస్మరించడంపై అసంతృప్తి
- రాజుకి వ్యతిరేకంగా వెలమ సంఘాల ప్రతినిధులు సమావేశం
- టీడీపీకి ఓటు వేయి రాదని తీర్మానం
- ఎన్నికల ప్రచారానికి దూరంగా తాతయ్య బాబు, మల్లు నాయుడు
- పార్టీ కార్యక్రమాలకు దూరంగా రాజుకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు
- అటువంటి వ్యక్తికి చోడవరం సీటు ఎలా ఇస్తారని ప్రశ్న
- కె ఎస్ ఎన్ రాజుకు సహకరించేది లేదంటున్న తాతయ్య బాబు మల్లు నాయుడు
- చంద్రబాబు తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్
09:14 AM, మార్చి 21 2024
గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్
- కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెస్ట్ నియోజకవర్గంలో సమావేశం
- విజయవాడ టౌన్ కాపులకు అడ్డా అని సంఘం నేతల ప్రకటన
- జనసేన తరఫున పోతిన మహేష్‌కుకి టికెట్ ఇవ్వాలని కాపు సంఘాల డిమాండ్
- బీజేపీకి టికెట్ కేటాయించడాన్ని తప్పు పట్టిన కాపు సంఘం నేతలు
- మహేష్ బీసీ అయినా ఆయన వెనుకే మేము ఉంటాం
- పశ్చిమ సీటు మహేష్ కే కేటాయించాలి
- పీక తెగిపోయే పొత్తు ఎందుకు?
- గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను మార్చారంటూ ఆవేదన
08:44 AM, మార్చి 21 2024
దుత్తలూరులో బరితెగించిన టీడీపీ నేతలు
- నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఆత్మీయ సమావేశం
- ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఆత్మీయ సమావేశాలు నిర్వహించకూడదంటూ అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతల దురుసు ప్రవర్తన
- పరుష పదజాలంతో దూషణలు.. దాడికి యత్నం.. అధికారితో తీవ్రవాగ్వాదం
- అనుమతులు లేవంటూ ఎంపీడీవోకి పోలీసులకు ఫిర్యాదు
- మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఐపీసీ 188 కింద నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
08:34 AM, మార్చి 21 2024
ఉల్లం'ఘను'లు
- యథేచ్ఛగా టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
- పలుచోట్ల నిబంధనలు పట్టించుకోని టీడీపీ నేతలు
- యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
- తిరుపతి జిల్లాలో కానిస్టేబుల్, చిత్తూరులో ఏఎన్‌ఎం సస్పెన్షన్
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
08:28 AM, మార్చి 21 2024
నేడు ఈసీ ముందుకు మూడు జిల్లాల ఎస్పీలు
- ఈసీ ముందు హాజరుకానున్న ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లా ఎస్పీలు
- ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల హింసాత్మక ఘటనలపై వివరణ కోరిన ఈసీ
- వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు
08:07 AM, మార్చి 21 2024
నాగబాబు చెంతకు తిరుపతి పంచాయితీ
- తిరుపతి జనసేన నేతలకు అధిష్టానం నుంచి పిలుపు
- స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు, కార్యకర్తలు
- టికెట్ శ్రీనివాసులుకే ఉంటుందని హామీ ఇచ్చిన పవన్
- పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకే కేటాయించిన టీడీపీ!
- అరణి శ్రీనివాసులుకు ఇవ్వొద్దంటూ కొంతకాలంగా డిమాండ్
- నేడు జనసేన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో భేటీ కానున్న తిరుపతి జనసేన నేతలు
- శ్రీనివాసులుకు ఇస్తే ప్రచారానికి దూరంగా ఉంటామని నాగబాబుకి స్పష్టం చేయాలని నిర్ణయం
- పవన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన శ్రీనివాసులు
07:38 AM, మార్చి 21 2024
బీజేపీలో కొలిక్కికరాని అభ్యర్థుల ఎంపిక
- ఢిల్లీలోనే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, సోమువీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ మధుకర్
- రాజమండ్రి ఎంపీ సీటు ఆశిస్తున్న సోమువీర్రాజు
- ఎమ్మెల్యేగా పోటీ చేయనని సోమువీర్రాజు స్పష్టీకరణ
- ఇప్పటికే రాజమండ్రి సీటు కోరుతున్న పురందేశ్వరి
07:18 AM, మార్చి 21 2024
వారాహి దుమ్ము దులుపుతున్న పవన్
- మరోసారి తెరపైకి వారాహి యాత్ర
- ఎన్నికల నేపథ్యంలో వారాహిపైనే
- ప్రచారం నిర్వహించాలని పవన్ నిర్ణయం
- అప్పట్లో వారాహి మీద రాష్ట్రవ్యాప్త యాత్ర అంటూ హడావిడి
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. వారాహిని పూర్తిగా పక్కనపడేసిన పవన్
- ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ బయటకు తీస్తున్న వైనం
- 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి పవన్ పర్యటన
- కాపులు ఓటేసి గెలిపిస్తారా? అనే అనుమానంతో.. పిఠాపురం పోటీ డైలమాలో పవన్
06:42 AM, మార్చి 21 2024
పిఠాపురంలో పవన్ పోటీ.. డౌటే
- పిఠాపురంలో మారుతున్న రాజకీయం
- బరిలోకి దిగకుండానే జనసేన అధినేత పవన్ కి పిఠాపురంలో ఎదురుగాలి
- పార్టీని వీడుతున్న కీలకకాపు నేతలు
- జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన పిఠాపురం మాజీ ఇన్ ఛార్జి మాకినీడు శేషు కుమారి
- సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శేషుకుమారి
- 2019 ఎన్నికలలో పిఠాపురం జనసేన అభ్యర్ధిగా పోటీచేసి 28 వేల ఓట్లు సాధించిన శేషుకుమారి
- పవన్ కి సిద్దాంతం లేదు... నిబద్దత లేదు: శేషు కుమారి
- జనసేనకి విధివిధానాలు లేవ్: శేషు కుమారి
- ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్‌సీపీలో చేరిక
- పవన్ తీరుతో విసుగెత్తి వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
- పవన్ వ్యవహారశైలి...నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు
- కాకినాడ ఎంపీగా పవన్ బరిలోకి దిగితే పిఠాపురంలో తానే టీడీపీ తరపున పోటీ చేస్తానంటూ మరోసారి బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ
- వరుసగా ఎదురుదెబ్బల నేపధ్యంలో పిఠాపురంలో పవన్ పోటీపై అనుమానమే!
- ఎంపీ సాకుగా చూపి పిఠాపురం పోటీ నుంచి తప్పుకుంటాడేమోననే అనుమానాలు
06:42 AM, మార్చి 21 2024
మైనారిటీలకు మంచి చేసిందెవరు?: YSRCP
- చంద్రబాబు అసత్య ప్రచారం
- ముస్లిం మైనారిటీల సంక్షేమం,అభివృద్ధికోసం తాను తెచ్చిన ప్రతీ పథకాన్ని సీఎం జగన్ రద్దు చేశారంటూ ఆరోపణ
- ఎవరి పాలనలో మైనారిటీలకు మంచి జరిగిందో తెలుసంటూ టీడీపీ ట్వీట్‌కు వైఎస్సార్‌సీపీ కౌంటర్
Everyone knows who did what to minorities! https://t.co/oOscpTDN1h pic.twitter.com/DLtTaoqtmA
— YSR Congress Party (@YSRCParty) March 20, 2024
06:30 AM, మార్చి 21 2024
కడప, అన్నమయ్య సిద్ధం
- ఈ నెల 27 నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర
- పోస్టర్లు ఆవిష్కరించిన ఎంపీ అవినాష్‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆంజాద్ భాషా, ఇతర ముఖ్య నేతలు
- కపడ, అన్నమయ్య జిల్లాలు సిద్ధమంటూ పోస్టర్లు
ఈ నెల 27న సీఎం @ysjagan ఇడుపులపాయ నుంచి "మేమంతా సిద్ధం" పేరుతో బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కడపలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు సమావేశమై బస్సుయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/Uky7UD4H4K
— YSR Congress Party (@YSRCParty) March 20, 2024
Comments
Please login to add a commentAdd a comment