Koffee With Karan
-
అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్- దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 2018లో 'ధడక్' సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టింది. మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకు తెలుగులో ఓ సినిమాకు సంతకం చేసింది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. అటు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఈ మధ్యే 'ద ఆర్చీస్' చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ చనిపోయిన క్షణాలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఓపక్క రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు' అని చెప్పుకొచ్చింది. ఖుషీ మాట్లాడుతూ.. 'నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే అందరూ నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా ఫిక్సయ్యాను' అని చెప్పుకొచ్చింది. కాగా అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో కన్నుమూసింది. చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
ఆమెకు 50, అతడికి 38.. లవ్‌పై ట్రోలింగ్.. హీరో ఏమన్నాడంటే?
సెలబ్రిటీలను ఇష్టపడేవాళ్లుంటారు.. ఉత్తి పుణ్యానికే వాళ్లపై విమర్శలు గుప్పించేవాళ్లూ ఉంటారు. వారు ఏదైనా ఫోటో షేర్ చేసినా, బయటకు వెళ్లినా, ఖరీదైన వస్తువులు కొన్నా, బ్రాండెడ్ అండ్ వెరైటీ డ్రెస్సులు వేసుకున్నా, ఎవరినైనా ప్రేమించినా, ప్రియురాలికి బ్రేకప్ చెప్పినా, భార్యకు విడాకులిచ్చినా.. ఏం చేసినా సరే తిట్లదండకం అందుకోవడానికి రెడీగా ఉంటారు. ఆమెకు 50 అతడికి 38.. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ బారిన పడేవారిలో హీరో అర్జున్ కపూర్ ఒకరు. ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50. గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. కానీ భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్జున్ కపూర్‌కు మరింత దగ్గరైంది మలైకా. వయసు వ్యత్యాసంపై ట్రోలింగ్ అయితే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకును తీసుకొచ్చే అమ్మాయిని పార్ట్నర్గా ఎంచుకోవడమేంటి? నీకంటే 12 ఏళ్లు పెద్ద.. అలాంటి ఆంటీతో లవ్వేంటి? అని నెటిజన్లు తరచూ సూటిపోటి మాటలతో అర్జున్ను వేధిస్తూనే ఉన్నారు. తాజాగా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్న అర్జున్ ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. 'ట్రోలింగ్ వల్ల ఎప్పుడో ఒకసారైనా బాధపడని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. కానీ దాన్ని ఎలా డీల్ చేస్తామనేది ముఖ్యం. లైకుల కోసం చిల్లరపనులు.. ఈ ట్రోలింగ్ వల్ల.. తప్పుడు కామెంట్లు చేసేవారి పద్ధతులు, వక్రబుద్ధి బయటపడుతుంది. ఏదిపడితే అది కామెంట్లు చేసి మన దృష్టిని ఎలాగోలా ఆకర్షించాలనుకుంటారు. మొదట్లో నేను కూడా వారి కామెంట్లకు స్పందించాలనుకున్నాను. కానీ వారికి నేను అటెన్షన్ ఇవ్వడమేంటని తర్వాత లైట్ తీసుకున్నాను. లైకుల కోసం ఇలాంటి చిల్లరపనులు చేస్తుంటారు. మళ్లీ ఇలాంటివారే మనం కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడుతారు' అని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు. చదవండి: వీరప్పన్ స్వయంగా చెప్పిన సంఘటనలతో డాక్యుమెంటరీ సిరీస్.. అక్కడే స్ట్రీమింగ్ -
అంతకుమించిన నరకం ఉండదు.. ఆర్యన్ అరెస్ట్‌పై స్పందించిన గౌరీఖాన్
గతేడాది క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంపై గౌరీఖాన్ తొలిసారి స్పందించింది. ప్రముఖ పాపులర్ టీవీ షో కాఫీ విత్ కరణ్ షోకి మహిప్ కపూర్, భావనా పాండేతో కలిసి హాజరైన ఆమె తొలిసారి కొడుకు అరెస్ట్‌పై మాట్లాడింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు మీ కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డార. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ అన్నింటిని తట్టుకొని నిలబడ్డారు. ఆ కష్టసమయం గురించి ఏమని చెబుతారు అని కరణ్ ప్రశ్నించాడు. దీనికి గౌరీఖాన్ బదులిస్తూ.. అవును. 'మా కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డాం. తల్లిగా అంతకంటే భయంకరమైన అనుభవం ఇంకోటి ఉండదు. కానీ ఆ సమయంలో అందరూ మాకు కుటుంబంలా నిలబడ్డారు. ఏమాత్రం పరిచయం లేని వాళ్లు కూడా మెసేజ్‌లు, కాల్స్ ద్వారా నన్ను ఓదార్చారు. ఆ సమయంలో మాకు ఎంతో ప్రేమ లభించింది. మాకు అండగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని చెబుతూ గౌరీఖాన్ ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ఆ విషయంలో కుమార్తెకు గౌరీ ఖాన్ సలహా.. ఏమని చెప్పిందంటే?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్. బాలీవుడ్లో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఇది ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీజన్లో 12వ ఎపిసోడ్ ట్రైలర్‌ను కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పాల్గొన్నారు. చదవండి: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి.. బర్త్‌డే తర్వాత రెండు రోజులకే! ఆమెకు కరణ్ పలు ప్రశ్నలు సంధించగా నవ్వుతూ సమాధానాలిచ్చారు. భర్త షారుక్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు భామలు భావన పాండే, మహీప్ కపూర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షో ఫుల్ ఎపిసోడ్ గురువారం రాత్రి ప్రసారం కానుండగా తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు మేకర్స్. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌పై ప్రశ్నతో ఈ ప్రోమో ప్రారంభమైంది. (చదవండి: Karan Johar: వాతావరణ మార్పుపై పోరాటంగా 'నయా భారత్ కా సప్నా') మీ కూతురికి డేటింగ్‌పై మీరిచ్చే సలహా ఏంటని గౌరీ ఖాన్‌ను ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. 'ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయవద్దని' సలహా ఇస్తానని నవ్వుతూ చెప్పింది. అలాగే షారుఖ్‌తో మీ ప్రేమకథకు ఏ సినిమా టైటిల్‌ను ఎంచుకుంటారు అని అడగ్గా.. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అంటూ గౌరీ ఖాన్ నవ్వుతూ ఆన్సరిచ్చింది. అంతే కాకుండా ఈ ఎపిసోడ్లో షారుఖ్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గురువారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
పెళ్లి తర్వాత జరిగే తంతు పగలే పూర్తయింది: హీరోయిన్
సెలబ్రిటీల సీక్రెట్స్‌ను బయటపెట్టే షో "కాఫీ విత్ కరణ్". హోస్ట్ కరణ్ జోహార్ తారలతో మాటలు కలుపుతూ వారి గురించి అన్ని విషయాలు రాబడుతుంటాడు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను తెలుసుకోవాలనుకునే ఫ్యాన్స్ ఈ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. తాజాగా ఈ షోకు ఫోన్ బూత్ చిత్రయూనిట్ సిద్దాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్, కత్రినా కైఫ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. ఇందులో కరణ్.. 'పెళ్లిరోజు అలిసిపోతాం, కాబట్టి ఆరోజు శోభనం ఉండదు' అన్న ఆలియా సమాధానాంపై స్పందనేంటని అడిగాడు. దీనికి కత్రినా.. మా శోభనం పగలు జరిగింది అని షాకింగ్ ఆన్సరిచ్చింది. ఇక సిద్దాంత్ చతుర్వేదిని సింగిలా? కమిటెడా? అని అడిగాడు. దానికతడు ఇప్పటికీ బ్రహ్మచారినేనని ఆన్సరిచ్చాడు. ఆమధ్య అనన్య పాండేతో తెగదెంపులు చేసుకున్న ఇషాన్ ఖట్టర్ కూడా తాను ఏ రిలేషన్లో లేనని క్లారిటీ ఇచ్చాడు. కాగా గతేడాది డిసెంబర్ 9న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. చదవండి:బ్రహ్మాస్త్రపై భారీ అంచనాలు.. కానీ అంతా తలకిందులయ్యేలా ఉందే! లలిత్ మోదీకి సుష్మిత బ్రేకప్?! -
ఆ డైరెక్టర్‌కి అలా హగ్ ఇచ్చా.. అందరు వింతగా చూశారు: కియారా
సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ప్రస్తుతం ఆమె హిందీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇటూ తెలుగు, అటూ హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి ఆమె కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా పరిశ్రమలోకి రాకుముందు ఓ దర్శకుడి పట్ల తను వ్యవహరించు తీరుకు చాల ఇబ్బంది పడ్డానని చెప్పింది. చదవండి: పూరీ దగ్గర సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడా! ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నటి అవ్వాలనేది నా కోరిక. ఇదే విషయం మా దగ్గరి బంధువు అయిన నటి జూహి చావ్లాకు తెలిసింది. నన్ను నటిగా తెరపైకి తీసుకురావాలని ఆమె ప్రయత్నిస్తున్న క్రమంలో తను నటించిన ఐ యామ్ మూవీ విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఆమె ఇండస్ట్రీ వాఆళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ హీరోహీరోయిన్లు, దర్శక-నిర్మాతలతో పాటు పలువుకు సినీ పెద్దలు కూడా హాజయ్యారు. వారికి పరిచయం చేసేందుకు నన్నూ కూడా ఆపార్టీకి ఆహ్వానించారు. చదవండి: సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్ అక్కడికి వెళ్లిన నన్ను.. దర్శకుడు సుజాయ్ హోష్కు ఆమె పరిచయం చేశారు. పరిచయం అనంతరం ఆయన నాతో మాట్లాడుతూ.. చేయి పైకెత్తి ఎవరినో పిలవబోయారు. దాన్ని అర్థం చేసుకోలేని నేను.. కౌగిలించుకోమన్నారేమో అనుకుని వెంటనే ఆయన్ని హగ్ చేసుకున్న. నేను చేసిన పనికి అక్కడే ఉన్న జూహీ షాకై చూశారు. ‘ఈ అమ్మాయి ఇలా చేసిందేంటి!’ అన్నట్టుగా ఆమె నా మొహం వైపు చూశారు. ఆ సంఘన గుర్తొస్తే ఇప్పటికీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను మర్చిపోలేని ఇబ్బందికర సంఘటన ఇది’’ అంటూ కియారా చెప్పుకొచ్చిది. -
మీ అమ్మ నువ్వింకా కన్యవే అనుకుంటుందా?.. షాకైన హీరోయిన్
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలు లాగడమే ఈ షో లక్ష్యంగా తయారైంది. ఏ సెలబ్రిటీ వచ్చినా వారి బెడ్రూమ్ విషయాలు లేదంటే రిలేషన్షిప్ గురించి ఏ మాత్రం మొహమాటం లేకుండా కూపీ లాగుతుంటాడు హోస్ట్ కరణ్ జోహార్. ఇటీవల సిద్దార్థ్ మల్హోత్రా ఈ షోకి రాగా తాజాగా సిద్దార్థ్ ప్రేయసి కియారా అద్వానీ కాఫీ విత్ కరణ్‌లో ప్రత్యక్షమైంది. ఆమెతో పాటు హీరో షాహిద్ కపూర్ కూడా గెస్ట్‌గా విచ్చేశాడు. ఇక వాళ్లిద్దరినీ సోఫాలో కూచోబెట్టిన కరణ్.. తన వాడివేడి ప్రశ్నలతో కియారాకు చెమటలు పట్టించాడు. నువ్వు బెడ్రూమ్లో దొంగా పోలీసు వంటి ఆటలు ఆడలేదా? అని అడిగాడు. దీనికామె కొంత ఇబ్బందిగా చూస్తూ మా అమ్మ ఈ ఎపిసోడ్ చూస్తుంది అని బదులిచ్చింది. అయినా వెనక్కు తగ్గని హోస్ట్.. అయితే ఏంటట? మీ అమ్మ నువ్వింకా కన్యవనే అనుకుంటుందా, ఏంటి? అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి కియారా నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా అని ఆన్సరిచ్చింది. సిద్దార్థ్‌తో నువ్వు రిలేషన్లో లేవా? అన్న ప్రశ్నకు అవుననీ చెప్పను, కాదనీ చెప్పను అని తెలివిగా ప్రశ్నను దాటవేసింది. అయితే మీరు క్లోజ్ ఫ్రెండ్సా? అని అడగ్గా.. క్లోజ్ ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువే! అని తెలిపింది. కాగా కియారా అద్వానీ ప్రస్తుతం సత్య ప్రేమ్ కీ కథ అనే సినిమా చేస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) చదవండి: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఎలా ఉందంటే... 'ది ఫ్యామిలీ మ్యాన్' తరహాలో.. మరోసారి డేర్ చేస్తున్న సామ్ -
నా షోకి రమ్మని వాళ్లిద్దరినీ ఎప్పటికీ పిలవను
కాఫీ విత్ కరణ్.. వెండితెర సెలబ్రిటీలను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసే షో. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ రన్ అవుతోంది. ఎంతోమంది గొప్పగొప్ప సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్న ఈ షోలో ఇద్దరు మాత్రం ఎప్పటికీ రారని బల్ల గుద్ది చెప్తున్నాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను నా షోకి రావాలని రేఖ మేడమ్‌ను చాలా అభ్యర్థించాను. గతంలోనే కాదు, ఈ మధ్య కూడా అడిగా. తను ఎలాగైనా నా షోలో కనబడాలనుకున్నాను. కానీ ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అంటే తను ఏదో పెద్ద రహస్యం దాస్తుందనీ, అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. అయినా తను ససేమీరా నో చెప్పింది కాబట్టి ఇకపై ఎప్పుడూ ఆమెను రమ్మని ఆహ్వానించను. అలాగే నా స్నేహితుడు, గురువు ఆదిత్య చోప్రాను కూడా రమ్మని చెప్పను. ఎందుకంటే తనపై ప్రశ్నలు కురిపించేటంత తెలివితేటలు నాకు లేవు. కాబట్టి బహుశా వీళ్లిద్దరూ నా షోలో కనిపించకపోవచ్చు' అని చెప్పుకొచ్చాడు కరణ్. కాగా 2005లో కాఫీ విత్ కరణ్ తొలిసారిగా టీవీలో ప్రసారమైంది. అయితే ఏడో సీజన్ మాత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. గత వారం విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రా షోలోకి విచ్చేయగా ఈ వారం షాహిద్ కపూర్, కియారా అద్వానీ రానున్నారు. చదవండి: త్రిష నిజంగా రాజకీయాల్లోకి రానుందా? ఆమె తల్లి ఏమందంటే? మళ్లీ కరోనా బారిన అమితాబ్, ఆస్పత్రిలో చేరిన బిగ్‌బి.. -
ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్, ఏమన్నాడంటే..
ప్రస్తుతం బాలీవుడ్ ప్రేమజంటలో కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల ప్రేమయాణం తరచూ హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట నేరుగా ఎప్పుడు స్పందించలేదు. ఒకవేళ మాట్లాడిన తాము స్నేహితులమే అంటూ రూమార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా వీరి ప్రేమ, పెళ్లిపై రూమర్లు ఆగడం లేదు. ఇటీవల కియార బర్త్‌డే వేడుకలో భాగంగా ఈ జంట దుబాయ్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు బయటకు రావడంతో వీరి లవ్ ఎఫైర్ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్ ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఓ షోలో తమ రిలేషన్‌పై నోరువిప్పాడు సిద్ధార్థ్. కాఫీ విత్ కరణ్ షోకు వచ్చిన సిద్ధార్థ్, కియారాతో ప్రేమలో ఉన్నట్లు పరోక్షంగా ప్రకటించాడు. హీరో విక్కీ కౌశల్‌తో కలిసి సిద్ధార్థ్ ఈ టాక్ షోలో పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చేత కియారాతో రిలేషన్‌ను బయటపెట్టించే ప్రయత్నం చేశాడు కరణ్. ఈ క్రమంలో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్‌ను ప్రశ్నించాడు.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. చదవండి: ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ ఈ సందర్భంగా కాఫీ విత్ కరణ్ గత సీజన్లో కియారాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సిద్ధార్థ్ కోసం ప్లే చేశాడు కరణ్. అందులో సిద్ధార్థ్ గురించి అడగ్గా.. తామిద్దరం స్నేహితుల కంటే ఎక్కువ అని కియారా చెప్పడం.. సిద్ధార్థ్ ముసిముసి నవ్వడంతో వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోతున్నారు. అంతేకాదు తన ప్రశ్నలతో కరణ్, కియారాను ఇబ్బంది పెట్టడం చూసి తనని ఎందుకు అన్ని ప్రశ్నలు అడిగారు? అని అన్నాడు. దీంతో ఒకే మీ పెళ్లేప్పుడు అని సిద్ధార్థ్‌ను అడగ్గా.. మీరు సెటిల్ అయ్యారు.. మేము అవ్వోద్దా? అని సమాధానం ఇచ్చాడు. ఇక చివకరగా ఒకవేళ తనని పిలవకుండానే పెళ్లి చేసుకుంటే కొడతానంటూ సిద్ధార్థ్‌ను హెచ్చరించాడు కరణ్. -
విజయ్‌కి షాకింగ్ ఇన్సిడెంట్, ‘చీజ్’ అంటూ కామెంట్.. ‘రౌడీ’ రియాక్షన్ చూశారా?
ప్రస్తుతం నార్త్‌లో లైగర్ హవా మామూలుగా లేదు. లైగర్ ఎక్కడికి వెళ్లిన ఆ ప్రాంతం జనసంద్రంలా మారిపోతుంది. దీంతో విజయ్ క్రేజ్ చూస్తుంటే సౌత్ ఆడియన్స్‌కి మతిపోతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ క్రమంలో లైగర్ టీం ఇటీవల ముంబై, పుణే, పాట్నాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోతో లైగర్ ప్రమోషన్ షూరు చేశారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు ఈ షోలో పాల్గొని పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కరణ్ జోహార్ నీకు చీజ్ ఇష్టమా? అని విజయ్‌ని ఆటపట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై విజయ్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సంఘటన ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఈ ‘లైగర్’ మీడియా పర్సన్ విజయ్ అన్న విజయ్ అన్న పిలుస్తూ ‘ఇతనికి కూడా చీజ్ కావాలంటా?’ అంటూ కామెంట్ చేశాడు. అది విన్న విజయ్ అతని వంక కాస్తా అసహనంగా చూశాడు. ఇక మనసులోనే ఏదో అనుకుంటూ ముందుకు కదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్ రియాక్షన్ చూసిన నెటిజన్లు ‘ఇకపై చీజ్ పేరు వింటే విజయ్ కోపంతో రగిలిపోతాడేమో’, ‘కాఫీ విత్ కరణ్ షో ఎంతపని చేసింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ టాక్ షో తొలి ఎపిసోడ్లో పాల్గొన్న సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లను డేటింగ్ చేయాలంటే ఏ హీరోను ఎంచుకుంటారని అడగ్గా ఇద్దరు విజయ్ దేవరకొండ అని సమాధానం చెప్పారు. ఈ ఆన్సర్పై జాన్వీని అంటే నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా? అని సారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి సమాధానం విన్న కరణ్ జోహార్ ఇద్దరు ఒక వ్యక్తితోనే డేటింగ్ చేస్తారా! అంటూ విజయ్‌ని చిజ్తో పోల్చాడు. View this post on Instagram A post shared by Sneh Zala (@snehzala) -
ఆ హీరో ఎంతమంది అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకున్నాడు?
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ అనడం కన్నా వారిని రోస్ట్ చేసే షో అనడం బెటరేమో! ఎందుకంటే ఇందులో సెలబ్రిటీలను పిలిచి వారిని చిత్రవిచిత్ర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఈ షోకు బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ హాజరయ్యారు. ఇంకేముంది, వచ్చీరాగానే తన ప్రశ్నలకు పదును పెట్టాడు కరణ్. అర్జున్ను ఉద్దేశిస్తూ సోనమ్‌తో.. నీకున్న ఎంతమంది ఫ్రెండ్స్‌తో ఇతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? అని అడిగాడు. దీనికామె అది నేనిప్పుడు మాట్లాడలేను. అయినా నాకలాంటి బ్రదర్స్ లేరు అని బదులిచ్చింది. అందుకు కరణ్ గట్టిగా నవ్వేస్తూ మరెలాంటి బ్రదర్స్ ఉన్నారని మరింత ఉడికించాడు. ఈ వ్యవహారంతో మధ్యలో కల్పించుకున్న అర్జున్.. నువ్వెలాంటి సిస్టర్‌వి అసలు.. మాకోసం ఏం చెప్తున్నావో తెలుస్తోందా? సోనమ్‌తో ట్రోల్ చేయించడానికే నన్ను ఈ షోకి పిలిచారా? ఏంటి? అని అడిగాడు. తర్వాత అర్జున్ను నీ ప్రేయసి మలైకా నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నావని అడిగాడు హోస్ట్. దానికతడు నాకు మలైకా అనే పేరే ఇష్టం, కాబట్టి అలాగే సేవ్ చేసుకున్నానని చెప్తాడు. ఇక ఈ ప్రోమో హాట్‌స్టార్‌లో రిలీజవగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీరి సంభాషణ పూర్తిగా వినాలంటే గురువారం వరకు ఆగాల్సిందే! చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ మహేశ్ బాబు 'పోకిరి' స్పెషల్ షో.. ఫ్యాన్స్‌కు పండగే -
శృంగార జీవితంపై హీరోయిన్ తాప్సీ బోల్డ్ కామెంట్స్
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పింక్, తప్పడ్ , రష్మీ రాకెట్ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం దోబారా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఇటీవలి కాలంలోహీరో, హీరోయిన్స్ ఎక్కువగా తమ మూవీ ప్రమోషన్స్ కోసం కాఫీ విత్ కరణ్ సీజన్-7లో పాల్గొంటున్నారు. చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్.. ఎందుకంటే అయితే తాప్సీ మాత్రం ఆ షోకి వెళ్లకపోవడంపై మీడియా నుంచి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. కరణ్ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని అడగ్గా.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం కరణ్ షోపై తాప్సీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కరణ్ శృంగార జీవితం(సెక్స్ లైఫ్)పై అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. చదవండి: ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆలియా భట్ ఎంత సంపాదిస్తుందో తెలుసా? -
మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. ఈ షో ఎంతటి క్రేజీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు వచ్చిన సినీ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో చిక్కు ప్రశ్నలు అడిగి ఇబ్బందుల్లో పడేస్తుంటాడు కరణ్. అలా వారి నుంచి ఆసక్తిర విషయాలను బయటపెట్టిస్తూ ఈ టాక్ షోను సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ సీజన్లో తొలిసారి మన తెలుగు హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండలు సందడి చేశారు. చదవండి: బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్ రివ్యూ.. ఏమన్నాడంటే దీంతో కాఫీ విత్ కరణ్ 6వ సీజన్‌కు నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో లెటేస్ట్ ఎపిసోడ్లో లాల్ సింగ్ చద్దా హీరోహీరోయిన్లు అయిన ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, కరీనాను అడిగిన ఓ ప్రశ్న ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రాపిడ్ ఫైర్ రౌండ్లో హోస్ట్ కరణ్ కరీనాను కజిన్ రణ్‌బిర్ కపూర్, షాహిద్ కపూర్ పార్టీ చేసుకుంటే ఎవరు మిమ్మల్ని ఆహ్వానించరు అని అడగ్గా.. ‘రణ్‌బిర్ కజిన్ కాబట్టి ఆహ్వానిస్తాడు. కానీ షాహిద్ కపూర్ మాత్రం ఆహ్వానించకపోవచ్చు’ అని వివరించింది. చదవండి: పసి పిల్లలను సైతం చంపే రాక్షస చక్రవర్తి 'బింబిసార'.. మూవీ రివ్యూ ఆ తర్వాత గతంలో ఈ షోలో బేబో ఎన్నోసార్లు పాల్గొంందని, పెళ్లికి ముందు ఒకసారి, పెళ్ల అనంతరం తన భర్త సైఫ్‌తో.. మాజీ భర్త షాహిద్.. అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో షోకు వచ్చినవారంత ఒక్కసారిగా షాకయ్యారు. కరణ్ మాటలకు కరీనా సైతం అవాక్కైంది. తన తప్పును వెంటనే సవరించుకున్న కరణ్.. కరీనాను క్షమాపణలు కోరాడు. కాగా కరీనా, షాహిద్లు జంటగా నటించిన జబ్ వి మెట్ మూవీ సమయంలో వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లకు ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న వీరిద్దరు. ఆ తర్వాత కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా.. షాహిద్ మిరా రాజ్‌పుత్‌ను వివాహమాడాడు. -
నా మాజీ భార్యలను వారానికోసారి కలుస్తా: ఆమిర్ ఖాన్
వేడి వేడి పొగలు కక్కే కాఫీ అంటే చాలామందికి ఇష్టం. అలాగే వాడివేడి ప్రశ్నలతో సెలబ్రిటీలను ఉక్కిరిబిక్కిరి చేసే కాఫీ విత్ కరణ్ షో అంటే కూడా ఇష్టపడేవారు ఎందరో! అందుకే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిగా చేసుకుంది కాఫీ విత్ కరణ్. ప్రస్తుతం ఏడో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రన్ అవుతోంది. ఈసారి ఈ షోకి లాల్ సింగ్ చద్దా టీం ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ వచ్చారు. వారికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన కరణ్.. వారిని నవ్విస్తూనే మరోపక్క సీక్రెట్స్ గుట్టు లాగాడు. ఈ సందర్భంగా ఆమిర్ మాట్లాడుతూ.. 'తన రిలేషన్షిప్లో ప్రేమ, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నాయే తప్ప క్రూరమైన క్షణాలంటూ ఏమీ లేవు. నా మాజీ భార్యలిద్దరి మీద నాకెంతో గౌరవం ఉంది. ఇప్పటికీ మేమంతా ఓ కుటుంబంలా ఉంటాము. మేము ఎంత బిజీగా ఉన్నా వారానికోసారైనా తప్పకుండా అందరం కలుసుకుంటాం. మామధ్య కేరింగ్, ప్రేమాభిమానాలు అలాగే ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్- రీనా 1986 ఏప్రిల్ 18న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకనిర్మాత కిరణ్‌రావును ప్రేమించాడు ఆమిర్. 2005లో వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ దంపతులకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆజాద్ రావు ఖాన్ జన్మించాడు. 2021లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు. చదవండి: భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్, ప్రణీత ఏమందంటే? నటితో అమర్దీప్ నిశ్చితార్థం, వీడియో వైరల్ -
శృంగారంపై ప్రశ్న.. హీరోయిన్ సమాధానం ఏంటంటే?
Koffee With Karan 7: Kareena Kapoor Answer To Karan Johar Question: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా సక్సెస్ అయిన షో 'కాఫీ విత్ కరణ్' టాక్ షో. ఇప్పటికీ ఈ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్లో పార్టిస్పేట్ చేసిన సెలబ్రిటీలతో అనేక రహస్యాలను బయటపెడుతున్నాడు ఈ స్టార్ ప్రోడ్యూసర్. ఇటీవలిటీ ఎపిసోడ్లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ అన్నదమ్ములతో డేటింగ్ చేయడం, విజయ్ దేవరకొండ కారులో శృంగారం చేయడం వంటి విషయాలతోపాటు సమంత, అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ఐదో ఎపిసోడ్ ప్రొమోను బయటకు వదిలారు. ఈ ఎపిసోడ్లో 'లాల్ సింగ్ చద్దా' హీరోహీరోయిన్లు అమీర్ ఖాన్, కరీనా కపూర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'పిల్లలు పుట్టాక సంతృప్తికర లైంగిక జీవితం అనేది నిజమా? కల్పితమా?' అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు 'మీకు తెలియదా?' అని కరీనా కపూర్ ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో 'మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా లైంగిక జీవితం గురించి మాట్లాడటం బాగుండదేమో?' అని కరణ్ చెప్పగా వెంటనే 'మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మాత్రం మీ అమ్మగారు పట్టించుకోవడం లేదు కదా' అని అమీర్ అనడంతో షోలో నవ్వులు కురిశాయి. చదవండి: హీరోయిన్ మేనకోడలు, కాంగ్రెస్ నాయకుడి కుమార్తె మృతి.. హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ కాగా అమీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చదవండి: నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్ బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
రష్మికపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ రూమర్డ్ కపుల్‌గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొడుతూ తరచూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. మధ్య ప్రేమాయణం ఉందని, వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చన్న వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. అయితే వీటిని రష్మక-విజయ్‌లు ఖండించినప్పటికీ రూమర్లకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా ఈ పుకార్లలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేశాడు నిర్మాత కరణ్ జోహార్. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో విజయ్ కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌ని అలాగే విజయ్‌ని కూడా రష్మికతో డేటింగ్ రూమర్స్‌పై ఆరా తీయగా.. తను నా డార్లింగ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా కెరీర్ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా. షూటింగ్లో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్, జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో మాధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్. తనంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పడం ఆసక్తిని సంతరించుకుంది. చదవండి: రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ -
విజయ్, రష్మిక డేటింగ్? హింట్ ఇచ్చిన అనన్య పాండే
‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండేతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ షోలో సందడి చేశాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. కొద్దికాలంగా విజయ్ ఫ్యాన్స్‌లో నెలకొన్న సందేహాంపై ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. కాగా విజయ్, రష్మిక డేటింగ్లో ఉన్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి వట్టి పుకార్లననే విజయ్-రష్మికలు ఆ వార్తలను కొట్టిపారేశారు. అయినా వీరిపై రూమర్లు ఆగడం లేదు. తాజాగా ఈ షోలో కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండ రిలేషిప్ స్టేటస్‌పై అభిప్రాయం ఏంటని అనన్యను ప్రశ్నించాడు. చదవండి: విజయ్ పాడిన ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ విన్నారా? దీనికి అనన్య ముసిముసి నవ్వుతూ.. ‘హీ ఈజ్ ఇన్ ‘రష్’(He is in rush). విజయ్ చాలా తొందరపడుతున్నాడు. మీకా.. మీకా సింగ్‌ను కలిసేందుకు అత్యుత్సహాంతో ఉన్నాడు’ అంటూ పరోక్షంగా ఫ్యాన్స్‌కి హింట్ ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు, ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంటే ‘అనన్య విజయ్-రష్మికలు రిలేషన్లో ఉన్నారని చెప్పకనే చెప్పారా?’,‘అయితే విజయ్ రష్మికతో మింగిల్ అయ్యేందుకు ఆత్రుతుగా ఉన్నాడా?’, ‘హో రష్-మికా(Rush-Mika)’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనన్య సమాధానానికి విజయ్ ఏమాత్రం ఆశ్యర్యపడలేదు. అయితే నువ్వు అదే అనుకుంటున్నావా? అని తిరిగి అనన్యను ప్రశ్నించాడు. ఆ తర్వాత కరణ్ కూడా రష్, మీకా అని అనన్య చెప్పిన పదాలను పదే పదే నొక్కి చెప్పాడు. చదవండి: ఎలాంటి నెగిటివిటి లేకుండా జీవించగలను: ఐశ్వర్య ఆసక్తికర ట్వీట్ The only time I loved ananya pandey!!!!! Happy tears in my eyes now#virosh #vijaydevarakonda #rashmika #LigerSaalaCrossbreed@TheDeverakonda @iamRashmika pic.twitter.com/zLLSy7lXJ0 — Raj❤❤vijay deverakonda (@deverakonda_raj) July 28, 2022 -
నా లవ్ గురించి చెప్పి అందరినీ బాధపెట్టలేను: విజయ్ దేవరకొండ
కాఫీ విత్ కరణ్ షో ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో టీవీలో మాత్రమే ప్రసారమయ్యే ఈ షో ఇప్పుడు కేవలం ఓటీటీలోనే అందుబాటులో ఉంది. కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీలను తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు కరణ్. అతడి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నటీనటుల బిక్కమొహం వేసుకుని కూర్చున్న సందర్భాలు కోకొల్లలు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండను సైతం కొన్ని అభ్యంతరకర ప్రశ్నలు అడిగి అతడిని ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు, అతడి లవ్ లైఫ్ కోసం కూడా ఆరా తీశాడు. ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా? అన్న ప్రశ్నకు విజయ్ ఏమన్నాడంటే.. 'నేను పెళ్లి చేసుకుని, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్న రోజు దీనికి సమాధానం గట్టిగా చెప్తాను. అప్పటివరకు నేను నోరు విప్పి ఎవరి మనోభావాలను కించపరచాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది నటుడిగా నన్ను ప్రేమిస్తారు. గోడలపై నా పోస్టర్లు అతికిస్తారు. ఫోన్ వాల్‌పేపర్ మీద కూడా నా ఫొటోనే ఉంటుంది. నన్ను అంతలా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. అలాంటిది నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేను' అని బదులిచ్చాడు. కాగా విజయ్, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! అటు రౌడీ హీరో, ఇటు రష్మిక ఇద్దరూ తాము మంచి స్నేహితులం మాత్రమేనని, తమ మధ్యలో ఏదీలేదని స్పష్టం చేసినప్పటికీ కొందరు మాత్రం ఇప్పటికీ వారు ప్రేమికులేనని బలంగా నమ్ముతుండటం గమనార్హం. చదవండి: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా -
చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన ‘రౌడీ’ హీరో
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన చిత్రం లైగర్. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మూవీ టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష్‌న్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా లైగర్ హీరోహీరోయిన్లు విజయ్, అనన్య పాండేలు కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో పాల్గొన్నారు. త్వరలోనే రాబోయే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. ఈ సందర్భంగా విజయ్, అనన్యలను తన బోల్డ్ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు కరణ్ జోహార్. చదవండి: నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్ నీకు చీజ్ ఇష్టమా? అని విజయ్‌ని ప్రశ్నించగా.. వామ్మో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ ముసిముసిగా నవ్వాడు విజయ్. ఆ వెంటనే గత ఎపిసోడ్లో జాన్వీ, సారాలు విజయ్ గురించి మాట్లాడిన వీడియోను ప్లే చేశాడు కరణ్. ఆ తర్వాత తన పార్టీలో అనన్య ఎదో చేసిందని దారి గురించి అడగాలి అంటుండగా ఆమె వద్దు వద్దు అంటూ అడ్డుపడింది. ఆ వెంటనే నీకు ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఏం జరగుతోందని అడిగి అనన్యను చిక్కుల్లో పడేశాడు. దీంతో ఆమె మాట మాట్లాడకుండా షాకై చూస్తుంది. చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్ ఇక ఆ తర్వాత విజయ్‌ని ‘చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్’(చివరిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావు) అని అడగ్గా.. ఈ ప్రశ్నని రద్దు చేయండని కరణ్‌ను పదే పదే రిక్వెస్ట్ చేశాడు విజయ్. ఆ వెంటనే అనన్య నేను చెప్పనా.. ఈ రోజు ఉదయమే వ్యాయమం చేశాడని చెబుతుంది. ఆమె సమాధానానికి కరణ్ ఆశ్చర్యంగా చూస్తూ.. మొదటిసారి.. ఈరోజు ఉదయమా! అంటాడు. ఇలా శాంతం ప్రోమో ఆసక్తిగా సాగింది. దీనికి ‘ఫుల్ ఎపిసోడ్ కోసం వేయింటింగ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Serious question - do you like 🧀? Then you'll love Episode 4 of #HotstarSpecials #KoffeeWithKaranS7, streams from this Thursday only on Disney+ Hotstar.@DisneyPlusHS @TheDeverakonda @ananyapandayy @apoorvamehta18 @jahnvio @aneeshabaig @Dharmatic_ pic.twitter.com/omxqi1NyBO — Karan Johar (@karanjohar) July 26, 2022 -
బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్
Akshay Kumar Says Bollywood Actors Scared To Do Multi Starrer Movies: అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న షోలలో 'కాఫీ విత్ కరణ్' టాక్‌షో ఒకటి. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుని ఏడో సీజన్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోలో సినీ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడో సీజన్లో అలియా భట్-రణ్వీర్ సింగ్, బీ టౌన్ బెస్ట్ ఫ్రెండ్స్ జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్ పాల్గొని అలరించారు. తాజాగా మూడో ఎపిసోడ్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ షోలో మల్టీస్టారర్ గురించి అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. హిందీ హీరోలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓర్మాక్స్ పాపులారిటీ సర్వేలో సమంత, అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. మీరిద్దరూ టాప్ లిస్ట్‌లో ఎలా ఉన్నారని కరణ్ ప్రశ్నించగా.. 'నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణం. సాధారణంగా బాలీవుడ్ యాక్టర్స్ మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి భయపడతారు. సింగిల్ హీరో సినిమాలకే ఎక్కవగా ప్రాధాన్యత ఇస్తారు. మరో హీరోతో కలిసి పనిచేయడంలో అభద్రతా భావం ఉంది. మీకు నచ్చిన పాత్ర తీసుకోమ్మని చెప్పినా కూడా నో చెప్పిన సందర్భాలున్నాయి. దినిని విడిచిపెట్టాలి. నేను, కరణ్ నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో కావాలనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా ఏ హీరో ఒప్పుకోలేదు' అని అక్షయ్ షాకింగ్ విషయాలు తెలిపాడు. చదవండి: మాజీ భార్యతో స్టార్ హీరో స్పెషల్ డిన్నర్.. ఫొటోలు వైరల్ కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ రామ సేతు, ఓ మై గాడ్ 2, సెల్ఫీ, రాట్ససన్ రీమేక్, క్యూప్సూల్ గిల్, గూర్ఖా, బడే మియాన్ చోటే మియాన్, సూరరై పోట్రు రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. -
కాఫీ విత్ కరణ్: టాలీవుడ్ నెపోటిజంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం 7వ సీజన్‌ను జరుపుకుంటుంది. ఈ సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో లెటెస్ట్ ఎపిసోడ్లో స్టార్ హీరోయిన్ సమంత సందడి చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె ఈ షోలో పాల్గొంది. అయితే ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమంత ఎపిసోడ్ తాజాగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సందర్భంగా కరణ్ సమంతను విడాకులు, ట్రోల్స్‌పై పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగగా సమంత తనదైన శైలిలో సమాధానం చెబుతూ వచ్చింది. అలాగే టాలీవుడ్ నెపోటిజంపై కూడా తనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సామ్ స్పందిస్తూ.. ‘టాలీవుడ్లో చాలా మంది హీరోల పిల్లలు, వారి బంధువుల పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు.. కానీ విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్‌గా మారడం చాలా అరుదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కరణ్ టాలీవుడ్‌ను ‘బిగ్ బాయ్స్ క్లబ్’ అని కామెంట్స్ రావడం తాను విన్నానని, దీనిపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించాడు. ‘నాకు తెలిసి రెండు ఆపిల్స్ ఒకెలా ఉండవు. ఒక ఆపిల్ నుంచి మరో ఆపిల్‌కు భిన్నంగా ఉంటుందని అనుకుంటున్నాను. నెపో పిల్లలు.. నాన్ నెపో పిల్లలు. ప్రతి ఒక్కరు తమ సొంత ఆలోచనలు, ప్రతిభ కలిగి ఉంటారు. వారికి కూడా టాలెంట్ ఉంటుంది. ఉదాహరణకు ఒక తండ్రి కోచ్‌గా ఉన్నప్పుడు అతని కుమారుడు గేమ్ ఆడుతున్న సమయంలో పక్కన నిలబడి చూడటం తప్పా, కొడుకును గెలిచేందుకు ఏం చేయలేడు కదా. ఇది అలాగే’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సపోర్ట్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడంపై(ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్) తన అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘ఆ అడ్వంటేజ్ అనేది మొదటి సినిమాల వరకు మాత్రమే ఉంటుంది. చదవండి: ఓటీటీ హావా.. ఈ ఒక్క రోజే ఏకంగా 13 సినిమాలు సందడి సరే రెండు, మూడు, నాలుగు సినిమాలకు కూడా ఉండోచ్చు. అంతకంటే ఉండదు కదా. అదే నన్ను చూసుకుంటే. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా సినిమాలు ఫెయిల్ అయినా, డిజాస్టర్ అయినా మా అమ్మ-నాన్నలకు, సోదరులకు మాత్రమే తెలుస్తుంది. అదే స్టార్ హీరోల పిల్లలు ఫెయిల్ అయితే దేశం మొత్తం తెలిసిపోతుంది. వారిని ఎప్పుడు ట్రోల్ చేస్తుంటారు. వారిని వారసత్వంతో పోలుస్తూ విమర్శలు చేస్తుంటారు. సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులని, గొప్ప నటులందరూ సూపర్ స్టార్స్ అని నేను అనుకోను. దైవానుగ్రహంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. మన సక్సెస్ నిర్ణయించేది ప్రేక్షకులే’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది. -
అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్
Sara Ali Khan Janhvi Kapoor Dating With Two Brothers: అత్యధిక ప్రజాధరణ పొందిన టాక్ షోలలో 'కాఫీ విత్ కరణ్' ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షో 7వ సీజన్ ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్లో రణ్వీర్ సింగ్, అలియా భట్ అలరించగా.. రెండో ఎపిసోడ్లో బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ సందడి చేశారు. అయితే వీరిద్దరూ పార్టిస్పేట్ చేసిన ఎపిసోడ్ ఫుల్ వీడియో గురువారం (జులై 15)న రిలీజైంది. ఈ ఎపిసోడ్లో సారా, జాన్వీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు హోస్ట్ కరణ్ జోహార్. కాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో వీరిద్దరు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి విజయ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ అన్నదమ్ములతో డేటింగ్ చేసినట్లు తెలిపాడు కరణ్ జోహార్. దీనికి షాకైన ఈ ముద్దుగుమ్మలు 'ఇంత ఓపెన్‌గా షోలో చెప్పేస్తావా ?' అని అన్నారు. తర్వాత ఆ అన్నదమ్ములతో స్నేహం లాక్డౌన్ సమయంలో జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆ బ్రదర్స్ ఇద్దరూ సారా, జాన్వీ పొరుగింట్లో ఉండేవాళ్లని తెలిపారు. కరణ్ చేప్పిన మాటలు నిజం కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. View this post on Instagram A post shared by veersara (@veerandsara) సారా, జాన్వీతో డేటింగ్ చేసిన ఆ అదృష్టవంతులు వీరేనంటూ పలు రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వారు డేటింగ్ చేసిన బ్రదర్స్ వీర్ పహారియా, శిఖర్ పహారియా (వరుసగా సారా, జాన్వీ)గా తెలుపుతున్నారు నెటిజన్స్. అంతేకాకుండా వారి ఫొటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ వీర్, శిఖర్ ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లు కావడంతో ఈ వార్త జోరందుకుంది. కాగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షో ఏడో సీజన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. for everyone whose wondering which brother duo janhvi and sara dated, it’s these two brothers called veer (sara) and shikhar (janhvi) pahariya, both maternal grandsons of the former chief minister of maharashtra! THANK ME LATER #KoffeewithKaranSeason7 pic.twitter.com/X1dO9uxgyn — siddhi. 👼🏻 (@aphrcdeityy) July 14, 2022 Who are the brothers #JhanviKapoor and #SaraAliKhan dated? 👀🙄 #KoffeewithKaranSeason7 — Ana 🌻💛 (@AnaaaWalia) July 14, 2022 Who were the siblings whom #SaraAliKhan and #JanhviKapoor dated and who lives in Karan's building?#KoffeeWithKaran — Mayank (@sarcasm_taken) July 14, 2022 Saif Ali Khan's daughter Sara Ali Khan with her boyfriend Veer Pahariya. Aren't they luk'n cute 2gether? pic.twitter.com/wjDjsvSTfX — Music India (@MusicIndiaTV) May 6, 2016 Janhvi Kapoor: Jahnavi Kapoor was seen very close by X boyfriend in Lonavla! – actress janhvi kapoor cozy photo with rumored ex boyfriend shikhar pahariya is viral on internet https://t.co/i6sPccV35R pic.twitter.com/iAtWQ6MGVS — TEJAS D KULKARNI (@kultejas18) January 28, 2020 Is Saif Ali Khan’s beautiful daughter Sara Ali Khan dating Veer Pahariya, grandson of… https://t.co/9hF3zx5LaV pic.twitter.com/IX7cGpwWga — Saif Ali Khan Online (@SaifOnline) May 6, 2016 -
బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్
Samantha Blames Karan Johar For Unhappy Marriages In KWK 7 Season: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ షోతో ఫిల్మ్ మేకర్‌గానే కాకుండా మంచి హోస్ట్‌గా కరణ్ జోహార్ నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు 6 సీజన్లపాటు అలరించిన ఈ షో ఏడో సీజన్ రానున్నట్లు ఓ వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సీజన్లో పార్టిస్పేట్ చేసే సెలబ్రిటీలు, వారు చెప్పిన పలు ఆసక్తికర విషయాలను మరో ప్రోమో రూపంలో బయటకు ఒదిలాడు. ఇందులో భాగంగానే సమంత తన ఎపిసోడ్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కరణ్ జోహార్‌ను ఉద్దేశించి.. 'ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం' అని సామ్ అనగానే 'నేనేం చేశాను' అని కరణ్ అడగ్గా.. 'పెళ్లి చేసుకుంటే జీవితం కబీ ఖుషి కబీ ఘమ్ (K3G) సినిమాలా ఉంటుందని స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది KGF మూవీలా ఉంటుంది' అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సామ్‌తోపాటు ఈ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సీజన్లో 'కబీర్ సింగ్' జోడీ షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ, 'జుగ్ జుగ్ జియో' బృందం అనిల్ కపూర్, వరుణ్ ధావన్, 'లైగర్' జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే, బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ షో పూర్తి ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడూ వస్తాయా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. -
రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్
Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఈ షోను ఇక కొనసాగించనని కరణ్ జోహార్ ప్రకటించి అభిమానులను షాక్‌గు గురిచేశాడు. కానీ తాజాగా ఆదివారం (జూన్ 19) ఈ షో 7వ సీజన్‌ను టెలీకాస్ట్ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. ఈ వీడియోలో రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, సైఫ్ అలీ ఖానా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితరులు ఉన్నారు. అలాగే ఈ టీజర్లో 'ఇప్పుడు రాబోయే సీజన్ మరింత పెద్దది, మెరుగైనది, ఇంకా మరింత అందమైనది' అని కరణ్ జోహార్ ఉత్సాహంగా చెప్పడం మనం చూడొచ్చు. కాపీ విత్ కరణ్ సీజన్ 7 ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి ప్రసారం కానుంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ప్రముఖ బాలీవుడ్ షోలో విజయ్ దేవరకొండ.. క్రేజ్ తగ్గేదేలే!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా విడుదల చేయలేదు. తాను నటించిన చిత్రలేవీ బాలీవుడ్లో హైప్‌తో విడుదల అవ్వలేదు. తాజాగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘లైగర్’. ఈ మూవీపై అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ షోలో కనిపించనున్నారు విజయ్, లైగర్ భామ అనన్య పాండే. బాలీవుడ్లో కొన్ని షోలు అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో ఒకటి కాఫీ విత్ కరణ్. కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి అక్కడ విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. అయితే ఈ షోకు ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి డార్లింగ్ ప్రభాస్, రానా మాత్రమే వెళ్లారు. వీరి తర్వాత విజయ్ దేవరకొండ ఈ లిస్ట్‌లో చేరనున్నాడు. దీనికి సంబంధించి ఈ షోలో పాల్గొన్నట్టు తెలియజేసే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. That signature - The Vijay Deverakonda #VijayDeverakonda #KaranJohar #koffeewithkaran #TeamDeverakonda pic.twitter.com/HmR9oSwA7K — Team Deverakonda (@TeamDeverakonda) May 29, 2022 చదవండి: Anchor Vishnu Priya: హీరోయిన్ అవ్వకుండానే చచ్చిపోతానేమోనని భయపడ్డా -
హిందీ బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చిన కరణ్ జోహార్
బుల్లితెర ప్రేక్షకులకు ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ బ్యాడ్ న్యూస్ అందించాడు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇకపై ప్రసారం కాదని ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. కొన్నేళ్లుగా సెలబ్రెటీల చిట్‌చాట్‌తో బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతోన్న కాఫీ విత్ కరణ్ షో నెక్స్ట్ సీజన్ ఇక లేదని చెప్తూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు ఈ మేరకు బుధవారం(మే 4) ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్ షేర్ చేశాడు. ‘‘కాఫీ విత్ కరణ్’ షో మీ, నా జీవితంలో ఒక భాగమైపోయింది. అలా ఈ షో ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాం. పాప్ కల్చర్‌లోనే అతిపెద్ద షోగా గుర్తింపు పొందింది కాఫీ విత్ కరణ్. కానీ ఈ షో నెక్స్ట్ సీజన్‌ను తిరిగి ప్రసారం చేయలేకపోతున్నామని చెప్పడానికి మనసు ఒప్పుకోవడం లేదు’’ అంటూ కరణ్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో 7వ సీజన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని కరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ మూవీకి కీర్తి పేరును నేనే సిఫార్స్ చేశా, మహేశ్ కాదు: డైరెక్టర్ అంతేకాదు మేలో ఈ షో షూటింగ్ కూడా జరగనుందని చెప్పాడు. అంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా కరణ్ ఈ షోను తిరిగి ప్రారంభంచడం లేదని చెప్పి బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చాడు. కాగా ఈ షో ద్వారా బాలీవుడ్ స్టార్స్‌తో ముచ్చటిస్తూ వారికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటకు లాగుతూ ఎంటర్టైన్ చేసేవాడు కరణ్. ప్రస్తుతం ఆయన ‘రాఖీ ఔర్ రాణీ కీ కహానీ’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆలియా భట్, రణ్వీర్ సింగ్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్, వయోకామ్ 18 సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్నేఇ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల కరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓ తండ్రిగా ఇంతకన్నా ఏం కావాలి?!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్టు సమాచారం. సినిమాలతో బిజీగా ఉండే వరుణ్ వీలు చిక్కినప్పుడల్లా.. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో కలిసి పార్టీలకు, పబ్‌లకు, డిన్నర్లకు వెళ్తాడన్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్ కోడైకూసింది. అయితే ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి కామెంట్ చేయని వరుణ్.. కాఫీ విత్ కరణ్ షోలో తొలిసారిగా స్పందించాడు. వచ్చే ఏడాది పెళ్లి..! ‘అవును.. నేను తనతో ఉన్నాను. ఇకపై ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే తను స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. సమస్యల గురించి గళం వినిపించగల ధీశాలి. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. అందుకే తనకు జీవిత భాగస్వామిగా మారి.. తన పక్కన నిలబడాలనుకుంటున్నాను. తన విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలనుకుంటున్నా. అదే విధంగా తను కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తుంది. అన్నివేళలా నాకు తోడుగా ఉంటుంది’ అని నటాషాతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ జంట బంధం గురించి వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ కూడా సానుకూలంగా స్పందించాడు. ‘ వచ్చే ఏడాది మా అబ్బాయి వివాహం జరిగే అవకాశం ఉంది. వరుణ్-నటాషాల రిలేషన్‌షిప్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువ సంతోషంగా కూడా ఉంది. ఒక తండ్రిగా నాకు ఇంతకన్నా ఏం కావాలి’అని పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే వరుణ్ ధావన్ వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా వరుణ్ -అలియా భట్ జంటగా నటించిన ‘కళంక్’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. -
ఆ షోకు తప్పకుండా వెళ్తా : అశ్విన్
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కొన్నాళ్లు నిషేధం ఎదుర్కొన్న ఈ ఆటగాళ్లు కన్ను లొట్టబోయి చావు తప్పిన చందంగా అనేక పరిణామాల అనంతరం బయటపడ్డారు. ఇక ఈ వివాదం తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పలు మ్యాచుల్లో రాణించి పునరాగమనంలో సత్తా చాటగా.. రాహుల్ కాస్త తడబడినప్పటికీ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఒకానొక సమయంలో ఆటగాళ్ల కెరీర్ ప్రమాదంలో పడినప్పటికీ... కరణ్ షో మాత్రం అంతర్జాతీయంగా మరింతగా పాపులర్ అయింది. ఈ క్రమంలో కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లేందుకు మరే ఇతర క్రికెటర్లు వెళ్లరనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో ‘ఆస్క్ మీ క్వశ్చన్’లో భాగంగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. కాఫీ విత్ కరణ్ షోకు మీరు వెళ్తారా అని అభిమాని అడుగగా.. ‘తప్పకుండా’ అంటూ అశ్విన్ సమాధానమిచ్చాడు. అయినా షోకు వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ ఉండదు.. హద్దుల్లో ఉంటే చాలు అనే ఫార్ములాను అనుసరించి అశ్విన్ ఇలా రెస్పాండ్ అయ్యాడేమో! (పాండ్యా, రాహుల్‌లపై వేటు) కాగా గాయాల బారిన పడి కీలక మ్యాచ్‌లకు దూరమైన అశ్విన్.. చివరిసారిగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో మైదానంలోకి దిగాడు. ప్రస్తుతం మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్‌లు విశేషంగా రాణిస్తుండటంతో జట్టులో స్థానం కోసం ప్రధాన స్పిన్నర్ అశ్విన్ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ప్రియాంకకు కరీనా వార్నింగ్..
బాలీవుడ్ హీరోయిన్స్ కరీనా కపూర్, ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. బాలీవుడ్లో ప్రియాంక నటించిన చివరి చిత్రం ‘జై గంగాజల్’. ఆ తరువాత హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంక అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ప్రియాంక గత ఏడాది డిసెంబర్లో హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ జంటగా వచ్చారు. (ఒక్కటి కాదు.. నాలుగు బొమ్మలు!) కార్యక్రమంలో భాగంగా కరణ్ ప్రియాంకను ఉద్దేశిస్తూ.. వరుణ్ ధావన్ గర్ల్‌ఫ్రెండ్ పేరు చెప్పమని అడిగారు. అందుకు ప్రియాంక తెలీదని చెప్పారు. పక్కనే ఉన్న కరీనా కపూర్.. ‘అయితే నీకిప్పుడు కేవలం హాలీవుడ్ యాక్టర్ల పేర్లు మాత్రమే తెలుస్తాయా.. నీ సమాధానం వింటే అలానే అనిపిస్తుంది. మూలాలను మర్చిపోవద్దు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే అది సీరియస్‌గా కాదు జోక్‌గా. ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక ప్రస్తుతం ‘ద స్కై ఈజ్ పింక్’ చిత్రంలో నటిస్తుండగా.. కరీనా అక్షయ్ కుమార్ సరసన ‘గుడ్ న్యూస్’ చిత్రంలో నటిస్తున్నారు. -
అమ్మ బాధపడింది.. ఇకపై అలాంటివి అడగను : కరణ్ జోహర్
దావోస్ : ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేదాన్ని ఎదుర్కొంటున్నయువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై విధించిన నిరవధిక నిషేధాన్ని క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) గురువారం ఎత్తివేసింది. నిషేధం తొలగించడంతో హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ వెళ్లి జట్టుతో కలుస్తాడని... రాహుల్ భారత ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై ‘కాఫీ విత్ కరణ్’ షో హోస్ట్, బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ నిషేదం ఎత్తివేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దావోస్‌లో జరగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కరణ్ గురువారం ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పెద్ద మనసుతో క్షమించారు.. పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ నిషేదం విధించంతో చాలా కుంగిపోయానని కరణ్ చెప్పుకొచ్చారు. ‘నా పిచ్చి ప్రశ్నల వల్లే మీరు ఈ వివాదంలో చిక్కుకున్నారు. నన్ను క్షమించండి’ అని పాండ్యా, రాహుల్‌లను కోరానని తెలిపారు. పెద్ద మనసుతో వారిద్దరూ తనను క్షమించారని కరణ్ వెల్లడించారు. ‘అది మీ తప్పిదం కాదు’ అని వారి నుంచి రిప్లై వచ్చినట్టు తెలిపారు. తన తల్లి పాండ్యా అభిమాని అని, ఈ వివాదంతో ఆమె మనస్తాపం చెందాని కరణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ షోలో అమ్మాయిల గురించి ప్రశ్నలు అడగడం కొత్తేమీ కాదని అన్నారు. అయితే, పాండ్యా, రాహుల్‌ల విషయంలో అది కాస్త లయ తప్పిందని అభిప్రాయపడ్డారు. షోలో పాండ్యా, రాహుల్ కామెంట్లను ఎడిట్ చేయొచ్చు కదా అని చాలామంది అన్నారని, కానీ నేనది గ్రహించలేకపోయానని కరణ్ వాపోయారు. తనకు క్రికెటర్లంటే చాలా ఇష్టమని చెప్పారు. కానీ ఇంత వ్యవహారం జరిగిన తర్వాత ‘కాఫీ విత్ కరణ్’కు మళ్లీ వారు వస్తారో రారో అని అనుమానం వ్యక్తం చేశారు. ‘క్రికెట్‌పై నాకు పెద్దగా అవగాహన లేదు. క్రికెటర్లు నాకు మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపై మహిళలను తక్కువగా చూపే ప్రశ్నలు అడగను. క్రికెట్‌పై అవగాహన పెంచుకుని.. పూర్తిగా ఆటకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతాను’ అన్నారు. -
పాండ్యా - రాహుల్ వివాదం ; కరణ్ స్పందన
భారత క్రికెటర్లు పాండ్యా, కే ఎల్ రాహుల్ ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వివాదంపై గంగూలీ, రాహుల్ ద్రవీడ్ వంటి ప్రముఖ క్రికెటర్లు స్పందించారు. అయితే ఇంత వివాదానికి వేదికగా నిలిచిన ‘కాఫీ విత్ కరణ్ షో’ హోస్ట్ కరణ్ జోహర్ మాత్రం ఇంతవరకూ ఈ విషయం గురించి మాట్లడలేదు. దాంతో కరణ్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విషయంపై స్పందించారు కరణ్. కరణ్ జోహార్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘పాండ్యా, రాహుల్ విషయంలో జరిగిన నష్టానికి నేను చింతిస్తున్నాను. నా షోలో ఇలా జరగడం నిజంగా దురదృష్టం. ఇందుకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. నేనే వారిని ఈ కార్యక్రమానికి గెస్ట్లుగా పిలిచాను. షోలో ఉన్నంతవరకే ఏదైనా నా కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి టెలికాస్ట్ అయితే తరువాతి పరిస్థితులు నా చేతిలో ఉండవు. ప్రస్తుతం ఇదే జరిగింది. నా షో వల్ల రాహుల్, పాండ్యాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీని గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఈ నష్టాన్ని నేను నివారించలేకపోయాను అంటూ నా సన్నిహితుల దగ్గర చెప్పుకుని చాలా బాధపడ్డాను. కానీ ఏం లాభం. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందం’టూ విచారం వ్యక్తం చేశారు కరణ్. మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు బీసీసీఐ వారిని జట్టు నుంచి తప్పించింది. అర్ధాంతరంగా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు రప్పించింది. -
‘అప్పుడు చాలా బాధనిపించింది’
సిని పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా స్టార్ అవుతారో చెప్పలేం. ఒక్క సినిమా రాత్రికి రాత్రే ఆకాశానికి ఎక్కించవచ్చు.. లేదంటే పాతాళానికి పడేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సక్సెస్ లేకపోతే కష్టం. స్టార్ కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవంటున్నారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. చాలా కాలం తర్వాత ‘మన్మర్జియా’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అభిషేక్. అయితే ఈ చిత్రంలో ఆయన సహాయ నటుడిగా కనిపించారు. ఒకప్పుడు హీరోగా నటించి.. ఇప్పుడు సహాయ నటుడిగా చేయడం తనను చాలా బాధించింది అంటున్నారు అభిషేక్. తాజాగా అభిషేక్ ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరణ్ ‘ఇన్నాళ్లు హీరోగా నటించి.. ఇప్పుడు సినిమాలో మరో కథానాయకుడి వెనక ఉండటం ఎలా అనిపించింది?’ అని ప్రశ్నించారు. అందుకు అభిషేక్ సమాధనమిస్తూ.. ‘నిజంగా అది గుండెల్ని పిండేసే విషయం. ఇన్నాళ్లు హీరోగా చేసి.. ఇప్పుడు సహాయ నటుడి పాత్రను పోషించడం కష్టం, బాధాకరం. ఇండస్ట్రీ అనేది చాలా దారుణమైన ప్రదేశం. ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఇది నా సొంత.. ఇది పొందడానికి పూర్తిగా నాకే అర్హత ఉంది అని అనుకోడానికి లేద’ని తెలిపారు. అంతేకాక ‘రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారుతుంటాయి. విజయాలు ఉంటే సెంటర్(కథానాయకుడిగా)లోనే ఉంటావు. లేదంటే పక్కకు జరిపేస్తారు. ఇన్నాళ్లు సెంటర్లో ఉన్న నన్ను పక్కకు జరపడం చాలా బాధించింది. కానీ బాధలో నుంచే స్ఫూర్తి కల్గుతుందని గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ సెంటర్లోకి రావడానికి కృషి చేయాలి’ అని తెలిపారు. -
‘నా కూతురుకి ఆ పరిస్థితి రాకూడదనే’
ప్రస్తుతం బాలీవుడ్లో వారసులు హవా కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన కూతుర్ని మాత్రం సినిమాల్లోకి పంపించనంటున్నారు శ్వేతా బచ్చన్ నందా. సోదరుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్ షో’కు హాజరయ్యారు శ్వేతా బచ్చన్. ఈ సందర్భంగా తన కూతురు నవ్య గురించి మాట్లాడుతూ.. ‘తనకు ఈ రంగం అంటే చాలా ఇష్టం, గౌరవం ఉండి.. సొంతంగా రాణించగలను అనే ధైర్యం ఉంటే ఫర్వాలేదు. అలాకాకుండా కేవలం కొందరు ప్రముఖ వ్యక్తుల కుటుంబానికి చెందిన మనిషిగా తాను ఈ రంగంలోకి వస్తే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది. దాని బదులు మరో కెరీర్‌ను ఎంచుకోవడమే ఉత్తమం’ అని అన్నారు. శ్వేత మాట్లాడుతూ.. ‘ఈ రంగం పట్ల నవ్యకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు ఇంకా తెలియదు. తను సిని రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు’ అన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పారు శ్వేత. ‘మా కుటుంబంలో తొలి తరం అంతా సినిమాల్లోనే ఉన్నారు. రెండో తరంలో మా అన్నయ్య, వదిన కూడా సినిమాల్లోనే ఉన్నారు. సినిమాలు సరిగా ఆడనప్పుడు వారే పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సినిమా స్టార్ అవ్వడం వల్ల జనాలు మా కుటుంబ సభ్యులు గురించి ఎలా మాట్లాడతారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను’ అన్నారు. ‘ముఖ్యంగా అభి గురించి. అమితాబ్ బచ్చన్ కొడుకు అయినందువల్లే చాలా ఇజీగా సినిమాల్లోకి వచ్చాడు. అంతే తప్ప అతని ప్రయత్నం ఏం లేదు అంటూ తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నేను కూడా తనను సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటాను. అక్కడ జనాలు తన గురించి మాట్లాడే మాటలు చూసి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నా కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి రాకుడదనే ఉద్దేశంతోనే తనను సినిమాల్లోకి పంపించకూడదని అనునుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు శ్వేత. -
పాండ్యా, రాహుల్‌లను వెనకేసుకొచ్చిన సౌరవ్
ముంబై : ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌లను టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెనకేసుకొచ్చాడు. తప్పుగా మాట్లాడి కుమిలిపోతున్న పాండ్యా, రాహుల్‌లను మన్నించి వదిలేయాలని అన్నారు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజమే..! పాండ్యా, రాహుల్ మాటలు అభ్యతంరకరమైనవే. వారు మాట్లాడింది తప్పే. కానీ, మనమంతా మనుషులం. మెషీన్లం కాదు. మెషీన్ మాదిరిగా మనం ముందుగానే ఫిక్స్ చేసినట్టుగా అన్నీ పర్ఫెక్ట్గా జరగాలని లేదు. తీవ్ర విమర్శలతో వారిని మరింత బాధించొద్దు. చేసిన తప్పును తెలుసుకుని వారు కుమిలిపోతున్నారు. మళ్లీ అలాంటి తప్పు చేయరు. వారికొక అవకాశమిద్దాం. వారిపై విమర్శలతో ఇంకా రాద్ధాంతం చేయొద్దు. మనం బతుకుదాం. ఇతరులను బతకనిద్దాం’ అని వ్యాఖ్యానించారు. (విచారణ మొదలు) కాగా, మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు బీసీసీఐ వారిని జట్టు నుంచి తప్పించింది. అర్ధాంతరంగా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు రప్పించింది. పాండ్యా, రాహుల్‌ల విచారణ మొదలైంది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి మంగళవారం వారితో ఫోన్లో మాట్లాడారు. అయితే కేవలం క్రికెటర్లు చెప్పింది మాత్రమే ఆయన విన్నారని... టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యం, ఆ వ్యాఖ్యల గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదని సమాచారం. (కుమిలిపోతున్న పాండ్యా!) -
హార్దిక్ పాండ్యాకు మరో షాక్
ముంబై : మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలపాలైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. ముంబైలో ప్రతిష్టాత్మక క్లబ్ అయిన ‘ఖర్ జింఖానా’లో గౌరవ సభ్యత్వాన్ని కోల్పోయాడు. సోమవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఖర్ జింఖానా సంయుక్త కార్యదర్శి గౌరవ్ కాపాడియా వెల్లడించారు. హార్దిక్ పాండ్యా సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పష్టం చేశారు. ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో కేఎల్ రాహుల్‌తో పాటు హార్దిక్ పాండ్యా వివాదాల్లో చిక్కుకున్నాడు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వీరిపై బీసీసీఐ నిరవధిక సస్పెన్షన్ విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. పాండ్యా, రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పారు. -
పాండ్యా, రాహుల్‌కు బీసీసీఐ నోటీసులు
హిందీ పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో మహిళలపట్ల అనుచితంగా మాట్లాడిన ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఆల్‌రౌండర్ కొన్ని వారాల క్రితం ‘కాఫి విత్ కరణ్’లో మహిళల పట్ల అగౌరవంగా కామెంట్ చేశాడు. ‘షోలో నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా కించపరిచేవిగా ఉంటే క్షమించండి. ఆ షో తీరుకు భిన్నంగా వ్యవహరించాను. అయితే, ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా మాట్లాడలేదు’ అని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. టీవీ షోలో హార్దిక్ ఏమన్నాడంటే.. కొన్ని వారాల క్రితం కాఫీ విత్ కరణ్‌లో పాండ్యా.. ‘మా అమ్మానాన్నలతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను. సెక్స్‌కి సంబంధించిన విషయాలు కూడా చెప్పేస్తా. అమ్మాయిలతో గడిపిన క్షణాలను సైతం వారి దగ్గర దాచను. నా వర్జినిటీ కోల్పోయిన సందర్భం కూడా వారికి చెప్పా’ అని చెప్పుకొచ్చాడు పాండ్యా. అంతేకాకుండా మహిళలను ఉద్దేశించి ఏకవచనంతో.. ఇది.. అది.. హేళనగా మాట్లాడాడు. దీంతో హార్దిక్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ టీవీ కార్యక్రమంలో హార్దిక్‌తో పాటు కేఎల్ రా్హుల్ కూడా పాల్గొన్నాడు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలి.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన హార్దిక్ పాండ్యాకు, అతనితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న కేఎల్ రాహుల్‌కు ఇండియన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ బుధవారం షోకాజ్ నోటీసులు పంపింది. నోటీసులపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. View this post on Instagram A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jan 8, 2019 at 6:17pm PST -
ప్రభాస్ పైకి అలా కనిపించడంతే : రాజమౌళి
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ ఇంకా ఎక్కువ బిజీ అయ్యారు. ఫోటోల్లో తప్ప బయట అసలు కనిపించడం లేదు. ‘సాహో’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ సడెన్‌గా బుల్లితెర మీద ప్రత్యక్షమయ్యారు. స్టార్ వరల్డ్ ఇండియా చానెల్లో ప్రసారమవుతోన్న కాఫీ విత్ కరణ్ సీజన్ 6కి హాజరయ్యారు ప్రభాస్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం(23) ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి బాహుబలి టీం రాజమౌళి, రానా, ప్రభాస్‌లు హజరయ్యారు. రానా ఇప్పటికే ‘నం. 1 యారి’ పేరుతో బుల్లితెర మీద ప్రసారమయ్యే ఓ ప్రొగ్రామ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోండగా.. రాజమౌళి కూడా అప్పుడప్పుడు చిన్న తెర మీద ప్రత్యక్షమవ్వడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రభాస్ కూడా వీరి జాబితాలో చేరారు. View this post on Instagram For the first time on television, the superstars from the South grace the Koffee couch! In conversation with @ssrajamouli, @ranadaggubati, and #Prabhas next Sunday on #KoffeeWithKaran. #KoffeeWithTeamBaahubali #Baahubali #Prabhas #Rana A post shared by Star World (@starworldindia) on Dec 16, 2018 at 9:06am PST ఈ ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. టీజర్ చూస్తే షోలో భాగంగా కరణ్ వివాదాస్పద ప్రశ్నలతో బాహుబలి టీమ్‌ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ‘రానా, ప్రభాస్‌లలో ఎవరేక్కువ బ్యాడ్ బాయ్’ అని కరణ్, రాజమౌళిని ప్రశ్నించారు. అందుకు జక్కన్న ప్రభాస్ బ్యాడ్ బాయ్ కానీ అలా కనిపించడు అంటూ సమాధానమిచ్చారు. అలానే కరణ్, ప్రభాస్‌ను హీరోయిన్ అనుష్క శెట్టితో డేటింగ్ రూమర్స్ గురించి అడగ్గా మొదలెట్టేశారా అంటూ ప్రభాస్ చెప్పిన సమాధానం ఆసక్తి రేపుతోంది. ఫైనల్‌గా ‘ఈ షోలో అబద్దం చెప్పారా’ అని కరణ్ అడగ్గా.. అవునంటూ ప్రభాస్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తోంది. ఈ ఆదివారం ప్రసారం కానున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram Leave it to @karanjohar to ask these perfect gentlemen, the perfectly wrong questions on #KoffeeWithKaran. #KoffeeWithTeamBaahubali #Baahubali #Prabhas #Rana A post shared by Star World (@starworldindia) on Dec 16, 2018 at 8:47am PST -
పెళ్లి రోజు మర్చిపోయిన నటుడు..
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహిరించే ‘కాఫీ విత్ కరణ్ జోహార్’ కార్యక్రమం ఎంత పాపులరో తెలిసిన సంగతే. ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ సీజన్ 6 నడుస్తోంది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఈ ఆదివారం జాన్వీ కపూర్, అర్జున్ కపూర్లు పాల్గొనగా వచ్చే ఆదివారం ఈ షోకి బాలీవుడ్ బెస్ట్ కపుల్ కాజోల్ - అజయ్ దేవగణ్‌లు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోమోల్లో అజయ్ తన భార్య కాజోల్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. కాజోల్ ఫోటోలు దిగడానికి 1 సెకను పడుతుంది. కానీ వాటిని పోస్ట్ చేయడానికి మాత్రం 3 - 4 గంటల సమయం పడుతుందన్నారు అజయ్. View this post on Instagram @kajol gets candid while @ajaydevgn stirs up the hornet's nest next Sunday on #KoffeeWithKaran! #KoffeeWithAjay #KoffeeWithKajol A post shared by Star World (@starworldindia) on Nov 25, 2018 at 8:38am PST యాక్టర్లు తరచుగా చెప్పే అబద్దం ఏంటని ప్రశ్నించగా ‘నా భార్యను ప్రేమిస్తున్నాను’ అని అజయ్ సమాధానం చెప్పడం.. వెంటనే ‘నేను కాదు మిగతా వారు’ అంటూ కవర్ చేసుకోవడం సరదాగా ఉంది. చివరకూ ‘మీ పెళ్లి రోజు ఎప్పుడ’ని అడగ్గా.. అజయ్ తడబటడం.. ఆఖరికి తప్పు సమాధానం చెప్పడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ప్రోమోలను మీరు కూడా చూడండి. View this post on Instagram Real life antics trump reel life drama when you're @ajaydevgn and @kajol! #KoffeeWithKaran #KoffeeWithAjay #KoffeeWithKajol A post shared by Star World (@starworldindia) on Nov 25, 2018 at 9:06am PST కాజోల్ - కరణ్ జోహార్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే 2016లో అజయ్, కరణ్ జోహార్ సినిమాల విడుదల సమయంలో వచ్చిన వివాదం కారణంగా కాజోల్, కరణ్ కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కరణ్ జోహార్‌కు కవల పిల్లలు రూహి, యాష్లు పుట్టిన తరువాత వీరిద్దరి మధ్య మాటలు ప్రారంభమయ్యాయి. బెస్ట్‌ఫ్రెండ్స్ ఇద్దరూ తెర మీద కనిపిస్తోంది ఈ ప్రోగ్రాం ద్వారానే. -
‘మా అమ్మ ఉన్నా.. అలానే చేయమనే వారు’
అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం ఆమె కుటుంబాన్నే కాక యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నేటికి కూడా శ్రీదేవి కుటుంబం ఈ విషాదం నుంచి కోలుకోలేదు. ఈ గడ్డు పరిస్థితుల్లో బోని కపూర్ మొదటి భార్య సంతానం అయిన అర్జున్ కపూర్, అన్షులా కపూర్లు, శ్రీదేవి పిల్లలకు తోడుగా ఉన్నారు. శ్రీదేవి మరణం వీరందరిని ఒక్కటి చేసిందని చెప్పవచ్చు. కొన్ని నెలలుగా అర్జున్ కపూర్ తన చెల్లెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్లతో చాలా సన్నిహితంగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ సందర్భంగా అర్జున్ కపూర్, జాన్వీ కపూర్లు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్జున్ కపూర్, శ్రీదేవి మరణం తరువాత సంభవించిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. ‘మన జీవితంలో జరిగే కొన్నే సంఘటనలు మనపై చాలా ప్రభావం చూపిస్తాయి. నా జీవితంలో అలాంటి సంఘటన మా అమ్మ(మోనా శౌరి) మరణం. ఆ సమయంలో మనకు తోడుగా నిలిచే వారు ఎంత అవసరమో నాకు, అన్షులాకు బాగా అర్ధమయ్యింది. మాకు వచ్చిన పరిస్థితే జాన్వీ, ఖుషిలకు వచ్చింది. కానీ మేము, వారు(జాన్వీ, ఖుషిలు) కూడా మాలానే బాధపడాలని కోరుకోలేదు’ అన్నారు. ఒక వేళ ఆ సమయంలో మా అమ్మ బతికి ఉన్నా కూడా ‘ముందు మీరు అక్కడికి వెళ్లండి.. ఇలాంటి సమయంలో ఎటువంటి కోపం పెట్టుకోకూడదు. జీవితం చాలా చిన్నది’ అని చెప్పేది అన్నారు. శ్రీదేవి మరణించిన సమయంలో అన్షులా కూడా తనలానే ఆలోచించిందంటూ అర్జున్ కపూర్ గుర్తు చేసుకున్నారు. ‘అప్పుడు సమయం రాత్రి 2 గంటలవుతుంది అనుకుంటా.. నేను ఈ విషయం అన్షులాతో ఎలా చెప్పలా అని అలోచిస్తున్నాను. కానీ ధైర్యం చేసి వెళ్లి చెప్పాను. అప్పుడు అన్షు నన్ను అడిగిన మొదటి ప్రశ్న వారిద్దరు(జాన్వి, ఖుషి) ఎక్కడ’ అంటూ అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 శ్రీదేవి దుబాయిలో కార్డియాటిక్ అటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. -
‘నేను అలా పిలిస్తే ఆమె స్పృహ తప్పడం ఖాయం’
నేను అలా పిలిస్తే కరీనా గుండె బద్దలవుతుంది అంటున్నారు సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్. నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి తండ్రి సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు సారా అలీ ఖాన్. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానలు ఇచ్చారు సారా అలీ ఖాన్. ఈ క్రమంలో తన మారు తల్లి కరీనా కపూర్‌కి, తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడారు సారా. ‘మీ అమ్మ చాలా గొప్పది. నేను మీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను’ అంటూ కరీనా తనతో చెప్పేదన్నారు. అంతేకాక తన తండ్రి కూడా కరీనాను మారు తల్లిగా ఎప్పుడు తనకు పరిచయం చేయలేదని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఒకవేళ నేను కరీనాను ‘ఛోటి మా’(చిన్నమ్మ) అని పిలిస్తే తన గుండె బద్దలవుతుందం’టూ హాస్యమాడారు. తన తండ్రి సైఫ్, తల్లి అమృతా సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వడం చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు నా తల్లి, తండ్రి ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక వేళ వారు కలిసి ఉన్నా కూడా ఇంత సంతోషంగా ఉండే వారు కాదేమో. ఈ రోజు నాకు రెండు సౌకర్యవంతమైన కుటుంబాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట్లో అయినా.. మా అమ్మ అమృత దగ్గరైనా మేం చాలా సంతోషంగా ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చారు. సారా ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు ఆమె మెచ్యూరిటీ లెవల్స్‌కి, ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. ‘నీకు గొప్ప భవిష్యత్ ఉంది.. మరో 10 ఏళ్లలో నువ్వే బాలీవుడ్ టాప్ హీరోయిన్’ అంటూ సారాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 10 Years From Now - #SaraAliKhan is going to be the number one female star. So Confident, So Charming, So Vocal, So Honest... One Episode of #KoffeeWithKaran, and quite sure that she has already won several hearts! — Himesh (@himeshmankad) November 18, 2018 ‘కేదార్నాథ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సారా అలీ ఖాన్. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. అయితే తొలి చిత్రం రిలీజ్ కాకాముందే మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నారు సారా. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రన్వీర్ సింగ్ సరసన సింబా చిత్రంలో నటిస్తున్నారు సారా. -
అవును.. లవ్‌లో ఉన్నారు
జంటగా పార్టీలకు, ఫంక్షన్లకు వెళుతున్నారు కానీ తమ మధ్య ఉన్నది ప్రేమ అని మాత్రం ఇన్నాళ్లు బయటకు చెప్పలేదు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్. ‘కాఫీ విత్ కరణ్’ అనే షోలో భాగంగా నటాషాను లవ్ చేస్తున్నట్లు వరుణ్ ఒప్పుకున్నారు. ‘‘నటాషాతో నేను డేటింగ్లో ఉన్నాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నటాషా సాధారణమైన అమ్మాయి. ఆమె గురించిన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆమె బాధపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదే’’ అని చెప్పుకొచ్చారు వరుణ్. ఈ ఏడాది 31వ∙వసంతంలోకి అడుగు పెట్టిన వరుణ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ఊహించవచ్చు. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’ సినిమాతో బిజీగా ఉన్నారాయన. సంజయ్‌దత్, మాధురీ దిక్షీత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్త్రీలోక సంచారం
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ‘బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ’ (వక్షోజ ఆకృతికి శస్త్ర చికిత్స) చేయించుకున్నందుకు ఆ తర్వాత తానెంతో చింతించానని బ్రెజీలియన్ సూపర్ మోడల్ జిసెల్ బంద్చంద్ ఒక మ్యాగజీన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 38 ఏళ్ల జిసెల్కు బెంజిమన్ అనే 8 ఏళ్ల కొడుకు, వివియన్ అనే 5 ఏళ్ల కూతురు ఉన్నారు. ఫుట్‌బాల్ ప్లేయర్ టామ్ బ్రాడీ ఆమె భర్త. సూపర్ మోడల్ కాబట్టి జిసెల్ ధ్యాస ఎప్పుడూ తన దేహాకృతుల మీదనే ఉండేది. అలా లేకపోతే, తన అభిమానుల ఆశల్ని, ఆకాంక్షల్ని నిర్లక్ష్యం చేసినట్లవుతుందనే బెంగ కూడా ఆమెకు ఉండేది. అందుకే చక్కగా తినేవారు. బాగా వ్యాయామం చేసేవారు. అయితే పిల్లలు పుట్టాక ఈ ప్రయత్నాలేవీ ఆమెలో వస్తున్న శారీరక మార్పులను ఆపలేకపోయాయి. పైగా పాలు తాగే వయసులో.. కొడుకు, కూతురు కూడా ఏ కారణం చేతనో ఆమె ఎడమ స్తన్యాన్నే ఎక్కువగా ఇష్టపడేవారు. దాంతో కుడి ఎడమలు సమంగా కనిపించేందుకు.. రెండో బిడ్డ పాలు మరిచిన కొన్నాళ్లకు ఎడమ స్తన్యానికి ‘బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ’ చేయించుకున్నారు జిసెల్. ఈ విషయాన్నే ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘‘రోజూ నిద్ర లేవగానే నాకు అనిపిస్తుంది.. నేను చేసిన పనేమిటని! నాది కాని దేహంలో నేను ఉండటం ఏమిటి అని కూడా అనుకుంటాను. ఇదొక జీవిత పాఠం నాకు. నేను అలా చేసి ఉండాల్సింది కాదని బాధపడుతున్న ప్రతిసారీ నా భర్త నన్ను ఓదారుస్తాడు’’ అని తెలిపారు జిసెల్. స్త్రీ, పురుష సమానత్వం (ఈక్వాలిటీ) అనేది పాశ్చాత్య భావనే తప్ప, అది మనది కాదని అంటూ.. మన దేశంలో పురుషుడికన్నా స్త్రీనే అధికం అని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖల మంత్రి ఉమా భారతి అన్నారు. గురువారం నాడు సుప్రీంకోర్టు 158 ఏళ్ల నాటి అడల్టరీ సెక్షన్‌ను కొట్టివేస్తూ.. వివాహేతర బంధం నేరం కాదనీ, అయితే నైతికంగా అది తప్పు అని ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఉమా భారతి.. ‘‘ప్రతిదానికీ కోర్టుల వరకు ఎందుకు వెళతారో అర్థం కాదు. సెక్షన్లు ఎలా ఉన్నా, ఏం చెబుతున్నా.. మన సమాజంలో స్త్రీ పాత్ర పురుషుడికంటే ఉన్నతమైనది.. పురుషుడికంటే స్త్రీ ఏ విధంగా చూసినా ఎక్కువే తప్ప.. పురుషుడితో సమానం కాదు’’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 21న ప్రారంభం అవుతున్న బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పాపులర్ సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 6, ఫస్ట్ ఎపిసోడ్లో ఆలియా భట్, దీపికా పడుకోన్ దర్శనమివ్వబోతున్నారు! ‘దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గర్ల్ పవర్’ అని ఈ తొలి ఎపిసోడ్ గురించి ట్విట్టర్లో కామెంట్ పెట్టిన కరణ్.. రణవీర్‌సింగ్‌తో దీపికకు, రణ్‌బీర్ కపూర్‌తో ఆలియాకు ఉన్న రిలేషన్‌షిప్‌లోని గుట్టుమట్లను ఎలాగైనా బయటికి లాగేస్తాడని.. సోషల్ మీడియాలో ఆ ‘షో’ అభిమానుల ఆకాంక్షల్ని బట్టి తెలుస్తోంది. -
కరణ్ విషం పెడతాడన్న కంగనా
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ల మధ్య ఉన్న విధం గురించి తెలిసిందే. గతంలో కరణ్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న కంగన అతనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కరణ్ కు బంధుప్రీతి ఎక్కువ అని, అతడు వారసత్వాన్ని, సినిమా మాఫియాను ప్రొత్సహిస్తున్నాడని ఆరోపించింది. ఈ ఆరోపణలపై కరణ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ఈ కార్యక్రమం తరువాత ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ఎప్పుడూ కలవలేదు. అయితే మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూ వచ్చింది. తాజాగా మరోసారి ఓ టీవీలో కరణ్ తో పాటు పాల్గొన్న కంగన సంచలన వ్యాఖ్యలు చేసింది. షోలో భాగంగా ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని తెలుసుకునేందుకు, కరణ్ తన ఇంటికి వచ్చిన అతిథులకు ఏం వడ్డిస్తారు అన్న ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కరణ్ తన అతిథిలకు విషం వడ్డిస్తారని చెప్పింది కంగనా. ఈ వ్యాఖ్యలపై కరణ్ స్పందించకపోవటం విశేషం. అయితే కంగన కావాలనే కరణ్ ను విమర్శిస్తుందంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు. -
భారత్‌లో పాప్ సంచలనం ప్రదర్శనలు
ముంబై: తన పాటలతో పాప్ ప్రపంచాన్ని మైమరపించే కెనడా పాప్ సంచలనం జస్టిన్ బీబర్ తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేశాడు. మంగళవారం అర్ధారత్రి ముంబైకి వచ్చిన బీబర్‌ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఐదు రోజులపాటు భారత్‌లో గడపనున్న బీబర్.. ముంబైతోపాటు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్లను సందర్శించనున్నాడు. నేడు ముంబైలోని డీవై పాటిల్ స్డేడియంలో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. బాహుబలి సమర్పకుడు, బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్'షోలో బీబర్ పాల్గొనున్నాడు. బుధవారం ఈ పాప్ సంచలనం కరణ్ షో కోసం షూటింగ్లో పాల్గొంటాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. కరణ్ రెగ్యూలర్‌గా బాలీవుడ్ ప్రముఖులను తన షోలో ఇంటర్వ్యూ చేసేవారు. అయితే తొలిసారిగా ఓ అంతర్జాతీయ సెలబ్రిటీని కరణ్ ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్రైవేట్ విమానంలో ముంబైకి చేరుకున్న బీబర్ 120 మంది సభ్యుల బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. అంతర్జాతీయ సెలబ్రిటీ కావడంతో షో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో బీబర్ కోసం ప్రత్యేక సూట్లను సిద్ధం చేశారు. సల్మాన్‌ఖాన్ బాడీగార్డు మూడు రోజుల పాటు బీబర్ వద్ద విధులు నిర్వహించనున్న విషయం తెలిసిందే. -
బాహుబలి సమర్పకుడి షోలో జస్టిన్ బీబర్
- పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌తో ‘కాఫీ విత్ కరణ్’ - ముంబై, ఢిల్లీల్లో బీబర్ ఫీవర్.. ముంబై: తన మెస్మరైజింగ్ పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోన్న కెనడియన్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ భారత పర్యటనలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. బాహుబలి సమర్పకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో బీబర్ పాల్గొంటాడని నిర్వాహకులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం ఈ షోకు సంబంధించిన షూటింగ్ జరగనుంది. అయితే అదే రోజు(మే 10) ముంబైలోని డీవై పాటిట్ స్టేడియంలో జస్టిన్ ప్రదర్శన ఉండటంతో ఆలస్యంగానైనా టాక్ షో షూట్ చేస్తారని తెలిసింది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ’కాఫీ విత్ కరణ్’లో ఎంతో మంది బాలీవుడ్ స్టార్లను ఇంటర్వ్యూ చేసిన కరణ్.. ఆరో సీజన్లో భాగంగా తొలిసారి తన షోలో ఓ అంతర్జాతీయ సెలబ్రిటీకి ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. ఐదు రోజులపాటు భారత్‌లో గడపనున్న బీబర్.. ముంబైతోపాటు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్లను సందర్శించనున్నాడు. బీబర్ కోసం సల్మాన్ త్యాగం.. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న సింగర్ జస్టిన్ బీబర్ తొలిసారి ఇండియాకు వస్తుండటంతో నిర్వాహకులు భారీ ఏర్పాటు చేశారు. ప్రవైవేట్ జెట్ విమానంలో ఇండియాకు చేరుకోనున్న బీబర్..120 మంది సభ్యుల బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో బీబర్ కోసం ప్రత్యేక సూట్లను సిద్ధం చేశారు. పాప్ సింగర్ అభిరుచి మేరకు ఆయా గదులను లావిష్‌గా ముస్తాబు చేశారు. బీబర్ వెంట 120 కార్లతో భారీ కాన్వాయ్ వెళుతుంది. ఇకపోతే బీబర్ సెక్యూరిటీ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ త్యాగం చేయాల్సివచ్చింది. కొన్నేళ్లుగా సల్మాన్‌కు బాడీగార్డ్ గా వ్యవహరిస్తోన్న షెరా.. ఈ మూడు రోజులూ జస్టిన్ బీబర్ వద్ద విధులు నిర్వహించనున్నాడు. సల్మాన్ అంగీకారం మేరకే షెరాను బీబర్‌కు బాడీగార్డ్‌గా నియమించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. తమ ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాహుబలి-1, 2 హిందీ వెర్షన్లను కరణ్ జోహార్ సమర్పించిన సంగతి తెలిసిందే. -
ప్రియాంక చోప్రాను చంపేస్తా: హీరో
ముంబై: కరణ్ జోహార్ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ తాజా ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. ఈ షోలో పాల్గొన్న షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు బోల్డ్‌గా తమ మనోభావాలను వ్యక్తం చేసి.. ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా కరణ్ అడిగిన ఫటాఫట్ ప్రశ్నలకు ఈ జోడీ చాలా సరదాగా, ఓపెన్ గా సమాధానం చెప్పింది. షోలో భాగంగా కిల్-మ్యారీ-హుకప్ గేమ్‌లో భాగంగా సోనాక్షిసిన్హా, అలియా భట్, ప్రియాంకచోప్రాలలో ఎవరినీ చంపేస్తావు, ఎవరిని పెళ్లిచేసుకుంటావు, ఎవరితో ఎఫైర్ పెట్టుకుంటావు అని కరణ్ అడుగగా.. మరో ఆలోచన లేకుండా ప్రియాంకను చంపేస్తానని షాహిద్ బదులిచ్చాడు. సోనాక్షిని పెళ్లి చేసుకుంటానని, తాను పెళ్లికి అనువుగా ఉంటుందని చెప్పాడు. అలియాతో రిలేషన్షిప్ పెట్టుకోవడం చాలా క్షేమం కాబట్టి తనతో హుకప్ అవుతానని చెప్పాడు. ఇక ద్రోహం, అత్తింటివారి జోక్యం, బ్యాడ్ సెక్స్, బోర్డమ్ ఈ నాలుగింటిలో మీ వివాహబంధం విచ్ఛిన్నానికి దారితీయడానికి అవకాశమున్న అంశాలు ఏమిటి అని.. మీరాను కరణ్ అడుగగా.. ’మా అత్తింటివారు మంచి వారు. బోర్ అన్న ప్రసక్తే లేదు. చెడు శృంగారం జోలికి మేం వెళ్లబోం. కాబట్టి అది ఛీటింగ్ కావొచ్చు’ అంటూ మీరా సమాధానమిచ్చింది. -
కత్రినా కైఫ్‌తో ఎఫైర్ పెట్టుకుంటా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరితో ఎఫైర్ పెట్టుకోవడం నీకు ఇష్టమని కరణ్ ప్రశ్నించగా.. ఏమాత్రం తడుముకోకుండా ‘కత్రినా కైఫ్‌తో’ అని చెప్పింది. దీంతో అందరూ ఒకింత విస్తుపోయారు. అలియా వివరణ ఇస్తూ.. ‘ఎందుకో నేను చెప్తాను. మేం కలిసి చాలా కసరత్తులు (బన్నీ హాప్) వేశాం. కాబట్టి ఇది పనిచేస్తుంది’ అని అంటూ కొంటెగా చెప్పుకొచ్చింది. కరణ్ జోహార్ ’కాఫీ విత్ కరణ్’ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్లో షారుఖ్ ఖాన్, అలియా భట్ పాల్గొన్నారు. షారుఖ్, అలియా చేసిన అల్లరి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో షారుఖ్, అలియా పోటాపోటీగా సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఎవరితో ఎఫైర్ పెట్టుకుంటావని అలియాను అడుగగా, కత్రిన అని సమాధానం చెప్పింది. తామిద్దరి కలిసి బన్నీహాప్ బాగా చేస్తామని చెప్పింది. అయితే, బన్నీహాఫ్ అంటే ఏమిటంటూ షారుఖ్ అమాయకంగా అడుగటం.. దానికి అలియా, కరణ్ ఇచ్చిన సమాధానాలు షోలో నవ్వులు పూయించాయి. అయితే, ఇంతకుముందు స్వీమింగ్పూల్లో కత్రిన, అలియా కలిసి కసరత్తులు చేస్తూ బన్నీహాప్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియో అప్పట్లో బాగా హల్చల్ చేసింది. దీనిని ఉద్దేశిస్తూ అలియా ఆ వ్యాఖ్యలు చేసిందన్నమాట. -
ఆలియాభట్.. జీనియస్ ఆఫ్ ద ఇయర్!!
ఆలియా భట్ హిందీ సినిమాల్లో అద్భుతంగా నటిస్తుంది. ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినా.. దాదాపు అన్నీ సూపర్ హిట్లే. కానీ, జనరల్ నాలెడ్జి విషయంలో మాత్రం అమ్మడు చాలా పూర్. ఆ విషయం మీద సోషల్ మీడియాలో ఆమెపై జోకులు తెగ పేలుతుంటాయి. తాజాగా ఆమె తన అజ్ఞానాన్ని మరోసారి నిరూపించుకుంది. కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోతో మొదటిసారి ఆమె అజ్ఞానం బయటపడింది. భారత రాష్ట్రపతి ఎవరంటే, పృథ్వీరాజ్ చవాన్ అని ఆమె చెప్పింది. తాజాగా షకున్ బత్రా రూపొందించిన కామెడీ వీడియోలో.. ఆలియా ఓ మెంటల్ ట్రైనింగ్ జిమ్‌లో చేరినట్లు ఉంటుంది. ఆ ట్రైనింగ్ ద్వారా ఆమె తన జనరల్ నాలెడ్జిని పెంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పది నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో ఆలియా తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్, తల్లి సోనీ రాజ్దాన్, 2స్టేట్స్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా ఉంటారు. కరణ్ జోహార్ అడిగే అన్ని ప్రశ్నలకు పిచ్చి సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆలియాభట్ ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. తన మీద సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వస్తున్న జోకులన్నింటినీ తాను ఆస్వాదిస్తానని గతంలో ఓసారి ఆలియా చెప్పింది. -
యుద్ధం మొదలైంది!
మీ దృష్టిలో చెడ్డదానిగా మారిన మంచి అమ్మాయి ఎవరు?... ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో సోనమ్‌కపూర్‌ని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు తడుముకోకుండా ‘దీపికా పదుకొనె’ అన్నారు సోనమ్. అది మాత్రమే కాదు.. ‘మీ దగ్గర లేనిది.. దీపికా దగ్గర ఉన్నది ఏంటి?’ అనే ప్రశ్నకు ‘అతిగా స్పందించే పీఆర్ టీమ్’ అని చటుక్కున చెప్పడంతో పాటు, మరోప్రశ్నకు సమాధానంగా ‘అసలు దీపికాకి ఓ సొంత స్టయిలే లేదు’ అన్నారు సోనమ్. ఈ ప్రోగ్రామ్ని దీపికా చూడకపోయినా, చూసినవాళ్లు ఆమె చెవిలో సోనమ్ చెప్పిన సమాధానాలను ఊదేశారు. అంతే.. దీపికా పదుకొనె తన సన్నిహితుల దగ్గర సోనమ్‌ని తెగ తిట్టిపోస్తున్నారట. ఇంతకీ దీపికాపై సోనమ్‌కి ఎందుకంత ఆగ్రహం అనే విషయంలోకి వస్తే.. నిన్న మొన్నటివరకు ఈ ఇద్దరి ‘పీఆర్ ఏజెన్సీ’ ఒక్కటే. వాళ్లని మంచి చేసుకుని, సోనమ్‌ని దిగజార్చి తనని హైలైట్ చేసుకునేలా దీపికా ప్రచారం చేయించుకున్నారట. దీపికా వదులుకున్న సినిమాలు, వాణిజ్య ప్రకటనలు సోనమ్ చేస్తోందంటూ వీలు కుదిరినప్పుడల్లా ప్రచారం చేసిందట సదరు పీఆర్ ఏజెన్సీ. ఈ విషయం గ్రహించిన సోనమ్ ఇటీవలే పీఆర్ ఏజెన్సీని మార్చేశారు. సమయం కుదిరినప్పుడు దీపికాపై సైటైర్లు వేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు కరణ్ జోహార్ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారామె. ఇప్పటివరకు బహిరంగంగా దీపికా, సోనమ్ మాటలు అనుకున్నది లేదు. కానీ, సోనమ్ అందుకు తెరతీసేశారు. దాంతో ఇద్దరి మధ్య బహిరంగ యుద్ధం మొదలైంది. వీలు కుదిరినప్పుడల్లా ఒకరి గురించి మరొకరు నోరు పారేసుకుంటున్నారట. మరి.. ఈ యుద్ధం ఎప్పుడు సద్దుమణుగుతుందో కాలమే చెప్పాలి. -
రణ్‌బీర్ ఓకే అంటే పెళ్లికి సై..
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌పై నటి అలియా భట్ మోజుపడింది. అతనంతే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఓకే అంటే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. సినీ నిర్మాత కరణ్ జోహర్‌తో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో రణ్‌బీర్ కపూర్‌పై అలియా భట్ ప్రశంసలు కురిపించింది. రాక్‌స్టార్ సినిమాలో తొలిసారి రణ్‌బీర్‌తో కలిసి నటించినప్పుడు సరదాగా గడిచిపోయిందని తెలిపింది. ఆ తర్వాతే రణ్‌బీర్ అంటే ఎంతో అభిమానం పెరిగిందని చెప్పింది. ఇప్పటికీ రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని వెల్లడించింది. రణ్‌బీర్ కపూర్ నటన బాగుంటుందని, ఆయన సహ నటులందరినీ కలుపుకొని ముందుకు వెళతాడని పొగడ్తలతో ముంచెత్తింది. సినిమాలో నటనపరంగానే కాక బయట జీవితంలోనూ రణ్‌బీర్ ఉండే విధానం తనకు ఎంతగానో నచ్చిందని వివరించింది. రణ్‌బీర్‌తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించింది. సినీ పరిశ్రమలో రణ్‌బీర్ గురించి తప్ప ఎవరి గురించి అడిగినా చలాకీగా సమాధానం చెబుతానంది. తాను నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా సహనటులు వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలు ఎప్పుడూ సరదాగా ఆట పట్టించేవారని తెలిపింది. మరో నటుడు అర్జున్ కపూర్‌తో ఎఫైర్ ఉందన్న వార్తలను అలియా కొట్టిపారేసింది. రణ్వీర్ సింగ్ వెరైటీగా నటించేందుకు ప్రయత్నిస్తాడని, ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తాడని, మరికొన్ని సందర్భాల్లో చాలా కూల్‌గా ఉన్నట్టు కనిపిస్తాడని తెలిపింది. -
‘సల్మాన్ మాటలకు పడిపోయా’
విత్ కరణ్’ టాక్‌షోలో తొలిసారిగా పాల్గొ న్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాటలకు పడిపోయానని సినీ నిర్మాత కరణ్ జోహర్ అన్నారు. చాలా తమాషాగా సంభాషించారని, ప్రశ్నలకు సమాధానాలు వడివడిగా, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారని తెలిపారు. సెలిబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ నాలుగో ఎడిషన్‌లో కరణ్ తొలిసారిగా అతడి ప్రియ స్నేహితుడైన షారుఖ్ ఖాన్ ఒకప్పటి శత్రువు సల్మాన్‌తో చిట్‌చాట్ చేశారు. తానిప్పటికీ స్వచ్ఛమైన మనిషి(వర్జిన్)నేనన్న సల్మాన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే అనేక మంది తన వద్దకు వచ్చి మీరు నిజంగా ‘వర్జినే’నా? అని అడుగుతుంటారన్నాడు. అయితే ఆ రోజు తాను తమాషాగా ఆ మాట అన్నానని వివరించారు. చాలా హస్య చతురతతో మాట్లాడుతున్న సల్మాన్‌తో కొన్నిసార్లు ఎలా సంభాషించాలో కూడా తెలియలేదన్నారు. గతేడాది ఎడిషన్‌ను బాలీవుడ్ నటులు, దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌తో ప్రారంభమైందని, అప్పుడు అంతా ప్రశాంతంగా సాగిందని కరణ్ చెప్పారు. ఇప్పటి షో దానికి కాస్త విభిన్నంగా జరిగిందని వివాదానికి ఊతమిచ్చారు. ప్రతి అంశాన్ని ప్రేక్షకులు లోతుగా వెళ్లి ఎందుకు విశ్లేషిస్తారో అర్ధం కావడం లేదని, ఇది కేవలం షో మాత్రమేనని తెలిపారు. ఈసారి ఈ షోలో సల్మాన్‌ఖాన్, అమీర్ ఖాన్లు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రతిఏటా షారుఖ్ ఖాన్ ఈ షోలో పాల్గొంటున్నారు. అయితే సల్మాన్ ఖాన్ వినసొంపైన మాటలతో ఆకట్టుకున్నారని, అతడు ఈ షోలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కరణ్ తెలిపారు. -
డేర్ డెవిల్ దీపిక
కథానాయికల్లో దీపికా పదుకొనేని డేర్ డెవిల్ అనొచ్చు. తెరపైనే కాదు, తెర వెనుక కూడా ఏదైనా డేర్‌గా చేసేస్తారామె. సిద్దార్థ్ మాల్యాతో డేటింగ్, తర్వాత అతనితో కటీఫ్ చెప్పేసి రణబీర్‌కపూర్‌తో లవ్ ఎఫైర్. తర్వాత అతనికి కూడా గుడ్‌బై చెప్పేసి రీసెంట్గా రణవీర్‌సింగ్‌తో చెట్టాపట్టేసుకొని తిరగడం... ఇవన్నీ దీపిక ధైర్యానికి దర్పణాలు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ అనే బుల్లితెర కార్యక్రమంలో ప్రియాంకతో కలిసి పాల్గొన్న దీపిక... తన మనసులో మాటను డేర్‌గా చెప్పేసి.. తాను డేర్ డెవిల్నని మరోసారి రుజువు చేసుకుంది. ‘మీ బెస్ట్ ఆఫ్ స్క్రీన్ కిస్ ఎవరితో? రణబీర్ కపూర్తోనా, సైఫ్ అలీఖాన్తోనా, లేక రణవీర్సింగ్తోనా? అని సదరు కార్యక్రమ వ్యాఖ్యాత అడిగితే... ‘రణవీర్‌సింగ్’ అని డేర్‌గా సమాధానమిచ్చేసి తనదైన శైలిలో కిలకిలా నవ్వేసింది ఈ సొట్టబుగ్గల వయ్యారి. ప్రస్తుతం రణవీర్‌తో దీపిక పీకలలోతు ప్రేమలో కూరుకుపోయి ఉన్నారు. వీరిద్దరు కలిసి ఇటీవలే ‘రామ్‌లీలా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఘాటైన లిప్‌లాక్‌లు చాలా ఉన్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశాల్లో దీపిక, రణవీర్ నటించ లేదని జీవించారని ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో దీపిక చెప్పిన సమాధానం చెప్పకనే చెబుతోంది. లక్షలాది మంది చూసే టీవీ కార్యక్రమంలో ధైర్యంగా ఉన్నదున్నట్లు మాట్లాడి ‘డేర్ డెవిల్’ అనే బిరుదుని సార్థకం చేసుకుంది దీపిక.