Aryan Khan Bail Updates: ఆర్యన్‌కు బెయిల్‌ రాకపోతే జరిగేది ఇదే.. - Sakshi
Sakshi News home page

Aryan Khan : ఆర్యన్‌కు బెయిల్‌ రాకపోతే జరిగేది ఇదే..

Published Tue, Oct 26 2021 10:47 AM | Last Updated on Tue, Oct 26 2021 12:21 PM

Aryan Khan Bail Petition Updates If Bail Not Granted What Wil Happen - Sakshi

Aryan Khan Bail Petition: డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌ బెయిల్‌ తిరస్కరించిన ధర్మాసనం ఈసారైనా బెయిల్‌ మంజూరు చేస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెల​కొంది. మంగళవారం ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. గతవారమే ఆర్యన్‌కు బెయిల్‌ వస్తుందని అంతా భావించినా కోర్టు షాకిచ్చింది. దీంతో ఈసారైనా బెయిల్‌ వస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది.

ఒకవేళ ఆర్యన్‌కు ఈ వారంలో బెయిల్‌ రాకపోతే మాత్రం అతను మరో 14 రోజుల పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే నెల1వ తేదీ నుంచి ముంబై హైకోర్టుకు వరుసగా దీపావళి సెలవులు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హైకోర్టుకు సెలవులు కావడంతో నేడు జరిగే విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కొడుకు అరెస్ట్‌తో షారుక్‌ దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు సమాచారం.

అటు షారుక్‌ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ అయితే కొడుకు బెయిల్‌ కోసం నిత్యం ప్రార్థనలు చేస్తోందని, ఆర్యన్‌ విడుదల కావాలంటూ భగవతుండ్ని ప్రార్థించమని తన స్నేహితులకు కూడా విన్నవించుకుంటుందట. కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లో స్వీట్స్‌ వండొద్దని ఇప్పటికే గౌరీ ఖాన్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. పుట్టినరోజు, పండుగలను కూడా జరుపుకోవడం లేదు. కొడుకు ఇంటికి వచ్చాకే అన్ని పండుగలు అన్ని గౌరీ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. 

చదవండి: Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ వస్తుందా? రాదా?
‘రూ.25 కోట్ల డిమాండ్‌’పై విజిలెన్స్‌ దర్యాప్తు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement