కడప పార్లమెంట్‌లో డిపాజిట్ దక్కడం గగనమే
పాత కాంగ్రెస్ నేతలను పట్టించుకోని వైనం
ఎన్నికలప్పుడే కన్పించని చేరికలు
అధ్యక్షురాలిగా పార్టీ పటిష్టతకు కృషి చేయలేదని అప్పుడే మొదలైన అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంట్‌కు పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాక తప్పదు. పోల్‌మేనేజ్‌మెంట్‌లో ఎవరికి తీసిపోదు. త్రిముఖ పోటీలో గెలుపు అంచుల వరకు వస్తుంది.’’ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. ఇప్పుడామెకు డిపాజిట్ దక్కే అవకాశం లేదని సెఫాలజిట్లు చెబుతున్నారు. కడప పార్లమెంట్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్ల ల్లో కూడా డిపాజిట్టు గగనమే. దీంతో షర్మిల చరి్మషా ప్రశ్నార్థకం కానుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల, ఓ సందర్భంలో ‘ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. నాజీవితం ఇక్కడే ముడిపడి ఉంది, చావైనా, బతుకైనా ఇక్కడేనని’ చెప్పుకొచ్చింది. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. స్పీడ్‌గా అన్ని జిల్లాలను చుట్టేసిన ఆమె తుదకు కడప పార్లమెంట్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా బరిలో నిల్చింది. సేమ్ డైలాగ్ ఇక్కడ కూడా వర్తింప జేసింది. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీ ఆడబిడ్డను ఆదరించండి, మీకోసం తుది వరకు అండగా నిలుస్తానంటూ కోరారు.
అంతవరకు బాగానే ఉన్నా, ఆపై అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన అస్త్రంగా చూపి ఓట్లు అభ్యర్థించడం ఆరంభించింది. ఎప్పుడు తిరగని, చూడని గ్రామాలకెళ్లినా పట్టణాలకెళ్లినా పనిగట్టుకొని అమె విమర్శలు గుప్పించింది. మరోవైపు పులివెందుల ప్రాంతలో సెంటిమెంట్ అ్రస్తాన్ని సైతం ప్రయోగించి, కొంగు చాచి ఓట్లు అడిగింది. ఇంతచేసినా సెఫాలజిట్లు షర్మిలకు కడప పార్లమెంట్‌లో డిపాజిట్ దక్కదని స్పష్టం చేశారు. మంగళవారం వెలువడే ఎన్నికల ఫలితాల్లో అదే రుజువవుతుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
తులసిరెడ్డికి చేదు అనుభవం
కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల తొలివిడత ప్రచారంలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెన్నంటే ఉన్నారు. జిల్లా వాసులకు పరిచయం చేస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. రెండోవిడత ప్రచారంలో తులసిరెడ్డి ఎక్కడా లేరు. వాగ్దాటి పటిమ ఉన్న తులసిరెడ్డిని కావాలనే దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈమారు షర్మిల పర్యటన కనీస సమాచారం కూడా ఇవ్వకుండా చేపట్టినట్లు సమాచారం. క్రియాశీలక మైనార్టీ నాయకుడు సత్తార్ పరిస్థితి కూడా అంతే. వీరంతా షర్మిల కంటే ముందు కాంగ్రెస్ గళాన్ని జిల్లాలో విన్పించిన నాయకులు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహార శైలితో పక్షం రోజుల వ్యవధిలో అంటీముట్టనట్లు ఉండిపోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎన్నికల సందర్భంలో పార్టీ ఇమేజ్ పెంచుకోకపోగా, ఉన్న వారిని కూడా చేజార్చుకున్న పరిస్థితి ఉతప్పన్నమైందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
అభ్యర్థుల ఖర్చులు సైతం....
షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ముందుకు వచ్చారు. కారణం ఎన్నికల, పోలింగ్ బూత్ ఖర్చులు అమె భరిస్తుందని భావించారు. పోటీ చేసినా ఆయా అభ్యర్థులు కూడా చేదు అనుభవం చవిచూశారు. కడపలో పోలింగ్ బూత్ ఖర్చుల విషయమై ఏజెంట్లుగా నిలుచున్న పలువురు ఆ తర్వాత కూడా అభ్యర్థి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన నేపథ్యంలో గణనీయమైన ఓట్లు సాధించి డిపాజిట్టు దక్కించుకుంటేనే షర్మిలకు పారీ్టలో కనీస గౌరవం ఉంటుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
కాంగ్రెస్‌వాదులకు దక్కని మర్యాద...
ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొర విని్పంచుకోగా, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలకి ఏపీలో గడ్డుపరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులకు మర్యాద దక్కలేదు. అందులో భాగంగా పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నజీర్ అహమ్మద్ షరి్మల బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ఆ పారీ్టకి దూరమయ్యారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించి తర్వాత తెలంగాణకు చెందిన ఎస్కే బాషిద్‌ను ప్రకటించారు.
మనస్థాపం చెందిన ఆయన కాంగ్రెస్ పారీ్టకి దూరమయ్యారు. హైదరాబాద్‌లో స్థిర పడిన బాషిద్ ఎంపిక వెనుక షరి్మల సన్నిహితుల సిఫార్సులేనని స్పష్టమవుతోంది. అలాగే కడప నగరానికి చెందిన జక్కరయ్య పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసిన సందర్భంలో సైతం ఆ పార్టీ జెండాను జక్కరయ్య వీడలేదు. కడప అభ్యరి్థత్వం రాత్రికి రాత్రే మార్పు చేశారు. జిల్లాలో క్రియాశీలక టీడీపీ నాయకుడితో కుదిరిన రహస్య ఒప్పందం మేరకు వైఎస్సార్‌సీపీ నేతగా ఉన్న అఫ్జల్‌ఖాన్‌ను తెరపైకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment