![Sharukh Khan Wife Gouri Khan Partcipated In Koffee With Karan - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/19/koffe.jpg.webp?itok=a2H0xrak)
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్. బాలీవుడ్‌లో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఇది ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీజన్‌లో 12వ ఎపిసోడ్ ట్రైలర్‌ను కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పాల్గొన్నారు.
చదవండి: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి.. బర్త్‌డే తర్వాత రెండు రోజులకే!
ఆమెకు కరణ్ పలు ప్రశ్నలు సంధించగా నవ్వుతూ సమాధానాలిచ్చారు. భర్త షారుక్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు భామలు భావన పాండే, మహీప్ కపూర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షో ఫుల్ ఎపిసోడ్ గురువారం రాత్రి ప్రసారం కానుండగా తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు మేకర్స్. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌పై ప్రశ్నతో ఈ ప్రోమో ప్రారంభమైంది.
(చదవండి: Karan Johar: వాతావరణ మార్పుపై పోరాటంగా 'నయా భారత్ కా సప్నా')
మీ కూతురికి డేటింగ్‌పై మీరిచ్చే సలహా ఏంటని గౌరీ ఖాన్‌ను ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. 'ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయవద్దని' సలహా ఇస్తానని నవ్వుతూ చెప్పింది. అలాగే షారుఖ్‌తో మీ ప్రేమకథకు ఏ సినిమా టైటిల్‌ను ఎంచుకుంటారు అని అడగ్గా.. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే అంటూ గౌరీ ఖాన్ నవ్వుతూ ఆన్సరిచ్చింది. అంతే కాకుండా ఈ ఎపిసోడ్‌లో షారుఖ్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గురువారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment