bail petiton
-
కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
చంద్రబాబుకు బెయిల్ భయం పట్టుకుందా..?
-
‘వివేకా కేసులో సునీత స్వార్థం స్పష్టంగా కనిపిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్‌కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఉద్ధేశపూర్వకంగా ఇరికించారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో.. సునీల్ యాదవ్ ఉన్నాడన్న గూగుల్ టేకౌట్ సమాచారం తప్పని వాదనలు వినిపించారు. టేక్ ఔట్ కథలన్నీ కట్టుకథలే కాగా, ‘2021 ఏప్రిల్ 29 తెల్లవారుజామున 2:30 గంటలకు సునీల్ యాదవ్ సంఘటన స్థలంలో ఉన్నాడని గూగుల్ టేకౌట్ ఆధారంగా సీబీఐ చెప్పిందని.. అయితే అదే సీబీఐ 23 జనవరి 2023 ఛార్జ్‌షీట్‌లో గూగుల్ టేకౌట్ విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించినట్లు తెలిపారు. యూనివర్సల్ టైం ప్రకారం ఉదయం 2:30కాగా భారత కాలమానం ప్రకారం ఐదున్నర గంటలు కలపాలని, అప్పుడు సమయం ఇండియన్ కాలమానం ప్రకారం ఉదయం 8:12అవుతుందని తెలిపారు. ఉదయం 8:12కు సీబీఐ చెప్పినట్టు సునీల్ యాదవ్ అక్కడుంటే హత్యతో సంబందం లేనట్టేనని పేర్కొన్నారు. కావున సునీల్‌కు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది. చదవండి: ‘లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా?’ దస్తగిరి విషయంలో అలా.. సునీల్ విషయంలో ఇలా.! షేక్ దస్తగిరి తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. ఆయన ముందస్తు బెయిల్ విషయంలో సునీత ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని, కానీ, సునీల్ యాదవ్ బెయిల్ విషయంలో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. సునీత స్వార్థ ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఈ కేసులో ఆమె బాధితురాలు కానే కాదు, తనకు తాను బాధితులుగా ప్రచారం చేసుకుంటుందని తెలిపారు. తండ్రి వివేకా హత్యతో ఆమె కుటుంబం మాత్రమే లబ్ధిదారులు అన్న విషయం గమనించాలని, కోర్టు విచారణ ప్రక్రియను పిటిషన్లు, కౌంటర్లతో దుర్వినియోగం చేస్తుందని, సీబీఐ దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకుంటుందని, అన్ని విషయాల్లో సునీత ప్రమేయం దర్యాప్తును ప్రాసిక్యూషన్ తప్పుపట్టించేలా ఉందని తెలిపారు. బాధితుడు వివేకా మాత్రమే, సునీత కాదు రెండవ భార్య షేక్ షమీంతో పాటు ఆమె కొడుక్కి ఆస్థి దక్కకుండా సునీత నిలువరించారని, ఈ హత్య కేసులో సునీత భర్త రాజశేఖరరెడ్డి మామ శివ ప్రకాష్ రెడ్డిలపై ప్రైవేటు పిటిషన్ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఒక వర్గం మీడియా ప్రచారం ఏకంగా హైకోర్టు న్యాయమూర్తినే విమర్శించిన తీరు ఇప్పటికే కోర్టు రికార్డుల్లో ఉందని, సీబీఐకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఢిల్లీ నుంచి వస్తున్నారని, ఈ కేసులో సునీత బాధితురాలు కాదని, తండ్రే ఆమె బాధితుడని సునీల్ యాదవ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అజేయ కల్లం పిటిషన్ పై సీబీఐకి నోటీసులు వివేకా హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లo వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తన పేరుతో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ పేర్కొందని, పూర్తిగా కేసును పక్కదోవ పట్టించేలా సీబీఐ అధికారి వ్యవహరించారంటూ హైకోర్టును ఆశ్రయించిన అజేయ కల్లం. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది. -
ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే..
Aryan Khan Bail Petition: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్ బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం ఈసారైనా బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. గతవారమే ఆర్యన్‌కు బెయిల్ వస్తుందని అంతా భావించినా కోర్టు షాకిచ్చింది. దీంతో ఈసారైనా బెయిల్ వస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది. ఒకవేళ ఆర్యన్‌కు ఈ వారంలో బెయిల్ రాకపోతే మాత్రం అతను మరో 14 రోజుల పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే నెల1వ తేదీ నుంచి ముంబై హైకోర్టుకు వరుసగా దీపావళి సెలవులు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హైకోర్టుకు సెలవులు కావడంతో నేడు జరిగే విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కొడుకు అరెస్ట్‌తో షారుక్ దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు సమాచారం. అటు షారుక్‌ఖాన్ భార్య గౌరీ ఖాన్ అయితే కొడుకు బెయిల్ కోసం నిత్యం ప్రార్థనలు చేస్తోందని, ఆర్యన్ విడుదల కావాలంటూ భగవతుండ్ని ప్రార్థించమని తన స్నేహితులకు కూడా విన్నవించుకుంటుందట. కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లో స్వీట్స్ వండొద్దని ఇప్పటికే గౌరీ ఖాన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. పుట్టినరోజు, పండుగలను కూడా జరుపుకోవడం లేదు. కొడుకు ఇంటికి వచ్చాకే అన్ని పండుగలు అన్ని గౌరీ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. చదవండి: Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వస్తుందా? రాదా? ‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు -
డ్రగ్స్ కేసు : నటుడు అర్మాన్ కోహ్లీకి షాక్ ఇచ్చిన కోర్టు
Armaan Kohli Bail Denied In Drugs Case: నటుడు అర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాకిచ్చింది. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని గత నెల28న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్మాన్ నివాసంలో జరిపిన సోదాల్లో 1.2 గ్రాముల కొకైన్ లభ్యం కావడంతో ఎన్సీబీ అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టు అర్మాన్‌కు 14రోజల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిని సవాలు చేస్తూ తనకు డ్రగ్ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అర్మాన్ పేర్కొన్నాడు. తనకు వెంటనే బెయిల్ ముంజూరు చేయాలని కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా ఈ కేసులో అర్మాన్తో పాటు ఏడుగురు నిందితులు ఉన్నారని, వీరికి ఒకరితో మరొకరికి సంబంధాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్మాన్‌కు బెయిల్ మంజూరు చేయరాదంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై ఏకీభవించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఎమ్ నెర్లికర్ అర్మాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. చదవండి : సిద్ధార్థ్ శుక్లాకు నివాళులు అర్పించిన హాలీవుడ్ నటుడు జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన కంగనా రనౌత్ -
గాలి జనార్ధన్‌రెడ్డికి చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: బెయిలు షరతులు సడలించాలంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. జనార్ధనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ వెకేషన్ బెంచ్ జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం ముందుకు సోమవారం వచ్చింది. ఈ పిటిషన్ గతంలో జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఆర్.సుభాశ్‌రెడ్డిల ధర్మాసనం విచారించిందని, ప్రస్తుతం వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించబోదని జస్టిస్ అశోక్ భూషణ్ స్పష్టం చేశారు. బళ్లారి, అనంతపురం, కడపలకు వెళ్లకూడదన్న 20.1.2015 నాటి ఆదేశాల్లోని షరతు సడలించాలని పిటిషన్లో కోరారు. జస్టిస్ ఆర్.సుభాశ్‌రెడ్డితో మాట్లాడామని, గతంలో పిటిషనర్ దాఖలు చేసిన మిస్లీనియస్ అప్లికేషన్‌తోపాటు ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సూచించిన ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. -
సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి, మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న రియా చక్రవర్తికి ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణను బాంబే హై కోర్టు రేపటికి (గురువారం) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తన బెయిల్ పిటిషన్లో రియా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాత్రమే డ్రగ్స్ వాడేవాడని.. అతను తన సిబ్బందిని డ్రగ్స్ తీసుకురావాల్సిందిగా కోరేవాడని తెలిపింది. సుశాంత్ జీవించి ఉంటే అతనిపై తక్కువ అభియోగాలు మోపబడేవని.. బెయిల్ లభించే నేరంగా ఉండేదని.. అతడికి ఒక సంవత్సరం మాత్రమే జైలు శిక్ష విధించేవారని తెలిపింది. (చదవండి: స్పీడ్‌పోస్టు, కొరియర్లలో డ్రగ్స్) అంతేకాక సుశాంత్ తనను, తన సోదరుడిని, ఇతర సిబ్బందిని డ్రగ్ సప్లయర్స్‌గా వాడుకున్నాడని రియా ఆరోపించింది. ‘సుశాంత్ డ్రగ్స్ కోసం తనతో క్లోజ్‌గా ఉండే వారిని అంటే నన్ను, నా సోదరుడిని వాడుకున్నాడు. ఇందుకు సంబంధించి అతడు ఎలాంటి ఎలాక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని వదల్లేదు. దాంతో ఆధారాలు లేవు. ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నాం’ అని రియా విచారం వ్యక్తం చేసింది. పబ్లిక్ డొమైన్లోని సమాచారం ఆధారంగా రియా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన కుక్ నీరజ్‌ను ‘గంజా జాయింట్లు / రోల్స్ / డూబీలు తయారు చేసి తన పడకగదిలో ఉంచమని’ తన మరణానికి మూడు రోజుల ముందు కోరినట్లు వెల్లడించింది. దీని గురించి నీరజ్ సీబీఐ, ముంబై పోలీసులకు చెప్పాడని తెలిపింది. ‘తాను జాయింట్లు సిద్ధం చేసి సుశాంత్ బెడ్రూంలోని ఒక బాక్స్‌లో ఉంచానని నీరజ్ తెలిపాడు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఆ బాక్స్ తెరిచి చూస్తే.. ఖాళీగా ఉందని.. సుశాంత్ జాయింట్లు / డూబీలు వాడాడని అర్థమయ్యింది అన్నది’ రియా. (చదవండి: సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు) ఇక నిన్నటితో రియా జ్యూడిషియల్ కస్టడీ ముగిసింది. దాంతో వచ్చే నెల 6 వరకు దాన్ని పొడిగించారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు బెయిల్‌కు అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేశారు. ఆమెను "డ్రగ్ సిండికేట్ యొక్క క్రియాశీల సభ్యురాలు" అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అభివర్ణించింది. -
అచ్చెన్నాయుడుకు చుక్కెదురు
-
చిదంబరానికి చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనను కొట్టిపారేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. -
లాలూకు సుప్రీంలో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు పశుగ్రాస కుంభకోణం కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. లాలూ బెయిల్ అప్పీల్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో లాలూ లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకే బెయిల్ కోరుతున్నారని ఆరోపించింది. లాలూకు బెయిల్ మంజూరు చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. లాలూ ప్రసాద్ ఎనిమిది నెలలకు పైగా ఆస్పత్రి వార్డులోనే ఉన్నా ఇప్పటికీ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. కాగా లాలూ రాంచీలోని రిమ్స్‌లో వైద్య చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి వార్డు నుంచే ఆయన రాజకీయాలు చక్కబెడుతున్నారని, ఇందుకు అక్కడికి వచ్చే విజిటర్ల జాబితానే కీలక ఆధారమని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు నివేదించింది. -
శ్రీనివాస్ తరపున బెయిల్ పిటిషన్
-
జైల్లోనే మరో రాత్రి గడపనున్న సల్మాన్
జోధ్‌పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరో రోజు జైలులోనే గడపనున్నారు. సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు రిజర్వ్‌లో ఉంచడంతో ఆయన శుక్రవారం రాత్రి సెంట్రల్ జైల్లో గడపనున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సల్మాన్ సోదరిలు అల్విర, అర్పిత, బాడీగార్డ్ షేరా.. సెషన్స్ కోర్టుకు వచ్చారు. మరోవైపు సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ త్వరలోనే జోధ్‌పూర్‌కు రానున్నారు. 1998లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు సెషన్స్‌కోర్టు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో నిన్న రాత్రి ఆయన సెంట్రల్ జైల్లోనే గడిపారు. ఆయనకు 106 ఖైదీ నెంబర్‌ను కేటాయించారు. జైలు అధికారులు సల్మాన్‌కు రోటీ, పప్పు అందించగా వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. కాగా ఇదే కేసులో సల్మాన్ సహ నటులు సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబూ, నీలం కొఠారిలను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
17 వ తేదీన సుప్రీంలో జయ బెయిల్ పై విచారణ
న్యూఢిల్లీ:అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. జయ పిటిషన్‌ను ఈ వారంలోనే విచారించాలన్న జయ తరఫు న్యాయవాది ఫాలీ నారీమన్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతత్వంలోని ధర్మాసనం మన్నించింది. దీపావళికి ముందు జైల్లోంచి బయటకు రావాలంటే ఈ నెల 17 (శుక్రవారం) జయకు చివరి అవకాశం. శుక్రవారం తర్వాత వారం రోజులు సుప్రీం కోర్టుకు సెలవులు రానున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు గత నెలాఖర్లో నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. వంద కోట్ల జరిమానా విధించడంతో జయ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించడంతో ఆమె నెల 9న సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
'తమిళనాడుకు తరలించినా అభ్యంతరం లేదు'
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలితను తమిళనాడు జైలుకు తరలించినా తమకు ఎటువంటి అభ్యతరం లేదని కర్ణాటక హోంశాఖ స్పష్టం చేసింది. దీనిపై పొరుగు రాష్ట్రం తమిళనాడు కోర్టు నుంచి అనుమతులు తీసుకుంటే కర్ణాటక ప్రభుత్వానికి ఏ విధమైన అడ్డంకులూ లేవని హోంమంత్రి కేజే జార్జ్ తెలిపారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ మరియు కొంతమంది ప్రముఖల ద్వారా ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జయలలిత కర్ణాటక జైల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడటమే కాకుండా, మద్దతుదారుల ఆందోళనతో చట్టపరమైన సమస్యలు కూడా వస్తాయని దేవగౌడ సూచించారు. ఆమె కర్ణాటక జైలులోనే ఉంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని నిఘా అధికారులు ఆదివారం సీఎం సిద్ధరామయ్యతో చెప్పినట్లు తెలిసింది. ‘‘జయను చూసేందుకు వేలాదిగా తమిళలు జైలు వద్దకు చేరుకుని గొడవ చేస్తున్నారు.సుప్రీం కోర్టులో జయ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అక్కడా బెయిల్ మంజూరు కాకపోతే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముంది’’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం జయ జైలు మార్పిడి విషయంలో సానుకూలంగా స్పందించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
మళ్లీ అమ్మకు నిరాశే.. బెయిల్ కు నో..!
-
మళ్లీ అమ్మకు నిరాశే.... బెయిల్ కు నో...
బెంగళూరు : పురచ్చితలైవికి మరోసారి నిరాశే ఎదురైంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అభ్యంతరం వ్యక్తం చేయటంతో జయకు బెయిల్ ఇవ్వటం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల ఏడో తేదీన హైకోర్టు సాధారణ బెంచ్‌లో విచారణకు ఆదేశించింది. కాగా జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. మరోవైపు కోర్టు తాజా తీర్పుతో అమ్మతో పాటు అన్నాడీఎంకే వర్గాలకు మళ్లీ నిరాశే ఎదురైంది. దాంతో జయలలిత దసరా పండుగకు జైల్లోనే గడపనున్నారు. -
అక్టోబర్ 6 వరకూ జైల్లోనే జయలలిత
-
అక్టోబర్ 6 వరకూ జైల్లోనే జయలలిత
బెంగళూరు : అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్టోబర్ 6వ తేదీ వరకూ జైల్లోనే గడపాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణకు చేపట్టింది. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీ వరకూ వాయిదా వేసింది. దాంతో జయ సోమవారం వరకూ జైల్లోనే ఉండాలి. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో పార్టీ కార్యకర్తలు నిరాశ చెందారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జయతో పాటు జైలు శిక్షకు గురైన శశికళ, సుధాకరన్, ఇళవరసిలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)