సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్‌కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఉద్ధేశపూర్వకంగా ఇరికించారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో.. సునీల్ యాదవ్ ఉన్నాడన్న గూగుల్ టేకౌట్ సమాచారం తప్పని వాదనలు వినిపించారు.
టేక్ ఔట్ కథలన్నీ కట్టుకథలే
కాగా, ‘2021 ఏప్రిల్ 29 తెల్లవారుజామున 2:30 గంటలకు సునీల్ యాదవ్ సంఘటన స్థలంలో ఉన్నాడని గూగుల్ టేకౌట్ ఆధారంగా సీబీఐ చెప్పిందని.. అయితే అదే సీబీఐ 23 జనవరి 2023 ఛార్జ్‌షీట్‌లో గూగుల్ టేకౌట్ విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించినట్లు తెలిపారు. యూనివర్సల్ టైం ప్రకారం ఉదయం 2:30కాగా భారత కాలమానం ప్రకారం ఐదున్నర గంటలు కలపాలని, అప్పుడు సమయం ఇండియన్ కాలమానం ప్రకారం ఉదయం 8:12అవుతుందని తెలిపారు. ఉదయం 8:12కు సీబీఐ చెప్పినట్టు సునీల్ యాదవ్ అక్కడుంటే హత్యతో సంబందం లేనట్టేనని పేర్కొన్నారు. కావున సునీల్‌కు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది.
చదవండి: ‘లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్‌పై దావా వేసే దమ్ముందా?’
దస్తగిరి విషయంలో అలా.. సునీల్ విషయంలో ఇలా.!
షేక్ దస్తగిరి తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. ఆయన ముందస్తు బెయిల్ విషయంలో సునీత ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని, కానీ, సునీల్ యాదవ్ బెయిల్ విషయంలో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. సునీత స్వార్థ ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఈ కేసులో ఆమె బాధితురాలు కానే కాదు, తనకు తాను బాధితులుగా ప్రచారం చేసుకుంటుందని తెలిపారు. తండ్రి వివేకా హత్యతో ఆమె కుటుంబం మాత్రమే లబ్ధిదారులు అన్న విషయం గమనించాలని, కోర్టు విచారణ ప్రక్రియను పిటిషన్లు, కౌంటర్లతో దుర్వినియోగం చేస్తుందని, సీబీఐ దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకుంటుందని, అన్ని విషయాల్లో సునీత ప్రమేయం దర్యాప్తును ప్రాసిక్యూషన్ తప్పుపట్టించేలా ఉందని తెలిపారు.
బాధితుడు వివేకా మాత్రమే, సునీత కాదు
రెండవ భార్య షేక్ షమీంతో పాటు ఆమె కొడుక్కి ఆస్థి దక్కకుండా సునీత నిలువరించారని, ఈ హత్య కేసులో సునీత భర్త రాజశేఖరరెడ్డి మామ శివ ప్రకాష్ రెడ్డిలపై ప్రైవేటు పిటిషన్ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఒక వర్గం మీడియా ప్రచారం ఏకంగా హైకోర్టు న్యాయమూర్తినే విమర్శించిన తీరు ఇప్పటికే కోర్టు రికార్డుల్లో ఉందని, సీబీఐకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఢిల్లీ నుంచి వస్తున్నారని, ఈ కేసులో సునీత బాధితురాలు కాదని, తండ్రే ఆమె బాధితుడని సునీల్ యాదవ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు.
అజేయ కల్లం పిటిషన్ పై సీబీఐకి నోటీసులు
వివేకా హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లo వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తన పేరుతో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ పేర్కొందని, పూర్తిగా కేసును పక్కదోవ పట్టించేలా సీబీఐ అధికారి వ్యవహరించారంటూ హైకోర్టును ఆశ్రయించిన అజేయ కల్లం. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment