షర్మిల.. జగనన్నను ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం: రోజా | Ex Minister RK Roja Serious Comments On Chandrababu And Sharmila Over His Press Meet Remarks, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

షర్మిల.. జగనన్నను ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం: రోజా

Published Fri, Apr 4 2025 6:58 AM | Last Updated on Fri, Apr 4 2025 10:37 AM

Ex Minister RK Roja Serious Comments On CBN And Sharmila

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్‌ నాయకురాల షర్మిలపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారని అన్నారు. ఈ కేసులో నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు? అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్‌ వేదికగా..‘షర్మిళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన విషయాలు చూశాం. ఒకరిపై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారు. ఒకప్పుడు వేల రూపాయలకూ అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారు – ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తోంది షర్మిల.

వివేకాగారి హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమన్నదీ, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమన్నదీ మీరే. ఇప్పుడు అధికారంలో మీ చంద్రబాబే ఉన్నా, ఏడుపు మాత్రం మీదే. నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు?. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా, షర్మిళగారు? దీని భాగంగానే మీరు నిర్దోషులపై బురదజల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోంది. చివరికి, మీ అన్నగారిని ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం. బాబు కక్ష రాజకీయాల్లో మీరు మరో కోణంగా మారిన విధానం ప్రజలు గమనిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement