Kadapa Parliament
-
Sharmila పొలిటికల్ ఫ్యూచర్?
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంట్‌కు పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాక తప్పదు. పోల్మేనేజ్మెంట్లో ఎవరికి తీసిపోదు. త్రిముఖ పోటీలో గెలుపు అంచుల వరకు వస్తుంది.’’ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. ఇప్పుడామెకు డిపాజిట్ దక్కే అవకాశం లేదని సెఫాలజిట్లు చెబుతున్నారు. కడప పార్లమెంట్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్ల ల్లో కూడా డిపాజిట్టు గగనమే. దీంతో షర్మిల చరి్మషా ప్రశ్నార్థకం కానుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల, ఓ సందర్భంలో ‘ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. నాజీవితం ఇక్కడే ముడిపడి ఉంది, చావైనా, బతుకైనా ఇక్కడేనని’ చెప్పుకొచ్చింది. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. స్పీడ్‌గా అన్ని జిల్లాలను చుట్టేసిన ఆమె తుదకు కడప పార్లమెంట్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా బరిలో నిల్చింది. సేమ్ డైలాగ్ ఇక్కడ కూడా వర్తింప జేసింది. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీ ఆడబిడ్డను ఆదరించండి, మీకోసం తుది వరకు అండగా నిలుస్తానంటూ కోరారు. అంతవరకు బాగానే ఉన్నా, ఆపై అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన అస్త్రంగా చూపి ఓట్లు అభ్యర్థించడం ఆరంభించింది. ఎప్పుడు తిరగని, చూడని గ్రామాలకెళ్లినా పట్టణాలకెళ్లినా పనిగట్టుకొని అమె విమర్శలు గుప్పించింది. మరోవైపు పులివెందుల ప్రాంతలో సెంటిమెంట్ అ్రస్తాన్ని సైతం ప్రయోగించి, కొంగు చాచి ఓట్లు అడిగింది. ఇంతచేసినా సెఫాలజిట్లు షర్మిలకు కడప పార్లమెంట్లో డిపాజిట్ దక్కదని స్పష్టం చేశారు. మంగళవారం వెలువడే ఎన్నికల ఫలితాల్లో అదే రుజువవుతుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. తులసిరెడ్డికి చేదు అనుభవంకడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల తొలివిడత ప్రచారంలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెన్నంటే ఉన్నారు. జిల్లా వాసులకు పరిచయం చేస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. రెండోవిడత ప్రచారంలో తులసిరెడ్డి ఎక్కడా లేరు. వాగ్దాటి పటిమ ఉన్న తులసిరెడ్డిని కావాలనే దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈమారు షర్మిల పర్యటన కనీస సమాచారం కూడా ఇవ్వకుండా చేపట్టినట్లు సమాచారం. క్రియాశీలక మైనార్టీ నాయకుడు సత్తార్ పరిస్థితి కూడా అంతే. వీరంతా షర్మిల కంటే ముందు కాంగ్రెస్ గళాన్ని జిల్లాలో విన్పించిన నాయకులు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహార శైలితో పక్షం రోజుల వ్యవధిలో అంటీముట్టనట్లు ఉండిపోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎన్నికల సందర్భంలో పార్టీ ఇమేజ్ పెంచుకోకపోగా, ఉన్న వారిని కూడా చేజార్చుకున్న పరిస్థితి ఉతప్పన్నమైందని విశ్లేషకులు వివరిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చులు సైతం.... షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ముందుకు వచ్చారు. కారణం ఎన్నికల, పోలింగ్ బూత్ ఖర్చులు అమె భరిస్తుందని భావించారు. పోటీ చేసినా ఆయా అభ్యర్థులు కూడా చేదు అనుభవం చవిచూశారు. కడపలో పోలింగ్ బూత్ ఖర్చుల విషయమై ఏజెంట్లుగా నిలుచున్న పలువురు ఆ తర్వాత కూడా అభ్యర్థి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన నేపథ్యంలో గణనీయమైన ఓట్లు సాధించి డిపాజిట్టు దక్కించుకుంటేనే షర్మిలకు పారీ్టలో కనీస గౌరవం ఉంటుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.కాంగ్రెస్‌వాదులకు దక్కని మర్యాద... ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొర విని్పంచుకోగా, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలకి ఏపీలో గడ్డుపరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులకు మర్యాద దక్కలేదు. అందులో భాగంగా పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నజీర్ అహమ్మద్ షరి్మల బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ఆ పారీ్టకి దూరమయ్యారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించి తర్వాత తెలంగాణకు చెందిన ఎస్కే బాషిద్ను ప్రకటించారు. మనస్థాపం చెందిన ఆయన కాంగ్రెస్ పారీ్టకి దూరమయ్యారు. హైదరాబాద్‌లో స్థిర పడిన బాషిద్ ఎంపిక వెనుక షరి్మల సన్నిహితుల సిఫార్సులేనని స్పష్టమవుతోంది. అలాగే కడప నగరానికి చెందిన జక్కరయ్య పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసిన సందర్భంలో సైతం ఆ పార్టీ జెండాను జక్కరయ్య వీడలేదు. కడప అభ్యరి్థత్వం రాత్రికి రాత్రే మార్పు చేశారు. జిల్లాలో క్రియాశీలక టీడీపీ నాయకుడితో కుదిరిన రహస్య ఒప్పందం మేరకు వైఎస్సార్సీపీ నేతగా ఉన్న అఫ్జల్‌ఖాన్‌ను తెరపైకి తెచ్చారు. -
షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన అవినాష్‌రెడ్డి
వైఎస్ఆర్, సాక్షి: కడప లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన. ‘‘నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. .. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా!’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు. -
నాడు తండ్రి.. నేడు తనయుడికి ‘ఆది’పోటు
సాక్షి ప్రతినిధి, కడప: కడప పార్లమెంట్ బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ నానా హైరానా పడింది. అభ్యర్థి ఎంపికకు పలు రకాలుగా కసరత్తు చేసింది. క్రమం తప్పకుండా ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వేలు నిర్వహిస్తూ రోజుకొక పేరు తెరపైకి తెచ్చింది.ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుయుక్తుల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే, ఓటమి ఎదుర్కోవాల్సిన సీటుకు భూపేష్‌ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు సమాచారం. ►మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన తర్వాత చివరలో ఆ ఫలితం తన ఖాతాలో వేసుకోవడం ఆదికి అలవాటుగా మారిపోయింది. ఈమారు టీడీపీ అధినేత చంద్రబాబుపై నారాయణరెడ్డి కుటుంబం పెట్టుకున్న ఆశలు సైతం నీరుగారిపోయాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని అటు తండ్రి చంద్రబాబు, ఇటు తనయుడు లోకేష్ భూపేష్‌రెడ్డిని ఊరించారు. తుదకు జమ్మలమడుగు సీటు బీజేపీకి కేటాయించి రాజకీయ సంకటస్థితిలోకి నెట్టారు. హితులు, సన్నిహితుల సూచనల మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు భూపేష్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా పసిగట్టిన ఆది అండ్‌కో పార్లమెంట్ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే దిశగా... టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన తమకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించిన భూపేష్‌రెడ్డి ఇప్పుడు జమ్మలమడుగు టికెట్‌ను బీజేపీకి కేటాయించడం పట్ల డైలమాలో పడ్డారు. ఆదినారాయణరెడ్డి బీజేపీ కార్యాలయం జమ్మలమడుగులో ప్రారంభించి, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగా టీడీపీ టికెట్ భూపేష్‌కు దక్కకుండా పథక రచన చేసి సక్సెస్ అయ్యారు. ఈదశలో అటు కుటుంబ సభ్యులు ఇటు భూపేష్ మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలనే ఒత్తిడి తెచ్చారు. ఆమేరకు భూపేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నహాలు చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితు ల్లో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్‌ను ప్రకటించేలా ఆది తెరవెనుక మంత్రాంగం చేపట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆమేరకు టీడీపీ అధిష్టానం భూపేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం విశేషం. జమ్మలమడుగులో అడుగుపెట్టని ఆది... బీజేపీ అభ్యర్థిగా నాలుగు రోజుల క్రితం ఆదినారాయణరెడ్డిని ప్రకటించినా ఇప్పటికీ జమ్మలమడుగులో అడుగుపెట్టలేదు. అందుకు కారణం దేవగుడి కుటుంబం నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండటమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ టికెట్ భూపేష్‌కు దక్కదని, బీజేపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని చెప్పి, ఆమేరకు సక్సెస్ అయినా ఆది కుయుక్తులను దేవగుడి కుటుంబం పసిగట్టింది. నారాయణరెడ్డి కుటుంబానికి అప్పుడు, ఇప్పుడు ఆదినారాయణరెడ్డి రాజకీయ వెన్నుపోటు పొడిచారని గ్రహించి కుటుంబం అంతా భూపేష్‌కు అండగా నిలిచింది. ఈపరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిగా ఎంపికై నా స్వగ్రామంలో కాలు పెట్టలేని దుస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఏది ఏమైనా కడప పార్లమెంటు బలిపీఠంపై భూపేష్‌ను బలవంతంగా ఎక్కించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. భూపేష్ది అదే పరిస్థితి.. ఆదినారాయణరెడ్డి తమ రాజకీయ వారసుడు భూపేష్‌రెడ్డి అంటూ 2009 ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. 2014లో భూపేష్ తెరపైకి వస్తారని భావించినా, ఆదినారాయణరెడ్డి తిరిగి వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నారాయణరెడ్డి కుటుంబానికి రాజకీయ వెన్నుపోటు పొడిచినట్లే, తర్వాత వైఎస్సార్సీపీ కూడా వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆపై మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అప్పటినుంచి స్థానికంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారు. టీడీపీ అధికారం కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో బీజేపీ కండువా వేసుకున్నారు. వర్గ రాజకీయాలకు నిలయమైన జమ్మలమడుగులో క్యాడర్‌ను కాపాడుకోవాలని నారాయణరెడ్డి తన కుమారుడు భూపేష్‌రెడ్డితో కలిసి టీడీపీలో యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు నారాయణరెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. భూపేష్ రాజకీయ ఎదుగుదలకు దేవగుడి కుటుంబం (ఆదినారాయణరెడ్డి మినహా) పని చేస్తూ వచ్చింది. ప్రస్తుతం టీడీపీ టికెట్ లభిస్తుందని భావించారు. అనూహ్యంగా ఆ స్థానంలోకి ఆదినారాయణరెడ్డి వచ్చి చేరిపోయారు. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించేలా మంత్రాంగం నిర్వహించారు. తాము కష్టపడి క్యాడర్‌ను తయారు చేసుకుంటే చివర్లో వచ్చి కోడిపిల్లను గద్ద ఎత్తుకెళ్లినట్లు ఎమ్మెల్యే సీటును ఆదినారాయణరెడ్డి దక్కించుకున్నారనే ఆవేదన భూపేష్‌లో ఉండిపోయింది. నాడు తండ్రి సీటును బ్లాక్మెయిల్ రాజకీయాల ద్వారా చేజేక్కించుకున్న ఆది, రాజకీయ మంత్రాంగంతో నేడు తనయుడి సీటును దక్కించుకుని ‘ఆది’పోటుకు గురయ్యారు. -
మరో యాత్రకు సిద్ధం.. నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మోసాలను ఎండగడుతూ.. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకూ సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకమవుతారు. యాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ప్రతి ఇంటికీ మేలు చేసిన అంశాన్ని సీఎం జగన్ యాత్రలో వివరించనున్నారు. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు గుర్తు చేయనున్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, ఆడపిల్ల పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామని, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు పూర్తిగా మాఫీ.. లాంటి 650కిపైగా వాగ్దానాలు గుప్పించి పది శాతం కూడా అమలు చేయకుండా వంచించిన వైనాన్ని సీఎం జగన్ ఎండగట్టనున్నారు. నాడు మోసం చేసిన కూటమితోనే జట్టు కట్టి చంద్రబాబు మళ్లీ వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ చేసిన మంచిని ప్రతి ఇంటికి వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని ఈ రెండు కార్యక్రమాలు ప్రతిబింబించాయి. గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేయడం కచ్చితంగా సాధ్యమేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహించారు. భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (ఉత్తర కోస్తా)లలో నిర్వహించిన నాలుగు సభలకు జనం కడలితో పోటీపడుతూ పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని సిద్ధం సభలతో తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. జనసేన–బీజేపీతో టీడీపీ జతకట్టినా... సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని, వైఎస్సార్సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మాట్రిజ్ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. కూటమి అష్టకష్టాలు.. వైఎస్సార్సీపీని ప్రజాక్షేత్రంలో ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని బెంబేలెత్తిన చంద్రబాబు ఉనికి కోసం జనసేన అధ్యక్షుడుతో జట్టు కట్టారు. టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో 2 పార్టీలూ నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి ఆ పార్టీతో జత కలిశారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరాక ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు జనం కదలిరాలేదు. ఆ సభా పేలవంగా సాగడంతో మూడు పార్టీలదీ అవకాశవాద పొత్తులని ప్రజలు తేల్చి చెప్పినట్లయింది. పొత్తు కుదిరినా ఇప్పటికీ మూడు పార్టీలు తమ అభ్యర్థులను పూరిగా ప్రకటించలేని స్థితి నెలకొంది. మరింత పెరిగిన విశ్వసనీయత.. ఎన్నికల్లో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్న సీఎం జగన్ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. గత 58 నెలల్లో నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా వివక్ష, లంచాలకు తావులేకుండా 87 శాతం కుటుంబాల ప్రజలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ)తో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను ఖాతాల్లోకి జమ చేశారు. నాన్ డీబీటీతో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు తార్కాణం. విప్లవాత్మక సంస్కరణల ద్వారా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి పథంలో నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. హామీలన్నీ అమలు చేయడం, సుపరిపాలన అందిస్తుండటంతో జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింతగా పెరిగింది. తొలి రోజు యాత్ర ఇలా.. ► సీఎం జగన్ బుధవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ► మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ► ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ► అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. -
5లక్షల ఓట్లతో అధికారం మిస్ అయ్యాం..
సాక్షి, హైదరాబాద్ : 2014 ఎన్నికల్లో అయిదు లక్షల ఓట్లతో అధికారం చేజారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ‘కడప పార్లమెంట్వాసుల ఆత్మీయ’ సమావేశానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీని సమర్థవంతంగా నడిపిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. అడ్డదారులు తప్ప రహదారి తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఓటుకు రూ.5వేలు నుంచి రూ.10వేలు ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారని సజ్జల ఆరోపించారు. ఓ వైపు దొంగ ఓట్లు ఎలా వేయించాలా అని కుట్ర పన్నుతున్న ఆయన, మరోవైపు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు చర్యలకు దిగారని విమర్శించారు. ఓటర్లను ప్రలోభపెట్టి గట్టెక్కాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల మండిపడ్డారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ సమయంలో అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సజ్జల కోరారు. నగరంలో స్థిరపడ్డ వైఎస్సార్ అభిమానులు, మేధావులు, విద్యావంతులు తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడాలని ఆయన సూచించారు. -
జగనాభిమానం
ఎప్పటిలాగే జిల్లా జనం వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ జగన్‌పై అభిమానం చూపారు. సీమాంధ్రలోని 13జిల్లాలలో ఎక్కడా లేని విధంగా 10 అసెంబ్లీ స్థానాల్లో 9 మందిఎమ్మెల్యేలను తిరుగులేని మెజార్టీతో గెలిపించి..వైఎస్ కుటుంబంపై తమది చెరగని ప్రేమ అని చాటిచెప్పారు. వైఎస్సార్సీపీ గెలుపుతో ఆపార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడంతో ఢీలాపడ్డారు. ప్రజలతీర్పును శిరసావహించి, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని విజయానంతరం ప్రకటించారు. కార్యకర్తలకు కష్టనష్టాల్లోఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. సాక్షి, కడప: సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ శుక్రవారం నిర్వహించారు. కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కడప పార్లమెంట్ పరిధిలోని అన్నిస్థానాలు వైఎస్సార్సీపీకి క్లీన్‌స్వీప్ అయ్యాయి. రాజంపేట పార్లమెంట్‌లోని రాజంపేట స్థానంలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. తక్కిన రాయచోటి, రైల్వేకోడూరు స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పదేళ్లపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో ఒక్కస్థానంలో కూడా విజయం సాధించకపోగా ఎక్కడా మెజార్టీని కూడా దక్కించుకోలేదు. కొత్తగా ఆవిర్భవించిన జై సమైక్యాంధ్రపార్టీతో పాటు ఆమ్ఆద్మీ, బీఎస్పీ, ఎన్సీపీలాంటి జాతీయపార్టీలకు కూడా మెజార్టీ దక్కలేదు. రెండుపార్లమెంట్లు వైఎస్సార్సీపీకే: కడప, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయం సాధించారు. రాజంపేట స్థానానికి కేంద్ర మాజీమంత్రులు సాయిప్రతాప్ కాంగ్రెస్ తరఫున, బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచారు. మిధున్‌రెడ్డి చేతిలో ఇద్దరూ ఓడిపోయారు. కడప టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఆర్. శ్రీనివాసులరెడ్డి(వాసు)పై 1,93,365 ఓట్ల తేడాతో వైఎస్ అవినాష్‌రెడ్డి గెలుపొందారు. అలాగే పురందేశ్వరిపై 1.75లక్షల ఓట్లతో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయం సాధించారు. వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన అవినాష్‌కే మరోసారి కడప ఎంపీ స్థానాన్ని ప్రజలు కట్టబెట్టారు. మాజీమంత్రి పెద్దిరామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. యువనేతలైన వీరిరువురు తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. జిల్లాలో నుంచి ఆరు కొత్త ముఖాలు అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు తొలిసారి ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టనున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు కమలాపురం, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచారు. వీరంతా ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించడం విశేషం. అలాగే రాజంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడా మల్లికార్జునరెడ్డి కూడా అసెంబ్లీ గడపను తొలిసారి తొక్కనున్నారు. హ్యాట్రిక్ వీరులు...హ్యాట్రిక్ ఓటములు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ‘హ్యాట్రిక్’ సాధించారు. 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా ఆది విజయం సాధించారు. 2009, 2011 ఉప ఎన్నిక లతో పాటు ప్రస్తుతంశ్రీకాంత్, కొరముట్ల గెలుపొంది ‘హ్యాట్రిక్’ జాబితో చేరారు. అలాగే కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి వరుసగా మూడుసార్లు ఓడిపోయి ‘హాట్రిక్’ ఓటమిని మూటగట్టుకున్నారు. అలాగే మాజీ మంత్రి పీ రామసుబ్బారెడ్డి కూడా 2004,2009, 2014లో ఓడిపోయి ‘హ్యాట్రిక్’ జాబితో చేరారు. పెద్దాయన గెలిచారు...‘పుట్టా’ ట్రిక్కులు ఓడిపోయాయి జిల్లాలో మైదుకూరు అసెంబ్లీస్థానంపై జిల్లా వాసులు ప్రత్యేక దృష్టి సారించారు. పుట్టా సుధాకర్‌యాదవ్ నియోజకవర్గంలో ధనప్రవాహం పారించారు. ఓటుకు వెయ్యిరూపాయల డబ్బు, ముక్కుపుడకలు పంపిణీ చేశారు. మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సహకారం తీసుకున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం ‘పెద్దాయన’గా పిలువబడే రఘురామునికే పట్టం కట్టారు. పుట్టా సొంత పంచాయితీ పలుగురాళ్లపల్లె, డీఎల్ స్వగ్రామం సుంకేసులలో కూడా రఘురామునికే మెజార్టీ వచ్చింది. వైఎస్ జగన్‌కు భారీ మెజార్టీ: ఎప్పటిలాగే పులివెందుల ప్రజానీకం వైఎస్ కుటుంబానికి మరోసారి పట్టం కట్టారు. తొలిసారి అసెంబ్లీబరిలో నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 75,243 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కడప పార్లమెంట్‌కు 14మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఏ అభ్యర్థి ఇష్టం లేదని నోటాకు పోలైన ఓట్లు: 6058. సమీరాకు...230 ఓట్లు: జిల్లాలో తొలిసారి అసెంబ్లీబరిలో సమీరా (హిజ్రా) పోటీకి దిగారు. జమ్మలమడుగు నియోజకవర్గం బరిలో సమీరా ఆమ్ఆద్మీపార్టీ తరఫున బరిలోకి దిగారు. ఈమెకు 230 ఓట్లు పోలయ్యాయి. -
ఇదేంది వా(బా)సు!
టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిపై తెలుగుతమ్ముళ్ల గుస్సా మరో పాళెం కానున్నారని సీనియర్ నేతల ఆవేదన సొంత కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో మెరుపు తీగలే అధికమయ్యాయా? పార్టీ ఉన్నతి కోసం, శ్రేణులకు అండగా ఉండే నాయకులు కనుమరుగయ్యారా? కడప పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి (వాసు) మరో పాళెం కానున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అందుకు కారణం పార్టీ కోసం కష్టపడకుండానే ఎంపీ టికెట్ దక్కడం ఒక ఎత్తయితే, అభ్యర్థిగా ప్రకటించాక ఒంటెత్తు పోకడలకు పోతుండటం మరో కారణంగా చెప్పుకొస్తున్నారు. వెరసి జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు గరంగరంగా ఉన్నారు. రాజకీయాలకు దూరంగా కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డ శ్రీనివాసులరెడ్డిని కడప పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. రాజకీయ వాసన అంతగా పట్టని వాసు ఒక్కమారుగా అభ్యర్థి కావడం వెనుక డబ్బే ఏకైక అర్హతగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి తనయుడిగా గుర్తింపు ఉన్న వాసు ఇంతకాలం ప్రత్యక్షంగా ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవనే చెప్పాలి. పెపైచ్చు లక్కిరెడ్డిపల్లెలో దివంగత రాజగోపాల్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు రమేష్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అయితే ఒక్కమారుగా వాసుకు రాజకీయ కాంక్ష ఏర్పడింది. దాంతో ముందుగా రమేష్‌రెడ్డి స్థానంలోకి వచ్చేందుకు తీవ్రప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే రాజగోపాల్‌రెడ్డి బంధువులు, సన్నిహితులు అన్నదమ్ముళ్లు ఇరువురి మధ్య చర్చలు జరిపి వారించినట్లు తెలుస్తోంది. దీంతో రాయచోటిని వదలి, కడప పార్లమెంటు వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులేసిన వాసు... తెలుగుదేశం పార్లమెంటు సీటు కోసం వాసు వ్యూహాత్మకంగా అడుగులు వేసి సఫలీకృతుడయ్యాడని పలువురు పేర్కొంటున్నారు. ఆ మేరకే సీనియర్ నేతల్ని కాదని ఆయనకు పార్టీ టికెట్ దక్కినట్లు భావిస్తున్నారు. కీలెరిగి వాత పెట్టాలనే విధంగా చంద్రబాబు ఆయువు పట్టును పట్టుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు కోటరీని మేనేజ్ చేయడంతో టీడీపీలో సభ్యత్వమే లేని శ్రీనివాసులరెడ్డి సునాయాసంగా కడప పార్లమెంటు టికెట్ దక్కించుకున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కోటరీ సూచనల మేరకు రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డిలను కాదని టికెట్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ తతంగాన్ని నిశితంగా పరిశీలిస్తున్న దివంగత రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సన్నిహితులు సైతం నివ్వెరపోయినట్లు తెలుస్తోంది. రాయచోటి పరిధిలోని లక్కిరెడ్డిపల్లెకు చెందిన వాసు కడప పార్లమెంటు పరిధివాసి కాకపోయినా పార్టీ టికెట్ దక్కించుకోవడం వెనుక అదనపు అర్హత డబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.