Karan Johar
-
ఫిట్‌నెస్‌పై రూమర్స్.. కరణ్ జోహార్ క్లారిటీ!
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో మెరిశారు. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఇటీవల తన ఫిట్నెస్ గురించి వస్తున్న వార్తలపై తాజా ఈవెంట్లో స్పందించారు. స్లిమ్‌గా కనిపించడానికి గల కారణాలను వివరించాడు. తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరైన టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఫిట్‌నెస్‌కు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని డైరెక్టర్ సలహా ఇచ్చాడు. దీంతో కరణ్ బరువు తగ్గడంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్‌పెట్టారు.(ఇది చదవండి: 'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా)కరణ్ జోహార్ బరువు తగ్గేందుకు ఓజెంపిక్ వంటి డయాబెటిక్ మందుల వాడుతున్నారని రూమర్స్ వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సన్నిహిత మిత్రుడు మహీప్ కపూర్ వ్యాఖ్యల తర్వాత ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్లో మహీప్ కపూర్ ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా కరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఆ వార్తలకు చెక్ పడనుంది. కాగా.. గతంలో స్లిమ్‌గా ఉంటూ తన ఫిట్నెస్ పట్ల నిబద్ధతను చాటుకున్నారు కరణ్ జోహార్. -
లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్‌హిట్టు: కరణ్ జోహార్
కొన్ని సినిమాలకు లాజిక్‌తో పని లేదంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar). కథపై నమ్మకం ఉంటే చాలు అవి హిట్టవుతాయంటున్నాడు. తాజాగా కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మనం ఎంచుకున్న కథను నమ్మడం అన్నింటికన్నా ముఖ్యమైనది. కొందరు ఉత్తమ దర్శకులనే ఉదాహరణగా తీసుకోండి.. వారు లాజిక్స్‌ను పట్టించుకోకుండా కథను నమ్మడం వల్లే పెద్ద విజయాలు అందుకున్నారు.లాజిక్ లేకపోయినా..సినిమా నచ్చితే లాజిక్‌ను ఎవరూ పట్టించుకోరు. ఉదాహరణకు రాజమౌళి (SS Rajamouli) సర్ సినిమాలే తీసుకోండి. ఆయన తీసిన సినిమాల్లో లాజిక్స్ గురించి జనాలు మాట్లాడుకుంటారా? లేదు కదా.. ఆయనకు కథపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరు. యానిమల్, ఆర్ఆర్ఆర్, గదర్.. ఈ సినిమాలన్నింటికీ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ప్రేక్షకులు నమ్మారుఒక వ్యక్తి సింగిల్ హ్యాండ్‌తో వెయ్యిమందిని కొడుతున్నట్లు చూపించినప్పుడు అది ఎలా సాధ్యం? అని ఎవరూ లెక్కలు వేయరు. సన్నీ డియోల్ (Sunny Deol)కు వెయ్యి మందిని ఓడించే శక్తి ఉందని అనిల్ శర్మ నమ్మాడు. అదే వెండితెరపై చూపించాడు. ప్రేక్షకులూ అదే విశ్వసించారు. అందుకే గదర్ 2 అంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దర్శకులు తమ కథను నమ్మినప్పుడే విజయాలు సాధించగలరు. చేసే పనిని సందేహించినా, ఆడియన్స్ ఏమనుకుంటారోనని లాజిక్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినా సమస్యలు చుట్టుముట్టడం ఖాయం' అని చెప్పుకొచ్చాడు.నిర్మాతగా ఫుల్ బిజీకరణ్ జోహార్ ప్రస్తుతం 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా నిర్మిస్తున్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్య మల్హోత్రా, రోహిత్ శరఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కరణ్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో అక్షయ్‌కుమార్- మాధవన్‌ల కేసరి: చాప్టర్ 2తో పాటు కార్తీక్ ఆర్యన్‌తో మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: ఓటీటీ సెన్సేషన్.. జాన్వీ కపూర్ కంటే గొప్ప నటి.. అయినా పట్టించుకోరే? -
ఆ విషయంలో ఆలియా భట్, శ్రద్ధా కపూర్ సినిమాలే నిదర్శనం: కరణ్ జోహార్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహిళలు లీడ్ రోల్లో నటించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయని అన్నారు. అందుకు శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ-2 ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు. 2024లో బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా స్త్రీ-2 నిలిచిందన్నారు. ఒక మహిళ నటి లీడ్ రోల్లో ఇంతటి భారీ విజయం దక్కడం గొప్ప విషయమన్నారు. దీని బట్టి జెండర్ పరంగా చూస్తే ఇది చిన్న విజయమే అవుతుందని తెలిపారు.ఈ చిత్రం గురించి జోహార్ మాట్లాడుతూ.. "భారతదేశంలో మహిళలు విజయం సాధించడాన్ని ప్రత్యేకంగా చూస్తాను. ఎందుకంటే ఇది జెండర్‌కు దక్కిన చిన్న విజయం. ఈ దశాబ్దంలో బిగ్గెస్ట్ హిట్‌గా స్త్రీ-2ని చూసినప్పుడు నాకు కేవలం స్త్రీ మూవీగానే అనిపించింది. వాస్తవానికి ఈ సినిమాలో పురుషులు కూడా చాలా బాగా చేశారు. కానీ వారికి కూడా ఒక స్త్రీనే నాయకత్వం వహించింది. అలాగే ఆలియా భట్ లీడ్రోల్లో 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ గంగూబాయి కతియావాడి కూడా ఇలాంటి విజయమే సాధించింది. ఇలాంటి చిత్రాలు సినీ ఇండస్ట్రీలో మైలురాళ్లుగా నిలుస్తాయి. మహిళ ప్రధాన పాత్రలో చేసినా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాయని ఈ విజయం చూస్తే అర్థమవుతోంది. ఒక మహిళ సినిమాకు నాయకత్వం వహించగలదనే పెద్ద సంకేతం ఇది. కేవలం ఆలియా పాత్రతోనే గంగుబాయి కతియావాడి సినిమాకు విజయం దక్కింది' అని అన్నారు..సినీ పరిశ్రమలో నటీనటుల పారితోషికం గురించి కూడా కరణ్ జోహార్ మాట్లాడారు. మేల్ స్టార్స్ ఎక్కువ మంది ప్రేక్షకులను రాబడతారని.. అందుకే వారికి ఎక్కువ రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ బాక్సాఫీస్ విషయానికొస్తే కొంతమంది ఫీమేల్ లీడ్ సినిమాలు సైతం మేల్ స్టార్స్ చిత్రాల కంటే అధిక ఒపెనింగ్స్ రాబడుతున్నాయని తెలిపారు. స్త్రీ 2, గంగూబాయి కతియావాడి వంటి చిత్రాల విజయం బాలీవుడ్లో ఈ మార్పును స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఫీమేల్ స్టార్స్ లీడ్ రోల్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయని వెల్లడించారు. -
#Shalini Passi లేటెస్ట్ సిరీస్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా సెన్సేషన్ (ఫోటోలు)
-
ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో నటించిన షాలిని పాసి లేటెస్ట్ సెన్సేషన్. ఢిల్లీకి చెందిన ఈమె సోషల్ యాక్టివిస్ట్, ఆర్టిస్ట్ కూడా. ఫ్యాషన్‌కు మారు పేరు. మరోవిధంగా చెప్పాలంటే వాకింగ్ ఫ్యాషన్ఎగ్జిబిషన్. అదిరిపోయే డ్రెస్‌లు, అద్భుతమైన హెడ్‌పీస్‌లు, ఆకట్టుకునే బ్యాగ్‌లు ఇలా షాలిని స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె బ్యాగులు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.ఆమె బ్యాగుల కలెక్షన్ చాలా స్పెషల్మాత్రమేకాదు, ధర కూడా కళ్లు చెదిరే రేంజ్‌లోనే. పావురాలు, చిలుకలు, పాత కెమెరాలు ఇలా రకరకాల షేపుల్లో ఆమె బ్యాగులు మెస్మరైజింగ్‌గా ఉంటాయి.ఒక ఎపిసోడ్లో, షాలిని క్లాసిక్ క్లిక్ కెమెరాను పోలి ఉండే క్లచ్‌తో కనిపించింది. పాతకాలపు కెమెరా ఆకారంలో క్రిస్టల్-స్టడెడ్ హ్యాండ్‌బ్యాగ్ ధర సుమారు 5 లక్షల రూపాయలు. మరో ఎపిసోడ్లో ఆమె చేతిలో మెరిసిన ఫ్లెమింగో క్లచ్ ధర అక్షరాలా రూ. 5,400,000.బ్రిక్ ఫోన్ బ్యాగ్ ధర రూ. 600,000, ఇంకా 8 లక్షల, 30వేల విలువ చేసే టీవీ టెస్ట్ స్క్రీన్ బ్యాగ్, దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే క్రిస్టల్ హార్ప్ క్లచ్‌తో ఆకర్షణీయమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా, షాలిని జెల్లీ ఫిష్, టెడ్డీ బేర్స్, చిలుకలు, గులాబీలు, కుక్కలు , ఇతర ఫన్నీ బ్యాగ్స్కూడా ఆమె సొంతం.కాగా షాలిని పాసి భర్త బిలియనీర్,పాస్కో గ్రూప్ ఛైర్మన్ సంజయ్ పాసి. ఈ దంపతుల రాబిన్ రాబిన్ . ఇక ఈ సిరీస్‌లో మహీప్ కపూర్, నీలం కొఠారి, భావన పాండే, రిద్ధిమా కపూర్ సాహ్ని, సీమా సజ్దేహ్ మరియు కళ్యాణి సాహా చావ్లా కూడా నటించారు -
Dhanteras 2024 : ధర్మ ఆఫీసు ధన్తేరస్ పూజలో సెలబ్రిటీల సందడి
-
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
సినిమాల్లోకి ‘సీరమ్’!
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌తో చిరపరిచితమైన వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సీఈవో అదార్ పూనావాలా ఏర్పాటు చేసిన సిరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 1,000 కోట్లు వెచ్చించనుంది. ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లలో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సిరీన్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. దీంతో ధర్మలో 50 శాతం వాటాను సిరీన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకోనుంది. మిగిలిన 50 శాతం వాటాతోపాటు యాజమాన్యాన్ని కరణ్ జోహార్ కలిగి ఉంటారని సిరీన్ స్పష్టం చేసింది. వెరసి పూనావాలా పెట్టుబడులు ధర్మ విలువను రూ. 2,000 కోట్లుగా నిర్ధారించాయి. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ధర్మ, సిరీన్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటైనట్లు సిరీన్ పేర్కొంది. సినిమాల నిర్మాణంలో ధర్మకున్న నైపుణ్యం, అదార్ పూనావాలాకున్న వనరులు ఇందుకు తోడ్పాటునివ్వగలవని అభిప్రాయపడింది. ధర్మ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని, మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తాజా పెట్టుబడులపై స్పందిస్తూ పూనావాలా పేర్కొన్నారు. భవిష్యత్ దృక్పథ వ్యూహాలు, నైపుణ్యంతోకూడిన సినిమాల నిర్మాణాల సక్రమ కలయికను తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నదని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. బాధ్యతలు ఇలా: కంపెనీ నూతన ఏర్పాటులో భాగంగా ధర్మకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కరణ్ జోహార్ సృజనాత్మక కార్యక్రమాలను రూపొందిస్తారు. సీఈవోగా అపూర్వ మెహతా వ్యూహాత్మక మార్గదర్శకుడిగా కరణ్‌తో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు. కంటెంట్ నిర్మాణం, పంపిణీ, ఆధునిక టెక్నాలజీలను ఏకీకృతం చేయడం, ప్రొడక్షన్ విధానాలను మెరుగుపరచడం, ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం తదితర కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు సిరీన్ వివరించింది. దేశీయంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజా డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. -
సంస్థలో సగం వాటా అమ్మేసిన ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌లో కరణ్ జోహార్ ఒకరు. దర్శకుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేశారు. పలు దక్షిణాది సినిమాల్ని హిందీలో రిలీజ్ చేసి, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన మార్క్ చూపించారు. అలాంటిది గత కొన్నిరోజులుగా ఈయన తన నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌ని అమ్మేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయింది.(ఇదీ చదవండి: పృథ్వీ వంకర చూపులు.. బిగ్‌బాస్‌లో గలీజు ప్రవర్తన!)కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలోని కొంత వాటాని రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని అన్నారు. కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త అడర్ పునావాలాకి చెందిన సెరెన్ ప్రొడక్షన్స్ 50 శాతం వాటా దక్కించుకుంది. ఈ మేరకు రూ.1000 కోట్ల మేర నిర్మాణ సంస్థలో ఇన్వెస్ట్ చేయనుంది. అంటే క్రియేటివ్ పనులన్నీ కరణ్ జోహర్ చూసుకుంటారు. నిర్మాణ వ్యవహారాల్లో పునావాలా భాగమవుతుందని తెలుస్తోంది.కరోనాకు ముందు పర్లేదు గానీ ఈ వైరస్ వచ్చిన తర్వాత మాత్రం బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. కరణ్ జోహార్ లాంటి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాత కూడా కుదేలైపోయాడు. ఈ ఏడాది కరణ్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్గా రిలీజైన ఆలియా భట్ 'జిగ్రా'.. కరణ్ నిర్మించింది. దీనికి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా సక్సెస్ రేటు తగ్గిపోవడంతో భారీ ఆర్థిక నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే సగం వాటా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
జిగ్రా విమర్శలపై కరణ్ జోహార్ పోస్ట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన నటి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తి డిమ్రీల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.అయితే జిగ్రా కలెక్షన్లపై ప్రముఖ నిర్మాత భార్య, నటి దివ్య ఖోస్లా విమర్శలు చేసింది. ఎందుకు ఫేక్ వసూళ్లు ప్రకటిస్తున్నారని మండిపడింది. తాను జిగ్రా థియేటర్‌కు వెళ్తే అంతా ఖాళీగా కనిపించిందని పోస్ట్ చేసింది. అయితే నటి దివ్య ఖోస్లా కామెంట్స్‌పై నిర్మాత కరణ్ జోహార్ రియాక్ట్ అయ్యారు. నిశ్శబ్దమే మూర్ఖులకు సరైన సమాధానమంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు.తాజాగా కరణ్ జోహార్ కామెంట్స్‌పై నటి దివ్య రియాక్ట్ అయింది. కరణ్ పేరు ప్రస్తావించనప్పటికీ అతని పోస్ట్‌పైనే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దివ్య కాస్తా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. మీకు సిగ్గు లేకుండా ఇతరులకు చెందిన వాటిని దొంగిలించడం అలవాటు.. మీరు ఎల్లప్పుడూ మౌనంగానే ఆశ్రయం పొందుతారు. మీకు వెన్నెముకే కాదు.. అలాగే వాయిస్ కూడా లేదంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రస్తావించింది.జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దుకాగా.. అంతకుముందు ఆడియన్స్‌ను ఫూల్ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్ హాల్ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు. -
కరణ్ జోహార్ 'టై' అంత ఖరీదా..? దేనితో డిజైన్ చేశారంటే..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహోర్ ఎన్నో విలక్షణమైన సినిమాలను నిర్మించి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. దర్శకుడిగా, నిర్మాతగా తానెంటో చూపించడమే గాక బుల్లి తెరపై కూడా వ్యాఖ్యతగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడూ లగ్జరీ ఫ్యాషన్ ట్రెండ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అందుకు తగ్గట్లుగా ఉండే ఆయన ఆహార్యం ఫ్యాషన్‌కే ఐకానిక్‌గా నిలిచేలా ఉంటుంది. ఎప్పుడు అత్యంత లగ్జరియస్ బ్రాండ్ వేర్లతో కనిపించే కరణ్ తాజాగా ఈసారి అత్యంత ఖరీదైన టైతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సాధారణం 'టై' అత్యంత ఖరీదైనదైన వేలకు మించి పలకదు ధర. కానీ కరణ్ ధరించిన 'టై' అత్యంత విలక్షణమైనది, అత్యంత ఖరీదైనది కూడా. ఇటీవల ముంబైలో జరగిన జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్లో షియపరెల్లి బ్రాండ్‌కి చెందిన లేత గోధమ కలర్ కోట్తో వెరైటీ టైతో కనిపించారు.ఈ 'టై'ని హెయిర్‌తో రూపొందిచడం విశేషం. ఆ కోట్కి తగ్గ కలర్లో ఇంగీష్ వాళ జట్టుమాదిరిగా ఉంటుంది. చెప్పాలంటే ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ల దృష్టి అంతా ఆ 'టై' పైనే ఉంది. ఇంతకీ అదెంత ఖరీదు తెలిస్తే కంగుతింటారు. దీని ధర సుమారు రూ. 1.93 లక్షలు.. అంటే దగ్గర దగ్గర రెండు లక్షలు పలుకుతోంది.(చదవండి: 'ఆభరణాల గౌను'లో సారా అలీఖాన్ రాయల్ లుక్..!) -
వాణిజ్య రాజధాని ముంబైలో 'దేవర'.. ప్రమోషన్స్‌లో బిగ్ ప్లాన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం రిలీజ్ దగ్గరపడుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ముంబై వేదికగా ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ పాల్గొన్నారు. పాన్ ఇండియా రేంజ్లో ట్రైలర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ఓవర్సీస్లో కూడా దేవర క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ఇదీ చదవండి: భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరంలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. ఆయన అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేశ్ నిమజ్జనం దాదర్ చౌపత్తి బీచ్ వద్దే జరుగుతుంది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొంటారు. నిమజ్జనం రోజున సుమారు 10 లక్షల మంది అక్కడి బీచ్‌కు చేరుకుంటారని అంచనా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదే బీచ్‌లో భారీగా దేవర పోస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. సినిమాకు ఈ అంశం భారీగా కలిసొస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్లో దేవరను కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు.సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ చిత్రం 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల (సుమారు 178 నిమిషాలు) రన్టైమ్తో రానుంది. అంటే దాదాపు మూడు గంటల నిడివి ఉండనుంది. దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పవర్ఫుల్ విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించగా శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.#Devara cutout is standing tall in the sea at Dadar Chowpatty in Mumbai ❤️#DevaraOnSep27th pic.twitter.com/fI0oKTlcap— NTR Arts (@NTRArtsOfficial) September 14, 2024 -
Devara Trailer: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్లో భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ సుమారు 11 లక్షలకు పైగా టికెట్ల విక్రయం జరిగింది.దేవర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ముంబైలో ప్రమోషన్స్ కార్యక్రమాన్ని మేకర్స్ ప్రారంభించారు. బాలీవుడ్ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్లో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ షేడ్‌లో కనిపించే విజువల్స్‌తో పాటు సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు కేక పుట్టించేలా ఉన్నాయి.దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
ముంబైలో దిగిన 'దేవర'
జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర. సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో ముంబైలో అడుగుపెట్టాడు తారక్. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో దేవరపై పాన్ ఇండియా రేంజ్లో భారీగా క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించారు. బాలీవుడ్ నుంచే దేవర సినిమా ప్రమోషన్లను తారక్ ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన సెప్టెంబర్ 10న ట్రైలర్ కార్యక్రంలో పాల్గొననున్నారు. ఇదే ఈవెంట్లో హిందీ మీడియాతో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది.ధర్మతో దేవర'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్‌కి చెందిన ఈ నిర్మాణ సంస్థ మొదట 'బాహుబలి' సినిమాను బాలీవుడ్ పబ్లిక్‌లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని నార్త్ బెల్ట్‌లో విడుదల చేసేందుకు భారీ ధరకు రైట్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్లో దేవర వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్స్, ప్రమోషన్స్ అన్నీ ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఒక సినిమాను కరణ్ జోహార్ అండ్ టీమ్ ఎలా పబ్లిక్‌లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న దేవర ట్రైలర్ కోసం ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది. -
ఐఫా అవార్డ్స్-2024 షెడ్యూల్ ప్రకటన.. రానా, తేజను తప్పించారా..?
ఈ ఏడాదిలో జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు అబుదాబి వేదిక కానుంది. 24వ ‘ఐఫా’ వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్‌లో సెప్టెంబర్ 27-29 వరకు జరగనున్నట్టు తాజాగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్‌తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వెలువడింది.ఐఫా అవార్డ్స్ వేడుకలో షాహిద్ కపూర్‌తో సహా బాలీవుడ్ ప్రముఖులు తమ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. సెప్టెంబర్ 27న ఐఫా ఉత్సవం పేరుతో అద్భుతమైన ఈవెంట్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 28న అవార్డ్స్, 29న ఐఫా రాక్స్ గాలాతో ఈ కార్యక్రమం ముగుస్తోంది.రేసులో ఈ సినిమాలే టాప్ఈ సంవత్సరం నామినేషన్లు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. రణబీర్ కపూర్ 'యానిమల్' అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుంది. రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీ 10 నామినేషన్లను పొందింది. 2023 ఏడాదిలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌తో పాటు జవాన్ రెండూ పాపులర్ కేటగిరీలో ఏడు నామినేషన్లను పొందగా, విక్రాంత్ మాస్సే చిత్రం 12th ఫెయిల్ ఐదు నామినేషన్లను సాధించింది. ఈసారి ఐఫా అవార్డ్స్ కోసం గట్టిపోటీ ఎదురుకానుంది.రానాను తప్పించారా..?ఐఫా అవార్డ్స్2024'కి హోస్ట్‌గా రానాతో పాటు యంగ్ హీరో తేజ సజ్జ వ్యవహరించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మేరకు హైదరబాద్‌లో ముందస్తు వేడుక(కర్టెన్ రైజర్ ఈవెంట్)లో కూడా వారు సందడి చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్లు తెరపైకి వచ్చారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలను ఈసారి నిర్వాహుకులు తప్పించారా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, గతంలో కరణ్ ఐఫా హోస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. -
కరణ్ జోహార్ డెనిమ్ జాకెట్ అంత ఖరీదా? ఏకంగా..!
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై(1998) సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యి కభీ ఖుషీ కభీ గమ్ సూపర్ హిట్ సినిమాలతో మంచిపేరు సంపాదించుకున్నారు. అంతేగాదు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే వంటి అవార్డులు కూడా అందుకున్నారు. అలాగే ఫ్యాషన్ పరంగా తనదైన శైలిలో ఎప్పటికప్పుడూ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు. దర్శకుడు కూడా హీరో రేంజ్లో ఉంటాడనేలా అతడి ఆహార్యం ఉంటుంది. అతను ఫ్యాషన్ శైలి ఏంటన్నది ధరించే దుస్తులే రేంజే చెబుతాయి. ఆయన ఇటీవల అనన్య పాండే బ్రాండ్ న్యూసిరీస్ 'కాల్ మి బే' ట్రైలర్ లాంచ్‌లో అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్‌తో సరికొత్త లుక్‌లో కనిపించాడు. చెప్పాలంటే మనం ఒక లాంగ్ టూర్‌కి ప్లాన్ చేసే మొత్తం అతడి కాస్ట్యూమ్ డిజైన్‌కి ఖర్చు పెట్టాడు.కరణ్ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కి చెందిన బ్లాక్ డెనిమ్ జాకెట్‌ని ధరించాడు . దీని ధర ఏకంగా రూ. 5.40 లక్షల పలుకుతుందట. ఈ జాకెట్‌కు తగ్గట్టు బ్లాక్ టీ షర్ట్, జీన్స్ ధరించడంతో ఓవరాల్ బ్లాక్ కలర్‌తో లుక్ ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా అనేలా హైలెట్‌గా ఉంది కరణ్ కాస్ట్యూమ్. (చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్‌ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్‌లోని షోరూమ్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో?
బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు ఇద్దరు పిల్లలు. యష్- రూహి అని ట్విన్స్. పిల్లలున్నారనగానే అతడికి పెళ్లయిందనుకునేరు.. కానే కాదు! 52 ఏళ్లున్న ఈ డైరెక్టర్ పెళ్లికాని ప్రసాద్‌లాగే మిగిలిపోయాడు. వివాహమంటే మొగ్గుచూపని ఇతడికి పిల్లలంటే ఇష్టం. అందుకని సరోగసి ద్వారా 2017లో కవలల పిల్లలకు తండ్రయ్యాడు.ఎవరి పొట్టలో ఉన్నాం?ఇప్పుడిప్పుడే స్కూలుకు వెళ్తున్న ఈ పిల్లలు తల్లి గురించి అడుగుతున్నారట! ఈ విషయాన్ని కరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'మాదొక మోడ్రన్ ఫ్యామిలీ. అయితే నాకు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నా పిల్లలిద్దరూ.. మేము చిన్నప్పుడు ఎవరి పొట్టలో ఉన్నాం? మా అమ్మ ఎక్కడ? మేము అమ్మ అంటున్న వ్యక్తి మాకు నానమ్మ అవుతుంది కదా.. అని ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.వద్దని చెప్పలేకపోతున్నాఆ చిన్ని బుర్రలకు అర్థమయ్యేలా సమాధానం ఎలా చెప్పాలి? తండ్రిగా ఉండటం అంత ఈజీ కానే కాదు. మరోపక్క నా బాబు స్వీట్స్ గట్రా తిని కొద్దిగా లావయినా కంగారుపడిపోతున్నాను. అలా అని వారిని వద్దని వారించలేను. ఎందుకంటే ఈ చిన్న వయసులో వాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలి. సంతోషంగా గడపనివ్వాలి. నా కూతురికి, బాబుకు ఆంక్షలు పెట్టి ఇబ్బందిపెట్టలేను' అని కరణ్ చెప్పుకొచ్చాడు.చదవండి: OTT: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే! -
కరణ్ జోహార్ ఫేస్ చేసిన బాడీ డిస్మోర్ఫియా అంటే..?ఎందువల్ల వస్తుంది?
మనిషికి ఆత్మనూన్యతకు మించిన ప్రమాదకరమైన జబ్బు మరొకటి లేదు. కొందరూ దీన్ని అధిగమించేలా తమ సామర్థ్యం, తెలివితేటలతో ఆకర్షిస్తారు. కానీ చాలామంది చింతిస్తూ కూర్చొండిపోతారు. తమలోని లోపాలనే పెద్దవిగా చూసుకుని బాధపడితుంటారు. నిజానికి వాటిని ఇతరులు కూడా గుర్తించకపోవచ్చు. కానీ వీళ్లు మాత్రం తాము అందరికంటే విభిన్నంగా, అసహ్యంగా ఉన్నానే భావనలో ఉండిపోతారు. ఇలాంటి ఆత్మనూన్యతకు సంబంధించిన రుగ్మతను ఎదుర్కొన్నాడు బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్. అతడు ఎదుర్కొన్న పరిస్థితిని వైద్య పరిభాషలో ఏమంటారంటే..కరణ్ జోహర్ ఎదుర్కొన్న పరిస్థితిని బాడీ డిస్మోర్ఫియా అంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్లు నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. తమ రూపాన్ని పదే పదే అద్దంలో చూసుకుని కుంగిపోతుంటారు. అందంగా ఉండేందుకు మంచి ప్రయత్నాలు కూడా చేస్తారు. అయినప్పటికీ ఏదో లోపం ఉందనుకుంటూ బాధపడిపోతుంటారు. ఇక్కడ కరణ్ జోహార్ కూడా ఇలానే ప్రవర్తించేవాడు. ఇతరులు ఎవ్వరూ తన శరీరాన్ని గమనించకూడదనుకునేవాడట. దీని నుంచి బయటపడేందుకు అతడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఏంటీ బాడీ డిస్మోర్ఫియా? అందుకు గల కారణాలు గురించి సవివరంగా చూద్దాం.బాడీ డిస్మోర్ఫియా అంటే ఏమిటి?నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లేదా బీడీడీ అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి శరీరాకృతి తీరులోని లోపాల గురించి చింతిస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఈలోపాలు ఎదుటివాళ్లకు కనిపించవు లేదా గుర్తించబవు. ఇది ముఖ్యంగా టీనేజర్లు, యువకులలో సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుందట. అంతేగాదు పెద్దలలో 2.4% మందిని ప్రభావితం చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా యుక్తవయసు, వయోజన వయసులో ఈ విధమైన భావన మొదలవుతుందని చెబుతున్నారు. చాలా వరకు ఈ విధమైన పరిస్థితి 18 ఏళ్ల కంటే ముందునుంచి వారిలో చిన్నగా వారిపై వారికి అభద్రతా భావం కలగడం మొదలవ్వుతుందని తెలిపారు వైద్యులు.ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాలు..శరీరంలో లోపాల గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడపడం, ఇతరులకు అది ముఖ్యమైనది కాదని లేదా గనించనప్పటికీ.రూపాన్ని పదేపదే చూసుకుంటూ ఒత్తిడికి గురవ్వుతుండటంహెయిర్స్టైల్, బట్టల మార్పు వంటివి తరుచుగా మర్చేయడంతరుచుగా సెల్ఫీలు తీసుకోవడం, శరీరంలోని కొన్ని ప్రాంతాను దాచేయత్నం చేయడంవారి శరీరం లేదా స్వరూపంలో నచ్చని దాన్నే ఇతరులు తదేకంగా చూస్తున్నారని లేదా ఎగతాళి చేస్తున్నారని భావించడంతమ శరీరంపై అసహ్యం లేదా సిగ్గుతో కుంగిపోవడంవస్త్రాధారణకు సరిపోనని భావించడంఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మాత్రం స్నేహితులు, కుటుంబ సభ్యలుతో గడపడం, వంటివి చేస్తే స్వీయ హాని లేదా ఆత్మహత్య వంటి ఆలోచనల నుంచి బయటపడగలుగుతారు. ఎందువల్ల అంటే..జెనిటిక్ సమస్యతల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఈ పరిస్థితితో బాధపడుతుంటే..మెదడు నిర్మాణం, రసాయనిక చర్యలు, కార్యాచరణ వ్యత్యాసాలుబాల్యంలో నిర్లక్ష్యానికి గురవ్వడంపరిణామాలు..బాడీ డిస్మోర్ఫియాతో బాధపడుతున్న వారికి మానసిక ఆరోగ్యో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆందోళన రుగ్మతలుడిప్రెషన్, ఒత్తిడితినే రుగ్మతలుఅబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ.(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
నాన్న వల్ల ఆర్థిక ఇబ్బందులు.. అమ్మ, నాన్నమ్మలే కాపాడారు: కరణ్ జోహార్
కరణ్ జోహార్ సాధించిన ప్రతి విజయం వెనుక తన కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. బాలీవుడ్లో రెండున్నర దశాబ్దాలకుపైగా రాణిస్తున్నారు.దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత కొద్ది కాలంగా దర్శకత్వానికి స్వస్తి పలికి నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న కరణ్ తన గతాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.నాన్న మిగిల్చిన నష్టాలను నాన్నమ్మ తీర్చిందికరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ కూడా టాప్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. 1980 సమయంలో తన తండ్రి నిర్మించిన 5 సినిమాలు వరుసుగా ఫ్లాప్ కావడంతో తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి తాజాగా కరణ్ మాట్లాడాడు. ఇబ్బందుల నుంచి సక్సెస్ కోసం తాను ఎంత కష్టపడ్డారో ఆయన తెలిపారు.కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ బాలీవుడ్లో దోస్తానా, అగ్నిపథ్, డూప్లికేట్, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలను నిర్మించి టాప్ నిర్మాతల లిస్ట్‌లో చేరిపోయారు. అయితే, దోస్తానా (1980) తర్వాత యష్ జోహార్ నిర్మించిన 5 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దారుణమైన నష్టాలను మిగిల్చాయి. దీంతో తన నాన్నగారు చాలా ఆస్థులను అమ్మేశారని కరణ్ తెలిపారు.'మా నాన్నగారు మొదటి చిత్రం ఫ్లాప్ అయినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. డబ్బును ఫైనాన్సర్లకు తిరిగి చెల్లించడానికి మా నాన్నమ్మ తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బును చెల్లించింది. ఆ తర్వాత మరో సినిమా నిర్మిస్తే అదికూడా నిరాశపరిచింది. ఆప్పుడు మా అమ్మ తన నగలను విక్రయించింది. ఆపై కుటుంబ వారసత్వంగా వస్తున్న ఢిల్లీలోని కొన్ని ఆస్తులను కూడా నాన్న అమ్మేశారు.' అని కరణ్ జోహార్ గుర్తుచేసుకున్నారు.కరణ్ జోహార్ తండ్రి నిర్మాత అయినప్పటికీ, తమది సంపన్న కుటుంబమనే అపోహను తొలగించారు. వారిది మధ్యతరగతి, ఉన్నత-మధ్యతరగతి కుటుంబమని చెప్పారు. కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా రాకుమారుడిలా తనని పెంచారని గుర్తుచేసుకున్నారు.కరణ్ జోహార్ అంత డబ్బు ఎలా సంపాదించాడు..?కరణ్ జోహార్ నేడు అత్యంత సంపద కలిగిన నిర్మాతల లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు. తన తండ్రి యష్ జోహార్ డబ్బు సంపాధించకపోయినప్పటికీ మంచిపేరు ఉంది. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కరణ్ ఊహించలేనంత విజయాలను సొంతం చేసుకున్నారు. కెరీర్లో నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి అవిశ్రాంతంగా ఎలా పనిచేశాడో ఆయన తెలిపారు. అదృష్టవశాత్తూ, దర్శకుడిగా తన మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఆయన అన్నారు. తన తండ్రి మరణించిన తర్వాతే ధర్మ ప్రొడక్షన్స్ నుంచి పలు సినిమాలు నిర్మించినట్లు ఆయన అన్నారు.జీవితంలో తను ఎంత కష్టపడ్డారో కరణ్ ఇలా చెప్పుకొచ్చారు. 'మా కుటుంబం ఆనందంగా ఉండాలని నాన్న ఎంతో కష్టపడ్డారు. కానీ, అంతగా కలిసిరాలేదు. ఆయన కలలకు నేను ఎలాగైనా జీవం పోయాలని అనుకున్నాను. ఈ క్రమంలో నేను ముందుగా దర్శకుడిగా పలు సినిమాలు తీశాను. దేవుడి ఆశీర్వాదంతో అవి సూపర్ హిట్ అయ్యాయి. చేతిలోకి సరిపడా డబ్బు వచ్చింది. నా కష్టంతో నాన్న కలను నిజం చేశాను. అందుకోసం నేను రోజుకు 18 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆదివారం, జాతీయ సెలవు దినాలలో కూడా నేను పని చేస్తాను. నా జీవితంలో శెలవు అనే పదానికి చోటు లేదు. నేను కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోతాను.' అని కరణ్ చెప్పారు.దర్శకుడిగా కరణ్ జోహార్ చివరి చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, అలియా భట్ నటించారు. విమర్శకుల చేత కూడా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్18 స్టూడీయోస్ సంయుక్తంగా నిర్మించాయి. -
‘కిల్’ ప్రీమియర్ షోలో మెరిసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)
-
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సింగర్ సుచిత్ర కోలీవుడ్ షేక్ చేస్తోంది. రోజుకొక బాంబు పేలుస్తోంది. గతంలో సుచీలీక్స్ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఆమె మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి.ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఈ సారి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లండన్ ట్రిప్‌లో కార్తీక్ కుమార్, షారుక్, కరణ్ కలిసి గే పార్టీలకు వెళ్లారని ఆరోపించింది. ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉందో అలాంటి దేశాలకు వెళ్లేవారని తెలిపింది. దీంతో మరోసారి సుచిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారాయి.*Big Allegations on Shahrukh Khan and Karan Johar*According to Tamil Singer Suchitra, her Ex husband Karthik Kumar, SRK and Karan Johar had a gay encounter in LondonThey Usually go the countries on holidays where GAY S*X is legal and they enjoy it 😵 pic.twitter.com/VYrYk8pUnz— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 16, 2024 -
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
హిందీలో చాలా ఏళ్ల నుంచి దర్శకుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కరణ్ జోహార్. ప్రస్తుతం డైరెక్షన్ పక్కనబెట్టి నిర్మాతగా వరస చిత్రాలు తీస్తున్నారు. కరణ్ నిర్మించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ఈ నెల చివర్లో రానుంది. సరే దాని గురించి పక్కనబెడితే ఈయన్ని ఇప్పుడు ఓ కమెడియన్ ఘోరంగా హర్ట్ చేశాడు. దీంతో కరణ్ ఫుల్ ఫైర్ అయ్యాడు. తనని చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇన్ స్టాలో స్టోరో కూడా పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)ఇంతకీ ఏమైంది?దర్శకనిర్మాత కరణ్ జోహార్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోల్స్, మీమ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని చూసిచూడనట్లు వదిలేస్తుంటాడు. అయితే ప్రముఖ రియాలిటీ షోలో ఓ కమెడియన్.. కరణ్‌ని దారుణంగా అనుకరించాడట. తల్లితో కలిసి టీవీ చూస్తున్న టైంలో ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చిందని, దీంతో తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.కరణ్ పోస్టులో ఏముంది?'నేను, మా అమ్మతో కలిసి టీవీ చూస్తున్నాను. ఓ పేరున్న ఛానెల్లో రియాలిటీ కామెడీ షో ప్రోమో ఒకటి చూశాను. అయితే ఓ కమెడియన్.. నన్ను చాలా చీప్‌గా అనుకరించాడు. ఇలాంటివి ట్రోలర్స్ నుంచి వచ్చాయంటే అర్థముంది. కానీ ఇండస్ట్రీలో పేరున్న కమెడియన్ ఇలా చేయడం ఏం బాలేదు. దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఇలా అవమానించడం కరెక్టేనా? ఈ విషయంలో నాకు కోపం రావట్లేదు కానీ చాలా బాధ కలుగుతోంది' అని కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆ షో ఏంటి? కమెడియన్ ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు.(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా) -
అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
కరణ్ జోహార్ ఇంట్లో కనిపించిన త్రిప్తి దిమ్రీ
-
అందరూ చూస్తుండగా అతడి కాళ్లు మొక్కబోయిన సమంత!
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ మంగళవారం (మార్చి 19న) పెద్ద ఈవెంట్ నిర్వహించింది. త్వరలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవేనంటూ పెద్ద లిస్ట్ విడుదల చేసింది. ఆయా సినిమాలకు సంబంధించిన తారలంతా ఈ ఈవెంట్లో తళుక్కుమని మెరిశారు. టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా సిటాడెల్ సిరీస్ కోసం స్టేజీపైకి వచ్చింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న హీరో వరుణ్ ధావన్.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పాదాలకు నమస్కరించాడు. దాన్ని గుర్తు చేయొద్దు ఇంతలో సమంత సైతం అతడి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన కరణ్.. వద్దు, వద్దంటూ సామ్‌ను ఆపాడు. దీంతో వరుణ్.. అందరూ కరణ్ పాదాలకు నమస్కరించాల్సిందేనన్నాడు. దీనికి కరణ్ బదులిస్తూ.. నన్ను అప్పుడే అంత పెద్దవాడిని చేసేయొద్దు ప్లీజ్.. ఈ మధ్యే ఓ ఏజ్(50 ఏళ్లు) దాటేశాను. దయచేసి నాకు దాన్ని గుర్తు చేయొద్దు అని చెప్పాడు. అయినప్పటికీ వినని వరుణ్.. మీ ముఖంలో వయసు కనిపించనీయకుండా మీ స్కిన్ డాక్టర్ చాలా బాగా కష్టపడుతున్నాడు అని సెటైర్స్ వేశాడు. నేనే ట్రీట్మెంట్ చేయించుకోలే నేనేమీ అందరిలా ముఖానికి సర్జరీలు, ట్రీట్మెంట్లు చేయించుకోలేదు.. అలాంటివారిలో నేను ఒకడిని కానే కాదు అని నొక్కి చెప్పాడు కరణ్. ఇకపోతే సిటాడెల్ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సిటాడెల్ అనే హాలీవుడ్ సిరీస్‌కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో సిమ్రాన్, కేకే మీనన్, శివశక్తి సింగ్, సఖీబ్ సలీం, సిఖిందర్ ఖేర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. गले 😍. . .#varundhawan #karanjohar #samantharuthprabhu #Reelswithtahirjasus #jasus007 pic.twitter.com/XwHon5qfVY — Tahir Jasus (@Tahirjasus) March 19, 2024 చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన ప్రేమలు హీరోయిన్ -
డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే
స్టార్ హీరోయిన్ నటించిన ఓ మూవీ ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్య కథతో తీసిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ పరంగా కాస్త ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఇదే సినిమా? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తెలుగులో తక్కువ కానీ హిందీలో చాలా సినిమాలు నేరుగా ప్రముఖ ఓటీటీల్లో రిలీజై అయిపోతున్నాయి. లాక్డౌన్ తర్వాత నుంచి ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ సారా అలీ ఖాన్ కాంబోలో తీసిన సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఉషా మెహతా అనే స్వాతంత్ర్య ఉద్యమకారిణి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1942లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు చాలామంది నిస్వార్థంగా పనిచేశారు. అలా అండర్ గ్రౌండ్లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిల్చిన ఓ మహిళ కథే ఈ సినిమా. సారా అలీ ఖాన్ టైటిల్ రోల్ పోషించింది. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ డైరెక్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏ వతన్ మేరే వతన్'. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మించారు. కణ్ణన్ అయ్యర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. (ఇది చదవండి: బిగ్‌బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీనవం.. ఇంతలో!) ఈ సినిమాను భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసి.. ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపిన ఓ మహిళ కథను తెరపై ఆవిష్కరించనున్నారు. ఉషా మెహతా అనే మహిళ జీవిత కథనే సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో రేడియో కీలక పాత్ర పోషించింది. ఇవాళ ప్రపంత రేడియో దినోత్సవం కావడంతో ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి, ఆనంద్ తివారీ కీలక పాత్రలు పోషించారు. resilience in her voice, and the spirit of freedom in her heart, hear what she has to say to you this #WorldRadioDay 📻#AeWatanMereWatanOnPrime, Mar 21#KaranJohar @apoorvamehta18 @somenmishra0 @SaraAliKhan #KannanIyer @darab_farooqui @Dharmatic_ pic.twitter.com/ZdQvDsFLjH — prime video IN (@PrimeVideoIN) February 13, 2024 -
2023లో ఉత్తమ చిత్రం యానిమల్: స్టార్ డైరెక్టర్ ప్రశంసలు
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం విడుదలై నెల రోజులవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీపై ఇప్పటికీ మరో డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. 2023లో తాను చూసిన వాటిలో యానిమల్ బెస్ట్ మూవీ అంటూ కితాబిచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరణ్ జోహార్ యానిమల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలామంది నా వద్దకు వచ్చి నువ్వు రాకీ ఔర్ రాణి సినిమా తీశారు కదా.. అది యానిమల్ వంటి చిత్రానికి టీకా లాంటిదేనా అని ప్రశ్నించారు. దీనిపై కరణ్ స్పందిస్తూ..'నేను మీతో విభేదించలేను. ఎందుకంటే యానిమల్ 2023లో నా ఉత్తమ చిత్రంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రకటన చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మన చుట్టు ప్రజలు ఉన్నప్పుడు.. మనం చెప్పే తీర్పు గురించి భయం ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా యానిమల్ మూవీని తాను రెండుసార్లు చూశానని అన్నారు. మొదట ఆ సినిమాను ఒక ప్రేక్షకుడిగా.. రెండోసారి సినిమాను అధ్యయనం చేసేందుకు చూసినట్లు తెలిపారు. సినిమా సక్సెస్‌ని గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు రాణీ ముఖర్జీ, తాప్సీ పన్నులాంటి వాళ్లు పాల్గొన్న రౌండ్ టేబుల్ మీట్లో కరణ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. యానిమల్ చూసి తాను కంటతడి పెట్టినట్లు తెలిపాడు. ఈ మూవీ సక్సెస్ సందీప్ రెడ్డి వంగా ఎంచుకున్న కథపై నమ్మకమే ప్రధాన కారణమని కరణ్ జోహార్ ప్రశంసించారు. సినిమా క్లైమాక్స్ గురించి కరణ్ మాట్లాడుతూ..'చివర్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వెనుక ఆ సాంగ్ వస్తుంటుంది. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడంతా రక్తమే కనిపించింది. అప్పుడు నాకనిపించింది ఏంటంటే.. నాలో ఏదైనా లోపం ఉండాలి.. లేదంటే అతనిలో అయినా ఉండాలి. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. సందీప్ సినిమా చూసి నా దిమ్మదిరిగిపోయింది' అని అన్నారు. బంధాలను, సంప్రాదాయలను పక్కన పెట్టి తీసిన సినిమా యానిమల్ అని.. అందుకే తనకు నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్,త్రిప్తి డిమ్రీ కీలకపాత్రల్లో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 850 కోట్ల మార్క్‌ను దాటేసింది. -
ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!
ఒక సినిమా వందకోట్లు కలెక్షన్స్ రావడమంటే అంతా ఈజీ కాదు. స్టార్ హీరోల సినిమాలకైతే వాళ్ల క్రేజ్‌ను బట్టి వసూళ్లు రాబట్టడం జరుగుతూ ఉంటోంది. ఇక హీరోల సంగతి పక్కన పెడితే.. దర్శకుడే సినిమాకు ప్రధాన బలం. వారి కథ, స్క్రీన్ ప్లేను బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అనే టాక్ తెచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కొల్లగొట్టడం చూస్తుంటాం. కానీ ఓకే దర్శకుడి తెరకెక్కించిన తొమ్మిదికి పైగా చిత్రాలు వంద కోట్లు రాబట్టమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన దర్శకధీరుడి గురించి తెలుసుకుందాం. తొమ్మిది చిత్రాల దర్శకుడు 2000ల మధ్యకాలంలో భారతీయ సినిమాలు.. దేశీయ కలెక్షన్లతో వందకోట్ల మార్కు చేరుకున్న సినిమాలుగా గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తం కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటిన సినిమాలను వంద కోట్ల క్లబ్లో చేర్చారు. చాలా మంది హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మించిన దర్శకుల సంఖ్య మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకున్న దర్శకుల్లో రోహిత్ శెట్టి ఒకరు. ఆయన నిర్మించిన తొమ్మిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు సాధించాయి. అత్యధికంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీసిన భారతీయ దర్శకుడిగా పేరు సంపాదించారు. గోల్మాల్ 3తో మొదలై.. గోల్మాల్ 3 చిత్రంతో మొదలైన రోహిత్ ప్రభంజనం సూర్యవంశీ వరకు కొనసాగింది. అతను నిర్మించిన చిత్రాల్లో రూ. 423 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఆ తర్వాత సింగం (రూ. 157 కోట్లు), బోల్ బచ్చన్ (రూ. 165 కోట్లు), సింగం రిటర్న్స్ (రూ. 219 కోట్లు), దిల్వాలే (రూ. 377 కోట్లు), గోల్మాల్ ఎగైన్ (రూ. 311 కోట్లు), సింబా (రూ. 400 కోట్లు) ఉన్నాయి. అయితే అయితే రోహిత్ శెట్టి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచనవి కూడా ఉన్నాయి. వాటిలో జమీన్ (రూ. 18 కోట్లు), సండే (రూ. 32 కోట్లు), సర్కస్ (రూ. 62 కోట్లు)తో రూ. 100 కోట్లు రాబట్టని లిస్ట్‌లో ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా 100 కోట్లే.. తన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన ఘనత కరణ్ జోహార్ సొంతం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఆదిత్య చోప్రాకు అసిస్టెంట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రనిర్మాత, 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 107 కోట్లను రాబట్టి.. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ రూ.100 కోట్లు దాటాయి. ఇటీవల విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఏడో చిత్రం కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది.. రూ.100 కోట్ల చిత్రాల దర్శకులు వీళ్లే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐదు చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ ఒక్కొక్కరు నాలుగు సినిమాలు ఉన్నాయి. దర్శకు ధీరుడి నాలుగు చిత్రాలు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వాటిలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి మాత్రమే నిలిచారు . -
మీ మాటలు వింటే భయమేస్తోంది: కంగనా కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ, చంద్రముఖి సినిమాలతో బిజీగా ఉంది. ఇందిరాగాంధీ రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ఎమర్జన్సీ. ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కంగనా మూవీ ఎమర్జన్సీ చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని అన్నారు. కరణ్ జోహార్ ట్వీట్‌పై కంగనా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) కంగనా స్పందిస్తూ.. "హాహా లాస్ట్ టైమ్ కూడా నా చిత్రం మణికర్ణికను చూడాలని ఎక్సైట్‌గా ఉందని చెప్పినప్పుడు.. మూవీ రిలీజైన వారాంతంలో నాపై పెద్దఎత్తున విష ప్రచారం చేశారు. నా సినిమాపై బురద చల్లేందుకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా నా మూవీ చూడాలని ఆసక్తిగా ఉందంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. అమ్మో మీరు అలా మాట్లాడుతుంటే నాకు నిజంగా భయమేస్తోంది. ఎందుకంటే మీరు మళ్లీ ఉత్సాహంగా ఉన్నానని చెప్పడం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందో.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. ఇటీవలే కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ చిత్రంపై కంగనా విమర్శలు చేసింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని.. కలెక్షన్స్, రివ్యూలన్నీ ఫేక్ అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కంగనా చిత్రంపై కరణ్ చేసిన కామెంట్స్ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. ఎమర్జన్సీ చిత్రం నవంబర్ 2023లో విడుదల కానుంది మణికర్ణిక వివాదం గతంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019) వివాదానికి దారితీసింది. ఆ చిత్రం నుంచి తప్పుకున్న దర్శకుడు క్రిష్.. కంగనాపై ఆరోపణలు చేశాడు. అయితే క్రిష్ చిత్రం నుంచి తప్పుకోవడంతో కో-డైరెక్టర్ సహాయంతో ముఖ్యమైన సీన్స్ రీషూట్ చేసినట్లు వెల్లడించింది. తాము 70 శాతం సినిమా చిత్రీకరించినట్లు కంగనా చేసిన వాదనలను అప్పట్లో క్రిష్ వ్యతిరేకించారు. కాగా.. కంగనా నటిస్తోన్న ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, విశాక్ నాయర్, శ్రేయాస్ తల్పాడే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆ తర్వాత కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటించిన తేజస్ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 20, 2023న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం చంద్రముఖి -2లో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!) Ha ha last time when he said he was excited to see Manikarnika, the worse smear campaign of my life was unleashed upon me on its releasing weekend … almost all main actors working in the film were paid to sling mud on me and sabotage the film and suddenly the most successful… https://t.co/iruVo5wq5o — Kangana Ranaut (@KanganaTeam) August 22, 2023 -
షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!
ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొవిడ్ నాటి పరిస్థితుల నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో అతను చేసే పాలిటిక్స్ తనకు నచ్చవని విమర్శలు చేశారు. కానీ నేను కూడా షారుక్ అభిమానినే అని ప్రస్తావించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన స్టార్ హీరోపై విమర్శలు చేయడంపై బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. షారూక్ రాజకీయాలు చేయడం వల్ల బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. (ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్) వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..' నేను కూడా షారుక్‌కు అభిమానినే. ఆయనకు చరిష్మా ఉంది. కానీ అతను చేసే రాజకీయాలే నాకు నచ్చవు. ఇలాంటి వారి వల్ల బాలీవుడ్‌కు చెడ్డ పేరు వస్తుంది. అయితే వీళ్లు స్టార్డమ్ లేకుండా దేన్నీ అంగీకరించరు. ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావిస్తారు. నేను కేవలం ప్రజలకు నచ్చే సినిమాలు తీస్తా. కానీ వాళ్లు బాక్సాఫీస్ కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తారు. ఏదైనా మూవీ హిట్ అయితే.. అది షారుక్ సక్సెస్ అంటారు. కానీ నా చిత్రాలు హిట్ అయితే ప్రేక్షకుల విజయంగా భావిస్తా. మాది భిన్న వైఖరి అయినప్పటికీ.. షారుక్‌తో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధం.' అని అన్నారు. మరో వైపు డైరెక్టర్ కరణ్ జోహార్‌పై విమర్శలు చేశారు. ముఖ్యంగా స్టార్ డమ్‌ను అతిగా కీర్తించడం వెనుక కరణ్ జోహార్ ఉన్నాడని వివేక్ ఆరోపించారు. అతను మధ్యతరగతి నుంచి వచ్చిన ప్రతిభావంతుల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. కరణ్ కేవలం స్టార్ సిస్టమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే మరోవైపు షారుక్ ఖాన్‌పై కామెంట్స్ చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఈ కామెంట్స్‌కు వ్యతిరేకంగా చాలామంది కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మిస్టర్ కంగనా అంటూ విమర్శలు చేస్తున్నారు. అగ్నిహోత్రి ఓ మానసిక రోగి అంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: మరో హిట్‌కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!) -
సోది సినిమా, అచ్చంగా సీరియల్.. కట్ చేస్తే రూ.200 కోట్లు
రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని.. సోది సినిమా.. అసలిది సినిమానా? అచ్చంగా సీరియలే.. అయినా ఇది ఎప్పుడో చూసిన కథే, కొత్తగా ఏముంది? ఇలా నానామాటలు అన్నారు. కొందరు మాత్రం సినిమాను ఆస్వాదించారు. లొసుగులు వెతకడం మాని సినిమాను సినిమాలా ఆదరించారు. మొదట్లో ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. నెగెటివిటీని దాటుకుని వందల కోట్లు రాబడుతోందీ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఈ సినిమా దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. 'సినిమా రిలీజ్‌కు ముందు కొంత భయపడ్డాను. ఏడేళ్లుగా డైరెక్షన్‌కు దూరంగా ఉండటం వల్లో, లేదంటే మూడేళ్లుగా ఆందోళనతో బాధపడుతున్నందుల్లో.. ఎందుకో తెలియదు కానీ నాలో ఒకరకమైన భయం, నీరసం ఆవహించింది. అసలే బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు? ఎటువంటి ఫలితాలు వస్తాయో ఊహించలేకుండా ఉన్నాం. ఏదైతేనేం.. ఒకరకమైన డోలాయమానంలో ఉన్నాను. కానీ జూలై 23 శుక్రవారం.. నాలో ఎక్కడలేని ఉత్తేజం వచ్చి చేరింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిని. ప్రేమ, ఎనర్జీతో పనిచేసిన టీమ్ అందరి కృషి వల్ల దక్కిన ఫలితమే ఈ చిత్రం. ఈ సినిమాకు రచయితలుగా పనిచేసిన శషాంక్ ఖైతన్, సుమిత్ రాయ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా మొదటి నుంచి వాళ్లు నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. కామెడీని రెట్టింపు చేసేలా స్క్రీన్‌ప్లేలో ప్రధాన పాత్ర పోషించిన ఇషిత మైత్ర గురించి స్పెషల్‌గా చెప్పుకుని తీరాల్సిందే! సోమెన్ మిశ్ర ఈ టీమ్‌కు ఆధ్వర్యం వహించి ఉండకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు' అని రాసుకొచ్చాడు. కాగా రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన 'రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని' చిత్రం జూలై 28న విడుదలైంది. జయా బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, అంజలి ఆనంద్, చుర్నీ గంగూలి, రాయ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) చదవండి: భార్య చేతిలో చెయ్యేసి ఏడ్చిన నటుడు, వీడియో వైరల్ -
'మా అమ్మకు లోదుస్తులు కూడా నేనే తెస్తా, దానికి సిగ్గెందుకు?'
టాలీవుడ్లో బేబీ సినిమా ఆడుతోంటే బాలీవుడ్లో రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ చిత్రం ఆడుతోంది. జూలై 28న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. సెంచరీ దాటేసి రికార్డులు సృష్టించాలన్న కసితో ఏదో ఒకరకంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ముంబైలో ప్రెస్‌మీట్ పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. 'నేను మా అమ్మకు లోదుస్తులు కొనిస్తాను. అదేమీ అంత సిగ్గుపడాల్సిన విషయం కాదు. కానీ నా స్నేహితులు మాత్రం తనకోసం షాపింగ్ చేస్తున్నప్పుడు తెగ భయపడిపోతారు. ఎవరికైనా అమ్మాయికి చెప్పి తనతో కొనిపించవచ్చుకదా అని సూచిస్తారు. మా అమ్మ నన్ను తీసుకురమ్మని చెప్పినప్పుడు నేను ఇంకొకరికి అజమాయిషీ చేయడమెందుకు? మా అమ్మకు ఇప్పుడు 81 ఏళ్లు. తనకు ఏది కావాలన్నా నేనే స్వయంగా వెళ్లి తీసుకొస్తాను. అది లోదుస్తులే కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ అందరూ దాన్ని అసౌకర్యంగా ఫీలవుతారు' అని చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్. రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా విషయానికి వస్తే.. ఇందులో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో షబానా అజ్మీ, ధర్మేంద్ర, జయా బచ్చన్ ముఖ్యపాత్రలు పోషిస్తారు. వయాకామ్18 స్టూడీయోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిరు యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించగా మనూశ్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. చదవండి: గతేడాది ప్రియుడితో పెళ్లి.. ఇంతలోనే నటికి అన్యాయం చేస్తూ.. బేబీ హీరోయిన్‌కు బంపరాఫర్ -
రిటైర్ అయిపోతే మంచిది
‘కరణ్ జోహార్.. ఫస్ట్ నువ్వు రిటైర్ అయిపో.. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించు.. వారు అద్భుతాలు సృష్టిస్తారు’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అన్నారు. రణవీర్ సింగ్, ఆలియాభట్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ఈ నెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కరణ్ జోహార్‌పై మండిపడ్డారు కంగనా రనౌత్. ‘‘భారతీయ ప్రేక్షకులు మూడు గంటల సినిమాలో ఎన్నో వింతలు చూస్తున్నారు. కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే ఈ నెపోటిజం గ్యాంగ్ మాత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో డైలీ సీరియల్స్ తీస్తున్నారు. 1990లలో తాను తీసిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నావ్? ప్రతిభ ఉన్న ఎంతో మంది యువత సరైన వనరులు లేక సినిమాలు తీయలేకపోతున్నారు. అలాంటి వాళ్లకి అవకాశం కల్పిస్తే కొత్త కథలతో మూవీస్ తీసి విప్లవాత్మక మార్పు తీసుకొస్తారు’’ అన్నారామె. అలాగే రణ్వీర్ సింగ్‌ని ఉద్దేశించి–‘‘డ్రెస్సింగ్ విషయంలో కరణ్‌ను ఫాలో కావొద్దు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా వంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకో. దక్షిణాది నటులను చూసి తెలుసుకో.. వాళ్ల లుక్‌లో ఓ డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉంటాయి’’ అన్నారు కంగనా. -
'ఆ సినిమాకు రూ.250 కోట్లా? జనాలేమైనా పిచ్చోళ్లా? సిగ్గనిపించట్లేదా?'
సౌత్ సినిమాలు హిందీలో రిలీజై అక్కడి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించినప్పటి నుంచి బాలీవుడ్‌కు గడ్డుకాలం మొదలైంది. అక్కడి ప్రేక్షకులు హిందీ సినిమాలకంటే కూడా డబ్బింగ్ సినిమాలపైనే మోజు చూపించారు, వాటినే ఆదరిస్తూ వస్తున్నారు. పైగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్‌పై వ్యతిరేకత, ద్వేషం మరింత పెరిగింది. దీంతో చిన్న, మధ్య, భారీ తరహా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఏవో కొన్ని మాత్రమే గట్టెక్కాయి. అందులో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. రెండు సినిమాలు అంతంతమాత్రమే ఇకపోతే ఇటీవల బాలీవుడ్లో ఓ కొత్త సినిమా రిలీజైంది. అదే 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని'. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 28న రిలీజైంది. కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకనిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా తొలి రోజు రూ.11 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. దీనిపై సినీ విశ్లేషకుడు గిరీశ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, బ్రో సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా ఆడటం లేదు. అందువల్ల అందరి కళ్లు వంద కోట్లకు చేరువలో ఉన్న హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్ మీదే ఉంది' అని ట్వీట్ చేశాడు. ఈ స్క్రీన్‌షాట్‌ను కంగనా రనౌత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సదరు సినిమాలపై కౌంటర్లు వేసింది. ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లా? 'జనాలేమీ పిచ్చోళ్లు కారు. ఇలాంటి పేలవమైన సినిమాలను వారు తిరస్కరిస్తారు. అసలు ఆ కాస్ట్యూమ్స్, సెట్ అంతా కూడా ఫేక్. కరణ్ జోహార్ 90వ దశకంలో ఏం చేశాడో ఇప్పుడూ అదే చేస్తున్నాడు. నీ పని నువ్వు కాపీ చేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా? సీరియల్ లాంటి ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లు ఎలా ఖర్చు పెట్టావో? ఏంటో?! నిజంగా టాలెంట్ ఉన్నవాళ్లు ఒకపక్క ఇబ్బందులు పడుతుంటే వీళ్లేమో కోట్ల కొద్ది డబ్బు ఎలా గుమ్మరిస్తున్నారో?' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో ఓ స్టిల్ రిటైర్మెంట్ తీసుకో అక్కడితో ఆగకుండా.. 'మూడు గంటల నిడివి ఉన్నా సరే జనాలు ఓపెన్‌హైమర్ సినిమానే చూస్తారు. అత్తాకోడళ్ల డ్రామాపై సినిమా తీయడానికి రూ.250 కోట్లు అవసరమా? నీకు నువ్వేదో పెద్ద ఫిలిం మేకర్ అని చెప్పుకుంటావు కానీ నీ పతనం ఆల్రెడీ మొదలైంది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా రిటైర్మెంట్ తీసుకో. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వు. అలాగే రణ్వీర్ సింగ్‌కు నా నుంచి ఓ విన్నపం. కరణ్ జోహార్ బాటలో నువ్వు నడవకు. అతడిలా రెడీ అవకు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నాలా మంచి బట్టలు వేసుకో. సౌత్ హీరోలు ఎలా రెడీ అవుతారో కనీసం వారిని చూసైనా నేర్చుకో. నీ వేషధారణతో మన సంస్కృతిని నాశనం చేయకు' అని కౌంటర్లు ఇచ్చింది కంగనా. చదవండి: పెళ్లైన ఆరేళ్లకు భర్తతో విడాకులు.. మమ్మల్ని ద్వేషించకండి అంటూ నటి పోస్ట్ -
అసలు ఆ డైలాగ్స్ ఏంటి.? ఆలియా భట్ మూవీపై తీవ్ర అభ్యంతరం!
బాలీవుడ్ భామ ఆలియా భట్, రణ్వీర్ సింగ్ జంటగా తెరకెక్కించిన తాజా చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కథ'. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. రణ్వీర్ సింగ్, ఆలియాభట్ ప్రస్తుతం ముంబయిలో బిజీ బిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని కొన్ని పదాలు, డైలాగ్స్ తొలగించాలని ఆదేశించింది. (ఇది చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) సినిమాలో ఉపయోగించిన 'కస్' పదాన్ని మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మేకర్స్‌ను ఆదేశించింది. అంతేకాకుండా లోక్‌సభ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై డైలాగ్స్ తొలగించాలని సూచించింది. దీంతో కొన్ని అభ్యంతరకర పదాలు, డైలాగ్స్ తొలగించడానికి చిత్రబృందం అంగీకరించగా.. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో చాలాసార్లు ఎక్కువగా వినియోగించిన బ్రా, ఓల్డ్ మాంక్ అనే పదాలను మారుస్తామని చెప్పడంతో సెన్సార్ బోర్డ్ అనుమతించింది. లోక్ సభ డైలాగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన డైలాగ్స్‌ను పూర్తిగా తొలగించాలని మేకర్స్‌ను కోరింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నివేశంలో అభ్యంతకర పదాన్ని తొలగించాలని ఆదేశించింది. మహిళల లోదుస్తుల షాప్ సన్నివేశాల్లో 'బ్రా' అనే పదం వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పదాలు వాడితే స్త్రీలను కించపరచడమేనని చిత్రబృందంపై సెన్సార్ బోర్డ్ మండిపడింది. (ఇది చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!) రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వయకామ్18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. కాగా.. జులై 28, 2023న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. -
మీరు 'గే' కదా?.. ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన నెటిజన్!
బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ దాదాపుగా అందరికీ సుపరిచితమే. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాను నిర్మించారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, నాగార్జున ఈ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా కనిపించనున్నారు. అయితే కరణ్ జోహార్‌కు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ అప్డేట్స్ ఇస్తుంటారు. (ఇది చదవండి: 25 ఏళ్ల నుంచి అవకాశాలే రాలే, అందుకే ఇలా తయారైంది: ఉర్ఫీ) అయితే తాజాగా ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ అందులోకి ఎంట్రీ ఇచ్చారు. థ్రెడ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరణ్.. అభిమానులు తనను ఏదైనా అడగాలంటూ ఛాన్స్ ఇచ్చారు. పది నిమిషాల పాటు మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే ఓ నెటిజన్ మాత్రం చాలా ఆశ్చర్యకర ప్రశ్నవేశాడు. మీరు గే కదా? అని మెసేజ్ చేశాడు. అతనికి కూడా అదేరీతిలో దిమ్మదిరిగేలా కౌంటరిచ్చాడు కరణ్. నీకు ఆసక్తిగా ఉందా? అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొత్త యాప్‌లో ఎంట్రీ ఇవ్వగానే కరణ్‌కు ఇలాంటి షాకిచ్చాడేంట్రా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: నా చీర పిన్ తీసేయమని డైరెక్టర్ అడిగారు: సీనియర్ హీరోయిన్) -
సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. బీ టౌన్ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. ఇప్పటికే పలుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా మరోసారి బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ రణ్‌బీర్ కపూర్‌ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్) తాజాగా కంగనా రనౌత్ రణబీర్‌ను 'దుర్యోధనునితో' పోలుస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ను శకునిగా అభివర్ణించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ఈ దుష్టశక్తులు ఉన్నాయంటూ పరోక్షంగా ఆరోపించింది. వారి పేర్లు చెప్పకుండానే వైట్ ర్యాట్, పాపా జో అంటూ సంభోధిస్తూ కామెంట్స్ చేసింది. కంగనా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'సినిమా పరిశ్రమలో రకరకాల బెదిరింపులు ఉన్నాయి. అయితే ఈ దుర్యోధనుడు (తెల్ల ఎలుక),శకుని (పాప జో) జోడి వేధింపులు మరింత దారుణంగా ఉన్నాయి. వారు తమను తాము సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవుతారు. బాలీవుడ్ పరిశ్రమకు ఈ విషయం తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ప్రధాన నిందితులు వీరే. అతన్ని ఆత్మహత్యకు పురికొల్పింది వీరే. నాపై అన్ని రకాల అసభ్యకరమైన పుకార్లను కూడా వ్యాప్తి చేశారు. నా జీవితంలో వారి వేధింపులు మించిపోయాయి.' అంటూ రాసుకొచ్చారు. గతంలో హృతిక్ రోషన్‌తో వివాదంలో కూడా వీరిద్దరు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించింది. బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన కంగనా తన సంచలన కామెంట్స్‌తో మరోసారి బీటౌన్‌లో చర్చ మొదలైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ప్రేరేపించారని పరోక్షంగా రణ్‌బీర్, కరణ్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారనుంది. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) -
ఓ ఛానెల్లో నన్ను అవమానించారు.. కరణ్‌పై కంగనా ఫైర్
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ బీ టౌన్లో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. తాజాగా నిర్మాత కరణ్ జోహార్‌పై విమర్శల వర్షం కురిపించింది. ఇటీవలే కరణ్ జోహార్ చేసిన పోస్ట్‌పై కంగనా స్పందించారు. హీరోయిన్ ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడని.. అందుకే ఆమె బాలీవుడ్‌ను వదిలి వెళ్లిందని కంగనా సంచలన ఆరోపణలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అనుష్క శర్మ కెరీర్‌ను దెబ్బతీశాడని ఆరోపించింది. దీనికి బదులిస్తూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదంటూ రిప్లై ఇచ్చారు. తాజాగా కరణ్ పోస్ట్‌పై స్పందించిన కంగనా..కరణ్ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది . అంతే కాకుండా ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ తనను అవమానించాడని కంగనా ఆరోపించింది. కంగనా ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాస్తూ..' కరణ్ నన్ను ఓ జాతీయ మీడియాలో అవమానించాడు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. అందుకే ఇలాంటి నెపో మాఫియా వ్యక్తులు నన్ను అవమానించారు. వేధింపులకు కూడా గురి చేశారు.' అని పోస్ట్ చేశారు. కరణ్ జోహార్ పోస్ట్ ప్రియాంక, అనుష్కల కెరీర్‌ను నాశనం చేశారన్న ఆరోపణలపై చిత్రనిర్మాత కరణ్ ఘాటుగానే స్పందించారు. అలాంటి అబద్ధాలతో తనకేలాంటి నష్టం కలగదన్నారు.తనను ఎవరు ఎంత దూషించినా.. చెడుగా చూపించాలని ప్రయత్నించినా భయపడేది లేదన్నారు. కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోలేకనే హాలీవుడ్‌కి వచ్చేశానని చెప్పుకొచ్చింది. దీనిపై కూడా కంగనా ట్విటర్ వేదికగా స్పందించింది. -
అనుష్క కెరీర్ అంతం చేయాలనుకున్నా, తెర వెనుక కుట్ర చేశా: నిర్మాత
ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్ అంశంపై బాలీవుడ్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ సినీపరిశ్రమలో ఉన్న తారల వారసులకు ఇచ్చిన విలువ, హోదా.. బయట నుంచి వచ్చిన నటీనటులకు ఉండదనేది బలమైన వాదన. అంతేకాదు, దర్శకనిర్మాతలు కూడా సెలబ్రిటీల వారసులకే సినిమా అవకాశాలిస్తారు, కానీ ఎంత టాలెంట్ ఉన్నా సరే బయటవాళ్లను పట్టించుకున్న పాపాన పోరనే అపవాదు చిత్రపరిశ్రమలో ఉండనే ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారుతోంది. అయితే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గతంలో అనుష్క శర్మ కెరీర్‌ను అంతం చేయాలనుకున్నాడట. ఆమెకు ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. కేవలం తన టాలెంట్‌తోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వచ్చింది. అలాంటి ఆమెను తక్కువ అంచనా వేసిన కరణ్ తనకు సినిమా అవకాశమే ఇవ్వకూడదని భావించాడట. ఈ విషయం స్వయంగా అతడే చెప్పాడు. 'రబ్నే బనాదీ జోడీ సినిమా కోసం అనుష్కను తీసుకుందామని ఆదిత్య చోప్రా ఆమె ఫోటో చూపించాడు. అది చూసిన నేను.. నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆమె వద్దే వద్దు. తనకు ఈ సినిమా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వేరే హీరోయిన్‌కు ఈ సినిమా ఇద్దామని ఉండేది. తెర వెనుక ఆమెను తప్పించే ప్రయత్నాలు చేశాను. సినిమా రిలీజయ్యాక అయిష్టంగానే చూశాను. కానీ బ్యాండ్ బాజా బారత్ మూవీ చూశాక తన నటనకు ఇంప్రెస్ అయ్యా. ఇంత మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలనుకున్నానన్న గిల్టీతో క్షమాపణలు చెప్పాను. సినిమా చాలా బాగా చేశావని అనుష్కను మెచ్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. 2016లో 18వ ఎమ్‌ఏఎమ్‌ఐ ముంబై ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో కరణ్ పై వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోను దర్శకరచయిత అపూర్వ అస్రానీ ట్విటర్లో షేర్ చేశాడు. 'కరణ్ జోహార్ అనుష్క శర్మ కెరీర్‌ను అంతమొందించాలని అనుకున్నట్లు కరణ్ జోహార్ గతంలో అంగీకరించాడు. నాకు తెలిసి ఇన్సైడర్, అవుట్‌సైడర్ అన్నది ఇప్పటికీ చర్చించాల్సిన అంశమే' అని ట్వీట్ చేశాడు. దీనిపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. 'మంచి కెరీర్ ఇవ్వడం లేదా అంతం చేయడమే కొందరి హాబీ. ప్రతిభావంతులైన బయటివారిపై కొందరు డర్టీ పాలిటిక్స్ చేయడం వల్లే బాలీవుడ్ ఇలా తయారైంది' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా అనుష్క శర్మ 'రబ్నే బనా దీ జోడీ' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఆమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. Someone’s only hobby is to make or break careers. If Bollywood is in gutter, it’s because of some people’s dirty ‘backroom’ politics against talented outsiders. https://t.co/GNPRjiW5ry — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 6, 2023 -
ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడు: కంగన సంచలన ఆరోపణలు
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌పై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసింది. హీరోయిన్ ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడని, అందుకే ఆమె బాలీవుడ్‌ను వదిలి వెళ్లిందని చెప్పింది. తాను బాలీవుడ్‌కు దూరం కావడంపై తాజాగా ప్రియాంక చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. ఓ అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోలేకనే హాలీవుడ్‌కి వచ్చేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీనిపై కంగనా ట్విటర్ వేదికగా స్పందించింది. ‘బాలీవుడ్లో కొందరు గ్యాంగ్‌గా మారి ప్రియాంకను అవమానించారు. స్వయం కృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలి వెళ్లిపోయేలా చేశారు. కరణ్ జోహార్ ఆమెను బ్యాన్ చేశారనే విషయం అందరికి తెలుసు. షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక ఫ్రెండ్షిప్ చేయడం కరణ్‌కు నచ్చలేదు. అందుకే ఆమెను దూరం పెట్టాడు. ఈ విషయంపై అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమ వాతావరణాన్ని నాశనం చేసినందుకు కరణ్ బాధ్యత వహించాలి. అమితాబ్, షారుఖ్ వంటి వారు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు’అని కంగనా వరుస ట్వీట్స్ చేసింది. This is what @priyankachopra has to say about bollywood, people ganged up on her, bullied her and chased her out of film industry” a self made woman was made to leave India. Everyone knows Karan Johar had banned her (1/2) https://t.co/PwrIm0nni5 — Kangana Ranaut (@KanganaTeam) March 28, 2023 -
పెళ్లిలో సందడి చేసిన సౌత్, బాలీవుడ్ హీరోలు
బాలీవుడ్ నటులు మరో పెళ్లి ఫంక్షన్లో సందడి చేశారు. ఇటీవల కియారా- అద్వానీ పెళ్లిలో బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో జరిగిన మరో వివాహా వేడుకలోనూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళ, మలయాళ, బాలీవుడ్ నటులంతా ఓకే వేదికపై మెరిశారు. రాజస్థాన్‌లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్,అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు దక్షిణాదితో పాటు బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన స్టార్ హీరోలు సందడి చేశారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ కలిసి భాంగ్రా డ్యాన్స్ చేశారు. ఆ వీడియోనూ అక్షయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'మీతో చేసిన ఈ డ్యాన్స్‌ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. కె మాధవన్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా మేనేజింగ్ ప్రెసిడెంట్. రాజస్థాన్‌లో పలువురు ప్రముఖులు హాజరైన ఆయన పెద్ద కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. I’ll forever remember this dance with you @Mohanlal Sir. Absolutely memorable moment 😊🙏 pic.twitter.com/GzIwcBbQ5H — Akshay Kumar (@akshaykumar) February 10, 2023 -
కరణ్ జోహార్ కవలల బర్త్‌డే పార్టీలో మెరిసిన తారలు..ఫోటోలు వైరల్
-
కరణ్ జోహార్ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్: ఫరా ఖాన్
బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తాజాగా కరణ్ డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆమె మాట్లాడారు. కరణ్ తాను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ల మాదిరిగానే డ్రెస్ వేసుకుంటాడని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ ఇటీవల కరణ్ జోహార్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంఘటనను గుర్తు చేసుకుంది. ఫరా ఖాన్ కొద్ది రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఓ హోటల్ లాంఛ్ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈవెంట్లో ఆమె ధరించిన దుస్తులపై కరణ్ ఎలా స్పందిస్తారని అడగ్గా..' కరణ్ జోహార్ తనను మనీష్ మల్హోత్రా బృందంలో చూస్తే షాక్ అవుతారని చెప్పింది. నా చెత్త రెడ్ కార్పెట్ పీడకల ఏమిటంటే అందులో కరణ్ కనిపించడం. అతను నేను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో ఎప్పుడూ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ లాగా దుస్తులు ధరిస్తాడు.' అంటూ నవ్వుతూ చెప్పింది. ఫరా ప్రస్తుతం రాబోయే ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. ఆమె చివరిగా దర్శకత్వం వహిచిన 2014 చిత్రం హ్యాపీ న్యూ ఇయర్. ఇందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, బోమన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా నటించారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రానికి పని చేయడానికి విరామంలో ఉన్నందున ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ 16కి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. -
ఆలియా భట్ సినిమాతో రూ.20 కోట్లు నష్టపోయా: కరణ్ జోహార్
బాలీవుడ్ దర్శకుడు, చిత్రనిర్మాత కరణ్ జోహార్ గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2012లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆ సినిమాతో దాదాపు రూ.20 కోట్లు నష్టపోయామని కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అయినప్పటికీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కరణ్ దర్శకత్వం వహించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కంటే ముందు ఆలియా, వరుణ్, సిద్ధార్థ్‌లతో మరో 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మిగిలిన చిత్రాలను తక్కువ బడ్జెట్‌తో చేయడంతో నష్టం తిరిగి వచ్చిందని చిత్రనిర్మాత వెల్లడించాడు. సిద్ధార్థ్ 'హసీతో ఫసీ'లో నటించగా, అలియా, వరుణ్ 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రంలో నటించారు. కరణ్ నిర్మించిన '2 స్టేట్స్'లో ఆలియా కథానాయికగా నటించిందని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లు కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్, అలియా నటిస్తోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్‌లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్‌పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్‌కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
లాభాలు తెచ్చే స్తతా లేదు కానీ కోట్లు కావాలి: హీరోలపై షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హీరోల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి లాభాలు తెచ్చే సత్తా ఉండదు కానీ కోట్లకు కోట్లు పారితోషికం అడుగుతారని ఎద్దేవా చేశారు. అలాగే కొన్ని సినిమాల వల్ల తాను పెద్ద మొత్తంలో నష్టపోయానని వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. 'ఇద్దరు వ్యక్తులతో ఒక స్టార్టప్‌లాగా ధర్మ ప్రొడక్షన్స్ ప్రారంభించాను. యశ్ చోప్రా చెప్పినట్లు సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాదు, దానికోసం మనం పెట్టే బడ్జెటే దాన్ని నిర్ణయిస్తుంది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ విషయంలో అదే రుజువైంది. ఆ సినిమాతో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రాలను లాంచ్ చేశాను. ఆ సినిమా పేరుకు హిట్టయింది కానీ నాకు డబ్బులు రావడం కాదు కదా పెట్టినవి కూడా పోయాయి. సినిమా అంటే నాకు ఒక ఎమోషన్. హిందీ సినిమా కోసం నా మనసు ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. కానీ ఒక బిజినెస్‌మెన్‌గా మాట్లాడాల్సి వస్తే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే సినిమాలో ఎక్కువ మొత్తం పారితోషికం రూపంలో స్టార్స్‌కే వెళ్లిపోతుంది. ఇలా అంటున్నందుకు నన్ను హత్య చేస్తారేమో, కానీ ఇదే నిజం. సినిమా ఫస్ట్ డేకు రూ.5 కోట్లు కూడా రాబట్టలేరు కానీ రూ.20 కోట్లు అడుగుతారు. ఇదసలు న్యాయమేనా?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు కరణ్. ఇది చూసిన నెటిజన్లు 'కరణ్ కరెక్ట్‌గా చెప్పాడు', 'తెలుగు సినిమాల విషయంలో కరణ్ నిజాయితీగా మాట్లాడతాడు' అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ అద్దెకు, ఎన్ని లక్షలంటే? దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వీజే సన్నీ -
బ్రహ్మాస్త్ర 2 లో యశ్.. కరణ్ జోహార్ క్లారిటీ
-
''బ్రహ్మస్త్ర నష్టాలతో కరణ్ జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు''
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) కరణ్ జోహార్‌పై సంచలన కామెంట్స్ చేశారు.ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు. బ్రహ్మాస్త్ర తో భారీ నష్టాలను చవిచూసిన కరణ్‌జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించాడంటూ బాంబ్ పేల్చాడు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ నిర్మించాయి. ''ఈ సినిమా ఫలితం, నష్టాలను చూసి కరణ్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో డిప్రెషన్‌తో ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తనకు సమాచారం ఉందని కేఆర్కే ఆరోపించాడు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ అతనికి రూ. 300 కోట్లు అప్పుగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే బ్రహ్మాస్త్ర కారణంగా దివాళా తీసినట్లు కరణ్ ఎందుకు ప్రపంచానికి చెప్పట్లేదు'' అంటూ కేఆర్కే ప్రశ్నించాడు. కాగా గతంలో బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ లెక్కలు తప్పిచూపించారని ఆరోపించిన కేఆర్కే ఇప్పుడు కరణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేఆర్కే చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. According to sources, Sometimes ago, Karan Johar made a drama at his home for suicide coz of huge loss of #Brahmastra! Then Mukesh Ambani gave him ₹300Cr loan. Now Question is this, why Karan doesn’t tell to world clearly that he has become bankrupt coz of disaster #Brahmastra — KRK (@kamaalrkhan) December 2, 2022 -
విజయ్‌కి ‘లైగర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: ‘లైగర్’చిత్రంలో పెట్టుబడులకు సంబంధించిన సెగ ఆ చిత్రంలో నటించిన హీరో విజయ్ దేవరకొండకు తగిలింది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట ఆయన బుధవారం హాజరయ్యారు. ప్రధానంగా భారీ బడ్జెట్‌తో కూడిన ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడులు పెట్టిన వారి విషయం పైనే ఈడీ దృష్టి పెట్టింది. కొందరు రాజకీయ నేతలు మనీలాండరింగ్ ద్వారా లైగర్‌లో పెట్టుబడులు పెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ గత నెల 17న ఈ సినిమా దర్శకనిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌లను 10 గంటలపాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను క్రాస్ చెక్ చేసుకోవడానికి విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రెమ్యునరేషన్ ఎలా తీసుకున్నారు? విజయ్ తన మేనేజర్‌తో కలిసి బుధవారం ఉదయం 8.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ అధికారులకు ఇవ్వడానికి తన వెంట కొన్ని పత్రాలను తెచ్చారు. ఉదయం 10.30 గంటలకు విజయ్ను ప్రశ్నించడం ప్రారంభించిన అధికారులు గంట భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ చిత్ర నిర్మాణంతోపాటు విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి అధికారులు ప్రశ్నల్ని సంధించారు. పారితోషికాన్ని చెక్కుల ద్వారానా, ఆన్‌లైన్‌లోనా లేదా నగదు రూపంలో తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను విజయ్ నుంచి తీసుకున్నారు. ఈ చిత్రానికి పెట్టుబడులు పెట్టిన వారిలో హైదరాబాద్‌కు చెందిన కొందరు రాజకీయ నేతలు ఉన్నారన్నది ఈడీ అనుమానం. ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. నటించడం మాత్రమే తన బాధ్యతని, ఆర్థిక లావాదేవీల్లో కలగజేసుకోలేదని చెప్పారని సమాచారం. తాను ఎక్కువగా దర్శకుడితోనే సంప్రదింపులు జరిపానని, తమ మధ్య పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు, వివిధ ఫంక్షన్ల సమయంలోనూ రాకపోకలు సాగించిన, హాజరైన వారి జాబితాలను అధికారులు సేకరిస్తున్నారు. వీరికి నిర్మాతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. అధికారులు త్వరలో మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. లైగర్ నిర్మాతల్లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌తోపాటు బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్, అపూర్వ మెహతా సైతం ఉన్నారు. వీరికీ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించిన మైక్ టైసన్ రెమ్యునరేషన్ అంశాన్నీ ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరికొందరి విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే విజయ్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారికి కావాల్సిన జవాబులిచ్చా.. ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. విచారణ నేపథ్యంలో అధికారులు తన రెమ్యునరేషన్ వివరాలు అడిగారని, తాను చెప్పానని పేర్కొన్నారు. ‘మీరందరూ ఎలా ఉన్నారు. (మీడియా వాళ్లను ఉద్దేశించి) చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు... దాదాపు రోజంతా కదా!! నేను లోపల (ఈడీ కార్యాలయంలో) 12 గంటలు ఉన్నా. ఈడీ వాళ్లు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. వారికి కావాల్సిన జవాబులు ఇచ్చాను. మీరు ఎంతగానో ప్రేమిస్తారు... ఆ పాపులారిటీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. నన్ను ఈడీ వాళ్లు పిలిచినప్పుడు వచ్చి నా డ్యూటీ నేను చేశాను. గురువారం రమ్మని పిలవలేదు’అని విజయ్ అన్నారు. ఏ కేసుపై మిమ్మల్ని విచారించారు అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా గుడ్‌నైట్ అంటూ వెళ్లిపోయారు. -
ప్రభాస్‌తో కృతి ప్రేమలో ఉందా? లీక్ చేసిన బాలీవుడ్ హీరో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కృతిసనన్ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా అని కృతి చెప్పడం ఈ రూమర్స్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ప్రభాస్-కృతిసనన్‌ల రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బేఢియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రియాలిటీ షోకు వరుణ్, కృతిసనన్ గెస్టులుగా వెళ్లారు. ఈ క్రమంలో కృతి మనసులో ఎవరున్నారు అన్న ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానమిస్తూ.. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు కానీ దీపికా పదుకోణెతో షూటింగ్లో ఉన్నాడు అంటూ హింట్ ఇచ్చేశాడు. ఇతడి మాటలకు కృతి కూడా సిగ్గుపుడతూ నవ్వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో ఓ షోలో కృతి ప్రభాస్‌కు కాల్ చేయడం, ఆదిపరుష్ టీజర్ ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో క్లోజ్‌గా ఉండటం వంటివి చూసి వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్‌లో జోరుగా టాక్ వినిపిస్తుంది. Whaaaaaaattt 😯😁🥰💖...... Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe — Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022 -
నాపై ట్రోలింగ్‌కు ఆ నిర్మాతే కారణం: జాన్వీ కపూర్
మరాఠీ బ్లాక్‌బస్టర్ మూవీ సైరాట్ హిందీలో ధడక్‌గా రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంతోనే వెండితెర అరంగ్రేటం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించాడు. ఆ తర్వాత కరణ్ నిర్మించిన పలు సినిమాల్లో తళుక్కున మెరిసింది జాన్వీ. ఇదే ఆమెకు విమర్శలు తెచ్చిపెట్టింది. తనను కరణ్ జోహార్ లాంచ్ చేయడం వల్లే తనపై ఇంత విద్వేషం చిమ్ముతారంటొంది జాన్వీ. తాజాగా బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'గొప్ప నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ హౌస్ నన్ను ఇండస్ట్రీలో లాంచ్ చేసింది. ఇదే నాపై ట్రోలింగ్‌కు కారణమనుకుంటా. ఐకానిక్ ధర్మ ప్రొడక్షన్స్ నన్ను ద్వేషించేందుకు ఓ మార్గాన్ని కల్పించింది. దీనివల్ల ఒత్తిడికి లోనవుతాను, కానీ క్షణం కూడా పశ్చాత్తాపపడను. ఎందుకంటే.. కరణ్ జోహార్, అతడికి సంబంధించిన ధర్మ ప్రొడక్షన్ హౌస్ సృజనాత్మక నిర్ణయాల గురించి మీకు తెలియదు. వాళ్ల బ్యానర్లో పని చేసినందుకు నేను అదృష్టవంతురాలిగా ఫీలవుతున్నా. అన్నింటికీ మించి కరణ్ వంటి నిర్మాత నుంచి నాకు ప్రేమ, విశ్వాసం, మార్గదర్శకత్వం లభించింది' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది జాన్వీ. ప్రస్తుతం ఆమె బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలు చేస్తోంది. చదవండి: ఎట్టకేలకు ఓటీటీలో కాంతార ఆ హీరోతో డేటింగ్, ఇదేం పాడుపని అన్నారు -
మా అమ్మ అలాంటి సీన్లు వద్దని చెప్పింది.. ఆదిపురుష్ భామ కృతి సనన్
మహేశ్ బాబు 'నేనొక్కడే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్లో నటిస్తూ బిజీ అయిపోయింది. కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సాధించింది ఈ భామ. తాజాగా ఆ బ్యూటీకి సంబంధించి ఓ విషయాన్ని షేర్ చేసుకుంది. 2018లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' మూవీలోని నటించేందుకు అవకాశం వచ్చినా తిరస్కరించినట్లు తెలిపింది. కారణం అలాంటి బోల్డ్ సీన్లలో నటించేందుకు ఆమె తల్లి ఒప్పుకోలేదని తెలిపింది. దీంతో ఆ పాత్రలో కియారా అద్వానీ నటించింది. కరణ్ జోహార్ కృతి సనన్‌ను సంప్రదించగా ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ఇటీవల జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి తల్లి గీతా సనన్ ఈ విషయాన్ని తెలిపింది. ఆమె మాట్లాడుతూ..'కృతి కెరీర్ ప్రారంభంలోనే అలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చలేదు. అలాంటి బోల్డ్ సీన్లలో నటించేందుకు నా కుమార్తెను అందుకే అనుమతించలేదు' అని అన్నారు. (చదవండి: ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం) ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృతి మాట్లాడుతూ.. 'మా అమ్మకు స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ పాత్రకు నో చెప్పింది. అందువల్ల నేను ఆ సినిమాలో నటించకపోవడమే మంచిదనిపించింది. నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చా. అందుకే ఇలాంటి సన్నివేశాల్లో నటించాలని నేను ఎప్పుడు అమ్మను అడగలేదు.' అని అన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ నటించారు. ప్రస్తుతం కృతి సనన్ వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన 'భేడియా' ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఆమెకు టాలీవుడ్ హీరో ప్రభాస్ 'ఆదిపురుష్', 'గణపత్', 'షెహజాదా', అనురాగ్ కశ్యప్ చిత్రాల్లోనూ నటించనుంది. -
బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!
కేజీఎఫ్ హీరో యశ్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది. రాఖీభాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత యశ్ తన తర్వాత ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్‌కు ప్రముఖ నిర్మాతలు యశ్‌ను సంప్రదించారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని టాక్. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న బ్రహ్మస్త్ర- పార్ట్2 కోసం యశ్‌ను సంప్రదించారని నెట్టింట్లో వైరలైంది. అయితే ఈ విషయంపై బ్రహ్మస్త్ర నిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర- 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ మొదటి ఎంపిక అని కరణ్ వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'ఇవన్నీ చెత్త.. ఆ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు' అని కొట్టిపారేశారు. బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను సంప్రదించారని మరో టాక్. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
ప్రముఖ స్టార్ హీరో సల్మాన్‌కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డెంగ్యూ బారిన పడ్డాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న సల్మాన్ పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. దీంతో రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సల్మాన్‌కు డెంగ్యూ రావడంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగులు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం ఆయన ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు బిగ్‌బాస్ సీజన్-16 ను సల్మాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో కరణ్ జోహార్ కనిపించనున్నారు. దీంతో సల్మాన్ కోలుకునేవరకు బిగ్‌బాస్ సీజన్‌ను కరణ్ హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే గతంలో కరణ్ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహించిన సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ తారల దీపావళి సెలబ్రేషన్స్..కొత్త దుస్తుల్లో మెరిసిన స్టార్స్
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడం ప్రారంభించారు. దీపాల పండుగ పర్వదినాన్ని తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులలో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు బాలీవుడ్ తారలు కూడా మినహాయింపు కాదు. బీటౌన్‌కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు అప్పుడే దీపావళి సంబరాలను ప్రారంభించారు. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, ఆయన భార్య తాహిరా కశ్యప్‌లు ముంబైలోని తమ నివాసంలో దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్, కృతి సనన్, అనన్య పాండే, తాప్పీ పన్ను హాజరై సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ, ‘ఆదిపురుష్’ సీత కృతి సనన్.. తన ఇంట దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో ఆమె ఇంటికి బాలీవుడ్ నటీనటులు తరలి వచ్చారు. వరుణ్ ధావన్, అతని భార్య నటాషా దలాల్ బంగారు రంగు దుస్తుల్లో దీపాలతో పోటీగా వెలిగారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే లెహంగా ధరించి అందరినీ మెప్పించింది. దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ బ్లాక్ కుర్తాను ధరించి మెరిశారు. శిల్పాశెట్టి బ్రౌన్ మెరూన్ కలర్ చీరతో అలరించింది. నోరా ఫతేహి తన మెరిసే లెహంగాలో అద్భుతంగా ఉంది. తాప్సీ పన్ను మెరిసే గులాబీ రంగు చీరను ధరించింది. -
సోషల్ మీడియాకు లైగర్ నిర్మాత గుడ్‌బై!
బాలీవుడ్‌లోని బడా నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు. సోషల్ మీడియాలో అతడు నిత్యం ట్రోల్స్ బారిన పడుతుంటాడు. కొన్నిసార్లు ఈ విమర్శలు బాధించినా వాటిని అధిగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాననే ఈయన తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ట్విటర్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 'జీవితంలో పాజిటివ్ ఎనర్జీల కోసం కొంత సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. అందులో భాగంగా ట్విటర్‌కు వీడ్కోలు చెప్తున్నా' అని ట్వీట్ చేశాడు. అయితే ట్విటర్‌కు గుడ్‌బై చెప్పాడు కానీ తన అకౌంట్‌ను మాత్రం డిలీట్ చేయలేదు. అతడి చివరి ట్వీట్ చూసిన అభిమానులు మానసిక ప్రశాంతతకు మించినది ఏదీ లేదు. మంచి నిర్ణయం తీసుకున్నారు, మీ ఆరోగ్యంపై, బ్రహ్మాస్త్ర రెండో పార్ట్‌పై ఫోకస్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన ఇటీవల తెరకెక్కించిన లైగర్ సహా పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. చదవండి: నామినేషన్స్‌లో 9మంది కంటెస్టెంట్లు నయనతార కవలల పేర్లకు అర్థాలు తెలుసా? -
పెళ్లికి పిలవలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది: కరణ్ జోహార్
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో కాఫీ విత్ కరణ్. తాజాగా ఫినాలే ఎపిసోడ్లో కరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహానికి పిలవకపోవడంపై కరణ్ జోహార్ స్పందించారు. పదమూడో ఎపిసోడ్లో తన్మయ్ భట్, డానిష్ సైత్, కుషా కపిల, నిహారిక పాల్గొన్నారు. ఈ నలుగురితో కాఫీ విత్ కరణ్ షో చాలా సరదాగా సాగింది. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల వివాహానికి పిలవకపోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఈ సందర్భంగా కరణ్ వెల్లడించారు. (చదవండి: ఆ టాలీవుడ్ హీరోను బాలీవుడ్లో లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్) కరణ్ జోహార్ మాట్లాడుతూ 'విక్కీ, కత్రినా వివాహానికి పిలవకపోవడం నాకు ఇబ్బందిగా మారింది. ఆహ్వానం అందలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది. ఈ విషయంలో చాలామందికి నాపై సానుభూతితో పాటు సందేహాలు వచ్చాయి. మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. మీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కదా ప్రశ్నించారు. విక్కీ-కత్రినా వివాహానికి అనురాగ్ కశ్యప్‌ను కూడా ఆహ్వానించలేదని తెలుసుకున్నప్పుడు కాస్త ఉపశమనం లభించింది' అని అన్నారు. కాగా.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న ఘనంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఫోర్ట్ బర్వారాలో జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. -
అంతకుమించిన నరకం ఉండదు.. ఆర్యన్ అరెస్ట్‌పై స్పందించిన గౌరీఖాన్
గతేడాది క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంపై గౌరీఖాన్ తొలిసారి స్పందించింది. ప్రముఖ పాపులర్ టీవీ షో కాఫీ విత్ కరణ్ షోకి మహిప్ కపూర్, భావనా పాండేతో కలిసి హాజరైన ఆమె తొలిసారి కొడుకు అరెస్ట్‌పై మాట్లాడింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు మీ కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డార. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ అన్నింటిని తట్టుకొని నిలబడ్డారు. ఆ కష్టసమయం గురించి ఏమని చెబుతారు అని కరణ్ ప్రశ్నించాడు. దీనికి గౌరీఖాన్ బదులిస్తూ.. అవును. 'మా కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డాం. తల్లిగా అంతకంటే భయంకరమైన అనుభవం ఇంకోటి ఉండదు. కానీ ఆ సమయంలో అందరూ మాకు కుటుంబంలా నిలబడ్డారు. ఏమాత్రం పరిచయం లేని వాళ్లు కూడా మెసేజ్‌లు, కాల్స్ ద్వారా నన్ను ఓదార్చారు. ఆ సమయంలో మాకు ఎంతో ప్రేమ లభించింది. మాకు అండగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని చెబుతూ గౌరీఖాన్ ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
బిగ్‌బాస్ షో.. ఆ స్టార్ హీరో పారితోషికం భారీగా తగ్గనుందా..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'బిగ్ బాస్'. ఈ షో ఇప్పటికే 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే సల్మాన్ ఖాన్ ఈ షో కోసం పారితోషికం భారీగా తగ్గించుకున్నట్లు నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సీజన్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుండగా.. మరీ సల్మాన్‌పై వస్తున్న ఊహగానాల్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది. (చదవండి: Kabhi Eid Kabhi Diwali Movie: వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్‌గా ?) గతేడాది ఓటీటీ వేదికగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వచ్చిన బిగ్‌బాస్ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆశించిన ఆదాయం రాబట్టడంలో మేకర్స్ విఫలమయ్యారు. దీంతో సల్మాన్ హోస్ట్‌గా ప్రసారమయ్యే రెగ్యులర్ షో బిగ్‌బాస్‌పైన ఆ ఎఫెక్ట్ పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. స్పాన్సర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ప్రస్తుత సీజన్ కోసం ఈ కండల వీరుడు పారితోషికం భారీగా తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్-15 సీజన్లో 14 వారాల కోసం సల్మాన్ ఏకంగా రూ.350 కోట్లు తీసుకున్నారని టాక్. ప్రస్తుత సీజన్ బిగ్ బాస్- 16 అక్టోబర్ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొనే వారిలో శివిన్ నారంగ్, మునావర్ ఫారూకీ, కనికా మాన్, ఫైసల్ షేక్ కంటిస్టెంట్లుగా హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. -
ఆ టాలీవుడ్ హీరోను బాలీవుడ్లో లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్
బాలీవుడ్లో ఎంతోమంది స్టార్ కిడ్స్ను వెండితెరకు పరిచయం చేసిన దర్శక నిర్మాత ఎవరని అడిగితే ఠక్కున గుర్తుచ్చే పేరు కరణ్ జోహార్. ఇప్పటికే కరణ్ ఎంతోమంది స్టార్ వారసులను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేశాడు. బీటౌన్ స్టార్స్ కూడా తమ వారసులను కరణ్ చేతిలో పెట్టాలని ఆశ పడుతుంటారు. ఇదిలా ఉండగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాపై కరణ్ ఈమధ్య ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే లైగర్ సినిమా ద్వారా విజయ్ దేవరకొండను బాలీవుడ్‌కు పరిచయం చేసిన కరణ్ ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోను కూడా బీటౌన్‌కు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఆయన మరెవరో కాదు. కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని . ఇప్పటికే దీనికి సంబంధించి నాగ్ కరణ్‌తో చర్చలు జరుపుతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. త్వరలోనే కరణ్ అఖిల్‌ని హిందీలో లాంచ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
ఆ విషయంలో కుమార్తెకు గౌరీ ఖాన్ సలహా.. ఏమని చెప్పిందంటే?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్. బాలీవుడ్లో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఇది ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీజన్లో 12వ ఎపిసోడ్ ట్రైలర్‌ను కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పాల్గొన్నారు. చదవండి: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి.. బర్త్‌డే తర్వాత రెండు రోజులకే! ఆమెకు కరణ్ పలు ప్రశ్నలు సంధించగా నవ్వుతూ సమాధానాలిచ్చారు. భర్త షారుక్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు భామలు భావన పాండే, మహీప్ కపూర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షో ఫుల్ ఎపిసోడ్ గురువారం రాత్రి ప్రసారం కానుండగా తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు మేకర్స్. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌పై ప్రశ్నతో ఈ ప్రోమో ప్రారంభమైంది. (చదవండి: Karan Johar: వాతావరణ మార్పుపై పోరాటంగా 'నయా భారత్ కా సప్నా') మీ కూతురికి డేటింగ్‌పై మీరిచ్చే సలహా ఏంటని గౌరీ ఖాన్‌ను ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. 'ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయవద్దని' సలహా ఇస్తానని నవ్వుతూ చెప్పింది. అలాగే షారుఖ్‌తో మీ ప్రేమకథకు ఏ సినిమా టైటిల్‌ను ఎంచుకుంటారు అని అడగ్గా.. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అంటూ గౌరీ ఖాన్ నవ్వుతూ ఆన్సరిచ్చింది. అంతే కాకుండా ఈ ఎపిసోడ్లో షారుఖ్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గురువారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
బ్రహ్మస్త్రపై కేఆర్కే సంచలన కామెంట్స్.. ఇదొక పెద్ద..!
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) బ్రహ్మాస్త్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మూవీని తనదైన శైలిలో విమర్శించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు. బ్రహ్మస్త్ర ఒక పెద్ద డిజాస్టర్ అని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలకు తనను నిందించవద్దని నిర్మాత కరణ్ జోహార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బాలీవుడ్‌ను షేక్ చేశారాయన. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. బాలీవుడ్లో ఇతర సినిమాల్లాగే ఇది కూడా పెద్ద వైఫల్యమని చిత్రబృందానికి దిమ్మతిరిగే షాకిచ్చారు. కేఆర్కే సోషల్ మీడియాలో స్పందిస్తూ ' అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నేను సమీక్ష చేయలేదు, అయినప్పటికీ ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లలేదు. అందుకే ఇదొక పెద్ద డిజాస్టర్. ఇతర బాలీవుడ్ నిర్మాతల్లాగే కరణ్ జోహార్ తన వైఫల్యానికి నన్ను నిందించరని ఆశిస్తున్నా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. I didn’t review film #Brahmastra still people didn’t go to theatres to watch it. So it has become a disaster. Hope @karanjohar won’t blame me for the failure like many other Bollywood people. — KRK (@kamaalrkhan) September 16, 2022 కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ నటులైన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
రూ.600 కోట్లు తగలబెట్టాడు.. వారందర్నీ జైల్లో పెట్టాలి: కంగనా ఫైర్
‘బ్రహ్మాస్త్ర’ మూవీ టీమ్‌పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశారని విమర్శించారు. అతని సినీ కెరీర్లో ఒక్క మంచి చిత్రం కూడా లేదని, అతన్ని మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సినీ క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. చిత్ర బృందంపై, ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. (చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. టాలీవుడ్లో సరికొత్త రికార్డు) ‘అయాన్ ముఖర్జీని మేధావి అని మెచ్చుకున్న వారందర్నీ జైలుకు పంపించాలి. ‘బ్రహ్మాస్త్ర’చిత్రానికి తెరకెక్కించడానికి అతనికి 12 ఏళ్లు పట్టింది. ఈ సినిమాను 400 రోజులకుపైగా షూట్ చేసి, 14 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చాడు. ప్రొడక్షన్స్ ఖర్చుల రూపంలో మొత్తంగా రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశాడు. బాహుబలి సినిమా సక్సెస్ కావడంతో.. బ్రహ్మాస్త్ర సినిమా పేరును జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా చివరి నిమిషంలో మార్చి మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి అవకాశవాదులు, సృజనాత్మకత కోల్పోయిన వ్యక్తులను మేధావి అని పిలవ కూడదు’అంటూ కంగనా రాసుకొచ్చారు. అలాగే కరణ్ జోహార్‌పై కూడా కంగనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అతను సినిమా స్క్రిప్ట్‌లపై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్స్ వివరాలు.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనుగోలు చేసి తన సినిమాలకు ఇప్పించుకుంటాడు. ఈసారి అయితే దక్షిణాది వారి దృష్టి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను తెరకెక్కించే సినిమాలో మంచి కథ, కథనం, టాలెంట్ ఉన్న నటీనటులను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని దక్షిణాది నటీనటులు, దర్శకులను కోరుకున్నాడు. ఇలా అక్కడి వారిని కోరుకునే బదులు మంచి టాలెంట్ ఉన్న వాళ్లతో సినిమా తీస్తే సరిపోతుంది కదా’అని కంగనా రనౌత్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమా విషయానికొస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు.స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పించారు. భారీ అంచనాల మధ్య నిన్న(సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. -
పెళ్లి తర్వాత జరిగే తంతు పగలే పూర్తయింది: హీరోయిన్
సెలబ్రిటీల సీక్రెట్స్‌ను బయటపెట్టే షో "కాఫీ విత్ కరణ్". హోస్ట్ కరణ్ జోహార్ తారలతో మాటలు కలుపుతూ వారి గురించి అన్ని విషయాలు రాబడుతుంటాడు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను తెలుసుకోవాలనుకునే ఫ్యాన్స్ ఈ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. తాజాగా ఈ షోకు ఫోన్ బూత్ చిత్రయూనిట్ సిద్దాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్, కత్రినా కైఫ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. ఇందులో కరణ్.. 'పెళ్లిరోజు అలిసిపోతాం, కాబట్టి ఆరోజు శోభనం ఉండదు' అన్న ఆలియా సమాధానాంపై స్పందనేంటని అడిగాడు. దీనికి కత్రినా.. మా శోభనం పగలు జరిగింది అని షాకింగ్ ఆన్సరిచ్చింది. ఇక సిద్దాంత్ చతుర్వేదిని సింగిలా? కమిటెడా? అని అడిగాడు. దానికతడు ఇప్పటికీ బ్రహ్మచారినేనని ఆన్సరిచ్చాడు. ఆమధ్య అనన్య పాండేతో తెగదెంపులు చేసుకున్న ఇషాన్ ఖట్టర్ కూడా తాను ఏ రిలేషన్లో లేనని క్లారిటీ ఇచ్చాడు. కాగా గతేడాది డిసెంబర్ 9న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. చదవండి:బ్రహ్మాస్త్రపై భారీ అంచనాలు.. కానీ అంతా తలకిందులయ్యేలా ఉందే! లలిత్ మోదీకి సుష్మిత బ్రేకప్?! -
ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి : ఎన్టీఆర్
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎందుకంటే ప్రేక్షకులకు ఇంకా ఏదో కొత్తగా కావాలి. ఆ ఒత్తిడి ఉన్నప్పుడే మనం బాగా చేయగలం. ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి. మన ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు, గొప్ప చిత్రాలు తీయాలి.. తీస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది. కాగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది నటులున్నారు. కానీ, కొందరు మాత్రమే నాపై ప్రభావం చూపారు. అమితాబ్ బచ్చన్‌గారు, రణ్‌బీర్ కపూర్ ఇంటెన్సిటీ అంటే నాకు చాలా ఇష్టం. వీరి నుంచి ఓ యాక్టర్‌గా నేను స్ఫూర్తి పొందాను. రాజమౌళి, కరణ్ జోహార్గార్లు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఒక్కటిగా మార్చారని నమ్ముతున్నాను. మా నాగార్జున బాబాయ్ నటించిన హిందీ చిత్రం ‘ఖుదాగవా’ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓ తెలుగు హీరో హిందీలో డైలాగులు చెబితే ఎలా ఉంటుందో తొలిసారి ఆ సినిమా చూసి తెలుసుకున్నాను’అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ–‘‘రాజమౌళిగారు ‘బ్రహ్మాస్త్రం’ని సమర్పిస్తున్నారంటే సినిమా అలా ఇలా ఉండదు. ఆయాన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో భాగమయ్యారు. రాజమౌళిగారు ఓ సినిమాని మూడేళ్లు చెక్కుతారు.. అలా ఆయాన్ కూడా ‘బ్రహ్మాస్త్రం’ ని మూడేళ్లు చెక్కారు’’ అన్నారు. (చదవండి: తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు) రాజమౌళి మాట్లాడుతూ – ‘‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా చేయాలనుకుని ఏర్పాట్లు చేశాం. ఐదు రోజుల కిందట పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నాం. అయితే శుక్రవారం ఎక్కువగా వినాయక నిమజ్జనాలు ఉండటం వల్ల ప్రీ రిలీజ్ వేడుకకి బందోబస్తు ఇవ్వడం కష్టమని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు.. దీంతో ప్రీ రిలీజ్ వేడుకని క్యాన్సిల్ చేసి, ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నాం. ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో భాగం కావాలని ఐదేళ్ల కిందట కరణ్‌గారు చెప్పడంతో ఓకే అన్నాను. ఆయాన్ ముఖర్జీ ఈ కథ చెప్పినప్పుడు నా బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి’’ అన్నారు. ‘‘తారక్ అమేజింగ్ యాక్టర్. ఆయాన్ ముఖర్జీ పదేళ్ల ఆలోచనల రూపం ‘బ్రహ్మాస్త్రం’’ అన్నారు కరణ్ జోహార్ ‘‘నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్రం’. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రణ్‌బీర్ కపూర్. ‘‘ఈ సినిమా మాకో ఎమోషన్’’ అన్నారు ఆలియా భట్. నటి మౌనీరాయ్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా, ప్రైమ్ ఫోకస్ ఫౌండర్ నమిత్ మల్హోత్రా, డీస్నీ స్టార్ ప్రెసిడెంట్ మాధవన్, స్టార్ స్టూడియోస్ హెడ్ విక్రమ్ దుగ్గల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరో చేసిన పనికి ఆగిపోయిన రష్మిక సినిమా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్‌తో రష్మిక క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. సౌత్ సహా నార్త్‌లోనూ వరుస ఆఫర్లతో యమ బిజీగా అయిపోయింది ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న రష్మికకు గట్టి షాక్ తగిలింది. ఆమె నటిస్తున్న సినిమా ఆగిపోయినట్లు సమాచారం. ఇంతకీ ఏమైందంటే.. టైగర్ ష్రాఫ్‌తో కలిసి రష్మిక 'స్క్రూ ఢీలా' అనే చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం టైగర్‌కు రూ 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేశాడు. అయితే షూటింగ్ మొదలయ్యాక టైగర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని కరణ్ అతన్ని కోరాడట. ప్రస్తుతం బాలీవుడ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున పారితోషికం కింద రూ.20కోట్లు తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవాలని కరణ్ అడిగాడట. ఇందుకు ఇందుకు టైగర్ ససేమీరా అనడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు బీటౌన్ టాక్. దీంతో టైగర్ చేసిన పనికి రష్మికకు కూడా మంచి ఛాన్స్ మిస్సయినట్లైంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: 'ఆంటీ' అంటూ ట్రోలింగ్.. పోలీస్ కంప్లైట్ ఇచ్చిన అనసూయ -
'లైగర్' ఫస్ట్‌డే కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ రావాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల నడుమ నిన్న(గురువారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తొలిరోజు రూ. 12కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ నెగిటివ్ టాక్ కారణంగా ఆ టెర్గెట్ను లైగర్ అందుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 9. 57కోట్ల షేర్ని మాత్రమే రాబట్టింది. తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నైజాంలో రూ. 4.2కోట్లు సీడెడ్‌లో రూ. 1.32కోట్లు వైజాగ్‌లో రూ. 1.30కోట్లు ఈస్ట్‌లో రూ.. 64లక్షలు వెస్ట్‌లో రూ. 39లక్షలు కృష్ణలో రూ. 48 లక్షలు గుంటూరులో రూ. 83లక్షలు నెల్లూరులో రూ. 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా 15.40 కోట్ల గ్రాస్, రూ. 9.57కోట్ల షేర్‌ను రాబట్టింది. ఓవర్ సీస్ సహా వరల్డ్ వైడ్ గా లైగర్ సినిమా తొలి రోజు 33.12 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ రూ. 90కోట్లు ఉండగా, ఇంకా రూ.76.55 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది. -
మీ అమ్మ నువ్వింకా కన్యవే అనుకుంటుందా?.. షాకైన హీరోయిన్
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలు లాగడమే ఈ షో లక్ష్యంగా తయారైంది. ఏ సెలబ్రిటీ వచ్చినా వారి బెడ్రూమ్ విషయాలు లేదంటే రిలేషన్షిప్ గురించి ఏ మాత్రం మొహమాటం లేకుండా కూపీ లాగుతుంటాడు హోస్ట్ కరణ్ జోహార్. ఇటీవల సిద్దార్థ్ మల్హోత్రా ఈ షోకి రాగా తాజాగా సిద్దార్థ్ ప్రేయసి కియారా అద్వానీ కాఫీ విత్ కరణ్‌లో ప్రత్యక్షమైంది. ఆమెతో పాటు హీరో షాహిద్ కపూర్ కూడా గెస్ట్‌గా విచ్చేశాడు. ఇక వాళ్లిద్దరినీ సోఫాలో కూచోబెట్టిన కరణ్.. తన వాడివేడి ప్రశ్నలతో కియారాకు చెమటలు పట్టించాడు. నువ్వు బెడ్రూమ్లో దొంగా పోలీసు వంటి ఆటలు ఆడలేదా? అని అడిగాడు. దీనికామె కొంత ఇబ్బందిగా చూస్తూ మా అమ్మ ఈ ఎపిసోడ్ చూస్తుంది అని బదులిచ్చింది. అయినా వెనక్కు తగ్గని హోస్ట్.. అయితే ఏంటట? మీ అమ్మ నువ్వింకా కన్యవనే అనుకుంటుందా, ఏంటి? అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి కియారా నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా అని ఆన్సరిచ్చింది. సిద్దార్థ్‌తో నువ్వు రిలేషన్లో లేవా? అన్న ప్రశ్నకు అవుననీ చెప్పను, కాదనీ చెప్పను అని తెలివిగా ప్రశ్నను దాటవేసింది. అయితే మీరు క్లోజ్ ఫ్రెండ్సా? అని అడగ్గా.. క్లోజ్ ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువే! అని తెలిపింది. కాగా కియారా అద్వానీ ప్రస్తుతం సత్య ప్రేమ్ కీ కథ అనే సినిమా చేస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) చదవండి: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఎలా ఉందంటే... 'ది ఫ్యామిలీ మ్యాన్' తరహాలో.. మరోసారి డేర్ చేస్తున్న సామ్ -
నా షోకి రమ్మని వాళ్లిద్దరినీ ఎప్పటికీ పిలవను
కాఫీ విత్ కరణ్.. వెండితెర సెలబ్రిటీలను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసే షో. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ రన్ అవుతోంది. ఎంతోమంది గొప్పగొప్ప సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్న ఈ షోలో ఇద్దరు మాత్రం ఎప్పటికీ రారని బల్ల గుద్ది చెప్తున్నాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను నా షోకి రావాలని రేఖ మేడమ్‌ను చాలా అభ్యర్థించాను. గతంలోనే కాదు, ఈ మధ్య కూడా అడిగా. తను ఎలాగైనా నా షోలో కనబడాలనుకున్నాను. కానీ ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అంటే తను ఏదో పెద్ద రహస్యం దాస్తుందనీ, అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. అయినా తను ససేమీరా నో చెప్పింది కాబట్టి ఇకపై ఎప్పుడూ ఆమెను రమ్మని ఆహ్వానించను. అలాగే నా స్నేహితుడు, గురువు ఆదిత్య చోప్రాను కూడా రమ్మని చెప్పను. ఎందుకంటే తనపై ప్రశ్నలు కురిపించేటంత తెలివితేటలు నాకు లేవు. కాబట్టి బహుశా వీళ్లిద్దరూ నా షోలో కనిపించకపోవచ్చు' అని చెప్పుకొచ్చాడు కరణ్. కాగా 2005లో కాఫీ విత్ కరణ్ తొలిసారిగా టీవీలో ప్రసారమైంది. అయితే ఏడో సీజన్ మాత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. గత వారం విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రా షోలోకి విచ్చేయగా ఈ వారం షాహిద్ కపూర్, కియారా అద్వానీ రానున్నారు. చదవండి: త్రిష నిజంగా రాజకీయాల్లోకి రానుందా? ఆమె తల్లి ఏమందంటే? మళ్లీ కరోనా బారిన అమితాబ్, ఆస్పత్రిలో చేరిన బిగ్‌బి.. -
కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ 'లైగర్'
#బాయ్‌కాట్ బాలీవుడ్.. ఇండియలో ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్ ఇది. బీటౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పడు 'లైగర్' సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో లైగర్‌కు బాయ్‌కాట్ సెగ తగిలింది. దీనికి కరణ్‌జోహార్ ఒక కారణమైతే, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మరో కారణంగా తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌తో కలిసి కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్ బాయ్‌కట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్‌సింగ్ చడ్డా బాయ్‌కాట్ చేయడంపై విజయ్ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్ చేసి అమీర్‌ఖాన్‌కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. దీనికి తోడు ఓ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి మీడియాకు ఆన్సర్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottLigerఅనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. We Telugu youth also support for this #BoycottLiger because it is not Telugu movie it is Hindi movie which is dubbing in telugu produced by Karan Johar #BoycottLigerMovie — suman kumar (@khsumankumar45) August 20, 2022 It's enough for boycott #BoycottLigerMovie pic.twitter.com/Tkt5PVhuOJ — Chris Virat🇮🇳 (@Chrisvirat100) August 20, 2022 -
‘లైగర్’లో ముందుగా ఆమెను హీరోయిన్గా అనుకున్నా: పూరీ
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటించిన తాజా చిత్రం లైగర్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లైగర్ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. అయితే లైగర్‌లో ముందుగా తాను వేరు హీరోయిన్ను అనుకున్నట్లు చెప్పాడు. చదవండి: ప్రపోజల్స్‌పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు ఈ మేరకు పూరీ మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాక నిర్మాణంలో భాగంగా నిర్మాత కరణ్ జోహార్‌ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఒకే అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ కోసం జాన్వీ కపూర్‌ను కలిశా. ఎందుకంటే కథ అనుకున్నప్పుడే విజయ్‌కి జోడిగా జాన్వీని అనుకున్నాను. నేను శ్రీదేవి విరాభిమాని కావడంతో నా చిత్రం ద్వారానే జాన్వీని తెలుగులో లాంచ్ చేయాలనుకున్నా. అందుకే జాన్వీని కలిసి కథ వినిపించా. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. చదవండి: నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు ఇదే విషయాన్ని కరణ్‌కు చెప్పడంతో ఆయన అనన్య పేరును సూచించారు. దీంతో అనన్యను హీరోయిన్గా ఫైనల్ చేశాం. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యాక తెలిసింది ఆమె ఎంత మంచి నటి అనేది. ప్రతి సీన్లోనూ హావభావాలు చాలా బాగా ఇచ్చేది. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది’ అని పూరీ చెప్పుకొచ్చాడు. కాగా పూరీ కనెక్ట్స్-ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్ జోహార్-చార్మీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాగా రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాన్ని జరపుకున్న ఈ మూవీకి బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 7 అసభ్యకర సన్నివేశాలని ఉన్నాయని, వాటి తొలగించి చిత్రం విడుదల చేయాలని పేర్కొంటూ సెన్సార్ బోర్డు లైగర్‌కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. -
ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్, ఏమన్నాడంటే..
ప్రస్తుతం బాలీవుడ్ ప్రేమజంటలో కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల ప్రేమయాణం తరచూ హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట నేరుగా ఎప్పుడు స్పందించలేదు. ఒకవేళ మాట్లాడిన తాము స్నేహితులమే అంటూ రూమార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా వీరి ప్రేమ, పెళ్లిపై రూమర్లు ఆగడం లేదు. ఇటీవల కియార బర్త్‌డే వేడుకలో భాగంగా ఈ జంట దుబాయ్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు బయటకు రావడంతో వీరి లవ్ ఎఫైర్ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్ ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఓ షోలో తమ రిలేషన్‌పై నోరువిప్పాడు సిద్ధార్థ్. కాఫీ విత్ కరణ్ షోకు వచ్చిన సిద్ధార్థ్, కియారాతో ప్రేమలో ఉన్నట్లు పరోక్షంగా ప్రకటించాడు. హీరో విక్కీ కౌశల్‌తో కలిసి సిద్ధార్థ్ ఈ టాక్ షోలో పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చేత కియారాతో రిలేషన్‌ను బయటపెట్టించే ప్రయత్నం చేశాడు కరణ్. ఈ క్రమంలో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్‌ను ప్రశ్నించాడు.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. చదవండి: ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ ఈ సందర్భంగా కాఫీ విత్ కరణ్ గత సీజన్లో కియారాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సిద్ధార్థ్ కోసం ప్లే చేశాడు కరణ్. అందులో సిద్ధార్థ్ గురించి అడగ్గా.. తామిద్దరం స్నేహితుల కంటే ఎక్కువ అని కియారా చెప్పడం.. సిద్ధార్థ్ ముసిముసి నవ్వడంతో వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోతున్నారు. అంతేకాదు తన ప్రశ్నలతో కరణ్, కియారాను ఇబ్బంది పెట్టడం చూసి తనని ఎందుకు అన్ని ప్రశ్నలు అడిగారు? అని అన్నాడు. దీంతో ఒకే మీ పెళ్లేప్పుడు అని సిద్ధార్థ్‌ను అడగ్గా.. మీరు సెటిల్ అయ్యారు.. మేము అవ్వోద్దా? అని సమాధానం ఇచ్చాడు. ఇక చివకరగా ఒకవేళ తనని పిలవకుండానే పెళ్లి చేసుకుంటే కొడతానంటూ సిద్ధార్థ్‌ను హెచ్చరించాడు కరణ్. -
శృంగార జీవితంపై హీరోయిన్ తాప్సీ బోల్డ్ కామెంట్స్
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పింక్, తప్పడ్ , రష్మీ రాకెట్ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం దోబారా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఇటీవలి కాలంలోహీరో, హీరోయిన్స్ ఎక్కువగా తమ మూవీ ప్రమోషన్స్ కోసం కాఫీ విత్ కరణ్ సీజన్-7లో పాల్గొంటున్నారు. చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్.. ఎందుకంటే అయితే తాప్సీ మాత్రం ఆ షోకి వెళ్లకపోవడంపై మీడియా నుంచి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. కరణ్ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని అడగ్గా.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం కరణ్ షోపై తాప్సీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కరణ్ శృంగార జీవితం(సెక్స్ లైఫ్)పై అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. చదవండి: ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆలియా భట్ ఎంత సంపాదిస్తుందో తెలుసా? -
మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. ఈ షో ఎంతటి క్రేజీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు వచ్చిన సినీ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో చిక్కు ప్రశ్నలు అడిగి ఇబ్బందుల్లో పడేస్తుంటాడు కరణ్. అలా వారి నుంచి ఆసక్తిర విషయాలను బయటపెట్టిస్తూ ఈ టాక్ షోను సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ సీజన్లో తొలిసారి మన తెలుగు హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండలు సందడి చేశారు. చదవండి: బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్ రివ్యూ.. ఏమన్నాడంటే దీంతో కాఫీ విత్ కరణ్ 6వ సీజన్‌కు నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో లెటేస్ట్ ఎపిసోడ్లో లాల్ సింగ్ చద్దా హీరోహీరోయిన్లు అయిన ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, కరీనాను అడిగిన ఓ ప్రశ్న ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రాపిడ్ ఫైర్ రౌండ్లో హోస్ట్ కరణ్ కరీనాను కజిన్ రణ్‌బిర్ కపూర్, షాహిద్ కపూర్ పార్టీ చేసుకుంటే ఎవరు మిమ్మల్ని ఆహ్వానించరు అని అడగ్గా.. ‘రణ్‌బిర్ కజిన్ కాబట్టి ఆహ్వానిస్తాడు. కానీ షాహిద్ కపూర్ మాత్రం ఆహ్వానించకపోవచ్చు’ అని వివరించింది. చదవండి: పసి పిల్లలను సైతం చంపే రాక్షస చక్రవర్తి 'బింబిసార'.. మూవీ రివ్యూ ఆ తర్వాత గతంలో ఈ షోలో బేబో ఎన్నోసార్లు పాల్గొంందని, పెళ్లికి ముందు ఒకసారి, పెళ్ల అనంతరం తన భర్త సైఫ్‌తో.. మాజీ భర్త షాహిద్.. అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో షోకు వచ్చినవారంత ఒక్కసారిగా షాకయ్యారు. కరణ్ మాటలకు కరీనా సైతం అవాక్కైంది. తన తప్పును వెంటనే సవరించుకున్న కరణ్.. కరీనాను క్షమాపణలు కోరాడు. కాగా కరీనా, షాహిద్లు జంటగా నటించిన జబ్ వి మెట్ మూవీ సమయంలో వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లకు ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న వీరిద్దరు. ఆ తర్వాత కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా.. షాహిద్ మిరా రాజ్‌పుత్‌ను వివాహమాడాడు. -
'నయా భారత్ కా సప్నా' ప్రచారాన్ని ప్రారంభించిన కరణ్ జోహార్
Karan Johar Launches Naye Bharat Ka Sapna Campaign: 'నయా భారత్ కా సప్నా' పేరిట స్వాతంత్ర్య దినోత్సవ ప్రచారాన్ని బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత కరణ్ జోహర్ ప్రారంభించారు. 'కూ యాప్' ద్వారా వాతావరణ మార్పులపై పోరాటం చేద్దామనే తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు కరణ్ జోహార్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నయా భారత్ కా స్వప్నా అనే కార్యక్రమం సరికొత్త భారతదేశం కోసం సమిష్టి మార్పును తీసుకురావడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రేరేపిస్తుంది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచడం, పునర్వినియోగం, తగ్గించడం, రీసైకిల్ చేయడం వంటి అలవాట్లను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పులపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తూ కరణ్ జోహార్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా స్వతంత్ర భారతదేశపు 75 వ వార్షికోత్సవాన్ని మరింత సంతోషంగా జరుపుకోవడానికి వినియోగదారులను సన్నద్ధం చేస్తోంది. ఆగస్టు 1 నుంచి 15 రోజుల పాటు సాగే ఈ ప్రచారంలో సమాజ సంక్షేమం కోసం ప్రతిరోజూ కృషి చేసే వైద్యులు ఆరోగ్య కార్యకర్తలతో సహా భారతదేశ సాయుధ దళాలకు, కోవిడ్ యోధులకు సెల్యూట్ చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. 'కూ యాప్ ప్రగతిశీల మార్పులు అలవర్చుకునేలా ప్రజలను ప్రేరేపిస్తోందని' ఆ యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ కామత్ వెల్లడించారు. అలాగే ఫైట్ క్లైమేట్ చేంజ్ గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ, “ఈ వాతావరణ మార్పుల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. ఈ నయా భారత్ కా సప్నా లో పాల్గొని, కూ యాప్ ద్వారా బహుభాషా వినియోగదారులతో సంభాషిస్తూ సమస్య గురించి అవగాహన కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ స్వాతంత్య్ర సంబురాల సమయంలో మనమందరం చేయి చేయి కలుపుదాం. మన భూమి, మన దేశం, మన ప్రజల కోసం మన వంతు కృషి చేద్దాం. అని పేర్కొన్నారు. Koo App One step for the nation. #nayebharatkasapna #swatantratasankalp View attached media content - Karan Johar (@karanjohar) 1 Aug 2022 -
శృంగారంపై ప్రశ్న.. హీరోయిన్ సమాధానం ఏంటంటే?
Koffee With Karan 7: Kareena Kapoor Answer To Karan Johar Question: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా సక్సెస్ అయిన షో 'కాఫీ విత్ కరణ్' టాక్ షో. ఇప్పటికీ ఈ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్లో పార్టిస్పేట్ చేసిన సెలబ్రిటీలతో అనేక రహస్యాలను బయటపెడుతున్నాడు ఈ స్టార్ ప్రోడ్యూసర్. ఇటీవలిటీ ఎపిసోడ్లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ అన్నదమ్ములతో డేటింగ్ చేయడం, విజయ్ దేవరకొండ కారులో శృంగారం చేయడం వంటి విషయాలతోపాటు సమంత, అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ఐదో ఎపిసోడ్ ప్రొమోను బయటకు వదిలారు. ఈ ఎపిసోడ్లో 'లాల్ సింగ్ చద్దా' హీరోహీరోయిన్లు అమీర్ ఖాన్, కరీనా కపూర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'పిల్లలు పుట్టాక సంతృప్తికర లైంగిక జీవితం అనేది నిజమా? కల్పితమా?' అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు 'మీకు తెలియదా?' అని కరీనా కపూర్ ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో 'మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా లైంగిక జీవితం గురించి మాట్లాడటం బాగుండదేమో?' అని కరణ్ చెప్పగా వెంటనే 'మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మాత్రం మీ అమ్మగారు పట్టించుకోవడం లేదు కదా' అని అమీర్ అనడంతో షోలో నవ్వులు కురిశాయి. చదవండి: హీరోయిన్ మేనకోడలు, కాంగ్రెస్ నాయకుడి కుమార్తె మృతి.. హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ కాగా అమీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చదవండి: నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్ బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా నిర్దోషులు
'కాఫీ విత్ కరణ్' షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలకు ఊరట లభించింది. వీరితో పాటు షో హోస్ట్, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌కు కూడా ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేలుస్తూ జోధ్‌పూర్ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. 2018లో కాఫీ విత్ కరణ్ సీజన్ 6 సందర్భంగా షో హోస్ట్ కరణ్ జోహర్ అడిగిన అభ్యంతరకర ప్రశ్నలకు (సెక్స్ లైఫ్) రాహుల్, పాండ్యాలు వ్యంగ్యమైన సమాధానాలు చెప్పారు. ఇందుకు గాను వీరు తగిన మూల్యమే చెల్లించుకున్నారు. అప్పట్లో వీరిద్దరు తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. బీసీసీఐ ఈ ఇద్దరిని అర్ధంతరంగా ఆసీస్ పర్యటన నుంచి వెనక్కు పంపించేసింది. అంతటితోనే ఆగకుండా వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. ఈ విషయమై డాక్టర్ మేఘ్వాల్.. రాహుల్, హార్థిక్ సహా కరణ్ జోహర్‌లపై జోధ్‌పూర్‌లోని లునీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఆ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని కోర్టు ఈ కేసును కొట్టేసింది. కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు టీమిండియాలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. పాండ్యా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాలో భాగంగా ఉంటే, ఇటీవలే గాయం నుంచి కోలుకుని రాహుల్ ఆసియా కప్‌కు సిద్ధంగా ఉన్నాడు. చదవండి: IND vs WI: విండీస్‌తో మూడో టీ20.. శ్రేయస్ అవుట్! హుడాకు ఛాన్స్! -
'బాలీవుడ్ పని ఖతం'.. చెత్తవాగుడంటూ కరణ్ జోహార్ ఫైర్
పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు బాలీవుడ్‌పై దండయాత్ర చేశాయి. అక్కడి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి కోట్లరూపాయలు వసూలు చేశాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం ఒకటీరెండూ మినహా అన్నీ బోల్తా కొట్టాయి. పెద్ద హీరోల సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ దక్కకపోవడంతో బాలీవుడ్ పని ఖతమైందంటూ వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ స్పందించాడు. 'చెత్తవాగుడు వాగుతున్నారు. మంచి సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. గంగూబాయ్ కతియావాడి, భూల్ భులాయా 2 సినిమాలు భారీ హిట్ కొట్టాయి. అలాగే జుగ్ జుగ్ జియో మూవీ కూడా బానే ఆడింది. సరైన కంటెంట్ లేని సినిమాలు మాత్రమే బెడిసికొడతాయి. అయినా ఇప్పుడు మనదగ్గర చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, బ్రహ్మాస్త్ర, రోహిత్ శెట్టి మూవీ, ఏడాది చివర్లో సల్మాన్ ఖాన్ సినిమా ఉంది. ఈ సినిమాల కోసం మనం ఎదురుచూడాలి. థియేటర్‌కు జనాలను రప్పించడం ఇప్పుడంత సులువేమీ కాదు. సినిమా ట్రైలర్, క్యాంపెయిన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. మనం మన పేరుప్రతిష్టలకు అనుగుణంగా బతుకుతున్నాం. కొన్నిసార్లు అది ఒత్తిడిగా అనిపిస్తుందేమో! కానీ ఛాలెంజ్‌లు స్వీకరించడమే నాకిష్టం' అని చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్. కాగా జుగ్ జుగ్ జియో చిత్రం కరణ్ జోహార్ సొంత బ్యానర్లోనే నిర్మితమైంది. గత నెలలో రిలీజైన ఈ మూవీ దాదాపు రూ.84 కోట్లు రాబట్టింది. గంగూబాయ్ కతియావాడికి రూ.180 కోట్లు రాగా భూల్ భులాయా 2 అవలీలగా రూ.250 కోట్లను కొల్లగొట్టింది. ఇదే సమయంలో భారీ సినిమాలు సల్మాన్ ఖాన్ 'అంతిమ్', అజయ్ దేవ్‌గణ్ 'రన్‌వే 34', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్', రణ్‌బీర్ కపూర్ 'షంషేరా' చిత్రాలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. చదవండి: అందం ఇదేనేమో.. త్రిష చీరకట్టు ఫోటోలు వైరల్ నన్ను పెళ్లి చేసుకుంటే మీరు తట్టుకోలేరు.. రోజంతా స్మరించాల్సిందే! -
రష్మికపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ రూమర్డ్ కపుల్‌గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొడుతూ తరచూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. మధ్య ప్రేమాయణం ఉందని, వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చన్న వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. అయితే వీటిని రష్మక-విజయ్‌లు ఖండించినప్పటికీ రూమర్లకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా ఈ పుకార్లలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేశాడు నిర్మాత కరణ్ జోహార్. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో విజయ్ కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌ని అలాగే విజయ్‌ని కూడా రష్మికతో డేటింగ్ రూమర్స్‌పై ఆరా తీయగా.. తను నా డార్లింగ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా కెరీర్ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా. షూటింగ్లో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్, జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో మాధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్. తనంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పడం ఆసక్తిని సంతరించుకుంది. చదవండి: రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ -
విజయ్, రష్మిక డేటింగ్? హింట్ ఇచ్చిన అనన్య పాండే
‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండేతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ షోలో సందడి చేశాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. కొద్దికాలంగా విజయ్ ఫ్యాన్స్‌లో నెలకొన్న సందేహాంపై ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. కాగా విజయ్, రష్మిక డేటింగ్లో ఉన్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి వట్టి పుకార్లననే విజయ్-రష్మికలు ఆ వార్తలను కొట్టిపారేశారు. అయినా వీరిపై రూమర్లు ఆగడం లేదు. తాజాగా ఈ షోలో కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండ రిలేషిప్ స్టేటస్‌పై అభిప్రాయం ఏంటని అనన్యను ప్రశ్నించాడు. చదవండి: విజయ్ పాడిన ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ విన్నారా? దీనికి అనన్య ముసిముసి నవ్వుతూ.. ‘హీ ఈజ్ ఇన్ ‘రష్’(He is in rush). విజయ్ చాలా తొందరపడుతున్నాడు. మీకా.. మీకా సింగ్‌ను కలిసేందుకు అత్యుత్సహాంతో ఉన్నాడు’ అంటూ పరోక్షంగా ఫ్యాన్స్‌కి హింట్ ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు, ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంటే ‘అనన్య విజయ్-రష్మికలు రిలేషన్లో ఉన్నారని చెప్పకనే చెప్పారా?’,‘అయితే విజయ్ రష్మికతో మింగిల్ అయ్యేందుకు ఆత్రుతుగా ఉన్నాడా?’, ‘హో రష్-మికా(Rush-Mika)’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనన్య సమాధానానికి విజయ్ ఏమాత్రం ఆశ్యర్యపడలేదు. అయితే నువ్వు అదే అనుకుంటున్నావా? అని తిరిగి అనన్యను ప్రశ్నించాడు. ఆ తర్వాత కరణ్ కూడా రష్, మీకా అని అనన్య చెప్పిన పదాలను పదే పదే నొక్కి చెప్పాడు. చదవండి: ఎలాంటి నెగిటివిటి లేకుండా జీవించగలను: ఐశ్వర్య ఆసక్తికర ట్వీట్ The only time I loved ananya pandey!!!!! Happy tears in my eyes now#virosh #vijaydevarakonda #rashmika #LigerSaalaCrossbreed@TheDeverakonda @iamRashmika pic.twitter.com/zLLSy7lXJ0 — Raj❤❤vijay deverakonda (@deverakonda_raj) July 28, 2022 -
నా లవ్ గురించి చెప్పి అందరినీ బాధపెట్టలేను: విజయ్ దేవరకొండ
కాఫీ విత్ కరణ్ షో ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో టీవీలో మాత్రమే ప్రసారమయ్యే ఈ షో ఇప్పుడు కేవలం ఓటీటీలోనే అందుబాటులో ఉంది. కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీలను తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు కరణ్. అతడి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నటీనటుల బిక్కమొహం వేసుకుని కూర్చున్న సందర్భాలు కోకొల్లలు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండను సైతం కొన్ని అభ్యంతరకర ప్రశ్నలు అడిగి అతడిని ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు, అతడి లవ్ లైఫ్ కోసం కూడా ఆరా తీశాడు. ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా? అన్న ప్రశ్నకు విజయ్ ఏమన్నాడంటే.. 'నేను పెళ్లి చేసుకుని, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్న రోజు దీనికి సమాధానం గట్టిగా చెప్తాను. అప్పటివరకు నేను నోరు విప్పి ఎవరి మనోభావాలను కించపరచాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది నటుడిగా నన్ను ప్రేమిస్తారు. గోడలపై నా పోస్టర్లు అతికిస్తారు. ఫోన్ వాల్‌పేపర్ మీద కూడా నా ఫొటోనే ఉంటుంది. నన్ను అంతలా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. అలాంటిది నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేను' అని బదులిచ్చాడు. కాగా విజయ్, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! అటు రౌడీ హీరో, ఇటు రష్మిక ఇద్దరూ తాము మంచి స్నేహితులం మాత్రమేనని, తమ మధ్యలో ఏదీలేదని స్పష్టం చేసినప్పటికీ కొందరు మాత్రం ఇప్పటికీ వారు ప్రేమికులేనని బలంగా నమ్ముతుండటం గమనార్హం. చదవండి: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా -
చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన ‘రౌడీ’ హీరో
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన చిత్రం లైగర్. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మూవీ టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష్‌న్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా లైగర్ హీరోహీరోయిన్లు విజయ్, అనన్య పాండేలు కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో పాల్గొన్నారు. త్వరలోనే రాబోయే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. ఈ సందర్భంగా విజయ్, అనన్యలను తన బోల్డ్ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు కరణ్ జోహార్. చదవండి: నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్ నీకు చీజ్ ఇష్టమా? అని విజయ్‌ని ప్రశ్నించగా.. వామ్మో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ ముసిముసిగా నవ్వాడు విజయ్. ఆ వెంటనే గత ఎపిసోడ్లో జాన్వీ, సారాలు విజయ్ గురించి మాట్లాడిన వీడియోను ప్లే చేశాడు కరణ్. ఆ తర్వాత తన పార్టీలో అనన్య ఎదో చేసిందని దారి గురించి అడగాలి అంటుండగా ఆమె వద్దు వద్దు అంటూ అడ్డుపడింది. ఆ వెంటనే నీకు ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఏం జరగుతోందని అడిగి అనన్యను చిక్కుల్లో పడేశాడు. దీంతో ఆమె మాట మాట్లాడకుండా షాకై చూస్తుంది. చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్ ఇక ఆ తర్వాత విజయ్‌ని ‘చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్’(చివరిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావు) అని అడగ్గా.. ఈ ప్రశ్నని రద్దు చేయండని కరణ్‌ను పదే పదే రిక్వెస్ట్ చేశాడు విజయ్. ఆ వెంటనే అనన్య నేను చెప్పనా.. ఈ రోజు ఉదయమే వ్యాయమం చేశాడని చెబుతుంది. ఆమె సమాధానానికి కరణ్ ఆశ్చర్యంగా చూస్తూ.. మొదటిసారి.. ఈరోజు ఉదయమా! అంటాడు. ఇలా శాంతం ప్రోమో ఆసక్తిగా సాగింది. దీనికి ‘ఫుల్ ఎపిసోడ్ కోసం వేయింటింగ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Serious question - do you like 🧀? Then you'll love Episode 4 of #HotstarSpecials #KoffeeWithKaranS7, streams from this Thursday only on Disney+ Hotstar.@DisneyPlusHS @TheDeverakonda @ananyapandayy @apoorvamehta18 @jahnvio @aneeshabaig @Dharmatic_ pic.twitter.com/omxqi1NyBO — Karan Johar (@karanjohar) July 26, 2022 -
నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో తొలి సౌత్ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఆమెకు దక్షిణాన విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోలకు సమానంగా పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమెదే మొదటి స్థానం. అలాంటి నయన్‌పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో సదరు నిర్మాతపై నయన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో రీసెంట్గా సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే. చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్ ఈ సందర్భంగా సామ్‌ను ప్రస్తుతం సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. 'సౌత్‌లో బిగ్గెస్ట్ హీరోయిన్ అయిన నయనతారతో ఇటీవల నేను ఓ సినిమాను చేశాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ పరోక్షంగా నయనతార పేరు చెప్పంది సమంత. అయితే దీనికి కరణ్ ‘కానీ.. తను నా జాబితాలో లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కరణ్ కామెంట్స్‌పై నయన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ అయిన నయన్‌ను గుర్తించలేదనడం ఇది ఆమెను కించపరిచనట్లే అంటున్నారు. @Samanthaprabhu2 Is such a Sweetheart & Sharing her Lovable bond with #Nayanthara ❤️ @karanjohar She is not far in your list coz Your list is full of Nepo-Products which doesn’t deserve any arguements and discussions. #KoffeeWithKaran #LadySuperStar pic.twitter.com/TDUXGT871Z — A. (@ursavian) July 21, 2022 అంతేకాదు స్టుపిడ్ కాఫీ విత్ కరణ్ షోలో నయనతారు అవమానించే అర్హత ఆయనకు లేదు. తను సాధించిన విజయంలో కనీసం సగం కూడా నువ్వు సాధించేలేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండ తన సొంతగా స్టార్‌గా ఎదిగారు. మీలా నెపోటిజంతో ఎదగలేదు’, ‘ఇంతకి ఈ కరణ్ జోహార్ ఎవరూ?’ అంటూ కరణ్‌ను ఏకిపారేస్తున్నారు. అంతేకాదు ధర్మ ప్రొడక్ష్‌న్, కరణ్ జోహార్‌ను అసలు బ్యాన్ చేయాలంటూ ట్విటర్ వేదికగా కరణ్‌పై నయన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న జాన్వీ కపూర్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'.. నయన్ నటించిన 'కొలమాను కోకిల' రీమేక్ అని మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సౌత్ నటీనటులపై కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసిన కరణ్.. మరోసారి నయన్ గురించి అలా అనడం హాట్ టాపిక్‌గా మారింది. Karan Johar doesnt have any right to shame #Nayanthara on his stupid Koffee show. You cannot even achieve half of what she has achieved. She is self made not like you Nepo bitch.#Samantha we love you for giving it right back to that Nepo crap and for being so lovely — VISHNU (@VishnuTweets2U) July 22, 2022 #KaranJohar 🤡 list doesn’t determine the number one actress. #nayanthara is lady super star and will always be the queen of South Indian cinema. Her movie and acting proves that. She doesn’t need to be in anyone’s list for that😏 — Funny Humans (@FunnyHumans1) July 21, 2022 Sorry, but karan johar who? #Nayanthara pic.twitter.com/T0NkBXrM8g — 𝐏 𝐫 𝐢 𝐲 𝐚 (@xxgoldenroses) July 21, 2022 🐍 @karanjohar is bullying outsiders to promote his nepo betis. But Thalaivi is sending love and motivating the very same nepo stars ❤️ That's queen for you 🥺 Don't even think about belittling this amazing human ~ #Ladysuperstar #Nayanthara ~#KoffeeWithKaran pic.twitter.com/eHLs5Rgt1b — Theladysuperstarclub (@Nayantharian) July 24, 2022 The way Kjo disrespected #Nayanthara breaks my heart💔 I mean how can someone be this cocky and disrespectful towards such an actor... Never liked him..but now, he's seriously a waste material and nothing else. — Parth (@ParthK_23) July 22, 2022 -
బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్
Akshay Kumar Says Bollywood Actors Scared To Do Multi Starrer Movies: అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న షోలలో 'కాఫీ విత్ కరణ్' టాక్‌షో ఒకటి. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుని ఏడో సీజన్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోలో సినీ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడో సీజన్లో అలియా భట్-రణ్వీర్ సింగ్, బీ టౌన్ బెస్ట్ ఫ్రెండ్స్ జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్ పాల్గొని అలరించారు. తాజాగా మూడో ఎపిసోడ్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ షోలో మల్టీస్టారర్ గురించి అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. హిందీ హీరోలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓర్మాక్స్ పాపులారిటీ సర్వేలో సమంత, అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. మీరిద్దరూ టాప్ లిస్ట్‌లో ఎలా ఉన్నారని కరణ్ ప్రశ్నించగా.. 'నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణం. సాధారణంగా బాలీవుడ్ యాక్టర్స్ మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి భయపడతారు. సింగిల్ హీరో సినిమాలకే ఎక్కవగా ప్రాధాన్యత ఇస్తారు. మరో హీరోతో కలిసి పనిచేయడంలో అభద్రతా భావం ఉంది. మీకు నచ్చిన పాత్ర తీసుకోమ్మని చెప్పినా కూడా నో చెప్పిన సందర్భాలున్నాయి. దినిని విడిచిపెట్టాలి. నేను, కరణ్ నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో కావాలనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా ఏ హీరో ఒప్పుకోలేదు' అని అక్షయ్ షాకింగ్ విషయాలు తెలిపాడు. చదవండి: మాజీ భార్యతో స్టార్ హీరో స్పెషల్ డిన్నర్.. ఫొటోలు వైరల్ కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ రామ సేతు, ఓ మై గాడ్ 2, సెల్ఫీ, రాట్ససన్ రీమేక్, క్యూప్సూల్ గిల్, గూర్ఖా, బడే మియాన్ చోటే మియాన్, సూరరై పోట్రు రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. -
మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్
కాఫీ వీత్ కరణ్ జోహార్ షోలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపీసోడ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సమంత-నాగ చైతన్య విడాకులపై నెలకొన్న ఎన్నో సందేహాలు ఈ ఎపోసొడ్తో తీరుతాయని సౌత్ ప్రేక్షకులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు సమంత ఎపిసోడ్ గత రాత్రి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. అందరు అనుకున్నట్లుగానే ఈ షోలో సామ్‌కు విడాకులు, ట్రోల్స్, భరణంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. చదవండి: Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు మొదట్లో బాధఫడ్డా.. ప్రస్తుతం దాని నుంచి పూర్తిగా బయటపడ్డానని తెలిపింది. అంతేకాదు మునపటి కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యానని పేర్కొంది. అలాగే ఈ షో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సామ్ చై గురించి అడిగే క్రమంలో కరణ్ జోహార్ మీ భర్త అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో వెంటనే మధ్యలో సమంత కల్పించుకుని ‘మాజీ భర్త’ అనాలి అంటూ కరెక్ట్ చేసింది. వెంటనే కరణ్ సారీ చెబుతూ.. మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని భావించారా? అని అడగ్గా.. చదవండి: కాఫీ విత్ కరణ్: టాలీవుడ్ నెపోటిజంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‘అవును, కానీ ప్రస్తుతం నేను దాని గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ స్పందించాలన్నా ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవు’ అని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ చైతన్యకు మీకు మధ్య ఏవైన మనస్పర్థలు ఉన్నాయా అని అడగ్గా.. ‘మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. -
Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సమంత-నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీరి విడాకులకు గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఇందులో ఎక్కువగా సమంత తప్పే ఉందని మొదట్లో అందరు ఆమెను నిందించారు. అంతేకాదు సమంత నాగ చైతన్య నుంచి రూ. 250 కోట్లు భరణం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదని సామ్ అప్పుడే స్పష్టం చేసింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. తాజాగా ఓ షోలో సమంతకు ఇదే ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్‌ల హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సమంతకు విడాకులు, రూ. 250 కోట్ల భరణం వంటి విషయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. హోస్ట్ కరణ్ జోహార్ తనని వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టను అంటూనే విడాకులపై ప్రశ్నించాడు. దీనికి సామ్ ‘మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. డైవర్స్ తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది. చదవండి: ‘థ్యాంక్యూ’ మూవీ ట్విటర్ రివ్యూ కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నాను. అయితే విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరం తీవ్ర మనోవేదనకు గురయ్యాం’ అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ‘నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశా’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. -
అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్
Sara Ali Khan Janhvi Kapoor Dating With Two Brothers: అత్యధిక ప్రజాధరణ పొందిన టాక్ షోలలో 'కాఫీ విత్ కరణ్' ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షో 7వ సీజన్ ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్లో రణ్వీర్ సింగ్, అలియా భట్ అలరించగా.. రెండో ఎపిసోడ్లో బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ సందడి చేశారు. అయితే వీరిద్దరూ పార్టిస్పేట్ చేసిన ఎపిసోడ్ ఫుల్ వీడియో గురువారం (జులై 15)న రిలీజైంది. ఈ ఎపిసోడ్లో సారా, జాన్వీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు హోస్ట్ కరణ్ జోహార్. కాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో వీరిద్దరు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి విజయ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ అన్నదమ్ములతో డేటింగ్ చేసినట్లు తెలిపాడు కరణ్ జోహార్. దీనికి షాకైన ఈ ముద్దుగుమ్మలు 'ఇంత ఓపెన్‌గా షోలో చెప్పేస్తావా ?' అని అన్నారు. తర్వాత ఆ అన్నదమ్ములతో స్నేహం లాక్డౌన్ సమయంలో జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆ బ్రదర్స్ ఇద్దరూ సారా, జాన్వీ పొరుగింట్లో ఉండేవాళ్లని తెలిపారు. కరణ్ చేప్పిన మాటలు నిజం కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. View this post on Instagram A post shared by veersara (@veerandsara) సారా, జాన్వీతో డేటింగ్ చేసిన ఆ అదృష్టవంతులు వీరేనంటూ పలు రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వారు డేటింగ్ చేసిన బ్రదర్స్ వీర్ పహారియా, శిఖర్ పహారియా (వరుసగా సారా, జాన్వీ)గా తెలుపుతున్నారు నెటిజన్స్. అంతేకాకుండా వారి ఫొటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ వీర్, శిఖర్ ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లు కావడంతో ఈ వార్త జోరందుకుంది. కాగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షో ఏడో సీజన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. for everyone whose wondering which brother duo janhvi and sara dated, it’s these two brothers called veer (sara) and shikhar (janhvi) pahariya, both maternal grandsons of the former chief minister of maharashtra! THANK ME LATER #KoffeewithKaranSeason7 pic.twitter.com/X1dO9uxgyn — siddhi. 👼🏻 (@aphrcdeityy) July 14, 2022 Who are the brothers #JhanviKapoor and #SaraAliKhan dated? 👀🙄 #KoffeewithKaranSeason7 — Ana 🌻💛 (@AnaaaWalia) July 14, 2022 Who were the siblings whom #SaraAliKhan and #JanhviKapoor dated and who lives in Karan's building?#KoffeeWithKaran — Mayank (@sarcasm_taken) July 14, 2022 Saif Ali Khan's daughter Sara Ali Khan with her boyfriend Veer Pahariya. Aren't they luk'n cute 2gether? pic.twitter.com/wjDjsvSTfX — Music India (@MusicIndiaTV) May 6, 2016 Janhvi Kapoor: Jahnavi Kapoor was seen very close by X boyfriend in Lonavla! – actress janhvi kapoor cozy photo with rumored ex boyfriend shikhar pahariya is viral on internet https://t.co/i6sPccV35R pic.twitter.com/iAtWQ6MGVS — TEJAS D KULKARNI (@kultejas18) January 28, 2020 Is Saif Ali Khan’s beautiful daughter Sara Ali Khan dating Veer Pahariya, grandson of… https://t.co/9hF3zx5LaV pic.twitter.com/IX7cGpwWga — Saif Ali Khan Online (@SaifOnline) May 6, 2016 -
విజయ్‌తో డేట్‌కి వెళ్తానన్నా సారా.. లైగర్ రియాక్షన్ చూశారా!
‘రౌడీ’ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తానంటూ మనసులో మాట బయటపెట్టింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. సారా కామెంట్స్‌పై విజయ్ దేవరకొండ ఆసక్తిగా స్పందించాడు. ఈ మేరకు.. సారాతో పాటు జాన్వీ కపూర్‌కు సైతం గట్టి హగ్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేశాడు విజయ్. కాగా సారా అలీ ఖాన్, జాన్వి కపూర్లు ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ మేరకు వారిద్దరు తాజా కాఫీ విత్ కరణ్ జోహార్ సీజన్-7లో సందడి చేశారు. ఈ వీకెండ్లో ప్రసారమయ్యే ఈ షో ప్రోమోను తాజాగా హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ‘నువ్వు ఎవరితోనైనా డేట్‌కు వెళ్లాలనుకుంటున్నావా? అతను ఎవరు?’ అని ప్రశ్నిస్తాడు హోస్ట్ కరణ్. దీనికి సారా సిగ్గు పడుతూ విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇస్తుంది. ‘నువ్వు కూడా విజయ్‌తోనేనా!’ అని కరణ్ జాన్వీతో అంటాడు. ఆ వెంటనే సారా అలీ ఖాన్ స్పందిస్తూ ‘ఏంటీ నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా?’ అని జాన్విని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇలా సాంతంగా ఈ ప్రోమోను విజయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీనికి విజయ్ ‘నాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న మీకు నా గట్టి హగ్, ప్రేమ పంపిస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా విజయ్ అంటే క్రష్ అని గతంలో పలుమార్లు సారా, జాన్వీలు తమ మనసులో మాట చెప్పిన సంగతి తెలిసిందే. తనదైన నటన, మ్యానరిజంతో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక లైగర్ మూవీతో విజయ్ బాలీవుడ్‌కు సైతం పరిచయం కాబోతున్నాడు. అక్కడ కూడా తనదైన సైల్తో విజయ్ బి-టౌన్ హీరోయిన్ల మనసును కొల్లగోడుతున్నాడు. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నటి, బీజేపీ సభ్యురాలు ఖుష్బూ సందర్ కీలక బాధ్యతలు నిర్వహించానున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు. చదవండి: కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్! ఇందుకు గానూ ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మార్గదర్శక కమిటీ సభ్యురాలిగా నటి ఖుష్బూ బాధ్యతలను నిర్వహించానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఆమెతో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, విపుల్ అమృత్‌వాల్ షాకు కమిటీలో చోటు కల్పించారు. -
బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్
Samantha Blames Karan Johar For Unhappy Marriages In KWK 7 Season: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ షోతో ఫిల్మ్ మేకర్‌గానే కాకుండా మంచి హోస్ట్‌గా కరణ్ జోహార్ నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు 6 సీజన్లపాటు అలరించిన ఈ షో ఏడో సీజన్ రానున్నట్లు ఓ వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సీజన్లో పార్టిస్పేట్ చేసే సెలబ్రిటీలు, వారు చెప్పిన పలు ఆసక్తికర విషయాలను మరో ప్రోమో రూపంలో బయటకు ఒదిలాడు. ఇందులో భాగంగానే సమంత తన ఎపిసోడ్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కరణ్ జోహార్‌ను ఉద్దేశించి.. 'ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం' అని సామ్ అనగానే 'నేనేం చేశాను' అని కరణ్ అడగ్గా.. 'పెళ్లి చేసుకుంటే జీవితం కబీ ఖుషి కబీ ఘమ్ (K3G) సినిమాలా ఉంటుందని స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది KGF మూవీలా ఉంటుంది' అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సామ్‌తోపాటు ఈ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సీజన్లో 'కబీర్ సింగ్' జోడీ షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ, 'జుగ్ జుగ్ జియో' బృందం అనిల్ కపూర్, వరుణ్ ధావన్, 'లైగర్' జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే, బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ షో పూర్తి ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడూ వస్తాయా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. -
షారుక్ ఖాన్‌తో కరణ్ జోహార్ బెడ్ షేర్ చేసుకున్నాడంటూ వార్తలు!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తరచూ ఏదో ఒక వివాదంలో నలుగుతూ ఉంటాడు. గతంలో ఆయనమీద దారుణమైన వార్తలు కూడా వచ్చాయి. షారుక్ ఖాన్‌తో సన్నిహితంగా వ్యవహరించడంతో అతడు హీరోతో శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే ఈ రూమర్స్ తనను ఎంతగానో బాధించాయని బయోగ్రఫీలో రాసుకొచ్చాడు కరణ్. ఎన్ అన్‌సూటబుల్ బాయ్ పుస్తకంలో కరణ్ తన మనసును ఎంతగానో బాధించిన పుకార్ల గురించి ఓపెన్ అయ్యాడు. 'శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదు. అది ఎవరి విషయంలోనైనా వ్యక్తిగతమే. నా దురదృష్టం కొద్దీ నాకు, షారుక్‌కు శారీరక సంబంధం అంటగట్టారు. నేను అతడితో పడుకున్నాను అంటూ వచ్చిన వార్తలు చూసి చాలా షాకయ్యాను. ఒకసారైతే ఓ టీవీ ఛానల్ యాంకర్ నేరుగా ఆ ప్రశ్నను నా ముఖం మీదే అడిగాడు. అది విని నాకు పట్టరానంత కోపం వచ్చింది. నువ్వు నీ అన్నతో పడుకుంటావా? అని అడిగాను. అందుకతడు ఏంటి? ఏమంటున్నారు? అని ప్రశ్నించాడు. నన్నసలు ఆ ప్రశ్న ఎలా అడగాలనిపించిందని ఛీ కొట్టాను. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని పుకార్లు సృష్టించినా మా మధ్య మంచి అనుబంధం ఉంది. షారుక్ నాకు నాన్నలాంటివాడు, ఒక అన్నలాంటివాడు. అలాంటిది మా గురించి అసహ్యంగా మాట్లాడారు. షారుక్ ఎప్పుడూ ఈ పుకార్లను లెక్కచేయలేదు. 'వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. పెళ్లయ్యాక అక్రమ సంబంధం పెట్టుకోలేదంటే గే అని రాసేస్తారు. అవేం పట్టించుకోకు అని నాకు ధైర్యం చెప్పేవాడు'' అని రాసుకొచ్చాడు. చదవండి: హీరోకు ఖరీదైన స్పోర్ట్స్ కారు గిఫ్టిచ్చిన నిర్మాత రణ్‌బీర్ కపూర్ కారుకు యాక్సిడెంట్, అద్దాలు ధ్వంసం -
కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్‌షాట్స్ వైరల్
బీటౌన్ దర్శక నిర్మాతల్లో ప్రముఖంగా చెప్పుకునే వారిలో ఒకరు కరణ్ జోహార్. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ పేరిట తాజాగా నిర్మించిన చిత్రం 'జుగ్‌జుగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియరా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేందుకు రెడీ అయిన తరుణంలో తాజాగా నిర్మాత కరణ్ జోహార్‌కు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని రాంచీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే.. తను పంపించిన పాయింట్స్‌ను కాపీ కొట్టి 'జుగ్‌జుగ్ జీయో' సినిమాను నిర్మించారని రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 'బన్నీ రాణీ' అనే టైటిల్‌తో కొన్ని పాయింట్స్‌ను ధర్మ ప్రొడక్షన్స్‌కు పంపించినట్లు ఆయన తెలిపాడు. తర్వాత ఆ సంస్థ నుంచి రిప్లై కూడా వచ్చిందని, అయితే ఆ పాయింట్స్‌ను సినిమాగా రూపొందిస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్స్ తనతో చెప్పలేదని, తీరా చూస్తే ఆయన పాయింట్స్‌తో ఈ మూవీ వచ్చినట్లుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై రాంచీ కోర్టులో దావా వేశారు విశాల్. పిటిషన్ స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ తర్వాత ఇరువైపులా వాదనలు విని, కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో, లేదో చెబుతామని వెల్లడించింది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కరణ్ జోహార్ అధికారికంగా స్పందించలేదు. కాగా 'జనవరి 2020లో బన్నీ రాణీ టైటిల్‌తో కథ రిజిస్టర్ చేసుకున్నా. 2020 ఫిబ్రవరిలో సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం కోసం ధర్మ ప్రొడక్షన్స్‌కు మెయిల్ చేశా. నాకు రిప్లై కూడా ఇచ్చారు. తర్వాత వాళ్లు నా స్టోరీ తీసుకున్నారు. జుగ్‌జుగ్ జీయో సినిమాను తెరకెక్కించారు. ఇది సరికాదు కరణ్ జోహార్.' అని విశాల్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తోపాటు విశాల్ పంపించిన పాయింట్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్లో కలకలం రేపింది. ఈ మర్డర్‌ను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేష్ కాంబ్లే కూడా ఉన్నాడు. అయితే సిద్ధేష్ను విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హిందీ చిత్రపరిశ్రమలోని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను కిడ్నాప్ చేయాలని ఈ ముఠా అనుకుందట. కరణ్ జోహార్‌ను అపహరించి ఆయన నుంచి రూ. 5 కోట్లకుపైగా డబ్బు రాబట్టాలని ప్లాన్ వేశారట. ప్రస్తుతం ఈ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్‌కు పోలీసులు భద్రత కూడా పెంచారు. ఇంతకుముందు కూడా 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్‌ను టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: 👇 రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ -
రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్
Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఈ షోను ఇక కొనసాగించనని కరణ్ జోహార్ ప్రకటించి అభిమానులను షాక్‌గు గురిచేశాడు. కానీ తాజాగా ఆదివారం (జూన్ 19) ఈ షో 7వ సీజన్‌ను టెలీకాస్ట్ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. ఈ వీడియోలో రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, సైఫ్ అలీ ఖానా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితరులు ఉన్నారు. అలాగే ఈ టీజర్లో 'ఇప్పుడు రాబోయే సీజన్ మరింత పెద్దది, మెరుగైనది, ఇంకా మరింత అందమైనది' అని కరణ్ జోహార్ ఉత్సాహంగా చెప్పడం మనం చూడొచ్చు. కాపీ విత్ కరణ్ సీజన్ 7 ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి ప్రసారం కానుంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనున్న ముగ్గురు హీరోయిన్లు
‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో ముగ్గురు హీరోయిన్లకు అతిథులుగా ఆహ్వానం అందిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ‘గల్లీబాయ్’ వంటి సక్సెస్ ఫిల్మ్ తర్వాత హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (రాఖీ.. రాణీల ప్రేమకథ). కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే అతిథులుగా కనిపించనున్నారన్నది బీ టౌన్ టాక్. అంతేకాదు.. కొన్ని సీన్స్‌లో కూడా వీరు ఉంటారట. కరణ్ జోహార్ నిర్మించిన ‘ధడక్’లో జాన్వీ, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో అనన్యా పాండే, ‘సింబ’ చిత్రంలో సారా అలీఖాన్ హీరోయిన్లుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. సో.. కరణ్ రిక్వెస్ట్ మేరకు ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో జాన్వీ, సారా, అనన్యలు అతిథులుగా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండటం విశేషం. -
సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్
రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం ఇటీవల మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆదివారం (జూన్ 5న) రిలీజైన విరాట పర్వం ట్రైలర్ అందరి బాగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. యుద్ధం మధ్యలో ప్రేమకథ అనే కాన్సెప్ట్ కట్టిపడేసేలా అనిపిస్తోంది. చదవండి: లారెన్స్ భిష్ణోయ్ తెలుసు కానీ, గోల్డీ ఎవరో తెలియదు: సల్మాన్ దీంతో ఈ ట్రైలర్‌పై పలువురు సినీ స్టార్స్ స్పందిస్తూ తమ స్పందనను తెలుపుతున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్ సైతం ట్రైలర్‌పై స్పందించాడు. విరాట పర్వం ట్రైలర్ విడుదల చేసినట్లు రానా ట్వీట్ చేయగా.. ఈ ట్రైలర్ తనని బాగా ఆకట్టుకుందని, సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ రానా ట్వీట్‌కు రీట్వీట్ చేశాడు కరణ్ జోహార్. ‘ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది రానా. సినిమాను చూడడానికి ఎదురుచూస్తున్నాను. నువ్వు సూపర్. ఇంక నేను సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. చదవండి: అర్జున్ కపూర్ బాడీ షేప్‌పై ట్రోల్స్, ఘాటుగా స్పందించిన లవ్‌బర్డ్స్ This looks fantastic Rana!!!! Can’t wait to see it! Intense Raw and Rivetting!!! You are superb! And I am a huge @Sai_Pallavi92 fan! ❤️ https://t.co/FpvsbHQhQ2 — Karan Johar (@karanjohar) June 6, 2022 -
సాక్షి కార్టూన్: 07-06-2022
-
షారుక్‌కి కరోనా
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఇదే నెలలో హీరోలు ఆదిత్యారాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే మే 25న దర్శక–నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పార్టీ వేదికగానే బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారనే వార్తలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. గత నెలలో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారినపడి 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు హాజరుకాని విషయం తెలిసిందే. -
ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలికించేవి: ప్రధాని మోదీ
PM Narendra Modi Akshay Kumar Condolence On Singer KK Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 'కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.' అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్ జోహార్, సింగర్స్ ప్రీతమ్, జుబిన్ నటియాల్, ఆర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 Extremely sad and shocked to know of the sad demise of KK. What a loss! Om Shanti 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) May 31, 2022 Heartbreaking news on the sudden passing away of such an incredible talent…. RIP KK…💔 the entertainment world has lost a true artist today….Om Shanti 🙏 pic.twitter.com/SiKQutPJVO — Karan Johar (@karanjohar) May 31, 2022 In utter shock. Just heard about KK . Someone please tell me it's not true — Pritam (@ipritamofficial) May 31, 2022 Black year for Indian music. Lata didi, bappi da, sidhu paaji and now KK sir. These losses.. all of them feel so personal. — ARMAAN MALIK (@ArmaanMalik22) May 31, 2022 One and only . KK 😔 . — Jubin Nautiyal (@JubinNautiyal) May 31, 2022 My deepest sincerest condolences. His golden, soulful voice echoes in all our hearts. Rest in peace dear #KK🙏🏻💔 — Shreya Ghoshal (@shreyaghoshal) May 31, 2022 Singer KK never smoked or drank! Led the most simple non controversial non media hyped life. Complete family man. Jab bhi mujhe mile he met with so much of love & kindness. God! Too unfair! OM SHANTI. — RAHUL VAIDYA RKV (@rahulvaidya23) May 31, 2022 -
ప్రముఖ బాలీవుడ్ షోలో విజయ్ దేవరకొండ.. క్రేజ్ తగ్గేదేలే!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా విడుదల చేయలేదు. తాను నటించిన చిత్రలేవీ బాలీవుడ్లో హైప్‌తో విడుదల అవ్వలేదు. తాజాగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘లైగర్’. ఈ మూవీపై అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ షోలో కనిపించనున్నారు విజయ్, లైగర్ భామ అనన్య పాండే. బాలీవుడ్లో కొన్ని షోలు అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో ఒకటి కాఫీ విత్ కరణ్. కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి అక్కడ విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. అయితే ఈ షోకు ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి డార్లింగ్ ప్రభాస్, రానా మాత్రమే వెళ్లారు. వీరి తర్వాత విజయ్ దేవరకొండ ఈ లిస్ట్‌లో చేరనున్నాడు. దీనికి సంబంధించి ఈ షోలో పాల్గొన్నట్టు తెలియజేసే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. That signature - The Vijay Deverakonda #VijayDeverakonda #KaranJohar #koffeewithkaran #TeamDeverakonda pic.twitter.com/HmR9oSwA7K — Team Deverakonda (@TeamDeverakonda) May 29, 2022 చదవండి: Anchor Vishnu Priya: హీరోయిన్ అవ్వకుండానే చచ్చిపోతానేమోనని భయపడ్డా -
కరణ్ జోహర్ బర్త్‌డే బాష్.. మెరిసిన తారాలోకం (ఫొటోలు)
-
కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోహీరోయన్లు షారుక్ ఖాన్ కుటుంబంతో హాజరు కాగా.. కొత్త జంటలు కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్, రణ్‌బీర్-ఆలియా భట్లు సందడి చేశారు. చదవండి: పార్టీ టైమ్: ప్రియురాలితో హృతిక్, ప్రియుడితో హీరో మాజీ భార్య అలాగే కృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్, గౌరీ ఖాన్ తదితరులు హజరు కాగా.. దక్షిణాది నుంచి పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలు హాజరయ్యారు. ఈ పార్టీలో రష్మిక బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ పార్టీలో రష్మిక బ్లాక్ డ్రెస్‌లో అక్కడి రెడ్ కార్పెట్‌పై హోయలు పోతూ నడుస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక స్టన్నింగ్ లుక్కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే ఈ పార్టీలో విజయ్ సైతం బ్లాక్‌డ్రెస్‌లో రాగా తమన్నా పింక్ కలర్ సూట్లో దర్శనమచ్చింది. చదవండి: విడాకుల తర్వాత కలిసి పార్టీకెళ్లిన మాజీ దంపతులు కాగా మొదట కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీతా గోవిందం, భీష్మ, డియర్ కామ్రెడ్, పష్ప వంటి చిత్రాలతో సక్సెస్ అందుకుంది. తక్కవ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మికకు ఆ వెంటనే హిందీలో ఆఫర్ వచ్చింది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసిన ఆమె రణ్‌బీర్ కపూర్ సరసన ఎనియమల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో పాటు తమిళ హీరో విజయ్‌తో ఓ సినిమ చేస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gossip Girl💋👑 (@bolly_newzz) -
పార్టీ టైమ్: ప్రియురాలితో హృతిక్, ప్రియుడితో హీరో మాజీ భార్య
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ వంటివారికి సైతం ఆహ్వానాలు అందాయి. అటు బాలీవుడ్ హీరోహీరోయిన్లతో పాటు స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ సైతం హాజరయ్యారు. అంతేకాదు మాజీ దంపతులు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కలిసి ఫొటోలకు పోజులిస్తూ పార్టీలో సందడి చేశారు. అలాగే మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుశానే ఖాన్ వారి లవర్స్‌తో పార్టీలో తళుక్కుమని మెరిశారు. హృతిక్ ప్రేయసి సబా ఆజాద్‌ను వెంటేసుకుని రాగా, సుశానే తన ప్రియుడు అర్శ్లన్ గోనీతో విందుకు హాజరైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by kaunbolaabollywood (@kaunbolaa_bollywood) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి 👇 బంపరాఫర్, సామాన్యులకు బిగ్‌బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ విడాకుల తర్వాత కలిసి కనిపించిన మాజీ స్టార్ కపుల్ -
విడాకుల తర్వాత కలిసి పార్టీకెళ్లిన మాజీ దంపతులు
విడాకుల తర్వాత మరోసారి కలిసి దర్శనమిచ్చారు ఆమిర్ ఖాన్, కిరణ్‌రావు. ఆ మధ్య తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ బర్త్‌డేను కలిసి సెలబ్రేట్ చేసిన ఈ మాజీ దంపతులు తాజాగా నిర్మాత కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీలో కలిసి దర్శనమిచ్చారు. ఆమిర్ బ్లూ డ్రెస్‌లో రాయల్ లుక్‌లో కనిపిస్తే కిరణ్ రావు సిల్వర్ డ్రెస్సులో ధగధగ మెరిసిపోయింది. రెడ్ కార్పెట్‌పై కలిసి నిలబడ్డ ఈ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం గమనార్హం. ఇది చూసిన ఓ అభిమాని అదేంటి? వీళ్లు విడాకులు తీసుకోలేదా? అని ప్రశ్నించాడు. దీనికి ఇతర ఫ్యాన్స్ స్పందిస్తూ.. 'మీరింకా ఎదగాలి బాబూ.. వాళ్లు విడాకులు తీసుకున్నమాట వాస్తవమే. అంతమాత్రానికి ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? శత్రువులుగా మిగిలిపోవాలా? కాస్త బుద్ధిపెట్టి ఆలోచించండి', 'విడాకులు తీసుకున్నాక కూడా ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. పైగా పిల్లలు ఉన్నప్పుడు వారు స్నేహంగా మెదలడం అత్యవసరం. విడిపోయిన అందరూ బద్ధ శత్రువులు అవుతారనుకోవద్దు' అని సమాధానమిచ్చారు. కాగా గతేడాది ఆమిర్, కిరణ్ విడాకులు తీసుకున్నారు. ఆమిర్ సినిమాల విషయానికి వస్తే అతడు ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar.fan) చదవండి: కమెడియన్ కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ టాలీవుడ్లో విషాదం, ప్రముఖ నిర్మాత కన్నుమూత -
ముంబైలో కరణ్ బర్త్‌డే పార్టీ.. విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం!
ముంబైలో జరిగే ఓ గ్రాండ్ పార్టీలో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రోజు(మే 25) బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పుట్టిన రోజు. నేటితో ఆయన 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నేడు(బుధవారం) సాయంత్రం తన నివాసంలో గ్రాండ్ పార్టీని నిర్వహించాడు కరణ్. ఈ సందర్భంగా బాలీవుడ్‌కు చెందిన తారలతో పాటు లైగర్ టీం కూడా ఈ బర్త్‌డే పార్టీలో సందడి చేసింది. ఈ పార్టీకి లైగర్ హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ రష్మిక మందన్నాకు కూడా హాజరైంది. అయితే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే ఇన్విటేషన్ అందడం గమనార్హం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ పార్టీకి బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్, మలైకా ఆరోరా, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, సారా అలీ ఖాన్ రణ్‌బీర్ కపూర్, ఆయాన్ ముఖర్జీ, మనీశ్ మల్హోత్రా, రణ్వీర్ సింగ్, అనన్య పాండే పాల్గొన్నారు. చదవండి: లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన అలియా, కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో ఉన్న దీపికా పదుకొనెలు నేడు ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది నుంచి విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్నాకు ఆహ్వానం అందింది. ఇదిలా ఉంటే రష్మిక, విజయ్ దేవరకొండలు రిలేషన్లో ఉన్నారంటూ కొద్ది రోజుల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా విజయ్ హీరో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్లో కరణ్ జోహార్ నిర్మించాడు. (చదవండి: డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్) -
వివాదంలో కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘కరణ్ నా స్క్రిప్ట్ దొంగలించాడు’ అని ఓ రచయిత, ‘నా పాటను కాపీ కొంటాడు’ అని ఓ పాకిస్తాన్ సింగర్ ఆయనపై ఆరోపణలు చేశారు. కాగా కరణ్ జోహార్‌అప్‌కమింగ్ మూవీ ‘జగ్ జుగ్ జీయో’. ఇందులో వరుణ్ ధావన్, కియారా అద్వాని హీరోయిన్లు కాగా నీతూ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి దీనిపై సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యింది. చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా.. ఈ నేపథ్యంలో నిన్న(మే 22న) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమాను వివాదాలు చూట్టుముడుతున్నాయి. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ తనది అంటూ విశాల్ సింగ్ అనే ఓ రచయిత వరుస ట్వీట్స్ చేశాడు. ‘కరణ్ తెరకెక్కిస్తున్న జగ్ జుగ్ జీయో కథను ‘బన్నీరాణి’ పేరుతో జనవరి 2020లో రిజిస్టర్ చేసుకున్నాను. ఫిబ్రవరి 2022లో ధర్మప్రోడక్షన్‌కు ఈ కథ మెయిల్ చేసి మీతో కలిసి ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నాను నాకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరాను. దీనికి ధర్మ ప్రొడక్షన్ నుంచి కూడా నాకు సమాధానం వచ్చింది. కానీ, తీరా నా కథను జగ్ జుగ్ జీయో పేరుతో తెరకెక్కించారు. మాట ఇచ్చి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు కరణ్ జోహార్ గారు’ అంటూ అతడు మొదట ట్వీట్ చేశాడు. Screenshot of my mail to @DharmaMovies dated 17.02.2020. An official complaint will follow.@karanjohar @somenmishra0 @jun6lee #JugJuggJeeyo#BunnyRani@Varun_dvn @AnilKapoor @raj_a_mehta pic.twitter.com/k7WV4kvK2a — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 చదవండి: క్యాన్సర్ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి ఆ తర్వాత ధర్మ ప్రొడక్ష్‌న్‌కు అతడు చేసిన స్క్రిప్ట్ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశాడు. అనంతరం తనకు మద్దతు ఇవ్వాలని, ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోవాలంటూ వరుస ట్వీట్ చేస్తూ కరణ్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, అతని నిర్మాణ సంస్థ, ఇతర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని అతడు తెలిపాడు. మరోవైపు కరణ్ జోహార్ తన లేటెస్ట్ మూవీలో తన పాటకు కాపీ చేశారని పాకిస్తాన్ సింగర్ ఆరోపించాడు. సింగర్ అబ్రార్ ఊ హాకు గాయకుడు నిజానికి ‘జగ్ జుగ్ జీయో’లోని నాచ్ పంజాబన్ అనే పాట తనదని, ఈ పాటను ఆయన కాపీ చేశారని పేర్కొన్నాడు. కాగా చిత్రాన్ని రాజ్ మెహతా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్, వయాడాట్ 18 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. If this would have been for publicity..would have given statements to all publications that contacted me today. Chose to lay down the facts in public and let you all decide what is right and what is wrong? सच और साहस हो जिसके मन में अंत में जीत उसी की रहे!https://t.co/n1f8MW3VqT — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 Outcome of this matter will be a strong comment on the power of @swaindiaorg? If #HindiCinema industry has to flourish... @swaindiaorg has to be a strong body. Hope it's taking note of this matter..and ideally should act suo moto. Being a member..am bound to register a complaint. — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 -
హిందీ బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చిన కరణ్ జోహార్
బుల్లితెర ప్రేక్షకులకు ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ బ్యాడ్ న్యూస్ అందించాడు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇకపై ప్రసారం కాదని ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. కొన్నేళ్లుగా సెలబ్రెటీల చిట్‌చాట్‌తో బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతోన్న కాఫీ విత్ కరణ్ షో నెక్స్ట్ సీజన్ ఇక లేదని చెప్తూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు ఈ మేరకు బుధవారం(మే 4) ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్ షేర్ చేశాడు. ‘‘కాఫీ విత్ కరణ్’ షో మీ, నా జీవితంలో ఒక భాగమైపోయింది. అలా ఈ షో ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాం. పాప్ కల్చర్‌లోనే అతిపెద్ద షోగా గుర్తింపు పొందింది కాఫీ విత్ కరణ్. కానీ ఈ షో నెక్స్ట్ సీజన్‌ను తిరిగి ప్రసారం చేయలేకపోతున్నామని చెప్పడానికి మనసు ఒప్పుకోవడం లేదు’’ అంటూ కరణ్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో 7వ సీజన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని కరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ మూవీకి కీర్తి పేరును నేనే సిఫార్స్ చేశా, మహేశ్ కాదు: డైరెక్టర్ అంతేకాదు మేలో ఈ షో షూటింగ్ కూడా జరగనుందని చెప్పాడు. అంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా కరణ్ ఈ షోను తిరిగి ప్రారంభంచడం లేదని చెప్పి బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చాడు. కాగా ఈ షో ద్వారా బాలీవుడ్ స్టార్స్‌తో ముచ్చటిస్తూ వారికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటకు లాగుతూ ఎంటర్టైన్ చేసేవాడు కరణ్. ప్రస్తుతం ఆయన ‘రాఖీ ఔర్ రాణీ కీ కహానీ’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆలియా భట్, రణ్వీర్ సింగ్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్, వయోకామ్ 18 సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్నేఇ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల కరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆర్ఆర్ఆర్'తో థియేటర్లకు హుషారొచ్చింది
కోవిడ్ దెబ్బకు కుదేలైన సినిమా పరిశ్రమకు ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు జోష్ తీసుకొచ్చాయని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అంటున్నాడు. థియేటర్లకు తరలివస్తున్నట్టు ఆర్ఆర్ఆర్ నిరూపించడంతో తాము కూడా హుషారుగా రంగంలోకి దిగుతున్నామని తమ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి మరిన్ని భారీ చిత్రాలను ప్రేక్షకులు ఆశించవచ్చునని ‘కూ’ యాప్ వేదికగా బాలీవుడ్ చిత్రాభిమానులకు తీపి కబురు అందించాడు. ఈ మేరకు ఆయన కూ ద్వారా ఒక వీడియో కూడా పంచుకున్నాడు. నిశ్చలంగా మారిపోయిన ప్రపంచాన్ని థ్రిల్, యాక్షన్, రొమాన్స్ వంటి కధాంశాలు కదిలిస్తున్నాయని కరణ్ జోహార్ అభిప్రాయపడ్డాడు. కరణ్ జోహార్ నిర్మాతగా రూ.150కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర ఈ ఏడాది సెప్టెంబరు నెలలో విడుదల కానుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించారు. అలాగే రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీని కూడా కరణ్ రూపొందిస్తున్నాడు. Koo App The show went on, even when the world slowed down...with fascinating stories filled with thrill, love, action and so much more. It’s time to bring all of this to the big screens, with Dharma Productions! We’re coming back...to where the magic happens...BACK TO CINEMAS!🎬 View attached media content - Karan Johar (@karanjohar) 11 Apr 2022 -
నువ్ ఏడిచే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్
Kangana Ranaut Drags Karan Johar As Lock Upp Hits 200M Views: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ పలు విమర్శలు మూటగట్టుకుంది. అంతేకాకుండా ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను విమర్శించేందుకు కంగనా ఏ చిన్న అవకాశాన్ని కోల్పోదన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కరణ్‌పై కంగనా తనదైన శైలిలో సెటైర్ వేసింది. కంగనా హోస్ట్‌గా నిర్వహిస్తున్న రియాలిటీ షో 'లాకప్'. ఆది నుంచే వివాదలు ఎదుర్కొన్న ఈ షో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ షో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కంగనా. చదవండి: 'కంగనా సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలు' ఈ విజయం గురించి గొప్పగా చెబుతూ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేసింది. ఈ స్టోరీలో 'లాకప్ షో 200 మిలియన్ వ్యూస్ సాధించడంతో అతనితోపాటు కొంతమంది రహస్యంగా ఏడవబోతున్నారు. నువ్ ఏడిచే రోజు వచ్చేసింది పాపా జో' అంటూ రాసుకొచ్చింది కంగనా. అయితే ఈ 'పాపా జో' అనే మాట కరణ్ జోహార్‌ను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురితో కలిసి తన షోను కరణ్ నాశనం చేసేందుకు ప్రయత్నించడాని ఆమె బలంగా నమ్ముతుందని సమాచారం. వీరిద్దరి మధ్య శత్రుత్వం 2017లో ప్రారంభమైంది. కరణ్ టాక్ షో అయిన 'కాఫీ విత్ కరణ్' షోకు సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి కంగనా సందడి చేసింది. ఈ కార్యక్రమంలో 'నెపోటిజానికి సూత్రధారి', 'సినిమా మాఫియా లాంటివాడు' అని కరణ్‌పై అభిప్రాయం వ్యక్తం చేసింది కంగనా. తర్వాత నుంచి అనేక సమయాల్లో కరణ్‌పై కంగనా విమర్శలు చేస్తూ వస్తోంది. చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్ చదవండి: కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్.. వాటి విలువ ఎంతంటే? -
టాలీవుడ్‌ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి: కరణ్ జోహార్
తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. బాహుబలితో మొదలైన ఈ ప్రభంజనం ఆర్ఆర్ఆర్ వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ లెక్కలను బీట్ చేస్తున్నాయి. కేజీఎఫ్, సాహో, పుష్ప సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కొత్తగా ఆర్ఆర్ఆర్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న అగ్రదర్శక నిర్మాత కరణ్ జోహార్ దక్షిణాది సినిమాలను ఆకాశానికెత్తేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలని, రొటీన్ సినిమాలు కాకుండా కొత్త దారిని ఎంచుకోవాలని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్లో మూసధోరణి కొనసాగుతుంది. బయోపిక్స్ హిట్ అయితే అంతా ఆ తరహా సినిమాలను రూపొందిస్తాం. ఒకవేళ సందేశాత్మక సినిమాలు విజయం సాధిస్తే అవే కథల్ని ఎంచుకుంటాం. నాతో సహా దర్శక నిర్మాతలంతా పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే ఆలోచిస్తుంటాం. కానీ తెలుగులో అలా కాదు. తమ సొంత ఆలోచనలతో కథలు రూపొందిస్తున్నారు. అందుకే ఇటీవల వచ్చిన పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు బాలీవుడ్లో కూడా గొప్ప విజయాలు సాధిస్తున్నాయి అని పేర్కొన్నారు. -
ఆ బడా నిర్మాతకు మలయాళం రొమాంటిక్ మూవీ రైట్స్..
Karan Johar Acquire Malayalam Movie Hridayam Rights: ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఓ మలయాళం బ్లాక్ బ్లస్టర్ హిట్ మూవీ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ సినిమా ఏంటంటే.. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హృదయం' చిత్రం. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్, దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమా సోషల్ మీడియాతోపాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ మనసు గెలుచుకుంది ఈ మూవీ. దీంతో ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుుకన్నారు. సోషల్ మీడియా వేదికగా 'నేను మీతో ఈ వార్తను పంచుకోవడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ అండ్ ఫాక్స్ స్టార్ స్డూడియోస్ మలయాళం న్యూ ఏజ్ ప్రేమకథా చిత్రం హృదయం సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల హక్కులను పొందాయి.' అని కరణ్ జోహార్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రస్తుతం రణ్వీర్ సింగ్, అలియా భట్లు హీరోహీరోయిన్లుగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో జయా బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కూడా నటించున్నారని సమాచారం. I am so delighted and honoured to share this news with you. Dharma Productions & Fox Star Studios have acquired the rights to a beautiful, coming-of-age love story, #Hridayam in Hindi, Tamil & Telugu – all the way from the south, the world of Malayalam cinema. pic.twitter.com/NPjIqwhz8l — Karan Johar (@karanjohar) March 25, 2022 -
అఖిల్ అక్కినేనితో శ్రీదేవి కూతురు జాన్వీ జోడీ!
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో హిట్టు కొట్టిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ లుక్‌పై ఇప్పటికే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్న అఖిల్ ఇందులో 6ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. ఇక ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం అఖిల్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహార్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్‌కి జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని చూస్తున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. శ్రీదేవీ కూతురిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పటివరకు ఏ టాలీవుడ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు. త్వరలోనే తెలుగులో ఆమె ఎంట్రీ ఉండనున్నట్లు వార్తలు చక్కర్లు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు
Karan Johar Trolled By Netizens For His Tweet to Delhi CM Over Theatres Re-Open: సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ట్రోల్స్ సెగ తగలడం కొత్తేమి కాదు. పలువురు సినీ సెలబ్రెటీలు వారి తీరుతో సోషల్ మీడియాలో చేదు అనుభవాన్ని చవిచూస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు ట్రోల్స్ సెగ తగిలింది. అయితే సోషల్ మీడియాలో నెగిటివిటి తెచ్చుకోవడం కరణ్‌కు ఇదేం కొత్త కాదు. తరచూ ఆయన సోషల్ మీడియాల్లో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. తాజా కరోనా నేపథ్యంలో మూసి వేసిన థియేటర్లను తెరవాలంటూ ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. దీంతో కరణ్‌పై నెటిజన్లు ధ్వజమెతున్నారు. చదవండి: దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు వరసగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి కరణ్ ఇచ్చిన ఓ విందు పార్టీయే వేదిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధానిలో మరోసారి థియేటర్లు మూత పడ్డాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి థియేటర్లు మూసీవేయాలంటూ ఆదేశం ఇచ్చారు. దీంతో సీఎం నిర్ణయంపై స్పందిస్తూ కరణ్ జోహార్ ఇలా ట్వీట్ చేశాడు. ‘మిగతా చాల చోట్లతో పోలిస్తే సినిమా థియేటర్లో కరోనా వ్యాపించే అవకాశాలు తక్కువ. చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సొషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ బాక్సాఫీస్ నడపవచ్చు. అందుచేత తిరిగి థియేటర్లు ఒపెన్ చేయడానికి అనుమతి అవ్వండి’ అని కోరుతూ ఆయన ట్వీట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు కరణ్‌పై విరుచుపడుతున్నారు. మీ ట్వీట్ ఉద్దేశం ఏంటి.. మమ్మల్ని డబ్బులు సంపాదించుకోనివ్వండి. సామాన్యులు యాతన పడనివ్వండి అనేగా అంటూ కరణ్‌కు నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. కరణ్ చెబుతోన్న లాజిక్ ‘బాలీవుడ్ వర్సెస్ సైన్స్’ అంటూ వెక్కిరించారు. మరికొందరు ‘సినిమాల్ని ఓటీటీలో చూసుకోవచ్చు. థియేటర్స్ తెరిచి జనం ప్రాణాలతో ఆటలాడకండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. We urge the Delhi Government to allow cinemas to operate. Cinemas are equipped with better ability to ensure a hygienic environment while maintaining social distancing norms as compared to other out-of-home settings. @LtGovDelhi @ArvindKejriwal @OfficeOfDyCM #cinemasaresafe — Karan Johar (@karanjohar) December 30, 2021 -
బన్నీ స్టార్‌డమ్‌పై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ తగ్గేదే లే అంటోంది. డిసెంబర్ 17న విడుదలై పుష్ప రాజ్ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా రాబట్టాడు. ఇది బన్నీ సినిమా చరిత్రలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా చెప్పుకోవచ్చు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ ఊర మాస్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వివిధ భాషల్లో రిలీజ్ అయి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ పుష్ప సినిమా కలెక్షన్లు ఉదహరిస్తూ తెలుగు సినిమాల ప్రారంభ వసూళ్లను హిందీ చిత్రాలు కూడా అందుకోలేకపోతున్నాయని తెలిపాడు. 'ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు చిత్రాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో అందులో నటించిన నటులకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. దీన్ని ఎవరూ ఆపలేరు. అందుకే హిందీలో రిలీజైన పుష్ప సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీ సినిమాలు సైతం అతంగా వసూళ్లు సాధించలేకపోయాయి.' అని పేర్కొన్నాడు కరణ్ జోహార్. అంతేకాకుండా అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాతో బాలీవుడ్లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటికే పలువురు బీటౌన్ సెలబ్రిటీలు సినిమాపై, బన్నీ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ కూడా అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచెత్తాడు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ పుష్పకు అత్యధిక వసూళ్లు వచ్చాయని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పుష్ప మేకింగ్ వీడియో.. అలరిస్తున్న తెర వెనుక సన్నివేశాలు -
బహుశా..ఈ కలయిక దేవుడు నిర్ణయించినదేమో! – ఎన్టీఆర్
Jr NTR Comments RRR PreRelease Event: ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ బిగ్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘రామ్ చరణ్ అభిమానులందరికీ స్వాగతం. బహుశా..ఈ కలయిక (చరణ్‌తో తన కాంబినేషన్‌ను ఉద్దేశించి) దేవుడు నిర్ణయించినదేమో! రామ్ అంటే తారక్. చరణ్ అంటే రామ్‌చరణ్. అందుకే రామ్‌చరణ్ అభిమానులందరికీ స్వాగతం’’ అన్నారు ఎన్టీఆర్. అలాగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ సీక్వెల్ ‘భజరంగీ భాయిజాన్ 2’ను ప్రకటించారు. చదవండి: (ఆ వార్తల్లో నిజం లేదు, అప్పుడే ఆచార్య వచ్చేది) -
బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ లాంచ్ ఫోటోలు
-
బీ-టౌన్లో కరోనా కలకలం, కరోనా బారిన వరసగా సెలబ్రెటీలు, బీఎంసీ అలర్ట్
థర్డ్‌వేవ్‌పై ప్రజలంతా ఆందోళన చెందుతున్న తరుణంలో బాలీవుడ్లో కరోనా కలకలం రేపుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ విందు పార్టీ కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. కరణ్ హౌస్ పార్టీకి హాజరైన నలుగురు సెలబ్రిటీలకు వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కే3జీ(K3G) సినిమాకు 20ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కరణ్ జోహార్ డిసెంబర్ 8న తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఆ తెల్లారే నటుడు సౌహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఇదే పార్టీకి హాజరైన కరీనా కపూర్‌ఖాన్, అమృతా అరోరా కూడా పరీక్షలు చేయించుకున్నారు. వారికి కూడా వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. చదవండి: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్ వీరితోపాటు పార్టీలో పాల్గొన్న సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ కూడా వైరస్ బారిన పడ్డారు. కరణ్ నివాసంలో డిన్నర్ పార్టీకి హాజరైన వాళ్లలో అలియా భట్, కరిష్మా కపూర్, మలైకా అరోరా, అర్జున్‌కపూర్, డిజైనర్ మసాబా గుప్తా సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో వీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పార్టీ జరిగిన మరుసటి రోజే కరీనా కపూర్, అమృత అరోరా అనిల్ కపూర్ పెద్దకూతురు రియా కపూర్ నివాసంలో జరిగిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రియా హౌస్ పార్టీకి హాజరైన సెలబ్రిటీలు కూడా సెల్ఫ్ ఐసోలేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే కరణ్ జోహార్‌కు మాత్రం కొవిడ్ నెగెటివ్ వచ్చినట్టు సమాచారం. చదవండి: పార్టీలతో హల్చల్.. బీటౌన్‌లో కరో(రీ)నా టెన్షన్ ఇక బాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అప్రమత్తమైంది. పాజిటివ్ వచ్చిన వారికి ఎవరెవరూ క్లోజ్‌గా కాంటాక్ట్స్ అయ్యారో వారిని వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ఈ మేరకు కరీనా అపార్ట్మెంట్లో బీఎంసీ అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్ సహా పలువురికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్టు తెలిసింది. అలాగే కరణ్ జోహార్, కరీనా కపూర్, అమృతా అరోరా నివాసాలను బీఎంసీ సిబ్బంది శానిటైజ్ చేశారు. వాటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి పాజిటివ్ వచ్చిన వారిని ఎవరూ కాంటాక్ట్ అయ్యారో వారిని ట్రెసింగ్ చేసే పనిలో బీఎంసీ పడింది. -
ఏడేళ్ల తర్వాత మళ్లీ డైరెక్టర్‌గా.. చిత్రం విడుదల తేది ప్రకటన
Rocky Aur Raniki Prem Kahani: ఏడేళ్ల సుధీర్ఘ కాలం తర్వాత మళ్లీ 'లైట్స్ ఆఫ్, రోలింగ్, యాక్షన్' అని చెప్పబోతున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' సినిమాతో మరోసారి దర్శకత్వం వహిస్తున్నందుకు ఉత్సాహంగా ఉన్నారు. అలియా భట్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమా విడుదల తేదిని నవంబర్ 29న కరణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లు జూలైలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వీడియో షేర్ చేస్తూ రొమాన్స్ డ్రామా ఫిబ్రవరి 10, 2023న రానున్నట్లు పోస్ట్ చేశారు. ఆ పోస్టులో '7 సుధీర్ఘ సంవత్సరాల తర్వాత నేను ఇక్కడకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా తర్వాతి చిత్రం 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' కుటుంబ విలువలతో కూడిన ప్రేమకథ ఫిబ్రవరి 10, 2023న విడుదలవనుంది. థియేటర్లలో పూర్తి వినోదాత్మక చిత్రంతో మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాం.' అని రాసుకొచ్చారు కరణ్. ఈ చిత్రంలో షబానా అజ్మీ, జయ బచ్చన్, ధర్మేంద్ర కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2021 (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాల్లో తారల సందడి
-
రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..!
సౌత్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కెరీర్ మెల్లిగా బాలీవుడ్‌లోనూ స్పీడందుకుంటోంది. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్‌లను (షాహిద్ హీరోగా ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగన్ ‘రుద్ర’) పూర్తి చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఓ లీడ్ క్యారెక్టర్‌కి రాశీ ఖన్నా అవకాశం దక్కించుకున్నారని టాక్. ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తీస్తారని తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో రాశీ కమిట్ అయిన వార్త నిజమే అయితే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లే. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణంగా కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి ‘యోధ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని బీ టౌన్ ఖబర్. ఇక సౌత్‌లో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, కార్తీ ‘సర్దార్’ చిత్రాల్లో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
కరణ్ జోహార్ ఇంటర్వ్యూ.. అలియా క్యూట్ క్యూట్ సమాధానాలు
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ షూటింగ్ విరామ సమయంలో అలియా భట్‌తో సరదాగా చేసిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వీడియోను కరణ్ జోహార్ ఇన్‌స్టాగామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో కరణ్ జోహార్ హోస్ట్‌గా ఉండి అలియాను రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ వీడియోలా కరణ్ మనం ఇప్పుడూ షుటింగ్ చేస్తున్నాం అవునా అంటే దానికి అలియా అవును రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ" షూటింగ్ అంటూ తడబడుతూ సమాధానం ఇస్తుంది. రాకీ ఎక్కడ ఉన్నాడు అని అలియాను కరణ్ ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి అలియా రాకీ వర్కవుట్‌లో ఉన్నాడంటోంది. ఇలా ప్రశ్నల పరంపర జరుగుతుండగా ఒకచోట అలియా టంగ్ స్లిప్ అవ్వడంతో ఆటపట్టిస్తాడు. అంతేకాదు ఈ వీడియోలో తనకు సక్సెస్ సాధించిన వ్యక్తులను చూడటం ఇష్టమని, పైగా కరణ్‌కి పద్మశ్రీ అవార్డు వచ్చిన క్షణం తను ఎంతగానో సంతోషించనంటూ అలియా వెల్లడిస్తోంది. దీంతో నెటిజన్లు కరణ్ హోస్ట్‌గా అలియాను ఇంటర్వ్యూ చేసే విధానం నచ్చిందంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల
2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘పద్మ’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. చిత్రసీమ నుంచి తమ తమ విభాగాల్లో సేవలు అందిస్తున్న నటి కంగనా రనౌత్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, సంగీత దర్శకుడు అద్నన్ సమి, నేపథ్య గాయకుడు సురేష్ వడ్కర్, సీనియర్ నటి సరితా జోషి ‘పద్మశ్రీ’ అవార్డులు అందుకున్నారు. పద్మం దక్కిన వేళ.. ఆనంద హేలలో పురస్కార గ్రహీతలు ఈ విధంగా స్పందించారు. ఆలస్యంగా వచ్చినా ఆనందమే – సురేష్ వాడ్కర్ ‘‘కాస్త అలస్యంగా వచ్చినప్పటికీ నా దేశం నన్ను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఏ కళా కారుడికైనా ఈ పురస్కారం చాలా గొప్పది. సంగీత ప్రపంచంలోమరింత ముందుకు వెళ్లడానికి ఈ పురస్కారం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని 66 ఏళ్ల సురేష్ వాడ్కర్ అన్నారు. హిందీ, మరాఠీ భోజ్‌పురి భాషల్లో పాడారు సురేష్. ‘సద్మా’లో ‘ఏ జిందగీ గలే లగా లే’, ‘పరిందా’లో ‘తుమ్ సే మిల్కే’ , ‘ప్యాసా సావన్’లో ‘మేఘా రే.. మేఘా రే..’ వంటి పాటలు పాడారు వాడ్కర్. ఈ క్షణాలు గుర్తుండిపోతాయి – కరణ్ జోహార్ ‘‘ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా అమ్మ, నా పిల్లలు, నా ప్రొడక్షన్ కంపెనీలా నా మనసులో ఈ పురస్కారం అలా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు కరణ్ జోహర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కల్ హో నా హో’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కరణ్ జోహార్. అలాగే ‘దోస్తానా’, ‘2 స్టేట్స్’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. నమ్మలేని క్షణం – ఏక్తా కపూర్ ‘‘ఇదొక గొప్ప గౌరవం. నమ్మలేని క్షణం... అలాగే గర్వకారణం. నాకు రెండు పిల్లర్లలా నిలిచిన మా అమ్మానాన్న (శోభ, జితేంద్ర కపూర్)లకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. వాళ్లిద్దరూ నన్ను పూర్తిగా నమ్మడంవల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబం, స్నేహితులు, మా బాలాజీ టెలీ ఫిలింస్ టీమ్, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ దేశానికి తిరిగి ఇవ్వాలన్నది నా ఆలోచన. మరింతమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తాను’’ అన్నారు ఏక్తా కపూర్. టీవీ రంగంలో దూసుకెళుతున్న ఏక్తా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ది డర్టీ పిక్చర్’, ‘షూట్ అవుట్ అట్ వడాలా’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ ప్రేమవల్లే ఇంతదాకా... – అద్నన్ సమీ ‘‘నాకింత గొప్ప పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే భారతదేశ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకుల అభిమానం వల్లే నా ప్రయాణం ఇంతదాకా వచ్చింది’’ అన్నారు అద్నాన్ సమీ. హిందీలో పలు పాటలు పాడిన అద్నన్ తెలుగులో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ‘ఏ జిల్లా..’, ‘వర్షం’లో ‘నైజామ్ పోరి..’, ‘జులాయి’లో ‘ఓ మధు..’ వంటి పాటలు పాడారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటి సరితా జోషి (80) ఆరు దశాబ్దాలుగా గుజరాతీ, మరాఠీ, హిందీ, మర్వారీ భాషల్లో 15 వేలకు పైగా షోస్‌లో భాగమయ్యారు. అలాగే ‘పరివార్’, ‘గురు’, ‘సింబా’, ‘రూహీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఆ నోళ్లు మూతపడతాయనుకుంటున్నాను ‘‘ఒక ఆర్టిస్టుగా నేను ఎన్నో అవార్డులు పొందగలిగాను. కానీ ఓ ఆదర్శనీయమైన పౌరురాలిగా ప్రభుత్వం నన్ను గుర్తించి ‘పద్మశ్రీ’ అందించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు నాకు సక్సెస్ రాలేదు. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెషల్సాంగ్స్, సౌందర్య లేపనాల ఉత్పత్తులను గురించిన ప్రకటనలను కాదనుకున్నాను. జాతీయ అంశాలను గురించి నేను పలుసార్లు నా గొంతు విప్పాను. అందువల్ల ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నాను. జాతీయ అంశాలను గురించి ప్రస్తావిస్తోంది అని నన్ను విమర్శించేవారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనుకుంటున్నాను’’ అన్నారు. ‘క్వీన్’, ‘తనువెడ్స్ మను’ ఫ్రాంచైజీ, ‘తలైవి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ నిర్మాతగానూ రాణిస్తున్నారు. – కంగనా రనౌత్ -
అల్లు అర్జున్‌పై బాలీవుడ్ డైరెక్టర్ల ప్రశంసలు, ఎందుకంటే..
Director Rohit Shetty And Karan Johar Reacts On Allu Arjun Comments Over Indian Movie Industries: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత ప్రశంసలు కురిపించారు. బుధవారం జరిగిన వరుడు కావలెను ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథీగా హజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే మహమ్మారి ప్రభావం తగ్గడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు థియేటర్లోకి వస్తున్నారని పేర్కొన్నాడు. ఇప్పటి నుంచి భారత సినీ పరిశ్రమలో అన్ని పెద్ద పెద్ద సినిమాలే రాబోతున్నాయన్నాడు. అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలని ఆశించాడు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు భారత సినీ పరిశ్రమలను ఉద్దేశించి బన్నీ వ్యాఖ్యలపై హందీ సూర్యవంశీ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి, నిర్మాత కరణ్ జోహార్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ట్వీట్ చేస్తూ బన్నీకి ధన్యవాదాలు తెలిపారు. ‘‘సినిమా అనేది నా ఒక్కడిదే కాదు. మనందరిదీ’ ఈ మాటనే నేను ఎక్కువగా నమ్ముతాను. మా చిత్రానికి విషెస్ తెలిపినందుకు థాంక్యూ బ్రదర్. మీరు నిజంగా రాక్‌స్టార్’ అలాగే మీరు నటించిన ‘పుష్ప’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని రోహిత్ ట్వీట్ చేయగా దీనికే ‘థ్యాంక్యూ బన్నీ.. నువ్వు నిజంగానే సూపర్‌స్టార్’ అని కరణ్ జోహార్ రీట్వీట్ చేశాడు. చదవండి: Allu Arjun : ఇండస్ట్రీలో అన్ని విభాగాల్లోకి మహిళలు రావాలి.. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో తెలుగులో ‘‘వరుడు కావలెను, రొమాంటిక్’, తమిళ్లో రజనీకాంత్‌గారి ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగీ 2’, హిందీలో ‘సూర్య వంశీ’.. సినిమాలు విడుదలవుతున్నాయి.. అన్ని సినిమాలూ హిట్ అవ్వాలి’’ అని హీరో అల్లు అర్జున్ ఆశించాడు. అలాగే ఈ డిసెంబరు 17న ‘పుష్ప’ తో తాము వస్తున్నామని, ఈ మూవీ అందరికి నచ్చాలని కోరుకుంటున్నాన్నాడు. ఇక ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బన్నీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ దీపావళికి భారతీయ సినిమా మునుపటిలా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉందని అల్లు అర్జున్ ధీమా వ్యక్తం చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్ "As I said earlier, it’s not my film, it’s OUR film…Thank you for the love and support my brother. Wish you ALL THE BEST FOR PUSHPA 🤗@alluarjun you are a ROCKSTAR🔥🔥🔥" - Rohit Shetty Come #BackToCinemas and witness the world of #Sooryavanshi on 5th November. pic.twitter.com/MMke5RV1tl — Dharma Productions (@DharmaMovies) October 27, 2021 -
బాలీవుడ్లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్ట్ చేయనున్న కరణ్ జోహార్..?
Karan Johar To Direct Yuvraj Singh Biopic: ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్‌లకు ఎనలేని ఆదరణ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన భారత క్రికెటర్ల బయోపిక్స్ మాత్రం తెరకెక్కింది మూడు మాత్రమే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ల నిజ జీవితాల ఆధారంగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడని, ఈ మేరకు యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని తెలుస్తోంది. కరణ్ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని బీటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలను కాదని కరణ్.. కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతున్నాడని సమాచారం. యువీ గతంలో హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరో ఒకరు తన బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ.. కరణ్ కొత్త కుర్రాడు సిద్ధార్థ్ చతుర్వేదిని పరిచయం చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. సిద్ధార్థ్.. యువీతో దగ్గరి పోలికలు కలిగి ఉంటాడని, అందుకే యువీని ఒప్పించి మరీ అతన్ని ఎంపిక చేశాడని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేసి.. గంగూలీ బయోపిక్ కంటే ముందే రిలీజ్ చేయాలని కరణ్ ప్లాన్ చేస్తున్నాడట. చదవండి: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..! -
నెట్‌ఫ్లిక్స్, కరన్‌జోహార్ బంధానికి ఎండ్‌కార్డ్
Karan Johar Ended His Deal With Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన లస్ట్ స్టోరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. లస్ట్ స్టోరీస్‌తో మొదలైన బాలీవుడ్ ఏస్ డైరెక్టర్ కరణ్ జోహార్ , నెట్‌ఫ్లిక్స్ బంధానికి తెరపడింది. 2019 నుంచి ఇండియాలో మార్కెట్ విస్తరణలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఒరిజనల్ కంటెంట్ అందించేందుకు కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్‌తో 2019లో జత కట్టింది. దీని ప్రకారం ధర్మా ప్రొడక్షన్ హౌజ్‌కి చెందిన ధర్మాన్ నుంచి వచ్చే అన్ని వెబ్ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లోనే ప్రసారం చేయాల్సి ఉంటుంది. లస్ట్ స్టోరీస్ కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్ ఒప్పందంలో భాగంగా వచ్చిన లస్ట్ స్టోరీస్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్‌కి చందాదారుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. మొత్తంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఈ రెండు సంస్థలు రెండేళ్ల పాటు పని చేశాయి. ఇక చాలు రెండేళ్ల కాంట్రాక్టు ముగిసిన తర్వాత దాన్ని పొడిగించేందుకు కరణ్ జోహార్ ఆసక్తి చూపించలేదు. తమ ధర్మ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చె వెబ్ సిరస్‌లను ఒకే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కే పరిమితం చేసేందుకు ఆయన సుముఖంగా లేరు. దీంతో రెండేళ్ల పాటు కలిసి చేసిన ప్రయాణానికి పులిస్టాప్ పెట్టేశారు. మరోవైపు ధర్మా ప్రొడక్షన్ హౌజ్‌కి సంబంధించిన సినిమాలు ఎక్కువగా అమెజాన్ ప్రైమ్‌వీడియోస్, డిస్నీ హాట్‌స్టార్‌లో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. విస్తరిస్తున్న ఓటీటీ ఇండియాలో ఓటీటీ మార్కెట్ శర వేగంగా విస్తరిస్తోంది. లీడింగ్‌లో ఉన్న అమెజాన్ ప్రైమ్‌కి ప్రస్తుతం 1.80 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉండగా ఈ ఏడాది చివరి నాటికి 2.10 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2021 డిసెంబరు నాటికి 46 లక్షల మంది చందాదారులున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాన్ని 55 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హాట్‌స్టార్, జీ 5, సోనీ, వూట్, ఆల్ట్ బాలాజీలు సరైతం చందాదారులను ఆకట్టుకునేందుకు వెబ్ సిరీస్, కొత్త సినిమా రిలీజ్‌పై దృష్టి పెట్టాయి. లాభసాటి వ్యవహారం ఓటీటీలకు యూత్ మహారాజ పోషకులుగా ఉన్నారు. దీంతో యూత్‌ను ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు నిర్మించే సంస్థలకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో ఒక్కో వెబ్ సిరీస్‌ని ఒక్కో ఓటీటీ ప్లాట్ఫార్మ్పై రిలీజ్ చేయడం ద్వారా ఇటు ఆర్థికంగా లాభసాటిగా ఉండటంతో పాటు బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుందనే యోచనలో కరణ్ జోహార్ ఉన్నారు. అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌కి బై చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చదవండి : సమంతకు నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్.. వైరల్ అవుతోన్న రెమ్యునరేషన్! -
బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌గా దివ్య, ఎంత గెలుచుకుందంటే?
బిగ్‌బాస్ ఓటీటీ షో గ్రాండ్‌గా ముగిసింది. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో బుల్లితెర నటి దివ్య అగర్వాల్ విజేతగా అవతరించింది. శనివారం(సెప్టెంబర్ 18)న జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో దివ్య బిగ్‌బాస్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. నిషాంత్ భట్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. షమితా శెట్టి, రాకేశ్ బాపత్, ప్రతీక్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ స్పెషాలిటీ ఏంటంటే? హిందీలో బిగ్‌బాస్ 14 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో 15వ సీజన్ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సీజన్ రావడానికి ముందే ప్రయోగాత్మకంగా బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ వూట్లోనే ప్రసారమైంది. ఏడు వారాలపాటు ప్రసారమైన ఈ షోను మినీ బిగ్‌బాస్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో బిగ్‌బాస్ ఓటీటీ టైటిల్ గెలుచుకున్న దివ్య బిగ్‌బాస్ 15వ సీజన్లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. అదే సమయంలో ప్రతీక్.. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 15వ సీజన్లో పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎవరీ దివ్య అగర్వాల్ దివ్య అగర్వాల్ విషయానికొస్తే ఆమె నటి, డ్యాన్సర్. MTV స్ప్లిట్స్‌విల్లా 10వ సీజన్లో పాల్గొన్నప్పుడు ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అంతేకాదు, ఈ సీజన్లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. MTV ఏస్ ఆఫ్ స్పేస్ 1లో పాల్గొని విజేతగా అవతరించింది. రియాలిటీ షోస్ క్వీన్ దివ్య ద ఫైనల్ ఎగ్జిట్ అనే సినిమాలోనూ నటించింది. గతంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక శర్మతో పీకల్లోతు ప్రేమ వ్యవహారంతో ఆమె మరింత హైలైట్ అయింది. ప్రస్తుతం ఆమె ఖత్రోన్ కీ ఖిలాడీ 11వ సీజన్ ఫేమ్ వరుణ్ సూద్‌తో డేటింగ్ చేస్తున్నట్లు భోగట్టా! View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
రష్మిక ధరించిన చీర, ఉంగరం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ అని అర్థమవుతోందా? ఈ నేషనల్ క్రష్ మనసు దోచి ఆమె వార్డ్‌రోబ్‌లోకి చేరిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. త్యానీ బై కరణ్ జోహార్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత కరణ్ జోహార్ నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తన అద్భుతమైన ఆలోచనతో సూపర్ హిట్ సినిమాలనే కాదు, అందమైన ఆభరణాలకూ రూపకల్పన చేయగలడని నిరూపించాడు. నిదర్శనం 2017లో ప్రారంభించిన ‘త్యానీ బై కరణ్ జోహార్ జ్యూయెలరీ’. బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఈ ఆభరణాలు ఎంతోమంది సెలబ్రిటీల ఫేవరెట్. చూడటానికి ఈ ఆభరణాల మెరుపు రాత్రివేళ ఆకాశంలో మెరిసే నక్షత్రాలను తలపిస్తే, వీటి ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తాయి. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: త్యానీ బై కరణ్ జోహార్ నెక్‌పీస్ ధర : రూ. 2,86,300 ఉంగరం ధర: రూ. 97,610 అశ్విని రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. టాప్‌మోస్ట్ ఫ్యాషన్‌గా డిజైనర్‌గా ఎదిగింది. బీటెక్ తర్వాత ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తయ్యాక, ఇటలీలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో స్పెషలైజేషన్ చేసింది అశ్విని రెడ్డి. 2009లో తన పేరు మీదే హైదరాబాద్‌లో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించింది. వెస్టర్న్ లుక్కు సంప్రదాయ శైలితో కూడిన ఎంబ్రాయిడరీ జోడిస్తూ ఎన్నో కలెక్షన్స్‌ను రూపొందించింది. కొద్దిరోజుల్లోనే ఆమె డిజైన్స్ పాపులర్ కావడంతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. 2018 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించిన ‘తిలోత్తమ కలెక్షన్స్’తో ఆమె ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ డిజైనర్ అంటే ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది అనుకోకండి. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. చీర డిజైనర్ : అశ్విని రెడ్డి ధర: రూ. 48,000 ►షాప్‌కి వెళ్లి, సెలక్ట్ చేసుకుని, ట్రై చేయడం.. నాకు చాలా కష్టం. కన్ఫ్యూజ్ అయిపోతా. అందుకే, ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను – రష్మిక మందన్నా. -దీపిక కొండి చదవండి: Pooja Hegde: ‘బుట్టబొమ్మ’ డ్రెస్ మరీ అంత ఖరీదా?! -
బిగ్‌బాస్: ఈసారి టీవీలో కాదు.. హోస్ట్‌ను మార్చేశారు..
ముంబై : ప్రముఖ రియాలిటీ షోలలో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లోనూ బిగ్‌బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇక హిందీలో ఇప్పటికే 14 సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో త్వరలోనే 15వ సీజన్లోకి అడుగుపెడుతుంది. అయితే ఈ సీజన్‌ను మాత్రం మేకర్స్ మరింత కొత్తగా ప్లాన్ చేశారు. బిగ్‌బాస్ పేరు నుంచి కంటెస్టెంట్స్ ఎంపీక వరకు ఎన్నో మార్పులు తెచ్చిన మేకర్స్ బిగ్‌బాస్ హోస్ట్‌ని కూడా మార్చేశారు. గత 11 సీజన్లకు హోస్ట్‌గా షోను ఎంతగానో రక్తికట్టించిన సల్మాన్ ఖాన్ స్థానాన్ని ఇప్పుడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ భర్తీ చేయనున్నారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 15కి హోస్ట్‌గా కరణ్ వ్యవహరించనున్నారు. అయితే ఇది సీజన్ మొత్తానికి కాదు. కేవలం తొలి ఆరు వారాలకు గాను కరణ్ హోస్ట్‌గా చేయనున్నారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్స్ నేరుగా టీవీలో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్(voot)లో 24×7 ప్రసారం కానుంది. ఆగస్టు 8నుంచి ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. మరో విశేషం ఎంటంటే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక నుంచి ప్రతివారం వారికి ఇచ్చే టాస్క్‌ల వరకు ప్రతిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని సమాచారం. ఇక బిగ్‌బాస్ ఓటీటీలో ప్రసారం కానున్న తొలి ఆరు వారాల ఎపిసోడ్‌కు గాను హోస్ట్‌గా సిధార్థ్ శుక్లా, ఫరా ఖాన్, రోహిత్ శెట్టి వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా మేకర్స్ కరణ్ జోహార్‌ను సీజన్15 హోస్ట్‌గా ప్రకటిస్తూ ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ స్పందిస్తూ..'బిగ్‌బాస్ షోకి నేను, మా అమ్మ పెద్ద ఫ్యాన్స్. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తాం. అంతేకాకుండా నేను ఎప్పటికైనా బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయాలని మా అమ్మ కోరిక. అది ఇప్పుడు నెరవేరుతుంది. గతంలో ఎన్నో షోలకు హోస్ట్‌గా చేయడాన్ని ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా చేయడం మరింత ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది' అంటూ పేర్కొన్నారు. ఇక ఓటీటీలో ప్రసారం అయ్యే తొలి ఆరు వారాల ఎపిసోడ్లకు మాత్రమే కరణ్ హోస్టుగా ఉంటాడనీ, అనంతరం 'కలర్స్' టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్లకు మాత్రం మళ్లీ యథావిధిగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తాడని సమాచారం. -
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు ఐకాన్ అవార్డు
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ బాక్సాఫీసుకు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ధర్మప్రొడక్షన్‌లో స్వయంగా ఎన్నో సినిమాలు నిర్మించాడు. ఆయన ఇండియన్ సినీ పరిశ్రమకు చేసిన కృషిగాను లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎల్ఐఎఫ్ఎఫ్) ఐకాన్ అవార్డుతో సత్కరించింది. లండన్ వేదికగా గతవారం ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమం చివరిలో కరణ్ జోహార్‌తో పాటు బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆసిఫ్ కపాడియా ఈ ఐకాన్ ఆవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించారు. అలాగే హీరోయిన్ శృతి హాసన్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌లకు ఎల్ఐఎఫ్ఎఫ అవుట్ స్టాడింగ్ ఎచీవ్మెంట్ అవార్డు దక్కడం విశేషం. -
రణ్వీర్ సింగ్.. వీడు నిజంగానే తేడా సింగ్
యాక్టింగ్‌తో పాటు యాటిట్యూడ్.. యాక్టర్స్ నుంచి ఇప్పటి జనరేషన్ కోరుకునేది ఇదే. ఆ లక్షణాలతో వందకు వంద శాతం పూర్తిగా న్యాయం చేస్తున్న ఏకైక బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. తన విచిత్రమైన మేనరిజంతో.. నటనలో వేరియేషన్స్‌తో అతని ఫ్యాన్స్‌లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాడు రణ్వీర్. ఇవాళ రణ్వీర్ 36వ పుట్టినరోజు... బాంద్రాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జగ్జీత్ సింగ్ భవ్నాని కొడుకే ఈ రణ్వీర్ సింగ్. స్కూల్ రోజుల్లోనే అల్లరిని అవపోసన పట్టిన రణ్వీర్.. పేరు పొడుగ్గా ఉందనే ఉద్దేశంలో భవ్నానిని లేపేసుకున్నాడు. కాపీరైటర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆపై మోడలింగ్ అటు నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టాడు రణ్వీర్ సింగ్. ఎక్స్ రేటెడ్(అడల్ట్) మ్యాగజైన్స్‌ను తెగ ఇష్టపడే రణ్వీర్.. అవకాశాల కోసం తొలినాళ్లలో బాగానే కష్టపడ్డాడు. అయితే ఆరంభంలోనే మూడు పెద్ద సినిమాల అవకాశాలు వచ్చాయి. కానీ, బ్యాండ్ బాజా బరాత్ కోసం ఇచ్చిన కమిట్మెంట్కు కట్టుబడి వాటిని వదిలేసుకున్నాడు. ఫ్యాన్స్ ఫేవరెట్ కోస్టార్స్‌కి మాత్రమే కాదు.. అభిమానులకూ రణ్వీర్ సింగ్ అంటే ఒక ఎనర్జీ. ఈవెంట ఏదైనాసరే ఎప్పుడూ రెడ్‌బుల్ తాగినోడిలా ఎనర్జిటిక్‌గా ఉంటూ సందడి చేస్తుంటాడు. ఫ్యాన్స్‌కు అతనొక ఫ్రెండ్లీ స్టార్. ఎవరైనా ‘సర్ మీ అభిమాని’ని అని చెబితే చాలు.. ఆప్యాయంగా వాళ్లను వాటేసుకుని ఫొటోలు దిగుతుంటాడు రణ్వీర్. అంతేకాదు ఎందరికో ఆర్థిక సాయం అందించాడు. చెప్పాపెట్టకుండా అభిమాల పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరై ఆశ్చర్యపరుస్తుంటాడు. అభిమానుల మానసిక ఆనందమే తనకు ముఖ్యమని చాలాసార్లు ప్రకటించాడు ఈ యంగ్ హీరో. ఖిల్జీగా క్రూరత్వం కెరీర్ మొదట్లో రణ్‌వీర్‌ది చిచ్చొర యాక్టింగ్ అనే ముద్రపడిపోయింది. కానీ, తనలోని వేరియెన్స్ను క్రమంగా బయటపెడుతూ అలరిస్తూ వచ్చాడు. దిల్ దడక్నే దో(2015) రణ్వీర్ నటనకు తొలిగా ప్రశంసలు దక్కేలా చేసింది. గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలాలోని అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ నటనను మెచ్చి బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్.. రణ్వీర్ను పొడుగుతూ స్వదస్తూరితో రాసిన లేఖను పంపాడు. ఇక బాజీరావ్ మస్తానీలో నటనకు బెస్ట్ యాక్టర్ ఫిల్మ్‌ఫేర్ అందుకున్న రణ్వీర్.. పద్మావత్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ రోల్‌తో క్రూరత్వాన్ని పండించి అందరినీ మెప్పించాడు. సింబా, గల్లీబాయ్ సక్సెస్‌ల తర్వాత ‘83’ లాంటి బయోగ్రాఫికల్ స్పోర్స్ డ్రామా ద్వారా, అపరిచితుడు రీమేక్‌తో తన కెపాసిటీని చూపించేందుకు రెడీ అయ్యాడు. లవ్ యూ దీప్‌వీర్ కెరీర్లో, బయట క్రేజీగా కనబడే రణ్వీర్.. ఫ్యామిలీ విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటాడు. పేరెంట్స్, అక్క మధ్య అల్లరిగా పెరిగిన రణ్వీర్.. ఎఫైర్ల విషయంలోనూ ఓపెన్‌గానే ఉంటాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల వెంటపడి చిల్లరగా వ్యవహరించానని ఓపెన్‌గానే ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నాడు రణ్వీర్. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టాక హేమా మాలిని చిన్న కూతురు అహానాతో మొదట డేటింగ్ చేశాడు. ఆ తర్వాత దీపికా పదుకొనేతో ప్రేమాయాణం.. అభిమానుల అనుమానాల మధ్యే వాళ్ల వాళ్లిద్దరూ ఒక్కటైపోవడం.. ఆప్యాయంగా సాగుతున్న దీప్‌వీర్ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీడు హీరోనా?:కరణ్ రణ్వీర్ తొలి మూవీ ‘బ్యాండ్ బాజా బారాత్’(2010). రణ్వీర్ను యశ్‌రాజ్ స్టూడియో దగ్గర తొలిసారి చూసిన బాలీవుడ్ సీనియర్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్ ‘వీడేం హీరో’ అనుకున్నాడట. ఇక ఈ సినిమా పోస్టర్ చూసి ‘వీడు హీరో అయితే ఈ సినిమా ఎవడు చూస్తాడు’ అనుకున్నాడంట. అంతేకాదు నిర్మాత ఆదిత్యా చోప్రాతో ఈ విషయంపై చర్చించాడట కూడా. ఇక బలవంతంగా ఆ సినిమా చూశాక.. తన అభిప్రాయం మార్చుకున్నాడనని, రణ్వీర్ విషయంలో మూర్ఖంగా ఆలోచించాననే విషయం అప్పుడు అర్థమైందని కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు కరణ్. ఇప్పుడు అదే కరణ్ డైరెక్షన్లో కొత్తగా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. అలియాభట్‌తో పాటు జయాబచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర ఇందులో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మీమ్ కంటెంట్ రణ్వీర్.. సోషల్ మీడియాలో ఒక మీమ్ స్టఫ్. యాక్టింగ్ కంటే రణ్వీర్ జనాలకు ఎక్కువగా దగ్గరైంది ఈ యాటిట్యూడ్‌తో. విచిత్రమైన అతని అటిరే(డ్రెస్సింగ్ విధానం), వేషధారణలు మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ చర్చగా మారుతుంటాయి. ఫ్యాషన్ విషయంలో అతనొక ట్రెండ్ సెట్టర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, ఆ ట్రెండ్‌ను ఫాలో కావాలంటే కొంచెం గట్స్ కూడా ఉండాలి. అంతెందుకు కండోమ్ యాడ్‌లో యాక్ట్ దమ్మున్న హీరో రణ్వీర్ మాత్రమేనేమో!. సెటైర్, వరెస్ట్.. ఇలా ఎన్ని కామెంట్లు వినిపించినా.. విమర్శలు చుట్టుముట్టినా రణ్వీర్ మాత్రం మారడు. పైగా ఈ కోణాలన్ని ఉన్నందునే ఈ యంగ్ ఫైనెస్ట్ యాక్టర్‌ను ‘తేడా సింగ్’గా చూస్తూ.. ఆదరిస్తూ వస్తున్నారు అశేష అభిమానులు. -
బ్రిటీష్ రాజుతో పోరాడిన లెజెండ్‌పై సినిమా
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితం వెండితెరకు రానుంది. ‘ది ఆన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శంకరన్ నాయర్’ బయోపిక్కు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించనున్నారు. ‘‘జలియన్ వాలాబాగ్ మారణకాండ’ వెనకాల దాగి ఉన్న నిజాలను దాచాలనుకున్న ఓ బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడిన లెజెండ్ శంకరన్ నాయర్ జీవితంతో సినిమా తీయడం గౌరవంగా భావిస్తున్నాను. శంకరన్ మనుమడు రఘు, అతని భార్య పుష్ప కలిసి రాసిన ‘ది కేస్ దట్ షూక్ ద ఎంపైర్’ బుక్ ఆధారంగా ఈ చిత్ర కథనం ఉంటుంది. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాత కరణ్ జోహార్. చదవండి: Narappa: వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ -
‘సుశాంత్ సింగ్‌కు పట్టిన గతే తనకు పట్టిస్తారు’
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ని దోస్తానా 2 సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యింది. అయినప్పటికి కార్తీక్‌ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కావాలనే కార్తీక్‌ను సినిమా నుంచి తొలగించారని.. అతడికి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని పలువురు ప్రముఖులు బహిరంగంగానే ప్రకటించడమే కాక కార్తీక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనుభవ్ సిన్హా, రైటర్ అపూర్వ అస్రానీ కార్తీక్ ఆర్యన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘‘నిర్మాతలు నటులను తప్పించినప్పుడు వారు దాని గురించి మాట్లాడరు. ఎప్పుడు ఇదే జరుగుతుంది. కార్తీక్ ఆర్యన్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని నాకు తెలిసింది. ఇది చాలా అన్యాయం. నేను తన మౌనాన్ని గౌరవిస్తున్నాను’’ అంటూ అనుభవ్ సిన్హా ట్వీట్ చేశారు. And by the way... when Producers drop Actors or vice versa they don't talk about it. It happens all the time. This campaign against Kartik Aryarn seems concerted to me and very bloody unfair. I respect his quiet. — Anubhav Sinha (@anubhavsinha) June 3, 2021 అపూర్వ అస్రానీ దీన్ని రీట్వీట్ చేస్తూ.. ‘‘అనుభవ్ సిన్హాను నేను గౌరవిస్తున్నాను. కార్తీక్‌కు వ్యతిరేకంగా చాలా స్పష్టమైన ప్రచారం జరుగుతుందని తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు ఎదుర్కొంటున్న బెదిరింపులు గురించి నేను బ్లాగ్ చేశాను. దాంతో చాలా మంది జర్నలిస్ట్‌లు నన్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. మంచి కోసం ఏదైనా మారుతుందని నేను భావిస్తున్నాను’’ అంటూ అపూర్వ అస్రానీ. I respect Anubhav Sinha for calling out the very obvious campaign against #KartikAaryan. A year ago I had blogged about the bullying Sushant Singh Rajput went through. And though I remain blacklisted for it by many journalists, I feel like something IS changing for the better.✊ https://t.co/8DbWRtLGa7 — Apurva (@Apurvasrani) June 4, 2021 కార్తీక్ ఆర్యన్ తొలగింపుపై ధర్మ ప్రొడక్షన్ స్పందించింది. కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతోనే తనను తొలగించామని తెలిపింది. కొల్లిన్ డీ కున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దోస్తానా 2ని తిరిగి డైరెక్ట్ చేయనున్నాం. త్వరలోనే దీని గురించి అధికారకి ప్రకటన చేస్తాం అని తెలిపింది. చదవండి: సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు -
రవిశంకర్ బయోపిక్: 100 దేశాలు.. 21 భాషలు
బాలీవుడ్లో బయోపిక్‌లకు కొదవలేదు. ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్‌లు తెరపైకి వచ్చాయి. క్రికెటర్ మిథాలీ రాజ్, చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆధ్యాత్మిక వేత్త ఓషో వంటి వారి బయోపిక్‌లు కూడా రానున్నాయి. తాజాగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీవితం వెండితెరపైకి రానుంది. గురువారం (మే 13) రవిశంకర్ బర్త్ డే సందర్భంగా ఈ బయోపిక్‌ను ప్రకటించారు ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఈ చిత్రానికి ‘ఫ్రీ (స్వేచ్ఛ అని అర్థం కావొచ్చు): ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్’ అని టైటిల్ పెట్టారు. ‘‘గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీవితం ఆధారంగా తీయనున్న ఈ సినిమా ద్వారా పాజిటివ్‌నెస్‌ని పెంపొందించాలన్నదే మా ఆలోచన. ఈ చిత్రానికి మాంటో బస్సి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని 21 భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో రిలీజ్ చేస్తాం’’ అని ట్వీట్ చేశారు కరణ్ జోహార్. -
పట్టాలెక్కని కరణ్-జాన్వీ సినిమా.. ఏమైందంటే...
కరణ్‌జోహార్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త సినిమా కూడా ఆగిపోలేదట. గత ఏడాది ఫిబ్రవరిలో తన దర్శకత్వంలో ‘తక్త్’ అనే సినిమాని ప్రకటించారు కరణ్ జోహార్. దానిలో జాన్వీకపూర్‌ది ఓ కీలకపాత్ర. కానీ ఆ చిత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమీ పెడ్నేకర్ తదితర భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ‘తక్త్’ ఆగిందనే వార్తలకు స్పందిస్తూ – ‘‘ఆగలేదు... చిన్న బ్రేక్ పడింది.. అంతే’’ అని కరణ్ జోహార్ అన్నారు. -
సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దోస్తానా 2' సినిమా నుంచి అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ వార్త అతడి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగం పూర్తైంది. అయితే కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతో కరణ్ జోహార్ ఆ హీరోను అర్ధాంతరంగా తొలగించాడని అంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులోనూ అతడితో సినిమాలు తీయకూడదని కరణ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. అసలు కరోనా సమయంలో షూటింగే కష్టమంటే.. ఇప్పుడు సగం పూర్తైన సినిమాలో మరో కొత్త హీరోను తీసుకుని మళ్లీ మొదటి నుంచి షూటింగ్ మొదలు పెట్టడం తలకు మించిన భారంగా మారనుంది. అయినప్పటికీ హీరోను రీప్లేస్ చేయడానికే ధర్మ ప్రొడక్షన్స్ నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన సైతం జారీ చేసింది. కాగా 2008లో వచ్చిన సూపర్ హిట్ సినిమా దోస్తానాకు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. 2019 నవంబర్లోనే షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కానీ గతేడాది లాక్డౌన్ వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. గత రెండు వారాలుగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ సడన్‌గా హీరో సైడ్ అయిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే బేధాభిప్రాయాల వల్ల కార్తీకే ఈ సినిమా నుంచి వైదొలగాడన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు కార్తీక్‌ను దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పోల్చుతున్నారు. సినిమా అవకాశాలు ఇచ్చినట్లే ఇచ్చి చేజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ కిడ్స్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టరు కానీ ఇలా అవుట్‌సైడర్స్(సినీ రంగానికి చెందనివారు)ను మాత్రం ఆ లిస్టులో చేరుస్తారని నిప్పులు చెరుగుతున్నారు. pic.twitter.com/NaohVGnjvp — Dharma Productions (@DharmaMovies) April 16, 2021 చదవండి: లంబోర్గిని కారు కొన్న కుర్ర హీరో, ధర ఎంతంటే? -
విజయ్ దేవరకొండ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ భామ అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. ఈ చిత్రాన్ని మాస్ దర్శకుడు పూరీ జగన్నాద్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన కొన్ని అప్‌డేటస్ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన మరో అప్డేట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేగాక నిర్మాత కరణ్ జోహార్, చార్మీలు సైతం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. మంగళవారం కరణ్ జోహార్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్, ఆయన టీమ్‌ను ‘లైగర్’ సినిమా కోసం ఎంపిక చేశామని మీతో చెప్పడానికి చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాం. గతంలో జాకీ చాన్ లాంటి ప్రముఖ నటులకు ఆయన కొరియోగ్రఫి అందించారు. అలాంటి ఆయన మా సినిమాకు పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. అంతేగాక ఈ ట్వీట్‌కు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీల ఫొటోను జత చేశాడు. ఇక హాలీవుడ్లో టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అండీ లాంగ్ అసలు పేరు ఆండ్రియాస్ నుయెన్. జాకీ ఛాన్ నటించిన ‘ఆర్మూర్ ఆఫ్ గాడ్ 3’, ‘చైనీస్ జోడాయిక్’, ‘పోలీస్ స్టోరీ 2013’, ‘డ్రాగన్ బ్లేడ్’ చిత్రాలకు ఆయన పనిచేశారు. 2006లో ‘మ్యాగ్ ఫైటర్స్ అనే స్టంట్ టీమ్‌ను ప్రారంభించారు. కాగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతుంది. ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Thrilled to have the famous Hollywood stunt choreographer #AndyLong & team, who have previously choreographed the powerful moves for Jackie Chan and many other films, onboard for #LIGER! Some action packed moves are on the way!!@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh pic.twitter.com/3WhOARa4EI — Karan Johar (@karanjohar) April 6, 2021 -
అక్క జాన్వీనే ఫాలో అవుతున్న ఖుషీ.. త్వరలోనే..
సినిమా ఇండస్ట్రీలో వారసులను పరిచయం చేసేందుకు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. బాలీవుడ్లో అయితే వారసులను పరిచయం చేయడానికి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మంది వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఆయన తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి–నిర్మాత బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ను హీరోయిన్ గా హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నారని టాక్. శ్రీదేవి–బోనీ కపూర్ల పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ను తమ ధర్మా ప్రొడక్షన్స్‌పై ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశారు కరణ్ జోహార్. త్వరలో కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఖుషీ. ఇప్పుడు ఖుషీని పరిచయం చేసే బాధ్యతను కూడా కరణే తీసుకున్నారట. ధర్మా –కార్నర్‌స్టోన్ ఏజెన్సీ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్న ఆయన ఈ బ్యానర్లో ఖుషీ కపూర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. -
ఏందయ్యా ఇది, పేపర్ చుట్టుకున్నావా?
బాలీవుడ్ సెలబ్రిటీల్లో హీరో రణ్వీర్ సింగ్‌ను ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకుంటారు. ఎప్పుడూ ట్రెండ్‌ను ఫాలో అవడమే కాక అప్పుడప్పుడు ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాడీ హీరో. అయితే కొత్త లుక్స్‌తో, కొంగొత్త వెరైటీ డ్రెస్సులతో నిర్మాత కరణ్ జోహార్ అతడికి తరచూ కాంపిటీషన్ ఇస్తుంటాడు. తాజాగా ఈ ప్రొడ్యూసర్ ఓ వైవిధ్యమైన బట్టలు ధరించాడు. న్యూస్‌పేపర్ ప్రింట్ వేసి ఉన్న షర్ట్‌ను ధరించాడు. దానికి జోడీగా బ్లాక్ ట్రాక్ ప్యాంట్స్ వేసుకున్నాడు. అయితే సెలబ్రిటీలు ఏం చేసినా దాన్ని ఇట్టే పట్టేసుకునే నెటిజన్లు కరణ్ డ్రెస్సింగ్ గురించి జోకులు పేలుస్తున్నారు. అతడు నిజంగానే పేపర్ చుట్టుకున్నట్లే ఉందని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది చినిగిపోవడం ఖాయంగా కనిపిస్తోందంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మరికొందరు అది నిజంగానే వార్తాపత్రికే అని భ్రమపడి ఎందుకీయన పేపర్ కప్పుకున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరణ్ ఈ డ్రెస్సులో మనీష్ మల్హోత్రా నివాసంలో పార్టీకి హాజరయ్యాడు. ఈ పార్టీలో బీటౌన్ సెలబ్రిటీలు కరీష్మా కపూర్, మలైకా అరోరా, అమృత అరోరా, మహీప్ కపూర్, సీమా ఖాన్, గౌరీ ఖాన్ తదితరులు హాజరయ్యారు. చదవండి: అజయ్ దేవ్‌గణ్ కారును అటకాయించిన దుండగుడు శ్యామ్ కె. నాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు -
ప్రియుడితో బాలీవుడ్ బ్యూటీ చెట్టాపట్టాల్!
అందరూ ఒకేలా ఉండరు. బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు తమ పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో చెప్పుకునేందుకు ఎల్లప్పుడూ రెడీ ఉంటారు. మరికొందరు మాత్రం వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచేందుకే సుముఖత చూపుతారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రెండో రకానికి చెందుతుంది. సహ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఏడాది నుంచి వార్తలు వినిపిస్తునే ఉన్నాయి, కానీ ఆమె దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో గత నెలాఖరున బాంద్రాలోని సిద్ధార్థ్ నివాసానికి వెళ్తూ కియారా కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది. కానీ ఈసారి కియారా ఏకంగా ప్రియుడిని వెంటేసుకుని నిర్మాత కరణ్ జోహార్ ఇంటికి వెళ్లింది. ఆదివారం కరణ్ తన కవలలు యశ్, రూహిల బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పుట్టినరోజు వేడుకలకు లవ్ బర్డ్స్‌కు ఆహ్వానం అందడంతో వీరు జంటగా కలిసి వచ్చారు. పార్టీ అనంతరం రాత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వీరితో పాటు కరీనా కపూర్, గౌరీ ఖాన్, రాణీ ముఖర్జీ, నేహా ధూపియా సహా పలువురు సెలబ్రిటీలు సైతం కరణ్ ఇంట్లోని వేడుకకు హాజరై సందడి చేశారు. ఇదిలా వుంటే కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. దీనికి విష్ణువర్దన్ దర్శకత్వం వహించగా కరణ్‌జోహార్ సహనిర్మాతగా వ్యవహరించాడు. చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఇంటికి హీరోయిన్! ప్రతిభ ఉంటే అవకాశాలొస్తాయి: కృతిక కమ్రా -
దిల్జిత్.. కరణ్ పెంపుడు జంతువు: కంగన
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కంగనకు, నటుడు, సింగర్ దిల్జిత్ దోసంజ్‌కి మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. అతడిని కరణ్ జోహర్ పెంపుడు జంతువు అంటూ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగన.. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు మహిళను ఉద్దేశించి.. షాహీన్ బాగ్ దాదీలలో ఒకరైన బిల్కిస్ బానుగా భావించి.. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తప్పుగా ట్వీట్ చేయడంతో నెజిటనులు కంగనపై విరుచకుపడ్డారు. వెనకా ముందు చూసుకోకుండా.. ట్విట్ చేస్తే ఇలానే అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, సింగర్ దిల్జత్ దోసంజ్ క్వీన్ హీరోయిన్ని ఉద్దేశించి ‘కంగన.. బిల్కిస్ బానుగా ట్వీట్ చేసిన మహిళ ఈమె.. పేరు మహిందర్ కౌర్. కంగన టీమ్ ఈ నిజం వినండి. ఎవరూ ఇంత గుడ్డివాళ్లలా ఉండకూడదు. ఆమె(కంగన) ఏమైనా చెప్తూనే ఉంటారు’ అంటూ మహీందర్ కౌర్ మాట్లాడిన వీడియోను కూడా ట్వీట్ చేశారు దిల్జిత్. దీనిపై కంగనా మండిపడ్డారు. దిల్జిత్‌ని కరణ్ పెంపుడు జంతువు అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దిల్జిత్ ట్వీట్‌పై స్పందిస్తూ కంగన.. ‘ఓ కరణ్ జోహర్ పెంపుడు జంతువు.. షాహీన్ బాగ్‌లో తన పౌరసత్వం కోసం నిరసన చేసిన దాదీ.. ఇప్పుడు రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తోన్న ఆందోళనలో కేవలం వంద రూపాయల కోసం వచ్చి కూర్చున్నది. మహీందర్ కౌర్ జీ ఎవరో నాకు తెలియదు. మీరంతా ఏం డ్రామాలు ఆడుతున్నారు.. వెంటనే ఆపేయండి’ అంటూ విరుచుకుపడ్డారు కంగనా. (చదవండి: కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!) Ooo Karan johar ke paltu, jo dadi Saheen Baag mein apni citizenship keliye protest kar rahi thi wohi Bilkis Bano dadi ji Farmers ke MSP ke liye bhi protest karti hue dikhi. Mahinder Kaur ji ko toh main janti bhi nahin. Kya drama chalaya hai tum logon ne? Stop this right now. https://t.co/RkXRVKfXV1 — Kangana Ranaut (@KanganaTeam) December 3, 2020 ఇక ఎంఎస్ మహీందర్ కౌర్‌ని చూసి బిల్కిస్ బాను అనుకోని కంగనా ట్వీట్ చేసినందుకు లీగల్ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 'ఫ్యాక్ట్ చెక్' అనే ఆన్లైన్ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు. -
మా అభిమాన భార్య కరణ్ జోహార్యే..!
ముంబై: బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రోడక్షన్లో నిర్మించిన ‘ది ఫ్యాబులస్ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ సిరీస్ గత శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ రియాలిటీ షోలో ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యలు కథానాయికలకు నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటొంది. ఇందులో సోహై ఖాన్(సల్మాన్ ఖాన్ సోదరుడు) భార్య సీమా ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రసారమైన నాలుగవ ఎపీసోడ్‌లో సీమా-సోహైల్ ఖాన్‌లను నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షో నిర్మాత కరణ్ జోహార్ కూడా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అది చూసిన కరణ్ తనదైన శైలీలో ట్రోలర్‌కు సమాధానం ఇచ్చాడు. (చదవండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!) Ok this really made me laugh! 🤣 A troll with a sense of humour is so refreshing! Thanks Doc! https://t.co/nuelRifxzI — Karan Johar (@karanjohar) November 29, 2020 అయితే ఈ వెబ్ సిరీస్‌పై డాక్టర్ అఖిలేష్ గాంధీ అనే ట్విటర్ యూజర్ కరణ్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఫ్యాబులస్ లైప్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్లో మన అభిమాన భార్య కరణ్ జోహార్ అని మనమంతా అంగీకరించక తప్పదని నా అభిప్రాయం’ అంటూ కామెంట్ చేశాడు. అది చూసిన కరణ్ సదరు నెటిజన్ కామెంట్‌పై స్పందిస్తూ.. ‘ఓకె నీ ట్వీట్ నిజంగా నన్ను నవ్వించింది. ఈ ట్రోల్ నన్ను రీఫ్రెష్ చేసింది. ధన్యవాదలు మిస్టర్ డాక్టర్’ అంటూ కరణ్ చురకలు అట్టించారు. కాగా కరణ్ జోహార్, అపూర్వ మెహతాలు కలిసి ‘ది ఫ్యాబులస్ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ రియాలిటీ షోను రూపొందించారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటులు సోహైల్ ఖాన్ భార్య నీలం ఖాన్, సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్, చుంకీ పాండే భార్య భావన పాండే, సమీర్ సోనీ భార్య నీలం కొఠారీలు నటిస్తున్నారు. -
రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!
ముంబై: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తాజా రియాలిటీ షో ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యల నిజ జీవితంగా ఆధారంగా ఈ రియాలీటీ షో తెరకెక్కుతోంది. ఈ షోలో కథానాయికలుగా మహీప్ కపూర్, నీలం కొఠారి సోని, భావన పాండేలతో పాటు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్లు నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం టెలికాస్ట్ అయిన తొలి ఎపీసోడ్ ప్రేక్షకులను కన్ఫ్యూజన్లోకి నెట్టెసింది. అయితే ఈ షో తొలి ఎపీసోడ్‌లో సోహైల్ ఖాన్.. భార్య సీమా ఖాన్ ఇంటికి వచ్చినట్లు చూపించారు. సోహైల్ వచ్చాడని అనుకుంటూ అని సీమా అనుకుంటుంది. దీంతో సీమా, సోహైల్‌లు ఎందుకు వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారని అని నెటిజన్లలో అనుమానం మొదలైంది. వీరిద్దరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతేగాక నాలుగవ ఎపిసోడ్లో ఆమె పెద్ద కుమారుడు నిర్వాన్ కూడా వస్తాడు. అతను కొత్తగా రెనోవెట్ చేసిన సీమ ఇంటిని పరిశీలిస్తుంటాడు. ఈ నేపథ్యంలో సీమా నిర్వాన్‌తో.. ‘నువ్వు ఎక్కువ సమయంలో నాతోనే ఉండాలని కొడుకును కోరుతుంది. దీంతో నిర్వాన్ రోజు నిన్ను చూడటానికి వస్తూనే ఉంటాను అమ్మ ’అని చెప్పడంతో నెటిజన్ల మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (చదవండి: నువ్వు చేసింది అనైతికం..) ఇక నిర్వాన్ తనతో ఉండడు అని సీమా బాధపడుతుంటే అతడు ‘నేను సముద్రాల అవతల నివసించడం లేదమ్మ.. అమ్మ పక్క వీధిలోనే ఉంటున్నాను’ అని సీమాతో చెబుతాడు. దీంతో ‘‘నేను నిర్వాన్‌ను ఎప్పుడూ చూడలేను. అతను ఎక్కవగా తన తండ్రితోనే కలిసుంటాడు. కేవలం ఇక్కడ నిద్రపోతాడంతే. నిర్వాన్ విషయంలో నన్ను అంత్యంత బాధించే విషయాలలో ఇది ఒకటి’’ అని సీమా కెమారా ముందు వాపోతుంది. దీంతో నెటిజన్లు సీమా-సోహైల్ ఖాన్లు విడిపోయారా అని సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వారిద్దరూ కలిసి లేనప్పుడు ఆమెను బాలీవుడ్ వైఫ్ అని పిలవడం సరైనదేనా అంటూ నెటిజన్ ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేగాక ఓ సన్నివేశంలో సీమా.. సోహైల్‌ను సంప్రదాయా వివాహం చేసుకోలేదని చెబుతుంది. ‘అంటే వారికి వివాహం కాలేదా?.. వారిద్దరూ సహాజీవనం చేస్తున్నారా? అలాంటప్పుడు సీమా బాలీవుడ్ వైఫ్ కాదు కదా’ అంటూ నెటిన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యల లైఫ్‌స్టైల్‌ను తెరపై చూపించే నేపథ్యంలో నిర్మాత కరణ్ జోహార్ ‘ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. (చదవండి: ఆమె ‘ఆది పురుష్’ సీత.. త్వరలో ప్రకటన!) -
23 ఏళ్ల తర్వాత మళ్లీ అతనితో
మాధురీ దీక్షిత్ నటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి.. ‘నటి’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంటీ అంటే... ఆమె నటించనున్న తాజా వెబ్ సిరీస్ టైటిల్ ‘యాక్ట్రెస్’ (నటి). ఈ సిరీస్‌లో మాధురి టైటిల్ రోల్లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కుతోంది. విశేషం ఏంటంటే.. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ ఈ సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే సినిమా ‘రాజా’. 1995లో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్. ఆ తర్వాత ‘మొహబ్బత్’ (1997) సినిమాలో మళ్లీ కలసి నటించారు. ఇన్నేళ్లకు మళ్లీ కలసి నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ జరుగుతోంది. -
అది నా సినిమా టైటిల్.. ఇచ్చేయ్
సాక్షి, ముంబై: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ మధ్య కాలంలో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర విమర్శలు నెటకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నెపోటిజానికి కారణం కరణ్ జోహార్ అని ఆయనపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇటీవల గోవాలో జరిగిన షూటింగ్లో భాగంగా పేరుకుపోయిన చెత్తను కరణ్ ధర్మ ప్రొడక్షన్ సిబ్బంది సమీప గ్రామంలో చెత్త విసిరేసి వెళ్లడంపై గోవా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మ ప్రొడక్షన్ సిబ్బంది బాధ్యత రహితంగా ప్రవర్తించారని పేర్కొంటూ ధర్మ ప్రొడక్షన్‌పై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు మధుర్ భండార్కర్.. కరణ్ తన టైటిల్‌ను వాడుకున్నారని ఐఎమ్‌పీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేగాక దీనిపై ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘బాలీవుడ్ వైవ్స్’ అనే పేరుతో తను సినిమాను రూపొందిస్తున్నానని.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని చెప్పారు. అయితే ఈ టైటిల్‌ను కరణ్ తన వెబ్ సిరీస్‌కు వాడుకున్నారని ఆరోపించారు. (చదవండి: కరణ్ జోహార్ క్షమాపణలు చెప్పాల్సిందే) ‘డియర్ కరణ్ జోహార్ మీరు, అపూర్వ మెహతా బాలీవుడ్ వైవ్స్ అనే నా సినిమా టైటిల్ మీ వెబ్ సిరీస్ కోసం అడిగారు. అయితే అప్పటికే నా సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో మీకు ఆ టైటిల్ ఇచ్చేందుకు నిరాకరించాను. కానీ మీ వెబ్ సిరీస్‌కు ‘దిఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అది నా సినిమా టైటిల్. దీనిని మీరు వాడుకోవడం అనైతికం. దయచేసి ఆ టైటిల్‌ను మర్చాలని మిమ్మల్ని వెడుకుంటున్నాను’ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేగాక కరణ్, అపూర్వ మెహతాలపై ఇండియన్ మోషన్ పిక్చర్ అసోషియేషన్‌కు(ఐఎమ్‌పీఆర్)కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన ఐఎమ్‌పీఆర్ కరణ్, మెహతాలకు నోటీజుసులు జారీ చేసి దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇంతవరకు కరణ్, మెహతాలు దీనిపై స్పందించకపోవడం గమనార్హం. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యల లైఫ్‌స్టైల్‌ను తెరపై చూపించే నేపథ్యంలో కరణ్ ‘ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) Dear @karanjohar U & @apoorvamehta18 had asked me 4 the title #BollywoodWives for web,which I refused,as my project is underway. It is Morally & ethically wrong u to tweak it to #TheFabulousLivesofBollywoodWives. Pls do not dent my project. I humbly request u to change the title. — Madhur Bhandarkar (@imbhandarkar) November 20, 2020 -
మళ్లీ మేజిక్!
థియేటర్లు ఆరంభమయ్యాయి. 50 శాతం సీటింగ్‌తో ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టేంత ఉంది. ఈ నేపథ్యంలో ఒక భారీ సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంటుందేమోననే ఆలోచన చాలామందికి ఉంది. మరి.. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ కూడా ఇలానే ఆలోచించారేమో. ‘బాహుబలి’ రెండు భాగాలను మళ్లీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మళ్లీ మేజిక్ జరగబోతోంది’’ అంటూ ఈ శుక్రవారం తొలి భాగం, వచ్చే శుక్రవారం మలి భాగాన్ని థియేటర్లు ఆరంభమైన రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
నలుగురిదీ ఒక్కటే మాట..
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో జరుపుతున్న విచారణలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చేతికి కీలక విషయాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌లు ఎన్సీబీకి చెప్పిన విషయాలు దాదాపు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. ‘హ్యాష్’ మత్తు పదార్థం కాదనే విషయాన్నే వీరు నలుగురూ చెప్పినట్లు సమాచారం. అయితే, ఇదే విషయం వీరిని మరిన్ని చిక్కుల్లోకి నెట్టే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. దీంతోపాటు, వీరు కీలక సమాచారాన్ని ఎన్సీబీ అధికారుల ఎదుట బయటపెట్టినట్లుగా సమాచారం. దీని ఆధారంగా ఈ హీరోయిన్లను మరోసారి ప్రశ్నించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా, సమీర్ వాంఖడే, అశోక్ జైన్ రూపొందించిన సమగ్ర నివేదికపై ఆదివారం రాత్రి ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఆస్తానా నేతృత్వంలో సమావేశం జరిగింది. ముంబైలో విస్తరించిన డ్రగ్ మాఫియా మూలాలను వెలికితీసి, చార్జిషీటు వేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కూడా ఆస్తానా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 20 మంది బడా డ్రగ్ సరఫరాదారులపై ఎన్సీబీ కన్నువేసినట్లు సమాచారం. కోర్టులో కరణ్ పేరు సుశాంత్ సింగ్ మృతి, బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాల కేసుల్లో దర్శకుడు కరణ్ జోహార్ పేరును ప్రస్తావించారు రియా చక్రవర్తి– క్షితిజ్ రవి ప్రసాద్ తరఫు లాయర్ సతీశ్ మనేషిండే. ఈ కేసులో కరణ్ పేరును ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా క్షితిజ్‌ను అధికారులు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని కోర్టుకు తెలిపారు. ముంబైలోని కోర్టు క్షితిజ్‌కు ఆదివారం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో మనేషిండే..విచారణ సమయంలో అధికారులు క్షితిజ్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనీ, కరణ్ జోహార్ పేరు కూడా వాంగ్మూలంలో చెప్పాలంటూ ఒత్తిడి చేశారని అన్నారు. ఆ పేరు చెబితే వదిలిపెడతామంటూ ఆశ చూపారన్నారు. క్షితిజ్ ఇంట్లో సోదాల సమయంలో సిగరెట్ పీక మాత్రమే అధికారులకు దొరికినా అది గంజాయి అంటూ ఆరోపించారని తెలిపారు. 2019లో కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న పలువురు బాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై ముంబైకి వస్తున్న కరణ్‌ను గోవా ఎయిర్‌పోర్టులో మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడలేదు. తనకు డ్రగ్స్ అలవాలు లేదనీ ఆయన గతంలోనే వ్యాఖ్యానించడం తెల్సిందే. -
‘కరణ్ పేరు పెట్టాలని ప్రసాద్‌ను ఒత్తిడి చేశారు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ధర్మప్రోడక్షన్ మాజీ సహా నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ సమయంలో కరణ్ జోహార్ పేరు పెట్టాలని ఎన్సీబీ ప్రసాద్‌ను ఒత్తిడి చేసినట్లు ఆయన తరపు న్యాయవాది సతీష్ మనెషిండె ఆరోపించారు. శనివారం ప్రసాద్‌ను అరెస్టు చేసిన ఎన్సీబీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి అక్టోబర్ 3 వరకు కస్టడి కోరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లాయర్ మనెషిండె మీడియాతో మాట్లాడుతూ.. 2020 సెప్టంబర్ 24 గురువారం రోజున ప్రసాద్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఎస్సీబీ అధికారి సింగ్ ఆయనకు ఫోన్ చేశారని, ముంబైలోని తన ఇంటిని తనిఖీ చేయాలని, స్టేట్మెంట్ తీసుకోవాలని ఎన్సీబీ సమాచారం ఇచ్చిందని మనెషిండె తెలిపారు. దీంతో సెప్టెంబర్ 25న ఉదయం 9 గంటలకు ముంబైకి తిరగి వచ్చి ఎన్సీబీ బృందం సమక్షంలోనే తన ఇంటిని తాళం తెరిచారని చెప్పారు. (చదవండి: డ్రగ్స్ కేసు: క్షితిజ్ రవి ప్రసాద్ కస్టడీ పొడిగింపు) (చదవండి: కరణ్ పార్టీకి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదు) తర్వాత అధికారులు తనిఖీ నిర్వహించగా బాల్కానీలో పాత, పోడి సిగరెట్ పెట్టెను కనుగొన్నారని చెప్పారు. అయితే ఎన్సీబీ అధికారులు దీనిని జాయింట్ గంజాగా పేర్కొంటూ దానిని స్వాధీనం చేసుకున్నారని, అనంతరం 11:30 గంటలకు ప్రసాద్‌తో పాటు అతని ఇద్దరూ స్నేహితులు ఇషా, అనుభవ్‌లను కూడా ఎన్సీబీ కార్యాలయింలో విచారించినట్లు చెప్పారు. కాగా ఆయన స్నేహితులను విచారిస్తుండగానే ఎలాంటి సమాచారం లేకుండా ఎన్సీబీ ప్రసాద్ ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించినట్లు తెలిసిందని చెప్పారు. అయితే విచారణలో ప్రసాద్‌కు వ్యతిరేకంగా తన స్నేహితులు స్టేట్మెంట్ ఇస్తే వారిని వదిలేస్తామని ఎన్సీబీ వారితో చెప్పినట్లు ఆయన స్నేహితులు తెలిపారని మనెషిండె పేర్కొన్నారు. అయితే శనివారం ప్రసాద్‌ను అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు విచారణకు ముందు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధింపులకు గురి చేశారని, బ్లాక్ మెయిల్ కూడా చేసినట్లు మనెషిండె ఆరోపించారు. (చదవండి: కరణ్ జోహార్‌కు మద్దతు తెలిపిన జావేద్ అక్తర్) -
కరణ్ పార్టీకి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదు
బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుకు, నిర్మాత కరణ్ జోహార్ 2019లో నిర్వహించిన పార్టీకి సంబంధాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో స్టార్ నటులు దీపికా పదుకొణె, షాహిదోద్ కపూర్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, జోయా అక్తర్ లాంటి ప్రముఖులు పాల్గొనగా.. వీరు డ్రగ్స్ స్వీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వాళ్లు ఏదో మైకంలో ఉన్న వీడియో కూడా ఇటీవల తెగ వైరల్ అయింది. (చదవండి: డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!) ఈ క్రమంలో సుశాంత్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంపై విచారణ చేపడుతోన్న ఎన్సీబీ తాజాగా ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అది అవాస్తవమని ఎన్సీబీ ఖండించింది. ప్రస్తుత కేసుకు, కరణ్ నివాసంలో జరిగిన పార్టీ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్త అశోక్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో గురించి ఎలాంటి వివరాలు సేకరించడం లేదని తెలిపారు. కాగా కరణ్ సైతం తన పార్టీలో డ్రగ్స్ వాడకం జరగలేదని పేర్కొన్న విషయం తెలిసిందే.. (చదవండి: నాకు డ్రగ్స్ అలవాటు లేదు)