ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..! | actress Shalini Passicostly bag collection will leave you in shock | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!

Published Tue, Nov 5 2024 6:49 PM | Last Updated on Tue, Nov 5 2024 8:21 PM

actress Shalini Passicostly bag collection will leave you in shock

బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత  కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో నటించిన షాలిని పాసి లేటెస్ట్‌ సెన్సేషన్‌. ఢిల్లీకి చెందిన ఈమె సోషల్‌ యాక్టివిస్ట్‌, ఆర్టిస్ట్‌ కూడా. ఫ్యాషన్‌కు మారు పేరు. 

మరోవిధంగా చెప్పాలంటే వాకింగ్ ఫ్యాషన్ఎగ్జిబిషన్. అదిరిపోయే డ్రెస్‌లు, అద్భుతమైన హెడ్‌పీస్‌లు, ఆకట్టుకునే బ్యాగ్‌లు ఇలా షాలిని స్టైల్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె బ్యాగులు హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి.

ఆమె బ్యాగుల కలెక్షన్‌ చాలా స్పెషల్‌మాత్రమేకాదు,  ధర కూడా కళ్లు చెదిరే రేంజ్‌లోనే. పావురాలు, చిలుకలు, పాత కెమెరాలు ఇలా రకరకాల షేపుల్లో ఆమె బ్యాగులు  మెస్మరైజింగ్‌గా ఉంటాయి.

ఒక ఎపిసోడ్‌లో, షాలిని క్లాసిక్ క్లిక్ కెమెరాను పోలి ఉండే క్లచ్‌తో కనిపించింది. పాతకాలపు కెమెరా ఆకారంలో  క్రిస్టల్-స్టడెడ్ హ్యాండ్‌బ్యాగ్  ధర  సుమారు 5 లక్షల రూపాయలు. మరో ఎపిసోడ్‌లో ఆమె  చేతిలో  మెరిసిన ఫ్లెమింగో క్లచ్ ధర అక్షరాలా రూ. 5,400,000.

బ్రిక్ ఫోన్ బ్యాగ్ ధర  రూ. 600,000, ఇంకా 8 లక్షల, 30వేల విలువ చేసే టీవీ టెస్ట్ స్క్రీన్ బ్యాగ్,  దాదాపు రూ. 3 లక్షల  విలువ చేసే   క్రిస్టల్ హార్ప్ క్లచ్‌తో ఆకర్షణీయమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా, షాలిని జెల్లీ ఫిష్, టెడ్డీ బేర్స్, చిలుకలు, గులాబీలు, కుక్కలు , ఇతర  ఫన్నీ బ్యాగ్స్‌కూడా ఆమె సొంతం.

కాగా షాలిని పాసి భర్త బిలియనీర్,పాస్కో గ్రూప్ ఛైర్మన్  సంజయ్ పాసి.  ఈ దంపతుల రాబిన్ రాబిన్‌ . ఇక ఈ సిరీస్‌లో మహీప్ కపూర్, నీలం కొఠారి, భావన పాండే, రిద్ధిమా కపూర్ సాహ్ని, సీమా సజ్దేహ్ ​​మరియు కళ్యాణి సాహా చావ్లా కూడా నటించారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement