‘బాలీవుడ్ బాద్‌షా’ షారుఖ్ ఖాన్ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. బ్లాక్ బస్టర్‌మూవీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, ఖరీదైన బంగ్గాలు, లగ్జరీ కార్లు..అబ్బో.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ పెద్దదే. 1980లలో తన కెరీర్‌ను ప్రారంభించింది మొదలు అత్యంత ప్రజాదరణతో వెండితెరను ఏలుతున్న స్టార్ హీరో. .
పఠాన్, జవాన్ , డంకీ మూవీలతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలి బ్లాక్ బస్టర్‌మూవీ జవాన్‌లో షారుఖ్ ఖాన్ పట్టుకున్న ఫోను మొదలు తమ అభిమాన హీరోకున్న ఫోన్లు ఎన్ని అనేది చర్చకు దారితీసింది.
షారుఖ్ ఖాన్ వద్ద 17 ఫోన్లు
షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్‌ల సంఖ్యను మీరు ఊహించగలరా? అక్షరాల 17 ఫోన్లు అట. షారూఖ్ కరీర్‌లో ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన , వివేక్ వాస్వాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో తప్ప మళ్లీ తనని కలవలేకపోయాయని వివేక్ తెలిపారు. ‘‘ఎస్‌ఆర్‌కే దగ్గర 17ఫోన్లు, ఉన్నాయి. నా దగ్గర ఒకటే నంబరు ఉంది.. నేను ఫోన్ చేసినపుడు ఆయన దొరకడు. ఆయన ఫోన్ చేసినపుడు నేను మిస్ అవుతా.. ఆయనకు బాధ్యతలు ఎక్కువ. నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడు. వెండితెర సామ్రాజ్యాన్ని ఏలుతున్న అద్భుతమైన వ్యక్తి’’ అంటూ గుర్తు చేసుకున్నారు. కాగా రియల్‌మీ, ఒప్పో లాంటి బ్రాండ్లకు షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు.
అంతేకాదు బాలీవుడ్ హ్యాపియస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు షారుఖ్, గౌరీ ఖాన్ జంట . వీరి వివాహ బంధం మొదలై మూడు దశాబ్దాలుదాటింది. ఈ క్రమంలో తన భార్యకు రోజుకు 8-10 సార్లు ఫోన్ చేస్తాననీ, ఒక్కోసారి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చేస్తానని చెప్పడం వైరల్ అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేస్తా, నా భార్యతోనే కదా మాట్లాడేదని అని ఫన్నీగా చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment