Gouri Khan
-
అద్దాల మిలమిలల్లో పెళ్లికూతురి లుక్ వైరల్
ప్రముఖ స్టైలిస్ట్ ఆకృతి సెజ్పాల్ డ్రీమ్ వెడ్డింగ్ నెట్టింట ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ధరించిన ముసుగు, లెహంగా అతిథులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా మొత్తం అద్దాలతో తయారు చేసిన లెహెంగాలో వధువు ‘ఆకృతి’ మరింత ఆకర్షణగా నిలిచింది.వధువు ఆకృతి సెజ్పాల్ 3డీ డిజైన్, పూర్తిగా పూలతో చేసిన పెళ్లి కూతురు వేసుకునే మేలి ముసుగులను చూశాం. కానీ పూర్తిగా మిర్రర్ వర్క్‌తో రూపొందించడం విశేషంగా నిలిచింది. లెహెంగాకు తోడుగా ఏమాత్రం క్లాత్ వాడకుండా తయారు చేసిన దుపట్టా కమ్ మేలి ముసుగుతో పెళ్లి కళతో కళకళలాడింది ఆకృతి. ఇంకా స్వీట్హార్ట్-నెక్లైన్ బ్లౌజ్, హెవీ లెహంగా స్కర్ట్, ఓపెన్ హెయిర్‌స్టైల్‌పై పిన్ చేసిన షీర్ దుపట్టాలో అందంగా మెరిసిపోయింది. చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ జుమ్కీలు, పాపిట బిళ్లతో తన లుక్‌ను మరింత అద్భుతంగా ముస్తాబైంది.< View this post on Instagram A post shared by Itrh (@itrhofficial)br> -
పెళ్లి కోసం షారుఖ్ ఖాన్ పేరునే మార్చుకున్నాడా?
బాలీవుడ్ లో అందమైన జంటలలో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ఒకరు. విరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1991లో షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. ఓ పార్టీలో గౌరిని చూసిన షారుఖ్.. తొలి చూపుతోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడట. తన భార్యగా గౌరీనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడట. అప్పటికి షారుఖ్ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. చాలా కాలం తర్వాత షారుఖ్ ప్రేమను గౌరి అంగీకరించింది. అయితే వీరి వివాహానికి గౌరి ఫ్యామిలీ వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో షారుఖ్ పేరుని అభినవ్‌గా మార్చి ఫ్యామిలీ వాళ్లకి పరిచయం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని గౌరీ గతంలో ఓ ఇంటర్యూలో చెప్పింది.‘ఇద్దరి మతం వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. దీంతో రిజిస్ట్రైషన్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత షారుఖ్‌కి అభినవ్ అని పేరు మార్చి ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాను. అలా పరిచయం చేస్తే షారుఖ్ హిందువు అని భావించి.. పెళ్లికి ఒప్పుకుంటారనుకున్నాను. అది చాలా సిల్లీ, చైల్డీష్ ఆలోచన’ అని గౌరి ఓ ఇంటర్యూలో చెప్పింది.చాలా గొడవల షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. 1991 అక్టోబర్ 25న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత గౌరి మతం మార్చుకుంటుందని అంతా భావించారు. కానీ ఆమె మారలేదు. షారుఖ్ కూడా ఈ విషయంలో గౌరిని బలవంతం పెట్టలేదు. ‘నాలాగే షారుఖ్ కూడా అన్ని మతాలకు గౌరవం ఇస్తాడు. తన మతంలోని మారమని ఎప్పుడూ నన్ను అడగలేదు’అని ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ చెప్పొచ్చింది. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. ఆర్యన్ ఖాన్ , సుహానా, అబ్రం ఖాన్. పెళ్లి తర్వాత గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియాలోని టాప్ ఇంటీరియర్ డిజైనర్లలో గౌరీ ఖాన్ ఒకరు. -
షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్లెన్నో ఊహించగలరా?
‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. బ్లాక్ బస్టర్మూవీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, ఖరీదైన బంగ్గాలు, లగ్జరీ కార్లు..అబ్బో.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ పెద్దదే. 1980లలో తన కెరీర్‌ను ప్రారంభించింది మొదలు అత్యంత ప్రజాదరణతో వెండితెరను ఏలుతున్న స్టార్ హీరో. . పఠాన్, జవాన్ , డంకీ మూవీలతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలి బ్లాక్ బస్టర్‌మూవీ జవాన్‌లో షారుఖ్ ఖాన్ పట్టుకున్న ఫోను మొదలు తమ అభిమాన హీరోకున్న ఫోన్లు ఎన్ని అనేది చర్చకు దారితీసింది. షారుఖ్ ఖాన్ వద్ద 17 ఫోన్లు షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్ల సంఖ్యను మీరు ఊహించగలరా? అక్షరాల 17 ఫోన్లు అట. షారూఖ్ కరీర్లో ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన , వివేక్ వాస్వాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో తప్ప మళ్లీ తనని కలవలేకపోయాయని వివేక్ తెలిపారు. ‘‘ఎస్ఆర్కే దగ్గర 17ఫోన్లు, ఉన్నాయి. నా దగ్గర ఒకటే నంబరు ఉంది.. నేను ఫోన్ చేసినపుడు ఆయన దొరకడు. ఆయన ఫోన్ చేసినపుడు నేను మిస్ అవుతా.. ఆయనకు బాధ్యతలు ఎక్కువ. నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడు. వెండితెర సామ్రాజ్యాన్ని ఏలుతున్న అద్భుతమైన వ్యక్తి’’ అంటూ గుర్తు చేసుకున్నారు. కాగా రియల్మీ, ఒప్పో లాంటి బ్రాండ్లకు షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. అంతేకాదు బాలీవుడ్ హ్యాపియస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు షారుఖ్, గౌరీ ఖాన్ జంట . వీరి వివాహ బంధం మొదలై మూడు దశాబ్దాలుదాటింది. ఈ క్రమంలో తన భార్యకు రోజుకు 8-10 సార్లు ఫోన్ చేస్తాననీ, ఒక్కోసారి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చేస్తానని చెప్పడం వైరల్ అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేస్తా, నా భార్యతోనే కదా మాట్లాడేదని అని ఫన్నీగా చెప్పిన సంగతి తెలిసిందే. -
ఇంటీరియర్ డిజైనర్‌గా గౌరీ ఖాన్ ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా!
బాలీవుడు సూపర్ స్టార్ షారుఖాన్ భార్య గౌరీ ఖాన్ సక్సెస్ ఫుల్ ఇంటీరియర్ డిజైనర్ తన కెరీర్‌తో దూసుకుపోతున్నారు. ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా తన ఇంటినే ఎంత విలావంతంగా తీర్చిదిద్దిందో చూస్తే సృజనాత్మకతకు నిర్వచనం గౌరీ ఖాన్ ఏమో అనిపిస్తుంది. అంతేగాదు ఓ పక్క తన భర్త కెరియర్‌కు తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తూనే మహిళా వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు. ఆధునాతన సృజనాత్మక నైపుణ్యానికి ఓ కొత్త అద్దాన్ని ఇచ్చారామె. ఈ సందర్భంగా ఇంటీరియర్ డిజైనర్‌గా తన జర్నీ ఎలా సాగింంది? అందులో తాను ఎదర్కొన్న సవాళ్ల గురించి ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే.. నిజానికి గౌరీ ఖాన్ బీఏ పట్టభద్రురాలే గాక ఫ్యాషన్ డిజైన్ కోర్సు కూడా చేశారు. ఇక ఆమె తండ్రిది గార్మెంట్ వ్యాపారం కావడంతో టైలరింగ్‌లో కూడా కొంత ప్రావిణ్యం ఉంది. అయితే ఈ అర్హతల కారణంగా ఇంటీరియర్ డిజైనర్ రంగంలోకి ప్రవేశించలేదు. ముంబైలో ఐకానిక్‌గా. మంచి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన షారుఖ్-గౌరీ ఖాన్ల ఇల్లు 'మన్నాత్' బంగ్లా అత్యద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని నిర్మించి ఏళ్లు కావొస్తుండటంతో అత్యంత సుందరంగా పునర్నిర్మించాలనుకున్నారు ఫారుఖ్. ఆ తరుణంలోనే గౌరీఖాన్‌కి ఇంటీరియర్ డిజైనర్ రంగంపై మక్కువ ఏర్పడింది. అంతేగాదు ఈ ఇంటిని అత్యంత సుందరంగా మలచడం కోసం ప్రముఖ ఆర్కిటెక్చర్లతో కలిసి పనిచేసింది కూడా. అలా ఆమె తనకు తెలియకుండానే ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు. పైగా తమ విలాసవంతమైన బంగ్లా మన్నాత్ని ఎంతం అందంగా తీర్చిదిద్దిందంటో అదోక అద్భుతమైన ప్యాలెస్ అన్నంత రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 200 కోట్లు. అలా గౌరీ ఖాన్ తన ఇంటిని సర్వాంగాసుందరంగా మార్చే క్రమంలో ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు గౌరీ. ఆ తర్వాత ఆ రంగాన్నే వృత్తిగా ఎంచుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఈ రంగంలో మరింత మెళ్లుకవలను నేర్చుకుని తన నైపుణ్యానికి మరింత పదునుపెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో 2013లో ముంబైలో గౌరీ ఖాన్ డిజైన్స్ పేరుతో డిజైన్ స్టూడియోని ఏర్పాటు చేసింది. ఇక అక్కడ నుంచి పలు విభిన్న ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతోంది గౌరీ ఖాన్. ఈ నేపథ్యంలో ఎందరో ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అయితే తాను ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా తన సంస్థను ప్రమోట్ చేసుకుంటూ ఈ వ్యాపారంలో తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అంటోంది. అంతేగాదు ముఖేష్ అంబానీ , రాబర్టో కావల్లి రాల్ఫ్ లారెన్ వంటి ప్రముఖుల ఇళ్లకు ఇంటిరీయర్ డిజైనర్‌గా పని చేశారు. తాను ఓ స్టార్ భార్యను కాబట్టి ఈ రంగంలో సులభంగా విజయం వచ్చేస్తుంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పంటారు గౌరీ ఖాన్. ఎవ్వరైన ఓ వ్యాపారం చేసేటప్పడు జస్ట్ సపోర్ట్ ఇస్తారు ఇక అక్కడ నుంచి ఎవరికీ వారే స్వయంగా వ్యాపారాన్ని నడిపుంచుకుని, విజయం దక్కించుకోవాల్సిందే అంటున్నారు గౌరీ. దేనికైనా అత్యంత ఓపికతో కూడిన నేర్పు ఉంటేనే సాధ్యమని చెబుతోంది. ఈ రంగంలో తాను ఎదుర్కొన్నఇబ్బందిని, సవాళ్లని ఓ పాఠంగా తీసుకుని ముందుకు వెళ్లేదానిని, అందువల్లే ఇంటీరియర్ డిజైనర్ ఎంట్రప్రెన్యూర్‌గా సక్సెస్ అయ్యానని అన్నారామె. ఇక ఆమె ఇంటరీయర్ డిజైనర్‌గా టేకప్ చేసిన ప్రాజెక్టులకు ఎంత ఛార్జ్ చేస్తుందంటే సుమారు రూ. 6 లక్షలు నుంచి మొదలవ్వుతుందట. ఆమె ఇంటీరియర్ డిజైన్స్ నెట్ వర్తే దాదాపు రూ. 200 కోట్లు పైనే ఉంటుందట. దీంతోపాటు ఆమె 2014లో డిజైన్ సెల్ అనే పేరుతో కాన్సెప్ట్ స్టోర్‌ని కూడా ప్రారంభించింది. ఇందులో గౌరీనే స్వయంగా తీర్చిదిద్దినా ఫర్నీచర్ డిజైన్లు ఉంటాయి. అంతేగాదు పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన మైసన్ ఎట్ ఆబ్జెట్ షోలో తన ఫర్నిచర్ డిజైన్లను ప్రదర్శించడానికి ఆహ్వానం సైతం దక్కించుకుంది. అలాగే ఫార్చ్యూన్ మ్యాగజైన్ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమె కూడా ఒకరిగా నిలవడం విశేషం సెలబ్రెటీ హోదా కంటే ప్రత్యేక గుర్తింపు మిన్న.. ఇక్కడ షారుఖ్ స్టారడమ్ అతడి భార్యగా ఆమెకు ఉంటుంది. అలాగా ఆమె షారుఖ్ సినిమాలను నిర్మిస్తూ చిత్ర నిర్మాతగా కూడా మారింది. అయినా మహిళ సాధికారత అనే పదానికి అర్థమిచ్చేలా తనకంటూ ఓ గుర్తింపు కావాలనుకుంది. అందుకోసం నచ్చిన రంగాన్ని ఎంచుకుంది. అది మొదటగా తన ఇంటి డిజైన్ నుంచి ప్రారంభంచి.. ప్రముఖులు ఇళ్లు డిజైన్ చేసే స్థాయికి చేరుకుంది. తన సంస్థకు గౌరీ ఖాన్ అనే బ్రాండ్ నేమ్ దక్కించుకుని సక్సెఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దూసుకుపోయింది. ఏ మహిళైనా సరే పెళ్లి, పిల్లలు కారణంతో కెరీర్‌ను ఆపేయాల్సిన పనిలేదని నిరూపించింది. అంతేగాదు పిల్లలు ఎదిగిపోయి మనం అవసరం లేదనుకున్న తరుణంలో మళ్లీ మన కెరీర్లో లేదా మనకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు యత్నించి, మనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకోగలమని ప్రూవ్ చేశారు గౌరీ ఖాన్. (చదవండి: 'నారీ శక్తి'.. 'నారీ శక్తీ' అంటారుగా! చేతల్లో చూపండి!) -
ఆ విషయంలో కుమార్తెకు గౌరీ ఖాన్ సలహా.. ఏమని చెప్పిందంటే?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్. బాలీవుడ్లో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఇది ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీజన్లో 12వ ఎపిసోడ్ ట్రైలర్‌ను కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పాల్గొన్నారు. చదవండి: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి.. బర్త్‌డే తర్వాత రెండు రోజులకే! ఆమెకు కరణ్ పలు ప్రశ్నలు సంధించగా నవ్వుతూ సమాధానాలిచ్చారు. భర్త షారుక్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు భామలు భావన పాండే, మహీప్ కపూర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షో ఫుల్ ఎపిసోడ్ గురువారం రాత్రి ప్రసారం కానుండగా తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు మేకర్స్. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌పై ప్రశ్నతో ఈ ప్రోమో ప్రారంభమైంది. (చదవండి: Karan Johar: వాతావరణ మార్పుపై పోరాటంగా 'నయా భారత్ కా సప్నా') మీ కూతురికి డేటింగ్‌పై మీరిచ్చే సలహా ఏంటని గౌరీ ఖాన్‌ను ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. 'ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయవద్దని' సలహా ఇస్తానని నవ్వుతూ చెప్పింది. అలాగే షారుఖ్‌తో మీ ప్రేమకథకు ఏ సినిమా టైటిల్‌ను ఎంచుకుంటారు అని అడగ్గా.. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అంటూ గౌరీ ఖాన్ నవ్వుతూ ఆన్సరిచ్చింది. అంతే కాకుండా ఈ ఎపిసోడ్లో షారుఖ్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గురువారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
పెళ్లికి ముందు షారుక్‌ను గన్‌తో బెదిరించిన గౌరీ ఖాన్ సోదరుడు, ఎందుకంటే..
Shah Rukh Khan And Gauri Khan Love Story: బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ నేటితో 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. మంగళవారం(నవంబర్ 2) షారుక్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తనయుడు ఆర్యన్ అరెస్టుతో కొద్ది రోజులుగా షారుక్ కుటుంబం విచారంలో ఉంది. దీంతో దసరా, షారుక్-గౌరీ ఖాన్లు తమ వెడ్డింగ్ యానివర్సరిని కూడా జరుపుకోలేదు. ఇటీవల ఆర్యన్‌కు బెయిల్ మంజూరు కావడం, అతడు జైలు నుంచి విడుదలవడంతో వారిలో ఆనందం నెలకొంది. ఇక ఈ రోజు షారుక్ బర్త్‌డే కూడా ఉండటంతో మన్నత్‌లో సెలబ్రెషన్స్ రెట్టింపు అయ్యాయి. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే.. ఇక దీపావళి పండుగ కూడా రావడంతో షారుక్ నివాసం మన్నత్‌ను మొత్తం దీపాలతో అలంకరించారు. బయటి నుంచి చూస్తే మన్నత్ మొత్తం దీపాల అలంకరణతో వెలిగిపోతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 25న షారుక్-గౌరీఖాన్‌ల పెళ్లి రోజు. ఈ నేపథ్యంలో వారి పెళ్లి, ప్రేమయాణం గురించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సినీ క్రిటిక్ అనుపమ చోప్రా షారుక్ బయోగ్రఫీ రాసిన సంగతి తెలిసిందే. ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’ అనే పేరుతో ఈ బుక్‌ను ఆమె విడుదల చేశారు. అయితే షారుక్-గౌరీలది ప్రేమ వివాహం అని తెలిసిందే. 25 అక్టోబర్ 1991లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే వారు కొన్నేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు. చదవండి: దీపావళికి ముందే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది: హీరోయిన్ స్కూలింగ్ నుంచే విరిద్దరికి పరిచయం ఉంది. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ వీరి పెళ్లికి గౌరీ కుటుంబ సభ్యులు మొదట్లో వ్యతిరేకించినట్లు అనుపమ తన బుక్‌లో పేర్కొన్నారు. దీంతో వారిని పెళ్లికి ఒప్పించేందుకు షారుక్ ఎన్నో ప్రయత్నాలు చేశారట. చెప్పాలంటే వీరిద్దరూ ఓ యుద్ధమే చేశారని చెప్పుకొవచ్చు. అయినా గౌరీ తల్లిదండ్రులు మరింత మొండిగా ప్రవర్తించారట. ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’ అనే బుక్‌లో అనుపమ ఏమని రాసుకొచ్చారంటే.. షారుక్ ఓ నటుడు అయినందుకే గౌరీ తండ్రి రమేశ్ చిబ్బర్ వారి ప్రేమను నిరాకరించారని అనుపమ రాసుకొచ్చారు. గౌరీ తండ్రికి సినిమాల్లో నటించడం అసలు నచ్చదట. చదవండి: షారుక్ ఖాన్ బర్త్‌డే.. వెలిగిపోతున్న 'మన్నత్' అలాగే గౌరీ తల్లి సవిత కూడా వారిద్దరూ విడిపోవాలని పులువురు జ్యోతిష్యులను కూడా కలిశారట. ఇక ఆమె సోదరుడు విక్రాంత్ అయితే ఏకంగా షారుక్‌ను గన్‌తో బెదిరించాడట. అయితే అతడికి గుండా అనే పేరు కూడ ఉందట. విక్రాంత్ గుండాయిజం చేసేవాడని సమాచారం. కానీ షారుక్ అతడికి ఏమాత్రం బయపడలేదట. చివరకు షారుక్ ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గౌరీ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారట. దీంతో వారు ఒకే చెప్పడంతో చివరికి వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1991 అక్టోబర్ 25న వీరి పెళ్లి ముహుర్తం ఖారారు చేయడం, చకచక వారి వివాహం జరిగిపోయింది. ప్రస్తుతం షారుక్-గౌరీలకు ముగ్గురు సంతానం, ఇద్దరు కుమారులు ఆర్యన్ ఖాన్, అభ్రాం కాగా, కూతురు సుహనా ఖాన్ ఉన్నారు. -
ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే..
Aryan Khan Bail Petition: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్ బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం ఈసారైనా బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. గతవారమే ఆర్యన్‌కు బెయిల్ వస్తుందని అంతా భావించినా కోర్టు షాకిచ్చింది. దీంతో ఈసారైనా బెయిల్ వస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది. ఒకవేళ ఆర్యన్‌కు ఈ వారంలో బెయిల్ రాకపోతే మాత్రం అతను మరో 14 రోజుల పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే నెల1వ తేదీ నుంచి ముంబై హైకోర్టుకు వరుసగా దీపావళి సెలవులు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హైకోర్టుకు సెలవులు కావడంతో నేడు జరిగే విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కొడుకు అరెస్ట్‌తో షారుక్ దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు సమాచారం. అటు షారుక్‌ఖాన్ భార్య గౌరీ ఖాన్ అయితే కొడుకు బెయిల్ కోసం నిత్యం ప్రార్థనలు చేస్తోందని, ఆర్యన్ విడుదల కావాలంటూ భగవతుండ్ని ప్రార్థించమని తన స్నేహితులకు కూడా విన్నవించుకుంటుందట. కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లో స్వీట్స్ వండొద్దని ఇప్పటికే గౌరీ ఖాన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. పుట్టినరోజు, పండుగలను కూడా జరుపుకోవడం లేదు. కొడుకు ఇంటికి వచ్చాకే అన్ని పండుగలు అన్ని గౌరీ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. చదవండి: Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వస్తుందా? రాదా? ‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు -
ప్రేమ కోసం షారుఖ్ ఎన్ని కష్టాలు పడ్డాడో!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ గురువారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. గౌరీ, షారుఖ్లది ప్రేమ వివాహం అని అందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న వీరు వారి ప్రేమను దక్కించుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. సినిమా హీరో అయిన షారుఖ్ కూడా నిజ జీవితంలో చాలానే కష్టాలు పడ్డారు. అయితే వారి ప్రేమ కథ ఏమిటో గౌరీ పుట్టిన రోజు సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం. జర్నలిస్ట్ అనుపమ చోప్రా రాసిన కింగ్ ఆఫ్ బాలీవుడ్: షారుఖ్ ఖాన్ అండ్ సెడక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే పుస్తకంలో వీరి ప్రేమ పెండ్లి పీటలు ఎక్కడానికి పడిన కష్టాలను వివరించారు. గౌరీని పెళ్లి చేసుకునే సమయానికే కింగ్ ఖాన్ టీవీ సీరియల్లో నటిస్తూ ఉన్నాడు. అయితే ఆయనను గౌరీ వాళ్ల ఇంట్లో ఎవరు అంగీకరించలేదు. గౌరీ తండ్రి, రమేష్ చిబ్బా, తన మతం కంటే షారుఖ్ నటనా వృత్తి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్, భారత మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ వద్ద పనిచేస్తున్నప్పుడు సినీ తారల జీవితాలను దగ్గరుండి చూడటంతో ఆయన ఆ వృత్తిని ద్వేషించారు. ఇక గౌరీ తల్లి సవితా, షారుఖ్‌ను తెరపై చూడటానికి ఇష్టపడిన గౌరీ తల్లి అల్లుడిగా మాత్రం అంగీకరించలేదు. ఇక గౌరీ వాళ్ల సోదరుడికి రౌడీ అన్న పేరు కూడా ఉండేది. అతను ఏకంగా షారుఖ్ తలపై గన్‌పెట్టి మరీ బెదిరించాడు. అయినా షారుఖ్ బయటపడకుండా తన ప్రేమను దక్కించుకున్నాడు. షారుఖ్, గౌరీ అక్టోబర్ 25, 1991 న వివాహం చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వారి బంధం బలంగా కొనసాగుతుంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు ఆర్యన్, సుహానా, అబ్రామ్. చదవండి: 'కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు' -
కరోనా : షారుక్ సాయం.. అభినందించిన మంత్రి
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాటం చేస్తున్న మహారాష్ట్రలోని ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లకు తన వంతు సహాయంగా 25వేల పీపీఈ (పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్మెంట్) కిట్లను అందించాడు. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే స్పందిస్తూ షారుక్‌కు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ' థాంక్యూ షారుక్.. మీ వంతుగా 25వేల పీపీఈ కిట్లను అందించినందుకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న మెడికల్ సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయంటూ' ట్విటర్లో పేర్కొన్నాడు. (తల్లి నుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం) దీనిపై షారుక్ స్పందిస్తూ.. ' నేనిచ్చిన కిట్లను హెల్త్ వర్కర్లకు వినియోగిస్తునందుకు మీకు ధన్యవాదాలు. అయినా దేశమంతా ఒకే కుటుంబంగా ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఆపత్కాల సమయంలో నా వంతుగా సహాయం చేశా. కరోనాను తరిమికొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న వైద్య రంగం, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ రీట్వీట్ చేశాడు. Thank you sir for all your help to source the kits. We are all together in this endeavour to protect ourselves and humanity. Glad to be of service. May your family & team be safe and healthy. https://t.co/DPAc7ROh7i — Shah Rukh Khan (@iamsrk) April 13, 2020 అంతకుముందు షారుక్ భార్య గౌరీఖాన్ తమ నాలుగంతస్తుల ఆఫీస్ బిల్డింగ్‌ను క్వారంటైన్ సెంటర్‌గా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖను అందజేశారు. క్వారంటైన్ సెంటర్లో మహిళలకు, చిన్నపిల్లలతో పాటు, మిగతావాళ్లకు కూడా అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై బృహత్ ముంబై కార్పొరేషన్ ట్విటర్లో స్పందిస్తూ.. ' మీ ఆఫీసుని క్వారంటైన్ సెంటర్‌గా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆపత్కాల సమయంలో మీరు చేస్తున్న పనికి మాకు సంతోషంగా ఉందంటూ' తెలిపారు. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10వేల కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 300 దాటేసింది. (మే 3 వరకు లాక్డౌన్ : మోదీ) -
లాస్ ఏంజెల్స్ వీధుల్లో కింగ్ ఖాన్
లాస్ ఏంజెల్స్: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ఈ మధ్యకాలంలో సినిమాలు కలిసి రావడం లేదు. ‘జీరో’ సినిమా ప్లాప్ తర్వాత కింగ్ ఖాన్ ఇంత వరకు బిగ్ స్కీన్‌పై కనిపించనే లేదు. దీంతో షారుక్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చినట్లుగా బీ టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విరామ సమాయంలో షారుక్ తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి అమెరికాలో సేదతీరుతున్నారు. ప్రస్తుతం షారుక్ లాస్ ఏంజెల్స్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్ పక్కన కింగ్ ఖాన్ లేజీగా కూర్చుని ఉన్న ఫొటోకు ‘ఆఖరికి లాస్ ఏంజెల్స్ సూర్యుడు వెళ్లిపోయాడు. ఇక ఇది పూల్ సమయం’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. అలాగే ఈ పోస్టులో గోడకు ఆనుకుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో, అలాగే బిలియార్డ్ టేబుల్ దగ్గర ఉన్న ఫొటోలను ‘షారుక్ ఫ్యాన్స్ క్లబ్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. Finally the California sun is out....it’s time for the Pool...maybe should dress right for it now at my @airbnb villa in LA #Ad #LAonAirbnb pic.twitter.com/PPmRHQLL4u — Shah Rukh Khan (@iamsrk) December 5, 2019 అలాగే కింగ్ ఖాన్ నేవి బ్లూ జాకెట్ ధరించి అభిమానితో దిగిన ఫొటోను, ఓ వీడియోలో అభిమానులు ఆయనను పిలుస్తుంటే తాను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా అన్నట్లుగా రాను అంటూ సైగ చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేశాడు. ఈ వీడియోలు, ఫొటోలను చూస్తుంటే లాస్ ఏంజెల్స్‌లో ఆయనకు మంచి విరామ సమయం దొరికినట్లుగా అనిపిస్తుంది. ఇక షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం యూకే యూనివర్శిటీలో ఫిలిం మేకింగ్ కోర్సు చేస్తుండగా, కూతురు సుహానా ఖాన్‌కు న్యూయార్క్ యూనివర్శిటీలో ఫిలిం స్టడీస్‌లో సీటు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే కింగ్ ఖాన్ ఈ హాలిడేస్‌ను కూతురు, కొడుకుతో కలసి ఎంజాయ్ చేయడానికే లాస్ ఏంజెల్స్‌కు వెళ్లినట్లున్నారు. Here is a video of King Khan in Los Angeles ❤️ pic.twitter.com/7IHi0PAO6g — SRK Universe Fan Club (@SRKUniverse) December 5, 2019 -
బాల్కనీలో నుంచుని చేతులు జోడించిన షారుఖ్
సాక్షి, ముంబై : 53వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బాద్షా తన పుట్టిన రోజు వేడుకలు గురువారం అర్ధరాత్రి ఘనంగా జరుపుకున్నారు. బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు తన ఇంటికొచ్చిన వేలాదిమంది అభిమానులకు షారుఖ్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. బాల్కనీలో నిలబడి అభిమానులకు చేతులు జోడించి అభివాదం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సతీమణి గౌరీ, పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్తో షారుఖ్ ఆనందాన్ని పంచుకున్నారు. గౌరీకి కేక్ తినిపించిన ఫోటో, అభిమానులకు అభివాదం చేస్తున్న ఫోటోలు ట్వీట్ చేశారు. ‘నా అర్ధాంగికి కేక్ తినిపించా. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన నా అభిమాన కుటుంబాన్ని కలుసుకున్నా. ఇప్పుడు నా గారాల పట్టీలతో ఆడుకుంటున్నా. ఎనలేని మీ ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. విశేషమేమంటే. గౌరీకి కేక్ తినిపిస్తున్న షారుఖ్ ఫోటోను దర్శకుడు కరణ్‌జోహర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘హ్యాపీ బర్త్ డే షారుఖ్. నువ్వూ, గౌరీ నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. మీతో పరిచయం నా జీవితంలో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నా. మీలో ఒకడిగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చారు. మరుగుజ్జు పాత్రలో షారుఖ్ నటిస్టున్న ‘జీరో’ చిత్రం ఘనవిజయం సాధించాలని కరణ్ ఆకాక్షించారు. కాగా, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న‘జీరో’ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షారుఖ్ బర్త్‌డే సందర్భంగా ఈ రోజు (నవంబర్ 2 ) ‘జీరో’ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. (జీరో’ ట్రైలర్ అద్భుతంగా ఉంది : ఆమిర్) Fed cake to wife...Met my family of fans outside Mannat...now playing Mono Deal with my lil girl gang! Having a Happy Birthday. Thank u all...for this amazing love. pic.twitter.com/8IthQY3cxQ — Shah Rukh Khan (@iamsrk) November 1, 2018 -
అందుకే గౌరీని పెళ్లాడాను : హీరో
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు షారుఖ్ చాలా ఓపికగా సమాధానం ఇస్తారు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘మీరెందుకు సార్ అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు’ అంటూ అభిమాని ప్రశ్నించగా.. ‘భాయ్.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా వస్తాయి. అయితే నా విషయంలో ఈ రెండు గౌరీ రూపంలో ఒకేసారి వచ్చేశాయి’ అంటూ తాను అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పారు. షారుఖ్ సమాధానానికి ఫిదా అయిన నెటిజన్లు.. ‘కింగ్ ఆఫ్ రొమాన్స్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని, గౌరీపై తనకు ఉన్న ప్రేమని ఎంత హృద్యంగా చెప్పారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీవీ షోలు చేస్తున్న సమయంలోనే షారుఖ్ ఖాన్ గౌరీని ప్రేమించారు. సినిమాల్లో అంతగా గుర్తింపు పొందకముందే 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ జంటగా పేరొందిన వీరికి ఆర్యన్, సుహానా, అబ్రాం అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. -
బాద్షా కూతురి ఫోటో..నెటిజన్లు ఫిదా
బాలీవుడ్ బాద్షా షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్, భార్య గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కూతురితో కలిసి లండన్‌లో దిగిన ఫోటోలను గౌరీ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జీన్స్, టీ షర్ట్స్‌లో గౌరీ, సిల్వర్ కలర్ డ్రెస్‌లో సుహానా ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. లండన్‌లోని ప్రముఖ కాలేజీలో చదువుతోన్న సుహానా తల్లితో కలిసి లండల్లో ఎంజాయ్ చేస్తోంది. కాలేజీ చివరిరోజులు కావడంతో లండన్ మొత్తం చుట్టేస్తోంది. కాగా గౌరీ పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది.సుహానా త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందని తెలుస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుక్ తనయ ఫొటోలు ఎప్పుడూ సోషల్‌మీడియాలో కనిపించినా వైరల్ అవుతూ ఉంటాయి. -
మరోసారి తండ్రి కాబోతున్న హీరో..!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానుల చిలిపి ప్రశ్నలకు షారుఖ్ ఇచ్చే సమాధానాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన షారుఖ్.. తనకు ఆకాంక్ష అనే పేరు అంటే ఎంతో ఇష్టమని.. ఒకవేళ తాను మళ్లీ తండ్రి అయ్యే అవకాశం వస్తే పుట్టే బిడ్డకు ఆ పేరే పెడతానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ట్విటర్లో స్పందించిన ఓ అభిమాని.. ‘ ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. మీరు నాలుగోసారి తండ్రి కాబోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరబోతుందంటూ’ క్రేజీ కామెంట్ చేశాడు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన షారుఖ్.. ‘ఓ మై గాడ్.. ఓ మై గాడ్..! ఒకవేళ నీ కల నిజమైతే అబ్రాం దుస్తులు ఇప్పటి నుంచే దాచి పెట్టాలి. భవిష్యత్తులో పనికొస్తాయి కదా’ అంటూ చిలిపిగా సమాధానమిచ్చారు. కాగా షారుఖ్- గౌరీ ఖాన్ దంపతులకు ఆర్యన్, సుహాన, అబ్రాం అనే ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే. OMG OMG I JUST REMEMBERED I HAD THIS DREAM WHERE YOU WERE EXPECTING YOUR 4TH CHILD IT WAS SO CRAZYY AND SWETTTT #AskSRK — RAAZ SRK❤️ (@RazJabra) June 6, 2018 OMG OMG!! Better save AbRam’s clothes just for in case your dream comes true..kaam aa jayenge https://t.co/alixtVHmV6 — Shah Rukh Khan (@iamsrk) June 6, 2018 -
చిన్నపిల్లోడిగా ఎదుగుతున్నా
ఎవరైనా ఎదుగుతూ ఎదుగుతూ పెద్దవాళ్లు అయిపోతారు. కానీ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మాత్రం చిన్నపిల్లాడిగా ఎదుగుతున్నారట. చిన్నపిల్లాడు అయిపోవటానికి కారణం ఏంటంటే.. షారుక్ ఖాన్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో ‘జీరో’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో ఆయన మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకూ వేరే సినిమా సైన్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు షారుక్. ఈ కమిట్మెంట్ చూస్తేనే అర్థం అవుతుంది ఈ సినిమాపై షారుక్ ఎంత ప్రేమను పెంచుకున్నారో. ‘జీరో’ అనుభవాలను షేర్ చేసుకుంటూ –‘‘ ఐయామ్ లవ్వింగ్ అంyŠ లివ్వింగ్ ఇన్ ‘జీరో’ (జీరోని ప్రేమిస్తున్నాను, అలాగే జీవిస్తున్నాను కూడా) టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని వివరించమంటే మాత్రం ‘చిన్నపిల్లోడిగా ఎదిగిపోతున్నాను. అది కూడా చాలా ఫాస్ట్‌గా’ అని చెప్ప గలను’’ అని పేర్కొన్నారు షారుక్. కత్రినా కైఫ్,అనుష్కా శర్మ కథానాయికలు. గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కానుంది.