బుల్లితెర ప్రేక్షకులకు ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ బ్యాడ్ న్యూస్ అందించాడు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇకపై ప్రసారం కాదని ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. కొన్నేళ్లుగా సెలబ్రెటీల చిట్‌చాట్‌తో బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతోన్న కాఫీ విత్ కరణ్ షో నెక్స్ట్ సీజన్ ఇక లేదని చెప్తూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు
ఈ మేరకు బుధవారం(మే 4) ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్ షేర్ చేశాడు. ‘‘కాఫీ విత్ కరణ్’ షో మీ, నా జీవితంలో ఒక భాగమైపోయింది. అలా ఈ షో ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాం. పాప్ కల్చర్‌లోనే అతిపెద్ద షోగా గుర్తింపు పొందింది కాఫీ విత్ కరణ్. కానీ ఈ షో నెక్స్ట్ సీజన్‌ను తిరిగి ప్రసారం చేయలేకపోతున్నామని చెప్పడానికి మనసు ఒప్పుకోవడం లేదు’’ అంటూ కరణ్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో 7వ సీజన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని కరణ్ తెలిపిన సంగతి తెలిసిందే.
చదవండి: ఈ మూవీకి కీర్తి పేరును నేనే సిఫార్స్ చేశా, మహేశ్ కాదు: డైరెక్టర్
అంతేకాదు మేలో ఈ షో షూటింగ్ కూడా జరగనుందని చెప్పాడు. అంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా కరణ్ ఈ షోను తిరిగి ప్రారంభంచడం లేదని చెప్పి బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చాడు. కాగా ఈ షో ద్వారా బాలీవుడ్ స్టార్స్‌తో ముచ్చటిస్తూ వారికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటకు లాగుతూ ఎంటర్‌టైన్ చేసేవాడు కరణ్. ప్రస్తుతం ఆయన ‘రాఖీ ఔర్ రాణీ కీ కహానీ’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్, వయోకామ్ 18 సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్నేఇ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల కరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment