Sharmila
-
షర్మిల.. జగనన్నను ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం: రోజా
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ నాయకురాల షర్మిలపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారని అన్నారు. ఈ కేసులో నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘షర్మిళ ప్రెస్మీట్లో మాట్లాడిన విషయాలు చూశాం. ఒకరిపై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారు. ఒకప్పుడు వేల రూపాయలకూ అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారు – ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తోంది షర్మిల.వివేకాగారి హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమన్నదీ, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమన్నదీ మీరే. ఇప్పుడు అధికారంలో మీ చంద్రబాబే ఉన్నా, ఏడుపు మాత్రం మీదే. నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు?. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా, షర్మిళగారు? దీని భాగంగానే మీరు నిర్దోషులపై బురదజల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోంది. చివరికి, మీ అన్నగారిని ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం. బాబు కక్ష రాజకీయాల్లో మీరు మరో కోణంగా మారిన విధానం ప్రజలు గమనిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. షర్మిళగారు ప్రెస్మీట్లో మాట్లాడిన విషయాలు చూశాం...ఒకరిపై అసూయ, ద్వేషంతో @ncbn చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి…— Roja Selvamani (@RojaSelvamaniRK) April 3, 2025 -
ఏమ్మా షర్మిలా... షర్మిలపై సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
షర్మిల వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
-
‘టీడీపీ, షర్మిల’.. కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం: రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. గ్రామగ్రామాన వైఎస్సార్సీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నంతకాలం తమ పార్టీకి ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఆదినారాయణ రెడ్డి లాంటి వారు వైఎస్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజకీయంగా దూరం కావాల్సి వచ్చింది. ఇలా చేసేవారందరికీ భవిష్యత్తులో ఇదే గతిపడుతుంది. విజయసాయి రెడ్డి వెళ్లడంతోనే వైఎస్ జగన్ విశ్వసనీయత దెబ్బతిన్నదని విమర్శిస్తున్న షర్మిలకు మా పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కనిపించలేదా?. సాయిరెడ్డి రాజీనామాతో ఇక వైఎస్సార్సీపీ పని అయిపోయిందని కూటమి నాయకులు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. వారందరికీ నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ద్వారా అత్యున్నత పదవులు అనుభవించి.. పార్టీ అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉండగా కొంతమంది వదిలేసిపోయారు. వారు స్వార్థంతో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్తున్నారు. వైఎస్ జగన్ కి ద్రోహం చేస్తున్నారని ప్రజలే అంటున్నారు. ఎందుకు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది పార్టీకి, వైఎస్ జగన్‌కు చేసిన ద్రోహంగానే ప్రజలు పరిగణిస్తున్నారు.టీడీపీ, షర్మిలకు కౌంటర్..టీడీపీ నాయకులు, షర్మిలకు, ఆదినారాయణరెడ్డికి అందరికీ చెబుతున్నా.. కొంతమంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్సీపీ పని అయిపోతుందా?. వైఎస్ జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకే కాదు.. మళ్లీ ఇంకో జన్మ ఎత్తయినా సరే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకునే కార్యకర్తలు నాతోపాటు ఊరూరా లక్షల్లో ఉన్నారు. వారే మా పార్టీకి బలం. వైఎస్ జగన్‌ని విమర్శించే వారంతా ఆయన పేరు వింటేనే పక్క తడుపుకునే వాళ్లు. వాళ్లకు జగన్ మీద మనసు నిండా కుట్ర, ఒళ్లంతా అసూయ ఉంది. జగన్ చనిపోలేదు.. కేవలం ఓడిపోయాడని ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్న మాటలే దీనికి సాక్ష్యం. అంత భయం ఉంది కాబట్టే ఇంతగా కూటమి నాయకులు శత్రువు గురించి భయపడుతున్నారు.ఉత్సాహంగా ప్రజల్లోకి త్వరలోనే..వైఎస్ జగన్‌కి మేమెప్పుడూ బలం కాదు.. ఆయనే మా అందరికీ బలం. పోరాటం, ధైర్యం, విశ్వసనీయత ఆయన బలం. ఆయన వ్యక్తిత్వం, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరే ఆయనకు శ్రీరామరక్ష. కార్యకర్తలే జగన్ బలం. కార్యకర్తలు ఉన్నంతకాలం ఆయన్ను ఏం చేయలేరు. త్వరలోనే ఆయన మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, వంటి వారు పార్టీ మారలేదా?. విశ్వసనీయత, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని అలాంటి చంద్రబాబే 2024 మళ్లీ సీఎం కాలేదా? అలాంటిది జగన్ సీఎం కాలేరా?. ఆయన మళ్లీ సీఎం కావడం తథ్యమని తెలుసు కాబట్టే శత్రువులంతా భయంతో వణికిపోతున్నారు.ఇద్దరు ముగ్గురు వదిలేసి వెళ్లినంత మాత్రాన జగన్ భయపడేవారే అయితే 2014లో 23 ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసినప్పుడే మా పార్టీ కనుమరుగయ్యేది. ఆరోజే ఆయన ఏమాత్రం అధైర్యపడలేదు. వైఎస్ జగన్‌ను కాదని వెళ్లిపోయిన ఈ ఆదినారాయణ రెడ్డి మళ్లీ గెలవలేదు. ఇప్పటికే 2019-24 మధ్య ఒకసారి విశ్రాంతి తీసుకున్న ఆదినారాయణరెడ్డి.. మరోసారి అందుకు సిద్ధంగా ఉండాలి. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్‌ను నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయి. వైఎస్సార్సీపీ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
‘ఇంగ్లీష్ అర్థం కాదా?’.. షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్
తిరుపతి, సాక్షి: ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. టీడీపీ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా షర్మిల చేసిన వితండ వాదనను మాజీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.షర్మిల చేస్తున్న రాజకీయాలు, వాదనలు, ఎత్తుగడలు, విమర్శలు.. అన్నింటిని లక్ష్యం ఒక్కటేనని, కానీ, ఎట్టి పరిస్థితుల్లో జరగదని అన్నారామె. అలాగే.. జగన్ రాజకీయ పతనం గురించి ఎవరు ఎంత కోరుకున్నా.. ప్రజలు మాత్రం ఆయనకు అండగా ఉంటారని రోజా చెప్పారు. ఈ క్రమంలో.. సెకి ఒప్పందం గురించి వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశం తాలుకా సారాంశాన్ని రోజా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.@realyssharmila గారూ.. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న గారు రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 29, 2024సెకితో ఒప్పందం గురించి టీడీపీ అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న రాద్ధాంతం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆ ఒప్పందం గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు. అంతేకాదు.. క్షమాపణలు చెప్పని తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా. -
బాబు అండ్ కో ఉచ్చులో షర్మిల.. వైఎస్ కుటుంబంపై కుట్ర
-
ఆస్తుల కోసం పరువు పోగొట్టుకుంటున్న షర్మిల!
ఆస్తుల కోసం ఇంతలా ఆరాటపడతారా? అది కూడా వందల కోట్లు పొందిన తరువాత మరింత కావాలని? అది కూడా సొదరుడు జైలుకెళ్లే ప్రమాదాన్ని పణంగా పెట్టిమరీ ఒక చెల్లి ఇలా ఆస్తి కోరుకుంటుందా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల తీరు అందరిని నివ్వెరపోయేలా చేస్తుంది. నిజంగానే ఆమెకు రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే అడగడం తప్పు కాదు కానీ.. అడగాల్సిన అవసరమే లేకుండా అన్న జగన్ స్పష్టంగా సరస్వతి పవర్ లో వాటాలు రాసివ్వడానికి సిద్దపడినా, నానా రచ్చ చేయడంతో షర్మిల సాధించేది ఏమిటో ఆమెకే తెలియాలి. పేదరికంలో ఉన్నవారు కూడా సోదరుడి ఆస్తిలో వాటా కోసం ఇలా గుక్కపెట్టి రోదించరేమో!ఏం తక్కువైందని షర్మిల ఇంతలా గొడవ చేస్తున్నారు. ప్రమాణాలు చేస్తానంటున్నారు? అయితే ఈ ప్రమాణాలకు, ప్రతిజ్ఞలకు విలువెంతో ఆమె చరిత్రే చెబుతుంది. తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుదిర్చి చేసిన పెళ్లినాటి ప్రమాణాలకే తిలోదకాలిచ్చిన విషయం షర్మిల మరచిపోయి ఉండవచ్చు.అయితే అందులో తప్పు ఒప్పుల గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ అలాంటి నిర్ణయాలు ఒకరి వ్యక్తిత్వాన్ని సూచిస్తూంటాయి అని మాత్రం చెప్పక తప్పదు. తెలంగాణ బిడ్డనంటూ అక్కడ రాజకీయాలు మొదలుపెట్టి.. పాలేరు నియోజకవర్గంలో మట్టిపై ప్రమాణం చేసి ఇక్కడే ఉంటానని, పోటీచేస్తానని కూడా షర్మిల ప్రతిజ్ఞ చేసిన విషయం ఇక్కడ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్నకు పోటీగా రాజకీయాలు చేయనని చెప్పిన ఆమె తెలుగుదేశం ట్రాప్‌లో పడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారు? సోదరుడు జగన్‌కు విరోధిగా ఎలా మారారు? ఒకప్పుడు తీవ్రంగా దూషించిన కాంగ్రెస్ పంచనే మళ్లీ ఎలా చేరారు? ఆ పార్టీని తానే ఉద్దరిస్తానని చెప్పుకుంటూ ఎలా తిరుగుతున్నారు? తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా రేవంత్‌ను ఉద్దేశించి షర్మిల అనుచితంగా దొంగ అని అన్ననోటితోనే ఆయన ముఖ్యమంత్రి కాగానే పొగిడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల ఆయనతో కార్యక్రమాలూ పెట్టించారు. తన సోదరుడు అంటే తనకు ప్రాణం అన్న స్వరంతోనే ఇప్పుడు విషనాగు అంటూ విషం చిమ్ముతున్నారు.మీడియా సమావేశం పెట్టి షర్మిల ఏడుపులకు దిగడం ఏమిటో, సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డిని పట్టుకుని జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని వ్యాఖ్యానించి అవమానించడం ఏమిటో! అంతేకాదు..ఆమె తల్లి ప్రస్తావన తెస్తూ, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా? చిన్నప్పుడే చంపేస్తే బాగుండు అని తల్లి విజయమ్మ అనడం లేదంటూ చివరికి సోదరుడి మరణాన్ని కూడా పరోక్షంగా కోరుకుంటున్న వైనం బహుశా ఏ సోదరి ఇంత నీచంగా మాట్లాడదేమో! ఇలాంటివి చూడడానికే బతికి ఉన్నానా అని విజయమ్మ బాధ పడుతోందని ఆమె చెప్పారు.నిజమే ఇంటిలో ఏ వివాదం వచ్చినా బాధపడేది అమ్మే. అయినా ఇప్పుడు షర్మిల మాటలు ఆమెకు ముల్లు మాదిరి గుచ్చుకుని ఉండాలి.అన్నంటే ప్రాణం అని చెప్పే వారేవరైనా ఇలా అరాచకంగా వ్యవహరిస్తారా? తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, సోదరుడు జగన్ కు ప్రత్యర్దులైన చంద్రబాబు నాయుడు కళ్లలోను, పగబట్టినట్లు దారుణమైన అసత్య కథనాలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతిల కళ్లలోను ఆనందం చూడడానికి అన్నట్లు షర్మిల వ్యవహరిస్తున్న తీరుతో ఎవరికి ఇలాంటి చెల్లి ఉండకూడదురా బాబు అనిపించదా! పోనీ ఇంత సానుభూతి నటిస్తున్న ఎల్లో మీడియా మరో వైపు జగన్‌వి అక్రమ ఆస్తులని ఎందుకు ప్రచారం చేస్తున్నాయి? ఇక్కడే వారి కుట్ర అర్ధం కావడం లేదా? ఏ కుటుంబంలో అయినా గొడవలు వచ్చినప్పుడు ఎక్కడో చోట రాజీ కుదురుతుంది. ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తారు.కానీ షర్మిల సరళి అంతా అన్ని దారులు మూసుకుపోవడానికే అన్నట్లుగా ఉంది. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా, జగన్ నుంచి 200 కోట్లు పొందిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, అదేదో డివిడెండ్ అని చెబితే ఎలా కుదురుతుంది. ఆయా సంస్థలలో వాటాలు ఉంటేనే కదా డివిడెండ్ వచ్చేది. అదేమీ లేకుండానే షర్మిలకు అంత భారీ మొత్తం ఎలా ముట్టింది? చట్టం ప్రకరం ఆ డబ్బు కూడా ఇవ్వనవసరం లేదన్న సంగతి ఆమెకు తెలియదా! అయినా జగన్ ఇచ్చారంటే అది ఆమె మీద ఉన్న అభిమానం కాదా? తన తండ్రి జీవించి ఉన్నప్పుడు మనుమరాళ్లు, మనుమడు సమానం అని అన్నారని, కనుక తనకు జగన్ ఆస్తిలో వాటా రావాలనే ఎలా డిమాండ్ చేస్తున్నారు? సాక్షి, భారతి సిమెంట్ కంపెనీలలో తనకు వాటా ఉందని దబాయిస్తున్న తీరు చూస్తే దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందనిపిస్తుంది.జగన్, భారతిలు ఈ కంపెనీల వృద్దికి విశేష కృషి చేశారు. వాటిని దెబ్బతీస్తే, జగన్ ఆర్థికంగా దెబ్బతింటారన్న కుట్ర ఉండి ఉండవచ్చు. రాజకీయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదతర ఎల్లో మీడియా సాక్షి మీడియానాశనం అవ్వాలని కోరుకుంటుంది. అందుకోసం షర్మిలను రెచ్చగొడుతుంటారు. అలాగే చంద్రబాబుకు సాక్షి తప్ప, మిగిలిన మీడియాలో అత్యధిక భాగం భజన చేసేవే. సాక్షి మీడియా లేకపోతే తన ప్రభుత్వంలో జరిగే అక్రమాలు ఏవీ బయటకు రావన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఈ నేపథ్యంలో షర్మిల వారికి ఒక ఆయుధంగా మారినట్లుగా ఉంది. షర్మిలను రాజకీయంగా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని వదలివేస్తారు. అంతెందుకు! ఈనాడు మీడియా ఇదే సరస్వతి పవర్‌పై ఎన్ని దారుణమైన కథనాలు రాస్తోంది. ఆ కంపెనీ వాటాలన్నీ తనకే రావాలని కోరుతున్న షర్మిల ఈనాడు స్టోరీలను కనీసం ఖండించడం లేదేమి? తన తండ్రి పేరును పనిగట్టుకుని లాయర్ పొన్నవోలు సధాకరరెడ్డి ఛార్జిషీట్లో చేర్పించారని పిచ్చి ఆరోపణ చేశారుఒక లాయర్ కోరితే కోర్టులు వైఎస్ పేరును ఛార్జ్షీటులో చేర్చుతాయా? లేక దర్యాప్తు సంస్థ కోరితే చేర్చుతాయా? అసలు అన్నపై పెట్టింది అక్రమ కేసులేనని ఆమె చెప్పారు కదా? ఆ కేసులను పెట్టించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యేనని పలుమార్లు షర్మిలే చెప్పారు కదా? అన్న వదలిన బాణం అంటూ పాదయాత్ర చేశారు కదా? జగన్ కోరకపోయినా ఈమె పాదయాత్ర చేశారన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు ఆమె చేస్తున్న కుట్రలు చూస్తుంటే జగన్ జైలులోనే ఉండాలని కోరుకున్నట్లుగా లేదా? జగన్ పై పెట్టిన కేసులు వంటి వాటిని మరెవరిపై పెట్టి ఉంటే, మూడు రోజులలో బెయిల్ వచ్చేదని ప్రముఖ న్యాయవాది ఎస్.రామచంద్రరావు అనేవారు. తన బెయిల్ రద్దు అవుతుందని తల్లి, చెల్లిపై కేసు పెడతారా అని అడగడంలోనే ఆమె విషపు ఆలోచనలు కనిపిస్తాయి. అంటే ఏమిటి దాని అర్థంఝ జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదు కాని, తనకు మాత్రం వందల కోట్ల ఆస్తి అప్పనంగా రావాలని కోరుకోవడమే కదా!నిజానికి వారిపై జగన్ కేసే పెట్టలేదు. కేవలం తన వైపు వాదనను ఎన్.సి.ఎల్.టి కి తెలియచేశారు. గతంలో తానే బైబై బాబు అని నినాదం ఇచ్చానని చెప్పారు. బాగానే ఉంది.కాని ఇప్పుడు జైజై బాబు అన్నట్లుగా ఎలా మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. చంద్రబాబు ఎలాగైతే డబుల్ టాక్ చేస్తారో, అచ్చం అలాగే షర్మిల కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు జగన్ సోదరిగా షర్మిలపై ఎలాంటి విమర్శలు చేయడానికి అయినా వైసీపీ నేతలు వెనుకాడేవారు. ఎప్పుడైతే షర్మిల హద్దులు దాటారో, అప్పటి నుంచి వైసీపీ వారు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదాహరణకు ఆమె వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ,దానికి స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్, ఆమె చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారా అని ప్రశ్నించారు.ఆ పరిస్థితి తెచ్చుకోవడం దురదృష్టకరం.ఇంకో విషయం చెప్పుకోవాలి. చట్టపరంగా షర్మిలకు ఈ ఆస్తులలో వాటా వచ్చే అవకాశం ఉంటే, ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండేవారు కదా? అలా కాకుండా తండ్రి ఏదో అన్నారని చెబుతూ దానికి జగన్ బైండింగ్ కావాలని అనడం చట్టరీత్యా ఎలా కుదురుతుంది? అసలు తండ్రి ఏమన్నారో, ఏమి అనలేదో ఎవరికి తెలుసు. నిజంగానే వైఎస్ కు అలాంటి ఆలోనలు ఉంటే ఆమెను ఏదో కంపెనీలో డైరెక్టర్ గా చేసేవారు కదా అన్న ప్రశ్నకు బదులు దొరకదు.ఇక్కడే షర్మిల వాదనలో బలహీనత కనిపిస్తుంది. షర్మిల తానేదో సోదరుడిని రచ్చ చేయగలిగానని సంతోషిస్తుండవచ్చు. చంద్రబాబో, ఎల్లో మీడియానో ఏదో సాయపడతారని ఆమె భ్రమపడుతుండవచ్చు.వాళ్ల లక్ష్యం జగనే తప్ప, షర్మిలకు ఉపయోగపడదామని కాదన్న సంగతి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ పరిణామాలవల్ల జగన్ కు కొద్దికాలం చికాకు కలగవచ్చు. కాని షర్మిల తిరిగి కోలుకోలేని విధంగా పూర్తిగా ప్రతిష్టను కోల్పోయారు. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బెయిల్ రద్దు కుట్రలో భాగమౌతారా?: విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈడీ జప్తు చేసిన, హైకోర్టు స్టే విధించిన సరస్వతి పవర్ షేర్లను ట్రాన్స్ఫర్ చేస్తే వైఎస్ జగన్‌కు ఇబ్బందులు ఎదురై బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిసినా షర్మిల రాజకీయ కుట్రలో భాగస్వామిగా మారి కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్ జగన్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీల న్యాయ సలహాను షర్మిలకు పంపించినా పెడచెవిన పెట్టారని చెప్పారు. ఏ చెల్లి అయినా ఇలా చేస్తుందా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయిన పదేళ్లకు.. షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తరువాత తాను వ్యాపారాల ద్వారా సంపాదించిన వాటిల్లో రూ.200 కోట్లు ఇచ్చిన అన్న పట్ల.. తన సొంత ఆస్తిలో 40 % ఇవ్వటానికి సిద్ధపడిన అన్నపై కనీస కృతజ్ఞత లేకపోగా నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే.. చంద్రబాబుతో కలసి బెయిల్ రద్దు చేసే కుట్రలు పన్నటమేని షర్మిలను విమర్శించారు. మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులను షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. అతి మంచితనం వల్లే జగన్ అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియాతో కలిసి నిర్వహించే మీడియా సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే జగన్‌పై దూషణలకే షర్మిల 95 శాతం ప్రాధాన్యమిస్తోందన్నారు. తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికే ఇదంతా అని షర్మిల చెప్పడం అబద్ధమని, చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే అన్నపై కుయుక్తులు పన్నుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై, వైవీ సుబ్బారెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు, ఆస్తుల విషయంలో జగన్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారానికి సంబంధించిందన్నారు. జగన్‌ను తిరిగి సీఎం కాకుండా చేయాలన్నదే షర్మిల ఆలోచనని, చంద్రబాబు ఇచ్చిన అజెండాతోనే ఆమె పనిచేస్తున్నారన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నా, కేంద్రంలో ఆ పార్టీకి ఎన్డీఏ వ్యతిరేకమైనా, ఆమె బాబుతో లాలూచీపడి జగన్‌పై కుట్రలు చేస్తోందన్నారు. షర్మిల మాటలను ప్రజలు నమ్మరుతల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించడం, జగన్‌ను నమ్మొదని చెప్పడం ఎంత ద్రోహమో, అన్యాయమో తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని షర్మిలకు సూచించారు. చంద్రబాబు మాటలనే ఆమె వల్లిస్తున్నారని, ఆయన అజెండాను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ కోటిన్నర కుటుంబాలకు, 80 లక్షల మంది అక్క చెల్మెమ్మలకు ఆసరా ఇచ్చారని, 45 లక్షల మందికి అమ్మ ఒడి అమలు చేశారని, అలాంటి సీఎం దేశంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇంత మందికి మేలు చేసిన జగన్ సొంత ఇంట్లో తల్లి, చెల్లికి అన్యాయం చేస్తారని కుట్రపూరితంగా చెబుతుంటే ఎవరు నమ్ముతారని షర్మిలను నిలదీశారు. మహిళల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచాలనే చంద్రబాబు దుర్మార్గ అజెండాకు షర్మిల సహకరిస్తోందన్నారు. తండ్రి మృతికి కారణమైన బాబుతో దోస్తీదివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు చేయడం దుర్మార్గమని సాయిరెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని షర్మిల గతంలో అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాజశేఖర్‌రెడ్డి మరో 15 రోజుల్లో దుర్మార్గమైన చావు చస్తాడని’ అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. వైఎస్ మరణానికి చంద్రబాబే కారణమని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం, పసుపు చీర కట్టుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం, చర్చలు జరపడం, కుట్రలు చేయడం... ఇంతకన్నా అమానవీయ ప్రవర్తన ఉంటుందా? అని ప్రశ్నించారు. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వాడుకుని జగన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన విషయం మరిచిపోయారా? అని షర్మిలను ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ అనుకూలంగా మాట్లాడుతున్నామని తనను, వైవీ సుబ్బారెడ్డిని షర్మిల విమర్శించడం సహేతుకం కాదన్నారు. శత్రువుకు మేలు చేసేందుకు సొంత అన్ననే వేటాడి, వెంటాడి కాటేసే చెల్మెమ్మ షర్మిల మినహా ఎక్కడా చూడలేదన్నారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభకు కారణమైన షర్మిల ఎల్లో మీడియా ముందు పెట్టే కన్నీటికి విలువ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్రలకు షర్మిలను వాడుకుంటున్నాడని విమర్శించారు.దేశంలో ఇలాంటి అన్న ఉంటాడా?వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్కు వచ్చిన ఆస్తులను కుమారుడు, కుమార్తెకు ఆయన జీవించి ఉన్నప్పుడే పంచారని తెలిపారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీసు ఆస్తులు, బైరైటీస్ మినరల్స్ స్టాక్స్, 25 మెగావాట్ల సరస్వతి పవర్, ఎస్ఆర్ఎస్ హైడ్రో, 51 ఎకరాల ఇడుపులపాయ భూములు, 79 ఎకరాల శెట్టిగుంట ఆస్తులు, 7.6 ఎకరాల పులివెందుల భూములు, బంజారాహిల్స్‌లోని 280 గజాలు, విజయవాడలోని రాజ్యువరాజ్ థియేటర్లు షర్మిలకు అప్పగించారని చెప్పారు. వైఎస్ జగన్ తనకు వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేశారన్నారు. జగన్ నెలకొల్పిన భారతీ సిమెంట్స్ కోసం తొలుత రూ.1,400 కోట్లు అప్పు చేశారని, ఆ తర్వాత తీర్చారని తెలిపారు. సాక్షి మీడియా మొదట్లో నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ నష్టాలు, అప్పులను షర్మిల ఎప్పుడూ పంచుకోలేదన్నారు. ఇవన్నీ జగన్ తన దక్షతతో అభివృద్ధి చేసి, లాభాల్లోకి నడిపించారని గుర్తు చేశారు. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టారని, తానే ఆ పేర్లు సూచించానని వెల్లడించారు. ఆమెకు ఏదైనా కంపెనీ నచ్చితే ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తుల పంపకాలు ఏ విధంగా జరిగాయో తెలుస్తుందన్నారు. అమ్మ తటస్థతపై సందేహాలు!తన అసంబద్ధ చర్యలు కుమారుడి బెయిల్ రద్దు పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిసినా ఆ కుట్రలకు వైఎస్ విజయమ్మ పరోక్షంగా సహకరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విజయమ్మ తటస్థతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.విజయమ్మను మొదటి నుంచి భావోద్వేగాలకు గురి చేసి షర్మిల ప్రభావితం చేస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టమైందని నెటిజన్లు, ప్రజలు చర్చించుకుంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా సరస్వతి షేర్ల ట్రాన్స్ఫర్ పత్రాలపై సంతకాలు చేయడం.. పలు సందర్భాల్లో షర్మిలకు అనుకూలంగా వ్యవహరించడం ఆమె తటస్థ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చినట్లు చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో విదేశాల నుంచి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియో సందేశాన్ని విడుదల చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను సమానంగా చూడాల్సిన అమ్మ ఒకవైపే మొగ్గడం సరికాదని పేర్కొంటున్నారు. నీ అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకున్నావు. తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావంటూ వైఎస్ జగన్ తన సోదరికి రాసిన లేఖను గుర్తు చేస్తున్నారు. ‘క్షమార్హం కాని అక్రమ చర్యల్లో అమ్మను భాగం చేశావు. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మను భావోద్వేగాలకు నువ్వు వాడుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. నీ సొంత వ్యూహాల్లో అమ్మను భాగం చేశావు. కోర్టు అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేస్తే నాకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిసీ బదలాయింపు చేశావు. అంతేకాక షేర్ సర్టిఫికెట్లు, షేర్ ట్రాన్స్ఫర్ ఫారాలు పోయినట్లుగా అమ్మ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించావు. అంతిమంగా అక్రమ పద్ధతిలో వాటాలను బదలాయింపు చేశావు. దీనివల్ల కుమారుడిగా నాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నీ చర్యల్లో భాగస్వామి అయింది. ఆమె తటస్థతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాక ఆమె ఒకవైపే ఉందన్న భావన కలిగిస్తోంది...’ అని తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్ లేఖ రాయటాన్ని నెటిజన్లు, ప్రజలు ఉదహరిస్తున్నారు.కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
అందుకే షర్మిలను ప్రజలు నమ్మలేదు: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్‌లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్వం వదులుకున్న వ్యక్తి అని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ అధిస్టానాన్ని సైతం వైఎస్ జగన్ ధిక్కరించారు. కుట్రతో తప్పుడు కేసులు పెట్టినా ఆయన వీరుడిలా పోరాడారన్నారు.‘‘వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ అనే వ్యక్తి ఒక యుద్ధ వీరుడు. అందుకే పార్టీ ఓడిపోయినా కోట్లాది మంది జగన్ వెంటే ఉన్నారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి జగన్ మాత్రమే. అందుకే ఆయనను ప్రజలు నమ్మారు. తెలంగాణ మెట్టినిల్లు అంటూ షర్మిల అక్కడ రాజకీయాలు చేశారు. మళ్లీ చాపచుట్టేసి తిరిగి ఏపీకి వచ్చారు.. చంద్రబాబుకు నేరుగా మద్దతు పలుకుతున్నారు. షర్మిలను తెలంగాణ, ఏపీ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబుతో కలసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు. మీ లాంటి చెల్లి వైఎస్ జగన్‌కు ఉండటం బాధగా ఉంది. వైఎస్ జగన్ చిన్న తప్పు కూడా చేయలేదు.’’ అని భూమన చెప్పారు.‘‘షర్మిల రాసిన లేఖలు టీడీపీ వెబ్సైట్లలో ఎలా వస్తున్నాయి?. చంద్రబాబుతో కలిసి అన్నపై కుట్ర చేయడం మీకు తగునా?. కేవలం రెండున్నర ఎకరాల చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు.. అందులో తమ్ముడి, సోదరీమణులకు ఎంత ఆస్తి పంచి ఇచ్చారు.’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. -
వైఎస్ షర్మిలపై అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం
-
షర్మిల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: గుడివాడ అమర్నాథ్
సాక్షి,విశాఖపట్నం: షర్మిల చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో శనివారం(అక్టోబర్ 26) అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై ఫైరయ్యారు. ‘మీరు చేసిన ఆరోపణలు ఖండించిన వాళ్లంతా మోచేతి నీళ్లు తాగినట్లు కనిపిస్తే అది మీ అమాయకత్వం. వైఎస్సార్సీపీ నాయకులకు అలాంటి లక్షణాలు లేవు. మేం నిజాలను ప్రజల ముందు పెడుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పండి. సొంత అన్నను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ చూస్తు ఊరుకోరు. వైవీ సుబ్బారెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దుకు కుట్రలు చేస్తున్నారు.ఎవరి పతనాన్ని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు ఈ స్థాయికి దిగజారారు. కాంగ్రెస్ పెట్టిన కేసులను తట్టుకుని నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన దమ్ము, ధైర్యం, హీరోయిజాన్ని ఇష్టపడే చాలా మంది ఆయనతో నడుస్తున్నారు’అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరదు కళ్యాణి -
షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్‌బాబు
సాక్షి,తాడేపల్లి: షర్మిలకు మానవత్వం ఉందా అని, వైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలుపుతారా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్ 26) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.‘రేవంత్‌రెడ్డి,చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారు.షర్మిల పాదయాత్రను వైఎస్సార్, వైఎస్జగన్ అభిమానులు కలిసి సక్సెస్ చేశారు. షర్మిల కోసం వైవీసుబ్బారెడ్డి ఎన్నోత్యాగాలు చేశారు’అని సుధాకర్‌బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు: పెద్దిరెడ్డి -
చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు: పెద్దిరెడ్డి
సాక్షి, కడప: రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. అలాగే, షర్మిలను ప్రత్యేకంగా ఏమీ పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సూచనలు తీసుకుని జిల్లా కమిటీలు వేస్తాం. పార్టీని ప్రక్షాళన చేసి సమర్ధులైన వ్యక్తులకు పదవులు ఇస్తాం. విద్యుత్ చార్జీలు విషయంలో ఈరోజు పచ్చ పత్రికలు మాట్లాడటం లేదు. రూ.6వేల కోట్ల భారం చంద్రబాబు ప్రజలపై వేస్తున్నారు. ఇప్పుడు జగన్ తప్పిదం వల్ల చార్జీలు పెరుగుతున్నాయి అంటూ రాస్తున్నారు. వరదల నుంచి అన్నీ జగన్ వల్లే అంటూ అభూత కల్పనలు సృష్టిస్తున్నారు.రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేశారు. ప్రజలు ఇప్పటికే ఎవరి పరిపాలన ఏమిటో గమనించారు. క్రాప్ ఇన్స్యూరెన్స్ ఇప్పుడు రైతులే కట్టుకోవాలి అంటున్నారు. వ్యవసాయం దండగ ఆన్న వ్యక్తి రైతులను ఏ విధంగా ఆదుకుంటాడు?. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకూ షేర్లు బదలాయింపు జరగదు. ఆమెకు అన్నీ తెలుసు.. ఆమె పద్ధతి జగన్‌ని దెబ్బతీయాలనే విధంగా ఉంది. మేము ప్రత్యేకంగా ఆమెను పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
KSR Comment: చంద్రబాబు చక్రబంధంలో చెల్లెమ్మ
-
ఆస్తి కోసం నమ్మించి మోసం.. చెల్లెమ్మతో చెల్లు
-
అన్న నాశనాన్ని కోరుకున్న చెల్లి..
-
KSR Live Show: షర్మిలకు ఆస్తిలో భాగం లేదు.. సాక్ష్యాలు ఇవే! హైకోర్టు న్యాయవాది సంచలన నిజాలు
-
చెల్లెమ్మా ఇంత పనిచేస్తావా..! జగనన్న మనసు నీకు తెలియదా ?.. చంద్రబాబు ఉచ్చులో పడి..!
-
షర్మిలకు రాసిన లేఖలో.. అన్నగా జగన్ తాపత్రయం
-
నిజంగా మీకు వాటా ఉంటే కంపెనీ లిస్టులో మీ పేర్లు ఎందుకు లేవు ?
-
MOUలో ఉన్నదేంటి?.. సంతకం పెట్టిన షర్మిల.. సాక్షి చేతిలో కోర్టు ఇచ్చిన డాక్యుమెంట్
-
అన్న జైలుకు పోయినా సరే.. నాకు ఆస్తి కావాలి అంతే!
-
ఆస్తి కోసం మరీ ఇంత దారుణమా?
-
టీడీపీ.. కుటుంబ తగాదాలపై ఎందుకంత ఆసక్తి?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? అని ప్రశ్నించింది వైఎస్సార్సీపీ. నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? వైయస్.జగన్మోహన్రెడ్డిగారికి, ఆయన సోదరి షర్మిలమ్మ రాసిన లేఖని టీడీపీ అఫీషియల్ X హ్యాండిల్లో బిగ్ బ్లాస్ట్ అంటూ పోస్ట్ చేసి ఈ గొడవని రెచ్చగొట్టి, నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?.దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదంటారా?. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఘోరమైన పాలనా వైఫల్యం నుంచి ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కాదా? దిగజారుతున్న లా అండ్ ఆర్డర్‌తో కడతేరుతున్న ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాల నుంచి, డయేరియా మరణాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ తప్పుడు రాజకీయాలు కాదా?రాజకీయంగా వైఎస్ జగన్ అంతాన్ని కోరుకుంటున్నవారితో తన వంతు పాత్ర పోషిస్తున్న ఘట్టం నేపథ్యంలో, ప్రజలకు అన్ని వాస్తవాలు తెలిసేలా వైఎస్ జగన్ తన సోదరికి రాసిన అన్ని లేఖలను, తన స్వార్జిత ఆస్తుల్లో ఇవ్వదలుచుకున్న ఆస్తుల వివరాలతో కూడిన MOUనుకూడా వెల్లడిస్తున్నాం. తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు కాకుండా వాస్తవాలకు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో విడుదల చేస్తున్నాం’ అని తెలిపింది. కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? వైయస్.జగన్మోహన్రెడ్డిగారికి, ఆయన సోదరి షర్మిలమ్మ రాసిన లేఖని @JaiTDP అఫీషియల్ X హ్యాండిల్ లో బిగ్ బ్లాస్ట్ అంటూ పోస్ట్ చేసి ఈ గొడవని రెచ్చగొట్టి, నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? దీన్ని… pic.twitter.com/1plILAl9cq— YSR Congress Party (@YSRCParty) October 25, 2024 -
ఈ 10 ప్రశ్నలకు.. సమాధానం చెప్పమ్మా చెల్లెమ్మా
-
కుట్ర, అవకాశవాదం ఒకవైపు.. ఇచ్చిన మాటకోసం నిలబడే నిజం మరోవైపు..
-
వైఎస్ఆర్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారు: పేర్నినాని
-
టీడీపీ కుట్రలో షర్మిల భాగమయ్యారు: వైవీ సుబ్బారెడ్డి
-
ఆ ఆస్తులన్నీ మా అన్న కష్టార్జితమే.. షర్మిల అన్ని తెలిసే సంతకం పెట్టింది.. Evidenceతో సహా నిజాలు బయటపెట్టిన సాక్షి
-
బెయిల్ రద్దు కుట్రలో భాగంగా బాబుతో కలిసి అన్నకే వెన్నుపోటు
-
సరస్వతీ పవర్ వాటాల బదిలీపై షర్మిల వాదన అసంబద్ధం
సాక్షి, అమరావతి: సరస్వతీ పవర్ వాటాల బదిలీ విషయంలో షర్మిల చేస్తున్న అసంబద్ధ వాదనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సరస్వతీ పవర్ వాటాలను జప్తు చేయలేదన్న షర్మిల వాదనతో న్యాయ నిపుణులు విబేధిస్తున్నారు. ఈడీ.. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులన్నింటినీ జప్తు చేసిందని, చరాస్తుల్లోకి షేర్లు కూడా వస్తాయని వారు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీల చట్టం స్పష్టంగా చెబుతోందని పేర్కొంటున్నారు. కంపెనీల చట్టం సెక్షన్ 44 ప్రకారం షేర్లు, డిబెంచర్లను చరాస్తులుగా పరిగణిస్తారు. అందువల్ల సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినందున, ఆ కంపెనీ షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. కాబట్టి హైకోర్టు జారీ చేసిన యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు సరస్వతీ పవర్ షేర్లకు కూడా వర్తిస్తాయి. షేర్లతో సహా జప్తులో ఉన్న ఏ ఆస్తులను కూడా ఇతరులకు విక్రయించడం గానీ, బదలాయించడం గానీ చేయడానికి వీల్లేదు. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుడులకు సంబంధించి నమోదైన కేసులో ఈడీ పలు ఆస్తులను జప్తు చేసింది. ఇందులో జగన్మోహన్రెడ్డి, ఆయన గ్రూపునకు చెందిన పలు కంపెనీలున్నాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో సరస్వతీ పవర్‌కు చెందిన స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్మోహన్రెడ్డి, సరస్వతీ పవర్లతో సహా పలు గ్రూపు కంపెనీలు మనీలాండరింగ్ నిరోధక అప్పిలెట్ ట్రిబ్యునల్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన అప్పిలెట్ ట్రిబ్యునల్ 2019 జూలై 26న తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో సరస్వతీ పవర్ స్థిర చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. సరస్వతి పవర్ స్థిర, చరాస్తుల జప్తును తప్పుపట్టింది. ఆ జప్తు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2019 అక్టోబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు అమలుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని హైకోర్టును కోరింది. ఈడీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈడీ దాఖలు చేసిన అప్పీల్ తేలేంత వరకు ఆ రోజు నాటికి ఉన్న స్థితిని అన్ని రకాలుగా యథాతథంగా కొనసాగించాలంటూ 2019 డిసెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ఈ రోజుకీ అమల్లో ఉన్నాయి. ఈ యథాతథస్థితి ఉత్తర్వుల గురించే జగన్మోహన్రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగా సరస్వతీ పవర్లో వాటాలను బదలాయించడం అంటే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నది న్యాయ నిపుణుల మాట. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు సలహా రూపంలో జగన్మోహన్రెడ్డికి స్పష్టంగా చెప్పారు. ఈ సలహాను జగన్ తన చెల్లి షర్మిల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ న్యాయ సలహాను ఆమె ముందుంచారు.జగన్‌ను ఉద్దేశపూర్వకంగా సమస్యల్లోకి నెట్టిన షర్మిల...కోర్టులో ఉన్న కేసులన్నీ తేలిన తరువాత వాటాలు బదలాయించుకోవచ్చునని షర్మిలకు జగన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వాటాలు బదిలీ చేస్తే తనకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని కూడా వివరించారు. అయితే చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్న షర్మిల తన అన్న జగన్ మాటలను పెడచెవిన పెట్టారు. ఆయన్ను న్యాయపరమైన సమస్యల్లోకి నెట్టేందుకే నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే సరస్వతీ పవర్లో ఉన్న వాటాలను అక్రమ పద్ధతిలో బదలాయించేశారు. అన్యాయమైన పని చేసిన షర్మిల మరోవైపు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ఈడీ సరస్వతీ పవర్‌కు చెందిన భూములను మాత్రమే జప్తు చేసిందే కానీ, షేర్లను జప్తు చేయాలంటూ ఓ వాదనను తీసుకొచ్చారు. అందుకే వాటాలను బదలాయించినట్లు ఆమె చెబుతున్నారు. న్యాయ నిపుణులు మాత్రం ఆమె వాదన చట్ట విరుద్ధంగా ఉందని తేల్చి చెబుతున్నారు. షర్మిల దురుద్దేశపూర్వకంగా సృష్టించిన న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడేందుకే జగన్మోహన్రెడ్డి న్యాయపోరాటం ప్రారంభించారు. షేర్ల బదిలీల విషయంలో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసి, తన వాటాలను తనకు వెనక్కి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.సరస్వతీ పవర్ షేర్లు జప్తులో లేవని ఎలా చెబుతారు..?హైకోర్టు న్యాయవాది మరక్కగారి బాలకృష్ణసరస్వతీ పవర్ షేర్ల బదిలీ విషయంలో షర్మిల వాదన చట్ట విరుద్ధంగా ఉంది. ఎవరు ఇస్తున్నారో గానీ ఆమెకు సరైన న్యాయ సలహాలు ఇవ్వడం లేదు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 44ను చదివితే షేర్లు అనేవి చరాస్తుల కిందకు వస్తాయి. ఇందుకు పెద్దగా లా చదువుకుని ఉండాల్సిన అవసరం కూడా లేదు. స్థిర, చరాస్తులను జప్తు చేసినప్పుడు, చరాస్తుల కిందకు వచ్చే షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. ఇందులో చర్చకు, వాదనకు ఆస్కారం ఏముంది? మనీలాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు సరస్వతి పవర్ షేర్లకు వర్తిస్తాయి. జప్తు ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునని ఏ చట్టం చెబుతుందో షర్మిలకే తెలియాలి. -
చట్టాన్ని గౌరవించటం తప్పా?
కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులున్నాయి. ఏడాదిన్నర జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చారాయన. పైపెచ్చు ఆ కంపెనీల ఆస్తులన్నీ ఈడీ, సీబీఐ జప్తులో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ ఉత్తర్వులూ ఉన్నాయి. మరి ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? దీనికి సమాధానమివ్వటానికి న్యాయనిపుణులే అక్కర్లేదు. కాస్త చదువు, ఇంకాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా చాలు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే దాని ప్రభావం బెయిలుపైనా పడే ప్రమాదముంటుంది! ఇదిగో... సరస్వతీ పవర్ షేర్ల బదిలీ వ్యవహారంలో ఇదే జరిగింది. వైఎస్ జగన్‌కు తెలియకుండా ఆయన పేరిట ఉన్న షేర్లను తల్లి పేరిట సోదరి షర్మిలే దగ్గరుండి మార్పించేశారు. షేరు హోల్డరైన జగన్‌కు కనీసం సమాచారమూ ఇవ్వలేదు. కోర్టు స్టే ఉత్తర్వులున్నా... కనీసం కోర్టుకూ చెప్పలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మాదిరి తల్లి పేరిట రాసిన అన్ రిజిస్టర్డ్ గిఫ్ట్‌డీడ్‌ను ఉపయోగించుకుని షేర్లను తల్లి పేర మార్పించేశారామె. దీంతో కంపెనీ యాజమాన్యం పూర్తిగా తల్లి చేతికి వచ్చినట్లవుతుంది. మరి ఇది కోర్టు ఉల్లంఘనే కదా? జగన్‌కు తెలియకుండా జరిగినా... కోర్టు దృష్టిలో తప్పే కదా? మరి ఈ తప్పును కోర్టు దృష్టికి తేవాల్సిన అవసరం జగన్‌కు లేదా? ఈ లావాదేవీని కోర్టు దృష్టికి తెచ్చి... రద్దు చేయమంటూ కోరటం తప్పెలా అవుతుంది? తనకు తెలియకుండా తన పేరిట చెల్లెలు చేసిన తప్పును సరిదిద్దడానికి ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీని) ఆశ్రయించటాన్ని చంద్రబాబు కూటమి ఎందుకంత ఘోరమైన తప్పిదం మాదిరి ప్రచారం చేస్తోంది? దాన్ని తల్లిపై కేసు వేసినట్లుగా ఎందుకు చూడాలి? న్యాయపరంగా రక్షించుకోవటానికి జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లటం తప్పెలా అవుతుంది? ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కాబట్టే..సొంత అన్న న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా షర్మిల ఇలా చేయటానికి అసలు కారణం... చంద్రబాబు నాయుడు. బాబు పన్నిన లోతైన కుట్రలో షర్మిల భాగం. అంతా కలిసే జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అందుకే రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. వీటిని పసిగట్టి జగన్ వెంటనే కోర్టును ఆశ్రయించటంతో... తమ పన్నాగం బెడిసికొట్టిందని గ్రహించి దీనికి ‘తల్లిపై వేసిన కేసు’గా కలర్ ఇస్తున్నారు. ఆస్తుల కోసం జగన్ తన కుటుంబీకులతోనే పోరాడుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు సరస్వతీ పవర్లో 100 శాతాన్ని షర్మిలకు ఇచ్చేస్తానని చెప్పాక... అప్పటికే 49 శాతం తల్లిపేరిట మార్పించి... తన మాటపై మరింత భరోసా కలిగేలా మిగిలిన 51 శాతాన్ని కూడా గిఫ్ట్‌గా ఇస్తానని రాసేశారంటే ఏమిటర్థం? ఆ ఆస్తిని పూర్తిగా వదులుకున్నట్లేగా? కాకపోతే కేసులున్నాయి కనక... అవన్నీ పూర్తిగా తొలగిపోయాకే ఆ షేర్లను చట్టబద్ధంగా షర్మిల పేరిట బదిలీ చేస్తానన్నారు.ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కనక తాను చేయనన్నారు. అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు తనవద్దే ఉంచుకున్నారు. కానీ షేర్ సర్టిఫికెట్లు పోయాయనే అబద్ధాలతో తల్లి ద్వారా షర్మిల అలాంటి చట్టవిరుద్ధమైన పని చేసేయటంతో... విధిలేక కోర్టును ఆశ్రయించారు. ఇదీ నిజం. ఇదే నిజం. -
జగన్‌ను దెబ్బతీస్తున్న అతి మంచితనం.. అతి నిజాయితీ..
అతి మంచితనం.. అత్యంత నిజాయితీ!! వైఎస్ జగన్‌ను పలుసార్లు దెబ్బ తీస్తున్నవి ఇవే!! నెటిజన్లు, రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు మరోసారి ఇదే చర్చ జోరుగా మొదలైంది!! తన దక్షత, ఆసక్తి, చొరవతో రాణించి స్వయంకృషితో నిర్మించుకున్న వ్యాపారాల్లో 40 శాతం ఆస్తులను 25 ఏళ్ల క్రితమే వివాహమైన సోదరికి ఇవ్వటానికి సిద్ధపడ్డారంటే అది జగన్ అతి మంచితనం కాదా? ఈ రోజుల్లో ఇలాంటి అన్న ఎంత మందికి ఉంటారు? తన నిజాయితీ చాటుకునేందుకు ఎంవోయూ చేసి మరీ సొంత చెల్లెలి చేతిలోనే ఎదురు దాడికి గురవుతుండటం అతి మంచితనం వల్ల కాదా? చేసిన పనికి కృతజ్ఞత చూపకపోగా రివర్స్‌లో కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసే కుట్రలో భాగస్వామిగా మారిపోయిన చెల్లెమ్మను ఏమనుకోవాలి? అతి మంచితనమే ఆయన్ను ఇబ్బందులకు గురి చేస్తోంది. వైఎస్సార్ మరణించి పదేళ్లు అవుతోంది. ఆయన ఉండగానే కుటుంబ ఆస్తులను పంచి ఇచ్చారు. అయినప్పటికీ చెల్లిపై ప్రేమ, ఆప్యాయతతో సొంత ఆస్తుల్లో వాటా ఇచ్చేందుకు సిద్ధపడటం అతి మంచితనానికి పరాకాష్ట కాదా? అతి నిజాయితీగా ఉండటం, రాజకీయాల్లో అబద్ధాలకు ఆమడ దూరంలో ఉండటం వల్లే 2014, 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యారని, తరచూ సమస్యల్లో చిక్కుకుంటున్నారనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. – సాక్షి, అమరావతిచెల్లెలిపై ప్రేమ, అభిమానంతోనేగా..? షర్మిల వివాహం జరిగిన 20 ఏళ్ల తర్వాత, తన తండ్రి వైఎస్సార్ మరణించిన 10 ఏళ్ల తర్వాత 2019 ఆగస్టు 31న.... జగన్ తన స్వార్జితమైన ఆస్తులు ఎందుకు ఇవ్వాలనుకున్నారు? చెల్లెలిపై ఎంతో ప్రేమ, అభిమానం గుండెల్లో ఉండబట్టే కదా? ఏ సోదరుడైనా చెల్లెలికి ఇన్ని ఆస్తులు ఇవ్వడానికి సిద్ధపడతారా? ఎంఓయూపై షర్మిల కూడా సంతకం చేశారుగా? చంద్రబాబుతో అంటకాగటమే అభిమతంలా ప్రవరిస్తున్న షర్మిల మాటలకు– చేతలకు పొంతన ఉంటే ఒట్టు!. జగన్ తనకు భవిష్యత్తులో ఇస్తానంటూ ఎంఓయూలో పేర్కొన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులని, వైఎస్సార్ జీవించి ఉన్నప్పుడే వాటిలో తనకు వాటా ఇవ్వాలని కుటుంబ మిత్రులతో చెప్పారని అంటున్న షర్మిలకు అవన్నీ జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులని తెలియదా? అవన్నీ వైఎస్ జగన్ సొంతంగా ఆర్జించిన ఆస్తులని, వాటిని కేవలం చెల్లెలిపై ఉన్న ప్రేమాభిమానాలతో భవిష్యత్తులో ఆమెకు బదలాయిస్తానని ఎంఓయూలో స్పష్టంగా పేర్కొన్నారు కదా!. ఆ ఎంఓయూపై జగన్‌తో పాటు షర్మిల కూడా సంతకాలు చేశారు కదా? మరి అవన్నీ కుటుంబ ఆస్తులయితే ఆ విషయాన్ని ఎందుకు ఎంఓయూలో పేర్కొనలేదు? దానికి షర్మిల ఎందుకు అడ్డుచెప్పలేదు? పోనీ వైఎస్సార్ జీవించి ఉన్నపుడే అలా భావించి ఉంటే... జగన్‌కు సొంత కంపెనీల్లో షర్మిల కుటుంబీకులు ఒక్కరిని కూడా ఎందుకు వాటాదారుగానో, డైరెక్టరుగానో పెట్టలేదు? వేరే పవర్ కంపెనీల్లో మాత్రమే షర్మిలను ఎందుకు వాటాదారుగా పెట్టారు? ఎందుకంటే జగన్ సొంత ఆస్తులతో షర్మిలకు సంబంధం ఉండకూడదని వైఎస్సార్ భావించారు కనక. అయినా సరే... ఆయన మరణించి పదేళ్లు గడిచిపోయాక కూడా... చెల్లెలిపై ఉన్న ప్రేమాభిమానాలతో తన నాలుగు ఆస్తుల్లో 40 శాతం వాటా ఇవ్వాలని జగన్ సంకల్పించారు. వైఎస్సార్ ఉండగానే ఆస్తుల పంపిణీ జరగలేదా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బతికుండగానే వారసత్వపు ఆస్తుల పంపిణీ జరిగిపోయింది. 2004, 2009 సంవత్సరాలలో వైఎస్సార్ ఎన్నికల అఫిడవిట్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది. 2004లో వైఎస్సార్ పేరుతో ఉన్న ఆస్తులు ఆ తర్వాత కనిపించవు. అంటే.. వాటిని పిల్లలిద్దరికీ పంచేసినట్లు అర్ధం కావడం లేదూ? అపుడు సాక్షి, భారతి సిమెంట్స్ లేవా? వైఎస్సార్ బతికి ఉన్నపుడే సాక్షి ఉంది, భారతి సిమెంట్స్ ఉంది. వైఎస్సార్ వాటిని ఎందుకు పంచలేదు? అంటే అవి తను సంపాదించిన ఆస్తులు కాదు కాబట్టి. అవి జగన్‌వి కాబట్టి.. జగన్ కంపెనీలపై హక్కు ఎలా వస్తుంది? సాక్షి, భారతి సిమెంట్స్ ఇంకా జగన్ ప్రారంభించిన కంపెనీల్లో షర్మిల ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు, ఆ కంపెనీలు నడిచేందుకు ఎలాంటి సాయమూ చేయలేదు. రిస్క్ తీసుకునే విషయంలో గ్యారెంటర్‌గా సంతకం కూడా చేయలేదు. కంపెనీల కోసం తెచ్చిన రుణాలపై షర్మిలకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ కంపెనీల నష్టాలను షర్మిల పంచుకోలేదు. ఎలాంటి కేసులనూ ఎదుర్కోలేదు. మరి వాటిపై హక్కు ఎలా వస్తుంది? ఇంతకన్నా ఆధారాలు కావాలా? భారతి సిమెంట్స్ పేరులోనే జగన్ సతీమణి భారతి పేరు ఉంది. జగతి పబ్లికేషన్స్ అనేది జగన్, భారతి పేర్లతో కలిపి పెట్టిందనేది అందరకూ తెలుసు. అవి జగన్‌వి అనేందుకు ఇంతకన్నా వేరే ఆధారాలెందుకు? రూ. 200 కోట్లు ఇవ్వలేదా? తన స్వార్జితమైన ఆస్తులివ్వడానికి ముందే పదేళ్ల వ్యవధిలో షర్మిలకు జగన్ రూ.200 కోట్లు ఇచ్చారు. ఆ విషయంలోనూ షర్మిలకు ఎలాంటి కృతజ్ఞతా లేదు. డివిడెండ్ ఎలా వస్తుంది? జగన్ కంపెనీలలో షర్మిల వాటాదారు కాదు. ఏ కంపెనీలలోనూ ఆమెకు ఒక్క శాతం కూడా షేరు లేదు. మరి రూ.200 కోట్ల డివిడెండ్ ఎలా వస్తుంది? అన్న చేసిన సాయాన్ని ఇలా మార్చి చెప్పడం వంచన కాక మరేమిటి?ఇలాంటి అన్న ఎక్కడన్నా ఉన్నారా? పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల తర్వాత, వారసత్వపు ఆస్తులు పంచేసిన తండ్రి చనిపోయిన 10ఏళ్ల తర్వాత కూడా బాధ్యతగా చెల్లెలికి ఆస్తులిస్తానని ఎంఓయూ చేసే అన్న ఎవరైనా ఉంటారా? కోర్టు కేసుల తర్వాత ఆ ఆస్తులిస్తానని స్వయంగా సంతకం చేసి ఇచ్చే అన్నను ఎవరన్నా చూశారా? ఆ విషయంలోనూ షర్మిలకు కృతజ్ఞత లేదు. అందరితో చెప్పి జగన్‌తో చెప్పలేదెందుకు? వైఎస్ జగన్ సొంతంగా నిర్మించుకున్న వ్యాపారాలు కూడా కుటుంబ ఆస్తులని, వాటిలో తన పిల్లలిద్దరితో సహా మనవలు నలుగురికీ సమాన వాటా ఇవ్వాలని వైఎస్సార్ సంకల్పించారని, ఇదే విషయాన్ని బంధువులతో చెప్పారని అంటున్న షర్మిల... ఆ విషయాన్ని జగన్‌తో వైఎస్సార్ ఎందుకు చెప్పలేదనే ప్రశ్నకు సమాధానమివ్వగలరా? బంధుమిత్రులతో చెప్పిన వైఎస్సార్... ఆ వ్యాపారాలను నడిపిస్తున్న సొంత కుమారుడితో చెప్పకుండా ఉంటారా? ఒకవేళ చెప్పి ఉంటే... ఆయన మాటను విస్మరించటమో, కాదనటమో జగన్ చేసేవారా? తండ్రి మరణించాక... ఆ విషాదాన్ని తట్టుకోలేక అసువులు బాసిన పలువురు అభిమానులను కలవటానికి ఓదార్పు యాత్ర చేస్తానని పావురాలగుట్ట సాక్షిగా ప్రమాణం చేశారు జగన్. ఆ మాటను నిలబెట్టుకోవటానికి కాంగ్రెస్ అధిష్టానంతో తలపడటమే కాదు... కేసులు ఎదుర్కొన్నారు. జైలుకూ వెళ్లారు. ఆ స్థాయి వ్యక్తికి ఊహల్లో కూడా ఎదురుకానన్ని కష్టాలను భరించారు. అదీ... తండ్రి పట్ల, ప్రజల పట్ల జగన్‌కు ఉన్న కమిట్మెంట్. అలాంటి జగన్‌పై షర్మిల చేస్తున్న ఈ విమర్శలకు అర్థం ఉందా అసలు? మాట కోసం ఎంత దూరానికైనా వెళ్లే జగన్... మాట తప్పారని అనటానికి అసలు నోరెలా వస్తుంది!!. మరి షర్మిల కూడబెట్టిన ఆస్తుల మాటేమిటి? పెళ్లయిన 25 ఏళ్ల వైవాహిక జీవితంలో షర్మిల కూడా కొన్ని వారసత్వ ఆస్తులను పొందారు. కొన్ని సొంతంగా సంపాదించారు. కొన్ని కంపెనీలమీద రుణాలు తీసుకుని ఆస్తులు కూడబెట్టారు. వ్యాపారాలు చేశారు. వాటిపై ఏనాడైనా జగన్ హక్కులు కోరారా? ఆమె సంపాదించుకున్న ఆస్తులు జగన్‌కు ఎలా వస్తాయి? మరి షర్మిలకు కూడా అది వర్తిస్తుంది కదా? నాలుగేళ్లుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. జగన్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఎందుకంటే రకరకాల కారణాలతో షర్మిల నాలుగేళ్లుగా జగన్‌ను ఇబ్బందిపెడుతున్నారు. ఆయన ప్రత్యర్థులందరితోను చేతులు కలిపారు. అసత్య ఆరోపణలు చేశారు. అయినా సరే... ఆయన క్షమించారు, ఒక్కోసారి రాజకీయంగా విమర్శల్ని తిప్పికొట్టారు తప్ప... ఇంత దారుణంగా చేస్తున్న నీకు ఎంఓయూ ప్రకారం ఆస్తులెందుకు పంచాలని ఒక్కసారి కూడా అడగలేదు. ఎంఓయూ ఊసే బయటపెట్టలేదు. కృతజ్ఞత లేకపోగా.. కుట్రలా..? ‘‘నేనింత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా నువ్వు కనీసం కృతజ్ఞత చూపించటం లేదు. ఆఖరికి నా క్షేమాన్ని కాంక్షించకుండా నువ్వు వరసగా చేస్తున్న పనులు నన్ను తీవ్రంగా బాధపెట్టాయి. రాజకీయంగా వ్యతిరేకించటమే కాదు. బహిరంగంగా నువ్వు చేసిన దారుణమైన అసత్యారోపణలు నా వ్యక్తిగత ప్రతిష్ఠను కూడా దెబ్బతీశాయి. అయినా అవన్నీ నీ విజ్ఞతకే వదిలేశా. నేనైతే చాలా బాధపడ్డా’’ అని ఆమెకు రాసిన తొలి లేఖలో పేర్కొన్నారు. కానీ తనను న్యాయపరంగా ఇబ్బంది పెట్టడానికి కుట్రపూరితంగా ఆస్తులు బదలాయించడాన్నే ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఇది ఎంఓయూకు విరుద్ధం కనక.. ఎంఓయూను ఆమె గౌరవించటం లేదు కనక... ఇంకా తానెందుకు ఎంఓయూకు కట్టుబడి ఉండాలని ప్రశ్నించారు. అంతేకాదు! అప్పటికీ ఒక చివరి అవకాశమిస్తూ... చెల్లెలు కనక.. మనసు మార్చుకుని, ప్రవర్తన మార్చుకుంటే భవిష్యత్తులో తన ఎంఓయూను అమలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తానని చెప్పారు. అదీ జగన్ వ్యక్తిత్వం. -
అవి జగన్ సొంత సంస్థలు
సాక్షి, అమరావతి: భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత సంస్థలని.. వాటిల్లో షర్మిల వాటాదారు కాదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చిచెప్పారు. సోదరి షర్మిలపై ప్రేమ, ఆప్యాయతతో తన స్వార్జితమైన నాలుగు సంస్థల్లో 40 శాతం వాటాను ఇస్తూ జగన్ ఒప్పందం రాసిచ్చారని.. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), కోర్టు అనుమతి ఇచ్చాక వాటిని పూర్తి స్థాయిలో బదలాయిస్తానని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే ఈడీ జప్తు చేసిన సరస్వతీ పవర్ షేర్లను బదిలీ చేయించి జగన్ బెయిల్‌ను రద్దు చేయించాలన్న కుట్రలో షర్మిల పావుగా మారారని.. ఆ కుట్రను చిత్తు చేయడానికే ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారేగానీ ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. అవన్నీ జగన్ స్వార్జితం: వైవీ సుబ్బారెడ్డి షర్మిల బహిరంగ లేఖ చూశాక కుటుంబపరమైన కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నా. సరస్వతీ పవర్ షేర్ల అంశం హైకోర్టులో ఉంది. ఈడీ జప్తు చేసిన ఆ సంస్థ ఆస్తులపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. జగన్‌పై కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడంతో ఆయన సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే దాన్ని ఆపాలని జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇచ్చారు. అంతేగానీ ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదు. » జగన్ తన స్వార్జిత ఆస్తిలో షర్మిలకు వాటా ఇస్తూ 2019 ఆగస్టులో ఒప్పందం రాసిచ్చారు. ఆ ఒప్పందంలో జగన్ స్వార్జిత ఆస్తులు అని చాలా స్పష్టంగా ఉంది. అది చూశాకే షర్మిలమ్మ, విజయమ్మ ఇద్దరూ సంతకం పెట్టారు. తన చెల్లిపై ప్రేమ, అభిమానంతో ఆస్తులు ఇస్తున్నట్లు జగన్ ఆ ఒప్పందంలో రాశారు. ఇవన్నీ వాస్తవాలు. వాటిని కప్పి పుచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. » దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే ఆయన ఆస్తులను పంచారు. షర్మిల ఈ ఆస్తులు కావాలని అని నిజంగా అనుకుంటే.. అవి ఇస్తానని జగన్ చెప్పినా.. ఆమె ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూస్తుంటే.. ఆమె ఆస్తుల కోసం పోరాడుతున్నారా? లేక జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? అని అనిపిస్తోంది. » నాకు తెలిసినంతవరకు జగన్ స్వార్జిత ఆస్తిలో ఎక్కడా షర్మిలమ్మ ప్రమేయం లేదు. నిజంగా ఆ ఆస్తుల్లో షర్మిలమ్మకు వాటా ఉండి ఉంటే.. ఆమెపై ఆనాడు కేసులు ఎందుకు నమోదు కాలేదు? కేవలం జగన్ మాత్రమే ఎందుకు జైలుకు వెళ్లారు? జగన్ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టే ఆయనకు డివిడెండ్ వచ్చింది. దాన్నుంచే ఆయన తన చెల్లికి ఈ పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారు. షర్మిల అందులో షేర్ హోల్డర్ కాదు. అవి జగన్ సొంత కంపెనీలు. అందుకే వాటికి భారతి సిమెంట్స్.. తన పేరు, భార్య పేరు కలిసొచ్చేలా జగతి పబ్లికేషన్స్ (సాక్షి గ్రూప్) అని పేరు పెట్టారు. » నలుగురు పిల్లలూ తనకు సమానం అని వైఎస్సార్ అన్నారని షర్మిల లేఖలో రాశారు. అది నిజమే. ప్రేమను పంచడంలో వైఎస్సార్ నలుగురు పిల్లలనూ సమానంగా చూశారు. అయితే వైఎస్సార్ బతికున్నప్పుడే జగన్ స్థాపించిన కంపెనీల్లో ఎక్కడా షర్మిల గానీ, అనిల్ గానీ షేర్‌హోల్డర్‌గా లేరు. అది వైఎస్సార్ కోరుకోలేదు. ఒకవేళ ఆయన కోరుకుంటే వారిని ఆ కంపెనీల్లో షేర్ హోల్డర్లుగా పెట్టి ఉండేవారు కదా? తండ్రి మరణం తర్వాత, ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. 2014లోగానీ మొన్న 2024లోగానీ అబద్ధాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవారు. అలాంటి మనిషే అయితే చెల్లి విషయంలో మాట తప్పరు కదా? బాబుతో కలసి రాజకీయం చేయడం వైఎస్ అభిమతమా?: పేర్ని నాని » గత మూడు నాలుగు రోజుల నుంచి టీడీపీ నానా హంగామా చేసి చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. షర్మిలమ్మ తన ఆస్తుల పంపకం గురించి అన్నకు రాసిన ఉత్తరం. అది రాష్ట్రానికి, ప్రజలకు అంత ముఖ్యమా? షర్మిలమ్మ పీసీసీ అధ్యక్షురాలు. ఆమె అన్నకు రాసిన ఉత్తరం ఎన్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో రావడం అంటే చంద్రబాబు ఎంత అనైతికంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడికక్కడ ఎవరెవరితో కలిసి పని చేస్తున్నారు? అనేది ఆలోచించండి. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కుస్తీ.. ఇక్కడ మాత్రం దోస్తీ! ఏ స్థాయిలో దిగజారి రాజకీయాలు చేస్తున్నాడో చూడండి. లేఖ రాసింది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలైతే టీడీపీ వెబ్సైట్లో ప్రచారం చేయడం ఏమిటి? » వైఎస్సార్ జీవించి ఉన్నప్పుడు మొదలుపెట్టిన కంపెనీల్లో కుటుంబ సభ్యులంతా వాటాదారులైతే.. భారతి సిమెంట్స్‌లో షర్మిల పేరు ఎందుకు పెట్టలేదు? షేర్ హోల్డర్లుగా ఎందుకు ప్రకటించలేదు? జగన్ ఆ కంపెనీలకు కేవలం కాపలాదారే అయితే వైఎస్సార్ మిమ్మల్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా పెట్టేవారు కదా? అప్పట్లో మీరు విదేశాల్లో కూడా లేరు కదా? » వైఎస్సార్ అభిమతం, ఆశయాలను కొనసాగించాలన్న అంకితభావం ఉంటే.. చంద్రబాబుతో కలిసి ప్రయాణించడం, రాజకీయం చేయడాన్ని ఎవరైనా ఊహిస్తారా? వైఎస్సార్ అదే ఆశించారా? ఆయన్ను అణగదొక్కడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలుసు కదా? రాజకీయాల్లో ఇద్దరూ బద్ధ శతృవులు. అలాంటి చంద్రబాబుతో కలిసి పని చేస్తారా? ఏబీఎన్ రాధాకృష్ణతో కూడా కలసి పోతారా? వైఎస్సార్ అభిమానుల్లో ఎవరైనా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారా? కానీ ఆ పని మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్డీఏ కూటమితో కలసి ఎలా పని చేస్తున్నారు? అదేనా వైఎస్సార్ అభిమతం? ఆశయం? » వైఎస్సార్ మరణించాక.. జగన్ 10 ఏళ్లు కష్టాలు పడితే.. తాను పార్టీ కోసం పాటుపడ్డాడని, కష్టపడి పని చేశానని షర్మిలమ్మ అంటున్నారు. జగన్ ఎప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారో తెలియదా? ఆయన సోనియాను ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. అప్పుడు 230 రోజులు షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. అది కూడా 2014 ఎన్నికల ముందు మాత్రమే. 2014 తర్వాత ఆమె ఏనాడూ రాలేదు. పార్టీ జెండా మోయలేదు. » వైఎస్సార్సీపీకి 2012 నుంచి ఈరోజు వరకు కర్త, కర్మ, క్రియ, కష్టం నష్టం.. గెలుపు.. అన్నింటిలో పూర్తి భాగస్వామ్య హక్కు జగన్‌ది మాత్రమే. కేవలం ఆయన వల్లనే పార్టీ ఎదిగింది... నిల్చింది... గెల్చింది. ఆ ఘనత పార్టీది, కార్యకర్తలది. అంటే జగన్, పార్టీ కార్యకర్తలకే ఆ ఘనత దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే మాలాంటి వారు చాలా మంది పని చేశారు. పదవులు వదులుకుని వచ్చాం. టీడీపీ నుంచి కూడా పదవులు వీడి వచ్చిన వారు ఉన్నారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చారు. కానీ ప్రధానంగా పని చేసింది లక్షలాది మంది కార్యకర్తలు, జగన్ మాత్రమే. వారి వల్లనే పార్టీ ఎదిగింది. నిలబడింది. ఇది వాస్తవం. దీన్ని షర్మిలమ్మ గుర్తించాలి. » ఇది చెప్పాలో వద్దో తెలియదు. షర్మిలమ్మ పాదయాత్ర సమయంలో జగన్ జైల్లో ఉంటే నేను స్వయంగా కలిశా. చెల్లితో పాదయాత్ర చేయించడం ఎంత వరకు కరెక్ట్? భవిష్యత్తులో సమస్యలు వస్తాయని చెబితే అలాంటి అవకాశం అసలు ఉండదని నాడు జగన్ అన్నారు. చెల్లిపై ఆయనకు అంత నమ్మకం. కానీ ఈ రోజు నేను అన్నదే జరుగుతోంది. » షర్మిలను పార్టీ కోసం వాడుకుని వదిలేశారని చంద్రబాబు అంటున్నారు. మరి నువ్వు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీ కోసం ఎంతగా వాడుకున్నావ్ చంద్రబాబూ..? మీరు కనీసం సభ్యత్వం కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన పార్టీని వీడారు కదా? మీరు మీ లాభం కోసం మనుషులను ఎలా వాడుకుంటారో.. స్వయంగా మీ తోడల్లుడు ఏకంగా పుస్తకమే రాశారు కదా! వాడుకోవడం, వదిలేయడం.. అదీ మీ నైజం! అలాంటి మీరు నీతులు చెబుతున్నారు. ఆస్తులు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. మరి మీ హెరిటేజ్‌లో మీ తోబుట్టువులకు ఎంత వాటా ఇచ్చారు? ఏమైనా రాసిచ్చారా? మీకు నిజాయితీ ఉంటే వెంటనే ఆ పని చేసి చూపండి. ఈ వయసులో ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి చంద్రబాబూ!! 40% వాటా కోసం మాట తప్పుతారా? » అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ కేవలం గార్డియన్ మాత్రమేనని, ఆస్తులను నలుగురికి (మనవళ్లు, మనవరాళ్లు) సమానంగా పంచడం, అది జగన్ బాధ్యత అని.. అది వైఎస్సార్ ఉద్దేశమని.. అది ఆయన సన్నిహితులైన కేవీపీ, సాయిరెడ్డి, సుబ్బారెడ్డికి కూడా తెలుసని షర్మిలమ్మ ఆ లేఖలో రాశారు. ఒకవేళ నిజంగా వైఎస్సార్ ఉద్దేశం అదే అయితే.. ఇంత మందికి ఆయన చెప్పి ఉంటే, జగన్‌కు కూడా చెప్పి ఉండాలి కదా? ఇద్దరు తల్లిదండ్రులను కూడా కంపెనీ డైరెక్టర్లుగా పెట్టి ఉండాలి కదా? ఇలాంటి మనస్తత్వమా షర్మిలది? »తండ్రి మరణం తర్వాత జగన్ ఓదార్పుయాత్ర చేస్తానంటే.. కాంగ్రెస్ వద్దనడంతో పార్టీని వీడారు. పదవులు ఇస్తామన్నా ఆశ పడలేదు. కేవలం మాట కోసం బయటకు వచ్చారు. రాజీ పడకుండా పోరాడారు. తండ్రి ఆశయం, జనం కోసం, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో పోరాడారు. 16 నెలలు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించారు. ఎంతో జీవితాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆశయాన్ని మాత్రం వీడలేదు. జగన్‌పై ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటికీ వాటిని మోస్తూనే ఉన్నారు. పదవులు ఇస్తామన్నా కేవలం ఇచ్చిన మాట కోసం వదులుకున్నారు. » అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఏదో నాలుగు ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? తనే స్వయంగా రాశారని మీరే చెబుతున్నారు కదా! నమ్మిన సిద్ధాంతం, ఆశయాల కోసం రాజీ పడకుండా అన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? మరి ప్రజలు దీన్ని నమ్ముతారా? »గత పదేళ్లలో మీకు రూ.200 కోట్లు నగదు బదిలీ చేస్తే అది కంపెనీ డివిడెండ్ అని అంటారా? మీరు కంపెనీలో షేర్‌హోల్డర్ కానప్పుడు మీకు లాభం ఎలా పంచుతారు? అది వచ్చింది మీ అన్న, వదిన నుంచి కాదా? ఇంత దారుణంగా మాట్లాడడం, వ్యవహరించడం ఎంత వరకు సబబు? తండ్రి, అన్న శతృవుతో కలిసి పని చేయడం, ఆస్తుల కోసం జగన్ కోర్టుకు ఎక్కాడని టీడీపీ మీడియాతో కలసి దు్రష్పచారం చేయడాన్ని మీ విజ్ఞత, విచక్షణకే వదిలేస్తున్నాం.రెట్టింపు డబ్బులిస్తాం.. ఫిలిం సిటీ భూములు వదిలేస్తారా?వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఒంగోలు సిటీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి చట్ట ప్రకారం భూములు కొన్నారని, రామోజీరావు అండ్‌కో లా హైదరాబాద్‌లో ఫిలిం సిటీ కోసం పేదలను భయపెట్టి భూములు చవగ్గా కొల్లగొట్టలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు చెప్పారు. రామోజీ అండ్ కో ఫిలింసిటీ కోసం ఎంతో మంది పేదలను భయపెట్టి భూములు లాక్కొన్నారని, ఆరోజు కొన్న రేటుకు రెట్టింపు డబ్బులిస్తాం ఫిలిం సిటీ భూములను వదిలేస్తారా అని ప్రశ్నించారు. జూపూడి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చట్టప్రకారం కొన్న భూములపైనా ఎల్లోమీడియా వక్రీకరించడం సమంజసం కాదని అన్నారు. చంద్రబాబుకు సిగ్గు ఉందో లేదో తెలియదు కానీ, రాష్ట్రం మొత్తం చంద్రబాబును చూసి సిగ్గుపడే అంశాలు చాలా ఉన్నాయని విమర్శించారు. జగన్ ఇంట్లో ఆస్తుల తగదాలతో ఆయనకేమిటి సంబంధం అని ప్రశ్నించారు. సంబంధం లేకపోతే షర్మిల లేఖ చంద్రబాబు దగ్గరకు ఎలా వచ్చిందని నిలదీశారు. ఆనాడు సోనియాగాంధీతో కుమ్మక్కైన చంద్రబాబు వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించారని, ఫలితంగా జగన్ ఆస్తులు సీబీఐ, ఈడీ అటాచ్‌లో ఉన్నాయన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే జగన్ ఎన్సీఎల్టీకి అర్జీ పెట్టుకున్నారని వివరించారు. అసలు చంద్రబాబు ఏనాడైనా తన ఆస్తులను తమ్ముళ్లు, చెల్లెమ్మలకు రాసిచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు తన ఉనికి కోసం సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడిని ఎదగకుండా చేశాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్, ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని, శాంతిభద్రతలను పూర్తిగా వదిలేశారని ధ్వజమెత్తారు.అనుబంధాల గురించి షర్మిల మాట్లాడటమా?వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డిప్రొద్దుటూరు: శత్రువులతో చేతులు కలిపిన షర్మిలమ్మ కుటుంబ అనుబంధాలు, ప్రేమల గురించి మాట్లాడటం విడ్డూరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆమె ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై ఆస్తి కోసం సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బజారుకీడుస్తున్నారని ధ్వజమెత్తారు. శివప్రసాదరెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత షర్మిలమ్మపై ప్రేమతో జగన్ స్వార్జితంలో సుమారు రూ.200 కోట్లు నగదు చెల్లించారని చెప్పారు.ఇందుకు భారతమ్మ కూడా పూర్తి సహకారం అందించి గొప్పతనాన్ని చాటుకున్నారని తెలిపారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్, మిగతా ఆస్తులలో షర్మిలమ్మకు భాగం ఇవ్వాలనే ఎంఓయూ కుదుర్చుకున్నారన్నారు. అయితే ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉండటతో బదలాయించలేదన్నారు. కేసులు పరిష్కారమయ్యే వరకు, న్యాయ సంబంధమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఎంవోయూ ఇచ్చారన్నారు. షర్మిలకు చెందని ఆస్తి కోసం చంద్రబాబు అండ్ కో తో చేతులు కలిపి వైఎస్ జగన్‌ను మరో మారు జైలుకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో కోటి కుటుంబాలు అండగా ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలన్నారు. షర్మిలమ్మ అత్యాశతో అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసలు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదని అన్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడుకు ఆస్తిలో వాటా ఇవ్వకపోవడంవల్లే మతి స్థిమితం కోల్పోయారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వారసులకు ఆస్తి తగాదాలు లేవా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణులకు భాగ పరిష్కారాల సమస్య లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ వ్యతిరేకుల చేతుల్లో షర్మిల కీలుబొమ్మవైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై షర్మిల చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం లాజిక్లేదని, ఆమె వైఎస్సార్ కుటుంబ వ్యతిరేకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై. ఈశ్వర ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని.. నిజానికి, మెజారిటీ షేర్ల బదిలీ అంటే భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానమని.. ఇది హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో షర్మిల, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన విధానాలను అనుసరించకుండా మెజారిటీ షేర్లను బదిలీ చేశారన్నారు. వాటా బదిలీ ఫారంలలో బదిలీదారుల సంతకాలు తీసుకోలేదని.. బదిలీ కోసం షేర్ సర్టిఫికెట్లు అందించలేదని ఆయన పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయించాలనే..ఇక జగన్ బెయిల్ రద్దు కావాలంటే ఎలా అని ఆలోచించి.. చివరకు పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టు ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన అంశాన్ని పట్టుకున్నారన్నారు. తద్వారా.. దాని షేర్లు బదిలీ చేశారని చూపుతూ జగన్ బెయిల్ రద్దు చేయించాలని కుట్ర పన్నినట్లు ఈశ్వర్ప్రసాద్ తెలిపారు. తన బెయిల్ రద్దుచేసి, తిరిగి జైలుకు పంపించే కుట్ర చేస్తుండడంతో జగన్ న్యాయబద్ధంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు అప్పీల్ చేశారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని.. షర్మిల ఇప్పటికైనా ఈ దుష్టశక్తుల కుట్రల నుంచి బయటపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
గిఫ్ట్ డీడ్‌ను షర్మిల దుర్వినియోగం చేశారు
సాక్షి, అమరావతి: రక్తం పంచుకు పుట్టిన చెల్లి షర్మిలపై ప్రేమాభిమానాలతోనే సొంత ఆస్తుల్లోనూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటా ఇస్తామన్నారని, కానీ గిఫ్ట్ డీడ్‌ను షర్మిల దుర్వినియోగం చేసి, తల్లి పేరిట షేర్లుగా మార్చారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్దే ఉన్నాయని తెలిసే అవి పోయాయని అబద్ధాలాడారని, షర్మిల చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలపై క్రిమినల్ కేసు పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు. సజ్జల శుక్రవారం పార్టీ నాయకులు, శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఎన్సీఎల్టీలో అర్జీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? షర్మిల తీరు, ఎల్లో మీడియా దు్రష్పచారాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. సరస్వతి పవర్ షేర్ల మ్యాటర్ హైకోర్టులో ఉందన్నారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులపై స్టేటస్కో మెయిన్‌టెయిన్ చేయాలని హైకోర్టు నిర్దేశించిందని తెలిపారు. వైఎస్ జగన్‌పై అప్పట్లో కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తే.. ఆయన ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగిందని తెలిపారు. అలా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే, దాన్ని ఆపాలంటూ వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇచ్చారని వివరించారు. అంతేతప్ప, ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదన్నారు. సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలిసి కూడా షర్మిల కుయుక్తులు పన్నారని చెప్పారు. న్యాయపరంగా జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే సీఎం చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేశారన్నారు. ఇది తెలిశాక ఆ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమంటూ ఆపాలంటూ చెల్లెలికి జగన్ లేఖ రాశారని చెప్పారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయనిపుణుల అభిప్రాయాన్ని తీసుకొన్నారని తెలిపారు. షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని, దానిని ఆపకుంటే ఇబ్బందులొస్తాయని న్యాయ నిపుణులు చెప్పారన్నారు. ఈ వాస్తవ విషయాలను పార్టీ నాయకులు, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. -
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పై జనం ఆగ్రహం
-
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయావు షర్మిల?
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల ఆరోపణల్లో ఏ మాత్రం లాజిక్ లేదంటూ వైఎస్సార్సీపీ ఇంటెలెక్టుల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు వై ఈశ్వర ప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘‘అటాచ్మెంట్లో ఉంది భూమి మాత్రమే, షేర్ కాదంటున్నారు. ఒక కంపెనీ లో మెజారిటీ షేర్లు ట్రాన్స్ఫర్ అయితే, షేర్లతో పాటు భూమి కూడా కొన్న వారి స్వాధీనం అవుతుందనే చిన్న ప్రాథమిక సూత్రం విస్మరిస్తే ఎలా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘ఇలా భూమిని బదలాయింపు చేస్తే హైకోర్టు ఆజ్ఞలను అతిక్రమించినట్లు కాదా? దీని పర్యవసానం ఎలా వుంటుందన్నది మీకు తెలియదా?. మీ చర్యల వల్ల మీ మీద ప్రేమతో మీ సోదరుడు వైఎస్ జగన్ ఇవ్వాలనుకున్న ఆస్తులు మీకు వస్తాయో లేదో కానీ, వైఎస్సార్ ద్వేషులు మాత్రం చాలా ఆనందంగా వున్నారు. బాగా చదువుకున్న దానివి. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా అమ్మా?’’ అని ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: బాబు వదిలిన కుట్ర ‘బాణం’వైఎస్సార్ కుమార్తెగా చెప్పుకుంటూ.. కోట్లాది అభిమానుల గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిన ఆ మహానుభావుని చావు కోరుకున్న దుర్మార్గుల చెంత చేరి, వారి చేతిలో కీలుబొమ్మ అయితే ఆ మహా నేత అభిమానులు ఎంతగా మానసిక క్షోభకు గురి అవుతారో ఒక్క గుర్తు చేసుకో తల్లి. ఆ నాయకుడి కూతురిగా మీరు ఎలా భరించగలుగుతున్నారో గాని, మాకు మాత్రం చాలా కష్టంగా వుంది. దయచేసి ఇప్పటికైనా ఆ కబంధ హస్తాల నుంచి బయటకు రండి’ అంటూ ఈశ్వర్ ప్రసాదరెడ్డి హితవు పలికారు. -
వైఎస్ జగన్ పట్ల షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు
-
జగన్ పై కావాలనే కుట్ర.. కుటుంబంతో రాజకీయం.. బాబు ఇంతకు దిగజారాలా!
-
షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు.‘‘షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తామన్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైఎస్ జగన్‌ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.’’ అని రాచమల్లు దుయ్యబట్టారు. ‘‘ఇంటింటికీ ఒక రామాయణం ఉండనే ఉంటుంది. మా ఇంటి రామాయణం షర్మిల పుణ్యమాని బజార్లోకి వచ్చింది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను షర్మిల బజారుకీడ్చిన తర్వాత వాస్తవాలేంటో చెప్పాల్సిన బాధ్యత మాకుంది. చంద్రబాబును ఆసరాగా చేసుకుని ఆమె చేస్తున్నది సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. షర్మిలమ్మ ప్రేమలు, అప్యాయతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నిజంగా అలా ప్రేమలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే అన్నను జజారు కీడుస్తుందా? జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందా?. చంద్రబాబుతో చేతులు కలిపి కుట్రకు తెరలేపుతుందా?జగన్ ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లాడనడం పచ్చి అబద్ధం. ఎవరి ఆస్తులు ఎవరికిస్తున్నారో తెలియజెప్పాల్సిన అవసరం మాకుంది. షర్మిలకు పెళ్లై 30 ఏళ్లు కావొస్తుంది.. నీ తండ్రి మరణించిన 14 ఏళ్ల తర్వాత అమ్మగారి ఇంటి నుంచి ఏం ఆస్తి వస్తుంది?. వైఎస్సార్ బతికుండగానే ఇద్దరికీ సమానంగా ఆస్తులను పంచారు. వైఎస్సార్ ఆడపిల్లను వేరుగా చూడకుండా ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచారు. తన స్వార్జితం సంపాదించుకున్న ఆస్తిలో చెల్లెలుపై ప్రేమతో ఆయన వ్యాపారాల్లో రూ.200 కోట్లు వైఎస్ జగన్ ఇచ్చారు. డబ్బే కాదు.. ఆస్తులు కూడా ఇస్తానని పిలిచి ముందుకు వచ్చాడు. షర్మిలకు హక్కు లేకపోయినా.. రక్త సంబంధంతో ఎంవోయూ చేశారు.జగన్ ఇవ్వడం గొప్పైతే.. దానికి ఒప్పుకోవడం జగన్ సతీమణి భారతి చాలా గొప్పతనం. ఏ ఆడబిడ్డకు ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. ఆమెను ప్రశంసించాలి. ఆ ఎంవోయూలో ఈడీ చేతిలో ఆస్తులు అటాచ్ అయ్యాయి. వెంటనే బదలాయింపు చేయలేనని చెప్తూ అగ్రిమెంట్ చేశారు. ఆమెకు దానిలో హక్కు లేదు. తండ్రి గారి సొమ్ము కూడా కాదు. కేసులు పరిష్కారం అయిన తర్వాత నీకు బదలాయింపు జరుగుతుందని కూడా ఎంవోయూలో ఉంది. ఏదో నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో హక్కు అడిగినట్లు షర్మిలమ్మ మాట్లాడుతోంది. జగన్ నీకిచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్‌కు వెళ్లలేదు.. ఆయన కోర్టుకు వెళ్లలేదు.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి వెళ్లారు.నాకు తెలియకుండా మోసం చేసి, నా తల్లికి అబద్ధాలు చెప్పి బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించారని, దాన్ని ఆపాలని జగన్ కోరారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా, ప్రమాదం జరగకుండా ఆయన తీసుకున్న జాగ్రత్త ఇది. నీది కాని ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ. ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లీ..?. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సునీతమ్మ, మీరు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్‌ను చిక్కుల్లోకి పంపాలని కుట్ర చేశారు. మరోక రెండేళ్లు జగన్‌ను జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తావా..?చంద్రబాబు, రేవంత్ చేశారంటే ఒక అర్ధం ఉంది.. తోడబుట్టిన, రక్తం పంచుకుని పుట్టిన దానివి.. ఎందుకింత నీచానికి ఒడికడుతున్నావు. తల జగన్ గారిదైతే.. కత్తి షర్మిలమ్మది.. చేయి చంద్రబాబుది. ఇంత చేస్తూ అనుబంధాలు, ప్రేమలు, అప్యాయతలంటూ మాట్లాడతావా.. షర్మిల మాట్లాడే మాటలన్నీ పచ్చి అబద్దం. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లో భూములపైనే ఎటాచ్మెంట్ ఉంది. కంపెనీ అటాచ్ కాలేదు అంటూ అబద్దాలు మాట్లాడుతోంది.2019లో సరస్వతి ఇండస్ట్రీస్‌లో పూర్తిగా వంద శాతం ఆమెకే ఇచ్చాడు. ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి కోట్లు ఖర్చు అవుతుందని కాలయాపన చేసింది. 2019 డిసెంబర్లో ఆ ఆస్తి కూడా అటాచ్మెంట్లోకి పోయింది. ఆమె ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మాట్లాడుతుంది తప్ప...హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో గురించి మాట్లాడటం లేదు. హైకోర్టు తీర్పులో ఎటువంటి క్రయవిక్రయాలు చేయకూడదని స్పష్టంగా ఉంది. అహంకారం+అత్యాశ= షర్మిల. చంద్రబాబు, సోనియాతో కలిసి ఎప్పటికైనా ఏలాలనే పదవులపై అత్యాశ. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు తెలంగాణాలో పార్టీని మూసేసి ఇక్కడకు వచ్చి అన్నను బజారుకీడుస్తున్నావు.మీ అన్నపై రాయితో దాడి చేస్తే ఆనాడు నువ్వేం మాట్లాడావు..?. జగన్ అంతమే నీ లక్ష్యంగా కనిపిస్తోంది. అప్పుడే నీకు సంతోషంగా ఉండేట్లుంది. జగన్ సంపాదించిన ఆస్తిని తన చెల్లెలుపై ప్రేమతో ఉచితంగా ఇస్తున్న ఆస్తి ఇది. అమ్మకు అబద్ధం చెప్పి.. ఆమెకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను లాగేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు.. ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావు...? విజయమ్మ గారిని కూడా ఒక మాట అడుగుతున్నా.. నా బిడ్డ జగన్‌ను రాష్ట్రానికి ఇస్తున్నాను.. నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అన్నారు.. ఇప్పుడు జగన్ మా బిడ్డ, మా అన్న అయినప్పుడు ఆయనకు ప్రమాదం వస్తే మా అందరితో ముడిపడి ఉంది. ఆయన ప్రమాదం, ఆయన ప్రాణం, గౌరవం మా అందరి కోటిమంది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంది. మా అందరి జీవితాలతో ముడిపడి ఉన్న పెద్దన్న లాంటి జగన్ గారిని మీరందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు?. శతాబ్ది జోక్ కాదు.. వందేళ్లు వెనక్కి పోయినా నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లోనూ ఉండదు.ఆ అన్న నీ ఒక్కడికే అన్న కాదు.. మా అందరికీ అన్న.. నీది రక్త బంధమైతే.. మాది హృదయానికి సంబంధించిన బంధం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేం జగన్‌తో ఉండే వాళ్లం..నువ్వు ఆయన్ని జైళ్లోకి పంపిస్తే మా జీవితాలు ఏం కావాలి..?. చెల్లెల్లు రక్షాబందన్ కట్టి అన్న చల్లాగా ఉండాలనుకుంటారు..నువ్వు అన్నను జైలుకు పంపాలనుకుంటున్నావు. భర్త సంపాదించిన ఆస్తిలో చెల్లెలకు వాటా ఇస్తున్నా సహకరించి సంతకం పెట్టిన భారతమ్మను గౌరవించాలి. జగన్ తల్లి, చెల్లిపై కోర్టులో కేసు వేశాడా..? ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా.. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆస్తుల కోసం తల్లి,చెల్లిపై కేసు వేశాడని రాస్తారా?. కుట్రపూరితంగా మీరు ఆయన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే..కళ్లు తెరిచి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ ఆస్తి మీది కాదు..జగన్మోహన్రెడ్డి కష్టార్జితం. ఈ కుటుంబ సమస్యను బజారుకీడ్చింది మీరు.. చంద్రబాబుతో చేతులు కలిపింది షర్మిల.మీ ఇంట్లో రామాయణం లేదా చంద్రబాబు..? మీ తమ్ముడు రామ్మూర్తిని గొలుసులేసి కట్టేశారు..రూపాయి అస్తులు ఇవ్వలేదు. మీ అమ్మ కు హైదరాబాద్‌లో ఉన్న వందల కోట్ల భూమిని మీ చెల్లెల్లకు ఇచ్చినావా?. లక్ష్మీ పార్వతికి చెందాల్సిన ఆస్తులు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వంశానికి సమస్యలు లేవా?. పవన్ కల్యాణ్ పెళ్లాలకు ఉండే సమస్యలు సంగతేంటి?. మీ రామాయణాలు ఏ రోజూ మేం ప్రస్తావించలేదు.. ఇళ్లన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పేజీ పేజీ వండి వార్చలేదు. కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన అనుబంధాలు చంద్రబాబుకు లేవు.. అది ఒక్క వైఎస్సార్ కుటుంబంలోనే ఉన్నాయి. మా దరిద్రానికి ఇప్పుడు ఈ షర్మిల మాకు తోడైంది.. లేదంటే ఇంతవరకూ మచ్చలేని కుటుంబం వైఎస్సార్‌ది. విజయమ్మకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా..మీ బిడ్డ మీ బిడ్డ కాదు..మా ఆస్తి... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల ఆస్తి..మీ ఇష్టానుసారం ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండటానికి సిద్ధంగా లేము. ఇంత దూరం వచ్చిన తర్వాత దాచిపెట్టుకుని మెల్లిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది..?’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ, ఎల్లోమీడియాల పావుగా షర్మిల..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ కుట్రలు పెద్ద ఎత్తునే సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి షర్మిలను పావుగా మార్చుకున్న టీడీపీ నేతలు, ఎల్లోమీడియా జగన్‌పై అభాండాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ కుట్ర చేస్తోందంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. మీడియా సంస్థలు నడుపుతున్నవారు ఇందులో భాగస్వాములు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మెట్టు పతనమయ్యాయి అనేందుకు నిదర్శనం. రాజకీయంగా జగన్‌ను పూర్తిగా దెబ్బతీయకపోతే తమ మనుగడకే ప్రమాదం అన్నంత కసితో వీరంతా కుమ్మక్కై నైతిక, మానవీయ విలువలకు కూడా తిలోదకాలిస్తున్నారు.అక్టోబరు 21న పచ్చమీడియాలో భాగమైన ఆంధ్రజ్యోతి ఒక కథనం వండింది. దిక్కుతోచని పరిస్థితిలో జగన్ తన చెల్లి షర్మిలతో కాళ్లబేరానికి దిగారన్నది ఆ కథనం సారాంశం. ఆస్తుల పంపకంపై బెంగళూరు వేదికగా చర్చలు జరిగాయని, ఒప్పందం దాదాపుగా కుదిరిందని కూడా ఈ కథనంలో చెప్పేశారు. కాంగ్రెస్‌తో దోస్తీ కోసం జగన్ ఇలా చేశాడని కూడా ఆ పత్రిక కనిపెట్టేసింది. ప్రత్యక్ష సాక్షులం తామే అన్నట్టుగా ఈ కథనాన్ని అల్లారు. పైగా షర్మిలపై ఎనలేని సానుభూతి వ్యక్తమైంది దీంట్లో. మూడు రోజులు కూడా గడవకముందే.. అంటే అక్టోబరు 24న అదే పత్రికల్లో ఇంకో కథనం ప్రత్యక్షమైంది. మునుపటి దానికి పూర్తి వ్యతిరేకమైన వాదనతో ఈ కథనం ఉండటం గమనార్హం. జగన్ సొంత చెల్లిపైనే కేసులు వేశారని, అసలు ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని 'మమకారం మాయం" శీర్షికతో సదరు పత్రిక మొసలి కన్నీరు కార్చింది కూడా. ఆస్తుల పంపకంపై అన్నా చెల్లెళ్ల మధ్య రాజీ అని రాసిన మూడు రోజులకే ఈ రకమైన కథనం రాయడంలోనే కుట్ర ఉంది. జగన్‌పై ఏదో ఒకలా నిత్యం అబద్ధాలు ప్రచారం చేయకపోతే జనంలోకి దూసుకెళుతున్న ఆయన్ను రాజకీయంగా ఆపడం కష్టమని వారికి అర్థమైనట్టుంది. అందుకే ఎక్కడలేని దుగ్ధతో వాళ్లు ఈ రకమైన కథనాలు వండి వారుస్తునే ఉన్నారు. జగన్, షర్మిలల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్న మాట వాస్తవం. షర్మిల... సోదరుడు అని కూడా చూడకుండా జగన్ రాజకీయ ప్రత్యర్ధులతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి దుర్మార్గులతో కుమ్మక్కై ఇష్టారీతిన జగన్ వ్యతిరేక ప్రచారం చేసింది నిజం. అయినప్పటికీ గత పదేళ్లలో జగన్ నుంచి ప్రత్యక్షంగా లేదా, పరోక్షంగా సుమారు రూ.200 కోట్ల మొత్తం పొందిన తర్వాత కూడా ఆశ తీరక షర్మిల తన అన్నను అప్రతిష్టపాలు చేయబోయి తానే పరువు పోగొట్టుకుంటున్నారన్న సంగతి తెలుసుకోలేక పోతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ సమర్పించిన అఫిడవిట్లోనే జగన్ నుంచి రూ.80 కోట్లు పొందినట్లు షర్మిల పేర్కొనడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఎంత అభిమానం లేకపోతే జగన్ జగన్ అంత మొత్తం చెల్లికి ఇస్తారు? చివరికి అన్న బెయిల్ రద్దుకు కొందరు చేస్తున్న కుట్రలో ఆమె ఒక పాత్ర పోషించడం హేయమైన చర్యగా కనిపిస్తుంది. షర్మిల రాజకీయంగా అంత పరిపక్వత లేని వ్యక్తి కావడం ఎల్లో మీడియా ఆడింది ఆటగా, పాడింది పాటగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ వేసి తాను గతంలో చెల్లెలికి ఇవ్వదలచిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసుకుంటున్నానని, తనకు తెలియకుండా జరిగిన షేర్ల బదిలీని ఆమోదించవద్దని కోరారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినట్లు ఇది కేసు కాదు. కేవలం ఒక అభ్యర్థన మాత్రమే. కోర్టు ధిక్కారం జరగకుండా ఉండేందుకు తీసుకున్న ఒక జాగ్రత్త మాత్రమే. ఈ విషయాలపై జగన్, షర్మిల మధ్య లేఖలు నడిచాయి. వాటిని చదివితే జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద కుట్రే జరిగిందని అర్థమవుతుంది. గిఫ్ట్‌డీడ్ తాను ఎందుకు రద్దు చేసుకోదలించింది కూడా జగన్ ఆ లేఖల్లో స్పష్టంగా రాశారు. తన వాదనను ఆయన బలంగా వినిపించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వీరిద్దరికి ఆస్తులు పంచి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో షర్మిలకు తన స్వార్జితమైన ఆస్తుల నుంచి కూడా కొంత వాటా ఇవ్వాలని జగన్ అనుకున్నారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. కేవలం చెల్లిపై అభిమానంతోనే ఆయన ఇలా చేయాలని అనుకున్నారు. పైగా దీన్ని లిఖితపూర్వకంగా ఒక అవగాహన పత్రం రూపంలో 2019 ఆగస్టు 31న ఇచ్చారు. తనపై వచ్చిన కోర్టు కేసుల పరిష్కారం ఆ గిఫ్ట్ డీడ్ తర్వాతే అమలు అవుతుందని చాలా స్పష్టంగా పేర్కొన్నారు కూడా. సరస్వతి పవర్ కంపెనీలో జగన్, ఆయన సతీమణి భారతిలకు ఉన్న వాటాలలో కొంత భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని భావించి, ఆమె సంతృప్తి కోసం తల్లి విజయమ్మ ను ట్రస్టీగా పెట్టుకుని డీడ్ రాశారు. షేర్ల బదిలీకి తమ అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అయితే షర్మిల తన తల్లిపై ఒత్తిడి తెచ్చి వాటిని జగన్ కు తెలియకుండా తన పేర బదిలీ చేసుకునే యత్నం చేసింది. ఈ సంగతి తెలిసిన వెంటనే జగన్ లాయర్లు స్పందించి, అలా చేయడం చెల్లదని చెబుతూ పిటిఫన్ వేశారు. ఎల్లో మీడియా దీనిని వక్రీకరిస్తూ, జగన్ తన తల్లి, చెల్లిపై కేసు పెట్టారని తప్పుడు ప్రచారం చేసింది. కేసుకు, పిటిషన్‌కు మధ్య ఉన్న తేడాను ప్రజలకు తెలియకుండా ఇలా రాశారన్నమాట. జగన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేయకపోతే, ఆయన గతంలో తనకు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లవుతుంది. షర్మిల పాత్ర ముగిసిన వెంటనే టీడీపీ వారు మరో పాత్రను ప్రవేశపెట్టి, జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. ఆ మేరకు టీడీపీ ఎల్లో మీడియా కుట్ర నుంచి జగన్ బయటపడ్డారు. ఇదే సందర్భంలో షర్మిలకు జగన్ రాసిన లేఖలో తనపట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై కూడా అభ్యంతరం చెప్పారు. ఎల్లో మీడియా కొత్త, కొత్త సూత్రీకరణలు చేస్తోంది. జగన్ తన స్వార్జితమైన ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వకపోతే అది అన్యాయమట. నిజానికి మన సమాజంలో ఎక్కడైనా ఒక కుటుంబంలో పిల్లల మధ్య ఆస్తుల పంపకం జరిగిన తర్వాత, సోదరుడు మళ్లీ తోడబుట్టిన వారికి తన ఆస్తిలో వాటా ఇవ్వడానికి సిద్దపడే పరిస్థితి ఉంటుందా? అయినా జగన్ సోదరిపై ఆప్యాయతతో అలా తన ఆస్తిని కూడా కొంత ఇవ్వాలని తలపెట్టారు. షర్మిల మొత్తం వ్యవహారాన్ని గందరగోళం చేసి, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు ఈడ్చారు. తమ కుటుంబానికి శత్రువు వంటి ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో చేతులు కలిపి ఇలాంటి కుట్రలకు తెరదీశారు. రాధాకృష్ణ వెనుక ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యమే. దీనిని గుర్తించిన జగన్ ఆ కుట్రలను చేధించారు. విజయనగరం పర్యటనలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కేవలం చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఇలాంటి ఉదంతాలను వాడుకుంటున్నారని, ఏ కుటుంబంలో గొడవలు ఉండవని ప్రశ్నిస్తూ, రాష్ట సమస్యలకు దీనికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు షర్మిలకు మద్దతుదారుగా నటిస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో తన సొంత మామ ఎన్.టి.రామారావును సీఎం. సీటు నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకు లాగిపారేస్తే ఆయన కుమిలి ,కుమిలి ఏడ్చారు. ఆ తర్వాత ఎన్.టి.రామారావుకు పార్టీ తరపున ఉన్న రూ.75 లక్షల డబ్బు కూడా ఆయనకు అందకుండా కోర్టు ద్వారా చంద్రబాబు లాగేసుకున్నారు. దాంతో తీవ్ర అవమాన భారంతో ఎన్.టి.ఆర్. మరణించారు. మరణానికి కొద్ది రోజుల ముందు ఎన్.టి.ఆర్ ఒక వీడియోలో మాట్లాడుతూ చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చి, పెద్ద మోసగాడని ధ్వజమెత్తారు. అంతేకాదు. ఎన్.టి.ఆర్. రెండో భార్య లక్ష్మీపార్వతికి ఆయన ఆస్తిలో సరైన వాటా దక్కకుండా ఆమెను రోడ్డుకు ఈడ్చారా? లేదా? చివరికి ఆమె తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. ఇది మామ పట్ల చంద్రబాబు వ్యవహరించిన అమానుష ధోరణి అయితే, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు తో కూడా ఆయనకు తగాదా వచ్చింది. రామ్మూర్తి చివరికి అన్నపై కోపంతో కాంగ్రెస్ లో కూడా చేరారు. ఇదంతా చంద్రబాబు కుటుంబ తగాదాల కింద రావా? చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలతో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారే. చంద్రబాబు తీరును తప్పుపడుతూ ఆయన బావమరిది హరికృష్ణ సొంత పార్టీ పెట్టుకుని పెద్ద ఎత్తున దూషణలు చేశారు. హరికృష్ణకు అప్పట్లో ప్రస్తుత ఎమ్.పి దగ్గుబాటి పురందేశ్వరి మద్దతు ఇచ్చేవారు. చంద్రబాబు తల్లి అమ్మాణమ్మకు హైదరాబాద్‌లోఉన్న అత్యంత విలువైన ఐదెకరాల భూమిని ఇతర సంతానానికి గాని, ఇతర మనుమళ్లకు కాని ఇవ్వకుండా చంద్రబాబు కుమారుడు లోకేష్ కు మాత్రమే ఆమె ఎందుకు ఇచ్చారన్న దానిపై జవాబు దొరుకుతుందా? జగన్, షర్మిల మధ్య వివాదంతో రాష్ట్రం అంతా ఏదో అయిందన్న భ్రాంతి కల్పించాలని చూస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలలో ఇలాంటివి జరగలేదా? ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావుపై ఆయన రెండో కుమారుడు సుమన్ ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారో తెలియదా? నిజమో, కాదో కాని కొంతకాలం క్రితం ఆస్తుల పంపిణీపై రామోజీ కుటుంబంలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఆంధ్రజ్యోతి పునరుద్దరణలో కీలక భూమిక పోషించి పెట్టుబడి పెట్టిన విజయ ఎలక్ట్రికల్స్ దాసరి జయరమేష్, నూజివీడు సీడ్స్ ప్రభాకర్ రావు ల వాటా ఎలా తగ్గిపోయింది? రాధాకృష్ణ వాటా ఎలా పెరిగింది? మొత్తం పెత్తనం అంతా ఈయన చేతికే ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తుంటారు. మరికొన్ని ప్రముఖుల కుటుంబాల గొడవలకు సంబంధించి పాత విషయాలు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఆయన మొదటి భార్య నందిని ఏకంగా కేసు పెడితే, రెండో భార్య రేణు దేశాయ్ ఆయన గురించి ఏమి చెప్పారో గుర్తు చేస్తున్నారు. తనకు రాజకీయంగా ఉపయోగపడుతున్నారు కనుక పవన్ కళ్యాణ్ ను ఆయన గొప్పవాడని ప్రచారం చేస్తారు. తేడా వస్తే ఇంతకన్నా ఘోరంగా చంద్రబాబు అవమానిస్తారు. ప్రధాని మోడీ పెళ్లాన్ని ఏలుకోలేని వాడని చంద్రబాబు అన్నారా? లేదా? తదుపరి తన అవసరార్థం ప్లేట్ మార్చి మోడీ చాలా గ్రేట్ అని ఉపన్యాసాలు చెబుతున్నారు కదా! రిలయన్స్ అంబానీ సోదరులు ఇద్దరూ ఆస్తుల విషయంలో కొంతకాలంం గొడవ పడ్డారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై ఆమె రెండో కోడలు మేనకా గాందీ కొన్ని ఆరోపణలు చేస్తూ తనకు ఎలా అన్యాయం చేశారో వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు వస్తాయి. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే షర్మిలపట్ల జగన్ అతి ప్రేమ చూపి అనవసరంగా చికాకు కొని తెచ్చుకున్నారని అనిపిస్తుంది. అయినా ఆయన ఇప్పటికీ కూడా తన అభిమానాన్ని కనబరుస్తూనే ఉన్నారు. షర్మిల తప్పు సరిదిద్దుకుంటే మళ్లీ ఆస్తులు ఇవ్వడానికి ఆలోచిస్తామని చెప్పడం కొసమెరుపు. కాని ఆమె ఇప్పటికే టీడీపీ ఎల్లో మీడియా వేసిన చక్రబంధంలో ఇరుక్కున్నారు.ఆమెను అడ్డు పెట్టుకుని వారు ఆడుతున్న ఈ డ్రామాకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పెద్ద కుట్రలో పావుగా షర్మిల..?
-
ఎవరి ట్రాప్ లో పడి ఎవరి కోసం షర్మిల ఇలా చేస్తుంది..?
-
జగన్ తీసుకుంది మంచి నిర్ణయమే..
-
అక్రమంగా షేర్ల బదలాయింపు జరిగిపోతే.. అవి ED, CBI అటాచ్ మెంట్ లో ఉంటే జరగబోయే పరిణామాలు ఏంటి..?
-
చెల్లిపై అపారమైన ప్రేమ కనిపిస్తుందా?.. లేక మోసం చేయాలని ఉద్దేశం ఎక్కడైనా కనిపిస్తుందా?
-
షేర్ల బదలాయింపు వెనుక అసలు వాస్తవం ఏంటి ?
-
జగన్ NCLTని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది..?
-
అన్న ఆస్తిలో చెల్లికి వాటా ఉంటుందా?
-
Big Question: చెల్లెమ్మ దాచిన నిజం..! షర్మిలమ్మా.. సమాధానం చెప్పు..
-
చంద్రబాబు, షర్మిల కుట్రను ముందే పసిగట్టిన జగన్..
-
షర్మిలతో కలిసి కూటమి కుయుక్తులు
-
KSR Live Show: అన్న వద్దు ఆస్తి కావాలి.. షర్మిల ఫిర్యాదులో.. పొలిటికల్ యాంగిల్
-
KSR Live Show: అన్న ఆస్తి కోసం చెల్లి కుట్ర..
-
ఎల్లో గ్యాంగ్ తో కలిసి షర్మిల కుట్రలు..
-
కాంగ్రెస్ అధ్యక్షురాలు కాదు... చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలు
-
అసలు ‘తల్లికి వందనం’ ఎప్పటి నుంచి ఇస్తారు?
సాక్షి, అమరావతి: ‘తల్లికి వందనం’ కార్యక్రమంపై రెండ్రోజుల క్రితం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గత వైఎస్సార్సీపీ సర్కారును విమర్శించగా.. అదే రోజు వైఎస్సార్సీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఆమె మళ్లీ శనివారం ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుకు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వంగా గీత గట్టిగా బదులిచ్చారు. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఇస్తుందా.. లేక ప్రతి తల్లికి మాత్రమే అంటూ జారీచేసిన జీఓ–29ని సరిదిద్దుతుందా? అసలు ఎప్పటినుంచి ఈ పథకాన్ని అమలుచేస్తారు?’ అంటూ షర్మిల పోస్టుకు జతచేస్తూ ప్రశ్నించారు.అంతకుముందు.. షర్మిల తన శనివారం నాటి పోస్టులో.. ‘బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుంది?’ అని ఆమె తన తీరును సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీలపై చర్చకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. ఈ పోస్టుకు గీత కౌంటర్ ఇచ్చారు. -
తల్లికి వందనంపై షర్మిల రియాక్షన్.. మర్చిపోయావా చెల్లీ..
-
Big Question: బాబుకు తెలిసింది ఒక్కటే "టార్గెట్ జగన్"
-
అసత్యాలు చెబుతున్న షర్మిల.. ఇవిగో వాస్తవాలు
సాక్షి, అమరావతి: ‘అమ్మ ఒడి’ పథకం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్లు అమలు చేసి చూపిన చరిత్ర వైఎస్ జగన్‌ది. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు మాట నిలుపుకున్నారు. జగన్ ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు సహా కూటమి నేతలంతా హామీ ఇచ్చారు.జగన్, చంద్రబాబు హామీ మధ్య తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తోంటే ఎవరు మోసం చేసింది షర్మిలకు కనిపించడం లేదు కాబోలు. జగన్ కూడా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తానని చెప్పారని ఇప్పుడు షర్మిల చెప్పడం.. ముమ్మాటికీ మాట తప్పిన చంద్రబాబును కాపాడటానికేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా కనిపించే మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అయితే.. కనిపించని నాలుగో పార్టీనే రాష్ట్ర కాంగ్రెస్ అన్నది షర్మిల మాటలను బట్టి మరోసారి నిరూపితమైంది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను చూడకుండానే శుక్రవారం ఆమె విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ జగన్‌పై ఆరోపణలు గుప్పించడం విస్తుగొలుపుతోంది. ప్రతిపక్ష పార్టీగా అధికార పక్ష హామీలపై నిలదీయాల్సింది పోయి.. జగన్‌ను తప్పు పట్టడం విస్తుగొలుపుతోంది. అసాధ్యమైన హామీలతో ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయలేక ఆత్మరక్షణలో పడగానే షర్మిల హఠాత్తుగా తెరపైకి వచ్చారు. తల్లికి వందనం పథకంపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవడాన్ని ప్రశ్నిస్తారని అంతా భావించారు. సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎప్పటి నుంచి అమలు చేస్తారని నిలదీస్తారనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా షర్మిల చంద్రబాబుకు రాజకీయంగా వత్తాసు పలకడం ద్వారా చంద్రబాబు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనని స్పష్టమైంది. చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకం అమలులో ప్రజలను మోసగించిన తీరును వివరిస్తూ సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ షర్మిల వైఎస్సార్సీపీని విమర్శిస్తూ చంద్రబాబు స్క్రిప్‌్టను వినిపించడం విస్మయపరిచింది. జగనన్న అమ్మ ఒడితో విద్యా విప్లవం » ‘జగనన్న అమ్మ ఒడి పథకం’ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. విద్యా రంగంలో విప్లవాన్ని తీసుకురావడమే కాకుండా సామాజిక, సాంఘిక సంస్కరణగా గుర్తింపు పొందింది. జగన్ కచ్చితమైన క్యాలండర్‌ను అనుసరిస్తూ ఈ పథకం కింద నాలుగేళ్లలో రూ.26,067.28 కోట్లు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. » వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే అన్ని పథకాలు ఈపాటికి సక్రమంగా అమలయ్యేవని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి పథకం రూ.6,500 కోట్లు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. విద్యా దీవెన పథకం రెండు విడతల్లో రూ.1,400 కోట్లు ఖాతాల్లో వేసేవారు. వసతి దీవెన పథకం కింద రెండు విడతల కింద రూ.1,100 కోట్లు లబ్ధిదారులకు అందేవి. వైఎస్సార్ రైతు భరోసా మొదటి విడత కింద రూ.7 వేల కోట్లకుపైగా అన్నదాతలకు జమ చేసేవారు. మత్స్యకార భరోసా కింద రూ.130 కోట్లు మత్సకారులకు దక్కేవి. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.1,400 కోట్లు అందేవి. » ఈ విషయాలన్నీ చెబుతూ షర్మిల చంద్రబాబును నిలదీయాలి. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్ని0చాలి. రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం, పిల్లలందరికీ రూ.15 వేలు, మత్స్యకార భరోసా, 1.85కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1,500, 1.60 కోట్ల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారని అడగాలి. బాబుకు మేలు చేసేందుకే ఆమె రాజకీయం చేస్తున్నారని ప్రజలు గమనించారు. అందుకే ఆమెకు కడప లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ దక్కలేదు. రాష్ట్రంలో పేదల గొంతును వినిపించేది.. సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడేది వైఎస్సార్సీపీయేనని ప్రజలు గుర్తించారన్నది సుస్పష్టం. షర్మిల ఇకనైనా తెలుసుకో.. -
ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ.. షర్మిలను రేవంత్ గెలిపిస్తాడంట!
గుంటూరు, సాక్షి: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితం అయ్యిందని.. అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తోందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. వైఎస్సార్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు.మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితం అయింది. ప్రస్తుతం టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. కేవలం తన అన్న జగన్ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతోంది. వైఎస్సార్ మీద అంత మమకారం ఉంటే.. ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు?. .. కడపలో బై ఎలక్షన్ వస్తుందని ఎల్లోమీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని పట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడే కూర్చుని ఉంటారని అనడం విడ్డూరం. మహబూబ్ నగర్ గెలిపించుకోలేని రేవంత్.. కడపలో షర్మిలను గెలిపిస్తాడంట. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే విభజననష్టం. ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు?.. .. వైఎస్సార్ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. జగన్ అంతకుమించి చేశారు. ప్రజల గుండెల్లో జగన్ గొప్పగా ఉన్నారు. ఎన్నికల్లో జరిగిన మాయాజాలం గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అయినా దాని గురించి ప్రస్తుతం మేము మాట్లాడదల్చుచుకోలేదు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి పొత్తుల కోసం వెంపర్లాడలేదు. మేము పొత్తు లు పెట్టుకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదు. చంద్రబాబు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం. ఆ తర్వాత ప్రజాపోరాటాలు చేస్తాం అని రవిచంద్రారెడ్డి అన్నారు. -
షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు!: సీపీఐ నారాయణ
హైదరాబాద్, సాక్షి: రాజకీయాల్లో జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ దివంగత మాజీ సీఎం డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, అయితే ఆయనకు ఆ గుర్తింపు ఊరికే రాలేదని అన్నారు సీపీఐ నారాయణ. సోమవారం (జులై 8న) వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్న నారాయణ.. వైఎస్సార్ రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీలోనూ వైఎస్సార్‌ను చాలామంది ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ ఇబ్బందులు కొనసాగాయి. సొంత పార్టీ, బయటి పార్టీల నుంచి రాజశేఖర్‌రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఆ కష్టాలు ఎదుర్కొని నిలపడ్డారు కాబట్టే ‘జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్’ అయ్యారు’’ అని నారాయణ అన్నారు. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న వైఎస్సార్ తనయ షర్మిలపైనా నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలమ్మకి ఇంకా అన్ని కష్టాలు రాలేదు. ఒకవేళ షర్మిలకు ఏమైనా కష్టాలు వస్తే.. అవి ఆమె సొంత పార్టీ నుండే వస్తాయి. కాబట్టి ‘షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు..’ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు? -
షర్మిల ఒంటెత్తు పోకడలు..
-
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అన్ని కమిటీలు రద్దు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని విభాగాలు రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీల రద్దు నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త కమిటీలతో రాబోతున్నామని ఆమె పేర్కొన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన ఫలితాల్ని చవిచూసింది. దీంతో ఢిల్లీకి షర్మిలను రప్పించుకున్న హైకమాండ్.. ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్టీ పునర్మిర్మాణంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. -
ఈ తరహా దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఆగ్రహం
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల అరాచకాలపై సర్వత్రా ఖండనలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఈర్ష్య, అసూయలతో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాల్లేవీ ఉండకూదని పచ్చ మూకలు దాడులకు తెగపడుతోంది. ఈ క్రమంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె ఈ దాడుల్ని ఖండిస్తూ ఓ సందేశం ఉంచారు. ‘‘రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం.రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి…— YS Sharmila (@realyssharmila) June 9, 2024.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని సందేశం ఉంచారామె. మరోవైపు.. ఏపీలో టీడీపీ శ్రేణుల దాడుల్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లంరాజు ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారారయన. -
భ్రష్టు పట్టించారు.. షర్మిలపై సొంతపార్టీ నేతల ఆగ్రహం
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు.‘‘ రాహుల్ గాంధీకి విలువ ఇచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేశాం. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందా?. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసింది. షర్మిల క్యాడర్‌ను గాలికి వదిలేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాను. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. రాహుల్ గాంధీ ధైర్యంగా మోదీకి ఎదురుగా నిలబడ్డారు’’ అని ఆమె అన్నారు. -
Sharmila పొలిటికల్ ఫ్యూచర్?
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంట్‌కు పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాక తప్పదు. పోల్మేనేజ్మెంట్లో ఎవరికి తీసిపోదు. త్రిముఖ పోటీలో గెలుపు అంచుల వరకు వస్తుంది.’’ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. ఇప్పుడామెకు డిపాజిట్ దక్కే అవకాశం లేదని సెఫాలజిట్లు చెబుతున్నారు. కడప పార్లమెంట్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్ల ల్లో కూడా డిపాజిట్టు గగనమే. దీంతో షర్మిల చరి్మషా ప్రశ్నార్థకం కానుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల, ఓ సందర్భంలో ‘ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. నాజీవితం ఇక్కడే ముడిపడి ఉంది, చావైనా, బతుకైనా ఇక్కడేనని’ చెప్పుకొచ్చింది. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. స్పీడ్‌గా అన్ని జిల్లాలను చుట్టేసిన ఆమె తుదకు కడప పార్లమెంట్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా బరిలో నిల్చింది. సేమ్ డైలాగ్ ఇక్కడ కూడా వర్తింప జేసింది. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీ ఆడబిడ్డను ఆదరించండి, మీకోసం తుది వరకు అండగా నిలుస్తానంటూ కోరారు. అంతవరకు బాగానే ఉన్నా, ఆపై అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన అస్త్రంగా చూపి ఓట్లు అభ్యర్థించడం ఆరంభించింది. ఎప్పుడు తిరగని, చూడని గ్రామాలకెళ్లినా పట్టణాలకెళ్లినా పనిగట్టుకొని అమె విమర్శలు గుప్పించింది. మరోవైపు పులివెందుల ప్రాంతలో సెంటిమెంట్ అ్రస్తాన్ని సైతం ప్రయోగించి, కొంగు చాచి ఓట్లు అడిగింది. ఇంతచేసినా సెఫాలజిట్లు షర్మిలకు కడప పార్లమెంట్లో డిపాజిట్ దక్కదని స్పష్టం చేశారు. మంగళవారం వెలువడే ఎన్నికల ఫలితాల్లో అదే రుజువవుతుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. తులసిరెడ్డికి చేదు అనుభవంకడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల తొలివిడత ప్రచారంలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెన్నంటే ఉన్నారు. జిల్లా వాసులకు పరిచయం చేస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. రెండోవిడత ప్రచారంలో తులసిరెడ్డి ఎక్కడా లేరు. వాగ్దాటి పటిమ ఉన్న తులసిరెడ్డిని కావాలనే దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈమారు షర్మిల పర్యటన కనీస సమాచారం కూడా ఇవ్వకుండా చేపట్టినట్లు సమాచారం. క్రియాశీలక మైనార్టీ నాయకుడు సత్తార్ పరిస్థితి కూడా అంతే. వీరంతా షర్మిల కంటే ముందు కాంగ్రెస్ గళాన్ని జిల్లాలో విన్పించిన నాయకులు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహార శైలితో పక్షం రోజుల వ్యవధిలో అంటీముట్టనట్లు ఉండిపోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎన్నికల సందర్భంలో పార్టీ ఇమేజ్ పెంచుకోకపోగా, ఉన్న వారిని కూడా చేజార్చుకున్న పరిస్థితి ఉతప్పన్నమైందని విశ్లేషకులు వివరిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చులు సైతం.... షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ముందుకు వచ్చారు. కారణం ఎన్నికల, పోలింగ్ బూత్ ఖర్చులు అమె భరిస్తుందని భావించారు. పోటీ చేసినా ఆయా అభ్యర్థులు కూడా చేదు అనుభవం చవిచూశారు. కడపలో పోలింగ్ బూత్ ఖర్చుల విషయమై ఏజెంట్లుగా నిలుచున్న పలువురు ఆ తర్వాత కూడా అభ్యర్థి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన నేపథ్యంలో గణనీయమైన ఓట్లు సాధించి డిపాజిట్టు దక్కించుకుంటేనే షర్మిలకు పారీ్టలో కనీస గౌరవం ఉంటుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.కాంగ్రెస్‌వాదులకు దక్కని మర్యాద... ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొర విని్పంచుకోగా, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలకి ఏపీలో గడ్డుపరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులకు మర్యాద దక్కలేదు. అందులో భాగంగా పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నజీర్ అహమ్మద్ షరి్మల బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ఆ పారీ్టకి దూరమయ్యారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించి తర్వాత తెలంగాణకు చెందిన ఎస్కే బాషిద్ను ప్రకటించారు. మనస్థాపం చెందిన ఆయన కాంగ్రెస్ పారీ్టకి దూరమయ్యారు. హైదరాబాద్‌లో స్థిర పడిన బాషిద్ ఎంపిక వెనుక షరి్మల సన్నిహితుల సిఫార్సులేనని స్పష్టమవుతోంది. అలాగే కడప నగరానికి చెందిన జక్కరయ్య పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసిన సందర్భంలో సైతం ఆ పార్టీ జెండాను జక్కరయ్య వీడలేదు. కడప అభ్యరి్థత్వం రాత్రికి రాత్రే మార్పు చేశారు. జిల్లాలో క్రియాశీలక టీడీపీ నాయకుడితో కుదిరిన రహస్య ఒప్పందం మేరకు వైఎస్సార్సీపీ నేతగా ఉన్న అఫ్జల్‌ఖాన్‌ను తెరపైకి తెచ్చారు. -
చంద్రబాబు–షర్మిల మిలాఖత్
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి బెంబేలెత్తిపోయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన, బీజేపీలతో జతకట్టి.. చివరికి పీసీసీ చీఫ్ షర్మిలతోనూ మిలాఖత్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌పై దుష్ఫ్రచారం చేసి, తాను సూచించిన అభ్యర్థులను కాంగ్రెస్ తరఫున బరిలోకి దించేలా బాబు స్కెచ్ వేశారు. ఇందుకు ప్రతిఫలంగా కడప లోక్‌సభ స్థానంలో షర్మిలకు టీడీపీ–బీజేపీ ఓట్లు బదలాయించేలా వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. కడప లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేతలు ఆర్. శ్రీనివాసులురెడ్డి, మల్లెల లింగారెడ్డి వంటి వారిని కాదని ఎవరికీ పెద్దగా తెలియని భూపేష్‌రెడ్డిని చంద్రబాబు బరిలోకి దించారు. నిజానికి.. భూపేష్‌రెడ్డి చిన్నాన్న ఆదినారాయణరెడ్డి అదే లోక్‌సభ స్థానం పరిధిలోని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తుండటం గమనార్హం. ముందస్తుగా కుదిరిన లోపాయికారి ఒప్పందం మేరకు కడప లోక్‌సభ అభ్యర్థిగా డమ్మీని బరిలోకి దించిన చంద్రబాబు.. ఇప్పుడు షర్మిలకు టీడీపీ–బీజేపీ ఓట్లను బదలాయించేలా కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు–షర్మిల మధ్య కుదిరిన ఈ రహస్య ఒప్పందం చింతలపూడి నియోజకవర్గంలోనూ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రోషన్, కాంగ్రెస్ అభ్యర్థి ఎలీజా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ప్రచారం చేస్తుండటమే అందుకు నిదర్శనం.దారితప్పిన బాటసారి..నిజానికి.. తెలంగాణలో రాజకీయ శూన్యత లేకపోయినా వాస్తవాన్ని అంచనా వేయలేక.. రాజకీయంగా తనను తాను ఎక్కువగా ఊహించుకుని 2021, జూలై 8న వైఎస్సార్టీపీని షర్మిల స్థాపించారు. అదే సమయంలో.. షర్మిల, ఆమె భర్త అనిల్ వ్యక్తిత్వాలను హననం చేస్తూ గతంలో దుష్ఫ్రచారం చేసిన ఎల్లో మీడియా ఆమెకు అనుకూలంగా కథనాలు వండివార్చడం మొదలుపెట్టింది. వైఎస్సార్టీపీ స్థాపించడానికి కాస్త ముందు ఇడుపులపాయలో, పులివెందులలో ఏవేవో జరిగిపోతున్నట్లుగా ఎల్లో మీడియా రాసిన విషపు రాతలను షర్మిల ఖండించలేదు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే.. షర్మిల ఎల్లో మీడియాతోపాటు చంద్రబాబు డైరెక్షన్లోనే రాజకీయ ప్రయాణం మొదలైందని అప్పట్లో రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ‘తెలంగాణలోనే నా బతుకు.. చావు ఇక్కడే’.. అంటూ వైఎస్సార్టీపీ స్థాపించినప్పుడు శపథం చేసిన షర్మిల.. తాను పాలేరు, మరోచోట పోటీచేస్తానని.. మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతానని ప్రకటించారు. పైగా.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో పెట్టుకుని ఓట్లు అడగడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీన్ కట్‌చేస్తే.. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే చంద్రబాబు డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిల భేషరతుగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఆదేశాలతోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనంచేసి ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నారు. -
చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, సునీత
పులివెందుల/లింగాల: తన అక్కలైన షర్మిల, సునీతలు చంద్రబాబు ట్రాప్‌లోపడి తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. 2021 నుంచి వారిద్దరూ తనను మానసికంగా ఎంతో ఇబ్బందిపాల్జేశారన్నారు. చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, ఎల్లో మీడియా ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివి ఇష్టమొచ్చినట్లు నన్ను, జగనన్నను తిడుతున్నారని.. అయినా, వారిపట్ల తనకెలాంటి కోపంలేదని చెప్పారు. వైఎస్ వివేకాను హత్యచేశానన్న వ్యక్తిని వారు ప్రోత్సహిస్తున్నారని, అతడు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నా.. అతడిని ఓడించాలని ఒక్కమాట కూడా అనడంలేదన్నారు. హంతకుడు అప్రూవర్‌గా మారడంతో అతడినే సోదరుడిగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినాశ్‌రెడ్డి రోడ్ షో, బస్టాండులో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..సభ్యతతో ప్రతి విమర్శలు చేయడంలేదు..వారిద్దరూ తనను ఎన్ని విమర్శలు చేసినా అదే రీతిలో తాను చేయగలను. కానీ, సభ్యత, సంస్కారాలవల్ల చేయడంలేదు. మా నాన్నను తప్పుడు ఆరోపణలతో 385 రోజులు జైల్లో పెట్టారు. ఎవరికీ ద్రోహం చేయలేదు, మనకెందుకీ శిక్ష అని అంటూ ఆయన బాధపడ్డారు. దేవుడి దయ, మీ ఆశీస్సులు ఉన్నంతవరకు మేం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటాం. ఇక దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల మరణాలకు కారణం ఎవరు? ఎక్కడ కుట్ర జరిగింది? ఎవరికి మేలు చేసేందుకు ఇలాంటివి చేశారన్న నిజాలను ఎన్నివేల అడుగుల లోతున దాచిపెట్టి ఉన్నా బయటికి వస్తాయి. వారికి కడప కోర్టు జరిమానా..వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చి టీడీపీకి లబ్ధిచేకూర్చాలని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఇచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏమీచేయలేరు. ఇక కొద్ది గంటలముందే కడప కోర్టు వీరుచేసే దుష్ప్రచారాలకు జరిమానా విధించింది. కేసు ట్రయిల్‌కు రాకముందే మీరెలా మాట్లాడతారని షర్మిలక్కకు, సునీతక్కకు, వారి సోదరుడు బీటెక్ రవికి రూ.10 వేలు జరిమానా విధించింది.న్యాయస్థానాలు కూడా వీరు చేసేది తప్పని చెబుతున్నాయి. వీరి టార్గెట్ కేవలం వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే. నా నిజాయితీని నూరు శాతం నిరూపించుకుంటా. ఇక ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లువేసి, వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఎంపీ అభ్యర్థినైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మా కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను. -
షర్మిల, సునీత, బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు షాక్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: అడ్డగోలు ఆరోపణలు, దుష్ప్రచారంతో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాజకీయ లబి్ధకోసం వాడుకుంటున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.వివేకా హత్యకేసు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడొద్దని, దుష్ప్రచారం చేయవద్దని చంద్రబాబునాయుడు, లోకేశ్, షర్మిల, సునీత, బీటెక్ రవి, పవన్‌కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు ఆ పార్టీల కేడర్‌ను ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది.మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ షర్మిల, సునీత, బీటెక్ రవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న వివేకా హత్యకేసు గురించి మాట్లాడటానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. షర్మిల, సునీత, బీటెక్ రవిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఖర్చుల కింద విధించింది. ఆ మొత్తాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణను జూన్ 19కి వాయిదా వేశారు. తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్‌కళ్యాణ్, లోకేశ్, వివేకా కుమార్తె సునీతారెడ్డి తదితరులు చేస్తున్న దు్రష్పచారంపై వైఎస్సార్సీపీ కడప జిల్లా కోర్టులో దావా వేసింది. తమ పార్టీతోపాటు పార్టీ అధ్యక్షులు జగన్, కడప ఎంపీ అభ్యర్థితోపాటు పార్టీకి చెందిన వారిపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతారెడ్డిలను నిరోధించాలంటూ వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు కె.సురే‹Ùబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన జిల్లా కోర్టు.. వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నందున వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ చేస్తున్న దు్రష్పచారాన్ని ఆపాలని చంద్రబాబు, షర్మిల, సునీత, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి తదితరులను ఆదేశిస్తూ గతనెలలో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేలి్చచెప్పింది. జగన్మోహన్రెడ్డి, అవినాశ్‌రెడ్డిలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది.కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలంటూ షర్మిల, సునీత, బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ కడప జిల్లా కోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు వేశారు. షర్మిల తదితరుల వ్యాజ్యాలపై విచారించిన హైకోరుŠట్ ధర్మాసనం కడప కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత కోసం కడప కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. షర్మిల తదితరుల అనుబంధ వ్యాజ్యాలపై కడప జిల్లా కోర్టు మూడు రోజులుగా విచారిస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున పిటిషన్ వేయడంపై షర్మిల తదితరుల న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వ్యాఖ్యల వల్ల నష్టం వాటిల్లిందని భావిస్తే జగన్మోహన్రెడ్డి లేదా అవినాశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయాలే తప్ప పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదని చెప్పారు. ఈ వాదనలను వైఎస్సార్సీపీ న్యాయవాదులు ఎం.నాగిరెడ్డి, కె.సుదర్శన్‌రెడ్డి తోసిపుచ్చారు. తాము ఇచ్చిన ఆధారాలతో సంతృప్తి చెందినందునే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరుల తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి వెళితే ఓట్లపరంగా వైఎస్సార్సీపీకి నష్టం కలుగుతుందని, అందుకే పార్టీ తరఫున పిటిషన్ వేశామని తెలిపారు. వివేకా హత్యకేసు గురించి మాట్లాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా షర్మిల తదితరులు ఆ కేసు గురించి మాట్లాడారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బుధవారం జిల్లా జడ్జి కోర్టు హాల్లోనే ఉత్తర్వులను వెలువరించారు. నాగిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి వాదనలతో జడ్జి ఏకీభవించారు. మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ షర్మిల ఆ కేసు గురించి మాట్లాడారన్న వారి వాదనను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు నిరాకరిస్తూ.. షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేశారు. -
షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా గుర్రాలచింతలపల్లెకు వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను స్థానికులు అడ్డుకున్నారు. అనిల్‌కుమార్ స్నేహితుడినంటూ కొండలరావు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండిపడ్డారు. మైనింగ్ వాహనాలు బాడుగకు తీసుకొని.. దాదాపు రూ.4 కోట్ల వరకు బకాయి పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డబ్బుల గురించి కొండలరావును ప్రశ్నిస్తే ‘ఇది షర్మిల కంపెనీ’ అంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. వెంటనే తమ బకాయి డబ్బులివ్వాలని నిలదీశారు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం చాబలి గ్రామంలో బెనిటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట 163 ఎకరాల్లో ఐరన్ ఓర్ లీజు లభించింది.వేణుగోపాల్ డైరెక్టర్‌గా ఉన్న ఆ కంపెనీ 203, ఆదిత్య ఎలెట్, బి.ఎస్.మక్తా, సోమాజిగూడ, హైదరాబాద్ అడ్రస్‌లో ఉంది. ఏపీఆర్ 2278 నంబర్‌తో మంజూరైన లీజు గడువు 2024 నవంబర్ 9వ తేదీ వరకు ఉంది. ఈ ఐరన్ ఓర్ గనుల్లో పదేళ్లుగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను స్థానికంగా కొండలరావు అనే వ్యక్తి చూసేవాడు. అతను షర్మిల భర్త అనిల్‌కుమార్‌కు స్నేహితుడిగా చెప్పుకుంటూ.. స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. ఇక్కడి వారి నుంచి టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు తీసుకొని మొదట్లో నెలవారీ బాడుగలు సక్రమంగా చెల్లించేవాడు. ఆ తర్వాత బకాయిలు పెండింగ్ పెడుతూ వచ్చాడు. అవి కోట్లాది రూపాయలకు చేరుకోవడంతో స్థానికులు డబ్బుల గురించి కొండలరావును అడగడం మొదలుపెట్టారు. అతను పట్టించుకోకపోవడంతో రెండేళ్ల క్రితం మాచునూరు గ్రామస్తులు కంపెనీ ప్రాంగణంలో ధర్నా చేశారు. అప్పట్లో సగం డబ్బులు చెల్లించి.. మిగిలినవి తర్వాత ఇస్తానని చెప్పాడు. అనంతరం ఆ డబ్బుల గురించి నిలదీయగా.. ‘షర్మిల కంపెనీ ఇది. తమాషా చేస్తున్నారా.. డబ్బులిస్తాం. వెయిట్ చేయండి’ అంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచి కొండలరావు కంపెనీ వైపు రావడమే మానేశాడు. ట్రాన్స్పోర్ట్, టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు.. ఇలా బాడుగకు ఇచ్చిన అందరివీ కలిపి దాదాపు రూ.4 కోట్లకు పైబడి ఎగ్గొట్టినట్లు బాధితులు వాపోయారు. మాకు న్యాయం చేయండి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి న షర్మిలను బాధితులు గౌరీశంకర్రెడ్డి, మహేశ్వరరెడ్డి నిలదీశారు. ఆమె స్పందిస్తూ.. తనకు ఆ కంపెనీతో సంబంధం లేదని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. షర్మిల, అనిల్ పేర్లు చెప్పడం వల్లే ఇన్నాళ్లు ఆగాంబెనిటా మైన్స్‌లో టిప్పర్లు, బుల్డోజర్లు, ట్యాంకర్లు బాడుగకు పెట్టుకొని బకాయిలివ్వలేదు. 6 నెలలుగా కొండలరావు ఇక్కడికి రావడం లేదు. వైఎస్ కుటుంబానికి విధేయులమైన మేము షర్మిల, అనిల్ వల్లే ఇంతకాలం కొండలరావు ఏం చెప్పినా భరించాం. అదే విషయాన్ని షర్మిల దృష్టికి తీసుకెళ్లాం. నా ఒక్కడికే రూ.6.5 లక్షలు చెల్లించాల్సి ఉంది.మహేశ్వరరెడ్డితో కలిపి రూ.11 లక్షలు ఇవ్వాలి. మాచునూరు, ఆర్వేటిపల్లె చాబలి, రాజంపేట, ఇతర ట్రాన్సుపోర్టర్లు అందరికీ బకాయి పెట్టారు. దాదాపు రూ.4 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. షర్మిల, అనిల్ పేర్లు చెప్పి బెదిరించారు. లేదంటే మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకొని బకాయిలు రాబట్టుకునేవాళ్లం. – గౌరీశంకర్రెడ్డి, గుర్రాలచింతలపల్లె -
నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య ఐదేళ్ల క్రితం జరిగితే ఇప్పుడెందుకు దాని గురించి ఇంతలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు ఎందుకు మసాలా జోడిస్తున్నారని నిలదీసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఓవైపు కేసు విచారణలో ఉంటే నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా చెబుతారని నిలదీసింది. అలాగే హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించింది. ఇలా చెప్పడం తప్పు కాదా? నేరపూరిత చర్యల కిందకు రాదా? అని నిలదీసింది. అలాంటప్పుడు కడప కోర్టు అంత అత్యవసరంగా ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రశ్నించారు. దీనికి హైకోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టును నిందించవద్దని హెచ్చరించింది. వివేకా హత్య గురించి మాట్లాడొద్దని, అలాగే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ ముగించాలని కడప జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 8లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.తద్వారా కడప జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత, బీటెక్ రవి, షర్మిల దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.వివేకా హత్య కేసుకు మసాలా ఎందుకు కలుపుతున్నారు..?ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించింది. అలా హంతకుడని చెప్పడం కోర్టు ధిక్కారమే అవుతుందని వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఫలానా వ్యక్తి (ముఖ్యమంత్రి) నిందితులను రక్షిస్తున్నారని ఎలా చెబుతారని నిలదీసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పబ్లిక్ డాక్యుమెంట్ అని, తాము మాట్లాడుతోంది అందులో అంశాలనేనని మురళీధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసుకు ఎందుకు మసాలా కలుపుతున్నారని ప్రశ్నించింది. తాము అలాంటిదేమీ చేయడం లేదని గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును నారాసుర రక్తచరిత్ర అంటూ ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. అదే తాము మాట్లాడుతుంటే తప్పుపడుతున్నారన్నారు. సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నేతల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటిదేమీ చేయకుండా నేరుగా కోర్టులో వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 8 తేదీలోపు బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించాలని కడప జిల్లా కోర్టును ఆదేశించింది.సునీత తదితరుల వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు..వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సునీత, తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు అక్కడే పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. వాటిపై కడప జిల్లా కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మళ్లీ ఇదే అంశంపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తాము పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని కోరారు. బీటెక్ రవి తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్సీపీ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న తమ వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
అన్నావదినపై విషం కక్కుతారా..
-
షర్మిల ఆడియో లీక్
-
వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీల్చి, చంద్రబాబుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైంది. పాడేరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావును విరమింపజేయడానికి షర్మిల చేసిన ప్రయత్నం షర్మిల ఎల్లో రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వైఎస్సార్సీపీ ఓట్లు కోసమే బుల్లిబాబుకి టికెట్ ఇచ్చామంటూ సుబ్బారావుతో షర్మిల మాట్లాడిన ఆడియో లీకవడంతో అడ్డంగా దొరికిపోయారు.పాడేరు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల తొలుత వంతల సుబ్బారావును ఎంపిక చేశారు. ఇటీవల పాడేరులో జరిగిన సభలో కూడా సుబ్బారావే అభ్యర్థి అని ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి బుల్లిబాబు కాంగ్రెస్‌లోకి రావడంతో షర్మిల ప్లేటు ఫిరాయించారు. సుబ్బారావును కాదని బుల్లిబాబుకు టికెట్ ఇచ్చారు. దీంతో వంతల సుబ్బారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో షర్మిల సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే బుల్లిబాబుకి టికెట్ ఇస్తున్నామనీ.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. రెబల్‌గా బరిలో ఉంటే పార్టీలోకి మళ్లీ రాలేరంటూ హెచ్చరించారు. మీ సభలకంటే నా సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారంటూ సుబ్బారావు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఆడియోలో ఏముందంటే..షర్మిల: నమస్తే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్ట్స్ టైమ్ తప్పకుండా ఆపర్చ్యూనిటీ ఇస్తాం. పార్టీలో సముచితమైన స్థానం, గౌరవమిస్తాను. మీరు నా సొంత అన్న లెక్క అన్నా. అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా. నేనైతే మీకియ్యాలనే అనుకున్నానన్నా. కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సీపీఎంకు ఇచ్చేశారు. ఈ సీటు బల్లిబాబుకు ఇమ్మన్నారు. మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో.. నా టీమ్ ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు. అది వాస్తవం కాదు కదా అన్నా..సుబ్బారావు: నేనేమీ ప్రచారం చెయ్యలేదు. నేనైతే ఎక్కడా మీ గురించి కానీ, పార్టీ గురించి కానీ ప్రచారం చెయ్యలేదు.షర్మిల: సరే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కావద్దు. నెక్ట్స్‌టైమ్ తప్పకుండా అవకాశం ఉంటుంది. కమ్ బ్యాక్.సుబ్బారావు: ఇంత అన్యాయం ఏంటి మేడం. ఏ రోజూ జెండా మోయని వాడికీ, పార్టీలో లేనివాడికీ ఇచ్చెయ్యడం వల్ల నాకు బాధ ఉంది. మరొక్క విషయం.. మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చెయ్యకపోయినా బాగుండేది. మీరు ప్రకటన చెయ్యడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్లు కూడా ఫీలయ్యారు.షర్మిల: అన్నా.. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము. రెండూ కలిసొస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా.సుబ్బారావు: నేనిప్పుడు చూశాను.. మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది. మొన్న నా జనాల్ని చూస్తే.. మీకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది వచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకుండా. వీడియోలు పెట్టమంటే పెడతాను. చూడండి. నేను ఓటు బ్యాంకు ఉన్నవాడిని. కానీ.. గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చూడండి. నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను.షర్మిల: అన్నా.. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఇంక కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి.సుబ్బారావు: మర్చిపోవాలంటే.. మర్చిపోతానిక.షర్మిల: మర్చిపోండి.. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మళ్లీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్‌గా పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్లా మీరు కాంగ్రెస్‌లోకి రాలేరు.సుబ్బారావు: నా భవిష్యత్తే డ్యామేజ్ అయ్యింది. నాకింకేముంది మరి.షర్మిల: అదే అన్నా.. ఇప్పుడు ఆలోచించుకోండి. మళ్లీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అని వెనక్కొస్తే మీకిక్కడ స్థానం ఉండదు.సుబ్బారావు: మంచిదే కదా. -
ఒళ్ళు దగ్గర పెట్టుకో చెల్లెమ్మ.. షర్మిల, సునీతలకు స్ట్రాంగ్ వార్నింగ్
-
ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల
అల్లూరి,సాక్షి: వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే విపక్షాల కుట్రగా కనిపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఈ చీఫ్ ట్రిక్స్‌లో భాగం అయ్యారు. తాజాగా ఆమె ఆడియో క్లిప్ బయటకు రావడంతో ఆ కుట్ర బయటకు వచ్చింది.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున బుల్లిబాబు పోటీ చేస్తున్నాడు. అయితే ఈయన అభ్యర్థిత్వం కంటే ముందు ఇక్కడ రేసులో ఉంది వంతల సుబ్బారావు. బుల్లిబాబు వైఎస్సార్సీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. చేరి చేరగానే బుల్లిబాబునే పాడేరు అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న సుబ్బారావు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలకే కాకుండా.. ఓటు బ్యాంకు ఏనాడో కనుమరుగైన కాంగ్రెస్‌లోనూ రెబల్స్ పోటు ఆసక్తికర చర్చకు దారి తీసింది. దీంతో వంతల సుబ్బారావుతో రాయబారానికి దిగారు. మీరు సొంత అన్నమాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె. అయితే.. ఏనాడూ జెండా మోయనోడికి టికెట్ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పర్చిందని షర్మిలతో ఆయన అన్నారు.కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మరిచిపోవాలంటూ బెదిరింపు స్వరంతో కోరారామె. చివర్లో.. కాంగ్రెస్‌కు డ్యామేజ్ చేయొద్దంటూ షర్మిల కోరగా.. తన భవిష్యత్తు ఆల్రెడీ డ్యామేజ్ అయ్యిందని ఆయన బదులిచ్చారు. -
వైఎస్ఆర్సీపీ పై షర్మిల కుట్ర.. ఆడియో లీక్ తో అడ్డంగా దొరికిపోయింది..
-
వైఎస్సార్ పేరును కాంగ్రెస్సే ఇరికించింది
సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగా వైఎస్సార్ పేరును కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారన్నారు. తాను ఇరికించానని ఆమె నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే షర్మిల దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్‌ను కాంగ్రెస్ పార్టీ దోషిగా చిత్రీకరించే కుట్రలను అడ్డుకునేందుకు తాను న్యాయపరంగా పోరాటం చేశానన్నారు. కానీ, షర్మిల మాత్రం వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పంచన చేరి తనపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్సార్ పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్న షర్మిల వ్యాఖ్యలను వీడియోలను ప్రదర్శించి పొన్నవోలు వినిపించారు. వైఎస్సార్‌పై కేసులు పెట్టింది కాంగ్రెస్ అన్న షర్మిల.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నాతో ఎవరూ కేసులు వేయించలేదు.. కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్సార్ పేరును అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ కోర్టుకు లేఖలు రాశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తాను మాటలు మార్చట్లేదన్నారు. ‘వైఎస్సార్ పేరును కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని స్పందించాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్లో నేను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్‌ను చూడలేదు.. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆనాడు వైఎస్సార్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్రపతికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కేసుల్లో సంతకాలు చేసిన మంత్రులు, సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. కానీ వైఎస్సార్, వైఎస్ జగన్ ఎలా బాధ్యులు అవుతారు. ఈ వాస్తవం కోర్టుకు వివరించే ప్రయత్నం చేశాను’ అని పొన్నవోలు వివరించారు. రాజధానిలో చంద్రబాబు భూదోపిడీ, వందల కోట్ల విలువైన సదావర్తి భూముల దోపిడీ, తెలంగాణలో ఓటుకు కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ తాను పోరాటం చేశానన్నారు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం చూసి సీఎం జగన్ ఏఏజీగా అవకాశం కల్పించారన్నారు. క్విడ్ ప్రోకో అంటే వైఎస్సార్‌పై ఫిర్యాదు ఇచ్చిన శంకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కాదా అని నిలదీశారు. తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. షర్మిల చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై, సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కొంత మంది పకోడిగాళ్లు షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే తన భుజం మీద తుపాకీ పెట్టి సీఎం జగన్‌ను కాల్చాలని చూస్తున్నారని.. ఈ విషయం షర్మిల తెలుసుకోవాలన్నారు. -
రెండు పార్టీల రిమోట్ బాబు చేతిలో.. షర్మిల నిర్ణయం బాధించింది: సీఎం జగన్
ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడు.. కూటమి ఇస్తున్న హామీలతో మోసపోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రజలకు పదే పదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇండియా టుడే రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయాలపై ఆయన స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో మేం పోరాడుతున్నాం. ఈ రెండు పార్టీల రిమోట్లు చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలను ఆయనే నియంత్రిస్తున్నారు.కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న తన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల గురించి సీఎం జగన్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే కాదు ఆమెకు డిపాజిట్లు కూడా దక్కబోవనే విషయం తనను బాధకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు... ఏపీలో నాకు పోటీగా రాజకీయాలు చేసేలా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, షర్మిలను ప్రభావితం చేశారు. నాపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, చనిపోయాక నా తండ్రి..దివంగత మహానేత వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో చేర్చిన పార్టీతో ఆమె చేతులు కలిపారు. ఇదంతా ఎంతో బాధ కలిగిస్తోంది. ఎవరు ఏమిటనేది ఈ ఎన్నికల ద్వారా ప్రజలే నిర్ణయిస్తారు.తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపైనా సీఎం జగన్ స్పందించారు. ‘‘ఒకరు తప్పు చేశారా? లేదా? అనేది న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి. జైలుశిక్ష పడిందీ అంటే ఏదో తప్పు చేశారనే అర్థం. చంద్రబాబు తప్పు చేశాడనడానికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు.Was the stone attack on @ysjagan stage managed as his critics allege? Listen here: https://t.co/1Zdr4cbRBU— Rajdeep Sardesai (@sardesairajdeep) April 29, 2024జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగితేనే ఏపీలో సంక్షేమం ఉంటుందని, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు, వలంటీర్ల ద్వారా నెలవారీ సామాజిక పింఛన్లు డోర్ డెలివరీ వంటి కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం జగన్ ఆ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు. -
షర్మిల అబద్ధాలు ఆధారాలతో బయటపెట్టిన పొన్నవోలు
-
చెల్లెమ్మా..ఇక చాలమ్మ
-
నువ్వు డబ్బు సంపాదించుకుకోవడానికి నాకు ప్రజలు అధికారం ఇవ్వలేదు..!
-
మీరా వైఎస్సార్ వారసులు ?..జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
అంతా బాబు జట్టే.. పచ్చ కుట్రే..
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ ముఠా ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, పవన్ కళ్యాణ్, లోకేశ్, పురందేశ్వరి, బీటెక్ రవి అంతా ఒకే తానులో ముక్కలని తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే తప్ప, అసలు హంతకులకు శిక్ష పడటం కాదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. వివేకాను రాజకీయంగా, ఆ తర్వాత భౌతికంగానూ తొలగించుకొన్న వారితో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటకాగుతున్నారన్న విభ్రాంతికర వాస్తవం మరోసారి సాక్ష్కాత్కరించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున, ఈ కేసుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నందున ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదన్న పులివెందుల న్యాయస్థానం తీర్పును అందరూ శిరసావహిస్తారని భావించారు. కానీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేయడం పచ్చ కుట్రను బయటపెట్టంది. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న వివేకానందరెడ్డిని తానే ఓడించానని చంద్రబాబు నమ్మిన బంటు సీఎం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివేకాను అంతమొందించే కుట్రకు ఎంత ముందుగా భూమికను సిద్ధం చేశారో అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు చాలా ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేశారు. దస్తగిరి, సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల.. ఇలా పలువురు పాత్రధారులు తెరపైకి వస్తూ వారికి ఇచ్చిన డైలాగులు చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మరింతగా విషం చిమ్మేందుకు తెగించారు. ఓటర్లను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడాలని, సామరస్యపూర్వక రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ భావించింది. పలు న్యాయస్థానాల్లో విచారణ సాగుతున్న ఈ హత్యపై ఎవరూ మాట్లాడటం సరైన విధానం కాదని కూడా అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని విన్నవిస్తూ చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, లోకేశ్, పవన్, పురందేశ్వరి, బీటెక్ రవిని ప్రతివాదులుగా చేరుస్తూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరింది. ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలతో న్యాయస్థానం ఏకీభవించింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని ఈ నెల 16న తీర్పునిచ్చింది. మంచి ఉద్దేశంతో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అడ్డగోలు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమైన చంద్రబాబు అండ్ కోకు మింగుడు పడలేదు. దీంతో పక్కా పన్నాగంతో మొదట సునీతతో ఈ తీర్పుపై అభ్యంతరం తెలిపారు. ఆమె హైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తారని అందరూ భావించారు. కానీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పుపై సునీత వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఈ పిటిషన్లో ప్రస్తావించారు. తద్వారా అంతా చంద్రబాబు తానులో ముక్కలేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే సత్తా లేక కుట్ర రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు మరోసారి పరోక్షంగా చెప్పారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రచారంలోకి తీసుకువచ్చిన కట్టుకథను ప్రజలు ఆ ఎన్నికల్లో తిప్పికొట్టారు. ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులతో చెప్పించే సరికొత్త డ్రామాకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతతో మూడేళ్లకుపైగా డ్రామా నడిపించారు. ఆ తరువాత బాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిలను రాష్ట్ర రాజకీయ తెరపైకి తెచ్చారు. సునీత చేస్తున్న నిరాధార ఆరోపణలనే షర్మిల కూడా వినిపిస్తున్నారు. ఇటీవల వివేకా సతీమణి సౌభాగ్యమ్మనూ తెరపైకి తెచ్చారు. వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిలతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వారందరి ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. తాజాగా పులివెందుల కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సునీత, బీటెక్ రవి ఒకేలా చంద్రబాబు పాటనే పాడారు. వివేకా శత్రువులు, హంతకులతోనే జట్టు కట్టిన సునీత దంపతులు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉంది. వివేకాను 2017లో రాజకీయంగా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీగా ఓడించిన బీటెక్ రవి తదితరులతో వారు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినప్పటికీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన ఇదే బ్యాచ్‌తో సౌభాగ్యమ్మ, సునీత దంపతులు నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉండటం వివాదాస్పదంగా మారింది. సునీత ఇటీవల మీడియా సమావేశంలోనూ చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, మహాసేన రాజేశ్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. మరోవైపు వివేకాను కిరాతకంగా నరికి హత్య చేశానన్న దస్తగిరితోనూ సఖ్యతతో ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. హత్య జరిగిన రోజునా సందేహాస్పదంగా.. వైఎస్ వివేకా హత్య అనంతరం ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019 మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. లేఖను వారు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. -
పచ్చకుట్రలో పావులు
-
షర్మిలకు ఈసీ నోటీసులు..
అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో షర్మిలకు ఈసీ నోటీసులిచ్చింది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా నోటీసుల్లో స్పష్టం చేశారు. -
వివేకా హత్యపై దుష్ప్రచారం ఆపండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తదితరులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే మాట్లాడాలని కుండబద్దలు కొట్టింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, షర్మిల, సునీత తదితరులు తాము చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. వీరు సీఎం వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలపై దుష్ప్రచారం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. రాజకీయంగా మైలేజీ కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, మీడియా పబ్లిక్ కోర్టుగా అవతరించి న్యాయపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని కడప జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి రెండు రోజుల క్రితం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు, వక్రీకరణలు ఆపండి.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ధ్రువీకరణ కాని ఆరోపణలతో, వక్రీకరణలతో వ్యక్తిగత దాడులు, విమర్శలు చేయడం మానాలని కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలను, వారి పార్టీల క్యాడర్‌ను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉందని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయా పార్టీల అధినేతలను, అనుచరులకు కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్ రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేల్చిచెప్పింది. వ్యక్తిగత విమర్శలు మాని తమ పార్టీల ఎజెండాలపైన, ఇతర పార్టీల వైఫల్యాలపైన దృష్టి సారించాలని వారికి కోర్టు హితవు పలికింది. వివేకా హత్య కేసులో జగన్ నిందితుడు కాదన్న విషయాన్ని గుర్తెరగాలంది. రాజకీయ మైలేజీ కోసమే జగన్, అవినాశ్‌లపై.. షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు వ్యాఖ్యలు చేశారంది. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా పరువు నష్టం కలిగించేవేనని తేల్చిచెప్పింది. అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.. వాదనలు విన్న జిల్లా జడ్జి శ్రీదేవి పిటిషనర్ వాదనలతో ఏకీభవించారు. వాక్ స్వాతంత్య్రం సహేతుక పరిమితులకు లోబడి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఓ వ్యక్తి ప్రతిష్టను, మంచితనాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం ఆ స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ‘వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా షర్మిల, చంద్రబాబు, లోకేశ్ ప్రజల ముందు వైఎస్సార్సీపీ, దాని అధినేత వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తదితరులపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారనేందుకు, అసభ్యంగా పరిహాసం చేస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. వారి మాటలను, వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు పదే పదే ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ముఖ్యంగా అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా పేర్కొన్నారు. ఆయనను సీఎం జగన్ రక్షిస్తున్నారని పేర్కొన్నాయి.’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతరులు సొంత తీర్పులివ్వరాదు.. ‘పౌర హక్కుల దురాక్రమణను నిరోధించడానికి, నిందితుల హక్కులను కాపాడేందుకు, మీడియా ప్రవర్తనకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే విషయంలో సరైన నిబంధనలు లేవు. ఓ వ్యక్తి అరెస్ట్ సమయంలో అతడిని దోషిగా నిర్ధారించే ట్రెండే ప్రస్తుతం కొనసాగుతోంది. రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, మీడియా ఉన్నది ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే తప్ప, తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తీర్పులు ఇచ్చేందుకు ఎంతమాత్రం కాదు. ప్రస్తుత కేసులో ఈ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, వీడియోలు, పత్రికా కథనాలను విశ్లేషిస్తే.. బహిరంగంగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయనను వైఎస్ జగన్ రక్షిస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఓ కేసు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నప్పుడు.. ఎవరూ కూడా తమ సొంత తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. ఆ అధికారం ఎవరికీ లేదు. అలాంటి కేసులో ఉన్న వ్యక్తిని తమ ఇష్టానుసారం హంతకుడిగా, దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. నిష్పాక్షిక ట్రయల్ నిర్వహించి నిందితుడిని దోషిగా నిర్ధారించేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే అన్నది న్యాయ సూత్రం. ఓ వ్యక్తి నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పైన మాత్రమే ఉంది. పెండింగ్‌లో ఉన్న కేసు గురించి మూడో వ్యక్తి ఎవరూ కూడా తమ తప్పుడు ప్రయోజనాల కోసం బహిరంగంగా మాట్లాడటం, వ్యాఖ్యలు చేయడం, తీర్పులిచ్చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని జడ్జి శ్రీదేవి తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చంద్రబాబు ప్రోద్భలంతో వైఎస్ వివేకా హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, సునీత తదితరుల దుష్ప్రచారంపై విసిగిపోయిన వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. తమ పార్టీతో పాటు సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి, తదితరులపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతలను నిరోధించాలంటూ కడప జిల్లా కోర్టులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎం.నాగిరెడ్డి, కె.ఎస్.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరులు చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను, తప్పుడు ఆరోపణల వీడియోలను న్యాయవాదులు కోర్టు ముందుంచారు. కోర్టు ప్రొసీడింగ్స్‌లో మీడియా, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి ‘రాజకీయ పార్టీలు మీడియా ద్వారా పబ్లిక్ కోర్టుగా అవతరించాయి. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు సొంతంగా దర్యాప్తు చేసేస్తున్నాయి. తద్వారా కోర్టు ప్రొసీడింగ్స్‌లో జోక్యం చేసుకుంటున్నాయి. నిందితుడు, దోషికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించాయి. దోషిగా నిర్ధారణ అయ్యేవరకు నిరపరాధే అనే సూత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కోర్టులు కేసును విచారణకు స్వీకరించడానికి ముందే నిందితులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలుస్తున్నాయి. ఇది ప్రజలపై, జడ్జీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తత్ఫలితంగా అమాయకుడైన నిందితుడిని నేరస్తుడిగా చూడాల్సి వస్తోంది. నిందితుల హక్కులు, స్వేచ్ఛను పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ట్రయల్‌కు ముందు ఓ అనుమానితుడు, నిందితుడు విషయంలో మీడియా సాగించే పరిమితికి మించిన ప్రతికూల ప్రచారం ట్రయల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా అతడే నేరం చేశాడని భావించాల్సి వస్తోంది. ఇలా చేయడం న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని ఆపండి.. ఎన్నికల ప్రచారంలో షర్మిల తదితరులు వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అవినాశ్‌రెడ్డిని ఏకంగా హంతకుడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. చంద్రబాబు కూడా ప్రొద్దుటూరు సభలో వివేకాను హత్య చేసిన వ్యక్తిని ఎంపీగా నిలబెట్టారంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇక లోకేశ్ అయితే నేరుగా ముఖ్యమంత్రి జగనే తన బాబాయి వివేకాను హత్య చేశారని ఆరోపించారన్నారు. పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జగన్, అవినాశ్, వైఎస్సార్సీపీపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయా పార్టీల అధినేతలను, క్యాడర్‌ను నిరోధించాలన్నారు. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్, అవినాశ్‌పై వ్యాఖ్యలు.. ‘ప్రస్తుత కేసులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, బీటెక్ రవి వారి రాజకీయ మైలేజీ కోసం వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ ఎన్నడూ కూడా నిందితుడు కాదు. కాబట్టి వివేకాను జగన్ చంపారంటూ ప్రజలందరి ముందు లోకేశ్ చేసిన ప్రకటన పరువు నష్టం కలిగించేదే. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కోర్టు ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వుల వల్ల షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ, జగన్, అవినాశ్ రెడ్డిలకు తీరని నష్టం కలుగుతుంది. ఇదే సమయంలో షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు పదే పదే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల వేళ ఇది వైఎస్సార్సీపీ, ఎన్నికల్లో పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించా’ అని జిల్లా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బాబు నుంచి షర్మిలకు రూ. 60 కోట్లు
కడప కార్పొరేషన్: ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చంద్రబాబు భారీగా ఫైనాన్స్ చేశారని, సుమారు రూ. 60 కోట్లు ఇచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో 10 మంది టీడీపీ అభ్యర్థులకు మొండిచేయి చూపి షర్మిలకు డబ్బులిచ్చి కడప పార్లమెంటుకు పోటీ చేయిస్తున్నారని చెప్పారు. డా. చైతన్యరెడ్డితో కలిసి బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే షర్మిలకు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు వైఎస్ కుటుంబంలో షర్మిల, సునీతను చంద్రబాబు పావులుగా మార్చారని చెప్పారు. ఇందులో భాగంగానే షర్మిల పీసీసీ అద్యక్షురాలయ్యారని తెలిపారు. అరుంధతి సినిమాలోలాగా వారిని పశుపతి ఆవహించారని ఎద్దేవా చేశారు. కుటుంబాలను విడదీయడంలో చంద్రబాబు దిట్ట అని, తల్లీబిడ్డలకు కూడా తగవు పెట్టే సమర్థుడని చెప్పారు. సునీత లక్ష్యం వైఎస్ వివేకా హత్య కేసులో నిజమైన నేరస్తులను వెలికితీయడమా లేక తప్పు చేయని వారిని శిక్షించడమా అని ప్రశ్నించారు. ఆమె సైకో ఆలోచనకు ఇది నిదర్శనమన్నారు. ఒక పథకం ప్రకారం కథ అల్లుతూ వారు అనుకున్న వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ కేసును పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు. సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకొని ఉంటే అసలు నేరస్తులు దొరికేవారని చెప్పారు. బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంతో, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాశ్‌రెడ్డిపై ఉన్న కోపంతో షర్మిల, సునీత ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. కేసు ట్రయల్‌కు వచ్చాక నిజాలు బయటికి వస్తాయని, ఆ లోపే ఒకరిని లక్ష్యం చేసుకొని దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. వేరే సంబంధాలతోనే వివేకా హత్య వేరే సంబంధాలతోనే వివేకా హత్య జరిగిందని, రాజకీయ కోణం లేదని తెలిపారు. హత్యకు ఒక రోజు ముందు ఇంట్లో పని చేసే పందింటి రాజశేఖర్‌ను సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కాణిపాకం పంపించారని, చెవులు వినపడని వాచ్‌మేన్ రంగయ్య ఇంటి బయట ఉన్నారని చెప్పారు. అదే సమయంలో దుండగులు వివేకా ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. సీబీఐని ఎవరో మేనేజ్ చేశారని, అందువల్లే వీటిని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. వైఎస్ వివేకాతో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరికి సాన్నిహిత్యం ఉందని, తరచూ కలిసి భోజనం చేస్తారని సీబీఐకి సాక్షులు చెప్పారని గుర్తుచేశారు. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా చేసేందుకు వివేకా కష్టపడ్డారని తొలుత చెప్పిన సునీత.. ఆ తర్వాత మాటమార్చిందన్నారు. హార్ట్ ఎటాక్ డ్రామా ఆడింది కూడా సునీతేనని చెప్పారు. కేసును పక్కదారి పట్టించేందుకే వివేకా రాసిన లేఖను దాచిపెట్టారని ఆరోపించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెబితేనే లేఖను దాచిపెట్టినట్లు పీఏ కృష్ణారెడ్డి చెప్పారన్నారు. వారికి నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. రక్తపు మరకలను ఎవరూ తుడవలేదని, బెడ్ వద్ద మాత్రమే తుడిచారని, ఆ వస్త్రం కూడా అక్కడే ఉందని అన్నారు. కడప ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ వివేకా బలవంతపెట్టారని షర్మిల చెప్పడంలో అర్థం లేదన్నారు. 2014లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని నిర్ణయించారని, 2019లోనూ ఆయన్నే కొనసాగించారని చెప్పారు. పబ్లిక్ ఫోరం, మీడియాలో ట్రయల్స్ ఆపండి : డా. చైతన్యరెడ్డి వివేకా హత్య కేసులో పబ్లిక్ ఫోరం, మీడియా ట్రయల్స్ ఆపాలని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డా. చైతన్యరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ భాస్కర్‌రెడ్డికి హార్ట్ చెకప్ చేసి, సర్జరీ చేయాలని, బెయిలివ్వాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే, సీబీఐ వ్యతిరేకించకపోయినా సునీత మాత్రం వ్యతిరేకించిందన్నారు. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్‌ల బెయిల్‌ను వ్యతిరేకించకుండా, తన తండ్రి శంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం వ్యతిరేకించారన్నారు. ఇది కక్ష సాధింపు కాక మరేమిటని ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్‌కు ఎలాంటి శాస్త్రీయత లేదని, ఖచ్చితత్వం అంతకంటే లేదన్నారు. సీబీఐ పేర్కొన్నది వాట్సాప్ చాట్స్ అని, వాట్సాప్ కాల్స్ కానేకాదన్నారు. అందులో ఔట్‌గోయింగ్ చాట్స్ అసలే లేవన్నారు. -
షర్మిల, సునీత చంద్రబాబు అడుగుజాడల్లో.. ప్రజలు ఎలా నమ్ముతారు
-
‘వివేకా’ కేసు.. బాబు ప్రయోజనాల కోసమే..
కడప కార్పొరేషన్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కో–ఆర్డినేటర్ కె. సురేష్‌బాబు, డా. చైతన్యరెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం నీచ రాజకీయాలు చేయడమే చంద్రబాబు సంస్కృతి అని, అన్ని వ్యవస్థలను ధ్వంసంచేసి తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడమేగాక, ఆయన మరణానికి కూడా బాబు కారణమయ్యారన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఒక కొత్త కూటమి ఏర్పాటుచేయడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. 2014లో నరేంద్ర మోదీ, పవన్‌కళ్యాణ్‌తో.. 2019లో లోపాయికారిగా జనసేనతో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పాటు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన అందరి కుటుంబాల్లో చిచ్చుపెడతారన్నారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని రమేష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రెండు చానెళ్లు, రెండు పత్రికలైతే అదేపనిగా సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలపై బురదజల్లుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వైఎస్ వివేకా కేసు కోసం రూ.వందల కోట్లు ఖర్చుచేశారని, కోట్ల రూపాయలు వెచ్చించి లూథ్రా అనే ఖరీదైన న్యాయవాదిని నియమించుకున్నారన్నారు. ఇక ‘వివేకం’ అనే సినిమాలో క్యారెక్టర్లను చాలా నీచంగా చూపించడం దారుణమన్నారు. అవినాశ్ ఎలాంటివారో షర్మిల, సునీతలకు తెలీదా? ఇక అవినాశ్ ఎలాంటి వారో షర్మిల, సునీత ఇద్దరూ చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, వారికి తెలీదా.. ఎప్పుడైనా ఆయనలో నేరప్రవృత్తి గమనించారా.. దౌర్జన్యాలు, రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ గొడవలతో ఆయనకు సంబంధం ఉందేమో గుండెలపై చేయివేసుకుని చెప్పాలన్నారు. నిష్కళంకమైన జీవితం గడుపుతున్న అవినాష్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రజాసేవ చేయాలని ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారని.. ఏ రకమైన ఫ్యాక్షన్‌ను, గొడవలను ఆయన ప్రేరేపించలేదన్నారు. చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్ అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించేందుకు రూ.కోట్లు ఖర్చుచేసి చార్టెర్డ్ ఫ్లయిట్లు పెట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేశారని రమేష్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 40 సీట్లను రూ.వందల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో కూడా చాలామంది డబ్బులిచ్చి టికెట్లు కొన్నారన్నారు. మరోవైపు.. షర్మిల, సునీత న్యాయపోరాటం చేస్తున్నారో, రాజకీయ పోరాటం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ దయచేసి నోరు విప్పవద్దని ఆయన సూచించారు. ఇక చంద్రబాబు చెబుతున్న ‘సూపర్ సిక్స్’ ఒక ఫ్లాప్సిక్స్ అని రమేష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటేస్తే కాంగ్రెస్, బీజేపీలకు వేసినట్లేనని తెలిపారు. సునీతవి అర్థంలేని ఆరోపణలు డా. చైతన్యరెడ్డి మాట్లాడుతూ.. డాక్టరేట్ పొందిన సునీత అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య జరిగిన రోజు రాత్రి ఏ–1 ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి వాట్సాప్ కాల్స్ చేసుకున్నారని చెప్పడం అబద్ధమన్నారు. సీబీఐ చార్జిషీట్లో వాట్సాప్ చాట్‌లో ఉన్నారని చెప్పిందే తప్పా వాట్సాప్ కాల్స్ అని ఎక్కడా చెప్పలేదన్నారు. ఎన్నికల సమయం కాబట్టి వాట్సాప్‌కు మెసేజ్‌లు వస్తూ ఉంటాయని, ఫోన్ ఆన్‌చేసి ఉంచితే ఎవరి వాట్సాప్ అయినా యాక్టివ్‌లో ఉన్నట్లేనని చెప్పారు. ఇక గూగుల్ టేకౌట్‌కు శాస్త్రీయతలేదని, దాన్ని గూగుల్ కంపెనీ దానిని సర్టిఫై చేయలేదని, న్యాయమూర్తి కూడా అంగీకరించలేదన్నారు. కోర్టులో నేరం రుజువు కాకుండా ఆరోపణలు చేయడం సరికాదని షర్మిల, సునీతకు చైతన్యరెడ్డి హితవు పలికారు. -
షర్మిలతో చాలా నష్టం..!
-
పులివెందులలో షర్మిల ప్లాప్ షో
-
వైఎస్ విమలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు: వైఎస్సార్ సోదరి విమల
సాక్షి, విజయవాడ: వైఎస్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని వైఎస్సార్ సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని అన్నారామె. వైఎస్ విమల శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా?.. .. షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడ ఉంది. అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది. శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి. వైఎస్సార్ ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు .. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు. మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు. మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు. వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు .. కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా?. వైఎస్సార్ ఉన్నపుడు వివేకానంద రెడ్డి కడప చూసుకున్నారు. ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు. నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు. మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు. శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు. అవినాష్ పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది. షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు. షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి వాళ్లిద్దరూ ఇదంతా చేస్తున్నారు. .. జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. లేదంటే ఒకసారి షర్మిల, సునీత మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి’’ అని విమల ఏపీ ప్రజల్ని కోరారు. -
షర్మిల రోడ్‌షోకు అద్దె మనుషులే దిక్కు
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మరకలు అంటేలా దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రజల మద్దతు కరవైంది. కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె రోడ్‌షోల పేరిట నియోజకవర్గంలో తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అండతో, టీడీపీ స్క్రిప్టుతో సీఎం జగన్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల వైపు ప్రజలు కన్నెత్తి చూడటంలేదు. దీంతో ఆమె సభలు, రోడ్ షోలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. దీంతో టీడీపీ పంపుతున్న అద్దె మనుషులే దిక్కయ్యారు. స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో డబ్బులిచ్చి మరీ మనుషులను తరలించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా తరలించిన వారిలో అధికశాతం బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కూడా ఉన్నారు. షర్మిల శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేశారు. వేంపల్లె కేంద్రంగా తొలుత నిర్వహించిన సమావేశానికి చక్రాయపేట మండలం నుంచి టీడీపీ నాయకులు జనసమీకరణ చేపట్టారు. ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి వాహనాల్లో తరలించారు. సిద్ధారెడ్డిగారిపల్లెకు చెందిన టీడీపీ నేత భాస్కరరెడ్డి జనసమీకరణ బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్‌షోలకు వేంపల్లెలోని బిడాలమిట్ట, చింతరాంపల్లె ప్రాంతాల నుంచి స్థానిక కాపువీధికి చెందిన టీడీపీ నేత మునిరెడ్డి అద్దె మనుషులను తరలించారు. ముద్దనూరు, కడప ప్రాంతాలను నుంచి జనాన్ని తరలించారు. పులివెందులలో సాయంత్రం జరిగిన సభకు కడప నుంచి జనాన్ని సమీకరించారు. చెన్నూరు, ఐటీఐ సర్కిల్, ఆజాద్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చారు. వీరికి కూడా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇచ్చారు. డబ్బులు తీసుకొని మధ్యలో జారుకోకుండా ముందుగా టోకెన్లు ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో టోకెన్ ఉన్న వారికి రూ.500 చొప్పున కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సన్నిహితుడు చెల్లించినట్లు సమాచారం. సమావేశానికి రావాలని శివప్రకాష్ రెడ్డి బెదిరింపులు! మరోవైపు షర్మిల సమావేశానికి హాజరు కావాలంటూ వైఎస్ వివేకా పెద్ద బాçవమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి స్థానికులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ టీడీపీ రెండు ఒక్కటేనని, స్థానిక నాయకత్వం తమ చేతుల్లోనే ఉంటుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. తొలి విడత ప్రచారంలోనూ.. తొలి విడత ప్రచారంలో షర్మిల బద్వేల్, కడప, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంలోనూ ఇలాగే తుఫాన్ వాహనాల ద్వారా కడప నుంచి జనాల్ని తరలించారు. 20 వాహనాలకు సరిపడా జనానికి కడప జయరాజ్ గార్డెన్లో బస ఏర్పాటు చేసి, నాలుగు రోజుల పాటు షర్మిల పర్యటనలకు తిప్పుకున్నారు. వీరంతా హందీలో మాట్లాడుతుండటంతో పలువురు వాకబు చేయగా, బిహార్ నుంచి వచ్చిన వలసకూలీలని, రోజు కూలీకి ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. -
‘తప్పు చేస్తున్నావ్ షర్మిలా’
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికే వైఎస్ అని పేరుపెట్టుకుని ప్రజల ముందుకు వస్తే తమలాంటి అభిమానులు వదిలిపెట్టరని, తస్మాత్ జాగ్రత్త అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను హెచ్చరించారు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి. వైఎస్సార్‌జిల్లాలో పర్యటిస్తున్న కొండా రాఘవరెడ్డి.. షర్మిలపై మండిపడ్డారు. వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చే కుట్రలను ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్ అభిమానిగా షర్మిల చర్యలు తమనెంతో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఏ ఫుట్‌పాత్‌పై తిరిగినా మాకు అభ్యంతరం లేదు. మేము రాజశేఖర్‌రెడ్డి గారి వీరాభిమానులము. రాజశేఖర్‌రెడ్డిగారంటే మాకు ప్రాణం. రాజశేఖర్‌రెడ్డిగారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే.. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము. మాలాంటి వారు లక్షలమంది తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికి వైఎస్ అని పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నావ్ చూడు. మా లాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి కడప ప్రజలను జాగృతం చేస్తున్నాం. అక్కడ ఉన్నప్పుడు(తెలంగాణలో) ఆడ(అక్కడ) బిడ్డ అని అంటివి. ఇక్కడకొచ్చి(ఏపీ) ఈడ బిడ్డ అంటివి. దానికోసం సామెతలు. రక్తసంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టాల్సిన అన్నకు నువ్వు రాక్షస రూపంలో ఆయన స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలివో మాకు అర్థమైతాంది.నేను ఇవాళ జగన్మోహన్రెడ్డిగారిని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవాలి. ఏం తప్పు చేసిండు జగన్మోహన్రెడ్డిగారు. నీకు ఏమి ఎరుక. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావా? నీకు తెలుసా నాడు-నేడు, తెలుసా నీకు అమ్మ ఒడి, తెలుసా నీకు గోరుముద్ద. ఏం తెలుసు నీకు. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్నప్పుడు 850 రుగ్మతలు ఆరోగ్య శ్రీలో ఉంటే, ఈరోజు రెండు వేల ఐదువందల రుగ్మతలను ఆరోగ్య శ్రీలో పెట్టిన మహానాయకుడు జగన్మోహన్రెడ్డిగారు. నీది నాలుకనా.. తాటిమట్టనా? అని అడగదల్చుకున్నాం. ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖరరెడ్డిగారి కూతురిగా అంగీకరించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తెలుసుకో షర్మిలా. నువ్వు మురుసుపల్లి షర్మిలవు. నువ్వు మురుసుపల్లి అనిల్‌కుమార్ భార్యవు. అసలు నీకు ఏం కావాలి. నీకు ఆశ ఎక్కువ. ఆశయం మాత్రం లేదు. ఓర్వలేని తనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? అని ధ్వజమెత్తారు కొండా రాఘవరెడ్డి. -
బాబు చెప్పినట్లే.. షర్మిల, సునీత డ్రామాలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒప్పందం చేసుకుని మరీ సొంత అన్న వైఎస్ జగన్‌పై షర్మిల, సునీత విమర్శలు చేయడం మూర్ఖత్వమని నేషనల్ దళిత జేఏసీ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ వల్ల వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలు పెరిగితే.. షర్మిల వల్ల దివంగత నేత ప్రతిష్ట దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ చనిపోతే.. ప్రకృతి ఆగ్రహంతో పావురాల గుట్టలో మాంసపు ముద్ద అయ్యాడంటూ రేవంత్ వికృత విమర్శలు చేసిన విషయాన్ని షర్మిల మరిచిపోవడం దారుణమని పేర్కొన్నారు. చరిత్ర పుటల్లో వైఎస్సార్ పేరు లేకుండా చేయాలని చంద్రబాబు ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నాడని.. అటువంటి రేవంత్, చంద్రబాబు పంచన చేరి షర్మిల, అనీల్‌కుమార్, సునీత ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తన బాబాయి వివేకా చివరి కోరిక మేరకు కడప ఎంపీకి పోటీ చేస్తున్నానని షర్మిల చెబుతోందని, అదే నిజమైతే 2019లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. చనిపోయిన వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పంచన చేరడం దారుణమైతే.. అన్న వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం మరింత దారుణమన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ‘రుజువు కాని నేరారోపణలను అభ్యర్థిపై చేయకూడదని, అవేమి పట్టించుకోకుండా షర్మిల చేస్తున్న ఆరోపణలు, విమర్శలు దారుణమని పేర్కొన్నారు. వైఎస్ వివేకాను దాదాపు 20 ఏళ్లపాటు ఒంటరిగా వదిలేసి తన తల్లి సౌభాగ్యమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న నర్రెడ్డి సునీత ఇప్పుడు నీతులు చెబుతున్న తీరు చూస్తే సభ్య సమాజం సిగ్గు పడుతుందని తెలిపారు. వివేకాను గొడ్డలితో నరికి చంపానని, ఆయన మార్మాంగాలను చిద్రం చేశానని బాహాటంగా చెబుతున్న దస్తగిరికి బెయిల్ ఇప్పించడమే కాకుండా అతన్ని సంరక్షిస్తున్న సునీత ఇప్పుడు ఎవరికి అనుకూలంగా పలుకులు పలుకుతుందో జనం గమనిస్తున్నారన్నారు. వివేకా హత్యకు గురైన ప్రదేశంలో రక్తపు మరకలను శుద్ధిచేసిన నలుగురికీ నేటికీ జీతాలు ఇచ్చి పోషిస్తున్న సునీత ఇష్టం వచ్చినట్టు వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే జనం సహించరని వరప్రసాదరావు హెచ్చరించారు. -
షర్మిల రాజకీయం.. ఘోరంగా మిస్ ఫైర్!
అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. అని ఒక పాట ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే అయినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి అయిన షర్మిలను ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఆదరించే వర్గాలలో కొంత చీలిక తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు. తదనుగుణంగా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలలో ఉన్న షర్మిలను అక్కడ నుంచి ఏపీకి తీసుకురావడంలో పరోక్షంగా ఒక పాత్ర పోషించారు. చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెను ఏపీ రాజకీయాలలోకే వెళ్లాలని పట్టుబట్టారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ వద్ద దీనిపై పంచాయతీ కూడా జరిగింది. ఆమె ఏపీ రాజకీయాలలోకి వెళ్లేలా ఒప్పందం కుదిరిన తర్వాతే ఆమె పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నారు. తదుపరి షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె కూడా చంద్రబాబు తరపునే పనిచేస్తూ అన్నను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా తన ఉపన్యాసాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శిస్తూ చెల్లెలుకు న్యాయం చేయడం లేదని అనేవారు. షర్మిల పట్ల, అలాగే విజయమ్మ పట్ల తనకు సానుభూతి ఉందన్నట్లు మాట్లాడేవారు. షర్మిల రాజకీయాలలోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా తన వెనుక ఎవరు ఉంది ప్రపంచానికి పరోక్షంగా చెప్పేశారు. రాధాకృష్ణ అంటే చంద్రబాబు సొంత మనిషి కింద లెక్క. చంద్రబాబు తరపున ఆయా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారని ఎక్కువ మంది నమ్ముతారు. అలాంటి వ్యక్తి చేసిన రాయబారం ఫలించి ఆమె కొంతకాలం తెలంగాణలో పార్టీ నడిపి, ఆ తర్వాత ఏపీ రాజకీయాలలోకి వచ్చారు. అంతవరకు తాను తెలంగాణ బిడ్డనని, ఈ మట్టిని వదలిపెట్టనని షర్మిల చేసిన శపధాలన్నీ గాలిలో కలిసిపోయాయి. షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కనుక, ఆ ఓట్లను ఆమె కొంతవరకు చీల్చగలిగితే అది తమకు లాభిస్తుందని చంద్రబాబు, రాధాకృష్ణ అంచనా వేసుకున్నారు. ఆమె కూడా వారికి యధో శక్తి రాజకీయంగా ఉపయోగపడుతూ, తన అన్నను విమర్శిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో గతంలో మాట్లాడినదానికి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్న తీరు కూడా ఇంకో నిదర్శనంగా కనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చంద్రబాబును సైతం కొంతమేర విమర్శించవలసి వస్తోంది. వాటిని ఎడిట్ చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శించిన మేర తమ మీడియాలో ప్రచారం చేశాయి. కాలం గడిచే కొద్ది చంద్రబాబుకు తత్వం బోధపడినట్లుగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. వారిలో కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ వద్దకు రాకుండా కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారా అని చంద్రబాబు మదనపడుతున్నారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనకు వచ్చారు. బహుశా షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు వచ్చే ఓట్లలో ఏమైనా గండి పడుతుందా అని సర్వేలు చేయించుకుని ఉండాలి. ఆ సర్వేలలో షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఎలాంటి నష్టం ఉండదని తేలి ఉండవచ్చు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఉపయుక్తంగా ఉంటుందన్న సమాచారం వచ్చి ఉండవచ్చు. దాంతో అంతవరకు షర్మిలను భుజాన వేసుకుని సానుభూతి వచనాలు పలికిన చంద్రబాబు మళ్లీ పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ పాత డైలాగులు చెప్పడం ఆరంభించారు. 2014లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తదుపరి 2018లో తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను కలిపి విమర్శించేవారు. 2024 నాటికి అదే మోదీతో, బీజేపీతో ఆత్మగౌరవం వదలుకుని మరీ పొత్తు పెట్టుకున్నారు. డబుల్ స్టాండర్స్ కు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు ఇలా యూ టర్న్‌లు తీసుకోవడం కొత్తకాదు. ప్రస్తుతం కూడా అలాగే షర్మిల విషయంలో కూడా యు టర్న్ తీసుకుని మాట్లాడడం ఆరంభించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే షర్మిల వచ్చారని ఆయన చెబుతున్నారు. పెద్ద కాంగ్రెస్, వైకాపా పిల్ల కాంగ్రెస్ అని పాతపల్లవిని కొత్తగా ఎత్తుకున్నారు. ఈ రెండు కలిసి డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ఆయన అన్నారు. అక్కడితో ఆగకుండా రాజకీయాలకు దూరంగా ఇంటిలోనే ఉంటున్న విజయమ్మ పేరు ప్రస్తావించి.. మొన్నటివరకు కుమారుడికి ఆంధ్ర, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చారని చెప్పిన విజయమ్మ ఇప్పుడేమో కుమార్తెను ఏపీలో యుద్దానికి పంపారని అన్నారు. పిల్లలకే న్యాయం చేయలేని తల్లి ఐదు కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. షర్మిలకు అన్యాయం జరిగితే ఇంటిలోనే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! తన రాజకీయ అవసరాల కోసం తన ప్రత్యర్ది పార్టీ అధినేత ఇళ్లలో ఉన్న ఆడవారిపై కూడా అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి చంద్రబాబు వెనుకాడరనే కదా! తన భార్యను ఎవరో ఏదో అన్నారంటూ అసెంబ్లీలో రచ్చ చేసి, బయటకు వచ్చి ఏడుపు లంఖించుకున్న ఆయన, విజయమ్మపై విమర్శలు చేయవలసిన అవసరం ఏముంది. అంటే ఏదో రకంగా రెచ్చగొడితే ఆమె కూడా కామెంట్ చేస్తే, ఈ విషయంపై చర్చ కొనసాగించాలన్న దురుద్దేశంతోనా అనే సందేహం వస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానిఫెస్టోల గురించి సవాల్ చేస్తూ ప్రజా సమస్యల గురించి అధికంగా ప్రస్తావిస్తూ, యాత్ర సాగిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇలా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. దీని అంతటికి ఒక కారణం కనిపిస్తుంది. వలంటీర్లు తదితర అంశాలలో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు వాటిని జనం మర్చిపోవాలన్న లక్ష్యంతో పనికి రాని ఉపన్యాసాలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే? షర్మిల వల్ల తనకు రాజకీయంగా కలిసి వస్తుందని ఆయన ఆశించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ఇచ్చే వర్గాలలో ఎలాంటి విభజన రాకపోగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎంతో కొంత చీలుతుందని ఆయనకు అర్దం అయినట్లుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీచేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేమన్న భయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్రాప్‌లో వేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులోకి వెళ్లారు.కానీ దీనివల్ల మైనార్టీ వర్గాలలో తనపై వ్యతిరేకత ఏర్పడిందని చంద్రబాబు అర్ధం చేసుకుని ముస్లింలకు తన పాలనలో రక్షణ ఉందని చెప్పడం ఆరంభించారు. షర్మిల వల్ల చీలే ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలపై ఆదారపడకుండా, తన ప్రభుత్వ పనితీరు, స్కీముల వల్ల ప్రజలకు జరిగిన మేలు మొదలైన విషయాలను చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. బీజేపీ,జనసేనలతో నేరుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్, సీపీఐ వంటి పక్షాలతో అవగాహన పెట్టుకున్నారన్నది ఎక్కువ భావన. అయినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేకపోతున్నామన్న ఆందోళన చంద్రబాబులో ఏర్పడింది. అందులో భాగంగానే షర్మిలపై చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. కొన్నాళ్ల క్రితం కూటమి సభ జరిగినప్పుడు మోదీ ఇలాగే అన్నా, చెల్లెళ్లు ఒకటేనని అన్నప్పుడు చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ టీడీపీ ఓట్లకే గండిపడుతోందని సర్వేలు తెలపడంతో ఆయనలో మరింత కంగారు ఏర్పడింది. నిజానికి షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు ఇప్పటికి 99 శాతం నియోజకవర్గాలలో ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. 99 శాతం సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోవడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అయినా ఆమెను అడ్డుపెట్టుకుని తను లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తే, ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి భవిష్యత్తే అయోమయంలో పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. తత్ఫలితంగా చంద్రబాబు కొత్త స్వరం ఆలపిస్తున్నారు. అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి అనే చందంగానే చంద్రబాబు పరిస్థితి ఏర్పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఊసరవెల్లి.. షర్మిలను సీఎం జగన్‌పై ప్రయోగించిన కుటిలనేత
అధికారంకోసం అడ్డదారులు తొక్కడం... అవసరమైతే అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనుకాడకపోవడం... రోజుకో ఎత్తు గడతో నాలుక మడతేసేయడం... బద్ధ శత్రువులతోనైనా ఇట్టే జతకట్టేయడం... మరో అడుగు ముందుకేసి ఏకంగా కుటుంబాల్ని చీల్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి వ్యక్తులనైనా బోల్తాకొట్టించగల సమర్థుడాయన. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అన్ని పార్టీలను ఏకం చేసేందుకు నానా పాట్లు పడ్డారు. అంతేనా...మరో అడుగు ముందుకేసి ఆయన సోదరినే పావుగా వాడుకున్నాడు. అదీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఏకంగా అన్నా... చెల్లెళ్లిద్దరూ కలసి నాటక మాడుతున్నారంటూ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారంకోసం ఎంతకైనా తెగించగలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న తీరును జనం సైతం ఛీకొడుతున్నారు. సాక్షి, అమరావతి: రాజకీయంలో ఎలాంటి కుట్రలకైనా వెరవకూడదనీ.. అబద్ధాలు అలవోకగా ఆడేయొచ్చని.. ఎలాంటి విషయాన్నైనా తనకు అనుకూలంగా మలచుకోవచ్చని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అ్రస్తాలను ఎక్కుపెట్టారు. ఘోర పరాజయం నుంచి తప్పించుకుని, రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి చివరి ప్రయత్నంగా మహానేత వైఎస్ కుటుంబాన్ని చీల్చి.. సీఎం జగన్‌పై సోదరి షర్మిలను ప్రయోగించారు. సోదరికే న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం చేయగలరని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన చంద్రబాబే.. ఆమెకు జనస్పందన లభించకపోవడం, తాను అనుకున్న ప్రయోజనాలు లభించే అవకాశాలు కన్పించకపోవడంతో మరోసారి మాట మార్చారు. శనివారం పెదకూరపాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పిందని.. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేస్తారని ఇప్పుడు కొత్తగా ప్రశ్నించారు. అంతేగాదు... పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోందంటూ ఆరోపించారు. ఎన్డీయేకు పడే ఓట్లు చీల్చాలని నాటకం ఆడుతున్నారని మరో ప్రచారానికి దిగారు. దీనిని బట్టి ఆయన రంగులు మార్చడంలో ఊసరవెల్లికి కూడా మించిపోతారని రాజకీయ విశ్లేషకులు వ్యంగోక్తులు విసురుతున్నారు. పావులా మారిన షర్మిల తెలంగాణలో 2021 జూలై 8న వైఎస్సార్సీపీని షర్మిల స్థాపించారు. తన బతుకైనా చావైనా తెలంగాణలోనేని ఆమె అప్పట్లో ప్రతిజæ్ఞ చేశారు. కానీ.. గతేడాది చివర్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా అస్త్రసన్యాసం చేసి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌తో బెంగళూరు విమానాశ్రయం సాక్షిగా మంతనాలు జరిపి ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు కట్టబెట్టేందుకు ప్రణాళిక రచించారు. బీజేపీలోని తన ఏజెంట్, ప్రస్తుతం అనకాపల్లి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్‌కు ఇం‘ధనం’ చేకూర్చి.. తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా కథ మొత్తం నడిపించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు.. పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్నాక ఢిల్లీ, కడప తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లలోనే ప్రయాణించారు.ఇప్పటికీ సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో షర్మిల ప్రయాణాలు చేస్తుంటే.. ఆమె భర్త అనిల్ టీడీపీ నేతలు బీటెక్ రవి, దేవగుడి నారాయణరెడ్డి తదితరులతో సమావేశమవుతున్నారు. షర్మిలను సీఎం జగన్‌పై ఉసిగొలిపి.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను చీల్చడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఆ ప్రయోగం విఫలమై ఇప్పుడు కొత్త పాచిక చంద్రబాబు, ఎల్లో పత్రికలు సీఎం జగన్‌పై చిమ్ముతున్న విషాన్నే పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల చేత వల్లెవేయించారు. మరో అడుగు ముందుకేసి కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచేలా చక్రం తిప్పారు. షర్మిలకు తోడుగా వివేకా కూతరు సునీతను రంగంలోకి దించారు. వారిద్దరి ద్వారా వివేకా హత్యపై దుష్ప్రచారం చేయించి.. దాన్ని అస్త్రంగా మార్చుకుని లబ్ధి పొందాలన్నది చంద్రబాబు పాచిక. కానీ.. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలే ఆయన హత్యకు దారితీశాయని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నందున కడప లోక్‌సభ స్థానం పరిధిలో షర్మిల చేస్తున్న బస్సు యాత్రకు ప్రజాస్పందన కన్పించలేదు. తాను అనుకున్న ప్రయోజనం లభించకపోవడంతో చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. ఇప్పుడు షర్మిలపైనా నిందలు మొదలుపెట్టేశారు. వారిద్దరూ కలసి ఎనీ్టయే ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కొత్త పల్లవి ఎత్తుకుని తన సహజ నైజాన్ని చాటుకుంటున్నారు. అధికారంకోసం జిత్తులమారి ఎత్తులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసి.. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ రాబోయే ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించడం ఖాయమని దాదాపు అన్ని సర్వేల్లోనూ స్పష్టమైంది. అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేని చంద్రబాబు జనసేన, బీజేపీతో జతకలిశారు. మరో వైపు వివేకానందరెడ్డి కూతురు సునీతను చేరదీశారు. వివేకా హత్యపై సునీతతో దుష్ప్రచారం చేయిస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారు. అంతేగాకుండా జగన్ సోదరి షర్మిలను వాడుకునేందుకు కొత్త ప్రణాళికను అమలు పర్చారు. -
ఒక అత్యాశ...ఒక అసూయ
-
ఎన్నికల తర్వాత టీడీపీ గల్లంతే
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో టీడీపీ 2019 ఎన్నికల కంటే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని.. రాజకీయ తెరమీద ఆ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతోందన్నది స్పష్టంగా కనిపిస్తుండడంతో దాని అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర నిరాశ ని స్పృహలతో శివాలెత్తిపోతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఫ్ర్రస్టేషన్ ఫ్రకాష్టకు చేరిందనేది వారం రోజులుగా ఆయన చేష్టలు చూస్తుంటే అర్థమవుతోందని.. ఆయన కలలుగన్న కూటమి, పొత్తు వికటించడంతో చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడంలేదని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తు, సీట్ల ఖరారు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ కూటమిలో ఉన్న పార్టీలు తన కింద పనిచేసేవిగా చంద్రబాబు భావిస్తున్నారని.. అందుకే ఆయన అనుకున్నవారే ఆయా పార్టీల్లో అభ్యర్థులు అవుతున్నారన్నారు. దీంతో బీజేపీ, జనసేనలను నమ్ముకున్న వారందరూ మండిపడుతున్నారని.. కూటమిలో జరుగుతున్న గొడవలు, గందరగోళాలే అందుకు నిదర్శనమన్నారు. ఫలితంగా ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఓటమి భయంతో వ్యవస్థలపై దాడి.. ఘోర పరాజయం ఖాయమని ఆందోళన చెందుతున్న చంద్రబాబు తిట్లకు దిగుతూ.. వ్యవస్థలపై దాడిచేస్తున్నారు. చివరికి పిచ్చి పాటలు పెట్టుకుని డాన్స్‌లు కూడా వేస్తున్నాడు. 74 ఏళ్ల వ్యక్తి ఇలాగేనా చేసేది? ప్రజలు ఎన్నుకున్న ఒక సీఎం గురించి పిచ్చివాడిలా పిచ్చి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు.. జనం ఉమ్మేస్తారనే ఇంగితం కూడా లేకుండా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. 2019లో సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పటి సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిపై ఏ విధంగా చిందులు వేశాడో అందరూ చూశారు. కానీ, జగన్ ఒక వ్యవస్థపై ఇలా మాట్లాడిన సందర్భాలు ఎన్నడూ చూడలేదు. ఈ రోజు వీళ్లు ఎడాపెడా ఫిర్యాదులిస్తుంటే బదిలీలు చేస్తున్నారు. వారి ఫిర్యాదుల్లో అవాస్తవాలున్నా ఆ వ్యవస్థను జగన్ ఎన్నడూ మాట్లాడలేదు. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లాక వారి విచక్షణాధికారాన్ని ప్రశ్నించకూడదనే గౌరవాన్ని సీఎం జగన్ పాటిస్తున్నారు. ఇక ఈసీకి ఫిర్యాదు చేసి వలంటీర్లనైతే ఆపావగానీ పింఛన్లను ఆపలేవుగా బాబూ? శక్తి ఉంటే అవి కూడా ఈ సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ లాంటి సంస్థలతో ఆపించే వాడేగానీ ధైర్యం చాలలేదు. టెర్రరిజంలా ఎల్లో గ్యాంగ్ అరాచకం.. చంద్రబాబే శాశ్వత సీఎంగా ఉండాలని పెడితే తప్ప చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పురందేశ్వరి, లోకేశ్, దత్తపుత్రుడులకు మనసు శాంతించదేమో. రామోజీరావుకు మార్గదర్శి కేసు నడుస్తున్నప్పటి నుంచీ ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు మళ్లీ ‘సీఎస్ గారూ’.. అంటూ రాసుకొచ్చాడు. ముసుగు తొలగించి నేరుగా దాడికి దిగారు. ఇక పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నా.. ఆమె అజెండా మాత్రం చంద్రబాబుదే. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తీసేయాలంటూ ఈసీకి లేఖ రాసింది. పెయిడ్ ఆర్టిస్టులా షర్మిల మాటలు.. ఇక తెలంగాణనే తన జీవితమన్న షర్మిల ఎందుకిక్కడికి వచ్చారు? ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ బాధ్యతలను ఆమెకెవరు అప్పగించారు? అదే కాంగ్రెస్‌ను తెలంగాణలో విపరీతంగా తిట్టి ఇప్పుడెలా కలిశారు? ముందు వీటికి సమాధానాలు చెప్తే.. వివేకా హత్య, ఆమె తీసుకున్న పాత్రకు జవాబు కూడా దానిలోనే ఉంటుంది. నాలుగేళ్లుగా పట్టని వివేకా హత్య ఈ రోజు ఎందుకు పట్టింది? కోర్టు పరిధిలో ఉన్న అంశాలు తేలకముందే హంతకుడు అని ముద్ర వేస్తున్నారు. షర్మిల చంద్రబాబు అజెండాను భుజానకెత్తుకుంది. అందుకే షర్మిలను పెయిడ్ ఆర్టిస్తు అనాల్సి వస్తోంది. -
షర్మిల ఆత్మ పరిశీలన చేసుకోవాలి
కడప కార్పొరేషన్: పీసీపీ అధ్యక్షురాలు షర్మిల ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్‌బాషా హితవు పలికారు. గతంలో జగనన్న చెల్లిగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే కనీస స్పందన కూడా లేదన్నారు. రాజన్న రాజ్యం స్థాపిస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె అక్కడి ప్రజలను, నాయకులను నట్టేట ముంచి ఎన్నికల్లో పోటీచేయకుండా అస్త్ర సన్యాసం చేసిందన్నారు. ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో శనివారం అంజద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ.. రెండ్రోజులుగా షర్మిల వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా ఆమె సీఎం వైఎస్ జగన్‌ని, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్‌పై అభాండాలు దారుణం.. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొస్తే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి షర్మిల మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై సంబంధంలేని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిన విషయాన్ని ఆమె మర్చిపోవచ్చేమోగానీ ప్రజలు మర్చిపోలేదన్నారు. షర్మిల పరిస్థితి చూస్తే తమకే బాధేస్తోందని, జనాలు లేక చాలాచోట్ల మాట్లాడకుండానే ఆమె వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం బాబు మాయలో పడి వైఎస్ జగన్‌పై అభాండాలు దారుణమన్నారు. ఇష్టానుసారంగా సీఎం జగన్, అవినాష్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు హర్షించలేదన్న సత్యాన్ని ఆమె గ్రహించాలన్నారు. కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి అవినాష్‌రెడ్డిని హంతకుడని మాట్లాడటం అనైతికమని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని అంజద్‌బాషా చెప్పారు. టీడీపీ, బీజేపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలతో వేదికను పంచుకుంటూ బాబు స్క్రిప్టును చదవడం దారుణమన్నారు. షర్మిల, సునీత గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు. -
షర్మిల వ్యాఖ్యలపై వైఎస్ అవినాష్ రెడ్డి రియాక్షన్..
-
షర్మిల వ్యాఖ్యలపై దాసరి సుధా ఫైర్
-
షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన అవినాష్‌రెడ్డి
వైఎస్ఆర్, సాక్షి: కడప లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన. ‘‘నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. .. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా!’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు. -
ఏప్రిల్ 06: ఏపీ ఎన్నికల సమాచారం
April 6th AP Elections 2024 News Political Updates 09:06 PM, April 06 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్‌ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది 06:25 PM, April 06 2024 అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు: సీఎం జగన్ కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.? మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.! చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ? చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.! ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ? చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా? నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ? 04:42 PM, April 06 2024 చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందుకే ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం జగన్ 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారని చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు వాలంటీర్ల వ్యతిరేకి చంద్రబాబు నిర్వాకం వల్లే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం 04:28 PM, April 06 2024 ‘మార్గదర్శి’ పై కేసు నమోదు ద్వారక పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద కేసు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు కేసు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు మార్గదర్శి సితం పెట అకౌంట్ అసిస్టెంట్ వి. లక్ష్మణ్ రావు, ఆఫీస్ బాయ్ శ్రీను పై కేసు నమోదు 03:14 PM, April 06 2024 ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు విశాఖ టికెట్ జీవీఎల్‌కు ఇవ్వాలని కోరిన నేతలు విశాఖలో బీజేపీ ని కాపాడాలని నేతల ఆందోళన జేపీ నడ్డాను కూడా కలవనున్న విశాఖ బీజేపీ నేతలు 01:45 PM, April 06 2024 అనకాపల్లి: ఎన్నికల కోసం జనసేన నేతల మద్యం దిగుమతి సోమలింగంపాలెం వద్ద గడ్డిమెట్లో దాచిన మద్యం పట్టివేత మద్యం విలువ రూ.90 లక్షలపైన ఉంటుందని అంచనా గోవా నుంచి తెచ్చిన మద్యంగా పోలీసుల నిర్ధారణ 01:30 PM, April 06 2024 పాలకొల్లులో రెండో రోజు చంద్రబాబు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం ఎన్నికల సన్నద్ధత పై కూటమి అభ్యర్థులు, నేతలతో చర్చ మూడు పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం 01:25 PM, April 06 2024 రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు పాలకొల్లు సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించిన రామరాజు అనుచరులు ఉండి గడ్డ రామరాజు అడ్డ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు 01:20 PM, April 06 2024 చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కడపలో కిరాణా షాపులు బంద్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందని వ్యాఖ్య 01:15 PM, April 06 2024 వైఎస్సార్సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ అమలాపురం టికెట్ దక్కకపోవడంతో 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన రాజాబాబు 12:58 PM, April 06 2024 చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్దాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు వృద్ధులకు రూ. 4000 చొప్పున పెన్షన్ ఇస్తానని మరో అబద్ధం చెప్తున్నాడు 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు వలంటీర్ వ్యవస్థ పై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడు పెన్షన్ల కోసందూర ప్రాంతాలకు వెళ్లి మండుటెండలో అవస్థలు పడి కొంతమంది వృద్ధులు చనిపోయారు ఆ అవ్వ తాతల ఉసురు చంద్రబాబుకు తప్పదు చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన తిరిగి సీఎంగా జగనే అవుతారు 12:42 PM, April 06 2024 వాళ్లు కాపులకు ఏం చేశారసలు?.. : ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని అసెంబ్లీకి తీసుకెళతానని పవన్ కల్యాణ్ మోసం చేశాడు చంద్రబాబు కు దాసోహం అంటూ 21 సీట్లు తీసుకున్నాడు బీజేపీలో ఉన్న ఒక్క కాపుకి కూడా చంద్రబాబు సీటు లేకుండా చేశాడు పవన్ కల్యాణ్ కోసం కాపు జాతి లేదు కాపుల కోసం పని చేసే ఎవరికైనా మద్దతు ఉంటుంది 31 సీట్లు కాపు లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు బిజెపి ఒక్క సీటు ఇవ్వలేదు.. టీడీపీ కూడా కాపులకు న్యాయం చేయలేదు అందుకే.. కాపులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు వ్యాఖ్యలు 12:02 PM, April 06 2024 ప్రతీ పేదోడి గుండెల్లో జగన్: గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే! మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేదవాడు అనుకుంటాడు సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుంది సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్ సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడు.. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే కొణతాల, దాడి వీరభద్రరావుపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపాను వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారు సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తా 11:55 AM, April 06 2024 షర్మిల వ్యాఖ్యల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎంపీ అవినాష్‌రెడ్డి కడప ఎన్నికల ప్రచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అద్యక్షురాలు షర్మిల అన్నారు ఆ వ్యాఖ్యల్ని అమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉంది మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి 11:49 AM, April 06 2024 టీడీపీ త్వరలో నామరూపాల్లేకుండా పోతుంది: వైవీ సుబ్బారెడ్డి సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో రౌడీయిజం చేస్తున్నారు సీఎం రమేష్ మార్క్ రౌడీయిజం మనకు కావాలా? సీఎం రమేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజ్యసభలో ఖాళీ అయినట్లే.. మిగతా మూడు చోట కూడా టీడీపీ ఖాళీ అవుతుంది ఎన్నికల తర్వాత నామారూపాల్లేకుండా పోతుంది 10:55AM, April 06 2024 కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకానా? టీడీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం బీజేపీతో అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ నరసాపురం, కడప ఎంపీ స్థానాలు ఇచ్చిపుచ్చుకునే యోచనలో టీడీపీ బీజేపీ మాడుగుల, చింతపూడి, మడకశిర, సూళ్లురుపేట, సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు? 10:37AM, April 06 2024 విశాఖలో జీవీఎల్ పోస్టర్ల కలకలం విశాఖలో బీజేపీ నేత జీవీఎల్ పేరిట పోస్టర్లు జన జాగరణ సమితి పేరిట ఆంధ్రాయూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు విశాఖ ఎంపీ సీటు జీవీఎల్‌కే కేటాయించాలంటూ సందేశాలు విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్ గళం వినిపించారని.. ఆయనకే టికెట్ ఇవ్వడం న్యాయమంటూ పోస్టర్లపై రాతలు పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి విశాఖ ఎంపీ సీటు విశాఖ బీజేపీకి వెళ్తే గనుక.. నరసాపురం కోరే ఛాన్స్ నరసాపురం ఓకే అయితే గనుక.. టీడీపీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చే అవకాశం 09:48AM, April 06 2024 ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే: కేశినేని, దేవినేని అవినాష్ విజయవాడ పటమట లంక 14వ డివిజన్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారం చూపిన దేవినేని అవినాష్: కేశినేని నాని స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయం: కేశినేని నాని జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు: కేశినేని నాని నేదురుమల్లి నీ, ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబును కాదా?: కేశినేని నాని చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వం పై కుక్కల్లాగా వాగుతున్నారు: కేశినేని నాని మేము మాటలు వ్యక్తుల కాదు చేతల ప్రభుత్వం లో వున్నాము: కేశినేని నాని టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు: కేశినేని నాని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోంది: దేవినేని అవినాష్ స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు: దేవినేని అవినాష్ అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నాం: దేవినేని అవినాష్ నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: దేవినేని అవినాష్ రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలి: దేవినేని అవినాష్ ఓటమి భయంతోనే వ్యక్తి గత రోషణకు చేస్తున్న టీడీపీ నేతలు: దేవినేని అవినాష్ ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ కి అండగా ఉన్నారు: దేవినేని అవినాష్ 09:15AM, April 06 2024 చంద్రబాబుకి బుద్ధి చెప్తాం: నెల్లూరు ప్రజలు నెల్లూరులో చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్‌కు స్వాగతం పలికేందుకు సిద్ధం జై జగన్ అంటూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధం అంటూ ప్రజల నినాదాలు 08:27AM, April 06 2024 నెల్లూరు సిద్ధమా?: సీఎం జగన్ ట్వీట్ నేడు ఉమ్మడి నెల్లూరులో సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ ఇప్పటికే రాయలసీమలో బస్సు యాత్ర సూపర్ సక్సెస్ Day-9 నెల్లూరు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:54AM, April 06 2024 రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించనున్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి 07:32AM, April 06 2024 ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రచారం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం క్రొసూర్, సత్తెనపల్లి ప్రజా గళం బహిరంగ సభలు 07:17AM, April 06 2024 చుక్కాని లేని జనసేనాని విభజిత ఆంధ్రప్రదేశ్‌కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయిన పవన్ కల్యాణ్ కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ భారీ భారీ డైలాగులు.. పేర్ల వాడకాలు బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం మరీ ఎబ్బెట్టు మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ అభిమానులతో నినాదాలు చేయించిన పవన్ తర్వాత 50–60 స్థానాలలో పోటీ అంటూ ప్రచారం ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చెయ్యి అని ప్రకటనలు చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో జనసేన శ్రేణులే.. అసలు పవన్ ఎందుకు పార్టీ పెట్టాడా? అని నిలదీతలు పైగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనే విమర్శ పవన్‌పై 07:04AM, April 06 2024 నేడు 9వ రోజు మేమంతా సిద్ధం యాత్ర తొమ్మిదో రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో సిద్ధం బహిరంగ సభ నిన్న యాత్రకు విరామం.. నెల్లూరు నేతలతో సీఎం జగన్ భేటీ ఇప్పటికే రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన ఎన్నికల ప్రచార యాత్ర అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టిన వైనం పేదలే స్టార్‌క్యాంపెయినర్లుగా ప్రచారం దూసుకెళ్తున్న సీఎం జగన్ పాలనపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌తో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో మరింత మంచి జరిగేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచన ప్రతీ సభలోనూ జరిగిన మంచిని వివరిస్తూ.. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -9. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు కావలి బైపాస్ దగ్గరబహిరంగ సభ జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/3oqaBoGJAU — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 06:45AM, April 06 2024 షర్మిలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధా కడపలో పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం షర్మిల ప్రచారంలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా విచారణ కోర్టులో జరుగుతుండగానే అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం సమంజసం కాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల అందరిలో బాధ ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గతంలో దివంగత వైఎస్అర్, వివేకానందరెడ్డిలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇప్పుడు సిఎం వైఎస్ జగన్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తు అండగా నిలుస్తున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేము ఎవరి ఇంటికి వెళ్లినా మా తమ్ముడు, మా అన్న అంటూ చెబుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అలాంటి మంచి వ్యక్తులపై నిరాధార అరోపణలు చెయ్యడం దారుణం: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయట తిరుగుతున్నాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కోర్టులు ఇంకా తీర్పులు ఇవ్వాల్సి ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఈలోపు తొందరపడి అవినాష్‌రెడ్డి మీద షర్మిల ఆరోపణలు చేయడం సరికాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా నా భర్త ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే జగనన్న నన్ను తోబొట్టులా అదరించాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల ప్రచారం చేసుకోకుండా ఏదొ పొలిటికల్ ఏజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇకనైనా ఇలాంటివి వదిలిపెట్టి ప్రచారం చేసుకొవాలి: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రెస్ వ్యాఖ్యలు 06:30AM, April 06 2024 ఎల్లో మీడియాపై ఐపీఎస్ ఆఫీసర్ అసోషియేషన్ సీరియస్ చంద్రబాబు కోసం బరితెగించొద్దు! పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వార్నింగ్ ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ‘వీళ్లా ఐపీఎస్‌లు’ కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ.. పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ తమ కౌంటర్‌ను ‘ఈనాడు’ బ్యానర్‌గా వెయ్యాలని డిమాండ్.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల అసంతృప్తి ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ చంద్రబాబు కోసం హద్దులు దాటుతున్న ఎల్లో మీడియా! ఐపీఎస్ అధికారులను కించపరిచేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి గత మూడు రోజులుగా వరుస కథనాలు సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తుండటంపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ చంద్రబాబుకి తొత్తుగా మారిన ఎల్లో మీడియాపై ఇప్పటికే ఉమ్మేస్తున్న… pic.twitter.com/LaB6dcPczr — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 సామాన్యులే మన పార్టీ కార్యకర్తలు!#YSJaganAgain#VoteForFan pic.twitter.com/UyO2f6gCUh — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 -
ఏప్రిల్ 05.. ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 5th Telugu Updates 09:23 PM, ఏప్రిల్ 05 2024 ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్‌రెడ్డి ఆగ్రహం తనపై రాసిన తప్పుడు వార్తపై మండిపడ్డ సీఎస్ ఈనాడు చీఫ్ ఎడిటర్‌కి లేఖ రాసిన సీఎస్ ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు తప్పుడు కథనం సీఎస్ జవహర్‌రెడ్డి ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనం అబద్ధపు రాతలపై ఖండన లేఖ విడుదల చేసిన సీఎస్ తన ఖండన ఈనాడు మొదటి పేజీలో రాయాలని కోరిన జవహర్ రెడ్డి లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని.స్పష్టం చేసిన సీఎస్ ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారు? ఐపీఎస్ అధికారులు ఏసిఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చింది ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్‌పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా.. లేఖలో పేర్కొన్న సీఎస్ 09:09 PM, ఏప్రిల్ 05 2024 పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ ముగ్గురిపైన క్రిమినల్ చర్యలకు దిగాలని ఐపీఎస్ అధికారుల సంఘం నిర్ణయం ఐపీఎస్‌లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం.. ప్రకటన విడుదల చేసిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన సంఘం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించిన ఐపీఎస్‌ల సంఘం 08:14 PM, ఏప్రిల్ 05 2024 పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుపడింది చంద్రబాబు కాదా? చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మరు షర్మిలను చంద్రబాబు తప్పు దోవ పట్టిస్తున్నారు దివంగత మహానేత వైయస్సార్ పాలనను సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు వైఎస్సార్ మరణం తర్వాత ఎఫ్ఐఆర్లో ఆ మహానేత పేరును కాంగ్రెస్ చేర్చింది అలాంటి పార్టీలో షర్మిల చేరడం ఆంధ్ర రాష్ట్రానికి ఆమెకి ఎటువంటి సంబంధాలు లేవు కొంతసేపు తెలంగాణ కోడలు అంటుంది కొంతసేపు ఆంధ్ర ఆడపిల్లను అంటుంది షర్మిల మాటలకు పొంతన లేదు సీఎం జగన్ పై రాళ్లు వేస్తే దివంగత వైఎస్సార్ కూడా నిన్ను క్షమించడు నారా లోకేష్‌కు దమ్ముంటే మంగళగిరిలో గెలిచి చెప్పమనండి మీడియా వాళ్లందరూ వెళ్లి నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా..? లేదా అడగండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచే పార్టీ వైఎస్సార్సీపీ నారా లోకేష్‌కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ, అమిషా, పవన్ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్. టీడీపీ నేతలు మెడ నిండా ఎన్ని కండువాలు వేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు 05:59 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల: వాసిరెడ్డి పద్మ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు తీర్పు శిక్ష ఈవిడే వేసేస్తున్నారు.. ఇది తీవ్రమైన అంశం విచారణలో ఉన్న అంశాల పై ఇంత రాజకీయం చేయడం సరికాదు కడప ప్రజలు అమాయకులు.. అజ్ఞానులు కాదు వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా? ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకుంది అవినాష్ రెడ్డి పై హంతకుడని నింద వేస్తున్నారు కోర్టులో విచారణ జరుగుతున్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయమేంటి? చంద్రబాబు రాజకీయంలో షర్మిల, సునీత పావులుగా మారారు ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా? ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు మూసేశారు ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు ఏపీ ప్రజల కోసం ఈ రోజు ఎందుకు వస్తున్నారు చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్ లు తీసుకుంటున్నారు మీ యూటర్న్ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి.. ప్రజలకు సంజాయిషీ చెప్పాలి వివేకాను రాజకీయంగా లేకుండా చేసిన వారితో చేతులు కలిపారు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఆధారాలు లేకుండా అవినాష్ పై ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల్లో ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి ఏపీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి ఎవరు ఏం చేశారో కడప ప్రజలకు తెలుసు షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం కచ్చితంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం 05:01 PM, ఏప్రిల్ 05 2024 ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ బస్సుయాత్ర 9వ రోజు శనివారం(ఏప్రిల్ 6) షెడ్యూల్ ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. 04:53 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు బుజ్జగించినా తేలని గోపాలపురం టికెట్ పంచాయితీ చంద్రబాబు ముందే బయటపడ్డ వర్గ విభేదాలు చంద్రబాబు బస చేసిన నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద ముళ్లపూడి వర్గీయుల ఆందోళన మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు ఫ్లకార్డులతో నిరసన,నినాదాలు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అదుపు చేసిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ మద్దిపాటి వెంకట రాజుని వెంటనే మార్చాలంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించి తెలుగు తమ్ముళ్ల నిరసన 03:45 PM, ఏప్రిల్ 05 2024 గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?: పోసాని కృష్ణమురళి ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్‌కు దేవుడు చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు లొంగదీసుకున్నారు 02:02 PM, ఏప్రిల్ 05 2024 అచ్చెన్న, అయ్యన్నలకు ఈసీ నోటీసులు టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడుకి ఎన్నికల సంఘం నోటీసులు సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు టీడీపీ నేతలపై ఈసీఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కి నోటీసులు ఇచ్చిన సీఈఓ మీనా 01:45 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుపై ఫైర్.. టీడీపీ మీటింగ్‌లో తిట్ల పురాణం చిప్పగిరి మండలం నెమకల్లు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సొంత పార్టీ లో నిరసన సెగ పార్టీ కార్యకర్తల ఆత్మీయసమావేశం లో వీరభద్ర గౌడ్ సమక్షంలో రెండు వర్గాలు రసాభాస మా అవసరం మీకు పట్టదా అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఒక్క వర్గానికే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు మండిపాటు సమాచారం ఇవ్వకుండా మీటింగులు ఎలా పెడతారంటూ ఒకరి పై నొకరు తిట్ల పురాణం 1:15 PM, ఏప్రిల్ 05 2024 విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ మన పార్టీ(ప్రజాశాంతి) అధికారంలోకి వస్తుంది అందుకే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా కారణం నేను విశాఖలోనే పుట్టి, పెరిగి చాలా సేవ చేశా రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కోసం కోర్టులో పోరాడా స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తానని చెప్పాను ఇవ్వకపోతే నేను జైలు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను కోర్టుల్లో జడ్జిలు తప్పుడు తీర్పులు ఇస్తే వారి సంగతి తేల్చుతా 12:30 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు నిరసన సెగ టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనల్లో నిరసన సెగలు పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించాలంటూ నినాదాలు నల్లజర్ల లో చంద్రబాబు బసచేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణుల నిరసన బొరగం శ్రీనివాస్ కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయుల ఆందోళన పోలవరం అభ్యర్థి ని మార్చాలని నినాదాలు చేస్తున్న టీడీపి శ్రేణులు 11:43 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు: హోం మంత్రి తానేటి వనిత వలంటీర్లను గోనె సంచులకు మోసుకునేవాళ్లు.. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు తలుపులు తట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు డేటా తీసుకెళ్లి అమ్మేస్తున్నారు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారన్న అన్న వ్యక్తి పవన్ కల్యాణ్ వలంటీర్లను చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్.. కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించింది ఎవరు?.. చంద్రబాబే అవ్వ తాతల మరణాలకి చంద్రబాబే కారణం చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు పుష్కరాల్లో షూటింగ్ ల పేరుతో సామాన్యుల ప్రాణాలు పట్టణ పెట్టుకుంది ఎవరు చంద్రబాబు కాదా....? జగనన్న బస్సు యాత్రకు వస్తున్న జన సందోహన్ని చూసి వీరికి వణుకు పుడుతుంది దళిత మహిళలని లేకుండా నాపై చెత్తాచెదారం అంటూ హీనంగా మాట్లాడారు.. చంద్రబాబు కొవ్వూరులో టిడిపి వ్యక్తిని తీసుకెళ్లి గోపాలపురంలో ఎందుకు పెట్టారు జవహర్ ను తీసుకెళ్లి గతంలో తిరువూరులో పెట్టింది ఎవరు.... కొవ్వూరు నియోజకవర్గం లో ఒక రూపాయి దోచుకున్నానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వైదొలుగుతాను...? దోచుకున్నానని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం... కొవ్వూరు లో టిడిపి హాయంలో ఏడేచ్చగా దోచుకుంది వారి నాయకులు దొమ్మేరులో దళిత యువకుడు ఆత్మహత్య చనిపోతే చంద్రబాబు నాపై ఆపాదిస్తున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై బురద చల్లితే సానుభూతి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు భ్రమరావతి కట్టినంత ఈజీ కాదు ప్రజల్లో అబద్దాల మేడలు కట్టడం ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు గూడు కట్టుకుని ఉన్నాయి జగనన్నను పేదలు ఆరాధ్య దైవంగా భావిస్తూ పేదల గుండెల్లో స్థానం కల్పించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై నాయకులపై బురద చల్లితే.. మైలేజీ వస్తుందని అనుకోవడం వారి భ్రమ కొవ్వూరులో గోపాలపురంలో కూడా టిడిపిలో వర్గ విభేదాలు రెండు గ్రూపులు ఉన్నాయి వైఎఎస్సార్సీపీలో కొవ్వూరు గోపాలపురంలో ఐక్యతగా పనిచేస్తున్నామని కడుపుమంటతో ఉక్రోశంతో చంద్రబాబు ఉన్నారు ప్రజలు ఎవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడం కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను.. చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో లో కాపీ పేస్ట్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టామని అంటున్నారు ఒకటైన నిరూపించమని సవాల్ చేస్తున్నాను టిడిపి హయంలో మహిళలను వివస్రను చేశారు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరి అధికారులపై బురద చల్లాలి అనుకోవడం బాధాకరం ఐఏఎస్ ఐపీఎస్ చిన్న స్థాయి ఉద్యోగుల సైతం వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తారు వారి ప్రభుత్వానికి కొమ్ము కాయరు టీడీపీ హయాంలో అలా చేసినట్లు ఉన్నారు అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు తూర్పు గోదావరిలో హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు 11:03 AM, ఏప్రిల్ 05 2024 సీఎం రమేష్ ఓ అహంకారి: ఎమ్మెల్యే ధర్మశ్రీ అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన తీవ్రంగా ఖండించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులు, హింసను సహించరు సీఎం రమేష్ ఎక్కడ నుండి వచ్చారు మళ్లీ అక్కడికే పంపుతారు సీఎం రమేష్ అహంకారంతో విర్రవీగుతున్నారు సీఎం రమేష్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తా 10:52 AM, ఏప్రిల్ 05 2024 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నమ్మకద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి నే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం కిరణ్ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించాడు కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తాం చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు పుంగనూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 10:34 AM, ఏప్రిల్ 05 2024 ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా ఎందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా? అని స్థానిక ప్రజలు వాపోతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:02 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు అవ్వా తాతల ఉసురు తప్పదు: చింతల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధ వేస్తుంది పెన్షన్ కోసం వృద్ధులను మంచాలపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది వలంటరీ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు చేయించాడు నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వలంటీర్లు సేవలు అందించారు ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వలంటీర్లు పెన్షన్లు అందించే వాళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేసి వలంటీర్లను పక్కన పెట్టించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా ఎన్నికల సంఘం పునరాలోచన చేసి వాలంటీర్లతో పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 09:37 AM, ఏప్రిల్ 05 2024 వేర్ ఈజ్ లోకేషం? ఎన్నికల వేళ.. టీడీపీలో ఆసక్తికర పరిణామం తెర వెనుకే ఉంటున్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖరావాలకు సైతం బ్రేక్ ఇచ్చిన లోకేష్ పూర్తిగా ఉండవల్లి నివాసానికే పరిమితమైన వైనం మంగళగిరి ప్రచారానికి వెళ్తే.. అడుగడుగునా నిలదీస్తున్న జనం దీంతో.. లోకేష్ ప్రచారానికి దూరంగా ఉంటున్న పార్టీ శ్రేణులు అపార్ట్మెంట్లలో ప్రచారానికే మొగ్గుచూపిస్తున్న నారా లోకేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి లావణ్యకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మంగళగిరి వాసులు సోషల్ మీడియాలో సినబాబుపై పేలుతున్న సెటైర్లు 09:09 AM, ఏప్రిల్ 05 2024 టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: విజయసాయిరెడ్డి 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నారు జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు.. వలంటీర్ వ్యవస్థ పై పిర్యాదులు చేసి.. పింఛన్ దారులకు దూరం చెయ్యడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం.. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబలించి వేస్తుంది.. వలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు.. అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తాం.. రేపటి(ఏప్రిల్ 6) సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభం అవుతుంది ప్రతీ స్వాగత పాయింట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతారు.. సాయంత్రం నాలుగు గంటలకి సీఎం జగన్ కావలి చేరుతారు.. 6 గంటలకి సభ ముగుస్తుంది నెల్లూరు చేరిక కార్యక్రమంలో YSRCP MP అభ్యర్థి విజయసాయి రెడ్ది వ్యాఖ్యలు 09:02 AM, ఏప్రిల్ 05 2024 ఇవాళ బస్సు యాత్రకు విరామం నెల్లూరులోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం బస చేసిన ప్రాంతంలోనే.. నెల్లూరు జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం జగన్ రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్ ఇప్పటికే వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయవంతంగా సాగిన యాత్ర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సలహాలు-సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉదయం నుంచే చింతరెడ్డిపాలెం సీఎం జగన్ బస కేంద్రానికి చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రేపు.. తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో పాల్గొననున్న సీఎం జగన్ నెల్లూరు బైపాస్ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న యాత్ర రేపు కావలిలో సిద్ధం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ 08:47 AM, ఏప్రిల్ 05 2024 విజయసాయిరెడ్డి సమక్షంలో చేరికలు నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పండగ వాతావరణం టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్సీపీలోకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ Sc కమిషన్ మెంబర్ రవీంద్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి 08:27 AM, ఏప్రిల్ 05 2024 నేటి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా.. నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలతో కీలక మంతనాలు నిర్వహించే ఛాన్స్ 08:06 AM, ఏప్రిల్ 05 2024 రఘురామ కొత్త రాగం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త రాగం కూటమి తరఫునే పోటీ చేస్తానని గతంలో ప్రకటించుకున్న రఘురామ సీటు తన్నుకుపోయిన బీజేపీ.. తన అనుచరుడి కోసం పైరవీలు మొదలుపెట్టిన చంద్రబాబు తాజాగా రఘురామ కొత్త రాగం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటన నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక. చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటూ రఘురామ వ్యాఖ్య నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుందంటూ గప్పాలు 07:42AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు గంజాయి వ్యాఖ్యలు.. భగ్గుమన్న వ్యాపారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం బంద్ కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ రావులపాలెంలో టీడీపీ నిర్వహించిన ప్రజా గళం సభలో వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వ్యాపారులు బంద్ నిర్వహించడంతోపాటు చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న చాంబర్ ఆఫ్ కామర్స్ చంద్రబాబు మాటలపై మండిపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు 07:15AM, ఏప్రిల్ 05 2024 మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్‌కే గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన బుద్ధ ప్రసాద్ బుద్ధ ప్రసాద్‌కు టికెట్ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో అసంతృప్తి రాజీనామాలకు సిద్ధమైన పలు వర్గాలు మరోవైపు.. బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్ యనమల భాస్కరరావు పేరును స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ బాబు కోసం.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్‌కు టికెట్ మూడు రోజుల కిందట జనసేనలో చేరిన ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పవన్ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా స్థానాల్లో జనసేన శ్రేణుల నిర్ణయం? 07:06AM, ఏప్రిల్ 05 2024 అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యం టీడీపీ సానుభూతిపరుడు షాపుపై డీఆర్ఐ అధికారుల తనిఖీలు జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరింపులు నా సంగతి మీకు తెలియదు అంటూ రౌడీయిజం అధికారులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారుల చేతిలో నుంచి ఫైళ్లు లాక్కున్న సీఎం రమేష్ సీఎం రమేష్ రౌడీయిజం చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రశాంతమైన అనకాపల్లిలో గతంలో ఎన్నడు ఇటువంటి సంఘటన జరగలేదంటున్న ప్రజలు అధికారులపై టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సీఎం రమేష్ పోలీసులు సర్ది చెప్పిన పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ కార్యకర్తలు ఎక్కడ నుంచో వచ్చి అనకాపల్లిలో రౌడీయిజం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం 06:54AM, ఏప్రిల్ 05 2024 నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాజమండ్రి ఎంపీ బరిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి పొత్తులో భాగంగా.. పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు తీసుకున్న ఏపీ బీజేపీ సీట్ల పంపకంపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి.. పురందేశ్వరి తీరుపై విమర్శలు టీడీపీ తీసుకున్న విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం బీజేపీ నరసాపురం సీటును వదులుకునే చాన్స్ నరసాపురం ఎంపీ సీటు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు కడప ఎంపీ సీటును బీజేపీ ఇచ్చే యోచనలో టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ మరో మూడు నాలుగురోజుల్లో సీట్లు మార్చుకునే అంశంపై రానున్న స్పష్టత 06:49AM, ఏప్రిల్ 05 2024 తిరుపతి జిల్లా సిద్ధంపై సీఎం జగన్ ట్వీట్ తిరుపతి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం యాత్ర గురువారం సీఎం జగన్ బస్సు యాత్రకు తిరుపతి ప్రజల బ్రహ్మరథం సాయంత్రం నాయుడుపేట బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం: సీఎం జగన్ నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం: సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు: సీఎం జగన్ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం: సీఎం జగన్ ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు: సీఎం జగన్ తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు: సీఎం జగన్ పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?: సీఎం జగన్ పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి: సీఎం జగన్ ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు: సీఎం జగన్ చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్ Day-8 తిరుపతి జిల్లా సిద్ధం! #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/1GxnW91kLr — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 06:40AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకి ఈసీ నోటీసులు సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు గురువారం నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం మార్చి 31వ తేదీన నిర్వహించిన ప్రజా గళం సభల్లో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీకి వైఎస్సార్సీపీ లేళ్ల అప్పిరెడ్డి, మరొకరు ఫిర్యాదు ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశం 06:30AM, ఏప్రిల్ 05 2024 చివరకు ఇదీ టీడీపీ పరిస్థితి: YSRCP ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి టీడీపీకి అంత బెరుకేంటో? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. వలంటీర్ వ్యవస్థను నిలువరించి.. ఫించన్లను జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నెగిటివ్ కామెంట్స్‌కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్‌కి చాట్ ఆప్షన్‌ను మాయం చేసిన టీడీపీ అదే సమయంలో.. టీడీపీని మరింతగా ముంచేస్తున్న పొత్తులు సీట్ల పంపకాల్లో బాబు ఒంటెద్దు పోకడ ప్రజల్లో దిద్దుకోలేక.. పార్టీలో సర్దుకోలేక చేతులెత్తేస్తున్న చంద్రబాబు! ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంత బెరుకేంటి @JaiTDP..? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. దాంతో నెగిటివ్ కామెంట్స్‌కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్‌కి చాట్ ఆప్షన్‌ను మాయం చేసిన టీడీపీ టీడీపీని నిండా ముంచేస్తున్న పొత్తులు, సీట్ల పంపకాల్లో బాబు… pic.twitter.com/nJNBTLnz5B — YSR Congress Party (@YSRCParty) April 4, 2024 -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హాట్ కామెంట్స్
-
AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్..
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే టీడీపీ రెండు పార్టీలో కలిసి కూటమిని ఏర్పాటు చేయగా.. ఇటు కాంగ్రెస్‌లో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో, హైకమాండ్ కొందరిని బలవంతంగా బరిలో దించే ప్రయత్నం చేస్తోంది. కాగా, ఏపీలో ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని సర్వేల్లో వైఎస్సార్సీపీకే అనుకూల ఫలితాలు వస్తున్నాయి. దీంతో, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల్లో పోటీకి జంకుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల్లో పోటీ అంటేనే భయపడిపోయి.. వెనకడుగు వేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హస్తం పార్టీలో సీనియర్ నేతలు కూడా పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. ఎన్నికల్లో డిపాజిట్ కూడా గల్లంతైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇక, కాంగ్రెస్‌లో సీనియర్ నేతలైన రఘువీరా రెడ్డి, కేవీపీ వంటి సీనయర్లు కూడా పోటీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేదిలేదని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, మరో మార్గం లేక పల్లం రాజు, గిడురు రుద్రరాజులను కాంగ్రెస్ అధిష్టానం బలవంతంగా దించే ప్రయత్నం చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోయే దానికి ఎందుకు తమను బలి చేస్తారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో కనీసం డిపాజిట్ రాకపోతే పార్టీలో పరువు పోతుందునే ఆలోచన వారు ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసి పోటీ నుంచి వారిని తప్పించాలని వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. -
ఎన్డీయే కూటమి, పవన్, షర్మిలపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలుపుపై వంద శాతం ధీమాతో ఉన్నామని, ఎంతమంది కూటమిగా వచ్చినా సగం ఓట్లు కూడా ఆ పార్టీలకు పడవని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సజ్జల మాట్లాడుతూ.. కూటమిపై, ప్రతిపక్ష నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీతో వైఎస్ జగన్‌కు ఉంది ప్రభుత్వ సంబంధమే. కేంద్రం, రాష్ట్రం అన్నట్టుగానే బీజేపీతో ఇంతకాలం అనుబంధం కొనసాగించాం. వాస్తవానికి బీజేపీ నుంచి మాకెప్పుడో ఆఫర్ ఉంది. ఎన్డీయేతో వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లం. కానీ, ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం గనుకే దూరంగా ఉన్నాం. నలుగురితో కలిసి పోటీచేస్తే తర్వాత తేడాలొస్తాయ్. చంద్రబాబులా పొత్తునుంచి బయటికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేం’’ అని సజ్జల చెప్పుకొచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదన్న సజ్జల.. ఆయన్ని చూస్తే జాలేస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయాలపై పవన్‌కు ఒక క్లారిటీ అంటూ లేదు. అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా?’’ అని సజ్జల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండబోదని సజ్జల అంచనా వేశారు. ఈ క్రమంలో సంచలన ప్రకటన చేశారాయన. ‘‘ రాజకీయ లక్ష్యాలే తప్ప.. వైఎస్ కుటుంబంలో గొడవలేం లేవు. షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అయితే.. రాజకీయంగా షర్మిలే తప్పటడుగులు వేశారు’’ అని సజ్జల వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో 87శాతం మందికి సంక్షేమం అందించాం. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే పడతాయి. ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉంది. కూటమిగా ఎంతమంది కలిసొచ్చినా వాళ్లకొచ్చే ఓట్లు 50శాతం లోపే ఉండొచ్చు’ అని సజ్జల అంచనా వేస్తున్నారు. -
March 26th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 26th Latest News Telugu.. 06:40 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు పార్టీలో చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు) కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ 06:17 PM, March 26th 2024 తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ సమక్షంలోవైఎస్సార్సీపీలో చేరిన రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ 06:05 PM, March 26th 2024 అమరావతి: ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీస్ మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పత్రికల్లో ప్రజల అభిప్రాయాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు అడ్డుకట్ట వేయాలని కోరాం నిత్యం వైఎస్సార్సీపీపై బురద చల్లుతూ వార్తలు రాస్తున్న విధానంపై ఫిర్యాదు చేసాం 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళేముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను సవరించాలని కోరాం పాంప్లెట్స్ పంచేందుకు అనుమతి తీసుకోవాలని నిబంధనను సవరించాలని కోరాం బ్రాండింగ్, హోర్డింగ్స్, పార్టీ ఆఫీసుల్లో ప్రచార ప్రకటనలపై నిబంధనలపై మరోసారి పునరాలోచించాలని కోరాం అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెల్లాం 05:50 PM, March 26th 2024 విజయవాడ: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే చంద్రబాబుకు తెలుసు: రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడను అభివృద్ధి చేసి చూపించారు సీఎం జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి పాలనలో మేం భాగస్వామ్యులైనందుకు ఆనందంగా ఉంది సీఎం జగన్.. బీసీలకు పెద్ద పీట వేశారనడానికి నేనే ఉదాహరణ ఒక బిసీ మహుళనైన నన్ను విజయవాడకు మేయర్ చేశారు విజయవాడ ఈస్ట్, వెస్ట్,సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీగా కేశినేని నానిని గెలిపించుకుంటాం చంద్రబాబు తన బినామీలను మా పై పోటీ పెడుతున్నాడు సామాన్యుడు రాజకీయాల్లోకి రాకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి నా పై వెస్ట్ లో పోటీకి దించుతున్నారు పశ్చిమనియోజకవర్గం వైఎస్సార్సీపీకి అడ్డా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేస్తాం ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి అధికప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు -షేక్ ఆసిఫ్, విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి 05:40 PM, March 26th 2024 తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): టీడీపీ నేత బొజ్జల సుధీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు వాలంటీర్లపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా నిష్పక్షపాతంగా గౌరవవేతనం తీసుకుంటూ ప్రభుత్వం తరపున సేవలందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులు అని బొజ్జల సుధీర్ మాట్లాడడం చాలా దారుణం. అలా మాట్లాడనికి అసలు మనిషినా, పశువునా? బొజ్జల సుధీర్ బేషరతుగా వాలంటీర్లకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి 05:30 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో వేనాటి రామచంద్రారెడ్డి(సూళ్లురుపేట), మస్తాన్ యాదవ్(వెంకటగిరి) మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, గొరకపూడి చిన్నయ్యదొర తదితరులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ 05:25 PM, March 26th 2024 వైఎస్సార్సీపీ చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన చిన్నం రామకోటయ్య 05:20 PM, March 26th 2024 ఏపీ అసెంబ్లీ స్థానాల్లో మరోసీటు అదనంగా కోరుతున్న బీజేపీ రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి కావాలని బీజేపీ పట్టు రెండు సిట్టింగ్ స్థానాలు కావడంతో ససేమిరా అంటున్న టీడీపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ 05:18 PM, March 26th 2024 టీడీపీని వీడే యోచనలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఏలూరు ఎంపీ టికెట్ యనమల కుటుంబానికి ఇవ్వడంతో మాగంటి బాబు అసంతృప్తి మాగంటి బాబు పార్టీ మారతాడని ప్రచారం 05:15 PM, March 26th 2024 పల్నాడు : పెదకూరపాడు టీడీపీ నేత కంచేటి సాయిని సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అమరావతిలో వైఎస్సార్సీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో సాయి అరెస్ట్ సత్తెనపల్లి పీఎస్ కు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, కార్యకర్తలు సత్తెనపల్లి కోర్టు దగ్గర పోలీస్ బందోబస్తు 05:13 PM, March 26th 2024 ఏలూరు : నారా భువనేశ్వరి పర్యటనలో ఉద్రిక్తత నారా భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టికెట్లు రాని కొందరు గొడవ చేసే అవకాశం ఉందని అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టీడీపీ కార్యకర్తలు, వ్యక్తిగత సిబ్బందికి మధ్య తోపులాట 05:12 PM, March 26th 2024 AP: ముగిసిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలి బీజేపీ శ్రేణులకు కేంద్రం పెద్దల దిశానిర్దేశం 05:11 PM, March 26th 2024 అమరావతి : రాజకీయ పార్టీల నేతలతో సమావేశంc కానున్న ఈసీ ఎన్నికల నియమ నిబంధనలపై పార్టీల నేతలతో చర్చించనున్న ఈసీ 04:45 PM, March 26th 2024 బుజ్జగింపు చర్యలు.. పార్టీ పదవులతో ఎర సీట్లు ఇవ్వలేని అసెంబ్లీ ఆశావహులకు పార్టీ పదవులు ఇస్తున్న టీడీపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం. పార్టీ జాతీయప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా గండి బాబ్జి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకట రాముడు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్,మన్నె సుబ్బారెడ్డి,కొవ్వలి రామ్మోహన్ నాయుడు. పార్టీ కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణం రాజు,వాసురెడ్డి ఏసుదాసు నియామకం 03:41 PM, March 26th 2024 రఘురామ కృష్ణరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే హైదరాబాద్ లో హల్చల్ చేసిన రఘురామ మనుషులు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అభిమానులు పూజలు బీజేపీ మోసం చేసింది, టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ 03:39 PM, March 26th 2024 కర్నూలు : కలకలం రేపుతున్న ఆడియో రికార్డు ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామన్న బీజేపీ నేత పురందేశ్వరికి రూ.3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత ప్రతిపాదన పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ 02:51 PM, March 26th 2024 విజయవాడ: వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం: దేవినేని అవినాష్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నాం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి పది సంవత్సరం అధికారంలో ఉండి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు నియోజకవర్గంలో కుట్ర రాజకీయాల కు తెరలేపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నా తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే జగన్ కోరిక ఎన్టీఆర్ హయంలో మద్యనిషేధం చేస్తే మరల ప్రజలను మద్యం మత్తులోకి ముంచిన వ్యక్తి చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనానికి ఆద్యం పడింది 02:49 PM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ఆగ్రహం వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి 02:34 PM, March 26th 2024 అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడు మాడుగుల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈర్లి అనురాధ ఈర్లి అనురాధ.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కూతురు 01:47 PM, March 26th 2024 వలంటీర్లపై చంద్రబాబు,పవన్ పగ పెట్టారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గ్రామ వలంటీర్ల వలనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. కోవిడ్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వలంటీర్లు సేవలందిచారు వలంటీర్లను టెర్రెరిస్ట్లతో పోల్చడాన్ని ఖండిస్తున్నాము గ్రామ వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పగ పెట్టారు సచివాలయ వ్యవస్థ ద్వారా సుమారు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి వలంటీర్లపై కక్ష పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు వైఎస్సార్సీపీ ఎవ్వరికి భయపడదు ఎవరికి ఎవరు భయపడుతున్నారో గమనించాలి సీఎం జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయాలని బీజేపి నిర్ణయించుకుంది స్టీల్ ఫ్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపిలో ఈ పార్టీలు ఎందుకు కలిసాయి? చంద్రబాబు ఎప్పుడైనా పిల్లలు చదువులు కోసం ఆలోచన చేసారా? రాష్ట్రంలో పేదవాడికి, పెత్తందారుడికి మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది 01:47 PM, March 26th 2024 టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై రచ్చ వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన టీడీపీ నేత సుధీర్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న వాలంటీర్లు, లబ్ధిదారులు సర్వత్రార వ్యతిరేకత రావడంతో టీడీపీ దిద్దుబాటు చర్యలు సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని అచ్చెన్నాయుడు బీరాలు 01:31 PM, March 26th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 01:26 PM, March 26th 2024 నాకే టికెట్ ఎగ్గొట్టిన బాబు పోలవరం కడతానంటే నమ్ముతారా?: రఘురామ చంద్రబాబుకు రఘురామ టికెట్ డిమాండ్ బీజేపీ అధిష్టానం ఉద్దేశ్యాలు తేడాగా ఉన్నాయి ఏపీ బీజేపీని నడిపిస్తుంది ఎవరో నాకు తెలుసు కేంద్ర బీజేపీని నడిపిస్తున్నది కూడా వారేనా? బీజేపీ మోసం చేస్తే నాకు టికెట్ ఇవ్వరా? నరసాపురంలోనే తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇవ్వాలి చంద్రబాబు ఆడిన మాట తప్పి నాకు టికెట్ ఎగ్గొడితే ఎలా? నాకు సీటు ఇవ్వలేని వాడు (చంద్రబాబు) రేపు పోలవరం కడతానంటే ఎలా నమ్ముతారు? : రాష్ట్రానికి చంద్రబాబు ఏదో చేస్తానంటే ఎలా నమ్ముతారు? : రఘురామకృష్ణరాజు 01:16 PM, March 26th 2024 విజయవాడ: బీజేపీ పదాదికారుల సమావేశానికి సీనియర్లు దూరం సమావేశానికి హాజరుకాని సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ తదితరులు పదాదికారుల సమావేశానికి సీనియర్లు గైర్హాజరుపై బీజేపీలో చర్చ ఎంపీ టిక్కెట్లు రాకపోవడంపై సీనియర్ల అలక 12:28 PM, March 26th 2024 కృష్ణాజిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న టీడీపీ శ్రేణులు మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయం రోజుకొక మండలం నుంచి రాజీనామాలు చేస్తూ నిరసన తెలపాలని నిర్ణయం టీడీపీ క్రియాశీలక సభ్యత్వాలకు,పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేసిన అవనిగడ్డ మండలం టీడీపీ శ్రేణులు జనసేనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించకూడదని తీర్మానం 12:25 PM, March 26th 2024 ఉద్యోగులపై ప్రతిపక్షాల అభాండాలు: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కరోనా సమయంలో సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌లో దాకున్నాడు కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్ ఎన్నో పార్టీలను చూశాంజజ కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్‌ది ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్‌ను తప్పకుండా ఉపయోగించుకోవాలి వెల్ఫేర్ స్కీమ్స్‌లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి 12:19 PM, March 26th 2024 తిరుపతి టీడీపీ పార్టీ నేతలు రహస్య సమావేశం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పై చర్చ ఏకమైన తిరుపతి టీడీపీ ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చ తిరుపతి టీడీపీ నేత జే.బి.శ్రీనివాసులు ఇంట్లో సమావేశమైన నేతలు అధినేత చంద్రబాబు నాయుడు తో మరోసారి తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు కుప్పం రావాలని మాజీ సుగుణమ్మ కు పిలుపు ఇచ్చిన చంద్రబాబు, చంద్రబాబు మాటను ఖాతరు చేయని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 12:01 PM, March 26th 2024 వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణం: మార్గాని భరత్ జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వాలంటీర్లు పనిచేశారు అభం శుభం తెలియని వాలంటీర్లపై కత్తి కట్టడం దారుణం తెలుగుదేశం పార్టీ జిహాది పార్టీ ఎన్డీయే పొత్తు తాత్కాలికమే అని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు.. తాత్కాలికమంటే అర్థం ఏమిటి? నరేంద్ర మోదీ వస్తే ముస్లింలు ఓట్లు తీసేస్తాడని చెప్పిన వ్యక్తి చంద్రబాబ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే సెక్యులరిజం ఉండదని క్రైస్తవులకు చెప్పిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు వద్దని నేరుగా చెబుతున్నాడు ఓటమిని అంగీకరించలేని పనికిమాలిన వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమలవుతుండగా తప్పుడు కరపత్రాలు నాపై ఎలా పంచుతున్నారు.. దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులదే మోరంపూడి ఫ్లైఓవర్ పనులకు నా స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను నాపై తప్పుడు ప్రచారం చేసిన ఆదిరెడ్డి వాసు పై 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తున్నాను నేను అభివృద్ధి చేసిన ప్రతి ప్రాంతంలో నాపై తప్పుడు కరపత్రాలు పంచుతున్నారు ఆదిరెడ్డి వాసు.. పిరికిపందలా వ్యవహరించుకు. దమ్ముంటే నేరుగా నన్ను ఎదుర్కో.. ఐదేళ్లు నీ భార్య ఎమ్మెల్యేగా ఉంది.. రాజమండ్రికి మీరు ఏం చేశారు? ప్రజలను నమ్మించి మోసం చేసిన వారిని పొలిటికల్ తీవ్స్ అంటారు 2014 నుంచి 19 వరకు ఓట్లు వేయించుకుని ఆదిరెడ్డి భవాని రాజమండ్రి ప్రజలను నమ్మించి, మోసం చేశారు 11:24 AM, March 26th 2024 ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీ కూటమి అభ్యర్థులు ఎంపికపై విమర్శలు చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాలు చేసిన వారికి ఏ విధంగా సీట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు 40 ఎకరాల భూకబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ సీఎం రమేష్‌పై 450 కోట్ల రూపాయల చీటింగ్ కేసు బ్యాంకులకు 47 కోట్లు రుణాలు ఎగవేసిన కొత్తపల్లి గీత బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కొత్తపల్లి గీతకు జైలు శిక్ష బీజేపీ పార్టీలో అవినీతిపరులు తప్పితే మంచివారికి చోటు లేదని ప్రశ్నిస్తున్న నేతలు 11:19 AM, March 26th 2024 అనపర్తి టీడీపీలో కలకలం అనపర్తి అభ్యర్థిగా గతంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించిన చంద్రబాబు అనపర్తి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఖరారు అవుతుందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అనపర్తి టీడీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపివేసిన టీడీపీ క్యాడర్ మూకుమ్మడిగా దిగువ స్థాయి కేడర్ అంతా రాజీనామాలు చేసి జోన్ -2 ఇన్చార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేత 11:17 AM, March 26th 2024 టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు.. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కానీ టీడీపీ వలంటీలను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు కేవలం తమ స్వార్థం కోసం వాలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది 11:03 AM, March 26th 2024 అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఇప్పటికే 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన ఇవాళ ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం 10:05 AM, March 26th 2024 వలంటీర్లు ఉగ్రవాదులు కాదు.. సేవా సైనికులు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వలంటీర్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా..? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నారు.. వారంటే చంద్రబాబుకు చులకన అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు. సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.. 09:26 AM, March 26th 2024 మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తిలో కొనసాగుతున్న నిరసనలు పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని డిమాండ్ టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు బండారు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి తండ్రీకొడుకులే కారణమంటూ మండిపాటు బండారుకు సీటు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిక 09:22 AM, March 26th 2024 విశాఖ సౌత్ సీటుపై పవన్ కల్యాణ్ యూ టర్న్..? వంశీకే సీటు అంటూ హామీ ఇచ్చిన పవన్ ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన వంశీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించిన వంశీ చివరి నిమిషంలో జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు.. ఆందోళనలో వంశీ వర్గీయులు.. వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ధర్నాలు నిరసనలు వంశీ పై వ్యతిరేకతతోనే సౌత్ సీటు పెండింగ్ లో పెట్టారనే చర్చ మరో వైపు విశాఖ సౌత్ లేదా భీమిలి ఆశిస్తున్న బీజేపీ నేత మాధవ్ జరుగుతున్న పరిణామాలతో అయోమయంలో జనసేన క్యాడర్ 09:13 AM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డి మనీషా .. పశువా ?: వెల్లంపల్లి శ్రీనివాస్ వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు వలంటీర్లు సమాజ సేవ చేస్తున్నారు గౌరవ వేతనం తీసుకుని చుట్టుపక్కల వారికి సాయం అందిస్తున్నారు వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటివారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వాలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదు చంద్రబాబు మాటమీద నిలబడడు వలంటీర్లు గోనె సంచులు మోసే ఉద్యోగం అంటూ గతంలో హేళన చేసారు ఇటీవల వలంటీర్లు కొనసాగిస్తాం అంటున్నారు టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్లను దూషిస్తున్నారు ఇంకోసారి వాలంటీర్ల గురించి మాట్లాడితే సహించేది లేదు 08:56 AM, March 26th 2024 పెండింగ్ స్థానాలపై పవన్ కసరత్తు ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించిన జనసేన 3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంపై తేలని పంచాయతీ 08:36 AM, March 26th 2024 కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కుప్పం నియోజకవర్గం ప్రజల్ని ఆకట్టుకోని చంద్రబాబు బహిరంగసభ చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలు టీడీపీకి ఓటు వేయకపోతే మగవాళ్ళను ఇంట్లోకి రానివ్వదంటూ మహిళల్ని రెచ్చగొడుతున్న చంద్రబాబు కుప్పంలో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో ఇంటి ఇంటికి ప్రచారం చేసినా పట్టించుకోని కుప్పం ప్రజలు కుప్పంలో 33 వేల దొంగ ఓట్లు తొలగింపుతో చంద్రబాబు వెన్నులో వణుకు 08:31 AM, March 26th 2024 జనసేనలో తేలని టికెట్ల పంచాయితీ జనసేనలో తేలని అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం టిక్కెట్ల పంచాయితీ మచిలీపట్నం ఎంపీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న వల్లభనేని బాలశౌరి ఇటీవల జనసేనలో చేరిన బాలశౌరి నిన్నటి వరకూ తనకే టిక్కెట్ అనే ధీమాలో ఉన్న బాలశౌరి తాజాగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి కొత్తపేరు మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధి కోసం పరిశీలనలో బాలశౌరితో పాటు బండారు నరసింహారావు పేరు బండారు పేరు పరిశీలనతో ఎంపీ టిక్కెట్ పై ఆందోళనలో బాలశౌరి అవనిగడ్డలో ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్న పవన్ బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లతో సర్వేలు చేయిస్తున్న పవన్ ఐవీఆర్ఎస్ సర్వేలతో అయోమయంలో జనసేన క్యాడర్ 08:26 AM, March 26th 2024 సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్ ధర్మవరం టికెట్ కోసం వర్గపోరు మధ్యేమార్గంగా రేసులోకి మరోపేరు ధర్మవరం అసెంబ్లీ సీటుపై వీడని పీటముడి రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్‌ను బరిలోకి దించేందుకు సన్నాహాలు సూరి, శ్రీరామ్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం 08:13 AM, March 26th 2024 మోదీతో జగన్ ది ప్రభుత్వ సంబంధమే: సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రం, రాష్ట్రం అన్నట్టుగానే బీజేపీతో అనుబంధం బీజేపీ నుంచి మాకెప్పుడో ఆఫర్ ఉంది ఎన్డీఏతో వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లం ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం నలుగురితో కలిసి పోటీచేస్తే తర్వాత తేడాలొస్తాయ్ చంద్రబాబులా పొత్తునుంచి బయటికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేం గెలుపుపై వందశాతం ధీమాతో ఉన్నాం 87శాతం మందికి సంక్షేమం అందించాం ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉంది ఎంతమంది కలిసొచ్చినా వాళ్లకొచ్చే ఓట్లు 50 శాతం లోపే పవన్ పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదు పర్సనల్‌గా పవన్‌ను చూస్తే జాలేస్తోంది అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా? రాజకీయాలపై పవన్‌కు ఒక క్లారిటీ లేదు రాజకీయ లక్ష్యాలే తప్ప.. వైఎస్ కుటుంబంలో గొడవలేం లేవు షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు రాజకీయంగా షర్మిలే తప్పటడుగులు వేశారు ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు 07:52 AM, March 26th 2024 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రారంభం మూడు విడతలుగా ప్రచారం రండి.. రండి.. ఇక్కడకే దయచేయండి పిఠాపురంలో నా కోసం ప్రచారం చేయండి టికెట్లు ఇవ్వని వారికి పవన్ నుంచి పిలుపు 07:21 AM, March 26th 2024 ‘శవా’లెత్తిపోతున్న టీడీపీ వ్యక్తిగత హత్యలకు రాజకీయ రంగు ఎన్నికల వేళ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాద్ధాంతం నల్లమాడ మండలంలో అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తి హత్య టీడీపీలో ఏనాడూ కనిపించకపోయినా కార్యకర్తగా ప్రచారం చంద్రబాబు సహా టీడీపీ పెద్దలంతా ఓవరాక్షన్ 07:15 AM, March 26th 2024 ‘దేశం’లో కమలం కల్లోలం ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ తాజాగా ఈ సీటు బీజేపీకని ప్రచారం.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక పలువురు టీడీపీ నేతల రాజీనామా రాజీనామా పత్రాలు జోన్–2 ఇన్చార్జి సుజయ్ కృష్ణకు అందజేత అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోము వీర్రాజు 07:02 AM, March 26th 2024 ఇటు పేదల సైన్యం.. అటు పెత్తందార్ల పటాలం రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40 శాతం సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్ రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ, 11 ఎంపీ సీట్లు అసెంబ్లీ, ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో.. 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే సేవే పరమావధిగా.. నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు.. దేశ చరిత్రలో ఇదో రికార్డు 156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 33 శాసనసభ, 4 లోక్‌సభ స్థానాల్లోనే బీసీలకు చాన్స్.. బడుగులకు ఇచ్చింది 23 శాతమే ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు చాన్స్ కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకే బాబు టికెట్లు.. బడుగులకు మరోసారి వెన్నుపోటు 06:50 AM, March 26th 2024 రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’.. ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు... మరోసారి చారిత్రక విజయం సాధించడమే లక్ష్యంగా "మేమంతా సిద్ధం" పేరుతో ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి భారీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్న సీఎం @ysjagan. #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/JR8BXV6rqe — YSR Congress Party (@YSRCParty) March 25, 2024 06:47 AM, March 26th 2024 ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం పెండింగ్‌లో పెట్టిన స్థానాలపై గందరగోళం పొత్తులో టీడీపీ సీట్లు 144.. ఖరారు చేసినవి 138 మాత్రమే పి.గన్నవరం జనసేనకు బదిలీ.. అనపర్తిపై తేల్చని బీజేపీ టీడీపీ సీట్లలో మిగతా ఆరు ఏవన్న దానిపై అనిశ్చితి బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తేలలేదు గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లతో బంతాట రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నదీ తేలని వైనం దర్శి, అనంతపురం అర్బన్‌లో అభ్యర్థుల కోసం పాట్లు 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యమే 06:43 AM, March 26th 2024 వెన్నుపోటు పొడుస్తారా? టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం తడిగుడ్డతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైనే టీడీపీ పోస్టులు మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీటివ్వాలంటున్న బీజేపీ నేతలు 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు చివరికి కాంగ్రెస్‌తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి మరోవైపు.. టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోదీపై విష ప్రచారం టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం -
March 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 25th Latest News Telugu.. 9:10PM, March 25th 2024 పశ్చిమ గోదావరి జిల్లా: ఉండిలో ఇప్పటివరకు ఒక లెక్క సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చినాక మరో లెక్క: పీవీఎల్ నరసింహ రాజు, ఉండి వైఎస్సార్సీపీ అభ్యర్థి పేదలకు సంక్షేమాన్ని చేర్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్ పేదలందరూ సీఎం జగన్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆక్వా రైతుల్ని జగన్మోహన్రెడ్డి ఆదుకున్నట్టు ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు జోన్ పరిధిని 10 ఎకరాల లోపు రైతులకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నారు శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థి వాలంటీర్నీ స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులు అనడాన్ని ఖండిస్తున్నాం ఇవాళ ఏ పేద గడపని అడిగిన వాలంటీర్ల వల్లే సంక్షేమం వస్తుందని చెబుతున్నారు సీఎం జగన్ గొప్ప ఆశయంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు నూటికి 90 శాతం అర్హులైన వారికికి పథకాలు అందుతున్నాయంటే అది వాలంటీర్ల వల్లేసాధ్యం పేదవారికి ఏ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు ఏ పథకానికి అర్హత ఉందో తెలుసుకుని సచివాలయాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు వాలంటీర్లు ప్రపంచమంతా వాలంటరీ వ్యవస్థను అభినందిస్తుంతే ప్రతిపక్షాల బురద చల్లాలని చూస్తున్నారు వాలంటీర్లను తమ కుటుంబంలో సభ్యులుగా ప్రజలు చూసుకుంటున్నారు ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఈసారి ఎగరడం ఖాయం. నర్సాపురం పార్లమెంట్లో బీసీ మహిళను ఎంపీ గా నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ చంద్రబాబుటీడీపీ బీసీల పార్టీ అని వారిని మోసం చేశాడు బీసీ, ఎస్టీ, ఎస్టీ వెనకబడిన వర్గాలన్ని సీఎం జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో వచ్చాడో ఆ ఆశయాలనే పక్కనపెట్టి చంద్రబాబుకు పెంపుడు కుక్కలాగా మారాడు చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. నుంచో మంటే నుంచుంటున్నాడు పవన్ కళ్యాణ్ అయోమయ స్థితిలో ఉన్నాడు 7: 05PM, March 25th 2024 విశాఖ: వాలంటీర్లను టెర్రరిస్ట్ లన్న బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: అవంతి శ్రీనివాస్ వాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వాలంటీర్లపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు వాలంటీర్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను కించిపరిచే విధంగా మాట్లాడారు టీడీపీ నేతలు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి 6: 20PM, March 25th 2024 ఏపీకి పురంధేశ్వరి నమ్మకద్రోహం చేశారు : సుంకర పద్మశ్రీ పురంధేశ్వరిని తూ.గో జిల్లాలో ప్రజలు తిరగనివ్వొద్దు పురంధేశ్వరికి రాజకీయ భిక్షపెట్టింది కాంగ్రెస్సే సోనియా పురంధేశ్వరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆస్తులు కాపాడుకోవడానికి పురంధేశ్వరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్‌ను మోసం చేశారు ప్రత్యేక హోదా, విభజన హామీలపై హామీ ఇచ్చాకే పురంధేశ్వరి మాట్లాడాలి 6:18 PM, March 25th 2024 గుంటూరు మంద కృష్ణ ఏపీలో మాదిగలను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేశాడు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఎన్నికలొచ్చిన ప్రతీసారి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవడం మంద కృష్ణకు అలవాటు ఈ నెల 30న మంద కృష్ణ నిర్వహించే సభను అడ్డుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగల వాటా కోసం మంద కృష్ణ ఎప్పుడూ పోరాటం చేయలేదు 6:15 PM, March 25th 2024 విజయవాడ పురంధేశ్వరి అధ్యక్షతన రేపు బీజేపీ పదాధికారుల సమావేశం హాజరు కానున్న బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి, నాయకులకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఏపీ బీజేపీ 6:12 PM, March 25th 2024 జనసేనలో తెగని విజయవాడ వెస్ట్ పంచాయితీ టికెట్ తనకే కేటాయించాలంటూ పోతిన మహేష్ దీక్ష దీక్ష ముగిసినా టికెట్ పై ఇంకా రాని క్లారిటీ నాకు సీటు ఇవ్వకపోతే కూటమికే నష్టం 2019 ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీని వదిలేశారు నేను పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నా - ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా 6:10 PM, March 25th 2024 బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనే పదానికి అసలైన నిర్వచనం వైఎస్ జగన్ : వంగా గీత నా మీద నమ్మకంతోనే పిఠాపురం సీటు ఇచ్చారుజనం మనసులో జగన్, మా పిఠాపురం ప్రజల మనసులో నేనున్నాను పిఠాపురంలో మా విజయం తధ్యం నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ నేను వారి కుటుంబ సభ్యురాలినే కులాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది నాకు మళ్లీ పిఠాపురంలో సేవ చేసే అవకాశం వైఎస్ జగన్ కల్పించారు స్థానిక నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాం స్కూల్స్, హాస్పిటల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేశాం ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురం పీఠం నాదే - కోర్టులు, పోలీస్ స్టేషన్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మించాం వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారు 6:08 PM, March 25th 2024 బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్న పురంధేశ్వరి ఎన్డీఏ అభ్యర్ధుల గెలుపు కోసం పని చేస్తామన్న మంద కృష్ణ మాదిగ 6:05 PM, March 25th 2024 కాకినాడ: జనసేనలో మహిళలకు గౌరవం లేదు జనసేన మాజీ రాష్ట్ర కార్యకదర్శి పోలసపల్లి సరోజ జనసేనలో చాలా అవమానాలు ఎదుర్కోన్నాను. పవన్ చెప్పే సిద్దాంతాలు..ఆశయాలు పేపర్ మీదకే పరిమితం పవన్ చుట్టూ ఒక కాపు కోటరీ ఉంది. ఆ కోటరీ పవన్ కలవనివ్వరూ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్ట్ జనసేన కాపుల పార్టీయే కాదు..కమ్మవారి పార్టీ కూడా జనసేనలొ బిసి నాయకులకు విలువ లేదు. జనసేన 21 సీట్లలో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అందుకే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పాను. 5:08 PM, March 25th 2024 అనకాపల్లి జిల్లా: టీడీపీలో మంటలు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని నిరసన టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు 5:01 PM, March 25th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో టీడీపీ నేతల దౌర్జన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చిలమత్తూరు లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా గొడవ 4:33 PM, March 25th 2024 YSRCP: మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైఎస్సార్సీపీ అధినేత 3:57 PM, March 25th 2024 శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే కలమట ఫైర్ కొత్తూరు మండలం నివగాంలో అనుచరులతో సమావేశం జిల్లా టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరమణ పాతపట్నం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి సానుకూల నిర్ణయం రాకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి నాకు తీరని అన్యాయం చేశారు నాపై తప్పుడు నివేదికలు అధిష్టానానికి పంపించి జిల్లా నేతలు టికెట్ దక్కకుండా చేశారు: కలమట నాకు టికెట్ రాకపోవడంతో ఆవేదన చెందుతూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు: ఎంపీ జీవీఎల్ నిస్వార్ధంతో నేను చేసిన సేవ ఎప్పటికీ వృథాగా పోదు భవిష్యత్ లో బీజేపీ జెండా రెపరెపలాడిస్తా : ఎంపీ జీవీఎల్ అమరావతి రేపు బీజేపీ పదాధికారుల సమావేశం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ మిత్రపక్షాలతో సమన్వయంపై సమావేశంలో చర్చ నేతలు, కేడర్ కు దిశానిర్దేశం చేయనున్న బీజేపీ అధినాయకత్వం కడప: బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ పట్టు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోషన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సురేష్ పోస్ట్ కృష్ణా : అవనిగడ్డలో పీక్స్ కు టీడీపీ, జనసేన పొత్తు పంచాయితీ టికెట్ జనసేనకు ఇవ్వడంతో మండలి బుద్ధ ప్రసాద్ వర్గం తీవ్ర అభ్యంతరం సాయంత్రంలోపు మండలి బుద్ధ ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ సానుకూల ప్రకటన రాకుంటే రాజీనామాకు సిద్ధమంటున్న బుద్ధ ప్రసాద్ వర్గం మండలి బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన టీడీపీ నేతలు 3:48 PM, March 25th 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు బాటలోనే పవన్ సర్వేల పేరుతో ఆశావాహులను, క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ అవనిగడ్డ జనసేన అభ్యర్ధి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ, వికుర్తి శ్రీనివాస్ పేరుతో సార్వే ఒకేసారి ముగ్గురు పేర్లతో సర్వే నిర్వహిచడంతో అయోమయంలో జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ సర్వేలతో రగిలిపోతున్న అవనిగడ్డ టీడీపీ కార్యకర్తలు 3:18 PM, March 25th 2024 ఏపీ బీజేపీ లిస్టు రెడీ.! రెండు రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును ప్రచారంపై ఫోకస్ పెట్టిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వచ్చే నెల 5 నుంచి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం రాజమండ్రి నుంచి బీజేపీ ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి 3:05 PM, March 25th 2024 చిత్తూరు జిల్లా: టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళలతో ముఖముఖీ సమావేశమైన చంద్రబాబు టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి.. అన్నం పెట్టొద్దు అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 2:43 PM, March 25th 2024 పిఠాపురంపై పవన్‌లో పెరుగుతున్న ఆందోళన సీన్ సితార అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పడవంటున్న జనసేన కార్యకర్తలు కాపులు కూడా ఓట్లేయడం కష్టమంటున్న పార్టీ నేతలు పిఠాపురంలో గెలవాలంటే ఏం చేయాలి? పవన్‌కళ్యాణ్ సమాలోచనలు నిన్న మంగళగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో పవన్ సమావేశం ఈసారికి హెల్ప్ చేయండి, ఎలాగొలా గెలుస్తానంటూ వర్మకు బుజ్జగింపులు పవన్ సూచన మేరకు ఇవాళ వర్మతో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్ధి ఉదయ శ్రీనివాస్ భేటీ పరిస్థితి ఇలాగే ఉంటే కాకినాడ ఎంపీకి పోటీ చేయడం మంచిదని సన్నిహితుల సూచనలు 2:35 PM, March 25th 2024 టీడీపీకి షాక్ ఇస్తున్న అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ పరిధిలో మూకూమ్మడిగా ప్రచారం ఆపేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో ఆయా ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉండటంతో ప్రచారం ఆపేసిన అసెంబ్లీ అభ్యర్థులు రాష్ట్రంలోనే... రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం, బలిజలు 2.50 లక్షల ఓటింగ్ ఉండటంతో ఆందోళనలో ఎమ్మెల్యే అభ్యర్థులు. ముస్లిమ్స్ ప్రభావంతో పీలేరు, రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లి పల్లెలో తీవ్ర ప్రభావం.. బలిజల ప్రభావంతో రాజంపేట, రైల్వే కోడూరు కోల్పోయే అవకాశం. 2:25 PM, March 25th 2024 సోషల్ మీడియా శాడిజనికి గీతాంజలి బలి: కోన వెంకట్ ఒక పవిత్ర ఆత్మను చంపేశారు సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టింనే చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది వీలైతే కొత్త చట్టాలను తేవాలి ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారు జనాన్ని భయపెడుతున్నారు ప్రముఖ సినిమా రచయిత, ప్రొడ్యూసర్, దర్శకుడు కోన వెంకట్ తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్ 2:21 PM, March 25th 2024 అవనిగడ్డలో తిరుగుబావుటా ఎగరేసిన టీడీపీ నేతలు పొత్తుల్లో జనసేనకు అవనిగడ్డ సీటు కేటాయించడం పై తీవ్ర అసంతృప్తి అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనకు సహకరించేది లేదు : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ జనసేనకు టిక్కెట్ ఇస్తే అవనిగడ్డ క్యాండెట్ ను ఓడిస్తాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ నలభైయేళ్లుగా పార్టీ జెండా మోశాం.. తొలిసారి మాకు బాధకలుగుతోంది : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ ను ఇండిపెండెంట్ గా పోటీచేయించి గెలిపించుకుంటాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ సీటు మాకే వస్తుందని ఎంతగానో ఆశించాం : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మండలి బుద్ధప్రసాద్ కు సీటు దక్కక పోవడం మమ్మల్ని బాధించింది: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు అవనిగడ్డ సీటు విషయంలో చంద్రబాబు మరోమారు పునరాలోచించుకోవాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నెలరోజుల నుంచి సీటు పై నాన్చుతూనే ఉన్నారు : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మా ఆవేదనను అధిష్టానం గుర్తించాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు మాకెందుకు ఇవ్వడంలేదో సమాధానం చెప్పాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు జనసేనకు అనిగడ్డ సీటు ఇస్తున్నామని ఇంతవరకూ మాకు చెప్పలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నిన్న జనసేన జాబితా ప్రకటనతోనే మాకు తెలిసింది : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు విషయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు 2:16 PM, March 25th 2024 నో టికెట్.. జీవీఎల్ వీడియో సందేశం విశాఖ ప్రజలకి , కార్యకర్తలకి జీవీఎల్ వీడియో సందేశం విశాఖ సీటు నాకు రానందుకు విశాఖ వాసులు చాలామంది ఫోన్ చేసి బాధపడ్డారు విశాఖ ప్రజల అభిమానం చూరగొన్నందుకు సంతోషంగా ఉంది గత మూడేళ్లగా విశాఖ అభివృద్దికి, విశాఖ ప్రజలకి సేవకి సంతోషాన్ని కలిగించింది విశాఖలో పోటీచేయడానికి అవకాశం రాని సంగతి మీకు తెలిసిందే ప్రజలకి మంచి జరగాలని నిస్వార్ధంగా సేవ చేశా విశాఖ అభివృద్దికి మనం కలిసి చేసిన సేవ వృదా అయిందని భావించద్దు ఎన్నికలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సేవ చేయలేదు జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ ప్రజాసేవ, విశాఖ అభివృద్ది ఒక కమిట్ మెంట్ తో చేసేవి త్వరలోనే విశాఖ వచ్చి మీ అందరినీ కలుస్తా విశాఖ అభివృద్దే ధ్యేయంగా కార్యకర్తలంతా కలిసి ఒక కార్యచరణ రూపొందించుకుందాం విశాఖ అభివృద్దే లక్ష్యం విశాఖలోనే ఉంటూ భవిష్యత్ లో విశాఖ అభివృద్దికి మీ అందరితో కలిసి కృషి చేస్తా 1:52 PM, March 25th 2024 తిరుపతి టికెట్ పంచాయితీ.. సుగుణమ్మ కంటతడి తిరుపతి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు టికెట్ దక్కలేదని కంటతడి పెట్టిన సుగుణమ్మ అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశా: సుగుణమ్మ తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరం: సుగుణమ్మ చంద్రబాబు చేపించిన సర్వేలు ఏమయ్యాయి?: సుగుణమ్మ టికెట్ జనసేనకు కేటాయించడంపై పునరాలోచన చేయాలి: సుగుణమ్మ బయటి వ్యక్తులకు ఎన్నికల్లో మద్దతు తెలపలేం: సుగుణమ్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ పై మరోసారి చర్చించాలి : సుగుణమ్మ ఎక్కడి నుంచో వచ్చినవారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. కేడర్ అంగీకరించడం లేదు: సుగుణమ్మ 1:46 PM, March 25th 2024 ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో పర్యటించనున్న జాతీయ అగ్ర నేతలు బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి 1:35 PM, March 25th 2024 ఏపీలో పెండింగ్ సీట్లపై కూటమిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో పెట్టిన కూటమి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని బీజేపీ టీడీపీ -7, జనసేన - 3 పెండింగ్ - 20 స్థానాలకు సామాజిక సమీకరణాల లెక్కల్లో కూటమి విజయనగరం స్థానం కాపులకు దక్కే అవకాశం విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు తెరమీదకు కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు శ్రీకాకుళం, అనకాపల్లి, స్థానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయింపు ఒంగోలు, కడప పార్లమెంట్ స్థానాలకు గానూ రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారా? దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు స్థానాలకు ఖరారు కానీ టీడీపీ అభ్యర్థులు జనసేన నుంచి పెండింగ్ లో పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలు. 1:20 PM, March 25th 2024 కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు: ముద్రగడ కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి బాబుకు పవన్ సహకరించారు కాపులు రోడెక్కే పరిస్థితిని చంద్రబాబు కలగజేశాడు ఆనాడు చంద్రబాబు పక్కన ఉన్న పవన్ ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు. ఇవాళ పిఠాపురం నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీటితో గెలుస్తాను.. ఓటర్ల అమ్ముడు పోతారు అనే భావం వ్యక్తం చేశారు. పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముపోయిన వారిగా మాట్లాడటం భాధాకరంగా ఉంది. ఓటర్లు ఈ విషయం గమనించమని కోరుతున్నాను. జనసేన బలోపేతానికి ఫలితం ఆశించకుండా పని చేయాలనుకున్నాను 70-80 సీట్లు.. సగ కాలం ముఖ్యమంత్రి పదవి అడగాలని జనసేనకు చెప్పాను. దీని పై పవన్ స్పందన ఎక్కడా రాలేదు. ఇనుప ముక్కను నీటిలో నాన బెడితే ఏలా ఉంటుందో.. అలా పవన్ కాలయాపణ చేశారు. 1:05 PM, March 25th 2024 చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ చంద్రబాబు గారి మ్యానిప్యులేషన్ల గురించి తెలియందెవరికి? సీటు కావాలంటే వందకోట్లు చెల్లించాలి ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు అది ఏడు కోట్లా, 20 కోట్లా స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు బుకాయింపులు వద్దు. చంద్రబాబు గారి హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగినా చెబ్తారు వొంటేరూ.. 12:55 PM, March 25th 2024 ముఖ్యనేతలతో పురంధేశ్వరి సమావేశం పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ ప్రచార షెడ్యూల్‌పై ఏపీ ముఖ్య నాయకులతో చర్చ ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రాక వచ్చే నెల ఐదో తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి 12:40 PM, March 25th 2024 బాబు, సుజానా చౌదరిపై కేశినేని నాని ఫైర్ విజయవాడ వెస్ట్ బీజేపీ సీటుపై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ పరోక్షంగా సుజనా చౌదరిని కౌంటర్ చేసిన కేశినేని నాని వెస్ట్‌లో వైసీపీ అభ్యర్ధి ఆసిఫ్‌పై పెద్ద కుట్ర జరుగుతోంది మొన్నటి వరకూ జనసేనకే వెస్ట్ టిక్కెట్ అన్నారు ఇప్పుడు బీసీ వ్యక్తిని కాదని.. బీజేపీ నుంచి ఒక ధనికుడిని తీసుకొస్తున్నారు పశ్చిమ నియోజకవర్గం ముస్లింలు, బీసీలు, పేదలు ఉన్న నియోజకవర్గం సీఎం జగన్ ఒక కార్యకర్తగా ఎదిగిన ఆసిఫ్‌కు టిక్కెట్ ఇచ్చారు మన ప్రత్యర్ధులు చార్టెడ్ ఫ్లైట్‌లో తిరిగే ఒక వ్యాపారవేత్తను మనపై పోటీకి పెట్టారు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు నిజంగా ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య పోటీనే చంద్రబాబు బీసీ, ఎస్సీ, మైనార్టీలను మోసం చేస్తున్నారు కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఉపయోగపడని వ్యక్తిని ఎందుకు తెస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తిని ఆసిఫ్ మీదకు వదిలారు డబ్బుతో పశ్చిమ నియోజకవర్గాన్ని కొనాలని చూస్తున్నారు మేనేజ్మెంట్తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు 12:20 PM, March 25th 2024 పొత్తులో సీటు చిచ్చు.. అవనిగడ్డలో చిచ్చురాజేసిన సీటు పంచాయతీ పొత్తుల్లో జనసేనకు దక్కనున్న అవనిగడ్డ సీటు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అవనిగడ్డ టీడీపీ కేడర్ అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్‌ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ కేడర్ భవిష్యత్ కార్యాచరణ కోసం సమావేశమైన అవనిగడ్డ టీడీపీ కేడర్ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు 12:00 PM, March 25th 2024 రఘురామకు బీజేపీ కౌంటర్ రఘురామకృష్ణంరాజు విమర్శలపై బీజేపీ కౌంటర్ బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్ఆర్ఆర్కు నో ఛాన్స్ జాబితాలో పేరు లేకపోవడంలో ఆశ్చర్యమేముందన్న బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా అంటూ సెటైర్లు వారిపై జాలిచూపే పార్టీలు ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి? ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై అక్కసు వెళ్లగక్కిన రఘురామకృష్ణంరాజు తనకి నర్సాపురం సీటు ఇవ్వలేదంటూ బీజేపీపై విమర్శలు. 11:36 AM, March 25th 2024 పవన్‌పై నమ్మకం ఉంది: పోతిన మహేష్ విజయవాడ వెస్ట్‌లో తేలని టికెట్ పంచాయితీ జనసేన తరఫున పట్టువీడని పోతిన మహేష్ కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం: మహేష్ ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా: మహేష్ పవన్‌పై నమ్మకం ఉంది: మహేష్ నాకు టికెట్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు: మహేష్ 11:03 AM, March 25th 2024 కుప్పంలో భారీగా మద్యం పట్టివేత? చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల వేళ భారీ మద్యం పట్టివేత కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానీపల్లి కి తరలిస్తున్న మద్యం స్వాధీనం ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబాపెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్లు అధికారుల అంచనా రూ. 6లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసున్న పోలీసులు ఇద్దరు ముద్దాయిలు, ఒక ద్విచక్ర వాహనం ఒక కారును అదుపులోకి తీసుకున్న SEB పోలీసులు 10:47 AM, March 25th 2024 బాబు ఎగస్ట్రా సీటు ఇస్తారా? రసదయకంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాజకీయం అభ్యర్థుల్ని ప్రకటించినా.. కొన్ని చోట్ల తెగని పంచాయితీ భీమిలి లేదా విశాఖ సౌత్ సీటు అడుగుతున్న బీజేపీ నేత మాధవ్ టీడీపీ నుంచి భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన నుంచి దక్షిణ విశాఖ ఆశిస్తున్న వంశీ యాదవ్ వంశీ యాదవ్‌కు సీట్లు ఇవ్వొద్దని జనసేన శ్రేణుల ఆందోళనలు ఇవాళో, రేపో చంద్రబాబును కలవనున్న మాధవ్ సీట్లు సర్దుబాటులో భాగంగా బీజేపీకి మరొక సీటు అదనంగా అడగనున్న మాధవ్ ఇచ్చేది అనుమానమే అంటున్న రాజకీయ వర్గాలు 10:02 AM, March 25th 2024 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ‘ప్రజాగళం’ పేరుతో సన్నాహాలు రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటన 27న చిత్తూరు జిల్లాలో పర్యటన ప్రారంభం 31వ తేదీ వరకు పర్యటనలు ఖరారు 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌లో ప్రచారం 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ప్రచారం 09:38 AM, March 25th 2024 చివరకు బండారు ఇలా.. పెందుర్తి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ దక్కకపోవడంతో మనోవేదన తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిక షుగర్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల పల్స్ రేటు గణనీయంగా పడిపోయిందన్న డాక్టర్లు కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన బండారు.. మూడో లిస్ట్‌లోనూ నో టికెట్ పెందుర్తి టికెట్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పంచకర్ల రమేష్ బాబుకు కేటాయింపు బండారుకు పలువురు టీడీపీ నేతల పరామర్శ మంత్రి రోజాను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ 09:27 AM, March 25th 2024 అద్దెకు మరో జనసేన కార్యాలయం జెండా ఎత్తేసిన మరో జనసేన కార్యాయలం నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో ఆఫీస్‌కు తాళం పట్టుమని 30 రోజులు గడవకముందే ‘అద్దెకు ఇవ్వబడును’ అనే బోర్డు మొన్నీమధ్యే ఉత్తరాంధ్రలో ఇలాంటి పరిస్థితి మాధవధారలోని జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం వేసి టులెట్ బోర్టు కార్యాలయాలు నిర్వహించే స్తోమత లేనప్పుడు ఎందుకీ ఆర్భాటాలు అని నిలదీస్తున్న జనసేన నేతలు! 09:10 AM, March 25th 2024 పవన్.. మరీ ఇంత దుర్మార్గమా? ధనసేన చేతిలో జనసేన నేతలు దగా అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో జనసేన పోటీ 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చిన పవన్ కల్యాణ్ 18 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే బీసీలకు సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మైనారిటీలకు ఒక్క సీటు కూడా ఇవ్వని జనసేన అనకాపల్లి, నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా ,చేనేత కులాలకు ఒక్క సీటు కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం 18 సీట్ల లో 12 సీట్లు ఓసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలకు పిలిచి ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన కోసం పనిచేసిన నాయకులను పక్కన పడేసిన పవన్ జనసేన లో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిన పవన్ జనసేన వీర మహిళలు ఎవ్వరు పోటీ కి పనికిరారని తేల్చిన పవన్ బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ.. పవన్ హ్యాండ్ ఇచ్చిన లిస్ట్ పెద్దదే 08:40 AM, March 25th 2024 సీ-విజిల్ యాప్.. అనంతలో 29 మంది సస్పెండ్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా గా సీ-విజిల్ యాప్ ద్వారా అందిన 168 ఫిర్యాదులు విచారణ తర్వాత చర్యలు తీసుకున్నట్లు ప్రకటించిన కలెక్టర్ గౌతమి ఇప్పటిదాకా రూ. 16.94 లక్షల స్వాధీనం నిబంధనలు పాటించని 29 మందిని సస్పెండ్ 08:30 AM, March 25th 2024 గీత టికెట్‌పై గిరిజన సంఘాల్లో అసంతృప్తి అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు ఇచ్చిన బీజేపీ పురందేశ్వరి తన స్వలాభం కోసమే గీతకు టికెట్ ఇప్పించారనే ఆరోపణ 2014లో వైఎస్ఆర్సిపీ అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసిన గీత గత విశాఖ ఎంపీ ఎన్నికల్లో కేవలం 1159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత గత ఎన్నికల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి బీజేపీ టికెట్ కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత కొత్తపల్లి గీతకు టికెట్ కేటాయింపు పై స్థానిక గిరిజన వర్గాల్లో అసంతృప్తి 08:12 AM, March 25th 2024 నేడు రామచంద్రపురానికి ఎంపీ మిథున్‌రెడ్డి కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తోట త్రిమూర్తులు నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్న మిథున్ పిల్లి సూర్యప్రకాష్‌కు తన అనుచరులు సపోర్ట్ చేయాలని సమావేశం 07:45 AM, March 25th 2024 మేమంతా సిద్ధం.. తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్రకు అంతా సిద్ధం మరో మరో 48 గంటల్లో వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ నుండి ప్రారంభం కానున్న బస్సుయాత్ర రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న యాత్ర జగన్ బస్సుయాత్రతో ఏపీలో మరింత పెరిగిన పొలిటికల్ హీట్ తొలిరోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ తొలి బస్సుయాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి బస్సుయాత్రతో వైఎస్సార్సీపీ కేడర్‌లో మరింత జోష్ 07:28AM, March 25th 2024 నేడు కుప్పానికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటన రెండ్రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్న నారా చంద్రబాబు నాయుడు కుప్పం సెంటర్లో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు రేపు హంద్రినీవా పరిశీలన 27 నుంచి ప్రజాగళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ప్రతీరోజూ నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 07:26AM, March 25th 2024 ఎమ్మెల్యే సీట్లలోనూ ఇంతేనా?.. బీజేపీ సీనియర్ల ఆవేదన బీజేపీ జాబితాలో సీనియర్లకి దక్కని అవకాశం ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశమివ్వడానికి సీనియర్ల గొంతుకోసారంటూ విమర్సలు జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,గారపాటి చౌదరి, సత్యకుమార్, విష్ణు వర్దన్ రెడ్డి లాంటి సీనియర్లకి టిక్కెట్లే ఇవ్వని అధిష్టానం ఎంపీ రేసులో చివరి వరకు ప్రయత్నించినా నిరాశే చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రల వల్లే సీనియర్లకి అవకాశం దక్కలేదంటున్న బీజేపీ వర్గాలు కాంగ్రెస్‌కి బాండ్ల రూపంలో రూ. 30 కోట్లు విరాళమిచ్చిన సీఎం రమేష్‌కి అనకాపల్లి ఎంపీ టికెట్ కడపకి చెందిన సీఎం రమేష్ కి అనకాపల్లి సీటు కేటాయించడంపై సీనియర్లు ఆగ్రహం సీఎం రమేష్‌కి టిక్కెట్ అంటే.. టీడీపీకి కేటాయించినట్లేనంటున్న బీజేపీ నేతలు బ్యాంకులని బురిడీ కొట్టిన కేసులతో పాటు.. ఎస్టీ కాదని కోర్టులో కేసులు నడుస్తున్న కొత్తపల్లి గీతకి అరకు పార్లమెంట్ నాలుగు దశాబ్దాలకి పైగా బీజేపీకి సేవలందించిన సోము వీర్రాజుని కాదని రాజమండ్రి నుంచి స్ధానికేతురాలైన పురందేశ్వరికి అవకాశం నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకి బీజేపీ చెక్ ఢిల్లీలో ఉండి 15 రోజులగా ప్రయత్నించినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని బీజేపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం సీనియర్ల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న వైనం బీజేపీలో చేరిన వెంటనే వరప్రసాద్‌కి తిరుపతి టిక్కెట్ ఒకటి రెండు రోజులలో పది అసెంబ్లీ స్ధానాల జాబితా ప్రకటించనున్న బీజేపీ ఎమ్మెల్యే జాబితాలోనూ ఇతర పార్టీ నేతలకే ఎక్కువ ఛాన్స్ 07:04AM, March 25th 2024 ఎల్లుండి నుంచే ‘మేమంతా సిద్ధం’ అధికార వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ఎల్లుండి (మార్చి 27 నుంచి) ఇడుపులపాయ నుంచి మొదలు సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమంతో పాటు పాలనతో సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ప్రజల్లో సీఎం జగన్ పార్లమెంటరీ స్థానాల పరిధిలో బహిరంగ సభలు ఉదయం ప్రజలతో మమేకం.. సాయంత్రం పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ ఇంటెరాక్షన్‌లో ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ ఈ యుద్ధం 15 ఏళ్ళుగా నాకు అలవాటే. నాతో నడిచిన మీకూ అలవాటే... కౌరవ సైన్యాన్ని మరోసారి ఎదుర్కొనేందుకు నేను సిద్ధం... మీరు సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/GGPuif7Ig2 — YSR Congress Party (@YSRCParty) March 24, 2024 06:57AM, March 25th 2024 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలు పెండింగ్ రెండు లోక్‌సభ స్థానాల్లో కాకినాడకు ఇప్పటికే అభ్యర్థి ఖరారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ అమిత్ షా చెబితే ఎంపీగా తాను పోటీ చేస్తానన్న పవన్ కాకినాడలో తాను ఎంపీగా పోటీ చేసి.. పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తాడని స్పష్టీకరణ 06:52AM, March 25th 2024 లోకేష్ ఎక్కడికెళ్లినా.. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌కు చుక్కలు ఎక్కడికెళ్లినా ప్రజల నిరసనలు.. నిలదీతలు.. ప్రశ్నల వర్షం అధికారంలో ఉండగా ఏం చేశారు?.. కరోనా టైంలో ఏమైపోయారు? అంటూ నిలదీస్తున్న మంగళగిరి వాసులు లోకేశ్ ప్రచారంలో ఇదీ పరిస్థితి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న వైనం ప్రచారానికి ముఖ్య నేతల డుమ్మా చివరకు అపార్ట్మెంట్లలో ప్రచారానికే పరిమితమైన లోకేష్ మంగళగిరిలో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన? ఓటర్లకు బల్ల బండ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ ఓ ప్రదేశంలో వాటిని నిలిపి.. ఓటర్లే వాటిని తీసుకెళ్లేలా ఒత్తిడి అధికారులకు అనుమానం రాకుండా కొనసాగుతున్న ప్రలోభాలపర్వం 06:48AM, March 25th 2024 ఏపీ బీజేపీకి ఇలాంటి పరిస్థితా? వలసలకే సీట్లా?.. ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువైన రీతిలో ఎంపీల లిస్టు ఆరు స్థానాల్లో నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్‌కు తిరుపతి సీటు కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ ఈ మధ్యే చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట పురందేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు సీనియర్లలో తీవ్ర ఆవేదన వలస నేతలకు సీట్లు ఇప్పించడంలో చంద్రబాబు కీ రోల్ బాబును నమ్ముకున్న రఘురామ రాజు మాత్రం హ్యాండ్ 06:35AM, March 25th 2024 బాబుకి బుద్ధి చెప్పి తీరతా: గొంప కృష్ణ ఎన్ఆర్ఐ గొంప కృష్ణని నిండా ముంచిన చంద్రబాబు శృంగవరపుకోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఆశచూపి అమెరికా నుంచి పిలిపించిన చంద్రబాబు టీడీపీ కోసం కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టించిన నారా లోకేష్ బాబు, లోకేష్‌ను నమ్మి అమెరికా నుంచి వస్తే కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారంటూ గొంప కృష్ణ ఆవేదన రానున్న ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి బాబుకి బుద్ధి చెప్తానని శపథం! 06:30AM, March 25th 2024 టీడీపీ.. ఆ 31 స్థానాల్లోనూ గందరగోళమే 30కి పైగా స్థానాల్లో భగ్గుమంటున్న టీడీపీ నేతలు సీట్లు రాక పలుచోట్ల రెబల్స్‌గా మారిన తెలుగు తమ్ముళ్లు వారిని బుజ్జగించేందుకు శతవిధాలా యత్నిస్తున్న చంద్రబాబు ఎంత సర్ది చెప్పినా టికెట్ దక్కించుకున్నవారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోలోన రగిలిపోతున్న వైనం పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే రెడ్డిగూడెంలో బలప్రదర్శన చేపట్టిన టికెట్ దక్కని దేవినేని ఉమ ఏలూరు ఎంపీ టికెట్‌పై రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీ గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద -
‘దేశ’ ముదుర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ... కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి మరీ నడిపిస్తున్నారని మరోసారి స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది. అవసరాల కోసం, కేసుల నుంచి రక్షణ కోసం చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. అధికారికంగా జనసేనతోను, అనధికారికంగా కాంగ్రెస్‌తోను అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా వెల్లడయింది. ఇందుకోసం చంద్రబాబు తన నమ్మిన బంటు సీఎం రమేశ్ ద్వారా... కాంగ్రెస్ పార్టీకి భారీ ప్యాకేజీ అందజేసినట్లు నేరుగా ఎలక్టొరల్ బాండ్లే వెల్లడించాయి. అది కూడా తెలంగాణలోను, కాంగ్రెస్‌లోను ఎన్నికలకు ముందు ఏకంగా 30 కోట్ల రూపాయలను అధికారికంగా పార్టీ ఫండ్ కింద చంద్రబాబు నాయుడు పంపించినట్లు వెల్లడయింది. ఇక అనధికారికంగా ఎంత ముట్టజెప్పారన్నది ఊహించటం కష్టమే. వీటన్నిటికీ తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలా మోశారో... కాంగ్రెస్ కోసం తన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎలా కట్టడి చేశారో తెలియనివేమీ కావు. నిజానికి కడప జిల్లాకు చెందిన సీఎం రమేశ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా... నూటికి నూరుపాళ్లూ తెలుగుదేశం మనిషి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థను ఆరంభించి... బాబు అండదండలతో భారీ కాంట్రాక్టులు పొందారు. బాబు మనిషిగా సింగపూర్, మారిషస్‌ల నుంచి నిధులు తెచ్చుకుని చాలా తక్కువ కాలంలోనే వేల కోట్లకు ఎదిగాడు. అందుకే... 2019లో తాను ఓడిపోగానే సీఎం రమేశ్‌ను బీజేపీలోకి పంపించేశాడు చంద్రబాబు నాయుడు. ఇక అప్పటి నుంచి బీజేపీలో ఉంటూనే... నారా వారి ప్రయోజనాల కోసం సకల కార్యాలూ చక్కబెట్టడం మొదలెట్టాడు సీఎం రమేశ్. అలాంటి సీఎం రమేశ్... బీజేపీలో ఉంటూ బీజేపీకి ఒక్క పైసా కూడా అధికారికంగా ఇవ్వకపోయినా... రూ.30 కోట్లను మాత్రం బీజేపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ ఖాతాలో వేయటం అందరినీ ఆశ్చర్యపరిచేదే. అంతేకాదు. చంద్రబాబు ఎవరెవరిని వాడాలని అనుకుంటున్నారో... వారందరికీ అవసరమైన ఖర్చులు పెట్టడం, ప్రత్యేక విమానాలు సమకూర్చటం ఇవన్నీ రమేశ్ విధులే. ఈయన విమానాన్ని ఇటీవల షర్మిల, పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిషోర్ సహా బాబు బ్యాచ్ మొత్తం వాడేస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. జగన్ టార్గెట్‌గా బాబు పావులు... 2019లో ప్రజా క్షేత్రంలో దారుణంగా ఓడిపోయినప్పటి నుంచీ చంద్రబాబు ఎన్ని పాచికలు వేసినా పారటం లేదు. ఆ తరవాత జరిగిన స్థానిక ఎన్నికలతో సహా ప్రతి ఎన్నికలోనూ ఘోరమైన ఓటమి పాలవుతుండటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రజాక్షేత్రంలో ఢీకొనటం కష్టమని తెలుసుకుని మాయోపాయాలకు దిగాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆసరాగా చేసుకుని ఆయన కుటుంబీకుల్లో చిచ్చు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చి... ఆ దిశగా పావులు కదిపాడు. హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటామేమోనని భయపడుతున్న సునీతను చేరదీయటంతో పాటు... అధికారం ఆశ చూపించి వైఎస్ షర్మిలనూ తమవైపు తిప్పుకున్నారు. వారు గనక తెలుగుదేశంలో నేరుగా చేరితే తమ మాటలెవరూ నమ్మరన్న ఉద్దేశంతో... తన సన్నిహితుడు రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో ఆమె పార్టీని విలీనం చేయించటం వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా చేయించాడు. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి కాంగ్రెస్‌కు తన బంటు సీఎం రమేశ్ ద్వారా రూ.30 కోట్లను ఎలక్టొరల్ బాండ్ల ద్వారా అందజేశారు. నిజానికి ఎలక్టొరల్ బాండ్ల విషయంలో చాలా కంపెనీలు 2019 ఎన్నికల ముందు కొనుగోలు చేసి ఆయా పార్టీలకు అందజేశాయి. సీఎం రమేశ్ మాత్రం 2023లోనే తన రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా రూ.45 కోట్ల మేర ఎలక్టొరల్ బాండ్లను కొనుగోలు చేసి, అందులో రూ.30 కోట్లను కాంగ్రెస్ ఖాతాలోకి, రూ.5 కోట్లను తెలుగుదేశం ఖాతాలోకి, మరో 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ (ఎస్) ఖాతాలోకి వేశారు. కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు... తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికై... బీజేపీలో కొనసాగుతూ... కాంగ్రెస్‌కు భారీగా నిధులిచ్చిన సీఎం రమేశ్... ఇటీవల చంద్రబాబు నాయుడిని ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలవటానికి కూడా ఇష్టపడనప్పుడు మొత్తం వ్యవహారాన్ని వెనక ఉండి నడిపించారు. మొత్తానికి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు సంపాదించి బాబును వారితో భేటీ అయ్యేలా చేశారు. ఇక వాళ్లేం చెబితే అది చేస్తానని చంద్రబాబు సాగిలపడటంతో వారు కూడా పొత్తుకు సరేనన్న విషయం బహిరంగ రహస్యమే. ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా నేరుగానే చెప్పారు. బాబుకు బుద్ధొచ్చింది కనకనే తిరిగి తమ వద్దకు వచ్చాడని ఆయన చెప్పగా... గతంలో చంద్రబాబుజీ... నాయుడుజీ అన్న ప్రధాన మంత్రి మోదీ... ఇటీవల చిలకలూరిపేట సభలో మాత్రం నేరుగా చంద్రబాబు నాయుడు అని మాత్రమే... అదికూడా ఒక్కసారే సం¿ోదించడం గమనార్హం. బాబు మాత్రం మోదీజీ గారు అంటూ అతివినయం ప్రదర్శించటం ఎవ్వరి దృష్టినీ దాటిపోలేదు కూడా. కాకపోతే సీఎం రమేశ్ కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చాక పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీని విలీనం చేయటంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు. నాటి నుంచీ ఆమె నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్‌గా చేసుకుని రకరకాల విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు కూడా తాను అండగా ఉన్నానని చెబుతూ... వివేకా హత్య విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలకు దిగారు. ఒక దశలో వివేకా భార్యను గానీ, సునీతను గానీ కడపలో పోటీ చేయించాలని భావించి... ఇపుడు మాత్రం చంద్రబాబు సూచనలతో నేరుగా తానే పోటీక దిగే ప్రయత్నాలూ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటిదాకా ఈ వ్యవహారాలపై ఎన్ని విమర్శలొచ్చినా కాంగ్రెస్‌తో తమకేం సంబంధమంటూ చంద్రబాబు దాటవేశారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహాలో స్పందించేవారు. కాకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ఎలక్టొరల్ బాండ్ల మొత్తం వివరాలన్నీ బయటపెట్టింది. ఎవరు కొన్నారు? ఏ పార్టీకి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అనే వివరాలన్నీ వెల్లడించటంతో... సీఎం రమేశ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చిన వ్యవహారం బట్టబయలయి... దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఇవీ.. బాండ్ నంబర్లు కాంగ్రెస్‌కు సీఎం రమేశ్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన బాండ్ల నంబర్లు. ఒక్కొక్కటీ రూ.కోటి విలువ గల 30 బాండ్లను... అంటే రూ.30 కోట్లను కాంగ్రెస్‌కు అందజేశారు. 14402, 14412, 14414, 14416, 14418, 14420, 14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477. -
March 21st: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 21st Latest News Telugu 09:17 PM, మార్చి 21 2024 నెల్లూరు జిల్లా: కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేని సోమిరెడ్డి ఎన్నికలు దగ్గర పడడంతో నానాయాగి చేస్తున్నాడు: మంత్రి కాకాణి సర్వేపల్లి టికెట్ విషయంలో చంద్రబాబు అనేక రకాల సర్వేలు చేసినా.. ఏ సర్వే కూడా టీడీపీ కి అనుకూలంగా రాలేదు గత్యంతరం లేక సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి కోడలు పేర్లు పరిశీలిస్తున్నారు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు 08:30 PM, మార్చి 21 2024 విశాఖ: జనసేన కార్యకర్తలు ఆరుగురిపై కేసు నమోదు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీ అనుచరులు.. నిన్న సాదిక్ పార్టీ ఆఫీస్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచిన పోలీసులు జనసేన కార్యకర్తలు ఆరుగురుకి 15 రోజులు రిమాండ్ విధించిన కోర్టు 08:00 PM, మార్చి 21 2024 శ్రీకాళహస్తి: టీడీపీ నేతల్లో తారాస్థాయికి చేరిన అసమ్మతి టీడీపీ అసమ్మతి నేత మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి వినుత భేటీ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఉమ్మడి పార్టీల నాయకులు రహస్య భేటీ శ్రీకాళహస్తి నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్న కోలా ఆనంద్ ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ నేత కోలా ఆనంద్, పొత్తు ధర్మం పాటించాలని, శ్రీకాళహస్తి బీజేపీకి కేటాయించాలని డిమాండ్ 07:02 PM, మార్చి 21 2024 ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా రాని క్లారిటీ పొత్తులో భాగంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమువీర్రాజు బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాల్లో జాప్యం ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు రాజమండ్రి సీటు కోరుతున్న పురంధేశ్వరి, సోమువీర్రాజు వైజాగ్‌లో పోటీ చేస్తానంటున్న జీవీఎల్ అనకాపల్లి సీటు కావాలంటున్న సీఎం రమేష్ రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు అరకు టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి గీత ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆంజనేయ చౌదరి తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు విజయనగరం సీటు కేటాయించాలంటున్న మాధవ్ 06:30 PM, మార్చి 21 2024 అమరావతి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో ముగిసిన మూడు జిల్లాల ఎస్పీల భేటీ. ముగ్గురు ఎస్పీలను విడి విడిగా పిలిచి వివరణ అడిగిన ఏపీ సీఈఓ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన ఏపీలోని శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీఐ నిఘా పెట్టిందన్న సీఈఓ ముగ్గురు ఎస్పీలిచ్చిన వివరణల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న ఏపీ సీఈఓ ఎంకే మీనా. 06:15 PM, మార్చి 21 2024 పిఠాపురం ప్రజలకు భీమవరం, గాజువాక ప్రజల బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం ప్రజలు నమ్మొద్దు పవన్ భీమవరం, గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేశారు ఏనాడు పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరు కనీసం ఆ నియోజకవర్గంలో పర్యటనలు కూడా చెయ్యలేదు ప్యాకెజి కోసం తూతూ మంత్రంగా సభలు పెట్టి వెళ్లిపోయారు ఇప్పుడు మా రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నాడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖ 06:02 PM, మార్చి 21 2024 ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, అనుచరులు దాడికి దిగారు నా ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు 20 కార్లలో రామాంజనేయులు గూండాలను తీసుకొచ్చారు నా డ్రైవర్, మా కార్యకర్తలకి గాయాలయ్యాయి మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశాడు నాపై హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చెయ్యాలని చేస్తోంది పెమ్మసాని చంద్రశేఖర్ గుండాయిజంని ప్రోత్సహిస్తున్నారు -ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తోంది నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని సీఈఓ ని కోరాం ఈనాడు పత్రిక అడ్డగోలు రాతల పై ఫిర్యాదు చేశాం సీఎం జగన్ పై విషపు రాతల తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈనాడు పత్రిక పై చర్యలు తీసుకోవాలని కోరాం -నారాయణ మూర్తి, వైఎస్సార్సీపీ నేత 05:45 PM, మార్చి 21 2024 కాకినాడ: ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏటిమొగలోని 14,15 డివిజన్ లలో ప్రచారం ఏటిమొగ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహరం అందేలా కృషి చేస్తాను ఉప్పలంక నుండి ఉప్పాడ వరకు ఉన్న మత్స్యకార గ్రామాల్లో రిలియన్స్ సీఎస్ఆర్ నిధులు అందించే పట్టుపదలతో ఉన్నాను ఏటిమొగ లో రోడ్లు,డ్రైన్లు నిర్మించి మత్స్యకార ప్రాంతాలను అభివృద్ధి చేశాను 05:42 PM, మార్చి 21 2024 నెల్లూరు: ప్రచారానికి వెళుతుంటే ప్రజల స్పందన అద్భుతంగా ఉంది: విజయసాయిరెడ్డి సిటీ నియోజకవర్గంలోని 47వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ప్రచారంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, NDCC బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారు తమ ప్రభుత్వంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాం -మరోసారి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు 05:39 PM, మార్చి 21 2024 తిరుపతి: తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నారా లోకేష్‌ను కలిసిన తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 05:30 PM, మార్చి 21 2024 అనకాపల్లి.. మాడుగుల నియోజకవర్గంలో టీడీపీలో బయటపడే విభేదాలు మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న నిరసనలు ఎన్నారై పైల ప్రసా ద్‌కు సీటు వద్దంటూ కార్యకర్తలు ప్రదర్శన నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్ద అంటూ నిరసన టీడీపీ అధిష్టానం సీటుపై పున పరిశీలన చేయాలని డిమాండ్. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక.. 05:26 PM, మార్చి 21 2024 విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41-ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ లోకేష్‌ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ సీఐడీ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసిన లోకేష్ తరపు న్యాయవాదులు ఏప్రిల్ 15కు తదుపరి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 04:40 PM, మార్చి 21 2024 టీడీపీకి టికెట్.. జనసేన కార్యకర్తల ఆందోళన.. రామచంద్రపురం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తల ఆందోళన.. జనసేన కార్యాలయానికి భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు.. రామచంద్రపురం టికెట్ జనసేనకే ఇవ్వాలని డిమాండ్. .జనసేన నేత పోలిశెట్టి చంద్రశేఖర్ లేదా నాగబాబుకి ఇవ్వాలని కోరిన కార్యకర్తలు.. నియోజకవర్గానికి సంబంధం లేని అమలాపురం స్థానికుడు వాసంశెట్టి సుభాష్‌కు ఇవ్వడంపై ఆగ్రహం. 04:10 PM, మార్చి 21 2024 విజయవాడ: పవన్‌కు ఎదురు తిరిగిన పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన వపన్ పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్ పవన్ కుదరదని చెప్పడంతో రెబల్‌గా బరిలోకి దిగాలని నిర్ణయం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని పవన్‌కు స్పష్టం చేసిన పోతిన మహేష్ 03:38 PM, మార్చి 21 2024 మా ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో టీడీపీ కూటమి : వైవీ సుబ్బారెడ్డి మోదీ వస్తే తప్ప ప్రచారం చేయలేని పరిస్థితిలో వాళ్లు ఉన్నారు వారాహిని ఎన్నిసార్లు దించుతారు... ఎన్నిసార్లు ఎత్తుతారు 03:36 PM, మార్చి 21 2024 మిగిలిన సీట్లపై చంద్రబాబు-పవన్ మల్లగుల్లాలు ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్‌లో బాబు, పవన్ చర్చలు చంద్రబాబును ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన పవన్ ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా సాగిన చర్చ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు,పవన్ చర్చలు 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్ధుల ఖరారు దిశగా కసరత్తు ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు 02:30 PM, మార్చి 21 2024 విజయవాడ విజయవాడ వెస్ట్‌లో కొనసాగుతున్న పోతిన మహేష్ నిరసనలు పశ్చిమ టికెట్ మహేష్‌కి ఇవ్వాలని, పవన్ మనసు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు దేవుడి కి 108 కొబ్బరికాయలు కొట్టి మరి వేడుకొంటున్న జనసేన కార్యకర్తలు 7రోజులుగా నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు 02:15 PM, మార్చి 21 2024 మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారు జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డారు కేంద్ర, రాష్ట్ర నిధులను దోచేశారు బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారు మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తోంది ఐఎంజీ స్కామ్‌కు ఆద్యుడు చంద్రబాబు రూ.లక్ష పెట్టుబడితో వచ్చిన కంపెనీకి 5 రోజుల్లోనే 400 ఎకరాలు కేటాయించిన ఘనుడు చంద్రబాబు రూ.వేల కోట్ల దోపిడీకి ఆ రోజుల్లోనే బాబు ప్లాన్ చేశారు అమరావతి స్కాం లాంటిదే ఐఎంజీ స్కాం ఇలాంటి అవినీతిపురుడికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి 02:12 PM, మార్చి 21 2024 స్కిల్ బిల్ పాండే చంద్రబాబు తాడేపల్లిలో మహాదోపిడీ పుస్తకావిష్కరణ చంద్రబాబు స్కాంల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చింది దోపిడీలు చేసిన గద్దలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయి రామోజీ జర్నలిజం ముసుగులో విషం చిమ్ముతున్నారు చంద్రబాబు కుహనా రాజకీయాలను నేను దగ్గరగా చూశా ‘‘స్కిల్ బిల్ పాండే’’ చంద్రబాబు స్కిల్ కార్పొరేషన్ లో భారీ స్కాం చేసి జైలు పాలయిన వ్యక్తి చంద్రబాబు తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారు జగన్ కనుసైగ చేస్తే జనం పవన్ ని తొక్కుకుంటూ తీసుకెళ్తారు చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ రాజ్యం వస్తుంది -రచయిత, సీనియర్ జర్నలిస్టు విజయబాబు వ్యాఖ్యలు 02:00 PM, మార్చి 21 2024 ముగిసిన బాబు-పవన్ భేటీ ముగిసిన చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో భేటీ అయిన పవన్ కల్యాణ్ 75 నిమిషాల పాటు కొనసాగిన బాబు-పవన్ భేటీ ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ ఉమ్మడి హామీలు సహా ఏపీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ 01:45 PM, మార్చి 21 2024 వలంటీర్ల మీద ఫేక్ ప్రచారం.. స్పందించిన ఈసీ వలంటీర్ల మీద సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే.. ఫొటోలు, వీడియోలు తీసి పంపాలంటూ ఏపీ ఎన్నికల సంఘం పేరిట ప్రచారం వాట్సాప్ చేయాలంటూ ఫేక్ సర్క్యూలర్ ఎక్స్ వేదికగా ఖండించిన ఏపీ సీఈవో ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసిన ఏపీ సీఈవో FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb — Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024 01:37 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ టికెట్ మాదే: అడ్డూరి శ్రీరామ్ విజయవాడ వెస్ట్ సీటుపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు వెస్ట్ సీటుపై ఇప్పటికే చర్చలు ముగిశాయి.. బీజేపీకే టికెట్ 2014 పొత్తు లెక్కల ప్రకారం బీజేపీకే టికెట్ వస్తుంది పొత్తులో త్యాగాలు సహజం, జనసేన కలిసి వస్తుందని భావిస్తున్నా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వ్యాఖ్యలు 01:22 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ జనసేనకు ఇవ్వాలి : పోతిన మహేష్ పొత్తులో సీటు ఎవరైనా కోరుకోవచ్చు విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు రావడం న్యాయం విజయవాడ వెస్ట్ జనసేన ఇంఛార్జి పోతిన మహేష్ వ్యాఖ్యలు 01:10 PM, మార్చి 21 2024 చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇరు నేతల సమావేశం ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చ 23,24 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన 27 నుంచి ఉత్తరాంధ్ర నుంచి వారాహితో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్ 12:43 PM, మార్చి 21 2024 ఏపీ బీజేపీకి ఇంఛార్జిల నియామకం లోక్‌సభ ఎన్నికల వేళ మూడు రాష్ట్రాలకు ఇంఛార్జిల నియామకం ఏపీకి బీజేపీ ఎన్నికల ఇంఛార్జిగా అరుణ్ సింగ్, కో ఇంఛార్జిగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఏపీ బీజేపీలో ఇంకా తేలని సీట్ల పంచాయితీ 12:27 PM, మార్చి 21 2024 ఏపీలో నాడు డబుల్ ఇంజిన్ సర్కార్ దివాళ తీసింది: విజయసాయిరెడ్డి 2014లోనే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను చూశాం డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ దివాళ తీసింది బీజేపీ, టీడీపీ పక్షపాతిగా వ్యవహరించాయి టీడీపీ హయాంలో ఒక జిల్లా, ఒక కుటుంబం ఒక కులం మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ AP has already seen a “double-engine” sarkar between 2014-18 to realize that both the engines of BJP and TDP work in the opposite directions leading to policy paralysis, stagnation of rural economy and rampant corruption. Only, 1 district, 1 caste and 1 family prospers under TDP. — Vijayasai Reddy V (@VSReddy_MP) March 21, 2024 12:02 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ ఎవరికో? విజయవాడ వెస్ట్ సీటు కోసం బీజేపీ, జనసేన మధ్య పోటీ పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం గెలుపు కోసం బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీటింగ్ టికెట్ కోసం జనసేన వెస్ట్ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ పట్టు మహేష్ కే టికెట్ ఇవ్వాలని వారం రోజులుగా అనుచరుల నిరసనలు నిన్న పవన్ తో పోతిన మహేష్ భేటీ చర్చలు నడుస్తున్నాయి.. ఆందోళన వద్దన్న పవన్! పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం పవన్ తాజా హామీతో.. జనసేన - బీజేపీలో ఎవరికి టికెట్ ఫైనల్ అవుతుందోనని ఉత్కంఠ 11:38 AM, మార్చి 21 2024 నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో టికెట్ పంచాయితీ డోన్ 1అభ్యర్థిగా ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించిన అదిష్ఠానం టీడీపీ బీఫామ్ మాత్రం తనకే వస్తుందంటున్న స్థానిక నేత ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ అభ్యర్థిని నేనే అని చంద్రబాబు రెండుసార్లు బహిరంగంగా చెప్పారు: ధర్మవరం సుబ్బారెడ్డి నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం : ధర్మవరం సుబ్బారెడ్డి 11:27 AM, మార్చి 21 2024 రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటన రాజోలు జనసేన అభ్యర్థిపై వీడిన సస్పెన్స్ రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ బొంతు రాజేశ్వరరావు వర్గంలో తీవ్ర నిరాశ 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు 10:39 AM, మార్చి 21 2024 చంద్రబాబుపై బోడె ప్రసాద్ అసహనం పెనమలూరు టీడీపీలో కొనసాగుతున్న సీటు పంచాయితీ రకరకాల పేర్లతో సర్వే చేయిస్తున్న చంద్రబాబు చంద్రబాబు సర్వేల పై బోడే ప్రసాద్ అసహనం పార్టీకోసం ఎంతో కోల్పోయా : బోడే ప్రసాద్ సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: బోడే ప్రసాద్ పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు: బోడే ప్రసాద్ పని చేయటం రాని వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: బోడే ప్రసాద్ పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ?: బోడే ప్రసాద్ సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి: బోడే ప్రసాద్ కానీ చంద్రబాబు నన్ను విస్మరించారు: బోడే ప్రసాద్ పెనమలూరు టీడీపీ టికెట్ నాకే వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నాను: బోడే ప్రసాద్ అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది: బోడే ప్రసాద్ ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం: బోడే ప్రసాద్ 10:11 AM, మార్చి 21 2024 ఇళ్లు తొలగించాలని లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్: దేవినేని అవినాష్ ఫైర్ టీడీపీ హయాంలో లో ఏటువంటి అభివృధి జరగలేదు కలువ గట్ల వాసులకు 1.20లక్షల రూపాయలు తో మంచి నీటి సౌకర్యం కల్పించాం మౌలిక సుడుపాయాలు కల్పనే జగన్ ప్రభుత్వానికి ప్రథమ లక్ష్యం ప్రతి ఒక్క కుటుంబానికి అనేక పథకాలు అందించాం అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల నేపథ్యంలో బూటకపు హామీలతో ప్రజల ముందు వస్తున్న టీడీపీ జనసేన నేతలు కలువ గట్ల ఇల్లు తీసేస్తారు అనీ గద్దె రామ్మోహన అసత్య ప్రచారం చేస్తున్నాడు జగన్ హయాంలో లో ఏ ఒక్కరి ఇల్లు తొలగించరని హామీ ఇస్తున్నా గతం లో కలువ గట్ల ప్రాంతం లో ఇళ్ళ తొలగింపు పై లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్ ఎవరు మోసం చేస్తారు, అబద్ధాలు చెబుతారో ప్రజలకు తెలుసు కలువ గట్ల ఇళ్లు తీసేసి సింగపూర్ సంస్థ కు అప్పజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది హుందా తనం కోల్పోయి రెచ్చ గొట్టు వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శవ రాజకీయాలు, నీచ రాజకీయాలకు తెర లేపుతున్న టీడీపీ నేతలు నాయి బ్రాహ్మణులను తోకలు కట్ చేస్తా అనీ అన్నది చంద్రబాబు కాదా? బీసీ లు అంటే ఓటు బ్యాంక్ గా మాత్రమే చంద్రబాబు చూస్తారు 14సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పుడు చేయకుండా బీసీ డిక్లరేషన్ ఇప్పుడు చేస్తా అనడం హాస్యాస్పదం గతంలో జగన్ పథకాలను మెచ్చుకుని.. నేడు చంద్రబాబు మాయలకు లొంగిపోయిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:56 AM, మార్చి 21 2024 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లపై వేటు కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వాలంటీర్లపై వేటు చిన్నపురంలో బందరు అభ్యర్థి పేర్ని కిట్టు తరఫున వలంటీర్ల ప్రచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లు పాల్గొన్నట్లు గుర్తింపు విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో ఉత్తర్వులు 10:34 AM, మార్చి 21 2024 పి.గన్నవరం బీజేపీకే? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మారుతున్న రాజకీయాలు పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థులను మార్చే ప్రయత్నం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ ని మార్చి బిజెపి అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు... రేసులో మాజీ ప్రభుత్వ అధికారి టి ఎస్ ఎన్ మూర్తి ఇప్పటికే ప్రచారంలోకి దిగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ 10:01 AM, మార్చి 21 2024 అనంతలో YSRCP ప్రచారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ప్రజల నుంచి అపూర్వ స్పందన 09:32 AM, మార్చి 21 2024 చోడవరం టీడీపీలో విభేదాలు అనకాపల్లి చోడవరం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ విభేదాలు కేఎస్ఎన్ రాజుకు సీటు ఇవ్వడంపై బత్తుల తాతయ్య బాబు, గూనూరు మల్లు నాయుడు ఆగ్రహం కాపులను, వెలమ సామాజిక వర్గాలను విస్మరించడంపై అసంతృప్తి రాజుకి వ్యతిరేకంగా వెలమ సంఘాల ప్రతినిధులు సమావేశం టీడీపీకి ఓటు వేయి రాదని తీర్మానం ఎన్నికల ప్రచారానికి దూరంగా తాతయ్య బాబు, మల్లు నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా రాజుకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు అటువంటి వ్యక్తికి చోడవరం సీటు ఎలా ఇస్తారని ప్రశ్న కె ఎస్ ఎన్ రాజుకు సహకరించేది లేదంటున్న తాతయ్య బాబు మల్లు నాయుడు చంద్రబాబు తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ 09:14 AM, మార్చి 21 2024 గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెస్ట్ నియోజకవర్గంలో సమావేశం విజయవాడ టౌన్ కాపులకు అడ్డా అని సంఘం నేతల ప్రకటన జనసేన తరఫున పోతిన మహేష్కుకి టికెట్ ఇవ్వాలని కాపు సంఘాల డిమాండ్ బీజేపీకి టికెట్ కేటాయించడాన్ని తప్పు పట్టిన కాపు సంఘం నేతలు మహేష్ బీసీ అయినా ఆయన వెనుకే మేము ఉంటాం పశ్చిమ సీటు మహేష్ కే కేటాయించాలి పీక తెగిపోయే పొత్తు ఎందుకు? గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను మార్చారంటూ ఆవేదన 08:44 AM, మార్చి 21 2024 దుత్తలూరులో బరితెగించిన టీడీపీ నేతలు నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఆత్మీయ సమావేశం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఆత్మీయ సమావేశాలు నిర్వహించకూడదంటూ అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతల దురుసు ప్రవర్తన పరుష పదజాలంతో దూషణలు.. దాడికి యత్నం.. అధికారితో తీవ్రవాగ్వాదం అనుమతులు లేవంటూ ఎంపీడీవోకి పోలీసులకు ఫిర్యాదు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఐపీసీ 188 కింద నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు 08:34 AM, మార్చి 21 2024 ఉల్లం'ఘను'లు యథేచ్ఛగా టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన పలుచోట్ల నిబంధనలు పట్టించుకోని టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన తిరుపతి జిల్లాలో కానిస్టేబుల్, చిత్తూరులో ఏఎన్ఎం సస్పెన్షన్ పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 08:28 AM, మార్చి 21 2024 నేడు ఈసీ ముందుకు మూడు జిల్లాల ఎస్పీలు ఈసీ ముందు హాజరుకానున్న ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లా ఎస్పీలు ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల హింసాత్మక ఘటనలపై వివరణ కోరిన ఈసీ వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు 08:07 AM, మార్చి 21 2024 నాగబాబు చెంతకు తిరుపతి పంచాయితీ తిరుపతి జనసేన నేతలకు అధిష్టానం నుంచి పిలుపు స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు, కార్యకర్తలు టికెట్ శ్రీనివాసులుకే ఉంటుందని హామీ ఇచ్చిన పవన్ పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకే కేటాయించిన టీడీపీ! అరణి శ్రీనివాసులుకు ఇవ్వొద్దంటూ కొంతకాలంగా డిమాండ్ నేడు జనసేన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో భేటీ కానున్న తిరుపతి జనసేన నేతలు శ్రీనివాసులుకు ఇస్తే ప్రచారానికి దూరంగా ఉంటామని నాగబాబుకి స్పష్టం చేయాలని నిర్ణయం పవన్ సమక్షంలో వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన శ్రీనివాసులు 07:38 AM, మార్చి 21 2024 బీజేపీలో కొలిక్కికరాని అభ్యర్థుల ఎంపిక ఢిల్లీలోనే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, సోమువీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ మధుకర్ రాజమండ్రి ఎంపీ సీటు ఆశిస్తున్న సోమువీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ చేయనని సోమువీర్రాజు స్పష్టీకరణ ఇప్పటికే రాజమండ్రి సీటు కోరుతున్న పురందేశ్వరి 07:18 AM, మార్చి 21 2024 వారాహి దుమ్ము దులుపుతున్న పవన్ మరోసారి తెరపైకి వారాహి యాత్ర ఎన్నికల నేపథ్యంలో వారాహిపైనే ప్రచారం నిర్వహించాలని పవన్ నిర్ణయం అప్పట్లో వారాహి మీద రాష్ట్రవ్యాప్త యాత్ర అంటూ హడావిడి స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. వారాహిని పూర్తిగా పక్కనపడేసిన పవన్ ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ బయటకు తీస్తున్న వైనం 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి పవన్ పర్యటన కాపులు ఓటేసి గెలిపిస్తారా? అనే అనుమానంతో.. పిఠాపురం పోటీ డైలమాలో పవన్ 06:42 AM, మార్చి 21 2024 పిఠాపురంలో పవన్ పోటీ.. డౌటే పిఠాపురంలో మారుతున్న రాజకీయం బరిలోకి దిగకుండానే జనసేన అధినేత పవన్ కి పిఠాపురంలో ఎదురుగాలి పార్టీని వీడుతున్న కీలకకాపు నేతలు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన పిఠాపురం మాజీ ఇన్ ఛార్జి మాకినీడు శేషు కుమారి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శేషుకుమారి 2019 ఎన్నికలలో పిఠాపురం జనసేన అభ్యర్ధిగా పోటీచేసి 28 వేల ఓట్లు సాధించిన శేషుకుమారి పవన్ కి సిద్దాంతం లేదు... నిబద్దత లేదు: శేషు కుమారి జనసేనకి విధివిధానాలు లేవ్: శేషు కుమారి ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరిక పవన్ తీరుతో విసుగెత్తి వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం పవన్ వ్యవహారశైలి...నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు కాకినాడ ఎంపీగా పవన్ బరిలోకి దిగితే పిఠాపురంలో తానే టీడీపీ తరపున పోటీ చేస్తానంటూ మరోసారి బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరుసగా ఎదురుదెబ్బల నేపధ్యంలో పిఠాపురంలో పవన్ పోటీపై అనుమానమే! ఎంపీ సాకుగా చూపి పిఠాపురం పోటీ నుంచి తప్పుకుంటాడేమోననే అనుమానాలు 06:42 AM, మార్చి 21 2024 మైనారిటీలకు మంచి చేసిందెవరు?: YSRCP చంద్రబాబు అసత్య ప్రచారం ముస్లిం మైనారిటీల సంక్షేమం,అభివృద్ధికోసం తాను తెచ్చిన ప్రతీ పథకాన్ని సీఎం జగన్ రద్దు చేశారంటూ ఆరోపణ ఎవరి పాలనలో మైనారిటీలకు మంచి జరిగిందో తెలుసంటూ టీడీపీ ట్వీట్‌కు వైఎస్సార్సీపీ కౌంటర్ Everyone knows who did what to minorities! https://t.co/oOscpTDN1h pic.twitter.com/DLtTaoqtmA — YSR Congress Party (@YSRCParty) March 20, 2024 06:30 AM, మార్చి 21 2024 కడప, అన్నమయ్య సిద్ధం ఈ నెల 27 నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర పోస్టర్లు ఆవిష్కరించిన ఎంపీ అవినాష్‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆంజాద్ భాషా, ఇతర ముఖ్య నేతలు కపడ, అన్నమయ్య జిల్లాలు సిద్ధమంటూ పోస్టర్లు ఈ నెల 27న సీఎం @ysjagan ఇడుపులపాయ నుంచి "మేమంతా సిద్ధం" పేరుతో బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కడపలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు సమావేశమై బస్సుయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/Uky7UD4H4K — YSR Congress Party (@YSRCParty) March 20, 2024 -
ఒక్కొకరుగా ముసుగు తీస్తున్నారు.. కుట్ర క్లియర్..
-
తొలగిన పచ్చ ముసుగు
ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ పచ్చ ముసుగులు తొలిగాయి! వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తమ రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టుకున్నారు. తమకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, కొంతకాలంగా తాము చదువుతోంది చంద్రబాబు స్క్రిప్టేనని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా సాగుతున్న పచ్చ కుట్రలో తాము భాగస్వాములమని తేల్చేశారు. టీడీపీ తరఫునో, ఆ పార్టీ మద్దతుతోనో ఎన్నికల్లో పోటీ చేయడమే తమ ఆంతర్యమని కుండబద్ధలు కొట్టారు. ఇక షర్మిల కూడా తానూ ఆ పచ్చతానులో ముక్కనేనని విస్పష్టంగా ప్రకటించారు. వైఎస్ వివేకా ఐదో వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల ఒకే లయ... ఒకే తాళంతో చంద్రబాబు ఐదేళ్లుగా పాడుతున్న పాచిపాటనేమళ్లీ పాడారు. –సాక్షి, అమరావతి సునీత... షర్మిల... సౌభాగ్యమ్మ బాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా... వైఎస్ వివేకా 2019 మార్చి 15న హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు ప్రచారంలోకి తెచ్చిన కట్టుకథను ప్రజలు ఎన్నికల్లో తిప్పికొట్టారు. దాంతో ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వివేకా కుటుంబ సభ్యులతో పలికించే కుయుక్తులకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతను రంగంలోకి దించారు. ఆ డ్రామా దాదాపు మూడేళ్లకుపైగా కొనసాగిన తరువాత చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిల రాజకీయ తెరపైకి వచ్చారు. సునీత నిరాధార ఆరోపణలనే ఆమె కూడా వినిపిస్తున్నారు. ఈ నాటకం రక్తి కట్టకపోవడంతో చివరి పాత్రధారిగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఆమె పాత్రను ప్రవేశపెట్టడం చంద్రబాబు టైమింగ్‌కు నిదర్శనం. ఎన్నికల వేళ సౌభాగ్యమ్మ, సునీత తమలో గూడుకట్టుకున్న రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం సీఎం రమేశ్ ద్వారా చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కడప ఎంపీగా పోటీ చేయాలనే తమ ఆకాంక్షను గుర్తుచేశారు. నాలుగేళ్లుగా ఈ డ్రామా నడుపుతున్న చంద్రబాబు అందుకు సరే అన్నారు. వారం క్రితమే నర్రెడ్డి సునీత తానుగానీ తన తల్లి గానీ ఎన్నికల్లో పోటీ చేస్తామనే సంకేతాలు ఇచ్చారు. వైఎస్సార్సీపీని ఓడించాలన్నారు. పచ్చ సీరియల్లో తరువాత ఎపిసోడ్ వివేకా వర్ధంతి కార్యక్రమాన్ని పులివెందులలో పక్కా స్క్రిప్ట్‌తో నిర్వహించారు. అందులో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. రాజకీయ వారసత్వం రెండో వివాహంతో రగడ వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తాను రెండో వివాహం చేసుకున్న షమీమ్ అనే మహిళకు ఆస్తిలో వాటా ఇవ్వడంతోపాటు ఆమె ద్వారా జన్మించిన కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా భావించారు. దీన్ని సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ వివేకా ఆస్తితోపాటు రాజకీయ వారసత్వం తమకే దక్కాలని పంతం పట్టారు. వివేకా హత్య తరువాత ఆయన పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తులను సునీత హడావుడిగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్తులు హస్తగతమయ్యాక రాజకీయ వారసత్వంపై సౌభాగ్యమ్మ, సునీత కన్నేశారు. వివేకా జీవితాంతం రాజకీయంగా విభేదించిన చంద్రబాబుతో చేతులు కలిపారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి పులివెందులకే చెందిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపట్ల నాలుగేళ్లుగా సౌభాగ్యమ్మ, సునీత సన్నిహితంగా ఉంటున్నారు. హత్య అనంతరం... ఆద్యంతం సందేహాస్పదం వైఎస్ వివేకా హత్య అనంతరం సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి వ్యవహరించిన తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019, మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడులకు సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాను హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అందచేశారు. లేఖను సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా? అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగయ్య చెప్పిన వివరాల ప్రకారం 2019, మార్చి 14 అర్ధరాత్రి వివేకాను హత్య చేసిన తరువాత హంతకులు ఆ నివాసంలో ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం వెతికారు. దీంతో వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది స్పష్టమైంది. వివేకా ఆస్తి కోసం, రాజకీయ వారసత్వం కోసమే ఆయన సొంత కుటుంబ సభ్యులే ఈ హత్యకు పన్నాగం పన్ని ఉంటారన్నది స్పష్టమవుతోంది. బద్ధశత్రువులతో ఒకే వేదికపై పులివెందులలో శుకవ్రారం నిర్వహించిన వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీతతోపాటు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వివేకాకు జీవితాంతం బీటెక్ రవి ప్రత్యర్థిగానే ఉన్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా ఓడించారు. ఆ రాజకీయ కుట్రను ఆదినారాయణరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. 2019లో వివేకాను హత్య చేసివారికి వీరిద్దరూ పూర్తి అండదండలు అందిస్తున్నారు. అటువంటి వారు సౌభాగ్యమ్మ, సునీతకు అత్యంత ఆప్తులయ్యారు. వారిద్దరినీ ఆహ్వానించి వివేకా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం విభ్రాంతికరమే కాదు రాజకీయాలంటేనే జుగుప్స కలిగిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒంటరిని చేసి.. పస్తులు ఉంచి.. వివేకా జీవించి ఉండగా ఆయన్ని పట్టించుకోని కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. హత్యకు గురి కావడానికి చాలా ఏళ్ల ముందు నుంచే వివేకాను ఆయన సతీమణి, కుమార్తె, అల్లుడు విస్మరించారు. వివేకా షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సౌభాగ్యమ్మ, సునీత ఆయన్ని చాలా ఏళ్లుగా పులివెందులలో ఒంటరిగా వదిలేశారు. సౌభాగ్యమ్మ చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో తన కుమార్తె నివాసంలో ఉంటున్నారు. వివేకా చెక్ పవర్‌ను కూడా రద్దు చేసి ఆయన రోజువారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి కల్పించారు. వివేకాకు ఇంట్లో వండి పెట్టేవారే లేని దుస్థితి కల్పించారు. చివరికి రెండు చపాతీలు కూడా ఇచ్చేవారు లేక ఆయన పనివాళ్ల మీద ఆధారపడాల్సి వచ్చేది. తిండి లేకుండానే నిద్రపోయిన రోజులూ ఉన్నాయి. ఈ విషయాలేవీ ఎవరికీ తెలియవన్నట్టుగా సౌభాగ్యమ్మ, సునీత వ్యవహరించి నిజాలకు పాతరేసేందుకు యత్నించారు. బీటెక్ రవి సాగని ఆటలు పులివెందుల నియోజకవర్గంలో కొద్దోగొప్పో పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చని పథకం వేశారు. కానీ నాడు వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి (ఈయనతో వివేకాకు ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నార్కో పరీక్ష నిర్వహించాలని సిట్ దర్యాప్తులో నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి మొండికేయడం సందేహాస్పదమే. దస్తగిరి.. హంతకుడి హైడ్రామా వివేకాను ఎంత పాశవికంగా హత్య చేశాడో పూసగుచ్చినట్లు చెప్పిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం ఎవరికైనా విభ్రాంతి కలిగించకమానదు. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నాడన్నది నిర్ధారణ అయ్యింది. అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... దీని వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి... ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కోసం కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నాడు. దస్తగిరి దుష్ప్రచారాన్ని పదేపదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. మరి దస్తగిరి కట్టుకథలు, అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా! -
చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్
-
నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్?.. షర్మిలకు మంత్రి రోజా కౌంటర్
సాక్షి, తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు మంత్రి ఆర్కే రోజా కౌంటరిచ్చారు. నాలుగున్నరేళ్లు తెలంగాణ బిడ్డను అని చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి షర్మిల హడావుడి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. కాగా, మంత్రి రోజా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, రోజా మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నేత చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17వేల పోస్టులను భర్తీ చేశారు. 6,100 భర్తీలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడైనా ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో షర్మిలకు రాజకీయ అవగాహన లేదని నిన్న చేసిన హడావిడి చూస్తే అర్థమైంది. నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తాను తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంది. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి జగన్‌పై విషం చిమ్ముతూ ఆరాటాలు, పోరాటాలు చూసి ప్రజలు నవ్వుతున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము’ అంటూ హెచ్చరించారు. -
షర్మిలా.. నిజాలు మాట్లాడడం నేర్చుకో
అల్లిపురం (విశాఖ దక్షిణ) : వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ పేరును ఆయన మరణం తరువాత ఎఫ్ఐఆర్లో చేర్చి అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించడమే కాకుండా ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేసిన కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవాలు మాట్లాడడం షర్మిల నేర్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు. విశాఖలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడకు వచ్చి ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను యావత్తు దేశమే పొగుడుతుంటే షర్మిల సచివాలయ వ్యవస్థపై బురదజల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడడం ఆమె అవగాహనారాహిత్యమని వరుదు కళ్యాణి విమర్శించారు. ఎక్కువ ఉద్యోగాలిచ్చింది వైఎస్సార్సీపీ సర్కారే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో 2 లక్షల 14 వేల శాశ్వత ఉద్యోగాలు, 6 లక్షల 30 వేలకు పైగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా.. 2008లో డీఎస్సీ నోటిఫికేషన్లో ఆగిన ఉద్యోగాలను కూడా తమ ప్రభుత్వంలో భర్తీ చేశామన్నారు. యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. కనీస అవగాహనలేకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్న షర్మిల తన సొంత కుటుంబాన్ని వేధించిన వారితోనే జతకట్టడానికి సిగ్గులేదా అని ఆమె ప్రశ్నించారు. -
షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్ లు
-
షర్మిల, కాంగ్రెస్ వల్ల డి మా పార్టీకి ఉడేది ఏమి లేదు
-
షర్మిల, కాంగ్రెస్ వల్ల మా పార్టీకి ఉడేది ఏమి లేదు
-
షర్మిలపై RGV ఆసక్తికర వ్యాఖ్యలు
-
బాబు, పవన్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అనంతపురం: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయని తెలిపారు. 2018కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చిందని విమర్శించారు. టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేయడం వల్ల తాము కొన్ని స్థానాల్లో ఓడిపోయామని అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని అన్నారు. ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే తెలుస్తుందన్నారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అంటేనే నిజం అని.. ఖచ్చితంగా నిజం గెలుస్తుందన్నారు. టీడీపీ పతనావస్థకు చేరిందని, ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. రాజ్యసభలో టీడీపీ ఖాళీ అవుతోందని. .. పతనావస్థకు ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు. టీడీపీ అజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని విమర్శించారు. 18న రాప్తాడులో వైఎస్సార్సీపీ ' సిద్ధం' సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిల: మంత్రి రోజా -
షర్మిల, చంద్రబాబుకు ఏపీ మంత్రులు కౌంటర్
-
షర్మిలను నిలదీసిన వైఎస్సార్ అభిమాని
-
ఏపీ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదు: వెల్లంపల్లి
-
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
-
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
అనకాపల్లి: కొన్ని రోజుల క్రితం ఏపీలోని కాంగ్రెస్ పార్టీలో చేరి రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజలకు వద్దకు వెళుతున్న షర్మిలకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీ కండువా మళ్లీ మీరు ఎందుకు కప్పుకున్నారని షర్మిలను ఓ సామాన్యుడు నిలదీశాడు. గతంలో జగనన్న వెంట నడిచి, ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ అనడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని నిలదీశాడు. అనకాపల్లి నియోజకవర్గంలో నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సామాన్యుడి నుంచి ఎదురైన ఈ హఠాత్తు పరిణామంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించింది. వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మా కార్యకర్తలమంతా తప్పుపట్టాం. ఆ సమయంలో మేమంతా మీకు, మీ కుటుంబానికి అండగా నిలబడ్డాం. మీ పాదయాత్రలో మీతో నడిచాం. ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటున్నారు. అందుకే నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి’ అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, పింఛన్లు మొదలుకొని ప్రతీ పథకం అర్హుడైన పేదవాడికి అందుతుందని స్పష్టం చేశాడు . -
మణిపుర్‌కు మతం రంగు!
మణిపుర్లో విధ్వంసం కన్నా మణిపుర్‌పై విధ్వంసక ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది! దేశంలో ఎక్కడేం జరిగినా దానికి మతాన్ని అంటుకట్టేలా తయారైన రాజకీయ వ్యవస్థ ఆఖరికి మణిపుర్‌లోని తెగల మధ్య ఘర్షణలను కూడా ‘మత కలహాలు’గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మణిపుర్‌తో సంబంధం లేని రాష్ట్రాలకు సైతం ఆ ‘రాజకీయ మతోన్మాదం’ వ్యాపించింది! దురుద్దేశాలతో కొన్ని విదేశీ శక్తులు, పొద్దెరగని కొందరు దేశవాళీ కొత్త రాజకీయవాదులు స్వార్థ ప్రయోజనాల కోసం మణిపుర్ నిప్పుల కుంపటిని తమ ప్రసంగ వేదికలపైకి మోసుకెళుతున్నారు. అవి మత కలహాలు కావు... భూమి హక్కుల తగాదాలని తెలిసీ మణిపుర్‌కు మతం రంగును పులుముతున్నారు! నిరుడు ఈ సమయానికి మణిపుర్ ప్రశాంతంగా ఉంది. ఫిబ్రవరిలో ప్రశాంతం. మార్చి నెలలో కూడా ప్రశాంతం. ఏప్రిల్ వచ్చేసరికికొంచెం వేడెక్కింది. అయితే అది... ఏప్రిల్‌లో 16 సెల్సియస్ డిగ్రీలతో మొదలై, జూన్ నాటికి 35 డిగ్రీల వరకు చేరుకునే ఎండాకాలపు వేడిమి కాదు. నిరసన ప్రదర్శనల వేడి. దాడులు, దహనాల వేడి. నిజానికి అంతకు పదేళ్లు, ఆ ముందు పదేళ్ల నుంచి కూడా మణి పుర్ దాదాపుగా ప్రశాంతంగానే ఉంది. రాష్ట్రాన్నే రెండు ముక్కలు చేసేంతగా అక్కడేం జరగలేదు. గత మే నెల నుంచే హింసాకాండ మొదలైంది. మూకుమ్మడి దాడులు, గృహదహనాలు, ప్రార్థనాస్థలాల ధ్వంసం, మహిళల్ని నగ్నంగా ఊరేగించడం మణిపుర్‌ను అగ్నిగుండంలా మార్చేశాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 180 మంది మరణించారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. డిసెంబరులో మణిపుర్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపించినప్పటికీ కొత్త సంవత్సరంలో మళ్లీ ఒక్కసారిగా హింస చెలరేగింది. జాతుల మధ్య మొదలైన ఈ ఘర్షణలు విద్వేష జ్వాలలే అయ్యాయి. ఇంతకన్నా ఘోరం... అక్కడ జరుగుతున్న ఘటనలపై పాశ్చాత్య మీడియా చేస్తున్న దుష్ప్రచారం! వారితో పాటు అంతర్గతంగా మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా మణిపుర్‌కు మతంరంగు పులిమేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ‘‘1947లోపంజాబ్లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలన కాండను మణిపుర్ ఘటనలు గుర్తు చేస్తున్నాయి’’ అనేంతగా ప్రచారం జరుగు తోంది. వారి వ్యతిరేకత ఎవరి మీదనైనా కావచ్చు. కానీ వాస్తవాలను హతమార్చడం ఎందుకు? పర్ణశాల వంటి మణిపుర్‌పై మతోన్మాద మరకల్ని అంటించడం దేనికి?భౌగోళికంగా మణిపుర్ ప్రత్యేకమైనది. రాష్ట్రంలో కేవలం పది శాతం మాత్రమే ఉన్న మైదాన భూభాగంలో రాష్ట్రంలోని దాదాపుతొంభై శాతం ప్రజలు నివసిస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మైతేయిలు. రాష్ట్రంలో వారి జనాభా దాదాపు 53 శాతం. దీంతో సహజంగానే రాజకీయాల్లో వారిదే ప్రాబల్యం. 60 సీట్ల అసెంబ్లీలో 40 స్థానాలు వాళ్లవే.కొండ ప్రాంతాల్లోని గిరిజనులైన కుకీలు, నాగాలకు ఎస్టీ రిజర్వేషన్ ఉండటం, మైదాన ప్రాంత గిరిజనులైన మైతేయిలకు ఎస్టీ రిజర్వేషన్ లేకపోవడం... కాలక్రమంలో రెండు వర్గాల మధ్య సఖ్యత లోపించడానికీ, సంఘర్షణకూ కారణం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాలు మరింతగా క్షీణించడానికి మణిపుర్ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పు కారణం అయింది. మణిపుర్‌ను రణపుర్గా మార్చేసింది. 2023 మార్చి 27న షెడ్యూల్డు తెగల జాబితాలోకి మైతేయి తెగలను చేర్చేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు సిఫారసు చేయాలని మణిపుర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై కుకీలు, నాగాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ వర్గంగా మైతేయిలదే రాజకీయంగా పైచేయిగా ఉందనీ, హిందువుల్లోని ఎస్సీ, ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను వారు ఇప్పటికే అనుభవిస్తున్నారనీ, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వటం సరికాదనీ అభ్యంతరం చెబుతున్నారు. మైతేయిలకు రిజ ర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారనీ, తమ ఉద్యోగాల వాటా తగ్గిపోతుందనీ ఆందోళన చెందుతున్నారు. అయితే, మైతేయిల వాదన మైతేయిలకు ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగా, కుకీ ఆదివాసీల్లోని ముప్పైకి పైగా తెగలకు ఎస్టీలుగా ప్రభుత్వ గుర్తింపు ఉంది. తమకు ఆ గుర్తింపు లేని కారణంగా దేశంలోని ఎవరైనా వచ్చి తాముంటున్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో భూమి కొనొచ్చుగాని... తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుక్కోవటానికి వీలులేకుండా పోయిందన్నది మైతేయిల వాదన. అంతేకాదు 1949లో భారత్‌లో కలవటానికి ముందు మైతేయిలను ఆదివాసీ తెగగానే గుర్తించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ హోదాను పునరుద్ధరించాలని మాత్రమే తాము కోర్టుకు విన్నవించుకున్నాం అని మైతేయి సంఘం అంటోంది. కేవలం రిజర్వేషన్ల కోసమే కాకుండా... సంస్కృతిని, భాషను, భూమిని, తమ సంప్ర దాయాలను కాపాడుకోవటం కోసం ఎస్టీలుగా గుర్తింపును కోరు తున్నామని కోర్టులో వాదించింది. మణిపుర్ హైకోర్టు ఈ వాదనలతో ఏకీభవించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందో ళనకు పిలుపు ఇవ్వటం, అది హింసాత్మకంగా మారటంతో ఆందోళన మంటలు రాష్ట్రంలో రాజుకున్నాయి. రెండు వైపులా మరణాలు సంభ వించాయి. చర్చిలు, దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇవేమీ మత కలహాలు కావు. భూమి హక్కుల విషయమై మొదలై, నేటికీ కొనసాగుతున్న ఘర్షణలు. అయితే మణì పూర్లో జరుగుతున్నవి మత ఘర్షణలు అని, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హిందువులు విధ్వంసానికి పాల్పడు తున్నారనే దుష్ప్రచారం సాగుతోంది. గమనించాల్సి వాస్తవం ఏమి టంటే మైతేయి తెగల్లో అధిక సంఖ్యాక హిందువులతో పాటు, ముస్లింలు, క్రిస్టియన్లు; కుకీ నాగాల్లోనూ అధిక సంఖ్యాక క్రిస్టియన్లతో పాటు హిందువులు, ముస్లింలు ఉన్నారన్నది! మణిపుర్ తెగల మధ్య ఘర్షణలు మతాల మధ్య చిచ్చుగా కొన్ని పాశ్చాత్య దేశాలకూ, మన దేశంలోనే కొన్ని రాజకీయ పార్టీల వారికీ మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? ఎందుకంటే, ఎవరి స్వార్థ ప్రయో జనాలు వారివి. నిజానికి మత ఘర్షణలనేవి మణిపుర్ చరిత్రలోనే లేవు. ‘‘కుకీ, నాగా తెగలకు పరిపాలనలో స్థానం కల్పించిన చరిత్ర మైతేయిలది. మణిపురి ప్రజలకు మతోన్మాదం లేదు. 19వ శతాబ్దంలో రాచరిక పాలనలో హిందూమతం ఆధిపత్యం చలాయించిందన్నది నిజమే, కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. మరిక మతోన్మాదం ఎక్కడి నుంచి వచ్చింది?’’ అంటారు మణిపుర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రియోరంజన్ సింగ్. అయితే రెండు వేలకు పైగా చర్చిలను ధ్వంసం చేశారని కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలను వారికి ఏ క్రైస్తవ దేశాలు అందించాయో వారే చెప్పాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూసినా 100 దేవాలయాలతో పాటు రెండు వేల మైతేయి ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. మరి వీటిని ఏమంటారు? మత ఘర్షణలు అనేనా! మైతేయి వర్గం ప్రయోజనాల కోసం ఏర్పాటైన కోకోమి ప్రతినిధి కె. ఓథాబాయ మాట్లాడుతూ, ‘‘మణిపుర్‌లోని సమస్యలు మతపరమైనవి కావు’’ అని స్పష్టం చేశారు. ఆ మాటను కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెప్పేవారెవరు? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు చెప్పేవారెవరు? ‘‘మణిపుర్లో మతం పేరుతో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు. జరుగుతున్నదాన్ని డైవర్ట్ చేసి మతపరమైనహింసగా చూపించడం ఇదే మొదటిసారి’’ అని స్వయంగా మణిపుర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేబబ్రత సింగ్ అన్నారు కదా! బాధ్యత గల రాజకీయ నాయకులు ఎవరూ మణిపుర్లో జరుగు తున్న మతపరమైన దాడులు అని అనలేదు. అలాంటి ప్రచారానికి తావు కూడా ఇవ్వరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మణిపుర్‌కు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘మీరు క్రిస్టియన్ అయుండీ ఎందుకు మణిపుర్ క్రిస్టియ న్లను సమర్థించడం లేదు?’’ అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో ఇలా ఒక మతం వారిని రెచ్చగొట్టే ప్రసంగాలను ఇస్తున్నారో ప్రత్యేకించి చెప్పే పని లేదు. – మాధవ్ శింగరాజు, సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో మద్దతు ధర
-
లైవ్ లో షర్మిల వీడియో చూపిస్తూ ఏకిపారేసిన కొత్తపల్లి రజిని..!
-
కాంగ్రెస్ ముసుగులో షర్మిలను తీసుకొచ్చిన బాబు
సాక్షి, తిరుపతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో తుడిచి కొట్టుకు పోతామన్న భయాందోళనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చి అడ్డగోలు ఆరోపణలు చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబు అండ్‌కో, ఎల్లోమీడియా స్క్రిప్ట్ ప్రకారమే ఆమె విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త, తిరుపతి ఎంపీ గురుమూర్తి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ‘సిద్ధం’ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ఆయన హామీలకు ఉంటుందా? బాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదని, అందుకే కుప్పంతోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల జాడే లేకుండా పోయిందన్నారు. సామాన్యులే సీఎం వైఎస్ జగన్‌కు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లని ధీమా వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, 2014లో అధికారంలోకి రాగానే 2 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, డ్వాక్రా మహిళల కోసం ఆసరా పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు. గతంలో జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తేనే సంక్షేమ పథకాలు అందేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, గడప గడపకు వెళ్లి వలంటీర్లు అర్హులందరికీ అందిస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 3న అనంతపురంలో ‘సిద్ధం’ కార్యక్రమంలో పాల్గొంటారని, ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 29న తిరుపతిలో నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
బాబు మాటలే బట్టీపట్టి చెబుతున్న షర్మిల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని షర్మిల.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ఇచ్చిన స్క్రిప్ట్‌నే పోటీ పరీక్షలకు విద్యార్థి సిద్ధమైనట్లుగా బట్టీ పట్టి చదువుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆమె మాట్లాడుతున్న మాటలకు ఒకదానికి, మరొకదానికి పొంతన లేదన్నారు. షర్మిల మాటలను చూస్తే.. బహుశా ఆమె తెలంగాణలో ఉండి మాట్లాడుతున్నట్లుగా అనుకుంటున్నారేమో అని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సోనియా వేధింపులు షర్మిలకు తెలుసు వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తాళలేక మరణించిన వారి కుటుంబాలకు భరోసా కల్పించడానికి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి సోనియాగాంధీ యత్నించారు. అప్పట్లో సోనియాను జగన్, విజయమ్మ, షర్మిల కలిశారు. అక్కడేం జరిగిందో షర్మిలకు కూడా తెలుసు. వైఎస్ పథకాలను తుంగలో తొక్కి, ఆశయాలను పక్కన పెట్టేందుకు సిద్ధమైన సోనియాతో విభేదించి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచి కక్ష సాధింపు మొదలు పెట్టి వేధించిన విషయమూ షర్మిలకు తెలుసు. వైఎస్ వివేకానందరెడ్డిని మంత్రిని చేసిన సోనియా.. వైఎస్సార్సీపీ స్థాపించాక పులివెందుల ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మపై వివేకానందరెడ్డిని పోటీ పెట్టడం ద్వారా కుటుంబాన్ని చీల్చిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడూ అదే రీతిలో కుటుంబాన్ని చీల్చి షర్మిలను పీసీసీ చీఫ్‌గా చేశారని జగన్ ఎత్తిచూపారు. ప్రజలు జగనే వైఎస్‌కు సరైన వారసుడు అనుకున్నారు కాబట్టే వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. మహానేత వైఎస్ ఆశయ సాధనే ఊపిరిగా.. సీఎం జగన్ వైఎస్సార్ బిడ్డగా ఆ రోజు మొదలు పెట్టిన ప్రస్థానం.. నేడు ఉధృతమైన ప్రవాహంలా సాగుతోంది. దానికి కారణం వైఎస్ ఆశయాలను, ఆలోచనలను జగన్ మనసా వాచా నమ్మి వాటిని మరింత మెరుగుపర్చి అమలు చేస్తున్నారు. పార్టీని నడపడం, విలువలను పాటించడం, నిజాయితీ, నిబద్దతలో ఎన్ని ఆటుపోట్లనైనా తట్టుకొంటూ వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆనాడు అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లో పెట్టడం నుంచి చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నప్పుడూ జగన్ చలించలేదు. ఇలా సొంతంగా ఎదిగిన వ్యక్తి జగన్. జగన్ తండ్రి వైఎస్ అని చెప్పుకోవడం ఏ తండ్రికైనా గర్వకారణమే. వైఎస్ బిడ్డగా, జగన్ సోదరిగా షర్మిలకు అభిమానులు గౌరవం ఇస్తారు. గుండెల్లో పెట్టుకుంటారు. ఏం అన్యాయం జరిగిందో షర్మిలే చెప్పాలి జగన్ కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీని స్థాపించినప్పుడు లక్షలాది కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. త్యాగాలు చేశారు. అందరూ కష్టపడ్డారు. జగన్ జైలులో ఉన్న సమయంలోనే కదా షర్మిల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ ఎంతో కష్టపడ్డారు. అందరికీ రకరకాల బాధ్యతలు అప్పజెప్పారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించారు. షర్మిల పాదయాత్ర చేశారు. అన్యాయం జరిగిందని షర్మిల అంటున్నారు. ఆమెకు ఏం అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలి. పదవి కోసమే ఆమె ఆరోజు జగన్ కోసం నిలబడ్డానని స్పష్టంగా చెప్పగలిగితే సమాధానం చెప్పొచ్చు. పదవుల పంపకంలో అన్యాయం చేశారా? కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది చర్చించడానికి అర్హమైనదేనా? కుటుంబం పదవులు పంచుకొంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? వైఎస్సార్టీపీ కార్యకర్తలకు షర్మిల ఏం న్యాయం చేశారు? తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీ కోసం చాలా మంది కష్టపడి ఉంటారు కదా. వారికి షర్మిల ఏం న్యాయం చేశారు? వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేశారు? వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాష్ట్రానికి వచ్చిన షర్మిలను భుజానికెత్తుకుని మోస్తున్న ఎల్లో మీడియా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో షర్మిలకు భాగముందని ఎందుకు రాయలేదు? అప్పుడూ ఇప్పుడూ జగన్‌పై షర్మిల బాణాలు ఎక్కుపెట్టినప్పుడే వాటినే ఎల్లో మీడియా ప్రచురిస్తోంది. వైఎస్ మరణంపై రేవంత్‌రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు షర్మిల ఎందకు స్పందించలేదు? వైఎస్ పథకాలు లేవంటే తీసుకున్న వాళ్లంతా ఎవరు? వైఎస్ పథకాలను తీసేశారని షర్మిల మాట్లాడితే ఏమనాలో అర్థం కావడంలేదు. చంద్రబాబు, రాధాకృష్ణ వద్ద నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి చెప్పినప్పుడు వాస్తవాలు ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో వైఎస్ అమలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా ఇప్పుడు షర్మిల లేవంటున్నారు. రైతులకు నేడు ఇస్తున్నంత భరోసా దేశంలో మరెక్కడైనా ఉందా? అసలు క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటున్నారు. తీసుకున్న రైతులంతా ఏమనుకుంటారు? పాపం ఆమె తెలియక ఇంత అబద్ధం మాట్లాడి ఉండొచ్చు. బహుశా చంద్రబాబు కూడా వీటిపై మాట్లాడటానికి సాహసం చేయకపోవచ్చు. చంద్రన్న కానుకలు లేవని అనొచ్చు కానీ, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లేవని మాత్రం ఆయనా అనలేడు. షర్మిలమ్మే తిట్లు తింటుందిలే అని చంద్రబాబు ఆ తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చి ఉండొచ్చు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో సీఎం జగన్ ఆరోజుతో పొలిస్తే 3వేలకు పైగా ప్రొసీజర్స్ పెంచారు. రూ.25 లక్షల వరకూ పరిమితి పెంచారు. అర్హత కోసం ఆదాయాన్ని రూ.5 లక్షలు చేశారు. 90 శాతం కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవి నిజం కాదా? ఫీజు రీయింబర్స్మెంట్ ఆనాడు రూ.30 వేల నుంచి రూ. 35 వేలు ఇస్తే, ఇప్పుడు వంద శాతం చెల్లిస్తున్నది వాస్తవం కాదా? కేవలం జగన్ చెల్లెలు, వైఎస్ బిడ్డ అనే ఏకైక అర్హతతో ఇక్కడకు సోనియా గాంధీ తెచ్చి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. రోజు రోజుకు అబద్ధాలతో షర్మిల మాటల దాడి చేస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలి. హోదా, విశాఖ స్టీల్‌పై మోదీ సభలోనే గళమెత్తిన జగన్ బీజేపీకి వైఎస్సార్సీపీ టూల్లా మారిందని, రాష్ట్రాన్ని అప్పజెప్పిందని షర్మిల చేసిన ఆరోపణలు అర్థరహితం. స్టీల్ ప్లాంట్ విషయం కేంద్రానికి సంబంధించింది. ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్‌ను నడిపేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం మేం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అప్పులను రీస్ట్రక్చర్ చేయడం, గనులు కేటాయించడం, అదనంగా ఉండే భూమిని అమ్మి ఆ సొమ్ముతో అప్పులను తగ్గించుకోవడం ద్వారా స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపించవచ్చని సూచిస్తూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ పరిశ్రమ వ్యాపారం కాదని, సెంటిమెంట్‌కు సంబంధించినదని కూడా చెప్పాం. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? ప్రధాని ఉన్న వేదికపైనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం జగన్ గళమెత్తారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఇంకేదైనా ఉందా? పోరాటం అంటే నిర్వచనం, స్వరూపం ఎలా ఉండాలో షర్మిలే చెప్పాలి. గంగవరం పోర్టుపై షర్మిల మాటలు సత్యదూరం. ఆ పోర్టులో మనకున్న వాటా బదులుగా వచ్చిన రూ.600 కోట్లను మరో మూడు పోర్టుల అభివృద్ధికి వినియోగిస్తున్నాం. గంగవరం పోర్టుపై మన హక్కును కోల్పోలేదు. లీజు తర్వాత మళ్లీ అది ప్రభుత్వానికే వస్తుంది. ఇది కాక కొంత రెవెన్యూ షేరింగ్ కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఒక పెద్ద సంస్థ వచ్చి ఆపరేషన్స్ చేస్తే రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇలానే చేస్తోంది. ఆమె ఇచ్చింది తలా తోక ఉన్న స్టేట్మెంటేనా? మణిపూర్‌పై అప్పుడెందుకు మాట్లాడలేదు? మణిపూర్ అంశం షర్మిలమ్మ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎందుకు పోరాడలేదు? ఇక్కడకు రాగానే బీజేపీ, మణిపూర్ అంటూ క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందనడంలో ఆంతర్యం తెలియడంలేదా? ఇదంతా ఆమె అనుకున్నది కాదు... చంద్రబాబు అనుకున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల ఓట్లు కోసం మాత్రమే ఆమెను తీసుకొచ్చారు. సంఖ్యా బలం లేకున్నా పోటీనా? శాసనసభలో సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీకి దక్కుతాయి. సంఖ్యా బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని దుర్మార్గమైన, వికృతమైన ఆలోచనలతో చంద్రబాబు నాటకం ఆడాలనుకుంటున్నారు. ఎన్నికలప్పుడు అభ్యర్థుల మార్పు సాధారణం. మరింత మెరుగైన ఫలితాల కోసమే మార్పులు చేస్తున్నాం. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలను ఎలా ఉపయోగించుకోవాలో మేం చూసుకుంటాం. దొంగతనంగా వారిని లాక్కోవాలని చంద్రబాబు ప్రయత్నించడం ప్రజాస్వామ్యమేనా? గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారం. భావోద్వేగంతో స్పందించిన మాటలపై చిల్లర రాజకీయమా? సీఎం జగన్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. ఏదీ ఆయన హక్కు అనుకోరు. చంద్రబాబు అధికారం ఆయన హక్కు అనుకుంటాడు. చంద్రబాబు ఎప్పుడూ బాధ్యతతో అధికారంలోకి రాలేదు. అందుకే ఆయన అధికారంలోకి రాగానే.. మరో 50 ఏళ్ల తర్వాత ఏం చేస్తాడో ఇప్పుడే చెబుతుంటాడు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. ఆ స్పృహ జగన్‌కు ఉంది. ఎప్పుడైనా ప్రజలే నిర్ణేతలని గట్టిగా నమ్ముతారు. ఐదేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్లి దీవెనలు కోరాలని భావిస్తారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘మీకిది సంతృప్తినిస్తోందా’ అని అడిగితే.. దానికి భావోద్వేగంతో జగన్ స్పందించారు. నాలుగున్నరేళ్ల తన పాలనలో ఇన్ని కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించి.. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు నింపినందుకు జన్మ ధన్యమైందని చెబుతూ.. ఒకవేళ తప్పుకోవాలన్నా పూర్తి సంతృప్తితో చేస్తాను అన్నారు. ఎవరైనా ఇలా అనగలరా? మహా స్థితప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. ఇప్పటికీ 75 ఏళ్ల వయసులోనూ ఎలా ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకోవాలని అనుకునే చంద్రబాబు అయితే ఈ మాట అనలేడు. ఈ రాష్ట్రానికి ఏమి చేయగలిగాడో చెప్పుకోవడానికి జగన్‌కు చాలా ఉంది. ఆ తృప్తినే ఆయన వ్యక్తీకరించారు. దానికి ఓ చిల్లర భావాన్ని ఇచ్చి ఎల్లో మీడియా సంతోషిస్తే ఏం చేయలేం. -
బాబు స్క్రిప్టు.. షర్మిల రిపీట్
సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు... అవి అబద్ధాలని అందరికీ తెలిసిపోతుండటంతో తన స్క్రిప్టును చదవటానికి ఇతరులను ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించేసిన బాబు... ఇపుడు పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిలను ప్రవేశపెట్టి, తన స్క్రిప్టును ఆమెచేత కూడా వల్లె వేయిస్తున్నారు. అందుకేనేమో... గంగవరం పోర్టుపై కనీస అవగాహన కూడా లేనట్లుగా ఆమె చంద్రబాబు చేసిన ఆరోపణలనే రిపీట్ చేశారు. రూ.70,000కోట్ల విలువైన గంగవరం పోర్టును అదానీ గ్రూపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లకు అమ్మేసిందంటూ ఆమె బుధవారం విశాఖలో మాట్లాడారు. అసలు ఆ పోర్టు విలువ ఆమె చెప్పిన దాన్లో 10 శాతం కూడా లేదని... అందులోనూ ఆ పోర్టులో 89.6 శాతం వాటా ప్రయివేటు వారిదని, దాన్ని అదానీ కొనుగోలు చేసిందని... అది ఇద్దరి మధ్య జరిగిన ప్రయివేటు డీల్ అనే వాస్తవాన్ని మాత్రం చెప్పలేదు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేసిన గంగవరం పోర్టులో 89.6 శాతం వాటా ప్రమోటర్ డీవీఎస్ రాజు, ఆయనకు పెట్టుబడులు సమకూర్చిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీది. మరి అలాంటి పోర్టును రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లకు ఎలా విక్రయిస్తుంది? రాష్ట్రం విక్రయించగలిగేది తన చేతిలో ఉన్న 10 శాతం వాటానే కదా? వాస్తవానికి డీవీఎస్ రాజు గ్రూపు–అదానీ గ్రూపు ఆ పోర్టు విలువను ఆర్థిక సంస్థల చేత మదింపు చేయించగా రూ.6,200 కోట్లుగా లెక్కగట్టాయి. దీంతో అదే ధరకు డీవీఎస్ రాజు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలకున్న వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. మరి ఈ షర్మిల చెప్పిన రూ.70వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? వాస్తవానికి అవి చంద్రబాబు స్క్రిప్టులో నుంచి వచ్చాయి. గతంలో బాబు కూడా అది రూ.70వేల కోట్ల విలువైన పోర్టు అని... దాన్ని ప్రభుత్వం రూ.600 కోట్లకే విక్రయించేసిందని పచ్చి అబద్ధాలతో ప్రభుత్వంపై బురదజల్లారు. కానీ ప్రభుత్వం వాస్తవాలను వివరిస్తూ గట్టిగా స్పందించటంతో... ఇప్పుడు అదే బురదను షర్మిల ద్వారా చల్లిస్తున్నారు. నిజానికి ప్రభుత్వానిది ఈ పోర్టులో 10.4 శాతం వాటా మాత్రమే. అయితే పోర్టు విస్తరణకు వీలుగా ఆ వాటా విక్రయించాలని కొనుగోలుదారు అభ్యర్థించటంతో ప్రభుత్వం నిపుణులు సూచించిన ధరకన్నా రూ.20 కోట్లు అధికంగానే... అంటే రూ.644.45 కోట్లకు దీన్ని విక్రయించింది. పైపెచ్చు ఆ నిధులతో ఇపుడు మరో మూడు కొత్త పోర్టులను ప్రభుత్వమే సొంతంగా అభివృద్ధి చేస్తోంది. ఇక డీవీఎస్ రాజు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వార్బర్గ్ పింకస్ చేతి నుంచి అదానీ గ్రూపు చేతికి మారింది పోర్టు నిర్వహణ మాత్రమే. ప్రభుత్వంతో గతంలో కుదిరిన లీజు ఒప్పందంలో ఎలాంటి మార్పులూ లేవు. మరి భూములతో సహా విక్రయించేసినట్లు మాట్లాడటం షర్మిల అవగాహన రాహిత్యానికి నిదర్శనం కాదా?. కొత్త పోర్టుల నిర్మాణానికి నిధులు అదానీ గ్రూపు ప్రతిపాదనను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్ 4న కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేసింది. విలువ మదింపు కోసం సెబీ గుర్తింపు పొందిన కేపీఎంజీ, న్యాయ సలహాల కోసం జేఎస్ఏ అసోసియేట్స్, ఒప్పందంలో పాటించాల్సిన సలహాల కోసం గ్రాంట్ థార్న్టన్లకు బాధ్యతలను ఈ కమిటీ అప్పగించింది. వారు గంగవరం పోర్టు షేరు ధరను రూ.115గా లెక్కించారు. రూ.5 అదనంగా చెల్లిస్తుండటంతో ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజే సలహా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్లింది. తన 10.4 శాతం వాటాను రూ.644.45 కోట్లకు విక్రయించింది. ఈ మొత్తాన్ని కొత్తగా చేపట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులకు ప్రభుత్వం వినియోగిస్తోంది. పోర్టు విలువ రూ.6,200 కోట్లుగా మదింపు పీపీపీ విధానంలో ప్రమోటరు డీవీఎస్ రాజు గంగవరం పోర్టు లిమిటెడ్ పేరుతో ఈ పోర్టును అభివృద్ధి చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 1,800 ఎకరాల భూమి విలువ రూ.54 కోట్లుగా లెక్కించి పోర్టులో 10.4 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన వాటాలో ప్రధాన ప్రమోటరు డీవీఎస్ రాజు చేతిలో 58.1 శాతం, పోర్టు నిర్మాణానికి నిధులు సమకూర్చిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్మెంట్ (వార్బర్గ్ పింకస్) పేర 31.5 శాతం ఉన్నాయి. పోర్టు విలువను రూ.6,200 కోట్లుగా మదింపు చేసి, ఆ మేరకు ప్రమోటర్ల నుంచి 89.6 శాతం వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అది ఆ ఇద్దరి మధ్య జరిగిన ప్రయివేటు ఒప్పందం. ఇక పోర్టు కొన్నాక అదానీ గ్రూపు కొత్తగా రెండు టెర్మినల్స్ అభివృద్ధి చేయడంతోపాటు లాజిస్టిక్ వంటి విభాగాల్లో భారీ విస్తరణ చేపట్టింది. కానీ దీన్లో ప్రభుత్వ వాటా 10.4 శాతం ఉండటం వల్ల ఇబ్బందులు రావటంతో ఆ వాటాను కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రమోటర్లకు చెల్లించిన విధంగానే షేరుకు రూ.120 చొప్పున చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఆస్తులు, భూములు తిరిగి ఇచ్చే విధంగా ఒప్పందం ఇక పోర్టులో వాటా విక్రయం తర్వాత రాయితీలకు సంబంధించి అదానీ గ్రూపుతో ఏపీ మారిటైమ్ బోర్డు స్పష్టమైన ఒప్పందం చేసుకుంది. 30 ఏళ్ల లీజు తర్వాత పోర్టు ఆస్తులు, భూములు తిరిగి ఇచ్చే నిబంధనను అందులో పొందుపరిచింది. ఒకవేళ లీజు గడువు పెంచుకోవాలంటే ప్రభుత్వ అనుమతితో 10 ఏళ్లు చొప్పున రెండు సార్లు పెంచుకునేందుకు అనుమతిస్తారు. ఇక పోర్టు వ్యాపారంలో 2.1 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించాలి. ఆ విధంగా పోర్టు నిర్వహణను ఆదానీ చేపట్టిన తర్వాత రెండేళ్లలో (2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో) రాయల్టీ, లీజు అద్దె రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.60.01 కోట్ల ఆదాయం సమకూరింది. త్వరలో కొత్తగా అభివృద్ధి చేసిన రెండు కార్గో టెర్మినల్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని, ఈ పోర్టుపై ప్రభుత్వం ఎలాంటి హక్కులను వదులుకోలేదని ఏపీ మారిటైమ్ బోర్డు స్పష్టం చేసింది. -
రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదు: సజ్జల
-
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారు: వైవీ సుబ్బారెడ్డి
-
ఏపీకి షర్మిల రాకపై మంత్రి రోజా సెటైర్లు
సాక్షి, తిరుపతి: ఏపీకి షర్మిల రాక.. మరొక నాన్‌లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టేనని.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కులేదని మంత్రి రోజా అన్నారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని, కాంగ్రెస్ పార్టీ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించిందని ఆమె ధ్వజమెత్తారు. స్విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వడమాల పేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంప్‌ను మంత్రి రోజా మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో 14వ సారి పింక్ బస్ క్యాంప్ నిర్వహించి మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటికి దీపం ఇల్లాలు.. ప్రతి ఇంట్లో మహిళ పింక్ బస్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో విద్య, వైద్యం, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. -
తప్పు చేసావ్ షర్మిల.... మహానేత కూతురుగా: వరుదు కల్యాణి
-
షర్మిల వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
-
వైఎస్సార్సీపీ లీడర్ మాస్ ర్యాగింగ్
-
YS Raja Reddy Engagement: షర్మిల తనయుడి నిశ్చితార్థంలో సీఎం జగన్ దంపతులు (ఫోటోలు)
-
షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం జగన్ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. గండిపేటలో నిశ్చితార్థం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో MS పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవ్వాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024. Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi — YS Sharmila (@realyssharmila) January 1, 2024 -
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా షర్మిల
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) మంగళవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన వెలువరించింది. తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది. (చదవండి : షర్మిల కాంగ్రెస్‌లో చేరడం చంద్రబాబు కుట్రే) వైఎస్సార్టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. తన పార్టీ YSRTPని జనవరి 4, 2024న కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా APCC చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం ఆ పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే షర్మిలను కాంగ్రెస్ పెద్దలు ఏపీసీసీ చీఫ్‌గా నియమించారు. I thank hon'ble @kharge ji , #SoniaGandhi ji , @RahulGandhi ji , and @kcvenugopalmp ji for trusting me with post of the president of @INC_Andhra Pradesh. I promise to work faithfully towards rebuilding the party to its past glory in the State of Andhra Pradesh with total… https://t.co/C6K8cQEz1F — YS Sharmila (@realyssharmila) January 16, 2024 ఇదీచదవండి.. రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం -
పూల కళాతోరణం షర్మిల నిలయం
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, షర్మిలా అగర్వాల్ ఇంట్లోకి అడుగుపెడితే మ్యూజియంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన రెండు గదుల గోడల నిండా ఆమె వేసిన చిత్రలేఖనాలు, ఆమె సేకరించిన అరుదైన కళారూపాలు ఉన్నాయి. సెంటర్ టేబుళ్లు, కార్నర్ స్టాండుల్లో ఇకేబానా (జపాన్ పుష్పాలంకరణ కళ) ఫ్లవర్ అరేంజ్మెంట్ అలరిస్తుంది. మరోవైపు ర్యాక్‌లలో ఆమె ఆవిష్కరించిన పుస్తకాల ప్రతులు కొలువుదీరి ఉన్నాయి. షర్మిలా అగర్వాల్ స్వయంగా రచయిత్రి, చిత్రకారిణి, ఇకేబానా పుష్పాలంకరణలో నిష్ణాతురాలు. ఈ మూడు కళలూ ఒకరిలో రాశిపోసి ఉండడంతో కావచ్చు ఆమె చిత్రాల్లో... ఆమె కవిత్వంలో కనిపించే భావుకత ద్యోతకమవుతుంది, అలాగే అదే చిత్రాల్లో ఆమె అలంకరించే ఇకేబానా కూడా కనిపిస్తుంది. రచయిత కావడంతో ఇకేబానా పుష్పాలంకరణను అక్షరబద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారామె. గడచిన గురువారం (నాలుగవ తేదీన) ‘ఇకేబానా సులభం’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు ప్రాక్టీస్ వర్క్‌బుక్స్ పోలిన పది పుస్తకాల సెట్‌ను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ ‘గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఈ పుస్తకాల సహాయంతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇకేబానా పుష్పాలంకరణ కళ ప్రతి తెలుగింటికీ చేరాలనేది నా కల. పుస్తకాన్ని ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనువుగా రూపొందించాను’ అన్నారామె. పువ్వు మాట్లాడుతుంది! ‘‘పూలు మన మనసుకు అద్దం పడతాయి. పుష్పాలంకరణ మన ఇంటికి వచ్చిన అతిథులకు మన మాటగా మౌనంగా స్వాగతం పలుకుతుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తాజా పువ్వు కనిపించాలి. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక నా వివరాలకు వస్తే... నేను పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో. రాసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. నా కవితలు స్థానిక హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పెయింటింగ్స్ కూడా ఇష్టంగా వేసేదాన్ని. ఇక చదువు కూడా అదే బాటలో సాగింది. లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు చేశాను. మీనియేచర్ పెయింటింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటాను. పెళ్లి తర్వాత హైదరాబాద్ రావడం నాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హైదరాబాద్ నగరం చిత్రకారిణిగా నాకు గుర్తింపునిచ్చింది. సోలో ఎగ్జిబిషన్లు పెట్టాను, వేరే ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. నా స్టూడియోలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రదేశాల ప్రత్యేకతలనూ చూడవచ్చు. హిందీలో చంద్ లమ్హే,, కహా అన్ కహా రాశాను. పెయింటింగ్ గురించి మెళకువలు నేర్పించడానికి ‘ఇన్నర్ రిఫ్లెక్షన్స్’ పేరుతో రచనను సిద్ధం చేస్తున్నాను. ఇకేబానా గురించి చెప్పాలంటే ఇది నిరంతరనం సాధన చేయాల్సిన కళ. ఈ ఆర్ట్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి జపాన్‌కి ఆరుసార్లు వెళ్లాను. గతంలో ‘ఇకేబానిస్ట్స్ అరౌండ్ ద వరల్డ్, ఇకేబానా ఫర్ బిగినర్స్, ఇకేబానా జపానీ పుష్పకళ’ ప్రచురించాను. ‘ఇకేబానా మనదేశానికి వచ్చి అరవై ఏళ్లు దాటింది. ముంబయికి చెందిన నిర్మలా లుక్మాణి 1961లో జపాన్‌కెళ్లి ఒహారా స్కూల్లో డిగ్రీ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే విద్యార్థులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు...’ వంటి చారిత్రక వివరాలందించాను. తెలుగు స్నేహితుల సహాయంతో ‘ఇకేబానా సులభం’ పుస్తకంలో... ఇకేబానా కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, స్వయంగా క్లాసులకు హాజరు కాలేని వాళ్లకు పూసగుచ్చినట్లు వివరించాను. ఫ్లవర్‌పాట్ కొలతలు, కొమ్మలు, పూల పరిమాణాలతో సహా కచ్చితంగా రేఖాచిత్రాలతో పుస్తకం రాశాను. జపాన్‌లో ఉపయోగించే పూలతో అలంకరణను చూపిస్తూనే మనకు లభించే పూలు, ఆకులతో అలంకరించడం కూడా ఫొటోలతో చూపించాను. ఫ్లవర్‌వాజ్‌లుగా ఉపయోగించే పాత్రలు, పిన్హోల్డర్లు, పూలు... ఎందులోనూ కృత్రిమత్వం ఉండదు. నురుగులాంటి వాటికి నిషేధం. శ్వాసకు హాని కలగరాదు, మట్టిలో కరిగే క్రమంలో నేలకు హాని కలిగించరాదు. ఇది నియమం. చిత్ర వైవిధ్య లేఖనం నేను పుట్టిపెరిగిన ఉత్తరాది జీవనశైలిని నా చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. అక్కడి జీవనశైలిలో టెర్రస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టం రెండూ తీవ్రంగా ఉంటాయి. వేసవిలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు డాబా మీద గడుపుతారు. శీతాకాలంలో మధ్యాహ్నపు ఎండ కోసం డాబా మీద ఉంటారు. దైనందిన జీవితంలో సగభాగం డాబా మీద గడుస్తుంది. కాబట్టి డాబా అన్ని ఏర్పాట్లతో ఉంటుంది. నా చిత్రాలు ఉత్తరాది జీవితాన్ని కళ్లకు కడతాయి. ఇకేబానా పరిణామక్రమం కూడా చిత్రాల్లో మిళితమై ఉంటుంది. ఈ కళ జపాన్ స్కూళ్ల నుంచి మన దేశానికి థియరిటికల్‌గా వచ్చి అరవై ఏళ్లు దాటినప్పటికీ సంపన్న, ఎగువ మధ్యతరగతి దగ్గరే ఆగి పోయింది. సామాన్యులకు చేరాలంటే నేను ఊరూరా స్కూళ్లను పెట్టలేను, కాబట్టి అక్షరం అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తెలుగు నేల నాకు చాలా ఇచ్చింది. తెలుగు నేలకు నేను తిరిగి ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ పుష్పాలంకరణ కళను తెలుగు రాష్ట్రాల్లో కుగ్రామాలకు కూడా చేర్చాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు షర్మిలా అగర్వాల్. ఈ పెయింటింగ్‌ను పరిశీలించండి. ఇందులో అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు, రికా (ఇకేబానాలో ఓ శైలి) పుష్పాలంకరణ ఒక భాగంలో కనిపిస్తాయి. మరొక భాగంలో అంతఃపుర స్త్రీలు పుష్పాలంకరణ చేస్తున్నారు, కిందవైపు సామాన్య మహిళలు ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో సంతోషిస్తున్నారు. జపాన్ నుంచి ఈ కళ బౌద్ధ భిక్షువుల ద్వారా ఇండియాకి వచ్చినప్పుడు రాజకుటుంబాల మహిళలకు చేరింది. ఆ తర్వాత సామాన్యులకు పరిచయమైంది. ఇది ప్రాచీన చారిత్రక నేపథ్యం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
షర్మిల కాంగ్రెస్‌లో చేరడం.. చంద్రబాబు కుట్రే : సజ్జల
సాక్షి, విజయవాడ: షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. "బ్రదర్ అనిల్‌పై గతంలో టీడీపీ నేతలు ఎలాంటి విమర్శలు చేశారో చూశాం.. ఇప్పుడు అదే బ్రదర్ అనిల్ పక్కన టీడీపీ నేతలు ఫొటోలు దిగుతున్నవి కూడా చూశాం.. దీన్ని బట్టి టిడిపి నేతల పన్నాగాన్ని అర్థం చేసుకోవచ్చాన్నారు" సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘వైఎస్సార్సీపీ ఆవిర్భవించిన తొలిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందుల నుంచి విజయమ్మకు పోటీగా బరిలోకి దింపింది. వైఎస్సార్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలున్నాయి. కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు అర్థం అయింది. అందుకే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను డైవర్ట్ చేయడానికే బాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన అంశాలు ఏంటంటే..: షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది షర్మిల రాజకీయంగా ఎక్కడనుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చు షర్మిల వల్ల YSRCPకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నష్టం ఏమీ ఉండదు షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారు సీఎం రమేష్‌కు సంబంధించిన సొంత విమానంలో షర్మిల, బ్రదర్ అనిల్ వెళ్లారు ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు (ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు కింద చూడవచ్చు) టీడీపీ నేత బీటెక్ రవిని... బ్రదర్ అనిల్ కలవడం ఇవన్నీ అందులో బాగమే అంతకు ముందు బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆ రోజు నుంచే అనుమానాలున్నాయి టీడీపీ, కాంగ్రెస్ కలిసే నాడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు మోపాయి కాంగ్రెస్ నేతగా, ముఖ్యమంత్రిగా ఉంటూ వైఎస్సార్ చనిపోయారు ఆయన చనిపోయాక.. పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు విజయమ్మకు పోటీగా పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ బరిలో దించింది YSRCP అభ్యర్థిగా విజయమ్మకు 70శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకాకు 20శాతం ఓట్లు కూడా రాలేదు కాంగ్రెస్ తో ఎప్పుటి నుంచో చంద్రబాబు కాంటాక్ట్ లో ఉంటున్నాడు చంద్రబాబు తనకేం కావాలో ఓ కుట్ర ప్రకారం మిగతా వాళ్లను కలుపుకుని అందరితో కలిసి చేయిస్తాడు సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుకు మైనస్ మార్కులు వస్తాయి అందుకే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు కాంగ్రెస్ పార్టీని మేము పట్టించుకోం, పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు ప్రజలా? కుటుంబమా? అనే ప్రశ్న వస్తే ముఖ్యమంత్రి YS జగన్ ఛాయిస్ ప్రజలే రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్లీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? కుటుంబం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YSRCPని పెట్టలేదు ఒక పార్టీగా మా విధానాలు మాకు ఉన్నాయి (ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, ఎడమ సోనియాతో, కుడి ఖర్గేతో షర్మిల) (ఇటీవల తెలుగుదేశం నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ) (ఇటీవల తెలుగుదేశం నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ) (బెంగళూరులో డీకే శివకుమార్‌తో చంద్రబాబు మంతనాలు) ఇదీ చదవండి: నారా దారి.. అడ్డదారి: పరాకాష్టకు కుట్రలు, కుతంత్రాలు -
కొత్త దారి రైతుబిడ్డ
‘ఇక వ్యవసాయం చేయవద్దు అనుకుంటాను. కాని చేయక తప్పేది కాదు. దీనివల్ల తలపై అప్పులు తప్ప నాకు జరిగిన మేలు లేదు. అయినా సరే భూమి నాకు అమ్మతో సమానం’ అన్నాడు మహారాష్ట్రలోని ఒక రైతు. ‘లాభనష్టాల సంగతి పక్కన పెడితే, ఒక్కరోజు పొలం వైపు వెళ్లక పోయినా నాకు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది’ అంటాడు రాజస్థాన్‌లోని ఒక రైతు. మన దేశంలో రైతుకు, భూమికి మధ్య ఆత్మీయ బంధం ఉంది. ఆ బంధాన్ని బలోపేతం చేయడానికి కెనడా నుంచి వచ్చిన షర్మిల జైన్ తన లక్ష్యసాధనలో విజయం సాధించింది... రైతుల ఆత్మహత్యలతో వ్యవసాయరంగం కల్లోలంగా ఉన్న కాలం అది. ఆ సమయంలో షర్మిలజైన్ కెనడాలో నివాసం ఉంది. స్వదేశంలో రైతుల ఆత్మహత్యల గురించి చదివిన తరువాత ఆమె మనసు మనసులో లేదు. ఎన్నో ఆలోచనలు తనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా?’ అని ఆమె ఆలోచించింది. ఆ సమయానికి కదిలిపోయి మరోరోజుకు మామూలై పోయే వ్యక్తి కాదు షర్మిల. కనిపించే సమస్య వెనకాల కనిపించని సమస్యలను అధ్యయనం చేయడానికి రంగంలోకి దిగింది. అంతేకాదు, రైతుల కోసం కెనడాను వదిలి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ‘నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసా? భావోద్వేగాలపై తీసుకునే నిర్ణయాలు బెడిసికొడతాయి. తీరిగ్గా ఆలోచించు. వెళ్లడం సులభమేకాని ఇక్కడికి మళ్లీ రావడం అంత సులభమేమీ కాదు’ అన్నారు సన్నిహితులు.బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పింది షర్మిల. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన షర్మిలకు రైతుజీవితం కొత్తేమీ కాదు. వారికి సంబంధించి తాను చిన్నప్పుడు విన్న సమస్యలే ఇప్పుడు కూడా వినాల్సి వస్తుంది. మరాఠీ మీడియం స్కూల్లో చదువుకున్న షర్మిల స్నేహితులలో చాలామంది రైతు బిడ్డలే. ఆ కుటుంబాల ఆర్థి«క కష్టాలతోపాటు గృహహింసకు సంబంధించిన విషయాలను తరచుగా వినేది. ఆ సమయంలోనే లాయర్ కావాలని అనుకుంది. కెనడా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన షర్మిల క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని ఎన్నో పల్లెలు తిరిగింది. ఇంటింటికి వెళ్లి రైతులతో మాట్లాడింది. వారితోపాటు పొలానికి వెళ్లింది. ‘ఇలా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి రాసుకోవడం, తరువాత కనిపించకపోవడం మామూలే. అయితే షర్మిలజీ కళ్లలో నిజాయితీ కనిపించింది. ఆమె మా కోసం ఏదో చేయగలదు అనే ఆశ కలిగింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు చౌహాన్ అనే రైతు. వ్యవసాయ సంబంధిత అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి... ఇంగ్లాండ్‌లో ఎన్విరాన్మెంటల్ లా, అగ్రికల్చరల్ లా లో మాస్టర్స్ చేసింది షర్మిల. రెండు సంవత్సరాల కాలంలో ఎంతోమంది రైతులతో, వ్యవసాయరంగ నిపుణులతో మాట్లాడిన తరువాత ‘గ్రీన్ ఎనర్జీ ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. చెరువులను పునరుద్ధరించడం, నవీన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయడం, చిరుధాన్యాలు పండించడంపై అవగాహన కలిగించడం... మొదలైనవి ఈ ఫౌండేషన్ లక్ష్యాలు. తొలిసారిగా మహారాష్ట్రలోని బుచ్కెవాడి గ్రామంలో నాబార్డ్ గ్రాంట్‌తో వాటర్ మేనేజ్మెంట్ ప్రోగాం చేపట్టారు. నిరంతరం నీటిఎద్దడితో సతమతం అవుతున్న ఆ గ్రామం వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా బాగు పడింది. వేసవి సమయంలోనూ నీటి కష్టాలు రాని పరిస్థితి వచ్చింది. రాజస్థాన్‌లోని దుంగర్పుర్ గ్రామంలోని రైతులకు నీటి అవసరం ఎక్కువగా లేని పంటల గురించి అవగాహన కలిగించారు. ‘గ్రీన్ ఎనర్జీ మా ఊరిలో అడుగు పెట్టకపోతే వ్యవసాయానికి శాశ్వతంగా దూరం అయ్యేవాళ్లం. గ్రీన్ఎనర్జీ కార్యక్రమాల ద్వారా అనేక రకాలుగా లబ్ధిపొందాం. ఇప్పుడు కూరగాయలు కూడా పండిస్తున్నాం. గతంలో పంటలు పండనప్పుడు నా భర్త కూలిపనుల కోసం పట్నం వెళ్లేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు’ అంటుంది దీప్తి అనే మహిళా రైతు. షర్మిల తన తండ్రి నుంచి రెండు విలువైన మాటలు విన్నది. ఒకటి... చిరుధాన్యాల ప్రాముఖ్యత. రెండు... కార్పోరేట్ కంపెనీల సామాజిక బాధ్యత. ఇప్పుడు బాగా వినిపిస్తున్న సీఎస్ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఆరోజుల్లోనే విన్నది షర్మిల. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల కోసం, చిరుధాన్యాలను పండించే రైతులకు సహాయపడడానికి ‘గుడ్ మామ్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది షర్మిల జైన్. ‘గుడ్ మామ్’ ద్వారా మిల్లెట్ నూడుల్స్ నుంచి హెర్బ్ స్టిక్స్ వరకు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాలపై ఆసక్తి వేలం వెర్రిగా మారకుండా, దాన్ని ఇతరులు సొమ్ము చేసుకోకుండా ఉండడానికి ‘గుడ్ మామ్’ ద్వారా ‘ఏది అబద్ధం?’ ‘ఏది నిజం’ అంటూ అవగాహన కలిగిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అయిదు రాష్ట్రాలలో వేలాదిమంది రైతులకు వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, కెపాసిటీ–బిల్డింగ్ ప్రోగామ్స్ ద్వారా సహాయపడుతున్నాం. చిరుధాన్యాలు, కూరగాయలు పండించడంపై అవగాహన కలిగిస్తున్నాం. చిరుధాన్యాలు అనే పేరు పెద్దగా వినిపించని కాలంలోనే వాటి ప్రాముఖ్యత గురించి ప్రచారం చేశాం. – షర్మిల జైన్ -
అసలైన అవకాశవాదులు మీరే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జీవనాడిని కలుషితం చేసిన మీరే అసలైన అవకాశవాదులని.. మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దొంగే.. దొంగా దొంగా.. అన్నట్లుంది మంత్రి కేటీఆర్ వైఖరని పేర్కొన్నారు. విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టాలని చెప్పే దొర.. కుటిల యత్నా లతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అసలైన శక్తులు మీరే కదా?.. అని దుయ్యబట్టారు. రాష్ట్రం నెత్తిన అప్పులు మోపి రూ.లక్ష కోట్లు కాజేయడమే కాకుండా.. 9 ఏళ్లలో 8 వేల మంది రైతులను, ఉద్యోగాలు అని చెప్పి వందల మంది నిరుద్యోగు లను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. -
కోకాపేట భూముల్ని కారుచవకగా కొల్లగొట్టిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ రాయించుకున్న కోకాపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.1100 కోట్లను చెల్లించాలని గురువారం ట్విట్టర్ వేదికగా కోరారు. జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాల యాల పేరిట రూ.వెయ్యి కోట్ల విలువైన 33.72 ఎక రాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశా రని ఆరోపించారు. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో బీఆర్ఎస్ భవనం కోసంరూ.3.41 కోట్లకే 11 ఎకరాలు దోచేశారని పేర్కొన్నారు.