YS Vivekananda Reddy
-
వివేకా కేసులో బాబు డ్రామాలు
-
వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం
-
చంద్రబాబు క్షుద్ర రాజకీయం
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచార కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు తెరతీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మేన్ రంగన్న అనారోగ్యంతో మరణిస్తే, ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం పన్నుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు పరిధిలోకి రాష్ట్ర పోలీసులను జొప్పించడం ద్వారా చంద్రబాబు తన కుయుక్తులను చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2019 మార్చి 14న వైఎస్ వివేకా హత్యకు గురవ్వగా, ప్రస్తుతం అదే చంద్రబాబు ప్రభుత్వంలో రంగన్న మరణించారన్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ తిమ్మిని బమ్మి చేసేందుకు బరి తెగిస్తున్నారు. వాస్తవంగా ఇందుకు బాధ్యత వహించాల్సింది టీడీపీ ప్రభుత్వం. కానీ అందుకు విరుద్ధంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్రను కప్పి పుచ్చేందుకే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రంగన్నను తొలుత పులివెందుల ఆసుపత్రికి, అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈ సహజ మరణానికి రాజకీయ రంగు పులమాలన్న ఆలోచన రావడం ఒక్క చంద్రబాబు ముఠాకే సాధ్యమైంది. ఎవరికైనా, ఏమైనా సందేహాలు ఉంటే ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి నివేదించాలి. ఇంకోవైపు న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్నతోపాటు గత ఐదేళ్లలో సంభవించిన మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. తద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పరోక్షంగానైనా సరే రాష్ట్ర పోలీసులకు అప్పగించాలన్నది చంద్రబాబు కుతంత్రమని స్పష్టమవుతోంది. తద్వారా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేసే కుట్రను అమలు చేయాలన్నది అసలు ఉద్దేశం. అందుకే కుట్ర పూరితంగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడించి, ఆ రాత్రికే సిట్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. రెడ్‌బుక్ కుట్రలను అమలు చేసేందుకే ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించిన ఇ.జి.అశోక్కుమార్తోనూ అదే రాత్రి హడావుడిగా మాట్లాడించారు. మంత్రివర్గ సమావేశం వేదికగా కుట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో అజెండా అంశాలపై చర్చ అనంతరం.. ముందస్తు పన్నాగం ప్రకారం రంగన్న మృతిపై చర్చకు తెరతీశారు. ఏకంగా డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను మంత్రి మండలి సమావేశ మందిరంలోకి పిలిపించి రంగన్న మృతిపై ఆరా తీసినట్టు హైడ్రామా నడిపారు. ముందు ఇచి్చన స్క్రిప్టు ప్రకారమే డీజీపీ తన పాత్రలో నటించారు. రంగన్నది అనుమానాస్పద మృతేనని ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, పోస్టుమార్టం నివేదిక రాకుండానే ఆయన ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం. బాబు గూటిలో చిలుకే దస్తగిరి స్వయంగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశానని అంగీకరించిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విభ్రాంతికి గురి చేసింది. తద్వారా తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అతనితో వాంగ్మూలం ద్వారా చెప్పించడం అన్నది టీడీపీ పకడ్బందీ కుట్రకు తార్కాణం. అప్రూవర్‌గా మారక ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అత్యంత నేర చరిత్ర కలిగిన దస్తగిరి వైఎస్ వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు వరకు రూ.500 కోసం కూడా అప్పులు చేసే దయనీయ స్థితిలో ఉండేవాడు. స్నేహితుడు సునీల్ యాదవ్‌తో అతని వాట్సాప్ చాటింగులే ఆ విషయాన్ని నిర్ధారించాయి. అటువంటి దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే... అతని వద్దకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయన్నది ఈ కేసులో అత్యంత కీలకం. ఇతను బహిరంగంగా సాగిస్తున్న దందాగిరీ అంతా ఇంతా కాదు. ఇలాంటి కిరాయి రౌడీకి సిద్ధార్థ లూథ్రా వంటి ఢిల్లీ స్థాయి లాయర్లు కేసు వాదిస్తుండటం గమనార్హం. గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు లూథ్రాతో రహస్యంగా భేటీ కావడం గమనార్హం. అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది.వివేకా రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టించుకోరా? వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ ఆవేదనతో ఇచి్చన వాంగ్మూలాన్ని అటు సీబీఐ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నాయి. ఆమెతో రెండో వివాహంతోనే వివేకా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పడంతోపాటు ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడాన్ని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. షమీమ్‌ను సునీత తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లు ఆ విషయాన్ని బయట పెట్టాయి. వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబ సభ్యులు.. అంటే కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి పాత్ర ఉందని షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. మరి ఆ అంశానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా వైఎస్ వివేకా హత్య వెనుక కారణాలను కప్పిపుచ్చి, తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టంసిట్ పర్యవేక్షణలో 4 గంటలపాటు నిర్వహణపులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మేన్ రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన రంగన్న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి గురువారం కడప రిమ్స్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని పులివెందులలోని భాకరాపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, రంగన్న మృతి పట్ల సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనుమానం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సిట్, వైద్య బృందం సభ్యులు కలిసి భాకరాపురం శ్మశానంలో పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీయించారు. శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కడపకు చెందిన వైద్య బృందం, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సభ్యులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో 4గంటలపాటు రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ముఖ్యమైన శరీర భాగాలను సేకరించి తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. -
‘మల్లెల బాబ్జీ నుంచి తారకరత్న దాకా చర్చిద్దామా.. బాబు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే కదా. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. వివేక కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేబినెట్ సమావేశాలు కామెడీ సమావేశాలుగా మారిపోయాయి. కేబినెట్ సమావేశాలు అనగానే అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. తమకు మేలు చేకూరే అంశాలపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమోనని అనుకుంటారు. కానీ, చంద్రబాబు కేబినెట్‌కి వైఎస్ జగన్ అంటే భయం పట్టుకుంది. పదే పదే జగన్ చుట్టూ చర్చిస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి కూడా చర్చించే స్థాయికి దిగజారారు.చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యల గురించి కూడా సమీక్షలు నిర్వహించాలి. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే జగన్ కుటుంబానికి ఏం సంబంధం?. వైఎస్ జగన్‌ని అవమానపరిచే కుట్ర కాదా ఇది?. ఆయన చెల్లెళ్లను కూడా తన రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని చీల్చటానికి చంద్రబాబు చేసిన కుట్ర ఇది.వివేకానంద రెడ్డిని నేనే చంపానని దస్తగిరి పదేపదే చెప్పాడు. మరి అతనికి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతున్నదెవరో చంద్రబాబు సమీక్ష చేయాలి. మల్లెల బాబ్జీ హత్య నుండి వినుకొండ రషీద్ హత్య వరకు అన్నింటిపై చర్చిద్దాం. వీటిపై ఏ వేదిక మీద చర్చించటానికైనా మేము సిద్ధమే. బాలకృష్ణ కుటుంబంలో జరిగిన కాల్పుల గురించి కూడా చర్చిద్దాం. ఆయన వాచ్మెన్ ఎలా చనిపోయాడో కూడా చర్చిద్దామా?. హరికృష్ణ రోడ్డు ప్రమాదం, నారా రామ్మూర్తి నాయుడు పిచ్చివాడు కావటం, తారకరత్న హఠాన్మరణం గురించి కూడా చర్చించాలి. వీటన్నిటిపై చంద్రబాబు సమీక్ష చేయాలి. వివేకా కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే. వివేకా అధికారికంగా పెళ్లి చేసుకున్న షమీమ్ ఫోన్ ఎక్కడ ఉంది?. అందులోని వాట్సప్ చాటింగ్‌ని ఎందుకు డిలిట్ చేశారో కూడా తేల్చాలి. ఈసీ గంగిరెడ్డి, డ్రైవర్ నారాయణ, అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తారా?. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారా?. హత్యా రాజకీయాలు మాపై రుద్దాలనుకుంటే కుదరదు. ఆ పాపాలే మీకు శాపాలై ఉరితాళ్లుగా మారతాయి’ అంటూ హెచ్చరించారు. -
వైఎస్ వివేకా వాచ్ మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
-
వాచ్మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ జిల్లా, సాక్షి: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మన్ రంగయ్య .. కడప రిమ్స్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి మృతి చెందాడు. అయితే ఆయన మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా భర్తను 2024 వరకూ పోలీసులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నా భర్తను హింసించారు. ఆయన కీళ్లు విరగొట్టారు. కొట్టి కొట్టి ఇలా చనిపోయేలా చేశారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి అన్నీ ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారు. రంగయ్య మృతికి సీబీఐ, పోలీసులే కారణం’’ అని ఆరోపించారామె. సుశీలమ్మ ఆరోపణలపై సీఐ ఉలసయ్య స్పందించారు. ‘‘రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ పిర్యాదు చేసింది. అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. మృతికి కారణం ఏమిటో పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుంది’’ అని తెలిపారు. రంగయ్య మృతదేహానికి ఇవాళే పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. -
వివేకా హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రలు
-
దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో తొలి నుంచి నిందితుడి (ఏ–4)గా పేర్కొన్న దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణా సంస్థతోపాటు దస్తగిరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. తాను అప్రూవర్‌గా మారినందున తనను సాక్షిగా పరిగణించాలంటూ గత ఏడాది సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు.సీబీఐ కూడా దీనికి అనుకూలంగా వాదనలు వినిపించడంతో న్యాయస్థానం దస్తగిరిని సాక్షిగా పేర్కొనాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ డి.శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. కేసులో సీబీఐ తరఫున స్పెషల్ పీపీ శ్రీనివాస్ కపాడియా హాజరై సమయం కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తూ.. సీబీఐ, దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ల వాదన ఇదీ... ‘సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దస్తగిరిని సాక్షిగా పేర్కొనడం సరికాదు. 2021, అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షిట్ దస్తగిరిని నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత వేసిన రెండు మధ్యంతర చార్జ్‌షీట్లలోనూ దస్తగిరి పేరును తొలగించలేదు. 2022, ఫిబ్రవరి 21న సెక్షన్ 306(4)(ఏ) కింద అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా చార్జ్షిట్లో అతని పేరు తీసివేయలేదు. ఒకసారి నిందితులుగా అనుమతించిన (కాగ్నిజెన్స్) తర్వాత.. ఇదే కోర్టు పునః సమీక్షించజాలదు.క్రిమినల్ ప్రొసిజర్ కోడ్‌లో అలాంటి నిబంధన ఎక్కడా లేదు. చట్ట ప్రకారం అలాంటి నిర్ణయం చెల్లదు. ఒకసారి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించే అధికారాలు లేవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొంది. దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నామని చెప్పడం కూడా సరికాదు. నిందితుడిగా పలుమార్లు ఇదే కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. హాజరుకానప్పుడు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దస్తగిరిని సాక్షిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’ అని పేర్కొంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. -
పాత కుట్ర.. కొత్త సిరా!
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు సర్కారు రంగంలోకి దిగింది! తానే స్వయంగా వైఎస్ వివేకాను హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరి తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అక్రమ కేసు నమోదు చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దస్తగిరి గతంలో న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను కొట్టివే సినప్పటికీ... అదే ఫిర్యాదుపై తాజాగా కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయడం అందుకు నిదర్శనం. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయిన అనంతరం రూపుదిద్దుకున్న కుట్ర కార్యాచరణను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. బెడిసికొట్టిన పన్నాగం..వైఎస్ వివేకా హంతకుడు దస్తగిరి ద్వారా నర్రెడ్డి సునీత దంపతులు గతంలో వేసిన పన్నాగం బెడిసికొట్టింది. 2023 నవంబరులో తాను కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి తనను కలసి బెదిరించినట్లు దస్తగిరి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. జైలులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ సందర్భంగా చైతన్య రెడ్డి జైలులోకి తన బ్యారక్ వద్దకు రూ.20 కోట్లు తెచ్చి లోబరుచుకునేందుకు యత్నించారని పిటిషన్లో ఆరోపించాడు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణతో అసలు విషయాలు వెల్లడయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ దీనిపై సమగ్ర నివేదిక సమర్పించారు. జైలులో ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు నిర్వహించడం దశాబ్దాలుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇతర జైళ్లలో నిర్వహించిన వైద్య శిబిరాల వివరాలను సైతం నివేదించారు. దస్తగిరి రిమాండ్ ఖైదీగా జైలుకు రాకముందు కూడా డాక్టర్ చైతన్య రెడ్డి ఖైదీలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వెల్లడించారు. జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉన్న దస్తగిరిని చైతన్యరెడ్డిగానీ ఇతరులుగానీ కలువ లేదని స్పష్టం చేశారు. జైలులో అన్ని ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని, వాటిలో అటువంటి దృశ్యాలేవీ రికార్డు కాలేదన్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. జైలుకు రూ.20 కోట్లు తీసుకెళితే సీసీ టీవీ కెమెరాల్లో నమోదు కావాలి కదా? అని ప్రశ్నిస్తే దస్తగిరి తరపు న్యాయవాది సమాధానం చెప్పలేకపోయారు. ఈ క్రమంలో దస్తగిరి అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కూటమి సర్కారు వచ్చాక మరోసారి స్పష్టం...గతేడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే కుట్రను మరోసారి తెరపైకి తెచ్చారు. చైతన్యరెడ్డి కడప జైలులో దస్తగిరిని కలిశారన్న ఫిర్యాదుపై విచారించాలని జైళ్ల శాఖ ఐజీ శ్రీనివాసరావును ఆదేశించారు. 2024 నవంబరు 25న ఆయన కడప జైలుకు వచ్చి విచారించగా.. దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించినట్లుగానీ కనీసం కలిసినట్లుగానీ నిర్ధారణ కాలేదు. అదే విషయాన్ని ఆయన ప్రభుత్వానికి నివేదించారు. దాంతో చంద్రబాబు కుట్ర మరోసారి బెడిసికొట్టింది.అయినా తప్పుడు ఫిర్యాదు... అక్రమ కేసువైఎస్ వివేకా హత్య వెనుక అసలు వాస్తవాలు వెల్లడి కాకూడదన్నదే నర్రెడ్డి సునీత దంపతుల లక్ష్యంగా మారింది. అందుకే దేవిరెడ్డి శివశంకర్రెడిని లక్ష్యంగా చేసుకుని అక్రమ ఫిర్యాదులు, అక్రమ కేసుల పరంపర కొన సాగించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కొన్నాళ్ల క్రితం నర్రెడ్డి సునీత కలిశారు. అప్పటి నుంచి కుట్ర కార్యాచరణ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో దస్తగిరి గతంలో ఇచ్చిన తప్పుడు ఫిర్యాదునే మరోసారి తెరపైకి తెచ్చారు.2023 నవంబరులో తాను కడప జైలులో ఉండగా డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని.. రూ.20 కోట్లు ఆఫర్ చేసి లొంగదీసుకునేందుకు యత్నించారని పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 3న అర్ధరాత్రి 11.30 గంటలకు దస్తగిరి ఫిర్యాదు చేయడం... ఆ వెంటనే కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా చేయకుండానే పోలీసులు చైతన్యరెడ్డితో పాటు ఇతరులపై అక్రమ కేసు నమోదు చేయడం అంతా పక్కా కుట్రతో చకచకా సాగిపోయాయి. 15 నెలల క్రితం జరిగిందని దస్తగిరి చెబుతున్న ఉదంతంపై కనీసం ప్రాథమిక విచారణ జరపాలని కూడా పోలీసులు భావించక పోవడం విస్మయం కలిగిస్తోంది. పైగా గతంలో న్యాయస్థానం కొట్టివేసిన పిటిషన్‌లోని అభియోగాల ఆధారంగా హడావుడిగా అర్ధరాత్రి కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమేనని స్పష్టమవుతోంది. అనంతరం ఈ కుట్రకు మరింత పదును పెడుతూ దస్తగిరి ఫిర్యాదుపై విచారించాలని జైళ్ల శాఖ ఎస్పీ రాహుల్‌ను ఆదేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత నవంబరులో జైళ్ల శాఖ ఐజీ శ్రీనివాసరావు ఇదే ఫిర్యాదుపై విచారించారు. దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నవి అవాస్తవాలని నిగ్గు తేల్చారు. కానీ అదే ఆరోపణలపై టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించడం గమనార్హం. ఇప్పటికే ఐజీ స్థాయి అధికారి దర్యాప్తు చేసిన ఉదంతంపై.. ఆయన కంటే కింది స్థాయి అధికారి అంటే ఎస్పీ రాహుల్‌తో విచారణకు ఆదేశించడంపై పోలీసు వర్గాలు విస్తుపోతున్నాయి. మరోసారి విచారించాలని భావిస్తే గతంలో విచారించిన ఐజీ స్థాయి కంటే ఉన్నత స్థాయి అధికారికి ఆ బాధ్యతలు అప్పగించాలి. కానీ ఐజీ కంటే చిన్న స్థాయి అధికారి అయిన ఎస్పీతో విచారించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే తమ మాట వినే అధికారితో విచారణ తంతు ముగించి అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్రగా వెల్లడవుతోంది. కాగా దస్తగిరిని జైళ్లశాఖ ఎస్పీ రాహుల్ శుక్రవారం విచారించారు. డాక్టర్ చైతన్యరెడ్డి, ఏఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. -
వైఎస్ వివేకానందరెడ్డి కేసు మళ్లీ విచారణ
-
వివేకా హత్య కేసుపై కథనాలు ఎలా ప్రచురిస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉండగా, ఆ కేసు గురించిన కథనాలు ఎలా ప్రచురిస్తారని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హైకోర్టు నిలదీసింది. కథనాలే కాకుండా ఏకంగా ట్రయల్ నిర్వహించి, తీర్పులు కూడా ఇచ్చేస్తూ ప్రజలను, కేసును ప్రభావితం చేస్తున్నారని తీవ్రంగా మండిపడింది. ఘటన జరిగినట్లు రాస్తే సరిపోతుందని, దానికి కారకులు, ఎవరిది తప్పు వంటి వివరాలేవీ ప్రచురించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవన్నీ చేయాల్సింది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని, దీనిపై తాము ఓ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అప్పటివరకు క్రిమినల్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేయవచ్చని తెలిపింది.దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై గుంటూరు కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ ఆరు వారాల పాటు నిలిపివేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనంవివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న ఓ వ్యక్తిని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి తన కారులో కడప నుంచి తాడేపల్లి తీసుకొచ్చారంటూ ఆంధ్రజ్యోతి గత ఏడాది ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుంటూరు కోర్టు వారిద్దరినీ వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. ఈ కేసును కొట్టేయాలని, తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ రాధాకృష్ణ, శ్రీనివాస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రజ్యోతి కథనం గురించి, ఏ సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారో వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. కోర్టు ముందు విచారణలో ఉన్న కేసు గురించి ఎలా కథనాలు ప్రచురిస్తారని, ట్రయల్ కూడా నిర్వహించి తీర్పులిచ్చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఘటన గురించి మాత్రమే రాశామని సుబ్బారావు చెప్పగా.. ‘ఘటన అంటే ఏమిటి? ఓ వ్యక్తి గాయపడితే గాయపడ్డాడు అని రాయాలి. అంతే తప్ప ఆ వ్యక్తిని ఎవరు గాయపరిచారు, దాని వెనుక ఎవరున్నారు, అంతిమంగా తప్పు ఎవరిది వంటి విషయాల గురించి చెప్పాల్సింది మీరు కాదు. దర్యాప్తు అధికారులు, న్యాయస్థానాలే’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తనను తాను బాధితునిగా పేర్కొంటూ దాఖలు చేసిన ఈ క్రిమినల్ కేసు చెల్లదన్నారు. ఇది కేకే మిశ్రా కేసులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..
-
వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత, సీబీఐ అధికారి రాంసింగ్‌కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. వీరు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.కేసు పూర్వపరాలేంటీ? మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. కృష్ణా రెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు 2023 డిసెంబర్ 8న విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీత, రాంసింగ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ సునీత, ఆమె భర్త రాజశేఖర్, ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.హైకోర్టు ఏం చెప్పింది?వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసును కొట్టేయాలన్న సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ వాదనలను ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. వీరు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చదవండి : నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలుకృష్ణారెడ్డి ఏం చెబుతున్నారు? "వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత దంపతుల పాత్ర అనుమానస్పదంగా ఉంది. ఈ హత్య సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కుట్ర అని భావిస్తున్నాను. వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని వివేకానందరెడ్డి భావించడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నాను. వివేకా లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు. ఈ హత్యకు కారణం ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర ఉంది. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషి చేశారు" అని వివేకా పీఏ కృష్ణారెడ్డి వెల్లడించారు.చదవండి : వైఎస్ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ పూర్తి పాఠం -
చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, సునీత
పులివెందుల/లింగాల: తన అక్కలైన షర్మిల, సునీతలు చంద్రబాబు ట్రాప్‌లోపడి తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. 2021 నుంచి వారిద్దరూ తనను మానసికంగా ఎంతో ఇబ్బందిపాల్జేశారన్నారు. చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, ఎల్లో మీడియా ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివి ఇష్టమొచ్చినట్లు నన్ను, జగనన్నను తిడుతున్నారని.. అయినా, వారిపట్ల తనకెలాంటి కోపంలేదని చెప్పారు. వైఎస్ వివేకాను హత్యచేశానన్న వ్యక్తిని వారు ప్రోత్సహిస్తున్నారని, అతడు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నా.. అతడిని ఓడించాలని ఒక్కమాట కూడా అనడంలేదన్నారు. హంతకుడు అప్రూవర్‌గా మారడంతో అతడినే సోదరుడిగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినాశ్‌రెడ్డి రోడ్ షో, బస్టాండులో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..సభ్యతతో ప్రతి విమర్శలు చేయడంలేదు..వారిద్దరూ తనను ఎన్ని విమర్శలు చేసినా అదే రీతిలో తాను చేయగలను. కానీ, సభ్యత, సంస్కారాలవల్ల చేయడంలేదు. మా నాన్నను తప్పుడు ఆరోపణలతో 385 రోజులు జైల్లో పెట్టారు. ఎవరికీ ద్రోహం చేయలేదు, మనకెందుకీ శిక్ష అని అంటూ ఆయన బాధపడ్డారు. దేవుడి దయ, మీ ఆశీస్సులు ఉన్నంతవరకు మేం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటాం. ఇక దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల మరణాలకు కారణం ఎవరు? ఎక్కడ కుట్ర జరిగింది? ఎవరికి మేలు చేసేందుకు ఇలాంటివి చేశారన్న నిజాలను ఎన్నివేల అడుగుల లోతున దాచిపెట్టి ఉన్నా బయటికి వస్తాయి. వారికి కడప కోర్టు జరిమానా..వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చి టీడీపీకి లబ్ధిచేకూర్చాలని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఇచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏమీచేయలేరు. ఇక కొద్ది గంటలముందే కడప కోర్టు వీరుచేసే దుష్ప్రచారాలకు జరిమానా విధించింది. కేసు ట్రయిల్‌కు రాకముందే మీరెలా మాట్లాడతారని షర్మిలక్కకు, సునీతక్కకు, వారి సోదరుడు బీటెక్ రవికి రూ.10 వేలు జరిమానా విధించింది.న్యాయస్థానాలు కూడా వీరు చేసేది తప్పని చెబుతున్నాయి. వీరి టార్గెట్ కేవలం వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే. నా నిజాయితీని నూరు శాతం నిరూపించుకుంటా. ఇక ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లువేసి, వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఎంపీ అభ్యర్థినైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మా కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను. -
షర్మిల, సునీత, బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు షాక్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: అడ్డగోలు ఆరోపణలు, దుష్ప్రచారంతో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాజకీయ లబి్ధకోసం వాడుకుంటున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.వివేకా హత్యకేసు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడొద్దని, దుష్ప్రచారం చేయవద్దని చంద్రబాబునాయుడు, లోకేశ్, షర్మిల, సునీత, బీటెక్ రవి, పవన్‌కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు ఆ పార్టీల కేడర్‌ను ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది.మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ షర్మిల, సునీత, బీటెక్ రవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న వివేకా హత్యకేసు గురించి మాట్లాడటానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. షర్మిల, సునీత, బీటెక్ రవిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఖర్చుల కింద విధించింది. ఆ మొత్తాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణను జూన్ 19కి వాయిదా వేశారు. తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్‌కళ్యాణ్, లోకేశ్, వివేకా కుమార్తె సునీతారెడ్డి తదితరులు చేస్తున్న దు్రష్పచారంపై వైఎస్సార్సీపీ కడప జిల్లా కోర్టులో దావా వేసింది. తమ పార్టీతోపాటు పార్టీ అధ్యక్షులు జగన్, కడప ఎంపీ అభ్యర్థితోపాటు పార్టీకి చెందిన వారిపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతారెడ్డిలను నిరోధించాలంటూ వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు కె.సురే‹Ùబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన జిల్లా కోర్టు.. వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నందున వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ చేస్తున్న దు్రష్పచారాన్ని ఆపాలని చంద్రబాబు, షర్మిల, సునీత, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి తదితరులను ఆదేశిస్తూ గతనెలలో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేలి్చచెప్పింది. జగన్మోహన్రెడ్డి, అవినాశ్‌రెడ్డిలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది.కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలంటూ షర్మిల, సునీత, బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ కడప జిల్లా కోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు వేశారు. షర్మిల తదితరుల వ్యాజ్యాలపై విచారించిన హైకోరుŠట్ ధర్మాసనం కడప కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత కోసం కడప కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. షర్మిల తదితరుల అనుబంధ వ్యాజ్యాలపై కడప జిల్లా కోర్టు మూడు రోజులుగా విచారిస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున పిటిషన్ వేయడంపై షర్మిల తదితరుల న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వ్యాఖ్యల వల్ల నష్టం వాటిల్లిందని భావిస్తే జగన్మోహన్రెడ్డి లేదా అవినాశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయాలే తప్ప పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదని చెప్పారు. ఈ వాదనలను వైఎస్సార్సీపీ న్యాయవాదులు ఎం.నాగిరెడ్డి, కె.సుదర్శన్‌రెడ్డి తోసిపుచ్చారు. తాము ఇచ్చిన ఆధారాలతో సంతృప్తి చెందినందునే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరుల తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి వెళితే ఓట్లపరంగా వైఎస్సార్సీపీకి నష్టం కలుగుతుందని, అందుకే పార్టీ తరఫున పిటిషన్ వేశామని తెలిపారు. వివేకా హత్యకేసు గురించి మాట్లాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా షర్మిల తదితరులు ఆ కేసు గురించి మాట్లాడారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బుధవారం జిల్లా జడ్జి కోర్టు హాల్లోనే ఉత్తర్వులను వెలువరించారు. నాగిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి వాదనలతో జడ్జి ఏకీభవించారు. మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ షర్మిల ఆ కేసు గురించి మాట్లాడారన్న వారి వాదనను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు నిరాకరిస్తూ.. షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేశారు. -
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్ అవినాష్
సాక్షి, వైఎస్సార్: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.వైఎస్ భాస్కర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.దివంగత వైఎస్సార్ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్ పెట్టిన టాస్క్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్ చేశారు. -
నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..
-
థర్డ్ డిగ్రీ, సాక్షులను కొట్టడం మీ డ్యూటీనా
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. తాను చెప్పిన విధంగానే వాంగ్మూలం ఇవ్వాలని ఫిర్యాదుదారుడిపై రామ్‌సింగ్ ఎలా ఒత్తిడి చేస్తారని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ నిలదీసింది. సాక్షులను కొట్టడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వంటివి చేయవచ్చా అంటూ సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)ని ప్రశ్నించింది. ఇలాంటి కస్టోడియల్ విచారణ చేయడం విధి నిర్వహణలో భాగమా అంటూ నిలదీసింది. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, సీబీఐ అధికారి రామ్‌సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు విన్న హైకోర్టు విచారణను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.వివేకా హత్య విషయంలో తాము చెప్పినట్లు వినకుంటే అంతు చూస్తామంటూ బెదిరించడమే కాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి సునీత, సీబీఐ అధికారి రామ్‌సింగ్‌లపై కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖరరెడ్డి, రామ్‌సింగ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన శ్రీనివాసరెడ్డి, పులివెందుల కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా సునీత, రాజశేఖరరెడ్డి తరపు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, మేజిస్ట్రేట్ యాంత్రికంగా ఉత్తర్వులిచ్చారన్నారు. పోలీసుల నుంచి నివేదిక కోరకుండా నేరుగా కేసు నమోదుకు ఆదేశాలివ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేసు నమోదుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణాలను వెల్లడించలేదన్నారు.సీబీఐ తరఫున ప్రత్యేక పీపీ అనిల్ తన్వర్ వాదనలు వినిపిస్తూ.. పులివెందుల కోర్టు పరిధి దాటి ఉత్తర్వులిచ్చిందని అన్నారు. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలాన్ని నమోదు చేయకుండానే కేసు నమోదుకు ఆదేశాలిచ్చారని తెలిపారు. రాంసింగ్ ఏం చేసినా విధి నిర్వహణలో భాగంగానే చేశారన్నారు. ఆ విధంగానే తన ముందు హాజరు కావాలని ఫిర్యాదుదారుడిని రామ్‌సింగ్ ఆదేశించారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సాక్షులను కొట్టడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటివి కూడా విధి నిర్వహణలో భాగమేనా అంటూ నిలదీశారు.సుప్రీంకోర్టు దర్యాప్తు నుంచి రాంసింగ్‌ను తప్పించిందిఅనంతరం ఫిర్యాదుదారు కృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాంసింగ్‌పై తీవ్రమైన ఆరోపణలున్నాయన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఆయన్ని వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నుంచి తొలగించిందన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు సరైనవేనని తెలిపారు. కారణాలను తెలియచేయాల్సిన అవసరం లేదన్నారు. ముందస్తు అనుమతి అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు తీర్పులను ప్రస్తావించారు.నిబంధనల మేరకే మేజిస్ట్రేట్ వ్యవహరించారుపోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, స్పెషల్ అసిస్టెంట్ పీపీ సూరా వెంకట సాయినాథ్ వాదనలు వినిపించారు. ప్రైవేటు ఫిర్యాదుపై విచారణకు ఆదేశించే విషయంలో మేజిస్ట్రేట్ ఎలాంటి కారణాలను తెలియచేయాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే మేజిస్ట్రేట్ వ్యవహరించారని వివరించారు. మేజిస్ట్రేట్ కేసును విచారణకు స్వీకరించలేదని, దర్యాప్తునకు మాత్రమే ఆదేశించి తుది నివేదిక కోరారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేశారన్నారు. అయితే కోర్టు ఈ చార్జిషీట్‌ను సాంకేతిక కారణాలతో రిటర్న్ చేసిందన్నారు. సీబీఐ అధికారి ప్రాసిక్యూషన్‌కు ముందస్తు అనుమతి అవసరం లేదన్నారు. ఏ దశలోనైనా అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. అందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. -
నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధాలేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. నర్రెడ్డి బ్రదర్స్ నాటకాలాడుతున్నారని చెప్పారు. వైఎస్ వివేకా రక్తపు వాంతులతో చనిపోయాడని తాను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెప్పలేదన్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్‌లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. అలాంటిది రాజశేఖర్‌రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్ వివేకా లెటర్‌ను దాచిపెట్టడానికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్ గురించి తాను రాజశేఖర్‌రెడ్డికి ఫోన్లో చెప్పగా ఆయనే దాచమన్నారని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నారు.అవినాశ్‌రెడ్డి తనను మేనేజ్ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్‌ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగానికి 9 నెలలు సస్పెన్షన్‌కు గురయ్యానని, ప్రమోషన్, పాస్‌పోర్ట్ రెన్యువల్ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.తాను వైఎస్ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలిపారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మనస్పర్థలు వచ్చాయన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ కుమారుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వారా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తున్నారన్నారు. గతంలో డ్రైవర్‌గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ముందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రామ్‌సింగ్ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారుఓసారి సునీత దంపతులు తనను హైదరాబాద్‌కు పిలిపించుకొని, రామ్‌సింగ్ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరాఖండిగా చెప్పానన్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖర్‌తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్పటికైనా ఈ కేసులో రాజశేఖర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు.వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్‌సింగ్ కొట్టాడుఢిల్లీలో సీబీఐ అధికారి రామ్‌సింగ్ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆతర్వాత ఒకరోజు రామ్‌సింగ్ వాట్సప్ కాల్ చేసి తన కుమారుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.తామిద్దరం మరుసటిరోజు రామ్‌సింగ్ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టెతో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికిస్తామని చెప్పాడన్నారు. తన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్‌సింగ్ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకున్నారని తెలిపారు.నాకేదైనా జరిగితే వారిదే బాధ్యతతనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్‌రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. -
నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య ఐదేళ్ల క్రితం జరిగితే ఇప్పుడెందుకు దాని గురించి ఇంతలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు ఎందుకు మసాలా జోడిస్తున్నారని నిలదీసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఓవైపు కేసు విచారణలో ఉంటే నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా చెబుతారని నిలదీసింది. అలాగే హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించింది. ఇలా చెప్పడం తప్పు కాదా? నేరపూరిత చర్యల కిందకు రాదా? అని నిలదీసింది. అలాంటప్పుడు కడప కోర్టు అంత అత్యవసరంగా ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రశ్నించారు. దీనికి హైకోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టును నిందించవద్దని హెచ్చరించింది. వివేకా హత్య గురించి మాట్లాడొద్దని, అలాగే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ ముగించాలని కడప జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 8లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.తద్వారా కడప జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత, బీటెక్ రవి, షర్మిల దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.వివేకా హత్య కేసుకు మసాలా ఎందుకు కలుపుతున్నారు..?ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించింది. అలా హంతకుడని చెప్పడం కోర్టు ధిక్కారమే అవుతుందని వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఫలానా వ్యక్తి (ముఖ్యమంత్రి) నిందితులను రక్షిస్తున్నారని ఎలా చెబుతారని నిలదీసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పబ్లిక్ డాక్యుమెంట్ అని, తాము మాట్లాడుతోంది అందులో అంశాలనేనని మురళీధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసుకు ఎందుకు మసాలా కలుపుతున్నారని ప్రశ్నించింది. తాము అలాంటిదేమీ చేయడం లేదని గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును నారాసుర రక్తచరిత్ర అంటూ ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. అదే తాము మాట్లాడుతుంటే తప్పుపడుతున్నారన్నారు. సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నేతల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటిదేమీ చేయకుండా నేరుగా కోర్టులో వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 8 తేదీలోపు బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించాలని కడప జిల్లా కోర్టును ఆదేశించింది.సునీత తదితరుల వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు..వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సునీత, తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు అక్కడే పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. వాటిపై కడప జిల్లా కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మళ్లీ ఇదే అంశంపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తాము పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని కోరారు. బీటెక్ రవి తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్సీపీ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న తమ వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలోకి ప్రవేశించొద్దని ఆదేశిస్తూ కోర్టుకు పాస్‌పోర్టు, రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని సూచించింది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హైదరాబాద్ సీసీఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్షులను బెదిరించొద్దని ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని తమకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదని.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో పాటు సునీల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పారు. అరెస్టు సమర్థనీయం కాదు నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం (హియర్ సే ఎవిడెన్స్) చట్టప్రకారం సాక్ష్యంగా చెల్లదని వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గూగుల్ టేకవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధృవీకరణ ఇవ్వదన్నారు. ఇలాంటి సాక్ష్యాలతో వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి అరెస్టు సమర్థనీయం కాదన్నారు. ‘మూడో చార్జిషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది.వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినవారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం సహకరిస్తున్నారు. హత్య వెనుక వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినా గంగిరెడ్డి తాను అలా చెప్పలేదని పేర్కొన్నారు. దస్తగిరి చెప్పిన విషయానికి అంత ప్రా«దాన్యమిస్తున్న సీబీఐ ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడంలేదు’ అని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. తండ్రి తన కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా?‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈయనపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయనను తప్పించి.. మరొకరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగిన రోజు వైఎస్ అవినాశ్‌రెడ్డికి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి తన కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో సీబీఐ విచారణను సాగదీస్తోంది’ అని నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తికి నివేదించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలి.. ‘‘పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే సాక్ష్యాలు లేవు. వైఎస్ భాస్కర్‌రెడ్డి వయసు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల వద్దకు చేర్చాల్సి ఉంటుంది. జైలులో ఉంటే అదెలా సాధ్యం? ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. వీరికి కూడా అదే వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితులను జైలులో ఉంచడం వారి హక్కులను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి గత నెలలో తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం తీర్పు చెప్పారు. -
కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
సాక్షి, విజయవాడ: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడుతారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించింది. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని పేర్కొంది. కేసు విచారణలో ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా చెబుతారని ప్రశ్నించింది. హంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హతకుడ్ని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెబుతారన్న హైకోర్టు అలా చెప్పటం తప్పు అని తెలిపింది.ఇలా చెప్పటం నేరపురితమైన చర్యలు కిందకు వస్తుంని పేర్కొంది. అయిదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు వివేకా హత్యపై మాట్లాడకూడదు అంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. -
Viveka Case: అవినాష్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్, సాక్షి: వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి ఓ పిటిషన్ వేశాడు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే దస్తగిరి పిటిషన్దస్తగిరి ఆరోపణల్లో వాస్తవం లేదునిరాధార ఆరోపణలతో పిటిషన్ వేశారుసీబీఐ బెయిల్ రద్దు ఎప్పుడూ కోరలేదుహైకోర్టు షరతులను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదుసాక్షులను బెదిరించినట్లు ఎక్కడా ఆధారాల్లేవ్వైఎస్ భాస్కర్‌రెడ్డి విషయంలో సైతం ఆధారాల్లేవ్ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ వేసిందిఅని అవినాష్ తరఫు న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి పిటిషన్‌ను కొట్టేసింది.మరోవైపు ఇదే కేసులో అరెస్టైన అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో ఉదయ్‌కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.ఇక.. ఈ కేసులో వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, పైగా ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారులేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోందిఅసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చానుదస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండిఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడురంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలినెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదుదస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారుఅనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడుదస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదుపక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదుకానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారుఅప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది?సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయిఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.?హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసుజమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పిందిఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు?నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చానుఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోందిఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది?వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ?శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పానుమూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ?ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా?నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడునేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పానువివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలిఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడుఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడుసునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలిఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసువివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారుచివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ?బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు.రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారుఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదుగూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందివైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోందిఅది కూడా మూడేళ్ల తరువాత చూశారు?మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు?గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది?గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది?ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారువారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదుచంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారునేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదున్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉందిఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుందినా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారుఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలినా నెంబర్ వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులున్నాయి.ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుందినేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా?మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారుఅనేక ఇబ్బందులకు గురిచేశారు74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడుటిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారుహత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.!వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు?వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచిందికేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు -
వివేకా భార్య సౌభాగ్యమ్మకు వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి బహిరంగ లేఖ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీ గురువారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిని వివేకా భార్య సౌభాగ్యమ్మకు రాశారు లక్ష్మీ. ‘2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ను చిన్నచూపు చూసినపుడు జగన్‌కు అండగా నిలచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరందరూ కలిసి ఒంటరివాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నపుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా’.. అన్నారు వైఎస్ లక్ష్మీ.2011లో నీ భర్తను నువ్వు, నీ కుమార్తె, అల్లుడు విజయమ్మపై పోటీచేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉందో మీకు తెలీదా? నీ కుమార్తె, అల్లుడు పూలంగళ్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారెంత మనోవేదన అనుభవించారో కూడా తెలీదా? వివేకానందరెడ్డి వైఎస్ జగన్‌ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవమో, 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్‌ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతే మీడియాకు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం.. సంబంధంలేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పనిపించడంలేదా?ఎవరిని కాపాడుకునేందుకు మీరిలా చేస్తున్నారు? మీ కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్దతు తప్పక ఉంటుంది. అలా కాకుండా.. మీ కుమార్తె వైఎస్సార్, జగన్ శత్రువులతో చేతులు కలిపి, వారి చేతిలో పావుగా మారి సంబంధంలేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ మీకెలా మద్దతివ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు.. మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ. ఇక మాటిమాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు.. పైగా చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్‌ను తిడుతున్నారు."న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడటం మీకు తప్పనిపించడంలేదా? నీ కుమార్తెను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్సార్, జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకొచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీవల్ల బాధపడుతున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. తప్పకుండా బయటపడుతుంది" అని లేఖలో పేర్కొన్నారు లక్ష్మీ. -
కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం మౌఖికంగా తెలిపింది. ‘మా వాదన వినలేదు’ కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు సూట్ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు. -
అంతా బాబు జట్టే.. పచ్చ కుట్రే..
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ ముఠా ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, పవన్ కళ్యాణ్, లోకేశ్, పురందేశ్వరి, బీటెక్ రవి అంతా ఒకే తానులో ముక్కలని తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే తప్ప, అసలు హంతకులకు శిక్ష పడటం కాదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. వివేకాను రాజకీయంగా, ఆ తర్వాత భౌతికంగానూ తొలగించుకొన్న వారితో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటకాగుతున్నారన్న విభ్రాంతికర వాస్తవం మరోసారి సాక్ష్కాత్కరించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున, ఈ కేసుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నందున ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదన్న పులివెందుల న్యాయస్థానం తీర్పును అందరూ శిరసావహిస్తారని భావించారు. కానీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేయడం పచ్చ కుట్రను బయటపెట్టంది. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న వివేకానందరెడ్డిని తానే ఓడించానని చంద్రబాబు నమ్మిన బంటు సీఎం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివేకాను అంతమొందించే కుట్రకు ఎంత ముందుగా భూమికను సిద్ధం చేశారో అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు చాలా ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేశారు. దస్తగిరి, సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల.. ఇలా పలువురు పాత్రధారులు తెరపైకి వస్తూ వారికి ఇచ్చిన డైలాగులు చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మరింతగా విషం చిమ్మేందుకు తెగించారు. ఓటర్లను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడాలని, సామరస్యపూర్వక రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ భావించింది. పలు న్యాయస్థానాల్లో విచారణ సాగుతున్న ఈ హత్యపై ఎవరూ మాట్లాడటం సరైన విధానం కాదని కూడా అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని విన్నవిస్తూ చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, లోకేశ్, పవన్, పురందేశ్వరి, బీటెక్ రవిని ప్రతివాదులుగా చేరుస్తూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరింది. ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలతో న్యాయస్థానం ఏకీభవించింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని ఈ నెల 16న తీర్పునిచ్చింది. మంచి ఉద్దేశంతో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అడ్డగోలు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమైన చంద్రబాబు అండ్ కోకు మింగుడు పడలేదు. దీంతో పక్కా పన్నాగంతో మొదట సునీతతో ఈ తీర్పుపై అభ్యంతరం తెలిపారు. ఆమె హైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తారని అందరూ భావించారు. కానీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పుపై సునీత వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఈ పిటిషన్లో ప్రస్తావించారు. తద్వారా అంతా చంద్రబాబు తానులో ముక్కలేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే సత్తా లేక కుట్ర రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు మరోసారి పరోక్షంగా చెప్పారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రచారంలోకి తీసుకువచ్చిన కట్టుకథను ప్రజలు ఆ ఎన్నికల్లో తిప్పికొట్టారు. ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులతో చెప్పించే సరికొత్త డ్రామాకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతతో మూడేళ్లకుపైగా డ్రామా నడిపించారు. ఆ తరువాత బాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిలను రాష్ట్ర రాజకీయ తెరపైకి తెచ్చారు. సునీత చేస్తున్న నిరాధార ఆరోపణలనే షర్మిల కూడా వినిపిస్తున్నారు. ఇటీవల వివేకా సతీమణి సౌభాగ్యమ్మనూ తెరపైకి తెచ్చారు. వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిలతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వారందరి ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. తాజాగా పులివెందుల కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సునీత, బీటెక్ రవి ఒకేలా చంద్రబాబు పాటనే పాడారు. వివేకా శత్రువులు, హంతకులతోనే జట్టు కట్టిన సునీత దంపతులు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉంది. వివేకాను 2017లో రాజకీయంగా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీగా ఓడించిన బీటెక్ రవి తదితరులతో వారు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినప్పటికీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన ఇదే బ్యాచ్‌తో సౌభాగ్యమ్మ, సునీత దంపతులు నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉండటం వివాదాస్పదంగా మారింది. సునీత ఇటీవల మీడియా సమావేశంలోనూ చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, మహాసేన రాజేశ్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. మరోవైపు వివేకాను కిరాతకంగా నరికి హత్య చేశానన్న దస్తగిరితోనూ సఖ్యతతో ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. హత్య జరిగిన రోజునా సందేహాస్పదంగా.. వైఎస్ వివేకా హత్య అనంతరం ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019 మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. లేఖను వారు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. -
షర్మిలకు ఈసీ నోటీసులు..
అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో షర్మిలకు ఈసీ నోటీసులిచ్చింది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా నోటీసుల్లో స్పష్టం చేశారు. -
కూటమికి వెంటిలేటర్ తీసేసినట్లేనా?
రెండు కాళ్లూ పడిపోయి చంకల్లో కర్రలు పెట్టుకుని దేకుతూ వెళ్తున్నవాడి కర్రలు ఫాట్ మని లాగేస్తే ఏమవుతుంది? అన్ని అవయవాలూ పని చేయడం మానేస్తూ.. ఒక్కోటీ విశ్రమిస్తుంటే.. ఏదోలా ఆయువును నిలుపుతున్న వెంటిలేటర్‌ను ఆపేస్తే ఏమవుతుంది. ఏదోలా గౌరవ ప్రదమైన స్కోర్ చేస్తాడు అనుకున్న బ్యాట్స్ మ్యాన్ రెండో బంతికే అవుటైతే ఎలా ఉంటుంది.. గోల్డ్ మెడల్ తెస్తాడు అనుకున్నవాడు డోపింగ్ టెస్టులో దొరికిపోతే ఏమవుతుంది.. ఆ అందరి ఆశలూ గల్లంతవుతాయి. భవిష్యత్ అంధకారమవుతుంది.. కొన్ని జీవితాలు ముగిసిపోతాయి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామం కూడా అచ్చం అలాంటిదే. తెలుగుదేశం.. జనసేన.. బీజేపీ.. ఇంకా కాంగ్రెస్ నాయకులూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక్కటంటే ఒక్క కారణం, రాజకీయ ఆధారం కనిపించడం లేదు. గతంలో టీడీపీ- జనసేన-బీజేపీ కలిపినా ఉమ్మడి పాలనలో రాష్ట్రానికి ఏమి చేశారన్నది వాళ్లు ఒక్క ముక్కా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలను మిళితం చేసి రుచి చూపించిన పాలనకు ప్రజలు ఫిదా అయ్యారు. ఈసారి కూడా జగన్ మళ్లీ గెలవాలని రైతులు.. మహిళలు.. యువత.. పేదలు... దళితులూ.. మైనారిటీ గిరిజనవర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల జాబితా సూపర్ సిక్స్ ను ప్రజలు నమ్మడం లేదు... ఎందుకంటే బాబుకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. అందుకే సూపర్ సిక్స్ పెద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కూటమి నాయకులూ యావత్తు.. తాము మూడుసార్లు గెలిచాక ఏమి చేసాం.. మళ్ళీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తాం అనేది చెప్పకుండా ఐదేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్యకేసును ప్రచారాంశంగా మార్చుకుని పదేపదే అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. మాటిమాటికీ హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు అరుస్తూ ఆ హత్యకేసును సీఎం వైయస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డికి చుట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదే ఎజెండాను అటు వివేకా కుమార్తె సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పవన్ కళ్యాణ్, ఆఖరుకు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్రెడ్డిని దోషిగా మార్చేందుకు యాతన పడుతున్నారు. వాస్తవానికి ఈ కేసు ఇప్పటికే సీబీఐ విచారణలో ఉండగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ విచారించింది. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని పదేపదే ప్రజల్లోకి తీసుకెళ్లడం అనైతికమని చంద్రబాబుకు తెలుసు కానీ అది మినహా వేరే అంశం తనకు లేకపోవడంతో ఎంతసేపూ వివేకా హత్య అంశమే ప్రచారాంశం అవుతోయింది. దీంతో ఇక ఈ హత్య కేసును ఆ అంశాన్ని ప్రచారంలో వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను బలపర్చిన న్యాయస్థానం వైఎస్ షర్మిళ, సునీత, చంద్రబాబు, పవన్, లోకేష్.. పురందేశ్వరి ఇలా ఎవరూ ఆ హత్య కేసును ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు ఆదేశించింది. దీంతో కూటమి నాయకులకు గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. ఇన్నేళ్ల పాలనలో తాము చేసింది కానీ.. చేయబోయేది కానీ చెప్పుకునేందుకు ఒక్కటీ లేని పరిస్థితుల్లో కేవలం ఆ హత్య కేసుని పదేపదే సభల్లో ప్రస్తావించి పబ్బం గడుపుకుందాం అనుకున్న చంద్రబాబుకు ఇది షాకింగ్ వార్త.. ఇక ఈ అంశం మాట్లాడకుండా ఎన్నికల సభలు ఎలా నిర్వహిస్తారో ఆయనకు.. లోకేష్.. పవన్.. పురందేశ్వరికి తెలియాలి. ఇక చేయడానికి ఏమీ లేని తరుణంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో.. ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.. -సిమ్మాదిరప్పన్న -
వివేకా హత్యపై దుష్ప్రచారం ఆపండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తదితరులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే మాట్లాడాలని కుండబద్దలు కొట్టింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, షర్మిల, సునీత తదితరులు తాము చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. వీరు సీఎం వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలపై దుష్ప్రచారం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. రాజకీయంగా మైలేజీ కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, మీడియా పబ్లిక్ కోర్టుగా అవతరించి న్యాయపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని కడప జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి రెండు రోజుల క్రితం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు, వక్రీకరణలు ఆపండి.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ధ్రువీకరణ కాని ఆరోపణలతో, వక్రీకరణలతో వ్యక్తిగత దాడులు, విమర్శలు చేయడం మానాలని కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలను, వారి పార్టీల క్యాడర్‌ను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉందని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయా పార్టీల అధినేతలను, అనుచరులకు కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్ రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేల్చిచెప్పింది. వ్యక్తిగత విమర్శలు మాని తమ పార్టీల ఎజెండాలపైన, ఇతర పార్టీల వైఫల్యాలపైన దృష్టి సారించాలని వారికి కోర్టు హితవు పలికింది. వివేకా హత్య కేసులో జగన్ నిందితుడు కాదన్న విషయాన్ని గుర్తెరగాలంది. రాజకీయ మైలేజీ కోసమే జగన్, అవినాశ్‌లపై.. షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు వ్యాఖ్యలు చేశారంది. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా పరువు నష్టం కలిగించేవేనని తేల్చిచెప్పింది. అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.. వాదనలు విన్న జిల్లా జడ్జి శ్రీదేవి పిటిషనర్ వాదనలతో ఏకీభవించారు. వాక్ స్వాతంత్య్రం సహేతుక పరిమితులకు లోబడి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఓ వ్యక్తి ప్రతిష్టను, మంచితనాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం ఆ స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ‘వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా షర్మిల, చంద్రబాబు, లోకేశ్ ప్రజల ముందు వైఎస్సార్సీపీ, దాని అధినేత వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తదితరులపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారనేందుకు, అసభ్యంగా పరిహాసం చేస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. వారి మాటలను, వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు పదే పదే ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ముఖ్యంగా అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా పేర్కొన్నారు. ఆయనను సీఎం జగన్ రక్షిస్తున్నారని పేర్కొన్నాయి.’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతరులు సొంత తీర్పులివ్వరాదు.. ‘పౌర హక్కుల దురాక్రమణను నిరోధించడానికి, నిందితుల హక్కులను కాపాడేందుకు, మీడియా ప్రవర్తనకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే విషయంలో సరైన నిబంధనలు లేవు. ఓ వ్యక్తి అరెస్ట్ సమయంలో అతడిని దోషిగా నిర్ధారించే ట్రెండే ప్రస్తుతం కొనసాగుతోంది. రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, మీడియా ఉన్నది ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే తప్ప, తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తీర్పులు ఇచ్చేందుకు ఎంతమాత్రం కాదు. ప్రస్తుత కేసులో ఈ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, వీడియోలు, పత్రికా కథనాలను విశ్లేషిస్తే.. బహిరంగంగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయనను వైఎస్ జగన్ రక్షిస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఓ కేసు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నప్పుడు.. ఎవరూ కూడా తమ సొంత తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. ఆ అధికారం ఎవరికీ లేదు. అలాంటి కేసులో ఉన్న వ్యక్తిని తమ ఇష్టానుసారం హంతకుడిగా, దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. నిష్పాక్షిక ట్రయల్ నిర్వహించి నిందితుడిని దోషిగా నిర్ధారించేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే అన్నది న్యాయ సూత్రం. ఓ వ్యక్తి నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పైన మాత్రమే ఉంది. పెండింగ్‌లో ఉన్న కేసు గురించి మూడో వ్యక్తి ఎవరూ కూడా తమ తప్పుడు ప్రయోజనాల కోసం బహిరంగంగా మాట్లాడటం, వ్యాఖ్యలు చేయడం, తీర్పులిచ్చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని జడ్జి శ్రీదేవి తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చంద్రబాబు ప్రోద్భలంతో వైఎస్ వివేకా హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, సునీత తదితరుల దుష్ప్రచారంపై విసిగిపోయిన వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. తమ పార్టీతో పాటు సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి, తదితరులపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతలను నిరోధించాలంటూ కడప జిల్లా కోర్టులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎం.నాగిరెడ్డి, కె.ఎస్.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరులు చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను, తప్పుడు ఆరోపణల వీడియోలను న్యాయవాదులు కోర్టు ముందుంచారు. కోర్టు ప్రొసీడింగ్స్‌లో మీడియా, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి ‘రాజకీయ పార్టీలు మీడియా ద్వారా పబ్లిక్ కోర్టుగా అవతరించాయి. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు సొంతంగా దర్యాప్తు చేసేస్తున్నాయి. తద్వారా కోర్టు ప్రొసీడింగ్స్‌లో జోక్యం చేసుకుంటున్నాయి. నిందితుడు, దోషికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించాయి. దోషిగా నిర్ధారణ అయ్యేవరకు నిరపరాధే అనే సూత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కోర్టులు కేసును విచారణకు స్వీకరించడానికి ముందే నిందితులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలుస్తున్నాయి. ఇది ప్రజలపై, జడ్జీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తత్ఫలితంగా అమాయకుడైన నిందితుడిని నేరస్తుడిగా చూడాల్సి వస్తోంది. నిందితుల హక్కులు, స్వేచ్ఛను పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ట్రయల్‌కు ముందు ఓ అనుమానితుడు, నిందితుడు విషయంలో మీడియా సాగించే పరిమితికి మించిన ప్రతికూల ప్రచారం ట్రయల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా అతడే నేరం చేశాడని భావించాల్సి వస్తోంది. ఇలా చేయడం న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని ఆపండి.. ఎన్నికల ప్రచారంలో షర్మిల తదితరులు వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అవినాశ్‌రెడ్డిని ఏకంగా హంతకుడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. చంద్రబాబు కూడా ప్రొద్దుటూరు సభలో వివేకాను హత్య చేసిన వ్యక్తిని ఎంపీగా నిలబెట్టారంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇక లోకేశ్ అయితే నేరుగా ముఖ్యమంత్రి జగనే తన బాబాయి వివేకాను హత్య చేశారని ఆరోపించారన్నారు. పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జగన్, అవినాశ్, వైఎస్సార్సీపీపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయా పార్టీల అధినేతలను, క్యాడర్‌ను నిరోధించాలన్నారు. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్, అవినాశ్‌పై వ్యాఖ్యలు.. ‘ప్రస్తుత కేసులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, బీటెక్ రవి వారి రాజకీయ మైలేజీ కోసం వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ ఎన్నడూ కూడా నిందితుడు కాదు. కాబట్టి వివేకాను జగన్ చంపారంటూ ప్రజలందరి ముందు లోకేశ్ చేసిన ప్రకటన పరువు నష్టం కలిగించేదే. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కోర్టు ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వుల వల్ల షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ, జగన్, అవినాశ్ రెడ్డిలకు తీరని నష్టం కలుగుతుంది. ఇదే సమయంలో షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు పదే పదే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల వేళ ఇది వైఎస్సార్సీపీ, ఎన్నికల్లో పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించా’ అని జిల్లా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వైఎస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి ప్రస్తావించొద్దని ఆదేశించింది. చంద్రబాబు, లోకేష్, పవన్, బీటెక్ రవిలతో పాటు పురందేశ్వరి, షర్మిల, సునీతను కూడా ఎన్నికల ప్రచారంలో మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. -
మహానటి సునీత..
-
వైఎస్ వివేకా కేసు..బయటపడ్డ కుట్ర..పుత్రిక డ్రామా
-
వైఎస్ వివేకా కేసులో సంచలన వీడియో
-
మహానటి.. సునీత.. వివేకా రెండో వివాహం గురించే తెలియదట
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి.. షమీమ్ అనే మహిళను పెళ్లి చేసుకోవడం, ఆమెతో ఒక కుమారుడిని కూడా కనడం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు చెలరేగి.. హత్యకు దారితీశాయని ఊరువాడా కోడై కూస్తున్నా.. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత మాత్రం తన తండ్రి రెండో వివాహం గురించి తనకు తెలియదని చెబుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా.. ఆమెతో ఆయనకు ఓ కుమారుడు ఉన్నాడట కదా.. అందుకే మీ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయంట కదా’ అని కొద్దిరోజుల క్రితం నర్రెడ్డి సునీత హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె తన రెండు భుజాలు ఎగురవేస్తూ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. ‘ఐ డోంట్ నో (నాకు తెలియదు)’ అని. నిజంగానే వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం సునీతకు తెలీదా అంటే ఎందుకు తెలీదు...పూర్తిగా తెలుసు అనే సమాధానమే వస్తోంది. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం బహిరంగ రహస్యం. షమీమ్‌ను వివేకా 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం రెండో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ 2014లో ఓ కుమారుడు జన్మించారు. ఆ కుమారుడికి షెహెన్ షా అనే పేరు కూడా పెట్టారు. వివేకా తన రెండో భార్య షమీమ్, కుమారుడు షెహెన్ షాతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. వివేకా రెండో వివాహం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తన రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని.. తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పారు. దీంతో ఉలిక్కిపడ్డ వివేకా అల్లుడు, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆస్తి వారసత్వం తనకే దక్కాలని, రాజకీయ వారసత్వం తనకే దక్కాలని వివేకా పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టు బట్టారు. ఆ విభేదాలతోనే వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులను వదిలేసి హైదరాబాద్‌లో కుమార్తె సునీత నివాసంలో ఉండేవారు. ఇక సునీత.. షమీమ్‌ను తీవ్రంగా దూషిస్తూ వాట్సాప్ సందేశాలు పంపారు. ఆ విషయాన్ని కూడా షమీమ్.. వివేకా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాలను షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూస్పష్టంగా పేర్కొన్నారు. షమీమ్ తన వాంగ్మూంలో వెల్లడించిన విషయాలు ఇవీ.. రెండో పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు.. వివేకా రెండో పెళ్లిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత ఏకంగా షమీమ్‌కు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాశ్‌రెడ్డి కూడా షమీమ్ బావకు ఫోన్ చేసి తీవ్రంగా దూషించడంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఆ విషయం తెలిసి వివేకా తీవ్ర ఆగ్రహంతో శివప్రకాశ్‌రెడ్డి కాలర్ పట్టుకుని నిలదీశారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె తన భార్యని స్పష్టం చేశారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష గట్టారు.. 2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిల నుంచి షమీమ్‌కు వేధింపులు తీవ్రమయ్యాయి. 2014లో వివేకా, షమీమ్‌లకు బాబు పుట్టాడు. ఆ బాబుకు షెహెన్ షా అనే పేరుపెట్టి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకా చెప్పారు. వివేకా మొదటి భార్యకు కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. దీంతో వారిద్దరూ వివేకానందరెడ్డిపై కక్ష గట్టారు. బైరటీస్ గనులు ఉన్న నాలుగు ఎకరాల భూమిని షమీమ్ కుమారుడి పేరున రాయాలని వివేకా భావించారు. కానీ అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నాలుగు ఎకరాల భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారు. అంతేకాకుండా వివేకా అప్పటికే షమీమ్‌కు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను కూడా బలవంతంగా శివప్రకాశ్‌రెడ్డి తీసేసుకున్నారు. షమీమ్‌ను దూషించిన సునీత సునీత.. వివేకా రెండో భార్య షమీమ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆమెను తీవ్రంగా దూషించారు. సునీత తనను ఎలా దూషించిందీ చెబుతూ షమీమ్.. వివేకాకు వాట్సాప్ సందేశాలు పంపారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఆ వాట్సాప్ చాటింగ్‌లను అప్పట్లోనే వెలికి తీశారు కూడా. అయినా సరే తన తండ్రి వివేకా రెండో వివాహం గురించి తనకు తెలీయదని సునీత చెప్పడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. వివేకా హత్య కేసు వెనుక ఉన్న కుట్రను బయటకు రాకుండా చేసేందుకే ఆమె ఇలా అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నది స్పష్టమవుతోంది. ఒంటరి అయిన వివేకా.. వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించారు. ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దీంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు. -
బయటపడ్డ వివేక హత్య వెనుక అసలు కారణం...వీడియోతో బుక్కయిన సునీత
-
ఇదంతా సీబీఐ, సునీత ఆడుతున్న డ్రామా
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సునీతక్క చెబుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు శాస్త్రీయ విధానంలో కాకుండా, పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఇదంతా దస్తగిరిని అడ్డం పెట్టుకొని, హియర్ సే ఎవిడెన్స్ అంటూ సీబీఐ, సునీత తదితరులు కలిసి ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ‘వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి. కానీ, సీబీఐ అతన్ని అరెస్టు చేయలేదు. పైగా, అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చేంత వరకూ వేచి ఉండి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టే బెయిల్ వచ్చిన తర్వాత 306 (4)బి ప్రకారం అప్రూవర్‌గా మార్చారు. ఇక అతను జైలుకెళ్లే అవకాశం లేదు. సీబీఐ, సునీత ఈ విధానాన్ని వాడుకున్నారు. ఒకవేళ హంతకుడినని ఒప్పుకొన్న అతన్ని అరెస్టు చేసి ఉంటే జీవిత కాలం బెయిల్ వచ్చి ఉండేది కాదు. అందుకే హంతకుడినని ఒప్పుకొన్న దస్తగిరి ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సహకరించి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఇక జీవిత కాలం ఈ కేసులో అతని అరెస్టు ఉండదని హామీ ఇచ్చి, ఈ ప్రయోజనాన్ని కల్పించినందుకు వారికి కావల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. ఇదంతా డ్రామా కాదా?’ అని అవినాశ్ ప్రశ్నించారు. దస్తగిరి హియర్ సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారని, అందువల్లే తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని, రెండున్నరేళ్లు శివశంకర్‌రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. గూగుల్ టేకౌట్‌కు కచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగన్న నలుగురి పేర్లు చెప్పినప్పటికీ, వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదని, కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదని తెలిపారు. సునీత అప్పుడొకలా.. ఇప్పుడొకలా.. వివేకా హత్యపై నర్రెడ్డి సునీత మొదట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని అవినాశ్ అన్నారు. ‘2020 జూలై 20న సీబీఐకి సునీత వాంగ్మూలమిస్తూ ఆమె భర్త సెల్ఫోన్లో వివేకా రాసిన డెత్ నోట్ ఫోటో చూపించారని, అందులో మా తండ్రి డ్రైవర్ ప్రసాద్‌ను డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడని, ఈ లెటర్ రాసేందుకు చాలా కష్టపడ్డానని, డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని రాసి ఉన్నట్లు చెప్పింది. 2020 ఆగస్టు 27న లెటర్ గురించి ఏమీ తెలియదని, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చూపించారని చెబుతోంది. ఇలా నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు నాన్నగారు అవినాశ్‌ను ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎంను చేసేందుకు ఏమేమి చేయాల్నో అంతా చేశారని సునీత చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్ మోటివ్ అని చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత 2023 మే31న సీబీఐ దగ్గరికి వెళ్లి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్పమంటే అలా చెప్పానంది. అప్పటికే 13 సార్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత ఏనాడూ ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమంటే.. ఇప్పుడు చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణా చెప్పమంటే చెబుతున్నారా’ అని అన్నారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్లాను ‘ఆ రోజు జమ్మలమడుగు వెళ్తున్న నాకు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేశారు. వివేకా చనిపోయినట్లు చెప్పి విలపించారు. వెంటనే ఇంటికెళ్లమన్నారు. నేను వెళ్లి డెడ్‌బాడీని చూసి బయటకు వచ్చేశాను. సీఐకి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్ నోట్లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని ఎందుకు చెప్పారు? లెటర్లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఇంక థర్డ్ పర్సన్ ఫోన్‌కాల్ కోసం వెయిటింగ్ ఎక్కడ? శివప్రకాష్‌రెడ్డి థర్డ్ పర్సనా? వివేకా చివరి రెండేళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని పని మనుషులు వాంగ్మూలమిచ్చారు. ఆస్తి ఆమ్మే అవకాశం లేదు. చెక్ పవర్ రద్దు చేశారు. రెండో భార్య షమీమ్, అమె కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం డైమండ్స్, సెటిల్మెంట్లు అంటూ తిరగడం ఆరంభించారు’ అని తెలిపారు. మా ఇద్దర్నీ గెలిపించాలని వివేకా పిలుపు ‘నేను చేసే ప్రతి కార్యక్రమాన్నీ వివేకా బలపర్చేవారు. 2014లో వేంపల్లెలో వీధి వీధీ తిరుగుతూ జగన్నను సీఎం చేయాలని, నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2019ఎన్నికల్లో చివరిరోజు కూడా ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించామని చెబుతున్నారు. 854 మంది ఓటర్లలో ఒక్కరినైనా సీబీఐ విచారించిందా? మీకంటే చిన్నోడినైన నాపైన ఎందుకింత ద్వేషం’ అని ప్రశ్నించారు. వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే ఆరోజు రాత్రి అంతా నేను ఫోన్ వాడినట్లు సునీత చెబుతోంది. నేను ఆరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను. ఫోన్ నెట్ ఆన్‌లో ఉంటే మేసేజ్‌లు వస్తుంటాయి. నానుంచి ఎవరికీ మెసేజ్ కానీ, ఫోన్‌కాల్ కానీ వెళ్లలేదు. ఎర్ర గంగిరెడ్డి నుంచి నాకు ఎలాంటి మేసేజ్ రాలేదు. అంటే వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే. ఎవరెన్ని అబద్దాలు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల, సునీత ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. తాను బీజేపీకిలోకి వెళ్తాననడం ‘జోక్ ఆఫ్ ది సెంచురీ’ అని ఓ విలేకరి ప్రశ్నకు సమా«ధానంగా అవినాశ్ రెడ్డి చెప్పారు. హార్ట్ ఎటాక్ అన్నది సునీత కుటుంబం చేసిన ప్రచారమే ‘హార్ట్ ఎటాక్ అన్న విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారమైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదే రోజు మీడియాతో మాట్లాడుతూ హార్ట్ ఎటాక్‌తో వివేకానందరెడ్డి చనిపోయినట్లు శివప్రకాష్‌రెడ్డి చెప్పినట్లుగా తెలిపారు. అదే విషయాన్ని వీడియో ద్వారా వివరించారు. హార్ట్ ఎటాక్ అని ఫిర్యాదు చేయాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పినట్లు సునీత చెప్పారు. డెత్‌నోట్ చదివాక కూడా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు. -
వివేకా కేసులో సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారు: ఎంపీ అవినాష్
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. ఏపీ ఎన్నికల వేళ.. రాజకీయాలు వేడేక్కిన వేళ.. పోలింగ్ సమీపిస్తోన్న వేళ.. నర్రెడ్డి సునీత పెడుతున్న ప్రెస్మీట్లు, చేస్తోన్న వివాదస్పద అంశాలు, బోడిగుండుకు.. మోకాలికి ముడిపెడుతూ చేస్తోన్న సూత్రీకరణలను అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక పకడ్బందీగా పన్నిన కుట్రలో భాగంగా సునీత ప్రెస్మీట్లలో అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, షర్మిల ఓ అడుగు ముందుకేసి ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందని, వాటిని చంద్రబాబు.. మరో అడుగు ముందుకేసి హత్యా రాజకీయాలంటూ ప్రకటనలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అసలు హత్య కేసులో ఇప్పటివరకు సిబిఐ అనుసరించిన ధోరణి, దర్యాప్తులో డొల్లతనంతో పాటు సునీత వ్యవహార శైలిని కూడా అవినాష్ రెడ్డి పలు ఆధారాలతో మీడియా ముందుంచారు. ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు: షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారు లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోంది అసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చాను దస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండి ఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడు రంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలి నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదు దస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారు అనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడు దస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదు పక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు 306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదు కానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారు అప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది? సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయి ఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.? హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసు జమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు? నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చాను ఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోంది ఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది? వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ? శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పాను మూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ? ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా? నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడు నేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పాను వివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలి ఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడు ఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడు సునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలి ఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసు వివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారు చివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ? బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు. రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారు ఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదు గూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోంది వైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది 100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోంది అది కూడా మూడేళ్ల తరువాత చూశారు? మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు? గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది? గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది? ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారు వారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదు చంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారు నేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదు న్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉంది ఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుంది నా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారు ఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలి నా నెంబర్ వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులున్నాయి. ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుంది నేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా? మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారు అనేక ఇబ్బందులకు గురిచేశారు 74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడు టిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారు హత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.! వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు? వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచింది కేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు -
‘వివేకా’ కేసు.. బాబు ప్రయోజనాల కోసమే..
కడప కార్పొరేషన్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కో–ఆర్డినేటర్ కె. సురేష్‌బాబు, డా. చైతన్యరెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం నీచ రాజకీయాలు చేయడమే చంద్రబాబు సంస్కృతి అని, అన్ని వ్యవస్థలను ధ్వంసంచేసి తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడమేగాక, ఆయన మరణానికి కూడా బాబు కారణమయ్యారన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఒక కొత్త కూటమి ఏర్పాటుచేయడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. 2014లో నరేంద్ర మోదీ, పవన్‌కళ్యాణ్‌తో.. 2019లో లోపాయికారిగా జనసేనతో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పాటు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన అందరి కుటుంబాల్లో చిచ్చుపెడతారన్నారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని రమేష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రెండు చానెళ్లు, రెండు పత్రికలైతే అదేపనిగా సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలపై బురదజల్లుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వైఎస్ వివేకా కేసు కోసం రూ.వందల కోట్లు ఖర్చుచేశారని, కోట్ల రూపాయలు వెచ్చించి లూథ్రా అనే ఖరీదైన న్యాయవాదిని నియమించుకున్నారన్నారు. ఇక ‘వివేకం’ అనే సినిమాలో క్యారెక్టర్లను చాలా నీచంగా చూపించడం దారుణమన్నారు. అవినాశ్ ఎలాంటివారో షర్మిల, సునీతలకు తెలీదా? ఇక అవినాశ్ ఎలాంటి వారో షర్మిల, సునీత ఇద్దరూ చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, వారికి తెలీదా.. ఎప్పుడైనా ఆయనలో నేరప్రవృత్తి గమనించారా.. దౌర్జన్యాలు, రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ గొడవలతో ఆయనకు సంబంధం ఉందేమో గుండెలపై చేయివేసుకుని చెప్పాలన్నారు. నిష్కళంకమైన జీవితం గడుపుతున్న అవినాష్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రజాసేవ చేయాలని ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారని.. ఏ రకమైన ఫ్యాక్షన్‌ను, గొడవలను ఆయన ప్రేరేపించలేదన్నారు. చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్ అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించేందుకు రూ.కోట్లు ఖర్చుచేసి చార్టెర్డ్ ఫ్లయిట్లు పెట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేశారని రమేష్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 40 సీట్లను రూ.వందల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో కూడా చాలామంది డబ్బులిచ్చి టికెట్లు కొన్నారన్నారు. మరోవైపు.. షర్మిల, సునీత న్యాయపోరాటం చేస్తున్నారో, రాజకీయ పోరాటం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ దయచేసి నోరు విప్పవద్దని ఆయన సూచించారు. ఇక చంద్రబాబు చెబుతున్న ‘సూపర్ సిక్స్’ ఒక ఫ్లాప్సిక్స్ అని రమేష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటేస్తే కాంగ్రెస్, బీజేపీలకు వేసినట్లేనని తెలిపారు. సునీతవి అర్థంలేని ఆరోపణలు డా. చైతన్యరెడ్డి మాట్లాడుతూ.. డాక్టరేట్ పొందిన సునీత అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య జరిగిన రోజు రాత్రి ఏ–1 ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి వాట్సాప్ కాల్స్ చేసుకున్నారని చెప్పడం అబద్ధమన్నారు. సీబీఐ చార్జిషీట్లో వాట్సాప్ చాట్‌లో ఉన్నారని చెప్పిందే తప్పా వాట్సాప్ కాల్స్ అని ఎక్కడా చెప్పలేదన్నారు. ఎన్నికల సమయం కాబట్టి వాట్సాప్‌కు మెసేజ్‌లు వస్తూ ఉంటాయని, ఫోన్ ఆన్‌చేసి ఉంచితే ఎవరి వాట్సాప్ అయినా యాక్టివ్‌లో ఉన్నట్లేనని చెప్పారు. ఇక గూగుల్ టేకౌట్‌కు శాస్త్రీయతలేదని, దాన్ని గూగుల్ కంపెనీ దానిని సర్టిఫై చేయలేదని, న్యాయమూర్తి కూడా అంగీకరించలేదన్నారు. కోర్టులో నేరం రుజువు కాకుండా ఆరోపణలు చేయడం సరికాదని షర్మిల, సునీతకు చైతన్యరెడ్డి హితవు పలికారు. -
దస్తగిరి కుమ్మక్కు డ్రామాలు
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి కట్టుకథ పథకం ప్రకారమే తెరపైకి వచ్చిందని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఆ కట్టుకథను నిజం చేయాలనే కుట్రతో వ్యవహరిస్తున్నారని, సీబీఐ సైతం ఆరోపణలకు తగిన ఆధారాలు సేకరించలేదన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీత ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం పదే పదే వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. తన తండ్రి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివేకాను చంపినట్లు నేరం ఒప్పుకున్న దస్తగిరిని సీబీఐ విడిచిపెట్టడం వెనుక తిరకాసు ఉందన్నారు. డాక్టర్ సునీత ఆరోపణలు, సీబీఐ దర్యాప్తులో లోపాలపై సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందస్తు బెయిల్ లభించాకే అప్రూవర్‌గా.. డ్రైవర్ దస్తగిరి 2021 ఆగస్టు 25న 161 సీఆర్పీసీ స్టేట్మెంట్ ఇవ్వగా ఆగస్టు 31న మేజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని ప్రకారం దస్తగిరి స్వయంగా వివేకాను చంపినట్లు ఒప్పుకున్నాడని చైతన్యరెడ్డి గుర్తుచేశారు. అదే ఏడాది అక్టోబర్ 7న ముందస్తు బెయిల్ కోసం దస్తగిరి దరఖాస్తు చేసుకోగా అక్టోబర్ 22న మంజూరైంది. దస్తగిరి బెయిల్‌కు అటు సీబీఐ, ఇటు సునీత ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అప్రూవర్‌ను అరెస్టు చేస్తే కేసు పూర్తయ్యేవరకు బెయిల్ లభించే అవకాశం లేదు కాబట్టి ముందస్తు బెయిల్ లభించిన తర్వాత దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఈ వ్యవహారం వెనుక డాక్టర్ నర్రెడ్డి సునీత, అప్పటి సీబీఐ అధికారి రాంసింగ్ ఉన్నారు. అసలు విషయం అక్కడే ఉంది.. వివేకా హత్యకు గురైన ప్రదేశంలో క్లూస్ టీమ్‌కు లభించిన ఆధారాలు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్మెంట్ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. క్లూస్ టీమ్ ఫొటోల ప్రకారం తలుపుల సేఫ్టీ లాక్, టవర్ బోల్ట్ బద్ధలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దస్తగిరి మాత్రం తన వాంగ్మూలంలో ఎర్ర గంగిరెడ్డి లోపలి నుంచి తలుపు గడియ తీయడంతో తాము ఇంట్లోకి ప్రవేశించామని చెప్పాడు. అది శుద్ధ అబద్ధం. నర్రెడ్డి సునీత దంపతులు తలుపుల లాక్‌లకు మరమ్మతులు చేయించారు. సేప్టీలాక్, టవర్ బోల్ట్ బద్దలైన విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లకుండా దాచి పెట్టారు. అక్కడే అసలు విషయం దాగి ఉంది. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వచ్చాÆý‡న్న విషయం బహిర్గతం అయితే దస్తగిరి కట్టుకథ తేలిపోతుందని జాగ్రత్త పడ్డారు. క్లూస్‌టీమ్ సేకరించిన ఐదు వేలి ముద్రలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులవి కాదు. అవి ఎవరివో ఇప్పటికీ సీబీఐ నిగ్గు తేల్చలేదు. పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివేకా హత్యకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారే హత్య చేసినట్లు నాడు తేల్చారు. ఇంటి ఉత్తరం వైపు తలుపు నుంచి ముగ్గురు బయటికి వచ్చారని, కొద్ది సేపటికి బయటకు వచి్చన ఎర్రగంగిరెడ్డిని ఏమైందని అడగ్గా కోపంగా తోసేయడంతో కింద పడ్డానని ప్రత్యక్ష సాక్షి రంగన్న చెప్పాడు. దస్తగిరి తూర్పు వైపు ఉన్న మెయిన్ డోర్ గుండా బయటికి వచి్చనట్లు చెబుతుండగా ప్రత్యక్షసాక్షి రంగన్న మాత్రం ఉత్తరం వైపు డోర్ నుంచి వచ్చారని చెబుతూ పరస్పర విరుద్ధంగా వాంగ్మూలాలు ఇచ్చారు. గూగుల్ టేకౌట్ పేరిట దుష్ప్రచారం వైఎస్ వివేకా, వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇళ్ల మధ్య 300 మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఒక వర్గం మీడియా హత్యకు ముందు నిందితులంతా వైఎస్ భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా తెలిసిందంటూ ప్రచారం చేసింది. గూగుల్ టేకౌట్‌కు ప్రామాణికత లేదని సీబీఐనే వెల్లడించింది. ఆ అవసరం ఎవరికి ఉంది? వివేకా హత్య అనంతరం రౌండ్ సీల్ ఉన్న దస్తావేజులు తీసుకెళ్లినట్లు దస్తగిరి చెబుతున్నాడు. రౌండ్ సీళ్లు ఉన్నాయంటే అవి నోటరీ అఫిడవిట్లు లేదా వీలునామా కావచ్చు. బెంగళూరు స్థలానికి చెందిన డాక్యుమెంట్లు అన్నది శుద్ధ అబద్ధమని సీబీఐ దర్యాప్తులో తేలింది. వీలునామా దస్తావేజులు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దీన్నిబట్టి వివేకా రెండో భార్య షమీమ్, వారసుడు షహెన్షా పేరుతో ఉన్న విల్లును దొంగిలించినట్లు తెలుస్తోంది. అసలు ఎర్ర గంగిరెడ్డి నేరస్తులతో కలిసి లేరని దర్యాప్తు ఆధారంగా రూఢీ అవుతోంది. అంటే దస్తగిరి వాంగ్మూలం అంతా కట్టుకథేనని స్పష్టమవుతోంది. దస్తగిరి అప్రూవర్‌గా మారడం ఒక నాటకమే. ఎర్రగంగిరెడ్డి చెప్పాడని నా తండ్రి శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి పేర్లను కేసులో చేర్చడం పథకంలో భాగమే. ఆ కట్టుకథ ఆధారంగా బాబు, షర్మిల, సునీత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు దర్యాప్తు అధికారిని తప్పించినా కింది స్థాయి సిబ్బందిని అలాగే కొనసాగించడంతో సీబీఐ అసలు హంతకులను వదిలేసి సంబంధం లేని వ్యక్తులపై నిందలు మోపింది. సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమైంది. -
‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుంది. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుంది. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోంది. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు?. దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని డాక్టర్ చైతన్యరెడ్డి తెలిపారు. -
షర్మిల, సునీతలు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలు: వైఎస్సార్ సోదరి విమలమ్మ
సాక్షి, అమరావతి: ‘వైఎస్ కుటుంబ ఆడపడుచులు షర్మిల, సునీత అన్యాయంగా మాట్లాడుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. నేనూ వైఎస్ కుటుంబ ఆడపడుచునే. వివేకానందరెడ్డి అందరికంటే నాకే ఎక్కువ సన్నిహితుడు. ఆ కుటుంబ ఆడపడుచుగా చెబుతున్నా.. మా అన్నయ్య వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఎంపీ అవినాష్రెడ్డికిగానీ వైఎస్ భాస్కర్రెడ్డికిగానీ ఎలాంటి సంబంధంలేదు’.. అని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరి విమలమ్మ విస్పష్టంగా ప్రకటించారు. ‘కొంగు పట్టుకుని షర్మిల ఓట్లు అడుగుతున్న వీడియో చూసి చాలా బాధపడ్డాను. వైఎస్ కుటుంబ పరువును ఆమె రోడ్డుకీడుస్తున్నారు. ఆమెలో నాయకత్వ లక్షణాల్లేవు. నిత్యం వైఎస్ అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అతను హత్యచేయడంగానీ చేయించడంగానీ వాళ్లు చూశారా? సీఎం జగన్‌పై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు హత్యచేశారో షర్మిల, సునీతే నిర్ణయించేస్తే ఇక కోర్టులు, జడ్జీలు ఎందుకు?’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. విజయవాడలో శనివారం విమలమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ఇలా సూటిగా స్పందించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలుగా షర్మిల, సునీత.. వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులంతా ఒక్కటయ్యారు. ఈ తరుణంలో వైఎస్ కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలి. కానీ, వైఎస్ శత్రువుల చేతుల్లో షర్మిల, సునీత కీలుబొమ్మలయ్యారు. వాళ్లిద్దరి చూట్టూ ప్రస్తుతం వైఎస్ కుటుంబ శత్రువులే ఉన్నారు. షర్మిల, సునీతలకు చెబుతున్నా.. వారు నోరు మూసుకోవాలి. పేద ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం సరికాదు. వారిద్దరూ ఎందుకిలా చేస్తున్నారో అర్థంకావడంలేదు. డబ్బు కోసమో పదవి కోసమే తెలీడం లేదుగానీ అసూయ, ద్వేషంతో వ్యవహరిస్తున్నారు. ఏదో ఆశించే ఇదంతా చేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని దూరం పెట్టారు. వాళ్ల పనులు కావడంలేదనే ఇలా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. వారికి మంచి చెప్పాలని చూశాను. అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశారు. హంతకుడు దస్తగిరి దర్జాగా తిరుగుతున్నాడు.. షర్మిల, సునీత తామేది మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు. మా ఇంట్లో అమ్మాయిలు ఇలా అన్యాయంగా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది. వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్యచేశాను అని చెప్పిన దస్తగిరి మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నాడు. అతని మాటలు నమ్మి అవినాష్‌రెడ్డిని విమర్శిస్తారా? ఏ తప్పూ చేయని వైఎస్ భాస్కర్‌రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నారు. అవినాష్ బెయిల్ రద్దుచేయాలని షర్మిల, సునీత కోర్టులో కేసులు వేశారు. కానీ, వివేకాను హత్యచేశాను అని చెప్పిన దస్తగిరి బెయిల్‌పై ఉన్నా వారెందుకు పట్టించుకోవడంలేదు? షర్మిల, సునీత ఎన్ని మాటలంటున్నా అవినాష్ ఒక్క మాటా కూడా అనడంలేదు. వైఎస్‌కు వివేక ఎలాగో.. జగన్‌కు అవినాశ్ అలా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూసేవారు. అందుకే పులివెందుల, కడప జిల్లాలో పార్టీ బాధ్యతలను వివేకాకు అప్పగించారు. వారిద్దరిలో ఒకరు ఎంపీగా పోటీచేస్తే మరొకరు ఎమ్మెల్యేగా పోటీచేసేవారు. అలా ఓటమి అన్నది లేకుండా గెలుస్తూ వచ్చారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వివేకానందరెడ్డి ఎలానో ప్రస్తుతం వైఎస్ జగన్‌కు వైఎస్ అవినాశ్ అలా అండగా ఉన్నారు. కానీ, వైఎస్ హఠాన్మరణం తర్వాత మారిన పరిస్థితుల్లో వైఎస్ జగన్ తన తండ్రి ఆశయ సాధన కోసం పార్టీ పెట్టారు. దురదృష్టవశాత్తూ ఆనాడు వివేకానందరెడ్డి కాంగ్రెస్ వైపు ఉండిపోయారు. ఆ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చింది. అందుకే పులివెందుల, కడప జిల్లాల్లో పార్టీ బాధ్యతలను చూసుకునేందుకు అవినాష్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. దీంతో అవినాష్ తనపై పెట్టిన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. పులివెందులను, కడప జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. అసలు అవినాష్‌ను ఎంపీగా గెలిపించాలనే వివేకానందరెడ్డి చివరివరకూ ప్రచారం చేశారు కదా. ఈ విషయాన్ని గుర్తించయినా షర్మిల, సునీత అవినాష్ మీద దుష్ప్రచారాన్ని మానుకోవాలి. ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌కు అండగా నిలవాలి. వారిద్దరూ మరోసారి కూర్చుని చర్చించి జగన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే జగన్ శత్రువులంతా ఒక్కటయ్యారు. బయట శత్రువులంతా ఒక్కటైతే కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండి ఎదుర్కోవాలి. ఆ కుటుంబ ధర్మాన్ని పాటించాలని షర్మిల, సునీతలకు సూచిస్తున్నా. జగన్‌ను మళ్లీ సీఎంను చేయండి.. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నారు. వైఎస్, వివేకా ఇద్దరూ ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకం. మా నాన్నను హత్యచేసిన తరువాత కూడా ఎలాంటి ప్రతికార రాజకీయాలకు పాల్పడకుండా వారు ఫ్యాక్షన్‌ను అంతంచేశారు. కానీ, ప్రశాంతంగా ఉన్న పులివెందులలో ప్రస్తుతం కొందరు అల్లర్లు రేకెత్తించేందుకు యత్నిస్తుండటం బాధ కలిగిస్తోంది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సాధించేందుకు జగన్ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. పేద ప్రజలకు అంత మంచి చేస్తున్న జగన్ మరోసారి సీఎం కావాలి. అందుకోసం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు అందరినీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు: వైఎస్సార్ సోదరి విమల
సాక్షి, విజయవాడ: వైఎస్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని వైఎస్సార్ సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని అన్నారామె. వైఎస్ విమల శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా?.. .. షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడ ఉంది. అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది. శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి. వైఎస్సార్ ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు .. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు. మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు. మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు. వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు .. కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా?. వైఎస్సార్ ఉన్నపుడు వివేకానంద రెడ్డి కడప చూసుకున్నారు. ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు. నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు. మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు. శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు. అవినాష్ పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది. షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు. షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి వాళ్లిద్దరూ ఇదంతా చేస్తున్నారు. .. జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. లేదంటే ఒకసారి షర్మిల, సునీత మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి’’ అని విమల ఏపీ ప్రజల్ని కోరారు. -
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్‌రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డికి భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్‌రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
వివేకా కేసులో దొరికిపోయిన సునీత
-
తండ్రి హత్యపై సునీత కుట్ర..
-
బాబు చేతిలో కీలుబొమ్మ సునీత
సాక్షి, అమరావతి: పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ లోకం అంతా కళ్లు మూసుకుందని అనుకున్నట్టుగా ఉంది నర్రెడ్డి సునీత తీరు. ఆమె చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారి, బాబు కుట్రలో భాగస్వామిగా మారి ఆమె తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. రాష్ట్ర ప్రజలంతా నమ్మేస్తారని భ్రమపడుతున్నారు. ఇదే భావనతో హైదరాబాద్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించి మరీ చంద్రబాబు స్క్రిప్‌్టను వినిపించారు. ఇన్నాళ్లూ బాధితురాలిగా వేసుకున్న ముసుగును తొలగించి పూర్తిగా టీడీపీ మనిషినేనని బయటపడ్డారు. ఓ వైపు ఆమె తండ్రి వైఎస్ వివేకా హత్య వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూనే, మరోవైపు వివేకా హంతకులతో జట్టు కడుతుండటం ఆమెకే చెల్లింది. వివేకానందరెడ్డి రెండో వివాహంతో కుటుంబంలో తలెత్తిన విభేదాలను మరుగున పెట్టి, తన తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదాలు లేవని నమ్మిచేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కడప ఎంపీ అభ్యర్థిత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసిన సునీత.. తాజాగా పులివెందుల ఉప ఎన్నికల్లో అభ్యర్థిత్వంపైనా అబద్ధాలు చెబుతున్నారు. ఆమె తండ్రి రాసిన లేఖను వారే దాచిపెట్టిన నిజం, గుండెపోటు కథను వారే ప్రచారంలోకి తెచ్చిన వాస్తవం బయటపడకుండా చూడటమే ధ్యేయమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాను కుట్రతో ఓడించింది చంద్రబాబు ముఠాయేనని, 2019 ఎన్నికల్లో వివేకాను టీడీపీకి అడ్డుగా లేకుండా చేసిందీ ఎల్లో గ్యాంగేనన్నది బహిరంగ రహస్యం. అందుకే ఆమె అబద్ధాలను ప్రజలు నమ్మడంలేదు. అసత్య ప్రచారాన్ని పూర్తి ఆధారాలతో సహా, హేతుబద్ధమైన ప్రశ్నలతో ప్రజానీకం తిప్పికొడుతోంది. విజయమ్మకు వ్యతిరేకంగా వివేకా ఎందుకు పోటీ చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత వైఎస్ కుటుంబంలో పరిణామాలను సునీత వక్రీకరించారు. పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ భాస్కర్‌రెడ్డి పోటీ చేయాలని భావించగా వివేకానందరెడ్డి వ్యతిరేకించారని, వైఎస్ విజయమ్మే పోటీ చేయాలని పట్టుబట్టారన్నారు. సునీత ఎంత పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారో ఇదే నిదర్శనం. పులివెందులలో విజయమ్మ పోటీ చేయాలని చెప్పిన వివేకా.. ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేశారనే విషయాన్ని సునీత ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆ ఎన్నికల్లో భాస్కర్‌రెడ్డి పోటీ విషయం చర్చకే రాలేదు. విజయమ్మనే పోటీ చేయించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ఆమే పోటీ చేశారు కూడా. కానీ వైఎస్ వివేకానందరెడ్డి తన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒత్తిడికి లొంగి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. వారి ఒత్తిడితోనే పులివెందులలో విజయమ్మపై పోటీ చేశారు. ప్రజలు మాత్రం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ వెన్నంటి నిలిచారు. ఆ ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ విజయమ్మ భారీ మెజార్టీతో గెలిచారు. దీన్ని వక్రీకరించి ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై దు్రష్పచారం చేసేందుకు సునీత యత్నించడం విడ్డూరంగా ఉంది. కడప ఎంపీ అభ్యర్థిత్వంపైనా అవాస్తవాలే? 2014లో కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేయాలని వివేకా భావించారని సునీత చెప్పుకొచ్చారు. అసలు కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్ రెడ్డిని వైఎస్సార్సీపీ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసింది. వివేకా కూడా ఏకీభవించారు. 2019 ఎన్నికల్లో కూడా అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డినే మరోసారి పోటీ చేయించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ ఎన్నికల ఇన్చార్జిగా వివేకానందరెడ్డినే నియమించారు. వివేకా చివరివరకూ అవినాశ్ రెడ్డి విజయం కోసం శ్రమించారు. హత్యకు గురికావడానికి ముందు రోజు కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించి ఎంపీగా అవినాశ్ రెడ్డిని, ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. పార్టీ నేతలతో చర్చించి వచ్చారు. వివేకానందరెడ్డి చివరివరకూ అవినాశ్ విజయం కోసం పనిచేశారని సునీతే 2019 మార్చి 21న హైదరాబాద్‌లోనే మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ విషయం బాబు చేతిలో కీలుబొమ్మగా మారిన ఆమె మర్చిపోయిందేమో కానీ, ప్రజలందరికీ గుర్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించింది చంద్రబాబు ముఠానే 2017 వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సునీత ఆరోపణలూ అసత్యాలే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డినే వైఎజ్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే కావడంతో వివేకా విజయం సులువేనని అంతా భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీ ఉనికికే ప్రమాదమని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి, కుట్రపూరితంగా వివేకాను ఓడించారు. ఈ వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. వాస్తవాలిలా ఉంటే.. సునీత మాత్రం వివేకాను ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఓడించారని పదే పదే అసత్యాలు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య.. అది ఎల్లో గ్యాంగ్ కుట్రే తన తండ్రి హంతకులను శిక్షించడం కోసమే పోరాడుతున్నా అని చెబుతున్న సునీత ఉద్దేశపూర్వకంగా ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. వివేకా హత్యకు గురైంది చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే. 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయం కోసం వివేకా ఎన్నికల వ్యూహాలు పన్నుతూ అందర్నీ కలుపుకొంటూ దూసుకుపోతున్నారు. దాంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. వివేకా జీవించి ఉంటే వారితో పాటు బీటెక్ రవికీ రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతారు. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు గురయ్యారు. వివేకా భౌతికంగా లేకపోవడం రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ పెద్దలు భావించారన్నది సుస్పష్టం. వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలు కొందరితో రహస్య సమావేశాలు, హత్య తరువాత ఆ నేతలు వ్యవహరించిన తీరే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తిన కొమ్మారెడ్డి పరమేశ్వరెడ్డితో బీటెక్ రవి సాన్నిహిత్యం పెంచుకున్నారు. హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. అంటే వివేకా హత్య వెనుక ఎల్లో గ్యాంగ్ ఉందన్నది స్పష్టమవుతోంది. సునీత మాత్రం చంద్రబాబు, ఆది నారాయణరెడ్డి, బీటెక్ రవిల పేర్లనే ప్రస్తావించడం లేదు. హడావుడిగా ఆస్తుల బదిలీ ఎందుకో.. వివేకానందరెడ్డి హత్య వెనుక కుటుంబ ఆస్తి వివాదాలు లేవని నమ్మిచేందుకు సునీత యత్నించారు. అసలు తన తండ్రి వివేకానందరెడ్డి పేరిట ఆస్తులేవీ లేవని చెప్పుకొచ్చారు. మరి ఆస్తులు ఏవీ లేకపోతే కుటుంబ కంపెనీల్లో ఆయన చెక్ పవర్‌ను ఆమె తల్లితో కలిసి ఎందుకు రద్దు చేశారు? వివేకా హత్య తరువాత పులివెందులలో ఉన్న భూములను హడావుడిగా తన పేరిట సునీత మార్చుకున్నారని రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి కదా. ఆస్తుల బదిలీలో ఈ హడావుడి ఎందుకు? అంటే దస్తగిరి వాంగ్మూలం తప్పేకదా అంతేకాదు దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన బెంగళూరు భూ సెటిల్మెంట్ వివాదం అన్నది లేనేలేదని సీబీఐ చెప్పిందని సునీత గుర్తుచేస్తున్నారు. అంటే అప్రూవర్‌గా మారుతూ దస్తగిరి చెప్పిన విషయాలు అవాస్తవాలేనని సునీత అంగీకరించినట్టే కదా. అలా అయితే దస్తగిరి ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవమే అవుతాయి కదా. వైఎస్ వివేకా హత్యతో వారికి సంబంధం లేనట్టే అవుతుంది. ఆ విషయాన్ని సునీత ఎందుకు అంగీకరించడంలేదు? అవినాశ్ రెడ్డిపై అసత్య ఆరోపణలను ఎందుకు కొనసాగిస్తున్నారు? అంటే.. కేవలం చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే ఆమె వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మే తన వెనుక ఏ పార్టీ లేదని సునీత ఎంతగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, చంద్రబాబు చేతిలో ఆమె కీలుబొమ్మగా మారారన్నది ఆమె వ్యవహార శైలే చెబుతోంది. టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే వైఎస్సార్సీపీకి ఓటేయకూడదని అంటున్నారు. బాబు ఐదేళ్లుగా చేస్తున్న అసత్య ఆరోపణలనే ఆమె పదే పదే వల్లిస్తున్నారు. వివేకా హంతకులతో సునీత దంపతుల సాన్నిహిత్యం వివేకానందరెడ్డి హత్యకు గురైన సమయంలో ఆయన నివాసంలో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డితో సునీత దంపతులకే దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉంది. ఆ నలుగురితో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డికి సాన్నిహిత్యం లేదు. ఇక వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన హంతకుడు దస్తగిరితో సునీత దంపతులు ఇప్పటికీ ఎందుకు సఖ్యతతో ఉంటున్నారన్నది మరో కీలకాంశం. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన సిట్, తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, సీబీఐ కూడా వివేకానందరెడ్డిని దస్తగిరితో సహా నలుగురు హత్య చేశారని నిర్ధారించాయి. వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. సునీత, ఆమె భర్త దస్తగిరితో పలుసార్లు భేటీ అవుతున్నారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితోనూ సన్నిహితంగా ఉంటున్నారు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మారారన్నది సుస్పష్టం. వివేకా హంతకుడితో, రాజకీయ ప్రత్యర్థులతోనూ ఆ కుటుంబం సన్నిహితంగా ఉండటం ఈ హత్య కుట్రలో వారి సామూహిక భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తోంది. వివేకా రెండో వివాహం, కుటుంబ వివాదాల సంగతేమిటి? వివేకానందరెడ్డి రెండో వివాహాన్ని సునీత ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు. షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారని, దాంతోనే కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఎందుకంటే వివేకా హత్య వెనుక కుటుంబంలో విభేదాలు కీలక పాత్ర పోషించాయి. ఆయన మరణిస్తే ఎవరికి ప్రయోజనం, ఆయనతో వ్యక్తిగతంగా, ఆస్తిపరంగా, రాజకీయంగా ఎవరికి విభేదాలు ఉన్నాయన్నది ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం. రెండో భార్య షమీమ్‌కు పుట్టిన కుమారునికి ఆస్తిలో భాగం ఇవ్వాలని వివేకా భావించారు. రాజకీయ వారసునిగా చేస్తానని కూడా ప్రకటించారు. దాంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయనతో తీవ్రంగా గొడవపడి, ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకాకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, సునీత దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని, ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నప్పటికీ అవడంలేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. షమీమ్ కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ ప్రయోజనమన్నది స్పష్టమవుతోంది. వివేకాను హత్య చేసిన తరువాత ఆయన నివాసంలో కొన్ని ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం హంతకులు వెదికారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంటే వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది సుస్పష్టం. వివేకా లేకపోతే ఆస్తి మొత్తం దక్కడంతోపాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్న ఉద్దేశం ఆయన బావమరిది, అల్లుడికి ఉందన్నది స్పష్టమైంది. లేఖను దాచిందీ మీరే.. గుండెపోటు ప్రచారం చేసిందీ మీరే ఇన్ని విషయాలు రెండేళ్లుగా మాట్లాడుతున్న సునీత.. వైఎస్ వివేకా గుండె పోటుతో మరణించారనే ప్రచారం ఎలా వచ్చిందో మాత్రం చెప్పరు. ఎందుకంటే ఆయన గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే ఉన్నారు. వివేకా రాసిన లేఖను కూడా దాచిపెట్టి ఆ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. శివప్రకాశ్ రెడ్డే మొదటగా ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ ప్రచారాన్ని కొనసాగించేందుకు వివేకా రాసిన లేఖను కుమార్తె, అల్లుడు రహస్యంగా ఉంచారు. ఆ లేఖను మొదటగా ఆరోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని సునీత భర్త రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖ, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే అయినా దాన్ని పోలీసులకు ఇచ్చారా అంటే అదీ లేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. -
బ్లడ్ గేమ్ బై సునీత.. తండ్రి రక్తంతో కూతురు కుటిల రాజకీయం
రక్తం ప్రశ్నిస్తోంది.. అవును రక్తం ప్రశ్నిస్తోంది. రక్త సంబంధం ఉన్న కూతురిని ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆడుతున్న బ్లడ్ గేమ్‌లో నువ్వెందుకు పావులా మారావని ప్రశ్నిస్తోంది. యస్.. వివేకా రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నా రాజకీయ ప్రత్యర్థులతో నువ్వు, నీ భర్త ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నిస్తోంది. నన్ను గొడ్డలితో కసితీరా నరికి నరికి చంపిన దస్తగిరి బయట తిరుగుతుంటే.. నువ్వు బస్సెక్కి షర్మిల వెంట ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నన్ను చంపినోడు బెయిల్‌పై బయట తిరుగుతుంటే.. అతడ్ని జైల్లో పెట్టించకుండా.. జగన్‌కు ఓటేయొద్దు.. అవినాష్‌కు ఓటేయొద్దు అంటూ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నా రక్తపు మరకల తడి ఆరక ముందు అన్నీ నిజాలే చెప్పిన నువ్వు.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. నీ పక్కనే అసలు హంతకులు ఉన్నారని నీ అంతరాత్మకు తెలుసు. వారిని కాపాడుకునేందుకు అవినాష్‌కు ఆ రక్తపు మరకలు పూసే ప్రయత్నం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. ఎందుకమ్మా అన్ని తెలిసి ఈ బ్లడ్ గేమ్ లో నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావ్.. అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. హత్య చేసినోడు ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. హత్య చేయించినోడు ఇంట్లోనే నీ పక్కనే తిరుగుతుంటాడు. ఎంటమ్మా సునీత ఇది.. పదేళ్లలో ఎప్పుడైనా నాన్నా అని ఆప్యాయంగా పిలిచావా ? ఇప్పుడు నా రక్తాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నావే.. ఇది కరెక్టేనా ? నా రెండో భార్య షమీమ్ ను నువ్వు హింసించినా.. అవమానించినా.. నేను నిన్నేమీ అనలేదే..ఓహో ఆస్తిలో వాటా తగ్గుతుందని నా తర్వాత హోదా, పదవి నీ భర్తకు దక్కవని కోపంతో ఉన్నావా ? అందుకే నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావా ? జగన్ కు ఓటేయొద్దని అంటున్నావా ? అమాయకుడైన అవినాష్ ను బలి పశువుని చేయాలని చూస్తున్నావా ? అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. మర్డర్ చేయడమే కాదు.. దాన్ని ఇంకొకరిపై నెట్టేసే కుట్రపై.. ఇదే రక్తం సాక్షిగా.. అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి.. ప్రధానంగా ఓ పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. 1. వివేకా రెండో భార్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కాలర్ పట్టుకుని బెదిరించింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 2. వివేకా రెండో భార్య కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని రక్త చరిత్రకు తెరలేపింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 3. వివేకాకు చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఆయనకు చెక్ పెట్టింది నువ్వు, నీ భర్త నర్రెడ్డి కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 4. తండ్రి బతికుండగా పట్టెడన్నం పెట్టని నువ్వు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 5. వివేకా రాజకీయ శత్రువులైన బీటెక్, ఆదినారాయణ రెడ్డి సహకారంతోనే హత్య జరిగిందని చెప్పింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 6. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచి పెట్టమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 7. అవినాష్ పేరు చెప్పకపోతే.. నీ భర్త జైలుకు పోక తప్పదని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 8. వివేకాను తానే నరికి చంపానని చెప్పినా.. దస్తగిరి బెయిల్‌కు నువ్వు సహకరించింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 9. వివేకా హంతకులు పక్కనే ఉన్నా.. రక్తపు మరకలు మరొకరికి పూయాలని ప్రయత్నిస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 10. నీ ఇంట్లో వారిని రక్షించుకునేందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుని రాజకీయం చేస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు -
బాబు పన్నాగం.. రాజకీయ శిఖండిలా షర్మిల, సునీత
తండ్రి హత్య ద్వారా రాజకీయంగా ఎదగాలన్న కుతంత్రం కూతురిది. సొంత బాబాయి హత్యను వ్యక్తిగత లాభంకోసం వాడుకోవాలన్నది మరొకరి వ్యూహం. ఇద్దరు ఆడవాళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయాలన్నది చంద్రబాబు పన్నాగం. ఇదీ వివేకా హత్య చుట్టూ జరుగుతున్న రాజకీయ రాక్షస క్రీడ. నర్రెడ్డి సునీతారెడ్డి సంచలనం రేపిన వివేకానందరెడ్డి హత్య తరువాత వార్తల్లో బాగా వినిపించిన పేరు. వివేకా చనిపోయిన రోజు నుంచి గత ఐదేళ్లుగా సునీతారెడ్డి చెబుతున్న మాటలు.. .చేస్తున్న ప్రకటనలు ఆమెపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. వివేకా హత్య తరువాత సంఘటనా స్థలంలో దొరికిన లెటర్ దాచిపెట్టడం మొదలు తన తండ్రితో సునీతారెడ్డికి ఉన్న విభేధాలు ఆమెపై అనుమానాలు మరింత బలపడేలా చేశాయి. అబద్ధం సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తన తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సునీతారెడ్డి చాలాకాలంగా వివేకాతో మాట్లాడటం మానేశారు. ఆ తరువాత జరిగిన గొడవల కారణంగానే వివేకా హత్య జరిగిందనే అనుమానాలూ ఉన్నాయి. ఇక వివేకా హత్య కేసు విచారణ సందర్భంగా సీబీఐలోని కొంతమంది అధికారులతో కలిసి సునీతారెడ్డి సాక్ష్యులను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అబద్ధం సాక్ష్యం చెప్పాలని సునీతా దంపతులు తనపై ఒత్తిడి తెచ్చినట్లు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఏకంగా పోలీసులకు, కోర్టుకే ఫిర్యాదు చేశారు. హత్య కేసును మరొకరిపై నెట్టేసేందుకు ఇక తన తండ్రి హత్య వెనక టీడీపీ నాయకులున్నారని ఆరోపించిన సునీతారెడ్డి తరువాతి కాలంలో అదే టీడీపీతో కలిసి పనిచేయడంతో ఆమెపై అనుమానాలు మరింత బలపడ్డాయి. తన తండ్రిని చంపానని బాహాటంగానే ప్రకటించిన దస్తగిరికి అనుకూలంగా సునీతారెడ్డి వ్యవహరించడంపై కుటుంబ సభ్యులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక తన తప్పు బయటపడకుండా ఉండేందుకే సునీతారెడ్డి వివేకా హత్య కేసును మరొకరిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అవినాష్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందనేది స్పష్టమవుతోంది. వివేకా హత్య జరిగిన తరువాత మీడియాతో మాట్లాడిన సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య తరువాత సరిగ్గా 12రోజులకు ప్రెస్‌మీట్ పెట్టిన సునీతారెడ్డి.. హత్యకు గల కారణాలపై సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఆమె టీడీపీ నాయకులే హత్యచేశారని బలంగా వాదించారు. తన తండ్రి హత్య వల్ల లబ్ది పొందేది టీడీపీయేనని సునీతారెడ్డి కారణాలతో సహా సోదాహరణంగా వివరించారు. వివేకా హత్య వెనక టీడీపీ నేతలు: సునీతారెడ్డి టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి ఈ హత్య వెనక ఉన్నారని అధికార తెలుగుదేశం పార్టీ ఆ ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని సునీతారెడ్డి ఆరోపించారు. ఆదినారాయణరెడ్డిని కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దీని వెనక పూర్తిస్థాయి కుట్ర జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు సునీతారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం తన తండ్రిహత్య కేసు విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులెవరికైనా హత్యతో సంబంధం ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. వారి పేరు ప్రకటించేవారని అన్నారు. కేవలం రాజకీయ లబ్దికోసమే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేసు విచారణను వాడుకుంటోందని ఆమె అన్నారు. వివేకా హంతకులను పట్టుకునేందుకు కాకుండాం తమ కుటుంబ సభ్యులను ఇరికించే విధంగా విచారణ సాగుతోందని విమర్శించారు. అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రయత్నం ఇక తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని సైతం సునీతారెడ్డి తీవ్రంగా ఖండించారు. తన తండ్రి వివేకానందరెడ్డి ఎన్నికల్లో అవినాష్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని సునీతారెడ్డి స్పష్టం చేశారు. కేసును తప్పుదారి పట్టించడంతోపాటు రాజకీయంగా లబ్దిపొందేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం వేసిన సిట్ నిందితులను పట్టుకోకుండా కేవలం తమ బంధువులను మాత్రమే విచారించడం వెనక కుట్ర జరుగుతోందనే అనుమానాలున్నాయన్నారు. మేము అనుమానాలు వ్యక్తం చేసినా కొంతమందిని టీడీపీ ప్రభుత్వంలోని సిట్ అధికారులు కనీసం విచారించలేదని అప్పట్లో ఆరోపించడం సంచలనం కలిగించింది. వివేకానందరెడ్డిని తెలుగుదేశం నేతలే హత్య చేసి ఉంటారని పలుమార్లు ఆరోపించిన సునీతారెడ్డి తరువాతి కాలంలో మాట మార్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖీఈ్కకి అనుకూలంగా ఆమె ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. చంద్రబాబుతో కలిసిం సొంత కుటుంబంపై కత్తులు దూస్తున్నారు. కాలం గడుస్తుంటే సునీతలో మార్పు వివేకా హత్యకు సంబంధించి ఎవరు హత్య చేశారుం ఎందుకు హత్యచేశారు అనే విషయంపై అందరికన్నా సునీతారెడ్డికే ఎక్కువ క్లారిటీ ఉంది. అందుకే ఆమె చాలాసార్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీం వివేకా హత్య గురించి కథలు కథలుగా చెప్పారు. కాలం గడుస్తున్నకొద్దీ సునీతారెడ్డి ఆలోచనల్లో పెను మార్పు రాసాగింది. సీబీఐ విచారణ ప్రారంభమైన తరువాత సునీతారెడ్డి పూర్తిగా మారిపోయారు. వివేకాను తామే కిరాతకంగా హత్యచేశామని ప్రకటించిన దస్తగిరి అండ్ బ్యాచ్‌కు సహకరించాలని నిర్ణయించుకున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారకుండానే ముందస్తు బెయిల్‌కు అప్లై చేస్తే సునీతారెడ్డి కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ మాట ఎందుకు అడగలేదు వివేకాను నరికానని మీడియా ముందు ప్రగల్భాలు పలికిన దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి కనీసం ఒక్కసారి కూడా ఎందుకు అడగలేదు. పైగా ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇరికించాలని సునీతారెడ్డి దంపతులు సాక్ష్యులను బెదిరించడం ప్రారంభించారు. అవినాష్‌రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సీబీఐతో కలిసి వివేకా పీఏ కృష్ణారెడ్డిని హింసించారు. బాబుకు రాజకీయ లబ్ది కోసం.. వివేకా హత్య కేసులో చంద్రబాబు కుట్రపై ఆధారాలతో సహా ప్రెస్‌మీట్ పెట్టిన సునీతారెడ్డి తరువాతి కాలంలో చంద్ర బాబు చేతిలో పావుగా మారిపోయింది. చంద్రబాబు ఎజెండాను అమలు చేసే విధంగా రాజకీయ విమర్శలు చేయడంం చంద్రబాబు మనుషుల సహాయంతో కోర్టుల్లో పిటిషన్లు వేయడం ప్రారంభించింది. వివేకా హత్య కేసులో నిందితులకు శిక్షపడటం కన్నాం ఈ కేసు ద్వారా చంద్రబాబుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న ఏకైకా అజెండా సునీతారెడ్డిలో బాగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు సునీతారెడ్డి రాజకీయ ప్రకటనలు ప్రారంభించించి వైఎస్సార్సీపీకి ఓటువెయొద్దంటూ అనే స్థాయికి ప్రచారం చేస్తోంది. లేఖను ఎందుకు దాచిపెట్టారు? వివేకా హత్యకేసులో టీడీపీ కుట్ర ఉందని ముందుగా ప్రకటించిన సునీతా తరువాతి కాలంలో ప్లేటు ఫిరాయించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య జరిగిన తరువాత అక్కడే దొరికిన లేఖను నర్రెడ్డి సునీతారెడ్డి దంపతులు ఎందుకు దాచిపెట్టారనే దానిపై ఇప్పటికీ సరైన సమాధానం లేదు. ఈ లేఖ విషయం ముందుగానే పోలీసులకు తెలిస్తేంకేసు విచారణ మరో విధంగా ఉండేదని స్పష్టమవుతోంది. హత్యను గుండెపోటుగా మలచడానికే ఈ లేఖను దాచిపెట్టారా అనే అనుమానాలు ముందునుంచీ ఉన్నాయి. ఆస్తి కోసమే హత్యా? ఇక వివేకా రెండో వివాహాన్ని వ్యతిరేకించిన సునీతారెడ్డి దంపతులు ఆస్తికోసమే ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ కేసులో అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఆకాంక్షతోనే సునీతారెడ్డి తన తండ్రి కేసును వాడుకుంటున్నారనే ఆరోపణలు చాలారోజుల నుంచే వినిపిస్తోంది. ముఖ్యంగా తన తండ్రి కేసును టీడీపీకి అనుకూలంగా మార్చడం ద్వారాం భవిష్యత్తులో రాజకీయ లబ్ది పొందాలన్నది సునీతారెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్.. సునీతారెడ్డి నోట పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివేకా హత్య కేసును రాజకీయం చేయాలని యత్నిస్తున్న సునీతారెడ్డికి.. ఆమె సోదరి షర్మిల జత కలిశారు. తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టి ఘోర వైఫల్యాలను మూటగట్టుకున్న షర్మిలం వివేకా కేసు ద్వారా ఏపీలో పొలిటికల్ ఎంట్రీ కోసం పావులు కదిపారు. సంబంధంలేని వ్యక్తులపై బురదజల్లి వ్యక్తిగత వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్దిపొందాలని యత్నిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగత ఆకాంక్షల నిమిత్తంం ఒక హత్యకేసును ఏవిధంగా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చో వివేకా కేసు మంచి ఉదాహరణ. సునీతతో చేతులు కలిపి.. తన తండ్రి హత్యకేసును తనకు అనుకూలంగా మార్చేందుకు అబద్ధాలు, అసత్యాలు పలుకుతున్న సునీతారెడ్డికి అనుకూలంగా అవతారం ఎత్తిన షర్మిల ప్రకటనలు చేయడం ప్రారంభించారు. రాజకీయ కారణాలతో తన అన్నతో విభేధించిన షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి ఘోర వైఫల్యాలను మూటగట్టుకున్నారు. ఇక తెలంగాణాలో రాజకీయ దుకాణం నడపలేనని నిర్ణయించికున్న ఆమెం ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా సునీతారెడ్డితో కలిసి తన కుటుంబంపైనే విమర్శలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా కడప ఎంపీ సీటుపై కన్నేసిన షర్మిల తన సోదరుడు అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తతంగం నడిపారు. కడప ఎంపీ సీటు విషయంలో చంద్రబాబు సహకారం అందిస్తారనే నమ్మకంతో ఏకంగా తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. ఓవైపు విచారణ జరగుతుండగానే వివేకానందరెడ్డిని హత్య చేసింది.. అవినాష్‌రెడ్డి అంటూ తీర్పు చెప్పినట్లు చెప్పింది షర్మిల. రాజకీయ ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన షర్మిలం తన తండ్రిపై చార్జిషీటు వేసిన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా వివేకా హత్యకు సంబంధించి గతంలో చాలాసార్లు అవినాష్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన షర్మిల ఇప్పుడు మాటమార్చటంపై.. జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై దశాబ్దాలుగా విషం చిమ్ముతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి అధినేతలు రామోజీ, రాధాకృష్ణతో పాటు చంద్రాబాబులతో షర్మిల స్నేహం చేయడం ఆమె తన విలువలను తాకట్టు పెట్టారనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎదిగేందుకే విమర్శలు విలువలు, నైతికత ద్వారా రాజకీయాలకే వన్నె తెచ్చిన వైఎస్సార్ కుమార్తె ఇప్పుడు ఇలా దిగజారడం పెద్దాయన అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. రాజకీయంగా ఎదిగేందుకు తన సొంత అన్నపైనే కత్తిగట్టిన చెల్లెలుగా షర్మిల చరిత్రపుటల్లో మిగిలిపోతుందనే విమర్శ జగన్ అభిమానులను సైతం ఆవేదనకు గురిచేస్తోంది. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి అనే మాటకు షర్మిల చేస్తున్న రాజకీయాలే ఓ చక్కటి ఉదాహరణ. అందుకే హత్య కేసును వాడుకుని ఎదగాలన్నం షర్మిల ఆకాంక్ష ఆమె రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతుందనే చర్చ జరుగుతోంది. చంద్రబాబే ఈ కేసులో అసలైన సూత్రధారి! వివేకా కేసులో అత్యంత అనుమానాస్పద వ్యక్తి చంద్రబాబునాయుడు. హత్య సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. రాజకీయంగా తాను లబ్దిపొందెందుకు ఎందరో పాత్రధారులను సృష్టించిన చంద్రబాబే ఈ కేసులో అసలైన సూత్రధారి. ఇక వివేకా హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా ఉండాల్సిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కేసు ద్వారా రాజకీయ లబ్దికోసం ఇప్పటికీ కూడా నానా కుట్రలు చేస్తున్నాడు. కేసును తప్పుదోవ పట్టించాడు ముఖ్యంగా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఈ కేసు నుంచి అసలు హంతకులను తప్పించే కుతంత్రాలు చేశాడు. హత్య జరిగిన తరువాత సిట్ పేరుతో కాలయాపన చేసిం రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నించాడు. వివేకా హత్యకేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను విచారించకుండా అడ్డుకున్నదీ చంద్రబాబే. అసలు హంతకులు దొరకకుండాం కాలయాపన చేస్తూ వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేశాడు. తన రాజకీయ లబ్దికోసమే వివేకాను హత్యచేయించాడనే ఆరోపణలు వచ్చినా అధికారం అడ్డుపెట్టుకుని చంద్రబాబు కేసును తప్పుదోవ పట్టించాడు. ఇక అధికారం పోయాక సీబీఐలోని కొంతమంది అధికారులను ప్రలోభపెట్టిన చంద్రబాబు కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబుం మెల్లిగా కేసులో అమయాకుల పేర్లు వచ్చేలా కుట్రలు చేశాడు. రాజకీయ ఆశచూపి సునీతారెడ్డిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నాడనే విమర్శలున్నాయి. అందుకే చంద్రబాబు లాయర్ల ద్వారానే సునీతారెడ్డి కోర్టుల్లో పిటిషన్లు వేసినట్లు స్పష్టమైంది. రఘురామకృష్ణం రాజు ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా ఈ కేసులో కుట్ర జరిగినట్లు ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది. ఈ కేసులో అటు సునీతారెడ్డిని ఇటు షర్మిల ద్వారా తన రాజకీయ ఎజెండాను నడిపిస్తున్న చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత దిగజారాడు. ఇప్పుడు హత్యా రాజకీయాలంటూ ప్రకటనలు చేయడంం అదే మాటను పదే పదే సునితా షర్మిలతో పలికించడం ఈ కుట్రల వెనక ఉన్న చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది. అందుకే వివేకా కేసులో సునీతారెడ్డి, షర్మిల లాంటి పాత్రధారులెంతమంది ఉన్నా అసలు సూత్రధారి మాత్రం చంద్రాబాబే. నీచపు హత్యారాజకీయాల చదరంగంలో పావులెవరో పాపాత్ములెవరో లోకం చూస్తూనే ఉంది. అంతా గ్రహిస్తూనే ఉంది. ఎన్నికల్లో ఓటు రూపంలో సమాధానం చెప్పెందుకు జనవాహిని సంసిద్ధంగా ఉంది. -
ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ హత్య జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అధికారంలో తెలుగుదేశం ఉంది. ఆనాడు వ్యవస్థలన్నీ చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. అప్పుడు మీనమేషాలు లెక్కించిన వారు ఇప్పుడు 2024లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ముఖ్యంగా షర్మిల చేస్తున్న రాజకీయ ఆరోపణలపై కడపలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల ఎక్కడికి వెళ్లి ప్రచారం చేయాలనుకున్నా.. నేను రాజశేఖరరెడ్డి బిడ్డను అని చెప్పాలనుకున్నా.. ప్రజల మాత్రం జై జగన్ నినాదాలు వినిపిస్తున్నారు. చెప్పుకోడానికి షర్మిలకు ఏం లేదా? ఈ ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ షర్మిల చెప్పుకోడానికి ఏమి లేకపోవడంతో మళ్లీ వివేకానంద హత్య కేసుపై పదే పదే ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యను ఇప్పుడు రాజకీయంగా ఉపయోగించుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మాట మారిందెందుకమ్మ.? : రాచమల్లు వైఎస్ కుటుంబ విషయాలను రాజకీయం కోసం షర్మిల వాడుకోవడం సరికాదని హితవు పలికారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. షర్మిలమ్మ తన స్థాయికి మించి, సంబంధం లేని మాటలు మాట్లాడుతోందని తప్పుబట్టారు. వైఎస్ఆర్ మరణించాక.. ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ FIRలో చేర్పించిందని, వైఎస్ జగన్‌ను అక్రమంగా 15 నెలలు జైలులో పెట్టిందని, రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని.. ఆనాడు షర్మిల అన్నారని రాచమల్లు పేర్కొన్నారు. ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం షర్మిల మాట మార్చడం సరికాదని హితవు పలికారు రాచమల్లు. సొంత అన్న అభిమతం తెలుసుకోలేకపోతున్నారు తెలంగాణాలో తరిమేస్తే ఆంధ్రాలో పడినట్లు నాలుగు ఓట్లు సంపాదించుకునేందుకు షర్మిల వైఎస్ పేరును ఉచ్చరించడం సరికాదన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశాయాలకు, ప్రతిబింబాలకు నిజమైన వారసుడు జగన్ మాత్రమేనన్నారు. ఒకే తల్లి కడుపున పుట్టి సొంత అన్న అభిమతం, ఆలోచనలను, మంచి తనాన్ని షర్మిల తెలుసుకోలేపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడిచిందంటూ షర్మిల చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు. వైఎస్సార్సిపి పేదవాడి చెమటతో నడుస్తోన్న పార్టీ అని పార్టీ, పరిపాలన, జగనన్న ఆలోచన అన్నీ పేదవాడి కోసమేనన్నారు. నిన్నటిదాకా తెలంగాణ.. హఠాత్తుగా ఏపీ నిన్నటిదాకా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలని చెప్పుకున్న షర్మిలకు ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. క్యాలెండర్లో పేజీ ఎలా మారుతుందో అలా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి పార్టీ మార్చిందని, మాట్లాడే తీరూ మారిందన్నారు. షర్మిలమ్మ ఈ రాష్ట్ర బిడ్డగా, జిల్లా బిడ్డ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిన్నాన్న కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారన్నారు. చంద్రబాబుకు మద్దతు..కాంగ్రెస్‌కు జీ హుజూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీకి మద్దతు ఇస్తూ షర్మిల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంటి విషయాలను వీధిలో పెట్టి షర్మిల రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి జీ హుజూర్ అని ఎలా అంటున్నారని తెలిపారు. తాను రాజశేఖరరెడ్డి బిడ్డను అంటూ రాజశేఖరరెడ్డిని హీనంగా మాట్లాడిన చంద్రబాబుతో అంతర్గతంగా ఎలా అవగాహన కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. షర్మిల నైతికతకు ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. -
వివేకం సినిమాపై ఎన్నికల సంఘం సీరియస్
సాక్షి, తాడేపల్లి : ఎన్నికల సమయంలో రిలీజ్ చేసిన వివేకం చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అడిషనల్ ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వివేకం సినిమా బ్యాన్ చేయాలి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో ప్రదర్శించడం, వివేకా బయోపిక్‌కామ్ అనే వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వివేకం సినిమాను మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకేసు నేపథ్యంలో నిర్మించారు.అందులో రాజకీయపార్టీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో వైఎస్సార్సీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ గారి పేరు సహా ఇతర పాత్రలను కూడా అదే పేర్లతో ఉచ్చరించారు. గతంలో ఇలా చేస్తే.. సీఎం జగన్‌తో పాటు పార్టీని కించపరిచేలా ఇష్టారీతిన సీన్లు రూపొందించారు. ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఆన్లైన్లో రిలీజ్ చేశారు. నిజానికి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కేసు విచారణలో ఉన్న సమయంలో దాని గురించి సినిమా తీయడమనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం. 2019 ఎన్నికల సమయంలో ఇదే రీతిలో బయోపిక్ ఆఫ్ పీఎం మోది చిత్రం రూపొందిస్తే అప్పట్లో దానిని బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా "వివేకం" చిత్రాన్ని బ్యాన్ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. చదవండి: ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. అవమానం పడ్డ చోటే జెండా పాతాడు -
ఒక్కొకరుగా ముసుగు తీస్తున్నారు.. కుట్ర క్లియర్..
-
తొలగిన పచ్చ ముసుగు
ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ పచ్చ ముసుగులు తొలిగాయి! వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తమ రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టుకున్నారు. తమకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, కొంతకాలంగా తాము చదువుతోంది చంద్రబాబు స్క్రిప్టేనని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా సాగుతున్న పచ్చ కుట్రలో తాము భాగస్వాములమని తేల్చేశారు. టీడీపీ తరఫునో, ఆ పార్టీ మద్దతుతోనో ఎన్నికల్లో పోటీ చేయడమే తమ ఆంతర్యమని కుండబద్ధలు కొట్టారు. ఇక షర్మిల కూడా తానూ ఆ పచ్చతానులో ముక్కనేనని విస్పష్టంగా ప్రకటించారు. వైఎస్ వివేకా ఐదో వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల ఒకే లయ... ఒకే తాళంతో చంద్రబాబు ఐదేళ్లుగా పాడుతున్న పాచిపాటనేమళ్లీ పాడారు. –సాక్షి, అమరావతి సునీత... షర్మిల... సౌభాగ్యమ్మ బాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా... వైఎస్ వివేకా 2019 మార్చి 15న హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు ప్రచారంలోకి తెచ్చిన కట్టుకథను ప్రజలు ఎన్నికల్లో తిప్పికొట్టారు. దాంతో ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వివేకా కుటుంబ సభ్యులతో పలికించే కుయుక్తులకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతను రంగంలోకి దించారు. ఆ డ్రామా దాదాపు మూడేళ్లకుపైగా కొనసాగిన తరువాత చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిల రాజకీయ తెరపైకి వచ్చారు. సునీత నిరాధార ఆరోపణలనే ఆమె కూడా వినిపిస్తున్నారు. ఈ నాటకం రక్తి కట్టకపోవడంతో చివరి పాత్రధారిగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఆమె పాత్రను ప్రవేశపెట్టడం చంద్రబాబు టైమింగ్‌కు నిదర్శనం. ఎన్నికల వేళ సౌభాగ్యమ్మ, సునీత తమలో గూడుకట్టుకున్న రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం సీఎం రమేశ్ ద్వారా చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కడప ఎంపీగా పోటీ చేయాలనే తమ ఆకాంక్షను గుర్తుచేశారు. నాలుగేళ్లుగా ఈ డ్రామా నడుపుతున్న చంద్రబాబు అందుకు సరే అన్నారు. వారం క్రితమే నర్రెడ్డి సునీత తానుగానీ తన తల్లి గానీ ఎన్నికల్లో పోటీ చేస్తామనే సంకేతాలు ఇచ్చారు. వైఎస్సార్సీపీని ఓడించాలన్నారు. పచ్చ సీరియల్లో తరువాత ఎపిసోడ్ వివేకా వర్ధంతి కార్యక్రమాన్ని పులివెందులలో పక్కా స్క్రిప్ట్‌తో నిర్వహించారు. అందులో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. రాజకీయ వారసత్వం రెండో వివాహంతో రగడ వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తాను రెండో వివాహం చేసుకున్న షమీమ్ అనే మహిళకు ఆస్తిలో వాటా ఇవ్వడంతోపాటు ఆమె ద్వారా జన్మించిన కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా భావించారు. దీన్ని సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ వివేకా ఆస్తితోపాటు రాజకీయ వారసత్వం తమకే దక్కాలని పంతం పట్టారు. వివేకా హత్య తరువాత ఆయన పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తులను సునీత హడావుడిగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్తులు హస్తగతమయ్యాక రాజకీయ వారసత్వంపై సౌభాగ్యమ్మ, సునీత కన్నేశారు. వివేకా జీవితాంతం రాజకీయంగా విభేదించిన చంద్రబాబుతో చేతులు కలిపారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి పులివెందులకే చెందిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపట్ల నాలుగేళ్లుగా సౌభాగ్యమ్మ, సునీత సన్నిహితంగా ఉంటున్నారు. హత్య అనంతరం... ఆద్యంతం సందేహాస్పదం వైఎస్ వివేకా హత్య అనంతరం సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి వ్యవహరించిన తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019, మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడులకు సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాను హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అందచేశారు. లేఖను సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా? అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగయ్య చెప్పిన వివరాల ప్రకారం 2019, మార్చి 14 అర్ధరాత్రి వివేకాను హత్య చేసిన తరువాత హంతకులు ఆ నివాసంలో ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం వెతికారు. దీంతో వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది స్పష్టమైంది. వివేకా ఆస్తి కోసం, రాజకీయ వారసత్వం కోసమే ఆయన సొంత కుటుంబ సభ్యులే ఈ హత్యకు పన్నాగం పన్ని ఉంటారన్నది స్పష్టమవుతోంది. బద్ధశత్రువులతో ఒకే వేదికపై పులివెందులలో శుకవ్రారం నిర్వహించిన వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీతతోపాటు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వివేకాకు జీవితాంతం బీటెక్ రవి ప్రత్యర్థిగానే ఉన్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా ఓడించారు. ఆ రాజకీయ కుట్రను ఆదినారాయణరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. 2019లో వివేకాను హత్య చేసివారికి వీరిద్దరూ పూర్తి అండదండలు అందిస్తున్నారు. అటువంటి వారు సౌభాగ్యమ్మ, సునీతకు అత్యంత ఆప్తులయ్యారు. వారిద్దరినీ ఆహ్వానించి వివేకా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం విభ్రాంతికరమే కాదు రాజకీయాలంటేనే జుగుప్స కలిగిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒంటరిని చేసి.. పస్తులు ఉంచి.. వివేకా జీవించి ఉండగా ఆయన్ని పట్టించుకోని కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. హత్యకు గురి కావడానికి చాలా ఏళ్ల ముందు నుంచే వివేకాను ఆయన సతీమణి, కుమార్తె, అల్లుడు విస్మరించారు. వివేకా షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సౌభాగ్యమ్మ, సునీత ఆయన్ని చాలా ఏళ్లుగా పులివెందులలో ఒంటరిగా వదిలేశారు. సౌభాగ్యమ్మ చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో తన కుమార్తె నివాసంలో ఉంటున్నారు. వివేకా చెక్ పవర్‌ను కూడా రద్దు చేసి ఆయన రోజువారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి కల్పించారు. వివేకాకు ఇంట్లో వండి పెట్టేవారే లేని దుస్థితి కల్పించారు. చివరికి రెండు చపాతీలు కూడా ఇచ్చేవారు లేక ఆయన పనివాళ్ల మీద ఆధారపడాల్సి వచ్చేది. తిండి లేకుండానే నిద్రపోయిన రోజులూ ఉన్నాయి. ఈ విషయాలేవీ ఎవరికీ తెలియవన్నట్టుగా సౌభాగ్యమ్మ, సునీత వ్యవహరించి నిజాలకు పాతరేసేందుకు యత్నించారు. బీటెక్ రవి సాగని ఆటలు పులివెందుల నియోజకవర్గంలో కొద్దోగొప్పో పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చని పథకం వేశారు. కానీ నాడు వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి (ఈయనతో వివేకాకు ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నార్కో పరీక్ష నిర్వహించాలని సిట్ దర్యాప్తులో నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి మొండికేయడం సందేహాస్పదమే. దస్తగిరి.. హంతకుడి హైడ్రామా వివేకాను ఎంత పాశవికంగా హత్య చేశాడో పూసగుచ్చినట్లు చెప్పిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం ఎవరికైనా విభ్రాంతి కలిగించకమానదు. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నాడన్నది నిర్ధారణ అయ్యింది. అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... దీని వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి... ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కోసం కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నాడు. దస్తగిరి దుష్ప్రచారాన్ని పదేపదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. మరి దస్తగిరి కట్టుకథలు, అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా! -
ఏపీ ఎన్నికల వేళ తెరపైకి వివేకా కేసు
తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు పొంతన లేదు. పైగా ఉన్నపళంగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకోవడంతో.. ఆమె ఏ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడుతుందో స్పష్టమవుతోంది. ఇక వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. అలాంటప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమి సంబంధం ఉంది?.. సంబంధం అంటగడుతూ ఈనాడు ఎందుకు కథనాలు ఇవ్వాలి? ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆ మధ్య ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. అదే సమయంలో.. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒకటిన్నర పేజీలు ప్రచురించడం వెనుక ఆంతర్యం ఏంటసలు?.. సునీత ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలు కొన్ని.. మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా? అవినాష్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు? అవినాశ్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? సునీత నుంచి సమాధానాలేవీ? ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా?.. ఆ దుర్బుద్ధి బయటపడిందిలా.. వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాష్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది. ఇదీ చదవండి: వివేకా వర్థంతిన సునీత రాజకీయం! ఆ లేఖ దాచింది నర్రెడ్డి దంపతులు కాదా? ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్‌లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు. పెద్ద మనుషుల ముసుగులో కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజు, వివేకా కేసులో షర్మిల, సునీత, లాంటి వాళ్లను మార్చుకుని ఎన్నికలకు వెళ్తున్నారుఘ ఈ క్రమంలోనే సీఎం జగన్‌పై జరుగుతున్న కుట్రలో భాగంగా తెరపైకి వచ్చిందే.. వివేకా హత్య కేసు. ఈ కుట్రలో ఈనాడు అధినేత రామోజీరావు కూడా భాగమే అయ్యారు. ‘‘వివేకా హత్య జరిగి రేపటికి అయిదేళ్లు.. అయినా కొలిక్కిరాని దర్యాప్తు.. కారణం జగనే!.. నిందితుల్ని కాపాడేందుకు సర్వశక్తుల ప్రయోగం’’ అంటూ అడ్డగోలు రాతలతో తాజాగా ఈనాడు ఇచ్చిన కథనమే ఇందుకు నిదర్శనం. ఈ కేసులో తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుందో.. అవే నర్రెడ్డి సునీత నుంచి మొదటి నుంచి చేస్తోంది. పైగా ఆమె స్టేట్మెంట్ను టీడీపీ అనుకూల మీడియా సంస్థలు హైలైట్ చేస్తూ వస్తున్నాయి. అందునా ఈమధ్య చంద్రబాబుకి, టీడీపీ అండ్ మిత్రపక్ష నేతలకు ఆమె ఢిల్లీ ప్రెస్ మీట్లో కృతజ్ఞతలు చెప్పారు. అయితే.. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్నే ప్రముఖంగా ప్రస్తావించిన రామోజీ మీడియా.. బాబు అండ్ కోకి ఆమె చెప్పిన కృతజ్ఞతల్ని పట్టించుకోలేదు. వీటన్నంటికి తోడు.. వివేకా వర్థంతి నాడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రకటన చేయాలని ఆమె నిర్ణయించుకోవడం, టీడీపీ తరఫునే బరిలోకి దిగాలని ఆమె ప్రయత్నిస్తుండడం.. ఇవన్నీ చూశాక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరిగింది కాదంటే ఎవరైనా నమ్మగలరా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి (ఏ5)గా సీబీఐ పేర్కొన్న డి.శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సీబీఐ కోర్టుకు సమర్పించాలని, ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు కావాలని, కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవద్దని, కోర్టులో విచారణ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించొద్దని ఆదేశించింది. అలాగే పాస్‌పోర్టు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని, విచారణలో కోర్టుకు సహకరించాలని, ఎలాంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని సీబీఐ 2021లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులో ఉంటున్న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గత సంవత్సరం సెప్టెంబర్ 19న సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీబీఐ వద్ద ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపి, సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్రావు, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ అనిల్ థన్వర్ వాదనలు వినిపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున శివశంకర్‌రెడ్డి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా జైలులో ఉంచడం సరికాదు నిందితులనే పేరుతో ఏళ్ల తరబడి జైలులో ఉంచడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. నిందితుని తరపు న్యాయవాది వాదనలతో పాటు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నిందితులకు కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుని తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2021 అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేవు. హంతకుడు దస్తగిరి (ఏ4)ని అప్రూవర్‌గా పేర్కొన్నారు. అతను చెప్పిన స్టేట్మెంట్లో శివశంకర్‌రెడ్డిపై ఆరోపణలు చేశాడు. 2022 జనవరి 31న దాఖలు చేసిన తొలి మధ్యంతర అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిని ఏ5గా చేర్చారు. కేసులో ఇరికించడానికే నిందితుడిగా చేర్చారు. దస్తగిరి చెప్పిన సెక్షన్ 161, 164 స్టేట్మెంట్లలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయి. కేసు తీవ్రతను గుర్తించని ట్రయల్ కోర్టు కీలక నిందితుడు దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. హత్య, సాక్ష్యాల చెరిపివేతలో శివశంకర్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. అయినా 2021 నవంబర్ 17 నుంచి జైలులో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. 55 ఏళ్ల శివశంకర్‌రెడ్డి వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. భుజానికి కూడా ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరం. దీని మెడికల్ రిపోర్టును కూడా అందజేశాం’ అని కోర్టుకు వివరించారు. -
దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే?
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పులివెందుల-కదిరి మార్గమధ్యంలో ఉన్న నామాల గుండు వద్ద శనివారం జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లికి చెందిన కూలి పని చేసుకునే దళిత చిన్న కదిరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నకదిరప్ప తన తండ్రి షేక్ హాజీవలీని చంపడానికి వచ్చాడంటూ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కట్టుకథ అల్లాడు. దీన్ని ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది. నిజానిజాలు తెలుసుకోకుండానే దస్తగిరి చెప్పిందే వేదం అన్నట్లుగా తెగ ప్రసారం చేసింది. వాస్తవమేంటో బాధితుడు చిన్న కదిరప్ప మాటల్లోనే.. ‘నాకు ఏడుగురు కూతుర్లు. పెద్దకూతురు నాగేశ్వరిని పులివెందులలోని బాకరాపేటకు చెందిన ప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాను. శుక్రవారం (8వ తేదీన) కూతురింటికి పోయి శనివారం మళ్లీ కదిరికి బయలుదేరాను. బస్సు కోసం పులివెందులలో రోడ్డు పక్కన నిలబడుకోంటే..మాకు బంధువైన తలుపుల మండలం శిద్దుగూరిపల్లికి చెందిన మల్లికార్జున బైక్ మీద వెళ్తూ నన్ను చూసి ఆపి బండిలో ఎక్కించుకున్నాడు. చార్జీ డబ్బులు మిగిలిపాయ.. అనుకొని ఎక్కాను. బండి స్పీడ్‌గా పోతూ నామాలగుండు దగ్గరకు రాగానే బ్రిడ్జి దగ్గర పొరపాటున ఫుట్‌పాత్‌కు తగిలింది. నేను కిందపడిపోయినా. అదే సమయంలో ఎదురుగా ఒకాయన వస్తుంటే ఆయనకు కూడా పొరపాటున బండి తగిలి కన్ను దగ్గర చిన్న గాయమైంది. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. కావాలనే బండి తగిలించారంటూ ఆయన నన్ను కొట్టడానికి వచ్చాడు. అక్కడ పడిపోయిన నా సెల్‌ఫోన్ తీసుకుంటుంటే దాన్ని కూడా లాక్కున్నాడు. నాకు తల నుంచి రక్తం కారిపోతుంటే అక్కడున్న స్థానికులు చూసి ఆయన దగ్గర నుంచి నా సెల్ ఇప్పించారు. అక్కడున్న వారిలో ఎవరో 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను పిలిపించి నన్ను తలుపుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కదిరి ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు’ అని చిన్న కదిరప్ప వివరించాడు. ‘మీరే ఆయన్ను చంపాలని ప్రయత్నించారంట..నిజమేనా?’ అని కదిరప్పను పాత్రికేయులు ఆసుపత్రిలో ప్రశ్నించగా.. ‘నాకు దెబ్బలు తగిలి ప్రాణం పోతుంటే వాడెవడో ఎందుకు అట్ల జెప్పినాడు?! దీంట్లో ఏందో రాజకీయం ఉంది. మేము కూలీనాలీ చేసుకునేటోళ్లం. మాకెందుకు నాయనా అట్లాంటివి’ అని అన్నాడు. బైక్ ప్రమాదంలో గాయపడిన కదిరప్ప ఫిర్యాదు మేరకు పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఇదీ చదవండి: దస్తగిరిది ఎంత క్రిమినల్ మైండ్ అంటే.. -
వివేకా, సునీతమ్మకు మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో.. సునీతా దంపతులపై ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నర్రెడ్డి సునీత యెల్లో మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేయగా.. సాక్షితో కృష్ణారెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి పలు నిజాల్ని పంచుకున్నారు. ‘‘వివేకానందరెడ్డితో నాది 35 ఏళ్ల అనుబంధం. ఆయన హత్య గురించి ముందు నాకే తెలిసింది. వెంటనే ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేశాను. వివేకాను ఎవరో ఏదో చేశారని స్పష్టంగా చెప్పాను. అయితే.. లెటర్ విషయం ఎవరికీ చెప్పొద్దని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి నాతో అన్నారు. అలాగే ఈ కేసులో అసలు గుండెపోటు కోణం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. .. వివేకా హత్య జరిగిన రోజే నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీతా దంపతులు నన్ను బెదిరించారు. తాము చెప్పిన పేర్లు సీబీఐ ముందు చెప్పాలని నన్ను ఒత్తిడి చేశారు. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలన్నారు. నానా హింసలకు గురి చేశారు. లేదంటే జైలుకు పంపిస్తామన్నారు. .. వివేకానందరెడ్డి, సునీతమ్మ చాలాకాలంగా మాట్లాడుకోలేదు. వివేకా రెండో వివాహం విషయంలో గొడవలు జరిగాయి. రెండో భార్య షమీమ్ కొడుకును వారసుడిగా చేస్తారనే వివేకా చెక్ పవర్ తొలగించారు. వివేకానందరెడ్డికి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై మంచి అభిప్రాయం లేదు. అల్లుడిపై ఆయన ఎప్పుడూ కోపంగానే ఉండేవారు అని తెలిపారాయన. -
Watch: తండ్రి హత్య కేసులో కూతురు చెప్పని నిజాలివే..
-
చంద్రబాబు డైరెక్షన్.. నర్రెడ్డి సునీత యాక్షన్
'మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒక పేజీన్నర ప్రచురించారు. ఆ మొత్తం చదివితే ఆమె తెలివితక్కువగా చేసిన ప్రకటనలను ఎడిట్ చేసి పాఠకులను మోసం చేశారన్న సంగతి అర్ధం చేసుకోవచ్చు.' తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు మధ్య ఎంతో తేడాను మనం గమనించవచ్చు. సునీత ఒక రాజకీయ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడుతున్నట్టు వినగానే మనకు అర్థమవుతుంది. వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రితో పాటు మరికొందరు జైలులో ఉన్నారు. సీబీఐ చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమి సంబంధం ఉంది? తనవద్ద ఆధారాలు లేవంటూ చెబుతూనే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విచారణ జరపాలని కోరడం వింత విడ్డూరంగా కనిపిస్తోంది. ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా? వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాశ్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది. ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్‌లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు. ఈమె మాదిరే సొంత చెల్లెలు షర్మిల కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఏదో ఆశించిందని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించలేదని, తత్ఫలితంగానే ఆమె కూడా ఇదే రీతిలో రోడ్డెక్కి రాజకీయం చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం అంగీకరించాలి. తన చెల్లెళ్లను వదలుకోవడానికి అయినా వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడ్డారు తప్ప, ప్రజా ధనాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోలేదన్న విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ప్రతినిధులు హాజరై వారికి కావాల్సిన ప్రశ్నలు వేసినట్లు ఇట్టే కనిపెట్టేయవచ్చు. వాటిలో కొన్నింటిని గమనించండి.. మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా? అవినాశ్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు? అవినాశ్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుంటుందో వాటినే ప్రశ్నలుగా మలిచి ఈ మీడియా ప్రతినిధులు వేశారంటేనే వీరందరి రాజకీయ లక్ష్యం తెలుసుకోవచ్చు. అదే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజుతో సహా పలువురు చోటా, మోటా టీడీపీ లీడర్లకు సైతం సునీత కృతజ్ఞతలు చెబితే, దానిని మాత్రం ఈనాడులో ఎడిట్ చేశారు. ఆ పాయింట్ వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందని ఈనాడు రామోజీరావు భావించడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఏతావాతా వీటన్నిటిని గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, రఘురామకృష్ణరాజు, లాయర్లను మార్చుకుని కోర్టుల ద్వారా యుద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రక్రియలో సునీత కూడా ఒక భాగమే అని తేలడం లేదూ!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వైఎస్ వివేకాను చంపిందెవరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడే ఇప్పుడు అమాయకంగా... హత్య చేసిందెవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత... హత్య జరిగాక రెండు నెలలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడిని ప్రశ్నించనే లేదు. అంతే కాదు.. హత్య చేశానని, తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను తనే గొడ్డలితో నరికానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. సునీతకు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడిగా మారాడు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీ నాయకుడైపోయాడు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సునీత బావగారు శివప్రకాశ్రెడ్డితో సహా పలువురికి ఫోన్లు చేసి చెప్పిన నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. తర్వాత ఓడిపోవటంతో బీజేపీలోకి ఫిరాయించారు. వీళ్లలో హత్య చేసిన వాళ్లు... చేయించిన వాళ్లు... దాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న వారు... అంతా ఉన్నారు. అందరూ కలిసి లోతైన కుట్రతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ కుట్రను మరింత లోతుకు తీసుకెళుతున్నారు. కుట్రలో భాగంగానే... చంద్రబాబు అనుకూల తోక పత్రికకు అధిపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మూడు రోజుల కిందట నర్రెడ్డి సునీతతో సహా చంద్రబాబును కలిశారు. కడప ఎంపీగా సునీతను పోటీకి దింపటంపై అక్కడ చర్చ జరిగింది. చివరకు సునీతను పోటీ చేయించని పక్షంలో ఆమె చేత విస్తృతంగా ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రచారమంటే... నియోజకవర్గంలో తిరగటం మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు కూడా. అందులో భాగమే ఢిల్లీలో సునీత ప్రెస్ కాన్ఫరెన్స్. దానికి కొనసాగింపే శనివారం ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బహిరంగ సభలో చంద్రబాబు ఊగిపోవటం. ఇదంతా ఒక స్కెచ్. సూత్రధారి చంద్రబాబు. పాత్రధారులు సునీత నుంచి దస్తగిరి, బీటెక్ రవి వరకూ ఎందరో!!. వివేకా హత్యతో లాభమెవరికి? జాతీయ, అంతర్జాతీయ నేర పరిశోధన ప్రమాణాలు చెప్పేదొకటే.. ఒక నేరం వల్ల ఎవరికి లాభం ఉంటుందో వారే దోషులు, కుట్రదారులు. అలా చూసినప్పుడు వివేకా హత్యతో లాభమెవరికి? ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? ఈ కోణంలో పరిశీలించినప్పుడు వచ్చే సమాధానాలు రెండే. వివేకా సంపాదించిన ఆస్తులు తమకే దక్కాలని, ఆయన రాజకీయ వారసత్వమూ తమకే ఉండాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి పంతం పట్టారు. కాకపోతే షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆమెతో వివేకాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ రెండో వివాహంతో వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి సౌభాగ్యమ్మ పులివెందులలో నివాసం ఉండకుండా హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్ద ఉంటున్నారు. సునీత నర్రెడ్డి ? ఆస్తి మొత్తం మాకే దక్కాలి.... వివేకా రెండో వివాహాన్ని ఆయన కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి యావదాస్తీ తమకే చెందాలని ఆమె పంతం పట్టారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్‌లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుడిని అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీమ్‌కు మాట ఇచ్చారు. దాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకున్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. షమీమ్‌తో సునీత గొడవ పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికి తీశాయి. సౌభాగ్యమ్మ, సునీత మొండి పట్టుదల చూశాక వివేకా కాస్త జాగ్రత్తపడ్డారు. తన ఆస్తిలో షమీమ్‌కు వాటా కల్పిస్తూ వీలునామా రాస్తానన్నారు. అందుకోసం స్టాంపు పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అదిగో... అలా స్టాంపు పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేకా హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంపు పేపర్లు, రౌండ్ సీల్ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య తన వాంగ్మూలంలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. పైపెచ్చు వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా!. మరి హత్య చేయించిందెవరో కనుక్కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? మాటమార్చి... చంద్రబాబు గూటిలోకి తన తండ్రి వివేకా హత్య వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని సునీత 2019 మార్చిలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. 2019 మార్చి 21న హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఇవన్నీ చెప్పిన సునీత... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. కానీ 2020లో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆమె పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి... చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. చంద్రబాబు? రాజకీయ లబ్ధికి ఇదే అదను.. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజానికి కడప జిల్లాలోను, పులివెందులలోను టీడీపీకి ప్రధాన అడ్డంకి వైఎస్ వివేకా. ఆయన అడ్డు తొలగింది. వైఎస్సార్సీపీ అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని దీనిలో ఇరికించి దుష్ప్రచారం సాగిస్తే... కడప జిల్లాలో తాము పాగా వేయొచ్చనేది బాబు దురాలోచన. అందుకే... మార్చి 15న వివేకా హత్య విషయం బయటకు వచ్చిన తరవాత బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన సొంత మనిషి అయిన అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రంగంలోకి దింపారు. ఆయన అందరినీ ప్రభావితం చేస్తూ దర్యాప్తును ఆదిలోనే తప్పుదోవ పట్టించారు. నిజానికి ఈ హత్య విషయంలో సునీత లక్ష్యం ఒక్కటే. హత్య వెనుకనున్న తన భర్త, బావగార్ల పేర్లు బయటకు రాకుండా ఉండటం. బాబు లక్ష్యమేమో తన ప్రత్యర్థులను ఇరికించటం. అందుకే ఈ విజాతి ధ్రువాలు రెండూ ఆకర్షించుకుని... ఒకరి లక్ష్యానికి మరొకరు సాయంగా నిలిచారని... రానురాను కుట్రను మరింత లోతుల్లోకి తీసుకెళుతున్నారని ఈ వ్యవహారాన్ని దగ్గర్నుంచి పరిశీలిస్తున్నవారు చెప్పే మాట. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలపై సందేహాలు రేకెత్తించేలా పచ్చ మీడియా ద్వారా అభూతకల్పనలతో దుష్ప్రచారం చేయటం... హత్య వెనుక ఉన్న కుట్రదారుల పాత్ర బయటకురాకుండా కేసును సంక్లిష్టంగా మార్చటం... ఇవన్నీ ఇందులో భాగంగానే జరిగిపోయాయి. చంద్రబాబు గ్యాంగ్‌కు కృతజ్ఞతలతో.. మీ సునీత బహుశా... నాలుగేళ్లుగా తాము సాగిస్తున్న కుట్రను మరింత పదునెక్కించాలనుకున్నారో, ఇకపై ముందుకు వెళ్లాలంటే ముసుగు తీయక తప్పదని భావించారో గానీ... సునీత ముసుగు తీశారు. రెండ్రోజుల కిందట ఢిల్లీలో బాబు స్క్రిప్టును చదువుతూ... ఆఖరికి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా కృతజ్ఞతలు చెప్పారంటే టీడీపీ ఏ స్థాయిలో సునీతకు సహకరించిందో... ఈ కుట్ర ఎంత లోతైనదో తెలియకమానదు. వైఎస్సార్సీపీ టికెట్టుపై గెలిచి... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని దూషిస్తూ సమాజంలో వర్గవిభేదాలు సృష్టించేందుకు కుట్రపన్నిన ఎంపీ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అత్యంత పరుషపదంతో దూషించిన టీడీపీ నేత పట్టాభి... సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ అత్యంత వివాదాస్పదుడిగా మారిన టీడీపీ నేత, పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్.. తమ పార్టీ విధానాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నారాయణ... బీజేపీలో ఉంటూ బాబు ఎజెండాను అమలు చేస్తున్న సీఎం రమేశ్... బాబు లాయరు సిద్ధార్థ లూథ్రా... నిరపరాధులను హింసించి, వేధించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన సీబీఐ అధికారి రామ్‌సింగ్... సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా... వీళ్లందరికీ సునీత కృతజ్ఞతలు తెలిపారు. అంటే తాను ఆ పచ్చ ముఠాలో సభ్యురాలినేనని విస్పష్టంగా ప్రకటించారు. విశేషమేంటంటే వీళ్లందరిలో ఓ ఉమ్మడి లక్షణం ఉంది. అది... తమ వృత్తులు, పార్టీలకు అతీతంగా చంద్ర బాబు కోసం పనిచేయటం. వైఎస్ జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించటం. అది చాలదూ... సునీత పాత్రను బయటపెట్టడానికి!!. ఇంకా వివేకా ఎవరెవరికి అడ్డంకిగా ఉన్నారు? ఆయన హత్యతో ఏ పాత్ర«ధారికి ఎలాంటి లాభం? ఇవన్నీ ఒకసారి చూద్దాం... ఆదినారాయణ రెడ్డి? గుండెపోటు అని మొదట చెప్పింది ఈయనే... వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియా సాక్షిగా బయటకు చెప్పింది నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తనకు ఫోన్ చేసి గుండెపోటుతో వివేకా మరణించారని చెప్పారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనక అలా జరిగి ఉండొచ్చని తాను కూడా అన్నానని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. శివప్రకాశ్ రెడ్డి ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి చెప్పటంతో... ఆయన తన వాహనాన్ని నిలిపేసి, వెనక్కు తిరిగి వివేకా ఇంటికి వచ్చారు. మరి గుండెపోటు అని ప్రచారం చేయాల్సిందిగా శివప్రకాశ్‌రెడ్డికి చెప్పిందెవరు? ఆదినారాయణ రెడ్డికి ఆయనే అడ్డంకి... 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి... టీడీపీకి అమ్ముడుపోయారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎంపీగా గెలవటానికి వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా నిలిచారు. జిల్లాపై పూర్తి పట్టున్న వివేకా రంగంలో ఉంటే తాను ఎంపీగా గెలవడం అసాధ్యమని ఆది నారాయణ రెడ్డి గుర్తించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు గురయ్యారు. వివేకా హత్య ఆదినారాయణరెడ్డికి రాజకీయంగా ప్రయోజనం కలిగించేదే కదా? నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ? లేఖను దాచి... గుండెపోటని ప్రచారం చేసి వివేకా హత్య కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిది కీలకపాత్ర. ఎందుకంటే హత్యకు గురైనప్పుడు వివేకా తన స్వదస్తూరితో రక్తంతో ఓ లేఖను రాశారు. ఆ లేఖను చూసిన ఎవరికైనా... అది మామూలు మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని తెలిసిపోతుంది. అలాంటి లేఖను ఆ రోజు (2019, మార్చి 15) ఉదయం 6.10 గంటలలోపే వివేకా పీఏ కృష్ణారెడ్డి చూశారు. ఆ విషయాన్ని వెంటనే సునీత భర్త రాజశేఖరరెడ్డికి ఫోన్లో చెప్పారు. ‘మేం వచ్చే వరకు ఆ లేఖను గానీ, వివేకా సెల్‌ఫోన్‌ను గానీ ఎవరికీ ఇవ్వవద్దు. పోలీసులకు కూడా చెప్పొద్దు’ అని వారు పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆ లేఖను గనక వెంటనే పోలీసులకు ఇవ్వమని వారు చెప్పి ఉంటే... మొత్తం వ్యవహారం మరోలా ఉండేది. వివేకాది హత్య అని తేలిపోయేది. ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లేవారు కాదు. పోలీసులు తమ పని తాము చేసేవారు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటంతో... వ్యవహారం మొత్తం వారు ప్లాన్ చేసినట్టే సాగింది. బీటెక్ రవి... ? వివేకా ఉంటే ఇక అంతే.. పులివెందుల నియోజకవర్గంలో కనీసస్థాయిలోనైనా పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చనేది ఆయన పన్నాగం. కానీ వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వర రెడ్డి(ఈయనకు వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు కూడా. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిచ్చేదే. రామ్‌సింగ్? చంద్రబాబు చేతిలో పావు... వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సిద్ధహస్తుడో వివేకా కేసులో సీబీఐ తీరే నిరూపిస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నిశితమైన దర్యాప్తు జరిగి దోషులు బయటపడాలని మొదటి నుంచీ భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... కేసును సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించాలని సునీత కోరగానే సరేనన్నారు. సీబీఐకి అప్పగించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే ముందస్తు కుట్రతో బీజేపీలోకి పంపిన తన మనుషులు సీఎం రమేశ్, సుజనా చౌదరి ద్వారా చంద్రబాబు చక్రం తిప్పటం మొదలెట్టారు. సీబీఐ దర్యాప్తు అధికారిగా నియమితుడైన రామ్‌సింగ్ వివాదాస్పద వ్యవహార శైలే అందుకు తార్కాణం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన ఆయన ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని కేసును పక్కదారి పట్టించారు. దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి బెదిరించి... ప్రలోభాలకు గురిచేసి అప్రూవర్‌గా మార్చారు. తాము అనుకున్నది అతని అప్రూవర్ వాంగ్మూలంగా నమోదు చేశారు. పీఏ కృష్ణారెడ్డిని, మరికొందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. తాను చెప్పిందే చెప్పాలని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వైఎస్సార్ జిల్లాలో పలువురిని అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేయడంతో వారి కుటుంబాలు బెంబేలెత్తిపోయాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామ్‌సింగ్ స్వయంగా అసత్య ఆరోపణలు చేశారు. కడపలో తాను కార్లో వెళ్తుంటే ఆగంతకులు వచ్చి హత్య చేస్తానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఆయన కారుపై ఎలాంటి దాడి జరగలేదని... ఎవరూ బెదిరించలేదని నిర్ధారణ అయ్యింది. అనేక ఫిర్యాదులు రావటంతో ఇంతటి వివాదాస్పదుడైన రామ్సింగ్ను న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర హోమ్ శాఖ ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి? రాజకీయ వారసత్వం మాకే దక్కాలి.. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వంపై ఆయన అల్లుడు, చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి కన్నేశారు. ఆయన తరువాత రాజకీయ వారసత్వంగా తమకే పదవులు దక్కాలని భావించారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్‌తో తనకు కలిగిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. దాంతో రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కంగుతిన్నారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించారు. వారిద్దరికి భయపడి ఆమె పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి ఓ అజ్ఞాత ప్రదేశంలో ఉండేవారు. అంటే వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం తమకే దక్కాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారన్నది సుస్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి 2019 ఎన్నికల ముందు హత్యకు గురయ్యారు. దస్తగిరి? హత్య చేసి... హైడ్రామా తండ్రిని చంపినవారిపై ఎవరికైనా కోపం, కక్ష ఉంటాయి. కానీ వివేకానందరెడ్డిని ఎంత పాశవికంగా హత్య చేసిందీ వెల్లడించిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం విస్మయం కలిగించేదే. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నారన్నది నిర్ధారణ అయ్యింది. కానీ అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి...ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కు కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో వాహనాలను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇక దస్తగిరి చేస్తున్న దుష్ప్రచారాన్ని పదే పదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. ఆయన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తోంది. అంటే దస్తగిరి ఇష్టానుసారంగా చెబుతున్న కట్టుకథలు, చేస్తున్న అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా!. సెల్ఫోన్లో డేటా డిలీట్ చేశారెందుకు? ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి వివేకా రాసిన లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందజేశారు. వారు ఆ సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశారు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ‘‘ఆ రోజు ఉదయం పీఏ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి గాయాలతో వివేకా బాత్రూమ్లో పడి ఉన్నారని చెప్పారు. మా నాన్నకు గతంలో కూడా గుండె సమస్య ఉన్నందున బాత్రూమ్లో పడి తలకు బలమైన గాయం అయి ఉండొచ్చని భావించా. అందుకే పోలీసులకు అలాగే ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డితో చెప్పా’’ అని సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. లేఖను చూశాకైనా... వివేకా మృతదేహాన్ని చూశాకైనా ఒక డాక్టరైన సునీతకు ఎలాంటి అనుమానమూ రాలేదంటే ఏమనుకోవాలి? ఉద్దేశపూర్వకంగా నిజాలు దాటిపెట్టారని భావించనవసరం లేదా? తండ్రిని ఓడించినా... సునీతకు ఇష్టులే వివేకానందరెడ్డిని 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చంద్రబాబు దొంగదెబ్బ తీసి ఓడించారు. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ వారే కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వివేకాను కుట్రతో ఓడించారు. అక్రమాలకు పాల్పడి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ కుట్రలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి సర్వంతామై వ్యవహరించారు. కానీ ఆ ముగ్గురూ సునీతకు, ఆమె భర్త, బావగారికిçప్పుడు అత్యంత సన్నిహితులైపోవటమే విచిత్రం. – సాక్షి, అమరావతి -
వివేకానంద్ రెడ్డి హత్య.. అసలు నిజాలు..
-
అడ్డంగా దొరికిపోయిన సునీత
-
పథకం ప్రకారమే మాపై దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి పథకం ప్రకారం మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే దానిచుట్టూ కట్టుకథ అల్లుతున్నారు. అలాంటి కట్టుకథే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైలుకెళ్లి బెదిరించానని చెప్పడం’.. అని వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని శంకర్ ఆసుపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలుకెళ్లి దస్తగిరిని బెదిరించానని, రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చామని చెబుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు. కడప సెంట్రల్ జైలులో మెడికల్ క్యాంపు నవంబరులో నిర్వహించారని.. అది అంతకు మూడు నెలల ముందు ఖరారైందన్నారు. క్యాంపు ప్రారంభం నుంచి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, పది మంది జైలు అధికారులు తమతోనే ఉన్నారని, సహచర వైద్యులు ఖైదీల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని చికిత్స అందించాక తాము బయటికి వచ్చేశామన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఓ పెద్ద కట్టుకథ అల్లారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సెంట్రల్ జైలులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. జైలు అధికారులు ఉంటారు.. అంత పటిష్ట రక్షణ ఉన్న ప్రాంతంలోకి బుద్ధి ఉన్నవారు ఎవరైనా వెళ్లి బెదిరిస్తారా? అలాచేస్తే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోరా? వెంటనే ఫిర్యాదుచేస్తే సీసీ ఫుటేజీ అధారంగా చర్యలు తీసుకుంటారు కదా.. నేను నిజంగానే బెదిరించి ఉంటే దస్తగిరి అప్పుడే జైలు అధికారులకుగానీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారికిగానీ, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రిమాండ్ ఖైదీగా పలుమార్లు కోర్టుకు హాజరైన దస్తగిరి న్యాయమూర్తులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మూడునెలల తర్వాత మీడియా ముందుకు రావడమేమిటి? ఇంకొన్నినెలలు గడిస్తే సీసీ ఫుటేజీ దొరకదని పక్కా క్రిమినల్ మైండ్‌తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్ వేయగానే.. ఇక ఈ దుష్ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. మా నాన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ వేయగానే తెరపైకి కట్టుకథలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే సీబీఐ అధికారి డ్రైవర్‌ను బెదిరించినట్లు కుట్ర చేశారు. పోలీసు అధికారులు విచారిస్తే అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ప్రస్తుతం హైకోర్టులో బెయిల్ పిటిషన్ నడుస్తున్నందున దాన్ని అడ్డుకోవడానికే ఇలా కొత్త కారణాలు సృష్టిస్తున్నారు. దస్తగిరి ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ వెంటనే నర్రెడ్డి సునీత కోర్టులో అఫిడవిట్ వేయడం క్రమం తప్పకుండా జరుగుతోంది. నర్రెడ్డి సునీత డైరెక్షన్లో అప్రూవర్ దస్తగిరి యాక్షన్ చేస్తున్నాడు. ఏకంగా ఎంపీ, సీఎం స్థాయి వారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడంటే అతని దురుద్దేశం అర్థమవుతోంది కదా. అప్రూవర్‌గా మారడమే వింత.. నిజానికి.. నేరానికి పాల్పడిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి ఈ కేసులోనే చోటుచేసుకుంది. తాను చేసింది తప్పు అని పశ్చాత్తాపం పడినప్పుడే ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారతాడు. కానీ, కేసులో తనకెలాంటి సంబంధంలేదని దస్తగిరి ముందే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశాడు. అందుకు నర్రెడ్డి సునీతగానీ, సీబీఐ వారుగానీ అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చిన వెంటనే దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయాడు. కానీ, వాస్తవాలు పరిశీలిస్తే.. అంతకుముందు ఆగస్టులోనే వివేకానందరెడ్డిని నరికి చంపామని మీడియాతో దస్తగిరి మాట్లాడుతాడు.. ముందస్తు బెయిల్ పిటిషన్లో తనకేమి తెలీదని కోర్టుకు చెబుతాడు.. అయినప్పటికీ నర్రెడ్డి సునీత అభ్యంతరం చెప్పరు. దీన్నిబట్టి.. సీబీఐ, సునీత, దస్తగిరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకే ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతోంది. హత్యచేసిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం సరైంది కాదని మేం పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. కరెక్ట్ పర్సన్ వచ్చి ఈ పిటిషన్ వేయాలని జడ్జి అభిప్రాయపడ్డారు. సునీత, దస్తగిరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంవల్లే దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలేదు. ఇంత ఘోరంగా ఈ హత్య కేసులో నర్రెడ్డి సునీత, దస్తగిరి కుమ్మకై వ్యవహరిస్తున్నారు. రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా.. ఇక వాచ్‌మన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగురిని గుర్తుపట్టి వారి పేర్లు చెప్పాడు. అయినప్పటికీ నలుగురిలో ఒకరిని అప్రూవర్‌గా తీసుకొస్తారు. ఇదంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది. హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్తే సీబీఐ నో అబ్జెక్షన్ చెబుతోంది. కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే నర్రెడ్డి సునీత, దస్తగిరి ముందస్తు బెయిల్పట్ల మౌనం వహిస్తుంది. అప్రూవర్ ముసుగులో అత్యున్నతస్థాయి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలకు మసిబూసి..మరోవైపు.. ఘటన స్థలంలో లెటర్ ఉందని పీఏ కృష్ణారెడ్డి చదివి వినిపిస్తే దాచిపెట్టమని వారే చెబుతారు. రక్తగాయాలు ఉన్నాయని చెప్పినా, హార్ట్ అటాక్ కారణంగా కింద పడినప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని ఊహించామని ఆమె చెబుతోంది. అసలు హార్ట్అటాక్ అనే ప్రచారం నర్రెడ్డి సునీత కుటుంబం నుంచే మొదలైంది. అలాగే, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి మొదట మీడియా ముందుకొచ్చి చెబుతారు. మరోవైపు.. హత్యచేసిన వ్యక్తులు పరారీ కాకుండా డాక్యుమెంట్ల కోసం వెతికామని దస్తగిరి స్వయంగా వెల్లడించాడు. వీటన్నింటినీ నిగ్గు తేల్చాల్సిందిగా నర్రెడ్డి సునీత కోరకపోవడంలోనే అసలు కుట్ర దాగి ఉంది. చివరి ఛార్జిషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతున్నా.. ఈ కేసు చివరి ఛార్జీషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతోంది. మోస్ట్ ఎఫెక్టెడ్గా ఉన్న మా కుటుంబం ఏనాడు మీడియా ముందుకురాలేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగా, కొత్తగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టే రావాల్సి వచ్చింది. మరోవైపు.. నర్రెడ్డి సునీత గూగుల్ టేకౌట్ గురించి, ఎంపీ వాట్సాప్ గురించి చెబుతోంది. నెట్ ఆన్‌లో ఉంటే వాట్సాప్ ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉంటుంది కదా.. ముందు గూగుల్ టేకౌట్ పేరుతో మభ్యపెడుతూ వచ్చారు. తర్వాత పొరపాటు పడ్డామని స్వయంగా సీబీఐ కోర్టుకు విన్నవించారు. గూగుల్ టేకౌట్ అనేది కిలోమీటర్ పరిధిలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించి దుష్ప్రచారం చేశారు. ఎంపీ కాకముందు, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి, మా నాన్న ఇద్దరూ ప్రతిరోజు కలిసి తిరగడమే కాక నిత్యం ఫోన్లో టచ్‌లో ఉంటారు. ఆ రోజు మాత్రమే ఫోన్లో మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. అసలు.. వివేకా హత్యతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి, మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు. కాకపోతే పథకం ప్రకారం పన్నిన కుట్రలో ఇరుక్కున్నాం. చెయ్యని తప్పుకు మా నాన్న జైల్లో ఉన్నారు. -
దస్తగిరిది ఎంత క్రిమినల్ మైండ్ అంటే..
వైఎస్సార్, సాక్షి: వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుకా పెద్ద కుట్ర దాగి ఉందని.. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడని అంటున్నారు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తనయుడు డా.చైతన్యరెడ్డి. ఈ కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలపై.. దస్తగిరి చేసిన ఆరోపణలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. దస్తగిరి ఎవరి డైరెక్షన్లో మాట్లాడుతున్నాడో అందరికీ అర్థమవుతోంది. చంద్రబాబు చెప్పడం.. సునీత చెప్పడం.. దస్తగిరి ఆరోపణలు చేయడం. ఈ డ్రామాలు, కథలు ఇప్పటివి కాదు. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడు. దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు. ఇదంతా మా నాన్న(శంకర్‌రెడ్డి) బెయిల్ పిటిషన్ కోర్టులో నడుస్తుందనే చేస్తున్నారు. నా తండ్రిని చెయ్యని తప్పుకి రెండున్నరేళ్లు జైల్లో ఉంచారు. ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకే కట్టుకథలు అల్లుతున్నారు. ఒకవేళ వాళ్లు అనుకున్నట్లు బెయిల్ తిరస్కరణకు గురైతే.. మళ్లీ నాలుగైదు నెలలు ఇలాంటివి ఏమీ ఉండవు.. దస్తగిరి అప్రూవర్‌గా మారడంలోనూ కుట్ర దాగుంది. హత్య జరిగిన తర్వాత డాక్యుమెంట్స్ కోసం వెతికామని దస్తగిరి చెబుతున్నాడు. ఆ టైంలో ఎవరైనా పారిపోవాలని చూస్తారుగానీ.. డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారా?. వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా కిందపడి రక్తపు వాంతులతోనే వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారు. హత్య తరువాత మీడియా ఎదుట మాట్లాడింది మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. హత్య జరిగిన నాడు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్‌లో యాక్టీవ్‌గా ఉన్నారని అరోపిస్తున్నారు. అది ఎన్నికల టైం. ఒక ఎంపీగా ఆయనకు సవాలక్ష మెసేజ్‌లు వచ్చి ఉంటాయి. మరి అంతకు ముందెప్పుడు ఆయన అలా వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నారో? లేదో? చూడండి. ఈ విషయాలన్నింటి గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. అసలు కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని వివేకా కూతురు సునీత ఎందుకు ప్రశ్నించరు?. ‘‘నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. అక్కడ ఉండేవాళ్ల ఆరోగ్య పరీక్షల నిమిత్తమే వెళ్లా. నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. పైగా జైల్లో ప్రతీ చోటా సీసీ కెమెరాలు ఉంటాయి. క్యాంపులో నాతో పాటు జైలు అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది కూడా ఉంటారు. అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే.. సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండే వాడిని కదా!. మూడు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటి?.. అని చైతన్య పశ్నించారు. -
చంద్రబాబు, మహాసేన రాజేష్‌కు ధన్యవాదాలతో.. ఇట్లు నర్రెడ్డి సునీత
సాక్షి, అమరావతి: ‘నాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచిన చంద్రబాబు, పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రాజేష్ మహాసేనలకు కృతజ్ఞతలు’.. అంటూ మూడేళ్లుగా తన వెనుక ఉండి, తనను ఎవరు ఆడిస్తున్నారో, తన నోటి నుంచి వస్తున్న మాటల వెనుక స్క్రిప్ట్ ఎవరిదో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత విస్పష్టంగా వెల్లడించారు. ఇన్నాళ్లూ తాను కప్పుకున్న ముసుగును తొలగించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకు చంద్రబాబు ఆమెను తెరమీదకు తెచ్చారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుతో ప్రారంభించి, చివరకు ఏపీ ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటేయొద్దని కోరుతూ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై మరోసారి అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అందుకోసం 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల ఉదంతాన్ని వక్రీకరించారు. ఆమె తండ్రిని కుట్రతో ఓడించిన చంద్రబాబు ముఠాను వెనకేసుకొచ్చారు. ఆ ముఠా సభ్యులు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సునీత, ఆమె భర్త సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని దాటవేశారు. ఆమె తండ్రి రెండో వివాహంతో కుటుంబంలో తలెత్తిన విభేదాలను మరుగున పరచడానికి చూశారు. వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరితో మాటామంతీ కొనసాగిస్తున్న విషయం బయటి ప్రపంచం గుర్తించడంలేదనే భ్రమలో ఉన్నారు. వెరసి తాను చంద్రబాబు గూటిలో చిలకనని స్పష్టం చేశారు. చంద్రబాబు నేర్పిన నాలుగు పలుకులనే పలికారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా ఆడారు. వివేకాను కుట్రతో ఓడించినందుకా చంద్రబాబు, ఆయన ముఠాకు కృతజ్ఞతలు? సునీత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ సభ్యులు బీటెక్ రవి, మహాసేన రాజేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడమే విడ్డూరం. వృత్తి రీత్యా డాక్టరైన సునీత ఉద్దేశపూర్వకంగా మతిమరుపు నటిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డిని 2017లో కుట్రతో రాజకీయంగా అంతమొందించింది చంద్రబాబే. తర్వాత 2019లో ఆయన్ని భౌతికంగా అంతం చేసిందీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఓడించారని ఆమె అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరం. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే కావడంతో ఆయన సునాయాసంగా గెలుస్తారని అంతా భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వారి వైపు లాక్కున్నారు. కుట్రపూరితంగా వివేకాను ఓడించారు. ఈ వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. హత్య వెనుకా ఎల్లో గ్యాంగే..! ఇక 2019 సాధారణ ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని వైఎస్ జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. వివేకానందరెడ్డి పార్టీ విజయం కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ అందర్నీ కలుపుకొంటూ దూసుకుపోతున్నారు. దాంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. వివేకా జీవించి ఉంటే వారితో పాటు బీటెక్ రవికీ రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. అంటే వివేకా భౌతికంగా లేకపోవడం రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ పెద్దలు భావించారన్నది సుస్పష్టం. వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలు కొందరితో రహస్య సమావేశాలు, హత్య తరువాత ఆ నేతలు వ్యవహరించిన తీరే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తిన కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో బీటెక్ రవి సాన్నిహిత్యం పెంచుకున్నారు. హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. అంటే వివేకా హత్య వెనుక ఎల్లో గ్యాంగ్ ఉందన్నది స్పష్టమవుతోంది. కానీ ఆ పచ్చ ముఠాలోని చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలను సునీత వెనకేసుకు వస్తుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కుటుంబ వివాదాల మాటేమిటి? వివేకానందరెడ్డి రెండో వివాహంతో కుటుంబంలో రేగిన విభేదాలు, ఆస్తుల కోసం ఘర్షణలు సునీత మరుగున పెడుతున్న మరో ప్రధాన అంశం. వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం, ఆయనతో వ్యక్తిగతంగా ఆస్తిపరంగా, రాజకీయంగా ఎవరికి విభేదాలు ఉన్నాయన్నది ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం. షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. ఆ మహిళకు పుట్టిన కుమారునికి ఆస్తిలో భాగం ఇవ్వాలని భావించారు. తన రాజకీయ వారసునిగా చేస్తానని కూడా ప్రకటించారు. దాంతో ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకాకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, సునీత దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని, ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా అవడంలేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. షమీమ్ కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ ప్రయోజనమన్నది స్పష్టమవుతోంది. వివేకాను హత్య చేసిన తరువాత ఆయన నివాసంలో కొన్ని ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం హంతకులు వెదికారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంటే వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది స్పష్టం. వివేకా లేకపోతే ఆస్తి మొత్తం దక్కడంతోపాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్న ఉద్దేశం ఆయన బావమరిది, అల్లుడికి ఉందన్నది స్పష్టమైంది. లేఖను గోప్యంగా ఉంచి.. గుండెపోటు ప్రచారం వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకు ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పక్కా పన్నాగంతోనే వ్యవహరించారు. శివప్రకాశ్‌రెడ్డి మొదటగా ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ ప్రచారాన్ని కొనసాగించేందుకు వివేకా రాసిన లేఖను కుమార్తె, అల్లుడు రహస్యంగా ఉంచారు. ఆ లేఖను మొదటగా ఆ రోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని సునీత భర్త రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖ, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. వివేకా హంతకులతో సఖ్యత.. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సాన్నిహిత్యం వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన హంతకుడు దస్తగిరితో సునీత సఖ్యతతో ఉండటం వెనుక గూడుపుఠాణి ఏమిటన్నది మరో కీలకాంశం. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన సిట్, తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, సీబీఐ కూడా వివేకానందరెడ్డిని దస్తగిరితో సహా నలుగురు హత్య చేశారని నిర్ధారించాయి. వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. సునీత, ఆమె భర్త దస్తగిరితో పలుసార్లు భేటీ అవుతున్నారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితోనూ సన్నిహితంగా ఉంటున్నారు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మారారన్నది సుస్పష్టం. వివేకా హంతకుడితో, రాజకీయ ప్రత్యర్థులతోనూ ఆ కుటుంబం సన్నిహితంగా ఉండటం ఈ హత్య కుట్రలో వారి సామూహిక భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తోంది. వారంరోజుల్లో తేలిపోయేదే అయితే చంద్రబాబునే ప్రశ్నించాలి వివేకా హత్య కేసు వారం రోజుల్లోనే తేలిపోవాలి కానీ, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని సునీత ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమే. ఎందుకంటే వివేకా హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబే. అప్పుడు వారం రోజుల్లోనే ఆ హత్య కేసును ఎందుకు ఛేదించలేదని సునీత ప్రశ్నించాల్సింది చంద్రబాబునే. ఇలా ప్రశ్నించకపోగా, వెనకేసుకు వస్తుండటం వెనుక ఉద్దేశం ఏమిటన్నది నిగ్గు తేలాలి. అంతేకాదు వివేకా హత్య జరిగిన వెంటనే ఆ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతో, మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. అయినా సునీత చంద్రబాబును ప్రశ్నించడంలేదు. ఇప్పుడు కేసు సీబీఐ చేతుల్లో ఉంది...ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని కదా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ ఆ దర్యాప్తును అడ్డుకుంది సునీతే. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు వద్దని, సీబీఐ దర్యాప్తు కావాలని ఆమె న్యాయస్థానంలో కేసు వేశారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న న్యాయస్థానం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కేసును బదిలీ చేసింది. మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇప్పుడు సునీత నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్నే. ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన ఆమె అక్కడే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించాల్సింది. ఆమె అలా చేయలేదు. ఎందుకంటే ఎన్నికల్లో బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు అది ఇష్టం లేదు. బాబుకు ఇష్టంలేని పని సునీత చేయరు. అది ఆమె తండ్రి హత్య కేసు దర్యాప్తు అయినా సరే.. మాటలు మార్చిన సునీత సునీత వైఖరి ఊసరవెల్లిని తలపిస్తోంది. తన తండ్రి వైఎస్ వివేకా హత్య వెనుక టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపి ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఉన్నారని ఆమె 2019 మార్చిలో చెప్పారు. అంతే కాదు.. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. ఈ మేరకు 2019 మార్చి 21న హైదరాబద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మరీ తన తండ్రి వివేకా, ఎంపీ అవినాష్‌రెడ్డి మధ్య ఉన్న అన్యోన్యతను వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర పూరితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ఆమె ప్రజలను కోరారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా కొంతకాలం అదే వైఖరి అవలంబించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి పూర్తిగా చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్ళి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడం మొదలెట్టారు. క్రమంగా మాటలు మారుస్తూ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను విచారించాలంటున్నారు. చివరగా వైఎస్సార్సీపీకి ఓటేయొద్దంటూ ముసుగు తొలగించేశారు. తన ఎల్లో విధానాన్ని బహిర్గతం చేశారు. సునీత టీడీపీ గూటి చిలుకే ఇన్నాళ్లూ తన తండ్రి వివేకా హంతకులెవరో నిగ్గు తేలాలంటూ వాదించిన సునీత.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో అసలు స్వరూపం బయటపెట్టారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే తనకు ప్రధానమని తేల్చిచెప్పారు. అందుకోసమే ఢిల్లీ ప్రెస్ మీట్లో రాజకీయ ప్రసంగమే చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, రఘురామరాజు, మహాసేన రాజేష్, పట్టాభి... ఇలా ఈ ఎల్లో గ్యాంగ్ కొన్నేళ్లుగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ఆరోపణలనే తాజాగా సునీతా చెప్పారు. అచ్చమైన టీడీపీ నేతగా మారారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటేయవద్దని చెప్పారు. ఇది నైతికంగా సునీత దిగజారుడుతనమే. ఇన్నాళ్లూ తండ్రి హత్యకు గురైన బాధితురాలిగా చెప్పుకున్న సునీత.. ప్రస్తుతం చంద్రబాబు కుట్ర రాజకీయంలో పావునని అంగీకరించారు. ఇన్నాళ్లూ తాను కార్చింది మొసలి కన్నీరేనని, చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనమే తన కంట్లో పన్నీరని చెప్పకనే చెప్పారు. వైఎస్సార్సీపీకి ఓటేయకూడదని అంటున్నారు. ఎందుకో మాత్రం ఆమె చెప్పనే లేదు. కులం, మతం, రాజకీయం చూడకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేసినందుకా? విద్య, వైద్య సంస్కరణలను ప్రవేశపెట్టినందుకా? గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చినందుకా? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నందుకా.. ఎందుకు ఓటేయకూడదని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం తన తండ్రి రెండో భార్యకు ఆస్తి లేకుండా అన్యాయం చేసినందుకు, తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి హత్యను ఉపయోగించుకోవాలని చూస్తున్నందుకే ఆమెకు ప్రజలు సహకరించాలా అని ప్రశ్నిస్తున్నారు. -
సునీత మాట్లాడినవన్నీ బాబు పలికించినవే
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత ఇన్నాళ్లూ ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, తప్పుడు కేసును ఎలా అల్లుతున్నారో బట్టబయలైందని, ముసుగు తొలగిపోయిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో సునీత మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆమె మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికించినవే అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ ఉండదన్నారు. రాజకీయ కుట్రతోనే సునీతతో చంద్రబాబు మీడియా సమావేశం పెట్టించారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి మేమే కారణమని ఆరోపించడం విడ్డూరం. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2017లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలవడానికి టీడీపీకంటే వైఎస్సార్సీపీకి 160 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందువల్లే తన చిన్నాన్న వైఎస్ వివేకాను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభ్యర్థిగా నిలబెట్టారు. చంద్రబాబులా ఓడిపోయే సీటుకు పోటీ పెట్టలేదు. వైఎస్ చనిపోయిన తర్వాత వివేకా కాంగ్రెస్‌లోకి వెళ్లి జగన్‌ను రాజకీయంగా అంతుచూడాలని భావించారు. వైఎస్ విజయమ్మపై పులివెందుల శాసన సభ స్థానం నుంచి పోటీకి దిగారు. అయినా వివేకాను జగన్ దగ్గరకు తీసుకున్నారు. వివేకా అడగకుండానే ఆయన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పెట్టారు. వివేకా సునాయసంగా గెలవాల్సింది. కానీ.. బలం లేకపోయినా ఆయనపై బీటెక్ రవిని చంద్రబాబు పోటీకి దింపి, అప్పట్లో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డితో కలిసి కుట్ర చేసి ఓడించారు. బీటెక్ రవి, ఆదినారాయణపై వివేకాకు కోపం ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్‌రెడ్డి తరఫున వివేకా అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. ఆనాడు తండ్రి వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవికి సునీత ఇప్పుడు కృజ్ఞతలు చెబుతున్నారు. వివేకాను ఏదన్నా చేయాలంటే బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది. వివేకా హత్యకు కారకులైన వాళ్లను కాదని.. ఏడాది తర్వాత ఇంట్లో వాళ్లే హత్య చేశారని సునీత మాటమార్చారు. తండ్రి హత్యకు కారకులైన వారితో జట్టుకట్టి వాళ్లకే కృజ్ఞతలు చెబుతున్నారు’ అని సజ్జల మండిపడ్డారు. ఎన్నికల వేళ చంద్రబాబు రాజకీయ కుట్ర ‘సునీత చెప్పినట్లే హత్య కేసు సాధారణంగా వారం రోజుల్లో తేలిపోయేట్లయితే, అప్పట్లో అధికారంలో ఉన్న ఆమె మిత్రుడైన చంద్రబాబు ఆలోగా విచారణ పూర్తి చేసి ఎందుకు కేసు తేల్చలేదు? ఎన్నికలు దగ్గరవుతున్నందున చంద్రబాబు ఉసిగొల్పి ఆరోపణలు చేయించి తన అస్త్రాలను వాడుతున్నాడనటానికి ఇదొక ఉదాహరణ. రాజకీయ కోణంలోనే ఆమె బయటకు వచ్చింది. ప్రజా కోర్టులో తేలాలని అమె కూడా అంటోంది కదా.. అదే తేలుతుంది. కేసులకు, ప్రజలకు సంబంధం ఏముంది? సీఎం జగన్ ప్రజలకు ఏం చేస్తామని చెప్పారో దాని ప్రకారం ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆమెకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి, మీరు జగన్‌ను శిక్షించండి అని సునీత కోరడం విచిత్రం. ప్రజలంటే వీరికి ఎంత అలుసు? వివేకా హత్యలో సునీత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమోననే అనుమానం చాలా మందికి ఉంది. సీబీఐకి ఇచ్చిన కొన్ని వాంగ్మూలాలను లోతుగా చూస్తే అది కనిపిస్తోంది. దాన్ని తప్పించుకోడానికి దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఆమె తిప్పికొడుతున్నారేమో! విచారణ వాటి మీదా జరగాలి. ఆమె తండ్రిని ఎలా కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడో చెప్పిన హంతకుడినే సోదరుడి కింద చూస్తున్న సునీతను ఏమనాలి?’ అని సజ్జల ధ్వజమెత్తారు. చంద్రబాబు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ జనసేన ‘వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లంతా స్మగ్లర్లు, గూండాలు కాకుండా పోయారా? బీజేపీ వాళ్లు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ చంద్రబాబు మాత్రం బీజేపీతో కలిసిపోయినట్లే ఫీల్ అవుతున్నాడు. వాళ్ల అండతో ఏదో ఒక రకంగా అర్జంటుగా కుర్చీ ఎక్కాలని బాబు తాపత్రయపడుతున్నట్లు స్పష్టమైపోయింది. పవన్ 24 సీట్లు తీసుకుని 240 సీట్లు అనుకుంటే ఎలా? జనసేనకు 30 వేల ఓట్లకు పైగా వచ్చిన 15 నియోజకవర్గాల్లో ఏడింటిని టీడీపీకి ఇచ్చాడు. మిగిలినవాటిలో ఓడిపోయేవన్నీ పవన్‌కు చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబుకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టుకుని నేను వామనావతారం, పాతాళానికి తొక్కుతా అని పవన్ అంటే ప్రజలు నవ్వుతారు. తాడేపల్లిగూడెం సభ చూశాక బాబు, పవన్ కథ ముగిసిందన్నది అర్ధమైపోతోంది’ అని అన్నారు. -
చంద్రబాబు చెంప చెళ్లుమనిపించిన పేర్ని నాని
-
Viveka Case: ‘నాపై ఒత్తిడి తెస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. కోర్టు ఆదేశాల మేరకే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో తనను బెదిరిస్తున్నారని వివేకాకు పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని.. ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం అందచేసినా.. ఫలితం లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు. -
వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
-
వివేకా కేసు.. వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఎస్కార్ట్ బెయిల్లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. ఎస్కార్ట్ బెయిల్లో వీళ్లు భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో.. ఈ ఏప్రిల్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని పులివెందులలో విచారించి.. నాటకీయ పరిణామాల నడుమ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సీబీఐ అధికారులు. అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయగా.. ఇవాళ ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అంతకు ముందు ఉదయ్ కుమార్‌రెడ్డికి కూడా సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెను కలిసేందుకు 14 నుంచి 16వ తేదీ వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇదీ చదవండి: Viveka Caseలో దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు' -
వివేకా హత్యతో లబ్ధి పొందింది సునీత, ఆమె భర్తే
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో లబ్ధి పొందింది ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ తరఫు న్యాయవాది టీఎల్ నయన్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. హత్య చేసే కారణం కూడా వారికే ఉందని వివరించారు. వివేకా హత్య వల్ల ఇతరులు పొందే ప్రయోజనం ఏమీ లేదన్నారు. వివేకా ఆస్తులన్నీ సునీత, ఆమె భర్త సొంతమయ్యాయని తెలిపారు. తండ్రి ఆస్తులను దక్కించుకున్న తరువాత సీబీఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సునీత వ్యవహరిస్తున్నారని వివరించారు. ప్రతి కోర్టులో, ప్రతి పిటిషన్లో ప్రతివాదిగా చేరుతూ (ఇంప్లీడ్) పిటిషన్ల మీద పిటిషన్లతో, అవాస్తవాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆమె వాదనలను సీబీఐ న్యాయవాదుల ద్వారా చెప్పిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో సునీత బాధితురాలు కాదని... మృతుడు వివేకానందరెడ్డే ఆమె బాధితుడని చెప్పారు. వారి బండారం బయట పడుతుందన్న భయంతోనే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ సైతం ఆ కోవలోకే వస్తుందన్నారు. అందువల్ల దాన్ని కొట్టేయాలని నయన్ కుమార్ కోర్టును కోరారు. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సహా మరికొందరిపై కడప కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు పెండింగ్‌లో ఉందన్నారు. 2021 ఆగస్టు 2 నుంచి జైలులో ఉన్నానని, చార్జిషీట్ కూడా దాఖలు చేసినందున, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్ యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు. నయన్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘వివేకా హత్య కేసులో కీలక నిందితుడు, కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి పిటిషన్‌ను తప్ప ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని సునీత కోర్టులను కోరుతూ వస్తున్నారు. వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వాంగ్మూలం ఇచ్చి, ఆయన్ని హత్య చేసిన వారిలో తానూ ఉన్నానని చెప్పిన దస్తగిరికి ఆమె సహకరిస్తున్నారు. అతనికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని, అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వడంపై సునీత నోరెత్తలేదు. ఆమె న్యాయం కోసం నిష్పాక్షికంగా వ్యవహరించడంలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సమాంతరంగా కేసులను పర్యవేక్షిస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారు. ఒక రకంగా సీబీఐని శాసిస్తున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తు సైతం పక్కదారి పట్టింది. అంతేకాకుండా కోర్టులకు నిందితులపై తీవ్ర దురభిప్రాయాన్ని కలిగిస్తూ న్యాయ విచారణ ప్రక్రియను దురి్వనియోగం చేస్తున్నారు’ అని నయన్ కుమార్ వివరించారు. ఆస్తి పోతుందన్న భయం సునీత,నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలో పెరిగిపోయింది.. ‘తన తండ్రి షేక్ షమీమ్ అనే మహిళను వివాహం చేసుకున్నారని, వారికి ఒక కొడుకు ఉన్నాడని, వారికి రూ.8 కోట్లు కూడా ఇవ్వాలని తన తండ్రి భావించారని, ఈ కారణంగానే తండ్రితో సత్సంబంధాలు లేవని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్పష్టంగా చెప్పారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఆస్తి పోతుందన్న భయం సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలలో పెరిగిపోయింది. రాజశేఖర్‌రెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి, మరికొందరు వివేకా హత్యకు కారణమంటూ మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కడప జిల్లా కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉంది. తులసమ్మ, షేక్ షమీమ్ మరికొందరు సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వివేకాను హత్య చేసే కారణం సునీతకు, ఆమె భర్తకే ఉంది. సునీల్ యాదవ్‌కు ఈ హత్యతో సంబంధం లేదు. కావాలనే అతన్ని ఇరికించారు.’ అని న్యాయవాది నయన్ కుమార్ నివేదించారు. న్యాయమూర్తిపైనే ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది.. ‘నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో ప్రతి విచారణకు ఆమె హాజరవుతున్నారు. న్యాయమూర్తి ముందు కూర్చొవడమే కాకుండా తన న్యాయవాదితో వెనక నుంచి చర్చిస్తూ, సూచనలిస్తూ, దర్యాప్తు వివరాలను తానే అందిస్తున్నా అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యల వల్ల.. ఓ వర్గం మీడియా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది. ఇదే కేసులో మరో నిందితుడి బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీబీఐ తరఫున వాదించడానికి ఢిల్లీ నుంచి సీనియర్లు వస్తున్నారు. వారికి స్థానిక న్యాయవాదులు, అధికారులు సహకరిస్తున్నారు. సునీత వాదనలు అనవసరం. హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ ఎక్కడెక్కడికి వెళ్లారో చెప్పేందుకు గూగుల్ టేక్ అవుట్, దస్తగిరి వాంగ్మూలంపై సీబీఐ ఆధారపడింది. గూగుల్ టేక్ అవుట్లో పేర్కొన్న సమయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దీనిలో తప్పు జరిగిందని సీబీఐ కూడా ఒప్పుకుంది.’ అని నయన్‌కుమార్ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయండి అజేయ కల్లం పిటిషన్‌పై సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందని, తాను చెప్పని విషయాలను చెప్పినట్టు చార్జిషీట్లో పేర్కొందని, వాటిని చార్జిషీట్ నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టు సీబీఐ తన చార్జిïÙట్లో పేర్కొన్నందున వాటిని చార్జిషీట్ నుంచి తొలగించాలంటూ అజేయ కల్లం ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ లక్ష్మణ్ ముందు విచారణకు వచ్చింది. అజేయ కల్లం తరఫున సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాది పి.వీర్రాజు వాదనలు వినిపించారు. -
‘వివేకా కేసులో సునీత స్వార్థం స్పష్టంగా కనిపిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్‌కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఉద్ధేశపూర్వకంగా ఇరికించారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో.. సునీల్ యాదవ్ ఉన్నాడన్న గూగుల్ టేకౌట్ సమాచారం తప్పని వాదనలు వినిపించారు. టేక్ ఔట్ కథలన్నీ కట్టుకథలే కాగా, ‘2021 ఏప్రిల్ 29 తెల్లవారుజామున 2:30 గంటలకు సునీల్ యాదవ్ సంఘటన స్థలంలో ఉన్నాడని గూగుల్ టేకౌట్ ఆధారంగా సీబీఐ చెప్పిందని.. అయితే అదే సీబీఐ 23 జనవరి 2023 ఛార్జ్‌షీట్‌లో గూగుల్ టేకౌట్ విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించినట్లు తెలిపారు. యూనివర్సల్ టైం ప్రకారం ఉదయం 2:30కాగా భారత కాలమానం ప్రకారం ఐదున్నర గంటలు కలపాలని, అప్పుడు సమయం ఇండియన్ కాలమానం ప్రకారం ఉదయం 8:12అవుతుందని తెలిపారు. ఉదయం 8:12కు సీబీఐ చెప్పినట్టు సునీల్ యాదవ్ అక్కడుంటే హత్యతో సంబందం లేనట్టేనని పేర్కొన్నారు. కావున సునీల్‌కు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది. చదవండి: ‘లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా?’ దస్తగిరి విషయంలో అలా.. సునీల్ విషయంలో ఇలా.! షేక్ దస్తగిరి తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. ఆయన ముందస్తు బెయిల్ విషయంలో సునీత ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని, కానీ, సునీల్ యాదవ్ బెయిల్ విషయంలో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. సునీత స్వార్థ ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఈ కేసులో ఆమె బాధితురాలు కానే కాదు, తనకు తాను బాధితులుగా ప్రచారం చేసుకుంటుందని తెలిపారు. తండ్రి వివేకా హత్యతో ఆమె కుటుంబం మాత్రమే లబ్ధిదారులు అన్న విషయం గమనించాలని, కోర్టు విచారణ ప్రక్రియను పిటిషన్లు, కౌంటర్లతో దుర్వినియోగం చేస్తుందని, సీబీఐ దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకుంటుందని, అన్ని విషయాల్లో సునీత ప్రమేయం దర్యాప్తును ప్రాసిక్యూషన్ తప్పుపట్టించేలా ఉందని తెలిపారు. బాధితుడు వివేకా మాత్రమే, సునీత కాదు రెండవ భార్య షేక్ షమీంతో పాటు ఆమె కొడుక్కి ఆస్థి దక్కకుండా సునీత నిలువరించారని, ఈ హత్య కేసులో సునీత భర్త రాజశేఖరరెడ్డి మామ శివ ప్రకాష్ రెడ్డిలపై ప్రైవేటు పిటిషన్ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఒక వర్గం మీడియా ప్రచారం ఏకంగా హైకోర్టు న్యాయమూర్తినే విమర్శించిన తీరు ఇప్పటికే కోర్టు రికార్డుల్లో ఉందని, సీబీఐకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఢిల్లీ నుంచి వస్తున్నారని, ఈ కేసులో సునీత బాధితురాలు కాదని, తండ్రే ఆమె బాధితుడని సునీల్ యాదవ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అజేయ కల్లం పిటిషన్ పై సీబీఐకి నోటీసులు వివేకా హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లo వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తన పేరుతో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ పేర్కొందని, పూర్తిగా కేసును పక్కదోవ పట్టించేలా సీబీఐ అధికారి వ్యవహరించారంటూ హైకోర్టును ఆశ్రయించిన అజేయ కల్లం. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది. -
అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ
హైదరాబాద్: వివేకా హత్య కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తాను ఇచ్చిన స్టేట్మెంట్ను సీబీఐ అబద్ధాల మయంగా మార్చేసిందన్నది ఆయన వాదన. ఈ క్రమంలో.. గత వారం ఆయన వేసిన పిటిషన్ విచారణ అర్హతకు సంబంధించిన ఆదేశాలను రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో.. రిజిస్ట్రీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు మెయిన్ నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘‘సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని గత వారం హైకోర్టులో వాదనలు సందర్భంగా అజేయ కల్లం న్యాయవాదులు వాదించారు. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా వివేకా కేసులో విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. -
వివేకా హత్య కేసులో అజేయ కల్లం పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హై కోర్టు
-
Viveka Case: కావాలనే ఇరికించారు.. బెయిల్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తమను సీబీఐ కావాలనే ఇరికించిందని, తమకు బెయిల్ ఇవ్వాలని వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీబీఐ కోర్టు తమ బెయిల్ పిటిషన్లను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్యకేసులో దర్యాప్తు పూర్తయిందని, సీబీఐ అభియోగ పత్రాన్ని కూడా దాఖలు చేసిందని తెలిపారు. ఈ కేసులో పిటిషనర్లను అక్రమంగా ఇరికించారని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదన్నారు. ఇప్పటికే 5 నెలలకు పైగా జైలులో ఉన్నారని, భాస్కర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. పలుమార్లు జైలు అధికారులు ఆస్పత్రుల్లో ఆయనకు పరీక్షలు కూడా నిర్వహించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేశారు. చదవండి: మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా? -
‘వివేకా కేసు దర్యాప్తులో దురుద్దేశం కనిపిస్తోంది!’
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తన స్టేట్మెంట్ను యధాతథంగా రికార్డు చేయలేదని.. తిరిగి తన స్టేట్మెంట్ను రికార్డు చేయించేలా దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఇవాళ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును రిజర్వ్ చేసింది. వివేకా కేసులో సీనియర్ అధికారి అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ‘‘సీబీఐ సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా(అజేయ కల్లం) స్టేట్మెంట్ రికార్డు చేసింది అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని అజేయ్ కల్లం తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో పిటిషన్ విచారణ అర్హతపై తీర్పు రిజర్వ్ చేసింది ధర్మాసనం. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. ఇదీ చదవండి: బతికున్నోళ్లను సునీతమ్మ బజారుకీడుస్తోంది -
వివేకా లేఖను పట్టించుకోరా? కీలక అంశాన్ని సీబీఐ ఎందుకు విస్మరించింది!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న వివేకా లేఖపై CBI నిశితంగా దృష్టి సారించక పోవడం విస్మయపరుస్తోందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ The Wire పేర్కొంది. CBI ఛార్జ్ షీట్లో ఏముంది? ‘డ్రైవర్ ప్రసాద్ తనపై తీవ్రంగా దాడి చేసినట్టు వివేకా పేర్కొన్నట్టుగా ఆ లేఖలో ఉంది. ఆ లేఖను వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ చూసి పీఏ కృష్ణా రెడ్డికి ఇచ్చాడు. ఆయన వెంటనే అంటే ఉదయం 6.29 గంటలకు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి ఆ లేఖలో ఉన్న సమాచారాన్ని చదివి వినిపించారు. తాము వచ్చే వరకు ఆ లేఖను గోప్యంగా ఉంచమని, ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పారు. దాంతో కాసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న సీఐ శంకరయ్యకు కూడా కృష్ణా రెడ్డి ఆ లేఖ విషయం చెప్పలేదు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరెడ్డి తదితరులు పులివెందులకు చేరుకున్నాక ఆ రోజు సాయంత్రం ఆ లేఖను వైఎస్సార్ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మకు అప్పగించారు’ అనే విషయాన్ని చార్జ్‌షీట్‌లో పేర్కొంది సిబిఐ. ఈ విషయాన్ని ప్రస్తావించడం మినహా ఇంత కీలకమైన విషయంపై సీబీఐ ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన కథనంలో ఎన్నో కీలక ప్రశ్నలను సంధించారు. తీవ్ర గాయాలతో లేఖ రాయగలిగారా? వివేకా లేఖపై ఇప్పటికీ సందిగ్ధత తొలగిపోలేదు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం ఇప్పించేంత వరకు ఆ లేఖ ఎప్పుడు రాశారన్న దానిపై స్పష్టత రాలేదు. వివేకాపై దాడి తర్వాత ఆయనతో బలవంతంగా ఆ లేఖను తాము ఎలా రాయించామని దస్తగిరి వెల్లడించాకే సందేహాలు మరింతగా పెరిగాయి. అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన వాంగ్మూలంలో వెల్లడించిన ప్రకారం.. "మొదట సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి ముఖంపై గట్టిగా కొట్టాడు. దాంతో వివేకా కింద పడిపోయారు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో వివేకా నుదుటి మీద నరికాడు. వివేకా నుదుటి మీద 3.5 ఇంచ్‌ల వెడల్పు, 6 ఇంచ్‌ల లోతుగా పక్క పక్కనే రెండు గాయాలున్నాయని పోస్టువర్టం నివేదిక వెల్లడించింది." భూమి పత్రాల కోసం గాలింపు "సునీల్‌యాదవ్ వివేకా గుండెపై 15–16 సార్లు గట్టిగా పిడిగుద్దులు గుద్దాడు. ఉవశంకర్ రెడ్డి తన చేతిలో ఉన్న గొడ్డలిని దస్తగిరికి ఇచ్చి వివేకా లేవకుండా చూడమని చెప్పారు. తాము భూమి పత్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతామని చెప్పాడు. వివేకా అతి కష్టం మీద లేవడానికి ప్రయత్నించాడు. నా ఇంట్లో ఏం వెతుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో దస్తగిరి గొడ్డలితో వివేకా కుడి చేతి మీద దాడి చేశాడు. వివేకా కుడి అరచేతిలో 2 ఇంచ్‌ల వెడల్పు, ఒక ఇంచి లోతున గాయం ఉందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కుడి చేతి మీద గొడ్డలితో గాయపరిచిన తర్వాత వివేకాతో నిందితులు లేఖ రాయించారు. కుడి చేతివాటం వ్యక్తి అయిన వివేకా ఆ లేఖ రాశారని" సీబీఐ పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ తర్వాత లేఖ రాయగలిగారా? గాయం వల్ల వివేకా మెదడు బయటకు వచ్చిందని దస్తగిరి పేర్కొనడం గమనార్హం. అంత తీవ్ర గాయమైన తర్వాత లేఖ రాసే స్థితిలో వివేకా ఉన్నారా అన్నది ప్రశ్నార్థకం. ఆ లేఖ వివేకానే రాసినట్టు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (CFSL) నిర్ధారించింది. కాగా తీవ్రమైన ఒత్తిడి, అత్యంత సంక్లిష్ట ప్రక్రియ నడుమ ఆ లేఖ రాసినట్టుగా ఉందని ఢిల్లీలోని CFSL నివేదిక వెల్లడింంది. కానీ అంతటి తీవ్ర గాయాలు అయ్యాక.. మెదడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఓ వ్యక్తి అలా లేఖ రాయడం సాధ్యమా? అని సీబీఐ వైద్య నిపుణులను సంప్రదించకపోవడం విడ్డూరం. ఆ వేలి ముద్రలు ఎవరివో? హత్య కేసు దర్యాప్తులో వేలి ముద్రలు అత్యంత కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వివేకా హత్యకు గురైన స్థలంలో గుర్తించిన మూడు గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివనే విషయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడం విస్మయపరుస్తోంది. వివేకా నివాసంలోని బాత్రూం గోడల టైల్స్ మీద రెండు వేలి ముద్రలు, తలుపు వెనుక ఒక వేలి ముద్రను క్లూస్ టీమ్ గుర్తించింది. గోడల టైల్స్ మీద ఉన్న వేలి ముద్రలు రక్తంతో ఉండటం గమనార్హం. కాగా ఆ మూడు వేలి ముద్రలు నిందితులు నలుగురితోపాటు వివేకా నివాసానికి వచ్చిన బంధువులు, ఇతరుల వేలి ముద్రలతో సరిపోలలేదు. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు రాత్రి వివేకా నివాసంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోంది. కానీ సీబీఐ ఇప్పటి వరకు ఆ వేలి ముద్రలు ఎవరివనే దిశగా దర్యాప్తు చేయనే లేదు. IPDR డేటా అహేతుకం ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్‌రెడ్డి మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ‘ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డ్స్(IPDR) నివేదిక ఆధారంగా గుర్తించినట్టు సీబీఐ పేర్కొంది. కానీ ఐపీడీఆర్ డేటా అన్నది శాస్త్రీయంగా కచ్చితమైన ఆధారం కాదు. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు ఆన్‌లో ఉన్నాయని మాత్రమే ఐపీడీఆర్ చెబుతుంది. సాధారంగా అర్ధరాత్రి దాటిన తర్వాత మొబైల్ నెట్‌వర్క్‌లు తమ డేటా బ్యాకప్ తీసుకుంటూ ఉంటాయి. దాంతో మొబైల్ డేటా ఆన్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. అంత మాత్రాన ఆ మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నట్టుగానీ, మెసేజ్‌లు పంపిస్తున్నట్టుగానీ నిర్ధారింనట్టు కాదు. ఇక ఆ ఫోన్ల నుం ఇతర ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయా.. లేదా అన్నది కూడా ఐపీడీఆర్ డేటా ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. కాబట్టి ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్ రెడ్డి మధ్య ఆ రోజు రాత్రి వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ఐపీడీఆర్ డేటా ద్వారా నిర్ధారించలేం. ఈ విషయంలో సీబీఐ వాదన పూర్తిగా అహేతుకమని స్పష్టమవుతోంది. గంగిరెడ్డి మొబైల్ ఫోన్ నుంచి వెళ్లిన మెసేజ్‌లను గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని సీబీఐ తెలిపింది. కాగా 2019 వర్చి 15నే ఎర్ర గంగిరెడ్డి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేటాను పరిశీలించినప్పటికీ అందులో అనుమానాస్పదమైన సమాచారం ఏమీ లభించలేదని పోలీసులు ప్రకటించిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. గూగుల్ టేక్ ఔట్‌పై మాట మారింది! నిందితులు 2019 మార్చి 14, 15 తేదీల్లో ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిర్ధారించామన్న సీబీఐ వాదన తప్పని తేలిపోయింది. ఎర్ర గంగిరెడ్డి, ఉవశంకర్ రెడ్డి ఫోన్లు వారి ఇళ్లలోనే ఉన్నట్టుగా సెల్ టవర్ల లోకేషన్ స్పష్టం చేస్తోంది. కాగా సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాపై సీబీఐ ఎక్కువగా దృష్టి సారించింది. 2019 మార్చి 14 అర్ధరాత్రి 2.42 గంటలకు సునీల్‌యాదవ్ వివేకా నివాసంలో ఉన్నట్టు.. 2.34 గంటలకు వివేకా నివాసానికి 15 మీటర్ల దూరంలో, 2.35 గంటలకు వివేకా నివాసానికి 10 మీటర్ల దూరంలో ఉన్నట్టు.. 2.42 గంటలకు వివేకా నివాసంలో ఉన్నట్టుగా పేర్కొంది. కాగా సునీల్ యాదవ్ నివాసం వివేకా నివాసానికి 160 మీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఎంతో ముఖ్యమైన అంశం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గూగుల్ టేక్ ఔట్ డేటాకు, వాస్తవ లొకేషన్‌కు 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల వరకు వ్యత్యాసం ఉంటుందని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కేసు విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఆ విషయాన్ని ప్రశ్నించారు. గూగుల్ టేక్ ఔట్ డేటాను బట్టి ఎలా నిర్ధారించగలుగుతారని అడిగారు. దాంతో CBI తన మూడో అనుబంధ చార్జ్‌షీట్‌లో మాట మార్చింది. యూనివర్సల్ కాలమానానికి (UTC), భారత కాలమానానికి (IST) మధ్య వ్యత్యాసాన్ని తాము గమనించక పొరపాటు చేశామని వెల్లడించడం గమనార్హం. గూగుల్ టేక్ ఔట్ డేటాను విశ్లేషిస్తే ఢిల్లీలోని CFSL పేర్కొన్న సమయం UTC కాలమానం ప్రకారం అని వెల్లడించింది. వాస్తవానికి యూటీసీ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందుంటుంది. అంటే సునీల్ యాదవ్ వివేకా నివాసంలో 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 2.42 గంటలకు ఉన్నట్టు తాము మొదటి చార్జ్‌షీట్‌లో పేర్కొంది వాస్తవం కాదని సీబీఐ అంగీకరింంది. సునీల్ యాదవ్ వివేకా నివాసంలో 2019 మార్చి 15న ఉదయం 8.12 గంటలకు ఉన్నారని తెలిపింది. అంటే వివేకా హత్యకు గురయ్యారని అందరికీ తెలిసిన తర్వాత కొన్ని వందల మంది అక్కడ గుమిగూడిన తర్వాత సునీల్ యాదవ్ చేరుకున్నారని చెప్పింది. ఆస్తి వివాదాన్ని ఎందుకు పట్టించుకోలేదు? రాజకీయ కారణాలతోనే వివేకాను హత్య చేశారని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కానీ దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలను పరిశీలిస్తే ఆస్తి కోసం ఈ హత్య చేసి ఉండొచ్చన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే వివేకాను హత్య చేసిన తర్వాత నిందితులు ఆస్తి పత్రాల కోసం ఆయన నివాసంలో వెతికారన్నది స్పష్టమవుతోంది. ఆ నివాసంలో అల్మారా (బీరువా) తలుపు బద్దలు గొట్టడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు కూడా. అంటే హత్యకు ఆస్తి వివాదం ప్రధాన కారణం కావచ్చు. నిందితులు ఏ పత్రాల కోసం వెతికారన్నది సీబీఐ ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. దొంగతనం, ఆస్తి వివాదం అనే కోణంలో సీబీఐ ఈ కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే సమయంలో రెండు చోట్ల ఉండటం సాధ్యమా? సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నారనే దానిపై సీబీఐ వాదనలు మరింత అసంబద్ధంగా ఉన్నాయి. దస్తగిరిని అప్రూవర్‌గా వర్చి ఇప్పింన వాంగ్మూలం, రంగన్న వాంగ్మూలం ప్రకారం ఆ రోజు రాత్రి 1.30 గంటల నుంచి 3 గంటల వరకు సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి నివాసం లోపల ఉన్నాడు. కానీ ఆ రోజు రాత్రి 1.58 గంటలకు సునీల్ యాదవ్.. వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా గూగుల్ టేక్ అవుట్ డేటా చూపిస్తోందని కూడా సీబీఐ పేర్కొంది. ఒకే సమయంలో ఒక వ్యక్తి వేర్వేరు చోట్ల ఎలా ఉండగలరు? సునీల్ యాదవ్ ఆ సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉంటే.. అదే సమయంలో అక్కడికి కిలోమీటర్ దరంలో ఉన్న వివేకా నివాసంలో కూడా ఉండి ఆయన్ను ఎలా హత్య చేయగలడు? మరి సీబీఐ ఇంత చిన్న అంశాన్ని విస్మరిస్తూ కేసు దర్యాప్తు చేస్తుండటం ఏమిటి? రూ.40 కోట్ల డీల్ కథ తేల్చలేదెందుకు? అసలు వివేకానందరెడ్డిని నిందితులు ఎందుకు హత్య చేశారనే అంశంపై సీబీఐ వాదన అసంబద్ధంగా ఉంది. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం.. వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నాడు. అందుకు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి అడ్వాన్స్‌గా కోటి రూపాయలు పంపించారు. అందులో 25 లక్షలు సునీల్ యాదవ్ అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులతో పులివెందులలో విల్లా కొనుగోలు చేయాలని భావించినట్టు దస్తగిరి చెప్పాడన్నది సిబిఐ పేర్కొన్న విషయం. కాగా ఇక్కడ ప్రశ్నార్థకం ఏమిటంటే.. వివేకా హత్య కోసం కుదిరినట్టు చెబుతున్న డీల్ డబ్బును సీబీఐ ఇప్పటికీ రికవరీ చేయలేకపోయింది. కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూడా సీబీఐని ఇదే విషయంపై ప్రశ్నించారు. నిందితుల మధ్య చేతులు మారినట్టు చెబుతున్న డబ్బును ఎందుకు రికవరీ చేయలేకపోయారంటే సీబీఐ సరైన సవధానం చెప్పలేకపోయింది. పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న మున్నా బ్యాంక్ లాకర్ నుంచి రికవరీ చేసిన 46.70 లక్షల రూపాయలకు సంబంధించి సీబీఐ చెబుతున్న వాదన నమ్మదగ్గదిగా లేదని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. 2020 సెప్టెంబర్ 9న మున్నా బ్యాంకు లాకర్లో ఉన్న 46.70 లక్షల రూపాయలను సీబీఐ జప్తు చేసింది. ఈ జప్తు వ్యవహారం భారత సాక్ష్యాధారాల చట్టం సెక్షన్ 27 ప్రకారం లేదని న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం. -
వివేకా హత్య కేసులో విస్మయం కలిగిస్తున్న సీబీఐ దర్యాప్తు
-
Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ కథనం -2
వివేకాను చివరిగా ఎవరు చూశారు? వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 2019 మార్చి 14 రాత్రి 12 గంటల సమయంలో వివేకా తన నివాసం నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగడం రంగన్న చూశాడు. నిందితులు కాకుండా వివేకా జీవించి ఉండగా చివరిసారిగా చూసిన వ్యక్తి రంగన్న. పోలీసు దర్యాప్తు నియమావళి ప్రకారం జీరో అవర్‌గా పిలిచే అప్పటి నుంచే దర్యాప్తు మొదలు కావాలి. అయితే 2021లో దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం గానీ అనంతరం రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలోగానీ 11.30 గంటలకు ఎర్ర గంగిరెడ్డి వివేకా నివాసానికి వచ్చారని చెప్పడం గమనార్హం. సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు ఆద్యంతం అశాస్త్రీయం, అహేతుకం, అసంబద్ధం, సందేహాస్పదంగా ఉందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ కుండబద్దలు కొట్టింది. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని చెబుతున్న సీబీఐ.. కీలకమైన ఆస్తి వివాదం కోణాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. వివేకా హత్య అనంతరం ఆయన నివాసంలో నిందితులు ఆస్తి పత్రాల కోసం వెతికారన్నది స్పష్టమవుతున్నా, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించింది. రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో కూడా ఏమీ చెప్పని వాచ్మెన్ రంగన్నకు రెండున్నరేళ్ల తర్వాత అంతా గుర్తుకు వచ్చినట్టు సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇక కీలక ఆధారంగా గొప్పగా ప్రకటించిన గూగుల్ టేక్ అవుట్ డాటా పూర్తిగా తప్పని స్వయంగా సీబీఐనే ప్రకటించడాన్ని ‘ద వైర్’ ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి రాసిన రెండు విశ్లేషణాత్మక కథనాలను ‘ద వైర్’ వెబ్సైట్ ప్రముఖంగా ప్రచురించింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట కట్టు కథలా? మొదటి కథనంలో సీబీఐ దర్యాప్తులో డొల్లతనాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రచురించిన రెండో కథనంలో మరింత లోతుగా విశ్లేషించి సీబీఐ దర్యాప్తు తీరును ఎండగట్టింది. సీబీఐ ప్రస్తావించిన ఐపీడీఆర్ డాటా కూడా హేతుబద్ధ ఆధారం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తునకు ఆధారంగా చెబుతూ సాక్షుల వాంగ్మూలాల పేరిట సీబీఐ చెబుతోంది కట్టు కథలేనని స్పష్టం చేసింది. ఏకంగా 14 మంది సాక్షులు సీబీఐ తీరును తప్పుబట్టడం.. ఏకంగా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సీబీఐపైనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఏ కోణంలో చూసినా సరే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దారి తప్పిందనే విషయాన్ని స్పష్టం చేసింది. వాచ్మెన్ రంగన్న అప్పుడలా.. ఇప్పుడిలా వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన మొదటి దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం.. వాచ్మెన్ రంగన్న 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసం వరండాలో నిద్రపోయాడు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11.30 గంటల సమయంలో వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. కారు శబ్దం వినిపించి రంగన్న నిద్ర లేచి గేటు తెరిచాడు. వివేకా ఇంటి వద్ద దిగిపోయాక.. కారు డ్రైవర్ ప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. ‘నేను నిద్రపోతాను.. నువ్వు నిద్రపో’ అని వివేకా రంగన్నతో చెప్పి తన నివాసంలోకి వెళ్లిపోయారు. నార్కో ఎనాలిసిస్ ఎందుకు బయటకు రాలేదు? ఆ తర్వాత వివేకాను ఆయన నివాసంలో ఆ రోజు రాత్రి హత్య చేస్తుంటే బయటే ఉన్న రంగన్న ఏం చేశాడనే దానిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోని పోలీసు అధికారులు విచారించనే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని వారాల తర్వాత రంగన్న పేరు కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరికొందరు అనుమానితులతోపాటు రంగన్నను కూడా అహ్మదాబాద్ తీసుకువెళ్లి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఎలాంటి విషయాన్ని రాబట్ట లేదు. మరి రంగన్నకు ఏదైనా విషయం తెలిసి ఉంటే నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో బయటపడేది కదా! రెండున్నరేళ్ల తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయా? వివేకా హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సీబీఐ రంగన్నను ప్రత్యక్ష సాక్షిగా న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ సారి రంగన్న కొన్ని కొత్త విషయాలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 2019 మార్చి 14న రాత్రి వివేకాను ఇంటి వద్ద దించేసి డ్రైవర్ ప్రసాద్ వెళ్లిపోయిన తర్వాత.. 15 నిమిషాలకు అంటే 11.45 గంటలకు వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరుకున్నాడని చెప్పాడు. దర్యాప్తులో ఇదే కీలకమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలు రెండు చోట్ల సరిపోలుతున్నాయి. వివేకా నివాసానికి ఎర్ర గంగిరెడ్డి రావడం.. వెళ్లడం అనే అంశాలు. మృతదేహాన్ని అర్ధరాత్రే చూసిన రంగన్న 2021 జూలైలో జమ్మలమడుగు న్యాయస్థానంలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా నివాసం నుంచి శబ్దాలు రావడంతో కిటికీ వద్దకు వెళ్లి లోపలికి చూశాడు. లోపల నలుగురు వ్యక్తులు హాల్, బెడ్ రూమ్‌లలో తిరుగుతూ దేని కోసమో వెతుకుతున్నారు. రంగన్న ఓ చెట్టు వెనుక దాక్కున్నాడు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి బయటకు వచ్చి గోడదూకి వెళ్లిపోవడం చూశాడు. అనంతరం ఎర్ర గంగిరెడ్డి బయటకు వచ్చి విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లాడు. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో రంగన్న వివేకా నివాసం లోపలికి వెళ్లాడు. బెడ్రూమ్లో మంచం పక్కన రక్తం పడి ఉంది. బాత్రూమ్లో వివేకా కింద పడిపోయి ఉన్నారు. ఆయన చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్లు.. సాక్షుల వాంగ్మూలాల పేరిటా సీబీఐ అడ్డదారులు తొక్కింది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్టుగా గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్ నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. కనీసం 14 మంది సాక్షులు తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఖండించారు. నలుగురు సాక్షులు రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు కూడా. వివేకా చనిపోయారనే విషయాన్ని 2019 మార్చి 15న ఉదయం 6.15 గంటలకు ఆయన పీఏ కృష్ణా రెడ్డి గుర్తించారు. చెప్పని విషయాలు ఎలా ఆపాదిస్తారు? అంతకు ముందే వివేకా మరణం గురించి ఎవరికైనా తెలుసా అనే కోణంలో సీబీఐ దృష్టి సారించింది. వివేకా హత్య గురించి గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి 2019 మార్చి 15 తెల్లవారు జామున 4 గంటలకే తెలుసని ఆయన తల్లి తమ పొరుగున ఉండే ప్రభావతి దేవికి చెప్పినట్టుగా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ మేరకు ప్రభావతి దేవి 161 వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా వెల్లడించింది. కానీ సీబీఐ వాదనను ప్రభావతి దేవి ఖండించారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తన పేరిట వాంగ్మూలం నమోదు చేసుకుందని ఆవిడ స్పష్టం చేశారు. (చదవండి : Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు') అజేయ కల్లం పేరిట తప్పుడు వాంగ్మూలం సాధారణ వ్యక్తులే కాదు.. ఏకంగా రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వక్రీకరించడం వివాదాస్పదమైంది. అజేయ కల్లం చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి చార్జ్ïÙట్లో పేర్కొంది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సీబీఐ తీరును ఎండగడుతోంది. అజేయ కల్లం చెప్పింది ఇది 2019 మార్చి 15 ఉదయం 5 గంటలకు పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం మొదలైంది. గంటన్నర తర్వాత అంటే 6.30 గంటల సమయంలో సహాయకుడు వచ్చి ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డిని పిలిచారు. ఆయన బయటకు వెళ్లారు. తర్వాత కాసేపటికి కృష్ణమోహన్‌రెడ్డి వచ్చి వైఎస్ జగన్ చెవిలో ఏదో చెప్పారు. దాంతో నిశ్చేష్టులైన వైఎస్ జగన్ వెంటనే లేచారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోయారు అని మాతో చెప్పారు. వెంటనే సమావేశాన్ని ఆపేసి బయటకు వచ్చాం’ అజేయ కల్లం చెప్పారంటూ CBI మార్చిన వాంగ్మూలం ఇది ‘2019 మార్చి 15 ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుండగా.. ఇంట్లో సహాయకుడు వచ్చి వైఎస్ భారతి పిలుస్తున్నారని వైఎస్ జగన్‌కు చెప్పారు. దాంతో లోపలికి వెళ్లిన జగన్ కాసేపటి బయటకు వచ్చి తన చిన్నాన్న వివేకానందరెడ్డి మరణించినట్టు అక్కడ ఉన్న మాకు చెప్పారు’ అని అజేయ కల్లం వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. అసలు వైఎస్ భారతి పేరును తాను ప్రస్తావించలేదని, అలాగే తాను 6.30 గంటలని చెప్పగా 5.30 గంటలుగా సీబీఐ పేర్కొందని ఆయన తప్పుబట్టారు. అయినా బయట నిద్రించిన రంగన్న! రక్తం మడుగులో తన యజమాని వివేకానందరెడ్డి చనిపోయి ఉండడాన్ని చూసిన తర్వాత రంగన్న ఏం చేశారంటే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తలుపు దగ్గరకు మూసివేసి బయటకు వచ్చి అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అక్కడే బీడీ తాగాడు. కాసేపు మెట్ల మీద కూర్చున్నాడు. కాసేపట్లో సమీపంలోని మసీదు నుంచి ఉదయం ప్రార్థనలు వినిపించాయి. దాంతో అక్కడే వరండాలో నిద్రపోయాడు. సీబీఐ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న రెండు మసీదుల్లోని మత పెద్దలతో మాట్లాడారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రోజూ ఉదయం 5 గంటలకు మసీదులో ప్రార్థనలు మొదలవుతాయి. అప్పటికి 15 నిమిషాల ముందే మసీదు మైకుల ద్వారా ఆజాన్ వినిపించడం మొదలు పెడతారు. అంటే తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.45 గంటల మధ్యలో రంగన్న తన యజమాని వివేకా మృతదేహాన్ని చూశాడు. కానీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న వివేకా వద్ద పని చేసే సిబ్బందికి గానీ.. అక్కడికి పది నిమిషాల్లోనే వెళ్లగలిగేంత సమీపంలో ఉన్న డ్రైవర్ ప్రసాద్ నివాసానికి గానీ.. మరెవరికైనా చెప్పాలనిగానీ అనుకోలేదు. ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య వివేకా పీఏ కృష్ణా రెడ్డి, వంటమనిషి లక్షి, ఆమె కుమారుడు ప్రకాశ్ వచ్చే వరకు నిద్రపోతున్నట్టు నటిస్తూ గడిపాడు. పైగా ఉదయం వివేకా నివాసం ఉత్తరం వైపు తలుపు తెరచి ఉండటాన్ని చూసిన పీఏ కృష్ణా రెడ్డి.. తనను ఇంటి లోపలికి వెళ్లి చూడమంటే రంగన్న లోపలికి వెళ్లాడు. అప్పుడు వివేకా మృతదేహాన్ని మొదటి సారి చూసినట్టుగా అందర్నీ నమ్మించాడు. ఆ విషయాన్ని 861 రోజుల తర్వాత సీబీఐ ద్వారా న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం, రంగన్న ఇచ్చిన వాంగ్మూలం తప్ప మరే ఆధారం లేదు. -
వివేకా హత్య కేసులో సీబీఐ స్టేట్ మెంట్ లో అన్నీ అబద్దాలే ఉన్నాయన్న అజేయకల్లం
-
Viveka Case: నా వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేశారు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నా వాంగ్మూలంపై సిబిఐ తప్పుడు వైఖరి "ఏప్రిల్ 29న నేను వాంగ్మూలం ఇస్తుండగా.. అధికారి మరొకరిని లోపలికి పిలిచారు. ఆయన లాప్‌ట్యాప్‌తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నాడు. ఆయన ఏం రికార్డు చేసింది నాకు చూపించలేదు. కనీసం చదివి వినిపించలేదు. నాకు తెలిసినంతవరకు నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు కూడా చేయలేదు. సీబీఐ నా స్టేట్మెంట్ను తప్పుడు రికార్డు చేసినట్లు మే 17న ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకున్నా". విచారించింది ఒకరయితే, సంతకం చేసింది మరొకరా? "నా స్టేట్మెంట్పై సంతకం చేసిన అధికారి, నన్ను విచారించిన అధికారి ఒకరు కాదు. దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజ్యాంగ ధర్మాసనాలు పదేపదే చెబుతున్నా.. కొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు చేయడం అంటే అస్పష్టమైన సత్యాన్ని బయటికి తీసుకురావడం. కానీ, ఇక్కడ అధికారులు అలా వ్యవహరించలేదు." నా వాంగ్మూలం పత్రికకు సిబిఐ ఎలా లీక్ చేస్తుంది? "నా వాంగ్మూలం గురించి నేను ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కానీ, ఆ పత్రికలో ఎలా వచ్చిందో నాకు అర్థంకాలేదు. ఆశ్చర్యం వేసింది. ఆ పత్రికలో పేర్కొన్నదంతా అసత్యపూరితం. పత్రికలో వచ్చిన దానిపై ఎలక్ట్రానిక్ మీడియా చర్చా కార్యక్రమాలు పెట్టడంతో నేను విలేకరుల సమావేశం పెట్టి.. ఆ పత్రికది కట్టుకథ అని చెప్పాల్సి వచ్చింది. సీబీఐ నమోదు చేసింది కూడా నేను చెప్పింది కాదని తెలిసింది. అయితే సీఆర్పీసీ 161 కింద రికార్డు చేసిన కాపీ నావద్ద లేనందున నా వాంగ్మూలం తప్పుగా పేర్కొన్న విషయాన్ని తెలుసుకోలేకపోయా" నేను చెప్పింది ఒకటయితే సిబిఐ మరోలా స్టేట్ మెంట్ తయారు చేస్తుందా? "ఏప్రిల్ 29, 2023న సీబీఐ నా నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. నేను చెప్పింది ఒకటయితే CBI దాన్ని మార్చి ఛార్జిషీటులో మరోలా పేర్కొంది. మార్చి 15, 2019న జగన్ గారి నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన సుమారు గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. OSD కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌గారు షాక్‌కు గురైయ్యారు. చిన్నాన్న చనిపోయారని తమతో అన్నారు" ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. నేను చెప్పని విషయాలు మీరేలా స్టేట్ మెంట్ లో చేర్చుతారు? తాను CBIకి స్టేట్మెంట్లో కేవలం పైన పేర్కొన్న విషయాన్ని మాత్రమే చెప్పానని, కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందని అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి భార్య ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని అజేయ కల్లం తెలిపారు. అయితే సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో తనకు ఆపాదించి, తాను చెప్పినట్టుగా అబద్ధాలను చేర్చారని అజేయకల్లం పిటిషన్ లో పేర్కొన్నారు. CBI దాన్ని తొలగించాల్సిందే "దురదృష్టవశాత్తు నేను చెప్పింది CBI సరిగ్గా రికార్డు చేయలేదు. చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది పూర్తిగా అసంబద్ధం. దర్యాప్తును తప్పుదారి పట్టించి.. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ ఇలా తప్పుగా పేర్కొంది. నేను చెప్పకున్నా చెప్పినట్లు సీబీఐ తప్పుడు వాంగ్మూలాన్ని సమర్పించడం ఎంతమాత్రం సరికాదు. ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సీబీఐ తప్పుడు సమాచారం చేర్చింది. ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో సమర్పించిన చార్జిషీట్ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలగించాలి". తెలంగాణ హైకోర్టు ఆ ఛార్జ్ షీట్ నుంచి తన వాంగ్మూలం తొలగించేలా ఆదేశాలివ్వాలని అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. వివక్ష లేకుండా విచారణ జరగాలి సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని అజేయకల్లం విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ డైరెక్టర్ని, వివేకా కేసు విచారణాధికారి (ఏఎస్పీ)ని ప్రతివాదులుగా చేర్చారు. -
ఛార్జ్ షీట్ లో అంతా కల్పిత కథలే
-
వివేకా కేసు: ఇంకా మౌనంగా భరించాలా?
సాక్షి, అమరావతి: సీబీఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ కూడా చెత్తగా దర్యాప్తు చేస్తుందనేందుకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేని గుంట నక్కలకు సీబీఐ వేదికగా మారిందని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ మొత్తం కల్పిత కథేనని కొట్టిపారేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు బాకాలు ఊదే ఎల్లో మీడియాకు నాలుగు రోజులు మసాలా కథనాలు వండివార్చడానికి మాత్రమే సీబీఐ ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుంది కానీ ఈ డైలీ సీరియల్ న్యాయస్థానాల్లో నిలబడదని తేల్చి చెప్పారు. వైఎస్ భారతమ్మ, తాను కలిసి సునీతమ్మ ఇంటికే వెళ్లలేదని సజ్జల స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఎంపీ అవినాష్‌రెడ్డిని వెనకేసుకురావాలని సునీతమ్మను తాను ఎలా కోరుతానని ప్రశ్నించారు. సునీతమ్మ పచ్చి అబద్ధాలు చెబుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేదా? ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం వ్యక్తుల వాంగ్మూలాలను కల్పిత కథకు అనుకూలంగా మారుస్తూ సీబీఐ ఛార్జ్షీట్లు దాఖలు చేస్తోంది. వైఎస్ వివేకా హత్య వల్ల నష్టం ఎవరికి? అని ప్రశ్నిస్తే.. వైఎస్సార్ సీపీకి, జగన్‌కే అని చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఇంకా చెప్పాలంటే నాడు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి నష్టం. రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవాలని ఆయన ఎందుకు అనుకుంటారు? ఏ చిన్న దర్యాప్తు సంస్థ అయినా, ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థకైనా ఈమాత్రం ఇంగితం ఉంటుంది. వివేకా హత్య కేసును రెండు సిట్లు దర్యాప్తు చేశాయి. అవి సేకరించిన కాల్ రికార్డ్స్, డేటాను సీబీఐ ఏం చేసిందో తెలియదు. వ్యవస్థల్లోకి వైరస్‌లా చంద్రబాబు.. అన్ని వ్యవస్థల్లో వైరస్‌లా పాకిన చంద్రబాబు తన అనుచరులతో జాతీయ స్థాయిలో మేనేజ్ చేసేలా చక్రం తిప్పుతున్నారు. వివేకా హత్య వల్ల నాడు అధికారంలో ఉన్న చంద్రబాబుకు రెండు లాభాలు. ఒకటి వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం.. రెండోది.. పాదయాత్ర పూర్తిచేసి అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైన వైఎస్ జగన్‌ను తేరుకోనివ్వకుండా చేయడం. తెలంగాణ హైకోర్టు ప్రశ్నించడంతో.. తెలంగాణ హైకోర్టు గత మే 31న మొదటిసారిగా కేసును క్షుణ్ణంగా పరిశీలించి సీబీఐని పలు ప్రశ్నలు అడిగింది. మేం ముందు నుంచీ వ్యక్తం చేస్తున్న సందేహాలే అవి. అవినాష్‌రెడ్డి జూన్ 19న సీబీఐ డైరెక్టర్‌కి లేఖ రాయడంతో సునీతమ్మ స్టేట్మెంట్ మరొకటి రికార్డు చేశారు. హింసాత్మక సంఘటనలు జరుగుతాయనే లేఖను బయట పెట్టలేదని సునీతమ్మ చెబుతున్నారు. అది అసహజం. సొంత తండ్రి చనిపోయినా లేఖ విషయాన్ని పట్టించుకోలేదంటే ఎలా నమ్మడం? పది రోజుల తర్వాత పరామర్శకు వెళ్లా.. 2019 మార్చి 23వ తేదీన భారతమ్మ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు చేయమన్నారని సునీతమ్మ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అవినాష్‌ను సమర్థించాలని నేను కోరినట్లు కథ అల్లారు. ఆ రోజు భారతమ్మ, నేను కలిసి ఆమె ఇంటికి వెళ్లలేదు. వివేకా హత్య జరిగిన తర్వాత పది రోజులకు నా భార్యతో కలసి పరామర్శించడానికి వెళ్లా. బాగా షాక్‌తో ఉంటారనుకున్నాగానీ అంత ఇదిగా అయితే కనిపించలేదు. షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మొదట ఇంటికి పెద్దలా ఉన్న వైఎస్ జగన్‌కు ఫోన్ రావాలి. కానీ సునీతమ్మ వైపు నుంచి ఫోన్ రాలేదు. వివేకా వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు ఈరోజు ఆమెకు మిత్రులు, సలహాదారులు, సన్నిహితులు. వివేకాకు మచ్చ రాకూడదని అవినాష్ రెడ్డి కుటుంబం మూడేళ్లు మౌనంగా అన్నీ భరించింది. చనిపోయిన వ్యక్తి గౌరవాన్ని కాపాడాలని మేం తపన పడుతుంటే బతికున్నవారినే సునీతమ్మ బజారుకీడుస్తున్నారు. బతుకులను నాశనం చేసే పరిస్థితికి వచ్చాక మౌనం వీడి నోరు తెరవాల్సి వస్తోంది. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ట్రైనింగ్ ఆధారాలు, పరిసరాలు, హత్యలో పాల్గొన్న వ్యక్తు లు ఇలా అన్నీ ఒక వైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగుతోంది. ఎప్పుడైతే సునీతమ్మ ఆలోచన విధానం మారిందో అప్పుడే కేసును బలవంతంగా తిప్పడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు లాభం చేకూరేలా మార్చారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి సీబీఐ చేతికి వ చ్చాక వారికి తగ్గట్లుగానే అన్నీ జరుగుతూ వచ్చా యి. అవినాష్ వైపు వేలు చూపించేందుకు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వివేకా కోసం అవినాష్ ధర్నా నిజానికి నాడు వివేకాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని జగన్‌కు ప్రతిపాదన చేసింది అవినాõÙ. ఒక ఎంపీటీసీని టీడీపీ నేతలు ఎత్తుకెళితే వివేకా కోసం అవినాష్‌రెడ్డి స్వయంగా ధర్నాకు కూర్చున్నాడు. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచీ పులివెందుల విషయంలో తన ప్రతినిధిగా అవినాష్‌ను జగన్ ఎంపిక చేసుకున్నారు. వైఎస్సార్‌కు వివేకా ఎలాగో ఇప్పుడు జగన్‌కు కూడా అవినాష్ అలానే. గుంట నక్కలకు వేదిక.. వివేకాను వారే హత్య చేశారనేందుకు పది పన్నెండు కారణాలున్నాయి. ఆస్తి, కుటుంబ పరువు విషయాలే ప్రధానంగా హత్యలకు దారి తీస్తాయి. వివేకా చెక్ పవర్‌ను రద్దు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ స్టేట్మెంట్లో అన్నీ ఉన్నాయి. వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి బెదిరించాడని, మనుషులను పంపించాడని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై సీబీఐ ఎందుకు విచారించదు? అన్ని శక్తులు ఉడిగిపోయిన గుంటనక్కలన్నీ ఒకచోట చేరి సీఎం వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు సీబీఐని వేదికగా చేసుకుంటున్నాయి. పది బండలు వేస్తే ఒకటన్నా నమ్మకపోతారా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కోర్టు ఒకసారి మొట్టికాయలు వేసింది. న్యాయమూర్తి అమ్ముడుపోయాడంటూ ఆంధ్రజ్యోతి డిబేట్లో నేరుగా బురద చల్లే దుస్సాహసానికి ఒడిగట్టింది. జర్నలిజం పేరుతో బెదిరింపులకు పాల్పడు తూ ఉగ్రవాదుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నా రు. చంద్రబాబు, ఎల్లో మీడియా కరివేపాకులా సునీతమ్మను వాడుకుంటున్నారు. ఎన్నికలు ముగి యగానే ఆమెను అనాథలా పక్కన పెట్టడం ఖాయం. ప్రత్యర్థుల క్యాంపులో సునీతమ్మ.. కారణాలు ఏమిటో తెలియదుగానీ వివేకా కుమార్తె సునీతమ్మ ఆ తర్వాత వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆమె పూర్తిగా ప్రత్యర్థుల క్యాంపులోకి వెళ్లినట్లు అనిపించింది. కథ మలుపు తిరగాలన్నపుడల్లా వారికి అనుగుణంగా ఆరేడు సార్లు సునీతమ్మ స్టేట్మెంట్లు తీసుకున్నారు. వారికి కావాల్సిన స్టేట్మెంట్లు తీసుకుంటూ ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ అంటున్నారు. సునీల్ యాదవ్ అనే నిందితుడు బెయిల్‌కి దరఖాస్తు చేసినప్పుడు గూగుల్ టేకవుట్‌ను తెరపైకి తెచ్చి అవినాష్‌రెడ్డి తండ్రిని లోపల పెట్టేశారు. గూగుల్ టేకవుట్ ఈ కేసులో నిలబడదని తెలియగానే యూనివర్సల్ టైమ్ కో–ఆర్డినేటర్ ప్రకారం మన సమయానికి 5.30 గంటలు కలపాలన్నారు. ఆ లెక్కన వారు చెప్పిన టైం మరుసటి రోజు 8 గంటలు కావడంతో దాన్ని పక్కన పెట్టేశారు. అది నిలబడదని వారికీ అర్ధమైంది. -
సీబీఐ ఛార్జ్‌షీట్ కల్పిత కథ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలా: సజ్జల
సాక్షి, అమరావతి: కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. ‘‘వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే మచ్చుతునక. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయింది. వ్యవస్థలో చంద్రబాబు వైరస్‌లా పాకారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసింది?. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైంది’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారు. సునీత ఇప్పటివరకు ఆరు, ఏడు స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం’’ అని సజ్జల తెలిపారు. ‘‘ఏ స్టేట్మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు మార్చారు. అవినాష్‌రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారు. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు. అవినాష్‌రెడ్డి ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా? ‘‘సునీత చెప్పినవన్నీ అబద్ధాలే.. భారతమ్మ, నేను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శించడానికి వెళ్లా. అవినాష్‌ను డిఫెండ్ చేయమని సునీతకు చెప్పలేదు. సునీతను ప్రెస్‌మీట్ పెట్టమని కూడా నేను చెప్పలేదు. గూగుల్ టేక్ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయింది. జూన్ 19న అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్మెంట్ ఇప్పించారు.’’ అని సజ్జల తెలిపారు. చదవండి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ -
కోట్ల ఆస్తి - కన్న కూతురు - కరుడుగట్టిన అల్లుడు
-
Viveka Case: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా?
ఆంద్రప్రదేశ్‌లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆధారంగా రాజకీయాలు చేయాలని ఆశించిన తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ పారలేదు. ఈ కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని ఎలాగొలా ఇరికించడానికి జరిగిన ప్రయ్నత్నాలన్నీ కుట్రపూరితమేనన్న సంగతి అర్దం అవుతుంది. సీబీఐ ఈ కేసును చేపట్టిన ఇన్నాళ్ల తర్వాత నిర్దిష్టంగా ఏమీ తేల్చలేకపోవడం గమనించదగ్గ అంశం. అయినప్పటికీ కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డి పేరును చార్జీషీట్ లో నిందితుడుగా చేర్చడం, ఆయన తండ్రిని అరెస్టు చేయడం వంటివి వివాదాస్పదంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లితే టీడీపీకి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ కేసులో అవినాశ్‌ను కాపాడడానికి వెళ్లారని ప్రచారం చేసింది. అది తప్పుడు ప్రచారమని ఈ సీబీఐ చార్జీషీట్ స్పష్టం చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనను కూడా నిందితుల జాబితాలో చేర్చడమే ఇందుకు ఉదాహరణ. చిత్రమేమంటే ఆయనపై హత్యానేరం మోపినట్లు ఈనాడు పత్రిక బానర్ హెడింగ్ పెట్టి ఆత్మ సంతృప్తి చెందింది. నిజానికి ఇలాంటి కేసులలో సీబీఐ చాలా జాగ్రత్తగా అన్ని కోణాలలో దర్యాప్తు చేయవలసి ఉంటుంది. కాని ఇందులో అవసరంలేని వ్యక్తులను కూడా సాక్ష్యాలకు పిలవడం, అవసరం ఉన్నవారిని వదలివేయడం సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. సీబీఐ వెనుక ఎవరో అదృశ్య హస్తం ఉండి నడిపిస్తున్నారన్న సందేహం వచ్చింది. దానికి తగ్గట్లుగానే సీబీఐ కోర్టుకు తన వద్ద ఉన్న సమాచారాన్ని తెలియచేయడానికి ముందే ఎల్లో మీడియా లో ప్రత్యక్షం అవడం కూడా ఈ డౌట్లను ధృవీకరించింది. ఇంతచేసినా సీబీఐ ఫలానా మోటోతో ఈ హత్య జరిగిందని చార్జీషీట్ లో ప్రస్తావించలేదు. మొదట ఇందులో ఆర్దిక కోణం గురించి సీబీఐ కాన్సన్ ట్రేట్ చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటో తెలియదు. వైఎస్ వివేకా ఆర్దిక స్థితిగతులు, అతనిని సొంత కుటుంబం దూరంగా ఉంచిన వైనం, ఆయన చెక్ పవర్‌ను రద్దు చేసిన తీరు. డ్రైవర్ దస్తగిరి, గంగిరెడ్డి తదితరులతో వచ్చిన విబేధాలు , రియల్ ఎస్టే ట్ లావాదేవీలు, మరో మహిళను పెళ్లి చేసుకోవడం, మగ పిల్లాడిని కనడం వంటి అంశాలకు ఎందుకు సీబీఐ విచారణలో సీరియస్‌గా తీసుకోలేదో అంతుపట్టదు. రాజకీయ కోణం అంటూ చేసిన ఆరోపణలలో హేతుబద్దత కనిపించడం లేదు. ఉదాహరణకు అవినాశ్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వరాదన్నది ఆయన ఉద్దేశం అయితే మాత్రం ఇచ్చేది ఆయన కాదు కదా! పార్టీ అధినేత జగన్ కదా? ఇందులో వివేకా అడ్డుపడేదేముంది? అవినాశ్‌కు కుండాపోయేదేమంది? వివేకా ఎన్నికల ప్రచారానికి ఎవరికి మద్దతుగా వెళ్లారు? వైఎస్ షర్మిల కూడా రాజకీయ అంశాలపై దృష్టి పెట్టడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ హత్య కేసులో రాజకీయం కోణం గురించి ప్రస్తావించి అవినాశ్ ప్రమేయం ఉండవచ్చని తమ ఆలోచన అంటూ .. అది నిజం కావచ్చు..కాకపోవచ్చు అని, మరో సందర్భంలో తన వద్ద ఆధారాలు లేవు కానీ.. అని అనడం సాక్ష్యం ఎలా అవుతుంది. ఆమె, వివేకాలు ఎంపీ టిక్కెట్ గురించి మాట్లాడుకుంటే ఫైనలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? వారిలో ఎవరో ఒకరు జగన్‌తో మాట్లాడితే కదా?అలాంటిది ఏమీ లేదే? షర్మిల రాజకీయంగా తెలంగాణలో దృష్టి పెట్టడం ఆరంభించాక ఆమె స్వరంలో ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు. ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో అవినాశ్ రెడ్డే ఎంపీ అభ్యర్ధి అని, అతను మంచివాడని చెప్పిన సంగతి విస్మరించలేం కదా? ఆమె మాత్రమే కాదు. వివేకా కుమార్తె సునీత కూడా రాజకీయంగా ఎలాంటి అనుమానాన్ని తొలుత వ్యక్తం చేయలేదు కదా? ఎవరో ఉదయకుమార్ రెడ్డి తల్లి పక్కింటావిడతో తన కొడుక్కి ముందే హత్య గురించి తెలుసని అన్నదన్న సమాచారంతో ఈమెకు అనుమానం మొదలైందట. ఇది నమ్మశక్యంగా ఉందా? వివేకా ఎప్పుడో సునీతకు ఆస్తి రాసిచ్చేశారని షర్మిల చెప్పిన విషయం కూడా కరెక్టు కాదని , తండ్రి హత్య తర్వాత సునీతకు బదలాయింపు అయిన ఆస్తుల వివరాలన్నీ మీడియాలో వచ్చాయే! ఈ కేసులో ఎవరివద్ద అయినా క్లూ ఉంటే సీబీఐ సాక్ష్యానికి పిలవవచ్చు.అలాకాకుండా తోచినవారందరిని పిలిచి , ఉబుసుపోక కబుర్లను పరిగణనలోకి తీసుకుని అభియోగాలు మోపవచ్చా? సునీత తన మొదటి వాంగ్మూలలో ఎక్కడా అవినాశ్ పైన అనుమానం వ్యక్తం చేయలేదు కదా? తదుపరి కాలంలో ఎందుకు మాట మార్చారు?అన్నిటికి మించి తన తండ్రిని గొడ్డలితో హత్య చేశానని చెబుతున్న నిందితుడికి ఆమె మద్దతు ఇవ్వడం నైతికంగా సమర్ధనీయమేనా?అతనికి ముందస్తు బెయిల్ కు సహకరించడం సరైనదేనా? 2009 తర్వాత జరిగిన పరిణామాలలో వివేకానందరెడ్డి కాంగ్రెస్ లో ఉండి మంత్రి పదవి తీసుకునేలా వత్తిడి చేసింది ఆయన కుటుంబ సభ్యులా?కాదా? ఆ తర్వాత విజయమ్మపై పోటీ చేసినప్పుడు అల్లుడు మరికొందరి పాత్ర ఏమిటి? అయినా ఆ తర్వాత కాలంలో జగన్ ఆయనను గౌరవించి పార్టీలోకి మళ్లీ చేర్చుకుని ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారా? లేదా? జగన్ మద్దతు ఇచ్చిన వ్యక్తికి వైఎస్ భాస్కరరెడ్డి ,అవినాశ్ రెడ్డి తదితరులు వ్యతిరేకించేంత సీన్ ఉంటుందా? టీడీపీ అభ్యర్ది వైసిపి ఓటర్లను కొనుగోలు చేసి కర్నాటక క్యాంప్ లో పెట్టారన్న ఆరోపణలు అబద్దమా? ఈ కేసులో కేవలం ఎంపీ టిక్కెట్ విషయంలోనే విబేధాలు వచ్చి హత్య జరిగిందని ఆరోపిస్తున్న సీబీఐ ఈ కోణాలలో ఎందుకు సమాచారం సేకరించలేదు? వివేకా మరణం గురించి జగన్ కు ఎప్పుడు తెలిసిందన్నదానికి అంత ప్రాధాన్యం ఏమిటో అర్దం కాదు. ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశంలో ఉన్న అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి తదితరులు ఫలానా టైమ్ కు జగన్‌కు పోన్ వచ్చిందని చెప్పకపోయినా, సీబీఐ తనకు తోచిన రీతిలో టైమ్ మెన్షన్ చేయవచ్చా? ఇవన్ని ఒక ఎత్తు అయితే, గూగుల్ టేకవుట్ డ్రామా సంగతి ఏమిటి? సీబీఐ గూగుల్ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తోందని ఎల్లో మీడియా చేసిన హడావుడి అంతా ,ఇంతా కాదు కదా? మరి ఇప్పుడు ఆ గూగుల్ టేకవుట్ టైమింగ్ మనకు వర్తించదని తేలింది కదా? దాని పేరుతోనే వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ జవాబివ్వక్లర్లేదా? ఎల్లో మీడియా ఆ విషయాన్ని దాచిపెట్టడానికి ఇప్పుడు తంటాలు పడుతోంది. ఏది ఏమైనా అనేక మిస్సింగ్ లింక్‌లతో సీబీఐ దాఖలు చేసిన చార్జీసీట్ పై వైర్ మీడియా చేసిన విశ్లేషణ చూస్తే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుంది. ఇవన్ని ఎందుకు! అవినాశ్ రెడ్డి ముందస్త బెయిల్ కేసులో విచారణ చేసిన న్యాయమూర్తి లేవనెత్తిన ప్రశ్నలకైనా సీబీఐ ఈ చార్జిషీట్ లో సమాధానం ఇవ్వగలిగిందా? అంతేకాదు. కేసు విచారణకు ముందే న్యామూర్తిపైనే తెలుగుదేశం కు చెందిన మీడియా బహిరంగంగా ఆరోపణ చేయవలసిన అవసరం ఏమి వచ్చింది. వారికి ఈ కేసులో ఉన్న ప్రత్యేక శ్రద్ద ఏమిటి? అది రాజకీయమా? లేక ఆర్థికమా? ఆ విషయాలపై కూడా దర్యాప్తు సంస్థ ఆలోచించాలి కదా? ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి కాని, మీడియాకు కాని ఉపయోగపడేలా సీబీఐ లీకులు ఇచ్చిందన్న ఆరోపణలకు బదులు దొరుకుతుందా? ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి మొదటి నుంచి ఒకే మాట మీద ఉంటే, సునీత, ఆమె భర్త పలుమార్లు మాటలు మార్చారు. ఈ కోణాన్ని కూడా కేసులో పరిశీలించవలసిన అవసరం ఉంది కదా! ఏతావాతా ఇన్ని లోపాలతో సీబీఐ చార్జీషీట్ వేసిందన్న విమర్శలు వస్తుంటే తెలుగుదేశం పార్టీకాని, ఎల్లో మీడియా కాని ఈ కేసులో చార్జిషీట్ అప్పుడే పడిపోయిందే అన్న బాదలో ఉన్నాయట. ఎన్నికల వరకు ఈ కథ నడిపి, రాజకీయంగా వాడుకోవాలన్న వారి కోరిక నెరవేరకుండా పోతోందన్నది వారి భావన అట. ఎందుకంటే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ,అబివృద్ది కార్యక్రమాల ఆధారంగా ఎన్నికలలోకి వెళితే గెలుపు అసాధ్యమని నిర్ణయానికి వచ్చిన వీరు ఈ కేసు ఆధారంగా రాజకీయం నడపాలని అనుకున్నారట. మొత్తం మీద సీబీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఇటీవలి కాలంలో పబ్లిక్ స్క్రూట్నీలో ఫెయిల్ అవుతున్న తీరు అందరికి అర్ధం అవుతూనే ఉంది. - కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
Viveka Case: వివేకా హత్య కుటుంబ ఆస్తి కోసమే!
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుటుంబ ఆస్తి వివాదాలే ప్రధాన కారణమని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ హత్య చేయించారని ఆధారాలతో సహా వివరించారు. వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడి పేరిట రాసిన నోటరీ వీలునామాను నిందితులు నర్రెడ్డి కుటుంబానికి అందచేశారని తెలిపారు. షమీమ్‌కు వాటా ఇవ్వకుండా వివేకా ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్ దురుద్దేశపూరితంగా ఈ అంశాలపై దర్యాప్తు చేయకుండా పక్కదారి పట్టించారన్నారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించటానికి మూడున్నర నెలల ముందు నుంచే రాంసింగ్ దర్యాప్తు చేపట్టడం, సాక్షులు చెప్పినదానికి భిన్నంగా వాంగ్మూలాలను నమోదు చేయడాన్ని ప్రస్తావించారు. ఈమేరకు ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు సవివరంగా రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలు, అనంతర పరిణామాలను లేఖలో వివరించారు. హత్యలో పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఇప్పించిన వాంగ్మూలం పూర్తిగా అసత్యాల పుట్ట అని స్పష్టం చేశారు. వివేకా బాత్రూమ్లో లభ్యమైన గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివి? అనే విషయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడాన్ని ఎంపీ అవినాశ్ లేఖలో ప్రస్తావించారు. కడప ఎంపీ టికెట్‌పై ఎలాంటి సందిగ్దత లేదని స్పష్టం చేస్తూ హత్యకు ముందు రోజు వరకు ఎంపీగా తన గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాంసింగ్ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశాలను పునఃసమీక్షించి ఐపీసీ 457, 460, 394, 398, 302 సెక్షన్ల కింద సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐకి గడువు నిర్దేశించింది. అంటే అప్పటిలోగా సీబీఐ తుది చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 19న సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి ఈ లేఖను రాశారు. సీబీఐ నమోదు చేసి న్యాయస్థానానికి సమర్పించిన సాక్షుల వాంగ్మూలాలు, అంతకు ముందు ఛార్జ్షీట్లలో పేర్కొన్న అంశాలను విశ్లేషించిన అనంతరం తాను సహేతుకంగా ఈ సందేహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీబీఐ గత గత ఛార్జ్ షీట్ల లో విస్మరించిన కీలక అంశాలను పునసమీక్షించి సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయలని కోరారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి లేఖలో ప్రస్తావించిన ప్రధానాంశాలు సంక్షిప్తంగా... పక్కదారి పట్టించిన రాంసింగ్ రాంసింగ్ దర్యాప్తు అధికారిగా 2021 నవంబరు 9న అధికారికంగా బాధ్యతలు స్వీకరించగా అప్పటికి మూడున్నర నెలల ముందే సీఆర్పీసీ నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబరు 2నే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. నాతోపాటు నా తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే సాక్షుల పేరిట వాంగ్మూలాలు నమోదు చేశారు. సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసి తన కింది అధికారులతో వాటిపై సంతకాలు చేయించారు. సీఐ శంకరయ్య, అభిషేక్‌రెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్లుగా రాంసింగ్ ఏకపక్షంగా వాంగ్మూలాలను నమోదు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శంకరయ్య కడప ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. తాను చెప్పినట్లు అబద్ధాలు చెప్పాలని ఉదయకుమార్‌రెడ్డిని రాంసింగ్ చిత్రహింసలకు గురి చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021 నవంబర్ 9వరకు రాంసింగ్ దర్యాప్తు కొనసాగించి రెండు చార్జ్షీట్లు దాఖలు చేశారు. వివేకా రెండో వివాహం అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బెంగళూరు భూవివాదం కట్టుకథే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి రాంసింగ్ ఇప్పించిన వాంగ్మూలంలోని అంశాలు పూర్తి అవాస్తవమని సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. బెంగళూరులోని ఓ భూవివాదానికి సంబంధించి డబ్బుల కోసం వివేకాను హత్య చేయమని, తనకు వైఎస్ భాస్కర్‌రెడ్డి సహకారం ఉందని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. బెంగళూరు భూవివాదానికి సంబంధించి 10 మందిని సీబీఐ విచారించింది. ఆ భూమికి సంబంధించిన పత్రాలు నకిలీవని తేలడంతో వాటిని బెంగళూరుకు చెందిన వై.వెంకట ప్రసాద్‌కు అప్పటికే అప్పగించేసినట్టు వెల్లడైంది. అంటే వివేకా హత్యకు చాలా నెలల ముందే బెంగళూరు భూవివాదం సమసిపోయింది. దస్తగిరి వాంగ్మూలం పూర్తిగా అవాస్తవమని స్పష్టమైంది. ఆ వాంగ్మూలం ఆధారంగా రాంసింగ్ దర్యాప్తు చేయడం దురుద్దేశపూరితమే. చెక్ పవర్ రద్దుతో ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సభ్యులు తన చెక్ పవర్ రద్దు చేయడంతో వివేకా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విపరీతంగా మద్యానికి బానిసయ్యారు. మోసగాడైన సునీల్ యాదవ్ చెప్పిన వజ్రాల కథను విశ్వసించారు. వాటిని విక్రయించి డబ్బులు ఇప్పించాలని సునీల్ యాదవ్ కోరడంతో తన వాహనాన్ని ఇవ్వడంతోపాటు అతడితో కలసి పలు ప్రాంతాలు తిరిగారు. తరువాత సునీల్ యాదవ్ చెప్పినదంతా కట్టుకథేనని ఎర్ర గంగిరెడ్డి గ్రహించాడు. అప్పటి నుంచి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వివేకా ఇంటికి రావడం మానేశారు. వారిద్దరి కుటుంబాల్లో మహిళలతో వివేకాకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో వారిద్దరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివేకాపై దాడి చేసిన తరువాత ఆయన మర్మాంగంపై సునీల్ యాదవ్ కాలితో తన్ని తీవ్రంగా దూషించారు. నర్రెడ్డి కుటుంబానిదే ఆ కుట్ర కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకానందరెడ్డిని హత్య చేశారు. ఆ హత్య వెనుక వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఇతర నర్రెడ్డి కుటుంబ సభ్యులున్నారు. ఎందుకంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడు షెహన్‌షాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చలేకపోయారు. తన కుమారుడి విద్యాభ్యాసం, భవిష్యత్ కోసం తన ఆస్తిలో కొంత వాటా రాసివ్వాలనుకున్నారు. కుటుంబ ఉమ్మడి ఆస్తిలో తన పేరిట ఉన్న 25 శాతం వాటాను షమీమ్, ఆమె కుమారుడి పేరిట ఆయన నోటరైజ్డ్ వీలునామా రాసినట్లు తెలిసింది. దీన్ని ఆయన మొదటి భార్య, కుమార్తె, అల్లుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య జరిగింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలతో ఎర్ర గంగిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ద్వారానే వారు వివేకా హత్యకు పన్నాగం పన్ని ఉంటారు. తమ కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వివేకాపై ఆగ్రహంతో ఉన్న సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిల సహకారంతో ఎర్ర గంగిరెడ్డి ఈ హత్యకు పథకం వేశాడు. డబ్బు ఆశ చూపించి దస్తగిరిని కూడా పాత్రధారిని చేశారు. వివేకా హత్య తరువాత ఆ ఇంట్లో కొన్ని పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, ఇతర నిందితులు గాలించారు. హత్యలో పాలు పంచుకున్న దస్తగిరితోపాటు వాచ్మెన్ రంగయ్య కూడా తన వాంగ్మూలంలో ఇదే విషయాన్ని చెప్పారు. బెంగళూరు భూవివాదం లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు కాబట్టి వారు వెతికింది వివేకా రాసిన నోటరీ వీలునామా గురించే అని స్పష్టమవుతోంది. నోటరీ వీలునామాను ఎర్ర గంగిరెడ్డి వివేకా కుమార్తె, అల్లుడికి ఇచ్చి ఉంటారు. అంటే కుటుంబ ఆస్తి కోసమే వివేకాను హత్య చేశారు. వివేకా హత్య తరువాత ఆ కుటుంబ ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్ ద్వారా మార్పించుకోవడం గమనార్హం. షమీమ్‌కు ఎలాంటి ఆస్తి దక్కలేదు. ఆస్తి కోసమే వివేకాను ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హత్య చేయించారని ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సమీప బంధువైన భరత్ యాదవ్ తన వాంగ్మూలంలో చెప్పాడు. తాము చెప్పినట్లు సీబీఐకి అవాస్తవాలు చెప్పకుంటే ఈ కేసులో ఇరికిస్తామని వివేకా పీఏ కృష్ణారెడ్డిని సునీత బెదిరించారు. ఈ వాస్తవాలన్నీ వివేకా హత్య వెనుక నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. సీబీఐ ఈ కోణంలో అసలు దర్యాప్తు చేయలేదు. ఆ వేలిముద్రలు ఎవరివి? వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని కడప పోలీసుల క్లూస్ టీమ్ పరిశీలించి బాత్రూమ్ గోడలు, తలుపు వెనుక ఉన్న వేలిముద్రలను సేకరించింది. ఆ వేలిముద్రల్లో కొన్ని నలుగురు నిందితుల వేలిముద్రలతో సరిపోలేదు. అంటే హత్య జరిగిన రోజు రాత్రి ఆ నలుగురు నిందితులే కాకుండా ఆ ఇంట్లో మరెవరో ఉన్నట్లు స్పష్టమవుతోంది. సీబీఐ అప్రూవర్‌గా మార్చిన దస్తగిరి ఆ వ్యక్తి పేరును వెల్లడించలేదు. ఆ వేలి ముద్రలు ఎవరివి? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. ఎవరినో రక్షించేందుకే ఆ వేలి ముద్రలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని స్పష్టమవుతోంది. ఆ వేలి ముద్రలు ఎవరివన్న కోణంలో దర్యాప్తు చేస్తే ఈ హత్య వెనుక అసలు కుట్ర బయటపడుతుంది. ఆ తరువాత మాట మార్చిన సునీత కడప ఎంపీ టికెట్ కోసమే వివేకాను హత్య చేశారని రాంసింగ్ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం. అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న నన్నే (అవినాష్‌రెడ్డి) 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. నా గెలుపు కోసం పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా వివేకానందరెడ్డి ఉన్నారు. ఆయన చనిపోయే ముందు రోజు వరకూ నా గెలుపు కోసం కృషి చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డితో కలసి ప్రచారం కూడా చేశారు. సీబీఐ ఈ విషయాలపై ఏమాత్రం దృష్టి సారించలేదు. కనీసం రఘురామిరెడ్డినిగానీ పార్టీ నేతలను గానీ సంప్రదించలేదు. వివేకా హత్య తరువాత తొలుత సునీత కూడా మీడియాకు ఇదే విషయాలను చెప్పారు. తన తండ్రి చివరి వరకు అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం పని చేశారని వెల్లడించారు. 2019 అక్టోబరు తరువాత ఆమె మాట మార్చి నాపై, మా పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇదీ చదవండి: వివేకా కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ? -
నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెబుతున్నది తప్పు: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి, కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. మరోవైపు ఈ కేసు విషయంలో వివేకా పీఏగా పనిచేసిన కృష్టారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు. శివశంకర్ రెడ్డి మా ఇంట్లో ఉన్నట్టు చెబుతున్నది అవాస్తవమని ఖండించారు. ఇది కూడా చదవండి: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం -
వివేకా హత్య కేసులో నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు :ఎంవీ కృష్ణారెడ్డి
-
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ది వైర్ సంచలన కథనం
-
Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. రాజకీయంగా అత్యంత సంచలనమైన కేసు.. దర్యాప్తు చేస్తోంది దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. దర్యాప్తు చేపట్టిన 1,226 రోజుల తర్వాత కూడా సీబీఐ సాధించింది ఇదీ అని చెప్పడానికి ఏమీ లేదన్నది నిర్వివా దాంశం. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందనే మాట చెప్పడం తప్ప.. అందుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఆధారాలు చూపించలేకపోయింది’ అని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ పేర్కొంది. నిష్పాక్షికమైన థర్డ్ పార్టీగా ‘ద వైర్’ వెబ్సైట్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లోని అంశాలను విశ్లేషించింది. రాజకీయ, నేర, న్యాయ సంబంధమైన వార్తా విశ్లేషకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సరిత రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన విశ్లేషాత్మక వ్యాసం ఇలా.. సాధించింది శూన్యం 2020 మార్చి 11న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే 120 రోజుల సమయం తీసుకుంది. మరో 474 రోజుల తర్వాత 2021 అక్టోబర్‌లో మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వివేకా హత్యలో పాలుపంచుకున్నారని చెబుతూ ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్(ఏ–2), గజ్జల ఉమాశంకర్ రెడ్డి(ఏ–3), దస్తగిరి(ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. ఈ హత్య వెనుక విస్తృత కుట్రను వెలికి తీయాల్సి ఉందని చెప్పింది. సీబీఐ తుది చార్జ్‌షీట్ 2023 జూలై 20న బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వారి సన్నిహితుడు డి.శివశంకర్‌రెడ్డిలను కూడా నిందితులుగా పేర్కొంది. కానీ సీబీఐ మొదటి నుంచీ పేర్కొంటూ వచ్చిన విస్తృత కుట్ర గురించి మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. హత్య వెనుక ఉద్దేశం అంటూ 14 పేరాల సుదీర్ఘ వ్యాసాన్ని చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. అందులో ఏముంది అంటే అందరికీ తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ నేపథ్యం, వంశ చరిత్ర మాత్రమే. ఇది తప్ప వాస్తవానికి హత్య వెనుక విస్తృత కుట్ర గురించి సీబీఐ స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయింది. ఇంతకీ ఇంతటి హైప్రొఫైల్ కేసుకు సంబంధించిన తుది చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు, వాటిలోని వాస్తవాలను పరిశీలిస్తే సీబీఐ దర్యాప్తులో డొల్లతనం బట్టబయలు అవుతోంది. సీబీఐ తాను పేర్కొన్న అభియోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క దానికి కూడా ఆధారం చూపించలేకపోయింది. అంతకు మించి వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబంలో విభేదాలు, బయట శక్తుల ప్రమేయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడం విస్మయ పరుస్తోంది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ఏం చెప్పింది.. అందులోని వాస్తవం ఏమిటన్నది అంశాల వారీగా పరిశీలిస్తే ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు సాధించింది శూన్యమన్నది స్పష్టమవుతోంది. సీబీఐ చెప్పిందేమిటి? వాస్తవం ఏమిటి? అన్నది చూద్దాం. 1.వివేకా క్రియాశీలకమైన నేతా? సీబీఐ : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. వాస్తవం : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత కాదు. హత్యకు గురయ్యే 15 ఏళ్ల ముందు 2004లో చివరిసారిగా ఎన్నికల్లో గెలిచారు. దశాబ్ద కాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. వివేకా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారని ఆయన కుమార్తె సునీతనే సీబీఐకి రెండుసార్లు చెప్పారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన రాజకీయాల నుంచి రిటైరై పోయినట్టేనని ఆమె చెప్పారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి పదవిలో లేరు. పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మ చేతిలో భారీ తేడాతో ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్ చేయలేదు. ఆయన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం కూడా ఇందుకు కారణం అయిఉండొచ్చు. 2.అవినాశ్ బలమైన అభ్యర్థి కాదా? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్ అవినాశ్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకానందరెడ్డి భావించారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వాస్తవం : అవినాశ్‌రెడ్డి బలహీనమైన అభ్యర్థి అన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో 1,90,323 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఆయన ఎంత బలమైన అభ్యర్థో ఆ మెజార్టీనే చెబుతుంది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో పార్టీ నిర్ణయం మేరకు తన ఎంపీ పదవికి 2018లో రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవినాశ్‌రెడ్డి మరింత భారీ మెజార్టీతో అంటే 3,80,976 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అంత మెజార్టీ సాధించడం విశేషం. ఏ రకంగా చూసినా అవినాశ్‌రెడ్డి బలమైన అభ్యర్థి అన్నదాంట్లో సందేహం లేదు. వివేకానందరెడ్డి తాను హత్యకు గురికావడానికి ముందు వరకు కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్యకు గురైన ముందు రోజు రాత్రి కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు వెల్లడించారు. అవినాశ్‌రెడ్డే ఎంపీ అభ్యర్థి అన్న విషయంలో మరో మాటే లేదని వివేకానందరెడ్డి సోదరి వైఎస్ విమల కూడా స్పష్టం చేశారు. ఎంపీగా అవినాశ్ గెలుపు కోసం వివేకా చివరి వరకు ప్రచారం చేశారని కూడా ఆమె చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ దురుద్దేశంతో అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 3. షర్మిల వాంగ్మూలంలో చెప్పినదానికి ఆధారం ఎక్కడ? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకా భావించారనే విషయాన్ని షర్మిల వెల్లడించారు. వాస్తవం : కడప ఎంపీ అభ్యర్థిత్వం విషయంపై వివేకానందరెడ్డి తనతో చెప్పినట్టుగా షర్మిల వెల్లడించిన సమాచారానికి ఎలాంటి ఆధారం లేదు. ఎంపీగా తానుగానీ తన తల్లి విజయమ్మగానీ పోటీ చేయాలని వివేకా చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చిన షర్మిల.. అందుకు ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. ఎంపీ టికెట్ అంశంపై వారిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా గతంలో ఎప్పుడూ మీడియాలోగానీ పార్టీ వర్గాలుగానీ చెప్పలేదు. సీబీఐ ఎలాంటి ఆధారం గురించి పేర్కొన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల తర్వాత షర్మిల తన సోదరుడితో రాజకీయంగా విడిపోయి తెలంగాణాలో సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ విషయం కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నదే. ఒక వేళ కడప ఎంపీ అభ్యర్థి విషయంపై వివేకానందరెడ్డికి వేరే అభిప్రాయం ఉన్నా సరే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసినప్పటి నుంచి వైఎస్సార్ కుటుంబ వ్యవహారాల్లో ఆయన పాత్ర పెద్దగా లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర పెద్దగా ఏమీ లేదన్నది ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డిపై సానుకూల దృక్పథంతో వైఎస్ జగన్ ఆయన్ను వైఎస్సార్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ చేశారు. కానీ వివేకా ఏనాడూ కూడా పార్టీ ముఖ్య నేతగా ఉండలేదు. 4. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీబీఐ చెప్పింది కట్టుకథే సీబీఐ : 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కారణం. అవినాశ్‌రెడ్డి అనుచరుడు డి.శివశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావించినప్పటికీ వైఎస్ జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి పని చేశారు. దాంతో వివేకా ఆగ్రహంతో డి.శివశంకర్‌రెడ్డిని దూషించారు. వాస్తవం : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డి కారణమనడానికి సీబీఐ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 800 మందికిపైగా ఓటర్లలో ఎవర్ని ప్రలోభాలకు గురిచేశారో కూడా చెప్పలేకపోయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో సీబీఐ కనీసం మాట్లాడనే లేదు. ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి, ఆయన హత్యకు సంబంధం ఉన్నట్టుగా కూడా సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించనే లేదు. రెండేళ్ల క్రితం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషయంపై తలెత్తిన వివాదం వల్ల తమను దూషించారనే ఉద్దేశంతో 2019 ఎన్నికల ముందు హత్యకు ఎవరైనా ప్రయత్నిస్తారా? అందులోనూ 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి కుటుంబం 2019 ఎన్నికల ముందు హత్య వంటి దుందుడుకు పనులకు ఎందుకు ఒడిగడుతుంది? పైగా 2019 ఎన్నికల్లో 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన అవినాశ్ రెడ్డికి వివేకాతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏమాత్రం ఉండదు. సీబీఐ తమ ఆరోపణకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వివేకా గుండెకు ఆపరేషన్ చేసుకున్నప్పటికీ ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులలో ఉండటం లేదు. హైదరాబాద్‌లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. నెలకు ఒకట్రెండుసార్లు పులివెందుల వచ్చి వెళుతున్నారు. కుమార్తె సునీత ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే వస్తున్నారు. ‘షమీమ్‌తో మా నాన్న సహజీవనం చేస్తున్నారని 2011లో బయటపటినప్పటి నుంచి ఆయనతో నేను సఖ్యతగా లేను. పులివెందులకు ఎప్పుడోగాని వెళ్లడం లేదు. 2018లో క్రిస్మస్ తర్వాత మళ్లీ నేను పులివెందుల వెళ్లనే లేదు. నా భర్త ఎన్.రాజశేఖర్‌రెడ్డి మాత్రం అప్పుడప్పుడు వెళుతుండేవారు’ అని సునీత చెప్పారు. వివేకానందరెడ్డి తన పేరును అక్బర్ఖాన్గా మార్చుకుని షమీమ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారు. షమీమ్ కుటుంబం నిర్వహణ బాధ్యత చూస్తుండటంతోపాటు ఆమె చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశారు. బలపనూరులో ఆమె ఇంటి పై అంతస్తును నిర్మించడంతోపాటు 8 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఇక వివేకానందరెడ్డి మొదటి భార్య సోదరులు తనను బెదిరించేవారని షమీమ్ సీబీఐకి చెప్పారు. పెద్ద భార్య పెద్ద సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని తెలిపారు. తన కుమారుడికి హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పించడంతోపాటు అక్కడే ఓ ఇల్లు కొని ఇచ్చి.. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వివేకా షమీమ్‌కు మాట ఇచ్చారు. కానీ అంతలోనే వివేకా హత్యకు గురయ్యారు. అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వివేకా వివేకానందరెడ్డి షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడంతోపాటు ఆస్తి ఇస్తానని చెప్పడంతో మొదటి భార్య కుటుంబం ఆగ్రహించింది. కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకు చెక్ పవర్ రద్దు చేసింది.చెక్‌పవర్ రద్దు కావడంతో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మద్యం, ఇతర అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేక అల్లాడిపోయారని వివేకా ఇంట్లో పనివానిగా ఉన్న పెందింటి రాజశేఖర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సునీల్ యాదవ్, దస్తగిరిలతో సన్నిహితమయ్యారు. వారు చెప్పినట్టు చేస్తే వారిద్దరు డబ్బులు తెస్తారని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో చెప్పేవారు. ఎనిమిది మంది నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఓసారి పెందింటి రాజశేఖర్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తమ ఇంట్లో డబ్బు కోసం ఏదో గొడవ జరుగుతోంది.. వివేకానందరెడ్డి బాగా తాగేసి గొడవ చేస్తున్నారని చెప్పారు. ‘మా నాన్న వివేకా ఇష్టానుసారంగా అప్పులు చేసి, తీర్చకపోవడంతో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ట్రాక్ రికార్డ్ సరిగా లేకపోవడంతో కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. కంపెనీల నిర్వహణకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు అడ్డంకిగా ఉండకూడదనే మా నాన్న చెక్ పవర్‌ను రద్దు చేశాం’ అని సునీత చెప్పారు. వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన స్థానంలో సునీత ఆ కంపెనీల్లో డైరెక్టర్ అయ్యారు. జీవించి ఉండగా రోజువారి ఖర్చుల కోసం వివేకా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలకే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆ కంపెనీ అప్పులన్నీ చాలా వరకు తీర్చేశారు. కంపెనీలన్నీ గాడిలో పడ్డాయి. ఈ ఏడాది జనవరిలో 93 ఎకరాల భూమిని సౌభ్యాగమ్మ, సునీత పేరిట బదిలీ చేశారు. బయటి శక్తుల పాత్ర పట్టించుకోని సీబీఐ వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వనే లేదు. కుటుంబ విభేదాలు, రాజకీయంగా అడ్డుకునేందుకు యత్నించారంటూ సీబీఐ చెబుతున్న కారణాలేవీ కూడా నమ్మదగ్గవిగా లేవు. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. అదే సమయంలో వివేకా కుటుంబంలో విభేదాలు, ఇతర అంశాలను కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. మొత్తం ఉమ్మడి కుటుంబంలో విభేదాలు అనే అంశాన్నే సీబీఐ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం కేవలం కేసును తప్పుదారి పట్టించేందుకేనని స్పష్టమవుతోంది. వివేకా హత్య వెనుక బయటి శక్తుల ప్రమేయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించనే లేదు. ఇప్పటి వరకు కేవలం సీబీఐ అప్రూవర్‌గా మార్చిన నిందితుడు దస్తగిరి, వాచ్‌మేన్ రంగయ్య వాంగ్మూలాలనే ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తోంది. కానీ వారు నిజాలే చెబుతున్నారడానికి ఆధారం ఏమిటి? -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం ప్రచురించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది చార్జీషీటు తప్పల తడక అంటూ విశ్లేషించింది. కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలంతో సీబీఐ వివేకా హత్యకు సంబంధించి విచారణ ముగించిందని సీబీఐ చార్జిషీటులో అసంబద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవని ది వైర్ కథనం స్పష్టం చేసింది. వివేకా మర్డర్ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. ఇక ఈ నెల 20న వచ్చిన తుదిచార్జీ షీట్లో సీబీఐ కేవలం అసంబద్ధమైన కథనాలను వండివార్చిందని ది వైర్ ఏకిపారేసింది. వివేకా హత్యకు ప్రధాన కారణం కడప ఎంపీ సీటుపై వచ్చిన విభేదాలే అని సీబీఐ చార్జీషీటులో పేర్కొంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ వివేకా రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ చెప్పింది. ఇక కడప ఎంపీ టిక్కెట్ తనకు కానీ, వైఎస్ షర్మిలకు కానీ, వైఎస్ విజయమ్మకు ఇవ్వాలని వైఎస్ వివేకా కోరుకున్నారనేది సీబీఐ థియరీ. చదవండి: వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్! ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి బలహీనమైన అభ్యర్థి అని వివేకా వాదించనట్లు.. అందుకే అవినాష్‌రెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వకూడదని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాలని వివేకా చెప్పేవారని తన చార్జిషీటులో సీబీఐ కథనం అల్లింది. అయితే ఈ కథనానికి ఎక్కడా ఆధారం చూపలేకపోయింది. పైగా సీబీఐ చార్జిషీటులోనే ఈవాదనను వ్యతిరేకిస్తూం ఎన్నో అంశాలున్నాయి. కడప సీటుకు సంబంధించి హత్య జరిగిందని సీబీఐ చెప్తున్న మాటలకు చాలా వైరుధ్యాలున్నాయి.ఇందులో వివేకా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని సీబీఐ చెప్పిన మాటలు పూర్తి వాస్తవ విరుద్ధం. నిజానికి 2004 తర్వాత వివేకా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. అసలు తన తండ్రి రాజకీయాల్లోకి రిటైర్ అయ్యారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది. 2011 లో వైఎస్ విజయమ్మ చేతిలో ఓటమి తర్వాత మా నాన్న రాజకీయాలకు దూరంగా ఉన్నారని సునీత సీబీఐకి చెప్పింది. దీనిని పూర్తిగా పక్కన పెట్టిన సీబీఐ వివేకా యాక్టివ్‌గా ఉన్నారని చార్జిషీట్లో రాసుకొచ్చింది. ఇక కడప ఎంపీ అభ్యర్ధి విషయంలో వచ్చిన విభేదాలే హత్యకు కారణమని సీబీఐ చెప్పిన మాటలకు ఆధారాలు లేవు. పైగా ఇది పూర్తి అబద్ధం అని నిరూపించే ఆధారాలు చార్జిషీట్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా 2019 మార్చి 10న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక మార్చి 17, 2019 న ఒకేసారి అన్ని స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు రోజులు ముందుగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉన్నా.. వివేకా మరణంతో రెండు రోజులు ఆలస్యమయింది. ఇక నోటిఫికేషన్‌కంటే ముందు అంటే అధికారికంగా అభ్యర్ధుల పేర్లు ప్రకటించడం కన్నా ముందే కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాష్‌రెడ్డి పేరు ఖరారైంది. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బలహీన అభ్యర్థి అనేది వాస్తవ విరుద్ధం. 2014 లోనే కడప నుండి లక్షా 93 వేల 323 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి. 2019 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి 3,80,976 ఓట్లతో ఆదినారాయణ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత బలమైన అభ్యర్థి అనేది కడప వారినే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ఇక కడప ఎంపీ అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్వతహాగా వివేకా కూతురు, అల్లుడు స్వయంగా సీబీఐకి చెప్పారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ఎప్పుడో నిర్ణయించారని వైఎస్ వివేకానందరెడ్డి కూడా అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేశారని స్వయంగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో వెల్లడించారు. వివేకా చనిపోవడానికి ఒకరోజు ముందు వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి వివేకా జమ్మలమడుగులో ప్రచారం చేసినట్టు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటికి రెండుసార్లు చెప్పారు. అంతే కాదు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి మినహా మరెవరి పేరు చర్చకు లేదని, అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎవ్వరూ ఎన్నడూ వ్యతిరేకించలేదని వైఎస్ వివేకా సోదరి విమలమ్మ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ విషయాలేవి మాత్రం సీబీఐకి కనపడలేదు. పైగా కడప ఎంపీ విషయంలో జోక్యం చేసుకుని పెద్దగా ప్రభావం చూపగల శక్తిగాని అంత అధికారంగాని వివేకాకు లేదని కడప రాజకీయాలను గమనించేవారందరికి తెలుసు. వైఎస్ వివేకా కడప ఎంపీ అభ్యర్థి నిర్ధారించే విషయంలో వైఎస్ వివేకా ప్రభావం చాలా తక్కువ. 2011 లో వైఎస్ జయమ్మకు వ్యతిరేకంగా పోటీ చేసిన వివేకా అనంతరం వైఎస్సార్ కుటుంబానికి దూరమయ్యారు. వైఎస్ మరణం తర్వాత ఆయన తన కుటుంబంతో వెళ్లి సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా అధికారం కోసం వైఎస్ వివేకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ బయటకు వస్తే మంత్రి పదవి కోసం ఏకంగా తల్లిలాంటి వదిన విజయమ్మపై పోటీ చేశారు. 2008లో అమెరికా నుండి వచ్చినవైఎస్ వివేకా అల్లుడికి రాజకీయ కాంక్ష ఎక్కువ. ఒకటి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రయత్నించారు. 2011లో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా నర్రెడ్డి కుటుంబం ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎన్నికల్లో విజయమ్మ చేతిలో వివేకా ఘోరంగా పరాజయం పొందారు. ఇంత జరిగినా చిన్నాన్న వివేకాపై వైఎస్ జగన్ సానుభూతిగానే వ్యవహరించారు. ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, కడప జిల్లా ఇన్ ఛార్జ్‌ని చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నంత ప్రభావవంతంగా వివేకా లేరనేది చాలామంది కడప నాయకులకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే అంత ప్రభావం చూపిస్తారా ఒకవైపు తన తండ్రి రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యారని స్వయంగా వివేకా కూతురు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు అధికారిక ప్రకటన కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అన్న విషయం అందరికీ తెలుసని.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చారు. అయినా సీబీఐ మాత్రం కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందనిఛార్జ్ షీట్ లో కథ అల్లడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక కడప ఎంపీ సీటే వివేకా హత్యకు కారణం అని కథ అల్లిన సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ఇక ఈ కథనానికి బలం చేకూర్చేందుకు సీబీఐ మరో కథను సిద్ధం చేసింది. అదే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి. వివేకాను అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ద్రోహం చేశారని అందుకే ఆయన ఓడిపోయారనేది సీబీఐ కథనం. ఇక ఓటమికి కారణం అయిన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఇంటికి వెళ్లి వైఎస్ వివేక తీవ్రంగా అవమానించారనేది సీబీఐ చార్జిషీటులో చెప్పిన మాట. దీంతో వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబం వివేకాను హత్య చేసిందనిం సీబీఐ కథనం అల్లింది. అయితే అసలు వాస్తవం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. వివేకాను ఎమ్మెల్సీ చేసేందుకు వైఎస్ జగన్ ఆయనకు బీఫాం ఇచ్చారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైన గెలవడానికి స్థానిక సంస్థల సభ్యులను బెదిరించి.. ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. అయితే సీబీఐ మాత్రం ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు వివేకాకు వ్యతిరేకంగా పనిచేసినట్లు చెబుతోంది. అయితే దీనికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన 800 మంది ఓటర్లలో ఒక్కర్ని కూడా సీబీఐ విచారించలేకపోయింది. ఈ 800 మందిలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తమకు డబ్బు ఇచ్చారని ఎక్కడా చెప్పలేదు. వీరెవరి దగ్గరు సీబీఐ స్టేట్మెంట్లు రికార్డు చేయేలేదు. అంతే కాదు కనీసం వివేకాను ఓడించిన మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని కూడా సీబీఐ విచారించ లేదు. అయినా రాజకీయ కక్షతోనే హత్య జరిగిందని ఛార్జ్‌షీట్ లో కథనం అల్లేసింది. రెండేళ్ల కిందట జరిగిన గొడవకు, ఇప్పుడు జరిగిన హత్యకు సంబంధం ఎలా ఉంటుందో సీబీఐ చెప్పలేదు. ఇక సీబీఐ చార్జిషీటులో రాజకీయ కోణమే హత్యకు కారణమని తేల్చేసింది. ఎక్కడా ఆధారం లేకపోయిన కథనం అల్లేసి వండివార్చేసింది. ఇక మిగిలిన ఆధారాలను మాత్రం పక్కన పడేసింది. అందులో ముఖ్య కారణం..ఆస్తి తగాదాలు. హత్య జరిగిన సమయానికి వివేకా వయస్సు 67 సంవత్సరాలు.పులివెందులలోని తన నివాసంలో వివేకా ఒంటరిగా నివసిస్తున్నారు. వివేకాకు ఆరు నెలలకిందటే గుండె ఆపరేషన్ జరిగినా వివేకా భార్య మాత్రంం వివేకాను వదిలి తన కుమార్తె సునీత దగ్గర ఉంటున్నారు. నెలకు ఒక్కసారి మాత్రమే వివేకా దగ్గరకి ఆయన సతీమణి వచ్చి వెళ్లేవారు. వివేకా కూతురు సునీతా ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే తండ్రిని కలిసేవారు. వ్యాపార సంబంధాల కారణంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం పలు మార్లు వివేకాను కలిసేవారనేది సీబీఐ సేకరించిన వాంగ్మూలాల ద్వారా స్పష్టం అవుతోంది. వివేకా గురించి ఆయన కుమార్తె సునీత సీబీఐతో చెప్పిన విషయాలతో వారి కుటుంబం మధ్య ఉన్న గొడవలు స్పష్టంగా అర్ధం అవుతాయి. తన తండ్రి వివేకాకు షమీమ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసాక తాను తండ్రి దగ్గరకు వెళ్లే దాన్ని కాదని ఏడాదిలో ఒకటి రెండు సార్లు వెళ్లినా కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే అక్కడ ఉండే దాన్నని సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. వివేకా హత్య కంటే ముందు 2018 క్రిస్మస్ రోజున తాను చివరిసారిగా వివేకా ఇంచికి వెళ్లినట్లు సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. షమీమ్అనే మహిళతో వివాహేతర సంబంధం కారణంగా వివేకాకు మొదటి భార్య కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయనిం సీబీఐకి షమీమ్ ఇచ్చిన వాంగ్మూలం స్పష్టం చేస్తోంది. 2006లో వివేకాకు షమీమ్ అనే మహిళతో పరిచయమైంది. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం కోసం వివేకా సహాయం కావాలని షమీమ్ కోరింది. ఇక వివేకా షమీమ్ల మధ్య పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. దీంతో తన పేరును అక్బర్‌గా మార్చుకుని వివేకా షమీమ్‌ను వివాహం చేసుకున్నారు.మరణించే సమయానికి వివేకా, షమీమ్ లకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం గురించి తెలిసిన తర్వాత వివేక మొదటి భార్య కుటుంబ సభ్యులు తనను బెదిరించారని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ పలుమార్లు మనుషులను పంపి నన్ను బెదిరించారని.. తన కోసం వివేకా పలుమార్లు బావ మరుదులతో ఘర్షణకు దిగారని సీబీఐకి తెలిపిన షమీమ్. నెలసరి ఖర్చులతో పాటు వివేకా తనను అన్ని రకాలుగా చూసుకున్నారని షమీమ్ సీబీఐకి తెలిపారు. 2018లో గుండె ఆపరేషన్ తర్వాత తన ఆరేళ్ల కుమారుడి భవిష్యత్ కోసం వివేకా ఆందోళన చెందేవారని షమీమ్ సీబీఐ అధికారులకు తెలిపింది. తన కుమారుడిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించడంతో పాటు తనకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిస్తానని కొంత డబ్బు ఫిక్డ్స్ డిపాజిట్ చేయించడంతో పాటు వ్యవసాయ భూమిని కొనిస్తానని వివేకా వాగ్ధానం చేశారని సీబీఐ వాంగ్మూలంలో చెప్పిన షమీమ్. అయితే చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అన్ని కంపెనీల నుండి వివేకా చెక్ పవర్ తొలగించడంతో ఆయన తీవ్రమైన ఆందోళనకు గురైనట్లు స్టేట్మెంట్లో స్పష్టం చేసిన వివేకా రెండో భార్య షమీమ్. ఇక మరణించడానికి కొద్ది రోజుల ముందు నుంచి వివేకా తీవ్రమైన వేదనలో ఉన్నట్లు కేర్‌టేకర్ పండింటి రాజశేఖర్ సీబీఐకి తెలిపారు. డబ్బులు లేకపోవడంతో వివేకా ఆందోళనకు గురయ్యారని.. ఫలితంగా విపరీతంగా మద్యం సేవించేవారని రాజశేఖర్ చెప్పాడు. ఒకరోజు డబ్బు విషయం మాట్లాడటం విన్నట్లు త్వరలోనే డబ్బు వస్తుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో అన్నట్లు పండింటి రాజ స్టేట్ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఎర్ర గంగిరెడ్డిని బూతులు తిడుతూ వివేకానందరెడ్డి గట్టిగా అరిచేవారని అయినా ఎర్ర గంగిరెడ్డి మౌనంగా ఉంటూ తరచూ వస్తు ఉండేవాడనేది రాజా సీబీఐకి చెప్పాడు. ఇక హత్యకు కొద్ది రోజుల ముందు నుంచి వివేకా ప్రవర్తన అసాధారణంగా మారిపోయిందని.. మెట్ల మీద కూర్చుని విపరీతంగా మద్యం సేవించడం, సిగరెట్లు విపరీతంగా కాల్చేవారని రాజా సీబీఐకి పూసగుచ్చినట్లు చెప్పాడు. మెల్లమెల్లగా వివేకా ఆరోగ్యం పూర్తిగాక్షీణించడం ప్రారంభించిందని ఇది చూసి తాను ఒకరోజు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానట్లు రాజా స్టేట్మెంట్లో స్పష్టం చేశాడు. ఇంకా ఏదో ఒకపంచాయతీ విషయంలో పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని వివేకా ఎదురుచూస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డికి చెప్పానని సీబీఐ ముందు రాజా ఒప్పుకున్నాడు. ఇక వివేకా డబ్బు వ్యవహారాల గురించి పండింటి రాజశేఖర్‌తో పాటు చాలా మందికి తెలుసు.సీబీఐ వాంగ్మూలాలను పరిశీలించినా వివేకాకు దాదాపు 5 కోట్ల అప్పు ఉందని స్పష్టమౌతోంది. ఇక ఓవైపు వివేకా అప్పులతో తీవ్రమైన వేదనలో ఉంటేం సునీత రెడ్డి మాత్రం సీబీఐ వాంగ్మూలంలో మరో చెప్పింది. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రి చనిపోయే సమయానికి ఆయన పేరు మీద 50 కోట్ల ఆస్తి ఉందని సునీతరెడ్డి చెప్పింది. అయితే వివేకా చెక్ పవర్ ఎందుకు తొలగించారని అడిగిన ప్రశ్నకు సునీత రెడ్డి విచిత్రమైన సమాధానం చెప్పింది. తాము వ్యాపారం కోసం అప్పు తీసుకొడానికి ప్రయత్నించినట్టు, అయితే వివేక అప్పటికే చాలా అప్పులు చేసినందున తమ కంపెనీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించినట్లు సునీత వాంగ్మూలంలో చెప్పుకొచ్చింది. అందుకే బ్యాంకు అకౌంట్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసి వివేకా చెక్ పవర్‌ను తొలగించినట్లు సునీతారెడ్డి చెప్పింది. కేవలం కంపెనీలో అప్పుతెచ్చుకోవడానికే ఈ మార్పులు చేశామని తన తండ్రి కంపెనీలలో తాను కూడా డైరెక్టర్‌గా ఉన్నానని సునీత ఒప్పుకుంది. ఇక వివేకా మరణం తరువాత ఆయన స్థానంలో తాను డైరెక్టర్‌గా చేరిన సునీత.. తండ్రి మరణం తరువాత అప్పులన్నీ కట్టేసి కంపెనీలను లాభాలలోకి తెచ్చామని చెప్పిన సునీత. అయితే వివేకా బతికి ఉన్నప్పుడు మాత్రం కనీస ఖర్చులకు డబ్బులు లేకుండా ఆయన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ వివేకా మరణం తరువాత 2023 జనవరిలో 93 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకున్న కూతురు సునీత రెడ్డి, భార్య సౌభాగ్యమ్మ. వివేకా కుటుంబంలో ఈ స్థాయిలో ఆస్తి కోసం కుట్రలు జరిగినా సీబీఐ మాత్రం వీటిని పట్టించుకోలేదు. తన విచారణలో ఎక్కడా హత్యకు సంబంధించిన కారణాలలో ఆస్తి తగాదాలకు సంబంధించిన కోణంలో విచారణ జరప లేదు. కేవలం రాజకీయ కోణాన్నే హత్యకు కారణంగా చూపేందుకు సీబీఐ కావాలని ఆస్తి తగాదాలను చిన్నదిగా చెప్పే ప్రయత్నం చేసింది. వివేకా హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం పైన సీబీఐ పూర్తిగా విచారణ జరపలేదు.సీబీఐ విచారణ మొత్తం కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ తన విచారణను ముగించింది. వివేకా హత్యకేసులో నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న చెప్పిన మాటలే సీబీఐ విచారణకు ఆధారం. కానీవీళ్లిద్దరు నిజం చెప్తున్నారా...? అనే దానికి ఎక్కడా ఆధారం లేదు అంటూ ది వైర్ కథనంలో పేర్కొంది. -
వివేకా హత్య కేసులో గత చార్జ్ షీట్ కు వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్ షీట్
-
వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్!
సాక్షి, అమరావతి: ఊహించినట్లుగానే మాజీ మంత్రి వైఎస్ వివేకాందనందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ చేతులెత్తేసింది! ముందుగానే ‘అప్రూవర్’ గంతలు కట్టుకుని దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ చివరికి సాధించింది శూన్యం!! నిందితుడు దస్తగిరితో చెప్పించిన తప్పుడు కథనం.. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు వండివార్చిన వాంగ్మూలాలు మినహా రెండున్నరేళ్ల దర్యాప్తు తరువాత సీబీఐ సాధించింది ఏమీ లేదు! శాస్త్రీయ ఆధారం అంటూ తెరపైకి తెచ్చిన ‘గూగుల్ టేక్’ అవుట్ చివరకు వట్టిదేనని చేతులెత్తేసింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట పరస్పర విరుద్ధమైన, అహేతుకమైన వాదనలు బెడిసికొట్టాయి. గతంలో దాఖలు చేసిన చార్్జషీట్లలో పేర్కొన్న అభూత కల్పనలు, ఊహాజనితాలకు కొనసాగింపుగానే సీబీఐ తుది చార్్జషీట్ను దాఖలు చేసి చేతులు దులిపేసుకున్నట్లు స్పష్టమవుతోంది. సాధించింది శూన్యం ఎలాంటి ఆధారాలు లేకుండా వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్లను చార్్జషీట్లలో సీబీఐ ఏకపక్షంగా చేర్చింది. వారికి వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. గూగుల్ టేక్ అవుట్ పూర్తిగా అహేతుకమని నిపుణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. యూటీసీ కాలమానానికి, భారత కాలమానానికి తేడా కూడా గుర్తించకుండా గతంలోని చార్జిషీట్లోఅభియోగాలను మోపడం సీబీఐ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తమ అభియోగాలు అవాస్తవమని న్యాయ విచారణలో వెల్లడవుతుందని గుర్తించిన సీబీఐ తుది చార్జిషీట్లోనాలుక కరుచుకుంది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి సునీల్ యాదవ్ అక్కడ లేరని పేర్కొంది. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం పూర్తిగా తొందరపాటేనని స్పష్టమైంది. వాంగ్మూలాల కట్టుకథలు సాక్షులు చెప్పని విషయాలను కూడా 164 స్టేట్మెంట్ పేరిట నమోదు చేసుకుని మీడియాకు లీకులు ఇవ్వడం సీబీఐ దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. 2019 మార్చి 15న ఉదయం తాము హైదరాబాద్‌లో సమావేశంలో ఉండగా వైఎస్ జగన్ తమకు వివేకా మరణించారనే విషయాన్ని తెలియచేసినట్లు అజేయ కల్లం చెప్పారు. కానీ ఆయన ఫలానా సమయం అని ఏమీ చెప్పలేదు. కానీ ఉదయం 5.30 గంటలకే వైఎస్ జగన్ తమకు చెప్పారని అజేయ కల్లం వెల్లడించినట్లు సీబీఐ ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు చేసుకుని మీడియాకు లీకులు ఇచ్చింది. దీన్ని అజేయ కల్లం వెంటనే ఖండించారు. అజేయ కల్లంను కలసిన అధికారి ఒకరు కాగా ఆయన పేరిట వాంగ్మూలం నమోదు చేసిన అధికారి మరొకరు కావడం గమనార్హం. ఇక అదే రోజు ఆ సమావేశంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏస్ కృష్ణమోహన్‌రెడ్డి ఉదయం 6.30 గంటలకు తనకు ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా మరణించిన విషయాన్ని తెలిపారని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ జగన్ నివాసంలో సహాయకుడు నవీన్ కూడా అదే చెప్పారు. ఆ ఇద్దరి వాంగ్మూలాలను సీబీఐ అదే విధంగా నమోదు చేసింది. మరి వారిద్దరు ఉదయం 6.30 గంటలకు తెలిసింది అన్నప్పుడు అదే సమావేశంలో పాల్గొన్న అజేయ కల్లం మాత్రం ఉదయం 5.30 గంటలకు తెలిసింది అని ఎలా చెప్పగలరు? ఎంపీ టికెట్ నిర్ధారించేది వైఎస్ జగన్ కడప ఎంపీ టికెట్ అంశంపై లేని సందిగ్దత ఉన్నట్టుగా చూపించేందుకు సీబీఐ విఫల యత్నాలు చేస్తోంది. తాజాగా షర్మిల వాంగ్మూలం పేరిట అదే ప్రచారాన్ని తెరపైకి తేవడం విడ్డూరంగా ఉంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని వివేకా ఒత్తిడి చేశారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కానీ ఎంపీ టికెట్‌ను నిర్ణయించేది వివేకానో షర్మిలనో కాదు. నిర్ణయించేది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన అప్పటికే అవినాశ్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనే 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థి అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. వివేకా కూడా అవినాశ్‌రెడ్డి తరపున ప్రచారం చేశారు. బెడిసికొట్టిన దస్తగిరి అప్రూవర్ కుట్ర వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మొదట్లోనే పక్కదారి పట్టింది. హత్య చేశానని స్వయంగా అంగీకరించిన నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విస్మయపరిచింది. వివేకాను హత్య చేస్తే తాము చూసుకుంటామని వైఎస్ భాస్కర్‌రెడ్డి భరోసా ఇచ్చారని ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే తాను అలా చెప్పనే లేదని ఎర్ర గంగిరెడ్డి స్పష్టం చేశారు. ఇక వివేకా హత్యకు రూ.40 కోట్లతో డీల్ కుదిరినట్లు దస్తగిరి మరో కట్టుకథ చెప్పాడు. అందుకు సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించ లేదు. బెంగళూరులో ఓ భూ వివాదంలో రూ.8 కోట్లు వస్తాయని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టుగా దస్తగిరి చెప్పాడు. అసలు ఆ వివాదమే లేదని స్పష్టమైంది. తనకు అడ్వాన్స్‌గా రూ.కోటి ఇచ్చారని చెప్పుకొచ్చిన దస్తగిరి రూ.2 వేల కోసం చివరికి రూ.500 కోసం సునీల్ యాదవ్‌తోపాటు ఇతరులను ప్రాథేయపడుతూ పెట్టిన వాట్సాప్ మెస్సేజ్‌లు వెలుగు చూశాయి. రూ.కోటి ఉన్న వ్యక్తి రూ.500 కోసం దేబిరించడం ఏమిటన్నది సీబీఐనే చెప్పాలి. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చిన సీబీఐ హత్య ఆయుధాన్ని కూడా రికవరీ చేయలేకపోయింది. తండ్రి శత్రువులతో సునీత కుమ్మక్కు పులివెందులలో తన తల్లి విజయమ్మపై పోటీ చేసినప్పటికీ వైఎస్ వివేకా పార్టీలోకి వస్తానంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. సముచిత గౌరవం ఇచ్చారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను అభ్యర్థిగా నిలిపారు. చంద్రబాబు పన్నాగంతో నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి వైఎస్సార్సీపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి కుట్రతో వివేకానందరెడ్డిని ఓడించారు. వివేకా మరణించిన తరువాత ఆయన కుమార్తె సునీత టీడీపీ నేతలతో కుమ్మక్కు కావడం విస్మయపరిచింది. వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కారణమంటూ సీబీఐకి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో పూర్తిగా విఫలమైన సీబీఐ తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథలతో దర్యాప్తును పక్కదారి పట్టిస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
Viveka Case: గూగుల్ టేక్ అవుట్ తప్పు.. మాటమార్చిన సీబీఐ!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారమంటూ గూగుల్ టేక్ అవుట్ పేరిట కొండను తవ్వినంత హడావుడి చేసిన సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో తోక ముడిచింది. ఇన్నాళ్లూ ఎంతో శాస్త్రీయ ఆధారమంటూ చెప్పుకొచ్చిన అంశంపైనే చివరికి చేతులెత్తేసింది. తాను గతంలో చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితుడు సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ వివరాలు అంతా పొరపాటని అంగీకరించడం గమనార్హం. కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన ఏ–6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ–7 వైఎస్ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది. కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగా చూపిస్తూ వారిని అరెస్టు చేసిన సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారం చూపించకపోవడం గమనార్హం. మరోవైపు షర్మిల తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీ టికెట్‌ను ఆశించనే లేదని సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా ఎంపీ టికెట్‌కు అడ్డుగా ఉన్నందునే వివేకాను హత్య చేశారన్న అభియోగాల్లో వాస్తవం లేదన్నది తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానంలో బుధవారం తుది చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అభియోగాలకు సరైన ఆధారమేదీ తుది చార్జ్‌షీట్‌లో సీబీఐ చూపించలేకపోయింది. వెరసి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఏనాడో దారి తప్పిందని.. కొందరి ప్రభావానికి గురై సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. వైఎస్సార్ కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతో ఎల్లో మీడియా చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనన్నది తేలిపోయింది. తూచ్.. అంతా ఉత్తిదే కేసు దర్యాప్తులో కేంద్ర బిందువుగా పేర్కొన్న ప్రధాన సాక్ష్యాధారంపైనే సీబీఐ బొక్కబోర్లా పడింది. వివేకాను హత్య చేసిన నలుగురు నిందితుల్లో ఏ–2 సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాను సేకరించి ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించామని రెండేళ్లుగా చెబుతున్న సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో మాట మార్చింది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన మొబైల్ నంబర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించాం’ అని సీబీఐ ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లో అందుకు విరుద్ధంగా పేర్కొంది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకానందరెడ్డి నివాసంలో లేరు. 2019 మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, ఉదయం 8.12 గంటలకు ఇంటి లోపల ఉన్నాడు. గతంలో గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నది గ్రీన్విచ్ కాలమానం ప్రకారం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి. ఈ లెక్కన భారత కాలమానం ప్రకారం అంటే దానికి 5.30 గంటల సమయం కలపాలి. గతంలో పొరబడ్డాం’ అని స్పష్టం చేసింది. గూగుల్ టేక్ అవుట్ పేరిట బురిడీకి యత్నం! కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు గూగుల్ టేక్ అవుట్ డేటా పేరిట సీబీఐ యత్నిస్తోందన్న సందేహాలు బలపడుతున్నాయి. వివేకా మరణించారనే విషయం 2019 మార్చి 15 ఉదయం 6.05 గంటలకే అందరికీ తెలిసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా వివేకా గుండెపోటుతో మరణించారని మీడియాకు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వందలాది మంది ఉదయం 7 గంటలకే పులివెందులలోని వివేకా నివాసానికి చేరుకున్నారు. స్థానికులు ఆ విధంగా రావడం సహజం. ఆ తర్వాత 8 గంటల సమయంలో సునీల్ యాదవ్ అక్కడికి వచ్చారని సీబీఐ ప్రస్తుతం చెప్పడం గమనార్హం. ఆ రోజు వివేకా నివాసానికి చేరుకున్న వారిలో 248 మందిని సాక్షులుగా సీబీఐ అధికారులు విచారించారు. వారిలో ఎవరూ కూడా ఆ రోజు సునీల్ యాదవ్ అక్కడ ఉన్నట్టు చెప్పనే లేదు. గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఒక్క ఆధారం లేదే.. గూగుల్ టేక్ అవుట్ డేటా అశాస్త్రీయతతతోపాటు ఈ కేసులో సీబీఐ అరెస్టుల వెనుక డొల్లతనం కూడా తుది చార్జ్‌షీట్‌లో బట్టబయలైంది. సీబీఐ హడావుడిగా అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలకు వ్యతిరేకంగా కొత్తగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి 30 సార్లు వచ్చినట్టుగా సీబీఐ గత చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అసలు సునీల్ యాదవ్ ముందు రోజు రాత్రి వివేకానందరెడ్డి ఇంట్లోనే లేరని తుది చార్జ్‌షీట్‌లో పేర్కొంది. హత్య సమయంలో వివేకా ఇంట్లోలేని సునీల్ యాదవ్.. ఆ రోజు రాత్రి భాస్కర్‌రెడ్డి నివాసం నుంచి వివేకా నివాసానికి వెళ్లినట్టు, హత్య తర్వాత మళ్లీ వివేకా నివాసం నుంచి భాస్కర్‌రెడ్డి నివాసానికి వచ్చినట్టు ఎలా చెబుతుంది? ఈ లెక్కన గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామన్న ఆ సమాచారం కూడా తప్పే కదా! కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగానే వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం పూర్తిగా అసంబద్ధమన్నది స్పష్టమైంది. అదే గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు సీబీఐ చెప్పింది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన తన ఇంటి నుంచి తొందరగా వెళ్లిపోయారని, మర్నాడు ఉదయం వివేకా ఇంటి వద్దకు వెళ్లారని చెప్పింది. కానీ ఆ రోజు రాత్రి ఉదయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది మాత్రం సీబీఐ చెప్పనే లేదు. మర్నాడు వివేకా మరణించారని సమాచారం తెలిసిన తర్వాత వందలాది మంది ఆయన నివాసానినికి చేరుకున్నారు. తాను ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి వెళ్లానని ఉదయ్ కుమార్‌రెడ్డే చెప్పారు. మరి దాన్ని ఏదో గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్టు సీబీఐ చెప్పడం ఏమిటి? ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మార్చి 15 ఉదయం వివేకా నివాసానికి చేరుకోవడానికి ముందే తాము అక్కడకు వెళ్లామని ప్రత్యక్ష సాక్షి సత్యనారాయణ చెప్పినట్టు తుది చార్జ్‌షీట్‌లో ఉంది. అప్పటికే వివేకా గుండెపోటుతో మరణించినట్టు అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంటే వివేకా గుండెపోటుతోనే మరణించారని మొదట బయటకు పొక్కిన సమాచారంతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైంది. ఏ విధంగానూ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. మిగిలిన నిందితుల గూగుల్ టేక్ అవుట్ డేటా లేదా? సీబీఐ ఎంతగా హడావుడి చేస్తున్నప్పటికీ గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయతమై మొదటి నుంచి నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతగా గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే.. ఈ కేసులో మిగిలిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి మొబైల్ ఫోన్ల గూగుల్ టేక్ అవుట్ డేటాను సీబీఐ ఎందుకు సేకరించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. నలుగురు నిందితుల్లో ఒకరి డేటాను మాత్రమే సేకరించడం ఏమిటి.. మిగిలిన ముగ్గురి డేటాను విస్మరించడం ఏమిటన్నది కీలకంగా మారింది. ఆ సమాచారం శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే హత్యలో పాలుపంచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నలుగురు నిందితుల మొబైల్ ఫోన్ల గూగుల్ డేటాను సేకరించి విశ్లేషించాలి. కానీ సీబీఐ అలా చేయకపోవడం సందేహాస్పదంగా మారింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నాన్న కడప ఎంపీ టికెట్ ఆశించనే లేదు ‘మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని భావించలేదు. ఆయన ఎంపీ టికెట్ ఆశించలేదు’ అని షర్మిల స్పష్టం చేశారు. ‘కడప ఎంపీగా నన్ను పోటీ చేయమని చిన్నాన్న కోరారు. కానీ ఆ సమయంలో కడప జిల్లా రాజకీయాల పట్ల నేను ఆసక్తిగా లేను’ అని తెలిపారు. ఈ మేరకు షర్మిల ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. దాంతో కడప ఎంపీ టికెట్ అంశంపై సీబీఐ ఇన్నాళ్లూ చేస్తున్న అభియోగాలు అవాస్తవం అని పరోక్షంగా తేలిపోయింది. వివేకానందరెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలని భావించారని, దీంతో ఎంపీ టికెట్‌కు అడ్డురాకుండా ఉండేందుకే ఆయన్ని హత్య చేశారన్న సీబీఐ అభియోగాల్లో నిజం లేదని నిగ్గు తేలింది. 2022 అక్టోబర్ 7న ఢిల్లీలోని సీబీఐ కార్యాలాయానికి వెళ్లి షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ అధికారులు అడిగిన 20 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందు బెంగళూరులోని తన నివాసానికి వైఎస్ వివేకానందరెడ్డి వచ్చారని, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని కోరారని షర్మిల చెప్పారు. ఆ సమయంలో ఆసక్తిగా లేనని చెప్పానన్నారు. వివేకా ఎందుకు పోటీ చేయాలని భావించలేదని సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బహుశా ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపలేదని షర్మిల చెప్పారు. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో వివేకానందరెడ్డి తన తల్లి విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. బహుశా అందువల్ల తనకు టికెట్ రాదని ఆయన భావించి ఉండవచ్చని చెప్పారు. -
సుప్రీం కోర్టులో వివేకా హత్యకేసు విచారణ ఎల్లుండికి వాయిదా
-
Viveka Case: సునీత బాధితురాలా? ఫిర్యాదుదారా? నిర్ణయించనున్న సుప్రీం
న్యూఢిల్లీ: వివేకా హత్య కేసులో సునీత బాధితురాలా? లేక ఫిర్యాదుదారా ? దేనికి కాంపిటెంట్ అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు ఇవ్వాళ జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ముందుకు రాగా.. విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఏం జరిగింది? ఈ కేసులో తనకు న్యాయ సహాయం కావాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంను ఆశ్రయించాడు దస్తగిరి. తనకు ఆర్థిక స్థోమత లేనందున కోర్టు న్యాయ సాయానికి అడ్వొకేట్ ను కేటాయించాలని కోరాడు. అయితే, వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. వివేకానందరెడ్డిని హత్య చేసిందే దస్తగిరి అయినప్పుడు.. అదే నిందితుడు.. బాధితుడు ఎలా అవుతాడని అడిగారు కృష్ణారెడ్డి. వివేకా హత్యపై అసలు ఫిర్యాదు చేసిందే తానని, అందరికంటే ముందు పోలీసులకు తానే ఫిర్యాదు చేసినందున తనను బాధితుడిగా గుర్తించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్ లో కోరారు. కేసులో తాను కూడా బాధితురాలినేనని, తాను ఇంప్లీడ్ అవుతానంటూ సునీత పిటిషన్ వేశారు. సునీత వాదనేంటీ? దస్తగిరి విషయంలో ఇంప్లిడ్ పిటిషన్ వేసిన సునీత రెడ్డిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ హోదాలో ఇంప్లీడ్ అవుతున్నారని అడిగింది. దానికి తాను బాధితురాలిని అని, ఈ కేసుకు సంబంధించిన ఏ విషయంలో అయినా.. తనను బాధితురాలిగా చూడాలని సుప్రీంకోర్టుకు కోరింది సునీత. కేసుకు సంబంధించి అదనపు సమాచారం ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం కేసును హైకోర్టుకు బదిలీ చేయడమే సబబని పేర్కొంది. ఇప్పటికే కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న తెలంగాణ హైకోర్టే పిటిషన్ విచారించడం సరైందని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం తెలిపింది. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సూచించింది. అయితే సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఇక్కడే పిటిషన్ ను విచారించాలని పట్టుబట్టారు. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసే సమయంలో వివేకా సతీమణీ, కుమార్తెలను బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించిందంటూ లుథ్రా తెలిపారు. చివరికి ఏం జరిగింది? సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనల అనంతరం ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సునీత బాధితురాలా? లేక ఫిర్యాదుదారా ? దేనికి కాంపిటెంట్ అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. -
వివేకా కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన CBI
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన విచారణ గడువు ఇవ్వాళ్టితో ముగియనుండడంతో CBI ఇవ్వాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు, అనుమానితులను పలు మార్లు విచారించింది సీబీఐ. విచారణకు వచ్చిన వారందరి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. ఇప్పటివరకు దాఖలైన ఛార్జ్ షీట్ల సంఖ్య చూస్తే ఇవ్వాళ్టిది మూడోది. 2021 తొలి ఛార్జ్ షీట్ 2022 జనవరిలో సప్లమెంటరీ ఛార్జ్ షీట్ 2023 జూన్ 30 ఫైనల్ చార్జిషీట్ దాఖలు ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ ముగియటంతో కోర్టులో హాజరు పర్చారు సీబీఐ అధికారులు. అయితే వీరికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు.. కేసు విచారణను జులై 14 కు వాయిదా వేసింది. ఇక ఇదే కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జులై 3 న విచారించనుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ వేయగా.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారించింది. ఈ కేసును జులై 3న తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి సిబిఐతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ రోజుతో సిబిఐకి ఇచ్చిన విచారణ గడువు ముగియడంతో సునీత పిటిషన్‌కు ఎంత వరకు వాలిడిటీ ఉంటుందన్నది జులై 3న తేలనుంది. ఇదీ చదవండి: ఎందుకీ ఈగో క్లాషెస్?.. సునీతకు సుప్రీంకోర్టు ప్రశ్న -
దస్తగిరి అరాచకం... డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి..
కడప అర్బన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి చేస్తున్న అరాచకాలలో మరో సంఘటన పులివెందుల పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బాధితురాలు షేక్ గులాబి పులివెందుల అర్బన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ‘నేను నా భర్త గుగూడు వల్లితో కలసి పులివెందుల టౌన్ భాకరాపురం, జయమ్మకాలనీలో ఉంటున్నాం. నా భర్త ట్రాక్టర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా భర్త మొదటి భార్య 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. నన్ను 8 ఏళ్ల క్రితం గుగూడు వల్లి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు గూగుడు వల్లి(16), రేష్మా (15) సంతానం కాగా.. నాకు గుగూడు వల్లికి ఇమ్రాన్, చాందినీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరం కలసి ఉంటున్నాం. అయితే మా కుటుంబ అవసరాల నిమిత్తం మా ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ దస్తగిరి దగ్గర ఆరు నెలల క్రితం రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నాం. పూచీకత్తుగా ఇంటి పత్రాలను ఇచ్చాము. తరువాత బాకీ డబ్బుకు వడ్డీగా వారానికి రూ. 4 వేలు చొప్పున దస్తగిరికి ఇస్తూ వస్తున్నాం. తర్వాత మధ్యలో కొన్ని వారాలు మేము వడ్డీ కట్టలేకపోయాం. దీంతో అసలుకు వడ్డీతో కలిపి రూ.1,10,000 మాతో ప్రామిసరీ నోటు దస్తగిరి రాయించుకున్నాడు. కాగా డబ్బు ఇవ్వాలని నా భర్తను ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. ఈ నెల 13న డబ్బు చెల్లిస్తామని చెప్పాం.. అయితే సర్దుబాటు కాక చెల్లించలేదు. ఈ క్రమంలో ఈ నెల 17న నేను, నా భర్తతో కలసి బంధువుల ఇంటికి వెళ్లాం. 18వ తేదీ సాయంత్రం దస్తగిరి మాకు ఫోన్ చేసి డబ్బు చెల్లించకుండా ఇంటి నుంచి పారిపోయారు.. మీ కుమారుడు గూగుడు వల్లిని నిర్బంధించాను. డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి.. లేకపోతే మీ కొడుకును కొడతాం.. అని బెదిరించాడు. నా కొడుకుతో ఫోన్లో మాట్లాడించాడు. ‘నన్ను దస్తగిరి కొడుతున్నాడు..’ అని మా కొడుకు బాధ పడుతున్నాడని.. పైగా దస్తగిరి భార్య షబానా కూడా ఫోన్ చేసి మీ కొడుకుకు ఇప్పటికే ఉదయం.. సాయంత్రం ఒక కోటింగ్ అయిపోందని.. నువ్వు వచ్చి మాట్లాడకపోతే నీ కొడుకు మా చేతిలో చచ్చిపోతాడని బెదిరిస్తున్నారు. నా కుమారుడిని వారు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది సార్.. దస్తగిరి, అతని భార్య షబానాపై చర్యలు తీసుకుని, మా కుమారుడిని అప్పగించండి.. సార్.. అంటూ’ గులాబి పోలీసులను వేడుకుంది. ఈ మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు. -
Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్ 19, సోమవారం) విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది. Supreme Court is hearing a plea by the daughter of former MP late YS Vivekananda Reddy against a Telangana High Court order granting anticipatory bail to Kadapa MP YS Avinash Reddy in connection with her father's murder.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/Xs5HCAjpXz — Bar & Bench (@barandbench) June 19, 2023 పిటిషన్‌కు కాలం చెల్లే అవకాశం! వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది. గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. Justice Surya Kant: Returnable on 7th July. Counsel: There is a connected matter. Justice Kant: List before first bench on 3rd July 2023, after getting appropriate orders from CJI. #SupremeCourt #SupremeCourtOfIndia — Live Law (@LiveLawIndia) June 19, 2023 తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది. ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కి కారణం ఇదే.. -
YS Viveka Case: ఎంపీ అవినాశ్ జైలుపాలే మీ లక్ష్యమా?
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డిని జైలుపాలు చేయడమే మీ లక్ష్యమా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం నర్రెడ్డి సునీతను ప్రశ్నించింది. ఈ వ్యవహారం చూస్తుంటే ఈగో క్లాషెస్లా ఉందని వ్యాఖ్యానించింది. తొందరపడి వ్యక్తిగత వాదనల ద్వారా నష్టపోతారేమో చూసుకోవాలని హితవు పలికింది. పిటిషనర్ సునీత విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఈ నెల 19వతేదీకి వాయిదా వేస్తూ అదనపు డాక్యుమెంట్లు అందచేసేందుకు అనుమతించింది. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. అయితే సుప్రీం వెకేషన్ బెంచ్ సీనియర్ న్యాయవాదులను అనుమతించకపోవడంతో పిటిషనర్ సునీత తన వాదనలు తానే వినిపించడం ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా ఆమెకు సహకరించేందుకు ధర్మాసనం అనుమతించింది. తాను పిటిషనర్‌నని, తన తండ్రి హత్యకు గురయ్యారని సునీత చెబుతుండగా.. ఆ విషయాల్లోకి తాము వెళ్లడం లేదని, వెకేషన్లో ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఈ కేసులో జూన్ 30 కల్లా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఛార్జిషీట్ ముందే ఫైల్ చేయాల్సి ఉంది. ఏ – 8 (అవినాశ్) భారీ కుట్ర చేసిన ప్రధాన వ్యక్తుల్లో ఒకరు. సీబీఐ దర్యాప్తునకు సహకరించడంలేదు. ముందస్తు బెయిలు పొందడం వల్ల కస్టోడియల్ ఇంటరాగేషన్ కుదరడం లేదు. ముందస్తు బెయిలు ఎందుకు ఇచ్చారో కారణాలు తెలియడం లేదు’’ అని సునీత పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్ విక్రమ్‌నాథ్ జోక్యం చేసుకుంటూ ‘దీంట్లో అంతగా అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ బెంచ్‌కు రావాల్సిన అవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. సీబీఐ చూసుకుంటుంది.. ‘ఒక వ్యక్తిని అరెస్టు చేయాలో లేదో దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని, ఎప్పుడు అరెస్టు చేయాలో ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో సీబీఐకు తెలుసు. విచారణకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా సీబీఐ చూసుకుంటుంది. మీరెందుకు జోక్యం చేసుకుంటారు? ఈ కేసులో పలు సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. మీకెందుకు ఈగో క్లాషెస్? అతడిని (ఎంపీ అవినాశ్) జైలు పాలు చేయాలన్న లక్ష్యమా? ఆ విధంగా చూడొద్దు. ఈ తరహా ప్రొసీడింగ్స్ ఎందుకు?’’ అని జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పుడీ పిటిషన్‌ను కొట్టివేస్తే.. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇతర నిందితులతో కలసి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత ఆరోపించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అవినాశ్‌రెడ్డి సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తున్నప్పుడు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముందని ప్రశ్నించింది. ‘‘మీకో సలహా ఇస్తాం. మీరు వ్యక్తిగతంగా వాదిస్తున్నారు. చట్టంపై అవగాహన లేమితో వాదనలో అంతగా ప్రావీణ్యం లేకపోవచ్చు. మేం ఇప్పుడు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తే సీనియర్ న్యాయవాదికి ఇబ్బంది అవుతుంది. అందుకే సెలవుల తర్వాత విచారణ జాబితాలోకి చేరుస్తాం’’ అని సునీతనుద్దేశించి ధర్మాసనం పేర్కొంది. సీబీఐ దర్యాప్తు ఈ నెల 30 కల్లా పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా ఈ సమయంలో పేర్కొన్నారు. వాదనలకు సీనియర్ న్యాయవాదులను అనుమతించడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ తమకు ఇబ్బంది కలగ చేయవద్దని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. తాము ఇప్పుడు వాదనలకు అనుమతిస్తే మరో నలుగురు సీనియర్ న్యాయవాదులు తమను వక్షకు గురి చేశారని ఆరోపించే అవకాశం ఉందని పేర్కొంది. తాము అనుమతించకపోయినప్పటికీ మీరు వాదనలు చేస్తున్నారంటూ లూత్రాను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో మరో బెంచ్ నిర్దేశించిన డెడ్‌లైన్‌ను తాము మార్చలేమని స్పష్టం చేసింది. గడువు నిర్దేశించాక ఎలా మారుస్తాం? సీబీఐకు నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని ధర్మాసనాన్ని సునీత కోరారు. అయితే ఇప్పటికే మరో బెంచ్ జూన్ 30వతేదీ అని గడువు నిర్దేశించిన తరువాత తాము ఎలా మారుస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ ఇప్పుడు తాము జోక్యం చేసుకుంటే మొత్తం అంతా మారిపోతుందని వ్యాఖ్యానించింది. అయితే సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీత మరోసారి అభ్యర్థించడంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఎందుకు సీబీఐ రావాలని కోరుతున్నారు? రావాలో వద్దో సీబీఐ నిర్ణయించుకుంటుంది. ప్రతివాది సహకరించకుంటే, కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమైతే, హైకోర్టు ఆదేశాలు సరి కాకుంటే సీబీఐ తనకు తానే వస్తుంది. అందుకే చెబుతున్నాం. జూలై 3న కోర్టుకు రండి. మీ న్యాయవాది వాదిస్తారు’ అని ధర్మాసనం సూచించింది. న్యాయవాది వాదించడమే సబబు.. హైకోర్టు ఆదేశాలు నిష్ప్రయోజనమని ఈ అంశానికి సంబంధించి మరో కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని సునీత పేర్కొనడంతో అందుకే తాము సెలవుల తర్వాత రావాలని సలహా ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ప్రతివాది అవినాశ్ మీ కజినా? అని ధర్మాసనం పదేపదే సునీతను ప్రశ్నించగా... అవునని తన రెండో కజిన్ అని సునీత సమాధానమిచ్చారు. అయితే పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించడమే సబబని, ఇందులో సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా సునీత పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చాలని, అడ్వొకేట్ ఆన్‌రికార్డ్స్ హాజరవుతారని లూత్రా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే సీబీఐకి నోటీసులు ఇవ్వడంలో తాము జోక్యం చేసుకోబోమని, పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 19న విచారణ జాబితాలో చేర్చాలంటూ రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలిచ్చింది. -
YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ A.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా లాయర్ ను పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత : సీబీఐ దర్యాప్తునకు అవినాష్ ఏ మాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు రాలేదు జస్టిస్ విక్రమ్ నాథ్ : ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ ముందున్న బెంచ్‌కు రావాల్సిన పరిస్థితి ఉందా? జస్టిస్ A.అమానుల్లా : ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో, ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో CBIకి తెలుసు. ఈ కేసులో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. సునీత : ఇతర నిందితులతో కలిసి అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు : అవినాష్ రెడ్డి CBI ముందు హాజరవుతున్నారు కదా, అలాగే దర్యాప్తుకు సహకరిస్తున్నప్పుడు CBIకి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముంది? ఈ కేసులో మీరు తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారు, మీరు (సునీతను ఉద్దేశించి) న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చు. మీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్ కు సమస్య ఎదురవుతుంది. సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా? సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోగా సిబిఐకి ఇచ్చిన దర్యాప్తు గడువు ముగుస్తుంది సుప్రీంకోర్టు : మిస్టర్ లుథ్రా.. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. వాదనలు వద్దంటున్నా.. మీరు తలదూర్చాలనుకుంటున్నారు. ఈ కోర్టులోనే ఒక బెంచ్ విధించిన గడువుపై మేం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా? సునీత : ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐని ఆదేశించండి సుప్రీంకోర్టు : అలాంటి ఉత్తర్వులు మేమేలా ఇస్తాం? ఈ పిటిషన్ లో విచారణకు రావాలా లేదా అన్నది CBI ఇష్టం. జులై 3న రండి సునీత : హైకోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించే తుది అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గతంలో మీరు చెప్పారు కదా జస్టిస్ A.అమానుల్లా : మీరు ఆరోపణలు చేస్తున్న నిందితుడు మీ కజినా? సునీత : అవును, అవినాష్ రెడ్డి నాకు సెకండ్ కజిన్ సీనియర్ లాయర్ లుథ్రా: ఈ కేసును రేపు పరిశీలించండి. రేపు అడ్వొకేట్ ఆన్ రికార్డును కోర్టు ముందుంచుతాం. నేను వాదనలు వినిపిస్తాను సుప్రీంకోర్టు : మీరు అడిగినట్టు CBIకి నోటీసులు ఇవ్వలేం. కేసును జూన్ 19వ తేదీకి (వచ్చే సోమవారం) వాయిదా వేస్తున్నాం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్లో సిబిఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీతకు అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసును జూన్ 19న పరిశీలిస్తానని తెలిపింది. -
అవినాష్‌రెడ్డి సహకరిస్తున్నా.. లేదంటూ మెన్షన్!
సాక్షి, ఢిల్లీ: వివేకా హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు(వెకేషన్ బెంచ్) కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. జూన్ 13న జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్నది సునీత పిటిషన్ సారాంశం. ఇవాళ(శుక్రవారం) సుప్రీంకోర్టులో పిటిషన్‌పై మెన్షన్ చేసిన సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా విచారణ చేపట్టాలని కోరారు. వివేకా కేసులో దర్యాప్తు కోసం రావాలని సీబీఐ కోరుతున్నా.. అవినాష్‌రెడ్డి హాజరు కాలేదని న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు. అయితే, ఇప్పటివరకు 7 సార్లు అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరు అయిన విషయం తెలిసిందే. బెయిల్ తర్వాత కూడా శనివారం రోజున అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. ఈ విషయాన్ని సమగ్రంగా వివరించకుండా.. అవినాష్‌రెడ్డి లక్ష్యంగా కొన్ని తప్పుడు వాదనలు వినిపించారు సునీత తరపు న్యాయవాది. ఇక తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు జరిగిన వాదనల సందర్భంగా హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను మాత్రం సునీత తన పిటిషన్లో సుప్రీంకోర్టు ముందు ఉంచకపోవడం గమనార్హం. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం హియర్ సే పేరుతో, కొన్ని కల్పిత కథనాలను సృష్టించి, వాటిని తెలుగుదేశం సహకారంతో ఎల్లో మీడియాలో పబ్లిష్ చేయించి వాటి ఆధారంగానే మరోసారి సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించినట్టు తాజా పిటిషన్ ద్వారా అవగతమవుతోంది. దర్యాప్తునకు అవినాష్‌రెడ్డి అన్నివిధాలుగా సహకరిస్తున్నప్పటికీ.. సునీత తరపు న్యాయవాది మాత్రం ఆయన దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ ధర్మాసనానికి వినిపించారు. దీనిపై స్పందించిన బెంచ్.. పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఇదీ చదవండి: ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు! -
సీబీఐ కోర్టులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
హైదరాబాద్: వివేకా కేసుకు సంబంధించి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈనెల9వ తేదీన తీర్పు ఇస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిలో భాగంగా తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సునీత ఇంప్లీడ్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమా మహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ని సిబిఐ అధికారులు ఆరెస్ట్ చేశారు. ఆరోపణలు మాత్రమే సిబిఐ పరిగణలోకి తీసుకుంది. భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో సీబీఐ ఇరికించింది. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి నేరం చేసాడు అనడానికి ఎక్కడ సరైన సాక్ష్యాలు లేవు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదు’ అని కోర్టుకు తెలిపారు. -
ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా భాస్కర్‌రెడ్డి.. సీబీఐ కోర్టు సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌కు సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది. ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న భాస్కర్ రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. కాగా, వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ పిటిషన్‌పై గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. తన వైపు కౌంటరు లేదని సీబీఐ కోర్టుకు దస్తగిరి తెలిపారు. సీబీఐ వాదనలు వినడానికి విచారణను ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి సహకరించేందుకు అనుమతివ్వాలన్న సునీత కోరగా, ఆమె పిటిషన్ పై శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి తమ కౌంటర్లు దాఖలు చేయలేదు. సునీత వాదనల కోసం పిటిషన్ విచారణ ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. -
వివేకా కేసు: కోర్టుకు హాజరుకాని దస్తగిరి.. విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఉన్న ఐదుగురు నిందితులను సీబీఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని హాజరుపరిచారు. అయితే, వివేకా కేసులో కీలక నిందితుడు దస్తగిరి ఈరోజు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో, కోర్టు.. కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు, వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. దాదాపు నెలన్నర రోజులుగా జైలులో ఉంటున్నానని, కస్టడీ విచారణ కూడా ముగిసిందని భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఏప్రిల్ 24 నుంచి చంచల్‌గూడ జైలులో ఉంటున్న భాస్కర్‌రెడ్డి గత వారం అస్వస్థతకు గురవ్వగా.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు హృదయ సంబంధ సమస్యలున్నట్లు గుర్తించారు. దీంతో నిమ్స్‌కు తరలించి.. పలు పరీక్షలు చేశారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ -
చెప్పుడు మాటలతో దర్యాప్తా?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు మినహా ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరో అన్నవి, విన్నవి మినహా సాక్ష్యాలేవని ప్రశ్నించింది. కేవలం చెప్పుడు మాటలు, ఊహాజనిత సాక్ష్యాల ఆధారంగా సీబీఐ తప్పుదారిలో దర్యాప్తు కొనసాగిస్తోందని తప్పుబట్టింది. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఐదు షరతులతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, జూన్ చివరి వరకు దర్యాప్తునకు సహకరించాలని, ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరు కావాలని తెలిపింది. ఒకవేళ అవినాశ్‌ను అరెస్టు చేస్తే రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరి ష్యూరిటీ తీసుకుని బెయిల్‌పై విడుదల చేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. షరతులను అవినాశ్ ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్ర, శనివారం సుదీర్ఘ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు మే 31న తుది తీర్పు వెలువరిస్తామని, అప్పటివరకు ఆయన్నుఅరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అవినాశ్‌రెడ్డికి షరతులతో ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ ఎం.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. సాక్షులెవరూ ఫిర్యాదు చేయలేదు.. ‘సుదీర్ఘ కాలం దర్యాప్తు చేసినా అవినాశ్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయింది. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను చెరిపివేయడంలోనూ అవినాశ్ ప్రమేయం ఉన్నట్లు తేలలేదు. సాక్షులను అవినాశ్ బెదిరిస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరూ దర్యాప్తు అధికారులకు ఫిర్యాదు చేయలేదు. సీబీఐ సేకరించింది హియర్ సే ఎవిడెన్స్ (ఫలానా వ్యక్తి నాకు చెప్పారు అని మరొకరి చెప్పడం), ఊహాజనిత సాక్ష్యాలు మాత్రమే. ఈ హత్య వెనుక భారీ కుట్ర ఉందనేందుకు అవినాశ్‌కు వ్యతిరేకంగా నేరుగా ఒక్క ఆధారం కూడా లేదు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన సమాచారంపైనే సీబీఐ పూర్తిగా ఆధారపడి దర్యాప్తు సాగిస్తోంది. రాజకీయ కోణం అంటున్నా అందుకు ఆధారాలు లేవు. కోర్టుకు ఆరోపణలు కాదు.. ఆధారాలు కావాలి. ఈ అంశాలన్నింటిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత కస్టోడియల్ విచారణ అవసరం లేదని ఈ కోర్టు భావిస్తోంది. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు పిటిషన్‌ను అనుమతిస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ‘సాక్షుల స్టేట్మెంట్లతోనే సీబీఐ దర్యాప్తు చేసింది. రెండేళ్ల క్రితమే అవినాశ్ కుట్ర బయటపడిందని చెప్పిన సీబీఐ అప్పుడే ఎందుకు విచారణ చేయలేదో సమాధానం లేదు. హత్యకు వాడిన గొడ్డలిని సీబీఐ రికవరీ చేయలేదు. ఏ–2 గొడ్డలిని నాలాలో పడేసినట్లు చెప్పాడు. నిందితులకు ఇచ్చిన డబ్బును కూడా రికవరీ చేయలేదు. దస్తగిరి అనుచరుడు మున్నాను ఈ డబ్బుకు సంబంధించి విచారించలేదు. వివేకా అల్లుడు తానే లేఖను దాచిపెట్టానని వాంగ్మూలంలో చెప్పాడు. ఎర్రగంగిరెడ్డితో మిగతా ముగ్గురు నిందితులకు ఉన్న సంబంధాలను సీబీఐ కనుగొనలేదు. వివేకా తలపై గాయాలున్నా హత్య కేసుగా నమోదు కాలేదు. అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేయడం నాటి విచారణాధికారి తప్పిదమే. కడప ఎంపీ టికెట్ వివాదంపై సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవు. వివేకా హత్య కేసులో, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవు’ అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎక్కడా అవినాశ్ పాత్ర లేదు: న్యాయవాది ‘ఈ హత్య కేసు వెనుక భారీ కుట్ర ఉందంటున్న సీబీఐ, అవినాశ్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. విచారణకు అవినాశ్ సహకరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఏడు సార్లు విచారణ జరిగింది. హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా సీబీఐ ఆరోపణలు మినహా అవినాశ్‌కు వ్యతిరేకంగా ఆధారాలను చూపడం లేదు. సాక్ష్యాలు లేకుండా ఓ పార్లమెంట్ సభ్యుడి ప్రజా జీవితాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు అవినాశ్ అక్కడకు చేరుకునేటప్పటికి అందరూ గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని చెబుతుండటంతో ఆయన కూడా తొలుత అలాగే భావించారు. సాక్ష్యాల ధ్వంసంలోనూ ఆయన పాత్ర లేదు. అప్పటికే పలు ఫోన్లలో వీడియోలు, ఫొటోలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు విచారించిన నేపథ్యంలో కస్టోడియల్ విచారణ అవసరం లేదు’ అని అవినాశ్ న్యాయవాది పేర్కొన్నారు. బెయిల్ మంజూరుకు కోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలివీ.. తొలి చార్జీషీట్ సమయంలో అవినాశ్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానించిన సీబీఐ విచారణ నోటీసులు జారీ చేసేందుకు మాత్రం రెండేళ్లు ఆగింది. జనవరి నుంచి విచారణకు హాజరు కావాలని మాత్రమే నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఆయన్ను అరెస్టు చేసే ఉద్దేశం ఉంటే సీబీఐ ఇన్నేళ్లు ఎందుకు ఆగిందనే దానికి దర్యాప్తు అధికారుల వద్ద సమాధానం లేదు. అవినాశ్ తల్లి మెడికల్ రికార్డులను పరిశీలిస్తే శస్త్రచికిత్స వాస్తవమే అన్నది తెలుస్తోంది. విచారణ సందర్భంగా హైకోర్టు అడిగిన పలు ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పలేకపోయింది. -
ఎంపీ అవినాష్‌కు ఊరట.. హైకోర్టు ఆర్డర్‌లోని కీలక అంశాలివే!
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ ఇచ్చిన తీర్పులో చాలా కీలక అంశాలను పొందుపరిచారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరు, దర్యాప్తు సంస్థల రికార్డులు, నిందితుల వివరాలను తన తీర్పులో పేర్కొన్నారు. హంతకులు వీరే సీబీఐ దర్యాప్తు ఆధారంగా వివేకానందరెడ్డిని హత్య చేసింది గంగిరెడ్డి, యాదాటి సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి అని తేలింది హత్యకు కారణాలేంటీ? దర్యాప్తు సంస్తల విచారణ ఆధారంగా తేలింది ఏంటంటే, హత్య చేసిన నలుగురికి వివేకాతో వేరు వేరు వైరుధ్యాలున్నాయి సంబంధిత వార్త: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు 1. ఎర్ర గంగిరెడ్డి : వివేకా పలుమార్లు గంగిరెడ్డిని అందరి ముందు తిట్టడంతో పాటు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ లావాదేవీల్లో విభేదాలు వచ్చాయి. 2. సునీల్ యాదవ్: తనకు బెంగుళూర్ సెటిల్మెంట్లో డబ్బులు రాలేదని వివేకాపై ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో పాటు రంగురాళ్లు, వజ్రాల లావాదేవీలలో వివేకాతో విభేదాలు వచ్చాయి. తన తల్లిపై వివేకా తప్పుడు ఆలోచనలతో ఉన్నాడని సునీల్ యాదవ్ వివేకాపై పగ పెంచుకున్నాడు. 3. ఉమాశంకర్‌రెడ్డి: వివేకా తనకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదనే కోపం ఉంది. తన భార్యపై వివేకా తప్పుడు ఆలోచనలతో ఉన్నాడని ఉమాశంకర్‌రెడ్డి కోపం పెంచుకున్నాడు. 4. దస్తగరి: తనను డ్రైవర్‌గా తొలగించాడన్న కోపం వివేకాపై ఉంది. ఒక మహిళతో అక్రమ సంబంధం విషయంలో దస్తగిరికి వివేకాకు శత్రుత్వం ఉంది. చదవండి: వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? 1. ఈ కేసులో ముందుగా టీడీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డిపై అనుమానాలు వచ్చాయి. 2. వివేకాను కుటుంబ సభ్యులే హత్య చేశారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటనలు చేశారు. దీనిని తీవ్రంగా తప్పుబడుతు వివేకా కుమార్తే సునీతారెడ్డి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసారు. 3. ఆధారాలను పరిశీలిస్తే సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను తుడిచేవేసే ప్రయత్నం జరిగినట్లు స్పష్టమవుతోంది. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సైతం ఆధారాలు దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. హత్యకు ముందు వివేకా రాసిన ఉత్తరాన్ని దాచిపెట్టాలని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పీఏ కృష్ణారెడ్డికి చెప్పారు. 4. సిబీఐ విచారణలో సేకరించిన వాంగ్మూలంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివేకా హత్య కేసులో సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారం లేదు. 5. సంఘటనా స్థలంలో ఆధారాలను గంగిరెడ్డి తుడిచేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయి. 6. హత్య సమయంలో వివేకా నివాసంలో డాక్యుమెంట్ల కోసం గంగిరెడ్డి, యాదాటి సునీల్ వెతికినట్లు సీబీఐ దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. నిందితులు ఆ డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లారు. డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లే ముందు డాక్యుమెంట్లను పరిశీలించుకున్నారని అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టంగా చెప్పారు. గంగిరెడ్డి, యాదాటి సునీల్ హత్య సమయంలో వ్యవహరించిన తీరును బట్టి ఈ డాక్యుమెంట్ల కోసమే హత్య జరిగినట్లు అర్ధమవుతోంది. 7. ఈ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటి వరకు సీబీఐ తేల్చలేకపోయింది. ఈ డాక్యుమెంట్లు దొరికితే హత్యకు అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. 8. వివేకా హత్యకు ముందు 2019 ఫిబ్రవరి 10వ తేదీన గంగిరెడ్డి ఇంటి వద్ద బ్లాక్ బొలేరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్న విషయంపై వివరాలు సేకరించడంలో సీబీఐ విఫలమైంది. ఇది కూడా చదవండి: ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. అవినాష్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఆవేదన 9. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. 10. కడప ఎంపి టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందనేది కేవలం ఊహజనితమే. సీబీఐ సేకరించిన వాంగ్మూలాలలోనే వివేకా కడప నుంచి పోటీ చేయాలనుకోలేదని స్పష్టం అవుతోంది. 11. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలంలో ఒక విషయం స్పష్టమవుతోంది. వివేకా హత్య కన్నా ముందే ఎంపీ టికెట్‌కు అనధికారికంగా అవినాష్‌రెడ్డి పేరు ఖరారు అయినట్లు రాజశేఖర్‌రెడ్డి చెప్పినదాన్ని బట్టి స్పష్టమవుతోంది. 12. కడప ఎంపీగా అవినాష్‌రెడ్డిని గెలిపించేందుకు తన తండ్రి ప్రయత్నించారని ఆయన కుమార్తె సునీతారెడ్డి పలుమార్లు చెప్పారు. 13. హత్యకు ఒకరోజు ముందు కూడా అవినాష్‌రెడ్డి కోసం వివేకా ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. 14. గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సమయంలో సునీతారెడ్డి.. అవినాష్‌రెడ్డి క్యార్టర్‌లోనే బసచేసారు. ఒకవేళ వివేకాను హత్య చేసింది అవినాష్‌రెడ్డి అయితే సునీతా ఆయన క్యార్టర్లో షెల్టర్ తీసుకునేవారా? అవినాష్‌రెడ్డితో తమ తండ్రికి శత్రుత్వం ఉందని వివేకా కుటుంబ సభ్యులు ఆరోపించలేదు. 15. దస్తగిరి స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ఏడాది ముందుగానే 46 లక్షల రూపాయలు రికవరి చేశారు. అయినా దస్తగిరిని అరెస్టు చేయలేదు. 16. ఇక ఈ కేసులో దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా గుర్తించక ముందు నుంచే సీబీఐ తనను అరెస్టు చేయదనే ధీమా దస్తగిరికి వచ్చేసింది. 17. తన తొలి స్టేట్మెంట్లో ఎక్కడా అవినాష్‌రెడ్డి పేరు చెప్పని దస్తగిరి తరువాత కాలంలో అవినాష్‌రెడ్డికి కుట్రలో భాగం ఉందనే స్టేట్మెంట్ ఇచ్చారు. 18. హత్య జరిగిన రాత్రి ఏ-2గా ఉన్న యాదాటి సునీల్ యాదవ్ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలున్నాయని సీబీఐ అంటోంది. సీబీఐ ప్రకారం హత్య జరిగిన రాత్రి 1.58నిమిషాలకు యాదాటి సునీల్ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. అయితే సిబీఐ సాంకేతిక నిపుణుడు ఇచ్చిన సమాచారం పూర్తి భిన్నంగా ఉంది. సీబీఐ సాంకేతిక నిపుణుడు తన వాంగ్మూలంలో యాదాటి సునీల్ 2.42నిమిషాలకు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ రెండు వాదనలలో వైరుధ్యం కనిపిస్తోంది. పరస్పర తేడాలున్నట్టు తెలుస్తోంది. 19. CC టీవి వీడియో క్లిప్‌లో తెల్లవారు జామున 3.15నిమిషాలకు ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పారిపోతున్నట్లు కనిపించింది. ఒక వేళ CBI చెబుతున్నట్టు 1.30కు హత్య జరిగితే 3.15కు నిందితుడు ఎందుకు పారిపోతున్నట్టు కనిపిస్తాడు? వివేకా ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్నప్రాంతానికి చేరుకోడానికి 2 గంటలు పట్టదు కదా? హత్య జరిగాక యాదాటి సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ముగ్గురు ఒకేసారి అక్కడి నుంచి తన వాంగ్మూలంలో దస్తగిరి చెప్పాడు. 20. గత రెండున్నరేళ్లలో అవినాష్‌రెడ్డికి వివేకా హత్యతో సంబంధం ఉన్నట్లు CBI ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. సీబీఐ సమన్లు ఇచ్చిన 7సార్లు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. -
వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వివేకా కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక ఇలాటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని విమర్శించారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి ఎల్లో మీడియా ప్రయత్నించిందని.. దర్యాప్తునకు సంబంధించిన అంశాలు వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘ఓ వర్గం మీడియా తమ సొంత అజెండాతో దుష్ప్రచారం చేస్తోంది. మీడియా ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు జరగాలి. టీవీ ఛానళ్ల డిబేట్లలో రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజాయితీపరులపై అమానుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ జగన్‌దే తుది నిర్ణయం వైఎస్ జగన్ చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. ఆ తర్వాతే వివేకా పార్టీలో చేరతానంటే జగన్ ఆహ్వానించారు. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంలో జగన్‌దే తుదినిర్ణయం. ఎవరికి టికెట్లు ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందనేది జగన్ ఇష్టం. వివేకా హత్య కేసు విషయంలో రాజకీయం కోణం ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎవరిని అడిగిన ఆ విషయం చెప్తారు. ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు లేఖను దాచిపెట్టాలని వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. కేవలం ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. వివేకా హత్య వెనక ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఆస్తి, కుటుంబ వ్యవహారాల్లో దర్యాప్తు జరపడం లేదు. కీలక అంశాలపై సీబీఐ విచారణ చేపట్టలేదు. టీడీపీకి అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టా? ప్రతికూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం ఓడినట్టా? చివరకు న్యాయమే గెలుస్తుందని హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది’ అని సజ్జల వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట లభించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివేకా కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని కోర్టు తెలిపింది. -
ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. అవినాష్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఊరట లభించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్లో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముడుపులు అందాయంటూ ఓ వర్గం టీవీ ఛానెల్స్‌లో జరిగిన డిబేట్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీఎన్(తెలుగు), మహా టీవీ ఛానళ్లలో ఈనెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు న్యాయమూర్తి ఆ ఆర్డర్‌కాపీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోలను డౌన్లోడ్ చేసి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సీజేకి అందించాలన్నారు. టీవీ చర్చల్లో చేసిన కామెంట్స్ చూసి ఆయన తీవ్రంగా కలత చెందినట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. కాగా, ఆయా టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ ఒకరు.. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మీడియాలో కొందరు వ్యక్తులతో చర్చలు పెట్టారు. ఇది కేవలం నాపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. మొత్తం న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది. ఒకస్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని అనకున్నాను. సుప్రీం కోర్టు ఆదేశాలు, ఎలాంటి భయం లేకుండా న్యాయాన్ని కాపాడుతానని చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసుకుని విచారణ కొనసాగించా. సస్పెండై, అరెస్టయిన ఒక మెజిస్ట్రేట్ ఏకంగా.. న్యాయమూర్తికి డబ్బు సంచులు అందాయని వ్యాఖ్యానించారు. గౌరవమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి చెయ్యండ్రా అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్, మహాటీవీ చర్చల్లో చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి. ఈ ధిక్కరణపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుంది’’ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీలో.. తొలి రెండు పేజీల్లో జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్న వ్యాఖ్యల సారాంశం. ‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయ’’ని న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు -
YS Avinash Reddy: అందుకే అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసిందని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని, కోర్టు ఆ వాదనతో ఏకీభవించి ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు వివేకా కేసులో అవినాష్‌కు సంబంధం ఉన్నట్లు ఒక్క ఆధారం లేదని.. అందుకే కోర్టు ఆ తీర్పు ఇచ్చిందని అంటున్నారు. వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ క్రమంలో తీర్పు అనంతరం బయటకు వచ్చిన ఆయన తరపున న్యాయవాదులు సాక్షితో మాట్లాడారు. అవినాష్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి సాక్షికి వివరించారు. ‘‘సీబీఐ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేసిందని కోర్టుకు తెలిపాం. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో అవినాష్ పేరు లేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో సిట్ ఏర్పాటు చేసి.. వందల మందిని విచారించారు. కానీ, ఏ ఒక్కరు కూడా అవినాష్ రెడ్డి పేరు చెప్పలేదు. కావాలనే అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. ఆ వాదనతో కోర్టు ఏకీభవించి.. కస్టడీ విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. అదే సమయంలో విచారణకు సహకరించాలంటూ అవినాష్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. ప్రతీ శనివారం అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్లాలి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొందని వివరించారు. అవినాష్ రెడ్డికి ఈకేసుతో సంబంధం ఉందని ఒక్క ఆధారం లేదు. అందుకే ముందస్తు బెయిల్ ఇచ్చారు అని ఆయన తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి సాక్షికి తెలిపారు. సిబిఐ చెప్పిన రాజకీయ కారణాలు కూడా సహేతుకంగా లేవని కోర్టుకు విన్నవించాం. కేవలం కక్ష సాధింపులో భాగంగా, ప్రత్యర్థులపై బురద జల్లేలా సిబిఐ చేసిన ఆరోపణలున్నాయని, పైగా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియాలో చేసిన ఆరోపణలనే సిబిఐ తన వాదనలుగా చేర్చిందని కోర్టుకు తెలిపామని న్యాయవాదులు వివరించారు. కేవలం హియర్ సే ఆధారంగా ఒకరిపై బురద జల్లడం సరికాదని, నిందారోపణలు చేసినంత మాత్రానా న్యాయం అందకుండా పోదన్న విషయం రుజువయిందన్నారు. ఇదీ చదవండి: ముందస్తు బెయిల్‌కు హైకోర్టు విధించిన షరతులు ఇవే.. -
ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అవినాష్‌రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ అవినాష్‌రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివేకా కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదులతో స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్కాపీలో ఏముందంటే.. 30 పేజీల హైకోర్టు ఆదేశాల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. సీబీఐ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. సాక్ష్యాలను తారుమారు చేశారనడానికి కూడా ఎవిడెన్స్ లేవు. చెప్పుడు మాటల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసింది. ఊహాజనితమైన విచారణ మాత్రమే సాగింది. ఈ తరుణంలో.. కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తున్నాం. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాం. హైకోర్టు షరతులివే ► అవినాష్‌రెడ్డిని గనుక అరెస్టు చేసినట్లయితే.. రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలి ► సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదు. ► సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేయకూడదు. ► సీబీఐ దర్యాప్తునకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలి. ► ప్రతి శనివారం ఉ.10 నుంచి సా.5 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి ► అవసరమని CBI భావించినప్పుడు విచారణకు అవినాష్ రెడ్డిని పిలవచ్చు పైషరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు. ఆ ఛానెల్స్ డిబేట్‌పై అభ్యంతరం ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ ఛానెల్స్‌లో తాజాగా వివేకా కేసు పరిణామాలపై జరిగిన డిబేట్లో న్యాయమూర్తికి డబ్బుల సంచులు వెళ్లాయంటూ ఓ సస్పెండెడ్ మెజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలపైనా.. హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఆ చర్చకు సంబంధించిన వీడియోలను కోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచారం చేశాయి. మీడియా ఛానల్ డిబేట్ లో కొంత మంది వ్యక్తుల ద్వారా నాపై ఆరోపణలు చేయించారు’’ అంటూ ఆర్డర్ కాపీలో వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ‘‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. మీడియా కథనాలు చూసి ఒక స్థాయిలో నేను ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలనుకున్నాను. సస్పెండ్ అయ్యి ఒక జడ్జ్ నాకు డబ్బు సంచులు వచ్చాయని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరిపి తీర్పు వెల్లడించాను. ఆయా డిబేట్ల వీడియోలను కోర్టుకు సమర్పించండి. చీఫ్ జస్టిస్ ఆ వీడియోలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు అని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి అనేక మలుపులు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్‌పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్‌రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్‌పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు వింది తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు హాజరయ్యారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు మాత్రం హాజరు కాలేదు. సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తల్లి బాగోగులు చూసుకోవడానికి గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేయడం సరికాదు! -
గన్మెన్లతో దస్తగిరి దాదాగిరి
సాక్షి ప్రతినిధి, కడప/రైల్వేకోడూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్‌పై ఉన్న ప్రధాన నిందితుడు దస్తగిరి దర్జాగా సెటిల్మెంట్లకు తెగబడుతున్నాడు. సీబీఐ సిఫార్సుల మేరకు ఐదుగురు గన్మెన్లను సమకూర్చుకుని పోలీస్ స్టేషన్ వద్దే దర్జాగా బహిరంగంగా బెదిరింపులకు దిగడం నివ్వెరపరుస్తోంది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నడిబొడ్డున సోమవారం పట్టపగలు మూడు షాపులకు తాళాలు వేసిన దస్తగిరి వాటిని ఖాదర్‌వలీ అనే వ్యక్తికి అప్పగించాలంటూ బెదిరింపులకు దిగాడు. పోలీస్‌స్టేషన్ పక్కనే గన్మెన్లతో హల్చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 30 ఏళ్లుగా షాపులు నిర్వహిస్తున్నా.. రైల్వే కోడూరులో అబ్దుల్ వాహిద్, శివయ్యనాయుడు, వైష్ణవి మెడికల్స్‌కు చెందిన సుబ్బరాయుడికి పోలీస్‌స్టేషన్ పక్కనే మూడు షాపులున్నాయి. వాటిని 30 ఏళ్లుగా అద్దెకు ఇచ్చారు. వాటి విలువ సుమారు రూ.2.5 కోట్లకు పైబడి ఉంటుంది. అయితే ఆ మూడు షాపులు ఖాదర్‌వలీ అనే వ్యక్తివి అంటూ దస్తగిరి రంగప్రవేశం చేశాడు. డాక్యుమెంట్లు ఉన్నాయని, మీరంతా ఖాళీ చేయాలంటూ వీరంగం వేశాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక సీఐ విశ్వనాథరెడ్డి కార్యాలయంలో ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం దస్తగిరి రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. ఐదుగురు గన్మెన్లను వెంట బెట్టుకొని ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్లి మూడు షాపులకు తాళాలు వేశాడు. అనంతరం పెద్ద మనుషుల సూచన మేరకు జిరాక్స్ డాక్యుమెంట్లు తీసుకొని 10 రోజుల్లో తిరిగి వస్తానంటూ హెచ్చరించాడు. రైల్వేకోడూరుకు చెందిన ఖాదర్‌వలీ ఆ షాపులు తనవేనని ఏనాడూ ముందుకొచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. మందు, ముక్క.. విలాస జీవితం వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరి విలాస జీవితం గడుపుతూ తరచూ దందాలు, దౌర్జన్యకాండకు దిగుతున్నాడు. కష్టపడితేనే పూట గడిచే స్థితి నుంచి ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అతడిప్పుడు చుక్క, ముక్క లేకుండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఖరీదైన స్కాచ్ ఎప్పుడూ వెంట ఉండాల్సిందే. ప్రైవేట్ పంచాయితీలు నిత్యకృత్యమయ్యాయి. సెటిల్మెంట్లపై దృష్టి పెట్టాడు. ప్రాణరక్షణ పేరిట ఐదుగురు గన్మెన్లను సమకూర్చుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. పోలీస్ స్టేషన్లలోనే దాడులు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. ఏకంగా పోలీసు స్టేషన్లలోనే దౌర్జన్యాలు, దాడికి తెగబడుతున్నాడు. వైఎస్సార్ జిల్లా తొండూరులో మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తిపై పోలీసు స్టేషన్లోనే దస్తగిరి దాడి చేశాడు. ఈ మేరకు క్రైమ్ నంబర్ 41/2022 కింద 2022 మే 29న కేసు నమోదైంది. అదే మండలంలో ఎలక్ట్రిక్ ఉపకరణాల చౌర్యం కేసు కూడా 2022 ఆగస్టు 2న దస్తగిరిపై నమోదైంది. ♦ శ్రీకాళహస్తిలో దర్గా స్థలంపై 20 ఏళ్లుగా ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న వివాదంలో బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఖాదర్‌బాషా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై క్రైమ్ నెంబర్ 121/2022 కేసు నమోదైంది. ♦ వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల కేంద్రంగా ఫైనాన్స్ వాహనాల సీజ్, వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల్లో తలదూరుస్తూ దస్తగిరి సెటిల్మెంట్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ దస్తగిరి అంటావేందీ..? బెయిల్‌పై ఉన్న నిందితుడు దస్తగిరి షరతులను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడు. ‘‘హలో... నేను దస్తగిరిని మాట్లాడుతున్నా! ఏ దస్తగిరి అంటావేందీ..? వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన దస్తగిరిని’’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బెయిల్ షరతులేవీ తనకు వర్తించవన్న రీతిలో యథేచ్ఛగా దౌర్జన్యాలకు దిగుతున్నాడు. -
వైఎస్ భాస్కర్ రెడ్డి నిమ్స్‌కు తరలింపు..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు అధికారులు శనివారం ఉదయం భాస్కర్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో వైద్య చికిత్సలు, యాంజియోగ్రామ్ చేయనున్నారు వైద్యులు. కాగా, వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. భాస్కర్‌రెడ్డికి బీపీ లెవల్స్ తగ్గడంతో జైలు అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు. భాస్కర్‌రెడ్డికి హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు ఆయనకు యాంజియోగ్రామ్ చేయించాలని సూచించినట్లు తెలిసింది. వైద్యుల సూచన మేరకు భాస్కర్‌రెడ్డిని నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత -
వివేకా హత్య కేసులో ఎల్లో స్క్రిప్ట్ ప్రకారమే సీబీఐ దర్యాప్తు
-
వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వైఎస్ వివేకా కేసులో ఎల్లో మీడియాలో ఇప్పటికే తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాత్ర ఉందనే విషయాన్ని బాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆయన దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టులో సీబీఐ చెప్పిన అంశాలను మీడియాలో విస్తృతంగా చెప్పాలని, దీనివల్ల వైఎస్సార్సీపీ ఇమేజ్ను దెబ్బతీయ వచ్చని సూచించారు. వివేకా మరణం సీఎం జగన్‌కు ముందే తెలుసని అజేయ కల్లం వంటి వారు కూడా చెప్పారనే విషయాలను పదేపదే చెప్పాలని సూచించినట్లు తెలిసింది. ఇక పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే కీలకమని, ప్రధాని చేతుల మీదుగానే పార్లమెంటు ప్రారంభించడమే సముచితమని చంద్రబాబు సహా పలువురు నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీని తామే ప్రారంభించిన విషయాన్ని నేతలు గుర్తుచేసుకున్నారు. ఆర్–5 జోన్లో ప్రభుత్వం పట్టాలిచ్చిన విషయంపై ఎవరూ పెద్దగా మాట్లాడవద్దని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: ఏపీలో బదిలీలకు 3వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు -
అవినాశ్ లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా సీబీఐ విచారణ చేస్తోందని.. ఆయనను ఇందులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ హైకోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇప్పటికే పలుమార్లు అవినాశ్ విచారణకు హాజరైనా మళ్లీ రావాలంటూ తీవ్రంగా వేధిస్తోందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. హత్య చేసిన నలుగురికి వివేకాతో విభేదాలున్నాయన్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేయలేదని తెలిపారు. ప్రధాన నిందితుడు దస్తగిరి విషయంలోనూ సీబీఐ తీరు ఇలాగే ఉందన్నారు. దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా వివేకా కుమార్తె సునీత పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని మాత్రం సుప్రీంకోర్టు వరకు వెళ్లారని గుర్తు చేశారు. కిరాయి హంతకుడు దస్తగిరికి పూర్తి సహకారం అందిస్తున్న సీబీఐ.. అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా దర్యాప్తు జరుపుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినాశ్ తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉన్నారని.. అయినా విచారణకు రావాలంటూ వేధిస్తోందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆధారాలు లేకుండా అవినాశ్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్ అవినాశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను శుక్రవారం ఉదయం హైకోర్టు విచారించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ధర్మాసనం ముందు.. అవినాశ్ తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం సునీత తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ తన వాదనలు వినిపించారు. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటడంతో విచారణను ధర్మాసనం శనివారం (నేడు) ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. నేడు సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది. కాగా అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు ఇలా సాగాయి.. నాలుగేళ్లుగా సీబీఐ దర్యాప్తు.. ‘2019, మార్చి 14న వివేకా హత్య జరిగింది. తొలుత నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో 2020లో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. కేసు విచారణ చేపట్టిన సీబీఐ దాదాపు నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించలేదు. 2021, అక్టోబర్ 26న ఒక చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్ (ఏ–2), ఉమాశంకర్‌రెడ్డి (ఏ–3), దస్తగిరి (ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. గంగిరెడ్డిని 2019, మార్చి 28న సిట్ అరెస్టు చేసింది. గంగిరెడ్డి వివేకాకు అత్యంత సన్నిహితుడు. వీరి మధ్య భూవివాదాలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఓ భూవివాదంలో రావాల్సిన కమిషన్ గురించి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక రెండో నిందితుడు సునీల్‌ను 2021, ఆగస్టు 28న అరెస్టు చేశారు. వివేకా అతడితో వజ్రాల వ్యాపారం చేసేవారు. అంతేకాదు.. సునీల్ తల్లిని వివేకా లైంగికంగా వేధించినట్లు అతడే తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మూడో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని 2021, సెపె్టంబర్ 9న అరెస్టు చేశారు. ఇతడితోనూ వివేకా వజ్రాల వ్యాపారం చేశారు. అంతేకాకుండా ఉమాశంకర్‌రెడ్డి భార్యను కూడా వివేకా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక నాలుగో నిందితుడు దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేయలేదు. వివేకా వద్ద దస్తగిరి డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2018 డిసెంబర్లో అతడిని తొలగించిన వివేకా.. ప్రసాద్ (ఎల్‌డబ్ల్యూ–16)ను డ్రైవర్‌గా పెట్టుకున్నారు. దస్తగిరి సూచన మేరకే.. హత్యకు ముందు వివేకాతో నిందితులు ప్రసాదే ఈ హత్యకు కారణం అన్నట్లు లేఖ రాయించారు. తానే ఆయుధం తెచ్చానని, హత్య చేశానని చెప్పిన ఓ కిరాయి హంతకుడు (దస్తగిరి) యథేచ్ఛగా బయట తిరగడం, అతడిని సీబీఐ అరెస్టు చేయకపోవడం ఇదే తొలిసారి కావొచ్చు. 2021, నవంబర్ 17న సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే చార్జిషీట్ వేయాల్సి ఉండగా, సీబీఐ చట్టాన్ని పాటించలేదు’ అని అవినాశ్ న్యాయవాది తన వాదనలు వినిపించారు. టీడీపీ కుట్రలో భాగంగానే వివేకా ఓటమి ‘2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. దీనికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి కారణమని.. వారి అంతుచూస్తానని బెదిరించారని సీబీఐ పేర్కొంటున్నా.. అందులో వాస్తవం లేదు. స్థానిక సంస్థల కోటాలో ఆ ఎన్నికలు జరగడం, నాటి అధికార టీడీపీ ఓటర్లను కొనుగోలు చేయడం కారణంగానే వివేకా ఎన్నికల్లో ఓడిపోయినట్టు కొందరు సాక్షులు వెల్లడించారు. వివేకా ఓటమితో భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు సంబంధం లేదు. వివేకా.. విజయమ్మ, షర్మిలల్లో ఒకరికి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు కూడా ఎవరూ చెప్పలేదు. సీబీఐ మాత్రం ఓ కథ అల్లుకుని.. ఆ మేరకు దర్యాప్తు చేస్తోంది’ అని అవినాశ్ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. డబ్బు, ఆయుధం రికవరీ ఏదీ? ‘గంగిరెడ్డి ఇచ్చాడని చెప్పి తనకు సునీల్ రూ.కోటి ఇచ్చినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అందులో రూ.25 లక్షలను మళ్లీ సునీల్ తీసుకున్నాడని చెప్పాడు. కేసు నమోదు చేసిన సీబీఐ మిగిలిన రూ.75 లక్షల్లో రూ.46 లక్షలు మాత్రమే రికవరీ చేసింది. మరి మిగతా డబ్బు ఎక్కడికి పోయింది. దస్తగిరి ఆయుధాన్ని నాలాలో వేశానని చెప్పాడు. నాలాలో వేసిన ఆయుధాన్ని కూడా సీబీఐ రికవరీ చేయలేకపోయింది. ఈ డబ్బు, ఆయుధం ఎక్కడికి పోయాయి. దీనికి సీబీఐ వద్ద సమాధానం లేదు. దస్తగిరి.. సీబీఐ పెంపుడు చిలుక(పెట్)లా మారాడు. వారు ఏం చెబితే అదే చెబుతున్నాడు. అందుకే గిఫ్ట్ కింద మిగిలిన డబ్బు రికవరీ చేయలేదేమో. సీబీఐ కేసు స్వీకరించిన తర్వాత దర్యాప్తు అధికారి ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన దస్తగిరి అక్కడే నెలన్నర ఉన్నాడు. ఈ క్రమంలోనే వారి మధ్య ఒప్పందం కుదిరింది. విచారణ అనుమానాస్పదంగా ఉండటంతో దర్యాప్తు అధికారిపై ఓ ప్రైవేట్ కేసు నమోదు కావడమే కాకుండా ఏకంగా అత్యున్నత న్యాయస్థానం అతడిని పక్కకు పెట్టింది. నిందితుడి నుంచి ఒకసారి వాంగ్మూలం తీసుకుంటారు. కానీ, ఆగస్టు 25, 2021 నుంచి 30 వరకు దస్తగిరి నుంచి మూడుసార్లు వాంగ్మూలం తీసుకున్నారు.. అతడిని అరెస్టు కూడా చేయలేదు. అదే ఏడాది అక్టోబర్ 7న దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్‌కు అభ్యంతరం లేదని, ఇవ్వొచ్చంటూ సీబీఐ పేర్కొంది. దీంతో దస్తగిరికి అక్టోబర్ 22న ముందస్తు బెయిల్ వచ్చింది. అనంతరం దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా పేర్కొంది’ అని అవినాశ్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. సెక్షన్ 201 మిస్సింగ్.. ‘పోలీసు దర్యాప్తుపై సీబీఐ ఆరోపణలు చేసింది. పాత ఎఫ్ఐఆర్లోని అంశాలతోనే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముందు గుండెపోటు అనుకున్నా.. తర్వాత అదే రోజు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అందులో ఐపీసీ 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం) కేసు నమోదు చేశారు. అయితే సీబీఐ ఎఫ్ఐఆర్లో మాత్రం 201 సెక్షనే లేదు. ఏప్రిల్ చివరి నాటికి దర్యాప్తు ముగించాలని కోర్టు చెప్పినా ఆ పని చేయలేదు’ అని తెలిపారు. ముందస్తు బెయిల్ ఇవ్వండి ‘ఇప్పటికే పలుమార్లు విచారణకు అవినాశ్ హాజరయ్యారు. ఈ నెల 16న మరోసారి రావాలంటూ సీబీఐ 15వ తేదీ సాయంత్రం నోటీసులు ఇచ్చింది. తాను 19న వస్తానని అవినాశ్ లేఖ రాశారు. ఈ క్రమంలో 19న హైదరాబాద్ బయలుదేరిన ఎంపీ.. తల్లి అనారోగ్యం విషయం తెలియడంతో మళ్లీ పులివెందుల వెళ్లారు. అక్కడి నుంచి ఆయన తల్లిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని న్యాయవాది వెల్లడించారు. కాగా, సుదీర్ఘ వాదనలు జరుగుతున్న సమయంలో సునీత జోక్యం చేసుకొని వైఎస్ అవినాశ్‌రెడ్డి న్యాయవాదికిచ్చినంత సమయం తమ న్యాయవాదులకు వాదనలు వినిపించేందుకు ఇవ్వాలని పేర్కొనడంతో హైకోర్టు మందలించింది. కోర్టు హాల్లో పరిధి దాటి వ్యవహరించవద్దని హెచ్చరించింది. అవినాశ్‌ను ఇరికించే యత్న ‘నిందితుల్లో కొందరు అవినాశ్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ మాట్లాడుకోవడం సాధారణం. దాని ఆధారంగా అవినాశ్‌ను ఇరికించాలని చూస్తున్నారు. హత్య జరిగిన రోజు ప్రచారం కోసం జమ్మలమడుగు వెళ్తున్న అవినాశ్.. హత్య విషయం తెలిసి నేరుగా వివేకా ఇంటికే చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న చాలామంది రక్తపు వాంతులతో, గుండెపోటు వచ్చి వివేకా మృతి చెందినట్లు చెప్పడంతో అవినాశ్ కూడా అలాగే భావించారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. వివేకా ఇంట్లో ఆయన లాన్‌లోనే పలువురికి ఫోన్ చేసి విషయం చెబుతూ ఉండిపోయారు. ఇన్నాళ్లయినా సీబీఐ అవినాశ్ ప్రమేయం ఉంది అని చెప్పేందుకు ఒక్క ప్రాథమిక ఆధారాన్ని కూడా చూపలేదు. ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకోని సీబీఐ హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌లు ఉన్నారని తనకు గంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి చెప్పిన వాంగ్మూలాన్ని మాత్రం విశ్వసించడం.. విచారణ ఏ లక్ష్యంగా సాగుతోందో తెలియజేస్తోంది. హంతకుడిని బయట తిరగమని చెప్పి.. ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాలని సీబీఐ చూస్తోంది. కోర్టులో పిటిషన్ వేస్తేగానీ వీడియో, ఆడియో రికార్డింగ్ గురించి వివరాలు చెప్పలేదు’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. సునీత తీరు అనుమానాస్పదం.. ‘కేసు ట్రయల్‌ను మరో రాష్ట్రానికి మార్చమని వివేకా కుమార్తె సునీత పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. ప్రతి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతున్న సునీత.. కిరాయి హంతకుడు (దస్తగిరి) బయట తిరగడంపై మాత్రం ఎలాంటి పిటిషన్ వేయలేదు. దస్తగిరికి బెయిల్ ఇవ్వొద్దని గానీ, ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని గానీ కోరలేదు. వివేకా హత్య తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తన తండ్రి.. వైఎస్ అవినాశ్ గెలుపు కోసం చనిపోయే ముందు వరకు తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. జగనన్నను సీఎంగా చూడటమే తన లక్ష్యంగా పనిచేశారని పేర్కొన్నారు. ఎప్పుడైతే ఆమె టీడీపీ నేతలను కలిశారో.. నాటి నుంచి సునీత తీరులో మార్పు వచ్చింది. టీడీపీ నేతలు సూచించినట్లు ఆమె వ్యవహరిస్తున్నారు’ అని అవినాశ్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. -
నాలుగేళ్ల తర్వాత.. సీబీఐ చిలుక ‘కొత్త పలుకు’
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. లోపల ఉన్నదంతా పచ్చ కుట్రేనని వెల్లడైంది. టీడీపీ పాడుతున్న పాత పాటనే సీబీఐ న్యాయస్థానంలో తన అఫిడవిట్లో శుక్రవారం వినిపించింది. సీబీఐలో కొందరు అధికారులు పదవీ విరమణ, స్థాన చలనానికి ముందు టీడీపీ ముఖ్య నేతల ప్రలోభాలకు గురై వారు చెప్పినట్టుగా అఫిడవిట్ పేరుతో కుట్రకు తెరతీసింది. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి అందరికంటే ముందు గుర్తించారన్నది నాలుగేళ్లుగా ముక్తకంఠంతో చెబుతున్న మాట. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్ కూడా అదే విషయం చెప్పింది. కానీ టీడీపీ ఆరు నెలలుగా కుట్రపూరితంగా ఓ వాదనను తెరపైకి తెచ్చింది. వివేకా మృతి చెందిన విషయం ఆయన పీఏ కంటే ముందే ఎంపీ అవినాశ్ రెడ్డి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెప్పారని దు్రష్పచారం చేస్తోంది. సరిగ్గా అదే అసంబద్ధ ఆరోపణను సీబీఐ శుక్రవారం తన అఫిడవిట్లో పేర్కొనడం విస్మయ పరుస్తోంది. పైగా ఏమాత్రం సాంకేతికంగా చెల్లుబాటుగాని ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డ్) నివేదిక అంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు యత్నించింది. ఐపీడీఆర్ నివేదిక అంటూ సీబీఐ చెప్పడమే ఆ అఫిడవిట్ పూర్తిగా కట్టు కథ అని... అభూతకల్పనలు, నిరాధార అభియోగాలేనని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. 2019 మార్చి 14 రాత్రే కాదు... అంతకు 20 రోజుల ముందు 20 రోజుల తర్వాత కూడా ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ ఐపీడీఆర్ డేటా అదేరీతిలో చూపిస్తోంది. అర్ధరాత్రి వేళల్లో కూడా ఆయన ఫోన్‌కు సంబంధించి ఐపీడీఆర్ డేటా పనిచేస్తునే ఉన్నట్టుగా వెల్లడిస్తోంది. రోజూ ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడేవారి ఐపీడీఆర్ డేటా అలానే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోన్‌కు సంబంధించి బైట్స్ అప్లోడ్, డౌన్లోడ్లకు ఆ సమయం తీసుకుంటూ ఉంటుంది. మరి సీబీఐ ఆ ముందు 20 రోజులు, తర్వాత 20 రోజులు ఐపీడీఆర్ డేటాను ఎందుకు ప్రస్తావించ లేదు? ఎందుకంటే అది చాలా సాధారణమైన విషయం కాబట్టి ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. సునీత, నర్రెడ్డి, బీటెక్ రవిల ఐపీడీఆర్ డేటా కూడా అంతే.. ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ ఐపీడీఆర్ డేటానే కాదు.. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ల ఐపీడీఆర్ డేటా కూడా అలానే చూపించింది. 2019 మార్చి 14న రాత్రి కూడా వారి ఫోన్లు పని చేస్తున్నట్టుగానే ఐపీడీఆర్ వెల్లడిస్తోంది. అంటే వివేకా హత్యకు వారు కుట్ర పన్నినట్టు భావించ వచ్చు కదా. అందులోనూ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. బీటెక్ రవితో రాజకీయ విభేదాలు, ఎర్ర గంగిరెడ్డితో భూవివాదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. వారంతా సన్నిహితులు కూడా. మరి సీబీఐ అధికారులు సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బీటెక్ రవి, ఎర్ర గంగిరెడ్డిల ఫోన్ల ఐపీడీఆర్ డేటా గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ డేటా ఆధారంగా వారే వివేకా హత్య చేయించి ఉంటారని ఎందుకు భావించడం లేదు? అంటే సీబీఐ అధికారులు ఏవో అదృశ్య శక్తుల ప్రభావానికి లోనై కేసు విచారణ కంటే ముందే ఓ నిర్ణయానికి వచ్చి ఆ దిశగానే ఎంపీ అవినాశ్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. ఫోన్ చేశారా.. మెసేజ్ చేశారా అన్నది కూడా నిర్ధారించలేం.. ఫోన్లో వాడిన మొబైల్ డేటాను బట్టి ఒక ఫోన్ నుంచి మరొకరికి ఫోన్ చేశారా? మెసేజ్ చేశారా అన్నది కూడా నిర్ధారించడం సాధ్యం కాదు. మొబైల్ డేటా ఆధారంగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్‌లు, ఫేస్బుక్ డేటాను విభజించి, విశ్లేషిం చే పరిజ్ఞానం 2020 వరకు లేనే లేదు. ఇప్పటికీ సాధికారికంగా లేదు. మరి సీబీఐ ఫోన్ మొబైల్ డేటాను బట్టి ఎంపీ అవినాశ్ రెడ్డి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేసినట్టు ఎలా నిర్ధారణకు వచ్చింది? సీబీఐ ఫోన్ నంబర్లు ఎందుకు చెప్పలేకపోయింది? 2019 మార్చి 15 తెల్లవారు జామున ఎంపీ అవినాశ్ రెడ్డి ఏ మొబైల్ నంబర్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన ఏ మొబైల్ నంబర్‌కు ఫోన్ చేశారో సీబీఐ ఎందుకు వెల్లడించ లేకపోయింది? ఫోన్ చేసి ఉంటే ఆ రెండు నంబర్లు చెప్పాలి కదా? ఆ నంబర్లు చెబితే వాటి కాల్ రికార్డ్ డేటా ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. అందులో పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. దీన్నిబట్టి ఆ రోజు తెల్లవారుజామున ఎంపీ అవినాశ్.. వైఎస్ జగన్‌కు ఫోన్ చేయలేదన్న వాస్తవం వెల్లడవుతుంది. అందుకే సీబీఐ ఆ ఫోన్ నంబర్లను తన అఫిడవిట్లో ప్రస్తావించలేకపోయింది. ఆధారాలు ధ్వంసం చేయాలంటే అర్ధరాత్రే చేసేవారు కదా.. వైఎస్ వివేకా హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను ఉదయ్‌కుమార్ రెడ్డి ద్వారా ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 7.30 గంటల సమయంలో ధ్వంసం చేయించారంటూ సీబీఐ మరో నిరాధార అభియోగాలు మోపింది. వివేకా హత్య తర్వాత తెల్లవారు జామున 4గంటలకు ఉదయ్‌కుమార్ రెడ్డి.. ఎంపీ అవినాశ్‌రెడ్డిని కలిశారని సీబీఐ పేర్కొంది. ఐపీడీఆర్ డేటా ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించామని చెప్పింది. పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ రెండు అంశాలను పరిశీలిస్తే సీబీఐ అభియోగాలు పూర్తి అవాస్తవం అన్నది తేటతెల్లమవుతోంది. సీబీఐ చెప్పేదే నిజమైతే అప్పుడే ఆధారాలు ధ్వంసం చేయమని అవినాశ్ చెప్పేవారు కదా.. అసలు ఉదయ్‌కుమార్ రెడ్డి ఆరోజు తెల్లవారుజామున అవినాశ్ని కలవనే లేదు. తీవ్రంగా పరిగణిస్తున్న వైఎస్సార్సీపీ టీడీపీ కుట్రలో భాగస్వాములై కొందరు సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఏమాత్రం హేతుబద్ధంగాని ఐపీడీఆర్ నివేదిక పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మేందుకు బరితెగించిన అధికారులపై.. సాంకేతికంగా ఐపీడీఆర్ హేతుబద్ధత, టెలికాం మార్గదర్శకాలు వెల్లడిస్తున్న అంశాల ఆధారంగా న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఐపీడీఆర్ ఎలా పనిచేస్తుందో తెలియదా? వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్స్ ఉన్నాయంటూ సీబీఐ చేసిన అభియోగాలు పూర్తి అహేతుకం. ఫోన్ కాల్స్ ఉన్నాయంటూ ఐపీడీఆర్ డేటా పేరిట సీబీఐ ఏకంగా న్యాయస్థానాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించడం విస్మయ పరుస్తోంది. అసలు ఐపీడీఆర్ ఎలా పని చేస్తుందనే కనీస సాంకేతిక అవగాహన కూడా సీబీఐకి లేదా అనే సందేహం కలుగుతోంది. ఐపీడీఆర్ ఫోన్ బైట్స్‌ను నిరంతరం అప్లోడ్, డౌన్లోడ్ చేస్తూనే ఉంటుంది. ఫోన్ ఆన్‌లో ఉన్నంతసేపు మనం ఫోన్ మాట్లాడుతున్నా లేకపోయినా సరే అది బైట్స్‌ను అప్లోడ్, డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనం మొబైల్ యాప్‌లు వాడకపోయినాసరే అవి నిరంతరం పని చేస్తునే ఉంటాయి. సర్వర్ ఆ డాటాను తీసుకుంటూనే ఉంటుంది. సాధారణంగా రాత్రి వేళల్లో సర్వర్ డాటాను తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఫోన్లు వాడరు కాబట్టి, ఆ ఫోన్లకు సంబంధించిన బ్యాకప్ తీసుకుంటూ ఉంటుంది. రోజూ ఎక్కువ సేపు ఫోన్లు మాట్లాడేవారు, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కువుగా వాడేవారి ఫోన్ డాటాను అర్ధరాత్రి వేళల్లో మరింత ఎక్కువసేపు ఐపీడీఆర్ అప్లోడ్, డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి డాటా బర్న్ అవుతునే ఉంటుంది. ఆ సమయంలో ఐపీడీఆర్ నివేదిక తీసుకుంటే ఫోన్లో మొబైల్ డాటా బర్న్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. అంత మాత్రాన ఫోన్ మాట్లాడినట్టు కాదు. కాబట్టి ఐపీడీఆర్ డాటాను బట్టి ఒక ఫోన్‌ను ఓ నిర్ణీత సమయంలో ఉపయోగించినట్టుగాని, ఆ సమయంలో వారు ఫోన్ మాట్లాడారని చెప్పడంగానీ సాధ్యం కాదు. ఇది టెలీకమ్యూనికేషన్ల ప్రొటోకాల్ వెల్లడిస్తున్న వాస్తవం. అటువంటిది ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 14 రాత్రి వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత కూడా ఫోన్లో మాట్లాడారని ఐపీడీఆర్ డేటా ఆధారంగా సీబీఐ చెప్పడం విడ్డూరం. 2019 మార్చి 15 తెల్లవారుజామునే వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడారని ఐపీడీఆర్ నివేదిక ద్వారా తెలుసుకున్నామని చెప్పడం అహేతుకం. ఇది అసంబద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐపీడీఆర్ డేటాను బట్టి ఒకరు ఆ సమయంలో ఫోన్ మాట్లాడారని చెప్పడం సాధ్యం కాదని, కేవలం సీబీఐ దురుద్దేశ పూరితంగానే ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించిందన్నది స్పష్టమవుతోంది. కమిట్మెంట్కు కట్టుబడి కట్టు కథ! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావితం చేసేందుకు టీడీపీ మొదటి నుంచీ పన్నాగం పన్నుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంతపాడే బీజేపీలోని టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే పచ్చ మీడియా అందులో ప్రధాన పాత్రధారులుగా మారారన్నది సుస్పష్టం. రిటైర్ అవ్వబోతున్న కొందరు సీబీఐ అధికారులను ప్రలోభాలకు గురి చేశారన్నది సర్వత్రా బహిరంగ రహస్యంగా మారింది. ఆ ప్రకారం ఎంపీ అవినాశ్ రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయించాలన్నది ఒప్పందం. అందుకోసం టీడీపీ భారీగా నిధులు వెదజల్లినట్టు సమాచారం. అందుకే సీబీఐ ఇటీవల హఠాత్తుగా దూకుడు పెంచింది. ఎంపీ అవినాశ్ రెడ్డి దర్యాప్తునకు ఎంతగా సహకరిస్తున్నాసరే ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి ఆయన ఏడుసార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయినా సరే ఆయన విచారణకు సహకరించడం లేదంటూ సీబీఐ అధికారులు అసంబద్ధ అభియోగాలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యతి్నస్తున్నారు. గత మూడు రోజుల్లో ఎలాగైనా సరే ఎంపీ అవినాశ్‌ను అరెస్టు చేయాలని కొందరు సీబీఐ ఉన్నతాధికారులు ప్రయతి్నంచారు. అందుకు తగ్గట్టుగానే టీడీపీ అనుకూల పచ్చ మీడియా చానళ్లు రోజుల తరబడి టీవీలలో చర్చలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కానీ ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయలేమని ఓ ఉన్నతాధికారి గుర్తించారు. కానీ టీడీపీతో కుదుర్చుకున్న కమిట్మెంట్కు న్యాయం చేసేందుకు ఆయన కొత్తకుట్రకు తెరతీశారు. ‘మీరు ఉండగా ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయలేకపోతే... కమిట్మెంట్కు లోబడి మరొకటి చేయండి’ అని టీడీపీ పెద్దల నుంచి ఆయనకు సందేశం అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వివేకా మృతి గురించి ఎంపీ అవినాశ్ రెడ్డికి.. ఆయన ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉంటుందని సీబీఐ తన అఫిడవిట్లో పేర్కొంది. ఒప్పందంలో భాగంగా రాజధానిలో పేదలకు ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, టీడీపీ మహానాడులో ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ఓ అంశాన్ని అందించేందుకే సీబీఐ అధికారి ఇంతటి దుర్మార్గానికి పాల్పడినట్టు స్పష్టమవుతోంది. దీనిని వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణిస్తూ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. అది హత్య అని డాక్టరైన సునీతకు తొలుత తెలీదా? స్వయంగా డాక్టర్ అయిన సునీత వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విస్మయ పరుస్తోంది. ఆమె తరఫు న్యాయవాదులు వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను న్యాయస్థానానికి చూపిస్తూ వాటిని చూస్తే ఎవరికైనా అది హత్య అని తెలుస్తుంది కదా.. అని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆయన టైపిస్ట్ ఇనయతుల్లా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలను పీఏ కృష్ణారెడ్డి.. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలకు పంపారు. ఆ ఫొటోలు చూసిన తర్వాత కూడా వారు అది హత్య అని చెప్పనే లేదు. పైగా తాము వచ్చే వరకు వివేకా రాసిన లేఖ, ఆయన సెల్‌ఫోన్ దాచిపెట్టమని చెప్పారు. మరి డాక్టర్ అయిన సునీత తన తండ్రి మృతదేహం ఫొటోలను చూసి అది హత్యేనని వెంటనే ఎందుకు చెప్పలేదు? సునీత తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి శుక్రవారం చూపిన ఫొటోలు మృతదేహం పోస్టుమార్టం టేబుల్‌పై ఉన్నప్పటి ఫొటోలు. ఆ ఫొటోలను టీడీపీ బాగా రిజల్యూషన్ పెంచి ఒక బుక్‌లెట్‌లో ప్రచురించింది. ఈ ఫొటోలు చూపుతూ.. ఎవరికైనా అది హత్య అని తెలీదా అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అవినాశ్ రెడ్డి వెళ్లేసరికి వివేకా మృతదేహం బాత్రూమ్లో కమోడ్ వద్ద గోడకు చేరబడి ఉంది. ఆ కోణంలో గాయాలు ఏవీ కనిపించనే లేదు. ఆయన వెంటనే బయటకు వచ్చేశారు. వివేకా మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు ఫోన్లు చేశారు. అవినాశ్ ఫోన్ చేసింది 2019 మార్చి 15 ఉదయం 6.30కే.. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయాన్ని చెప్పేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.30 గంటలకే తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయకుడి నంబరుకు ఫోన్ చేసి చెప్పారు. ఆ కాల్ రికార్డులు ఉన్నాయి కూడా. ఆ రోజు ఉదయం 6.10 గంటలకి పీఏ కృష్ణారెడ్డి తొలిసారిగా వివేకానందరెడ్డి మరణించారన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే ఆయన భార్య సౌభాగ్యమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డిలకు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. అనంతరం నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి ఉదయం 6.20 గంటల సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయాన్ని చెప్పారు. వెంటనే వివేకా నివాసానికి వెళ్లిన అవినాశ్ రెడ్డి ఆయన మృతదేహాన్ని చూసి వెంటనే బయటకు వచ్చారు. ఆ తర్వాత 6.30 గంటల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయకుడి ఫోన్‌కు కాల్ చేసి వివేకా మృతి చెందిన విషయాన్ని తెలిపారు. అంటే వివేకా మృతి చెందారనే విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాతే ఎంపీ అవినాశ్ రెడ్డికి.. ఆ తర్వాతే ఎంపీ ద్వారా వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి తెలిసింది. ఈ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి, అవినాశ్ రెడ్డి కాల్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాస్తవం ఇలా ఉంటే.. వివేకా మృతి చెందిన విషయం పీఏ కృష్ణారెడ్డి కంటే ముందే వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు తెలుసంటూ సీబీఐ అభూతకల్పనలు సృష్టించి దు్రష్పచారానికి పాల్పడటం వెనుక టీడీపీ ప్రలోభాలు, కుట్ర ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. -
ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే సీబీఐ నడుస్తోంది: సజ్జల
సాక్షి, విజయవాడ: ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం సీబీఐ వ్యవహరిస్తున్నట్లు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కౌంటర్‌పై స్పందించారు. సీబీఐ సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని, ఆధారాలు లేకుండా ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఎల్లో మీడియాకు ముందే తెలుస్తుందని.. సీబీఐ విచారణ ఏ విధంగా చేస్తోందో అర్థం కావట్లేదన్నారు. సీబీఐ వెనుక ఎవరున్నారన్నదానిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ప్రజల్లో అయోమయం సృష్టించేలా సీబీఐ తీరు ఉంది. ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారం సీబీఐ నడుస్తోంది. ఆ స్క్రిప్ట్‌కే విచారణ అని తగిలిస్తున్నారు. కాకమ్మ కథలన్నీ ఎల్లో మీడియాలోనే తయారవుతున్నాయి. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. సరైన దిశలో సీబీఐ విచారణ జరగడం లేదు’’ అని సజ్జల అన్నారు. చదవండి: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై TS హైకోర్టులో విచారణ -
వివేకా హత్యను రాజకీయం చేస్తున్నారు: కేఏ పాల్
-
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
సాక్షి కర్నూలు/ హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు. ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్ -
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై TS హైకోర్టులో విచారణ
హైదరాబాద్: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ ముందు ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. హంతకులకు, వివేకాకు వ్యక్తిగత విభేదాలున్నాయి వివేకా హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇరికించేలా కుట్ర జరుగుతోందని ఆయన తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న A1 గంగిరెడ్డికి వివేకాతో భూవివాదాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అలాగే నిందితుల్లో మరో ఇద్దరు సునీల్ యాదవ్, ఉమాశంకర్ లతో వివేకాకు విభేదాలు తలెత్తాయని, వజ్రాల వ్యాపారం చేస్తామంటూ వాళ్లిద్దరూ వివేకాను మోసగించడంతో సంబంధాలు చెడిపోయాయని తెలిపారు. అలాగే తమ కుటుంబ మహిళల విషయంలోనూ వివేకానందరెడ్డి తలదూర్చడంతో వారిద్దరికి వివేకాపై కోపం ఉందని తెలిపారు. ఇప్పటివరకు నిందితుడని ఎక్కడా చెప్పలేదు వివేకా హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని సిబిఐ ఇప్పటివరకు ఎక్కడా నిందితుడని చెప్పలేదని లాయర్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. అవినాష్ రెడ్డి గుండెపోటు అన్నారని చెబుతున్నారు, కానీ అవినాష్ రెడ్డి డాక్టరో, పోలీసు అధికారో కాదు కదా. CBI వేసిన రెండు ఛార్జ్ షీట్లలో అవినాష్ రెడ్డిని నిందితుడని పేర్కొనలేదు. రెండు ఛార్జ్ షీట్లు వేసేవరకు కనీసం విచారణ కూడా జరపలేదు. అనుబంధ ఛార్జ్ షీట్ వేసిన ఏడాది తర్వాత 160 కింద నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగానే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. విచారణకు పిలిచిన ఏడు సార్లు హాజరయ్యారు. విచారణకు సహకరించడం అంటే CBI వాళ్లు రాసిచ్చింది చెప్పడమా? అసలు ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోలను హైకోర్టు ముందుంచాలని ఉమా మహేశ్వరరావు కోరారు. తల్లి అస్వస్థత వల్లే విచారణకు రాలేకపోయారు అవినాష్ రెడ్డి విచారణ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లి బాగోగులు చూసుకునేందుకు అవినాష్ హుటాహుటిన వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా CBI అధికారులకు సమాచారం అందించారు. చికిత్స కోసం కర్నూలు తరలించి బాగయ్యేవరకు అక్కడే ఉన్నారు. మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని AIG ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ విషయం కూడా ఎప్పటికప్పుడు CBI డైరెక్టర్ కు లేఖ ద్వారా సమాచారం అందించారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు CBI అరెస్ట్ అంటూ ఒత్తిడి తెస్తోంది? అంటూ ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. రాజకీయ కారణాలు.. కుట్రకు అస్త్రాలు తన వద్ద డ్రైవర్ గా ఉన్న దస్తగిరిని తొలగించి వివేకా.. కొత్త డ్రైవర్ గా ప్రసాద్ ను పెట్టుకున్నాడని తెలిపారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలేమీ లేవని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక నేతలు సహకరించకే ఓడిపోయారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. నిందితుడు దస్తగిరి తీసుకున్న రూ.కోటిలో రూ.46.70 లక్షలే రికవరీ అయ్యాయని, మిగతా సొమ్ము ఏమైందో సీబీఐ చెప్పడం లేదని కోర్టుకు విన్నవించారు. కేవలం ఎంపీ టికెట్ కు పోటీ ఉన్నాడంటూ అవినాష్ రెడ్డిని అనుమానించడం సరికాదన్నారు అవినాష్ లాయర్ ఉమా మహేశ్వరరావు. FIR సెక్షన్లలో ఇంత తేడాలెందుకు? సీబీఐ నమోదు చేసిన FIRలో 201 సెక్షన్ లేదని, మొదట లోకల్ పోలీసులు 174 కింద FIR చేశారన్నారు అవినాష్ తరఫు న్యాయవాది. సీబీఐ ఒక కేసు నమోదు చేసే ముందు పాత FIR రిజస్టర్ చేయాలని, కానీ సీబీఐ FIRలో ఎక్కడా 174 సెక్షన్ లేదని కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో IPC 302 మాత్రమే నమోదు చేశారని, 201 సెక్షన్ లేదని కోర్టుకు తెలిపారు అవినాష్ తరపు న్యాయవాది. దస్తగిరి విషయంలో లోపాయికారి ఒప్పందాలెందుకు? హత్య చేసిన దస్తగిరిని సీబీఐ వెనకేసుకొస్తోందని, దస్తగిరి ముందస్తు బెయిల్ ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదని కోర్టుకు తెలిపారు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది. గంగిరెడ్డి ఢీఫాల్ట్ బెయిల్ పై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన సునీత.. A1గా ఉన్న దస్తగిరి బయట తిరుగుతుంటే మాత్రం స్పందించట్లేదని తెలిపారు. ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్ మెంట్ ఎందుకు తీసుకోలేదు? ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్ మెంట్ రికార్డు అంశంపై 15 నిమిషాలకు పైగా జరిగిన వాద ప్రతివాదనలు జరిగాయి. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను విచారించిందని, రంగన్న స్టేట్మెంట్ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని తెలిపారు. రంగన్న తన స్టేట్మెంట్ లో స్పష్టంగా నలుగురి వివరాలు చెప్పాడని, అయినా సీబీఐ మాత్రం నెల రోజుల పాటు దస్తగిరిని కనీసం విచారణకు పిలువలేదని, ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన హైకోర్టు.. సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది. హైకోర్టు ప్రశ్న: వివేకా హత్య సాక్ష్యాలను చెరిపేస్తున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారని చెబుతున్నారు, వారిపై సీబీఐ ఏమైనా చర్యలు తీసుకుందా? సీబీఐ జవాబు : ఇంకా దర్యాప్తు చేస్తున్నాం హైకోర్టు ప్రశ్న: కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారా? : హైకోర్టు సీబీఐ జవాబు : లోకల్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు...మేం చేయలేదు హైకోర్టు : రంగన్న స్టేట్మెంట్ కాపీని కోర్టుకు సమర్పించండి హైకోర్టు ప్రశ్న: మున్నా వద్ద డబ్బు ఎప్పుడు రికవరీ చేశారు?....మున్నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారా? సీబీఐ జవాబు : మున్నా లాకర్ నుంచి రూ.46 లక్షల డబ్బు రికవరీ చేశాం, మున్నా స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు హైకోర్టు ప్రశ్న: దస్తగిరికి ఎప్పుడు బెయిల్ వచ్చింది? అవినాష్ రెడ్డి తరపు లాయర్ : దస్తగిరి స్టేట్మెంట్లను సీబీఐ రికార్డ్ చేస్తూనే ఉంది, నెలన్నర రోజులు దస్తగిరి సీబీఐ కస్టడీలో ఉన్న తర్వాత అప్రూవర్ అంటూ ప్రకటించారు. అప్రూవర్ గా మారిన తర్వాత దస్తగిరికి ముందస్తు బెయిల్ కు సీబీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, దస్తగిరికి బెయిల్ వచ్చిన 4 రోజులకే సీబీఐ ఛార్జ్‌షీట్ వేసింది. హైకోర్టు ప్రశ్న: దస్తగిరి స్టేట్మెంట్ లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అవినాష్ రెడ్డి తరపు లాయర్ : దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్మెంట్ తీసుకుంది. మొదటి స్టేట్మెంట్ లో ఎక్కడా అవినాష్ గురించి చెప్పలేదు. చివరి స్టేట్మెంట్ లో మాత్రం అవినాష్ పేరును చేర్చారు. అది కూడా అవినాష్ మన వెనకాల ఉన్నాడని గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగరి స్టేట్ మెంట్ ఇచ్చినట్టు CBI చెబుతోంది. హైకోర్టు : వివేకా హత్య కేసుకు సంబంధించి ఈరోజు సునీత తరపు లాయర్ వాదనలు వింటాం, రేపు సిబిఐ వాదనలు వింటాం సునీత తరపు లాయర్ : అవినాష్ న్యాయవాది కి ఎంత సమయం ఇచ్చారో మాకు అంతే సమయం ఇవ్వాలి (మధ్యలో కలుగజేసుకున్న సునీతా రెడ్డి తరపు లాయర్ రవి చంద్ పై హైకోర్టు బెంచ్ అసహనం) హైకోర్టు : ఎవరి లిమిట్స్ లో వారుండాలి సునీతా రెడ్డి తరపు లాయర్ రవి చంద్ వాదనలకు అనుమతిచ్చింది హైకోర్టు. CBI వాదనలు శనివారం వింటామని తెలిపింది. సునీత తరపు లాయర్ రవి చంద్ : అవినాష్ రెడ్డి నోటీసులు ఇచినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతున్నారు, మొదట పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనన్నారు. రెండో నోటీసుకు హైకోర్టులో పిటిషన్ వేశారు, ఇప్పుడు మిగతా నిందితులను అరెస్టు చేసినప్పుడు తననెందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తల్లి అనారోగ్యం అంటున్నారు. విశ్వ భారతి హాస్పిటల్ లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండ హాస్పిటల్ ముందు అవినాష్ అనుచరులు అడ్డుకున్నారు. సునీత తరపు లాయర్ వాదనలు ముగియడంతో విచారణను ముగించారు. శనివారం CBI తరపు వాదనలు విననుంది హైకోర్టు. -
అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. అవినాష్ తరపున సీనియర్ కౌన్సిల్ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. రేపు ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాదనలను రేపు విననుంది. వైఎస్ అవినాష్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక, అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అవినాష్ పిటిషన్‌పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కూడా చదవండి: అవినాష్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా! -
వివేకా హత్య కేసు: వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, కర్నూల్: వైఎస్ వివేకా హత్య కేసు విషయమై వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను చంపిన వారు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారని అన్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వైఎస్ విమలమ్మ బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం, విమలమ్మ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఇంకా లిక్విడ్స్‌పైనే ఉన్నారని అన్నారు. ఈ క్రమంలోనే వివేకాను హత్య చేసిన వాళ్లు బయట తిరుగుతుంటే తప్పు చేయని అవినాష్ కుటుంబం ఎంతో బాధపడుతోంది. ఏ తప్పు చేయని అవినాష్‌ను టార్గెట్ చేయడం సరికాదు. తప్పు చేయలేదంటున్న వాళ్లు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. వివేకా హత్యలో మా ఫ్యామిలీ వాళ్లు లేరని మొదట చెప్పిన వైఎస్ సునీత ఇప్పుడు ఎందుకు మాట మార్చిందో తెలియదు. సునీత వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. అసత్య ఆరోపణల వల్ల అవినాష్ తల్లి తల్లడిల్లిపోతోంది. అవినాష్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అవినాష్‌ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. న్యాయం జరుగుతుందున్న నమ్మకంతో అవినాష్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అనారోగ్యంపై విష కథనాలా? -
అవినాశ్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిలుపై నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులా అని తెలంగాణ హైకోర్టుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఉత్తర్వులు జారీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. అవినాశ్ పిటిషన్‌పై ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని ఆదేశించింది. గతంలో మరో బెంచ్ విచారించినప్పటికీ వెకేషన్ బెంచ్ విచారణకు అడ్డంకి కాదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు (జూన్ 5) వచ్చే వరకు సీబీఐ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని లేదా తన పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలివ్వాలంటూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు విచారించలేదా అని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. హైకోర్టు రెండుసార్లు విచారించిందని, ఉత్తర్వులు ఇవ్వలేదని, జూన్ 5కు వాయిదా వేసిందని, మే 15న సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయని అవినాశ్ తరపున సీనియర్ న్యాయవాది వి.గిరి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. ‘హైకోర్టులో విచారణ ఉండగా సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం’ అని అభిప్రాయపడిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు హాజరు కాలేదు కదా అని అనగా.. ఏడుసార్లు పిటిషనర్ హాజరయ్యారని గిరి తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలో రావాలని నోటీసులు ఇవ్వడంతో మూడు రోజులు సమయం కోరామన్నారు. సీబీఐ తరపున ఎవరైనా హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఎవరూ హాజరు కాలేదని వైఎస్ వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది లూత్రా తెలిపారు. హైకోర్టులో ఏప్రిల్ 27న ఇద్దరి పిటిషన్లూ విచారణకు వచ్చాయని, సీజే వద్దకు వెళ్లినా ఎలాంటి ఆర్డర్ రాలేదని, జూన్ 5న మేటర్ జాబితా అయిందని లూత్రా వివరించారు. జస్టిస్ నరసింహ జోక్యం చేసుకొని.. ఏమైనా అరెస్టు భయం ఉందా అని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని, ఇప్పటికే అవినాశ్ తండ్రి అరెస్టయ్యారని, తల్లి ఆసుపత్రిలో ఉన్నారని గిరి చెప్పారు. ఈ సమయంలో లూత్రా జోక్యం చేసుకోవడంతో గిరి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గిరిని ధర్మాసనం మందలించడంతో ఆయన ధర్మాసనానికి క్షమాపణలు తెలిపారు. బెయిలు కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని ధర్మాసనం లూత్రానుద్దేశించి వ్యాఖ్యానించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ గురించి ఆరా తీసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు వెకేషన్ బెంచ్ వినాలని సూచిస్తామని తెలిపింది. హైకోర్టుకు వెళ్లాలని ఇరువర్గాలకు తెలిపింది. అవినాశ్ వద్దకు వెళ్లాలని సీబీఐ ప్రయత్నించగా వందలాది మంది అనుచరులు అడ్డుకున్నారని లూత్రా అనగా.. అవన్నీ సీబీఐ న్యాయవాది చెబుతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం జస్టిస్ నరసింహ ఉత్తర్వులు వెలువరించారు. Justice Narasimha: He has the right to... Mr. Luthra you can take all these objections when the anticipatory bail is taken up by vacation bench. — Live Law (@LiveLawIndia) May 23, 2023 Bench: ...We are inclined to accept the prayer as the anticipatory bail taken up for hearing pursuant to our order was heard, but no order was passed...We direct the Criminal LP...will be placed before next vacation bench on 25.05.2023... — Live Law (@LiveLawIndia) May 23, 2023 ఇది కూడా చదవండి: టీడీపీ మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా.. విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా? -
ఎల్లో మీడియా ఓవరాక్షన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారంటూ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎల్లో మీడియా ఓవరాక్షన్ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తల్లి శ్రీలక్ష్మి బాగోగులు చూసుకుంటున్న అవినాశ్ పట్ల కనీస మానవత్వాన్ని కూడా మరిచి ఎల్లో మీడియా అమానుష ధోరణిని బయటపెట్టుకుంది. సీబీఐ అధికారులు సోమవారం కర్నూలుకు రావడంతో అదే అదనుగా రెచ్చిపోయింది. అవినాశ్‌ను ఎలాగైనా అరెస్టు చేయించాలన్న విపరీత ధోరణి, కర్నూలు నగరంలో ఉద్రిక్తతలు సృష్టించాలన్న వ్యూహంతో క్షణక్షణం అసత్య ప్రచారంతో హోరెత్తించింది. గంట గంటకు ఎల్లో మీడియా పిచ్చి ముదిరి, మధ్యాహ్నానికి పీక్స్‌కు చేరుకొంది. స్థానిక పోలీసులు సహకరించడంలేదని, మధ్యాహ్నానికి కర్నూలుకు కేంద్ర బలగాలు వస్తున్నాయని, ఆ వెంటనే సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టు చేస్తారంటూ తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎల్లో మీడియా విపరీత ధోరణిని రాష్ట్రవ్యాప్తంగా పలువురు తప్పుపట్టారు. తల్లి ఆరోగ్యం బాగోలేక బాధలో ఉన్న వ్యక్తిపట్ల అమానవీయంగా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, సభ్య సమాజం ఖండించాయి. ఒక ఎంపీకి ఉండే హక్కులు, ఆయన ప్రైవసీని భంగపరిచే విధంగా పచ్చ పైత్యాన్ని వెళ్లగక్కుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలో భాగంగానే వైఎస్ అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా ఎల్లోమీడియా ఈ దుర్నీతికి పాల్పడుతోందని స్పష్టమవుతోంది. అందులో భాగంగానే అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబడుతున్నారని, ఎంపీ తల్లికి అందిస్తున్న చికిత్సపై వైద్యులు సమాచారం అందిస్తున్నా, అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినాశ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావల్సి ఉంది. అయితే, ఆయన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఈనెల 20వ తేదీ నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తోంది. అవినాశ్ దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 27 తర్వాత హాజరవుతానని అవినాశ్ సీబీఐ అధికారులకు లేఖ పంపారు. అయినప్పటికీ, సీబీఐ అధికారులు సోమవారం ఉదయం కర్నూలు వచ్చారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. దీనినే అవకాశంగా తీసుకున్న ఎల్లో మీడి యా వెంటనే తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ప్రారంభించింది. అవినాశ్‌ను అరెస్టు చేయడానికే సీబీఐ అధికారులు వచ్చారంటూ అసత్య ప్రచారం మొదలెట్టింది. వారు పోలీసు అధికారులను కలిసినట్లు, అవినాశ్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారంటూ స్క్రోలింగ్‌లు, చర్చలు ప్రారంభించింది. అవినాశ్‌ను అరెస్టు చేయకపోవడంతో నిరాశ చెందిన ఈ మీడియా.. కొత్త వ్యూహా న్ని రచించింది. సీబీఐ అధికారులు పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారని, ఎప్పుడైనా అరెస్టు జరగవచ్చని మరో ప్రచారం మొదలెట్టింది. ముఖ్యంగా టీవీ–5, ఏబీఎన్ తప్పుడు కథనాలు, చర్చలతో హోరెత్తించాయి. విశ్వభారతి హాస్పిటల్ వద్ద పోలీసు బందోబస్తు సీబీఐని కూడా ప్రభావితం చేస్తారా? సీబీఐ బృందం కర్నూలుకు రాగానే ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలైంది. సీబీఐ అధికారులు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. నేరుగా స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి అక్కడే బస చేశారు. అయినా, పచ్చ మీడియా సీబీఐ వెంటనే అవినాశ్‌ను అరెస్టు చేసేస్తోందంటూ ప్రచారం మొదలెట్టింది. టీవీ చర్చల్లో తమకు అను కూలురను కూర్చోబెట్టి, అధికారులను ప్రభావితం చేసేలా చర్చలు సాగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మీడియా ట్రయల్ పేరిట వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని చూసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉద యం నుంచే కర్నూలుకు తరలివచ్చారు. డిప్యుటీ సీఎం అంజాద్బాష,వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, శ్రీదేవి, ఆర్థర్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఉదయాన్నే ఆస్పత్రికి చేరుకున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కడప మేయర్ సురేశ్‌బాబు, శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. కర్నూలుతోపాటు పులివెందుల, కడప, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆస్పత్రి పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో మరిన్ని బలగాలు సోమవారం రాత్రికి కర్నూలుకు చేరుకున్నాయి. ఆస్పత్రి ముందు కార్యకర్తల నిరసన ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రి ముందు బైఠాయించారు. ‘తండ్రిని అకారణంగా జైలుకు పంపారు. తల్లి అనారోగ్యంతో ఉంటే బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌ను వెంటాడి, వేధించడం ఏంటని’ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబాటు వందలాది రోగులు, వారి సహాయకులు ఉండే ఆస్పత్రిలోకి మీడియా పదే పదే జొరబడటంపై సీనియర్ విలేకరులే మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబుకు ఏదో మేలు చేయాలన్న తపనతోనే ఎల్లో మీడియా పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో ఆస్పత్రి పరిసరాల్లో ఆదివారం అర్ధరాత్రి, ఎల్లో మీడియా హంగామా చేసింది. రాత్రి 11గంటల తర్వాత ఎల్లో మీడియా ప్రతినిధి ఒకరు తాను పనిచేస్తున్న సంస్థ పేరు కాకుండా మరో పేరు చెప్పి ఆస్పత్రిలోకి వెళ్లారు. శ్రీలక్ష్మి ఉన్న ఐసీయూ సమీపంలో ఓ కానిస్టేబుల్ అతన్ని నిలువరించారు. తప్పుడు పేరు చెప్పి రావాల్సిన అవసరం ఏముందని అక్కడున్న వారు కూడా గట్టిగా నిలదీశారు. దీంతో మీడియా ప్రతినిధి ఆస్పత్రి గేటు వద్దకు వచ్చి అవినాశ్ అనుచరులపై దుందుడుకుగా వ్యవహరించారు. ఇదంతా మిగతా ఎల్లో మీడియా ప్రతినిధులు వీడియో తీయబోయారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీలక్ష్మిని పరామర్శించిన వైఎస్ విజయమ్మ వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ సోమవారం సాయంత్రం విశ్వభారతి ఆస్పత్రికి వచ్చి ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మి ని పరామర్శించారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్‌ను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అంతా మంచే జరుగుతుందని కాంక్షించారు. ఆందోళనకరంగానే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై విశ్వభారతి ఆస్పత్రి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆమెకు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారేక్షన్ (గుండె పోటు) ఉందని పేర్కొంది. యాంజియోగ్రామ్ చేశామని, రెండు రక్తనాళాల్లో బ్లాక్‌లు గుర్తించామన్నా రు. క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆమెకు రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉండటంతో అయానోట్రోపిక్ సపోర్ట్‌తో ఉన్నారని తెలిపారు. ఆది, సోమవారాల్లో ఆమె వాంతులు చేసుకున్నారని, అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరికొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడించారు. -
ఇదేం తీరు.. ఇదేం హింస? అవినాష్‌రెడ్డిపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విషయంలో పచ్చమీడియా పడుతున్న ఆత్రుత, ఆరాటం తీవ్ర విమర్శల పాలవుతోంది. జర్నలిజం ముసుగులో వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న తీరు పరిధులు దాటుతోంది. అవినాష్‌రెడ్డి లోక్‌సభ సభ్యుడు. రెండు సార్లు కడప లోక్‌సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. 2014లో లక్షా 90వేల మెజార్టీ వస్తే, 2019లో 3లక్షల 80వేల మెజార్టీ వచ్చింది. అవినాష్‌రెడ్డి.. పూర్తిగా ప్రజా జీవితం గడుపుతున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయనకు సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయి. ఇప్పటివరకు నోటీసులు ఇచ్చిన ప్రతీసారి ఆయన సీబీఐ ముందు దర్యాప్తుకు హాజరవుతున్నారు. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా తనకున్న ఆప్షన్లను వినియోగించుకుంటున్నారు. అది ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. తనకు న్యాయం కావాలంటూ ఏ వ్యక్తి అయినా ఏ కోర్టునయినా ఆశ్రయించవచ్చు. తన వాదన వినిపించవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 7 సార్లు దర్యాప్తుకు హాజరైన అవినాష్.. తాజాగా తన తల్లి అస్వస్థత కారణంగా హైదరాబాద్ నుంచి తిరిగి కడపకు, అక్కడినుంచి కర్నూలుకు వచ్చారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా సీబీఐకి విన్నవించారు. తల్లికి గుండెపోటు వచ్చిందని, ఆస్పత్రిలో ICU ట్రీట్మెంట్ జరుగుతోందని, 7 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. చదవండి: ఆసుపత్రిలో చేరటంపైనా రోగిష్టి రాతలేనా ? ఇక్కడ బయటికొచ్చిన కీలకమైన అంశం ఏంటంటే, ఎల్లోమీడియా తీరు. సీబీఐ వాళ్లు ఏ చర్య తీసుకుంటారా అన్నది పక్కన పెడితే.. ఇంకా అరెస్ట్ చేయలేదంటూ పచ్చమీడియా తెగ ఆందోళన చెందుతోంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకెందుకు నాన్చుతున్నారు, అసలు అరెస్ట్ చేస్తారా? చేయరా? ఇవీ ఎల్లోమీడియాలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న చర్చలు. ఆపరేషన్ అవినాష్ అంటూ ఇష్టానుసారంగా మీడియా ట్రయల్స్ చేస్తోన్న ఎల్లోమీడియాకు, కనీస ఇంగీత జ్ఞానం లేకుండా విశ్లేషణలు ఇస్తోన్న ఛానల్ పెద్దలు, వారి వెనకే తనా అంటే తందానా అన్నట్టుగా పచ్చపార్టీ నేతలు.. వీరి తాపత్రయం చూస్తేంటే.. సిబిఐలోకి పరకాయ ప్రవేశం చేసి తామే అరెస్ట్ చేయాలన్నట్టుగా ఉంది. వృద్దురాలు అయిన అవినాష్ తల్లి గుండె నొప్పితో అస్పత్రిలో జాయిన్ అయితే తప్పేంటి? కొడుకు ఆసుపత్రిలో ఉండి చూసుకోవడం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. చదవండి: అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి ఎల్లో మీడియాకు పది ప్రశ్నలు 1. అవినాష్ రెడ్డి విషయంలో అంత అత్యుత్సాహం ఎందుకు? 2. వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తోంది సీబీఐనా? ఎల్లో మీడియానా? 3. సీబీఐ దర్యాప్తులో చర్చకు వచ్చే వేర్వేరు అంశాలకు తమ పైత్యాన్ని ఎల్లో మీడియా ఎందుకు కలుపుతోంది? 4. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో కూడా ఎల్లో మీడియానే వార్తల రూపంలో ఎలా ఇస్తోంది? 5. సీబీఐని ప్రభావితం చేయాలన్న తాపత్రయం ఎందుకు? 6. ఒక ఎంపీకి కనీస ప్రైవసీ ఉండదా? ఆయన వెంట ఎందుకు పడుతున్నట్టు? 7. ఆయన తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోకి ఎందుకు చొరబడుతున్నట్టు? 8. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా బయట ఇష్టానుసారంగా వార్తలు ఎందుకు రాస్తున్నారు? 9. మీడియా ట్రయల్ పేరిట ఎంతకైనా తెగిస్తారా? 10. మీ ఉద్దేశ్యాలను దర్యాప్తు సంస్థలకు ఎలా అంటగడతారు? కొన్ని ఛానళ్లు దురుద్దేశపూర్వకంగా అవినాష్‌ను లక్ష్యంగా చేసుకుని వార్తలు ప్రసారం చేస్తున్నాయి. చంద్రబాబుకు స్టే వచ్చినప్పుడు ఏమయ్యాయి ఈ వార్తలు? విచారణ తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించినప్పుడు ఎందుకు చేయలేదు మీడియా దర్యాప్తు? -దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎల్లో మీడియాను ప్రజలంతా ఛీ కొడుతున్నారు, జర్నలిజం విలువలకు ఎల్లో మీడియా పాతరేస్తుంది, అలజడి సృష్టించడానికే ఎల్లో మీడియా అభూత కల్పన సృష్టిస్తోంది, అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి, తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అవినాష్ దగ్గర ఉండాల్సి ఉంది, కొన్ని మీడియా సంస్థలు దిగజారి వ్యవహరిస్తున్నాయి. - బీవై రామయ్య, కర్నూలు మేయర్ తల్లి ఆరోగ్యం బాగవగానే అవినాష్‌రెడ్డి సహకరిస్తారు, సీబీఐకి విజ్ఞప్తి చేస్తున్నాం. -ఎస్వీ మోహన్‌రెడ్డి -
తల్లికి హార్ట్ సర్జరీ.. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐకి తెలిపారు. వివరాల ప్రకారం.. తన తల్లి అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల కారణంగా సీబీఐని వారం రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. ఆమెకు హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరముంటుందని డాక్టర్లు సూచించారు. ఈ కారణంగా సర్జరీ సమయంలో తాను విచారణ హాజరుకాలేనని అవినాష్ రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం మాకు మాటల్లేని ఆనందం: పేర్ని నాని -
తండ్రి హంతకులకు అండదండలా ?
-
తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తీరు మరోసారి వివాదాస్పదమైంది. తండ్రిని హత్యచేసిన వారికి శిక్షలు పడేందుకు పోరాడుతున్నానని చెబుతున్న ఆమె వ్యవహారశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం అనేకానేక సందేహాలు లేవనెత్తుతోంది. వివేకాను హత్యచేశానని స్వయంగా ఒప్పుకున్న దస్తగిరికి ఆమె పూర్తి అండదండలు అందిస్తుండటం తెలిసిందే. మరోవైపు.. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో కలిసేందుకు సునీత శుక్రవారం ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దస్తగిరి బెయిల్ వ్యవహారంలో సునీత వ్యవహారశైలి.. అనంతరం ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె యత్నించడానికి సంబంధం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. తన తండ్రి హత్య కేసులో ప్రధాన నిందితులను ప్రభావితం చేయడం ద్వారా ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఆమె యత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. అసలు వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఆయన హత్యకు దారితీసి ఉండొచ్చన్న బలమైన ఆరోపణలకు సునీత ప్రస్తుత వ్యవహారశైలి బలం చేకూరుస్తోంది. హంతకుడు దస్తగిరికి సునీత అండదండలు.. సాధారణంగా తండ్రిని హత్యచేసిన వారిపై ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది. కానీ, వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న దస్తగిరిపై ఆయన కుమార్తె సునీత అంతులేని సానుకూలత ప్రదర్శిస్తున్నారు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని ఆమె ఏమాత్రం వ్యతిరేకించలేదు. అనంతరం.. బెయిల్ కోసం దస్తగిరి పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. అంతేకాదు.. సునీత కూడా అతని బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించలేదు. మరోవైపు.. అసలు హత్యచేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని వివేకా పీఏ కృష్ణారెడ్డి న్యాయస్థానంలో సవాల్ చేశారు. అతనికి ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కూడా కోర్టును కోరారు. కానీ, సునీత వెంటనే ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం విస్మయపరిచింది. అలాగే, దస్తగిరి బెయిల్‌ను రద్దుచేయాల్సిన అవసరంలేదని ఆమె న్యాయస్థానికి తెలపడం గమనార్హం. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డికి ఎలాంటి అర్హతలేదని.. బాధితురాలిగా తనకే అది ఉందని ఆమె వాదించారు. దస్తగిరి బెయిల్‌పై బయట ఉండటంపట్ల తనకేమాత్రం అభ్యంతరంలేదని చెప్పుకొచ్చారు. అసలు తన తండ్రిని హత్యచేసిన వ్యక్తి జైలులో ఉండాలని కోరుకోవాల్సిన సునీత.. అతను బయట ఉండాలని ఆశిస్తుండటం వెనుక ఏదో మతలబు ఉందన్నది స్పష్టమవుతోంది. దస్తగిరి వాంగ్మూలాన్ని బలపర్చాలనే.. నిజానికి.. దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలతో ఎర్ర గంగిరెడ్డి విభేదించారు. సీబీఐ నమోదు చేసిన దస్తగిరి అప్రూవర్ వాంగ్మూలంలో చెప్పినవన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. దాంతో దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలం అంతా కట్టుకథేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో.. ఎర్ర గంగిరెడ్డిని కలిసి దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను బలపరచాలని ఒత్తిడి చేయడమే సునీత ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకోసం ఎర్ర గంగిరెడ్డిని ప్రలోభాలకు గురిచేయడం.. ఆయన బెయిల్‌కు సీబీఐ సహకరించేట్లుగా చేస్తానని హామీ ఇవ్వడం ఆమె ప్రణాళికగా ఉంది. వివేకా హత్య అనంతరం అక్కడ ఆధారాలను ధ్వంసం చేయాలని ఎర్ర గంగిరెడ్డిని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. ఇదే అంశం సునీత, ఆమె భర్తకు ప్రతికూలంగా మారింది. ఈ విషయంలో మాట మార్చాలని.. ఆధారాల ధ్వంసంతో తన భర్తకు సంబంధంలేదని ఎర్ర గంగిరెడ్డితో చెప్పించాలన్నది సునీత ఉద్దేశం. తాను చెప్పినట్లు చేస్తే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చేందుకు యత్నించినట్లు తెలిసింది. ఎర్ర గంగిరెడ్డిని కలిసే ప్రయత్నం ఎందుకో!? ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జైల్లో కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు విస్మయపరుస్తోంది. గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె జైలు అధికారులను అనుమతి కోరగా వారు నిరాకరించారు. దాంతో ఆమె తన న్యాయవాది ద్వారా కొన్ని పత్రాలు ఆయన వద్దకు పంపి సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. అసలు తన తండ్రి హత్యకేసులో ఏ–1గా ఉన్న గంగిరెడ్డిని సునీత కలిసేందుకు యతి్నంచడం సందేహాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దుచేయడంతో ఎర్ర గంగిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. తాను చెప్పినట్లుగా చెబితే దస్తగిరికి సహకరించినట్లుగానే ఎర్ర గంగిరెడ్డికి సహకరిస్తామని ఆయనకు చెప్పేందుకే సునీత ప్రయత్నించినట్లు సమాచారం. వేళ్లన్నీ సునీత, ఆమె భర్తవైపే.. ఈ మొత్తం పరిణామాలతో వివేకా హత్యకేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు సునీత ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమైంది. ఆమె ఎందుకు హంతకులకు కొమ్ముకాస్తూ మరీ హత్య కేసు దర్యాప్తు దారి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయన్నది బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో.. వివేకా హత్యకు గురికావడంతో ఆయన సొంత కుటుంబ సభ్యులపై సందేహాలు వ్యక్తమయ్యాయి. చదవండి: ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు వివేకా హత్య తరువాత ఆయన రాసిన లేఖ, సెల్ఫోన్లను పోలీసులకు వెంటనే ఇవ్వకుండా గోప్యంగా ఉంచమని పీఏ కృష్ణారెడ్డితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఇదే అంశంపై సీబీఐ ఇటీవల వారిని విచారించింది కూడా. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే వివేకా హత్య స్థలంలో ఆధారాల ధ్వంసం చేశారన్నది వెల్లడైంది కూడా. వివేకా రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ నేత బీటెక్ రవి, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావగారు శివప్రకాశ్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారన్నది కూడా బహిరంగ రహస్యంగా మారింది. వాస్తవాలు వెల్లడి కాకూడదనే.. ఈ నేపథ్యంలో.. వివేకా హత్య కేసులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డిల పాత్ర ఉందనే వాదన బలపడుతోంది. అంటే ఈ కేసులో వారిని నిందితులుగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తాము బాధితులమని.. తమకే అర్హత ఉందని చెప్పేందుకు వారు నైతిక హక్కు కోల్పోయారు. మరోవైపు.. ఎర్ర గంగిరెడ్డి సీబీఐ ముందు నిజాలు వెల్లడిస్తే తమ కుటుంబానికి ఇబ్బందిగా మారుతుందని సునీత ఆందోళన చెందుతున్నారు. అందుకే వాస్తవాలు వెల్లడించకుండా కట్టడి చేసేందుకే ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు సునీత యత్నించినట్లు స్పష్టమవుతోంది. -
వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు వివేకా కూతురు సునీత ప్రయత్నించారు. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లిన సునీత.. గంగిరెడ్డిని కలిసేందుకు యత్నించారు. గంగిరెడ్డిని కలవాలంటూ జైలు అధికారులను ఆమె రిక్వెస్ట్ చేశారు. అయితే అనుమతించలేమని జైలు అధికారులు స్పష్టం చేయడంతో చివరకు సునీత లాయర్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే కొన్ని పేపర్లపై గంగిరెడ్డితో సునీత లాయర్ సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. ఒకవైపు వివేకా హత్య కేసులో దస్తగిరి బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్లో సునీత జోక్యం చేసుకున్నారు. కృష్ణారెడ్డి పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దంటూ సునీత కోర్టును కోరారు. కృష్ణార్డెడ్డి ఈ కేసులో బాధితుడి కాదని, అందుచేత అతని పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని సునీత వాదన. ఈ నేపథ్యంలో గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి.. ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవినాశ్ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. మరో వైపు ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. చదవండి: అవినాశ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. మానవత్వం లేకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం -
అవినాష్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, గుంటూరు: వివేకా కేసులో తమ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, తన తల్లికి సీరియస్‌గా ఉంది గనుకే ఇవాళ విచారణకు హాజరు కాలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. అవినాష్‌రెడ్డి గైర్హాజరు విషయంలో కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో కథనాలు ప్రసారం చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారాయన. శుక్రవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్ హైదరాబాద్‌కు వచ్చారు. తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారు. అయినా ఏదో జరిగిపోతోందంటూ కొందరు హడావిడితో కూడిన ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ఫ్రచారం చేస్తున్నాయి.. వార్తలు ఇస్తున్నాయి. గతంలో ఆయన సీబీఐ పిలిచిన ప్రతీసారి హాజరయ్యారు. ఆయన సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. అవినాష్‌రెడ్డి ఎక్కడికీ పోవడం లేదు.. తప్పించుకోవాల్సిన అవసరం అవినాష్‌రెడ్డికి లేదు అని సజ్జల స్పష్టం చేశారు. అవినాష్‌పై బుదర చల్లాలనే కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, వైఎస్ సునీత, పచ్చమీడియా.. అంతా కలిసి అవినాష్‌పై అసత్య ప్రచారం చేయిస్తున్నారు అని సజ్జల ఆరోపించారు. అసలు హంతకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్ విచారణకు హాజరయ్యారు. తల్లికి అనారోగ్యం అని క్రియేట్ చేసుకుని.. విచారణకు ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. కానీ, నిందితుడు, గూగుల్ టేకౌట్ అని రకరకాల పేర్లతో సీబీఐ హడావిడి చేస్తోంది. అయిదు సార్లు విచారణకు హాజరైన అవినాష్ ఇప్పుడెందుకు వెళ్లడు?. ఒకవేళ తీవ్రపరిణామాలు ఎదురైనా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లికి బాగలేదని సీబీఐకి చెప్పి మరీ వెళ్లాడు. సీబీఐ ఎదుటకు రేపు అయినా వెళ్లాల్సిందేగా?. అసలు హత్య చేశానన్నవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. నేరుగా సెటిల్మెంట్ చేస్తున్నాడు. కానీ, ఒక ఎంపీని మాత్రం వెంటాడుతున్నారు అని సజ్జల ఆక్షేపించారు. ఆ ఫ్యామిలీ అలాంటిది కాదు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని కూడా వివేకా కేసులో సీబీఐ పిలవగానే విచారణకు వెళ్లారు. అన్యాయం ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒక ఎంపీపై బురద జల్లడం సబబు కాదు. వివేకా హత్యలో నిజంగా అవినాష్ పాత్ర ఉంటే.. అప్పట్లో చంద్రబాబు ఊరుకునేవారా?. వాస్తవాలు బయటకు రావాలనే సీబీఐ విచారణ చేస్తున్నా మేం అభ్యంతరం పెట్టలేదు. కానీ, వ్యక్తిత్వ హననం చేయడం కరెక్ట్ కాదు అని సజ్జల అన్నారు. ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డి తల్లికి సీరియస్ -
వివేకా హత్య కేసులో అంశాలను వక్రీకరించడం సరికాదు
-
దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట..
నేను సీబీఐ ఎస్పీకి చెప్పని వాటిని కూడా చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించడం దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని వైఎస్ జగన్ నాతో అన్నారని నేను సీబీఐకి వెల్లడించినట్లు వెలువడ్డ కథనం పచ్చి అబద్ధం. – అజేయ కల్లం సాక్షి, అమరావతి: మేనిఫెస్టో కమిటీ సమావేశానికి, హత్య కేసుకు సంబంధం ముడిపెడుతూ కథనాలను ప్రచురించటాన్ని బట్టి ఆంధ్రజ్యోతి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం అవుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు వైఎస్ జగన్ తనకు చెప్పారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త పచ్చి అబద్ధమని అజేయ కల్లం ఖండించారు. అంతకుముందే మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందని, అందులో పాల్గొన్న వారిని విచారించాలంటూ గతంలో ఓ కథనం వెలువరించిందని, అందులో భాగంగానే మళ్లీ పచ్చి అబద్ధాలను ప్రచురించిందన్నారు. ఏదో ఒకవిధంగా ముఖ్యమంత్రి జగన్ పేరును లాగాలనే ప్రయత్నం మినహా ఆంధ్రజ్యోతి కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాలంటూ తప్పుడు సమాచారంతో ఆ పత్రిక విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. సీబీఐ తనను విచారించిందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. కొద్దిరోజుల క్రితం సీబీఐ ఎస్పీ తన ఇంటికి వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడి సమాచారం తీసుకున్నారని, ఆ సమయంలో గుండెపోటు అంశం చర్చకే రాలేదని, దాని గురించి అడగలేదని అజేయ కల్లం వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన రోజు యాధృచ్ఛికంగా పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. తమకు కాలేజీలో పాఠాలు బోధించిన గురువు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మేనిఫెస్టో రూపకల్పనలో సహాయం చేయాలని కోరడంతో సమాశానికి వెళ్లానని అజేయ కల్లం తెలిపారు. సమావేశం జరుగుతుండగా కొంతసేపటికి ‘వివేకానందరెడ్డి గారు నో మోర్..’ అని ఇంగ్లీషులో చెప్పడంతో ఇక లేచి వచ్చేశామన్నారు. అదే విషయాన్ని సీబీఐ ఎస్పీకి చెప్పానన్నారు. ‘మీరు స్వచ్ఛందంగా అంగీకరిస్తే రికార్డు చేసుకుంటామని సీబీఐ ఎస్పీ కోరారు. సెక్షన్ 161 కింద సమాచారాన్ని అడిగారు. అయితే ఆ సమాచారం, రికార్డుకు ఎటువంటి న్యాయపరమైన విలువ ఉండదు. సంతకాలు తీసుకోలేదు’ అని అజేయ కల్లం పేర్కొన్నారు. ‘సాంకేతికంగా ఎటువంటి విలువ ఉండదు. ఎవిడెన్స్‌గా పనికిరాదు. ఆ సెక్షన్ కింద కొన్ని అంశాలు యాడ్ చేసుకోవచ్చు, కొన్ని అంశాలు తొలగించవచ్చు’ అని కల్లం తెలిపారు. గుండెపోటు మాటే చర్చకు రాలేదు.. అసలు గుండె పోటు అనే పదమే సీబీఐ ఎస్పీని కలుసుకున్న సందర్భంగా చర్చకు రాలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో రహస్యంగా ఉండాల్సిన తమ ఇద్దరి సంభాషణ సమాచారం లీకుల పేరుతో ఆంధ్రజ్యోతిలో రావడం అంటే సీబీఐ విశ్వసనీయత కూడా దెబ్బతిన్నట్లేనని పేర్కొన్నారు. ఇది సీబీఐ పేరును దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. సీబీఐ ముందుకొచ్చి ఇలాంటి లీకు వార్తలను నిరోధించడంతో పాటు ఖండించాల్సి ఉందన్నారు. ‘మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఆ పనిమీద దృష్టి పెడతాం కానీ గడియారం చూసుకుంటూ కూర్చోం కదా! ఎవరు ఎప్పుడు బయటకు వెళ్లారో ఎలా తెలుస్తుంది? అయినా ఈ సమావేశాన్ని సీరియస్ మర్డర్ కేసుకు ముడిపెట్టి ఆంధ్రజ్యోతి తనకు కావాల్సినట్లు రాసుకోవడం కంటే అనైతికం మరొకటి ఉండదు..’ అని కల్లాం మండిపడ్డారు. ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది తన దగ్గర నుంచి తీసుకున్న సమాచారం చార్జిషీటు వేసేవరకు రహస్యంగా ఉండాలని, లీకుల పేరుతో తప్పుడు సమాచారం మీడియాలో ప్రచురితమైనందున ఆ వార్తను ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని కల్లాం పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో మీడియాలో సమాంతర దర్యాప్తు జరగకూడదని, ఇన్విస్టిగేషన్ ఏజెన్సీలు మీడియాకు వివరాలు వెల్లడించరాదని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని కల్లాం ప్రస్తావించారు. నిందారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా అందుబాటులో లేని సమాచారాన్ని మీడియాలో లీకుల పేరుతో ప్రచురించకూడదన్నారు. నా భార్యకు కూడా తెలియదు.. ‘దర్యాప్తు అంశాలను ఇష్టానుసారం ప్రచురించేందుకు, మీడియా తమ ఇష్టం అనేందుకు వీల్లేదని సుప్రీం కోర్టు తాజా తీర్పులున్నాయి. కనీస క్రమశిక్షణ, కోడ్ ఆఫ్ కాండక్ట్ మీడియాకు అవసరం. నేను సీబీఐ ఎస్పీకి చెప్పని అంశాలను చెప్పినట్లుగా నా ఫొటోతో పెద్ద శీర్షిక పెట్టి కథనాలు ప్రచురించటాన్ని బట్టి ఆ పత్రిక ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది. ఆ సమయంలో నేను, సీబీఐ ఎస్పీ మాత్రమే ఉన్నాం. మా ఇంటికి సీబీఐ ఎస్పీ వచ్చిన విషయం నా భార్యకు కూడా తెలియదు. ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్త ప్రచురించిన తరువాతే మిగతా వారికి తెలిసింది’ అని కల్లాం తెలిపారు. ‘సెక్షన్ 161 కింద ఇచ్చిన సమాచారానికి ఎటువంటి న్యాయపరమైన విలువ లేదు. అయినా సాక్షిగా కూడా కాదు. తప్పుడు వార్తపై తగిన సమయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని చెప్పారు. సమాంతర విచారణ తగదు.. ఏదైనా క్రిమినల్ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు దానికి సమాంతరంగా విచారణను ప్రభావితం చేసేలా మీడియా కథనాలను రాయకూడదు, చర్చలు పెట్టకూడదు. దర్యాప్తు సమయంలో విచారణాధికారికి సాక్షులు వెల్లడించిన అంశాలను చార్జిషీట్ వేసేవరకు బహిర్గతం చేయకూడదు. విచారణలో వెల్లడైన అంశాలను బహిర్గతం చేస్తూ కథనాలను ప్రచురిస్తే వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లేనని పలు కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులిచ్చాయి. దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్వాగతించింది’ అని పేర్కొంటూ ఈ సందర్భంగా అజేయ కల్లం వాటిని ఉదహరించారు. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! -
లేఖను ఎందుకు దాచారు?
సాక్షి, హైదరాబాద్/పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిలను మంగళవారం ప్రశ్నించారు. వివేకా మరణించే ముందు రాసినట్టుగా చెబుతున్న లేఖ గురించే వారిద్దరి నుంచి ఎక్కువగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. సీబీఐ నోటీసుల మేరకు సునీత, రాజశేఖరరెడ్డి హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాలతోపాటు లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది?, తర్వాత పోలీసులకు అందించడం, వివేకా పీఏ కృష్ణారెడ్డికి హత్య జరిగిన రోజు ఎన్నిసార్లు ఫోన్లు చేశారు? ఆయన నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ అందుకున్నారు? హత్య జరిగిన సమాచారం అందిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు? ఇలా పలు అంశాలపై సునీత, రాజశేఖరరెడ్డిలను సీబీఐ అధికారులు మరోమారు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇద్దరి స్టేట్మెంట్లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. విచారణకు హాజరుకాని అవినాష్ కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని 15వ తేదీన ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాను ముందుగా నిర్ణయించుకున్న పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేనని.. నాలుగు రోజుల గడువు కావాలని లేఖ ద్వారా అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారి డ్రైవర్‌కు నోటీసులు అందజేసి అతడి సంతకం తీసుకున్నారు. అవినా‹Ùరెడ్డి ఈ నెల 19న ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రత్యేక కేటగిరీగా పరిగణించి వసతులు కల్పించండి: భాస్కరరెడ్డి పిటిషన్ జైలులో తనకు ప్రత్యేక కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరుతూ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు (ఏ–7) వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను గత నెలలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తన అనారోగ్యాన్ని, వయసును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ భాస్కరరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు తన ఉత్తర్వులను జూన్ 2కు వాయిదా వేసింది. -
వివేకా లేఖపై సునీతకు సీబీఐ ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేసులో కీలకంగా భావిస్తున్న వివేకా రాసిన లేఖపై ఇవాళ వివేకా కూతురు సునీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. వివేకా కేసులో సునీతారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీతను పిలిపించుకుని లేఖపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. ఆమె కూడా భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆమెను పిలిపించుకుని స్టేట్మెంట్ నమోదు చేసింది సీబీఐ. మరోవైపు వివేకా కేసులో పలువురు సాక్షులను సైతం సీబీఐ ప్రశ్నిస్తోంది. రక్తపు మరకల లేఖ.. ఎందుకు గోప్యంగా ఉంచారు? వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను పక్కా కుట్ర ఒకటి జరిగినట్టు ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి దీని వెనక ఉన్నట్టు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించినట్టు తేలింది. హంతకులు బెదిరించడంతో.. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి.. ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా.. వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే.. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పినట్టు కృష్ణారెడ్డి వెల్లడించారు, అదే విషయాన్ని దర్యాప్తులోనూ చెప్పారు. ఆ తరవాతే నర్రెడ్డి మరో అడుగు ముందుకేసి శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాష్‌రెడ్డికి చెప్పించారు. అవినాష్ కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. అసలు లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ.. వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం కానుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎంపీ అవినాష్‌రెడ్డి సిబీఐ దృష్టికి తీసుకెళ్లారు కూడా. -
ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. వివేకా కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూన్ 05వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అవినాష్‌రెడ్డిని విచారించుకోవచ్చని సీబీఐకి హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఆ బ్రదర్స్ చెప్పినట్టే చేశా.. వివేకా పీఏ సంచలన స్టేట్మెంట్ -
వివేకా లేఖకు నిన్‌హైడ్రేట్ పరీక్ష.. సీబీఐ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో.. సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు అవసరమైన నిన్‌హైడ్రేట్ (Ninhydrin Test) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే.. ఈ పరీక్ష ద్వారా లేఖ పాడైపోయే అవకాశం ఉన్నందున.. పరీక్షకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది దర్యాప్తు సంస్థ. వివేకా హత్య జరిగిన ఘటనాస్థలంలో దొరికిన లేఖను 2021 ఫిబ్రవరి 11వ తేదీన ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్కు పంపింది సీబీఐ. అయితే తీవ్ర ఒత్తిడిలోనే వివేకా ఆ లేఖ రాసినట్లుగా సీఎఫ్ఎస్ఎల్ తేల్చి చెప్పింది. ఇక ఇప్పుడు.. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ను కోరింది సీబీఐ. అయితే.. లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్ చెప్పింది. నిన్‌హైడ్రేట్ పరీక్ష చేస్తే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సీఎఫ్ఎస్ఎల్, సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో.. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ టెస్ట్ నిర్వహణ కోసం కోర్టును ఆశ్రయించించింది సీబీఐ. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అలాగే రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో సీబీఐ పిటిషన్‌పై నిందితుల స్పందన కోరింది సీబీఐ న్యాయస్థానం. ఈ పిటిషన్‌పై జూన్ 2వ తేదీన విచారణ జరపనుంది నాంపల్లి సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన స్టేట్మెంట్ -
నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: కృష్ణ రెడ్డి
-
వివేకా హత్యకేసులో మొదటినుంచీ పచ్చ మీడియా దృష్ట ప్రచారాలు
-
నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందాక ఆయన అల్లుడు.. బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలు చెప్పినట్టే చేశానని వివేకా పీఏ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పెద్దోళ్లు కనుక వారు చెప్పినట్టే చేయాల్సి వచ్చిందన్నారు. ‘వారు చెప్పినట్లు చేయకపోతే నువ్వు కూడా జైలుకు వెళ్తావు’ అని వివేకా కుమార్తె సునీతమ్మ కూడా చెప్పడంతో వారి సూచనల మేరకు నడుచుకున్నానని పునరుద్ఘాటించారు. వివేకా మృతదేహాన్ని చూడగానే తనకొచ్చిన సందేహాలన్నింటినీ వారికి స్పష్టంగా వివరించానని, అయినా వారి మార్గనిర్దేశం మేరకే వ్యవహరించానని ఇటీవల ఆయన ఓ టీవీ చానల్(ఎన్టీవీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి ఘటన అనంతర పరిస్థితిని పూసగచ్చినట్లు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రోజూలాగే ఆ రోజూ వెళ్లాను నేను 30 ఏళ్లకు పైగా వివేకా సార్ వద్ద పని చేస్తున్నాను. ప్రతిరోజు 5.30 గంటలకు సార్ ఇంటికి వెళ్లే అలవాటు. ఆ రోజు కూడా అలాగే వెళ్లాను. ఆయన నిద్ర లేచి ఉంటే హాలులో లైట్ వేస్తారు. వాచ్మెన్ రంగన్న పడుకొని ఉన్నాడు. సార్ ఇంకా లేవలేదని బయటికి వచ్చి, వీధిదీపం కింద ఐదు నిమిషాలు ఆంధ్రజ్యోతి పేపర్ తిరగేశాను. వివేకా సతీమణి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాను. ‘సార్ లేట్‌గా వచ్చి ఉంటాడులే.. కొద్దిసేపు పడుకోని’ అని ఆమె సూచించారు. తిరిగి పేపర్ చదువుతుండగా.. వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు వచ్చారు. సార్ ఇంకా లేవలేదా? అని అడిగారు. ‘రాత్రి లేట్‌గా వచ్చి ఉంటారు.. లేప వద్దని మేడమ్ చెప్పింది’ అని చెప్పాను. కొద్ది సేపటి తర్వాత.. సార్ లేవకపోతే లేపాలి కదా.. మళ్లీ ఎందుకు లేపలేదు.. అని అరుస్తారని వంటమనిషి లక్ష్మిని బెడ్ రూమ్ సైడుకు వెళ్లి పిలవాలని చెప్పాను. లక్ష్మి బెడ్రూము వద్దకు వెళ్లి పిలిచి వచ్చే సమయంలో వాచ్మెన్ రంగన్న లేచి.. బెడ్‌షీట్‌ను సందులో పెట్టి ఉత్తరం వైపు ఉండే గార్డెన్ వైపు వెళ్లిపోయాడు. అంతలోనే వాచ్మెన్ రంగన్న పరుగెత్తుకుంటూ వచ్చి సార్ పడిపోయాడని చెప్పాడు. నేను వంటమనిషి కుమారుడు ప్రకాశ్ నార్త్ సైడ్ వాకిలి గుండా లోపలికి పరుగెత్తాము. లోపలికి వెళ్లి చూస్తే అంతా రక్తమే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్ రూం అంతా రక్తం. భయం వేసింది. ఏసీ, లైట్ ఆన్‌లో ఉంది. సార్ మాత్రం బెడ్‌పై లేడు. బాత్రూములో పడిపోయి ఉన్నాడు. నాడి పట్టుకుని చూశా. తలపై గాయం కనిపిస్తోంది. నాతోపాటు ఉన్న ప్రకాశ్‌తో మన సార్ మనకు లేడని చెప్పా. బయటికి వచ్చి వివేకా సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేశాను. ‘బావ ఇక మనకు లేడు. ఎవరో ఏదో చేశారు. ఏదో జరిగింది. తలపై గాయం కనిపిస్తోంది. ఇల్లంతా రక్తం ఉంది’ అని చెప్పాను. తర్వాత ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డికి కూడా అదే చెప్పాను. తర్వాత కొద్ది సేపటికి వైఎస్ వివేకా మొబైల్ సోఫాలో కనిపించింది. సైలెంట్లో ఉంది. ఏదో ఫోన్ రావడంతో రింగ్ అవుతున్నట్లు గుర్తించి, జేబులో పెట్టుకున్నాను. బెడ్ ముందు ఉన్న వీల్ చైర్ ముందు ఓ పేపరు పడి ఉంది. ప్రకాశ్, నేను దాన్ని ఓపెన్ చేసి చూశాము. అందులో సార్ రాసిన మ్యాటర్ ఉంది. ఆ లెటర్లో అక్షరాలు అంత క్లియర్‌గా లేవు. బాగా పరిశీలిస్తే ‘డ్రైవర్ ప్రసాద్ నిన్న డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు నన్ను కొట్టి చంపాడు. మీరు డ్రైవర్ ప్రసాద్‌ను వదిలి పెట్టవద్దు’ అని రెండుసార్లు రాసి ఉంది. కింద వైఎస్ వివేకా అని ఉంది. లెటర్‌ను ఎవరికీ చూపించొద్దన్నారు ఆ లెటర్ విషయం వెంటనే అల్లుడు రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. ‘ఆ లెటర్‌ను జాగ్రత్తగా దాచి పెట్టు.. ఎవరికీ చూపించవద్దు’ అన్నాడు. నేను పోలీసులతో ప్రాబ్లమ్ అవుతుంది కదా అని అడగాను. ‘అదంతా నేను వచ్చిన తర్వాత మాట్లాడతా. నీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నేను వచ్చాక పోలీసులకు ఇస్తాను. అప్పటి దాకా దాచి పెట్టు’ అని చెప్పాడు. ఈ విషయంగా శివప్రకాశ్‌రెడ్డికి కూడా తెలియజేసి.. నాకు దిక్కుతోచడం లేదని చెప్పాను. తర్వాత కొద్ది సేపటికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వచ్చాడు. నేనే ఆయన్ను లోపలికి పిలుచుకుని వెళ్లాను. అవినాశ్ రెడ్డితోపాటు శివశంకర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి మరి కొంత మంది ఉన్నారు. తర్వాత అవినాశ్‌రెడ్డి సార్ బయటికి వచ్చి లాన్లో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వైఎస్ అవినాష్‌రెడ్డి చిన్నాన్న, పెద్దనాన్న, కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. నేను రంగన్న పిలిచి దబాయిస్తే, రాత్రి దోశలు తిని నిద్రయానని చెప్పాడు. పోలీసులకు చెప్పేద్దామంటే వినలేదు గుండెపోటు విషయం ఎవరు ఎలా చెప్పారో తెలియదు. లెటర్, రక్తాన్ని బట్టి వైఎస్ వివేకాను ఎవరో ఏదో చేశారని నేను భావించాను. కొద్ది సేపటికి సీఐ శంకరయ్య, ఎర్రగంగిరెడ్డి వచ్చారు. ఎర్ర గంగిరెడ్డి రావడంతోటే బ్లడ్ వాంటింగ్ చేసుకున్నాడని చెప్పాడు. బాత్రూములో గోడకు ఆరు, ఏడు అడుగులు రక్తం చిమ్మిందని చెప్పగా.. బేసిన్‌కు తల కొట్టుకుని రక్తం వచ్చి ఉంటుందిలే అన్నాడు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామా అంటే ఏం అవసరం లేదులే అన్నాడు. ఎర్రగంగిరెడ్డి ఇలా చెబుతున్నాడని నేను నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. పక్కన సీఐ ఉన్నాడని మాట్లాడాలని ఫోన్ సీఐకి ఇచ్చాను. వాళ్లిద్దరు మాట్లాడుకున్నారు. రాజశేఖరరెడ్డి స్టేషన్లో కంఫ్లైంట్ రాసివ్వాలని సూచించారు. కొద్దిసేపటికి ఎర్రగంగిరెడ్డి.. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాకు ‘లక్షుమ్మను రమ్మను.. బక్కెట్‌తో నీళ్లు తీసుకుని ఇదంతా క్లీన్ చేయాలి’ అని చెప్పాడు. లక్షుమ్మ సగం క్లీన్ చేసి.. కళ్లు తిరుగుతున్నాయని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత తన వద్ద పనిచేసే పిల్లలు రాజశేఖర్, ట్యాంకర్ బాషాతో ఇనాయితుల్లా క్లీన్ చేయించారు. సార్ డెడ్‌బాడీ బాత్రూము నుంచి తేవడానికి ఎర్రగంగిరెడ్డితో కలిసి నలుగురు వెళ్లారు. తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు బాగా కొట్టారు అవినాష్‌రెడ్డి ఉదయాన్నే వచ్చి వెళ్లాడు.. మళ్లీ రాలేదు. రక్తం శుభ్రం చేసే సమయంలో ఆయన లేరు. నేను సీఐ చెప్పినట్లు కంప్లైంట్ రాసిచ్చి ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి.. నా భార్యను తీసుకొచ్చి పోస్టుమార్టం రూమ్ వద్ద సార్‌ను చూపించాను. తర్వాత సార్ డెడ్ బాడీని ఇంటి వద్దకు తెచ్చారు. అప్పుడు లెటర్‌ను నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చాను. తర్వాత 15 నిమిషాలకు ఆ లెటర్‌ను ఎస్పీకి అందజేశానని, నీకు ఇబ్బంది లేదని రాజశేఖర్‌రెడ్డి చెప్పాడు. సాయంత్రం 4 – 4.30 గంటల ప్రాంతంలో నన్ను పోలీసులు తీసుకు వెళ్లి జేఎన్టీయూ గెస్ట్‌హౌస్‌లో పెట్టారు. అక్కడి నుంచి నాతోపాటు మరికొందరిని వేముల పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కడప డీటీసీకి తీసుకెళ్లి 13 రోజులు పెట్టుకుని అందరినీ కొట్టారు. తర్వాత నాతోపాటు ప్రకాశ్, ఎర్రగంగిరెడ్డిని ముద్దాయిలుగా చూపిస్తూ రిమాండ్‌కు తరలించారు. మూడు నెలలు జైలులోనే ఉన్నాం. మద్యమధ్యలో సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి వచ్చి మాట్లాడిపోయే వారు. మేము బయటికి వచ్చిన కొద్దిరోజుల తర్వాత కేసు సీబీకి బదిలీ చేశారు. తర్వాత సునీత, రాజశేఖరరెడ్డి.. సీబీఐకి సహకరించాలని చెప్పేవారు. అప్పటి నుంచి సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి వచ్చాం. సీబీఐ వాళ్లూ కొడతారనుకోలేదు సీబీఐ వాళ్లు ఢిల్లీకి రావాలని చెప్పారని నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. వెళ్లమని చెప్పి.. టికెట్ ఆయనే తీసిచ్చాడు. వారికి సహకరించాలని సూచించాడు. ఢిల్లీలో వాళ్లు నెల రోజులు పెట్టుకున్నారు. మధ్యలో రాంసింగ్ వచ్చి ‘నేను చెప్పినట్లు చెబుతావా? లేదా? వైఎస్ అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు మిమ్మల్ని మ్యానేజ్ చేశారు. ఆ విషయం మీరు చెప్పడం లేదు. మేము చెప్పినట్లు చెప్పకపోతే జైలుకు పంపుతాం’ అని బెదిరిస్తూ కొట్టేవారు. సీబీఐ అధికారులు ఇలా కొడతారని ఊహించలేదు. నెల తర్వాత నన్ను పంపించేశారు. ఆ తర్వాత నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతలు నన్ను హైదరాబాదుకు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్లాక ‘నువ్వు రాంసింగ్ సార్ ఎలా చెబితే అలా చేయాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతావు, నువ్వు సహకరిస్తే నిన్ను సేవ్ చేస్తాం. ఇదొక్కటే మార్గం’ అని చెప్పారు. మధ్యమద్యలో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి.. అవినాశ్ మ్యానేజ్ చేశాడని చెప్పమన్నారు. నిజం చెబితే కొడతారేంటి? ‘దస్తగిరి, రంగన్నలు మేము చెప్పినట్లు విన్నారు. నువ్వు కూడా చెప్పినట్లు వింటే సేవ్ చేస్తా’ అని రాంసింగ్ తెలిపారు. తెల్లవారగానే నీ ఇద్దరు కుమారులతో కలిసి కడపలోని కేంద్ర కారాగార గెస్ట్‌హౌస్‌కు రావాలని సూచించారు. నేను ఈ విషయం నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగా, వెళ్లాలని సూచించాడు. హైదరాబాదులోని పిల్లలను పిలిచించి ఉదయం 11 గంటలకు వారితో కలిసి వెళ్లాను. మేము చెప్పినట్లుగా సహకరించాలని కోరారు. ఇందుకు నేను మరోమారు అభ్యంతరం చెబుతూ.. నాకు తెలిసిన విషయాలన్నీ చెబుతానని చెప్పాను. దాంతో ఆయన కట్టె తీసుకుని నన్ను కొట్టాడు. నిజం చెబితే కొడతారా? అంటూ మా పిల్లలు అడ్డుతగిలారు. సాయంత్రం వరకు నన్ను అక్కడే పెట్టుకుని బూతులు తిట్టి పంపారు. మళ్లీ పిలిచి నప్పుడు కూడా ఇలాగే మాట్లాడితే నీ కథ ఉంటాదని హెచ్చరించారు. చెప్పినట్లు వినలేదని పెళ్లి ఆపించేశారు అప్పటికి వారం రోజుల్లో నా చిన్న కుమారుడి పెళ్లి. సీబీఐ వాళ్లకు నేను సహకరించలేదని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సునీతకు కోపం వచ్చింది. వారు పెళ్లి కుమార్తె వారికి ఫోన్ చేసి ‘కృష్ణారెడ్డి హత్య కేసులో ఉన్నాడు. వైఎస్ అవినాష్‌రెడ్డికి సహకరించాడు. త్వరలో ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి’ అని ఫోన్ చేసి చెప్పారు. నాకు విషయం తెలిసి నేను నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి వద్దకు వెళ్లగా సరైన స్పందన లేదు. పెళ్లి క్యాన్సిల్ అయితే కానీ అని నేను నిజాన్ని నిర్భయంగా చెప్పాలని భావించాను. ఆ తర్వాత నా కుమారుడు అమెరికా వెళ్లాడు. నేను ప్రాణ రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. అందుకే పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ వేశాను. దాని గురించి ఇప్పటివరకు అతీగతీ లేదు. నా పాస్‌పోర్టు రెన్యూవల్ కాకుండా ఆగిపోయింది. నా ప్రమోషన్ ఆగిపోయింది., నా కుమారుడు పెళ్లి ఆగిపోయింది. నేను వివేకాకు సేవ చేసినందుకు ఇస్తామన్న ఐదు ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇలా అన్ని విధాలా నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సీబీఐ కొత్త బృందం వచ్చింది. వారికి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. పారదర్శకంగా విచారణ జరిగితే అసలు దోషులెవరన్నది తెలుస్తుంది. వివేకాకు హైదరాబాద్, పులివెందుల, కడపల 200 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ ఆస్తులన్నీ దాదాపు కంపెనీ పేరుపైనే ఉండేవి. అలాగైతే జైలుకెళ్లేది నువ్వేనని భర్తకు సునీత హెచ్చరిక అవినాశ్ నన్ను మేనేజ్ చేయడం ఏమిటని అప్పుడే గట్టిగా వ్యతిరేకించాను. అప్పుడు సునీత నాపై ఫైర్ అవుతూ ‘నువ్వు ఏమనుకుంటున్నావు.. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు’ అని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి నన్ను సముదాయించేలా భుజం తట్టాడు. నేను ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను. ఆ సమయంలో సునీత.. రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి నేను సహకరించకపోతే నర్రెడ్డి జైలుకు వెళ్తాడని చెప్పింది. ఆయనతో ఆమె అలా ఎందుకు అన్నాదో నాకు అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత కొద్ది రోజులకు రాత్రి వేళ సీబీఐ అధికారి రాంసింగ్ నా సెల్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. తర్వాత మా అబ్బాయితో ఫోన్ చేయించి (రాంసింగ్‌కు తెలుగు రానందున) మాట్లాడించాను. -
సీబీఐ చెప్పినట్టు చేయమని సునీత చెప్పారు: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి, వైఎస్సార్: వివేకా హత్య కేసులో ఆయన ఏపీ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఇక, విచారణ సందర్బంగా కృష్ణా రెడ్డి.. కీలక విషయాలను వెల్లడించారు. కృష్ణారెడ్డి.. ‘వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 5:30 గంటలకే ఆయన ఇంటికి వెళ్లాను. ఇంటి వద్ద వాచ్మెన్ రంగన్న పడుకుని ఉండటం చూశాను. అప్పటికీ వివేకా తలుపులు తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూశాను. ఆ సమయంలో బాత్రూమ్లో వివేకా రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ విషయం గురించి మొట్టమొదట సునీత భర్త రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. అనంతరం, వివేకా పక్కనే ఉన్న లెటర్ చూసి మరోసారి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాను. దీంతో, లెటర్ విషయం ఎవరికీ చూపించవద్దని.. దాచిపెట్టమని ఆయన నాకు చెప్పారు. అందుకే వివేకా ఫోన్, లెటర్ మా ఇంట్లో దాచిపెట్టాను. ఇక, ఉదయం 6:30 గంటలకు వివేకా ఇంటికి వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చారు. బాత్రూమ్లో ఉన్న వివేకా డెడ్ బాడీ చూసి బయటకు వెళ్లిపోయారు. బాత్రూమ్ నుంచి వివేకా డెడ్‌బాడీని బయటకు తెచ్చే సమయంలో అవినాష్ రెడ్డి అక్కడ లేరు. వివేకా మృతదేహాన్ని క్లీన్‌చేసే సమయంలో కూడా అవినాష్ అక్కడ లేరు. ఇది కూడా చదవండి: వివేకా హత్యకేసులో సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్తత అయితే, బాత్రూమ్ గోడకు వివేకా తల బలంగా తగలడంతో చనిపోయారని ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. కాగా, గంగిరెడ్డి చెప్పినప్పుడే నేను అనుమానించాను. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేద్దామంటే గంగిరెడ్డి వద్దన్నాడు. సీఐ చెప్పినట్టు కంప్లయింట్ రాసి పోలీసు స్టేషన్లో ఇవ్వమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి.. వివేకా ఇంటికి వచ్చాక ఫోన్, లెటర్ ఆయనకు అప్పగించాను. అదేరోజు నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బెయిల్‌పై విడుదలయ్యాక నన్ను.. సునీత ఇంటికి పిలిచారు. సీబీఐ చెప్పినట్టు చేయ్.. లేదంటే ఇబ్బందులు తప్పవని సునీత.. నన్ను బెదిరించారు. సీబీఐ చెప్పినట్టు కృష్ణారెడ్డి వినకపోతే జైలుకు వెళ్తావంటూ సునీత హెచ్చరించింది. వివేకాకు చెందిన 200 ఎకరాల భూమి రాజశేఖర్ రెడ్డి కంపెనీ పేరుపై ఉన్నాయని’ తెలిపారు. ఇది కూడా చదవండి: వివేకా కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు
సాక్షి, అమరావతి: ప్రతి ఊర్లో ఒకడుంటాడు. ఊరికి ఏదైనా మంచి జరిగితే భరించలేడు. వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒకరున్నారు! అధికారంలో ఉండగా రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా బుద్ధి వంకరే. తనకు అలవాటైన రీతిలో కుట్రలకు పదును పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన భజన మీడియా ద్వారా కట్టు కథలను ప్రచారంలోకి తెస్తారు. ఒకపక్క భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం.. మరోపక్క అమరావతిలో భూ దందాలపై సిట్ దర్యాప్తు కొనసాగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించడంతో బెంబేలెత్తి టీడీపీ కరపత్రిక ఈనాడు, ఇతర ఎల్లో మీడియాను రంగంలోకి దించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అఫిడవిట్ పేరిట ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిరాధార అభియోగాలతో బురద చల్లేందుకు బరి తెగించారు. అయితే సీబీఐ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేస్తూ ఎంపీ అవినాశ్‌రెడ్డి పూర్తి ఆధారాలతో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, ఆయన బృందం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది. ఎంపీ అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదంటూ అభియోగం మోపడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 19 నుంచి 25వరకు అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరై ఏకంగా 210 ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పారు. ఆ ప్రశ్నలన్నీ గతంలో విచారణలో అడిగినవే అయినా సరే ఓపిగ్గా సమాధానాలిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా చేశారు. అయినా సరే ఎంపీ అవినాశ్ దర్యాప్తునకు సహకరించడం లేదనడం వెనుక దురుద్దేశాలున్నట్లు స్పష్టమవుతోంది. కౌంటర్ అఫిడవిట్లో ఎంపీ అవినాశ్‌రెడ్డి పేర్కొన్న ఇతర అంశాలు సంక్షిప్తంగా ఇవీ... ఎమ్మెల్సీ ఎన్నికలపై అదే దుష్ప్రచారం ఎన్నిసార్లు వాస్తవాలను వెల్లడించినా పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తేవడం ఎల్లో మీడియా కుట్రలకు నిదర్శనంగా నిలుస్తోంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై వక్రీకరణే అందుకు తార్కాణం. 2017లో కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ వివేకాను చంద్రబాబు కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని బరిలో నిలిపారు. నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారిలో బీటెక్ రవిని గెలిపించారు. అయితే వైఎస్ వివేకాకు వ్యతిరేకంగా వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి పని చేసి బీటెక్ రవిని గెలిపించారంటూ సీబీఐ అవాస్తవాలను తన అఫిడవిట్లో పదే పదే ప్రస్తావిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి అందుకే ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ నిరాధార అభియోగాలు మోపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎవరినైనా సీబీఐ విచారించిందా ? జిల్లాలో అన్ని ఓట్లను కలిపి ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది. మరి పులివెందులలో ఓట్లు క్రాస్ అయ్యాయని సీబీఐ ఎలా చెబుతుంది? ఇక డి.శివశంకర్‌రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించాలని అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి భావించారని సీబీఐ ఎలా నిర్ధారణకు వచ్చింది? వాటిలో ఒక్కదానికైనా సీబీఐ సమాధానం చెబుతుందా అంటే అదీ లేదు. కేవలం దురుద్దేశాలతో అభియోగాలు మోపడం మినహా నిరూపించే ఉద్దేశమే సీబీఐకి లేదన్నది స్పష్టమవుతోంది. బీటెక్ రవితో జట్టుకట్టిన సునీత దంపతులు ఈనాడు సహా ఇతర ఎల్లో సిండికేట్ కట్టు కథలకు తాజా పరిణామాలే నిదర్శనం. వైఎస్ వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి ఇప్పుడు ఆయన కుమార్తె సునీత, అల్లుడు– చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ఆ విషయాన్ని బీటెక్ రవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆరోపణలు కూడా చేశారు. అంటే 2017ఎన్నికల్లో వివేకాకు వ్యతిరేకంగా అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పని చేయలేదని స్పష్టమవుతోంది. సీఐబీ అభియోగాలు నిజమైతే బీటెక్ రవి, అవినాశ్‌రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలు ఉండాలి కదా? బీటెక్ రవితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి రోజూ ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నారనేది సందేహాస్పదంగా మారుతోంది. అవినాశ్‌కు ఖరారైన ఎంపీ టిక్కెట్‌పై సీబీఐ వక్రీకరణ కడప ఎంపీ టికెట్‌పై లేని సందిగ్దతను ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ను సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డికే పార్టీ ఖరారు చేసింది. ఆయన్ని గెలిపించే బాధ్యతను వైఎస్ వివేకానందరెడ్డికి అప్పగిస్తూ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించింది. అప్పటికే అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఆయన గెలుపు కోసం వివేకా కూడా విస్తృతంగా పర్యటించారు. హత్యకు గురికావడానికి కొన్ని గంటల ముందు కూడా అంటే 2019 మార్చి 14న అవినాశ్‌రెడ్డికి అనుకూలంగా వివేకానందరెడ్డి మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 300 ఇళ్లకు వెళ్లి ఇంటింటి ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సిట్టింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ విషయాన్ని రఘురామిరెడ్డిని అడిగినా, వివేకా ఎన్నికల ప్రచారం నిర్వహించిన 300 ఇళ్లలోని వారిని అడిగినా వాస్తవం తెలుస్తుంది. సీబీఐ ఆ ప్రయత్నమే చేయకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు అవినాశ్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ శ్రమించారని వివేకా కుమార్తె సునీత స్వయంగా 2019 మార్చి 27న మీడియాతో చెప్పారు. ఎంపీ టికెట్ కోసం వివేకానందరెడ్డిని హత్య చేశారన్న సీబీఐ అభియోగాలు పూర్తి నిరాధారం. అభ్యర్థులు ముందే ఖరారు.. వివేకా హత్య తరువాతే అవినాశ్‌రెడ్డికి టికెట్‌ను ఖరారు చేస్తూ పార్టీ ప్రకటించిందన్న సీబీఐ అభియోగం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను 2019 మార్చి 17న పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏ పార్టీ కూడా ఒక్క రోజులో 200 మంది అభ్యర్థులను ఖరారు చేయదు. ముందే ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను నామినేషన్ల ముందు ప్రకటించడం అన్నది కేవలం ఒక తంతే. అదే విధంగా 200 మంది వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అప్పటికే ఖరారు చేశారు. వారంతా అప్పటికే ప్రచారంలో సైతం నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనానికి భిన్నంగా సీబీఐ అఫిడవిట్ సీబీఐ ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను విస్మరించి నిరాధార అభియోగాలను మోపుతున్నట్లు మరోసారి నిరూపితమైంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్నట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి చెప్పింది తప్పని సీబీఐ తన కౌంటర్లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. ఆ రోజు అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతుండగా వివేకా చనిపోయిన విషయాన్ని ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. దీంతో అవినాశ్‌రెడ్డి వెనక్కి మళ్లి వివేకా నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు చల్లా మల్లి, బండి కేశవ్, బండి రాఘవరెడ్డి, వెంకట రమణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి ఇదే విషయాన్ని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. వారి సాక్ష్యాన్ని సీబీఐ రికార్డు కూడా చేసింది. కానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అసలు ఆ రోజు ఉదయం అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు వెళ్లడం లేదని సీబీఐ కౌంటర్లో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోకుండా సీబీఐ కట్టు కథలు అల్లుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యక్ష సాక్షులా... గూగుల్ టేక్ అవుటా? వాస్తవాలను వక్రీకరించడంలో పచ్చ ముఠా మరో అడుగు ముందుకేసింది. సాంకేతికంగా కచ్చితంగానీ, న్యాయపరంగా ఏమాత్రం చెల్లుబాటుగాని గూగుల్ టేక్ అవుట్ పేరిట దుష్ప్రచారం చేస్తోంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంట్లోనే గడిపి మూడో వ్యక్తి ఫోన్ కోసం ఎదురు చూశారని అఫిడవిట్లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. వివేకా హత్య విషయాన్ని ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డే ఎంపీ అవినాశ్‌కు తెలిపారు. శివప్రకాశ్‌రెడ్డి మూడో వ్యక్తి అవుతారా? మరి ఆయన్ని ఆ కోణంలో సీబీఐ ఎందుకు విచారించడం లేదు? గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ చెబుతున్న అంశాలు, ప్రత్యక్ష సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు తీరు అహేతుకంగా ఉందనేందుకు ఇదో నిదర్శనం. సీబీఐ ఏమాత్రం శాస్త్రీయంగానీ గూగుల్ టేక్ అవుట్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? ఐదుగురు సాక్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటుందా? ఒకవేళ గూగుల్ టేక్ అవుట్నే పరిగణలోకి తీసుకుంటే ఐదుగురు సాక్షులే కాదు.. మొత్తం 248 మంది సాక్షులు చెప్పింది తప్పని అంగీకరిస్తుందా? చిత్ర పటాలంటూ.. విచిత్ర వాదన ఫోన్ కాల్స్ మ్యాప్ అంటూ మరో ఊహాజనితమైన కథను తెరపైకి తెచ్చారు. వివేకా హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 15 ఉదయం 8 గంటల వరకు ఫోన్ సంభాషణల క్రమాన్ని వివరించే మ్యాప్ అంటూ అఫిడవిట్లో పేర్కొంది. ఒక ఊహాజనిత కుట్ర చిత్రాన్ని గీశారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశం ఏమిటంటే ఎర్ర గంగిరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడం కుట్రలో భాగంగా చూపించడం హాస్యాస్పదంగా ఉంది. ఇక తండ్రీ కుమారులైన వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి పరస్పరం మాట్లాడుకోవడం కూడా కుట్రలో భాగంగా చూపించడం అంటే సీబీఐ ఈ కేసు దర్యాప్తులో ఎంతగా దారి తప్పిందో స్పష్టమవుతోంది. నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఉదయ్‌కుమార్‌రెడ్డికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. యూసీఐఎల్ ఉద్యోగి అయిన ఆయన అవినాశ్‌రెడ్డిని సాధారణంగా తరచూ కలిసేవారు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్ కూడా కుట్రలో భాగంగా చూపించడం విడ్డూరంగా ఉంది. దర్యాప్తు ఇంత డొల్లతనంగా ఉండటం సీబీఐ ప్రమాణాలను దిగజారుస్తోంది. వారి ఫోన్ కాల్స్ మ్యాప్ ఎందుకు గీయలేదు? ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆ నలుగురు ఆయన అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితులన్నది పులివెందులలో అందరికీ తెలిసిన విషయమే. మరి ఎర్ర గంగిరెడ్డి– నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి– నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి మధ్య ఫోన్ కాల్స్‌పై సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారి మధ్య కాల్స్‌ను అనుమానాస్పదంగా పరిగణించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నా సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? వారి మధ్య ఫోన్ కాల్స్ మ్యాప్‌ల ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదో సీఐబీనే సమాధానం చెప్పాలి. వివేకా హత్య తరువాత సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కలుసుకున్నారు. ఆ ములాఖత్ కచ్చితంగా అనుమానాస్పదమే. ఇక వివేకాను నరికి చంపానని అంగీకరించిన దస్తగిరి బెయిల్ పిటీషన్‌ను సునీత వ్యతిరేకించకపోవడం కీలకంగా మారింది. డి.శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం ఆమె వ్యతిరేకించడం వెనుక దురుద్దేశం ఉందని స్పష్టమవుతోంది. దస్తగిరి బెయిల్‌ను వ్యతిరేకించని సునీత డి.శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆధారాలు ధ్వంసం చేయించింది వివేకా బావమరుదులే వివేకా హత్యా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేయించారంటూ అవినాశ్‌రెడ్డిపై సీబీఐ మోపిన అభియోగాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వివేకా చనిపోయారని, వెంటనే అక్కడికి వెళ్లమని ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి చెబితేనే అవినాశ్ వెళ్లారు. అప్పటికే వివేకా రాసిన లేఖ గురించి శివప్రకాశ్‌రెడ్డికి తెలిసినా అవినాశ్‌కు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఇక వివేకా నివాసంలో రక్తపు మరకలు, ఫ్లోర్‌ను శుభ్రం చేయించింది ఎర్ర గంగిరెడ్డి. శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఆయన అలా చేశారు. ఎందుకంటే వారిద్దరూ అత్యంత సన్నిహితులు కాబట్టి. అంటే ఆధారాలను ధ్వంసం చేయించింది శివప్రకాశ్‌రెడ్డి అని స్పష్టమవుతూనే ఉంది. మరి ఈ విషయంలో శివప్రకాశ్‌రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అవినాశ్ ఆధారాలను ధ్వంసం చేయించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందా? అలాంటిది ఏదీ లేనప్పుడు సీబీఐ ఏ ఆధారాలతో ఈ అభియోగాలను మోపుతోంది? వివేకా లేఖ, సెల్‌ఫోన్‌ను గోప్యంగా ఉంచిన ఆయన అల్లుడు, పెద్ద బావమరిదిని విచారించాలని అవినాశ్ ఎప్పటి నుంచో కోరుతునే ఉన్నారు. ఇన్నాళ్లకు మేలుకున్న సీబీఐ నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కొద్ది రోజుల క్రితం ఎట్టకేలకు విచారించింది. పది రోజుల క్రితమే సీబీఐ అఫిడవిట్ దాఖలు.. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, విశాఖలో అదాని డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే అద్భుతమైన ఆ రెండు ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు సర్కారు భూదోపిడీ, ఇతర అవినీతి బాగోతాలపై సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు బుధవారమే తీర్పునిచ్చింది. ఆ రెండు అంశాలు గురువారం మీడియాలో ప్రముఖంగా ప్రచురితమవుతాయని తెలుసు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ, పచ్చ మీడియా వేసిన పన్నాగమే సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌ను హఠాత్తుగా తెరపైకి తేవడం. వాస్తవానికి సీబీఐ పది రోజుల క్రితమే న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే రోజు అది అన్ని పత్రికలకు అందుబాటులోకి వచ్చింది. సీబీఐ కౌంటర్‌కు సమాధానంగా ఎంపీ అవినాశ్‌రెడ్డి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ రెండింటి ఆధారంగా న్యాయస్థానంలో వాద ప్రతివాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. అవన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తాజాగా భోగాపురం విమానాశ్రయం, అదాని డేటా సెంటర్‌కు శంకుస్థాపన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఆదేశాలతో ఈనాడు, ఎల్లో మీడియా సీబీఐ అఫిడవిట్ అంశాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. -
వివేకా హత్యకేసులో సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న వాచ్మెన్ రంగన్న కోర్టుకు ఇచ్చిన 164 స్టేట్మెంట్లో కూడా వివేకాను ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరి హత్యచేశారని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, వయసు రీత్యా పలు అనారోగ్య కారణాల వల్ల వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది. దీంతో రంగన్న ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ పోలీసులు, కుటుంబసభ్యులు మంగళవారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో రంగన్నను అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. సీబీఐ విచారణకు హాజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు వివేకా పీఏ కృష్ణారెడ్డిని మంగళవారం ప్రశి్నంచారు. హత్యకు ముందు వివేకానందరెడ్డి రాసిన లేఖను కృష్ణారెడ్డి దాచిపెట్టిన విషయంపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన కృష్ణారెడ్డిని ఐదు గంటలకు పైగా ప్రశి్నంచారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లేఖను ఎందుకు దాయాల్సి వచి్చంది? ఎవరు ఆదేశాలిచ్చారు?. లేఖను ఎవరు తొలుత గుర్తించారు? తర్వాత దాన్ని ఎక్కడ దాచిపెట్టారు? లేఖ విషయం తొలుత ఎవరెవరితో పంచుకున్నారు? లేఖను ఎన్ని గంటలకు పోలీసులకు అప్పగించారు? అప్పటి వరకు లేఖను గోప్యంగా ఉంచడానికి ప్రత్యేక కారణాలేవైనా ఉన్నాయా?.. ఇలా అనేక అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అధికారుల ప్రశ్నలకు కృష్ణారెడ్డి ముక్తసరిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. ఇటీవల పులివెందులలోని కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లగా, ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచే వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణకు హాజరుకావాలని కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: వివేకా కేసులో సునీత భర్తను విచారించిన సీబీఐ -
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ‘ఈనాడు’పై వివేకా పీఏ ఫైర్
సాక్షి, పులివెందుల: తాను పారిపోయానంటూ ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కాలేజీ పని మీద కడపకు వెళితే.. ఈనాడు పత్రిక వాళ్లు ‘కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.. పారిపోయారు’ అంటూ తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా? -
వివేకా హత్యకేసులో బయటపడుతున్నవాస్తవాలు
-
వివేకాతో రాజకీయ విభేదాలున్నాయని సీబీఐ ఆరోపణలు అవాస్తవం: ఎంపీ అవినాష్ రెడ్డి
-
సీబీఐ కోర్టులో వివేకా కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విచారణను జూన్ 2వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విచారణను జూన్‌కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఇక వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయొచ్చని సీబీఐకి తెలిపింది. అయితే.. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు గంగిరెడ్డి బెయిల్ రద్దు అమలులో ఉంటుందని, కావాలనుకుంటే సీబీఐ దర్యాప్తు గడువు తేదీ జూన్ 30 ముగిసిన తర్వాత గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు గంగిరెడ్డి హాజరుకావడం గమనార్హం. ఇదీ చదవండి: ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అత్యుత్సాహం -
ఏకపక్షంగా విచారణ
సాక్షి ప్రతినిధి, కడప: ‘సీబీఐ పెద్ద సంస్థ... నేను ఆ సంస్థ మొత్తాన్ని నిందించే పెద్దవాడిని కాదు గానీ వివేకం పెదనాన్న హత్య కేసులో విచారణ చేస్తున్న రామ్‌సింగ్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఫ్యాక్ట్ టార్గెట్ కాకుండా పర్సన్‌ను టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారు. కట్టుకథల ఆధారంగా అబద్ధాల కట్టడాలను కడుతోంది. మా అక్క సునీతమ్మ తన భర్తను కాపాడుకునే క్రమంలో నన్ను, మానాన్న వ్యక్తిత్వాలను నాశనం చేస్తోంది. సునీతమ్మను పావుగా వాడుకుని ఎల్లో మీడియా, చంద్రబాబునాయుడు, బీజేపీలో చేరిన టీడీపీ నేతల ద్వారా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో) ఏకపక్ష వైఖరి, ఎల్లో మీడియా కట్టుకథలపై ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వివరాలు ఇవీ.. మూడేళ్లుగా మాట్లాడాలనుకున్నా.. సీబీఐ విచారణ గురించి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. మూడేళ్లుగా చాలా సందర్భాల్లో మాట్లాడాలనుకున్నా.. సీబీఐపై నమ్మకంతో, వివేకం పెద్దనాన్న గురించి కొన్ని విషయాలు మాట్లాడలేక, చనిపోయిన వ్యక్తి కుమార్తె, అల్లుడు గురించి మాట్లాడలేక ఎన్ని ఆరోపణలొచ్చినా మౌనంగానే ఉన్నా. విచారణ తప్పుదారిలో వెళ్తున్నా భరించా. సీబీఐ వేసిన రెండు చార్జిïÙట్లు, 248 మంది సాక్షుల స్టేట్మెంట్లు, కోర్టుల్లో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లు, వ్యక్తిగతంగా నా విచారణను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం.. వాచ్మెన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగుర్ని గుర్తు పట్టి వారి పేర్లు కూడా చెబుతాడు. మరి నలుగురిలో ఒకర్ని అప్రూవర్‌గా మార్చాల్సిన అవసరం ఉందా? కిరాయికి హత్య చేసిన వ్యక్తి, డబ్బు కోసం మంచి మనిషి ని చంపిన వ్యక్తి, అదే డబ్బు కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడడా? హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్‌కు సీబీఐ నో అబ్జెక్షన్ అని చెబుతోంది. రెండేళ్లుగా కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అవుతున్న సునీతమ్మ మరి దస్తగిరి ముందస్తు బెయిల్ పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది అతడిని పావుగా వాడుకొని మమ్మల్ని టార్గెట్ చేయడం కాదా? అప్రూవర్ అనే అబద్ధాల కట్టడంలో అత్యున్నతస్థాయి విచారణ సంస్థ ఇన్వెస్టిగేషన్ అధికారి రామ్‌సింగ్ దిగజారి ప్రవర్తించారు. కీలక అంశాలను మరుగున పరుస్తూ సిల్లీ అంశాల ఆధారంగా విచారణ కొనసాగించారు. నిజాలను మరుగునపరచి.. ఘటనా స్థలంలో ఉన్న వాస్తవాన్ని ఎందుకు దాచి పెట్టాల్సి వ చ్చింది? వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తెలిసీ, డెత్ నోట్ చదివి వినిపించిన పీఏ కృష్ణారెడ్డిని ఎవరికీ చూపించకుండా లేఖ దాచి పెట్టాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వాస్తవాలు చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్లో చెప్పారు. జమ్మలమడుగు వెళ్తున్న నేను అక్కడికి వెళ్లి చూసిన ఘటనను ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చా. అప్పటి సీఐకి ఫోన్ చేసి వివేకం పెద్దనాన్న చనిపోయారు, చాలా రక్తం ఉంది, బెడ్ రూమంతా రక్తం ఉంది, త్వరగా రండి సార్.. అని చెప్పా. అది హత్య అని తెలియడానికి లెటర్ క్లియర్ ఎవిడెన్స్. లెటర్ కంటెంట్ విన్న వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? కనీసం నాకైనా చెప్పాలి కదా? హత్య విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు. ఇలాంటి వాస్తవాలను రామ్‌సింగ్ మరుగునపరచి ఏకపక్షంగా వ్యవహరిస్తారు. సునీతమ్మ తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాషిరెడ్డిలను కేసు నుంచి కాపాడుకునేందుకు ఆరాటం చూపుతోంది. అన్ని వేళ్లు వాళ్ల వైపే... ఘటనాస్థలంలో దొరికిన లెటర్‌తో పాటు వేళ్లన్నీ వాళ్ల వైపే చూపుతున్నాయి. వివేకం సార్ 2010లో ఇస్లాం మతం స్వీకరించి మహమ్మద్ అక్బర్‌గా పేరు మార్చుకొని షమీమ్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి షహెన్షా అనే అబ్బాయి కూడా ఉన్నాడు. సునీతమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, షమీమ్ స్టేట్మెంట్లు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. షమీమ్‌కు ఒక విల్లా కొనుగోలు చేసి ఇచ్చి, అబ్బాయిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివించాలని, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వివేకం పెదనాన్న అనుకున్నారు. బెంగళూరు డీల్ రూ.8 కోట్లు వస్తే ఆ మొత్తం వారికి ఇవ్వాలనుకున్నారు. అయితే బెంగళూరులో డబ్బు వచ్చే అవకాశమే లేదని 8 మంది సాక్షుల ద్వారా వెల్లడైంది. తన వాటా ఆస్తిగా వచ్చిన 25 శాతం భాగాన్ని షమీమ్ కుటుంబానికి చెందేలా వివేకం సార్ విల్లు రాయించారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఇది తెలిసి ఎర్ర గంగిరెడ్డి ద్వారా పథక రచన చేశారు. రెండో పెళ్లి వ్యవహారంతో 2013 నుంచి సునీతమ్మకు, పెదనాన్నకు మధ్య మాటలు కూడా లేవు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా ఆ విషయాన్ని విచారణలో వెల్లడించారు. వివేకం సార్‌కు ఉన్న చెక్ పవర్‌ను కూడా రద్దు చేశారు. హత్య అనంతరం ఎర్ర గంగిరెడ్డి డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు తీసుకెళ్లినట్లు ఏ–4 చెబుతున్నాడు. ఇవన్నీ కూడా వేళ్లు వారివైపే చూపుతున్నాయి. ఏ–2, ఏ–3 కుటుంబ సభ్యుల కారణంగా వివేకం సార్‌తో తీవ్రమైన విభేదాలున్నాయి. ఎర్రగంగిరెడ్డి ద్వారా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వీరందర్నీ వాడుకున్నారు. ఇది పూర్తిగా మర్డర్ ఫర్ గెయిన్. రాజశేఖరరెడ్డిని తప్పించి దస్తగిరిని పావుగా చేసుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. సునీతమ్మది పోరాటం కాదు...ఆరాటం వివేకం సార్ హత్య కేసులో సునీతమ్మది పోరాటం కాదు, ఆరాటం మాత్రమే. భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఈ హత్య కేసులోంచి బయటికి రావాలి. అమె భర్త స్థానంలో నన్ను, మా నాన్నను ఇరికించాలి. అది అసూయతోనే. ఇంకో కారణం లేదు. మాకైతే సునీతమ్మపై గౌరవం ఉంది. ఆమెను బాధ పెట్టాలని కాదు.. వాస్తవాలు తెలియాలి కాబట్టి చెబుతున్నాం. సుప్రీంకోర్టులో నాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పిటిషన్ వేశారు. రామ్సింగ్ను సపోర్టు చేస్తూ కౌంటర్ పిటిషన్ వేస్తారు. పర్సన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. మాజిల్లా వాసులందరికీ తెలుసు. ఎంపీ టికెట్ మోటివ్ అన్నది హాస్యాస్పదం. వైఎస్ వివేకా ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి, ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. సంబంధం లేని వారి జీవితాలను ఇందులోకి లాగి ఎందుకు నాశనం చేయాలనుకున్నారు? ఈ విషయాన్ని సీబీఐని అడుగుతున్నా. సునీతక్కను కూడా అడుగుతున్నా. నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని వివేకం పెదనాన్న బలపర్చేవారు. నా కార్యక్రమాలకు వచ్చేవారు. నా కోసం ఫైట్ చేసే వ్యక్తిని నేను చంపాననడం ఎంతవరకూ లాజికల్ అనేది ఆలోచించండి. 2014లో వేంపల్లెలో వీధి వీధిలో తిరుగుతూ మా ఇద్దరు కుమారులు జగన్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని ప్రచారం చేశారు. అప్రూవర్ కట్టుకథ.... సీబీఐకి సాక్షుల స్టేట్మెంట్లు పరిశీలిస్తే (ఎల్‌డబ్ల్యూ 10, 34, 37, 38, 50, 86, 94, 98) బెంగళూరు సెటిల్మెంట్ ఫెయిల్ అయింది. రాధాకృష్ణమూర్తివి ఫేక్ డాక్యుమెంట్లు, డబ్బులు రావని స్పష్టంగా చెప్పారు. ఏమాత్రం డబ్బులు రాని విషయం గురించి వాదోపవాదనలు చేసుకుని చంపినట్లు చెప్పడం కట్టుకథ కాదా? అది స్పష్టంగా తెలియడం లేదా? వివేకం పెదనాన్న హత్యలో సిట్ నాలుగైదు కోణాల్లో విచారణ కొనసాగించింది. వివేకం సార్ రెండో వివాహం, బతికున్న సమయంలో బలపనూరులో షమీమ్‌కు కట్టించిన ఇంటిని కూడా రాయించుకోవడం, మర్డర్ ఫర్ గెయిన్ అన్న విషయం వెలుగు చూస్తున్న సమయంలో.. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాషిరెడ్డిలను కాపాడుకునేందుకు సునీతమ్మ సిట్ వద్దు సీబీఐ విచారణ కావాలని కోరుతోంది. అంతకంటే వేరే మతలబు లేదు. ఎల్లోబ్యాచ్ పావుగా సునీతమ్మ సీబీఐ ఎంతో పెద్ద ఏజెన్సీ. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. ఏ–4 దస్తగిరిని పావుగా చేసుకొని సునీతమ్మ మమ్మల్ని టార్గెట్ చేస్తోంది. సునీతమ్మను పావుగా చేసుకొని లబ్ధి పొందేందుకు ఎల్లో బ్యాచ్ ప్రయతి్నస్తోంది. వాళ్లకు నేను, మానాన్న టార్గెట్ కాదు. వైఎస్సార్సీపీనే టార్గెట్. ఎందుకంటే మాద్వారా వైఎస్సార్సీపీ డీఫేమ్ కావాలి. ఎల్లో మీడియా, చంద్రబాబునాయుడు, మారెడ్డి రవీంద్రనాథరెడ్డి, బీజేపీలో ఉన్న టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వారికి ప్రజల్లోకి వెళ్లే దమ్ము, ధైర్యం లేదు. డీఫేమ్ చేయడంలో ఎల్లోబ్యాచ్ ఎక్స్పర్ట్. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడినే డీఫేమ్ చేసి రోడ్డున పడేశారు. మీ కుట్రలను పటాపంచలు చేస్తాం. న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ వ్యవస్థపైన మాకు నమ్మకం ఉంది. అబద్ధాల కట్టడాలు న్యాయస్థానంలో నిలబడవు. నిజం పునాదిపై ఉన్నాం. చివరకు న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసం ఉంది.